Sunday, 4 February 2024

(PRANJLI)


 *కన్నీరు... బ్రహ్మాస్త్రం.....001

రచన.. ప్రాంజలి ప్రభ " కవిత "(మల్లాప్రగడ )


విశ్వ మంతనా విశ్వాస విజయ వాక్కు

బెదురు లేక ఆశయ మేను గెలుపు కోరి

పనులలో సత్య ధర్మము పగలు రాత్రి

నాదు కన్నీరు పలుకులే అమృత ధార


నీతి అవినీతి కన్నీళ్ళు నీడలగుట

మంచి చెడ్డల మధ్యన మనసు కిటుకు

ఓర్పు ఓదార్పు హృదయము ఓడి గెలుచు

స్త్రీ హృదయవాంఛ కన్నీరు గీత వాక్కు


కన్నులలొ కన్నీరుగా గలగలగల

కన్నులు తుడిచి నవ్వులు కలకలకల

నాకు కన్నీటి దుఃఖము నయన విందు

చెప్పలేక కన్నీరుగా చెప్పు చుండె


గుండె బరువెక్కి అవమాన గుర్తు కొచ్చి

కన్ను చెమ్మరించు విషాద కాల మైన

కంటి ఓదార్పు కళలన్ని కానుకగుట

రెప్ప చాటున నిలిచిన నీటి చుక్క


నాకు ఇష్టం వర్షంలోన నడక బుద్ధి

కనబడదు కన్నీరులె గమన స్థితిన

చెమ్మగిల్లేటి కన్నీళ్ల చేష్ట లాపు

నవ్వి నవ్వించు కన్నీరు నటన భుక్తి


అడిగినా కాల గమనాన్ని తెల్ప లేవు

ప్రశ్నల జవాబు లేకనే ప్రతిభ లేదు

మాన లేనిగాయము ఐతే మనసు రాదు

విన్నది నిజంగ తెలుపుకన్నీరు ఆట


భక్తి యనెడి తీగ కదలి బలము పొంది 

స్థైర్యమనెడికొమ్మను బాకి స్థిరము కలిగి

మనసనే పందిరిని యెక్కి మనుగడ లత

నలుదిశలు నాక్ర మించెను నయన విందు

****

 *శుభ రాత్రి*..... 002          

రచన

 ప్రాంజలి ప్రభ.. కవిత.. (మల్లాప్రగడ )


కమ్మని నిదురకు కానుక తలపులు 

కంటి కిష్టమగుట కనుల రాత్రి 

ఆలూమగల కళ  ఆశ్రీత పుత్తడె 

ప్రణయము చిలికెడి ప్రభల రాత్రి


మంచి కళలు కనే మమతల శోభలు 

నిదుర పుణ్యమగుటే నిజము రాత్రి 

ప్రతి ఒక్క రికిశోభ ప్రతిదిన మనుగడ

నిదురొసగెడి శుభ నియమ రాత్రి 

        

ప్రేయసి సంతోష ప్రియ హాయిగా ఉంచె

వలపుల మెలికల వయసు రాత్రి 

అలసిన ప్రాణము అవసర కరుణయే 

విశ్రాంతి దొరికెడి విజయ రాత్రి


ఇదువరకటి పలు చిక్కులు మరచిన 

 మరిపించెడి నిదుర మనవు రాత్రి 

 నిదురకు కుదురుగ నిర్ణయం చెబుతున్న 

స్వాగత మొసగెడి సభల రాత్రి 

        

మనలో అలసటయె మాయను మార్చెడి 

నిర్మూలనకిదియె నిత్యరాత్రి 

పనులెన్నున్నను పక్కన  బడుతుండి 

నిదురకు తరలెడి వినయ రాత్రి


ఆలూమగలకుయె యలుపెరగని విధి 

శృంగార కేళికి శృతిగ రాత్రి 

సోమరి పోతుల పోరు మొద్దు నిదుర

కనులు మూతపడుటే కరుగు రాత్రి 

   

