----
"మత్తకోకిల -- ర స జ జ భ ర..18/11..
--
సీతజాడనెఱింగిమోదముసేయు శ్రీరఘుసేవకా
స్ఫీతతేజుఁడవౌ ప్రభావసువీరభీమునిసోదరా
త్రాతవీవెభయాపహారి విరాజరాజ్యజనాళికిన్
జోతలర్పణచేసెదయ్య విశోభిసూర్యమహన్నుతా !!! "
----
ముఖ్యమేయగు దైవసన్నిధి ముగ్ధయుక్తము మోక్షమే
సౌఖ్యమన్నది సంతునిశ్చయ సర్వమౌనముగా విదీ
సఖ్యతన్నది జేయగాదగు శాంతి కోరిక లబ్ధికై
వ్యాఖ్యలేనిది నిత్యసత్యము వాస్తవమ్మిది సాగుమా!
నేటి ప్రాంజలి ప్రభ..మల్లా ప్రగడ రామకృష్ణ
****
వేరే మాట లేదు, వేరే తలంపు లేదు, వేరే ధ్యాస లేనే లేదు.
ఉన్న దొకటే రామణామము, జపము, తపము, నిత్యమూ రామణామము తప్పా, వేరేదిలేదు, వేరేదిలేదు.
ముగ్గురమ్మల మూలమూర్తివి రామా
సూర్య సమప్రభల విశ్వశాంతిగా రామా
మానవత్వ పరిమళాలు విర జిల్లిన రామా
లోకకళ్యాణార్థమై హృదయంలో ఉండే రామా.. వేరే
ప్రతి అణువుల పరమార్థం వర్షించిన రామా
పంచభూతాలతో మమేకమై హర్షించిన రామా
పంచ అనుభూతులతో స్పర్శించిన రామా
ప్రకృతిలో పరమాత్మగా నిన్నే దర్శించితిని రామా..వేరే
సర్వజనాలుగ మెచ్చు సీతా రామా
వ్యాఖ్యలు చర్చలు వలదు రామా
వాస్తవమింతె యెరింగి సాగితి రామా
సంప్రదాయ పూజలే సీతా రామా.. వేరే
రామ నామమొక్కటే నాకు దిక్కు రామా
నిరంతరము నీ నామ స్మరణ మనోభి రామా
వేరే వాంఛలు లేనే లేవు, గుణాభి రామా
మా ఆరాధ్య దైవం నీవు, కళ్యాణ రామా
సర్వ లక్షణాలు పంచే వాడవు, కారుణ్య రామా
సర్వము రక్షించే వాడవు కలియుగ రామా
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే....
వేరే మాట లేదు, వేరే తలంబు లేదు వేరే ధ్యాస లేనే లేదు.
ఉన్న దొకటే రామణామము, జపము, తపము, నిత్యమూ రామణామము తప్పా వేరేది లేదు, వేరేది లేదు.
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే....
*ఆధ్యాత్మిక సంకల్పం*
సంకల్పమంటే... పట్టుదల. ఓ గట్టి నిర్ణయం. మొక్కవోని దీక్ష.
సంకల్పమంటే... మనసులో కలిగే ఓ ఆలోచన.... ఓ భావన.
ఆ సంకల్పానికి ఆధ్యాత్మిక శక్తి తోడైతే...
అద్భుతాలు సృష్టించవచ్చు. మనిషి మహనీయుడుగా మారతాడు. అసాధ్యం అనేదే ఉండదు.
మనస్సులో కలిగే ఆలోచన మనకు ఆనందాన్ని లేదా లాభాన్ని కలిగించేదైనా అవుతుంది. కాదంటే... బాధను, నష్టాన్ని కలిగించేదైనా అవుతుంది. ఈ రెండూ కాని ఆలోచన ఏదీ ఉండదు. ఏ ఆలోచనైతే మనకు ఆనందాన్ని కలిగిస్తుందో ఆ ఆలోచనని సొంతం చేసుకోవాలని, ఆ ఫలితాన్ని త్వరగా అందుకోవాలని, అందుకోసం ఏదైనా సరే చెయ్యాలని మనసు కోరుకుంటుంది. భౌతికంగా మన ప్రయత్నమూ ఆ దిశగానే సాగుతుంది. ఇలా మనలో పట్టుదలని కలిగించే ఆ ఆలోచనే సంకల్పం అవుతుంది. అలాంటి సంకల్పానికి ఆధ్యాత్మికత మరింత చైతన్యాన్ని జోడిస్తుంది.
