ఓం శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:
సంసారంలో సరిగమలు -4
కాకి ముక్కుకు దొండ పండు దొరుకు తుందా అని ఎదురు చూస్తాను,
ఏమిటండి మీరు మాట్లాడేది నాకు మీ మాట అర్ధం కావటం లేదు అన్నది శ్రీమతి వళ్లి
అది కాదే మనబాబు ఎలా ఉంటాడో నీకు తెలుసు
వాడికి ఎర్రటి అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, ఒకే కూతురై ఉండాలి, కట్నం వద్దు, ఉద్యోగం చేయకూడదు అని ఆంక్షలు పెట్టి మరీ పెళ్లి సంభందాలు చూస్తున్నావు, వాడికి పెళ్లి ఎప్పుడవుతుంతో గాని నేను మాత్రం రిటైర్ అవుతాను అన్నాడు నాగభూషణం.
మనవాడు చాలా బుద్దిమంతుడు, కనీసం ఒక్క చెడు అలవాటు లేదు అన్నది.
నిజమేనా నీది తల్లి మనసు, వాడు ఇంకా చిన్న పిల్లవాడిగా ఉహించు కుంటున్నావు, ముందే పెళ్లైతే వీడికి 5 గురు పిల్లలు పుట్టి, ఆ పిల్లలు తాతయ్య ఆమ్మోమ్మ నన్ను అక్కడకు తీసికెళ్ళు, ఇక్కడకు తీసికెళ్ళు, నాకు అది కొని పెట్టు , నాకు ఇది కొని పెట్టు అని వేదిస్తుంటే, ఎత్తు కోలేక ముక్కు చీవిడి తీయలేక కొడుకును ఏమి అనలేక అప్పటి పరిస్థితి ఒక్క సారి ఆలోచించు అన్న మాటలకు ఒక్క సా రి ఉలిక్కి పడింది శ్రీమతి వళ్లి.
ఏమండి అటు చూడండి, ఆ క్యాబు లో దిగేది మనబ్బాయ్ అనుకుంటా
అనుకుంటా అంటావేమిటే అక్షరాలా మనఅబ్బాయే
మరి ఆ అమ్మాయి పిల్లలు మరెవరండి
అది మాత్రాము నాకు తెలియదు, నీకే మన్నా తెలిస్తే నాకు చెప్పు అన్నాడు నాగభూషణం.
ఏడ్చి మొఖం కడుకున్నట్లున్నది మన పెంపకం
మన అబ్బాయి ఎదో నిర్వాహకం చేసిఉంటాడు అంటూ తలుపు దగ్గరకు వచ్చి తీశారు.
ఏమిటమ్మా అలా చూస్తావ్ నీకోడలు
అర్ధం ఆయిందనుకుంటా, అర్ధం కాక చస్తుందా అంటూ గొణుగుతూ
అక్కడే ఉండమని చెప్పండి
హారతి పళ్లెం తెస్తాను
దిష్టి తీసి కుడికాలు పేట్టి లోపలకు రండి అని పిలిచింది
అత్తయ్యగారు మామయ్యగారు మమ్ము దీవించండి అన్నది
సరే ముందు లోపలకు వెళ్లి కాస్త విశ్రాంతి తీసుకోండి
పిల్లలు అడిగారు ఎవరమ్మా వీరు అని
వీరు మీ తాతయ్య అమ్మొమ్మ అన్నది
తాతయ్య అమ్మొమ్మ అంటూ చుట్టు ముట్టారు
వాళ్ళని ఇబ్బంది పెట్టకండి మీకేమన్న కావాలన్నా కొనుకొస్తారు, తరువాత ముందు లోపలకు పోదాం పదా అని అన్నది వచ్చిన కోడలు
కొడుకు తల్లితండ్రుల వద్దకు వచ్చి మీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నాను నన్ను క్షమించండి, దయచేసి బయటకు వెళ్లి బ్రతకమని అరవకండి, అన్ని విషయాలు మీకు తెలియపరుస్తా ను తరువాత. మీకోడలని మాత్రం నేను లేనప్పుడు రాచి రంపాన మాత్రం పెట్టకండి. నన్ను నమ్మి వచ్చింది అని చెప్పాడు.
నాన్న ఇంకో విషయం నేను అడిట్ నిమిత్తం హైదరాబాద్ పోవాల్సిన పరిస్థితి వచ్చింది ఒక్క 10 రోజుల్లో తిరిగి వస్తాను. అంటూ బ్యాగ్ పట్టుకొని వెళ్ళాడు.
