Thursday, 12 January 2017

నటి అంజమ్మ (అంజలి) వర్ధంతి సందర్భంగా నివాళి.



       
గజల్
అణువణువున నీపేరును పలికిస్తివి ప్రియవిభుడా
జన్మంతా నాతోడని మాటిస్తివి ప్రియవిభుడా
నిన్నుచూసి నాహృదయం గుడిగంటగ మ్రోగిందిలె
నాకోసం పుట్టావని తపియిస్తివి ప్రియవిభుడా
వలపులన్ని చినుకుపూలై కురిసెనుగా ఈవేళా
సరిగంగల స్నానాలే చేయిస్తివి ప్రియవిభుడా
పూలనోము ఫలమేమో నువ్వునాకు దొరికావులె
అంతరాత్మ సాక్షిగానె ప్రేమిస్తివి ప్రియవిభుడా
మదిపంజర చిలుకలాగ వుండాలని సుధకోరిక
నీప్రేమతొ స్వర్గాన్నే చూపిస్తివి ప్రియవిభుడా

అరెరె... అబ్బబ్బ....
నీ మోములో ఎన్నేన్ని కాంతులో....!!
నా రూపం చూసినంతనే......!
పడే చెక్కిళ్ళకి నే గులామునే....!!
ఎంత ప్రేమైతే మాత్రం....!
నన్ను నీ కన్నురెప్పల్లో దాచేసి
నాతోనే దోబూచులాటలా....!!
నీ సొగసును చూసిన
ఎంతటి సోగ్గాడైనా సోమ్మసిల్లుడే....!
ఆ అదరలలో మందారం పూయించి...!!
కోటి పూల మకరందన్ని అందించేవు...!
ఏటవాలంటి నీ కనుబొమ్మల్లో
ఇంద్రధనుస్సును మెరిపించితివా....!!
కోటేరు ముక్కంటి నీ నాసికకు
నే ముక్కుపుడకనై రానా ....!
మనసు తనువు ఏకమై నిన్ను చుట్టేస్తున్నా.....!!


 ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
నటి అంజమ్మ (అంజలి) వర్ధంతి సందర్భంగా నివాళి.

మన తెలుగు సినిమా స్వప్న సుందరి
జనాలు మెచ్చుకున్న పల్లెటూరి పిల్ల
ఇద్దరు పిల్లల తో ఆమె చేసినది స్త్రీ సాహసం
అంజలి అంతందంగా అనార్కలి ఉంటుందా
శ్రీలక్ష్మమ్మ పాత్ర నుండీ సీతమ్మగా
అనసూయ, సావిత్రి, సుమతి, సక్కుబాయి
ప్రియురాలు, సాధ్వి, మహా ఇల్లాలు,పతివ్రత
ఈ పాత్రలే కాదు హాస్యం లో కూడా అందెవేసిన చేయి.
యువరాణి, ప్రతి నాయిక, తల్లి , వదిన
ఏ పాత్ర చేసినా ఆమె కనబడదు ఆ పాత్ర తప్ప

రసికుల పాలిట అనార్కలి
ప్రేక్షకులకు సువర్ణసుందరి
భక్తుల పాలిట సక్కుబాయి
నిర్మాతల పాలిట స్వర్ణ మంజరి
దర్శకుల పాలిట కులదైవం
ఆంధ్రుల వెండితెర సీత ఆమె
ఆనాటి వారందరి అమ్మాయిగారు
చేయని పాత్రలేదు ఎక్కని శిఖరం లేదు
తెరపై ఆమె కనబడితే ఉప్పొంగేది గౌరవ భావాలే

ఇరవై నాలుగేళ్ళకే ఇరవై యేడేళ్ళ యేళ్ళ అమ్మ పాత్ర వేయడం అంటే మాటలా? అదో సాహసం..భర్తకు తగ్గ ఇల్లాలు..ఎపుడూ ఇసుమంత ద్వేషం, ఈర్ష్య, అసూయ,చెడు పేరు ఎరుగని ఆమె వెండితెర సీతే కాదు, నిజంగా అరమరికలు లేని కాపురం ఆ దంపతులది.భర్త ఓ మహా సంగీత దర్శకుడు..ఆమో మహానటి.తెలుగు , తమిళం, హిందీ రంగాలలో జయకేతనం ఎగుర వేసి అభినయములో సాటిలేరు అనిపించుకున్న మా అభిమానం నటి అంజమ్మ వర్ధంతి సందర్భంగా నివాళి.

No comments:

Post a Comment