మనం అనుకున్న ప్రతి మాట, చేసిన ప్రతి ఆలోచన సంకల్పం కాదు. ఆలోచన వేరు. సంకల్పం వేరు. మనసులో కలిగే ఓ చిన్నపాటి భావన ఆలోచన అవుతుంది. నిరంతరంగా ఆలోచించటం మనస్సుకు సహజ లక్షణం. ఒక్క క్షణంలో వందలాది ఆలోచనలు మన మనసులో పుడతాయి. ఈ ఆలోచనలన్నీ సంకల్పాలు కావు. మనకు కలిగే ఆలోచనలన్నీ దాదాపు క్షణికాలే. వేలాది ఆలోచనల్లో ఏవో కొన్ని ఆలోచనలు మాత్రమే ఆచరణలోకి వస్తాయి. ఏ ఆలోచనైతే మళ్ళీ మళ్ళీ మన మనస్సులో మెదులుతుంటుందో, ఏ ఆలోచన గురించి మనస్సు, బుద్ధి తీవ్రంగా పరితపిస్తూ ఉంటాయో, ఏ ఆలోచన కోసం సాధించటం కోసం మన హృదయం అనుక్షణం పరితపిస్తుంటుందో ఆ ఆలోచనే ‘సంకల్పం’ అవుతుంది.
*ఆది, అనాది.. సంకల్పమే*
మహాప్రళయం తర్వాత సృష్టిని తిరిగి ప్రారంభించాలని బ్రహ్మదేవుడు అనుకున్నాడు. ఆ సమయానికి ఆయన చేతిలో ఏవిధమైన పరికరం లేదు. ఉన్నదంతా మనసు నిండా ఆలోచన మాత్రమే. ఎలాగైనా సరే సృష్టి జరగాలని భావించాడు. ఆ ఆలోచన బలపడింది. సంకల్పంగా మారింది. ‘తప’, ‘తప’ అనే శబ్దం ఆకాశవాణి నుంచి వినిపించింది. తపస్సు ప్రారంభించాడు. విరాట్పుషురుడికి అనుగ్రహం లభించింది. బ్రహ్మ ముఖం నుంచి రుద్రుడు ఆవిర్భవించాడు. అక్కడ నుంచి మిగిలిన సృష్టి అంతా ఆవిర్భవించింది. బ్రహ్మ సంకల్పానికి సైతం ఆధ్యాత్మిక శక్తి అవసరమైంది. తపస్సు, సాధన ద్వారానే ఇది సాధ్యపడింది.
*సంకల్పం... సాధన*
మహారాజు విశ్వామిత్రుడు చాలా గర్విష్టి. బ్రహ్మర్షి అయిన వశిష్ఠుడిని అనేకరకాలుగా ఇబ్బందిపెట్టడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఏ ఒక్క ప్రయత్నమూ ఫలించదు. వశిష్ఠుడికి ఉన్న బ్రహ్మర్షిత్వం తనకూ కావాలనుకున్నాడు. తపస్సు ప్రారంభించాడు. కొద్దికాలానికే మేనక మోహంలో పడి తపస్సు విడిచిపెట్డాడు. అప్పటిదాకా పొందిన శక్తి వ్యర్థమైపోయింది. తప్పు తెలుసుకున్నాడు. ఈ సారి గట్టిగా సంకల్పించుకున్నాడు. తపస్సు ప్రారంభించాడు. దైవమూ అనుగ్రహించింది. అమోఘమైన తన ఆధ్యాత్మిక సంకల్పశక్తితో విజయం సాధించాడు. వశిష్ఠుడి చేత ‘బ్రహ్మర్షీ!’ అని పిలిపించుకున్నాడు. సంకల్ప సాధన అంటే ఇలా ఉండాలి.
*సంకల్పానికి ధ్రువస్థానం*
సవతి తల్లి సురుచి పలికిన నిష్టూరాలకు ధ్రువుడు ఎంతగానో కుమిలిపోయాడు. కన్నతండ్రిని కనీసంగా కూడా చేరలేని తన స్థితికి దుఃఖించాడు. ఎలాగైనా సరే తండ్రి ఉత్తానపాదుడి ప్రేమను పొందాలని సంకల్పించాడు. తల్లి సునీతి సూచనతో తపస్సు కోసం అడవులకు చేరుకున్నాడు. నారద మహర్షి చేసిన మంత్రోపదేశంతో శ్రీమన్నారాయణుడి ప్రత్యక్ష దర్శనంతో పాటు శాశ్వతమైన ధ్రువస్థానాన్నిపొందాడు. ఆధ్యాత్మిక శక్తి తోడైన సంకల్పం సాధించిన సర్వోన్నత విజయానికి ఇది సంకేతం.
