Monday, 14 December 2020

16--12--3020


 


. Mallapragada: _*గోదాదేవి అసలు కథ*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

 

తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు , మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే. విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి , ఆయనకు పెరియాళ్వారు అంటే - పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తూ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణుచిత్తుడు. ఆమెకు *‘కోదై’* అంటే - పూలమాల అన్నపేరుతో గారాబంగా పెంచసాగాడు విష్ణుచిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది.

గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను ఆడుతూపాడుతూ పెరిగిందే. యుక్తవయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్తా ప్రేమగా మారిపోయింది. కళ్లుమూసినా , తెరిచినా ఆ నల్లనివాడే కనిపించసాగాడు. తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్లంతా ఒకప్పటి గోపికలనీ , తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు ! తన తండ్రి విష్ణుచిత్తుడు రోజూ భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందు తనే ధరించి , తనలో ఆ కృష్ణుని చూసుకుని మురిసిపోయేది. ఈ దృశ్యం ఒకరోజు విష్ణుచిత్తుని కంట పడనే పడింది. తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్లూ ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. కానీ ఆ రోజు కృష్ణుడు అతనికి కలలో కనిపించి , గోదాదేవి సాక్షాత్తూ భూదేవి అవతారమేననీ , ఆమె వేసుకున్న మాలలను ధరించిడం వల్ల తనకు అపచారం కాదు కదా , ఆనందం కలుగుతుందనీ తెలియచేశాడు.

ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణప్రేమని మరింతగా పెంచాయి. తనకు పెళ్లంటూ జరిగితే ఆయనతోనే జరగాలని అనుకుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలుపెట్టింది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికీ , అలంకారానికీ సంబంధించిన చాలా కఠినమైన నియమాలని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తెలని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు , వారికి వ్రత విధానాలను తెలియచేసేందుకు , తనలో కృష్ణభక్తిని వెల్లడించేందుకు 30 పాశురాలను పాడింది గోదా. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవభక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై !

ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు , ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణుచిత్తునికి కనిపించి , గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మనీ… అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటాననీ చెప్పాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియచేశాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవినీ , విల్లిపుత్తూరులోని ప్రజలనూ తీసుకుని శ్రీరంగానికి బయల్దేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన అర్చకులు వారిని ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లికూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి , అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగిరోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి , విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు.

[15/12, 11:19 am] . Mallapragada: *_16 నుండి ధనుర్మాసం ప్రారంభం     గోదాదేవి ఎవరు ?  పాశురాలు అంటే ఏమిటి ?   వాటి పరమార్ధం ఏమిటి ?_* 


గోదాదేవి 1200 ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ వైతాళికులు పన్నిద్దరాళ్వారులలో ఏకైక మహిళ. ఆళ్వారులు పాడిన నాలాయిర ప్రబంధంలో (4000 పాశురాలు) గోదాదేవి పాడిన 30 పాశురాలకు అతి విశిష్ట స్థానం ఉంది. గోదాదేవి తనని తాను రేపల్లెలో గొల్లభామగా భావించుకుంది.


తమ మధ్యనే తిరుగాడే శ్రీకృష్ణస్వామిని పగలంతా చూస్తున్న సంతోషం , రాత్రివేళ చూడలేని తాపం , తెల్లవారే వేళనే

కన్నులారా చూసి తరించాలన్న తపన , ఆత్రం కలబోసిన భావరాగానురాగాల పారిజాతాల మాల తిరుప్పావై.


*పాశురాల పరమార్ధం*


తిరుప్పావైలో ఉన్న మొత్తం పాశురాలు 30. వీటిలో మొదటి అయిదు ఉపోద్ఘాతంగా ఉంటాయి. తిరుప్పావై ప్రాధాన్యతను వివరిస్తాయి. భగవంతునికి చేసే అర్చన మొదలు నివేదన వరకు అన్ని ఉపచారాల్లో ఆడంబరం అవసరం లేదని , చిత్తశుద్ధి ఉంటే భగవంతుడు సంతోషిస్తాడని ఈ పాశురాలు చెబుతాయి. భగవంతుని ఆరాధించటం వల్ల వానలు సమృద్ధిగా కురుస్తాయని , పంటలు నిండుగా పండుతాయని , దేశం సుభిక్షంగా ఉంటుందని వీటిలో ఉంది.


తర్వాతి పది పాశురాల్లో చెలులతో కలిసి శ్రీరంగనాథుని సేవించడానికి గోదాదేవి వెళ్తున్న సన్నివేశాలు వర్ణితమై ఉంటాయి. పదిహేను నుంచి ఇరవయ్యో పాశురం వరకు గోదాదేవి చెలులతో కలిసి దేవాలయానికి వెళ్లిన విషయాలు , అక్కడి శిల్పసౌందర్యాల వర్ణనలు , రంగనాథునికి సుప్రభాతం పాడటం మొదలైనవి ఉంటాయి. కృష్ణుడి అష్టభార్యల్లో ఒకరైన నీలాదేవి ప్రార్థన కూడా ఈ పాశురాల్లోనే ఉంటుంది.


చివరి తొమ్మిది పాశురాలు పూర్తిగా భగవంతుడి విలాసాన్ని ప్రకటిస్తాయి. నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాశురంలో ఫలశృతి చెబుతూ ఎవరైతే ఈ పాశురాలు ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది.

