Sunday, 14 January 2024

ప్రాంజలి ప్రభ పద్య, కథల పత్రిక 15/01/2024



ప్రాంజలి ప్రభ (జనవరి  )  


వివేకానందుని జాయింతి సందర్భముగా 


విశ్వ వాహిని యందు వేదతత్వ బోధ విద్వక్త

జ్ఞానామృతంలో పంచిన భరత ధర్మ విద్వక్త


హైందవ ధర్మాన్ని జగతిన తెలియపరచె జ్ఞాన సంద్ర

దేశభక్తి సర్వులకు సంతృప్తి యన్న విద్వక్త


యువత జాగృతి పరిచిన స్ఫూర్తి దాతయే యోగీంద్ర

భువనేశ్వరి బెడ్డడే వివేకానంద విద్వక్త


గురువుల బోధన , సమాజ  చెలిమి మానవత్వమన్న 

సంస్కారం  తల్లితండ్రి పెంపకమన్న విధ్వక్త


రామకృష్ణ పరమహంస ముఖ్య  శిష్యుడే నరేంద్ర

హిందూ ధర్మ రక్ష సత్య సాధు వివేక విధ్వక్త


కష్టాలు కన్నీళ్లు నేర్పుతాయన్నా విధ్వక్త 

ఓటమి,అవమానాలు నేర్పుతా యన్నా విధ్వక్త

ప్రాంజలి ప్రభ.. పద్య పత్రిక (జనవరి )

రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ 


భూతిలకం.. (భ భ ర స జ జ గ.. యతి 12)


01..దాసుడ గావర వేడుకన్ వరదా మదంబు దొలంగగా

వాసము నామది జేయుచున్ రిపువర్గమున్ దొలగించుమా

బాసల నేర్వని సంస్తుతిన్ మదపాశమున్ హరియించుమా

వాసవ సేవిత శ్రీధరా భవపాశసంహరశ్రీపతీ


02..దాసుడ నైతిని యార్తితో సహ ధర్మచారి సహాయమై

ద్యాసయు భక్తియు మూర్తిపై నిజ దాన ధర్మ సమానమై

కాసులు కోరను బాంధవా సమ కార్యసాధన ప్రేమమై

మూసగ జీవిత లక్ష్యమై జప మూల్యమేమియు కోరనే 


03..కాల మనోభవ రాగయుక్తసకాలమేను జయమ్ముగా

జ్వాల సహాయము నీరుశక్తియుఝాస మయమ్ముగా

నేల సమాధన వృక్ష ముక్తియు నీడ ససే పరమ్ముగా

బేల సుఖమ్ముయు దక్ష రక్తియు బంధ చిత్త సజీవమే


03..ఇంకను ఏమని చెప్ప లేనును యీ శ్వరా సహనమ్ముగా

సంకట మేమది దుష్టబుద్ధియు సామరస్యపు జీవిగా

వంకలు బెట్టను దైవమా సహవాంఛతీర్చ సుబుద్ధి గా

శంకలుతెల్పను ధర్మమా సమసంశయమ్మును తీర్చుమా


05..కాలము నీదయ నిత్య సత్యముగా గురుత్వ పటుత్వమై

శీలమనేదియు సిగ్గుదొంతర శీఘ్రమోన్నతగ తృప్తి కై

బేలల శోభలు సర్వ మౌయగు బంధభావము మొహమై

చేలము తప్తము శీతవర్షము చిన్మయాసొభగన్ సుధీ


06..ప్రేమకు ప్రేమయు ఇచ్చి పుచ్చుట ప్రీతిగన్ను సరాగమై

క్షేమము కోరిసుసంపదేయగు క్షేమమౌ సహనమ్ముగా

జాముల కాలము సమ్మొహమ్మగు సంతసమ్మగుకేళిలో

స్యూమము నాందుచు శాంతి నొందియు సోలిశీతల గాలిగన్


07..మక్కువ జూపవ మానసమ్మున మార్గ మాయను మార్చుమా

చక్కని రూపము నీది నామది చింతనిన్నుగ ప్రార్థనే

ఒక్కరు కాదును యిద్దరమ్మగు ఓర్పుగాను సహాయమే

తక్కువ యెక్కువ నెంచలేనులె తత్త్వమేగతిభక్తిగా


08..భారమునీదెగ కావఁగన్ ననుపర్తివాస సువంద్య సాయీ

నేరములెంచకు నాదునౌ హరినీపదాలుశరణ్యమందున్

నీరజపీఠిని శేషశయ్యనునిద్రనొందు మురారి పత్నీ

సారసుశాస్త్రవిదాంవరా హరిచందనాభ దయాబ్ధిదత్తా !!! "అప్పాజీ గారు )

----


పరామోదః (య స  స జ న మ.. యతి..10)