నిదురలొ దాగున్న నిర్ణయ మర్మము 

ఏవో తెలియనివై ఎదలరాత్రి అలసిన ఒంటికి యాటకునిదురేను 

చక్కని చికిత్స చలువ రాత్రి


కలల నిదురలోన కళల 😂మాయాలోక

స్వవిహార సలిపెడి సమర రాత్రి 

మనసు మాయమ్ముగా మరచుట కథలగు 

 వీలుగ విరిసెడి విద్య రాత్రి 

      

క్రిములు పక్షులు కీటక పశువులు 

మనుషుల నిదురకు మాయ రాత్రి 

జీవము ప్రాణము జయమగు కాలమే

తప్పని నిదురకు తాప రాత్రి 

మనలోన దేహము మనసు దీరుటకునే

మెలిగేటి నిదురిడు మోక్ష రాత్రి 

 తెలియనిదేదోను తెల్పు నిదుర మత్తు

కనులను మూసెడి కళలరాత్రి


మన చుట్టు జరిగేటి మనుగడ సంగతి 

అసలేమి తెలియని ఆట రాత్రి 

 మనమేను మనమౌను మరచి తరించేది 

చక్కని తరుణము చెలిమి రాత్రి

*****

నేటి కవిత " సమయ శక్తి "

ప్రాంజలి ప్రభ..003 (మల్లాప్రగడ)