*సంకల్పశక్తి*
ప్రతి మనిషిలో ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే మూడుశక్తులు సహజంగా ఉంటాయి. ఇవి పుట్టుకతోనే వస్తాయి. అయితే, ఈ శక్తులు తనలో ఉన్నాయన్న ఎరుక కొద్దిమందికి మాత్రమే ఉంటుంది. ఈ మూడుశక్తుల్లో మొదటిదైన ఇచ్చాశక్తే సంకల్పశక్తి. మనలో ఉండే అతి గొప్పశక్తి ఇచ్ఛాశక్తి. ఇది దైవీకమైంది. మన ద్వారా జరిగే ప్రతి పనికీ మనలో కలిగే సంకల్పమే కారణమవుతుంది. *జ్ఞానం ఎంత ఉన్నప్పటికీ మహత్ సంకల్పం మనలో పుట్టాలంటే జ్ఞానం మాత్రమే సరిపోదు. దైవిక సహాయం లేదా ప్రకృతి సంకల్పం ఇందుకు తోడుకావాలి.*
సంకల్పానికి, మామూలు ఇచ్ఛాశక్తికి కొద్దిపాటు తేడా ఉంటుంది. ఈ సూక్ష్మభేదాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది. సంకల్పం అంటే దృఢ నిశ్చయం. ఏదైనా ఒక పని జరిగితీరాల్సిందే అని మనం అనుకుంటే అది కేవలం ‘ఇచ్ఛ’ (కోరిక)గానే మిగిలిపోతుంది. ఈ ఇచ్ఛ వెనక దృఢమైన నిశ్చయం ఉంటే అది సంకల్పంగా మారుతుంది. సంకల్పాల ద్వారా మనం శక్తిని పొందటం లేదా పోగొట్టుకోవటం జరుగుతుంది. పవిత్రమైన సంకల్పాలతో శక్తి ఉత్పన్నమవుతుంది. అపవిత్రమైన సంకల్పాలతో శక్తి నాశనమవుతుంది. మన ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచేవే పవిత్ర ఆలోచనలు. మిగతావన్నీ అపవిత్ర ఆలోచనలు.
రచన: డాక్టర్ కప్పగంతు రామకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్.
[09/01, 7:05 am] Malapragadasridevi: *Anjaneya Stuti -ఆంజనేయ స్తుతి*
*నమో ఆంజనేయం నమో దివ్య కాయం*
*నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం*
*నమో నిఖిలారక్షాకరం రుద్రా రూపం*
*నమో మారుతిమ్ రామ దూతం నమామి*
*నమో వానరేశం నమో దివ్యభాసం*
***
*స్ఫూర్తి నింపే అర్జున లక్షణాలు...!*_
రాకుమారుడు అయినందువల్లనో, ధర్మరాజుకు తమ్ముడు అయినందువల్లనో- అర్జునుడికి ప్రత్యేక గుర్తింపు రాలేదు. బాల్యం నుంచీ తనకు ఇష్టమైన విలువిద్యను ద్రోణాచార్యుడి వద్ద అభ్యసించాడు. కఠోర సాధన చేశాడు. రెండు చేతులతో ఒకే విధంగా అస్త్రాలు సంధించే ధనుర్ధారిగా, సవ్యసాచిగా గుర్తింపు పొందాడు.
ప్రతి మనిషిలోనూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. దాన్ని గుర్తించి సాధన ద్వారా అసాధారణ ప్రతిభను కనబరచినప్పుడే ప్రత్యేకత సొంతమవుతుంది. అర్జునుడికి దుర్యోధనుడు, శకుని రూపాల్లో ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదురయ్యాయి. సర్వం కోల్పోయి వనవాసం, అజ్ఞాతవాసాలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. విజయం సాధించాడు.
అర్జునుడు ఏకాగ్రతతో ఎన్నో అవరోధాల మధ్య పక్షి కన్ను గురి చూసి కొట్టగలిగాడు. చీకట్లో బాణాలు సంధించాడు. మత్స్య యంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని సొంతం చేసుకున్నాడు.
మనలో ఎంతో ప్రతిభ ఉండవచ్చు. మన చుట్టూ ఎన్నో వనరులు ఉండవచ్చు. ప్రతిభను వెలికి తీసే నైపుణ్యం, వనరులను వినియోగించుకునే చాకచక్యం, చేసే పనిమీద ఏకాగ్రత ఉన్నప్పుడే ఆసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి.