09..సహాయమ్ము సమాధనమ్ము సమర్ధతకథ నిత్యమ్మున్

ప్రహాసమ్ము ప్రయోజనమ్ము ప్రవర్తనలగు సత్యమ్మున్

విహారమ్ము విమోచనమ్ము వినమ్రతలగు సర్వాళిన్ 

సుహాసంబు సజీవణమ్ము సుఖమ్ము కలుగు శ్రీదేవీ


 010..సమూహంబు సహాయము సంచరింప సతము సౌఖ్యమ్మున్

సుమోదంబయి యెల్లరికిన్ శుభంబు గలుగ ప్రేమంబున్

సమైక్యంబగు శాంతముచే సమాధరమును పొందంగన్

నమోవాక్కులు సంభవమై నిరంతరమగు శ్రీదేవీ


011.. నరుణ్యాలయ సంతసమే క్రమన్ సముచిత సర్వంబున్ 

అరుణ్యా తరుణమ్ముగనే విధిన్ సముఖ విశేషంభో 

సరూప్యా వినయమ్ముగనే సమమ్ జయమగు వేగంబౌ

శ్వరా సేవలుగా జయమే సమం మగుటయె శ్రీదేవీ


012..సుఖం ముత్యము లాంటి యున్నత యోవనము సౌఖ్యమ్మున్ 

సుఖం నిత్యము వ్రాయను కాసులే యగుటయు ప్రేమమ్మున్ 

సుఖం సత్యము నేస్తము త్రాసు యే గమనము సౌమ్యమ్మున్ 

సుఖం గత్యము పాఠ్యము గా సుఖాల మయము శ్రీదేవీ


----

ప్రాంజలి ప్రభ జనవరి రెండవ వారం పద్యాలు

రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ


సీ॥ లక్ష్మివై మా ‘‘ధనలక్ష్మి’’వై మా ‘పంట’

.          లక్ష్మివై నవ ‘‘ధాన్యలక్ష్మి’’ వౌచు

 లక్ష్మివై మా ‘‘జయలక్ష్మి’’వై మా ‘వొంట’

  లక్ష్మివై ‘‘విజ్ఞానలక్ష్మి’’ వౌచు

 లక్ష్మివై  మా ‘‘గజలక్ష్మి’’వై మా కంట 

 లక్ష్మివై ‘‘సామ్రాజ్యలక్ష్మి’’ వౌచు

 లక్ష్మివై మా ‘‘ధైర్యలక్ష్మి’’వై మా యింట

 లక్ష్మివై ‘సంతానలక్ష్మి’ వౌచు

గీ॥ లక్ష్మివై జనులకు ‘‘అష్టలక్ష్మి’’ వౌచు

 లక్ష్మివై భువిలో ‘‘యిష్టలక్ష్మి’’ వౌచు

 లక్ష్మి వౌచును ‘‘శ్రీ మహాలక్ష్మి’’ వౌచు

 కదలి రావమ్మ ‘‘మకర సంక్రాంతి లక్ష్మి’’ !


సీస పద్యం 


చేతిలో బంగారు చెలిమిత్రిసూళము 

అండగా వాహనం అదును నంది

ప్రక్క కుబేరుడు ప్రకృతి తోడుగనీడ

కామధేనువు తోడు కాల మందు

కల్పవృక్షము తోడు కమనీయ గుణములు

చింతామణి వెలుగు చిన్మయమగు

అమృత కిరణుడుగా తలపాగ పువ్వుయే

సకల శుభములుగా సమపదములు


తే. గీ.నామనస్సునీ కర్పించ నమ్మ బలుకు

నేమి నియ్యగలను నేను నీకు తండ్రి

హృదయమందు నీవేనుండి హాయి గొలుపు

సర్వ లయకరా నీదయ సమయ మందు

.......

సీస పద్యము ... శివుడు 

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

సృష్టి - స్తితి - లయము... ల కతీతు డైనాడు ,

చింతింప తగనోడు ... వాడె శివుడు  

జ్ఞానము ఆనంద మున నిమగ్నుడు వాడు   

స్పటిక కాంతుడు వాడు ... వాడె శివుడు 

అర్ధ నా రీశ్వరు...  డు పులిచ ర్మబ దారి 

అభయప్ర దాతుడు .... వాడె శివుడు 

నీలఖంటుడు వాడు ముక్కంటి అయినాడు 

భస్మాభ రణముగ ...  కలిగి నోడు   

తేటగీతి 

ధ్యాన ముతొఉన్న నీలఖంటుడుగ వాడు    

సర్వమును చూసి సహకరిం చేటి  వాడు 

మొక్కి కొలిచిన మోక్షము ఇచ్చు వాడు 

పార్వతీ పరమేశ్వర మమ్ము చూడు 

--(())--


సీస పద్యము 


పరిచయమైనది పరిమళ మౌనులే

 పరవశమైనది పలుకు గాను

 అవధులు దాటే ను అతిశయమేనులే

 ఆశయమే గతి అనుభవమను

 కనివిని ఎరుగని కానుకయే గతి

 అలలుగా బ్రతుకగు ఆశ లగును 

 నిశ్శబ్ద బ్రతుకున నీడ కరువగుటే

 నిజమ తెలపలేక  నీతి గాను


తే. పొదగిన సుఖాలు యందునే పోరు లాగ

 వినయపు దరహాసమ్మగు విలువ తెలప

 కలలు తీర్చ సేవలగుటయే కాలమాయ

ప్రాంజలి ఘటించి బ్రతుకుగా ప్రభల గీత

******

ప్రాంజలి ప్రభ (జనవరి మూడవ వారం ) పద్యాలు 

రచన మల్లాప్రగడ రామకృష్ణ 


సర్వపర్వమగు వాసిగ చక్కగ నిల్పనా?