 Mallapragada: ✍️.....నేటి చిట్టికథ


🦅🦚🦜🦢🦅🦚🦜🦢🦅🦚🦜


 ఒక అడవిలో🌳 ఓ చెట్టు మీద గూడు కట్టుకుని ఒక కాకి సుఖంగా ఉండేది. 🦅


ఒక రోజున ఓ సరస్సు మీదగుండా ఎగిరి వెళ్తూ కిందన ఒక చక్కని పక్షిని చూసింది.


 సన్నటి పొడుగాటి నాజూకైన మెడ, విశాలమైన రెక్కలు, అంతకంటే విశాలమైన పాదాలు - తెల్లగా వెన్నముద్దలా ఉంది. దాని నడకలో రాచ ఠీవి ఉంది. అది గాలిలోకి ఎగురుతున్నప్పుడు కూడా చూసింది కాకి. మెడ ముందుకు సాచి రెక్కల్ని విసనకర్రల్లా ఆడిస్తూ ఏమి వయ్యారాలు పోయిందో! కిందకు దిగి చూసింది. ఎవరో కాదది రాజహంస.🦢



 ‘అది అంత తెల్లగా ఉంటే, నేను చూడు ఎలా ఉన్నానో నల్లగా’ అనుకుంది కాకి. బాధపడింది.🦅



 ప్రపంచంలోని పక్షులన్నిట్లోకి హంస అదృష్టవంతురాలనుకుంటూ హంస దగ్గరకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకుంది. హంసకు అభినందనలు తెలిపింది.👏👏


 ‘అవును, ఇన్నాళ్లూ నేనూ నా అంత అదృష్టవంతు రాలు లేదనుకున్నాను. నిన్న ఓ చిలకను🦜 చూశాక నా అభిప్రాయం మారిపోయింది. ఆ చిలక ఎంత బాగుందో! చిత్రంగా అది రెండు రంగులతో ఉంది. ముద్దు ముద్దుగా మాట్లాడుతోంది. సృష్టిలోకెల్లా అదే అందమైన పక్షి. సందేహం లేదు’ అంది హంస.


 కాకి 🦅ఎగురుకుంటూ పోయి చిలక ముందు వాలింది.🦜


కాకి దాన్ని చూస్తూ ‘ఏమందమే చిలకా నీది’ అంది.


 ‘ఔను. నేనూ అలాగే అనుకున్నాను. కానీ

నిన్ననే ఓ నెమలిని 🦚చూశాను. దాన్ని చూశాక నాదీ ఒక అందమే అనిపించింది. దాని నడక, దాని హొయలు, దాని అందం... ఆహాహా... ఏమని చెప్పను.  నాకున్నవి రెండే రంగులు.

 దానికి ఒళ్లంతా ‘రంగులే’ అంది.



 కాకికి 🦅కాలు నిలవలేదు. రివ్వున ఎగురుకుంటూ  నెమలిని వెతుక్కుంటూ వెళ్లింది. 


ఒకచోట నీలం, ఆకుపచ్చ, ఎరుపు, బంగారం ఇలా ఎన్నెన్నో రంగులతో మెరిసిపోతూ కనిపించింది నెమలి.🦚 అప్పుడది పురి కూడా విప్పి ఉందేమో. ఇంద్రధనస్సులా కాంతులీనుతూ ఉంది.


 కళ్లు చెదురుతున్నాయి. కాని, నెమలి అందచందాలను ఆస్వాదిస్తూ నెమలి దగ్గరకు వెళ్లి ‘ఎంత అందంగా ఉన్నావో! చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు. నిన్ను చూసేందుకు రోజూ ఇంత మంది వస్తున్నారంటేనే నువ్వెంత అందగత్తెవో అర్థమౌతోంది. నేనూ ఉన్నాను. జనాభా లెక్కకి. నన్ను చూస్తూనే విదిలించి కొడతారందరూ’ అని వాపోయింది.🦅



 🦚నెమలి విరక్తిగా నవ్వింది. ‘నా అందమే నాకు శాపం. అద్భుత రూప లావణ్యంతో ఉన్నాను కనుకే నన్ను బంధిస్తారు.

నీలా కాకిలా పుట్టి ఉంటే ఎంత స్వేచ్ఛో గదా అనుకుంటున్నాను. 

నాకా అదృష్టం లేదు. ఈ జన్మంతా బానిస బతుకే’ అని కన్నీళ్లు పెట్టుకుంది.


 నెమలి బాధ విన్నాక కాకికి తెలివొచ్చింది. 

మనందరి సమస్య కూడా ఇదే. ఎవరెవరితోనో పోల్చుకుని బాధపడుతుంటాం. భగవంతుడిచ్చిన దాంతో తృప్తి పడటం తెలీదు మనకు. అసంతృప్తే అన్ని దుఃఖాలకు కారణం. మనకు ఏవి లేవో వాటిని తలచుకుని పొర్లి పొర్లి ఏడ్చే బదులు, ఏవి ఉన్నాయో వాటితో సంతోషంగా ఉండటం నేర్చుకోవాలి. 


ప్రపంచమన్నాక హెచ్చు తగ్గులెప్పుడూ ఉంటాయి. ఉన్న వాటిని హాయిగా స్వేచ్ఛగా తృప్తిగా అన భవించే వాడి బతుకే బతుకు. వాడు నిత్య సంతోషి.


🌳🌳🌳🌳🌳🌳🌳🌳

ఈ రోజు నుండి 30 రోజులు తిరుప్పావై పాశురాలు పారాయణం చేసుకుందాం:*

*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః*


*తిరుప్పావై మొదటిరోజు పాశురం: 16 / 12 / 2020 బుధవారము:*

*********************


*1. పాశురము :*

********************


మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్

నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్

శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్

కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్

ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్

కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్

నారాయణనే నమక్కే పఱై దరువాన్

పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !


