Sunday, 15 January 2017

*మహిళ (ఛందస్సు )

 ఓం శ్రీ రామ్ - శ్రీమాత్రేనమ:

*అనుభవ సారాంశాలు (కవిత)

చంద్ర సూర్యులే - మనకు ప్రత్యక్ష దేవతలు
తల్లి తండ్రులే - నిశ్చ పూజించే దేవతలు
భార్య బిడ్డలే  - జీవిత  మార్గ దర్శకులు
స్నేహ భందువులే - ప్రోత్సాహక కారులు

విద్య వ్యాపారాలే - మనుగడకు మార్గాలు
పెద్దల మాటలే  - అనుభవ సారాంశాలు
సత్య  ధర్మాలే  - బతుకు నీతి  వాక్యాలు 
వేదాంత విద్యలే - ఆధ్యాత్మిక పాఠాలు

పాపపు పనులే - కల్గించు మనస్తాపాలు
పదిమంది మాటలే - మమతల వాక్యాలు
మంచి  మాటలే  - నిత్య జీవిత సత్యాలు  
ప్రజలకు సేవలే - మానవాళికి మార్గాలు 

కలుషిత  గాలులే  - మానవులకు వచ్చే రోగాలు
కుటుంబ కలహాలే - ఇతరులముందు చులకణలు
కల్తీ మత్తుమందులే   - ప్రాణాలతో చెలగాటాలు    
ఓర్వలేని  తనములే  - మానవుల పతణాలు 

--((*))--
 


* అ భాగ్యుని ఆవేదన

మనసు మూగగా మారింది
పట్టించుకొనే వారు లేక

చేతలు  చచ్చు పడ్డాయి
చేతికి పని దొరకక

కాళ్లు కదల నంటున్నాయి
మార్గ మేదో తెలుసుకోలేక

కళ్ళు చూడ నంటున్నాయి
చూసి తెలుసుకొనేది లేక

మనసులో ఉన్న విషయం చెప్పి
భాధ తగ్గించు కోవాలనుకున్నా

చేతితో చేసిన పనికి
విలువ లేక భాద పడుతున్నా 

కాళ్ళు కదిలిస్తూ ప్రపంచం
మంతా నడుద్దామంటే
దుర్వాసన చూసి భాదతో ఉన్నా

కళ్ళతో చూసినది నిజమో అభద్దమో
తెలుసుకొని చెపితే పిచ్చోడి క్రింద
లెక్క కట్టే లోక  మనుకున్నా

చదువుకోవటం ఎంత కష్టమో
ఉద్యోగం సంపాదించడం
అంతకన్నా ఎక్కువ  కష్టము
నీతి, నిజాయితి అనుకోని
కూర్చుంటే ఈ లోకంలో
బ్రతకటం ఇంకా కష్టమని తెలుసుకున్నా
ఇది ఒక చదువుకున్న
అభాగ్యుని ఆవేదనన్నా

అందుకే అధైర్య పడకండి
నే ననేది ఒక్కటే కళ్ళు తెరవండి
కాళ్లకు బుద్ధి చెప్పండి
మనసుతో బీదలకు, అనాధులకు
నిరుద్యోగులకు, ఆశ్రమము కల్పించండి

నీలో ఉన్న తెలివిని నలుగురికి
పంచి బ్రతికి బ్రతికించండి

--((*))--



*మనిషి (2012 వ్రాసిన కవిత )
 
మట్టిలోకి  యంత్రమై  మట్టిని పైకి నెట్టుతూ 
ముందుకు దుసుకుపొతూ !
 
గాలిలోకి యంత్రమై గాలి తేమను పైకి నెట్టుతూ 
ముందుకు సాగి పొతూ !
 
కొత్తదారులు దొరకక, పాతదారిలో బ్రతకలేక,
 మంచులా కరిగిపొతూ !
 
మనిషిగా నిజం  మాట్లాడితే,   మృగాన్ని 
తరిమినట్లు తరుముతూ !  
 
ఆశల వలయాల్లో చిక్కి, మనిషి కట్టిన కోటలు,
 పేక కోటల్లా కూలిపొతూ ! 
 
కోకిలగానాన్ని వింటూ, మనిషి 
శబ్ధ కాలుష్యాన్ని, జీవితములొ భరిస్థూ !
 
అర్ధంలేని  అర్ధం కోసం, ఇతరుల మేప్పుకోసం,
 పనులు చ్చేసి విలపిస్థూ !  

 వినగూడని మాటలు వింటూ, విన్నది చేప్పలేక
 మృగాల్లా బ్రతుకుతూ !
 
ఒకవేపు మారణహోమం సాగిస్తూ, 
మరోవైపు తర్పణాలు వదులుతూ !
 
మనిషి కామాన్ని అదుపులో ఉంచుకోలేక,
 మృగ జాతికి జీవం పోస్తూ !
 
జీవిత చివరి ఘడియలలో ఒక్కరూఆదుకోలేక,
 వీధి కుక్కలా విలపిస్తూ !
 
కొందరు చేసిన పుణ్య ఫలమో,
 దానఫలమో, అందరిముందు స్వాస విడుస్తూ !
 
మంచిని పెంచి, వంచనను త్రుంచి,
 మంచిమాటలతో, మనస్సును త్రుప్తిపరుస్తూ !
 
నిన్నటి గురించి ఆలోచించక, రేపటి గురించి
 విచారించక, సంతోషముగా జీవిస్థూ !
 
భవబంధాలను భరిస్తూ, ఈదేశంకు,
 భూధేవికి భారం, కాక జీవించేవాడు మనిషి.

--((*))--                                                  
 *నిశ్శబ్దం (2012 వ్రాసిన కవిత )
 
జాలువారు నదులు సముద్రములో 
కలుయును, నిశబ్ధముగా  !
 
కొన్ని సంఘటనలు జరిగి కాలంతోపాటు,
 సమసి పోవును, నిశబ్ధముగా  !
 
ఇరువురి మనస్సులు  పారవశ్వముతో జరుపును, 
సృష్టి కార్య్యము నిశబ్ధముగా  !
 
కలవరింతలు, ఘురకలు, అనుకోని శబ్ధాలు,
 నిద్ర పాడుచేయును,  నిశబ్ధముగా  !
 
సూర్య-చందృలు ఒకరి తరువాత
 ఒకరు విధిగా   మారుతారు,  నిశబ్ధముగా  !
 
సత్య్యం, ధర్మం, న్యాయం, అనేవి 
అందరికి తెలియును కాలముతోపాటు నిశబ్ధముగా  !
 
గురువుగారు పిలిచినట్లు నామనస్సు కలువ
 పువ్వులా విచ్చుకొంటుంది,  నిశబ్ధముగా  !
 
శబ్ధములతో సాగుతుంది, పగటిపూట సంసారము,
 రాత్రికి సర్దు కొంటుంది నిశబ్ధముగా  !
 
భూమి అలుపెరుగగా తిరుగుతూ సమస్త
 జీవకొటిని భరించుతూ ఉంటుంది నిశబ్ధముగా  !
 
ప్రతిఒక్కరు శారీరక సంభంధాలు వీడి
 పరమానంద ప్రాప్తిని పొందేది నిశ్శబ్దం . 

--((*))--



No comments:

Post a Comment