గర్వహీనుఁడన నన్నిఁక కాంచవ చక్కగా

నిర్వివాదమగు నీ కృప నీవెను కాంచుమా,

సర్వరక్షణయు భారము సన్నుతి  నీదయన్


భోగి భోగములు ప్రీతిగపొందుట సత్యమున్

యోగ సంబరము నెంచియు యోగ్యత సందడిన్

మూగగానయ నుభూతులు ముఖ్యము నిత్యమున్

భాగ్యమే మనసు నందున బంధపు తత్త్వమే


చక్కనైన కళ యూపుల చెంచల మెల్లగన్

చుక్కలై చరితమేయన చూపుల చల్లగన్

మక్కువై మనసు యాటలు మాయల వెల్లువన్

చిక్కులే తొలగి సర్వము శీఘ్రము కాంతిగన్


భోగభాగ్య ములు కమ్మని కాంతుల చిత్తరుల్

రాగ పల్లవిలు మెప్పుగ రమ్యత  గప్పుచున్

యోగ నిష్ఠలగ  నేత్రలు యెప్పగ దాల్చియున్

స్వాగతమ్మగుట పిల్పుల సాక్షిగ యుంటిరే


జీవితమ్ము విధి వాకిట చిత్తము పంచుటే

భావవేదముయు నిత్యము భాగ్యము కోరుటే

సేవ లక్ష్యమగు బంధము సత్యము పల్కుటే

నీవుగా నిజము తెల్పియు నీడగ యుండుటే


పంజరాన్ని వదిలే యిక పండుగ యేచెలీ 

మంజులా మహిమ జూపవె మానసమే గిళీ

శృంజనా భవము చక్కని సందడి యే చెలీ 

రంజనా సుఖము పొందుట రమ్యత యే విధీ


నవ్వులై నటన నానుడి నాట్యము యేలనో

పువ్వులై పుడమి చెంతన పూజ్యము యేలనో

మువ్వలై కదల చూపులు ముచ్చట యేలనో

గువ్వలై కలయు కాలము గుర్తులు యేలనో


 భోగి, భోగమన భోక్తకు భోజ్యము ఇష్టమై 

త్యాగ మూర్తులను , పెద్దల దారిన పండుగై 

రాగ భారతిగ సంతస రమ్యత జూపులై

వేగ హృద్యమున పౌరుల సేవల రాజ్యమే


వానవెల్లువగు మబ్బుల వాహిని వాకిటౌ

మానుపోరు కళ మానస మార్గము మక్కుఔ

మేను యాశ లగుతుల్యమ మేకము మోక్షమౌ

తాను నే ననుట సంభవ తన్మయ భావమే


01..మాణిబూషణశ్రీ వృత్తము (ర న భ భ ర.. యతి 10)

చక్కటి పద్యము వ్రాయగలరు... Pranjali🌹ప్రభ

      ****-          

తెలుగు భాషను నేను రామా 

బంధీనై పడి ఉన్నాను రామా

కాలగర్భంలో కలసిపోతున్నాను రామా

కటిచీకటిలో బ్రతుకుతున్నాను రామా


నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ,

శ్రీకృష్ణదేవరాయ, శ్రీనాధ, 

భగవద్గీతకు నిలయాన్ని నేను

వేదాలకు ఆలయాన్ని నేను

ఉపనిషత్తులకు ఆశ్రయాన్ని నేను

కటికచీకటిలో బ్రతుకుతున్నాను


తెలుగు భాషను నేను రామా

బంధీనై పడి ఉన్నాను రామా


పాఠశాలల్లో 4 ఆంగ్లగురువులు ఉంటారు

100 మార్కుల ఆంగ్లమును బోధిస్తారు

పాఠశాలల్లో లెక్కల గురువులు ఉంటారు

100 మార్కుల లెక్కలను బోధిస్తారు

పాఠశాలల్లో హిందీ గురువులు ఉంటారు

100 మార్కుల హిందీని బోధిస్తారు

మరి పాఠశాలల్లో తెలుగు గురువులు ఉంటారు

100 మార్కుల తెలుగును బోదించే వారేరి?


కాని సకలశాస్త్రాలకు నిలయమైన

100 మార్కుల తెలుగుకు 

బోధించే గురువులుండరు ఎందుకు?

మాతృ భాషను కులభాష అని

మతభాష అని మృతభాష అని

ప్రచారం చేస్తారెందుకు?

తెలుగు భాషా సాహిత్యమును

తెలుగు భాషా గురుశిష్యులను

కాలగర్భంలో కలిపేస్తున్నారు


ఈ దయలేని మానవులు

తెలుగు భాషను విస్మరించినారు ఎందుకు?

తెలుగు భాషా సాహిత్యమును మరిచారెందుకు?

కాలగర్భంలో కలిపేస్తున్నారు ఎందుకు?


స్వాములు సన్యాసులు 

గుడులు మందిరాలు

యజమానులు మేధావులు

మంత్రులు ముఖ్యమంత్రులు

గొప్పగా ఆలోచనచేయాలి

సంభాషణ తెలుగును 

అభివృద్ధి చేయాలి, తెలుగులో ప్రభుత్వం

సంప్రదిపులు, సమావేశాలు, వ్రాతలు ఉండాలి 


ఆంగ్లభాషవలే తెలుగు భాషను

అనివార్యంగా నేర్పించే 

రాజ్యాంగాన్ని నిర్మించుకోవాలి


అందుకే నేను

తెలుగు భాషను నేను రామా

బంధీనై పడి ఉన్నాను రామా

కాలగర్భంలో కలసిపోతున్నాను రామా

కటిచీకటిలో బ్రతుకుతున్నాను రామా


కళ్ళు తెరవండి, మనభాష తెలుగండి

తెలుగులో వ్రాస్తాము, చదువుతామని

శబధం చేయండి, మనమాతృభాషను బ్రతికించండి


తెలుగు భాషను నేను రామా

బంధీనై పడి ఉన్నాను రామా

కాలగర్భంలో కలసిపోతున్నాను రామా

కటిచీకటిలో బ్రతుకుతున్నాను రామా

ఎందరో మహానుభావులు

అందరికీ వందనాలు

సర్వేజనాసుఖినోభవంతు

                 మిత్రులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు    


అపరాధ సహస్రాణి, క్రియంతేఁహర్నిశం మయా !

