ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ
శ్రీ వారి ముచ్చట్లు కధ - 1
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఏమండి గుడ్డు తిన్న పాములా ఆ నిద్ర ఏమిటి, ప్రక్కన ఎవరున్నారు, అని ఒక్క సారి చూసేది లేదు, వంటి మీద గుడ్డ ఉందా లేదా అని గమనించేది లేదు.
ఏమిటే మాట్లాడు తున్నావు, ఈరోజు ఏమిటో తెలుసా
ఈరోజేమి పండగ కాదు, ఆదివారము
అవునే ఆదివారమంటే ఏమిటి, సెలవు దినము కదా
అవును మరి నన్ను ఉట్టి పుణ్యాన నోరు చేసుకున్నావు, అది నీకు అవసరమా, "బారెడు పొద్దు ఎక్కేదాకా పడుకోవచ్చు అని పెద్దలు చెప్పారు కదా.
మానాన్నగారు చెప్పిన విషయం చెపుతున్నాను, ప్రతి రోజు చేయాల్సిన విధి, దీనికి సెలవు అనేది ఉండదు అది గమనించండి అన్నది.
అదేమిటో చెప్పఁవే నాకు నిద్ర మత్తు వదిలింది నీమాటలకే
బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు మేల్కోవాలి. సూర్యోదయానికి ఎంత ముందు మేల్కొంటే అంత ఉత్తమం. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఆర్ఘ్యం ఇచ్చేటప్పుడు సూర్యకిరణాలు తీవ్రంగా ఉండకూడదు. లేలేత భానుడి కిరణాల వల్ల ఆధ్యాత్మికతతోపాటు ఆరోగ్యపరమైన ప్రయోజనాలు చేకూరతాయి.
భక్తితో సూర్య భగవానుడికి నీరు సమర్పిస్తే మనసులోని కోరికలన్నీ నేరవేరతాయి. పరిశుద్ధమైన ఆత్మ, స్వచ్ఛమైన మనసుతో భగవానుడికి వినయపూర్వకంగా అర్ఘ్యం ఇస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి.
ఆమ్మో చాలా విషయాలు చెప్పఁవే నాకు, ఇవి నేను ఆచరించాలంటే కొంత కాలము పడుతుంది, ఈరోజు వరకు నన్ను వదిలై, ఇదిగో బోర్డు వ్రాసా దాని ప్రకారముగా ఆచరిస్తా అని చెప్పాడు
ఎం రాసావు అక్కడ
చూడు నీకే తెలుస్తుంది.
రేపు నీవు చెప్పిన విధానంగా ఆచరిస్తాను అని ఉన్నది.
అవు నండి "ఆకలి రుచి ఎరుగదు, నిద్ర సుఖమెరుగదు, బద్ధకస్తుడు రేపుచేస్తాను అనక తప్పదు "
చాలా చక్కగా నన్ను అర్ధం చేసుకున్నావు అని నవ్వు కున్నాడు భర్త.
పెళ్ళాం చెపుతున్న నిద్రపోతూ భర్త.మత్తుగా ఇట్లా చెపుతున్నాడు.ఆలుమగలు ఎప్పుడు ఒకరినొకరు అర్ధంచేసుకుని జీవితం సాగించాలి పంతానికి పోయి తాడు తేగా దాకా చేయకూడదు, నిద్ర ఎట్లాగూ పోయింది ఇలా కూర్చో చెపుతాను అని భర్త భార్యకు చెప్పటం మొదలు పెట్టాడు.