*భావము :—* సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా~ మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాల సింహము వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరిమును, చంద్రునివలె ఆహ్లాదకరుడును, సూర్యునివలె తేజోమయుడును యైన నారాయణునే తప్పు, యితరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసినవిచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ యీ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగ దాని కంగమైన మార్గళి స్నానము చేయు కోరికగల వారందరును ఆలసింపక శ్రీఘ్రముగ రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నియలందరను ఆహ్వానించుచున్నది.


*తిరుప్పావైగీతమాలిక*

ంంంంంంంంంంంం

*అవతారిక:*

వ్రతము చేయుటకు అనువైన సమయము, మాసము - మార్గశీర్షమాసము. కనుక భాగత్సంశ్లేషము కోరే భక్తులందరను వ్రతము చేయగా మార్గళి స్నానం చేదురు, రండీ! అని గోదాదేవి ఆహ్వానిస్తున్నది.


*1 వ మాలిక*


(రేగుప్తి రాగము -ఆదితాళము)


ప.. శ్రీ గోకుల వాసులారా! - సిరికన్నియలార!

భావతాపము దీర్చుకొనగ - వ్రతము చేయరండి!


అ.ప.. మార్గశీర్ష మాసమెంతో - మంచిది కద! రండి!

మనసు పడిన వారెల్లరు -మార్గళి నీరాడ రండి!


1. చ.. ఆపద శంకించి కాచు - ఆనందుని తనయుని

యశోదమ్మ యొడి యాడెడు - ఆ బాల సింహుని

నీలమేఘశ్యాముని - ఇన శశి సమవదమని

నారాయణు గొలువనిపుడు - నరుల బొగడ రండి


2. ఛ. ఈ నోమును నోచు మనము - ఇతరములను కోరము

పర సాధన మొసగెడి మన - పరమాత్ముడే, సర్వము

లోకమంత పొగడగ నీ - నోము మనము నోచెదము

మనసు పడిన వారెల్లరు - మార్గళి నీ రాడరండి.


🙏 *ఓం నమో  నారాయణాయ*🙏


*-- వరలేఖరి.నరసింహశర్మ.*

[15/12, 9:49 pm] +91 79810 02699: *తిరుప్పావై ప్రవచనం - 1 వ రోజు: 16 / 12 / 2020 బుధవారము:*

*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైైఃః*


*భగవంతుని మొదటి స్థానం నారాయణ తత్వం:*

********************

*పాశురము:*

********************

*మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్*

*నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్*

*శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్*

*కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్*

*ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్*

*కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్*

*నారాయణనే నమక్కే పఱై దరువాన్*

*పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !*


*నారాయణ మంత్ర ఉపదేశంతో వ్రత ప్రారంభం*

ంంంంంంంంంంంం


*"మార్గళి త్తింగళ్"* మార్గశిర్షం మంచి మాసం , ఫలమును నిచ్చే మాసం. అలాంటి పన్నెండు మాసాలు మనకు ఒక సంవత్సరం అయితే , అది దేవతలకు ఒక రోజు అంటారు. దక్షిణాయణం వారికి రాత్రి అయితే ఉత్తరాయణం పగలు. సంక్రాంతి రోజు సూర్యుడు దక్షిణాయణం నుండి ఉత్తరాయణంకు మారుతాడు , అంటే సంక్రాంతికి ఒక నెల ముందుగా వచ్చే మార్గశీర్షం వారికి తెల తెల వారే సమయం. సత్వాన్ని పెంచేకాలం. కాబట్టి ఆచరణ ద్వారా మనం ఈమాసాన్ని వినియోగించుకోవాలి. *"మది నిఱైంద నన్నాళాల్"* చంద్ర కాంతి మంచిగా ఉండే కాలం , చంద్రుడు పెరిగే కాలం కబట్టి మనం మంచిరోజులుగా భావిస్తాం. *"నీరాడ ప్పోదువీర్ పోదుమినో"* స్నానం చేయటానికి వెల్దాం ! ఎలాంటి స్నానం అది అంటే భగవంతుని కళ్యాణ గుణాలతో మన పాపాలను కడిగివేసుకొనే స్నానం. *"నేరిళైయీర్"* భగవంతుని గురించి తెలుసుకోవాలనే జ్ఞానం మాత్రం చాలు ఈ వ్రతం చేయటానికి యోగ్యులమే. 


*"శీర్ మల్గుం ఆయ్ ప్పాడి"* పంటలు బాగా పండే ఆ నందగోకులంలోని *"చ్చెల్వ చ్చిఱుమీర్గాళ్"* సంపన్నులైన గోప పిల్లల్లా , మనమూ అవ్వాలి శ్రీకృష్ణ ప్రేమ కోసం.


ఏ భయమూ అవసరం లేదు. *"కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్"* పరమ సాత్వికుడైన నందగోపుని కుమారుడిగా మన వద్దకు వచ్చాడు కదా పరమాత్మ , ఏ అసురుల భారినుండి శ్రీకృష్ణునికి ముప్పు రాకుండా తాను కత్తి ఎల్లప్పుడు పట్టుకొని కాపాడుతూ ఉన్నాడు ఒక ఆచార్యునివలె. మరి నందగోపుడు మనవాడే కదా ! 