దాసోఁయ మితి మాం మత్వా, క్షమస్వ పరమేశ్వర !!

 

కరచరణ కృతం వా కర్మ వాక్కాయజం వా 

శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ !

విహిత మవిహితం వా సర్వమేతత్ క్షమస్వ 

శివ శివ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో !!


భాస్కరస్య యథా తేజః మకరస్థస్య వర్ధతే।

తథైవ భవతాం తేజః వర్ధతా మితి కామయే।। 


మకరరాశిలో ప్రవేశించిన సూర్యునియొక్క తేజస్సు దినదినప్రవర్ధమానమగుచున్నట్లుగా మీరు మంచిఅభివృద్ధితో ప్రకాశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ  మకరసంక్రాంతి శుభాకాంక్షలు 

అయ్యా/అమ్మా!సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబానికీ, మీ  బంధువులకు,మీ పరివారానికీ,సహవాసులకు,మీ శ్రేయోభిలాషులకూ, మీ అనుయాయులకు ఈ సంక్రాంతి అత్యంత ఆత్మీయ,ఆరోగ్య,ధన సంక్రాంతి కావాలని ఆ అమ్మలగన్నయమ్మను వేడుకుంటున్నాను.


 


పగలును, రాత్రియు బొట్టకు

వగతో వాపోవు చుండు వానిది బ్రతుకా?

తగనిన్ను గడియ యైనను

వగతో ప్రార్థింప ముక్తి వానిది కృష్ణా!


దైవికంబుగా సిరి నాకు దక్కెననుచు

మరియు చుండిన తప్పక మోసమగును

విరియబోచిన తమ్మిపై విందు గుడుచుచు

తేటి రేలందుదాన బంధింపబడదె


మనమెల్లరమును, భగవం

తుని బిడ్డలమగుట, గూర్మి దోగుచు జెలిమిన్

మనమన్నదమ్ములట్లుగ

గనుఁగొని యుండంగవలయు గలసి  కుమారా!


చింత కాల్చి వేయు చితి లేకపోయినన్

బాధపడిన బ్రతుకు బాగుపడదు

కాల  మొచ్చినప్పుడు కాదేది కష్టమ్ము

నవ్య కవన సరణి  నడుచు హరిణి!


వేకువందు లేచి వేడ్క గాపాఠాలు

చదువుచుండవలయు చక్క గాను

ఉదయసమయ పఠన ముత్సాహమిచ్చును

తెలిసి మెలగు మేలు తెలుగుబాల!


ఉదధిలోన నీళ్ళు ఉప్పలుగా జేసె

పసిడి గలుగు వాని పిపిన జేసె

బ్రహ్మదేవు సేత పదడైన సేతరా

విశ్వదాభిరామ! వినుర వేమ!


తాత్పర్యం: న బ్రహ్మదేవుడు అపారమైన సముద్రాన్ని సృష్టించాడు. కానీ దానిలోని నీరు తాగటానికి వీలులేకుండా ఉప్పుగా ఉంచాడు. అలాగే ఒక సంపన్నుడిని పుట్టించి పిసినిగొట్టు వానిగా మార్చాడు. బ్రహ్మదేవుడు చేసిన పని బూడిదతో సమానం అని అర్థం.


ఎప్పుడుఁదప్పులు వెదకెడు

నప్పురుషునిఁగొల్వఁగూడదదియెట్లన్నన్

సర్పంబు పడగనీడను

గప్ప వసించిన విధంబు గదరా సుమతీ!


తాత్పర్యం: ఓ సుమతీ! నల్లతాచు యొక్క పడగ నీడను వసించు కప్ప బతుకుదెంత కాలము? అంటే పాము తాను పెట్టిన గుడ్లను తానే తినును. అలాగే నీడకొరకున్న కప్పను కూడా ఏదో ఒక సమయమున మింగును. అలాగే ఎల్లప్పుడూ దోషములు వెదకుచూ ఉన్న యజమానుని సేవ కడుంగడు కష్టతరము. ప్రాణాపాయమని వ్యక్తమగుచున్నది. వాని బతుకు కప్పవలె పోల్చినాడు కవి.


దేశసేవకంటె దేవతార్చన లేదు

స్వార్థపరతకంటె చావులేదు

సానుభూతికంటె స్వర్గంబు లేదురా

లలితసుగుణజాల! తెలుగుబాల!! 


జనితా చోపనీతా చ యశ్చ విద్యా౦ ప్రయచ్ఛతి

అన్నదాతా భయత్రాతా పంచైతే పితరః స్మృతాః


కన్న తండ్రి, ఉపనయనము చేసినవాడు, విద్య గరిపినవాడు,అన్నము పెట్టినవాడు,

భయపడినప్పుడు కాపాడెడివాడు ఈ ఐదుగురూ తండ్రులని చెప్పబడుచున్నారు.


 పుట్టుకతోడ దుర్గుణము బుట్టిన దానిని మాన్ప పందెమున్

గట్టిననైన బ్రహ్మకును గాదది యెట్టులటన్న రెండుగా

గొట్టిన ముష్టిపప్పొకటి కుండెడు తేనెనుముంచి నానగా

బెట్టిన దానిచేదు తెగబీల్చఁగ జాలునె,  వేంకటేశ్వరా  !


అక్షరలక్షలు విలువజేసే సత్యాన్ని లోకానికి చాటిచెప్తున్నాడు కవి ఈ పద్యంలో.  మనలో చాలామందికి ఇప్పటికే అనుభవంలోకి వచ్చివుంటుంది.  వును నిజమే. కొంతమందికి పుట్టుకతొవచ్చిన దుర్గుణాలను మాన్పటం బ్రహ్మతరంకూడా కాదు. ఎలాగంటే. .......