అప్పుడే బయఁటకు వస్తూ భార్య క్షేమంగా వెళ్లి లాభంగా రండి అని అన్నది.
జరుగుతున్న వణ్ణి నోరుప్పగించి చూస్తూ ఉండిపోయారు, వల్లి నాగ భూషణం గారు
మావగారు కొడుకు వెళ్ళాకా నీపేరుఏమిటి , మీకు పెళ్లి ఎప్పుడు జరిగింది అని అడిగారు
క్షమించండి మావయ్యగారు, అత్తయ్యగారు, మా పెళ్లి విషయం కానీ పిల్లల విషయం కానీ ఎవ్వరికి చెప్పొద్దని పెళ్ళికి ముందు వప్పందం చేసుకున్నాం అన్నాది.
అదేమిటమ్మా మాఇంటికి వచ్చి విషయాలు చెప్పకపోతే మాకెట్ల తెల్సుస్తుంది. నీమతము, కులము, తల్లితండ్రులు విషయాలు తెలియద్దా.
చూడండి మాతల్లితండ్రులు పార్వతి పరమేశ్వరులు వారికిసేవలు చేయటం తప్పా ఇంకో విషయం చెప్పఁవద్దు అని చెప్పాడు మీ అబ్బాయి, అదే నాకు ఆచరణ
ఇంతకీ నీపేరు అన్నా చెపుతావా
చెపుతాను నాపేరు "ద్రౌపతి " అని చెప్పి పిల్లలకు స్నానం చేయించా లండి, టిఫిన్ తయారు చేసి పెద్ద మనవుడి ద్వారా పంపిస్తాను అన్నది.
కొడుకు క్యాంపుకు వెళ్లినా ఇంటియందు ఉన్న పిల్లలమీద తల్లి తండ్రులమీద మనసు ఉన్నది.
ఉండ బట్ట లేక ఇంటికి ఫోన్ చేసాడు కొడుకు కోటిలింగం
హలో అన్నాడు.
మొదట పెద్ద కొడుకు ఫోన్ తీసాడు ..
""నాన్నా వచ్చేప్పుడు నాకోసం బార్బీ బొమ్మ తీసుకురా నాన్నా..
మర్చిపోకు..
లవ్ యు నాన్నా...అని ఫోన్ పెట్టేసాడు..
మళ్ళీ చేసాడు ..
ఈసారి భార్య..
""ఏవండీ..మీరు వెళ్ళేప్పుడు డబ్బు పెట్టికెళ్లారు, బంగారు గొలుసు ఉంగరాలు ఉన్నాయి, జాగర్తగా ఉండాలండి, అసలే మీకు మతిమరుపు..
ఉండ బట్ట లేక ఇంటికి ఫోన్ చేసాడు కొడుకు కోటిలింగం
హలో అన్నాడు.
మొదట పెద్ద కొడుకు ఫోన్ తీసాడు ..
""నాన్నా వచ్చేప్పుడు నాకోసం బార్బీ బొమ్మ తీసుకురా నాన్నా..
మర్చిపోకు..
లవ్ యు నాన్నా...అని ఫోన్ పెట్టేసాడు..
మళ్ళీ చేసాడు ..
ఈసారి భార్య..
""ఏవండీ..మీరు వెళ్ళేప్పుడు డబ్బు పెట్టికెళ్లారు, బంగారు గొలుసు ఉంగరాలు ఉన్నాయి, జాగర్తగా ఉండాలండి, అసలే మీకు మతిమరుపు..
కాస్త గుర్తుంచుకోండి అంటూ పెట్టేసింది భార్య
ఈసారి మళ్ళీ చేసాను..
ఈసారి మా అమ్మ..
ఫోన్ ఎత్తగానే తను అడిగిన విషయం..
""ఏం బాబూ...ఏమైనా తిన్నావా లేదా"
అమ్మా నీవు అమాయకురాలవి ..
బిడ్డకి ఏమైనా అవుతుందని తల్లడిల్లి పోతుంటావు, నేను క్షేమంగా నే ఉన్నాను . నీవు గాబరా పడ వద్దు .
అమ్మా అందరి కడుపులు నింపి ఆఖర్న మిగిలిన దాంతో సర్దుకుపోయే అన్నపూర్ణవమ్మా నీవు ..