*"ఏరారంద కణ్ణి యశోదై ఇళమ్ శింగం"* మరి ఆయనేమో తన చేష్టలతో యశోదమ్మ కళ్ళు అనందంచే పెద్దగా అయ్యేట్టు చేస్తూ ఆమె ఒడిలో చిన్న సింహంపిల్లలా పెరుగుతున్నాడు. *"కార్మేని"* నల్లని మేఘంలాంటి దివ్య కాంతులతో అంతం లేని గుణాలు కల్గి , *"చ్చెంగణ్ "* వాత్సల్యం కల్గినవాడు. *"కదిర్మదియం పోల్ ముగత్తాన్"* చంద్ర సూర్యుల వంటి ముఖం కల్గినవాడు. మిత్రులతో ప్రేమగా శత్రువులతో కోపం కల్గినవాడు. 


*"నారాయణనే నమక్కే పఱైతరువాన్"* నారాయణ అనే మత్రం ఉపదేశం చేస్తూ మనకు సర్వస్వం ప్రసన్నం చేస్తుంది గోదా *"పారోర్ పుగళప్పడింద్"* ఫలం సాక్షాత్తు పరమాత్మే , ఈ లోకంలోని వారందరికీ అందజేస్తుంది అమ్మ గోదా.


*నారాయణ మంత్రం*

ంంంంంంంంంంంం


ఈ వ్రతంలో మనం భగవంతున్ని ఎట్లాచూస్తామో వివరిస్తుంది. భగవంతుడు ప్రాదేశికుడై అల్ప ఫలాన్ని ఇచ్చేవాడైతే మనం స్వీకరించం. భగవంతునికి ఎన్నెన్నో రూపాలు ఉంటాయి ఆకాశానికి అంతం లేనట్టుగా , సాగరంలో జలానికి అంతంలేనట్టుగా , మన జన్మలకీ కర్మలకీ అంతం లేనట్టుగా భగవంతుని కళ్యాణ గుణాలకు కూడా అంతం లేదు. కేవలం ఆయనగుణాలకేకాదు ఆయన స్వరూపానికి కూదా అంతం లేదు కాబట్టే ఆయనను సర్వవ్యాపి అంటారు. ఇందుగలడని అందులేడని సందేహము వలదు అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా , అంతటా వ్యాపించి ఉండటం భగవంతుని గొప్పతనం. 


ఆ వ్యాపనశీలాన్ని చెప్పే మంత్రాలే గొప్ప మంత్రాలుగా చెప్పబడి ఉన్నాయి. భగవంతుని వ్యాప్తిని చెప్పేవి కేవలం మూడే అవి *"విష్ణు", "వాసుదేవ" మరియూ "నారాయణ".* విష్ణు అంటే వ్యాపించిన వాడని అర్థం. వాసుదేవ అంటే అంతటా వసిస్తాడు - ప్రకాశిస్తాడు అని అర్థం. ఈ రెండు మంత్రాల్లో కేవలం వ్యాపించి ఉంటాడనే చెబుతాయి కాని ఎలావ్యాపించి ఉంటాడు , ఎందుకు వ్యాపించి ఉంటాడు అనే ప్రశ్నలకు సమాధానం లభించదు కనుక ఆ మంత్రాలకు కొంచెం లోపం ఉంది అంటారు. కాని నారాయణ మంత్రం మాత్రం వ్యాప్తిని చెబుతుంది , వ్యాప్తి ఫలాన్ని చెబుతుంది , ఎందుకు వ్యాపించి ఉంటాదని వివరిస్తుంది. ఎందెందులో వ్యాపించి ఉంటాదని తెలియజేస్తుంది , ఆ వ్యాపించి ఉండే వాటితో సంబంధం గురించి తెలియజేస్తుంది. 


నారాయణ అంటే ఒక అద్బుతమైన మంత్రం , నారములు అంటే సకల చరాచర వస్తువులు అని అర్థం. అయణం అంటే ఆధారం అని అర్థం. సూర్యుడు మనకు ఉత్తరం నుండి ఆధారమైన కాలాన్ని మనం ఉత్తరాయణం , విడ దీస్తే ఉత్తర - అయణం అంటాం. నారాయణ శబ్దం లోని అయణ అనే పదాన్ని అర్థం ఆధారం. ఈ సకల చరాచర వస్తుజాతానికి ఆధారమైన వాన్ని నారాయణ అంటారు. మరి చరాచర వస్తువులలో ఎట్లావ్యాపించి ఉంటాడు , లోపల - బయట వ్యాపించి ఉంటాడని తెలియజేసేది నారాయణ మంత్రం. ఈ నారాయణ అనే శబ్దాన్ని రెండు సమాసాలు వివరిస్తాయి. ఒకటి తత్పురుష రెండవది బహువ్రిహి సమాసాలు. తత్పురుష అనేది నారములన్నిటికి తాను ఆధారమైన వాడు , ఆధారమై తనలోపల పెట్టుకున్నవాడు అని చెబుతుంది. మరి బహువ్రిహి సమాసం తానీ నారములన్నిటికి తాను లోపల ఉండి రక్షిస్తాడని చెబుతుంది. అర్థాత్ ఆయన లోపన మరియూ బయట వ్యాపించి ఉంటాడని. అయణ అనే శబ్దంచే ఆయన అన్ని గుణములు కల్గి , చేయిచాస్తే చాలు అందేట్టు ఉంటాడు కాబట్టి ఆయనకు సౌలబ్యాది గుణాలు ఉంటాయి. లోపల ఉంటాడు కాబట్టి దగ్గరగా ఉంటాడు , పైన కూడా ఉంటాడు కనక అయన పరుడు - అందుచే పరత్వం సౌలబ్యం లాంటి గుణాలు కల్గినవాడు. జ్ఞానులు కూడా ఈ నారములలోని వారేకనుక తాను జ్ఞానం కల్గి ఉంటాడు. చేయిజాస్తే అందేవాడు , వారిలోని దోశాలనను ఎలా దూరంచేయాలో తెలిసినవాడు , దోశాలున్నా తన నుండి మనల్ని దూరం చేయని వాత్సల్యం కల్గినవాడు. దోశాలను తొలగించే శక్తి కూదా ఉంది. అర్థాత్ ఆయనలో పరత్వం ఉంది , సౌశీల్యం ఉంది , వీటన్నిటినీ తనవనుకునే స్వామిత్వం ఉంది , వీటి యొగ్యత గుర్తించే జ్ఞానంచే సర్వజ్ఞత్వం ఉంది , తను ఇలాచేస్తానంటె ఎవ్వరూ అడ్డనంత శక్తి ఉంది , ఎంత ఇచ్చినా తరగని నిండుతనం అంటే పూర్ణత్వం ఉంది. 