ముష్టిపప్పు పేరుగల ఒకచెట్టువుంది.  అది భయంకరమైన చేదు కలిగివుంటుంది.  దానిని నిండయిన తేనెకుండలో ఎంతకాలం నానబెట్టి తీసినప్పటికీ తేనెకున్న మాధర్యం దానికి అంటదు కదా ! అలాగే దుష్టుడు కూడా పుట్టుకతో వచ్చిన తన దుష్ట స్వభావాన్ని విడువలేడు.  పనికట్టుకుని ఇతరులమీద దుష్ప్రచారాన్ని చేసే నికృష్టులు ఈ కోవకి చెందినవారే. అటువంటి వారికి దూరంగా వుండటం మంచిది.


రచయిత  :- కాకితము గోవిందదాస కవి


తాత్పర్య సహిత విశ్లేషణ  :-

డా !! సోమయాజుల త్యాగరాజ శాస్త్రి


పద్దెము లోభికేల? మఱి పందికి జాఫరు గంధ మేల? దు

క్కెద్దుకు పంచదారటుకులేల?నపుంసకుడైనవానికిన్

ముద్దులగుమ్మయేల? నెఱ ముక్కఱ యేల వితంతురాలికిన్

గద్దకు స్నానమేటికి? గావలె? బెమ్మయసింగధీమణీ!


 హాలాపాన విజృంభమాణ మదగర్వాతీత దేహోల్లస

ద్బాలాలోకన శృంఖలానిచయ సంబద్ధాత్ముఁడై లేశమున్

వేలానిస్సరణంబు గానక మహావిద్వాంసుఁడుం గామినీ

హేలాకృష్ట కురంగశాబక మగున్ హీనస్థితిన్ వింటిరే.


భావము:- ఈ విషయం వినే ఉంటారు. ఎంత గొప్పపండితుడు అయినా మధువు త్రాగి, ఆ మత్తులో ఒళ్ళు మరచి కన్నులు తెరవ లేకుండా అయిపోతాడు; ఆడువారి వాలుచూపులు అనే సంకెళ్ళలో చిక్కి పోతాడు; ఆడుకొనే పెంపుడు లేడిపిల్లల లాగ ఎలా ఆడిస్తే అలా ఆడుతూ ఉంటాడు; అతి విలువైన తన జీవితకాలం వృథా అయిపోతున్నది కూడ గమనించలేడు. అలా ఉచ్ఛస్థితి నుండి హీనస్థితి లోకి దిగజారిపోతాడు. వ్యసనాల వలన ఎంత దుర్గతి కలుగుతుందో చూశారు  కదా!.


ప్రయత్నాద్యతమానస్తు 

యోగీ సంశుద్ధకిల్బిషః | 

అనేకజన్మసంసిద్ధః

తతో యాతి పరాం గతిమ్ || 


తా:- పట్టుదలతో ప్రయత్నించునట్టి యోగి పాపరహితుడై, అనేకజన్మలందు చేయుబడిన అభ్యాసముచే  యోగసిద్ధినిబొందినవాడై, ఆ పిదప సర్వోత్తమమగు (మోక్ష) గతిని బడయుచున్నాడు. 


నీనా సందొడబాటు మాట వినుమా! నీచేత జీతంబునేఁ

గానింబట్టక సంతతంబు మదివేడ్కన్గొల్తు నంతస్సప

త్నానీకంబున కొప్పగింపకుము నన్నాపాటియే చాలుఁదే

జీనొల్లం గరినొల్ల నొల్లసిరులన్‌ శ్రీకాళహస్తీశ్వరా!


తా:---: ప్రభో శ్రీకాళహస్తీశ్వరా! నీకూ నాకూ, ఒక ఒడబాటు మాట వినుము. నేను జీతమూ, భత్యమూ లేక నిన్ను సేవించెదను. నన్ను పగవారికి (నరకానికి) ఒప్పగించవద్దు. ఇది ఒక్కటే నా కోరిక. నేను అది తప్ప వేరొకటి అడుగను, నాకు జీవితము వద్దు, సిరులు, హస్తిశ్రేణి వద్దు.


అక్కఱపాటు వచ్చు సమయంబునఁజుట్టములొక్కరొక్కరి

న్మక్కువనుద్దరించుటలు మైత్రికిఁజూడగ యుక్తమేసుమీ

యొక్కట నీటిలో మెరక నోడల బండ్లను బండ్లనోడలన్

దక్కక వచ్చుచుండుట నిదానముగాదె తలంప భాస్కరా!


తాత్పర్యం: భాస్కరా! మానవులు ఇచ్చిపుచ్చుకొనుట సహజము. అలాగే అవసరమున్న వేళయందు బంధువులు ఒకరినోకరు ప్రేమతో, కష్టముతో నుండిన వేళలయందు ఉద్ధరించుటకు ప్రయత్నములు చేయుట స్నేహమునకు భావం. ఎలాగనగా, నీటిలో పడవల మీద బండ్లు తీలుకొని వెళ్లునట్లు.భూమి మీద బండ్ల మీద పడవలను తీసుకువెళ్ళునట్లు. అలాగే తగిన అవసరము వచ్చిన వేళ ఒకరినొకరు అన్యోన్యతలు పాటించాలని సారాంశము.