_ఓసారి ద్రోణుడు శిష్యులతో గంగానదీ తీరానికి వెళ్ళాడు. గంగలో దిగిన ద్రోణుడి కాలును ఓ మొసలి పట్టుకుంది. ఏం జరిగిందో తెలిసే లోపలే ఆర్జునుడు సమయస్ఫూర్తితో ద్రోణుణ్ని కాపాడాడు. మనలో ఉండే నైపుణ్యాన్ని సమయ స్ఫూర్తితో నిర్వర్తించినప్పుడే గుర్తింపు వస్తుంది. తనను నమ్ముకున్న వారికి అన్యాయం జరిగినప్పుడు స్వధర్మాన్ని నిర్వర్తించడం కూడా మనిషి కర్తవ్యాల్లో ఒకటి._
ఊర్వశి అర్జునుణ్ని మోహిస్తుంది. ఆమె కామ వాంఛను తిరస్కరించిన అర్జునుణ్ని కోపంతో పేడి అవతారం ఎత్తమని శపించింది. అర్జునుడు ఆ శాపాన్ని స్వీకరించాడు. ఆ శాప ఫలితంగానే అజ్ఞాతవాస సమయంలో బృహన్నలగా అవతారం ఎత్తాల్సి వచ్చింది. ధర్మబద్ధం కాని ఊర్వశి కోరికకు లొంగిపోలేదు. అర్జునుడిలో ఉన్న ఇంద్రియ నిగ్రహం, ధర్మబద్ధం కాని దాని మీద అనాసక్తి- అతడికి వన్నె తెచ్చాయి.
నేడు మనిషిని భ్రష్టు పట్టించే ఎన్నో వ్యామోహాలు చుట్టూ పరిభ్రమిస్తుంటాయి. ధర్మబద్ధం కాని వాటిని తిరస్కరించడంలోనే నైతికత వెలుగు చూస్తుంది.
కృష్ణార్జునుల మధ్య స్నేహమేకాక బంధుత్వం కూడా ఉంది. కృష్ణుడిని గురువుగా భావించాడు అర్జునుడు. కురుక్షేత్ర సంగ్రామంలో బంధుజనాన్ని చూసి జనాన్ని చూసి పాపభీతి, మనోదౌర్బల్యాలకు లోనయ్యాడు. కృష్ణుణ్ని శరణాగతి కోరాడు. అప్పటివరకు శత్రువులతో పోరాడటమే వీరత్వంగా భావించేవాడు అర్జునుడు.
భగవద్గీత ద్వారా అర్జునుడికి కంటికి కనిపించని అంతఃస్వరూపం చూపించి తనను తాను తెలుసుకోవడమే వీరత్వం అని బోధించాడు. బాహ్యంగా 'నేను' అనేది 'నువ్వు' కాదని విశ్వరూప సందర్శనం ద్వారా కర్తవ్యం గుర్తెరిగేలా చేశాడు కృష్ణుడు. మహాభారతంలో విలక్షణ పాత్ర అయిన అర్జునుడి లక్షణాలెన్నో నేటికీ మనిషి వ్యక్తిత్వ నిర్మాణానికి స్ఫూర్తినిస్తాయి.
***
ఓం *సర్వమోహిన్యై* నమః ।🙏🏼
శ్రీ లక్ష్మీసహస్ర నామములలో 133వ నామము.
నామ వివరణ.
సృష్టిలోని సమస్తమూ తానె అయి మోహమును కలిగించు తల్లి.
తే.గీ.
మోహమది ముంచు నన్ను సందేహమేల?
తే.గీ. *సర్వమోహినీ! * మోహపు గర్వమణచి
నన్ను రక్షింపుమమ్మరో నయనిధాన!
నిన్నె నమ్మితిన్ మొరవిను మన్ననమున.
🙏🏼
రచన .. చింతా రామకృష్ణారావు.
51..మత్తాలీ (మ త య య... యతి 6)
అందమ్మున్ నీవే యలరారంగా విద్యన్
పందాలై సర్వా పయనంమౌ శక్తిన్
చిందాడెన్ శోభల్ స్థిర మాయా మోహమ్మున్
సందర్భా భక్తీ సమ సేవా శ్రీదేవీ
52.. మలయసురభి :(మ న న మ..8)
సేవాభావమగు రసము నిత్యమ్మున్
భావావేశమగు సభలు సత్యమ్మున్
చావోపుట్టుకయు సుజన తత్త్వమ్మున్
తావేదీ తెలప జతకు శ్రీదేవీ
53.. విశాలాంభోజాలీ (త న య మ.. యతి 7)
ధ్యానమ్మగు విధి దాత్రుత్వా సేవల్
వైనమ్మగు మది వాశ్చల్యా శోభల్
మౌనమ్మగు గతి మోహంమౌ మాయల్
ప్రాణంమౌ స్థితి ప్రేమా శ్రీదేవీ
54.. జ ల ధ ర మాల (మ భ స మ.. యతి.9)
స్వేచ్చా బావమ్మగు మనసే మార్గమ్మున్
ఇచ్ఛాబ్రాంతీ మనసుగతీ కర్మమ్మున్
ప్రోచ్చాహమ్మగుట సమపోరే నేర్పున్
యుచ్చాహమ్మగుట విధియు శ్రీదేవీ
55.. కింసు కాస్తరణం (ర స య మ.. యతి 7)
సాధనే మనసై సమస్యా తీర్పేలే
వేదనా విధిగా విపంచీ మార్పేలే
శోధనా సమపాశ సొమ్మున్ నేర్పేలే
భేదమే వలదే భయమ్మున్ శ్రీదేవీ
***
*ఇంటింటికీ అక్షింతలను చేరవేసే ప్రక్రియ!*
జన జాగరణ చేసే సమయంలో ఇంటింటికీ వెళ్ళినప్పుడు
తాము అయోధ్య రామమందిరము (తీర్థ క్షేత్ర ట్రస్ట్) తరపున వచ్చాము అని పరిచయం చేసుకోవాలి.
