Thursday, 19 January 2017

***అమృత వాక్కు*

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

అమృత వాక్కు*

*గమ్యం తెలియక ,నియంత్రణ లేని మనస్సు మనల్ని పతనమొందిస్తుంది .అధోగతి పాలు చేస్తుంది .నిగ్రహం తో లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు విముక్తిని ప్రసాదించి విజయ శిఖరాలను అధిరోహింప జేస్తుంది*
*స్వామి వివేకానంద*


మంచి పద్యం

*మృగము మృగమనుచు* *మృగమును దూషింత్రు*
*మృగము కన్నా చెడ్డ* *మూర్ఖుడగును*
*మృగము కున్న గుణము మూర్ఖునకేదయా*
*విశ్వదాభిరామ వినురవేమ*

*భావం* 



*బుద్ధి లేనివని జంతువులను దూషిస్తాము కానీ మూర్ఖుడు మృగము కంటే* *చెడ్డవాడు .జంతువులకున్న బుద్ధి విచక్షణ కూడా మూర్ఖుడికి*
*ఉండదు ...బుద్ధి లేనివాడే జంతు సమానుడు*
(సేకరణ ఫ్రమ్ మై మెయిల్ ) 



ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

 





  *తత్వ బోధ -3

సమయము నిలువదు సహజము
నయనము తడియగు సహజము
పయనము వదలదు సహజము
కలయిక మరువదు సహజము

అమరము జననము కనుమిది
తమకము తనువుది కనుమిది
సమరము మగనిది కనుమిది
వినయము మగవది కనుమిది

మమతలు నిలువవు వినుమిది
కలతలు తొలగును వినుమిది
పలుకులు వెఱియును వినుమిది
తలపులు మరువవు వినుమిది

మధులిక కలకథ వలదిక
లతవల చిలకల వలదిక
తనువుల తపనలు వలదిక
తమకపు తికమక వలదిక
--((*))--


తత్వ బోధ -4

తలకెక్కిన పొగరు ముదిరి 
కల చూపిన వగరు ముదిరి
అల పొంగిన వరుస ముదిరి
గిల గిలక మనసు చెది రె 

తలబిరుసుగమారుచుండెధరణీ తలమున్.
కల బరువులు మారుచుండె తరుణీ మదిలోన్
అల మెరుపులు మారుచుండె కడలి తరుణమునన్
గిల గిల చెడు వాని స్నేహము మనసు చెడున్   
 
వలపించెడితరుణీమణి
కల పంచెడి వనితామణి
అలలు చూపెడి చింతామణి
గిల గిల నవ్వించె మహిళామణి

 విలపింపగజేయుచుండె విన్యాసమునన్.
కల నిజము జేయుచుండె సన్యాసమునన్ 
అల తలపులు మనసులో చేరి వేదింపులన్
గిల చేరి మంచి వాడి స్నేహమ్ము  చెఱచున్
  
 --((*))-- 


తత్వ బోధ -5

పల్లె సీమ లందు పాడి  పంటలు ముద్దు
మన్నె సీమ యందు జంతు జీవాలు పద్దు
కన్నె సీమ యందు ప్రేమ భావాల హద్దు  
వన్నె సీమలో పుత్తడి ఆశల వలయాలొద్దు   

రైతు కంటే గొప్ప రౌతు లేడు
ప్రేమ కంటే గొప్ప తీపి లేదు
మాట కంటే గొప్ప కీర్తి లేదు
వేట కంటే గొప్ప తప్పు లేదు 
 
తిండి గింజ కరువు మొండిజబ్బులమయం
కంటి నిండ నిద్దుర  లేక  జబ్బులమయం 
వంటి నిండ బట్టలు లేక డబ్బుల  మయం
పంటి మధ్య తిండి మరచి మందుల మయం
 
నగర వాస మిచట పరమ చేదు
పొగరు నేత తల బిరుసు చేదు 
తగని మాట మరి మరీ చేదు
స్త్రీల తగువు తీర్చుట మరీ చేదు
 --((*))--
  

తత్వ బోధ -6

సరసపు మాటలు పలికిన
విరసపు చూపులు చిలికిన
మధురిమ నడక నడచిన
మనసు మారాక బ్రతకాలి

విరసము గాచు చుండు వెటకారముగా
సరసము చూచు చుండు మమకారముగా 
మధుర మాయలో పడు చుండు వయ్యారంగా
మనసు అర్ధం చేసు కోకపోతే చేదు పయనమేగా
   
