Sunday, 8 January 2017

నమో వెంకటేశాయ

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:


వయ్యారపు నడక వద్దు - వేగముగా నడక వద్దు
రాలును జాజులు మాయమ్మకు - నుదురు చెమరిస్తుంది
మోములో కాంతులు తగ్గిపోతాయి - చెక్కిళ్ళు ఎర్రబడుతున్నాయి
పాపడిలో గంధమంతా శరీరమంతా తాకుతున్నాయి
జడలో ఉన్న ముత్యాల కుచ్చులు అదురుతున్నాయి  
కర కంకణాలు కదులు తున్నాయి, మ్మ ముక్కు పుడక కదల దోయి
అవును జాగర్తగా మోయండి అమ్మ పల్ల కీని
జాగర్తగా ఆపండి  అమ్మ దిగగలదు
ముత్యాల పాదరక్షలు అందించండి
మంగళ హారతి పట్టండి
చెలికెత్తులను ప్రోత్సహిస్తున్నాడు అన్నమయ్య            
అమరించి కౌగిట అలమేలుమంగ నిదె
సమకూడె వేంకటేశ్వరుడు మాయమ్మకు||
 

ఓం నమో వేంకటేశాయ చిత్రము పాటలు విడుదల సందర్భముగా శుభాకాంక్షలు.
శ్రీ వేంకటేశ్వరుని లీలలను రసరమ్యముగా భక్తుల హృదయములో శాస్వితముగా నిలిచే విధముగా 
సుందర భక్తి సాహిత్య చిత్రమును శ్రీ వేంకటేశ్వరుని  తెలుస్తూ తీసిన దర్శక రాఘవేంద్రునకు, సహాయ సహకారములు అందించిన ప్రతి ఒక్కరికి, మరియు భక్తి కథామృతమును అందించిన నిర్మాతకు అంతర్జాల తెలుగు   పత్రిక ప్రాంజలి ప్రభ తరుఫున విజయం సాధించాలని శుభాకాంక్షలు అందిస్తున్నాము. 


నమో వెంకటేశాయ
 

అండ పిండ  బ్రహ్మా౦డ చక్ర ధారి 
ఆత్మీయత తో ఆదుకున్న ధారి 
అరవీర భయంకరుల గుండెను కూడా
కరుణ రసముతో దయ చూపిన ధారి
ఆణువణువూ ఆవరించిన శ్రీ వెంకటేశ్వరా
నమో నమో శ్రీ వెంకటేశ్వరాయ
నమో నమో శ్రీనివాసయా నమో నమ:

చిత్ర విచిత్రాల దర్శకేంద్రా
శృంగారా సాహిత్య అభిలాషా
ప్రార్ధనకై మోక్షము నందించి
మనస్సును ప్రశాంత పరిచి
సుఖ శాంతులను అందించి
ఆదుకుంటావు శ్రీ వెంకటేశ్వర 


ఓం నమో వేంకటేశాయ
నమో నమ:
ఓం నమో శ్రీనివాసాయ
నమో నమ:
గోవిందా గోవిందా గోవిందా        

No comments:

Post a Comment