ఆలుమగలుయెపుడు, అలవోకగానవ్వి - నవ్వుబువ్వులుయింట రువ్వవలెను
యొకరిమాటనొకరు యెపుడుమన్ననజేసి - బంధుజనులమెప్పు పొందవలెను
తనవారు పరవారు తారతమ్యమువీడి - యాదరమునవారి నాదుకొనవలెను
అమ్మనాన్నలుయైన యత్తమామలుయైన - సాటిపిల్లలతోటి సాక వలెను
పతియు సేవ లోనె సతికిధర్మముగలదు - ధర్మ పధము పతికి ధర్మ సతియె
క్షీర నీర మనగ కీర్తినొందవలెను - తగిన సంతు పొంది తరము బెంచి
యొకరిమాటనొకరు యెపుడుమన్ననజేసి - బంధుజనులమెప్పు పొందవలెను
తనవారు పరవారు తారతమ్యమువీడి - యాదరమునవారి నాదుకొనవలెను
అమ్మనాన్నలుయైన యత్తమామలుయైన - సాటిపిల్లలతోటి సాక వలెను
పతియు సేవ లోనె సతికిధర్మముగలదు - ధర్మ పధము పతికి ధర్మ సతియె
క్షీర నీర మనగ కీర్తినొందవలెను - తగిన సంతు పొంది తరము బెంచి
ఆమ్మో చాలా నీతి వాక్యాలు చెప్పారే, పెద్ద కవిలాగా
జరిగే సంఘటనలు చెప్పాలంటే కవే కావాలా, అనుభవం సరిపోదు, ఇప్పుడు నీవు నాకు సలహా చెప్పలేదు అట్లాగే ఇది కూడా అన్నాడు భర్త.
మహానుభావా బుద్ధి తక్కువయి నిద్రలేపా " పట్టు పరుపుతో పనిలేదు, నడుము వాల్చటానికి నాపరాయి చాలు"
ఇక నిద్ర పోండి నాతో పని ఏమిటి.అన్నది.
ఓ శ్రీమతి ఇటురా "నిద్ర ఎంత సుఖావహమైనదో అంతటి భాగ్యమ్ము కలిగించునే " కొందరు నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతారు, నిద్ర మాత్రలు కూడా వేసుకుంటారు, ఆ అవసరము లేకుండా నిద్ర పోతున్నా అన్నాడు.
మగడా చిన్న పిల్లోడిలా జోల పాటలు పాడ మంటావా
పాటలు పడతావే, ఆ పాడుతా ఉయ్యాల్లో పడుకో చిన్న పిల్లాడిలా
" జోఅచ్చుతానంద జో జో ముకుందా ... లాలి పరమానంద రామ గోవిందా .... "
ఎంత చక్కగా పాడుతున్నావే
ఇంకొక పాట పాడు నిద్రవస్తుందేమో
రామాలాలి, మేఘశ్యామలాలీ అంటూ పాట పాడు తున్నది భార్య నవ్వుతూ
అపుడే గురక పెడుతూ నిద్ర పోయాడు భర్త
సూర్యుడు నడి నెత్తి మీదకు వచ్చే దాకా మంచం దిగని శాల్తీని పట్టుకొని "నిద్రాదేవత నిన్ వరించే గదరా నిర్భాగ్య దామోదరా అని హేళన చేస్తారు చూసిన వారు అను కున్నది భార్య ఏమీ చేయలేక.
చేప కళ్ళు తెరుచుకొని నిద్ర పోతుంది, ఎలుగుబంటు ఒకకంటితో నిద్రపోతుంది, మరో కంటితో జాగారం చేస్తుంది. మానవులు రెండు కన్నులు మూసుకొని కపట నిద్ర పోతారు. అటువంటి వారి ముందు ఏదన్న మాట్లాడాలన్నా కష్టమే.
అప్పుడే భర్త నిద్రలో కలవరిస్తున్నాడు " కంటికి నిద్రవచ్చునే - సుఖంబగుఁ రతికేళివల్ల, కంటికి నిద్రవచ్చునే - శ్రమించుట వల్ల - కంటికి నిద్ర వచ్చునే రేపటి గురించి ఆలోచన లేక పోవుటవళ్ళ "
"అనారోగ్యం, అసూయ, కామం, భయం ఉన్న చోట నిద్ర అసలు రమ్మన్నా రాదే " అది తెలుసుకో - నిద్ర పోయేవాడిని మాత్రం లేపి సుందర స్వప్నాలను భగ్నం చేయకు అన్నాడు నిద్రలో .
