Saturday, 21 January 2017

స్వర్ణ కమలం


1. స్వర్ణ కమలం 
ఓం నమో నమో నమఃశివాయ 

మంగళ ప్రదాయ గోతురంగతే నమఃశివాయ 
గంగ యాతరంగితొత్తమాంగతే నమఃశివాయ 

ఓం నమో నమో నమఃశివాయ 

శూలినే నమో నమః కపాళినే నమఃశివాయ 
పాలినే విరంచితుండ మాలినే నమఃశివాయ 

ఆందెల రవమిది పదములదా 

అందెల రవమిది పదములదా 
అంబర మంటిన హృదయముదా 
అందెల రవమిది పదములదా 
అంబరమంటిన హృదయముదా 
అమృత గానమిది పెదవులదా అమితానందపు ఎద సడిదా 

సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగ యాగ ఫలముగ 
సాగిన సాధన సార్ధకమందగ యోగ బలముగ యాగ ఫలముగ బ్రతుకు ప్రణవమై మ్రోగు కదా 

మువ్వలు ఉరుముల సవ్వడులై 
మెలికలు మెరుపుల మెలకువలై 
మువ్వలు ఉరుముల సవ్వడులై 
మెలికలు మెరుపుల మెలకువలై 

మేను హర్ష వర్ష మేఘమై 
వేణి విసురు వాయువేగమై 
అంగ భంగిమలు గంగ పొంగులై 
హావ భావములు నింగి రంగులై 
లాస్యం సాగే లీల రసఝరులు జాలువారేల 

జంగమమై జడ పాడగ జలపాత గీతముల తోడుగ 
పర్వతాలు ప్రసరించిన పచ్చని ప్రకృతి ఆకృతి పార్వతి కాగ 

ఆందెల రవమిది పదములదా 

నయన తేజమె న కారమై 
మనో నిశ్చయం మ కారమై 
శ్వాస చలనమె శి కారమై 
వాంచితార్ధమె వా కారమై 
యోచన సకలము యః కారమై 

నాదం న కారం మంత్రం మ కారం స్తొత్రం శి కారం వేదం వా కారం యఙం య కారం 

ఓం నమఃశివాయ 

భావమె మౌనపు భవ్యము కాగ 
భరతమె నిరతము భాగ్యము కాగ 
పురిల గిరులు తరిగేల తాండవమాడే వేళ 

ప్రాణ పంచమమె పంచాక్షరిగ పరమ పదము ప్రకటించగా 
ఖగోళాలు పదకింకునులై పది దిక్కుల ధూర్జటి ఆర్భటి రేగా 
అందెల రవమిది పదములదా 
అంబరమంటిన హృదయముదా 
అమృత గానమిది పెదవులదా అమితానందపు ఎద సడిద


ఘంట నాదము వలె వెంట వుండి
మంట వల్లను కోప భావ  ముండి
జంట కల్వుట తప్పు కాదు అంది 
వంట వార్పులు నేర్చు కున్న నంది

తైల ధారల వళ్ళ తనువంత  దిరుగాడి
పైరు గాలుల వల్ల మనసంత దిరుగాడి        
రైలు వేగము లాగ పరువంతొ దిరుగాడి
వైను  జోలికి  పోక  కళలంత  దిరుగాడి

నిత్య  జపము నందు నిర్మలత్వ ముండు 
సత్య పలుకు నందు ధర్మ తత్వ ముండు
పత్య  మనక అన్ని ప్రేమ భావ ముండు
మత్య ముజల మందు స్నేహా భావ మెండు     

 

Pranjali prabha.com
రచన: అన్నమాచార్య

రాగము : హంసధ్వని

చాలదా హరి నామ సౌఖ్యామృతము దమకు | 
చాలదా హితవైన చవులెల్లను నొసగ ||

ఇది యొకటి హరి నామ మింతైన జాలదా | 
చెదరకీ జన్మముల చెరలు విడిపించ |
మదినొకటె హరినామ మంత్రమది చాలదా | 
పదివేల నరక కూపముల వెడలించ ||

కలదొకటి హరినామ కనకాద్రి చాలదా | 
తొలగుమని దారిద్ర్యదోషంబు చెరుచ |
తెలివొకటి హరినామదీప మది చాలదా | 
కలుషంపు కఠిన చీకటి పారద్రోల ||

తగువేంకటేశు కీర్తనమొకటి చాలదా | 
జగములో కల్పభూజంబు వలె నుండ |
సొగసి యీవిభుని దాసుల కరుణ చాలదా | 
నగవు జూపులను నున్నతమెపుడు జూప ||


Telugu Videos Songs From Venkatesh & Bhanupriya's Swarna Kamalam

No comments:

Post a Comment