అన్ని గూణాలు కల్గి ఉన్న ఈ మత్రాన్ని మన ఆండాళ్ తల్లి మనకు ఊపాస్య మంత్రంగా అందించింది. 


ఈ పాటలో ఆత్మ ఉజ్జీవనానికి చేయాల్సిన కార్యక్రమం ఏమిటో తెలియజేస్తుండి. శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు , శారీరక సుఖాలు ఏకాంతంలో అనుభవించేవి , కాని భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి , దాన్నే గోష్టి అంటారు. ఆండాళ్ తల్లి అందరితో కలిసి , నారాయణ మంత్రంతో ముందుకు వెళ్ళుదాం అంటోంది , దీనికి యోగ్యత కేవలం కోరిక మాత్రం చాలు అని ధైర్యం చెబుతోంది.


*--...........


.

సర్వం పరవశం దుఃఖం సర్వం ఆత్మవశం సుఖం


ఏతత్విద్యా త్సమానేన లక్షణం సుఖదుఃఖయోః


 


మనదే అయినా, ఇతరులు గనుక తీసుకుంటే, ఇక అది దుఃఖాన్నే కలిగిస్తుంది. మనకు దక్కింది మాత్రమే సుఖాన్ని ఇస్తుంది. సుఖదుఃఖాలను ఇలాగే నిర్వచించుకోవాలి. అంటే, మనవద్ద లేనివాటికోసం దిగులు పడకూడదని, ఉన్నవాటితో సంతృప్తిగా ఉండాలని భావం.


🌳🌳🌳🌳🌳🌳🌳🌳

 👍🙏👌


ఇది నిజంగా రోమాలు 

నిక్క పొడుచుకొనేలా చేసే

నిజ జీవితంలోని 

జరిగిన సంఘటన...


చరిత్రలో నిలిచిన కథ.


 నిజంగా శివుని లీలలు ఎవరికి అర్థం కావు, 


ఈ లీల చాలా కొత్తగా ఉంటుంది. 


ఎందుకు అంటే ఎలాంటి నమ్మకం లేని, 

అసలు హిందూ ధర్మం అంటే సంబంధం లేని 

ఒక బ్రిటిషర్ కి శివుడు కనిపించాడు. 


ఒక క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి కూడా 

పరమ శివుడు కనిపించాడు. 


నిజంగా అద్బుతమైన శివుని లీల ఇది. 


ఈమె భార్యది మరియు ఈయనది నిజంగా అదృష్టమే.


 1879 లో బ్రిటిష్ వాళ్ళు భారత్ ని పరిపాలిస్తున్నప్పుడు,

“ఆఫ్ఘానిస్తాన్ లో జరుగుతున్న యుద్దంలో కల్నల్ మార్టిన్ 

అనే వ్యక్తి ఆర్మీ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. 


ఆ యుద్దం ఒక రోజు, రెండు రోజులు కాకుండా నెలల తరబడి జరుగుతూనే ఉంది. .


కల్నల్ తన క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తన భార్యకి పంపిస్తూ ఉండేవాడు. 


ఆమె పేరు మేరీ. 


ఇలా కొన్ని రోజుల గడువగా ఆమె కి కొన్నాళ్ళకి కల్నల్ నుండి క్షేమ సమాచారాలు అందడం ఆగిపోయింది. 


అప్పటి నుండి ఆమె తీవ్రమైన మనోవేదానికి గురి అయింది. 


ఎప్పుడు భయంతో, భాధతో తనలో తాను కుమిలి పోతూ ఉండేది. 


ఆమె రాత్రి పగల్లు తన భర్త కోసం తపిస్తూ బాధ పడుతూ ఎదురు చూడసాగింది. 


అయితే ఈమె ఒకరోజు గుర్రం మీద బయటకి వచ్చినప్పుడు బైధ్యనాథ్ గుడి పక్కన నుండి వెళ్తూ వేద మంత్రాలు విని, వెంటనే గుర్రం ఆపి గుడి లోపలికి వెళ్లింది. 


అక్కడ పూజారులు 

మహా శివుణ్ణి పూజించడం ఈమె గమనించింది. 


ఆ పూజారులు 

“ఈమె మనసులో ఏదో బాధలో ఉందని” 

గ్రహించి పలకరించారు.


ఆ పూజారులు 

“ఏమైంది తల్లి నీకు అని అడగగనే, 

వెంటనే ఆమె భర్త 

‘కల్నల్ గురించి చెప్పి, 

భర్త నుండి ఇంత వరకు ఎలాంటి సమాచారం లేదని, 

వెంటనే తనకు తాను తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకుంది. 


ఆ పూజా రులు ఆమెని ఓదారుస్తూ 


“మహా శివునికి తన భాధని చెప్పుకోమని అన్నారు.