మహాను భావా నీ ఇష్టం వచ్చినంత సేపు కుంభకర్ణునిలా నిద్రపో, నిద్రను ఆపే నీకు అన్నా లేడు, ఏ యుద్ధము లేదు హాయిగా పడుకో
నేను కాఫీ త్రాగుతున్న నీ ఇష్టం అంటూ లోపలకు వెళ్ళింది భార్య .
ఏమిటోనే కాఫీపొగల్లా మిట మిట లాడుతున్నది నీ మొఖం,
అన్న మాటలు విన్నది
ముందు మొఖం కడుక్కొని రండి అని ఒక్క తోపు తోసింది.
కాఫీ త్రాగి మొఖం కడుకుంటానులే
అట్లాకుదరదు ముందు మొఖం కడుక్కోండి అన్నది
ఆ తర్వాత ఏమి ఇస్తావ్ "ముద్దులాంటి కాఫీ ఇస్తా "
ఆ .... ఆ ...... అట్లాగే .... ఆ ... ఆ అట్లాగే
--(())--
ప్రాంజలి ప్రభ -
సన్యాసులు - రకాలు :
1. కుటీచకుడు : శిఖ , యజ్ఞోపవీతము, దండ- కమండలాలు ధరించి సంచారం చేయకుండా భక్తి మార్గంలో పయనిస్తూ అల్పాహారం తీసుకుంటూ ఉంటారు .
2 .బహూదకుడు : ఇతను రోజుకు ఎనిమిది కబళములు ఆహారం తీసుకుంటూ, నిత్యం సాధన చేస్తూ ఉంటారు.
3. హంస : ఇతను జడధారియై కౌపీనం ధరించి, జ్ఞానియై ఉంటాడు.
4 .పరమహంస : వెదురు దండాన్ని కలిగి , ఐదు గృహాల నుండి భిక్ష తెచ్చుకుని కౌపీనం మాత్రం ధరించి ,
నిరంతర సాధన లో ఉంటారు .
5.తురియాతీతుడు : దేహాన్ని ఓ శవంలా చూస్తాడు .
6.అవధూత :
ఇతనికి ఏవిధమైన నిష్ఠ నియమాలు లేవు .జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం అంటూ , నాశనమయ్యే ఈ శరీరం నేను కాదు, చూసే వాడికి కనిపించే ఈ రూపం నాది కాదు .నాకు పాప పుణ్యాలు , సుఖ దుఖాలు లేవు , గర్వము మాత్సర్యము , దంభము , దర్పము , ద్వేషము , అన్నింటిని త్యజించి ప్రాణాలు నిలుపుకోవడానికి అగ్ని దేవుడికి కాస్త దొరికిన ఆహారం అర్పణ చేస్తూ దొరకని రోజు ఏకాదశి , దొరికిన రోజు ద్వాదశి అంటూ.... రాత్రి పగలు నిత్య ఎరుకతో సంచారం చేస్తూ పిచ్చివాడిలా తిరుగుతూ ఉంటాడు . కర్మలు అన్ని క్షయం అయిపోయి, వరించిన మోక్షం అనే కంబళి కప్పుకుని ఉంటాడు ... ( నిర్వాణ షట్కానికి ప్రతి రూపం - అవధూతల మరో రూపం )
గ్లాసుడు నీళ్ళు (అనుశ్రుత గాథ)💐🍁
🍁 ఒక సన్న్యాసి అదృష్ట వశాత్తూ భగవంతుడిని కలుసుకున్నాడు. భగవంతుడి చిరునవ్వు నవ్వి నీకేం కావాలి నాయనా అని అడిగాడు.