చెలిమి హితకారి యయితేను చింత తొలగు

బాట ధర్మమార్గము గాను బంధ మౌను

స్వార్ధ పరలైన గుణపాఠ సాక్షి బతుకు

కర్మ యె యకర్మ యగుటయే కాల మందు


స్వంత స్పష్టత యాపెడి సరళ మార్గ

నిత్య యాలోచనలవల్ల నీవు మారు

మానసిక దృష్టి యున్నత మార్గ మౌతు

స్పష్టత బలమైనది చేర్చు సమయ శక్తి


నీవు బాహ్యస్వరాలను విన గలుగుట

వాటి భావంకు బలహీన వాకి లగుట

మీ మనసు బలోపేత మార్గ దృష్టి

స్పష్టమైన యేకాగ్రత సమయ శక్తి


సర్వ దిక్కులు శాసించు సిరి స్థిర కళ

శివుని శక్తి వీర్యము గాను శీఘ్ర సృష్టి

జీవు డుపయోగము తీరు చింత మార్చు

సత్య సంస్కారము నిలుపు సమయ శక్తి


పలుకు విలువ ప్రవర్తన పాఠమగుట

మనిషి మనిషికి మధ్యన మాట కదులు 

అల్పమయిన వాక్కేయాశ లంధకార

స్వల్ప తెలివితోటి పలుకు సమయ శక్తి


సారమంతమైన పనులు సామరస్య

కాలమా పరిమితమగు గమన మాయ

హంసలా పాలు నీరునూ హించి మార్చు

ఎన్ని విఘ్నాలు యున్నను యెదను శక్తి

****


సీస పద్య మాల .. ప్రకృతి లీల..004


కవితల సత్యాన్ని కనువిందు హృదయాన్ని

అక్షర సంపద ఆనతిగను

పద్యభావముగాను పద వచనాన్నిగా

ప్రాస యతిగల ప్రవాహముగను


 ప్రణయ ప్రబోధాన్ని   ప్రకృతిగా ప్రళయాన్ని

 పువ్వు పరిమళాన్ని పూజ్య కళను

 నవ్వు మోమిని గను నయనాల కాంతిని

 కల్పితాలగు కాంతి కాల ఊహ


 వెన్నెల జాబిలి వేకువ చల్లన 

 రవి వెలుగులు చిమ్మి రమ్య పరచు 

 కడలిన కెరటాలు కమ్మిన హృదయాలు

 అంబర ఆనంద ఆశయమ్ము


 పర్వతాల పుడమి పచ్చదన చెలిమి

 వర్షపు నీరుగా  వరదల దాహమై

గాలిసవ్వడి గాను కాలనిర్ణయమౌను

అగ్ని సహాయము అర్ధముగను


పలుకు తీయదనాన్ని పదనిస పాఠాన్ని

 సందేశ సహనమ్ము సమయ మౌను

 కోకిల కంఠాన్ని కోనసీమసుఖాన్ని

 హంస నడకలౌను హారతిగను


 కనికరం చక్కఁగా కనులతో కనలేను

వినలేని పలుకులే  వీన గలను 

భుజియించ వేళకు బోనముఁ ది నలేను 

జావ టీ పోయరు జాలిగనను 


తే. గీ. ప్రభువు హిమ ధవళ శరీర ప్రభవ మౌను

          నా మనస్సు పంచాననా దాహ ముగను

          భయ మనే గుహ లేకయు బంధ మగును

          లయ హృదయము గా శంకర లహరి లీల

***

పీడ కలలు... కవిత 005

ప్రాంజలి ప్రభ (మల్లాప్రగడ )