ఆమె గుడిలో 

మహా శివునికి మొక్కీ ఇంటికి వెళ్లింది తర్వాత ఆమె శివున్ని భక్తితో కొలుస్తూ 

“లఘు రుద్ర మంత్ర జపం 11 రోజులు చేసింది. 


భక్తితో ఆరాధిస్తూ ఆమె “తన భర్తని క్షేమంగా తన దగ్గరికి తీసుకు వస్తే, బైధ్యనాథ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తానని శివునికి మనసులో కోరుకుంది.


11 రోజుల జపం చేసిన తర్వాత, 

ఆమె కి కల్నల్ నుండి ఒక ఉత్తరం వచ్చింది. 


ఆ ఉత్తరంలో కల్నల్ క్షేమంగా ఉన్నట్లు చెప్పాడు మరియు తను ప్రాణాపాయ స్థితిలో నుండి బయట పడినట్లు చెప్పాడు. 


పతాన్స్ మమ్మల్ని చుట్టూ ముట్టి చంపేయబోయారని, మాకు బ్రతుకు మీద ఇక ఆశ కూడా పోయిందని, 

ఆ సమయంలో మేము తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని. 


అదే సమయంలో ఒక్కసారిగా అక్కడ 

ఒక భారతదేశపు 

మహా యోగి వెలుగుతూ కనిపించాడని. 


ఆయన పులి చర్మం ధరించి, 

మూడు సూది మొనలతో ఉన్న ఆయుధాన్ని చేతిలో పట్టుకున్నాడని, 

ఇంకా విభూతి కమండలాలతో ఉన్నాడని కల్నల్ ఉత్తరంలో రాశాడు. 


ఆయన శక్తికి, 

తేజస్సుకి పతాన్స్ కూడా వెనుతిరిగి పారిపోయారని కల్నల్ ఉత్తరంలో పేర్కోన్నాడు. 


ఈ యోగి వల్లే మేము విజయం సాధించమని అన్నాడు. 


ఇంకా చెప్తూ ఆయన కంఠం 1000 ఏనుగుల గంభీరం, పొడవైన ఉంగరాల జుట్టు ఉన్నాయని, 

ఆ మహా యోగి కల్నల్ తో మాట్లాడాడని చెప్తూ, 

నీ భార్య నన్ను భక్తితో పూజిస్తోంది ఆమె భక్తికి తృప్తి చెంది నిన్ను కాపాడడానికి వచ్చానని యోగి అన్నారని కల్నల్ ఉత్తరంలో రాశాడు.


కొన్ని వారాల తర్వాత,

కల్నల్ ఇంటికి చేరుకున్నారు. 


తర్వాత కల్నల్ మరియు మేరీ భైద్యనాథ్ గుడిని దర్శించుకున్నారు. 


కల్నల్ గుడిలో ఉన్న 

మహా శివుని రూపం చూసి యుద్ద భూమిలో చూసిన మహా యోగి ఈయనే అని అన్నాడు. 


అప్పటి నుండి కల్నల్ మరియు మేరీ 

“మహా శివునికి” అపార భక్తులు అయ్యారు. 


ఆ తర్వాత బైధ్యనాథ్ గుడిని పునర్నిర్మించారు మరియు వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని గుడికి ఇచ్చేశారు. 


జన్మ ధన్యం చేసుకున్నారు. 


ఇప్పటికీ బైధ్యానాథ్ గుడి ప్రాంగణంపై వీళ్ళ ఇద్ద రి పేర్లు ఉన్నాయి. 


బ్రిటిష్ వాళ్ళు కట్టిన 

ఒకే ఒక్క గుడి ఇదే. 


ఈ కథ “Hidden Archeology of India ” అనే పుస్తకంలో ఉంది...


👍👏👌

ఓ తండ్రి ఆవేదన...తన మాటల్లోనే....


నాకు77 ఏండ్లు. నా భార్య చనిపోయి 10 సంవత్సరాలు అవుతోంది. నాకు 4గురు కొడుకులు.. ఒక్కొక్క నెల ఒక్కో కొడుకు ఇంట్లో నా జీవనం...ఆప్యాయంగా పలకరించే మనిషి కోసం ఆరాటపడే వారిలో నేనూ ఒకడిని...ఇంక 4 రోజుల్లో చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి..ముడతలుపడ్డ తన వేళ్ళతో రోజులు లెక్కపెట్టుకుంటున్నాడు ఆ పెద్దాయన.

చిన్నకోడలి దగ్గరికి పోవడానికి ఇంక కొన్ని గంటలే సమయం ఉంది.పోయిన దీపావళికి 2వ కొడుకు పంచలు తీసిచ్చాడు.. అవి బాగా పాతబడిపోయాయి.పెద్దకొడుకు కొనిచ్చిన అద్దాలు పగిలిపోయి 3 వారాలు అయింది.కొడుక్కి చెపితే విసుక్కుంటాడని అద్దాలు పెట్టుకోవడం మానేశాను.కోడలితో చెప్తే గొడవ అవుతుందని చెప్పలేదు.

ఎవ్వరినీ ఇబ్బంది పెట్టలేని మనస్తత్వం నాది.

చిన్నకోడలికి చెప్పి అద్దాలు మార్చుకోవాలి. ఇంకా 4 రోజులుంది.అందరూ ఆఫీస్ కు వెళ్ళాక ఆ పంచలు ఉతుక్కోవాలి..నల్లగా ఉంటే చిన్నకొడలు కొప్పడుతుంది.