🍁 ఆ సన్న్యాసి నాకు సత్యాన్ని తెలుసుకోవాలని వుంది.సత్యాన్ని బోధించండి అన్నాడు. దానికి భగవంతుడు చూడు బాబూ!యిప్పుడు చాలా వేడిగా వుంది కదా ఒక గ్లాసుడు నీళ్ళు తెచ్చిపెట్టు.నీరు త్రాగి నీకు బోధిస్తాను అన్నాడు.
🍁 అక్కడికి దగ్గరగా గ్రామం కానీ,ఇళ్ళు కానీ లేవు. చాలా దూరం నడిచి వెళ్లి ఒక యిల్లు కనబడితే వెళ్లి తలుపు తట్టాడు.లోపలినుండి ఒక అందమైన కన్య వచ్చింది.
🍁 సన్నటి నడుము, కలువరేకుల్లాంటి కళ్ళు , చంద్రబింబం లాంటి ముఖం. అతను అంత అందమైన అమ్మాయిని అతను యింతవరకూ చూడలేదు.
🍁 అతని వైపు చూసి అందంగా చిరునవ్వు నవ్వింది. అలా నవ్వుతూ వుంటే యింకా అందంగా కనిపించింది. అంతే తాను వచ్చిన పని మర్చిపోయి నన్ను పెళ్లి చేసుకుంటావా? అని అడిగాడు. ఆ కన్య అంగీకారంగా తల వూచింది.
🍁 వారిద్దరూ వివాహం చేసుకున్నారు.రోజులు గడిచిపోతున్నాయి చాలా మంది పిల్లలు కలిగారు.ఎంతకాలం గడిచి పోయిందో వాళ్లకి తెలియనేలేదు.
🍁 ఇలా వుండగా ఒకరోజు పెద్ద గాలీ వాన ఒకటే ధార.ఊరూ వాడ ఏకమై పోయాయి. చెట్లు పడిపోయాయి, ఇళ్ళు కూలిపోయాయి. భార్యా పిల్లలతో అతడు ప్రవాహములో నడుచుకుంటూ పోతున్నాడు.
🍁 ప్రవాహం వేగంగా వుంది. ఎక్కడా గట్టు దొరకడం లేదు.అప్పుడు భగవంతుడు జ్ఞాపకం వచ్చాడు. 'భగవంతుడా రక్షించు' అని మొర పెట్టుకున్నాడు. భగవంతుడు అతడి మొర విని నేను అడిగిన గ్లాసుడు నీళ్లేవీ? అని అడిగాడు.
🍁 ప్రతిమానవుడు సత్యాన్వేషణ రేపో ఎల్లుండో చేద్దామని కాలం లో చిక్కుకుంటాడు. కాలం లో చిక్కుకొనినివసించడం అలవాటయి పోయింది. కాలం రెండు విధాలు
1.గడియారం సూచించే కాలమానం
2.మనస్సు కల్పించే మానసిక కాలం.
🍁 నిన్న,ఈ రోజు,రేపు అనేవి మనస్సు నిర్మించిన. నిన్న జరిగిన సంఘటనలు యిప్పుడు లేవు. "నిన్న''గతించినట్లే అవి గతించాయి. కానీ ఆ సంఘటనలు జ్ఞాపకం చేసుకొని యిప్పుడు జరుగుతున్నట్టే భావించి ప్రవర్తించే వాళ్ళు చాలామంది వున్నారు. రేపు యింకా రాలేదు కానీ ఈ రోజున జరిగిన సంఘటనలు రేపు కూడా
జరుగుతాయేమోనని ఊహించుకొని భయపడే వాళ్ళూ చాలా మందే వున్నారు.
🍁 #నీతి : నిజానికి నిన్నా లేదు, రేపూ లేదు, వర్తమానమే ఎప్పుడూ వుండేది. మానసిక కాలమే మిథ్య.
No comments:
Post a Comment