  నరత్వం దుర్లభం లోకే  విద్యాతత్ర సుదుర్లభా

కవిత్వం దుర్లభం తత్ర శక్తి స్తత్ర దుర్లభా


తా:-- లోకములో మనుష్యజన్మ యెత్తడమే దుర్లభమైనది,  అందులోనూ విద్యాసంపాదన చేయగలుగుట మరింత దుర్లభము, చదువు వచ్చిననూ కవిత్వము పట్టుబడుట మరీ కష్టము, కవికాగలిగిననూ ఉత్పత్తి శక్తి కలవాడగుట అసలే కష్టము గదా!


స్పృహణీయ గుణై: మహాత్మభిః

చరితే వర్త్మని యచ్ఛతాం మనః

విధిహేతు రహేతు రాగసాం

వినిపాతోపి స్సమున్నతే


భావము :--ప్రశంసనీయములైన గుణములు గల మహాత్ముల మార్గమే అనుసరణీయము.

ఆ మార్గముననుసరించువారికొకవేళ దైవికముగా ఆపదలు కలిగిననూ యది అభ్యున్నతికే యగును.తటస్థించిన యాపదలు వారికి ఆ మహాత్ముల మార్గము ననుసరించుటవల్ల మాత్రము కాదు.

****

                 --------   మిత్రులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు --------------


చలితో రేగిన రోగబీజముల దోషంబెల్లనూ భోగి మం 

టలతో దగ్ధము జేసి జీవితపు తోటల్ శుద్ధి గావించి,రా

గల సంవత్సరమెల్ల దేశమున సౌఖ్య శ్రీలువర్షించి ని

ర్మల ధీశక్తు లొసంగు మమ్మ! శుభ సంక్రాంతీ దిగంతంబులన్ (జాషువా)


సంక్రాంతి కవితలు.


కోపతాపాలకు తాటాకు మంటలను సరిహద్దులుగా నిర్దేశిస్తుంది 

శ్రుతి మించిన భావోద్వేగాలను దహించేందుకే భోగిమంటలంటుంది 

ఉన్నత శిఖరాన్ని చేరుకోవడమే కాదు,దాన్నెలా నిలుపుకోవాలో 

వినీలాకాశంలో ప్రశాంతంగా ఎగిరే గాలిపటం నేర్పుతుంది.

పొంగళ్ళ రుచులు తియ్యందనాలతో వెల్లివిరిసి నట్లే 

స్నేహ గంధాల మానవ బంధాలు మరింతగా పటిష్ట మౌతాయి 

లోకహితం కోరే 'హరిదాసు' ల వెంబడి 

పబ్బం గడుపునే డూ డూ బసవన్నలూ దర్శన మిస్తారు.

మమ్ముల దీవించండంటూ భోగి పళ్ళతో చిన్నారులు చేరవస్తారు.

రేపటికి వెలుగు నిచ్చే మేధకు నేడే మెరుగులు దిద్దుదాం 

తరతరాల సంక్రాంతిని మనసారా ఆహ్వానిద్దాం 

గొప్పదనం తో నిండిన మన సంస్కృతిని తనివితీరా ఆస్వాదిద్దాం (మాచవోలు శ్రీధర రావు)


 ఓం మిత్ర రవి సూర్య భాను ఖగ పూష I

హిరణ్యగర్భ మరీచ్యాదిత్య సవితృర్క భాస్కరేభ్యో నమః II

నమో ధర్మవిధానాయ నమస్తే కృతసాక్షిణే I

నమః ప్రత్యక్ష దేవాయ భాస్కరాయ నమో నమః II

భానో భాస్కర మార్తాండ చండరశ్మి దివాకర I

ఆరోగ్య మాయుర్విజయం శ్రియం పుత్రాంశ్చ దేహిమే II

ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః!!


                              బలిమి గలిగినవానితో బగ ఘటించి 

                             చేతగాని నరుండెట్లు జెడకపోవు 

                              నిన్ను జెనకిన మదను డేనేర్పు గాంచె   

                              మథిత గజ దనుజాయ నమశ్శివాయ


నువ్వు లేకున్నా కాలం ఆగదు. నీవు వున్నప్పుడు నీలో మంచిని బ్రతికించు. నీవు లేకపోయినా కాలం నిన్ను మరువని విధంగా జీవించు.

మన జననంతో బంధాలు కలుస్తాయి. మరణంతో జ్ఞాపకాలు మిగులుతాయి. మంచి

చెడుల జీవనయానంలో     కీర్తి ప్రతిష్ట లే శాశ్వతం. సిరిసంపదలు కావు.


చిలుక నొక రమణి ముద్దుల

చిలుకను శ్రీరామ యనుచు శ్రీపతి పేరం

బిలిచిన మోక్షము నిచ్చితి

వలరగ మిము దలఁచు జనుల కరుదా కృష్ణా!


    తమ్ములు తమయన్న యెడ భ

   యమ్మును భక్తియును గలిగి యారాధింపన్

   దమ్ముల నన్నయు సమ్మో

   దమ్మునఁ బ్రేమింపఁ గీర్తి దనరుఁ కుమారా!


ఓ కుమారా! పిన్నవారు పెద్దవారిపట్ల భయభక్తులను కలిగి యుండాలి. తమ్ముళ్ళూ అన్నపట్ల గౌరవమర్యాదలను ప్రదర్శించాలి. అన్నకూడా తమ్ముళ్ళను అదే భావముతో చూడాలి. ఇటువంటి అన్నదమ్ములు, లోకమున పేరు ప్రఖ్యాతులు పొందగలరు.


అన్ని జాడలుడిగి ఆనందకాముడై

నిన్ను నమ్మజాలు నిష్టతోడ

నిన్ను నమ్మ ముక్తి నిక్కంబు నీయాన!

విశ్వదాభిరామ వినురవేమ!