4 రోజులు గడిచిపోయాయి...హాస్టల్ నుండి ఇంటికి పోయే పిల్లవాడిలా ఆనందం నాకు..కొడుకు బస్ ఎక్కించి వెళ్ళిపోయాడు...బస్ దిగగానే నా చిన్నకొడలు నాకోసం స్కూటీ తెచ్చింది...నన్ను చూడగానే ' అద్దాలు ఏమయ్యాయి మామయ్యా?' అని అడిగింది...బ్యాగ్ లో ఉన్నాయి పదమ్మా! అన్నాను.తీసి పెట్టుకోమని ఆర్డర్ వేసింది...పగిలిపోయాయని చెప్పాను.కోపంగా నా వంక చూసింది. తలవంచుకున్నాను.

'సరే!జాగ్రత్తగా నా వెనుక కూర్చోండి' అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది...నాకు ఇష్టమైన బాదంపాలు త్రాగించి,అద్దాల షాపు దగ్గరికి వెళ్లి అద్దాలు ఆర్దరు చేసి ఇంటికి బయలుదేరింది కోడలు.


దారి మధ్యలో ఇలా అంది.

'అందుకే మామయ్యా!మిమ్మలి ఎక్కడికీ పంపడం నాకు ఇష్టముండదు...ఆ అద్దాలు కూడా తీసి ఇవ్వలేనంత బిజినా నీ కొడుకు..ఆ పంచ ఎలా ఉందో చూడరా వాళ్ళు. మిమ్మల్నే అనాలి'


పోనిలేమ్మా!ఎవ్వరినీ ఏమి అనకు.'అన్నాను... స్కూటీలో వెళ్తుండగా ' మామయ్యా!జాగ్రత్తగా కూర్చోండి. కావాలంటే నా భుజంపై తల వాల్చుకోండి.' అంది కోడలు.


అన్నదే తడవుగా ఆమె భుజంపై తల వాల్చుకున్నాను.

కుతురిలా చూసుకునే కోడలు భుజంపై తల వాల్చగానే కళ్ళల్లో కన్నీరు...ఇంటికి చేరగానే నా బ్యాగ్ తీసి బట్టలన్నీ తీసింది...ఇలా అడిగింది...

' నిజం చెప్పండి ! మీ బట్టలు మీరే ఉతుక్కుంటున్నారు కదా!'

'లేదమ్మా! వాషింగ్ మెషిన్ లో వేస్తారు..'అన్నాను.

అబద్ధం చెప్పేసి తలవంచుకున్నాను...నన్ను ఒక టీచరులా సీరియస్ గా చూసింది..తలవంచుకున్న నన్ను చూసి పక్కున నవ్వేసింది...

'నా బాధ మీకు అర్థం అవుతోందా.. మిమ్మల్ని చూసుకోలేనంత బిజీగా ఉన్నవారి ఇంటికి మీరు ఎందుకు వెళ్లడం.ఇక్కడ నేను మీ చిన్నకొడుకు సరిగ్గా చూసుకోవడం లేదా చెప్పండి మామయ్యా!' అంది.

కోడలి రెండు చేతుల్లో నా ముఖాన్ని ఉంచి వెక్కి వెక్కి ఏడ్చాను...

'నన్ను పసిబిడ్డలా చూసుకునే నీ దగ్గరికి ఎప్పుడు వస్తానా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తానమ్మా!మరు జన్మ ఉంటే నీకు బిడ్డనై పుట్టాలని ఉంది తల్లీ!' ప్రేమగా నువ్వు చూసుకునే ఈ నెల రోజుల అనుభూతి మిగితా అన్ని నెలలకు సరిపోతుంది...నీ రుణం ఎలా తీర్చుకోను తల్లీ!

ఇలా అన్న నన్ను ప్రేమతో ఓదార్చింది నా కోడలు... కాదు కాదు నా కూతురు...నాకు మరొక దైవం...💐💐💐💐


పెద్దవారు పసిపిల్లలతో సమానం.. వారికి ఆకలి వేసి

అడిగేదాకా చూడకండి...పిల్లలకు ఆకలివేస్తుందని తెలుసుకుని అన్నం పెడతాం కదా !వీరుకూడా అంతే!

పెద్దవారు మనకు మార్గదర్శనం.


.....

👍🙏👌


ఇది నిజంగా రోమాలు 

నిక్క పొడుచుకొనేలా చేసే

నిజ జీవితంలోని 

జరిగిన సంఘటన...


చరిత్రలో నిలిచిన కథ.


 నిజంగా శివుని లీలలు ఎవరికి అర్థం కావు, 


ఈ లీల చాలా కొత్తగా ఉంటుంది. 


ఎందుకు అంటే ఎలాంటి నమ్మకం లేని, 

అసలు హిందూ ధర్మం అంటే సంబంధం లేని 

ఒక బ్రిటిషర్ కి శివుడు కనిపించాడు. 


ఒక క్రైస్తవ మతానికి చెందిన వ్యక్తి కూడా 

పరమ శివుడు కనిపించాడు. 


నిజంగా అద్బుతమైన శివుని లీల ఇది. 


ఈమె భార్యది మరియు ఈయనది నిజంగా అదృష్టమే.


 1879 లో బ్రిటిష్ వాళ్ళు భారత్ ని పరిపాలిస్తున్నప్పుడు,

“ఆఫ్ఘానిస్తాన్ లో జరుగుతున్న యుద్దంలో కల్నల్ మార్టిన్ 

అనే వ్యక్తి ఆర్మీ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు. 


ఆ యుద్దం ఒక రోజు, రెండు రోజులు కాకుండా నెలల తరబడి జరుగుతూనే ఉంది. .


కల్నల్ తన క్షేమ సమాచారాలు ఎప్పటికప్పుడు తన భార్యకి పంపిస్తూ ఉండేవాడు. 


ఆమె పేరు మేరీ. 