ప్రతి ఇంటికి
1. రామ మందిర చిత్ర పటము
2. తీర్థ క్షేత్ర కరపత్రము
3. మృగముద్రలో అక్షింతలు ఇవ్వాలి
ప్రతి ఇంటికి 5 గ్రాములు చొప్పున అక్షింతలు ఇవ్వాలి.
మృగముద్రలో అనగా - బొటన వ్రేలు, మధ్య వ్రేలు మరియు ఉంగరపు వేలు కలిపి ఉంచితే వాటి మధ్యలో పట్టినన్ని ఇవ్వాలి.
*అక్షింతలను ఏం చేయాలి..??*
అక్షతలు ఇంటికి ఇచ్చిన తర్వాత వాటిని వృద్ది చేసుకొని దేవుని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు.
(వృద్ధి చేసుకోవడం అంటే మన ఇంట్లో తయారు చేసుకొన్న అక్షతలకు అయోధ్య నుండి వచ్చిన వాటిని కలపడమే.)
*వృద్ధి చేసుకున్న అక్షతల వినియోగము ఎలా చేసుకోవచ్చు ?*
22 జనవరి 2024 రోజున అయోధ్య లో శ్రీ బాల రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగతున్న సమయంలో ఇంటిల్లిపాదీ, ఇళ్లు కడుక్కోవడం, స్నానాలు ముగించుకొని,..
గ్రామంలోని దేవాలయానికి ఇంటిల్లిపాది చేరుకుని.. పూజలు ముగించుకొని
1.వ్యక్తిగతంగా నెత్తిన ధరించడం
2. పిల్లలను, చిన్నవారిని దీవించడం,
3. భర్త ఆశీస్సులు దీవెనలు తీసుకోవడం
4. బీరువాలో పెట్టుకోవడం (లక్ష్మీ స్థానం)
5. పిల్లల పుట్టిన రోజున, పెళ్ళి ఇతర శుభకార్యాలలో ఈ అక్షింతలతో దీవించడం
6. ఎవరైనా ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు వినియోగించడం (పుట్టినరోజు, పెళ్లిరోజు, శుభకార్యాలు, ఉద్యోగ ప్రమోషన్లు...)
*జనవరి 22న - ప్రాణ ప్రతిష్ఠ రోజున చేయాల్సిన పనులు వివరించాలి.*
జనవరి 22 ప్రాణ ప్రతిష్ట రోజున దగ్గరలోని దేవాలయంలో ఉదయం 11 గంటలకు పూజా కార్యక్రమం మరియు అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడడానికి ఏర్పాటు, హారతి మరియు ప్రసాద వితరణ ఉంటుంది అని చెప్పాలి.
అందులో కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనాలి.
తమ ఇంటి చుట్టుపక్కల ఉన్న భక్తులను దేవాలయానికి రమ్మని ఆహ్వానించాలి.
ఆ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత (రాత్రి) తమ ఇంటి ముందు కనీసం 5 దీపాలు వెలిగించాలి అని చెప్పాలి.
వీలయితే ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించాలి అని చెప్పాలి.
*జన జాగరణ ప్రముఖుల పనులు:-*....
***
**వ్యాపార వృద్ధికి కొన్ని మార్గాలు
* .ఎల్లప్పుడూ సౌకర్యవంతంగా నిర్వహించగల వసతులు కల్పించి సహాయ సహకారములు అందించండి
* . ఒక పనిని పూర్తి చేయుటకు తగినంత ఒత్తిడితో వాతావరణాన్ని కల్పించకండి, ప్రోత్సహించుతూ ఉత్సాహము కల్పిస్తూ చిన్న తప్పును పెద్దదిగా మార్చకుండా జాగర్త పడాలి.
* . స్పష్టమైన లక్ష్యాలు మరియు సమయ పాలనలను గట్టిగా సాధించ గలిగేలా ప్రతి రోజు గమనించాలి, దాని వాళ్ళ పనివారు వంద శాతంను పని చేయగలరు.
*. ఏమి జరుగుతుందో చెప్పండి మరియు ప్రస్తుత పని పూర్తి అయ్యే వరకు తదుపరి పని గురించి మాట్లాడటం మంచిది కాదు. ప్రజలు రాబోయేవాటిని చూడవలసి వస్తే వారు భవిష్యత్తులో ప్రస్తుత భవిష్యత్తును కొనసాగించటానికి నిరంతరం ప్రయత్నాలు జరుగుతూ ఉండాలి.