పరి పరి భాషించుట తగదు
పరి పరి ధూషించుట తగదు
పరి పరి ద్వేషించుటా తగదు
పరీ పరి ప్రేమించుటా తగదు
 
మాటలు పెరిగిన మనకు పరపతి పోవున్  
చేతలు మారిన కుటుంబ గతులే మారున్
నేతలు  మారిన మది తలపులు మారున్
వెతలు పెరిగిన మనుష్యుల తీరే మారున్

--((*))-- 


తత్వ బోధ -7

మనిషి కన్నా మబ్బును నమ్ముట మిన్న
మమత కన్నా మట్టిని నమ్ముట మిన్న
పదురు మాటకన్న పడతి మాట మిన్న
పగలు పని కన్నా రేయి సుఖము మిన్న     

పశువును నమ్మి మేత పెట్టు పాడి పెరుగు
వనితను నమ్మి సుఖపెట్టు మనసు కరుగు
పరువును నమ్మి మోసపోకు మనసు కలుగు 
తనువును నమ్మి ఆశపడకు రోగము కలుగు

కుక్క కింత పెట్టు విస్వాసము చూపు చుండు
నక్క కింత పెట్టు అతి తెలివి నేర్పు చుండు
అక్క కంతా మంచి చేయి ఆధారముగా ఉండు     
పక్క చేరి సుఖ పెట్టు కాపురంలో సుఖముండు   

మనిషి నేడు గొప్ప మాయలు నేర్చిన వాడు    
మని షి కొరకు మనసునే అమ్ము చున్న వాడు
పర షి కొరకు పాకులాడి పతనం పొందే వాడు 
విధి షి మణిలా మారి బ్రతుకు పండించు వాడు  
    
--((*))--



Pranjali Prabha.com
తత్వ భోద -8 

కను రెప్పల శశి వదనం
చీకటి వెన్నల సమరం
నగ్న పాదాలతో పయనం
తారల మధ్య కలాపం

నిద్రకాని నిద్రలో ఉండి
సంచార నిర్వేదంతో ఉండి
మేఘాల మధ్య నలుగుతూ ఉండి
తరాల మధ్య ఏకత్వముగా ఉండే

అనునాద శబ్దాలు భరిస్తూ
ఆకాశ నౌకాయానము చేస్తూ
క్రియా విశేషాలను సేకరిస్తూ
కార్య సమర్థుడుగా సంచరించే  

నిద్రలో చల్లటి ఉపశమనం ఇస్తూ
సృష్టికి నాంది పలికిస్తూ
వేకువనే గౌరవాన్ని కోల్పోతూ 
తలవంచి నేస్తాన్ని ఆహ్వానించే

వాద ప్రతి వాదనలు లేక
పంతాలు పట్టింపులులేక
సూర్య చంద్రులు కలసి
సమయాను బట్టి సర్దుకొనే

అట్లే ఒకరికొకరు తోడుగా ఉండి
ఒకరి కష్టాలు ఒకరు పంచుకుంటూ    
జీవిత సాఫల్యమే కుటుంబము
అదే సూర్య చంద్రుల ఆంతరార్ధం
--((-))--    

 తత్వ భోద -9

మనసు అంటే కాస్త ప్రేమ
మరికాస్త ఆశయాల ప్రేమ
ఆశల జోలికి పోనీ ప్రేమ
ఆత్మీయ అనురాగ ప్రేమ

గుట్టుగా కడుపునా దాచుకొని
మగువ మనసుని తెలుసుకొని
గట్టున చేర్చి చెలిమి నందుకొని
పున్నమి రాత్త్రులు వెన్నెలందుకొనే

మొన్నటిలా నిన్న లేదు కాని
నిన్నటిలా నేడు లేదు  కాని
రేపటి రూపం తెలియదు కాని
ఎల్లుండి రూపం గూర్చి ఆలోచిస్తామే

మేఘాన్ని ప్రార్ధించి వర్షందింపుకొని    
నిరంతర ప్రవాహంలా దారిచేసుకొని
కడలిలో చేరినట్లు మమత అందుకొని
ఆనంద తరంగాల మధ్య నలిగి పోయే
 --((*))--

No comments:

Post a Comment