నమ్మకు సుంకరి, జూదరి,

నమ్మకు మగసాలివాని, నటు వెలయాలిన్,

నమ్మకు మంగడి వానిని,

నమ్మకుమీ వామహస్తు నవనిని సుమతీ!


తాత్పర్యం: ఓ సుమతీ! లోకములో ఇంటి పన్నులు వసూలు చేయు వానిని, జూదమాడు వానిని, స్వర్ణవృత్తి చేయువారిని, వేశ్యలను, వస్తువులను అమ్మేవారిని, ఎడమ చేతితో పనులు చేయువారిని నమ్మరాదు అని భావం.


 కోపమందు నీవు కోల్పోయెదవు బుద్ధి

మనసు నొచ్చుకొనెడి మాటలనుచు

యుక్తి తోడ సాగయుపకారి వయ్యేవు

నవ్య కవనసరణి నడుచు హరిణి(ప్రేమా ప్రసాద్ )

సేకరణ (ప్రేమా ప్రసాద్ )  శ్రీ హరిణి శతకము నుండి.


అంభోజాక్షుల లోపల 

రంభ యే  కడు నందగత్తె    రాగంబులలో 

గాంభీర్యమైన  రాగము 

కాంభోజియే  కుందవరపు కవి చౌడప్పా


మూలం భుజంగై: కుసుమంచ భృంగై:

శాఖా ప్లవంగై: శిఖరం విహంగై:

నాస్త్యేవ తచ్ఛందన పాదపస్య 

యన్నాశ్రితం దుష్ట తరైశ్చ హిం స్రయై:


చందన వృక్షము యొక్క మొదలును పాములు చుట్టుకొని వుంటాయి, పూలను 

తుమ్మెదలు చుట్టుముట్టి వుంటాయి, కొమ్మలను కోతులు ఆశ్రయించి వుంటాయి,

శిఖరాగ్రమును పక్షులు ఆశ్రయించి వుంటాయి. అనగా గొప్పవారి చుట్టూ మంచివారిని,

యోగ్యులను గొప్ప వారి దరి చేరనీయకుండా దుష్టులు, క్షుద్రములైన ప్రాణులు, 

చేరుకొని వుంటాయి.


ఉపకారః పరో ధర్మః పరార్థ: కర్మనైపుణ్యం 

పాత్రే దానం పరః కామః పరో మోక్షే వితృష్ణతా


అర్థము:--పరోపకార మొనర్చుటయే ఉత్తమ ధర్మము, నేర్పుతో పనులు 

గావించుటయే ఉత్తమ అర్థము, భార్యాగత మైనదే ఉత్తమ కామము, కోరికలను 

జయించుటయే ఉత్తమ మోక్షము.


   మదమాతంగము లందలంబులు హరుల్మాణిక్యము ల్పల్లకుల్‌,

   ముదితల్‌, చిత్రదుకూలము ల్పరిమళంబు ల్మోక్షమీఁజాలునేఁ

   మదిలో వీని నపేక్ష సేసి నృపధామ ద్వారదేశంబుఁగా

   చి దినంబుల్‌ వృథపుత్తురజ్ఞులకటా! శ్రీకాళహస్తీశ్వరా!


తాత్పర్యము: ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! మదించిన ఏనుగులు, అందలములు, మణిమాణిక్యములు, పల్లకీలు, అందమైన వనితలు, చిత్రవిచిత్రమైన వస్త్రములు, పరిమళలేపనంబు కానీ, ఇవేవైననూ మొక్షమును ప్రసాదింపనొపంపుడు, వీటినాపేక్షించి రాజుల ఇంటివాకిళ్ళముందు దినములు వృథాగా ఎలా గడుపుదురు ప్రభో ఈ జనులు సత్యమూర్తివైన నీ ధ్యానము చేయక.


తెలియని కార్యమెల్లఁగడతేర్చుట కొక్కవివేకి జేకొనన్

వలయునట్లైన దిద్దుకొనవచ్చుఁబ్రయోజనమాంద్యమేమియుం

గలుగదు ఫాలమందు దిలకం బిడునప్పుడు చేతనద్దమున్

గలిగిన జక్క జేసికొనుగాదె నరుం డది చూచి భాస్కరా!


తాత్పర్యం: భాస్కరా! మనుజుడు నుదుటి యందు బొట్టును పెట్టుకొనుచూ చేతి యందు అద్దముతో బొట్టును వంకర టింకర లేకుండా సరిచేసుకొనును. అలాగే నేర్పరి వద్దకెళ్ళి పనులను చక్కదిద్దుకొని సంతోషాతిశయమును తెలివిగలవాడు పొందునని భావం.


రమంతే యోగినో నంతే నిత్యానందే చిదాత్మని,

ఇతి రామపదే నాసౌ పరంబ్రహ్మా భిధీయతే


తా:-- అనంతమైన చిదాత్మ యగు ఏ పరబ్రహ్మము నందు యోగీశ్వరులు ఆనందింతురో

అదియే " రామ" నామము.


రమతే సర్వభూతేషు స్ధావరేషు చరేషు చ

అంతరాత్మ స్వరూపేణ యాశ్చ రామేతి కథ్యతే !


తా:-- పరమాత్ముడు నిరాకార రూపంతో స్థావర జంగమాది సమస్త ప్రాణులలో రమణ మొనర్చు చుండుట చేత " రాము" డైనాడు.


కర్మతంత్రుఁ డగుచుఁ గమలాక్షుఁ గొల్చుచు

నుభయ నియతవృత్తి నుండెనేనిఁ

జెడును గర్మమెల్ల శిథిలమై మెల్లన

ప్రబలమైన విష్ణుభక్తి చెడదు.