* పనివారు యాజమాన్యాన్ని అర్ధం చేసు కొంటుంది కాబట్టి ఈ అంతర్గత పీడనం అనేది ఉండదు.
* పనివారిపై వత్తిడి పెంచటం, పనిని స్తంభింప జేయటం, ఎప్పుడు మంచిది కాదు, అవాంఛనీయ బాహ్య పీడనం వాళ్ళ అసౌకర్యము కల్గిన అగు జాగర్తలు తీసుకోవాలి.
* పని వారికి మరింత బాధ్యత ఇవ్వడం ద్వారా జట్టు సభ్యులను సవాలు చేయండి, బహుమతులు ఇవ్వండి (యజమానులు పూర్తి రొటీన్ మరియు ఉదాసీనతలో పడకుండా ఉండాలని నిర్ధారించుకోవాలి)
* జాగ్రత్తగా ఉండండి మరియు పనివారిపై ఓవర్లోడ్ అయినప్పుడు గమనించండి, తగ్గించడానికి ప్రయత్నం చేయండి, ఆ సమయంలో వారు ప్రాధాన్యతలను అర్థం చేసుకుంటూ సంయమనం పాటించండి.
* మీ చర్చను నడుపు కోండి మరియు జట్టును మీరు సవాలు చేస్తున్న విధంగా, మిమ్మల్ని మీరు సవాలు చేసుకోండి; మీరు వారితో నొప్పిని పంచు కునేందుకు జట్టుకు అవసరమైన సలహాలివ్వండి.
* మీ నిర్ణయం ఉపయోగకరమైన అనుభూతి కలిగించేవిధముగా ఉండాలి తగినంత పనిని ఇవ్వాలని నిర్ధారించుకోండి, అతి భయంకరమైన విషయం అన్యాయం, మోసం చేసే వ్యక్తులను, తాగుడు, మత్తుమందుకు బానిస ఐనవారును, అదేపనిగా కోపము విiసుగు చెంది ఉన్నవారిని గమనించండి, చివరకు విడిచిపెట్టవచ్చు.
* నవ్వించండి. హాస్యం ఆరోగ్యానికి చాలా అవసరం, విశ్రాన్తి గదులు ఏర్పాటు చేయండి. మితిమీరిన పనిని చేయ నవసరం లేదు మరియు ఎవరినైనా గాయపడ్డ, వారికి లక్షణమే చికిత్స మార్గం చూడాలి .
* ఫలితాలను ప్రకటించి , కృషిని అభినందిచే విధముగా ఉండాలి.
వ్యాపార ఫలితాల్లో గణనలు ఉన్నాయి కానీ మీరు వ్యక్తులతో మరియు మెషీన్లతో పని చేస్తారని అర్థం చేసుకోండి, కాబట్టి ఫలితాలను ఉద్దేశించిన ఫలితాలను సాధించక పోయినా ఎవ్వరిని ఎక్కువచేసి మాట్లాడకూడదు, ఉత్తమంగా చేసినవారిని కూడా ఎల్లప్పుడూ అభినందించాలి.
* చివరగా, కాని, మీ బృందంతో ఒక ఆలోచనను పంచుకోవడం గురించి మీరు తెలుసుకున్న అన్ని అంశాలను గుర్తుంచుకోండి, కుటుంబ విషయాలను గమనించుకోండి, మనం ఎందుకు చేస్తున్నామో తెలుసుకోవడానికి వాటిని తెలియజేయండి. మరియు మీరు నివసించే స్థలాన్ని, పరిశుబ్రముగా ఉంచండి. ప్రయాణిస్తున్న ప్రేమను పంచుకుంటూ ప్రపంచంలోని కొత్తవిషయాలను గమనిస్తూ అభివృద్ధికై తోడ్పడే విధముగా ఉండి, దేశ సేవకు సహకారంఅందించి, దేశాభివృద్ధికి తోడఁబడ గలరు.