ఈసారి మళ్ళీ చేసాను..
ఈసారి మా అమ్మ..
ఫోన్ ఎత్తగానే తను అడిగిన విషయం..
""ఏం బాబూ...ఏమైనా తిన్నావా లేదా"
అమ్మా నీవు అమాయకురాలవి ..
బిడ్డకి ఏమైనా అవుతుందని తల్లడిల్లి పోతుంటావు, నేను క్షేమంగా నే ఉన్నాను . నీవు గాబరా పడ వద్దు .
అమ్మా అందరి కడుపులు నింపి ఆఖర్న మిగిలిన దాంతో సర్దుకుపోయే అన్నపూర్ణవమ్మా నీవు ..
--(())--
నీ కోడలి కన్న బిడ్డలా చూసుకుంటావని నాకు తెలుసునమ్మా అన్నాడు
బాబు ఆరోగ్యం జాగర్త, త్వరగా పని చేసుకొని రారా బాబు, ఇక్క డా నాకు అంతా అగమ్య గోచరం గా ఉన్నది,
అన్ని సర్దుకు పోతాయమ్మ, నీకు ఓర్పు ఉన్నదని నాకు తెలుసమ్మా అందుకనే నేరుగా ఇంటికి పిల్లలను దాని తెచ్చాను అన్నాడు.
అమ్మా నాన్నకు ఒక్క సారి ఫోన్ ఇవ్వు అన్నాడు
నాన్న నా కోసం ఏంతో కష్టపడ్డావు, నన్ను ఎత్తుకొని పెంచావు, చదివించావు తన చిన్న చిన్న సరదాలు కూడా వదిలేసి నాకే ప్రాధాన్యత నిచ్చావు, నేను ఏది అడిగితే అది కొనిపెట్టావు .
నాన్న ఒక్కసారి స్పీకర్ ఆన్చెయ్ కొన్ని నిజాలు చెప్పాలి మీకు
ఏమిటిరా ఆ నిజాలు
నేను కాలిజి లో ద్రౌపతిని ప్రేమించాను, ఇద్దరం కలసి పెళ్లి చేసుకోవాలని అనుకున్నాము, అప్పటికే వాళ్ళ నాన్న గారు పట్టు పట్టి రెండో పెళ్ళివానికి ఇచ్చి పెళ్ళిచేసారు. అతనికి అప్పటికే 3 గ్గురు ఆడ పిల్లలు ఒక మోగాపిల్లోడు. అను కొని విధముగా పెళ్లి ఆయన రాత్రి హార్ట్ ఎటాక్ అయి చనిపోయాడు, అబ్బాయ్ తల్లి తండ్రులు ఆదరించక పోగా శాపనార్ధాలు పెట్టారు.
అప్పుడే నాకు పరిచయ మైనది, మేము గుడిలో పెళ్లి చేసుకున్నాము మాకు మొగ పిల్లవాడు పుట్టాడు పిల్లలందరూ నీకు మనవళ్లే
ఇదన్న జరిగిన విషయం ఒక ఆడదాన్ని జీవితం బాగు చేయాలని తొందరపడి మీకు చెప్పకుండా కాపురం చేసినందుకు నన్ను క్షమిస్తారని ఆశిస్తాను అన్నాడు.
బాబు నీవు చేసిన పని మంచి పనే మేముం ఏమీ అనుకోము ఆదేవుడు రాసి పెట్టాడు నీవు అలా ప్రవర్తించావు, ఇందులో తప్పెవరిది లేదు, పెద్ద వారుగా మేము ఉండి అందరి నీ చదివించి ప్రయోజకులుగా చేస్తాము.
నీవు మనసులో ఎటువంటి దిగులు పెట్టుకోకు
నాన్న అమ్మా ద్రౌపతి అనే పేరు ఇష్టము లేకపోతే మీకిష్టమొచ్చిన పేరుతో పిలవచ్చమ్మా,
చూడు బాబు మాకు పేరుతో పని ఏమున్నది కోడలు పిల్ల మమ్ము ఇబ్బంది పెట్టకుండా ఉంటే చాలు అన్నారు.
నన్ను నమ్మండి నాన్న మిమ్మల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టదు,
నిన్ను నమ్మేగదారా లోపలకు రానిచ్చింది దిగులు పెట్టుకోక త్వరగా రా
అట్లాగే నాన్న
No comments:
Post a Comment