భావము:- భక్తుడు తన పనులు తను నిర్వర్తించాలి, విష్ణుమూర్తిని సేవించాలి. ఈ రెండు నియమాలు సక్రమంగా పాటిస్తే క్రమంగా అతని పాపా లన్నీ నశించిపోతాయి. మిక్కిలి బలవంత మైనట్టి విష్ణుభక్తి ఎప్పటికి నశించదు.


చెడుఁగరులు హరులు ధనములుఁ

జెడుదురు నిజసతులు సుతులుఁ జెడు చెనఁటులకుం;

జెడక మనునట్టి గుణులకుఁ

జెడని పదార్థములు విష్ణుసేవా నిరతుల్.


భావము:- దుర్జనులకు వారి ఏనుగులు, గుఱ్ఱాలు, సంపదలు అన్ని నశించిపోతాయి. వారి ఆలుబిడ్డలు నశించిపోతారు. గుణవంతు లైన సజ్జనులు చెడకుండ బతుకుతారు. వారికి విష్ణుభక్తి మీది ఆసక్తి చెడదు.


కంటిరే మనవారు ఘనులు గృహస్థులై;

విఫలులై కైకొన్న వెఱ్ఱితనము;

భద్రార్థులై యుండి పాయరు సంసార;

పద్ధతి నూరక పట్టుబడిరి;

కలయోనులం దెల్ల గర్భాద్యవస్థలఁ;

బురుషుండు దేహి యై పుట్టుచుండుఁ

దన్నెఱుంగఁడు కర్మతంత్రుఁడై కడపట;

ముట్టఁడు భవశతములకు నయిన

దీన శుభము లేదు దివ్యకీర్తియు లేదు

జగతిఁ బుట్టి పుట్టి చచ్చి చచ్చి

పొరల నేల మనకుఁ? బుట్టని చావని

త్రోవ వెదకికొనుట దొడ్డబుద్ధి.


భావము:- మీరు చూస్తూనే ఉన్నారు కదా! మన వారు అందరు బలదర్పసంపన్నులు అయిన గొప్ప వారే. కాని పెళ్ళిళ్ళు చేసుకుని గృహస్థులై వెఱ్ఱితనం విడిచిపెట్టరు. ఆనందం కోరుకుంటారు కాని సంసారం అనే ఊబిలో ఊరకే కూరుకుపోతారు. పునర్జన్మలు అనేకం పొందుతూ రకరకాల స్త్రీల గర్భాలలో పడి నానా అవస్థలు పడుతూ, పుడుతూ, చస్తుంటారు. వందల కొద్దీ జన్మలెత్తినా ఈ కర్మబంధాలలో నుండి విముక్తి పొందలేడు. ఈ బాధలు అన్నీ మనకెందుకు? అసలు పుట్టుక అనేదీ, చావు అనేదీ లేని మంచి దారి వెతుక్కోవటం తెలివైన పని కదా!


మునులు నృపులుఁ జూడ మును ధర్మజుని సభా

మందిరమున యాగమండపమునఁ

జిత్రమహిమతోడఁ జెలువొందు జగదాది

దేవుఁ డమరు నాదు దృష్టియందు.


భావము:

మునీంద్రులు, నరేంద్రులు చూస్తూ ఉండగా యింతకు మునుపు ధర్మరాజు సభామందిరంలోని యజ్ఞ మండపంలో చిత్ర విచిత్ర ప్రభావాలతో ప్రకాశించే విశ్వనాథుడు నా చూపుల్లో స్థిరంగా యున్నాడు.


మణి శ్శాణో  ల్లీఢ:సమారా విజయీ  హేతి దళితో

మద  క్షీణో నాగః   శరది  సరిదాశ్యా న పులినాః 

కళా శేష శ్చంద్ర: సురత మృదితా బాల వనితా 

తనిమ్నా శోభన్తే గాలిత విభవా శ్చార్థిషు  నరాః 


శాణ విఘృష్ట రత్నమును శస్త్ర హతుండగు శూరుడున్ మద 

క్షీణ గజంబు సైకత విశిష్ట శరన్నదియున్ నవ క్షపా 

ప్రాణవిభుండు చండసురతాలన   బాలికయున్ ధనై కవి 

శ్రాణన శూరులు౦ గడు గృశత్వమునం బ్రభ గాంతురిద్దరన్ 


భావము:-- సాన పెట్టిన రత్నము, క్షతగాత్రుడైన శూరుడు, మదజల శ్రావము చే చిక్కిన ఏనుగు, శరత్కాలమున యెండిన యిసుక తిన్నెలుగల నది, కళాశేషుడైన చంద్రుడు,

రతిక్రీడచే  యలసిన  ముగ్ధ స్త్రీ,సత్ప్రదానముచే ఐశ్వర్యమును కోల్పోయిన రాజు 

క్షీణించిననూ ప్రకాశించుచునే యుందురు. (సేకరణ :-- మేడవరం రాధాకృష్ణమూర్తి )        

(భర్త్రుహరి సుభాషితము) 


స్వాయత్త మేకాంతహితం విధాత్రా

వినిర్మితం ఛాదనమజ్ఞతాయాః ।

విశేషతః సర్వ విదాం సమాజే

విభూషణం మౌనమపండితానామ్‌ ॥ 6


తా-: మూఢులు తమ మూఢత్వాన్ని దాచుకోవడానికై బ్రహ్మ మౌనమును సృష్టించి వారి స్వాధీనం చేశాడు. కావున పండితుల సమక్షమున మౌనమే మూర్ఖులకి అలంకారము. అనగా మూర్ఖులు తెలియని విషయాలను చర్చించరాదు.

No comments:

Post a Comment