--((*))--
*శ్రీ చన్ద్రశేఖరేన్ద్ర సరస్వతీ మహాస్వామి వారి ఆరాధనోత్సవము :*
*₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹*
శ్రీ జగద్గురు కాంచీ కామకోటి పీఠాధీశ్వర శ్రీమచ్చన్ద్రశేఖరేంద్ర సరస్వతీ భగవత్పాదాష్టోత్తర శతనామావళిః
1. శ్రీ చన్ద్రశేఖరేంద్రాస్మదాచార్యాయ నమో నమః
2. శ్రీ చంద్రమౌళి పాదాబ్జ మధుపాయ నమో నమః
3. ఆచార్య పాదాధిష్ఠానాభిషిక్తాయ నమో నమః
4. సర్వజ్ఞాచార్య భగవత్స్వరూపాయ నమో నమః
5. అష్టాంగయోగ నిష్ఠాది గరిష్ఠాయ నమో నమః
6. సనకాది మహాయోగి సదృశాయ నమో నమః
7. మహాదేవేంద్ర హస్తాబ్జ సంజాతాయ నమో నమః
8. మహాయోగీంద్ర సంవేద్య మహత్త్వాయ నమో నమః
9. కామకోటి మహాపీఠాధీశ్వరాయ నమో నమః
10. కలిదోష నివృత్తేక కారణాయ నమో నమః
11. శ్రీ శంకర పదాంభోజ చిన్తనాయ నమో నమః
12. భారతీ కృత జిహ్వాగ్ర నర్తనాయ నమో నమః
13. కరుణారస కల్లోల కటాక్షాయ నమో నమః
14. కాన్తి నిర్జిత సూర్యేందు కమ్రాభాయ నమో నమః
15. అమన్దానందకృన్మంద గమనాయ నమో నమః
16. అద్వైతానందభరిత చిద్రూపాయ నమో నమః
17. కటీతటలసచ్చారు కాషాయాయ నమో నమః
18. కటాక్షమాత్ర మోక్షేఛ్ఛా జనకాయ నమో నమః
19. బాహుదండ లసద్దండ భాసురాయ నమో నమః
20. ఫాలభాగ లస్త్భూతి భూషితాయ నమో నమః
21. దరహాస స్ఫుర ద్దివ్య ముఖాబ్జాయ నమో నమః
22. సుధామధుర సౌహార్ద భాషణాయ నమో నమః
23. తపనీయ తిరస్కారి శరీరాయ నమో నమః
24. తపః ప్రభా విరాజత్త్వక్తాదృశాయ నమో నమః
25. సంగీతానంద సందోహ సర్వస్వాయ నమో నమః
26. సంసారాంబుధి నిర్మగ్న తారకాయ నమో నమః
27. మస్తకోల్లాసి రుద్రాక్ష మకుటాయ నమో నమః
28. సాక్షాత్పర శివామోఘ దర్శనాయ నమో నమః
29. చక్షుర్గత మహాతేజోత్యుజ్వలాయ నమో నమః
30. సాక్షాత్కృత జగన్మాతృ స్వరూపాయ నమో నమః
31. క్వచిత్బాల జనాత్యన్త సులభాయ నమో నమః
32. క్వచిన్మహాజనాత్యంత దుష్ప్రాపాయ నమో నమః
33. గోబ్రాహ్మణ హితాసక్త మానసాయ నమో నమః
34. గురుమండల సంభావ్య విదేహాయ నమో నమః
35. భావనామాత్ర సంతుష్ట హృదయాయ నమో నమః
36. భావ్యాది భావ్య దివ్య శ్రీపదాబ్జాయ నమో నమః
37. వ్యక్తావ్యక్త తరానేక చిత్కళాయ నమో నమః
38. రక్త శుక్ల ప్రభామిశ్ర పాదుకాయ నమో నమః
39. భక్త మానస రాజీవ భవనాయ నమో నమః
40. భక్త లోచన రాజీవ భాస్కరాయ నమో నమః
41. భక్త కామలతా కల్ప పాదపాయ నమో నమః
42. భక్తి ముక్తి ప్రదానేక శక్తిదాయ నమో నమః
43. శరణాగత దీనార్త రక్షకాయ నమో నమః
44. శమాది షట్క సంపత్ప్రదాయకాయ నమో నమః
45. సర్వదా సర్వధా లోక సౌఖ్యదాయ నమో నమః
46. సదా నవనవాకాంక్ష్య దర్శనాయ నమో నమః
47. సర్వ హృత్పద్మ సంచార నిపుణాయ నమో నమః
48. సర్వేంగిత పరిజ్ఞాన సమర్థాయ నమో నమః
49. స్వప్న దర్శన భక్తేష్ట సిధ్ధిదాయ నమో నమః
50. సర్వ వస్తు విభావ్యాత్మ సద్రూపాయ నమో నమః
51. దీన భక్తావనైకాంత దీక్షితాయ నమో నమః
52. జ్ఞానయోగ బలైశ్వర్య మానితాయ నమో నమః
53. భావ మాధుర్య కలిత భావాఢ్యాయ నమో నమః
54. సర్వభూత గణామేయ సౌహార్దాయ నమో నమః
55. మూకీభూతానేక లోక వాక్ప్రదాయ నమో నమః
56. శీతలీకృత హృత్తాప సంసేవ్యాయ నమో నమః
57. భోగ మోక్ష ప్రదానేక యోగజ్ఞాయ నమో నమః
58. శ్రీఘ్ర సిధ్ధి కరానేక శిక్షణాయ నమో నమః
59. అమానిత్వాది ముఖ్యార్ధ సిధ్ధిదాయ నమో నమః
60. అఖండైక రసానంద ప్రబోధాయ నమో నమః
61. నిత్యానిత్య వివేక ప్రదాయకాయ నమో నమః
62. ప్రత్యగేకరసాఖండ చిత్సుఖాయ నమో నమః
63. ఇహాముత్రార్ధ వైరాగ్య సిధ్ధిదాయ నమో నమః
64. మహామోహ నివృత్యర్థ మంత్రదాయ నమో నమః
65. క్షేత్ర క్షేత్రజ్ఞ ప్రత్యేక దృష్టిదాయ నమో నమః
66. క్షయవృధ్ధి విహీనాత్మ సౌఖ్యదాయ నమో నమః
67. తూలాజ్ఞాన విహీనాత్మ తృప్తిదాయ నమో నమః
68. మూలాజ్ఞానా బాధితాత్మ ముక్తిదాయ నమో నమః
69. భ్రాంతి మేఘోచ్చాటన ప్రభంజనాయ నమో నమః
70. శాంతి వృష్టి ప్రదామోఘ జలదాయ నమో నమః
71. ఏక కాలకృతానేక దర్శనాయ నమో నమః
72. ఏకాంత భక్తి సంవేద్య స్వభావాయ నమో నమః
73. శ్రీచక్ర రథ నిర్మాణ సుప్రధాయ నమో నమః
74. శ్రీ కళ్యాణతరామేయ సుశ్లోకాయ నమో నమః
75. ఆశ్రితాశ్రయణీయత్వ ప్రాపకాయ నమో నమః
76. అఖిలాండేశ్వరీ కర్ణ భూషాదాత్రే నమో నమః
77. సశిష్యగణ యాత్రా విధాయకాయ నమో నమః
78. సాధుసంఘ నుతామేయ చరణాయ నమో నమః
79. అభిన్నాత్మైక్య విజ్ఞాన బోధకాయ నమో నమః
80. భిన్న భిన్న మతైశ్చాభి పూజితాయ నమో నమః
81. తత్తద్విపాక సద్బోధ దాయకాయ నమో నమః
82. తత్తద్భాషా ప్రకటిత స్వబోధాయ నమో నమః
83. సర్వత్ర సాధితానేక సత్కార్యాయ నమో నమః
84. చిత్ర చిత్ర ప్రభావాతి ప్రసిధ్ధాయ నమో నమః
85. లోకానుగ్రహ కృత్కర్మ నిష్ఠితాయ నమో నమః
86. లోకోధ్ధరణ కృద్భూరి నియమాయ నమో నమః
87. సర్వ వేదాంత సిధ్ధాంత సమ్మతాయ నమో నమః
88. కర్మ బ్రహ్మాత్మ యోగాది మర్మజ్ఞాయ నమో నమః
89. వర్ణాశ్రమ సదాచార రక్షకాయ నమో నమః
90. ధర్మార్ధ కామ మోక్ష ప్రదాయకాయ నమో నమః
91. పద వాక్య ప్రమాణాది పారీణాయ నమో నమః
92. పాదమూల నతానేక పండితాయ నమో నమః
93. వేదసారార్థ సద్గోష్ఠీ లోలుపాయ నమో నమః
94. వేదశాస్త్ర పురాణాది విచారాయ నమో నమః
95. వేద వేదాంగ తత్వ ప్రబోధకాయ నమో నమః
96. వేదమార్గ ప్రమాణత్వఖ్యాపకాయ నమో నమః
97. నిర్ణిద్ర తేజోవిజిత నిద్రాద్యాయ నమో నమః
98. నిరంతర మహానంద సంపూర్ణాయ నమో నమః
99. స్వభావ మధురోదార గాంభీర్యాయ నమో నమః
100. సహజానంద సంపూర్ణ సాగరాయ నమో నమః
101. నాదబిందు కళాతీత వైభవాయ నమో నమః
102. వాది భేద విహీనాత్మ బోధనాయ నమో నమః
103. ద్వాదశాంత మహాపీఠ నిషణ్ణాయ నమో నమః
104. దేశకాలా పరిఛ్ఛిన్న దృగ్రూపాయ నమో నమః
105. నిర్మాన శాంతి మహిత నైశ్చల్యాయ నమో నమః
106. నిర్లక్ష్య లక్ష్య సంలక్ష్య నిర్లేపాయ నమో నమః
107. శ్రీ షోడశాంత కమల సుస్థితాయ నమో నమః
108. శ్రీ చన్ద్రశేఖరేంద్ర సరస్వత్యై నమో నమః
*హర హర శంకర జయ జయ శంకర కాలడి శంకర...🙏🏻*
*_ప్రాంజలి ప్రభ .*
No comments:
Post a Comment