ఇలా కొన్ని రోజుల గడువగా ఆమె కి కొన్నాళ్ళకి కల్నల్ నుండి క్షేమ సమాచారాలు అందడం ఆగిపోయింది. 


అప్పటి నుండి ఆమె తీవ్రమైన మనోవేదానికి గురి అయింది. 


ఎప్పుడు భయంతో, భాధతో తనలో తాను కుమిలి పోతూ ఉండేది. 


ఆమె రాత్రి పగల్లు తన భర్త కోసం తపిస్తూ బాధ పడుతూ ఎదురు చూడసాగింది. 


అయితే ఈమె ఒకరోజు గుర్రం మీద బయటకి వచ్చినప్పుడు బైధ్యనాథ్ గుడి పక్కన నుండి వెళ్తూ వేద మంత్రాలు విని, వెంటనే గుర్రం ఆపి గుడి లోపలికి వెళ్లింది. 


అక్కడ పూజారులు 

మహా శివుణ్ణి పూజించడం ఈమె గమనించింది. 


ఆ పూజారులు 

“ఈమె మనసులో ఏదో బాధలో ఉందని” 

గ్రహించి పలకరించారు.


ఆ పూజారులు 

“ఏమైంది తల్లి నీకు అని అడగగనే, 

వెంటనే ఆమె భర్త 

‘కల్నల్ గురించి చెప్పి, 

భర్త నుండి ఇంత వరకు ఎలాంటి సమాచారం లేదని, 

వెంటనే తనకు తాను తెలియకుండానే కన్నీళ్లు పెట్టుకుంది. 


ఆ పూజా రులు ఆమెని ఓదారుస్తూ 


“మహా శివునికి తన భాధని చెప్పుకోమని అన్నారు.


ఆమె గుడిలో 

మహా శివునికి మొక్కీ ఇంటికి వెళ్లింది తర్వాత ఆమె శివున్ని భక్తితో కొలుస్తూ 

“లఘు రుద్ర మంత్ర జపం 11 రోజులు చేసింది. 


భక్తితో ఆరాధిస్తూ ఆమె “తన భర్తని క్షేమంగా తన దగ్గరికి తీసుకు వస్తే, బైధ్యనాథ్ ఆలయాన్ని పునర్నిర్మిస్తానని శివునికి మనసులో కోరుకుంది.


11 రోజుల జపం చేసిన తర్వాత, 

ఆమె కి కల్నల్ నుండి ఒక ఉత్తరం వచ్చింది. 


ఆ ఉత్తరంలో కల్నల్ క్షేమంగా ఉన్నట్లు చెప్పాడు మరియు తను ప్రాణాపాయ స్థితిలో నుండి బయట పడినట్లు చెప్పాడు. 


పతాన్స్ మమ్మల్ని చుట్టూ ముట్టి చంపేయబోయారని, మాకు బ్రతుకు మీద ఇక ఆశ కూడా పోయిందని, 

ఆ సమయంలో మేము తప్పించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని. 


అదే సమయంలో ఒక్కసారిగా అక్కడ 

ఒక భారతదేశపు 

మహా యోగి వెలుగుతూ కనిపించాడని. 


ఆయన పులి చర్మం ధరించి, 

మూడు సూది మొనలతో ఉన్న ఆయుధాన్ని చేతిలో పట్టుకున్నాడని, 

ఇంకా విభూతి కమండలాలతో ఉన్నాడని కల్నల్ ఉత్తరంలో రాశాడు. 


ఆయన శక్తికి, 

తేజస్సుకి పతాన్స్ కూడా వెనుతిరిగి పారిపోయారని కల్నల్ ఉత్తరంలో పేర్కోన్నాడు. 


ఈ యోగి వల్లే మేము విజయం సాధించమని అన్నాడు. 


ఇంకా చెప్తూ ఆయన కంఠం 1000 ఏనుగుల గంభీరం, పొడవైన ఉంగరాల జుట్టు ఉన్నాయని, 

ఆ మహా యోగి కల్నల్ తో మాట్లాడాడని చెప్తూ, 

నీ భార్య నన్ను భక్తితో పూజిస్తోంది ఆమె భక్తికి తృప్తి చెంది నిన్ను కాపాడడానికి వచ్చానని యోగి అన్నారని కల్నల్ ఉత్తరంలో రాశాడు.


కొన్ని వారాల తర్వాత,

కల్నల్ ఇంటికి చేరుకున్నారు. 


తర్వాత కల్నల్ మరియు మేరీ భైద్యనాథ్ గుడిని దర్శించుకున్నారు. 


కల్నల్ గుడిలో ఉన్న 

మహా శివుని రూపం చూసి యుద్ద భూమిలో చూసిన మహా యోగి ఈయనే అని అన్నాడు. 


అప్పటి నుండి కల్నల్ మరియు మేరీ 

“మహా శివునికి” అపార భక్తులు అయ్యారు. 


ఆ తర్వాత బైధ్యనాథ్ గుడిని పునర్నిర్మించారు మరియు వీళ్ళ దగ్గర ఉన్న మొత్తం ధనాన్ని గుడికి ఇచ్చేశారు. 


జన్మ ధన్యం చేసుకున్నారు. 


ఇప్పటికీ బైధ్యానాథ్ గుడి ప్రాంగణంపై వీళ్ళ ఇద్ద రి పేర్లు ఉన్నాయి. 


బ్రిటిష్ వాళ్ళు కట్టిన 

ఒకే ఒక్క గుడి ఇదే. 


ఈ కథ “Hidden Archeology of India ” అనే పుస్తకంలో ఉంది...


👍👏👌


1 comment: