-
ఓం శ్రీ రాం .. శ్రీ మాత్రేనమ: సేకరణ ... రచయత . సంపాదకులు . మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ప్రాంజలి ప్రభ .... ఆనందం .. ఆరోగ్యం ... ఆధ్యాత్మికం .. ఈ ప్రయత్నం . సహకరించినవారికి ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు
అందర్కీ అభినందనలు .. కృతజ్ఞాలు ..
ప్రతి రోజు కధలు చదివి మీరు మీ పిల్లలు ఆరోగ్యవంతులుగా అందరూ దేశంలో శాంతిని కలగాలని న ప్రయత్నం
1. దేవుడు కలలో కనిపిస్తే ఏమౌతుందో తెలుసా?
👉 కష్టమొచ్చినప్పుడు అందరం దేవున్ని తలుచుకుంటాం. మనకు దేవుడు వివిధ రూపాల్లో మార్గాల్లో సహాయం చేస్తాడు. మానన ప్రయత్నం ఉంటే తాను కూడా ఓ చెయ్యి వేస్తాడు. కష్టాల్లో చిక్కుకున్నప్పుడు తప్పకుండా కాపాడతాడు. దేవుడు కలలో కనిపించి మనకు కొన్ని సందేశాలు అందిస్తాడు. మనకు దేవుడు కలలో కనిపిస్తే అది శుభ సూచకం.
👉 మీరు ప్రయత్నాలు చేసి ఏ విషయంలోనైనా నమ్మకాన్ని కోల్పోయుంటే అది నెరవేరబోతోందని అర్థం. మీ పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. మీరు నిర్ణయాన్ని తీసుకోలేక సతమతమవుతుంటే దేవుడు కలలో కనిపించి సందేశం ఇస్తాడు. మీ అంతరంగాన్ని నమ్మండి అని సూచిస్తాడు. మీ అంతరాత్మ ఏది చెబితే అది చేయాలి. దేవుడు కలలో కనిపిస్తే మీపై, మీ కుటుంబంపై దేవుని కరుణా కటాక్షాలు ఉన్నట్లు లెక్క.
👉 మీ సమస్యలన్నీ త్వరలో పరిష్కారమవుతాయని అర్థం. దేవుడు కలలో కనిపించినప్పుడల్లా ఏదో మంచే అని భావిస్తే తప్పు. దేవునికి కోపం వచ్చినప్పుడు కూడా కలలో కనిపిస్తాడు. ఏదైనా మ్రొక్కుబడి తీర్చకపోతే వెంటనే తీర్చమని గుర్తు చేస్తాడు. మీ కర్తవ్యం మీరు నెరవేర్చాల్సి ఉంటుంది.
2. నేటి కవిత : " దేవత యే స్త్రీ " (7)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
పోగొట్టుకొంటిరా - పొగమంచులోనఁ -
ఆనందమయ్యెరా '' సమయమ్ము లోన
కాలమ్ము నీదిరా -- గమనించిచూడు
వేషము వద్దురా -- సరుకంత పొందు
ఓ మనసున్న మగాడా - మది తెలుసుకొమ్మురా
బొదరింటిలోన - నాగవేషణ యెల్ల -
మకురించు వేళ - వేదఘోషలు ఎల్ల
చిగురించి ఉంది - అంటుపెట్టుట వల్ల
సరియైనదంది - మేలుచేయుట వల్ల
ఓ మనసున్న మగాడా - మది తెలుసుకొమ్మురా
సాన పట్టుమురా - సతతము కలవరా -
గాలివీచెనురా - నిరతము సమమురా
నీరుపెట్టుమురా - నయనము తడపరా
మౌనమేలనురా - మనసున మనసురా
ఓ మనసున్న మగాడా - మది తెలుసుకొమ్మురా
సరిగమ అనరా - వేషము వద్దురా -
పదనిస వినరా - మోసము వద్దురా
కలనిజ మగురా - కాలము హద్దురా
వినిమయ మనురా - వేదము పల్కురా
ఓ మనసున్న మగాడా - మది తెలుసుకొమ్మురా
వేగిర రమ్మురా - వెతలు తీరునురా
సాగును నమ్మురా - సమయమీరునురా
తాపసి చూడురా - కధలు చెప్పకురా
ఆకలి తిర్చురా - అలసి పోకుమురా
ఓ మనసున్న మగాడా - మది తెలుసుకొమ్మురా
మగువ మాటలు నమ్మురా - కలిసిబతికేదమురా
ఓ మనసున్న మగాడా - మది తెలుసుకొమ్మురా
మగువ మాటలు నమ్మురా - కలిసిబతికేదమురా
--(())--
--))((--
3. *ఆశీర్వాద మంత్రం:* ప్రాంజలి ప్రభ
*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైఃఃఃఃైైైైైైైైైైై
*ఓషద యస్సం సం వదంతే వదంతే సోమేన సోమేన సహ*
*సహరాజ్ఞారాజ్ఞేతి రాజ్ఞా యస్మై కరోతి కరోతి బ్రాహ్మణః*
*బ్రాహ్మణస్తం తగమ్ రాజన్ రాజన్ పారయామసి పారయా*
*మసీతి పారయామసి బహుగ్వై బహ్వశ్వా యై బహ్వాజావికాయై*
*బహువ్రీహాయవాయై బహు మాష తిలాయై బహు హిరణ్యాయై బహు*
*హస్తికాయై బహు దాస పూరుషాయై రయి మత్యై పుష్టి మత్యై*
*బహు రాయస్పోషాయై రాజాస్తు ఓషధయస్సగ్ం సమోషధయ*
*ఒషధయస్సం సం వదంతే వదంతే సగ్ం సం వదంతే వదంతే*
*సోమేన వదంతే వదంతేసామేన సామేన సహ సహ సోమేన సోమేన*
*సహ సహ రాజ్ఞా రాజ్ఞా సహ సహ రాజ్ఞా రాజ్ఞేతి రాజ్ఞా యస్మై*
*కరోతి కరోతి బ్రాహ్మణః బ్రాహ్మణ స్తం తం బ్రాహ్మణో*
*బ్రాహ్మణస్తం తగమ్ రాజన్ రాజన్ తం తగ్ం రాజన్*
*రాజన్ పారయామసి పారయామసి రాజన్ రాజన్ పారయామసి*
*పారయామసీతి పారయామసి*
*శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్ఠతి.*
*ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు . పుత్రపౌత్రాభివృద్ధిరస్తు. దీర్ఘ సుమంగళీ భవ..*
*నవో నవో భవతి జయమానో హ్నం కేతు రుషసామేత్యగ్రే*
*భాగం దేవేభ్యో విదథా త్యాయ రస్తున్ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః*
*శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం శతసంవత్సరం దీర్ఘమాయుః.*
*శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్ఠతి*
*ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు . యశోవిభవ ప్రాప్తి రస్తు. దీర్ఘ సుమంగళీభవ..*
*ఆశీర్వాదం:*
*****************
4. *నవో భవతి జయమానో హ్నం కేతు రుషసామేత్యగ్రే*
*భాగం దేవేభ్యో విదథా త్యాయ రస్తున్ప్రచంద్రమా స్తిరతి దీర్ఘమాయుః*
*నవో నవో భవతి| నవోనవ ఇతి నవః నవః | భవతి జాయమానః |*
*జాయమానో హ్నాఆమ్ | అహ్నామ్ కేతుః | కేతురుషసా ఆం| ఉషాసామేతి ఎత్యగ్రే ఏ | భాగం దేవేభ్యః| దేవేభ్యోవి |*
*విదథాతి| దధాత్యాయన్ | ఆయన్ప్ర |ఆయన్నిత్యా ఆయన్ | ప్రచంద్రమా ఆహ్ చంద్రమాస్తిరతి | తిరతి దీర్ఘం |*
*దీర్ఘమాయుః | ఆయురిత్యాయుః | నవో నవో భవతి జాయమానో ఇతిపురో ను వాక్యా భావత్యాయురేవాస్మిన్*
*తయా దధాతి యమా ఆదిత్యా అగుమ్ సు మా ఆప్యాయ యంతీతి యాజ్యై వైన మేతయా ఆ ప్యాయయతి |*
*శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్ఠతి..*
*కళ్యాణమస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు . యశోవిభవ ప్రాప్తి రస్తు...*
*దీర్ఘ సుమంగళీ భవ.*
*శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః.*
*ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు . యశోవిభవ ప్రాప్తి రస్తు...*
*కళ్యాణమస్తు. ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు . యశోవిభవ ప్రాప్తి రస్తు...*
*దీర్ఘ సుమంగళీ భవ..*
**********************
*ఈ శ్లోకం మహాకవి కాళీదాసు విరచిత 'రఘువంశం' లోనిది . ఇది ఇందుమతిని సంభోదిస్తూ సునంద అనే చెలికత్తె స్వయంవర సమయం లో చెబుతుంది.*
*ఇదీ ఆ శ్లోకము:*
*******************
5. *కులేన కాంత్యా వయసా నవేన*
*గుణైశ్చ తై స్తై ర్వినయం ప్రధానైః*
*త్వమాత్మనస్తుల్య మముం వృణీష్వ*
*రత్నం సమాగచ్ఛతి కాంచనేన.*
*భావము :*
కులము రూపము నవయౌవ్వనము వినయము మొదలగు,
నీతో సమానమైన శ్రేష్ట గుణములు కలిగిన ఈ రాజును వరించుము.
బంగారులో రత్నమును పొదిగినట్లుండును.
*-- .*
06. *షోడశ దానాలు:*
*దానాలన్నిటిలో ముఖ్యమైనవి షోడశదానాలు, అవి వరుసగా....*
*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైఃఃఃఃైైైైైైైైైైైై
*(1) కన్యా దానం = దీనివల్ల బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది.*
*(2) సువర్ణ దానం = దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.*
*(3) దాసీజనం దానం = దీనివల్ల ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుంది.*
*(4) వాహన దానం = దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.*
*(5) అశ్వ దానం = దీనివల్ల గంధర్వలోక ప్రాప్తి కలుగుతుంది.*
*(6) గజ (ఏనుగు) దానం = దీనివల్ల శివలోక ప్రాప్తి కలుగుతుంది.*
*(7) గ్రుహ దానం = తీనివల్ల విష్ణులోకం ప్రాప్తి కలుగుతుంది.*
*(8) నాగలి దానం = దీనివల్ల క్రుష్ణ ప్రీతి కలుగుతుంది.*
*(9) కాలపురుష దానం = దీనివల్ల కోరికల సిద్ధి కలుగుతుంది.*
*(10) కాలచక్ర ప్రతిమ = దీనివల్ల ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది.*
*(11) భూ దానం = దీనివల్ల శివలోకం నివాసం కలుగుతుంది.*
*(12) మేక దానం = దీనివల్ల శివ ప్రీతి కలుగుతుంది.*
*(13) వ్రుషభ దానం = దీనివల్ల మ్రుత్యుంజయం కలుగుతుంది.*
*(14) పాన్పు దానం = దీనివల్ల గోలోక ప్రాప్తి కలుగుతుంది.*
*(15) గో దానం = దీనివల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది.*
*(16) నువ్వురాశి దానం = దీనివల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది.*
*-- మల్లాప్రగడ*
007. 🙏 శివలింగ తత్వం 🙏
🍃🌼మనం పూజించే శివలింగంయొక్క తత్త్వం ఏ కొద్దిపాటి తెలుసుకుని అర్చించినా అమోఘమైన ఫలితాలు ఉంటాయి.
🍃🌼బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వ్రాసిన శివలింగ తత్త్వంలోని కొన్ని విశేషాలు శివఙ్ఞానం అనే పుస్తకమునుండి.........
🍃🌼సృష్టి స్థితి లయలను నిర్వహించే పరమేశ్వర చైతన్యాన్ని బహు విధాలుగా భావించి, అర్చించి అనుగ్రహ బలాన్ని పొందే విధానాలను వేదాది శాస్త్రాల ద్వారా మన సనాతన ధర్మం విస్తృతంగా సాధించింది. అందులో శివలింగారాధన ఒకటి.
🍃🌼లింగ 'శబ్దానికి అద్భుత శాస్త్రార్థాలున్నాయి. స్థూలంగా ఆరాధనలో లింగం అనే మాటకు మూర్తి అని అర్థం చెప్పవచ్చు. మనం కంటితో చూడలేని భగవంతుని ఏదో ఒక బింబంగా గ్రహించి, శాస్త్ర పద్ధతుల ద్వారా ప్రతిష్ఠ,ఆవాహన వంటి ప్రక్రియలతో ఆరాధించడం సంప్రదాయం. అలా అరాధింపబడే బింబాన్ని లింగం అనడం శాస్త్రార్థం.
🍃🌼పాండురంగని విగ్రహాన్ని స్తుతిస్తూ పరబ్రహ్మ లింగం భజే పాండురంగం" అని కీర్తించారు ఆది శంకరులు. విష్ణు విగ్రహాన్ని పరబ్రహ్మ లింగం అనడం గమనించాల్సిన విషయం. ఇలాగే సాలగ్రామ శిలని విష్ణు లింగంగా, నర్మద బాణశిల శివలింగంగా, శోణశిల గణేశలింగంగా,సువర్ణముఖీ నదిలో లభించే ధాతువు/శ్రీ చక్రం శక్తి లింగంగా భావించవచ్చు.
🍃🌼అయితే శివునికి ప్రత్యేకించి శివలింగం అని, ప్రతి ఆలయంలోనూ లింగారాధనగా..విగ్రహాలు కాకుండా.. పూజించడంలో ప్రత్యేకత ఏమిటి?
🍃🌼దీని గురించి శివ పురాణాదులలో, శైవాగమాలలో వివరణ ఉంది. వాటిని మాత్రమే గ్రహించాలి. కొన్ని శివేతర గ్రంథాలలో జొప్పించిన కల్పనలను గ్రహించి, హైందవ ద్వేషులు వాటిని ప్రచారం చేయడం శోచనీయం.
🍃🌼అలాంటి అవాకులూ, చెవాకులు వల్ల విదేశీ కుతూహలశీలురు శివలింగం గురించి నీచాభిప్రాయాలని వెలిబుచ్చారు కూడా. కానీ ఆ రోజుల్లో స్వామీ వివేకానంద దానికి గట్టి సమాధానమిచ్చారు. యఙ్ఞంలో యూపస్తంభమే శివ లింగంగా భావించవచ్చు... అని చెప్పడం వారి సమాధానాలలో ఒకటి. మన శాస్త్రాల హృదయం ప్రకారం శివలింగ తత్త్వమేమిటో శోధిస్తే ఆశ్చర్యకరమైన మహా విఙ్ఞానాంశాలు గోచరిస్తున్నాయి.
🍃🌼లీనం చేసుకునేదే లింగం: చరాచర జగతి ఎవరియందు కలిగి, పెరిగి, తిరిగి లీనమవుతుందో అదే లింగం. ఆ లీనం వల్లనే సృష్టికి శక్తి, ఉనికి, మనుగడ లభిస్తున్నాయి.
🍃🌼ఆ ఈశ్వరుడు ఆకారాది రహితునిగా భావిస్తూ, ఒక సంకేతంగా గ్రహిస్తే.. ఆద్యంతరహితమైన జ్యోతి స్వరూపానికి ప్రతీకయే లింగం. అందుకే జ్యోతిర్లింగం అన్నారు.
🍃🌼మనలోని ఐదు ఙ్ఞానేంద్రియాలూ, ఐదు కర్మేంద్రియాలు,మనస్సు, జీవుడు.. వెరసి పన్నెండు స్థానాలలో ఒకే ఈశ్వర చైతన్యం ఉన్నది. ఆ ఈశ్వర జ్యోతియే ఆ పన్నెండు చోట్ల ఉన్నదనే ఎరుకయే .. పన్నెండు జ్యోతిర్లింగాలను మనలో దర్శించడం. అప్పుడు మన అణువణువూ శివమయమనే భావన నిలచి శివోహ ' మనే సత్యాన్ని స్థిర పరచుకోగలం.
🍃🌼యోగపరంగా..దేహంలోని మూలాధారం నుండి,సహస్రారం వరకు ఉన్న సుషుమ్నా నాడిలోని శక్తి ప్రవాహం ఒక కాంతిమయ స్తంభంగా దర్శిస్తే అదే అగ్నిమయమైన శివలింగంగా గ్రహించగలం. ఇదే శ్రీ చక్రంలోని బిందు స్థానం. ఈ బిందువునే పైకి లాగినట్లు ఒక నిలువు గీత (స్తంభాకృతి)గా సాగుతుంది. అదే శివుడు ప్రథమంగా అగ్నిస్తంభాకృతి కలిగిన లింగంగా వ్యక్తమయ్యాడనే పురాణ కథలోని దర్శనం.
🍃🌼ఒక దీపజ్యోతిని వెలిగించితే, అది అన్ని దిక్కుల కాంతిని ప్రసరిస్తున్న లింగాకృతిగానే దర్శనమిస్తుంది. అదే ఆకారాతీతమైన చైతన్య జ్యోతిర్లింగం
🍃🌼యోగపరంగా..దేహంలోని మూలాధారం నుండి,సహస్రారం వరకు ఉన్న సుషుమ్నా నాడిలోని శక్తి ప్రవాహం ఒక కాంతిమయ స్తంభంగా దర్శిస్తే అదే అగ్నిమయమైన శివలింగంగా గ్రహించగలం. ఇదే శ్రీ చక్రంలోని బిందు స్థానం. ఈ బిందువునే పైకి లాగినట్లు ఒక నిలువు గీత (స్తంభాకృతి)గా సాగుతుంది. అదే శివుడు ప్రథమంగా అగ్నిస్తంభాకృతి కలిగిన లింగంగా వ్యక్తమయ్యాడనే పురాణ కథలోని దర్శనం.