ప్రేమపెత్తనమౌను ప్రీతి చేదుగమన

చేను రక్షణ గాను చిత్రావిచిత్రము

ఇల్లు దోచుకొనుట ఈశ్వరచోరుడే

వంచకి మనసైన వలపుల పీడనే


నక్క బుద్ధి వలన నమ్మిన ప్రజచెడు

ప్ర క్కనుభవముతో ప్రభలు మాయ గమన

చుక్కచిత్తముగది చూపుముంచే వేయు 

గుక్కతిప్పనికళ గుర్తుచేయుబతుకు


పంచభక్ష్యములన భక్ష్యభోజ్యముగాను 

చోష్యలేహ్యముతోను చోద్యమునాకలలు


తానుదోచేనేర్పి తప్పులగురువగు

తానుదొంగబతుకు తనవారిని మార్చు

పాముపడగ యాట పసికందు కళలగు

ప్రేమకామాంధుని పీడకలలయాట


మెరయు మనిషితనం మంచి కుల మునందు

విరియు కలంరాత విధివిశ్వాసమే

జ్వలితయక్షరమగు జప కవిహృదయమే

వర యపురూపమే వలసిన శోదనే

***

ప్రాంజలి ప్రభ... ప్రేమ.. కవిత.. 006


కలువ కన్నీరు కనికర కళల ప్రేమ 

చెలిమి చలువ కళయికలే చరిత ప్రేమ 

కలిమి బలిమి సహనముగా కథలు ప్రేమ 

విలువ జూప గలుగు ప్రేమ వినయ ప్రేమ 


చదువరులగురుఁడ దండము చెలిమి ప్రేమ 

వదలని బగితిని  యొసఁగు  వాగ్మి ప్రేమ

చదువు సిరులను పెంచును సమయ ప్రేమ 

సుఖము దుఃఖము చదువగు సుమతి ప్రేమ


సూర్య భగవానుని కళలు సూత్ర ప్రేమ 

ప్రకృతి పరవశంతో సుఖ ప్రభల ప్రేమ

కవిత పలికేడి భావము కలల ప్రేమ

 వెలుగు పంచెడి ఆనంద వేళ ప్రేమ


ఆమని తలుపు ఆశయ ఆట ప్రేమ

యీమని వలపు వినయము ఇష్ట ప్రేమ

ఏమని యనకుమామది కేక ప్రేమ

రమ్మని పిలువ రక్తిగా రమ్య ప్రేమ


అందమెంతయున్న, నడత యధిక ప్రేమ 

తనదు మంచి కులమయిన, ధనమె  ప్రేమ 

విద్య లేనట్టి మనిషికి విలువ ప్రేమ 

విలువగల భూషణంబన విద్య ప్రేమ


కడలి యలలుతీరమ్ముసునామి ప్రేమ

కలలు హద్దులు దాటితే కాల ప్రేమ

అదుపు కలలైన యలలైన యాట ప్రేమ

దేవ యసుర సంపద లౌను దివ్య ప్రేమ


ఆమని భావమే బతుకు హాస్యపు వేళలు ఆటపట్టుకే

ఏమని చెప్పి దా మనసు ఎల్లలు దాచుట తప్పు దేనికో

ఈ మని సేవ తత్పరతయు నీడల చాటున ఎల్లవేళలా

రమ్మని యాశపాశమగు రమ్యత చూపుట రంగమందునన్

*****

పలుకు పాఠము.. కవిత..009


పలుకు విలువ ప్రవర్తన పాఠమగుట

మనిషి మనిషికి మధ్యన మాట కదులు 

అల్పమయిన వాక్కేయాశ లంధకార

స్వల్ప తెలివితోటి పలుకు సమయ శక్తి


శుభకళానిధి సమయమ్ము సుఖమునిచ్చు

ప్రభువు లీలా విధిగను వారోదయమ్ము

అభయ భావభవము పొంద ఆశ్రితయగు

నభయ నాడి నడకయగు నరుల దృష్టి


తరువులు శిశిరంలోన తొడిమ వదులు

తిరిగి చిగురే వసంతాన తీవ్ర పరము 

మృగ్య మైనట్లు మనసుకు మానవత్వ

పరిమళ మగుటే కళలతో బతుకు శక్తి


నాపరే కాలప్రస్థాన నమ్మబలుకు

నాటకంబుసుసాధ్యము నటనబతుకు

మానససుఖభావతలపు మార్గమెతుకు

మాయ భక్తినొసంగును మమత శక్తి


అంద మైన నందునిలీల యక్కరయగు

అందమే యనంతమధుర యాటలగుట

పందెమే యందమైనది పగటి కలయు

పొంద గలిగేటి యానంద పోరు శక్తి


మెరయు మనిషితనం మంచి కుల మునందు

విరియు కలంరాత విధివిశ్వాసమే

జ్వలితయక్షరమగు జప కవిహృదయమే

వర యపురూపమే వలసిన శోదనే

***

మనిషి మనసు .. కవిత..... రవళి.  06/02


డ్రమ్ము మోతతో సంగీత భ్రమలు కదిలి

పీలికల వస్త్ర ధారణ బేల వెకిలి 

భౌతి కాకర్షణల ప్రేమ చౌక నకిలి 

సహన జీవనాన్నికలిగి సంబరకళి


ఇవియు గిమ్మిక్కులను చూపు సినిమ రవళి 

పక్క పోరాట కళలతో పడచు రవళి 

పెదవు పోరాట ఆరాట ప్రేమ రవళి

వీధి స్వామ్యమై బ్రతుకుగా విజయ రవళి


అధిక ఆరాట పోరాట ఆట రవళి

రాజకీయము తెలియని రవ్వ రవళి 

ఆస్తి లేనికుటుంబము ఆశ రవళి 

 దారితప్పని సరదాల ధరణి రవళి


సంస్కృతి వదలకుండియు సరయు రవళి 

భుక్తి మార్గాన్ని చదువుగా భజన రవళి

కోరి కోర్కెతీరిస్తేటి గొప్ప రవళి 

మందు పోయిస్తె ను కదులు మిత్ర రవళి


ఎంత బండిని  లాగినా ఏడ్పు రవళి 

దెబ్బలు కలుగక తప్పవు  దీన రవళి 

ఎంత  రుచికరమైనను ఏమి రవళి 

రాళ్ల  దెబ్బలు  తప్పవు రవ్వ రవళి


అయిన వారందరితొ పంచు ఆట రవళి

నవ్వడం నలుగురిలోన నటన రవళి    

బైటపట్టింపు  పదిమంది కైపు రవళి

వున్నను మరచిపోవాలి ఊహ రవళి


కవులు కౌలుకి పోతేను గమ్య రవళి 

త్యాగ్యులంత భోగులగుటే తపన రవళి

వీరులంత మౌనమగుట వీధి రవళి

సాగిల పడుటే మదిలోన సంఘ రవళి 

....

1 comment:

  1. మంచి రచన. బాగుంది మేడం. అభినందనలు. శుభాకాంక్షలు. ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏

    ReplyDelete