Thursday, 12 January 2017

i) సంక్రాంతి (ఛందస్సు )

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

సంక్రాంతి (ఛందస్సు )

UI-UI-UI-UI-UI-UUI(kottadi)

సంక్రాంతి (ఛందస్సు )

ఓర్పు నేర్పు కూర్పు తీర్పు పంచు సంక్రాంతి 
శాంతి కాంతి పంచె బ్రాంతి తుంచే సంక్రాంతి
పంట వచ్చే మంచి పంచే శోభ  సంక్రాంతి     
అక్క బావ అన్న  చెల్లి బిడ్డ సంక్రాంతి

సూర్య చంద్ర నింగి నేల వెల్గు సంక్రాంతి 
పెంచు కున్న ప్రేమ పంచు తున్న సంక్రాంతి
పెంచు తున్న డబ్బు మబ్బు మాయ సంక్రాంతి       
మంచి మార్పు కోసం ప్రేమ పంచు సంక్రాంతి

బంధు మిత్ర స్నేహ భావ పంచే సంక్రాంతి
తల్లి తండ్రి కూర్చో బెట్టి చేయు సంక్రాంతి
పిండి  వంట  చేసి  కల్సి  తినే  సంక్రాంతి
పెద్ద చిkodiన్న ఆట పాట శోభ సంక్రాంతి    

నువ్వు నేను కల్సే భావం ఉండె సంక్రాంతి
ఇచ్చి పుచ్చు కొనే ప్రేమ పంచే  సంక్రాంతి
పూల ముగ్గు గొబ్బి పెట్టే  శోభ  సంక్రాంతి
కొత్త బియ్యం తీపి బెల్లం పంచే సంక్రాంతి  

--((*))--

*సంక్రాంతి (ఛందస్సు )

హరి దాసు పాటతో పాడుతున్న కోకిలలు
హరి విల్లు నీడతో   పాడుతున్న చిన్నారులు
సిరి మల్లె రాకతో    పాడుతున్న గోపికలు 
మెలి పూలచెట్లతో  ఆడుతున్న పువ్వులులే

రంగ వల్లి మధ్య గొబ్బెమ్మల ముచ్చట్లు 
రేగి పళ్ళు పోసి అమ్మొమ్మల ముచ్చట్లు
పిండి వంట చేసి నానమ్మల  ముచ్చట్లు
ఆట పాట కోడి పందెమ్ముల ముచ్చట్లు 

సంకు రాత్రి వచ్చే  సంబరమ్ములు తెచ్చే
సంత సమ్ము వచ్చే శాంతి సౌఖ్యము తెచ్చే
వంక లేక  భూమి శోభిల్లి ఖ్యాతి తెచ్చే
మారు చుండు కాల మెప్పుడున్ కాంతి తెచ్చే

బ్రాంతి వీడి శాంతి నిల్పే సంక్రాంతి
సూర్య వెల్గు చంద్ర వెన్నెల క్రాంతి
బ్రహ్మ సృష్టి  జన్మ సాహిత్య క్రాంతి
 నిత్య దృష్టి ధర్మ గ్రహ సంక్రాంతి
   --((*))--
  


రవి - సార్థకనామ గణాక్షర వృత్తము

ఆధారము - జయదామన్
ఇతర నామములు - కామినీ, భామినీ, తరంగవతీ
యతి - లేదు, ప్రాస ఉన్నది

రవి (కామినీ, భామినీ, తరంగవతీ)- ర/జ/ర UI UI UI UIU
9 బృహతి 171

సంకురాత్రి వచ్చెఁ జూడుమా
శంక లేని సమ్ముదమ్ముతో
వంక లేక వర్ధిలంగ ర-
మ్మింక భూమి శోభిలున్ గదా

మారుచుండుఁ గాలమెప్పుడున్
మారుచుండు చంద్రునిన్ రవిన్
ధారుణిన్ గనంగ వచ్చు నిం-
పారు పండుగై ముదమ్ముతో

శాంతి గల్గు గావుతన్ సదా
క్షాంతిపై సుఖమ్ము నిండ సం-
క్రాంతి సంబరమ్ము లెంతయో
కాంతు లిచ్చు వింతవింతగా

భామినుల్ హసంతివద్ద స-
త్కామనల్ మనమ్ము నుండఁగా
బ్రేమతోడ వండి పొంగలిన్
దా మొసంగిరప్డు దేవికిన్

సూర్యు నుత్తరాయణమ్ము నేఁ
డార్య దేశమున్ దొడంగెఁగా
సూర్యదేవుఁ డిచ్చు జీవమున్
సూర్యదేవుఁ డిచ్చు సర్వమున్

సంక్రాంతి శుభాకాంక్షలతో -

విధేయుడు - మోహన
*సంక్రాంతి పండుగ ముచ్చట్లు
ఛందస్సు

చూడ చక్కగ పెట్టె బొమ్మలు
సుంద రమ్ముగ పూల మాలలు
ఇంటి ముందర ముగ్గు చుక్కలు
ఇంటి అంతయు వెల్గు బల్బులు   

కోడె దూడల వింత గంతులు
కోళ్ల పందెము సంత సమ్ములు 
గంగి రెద్దుల  వింత ఆటలు
వాళ మూపుచు వృషభ గతి 

మేళ తాళము శబ్దం ఉండగ 
భోగి పండ్లను పోసి దీవెన
పసి నవ్వుల మంగ ళారతి
అమ్మ లక్కలు వచ్చి చూసెను

కామ దేనువు కోరిక తీర్చెను
కల్సి సంబర మంతయు చేసెను
బామ్మ గారెలు బూరెలు చేసిరి
పిండి వంటలు చేసియు అందరు
--((*))--

No comments:

Post a Comment