🍃🌼లోకం లింగాత్మకం ఙ్ఞాత్వా అర్చయేత్ శివలింగకం' అని ఆగమం చెప్పింది. లోకమంతా లింగాత్మకమని తెలిసి శివలింగారాధన చేయాలి ' అని తాత్పర్యం. లింగ గర్భం జగత్సర్వం.. జగమంతా లింగంలోనే ఉంది.
🍃🌼విచిత్రమేమిటంటే..కొద్ది ఏళ్ళ క్రితం విదేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థలు ఈ సమస్త విశ్వానికి సంబంధించి ఉపగ్రహాల సహాయంతో గ్రహించిన విఙ్ఞానాన్ని అనుసరించి ఒక చిత్రాన్ని ఆవిష్కరించారు.
🍃🌼అద్భుతం..అది మన వేద విఙ్ఞానం వర్ణించినట్లు ఒక గోళా(అండా)కృతిలో ఉన్న కాంతిపుంజ మధ్యంలో సమస్త గ్రహ నక్షత్రాదులన్నీ ఇమిడి ఉన్నాయి. ఈ దృశ్యాన్ని యుగాల క్రితం తపశ్శక్తితో గ్రహించి, లింగాకృతిని సంభావించి, విశ్వచైతన్య శక్తితో వ్యక్తి చైతన్యాన్ని అనుసంధానించే ప్రక్రియను లింగార్చనగా, లింగ ధ్యానంగా ఆవిష్కరించిన మన మహర్షుల పాదాలకు నమస్కారములు.
💫🌹💫🌹💫🌹💫🌹💫🌹💫🌹
0988. ఓం నమఃశివాయ.
శుభోదయం ఆండీ
ఎంతో సుందరమైన దేదీప్యమాన కాంతిమయ శ్రీ శివ కుటుంబ చిత్రం. అనేకానేక అభినందనలండీ....
స్వర్ణ,మణిమయ దివ్య,భవ్య సింహాసనారూఢులైన బంగారు కళలొలుకు భవుని కుటుంబమును వీక్షింప సదా వేడుకౌను...
భవభయహరు సాంబశివుడు,అంబ, గణేశుడు, సుబ్రహ్మణ్యేశ్వరుండు బాలురై తలిదండ్రుల ఒడిలోన
ఒద్దికగా ముద్దులొలుక బంగారు ఆభరణాల ధగధగలు జూడకనులు పండుగౌను దివ్యాయుధముల కేల గైకొని యుండ దుష్టుల గుండెలదురు అందాల కన్నుల సుప్రసన్న దృక్కులు సాధుజనులకు అభయమిచ్చు వారి వాహనములౌ నంది, మూషికము, నెమలి పాదముల చెంత చేరగ భక్తి మీర
వాటి మనికి పావనమ్మె దివ్య మండపాన మెరసెనదియె దివ్య దీధితుల స్వర్ణ తోరణమ్ము
చిత్ర యోగ,మంత్ర యోగ దష్ట్రలై నిలిచిరి గురువర్య తమరు కుంచెను దివ్య హస్తాల బట్టి
చిత్ర గురు బ్రహ్మ గాను ధన్యులండీ మీరు బహువిధములౌ ప్రజ్ఞల తోడ...
మీదు స్నేహాన నేనును ధన్యుడనైతి అభినందనశతము గురువర్యా కళాశ్రీ కేశవా.... సదా వందనములు...
రచన.. వేపా. పార్వతీశం హైదరాబాద్
--(())--
09. ఉదయ సమ్మౌహనం
సమ్మోహనాలు..
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
నేను చీకటి చేరి
చేరి వెలుగుకు దారి
చీకటి వెలుగుల మధ్యన బతుకు మోహనా
తూర్పు పడమర ఎదురు
ఎదురు అయిన కలవరు
కలవని స్నేహముగా తలచేను మోహనా
విడ్డూరమే ఆశ
ఆశ ఒక నిరాశ
ఆశ నిరాశల మధ్య పాశము మోహనా
లోభమే రోగమై
రోగము పాపమై
పాప రోగాలు వల్లన బతికె మోహనా
కళలతో న సేద్యము
సేద్యము నైవేద్యము
నైవేద్యము తో జీవితమ్ము గ మోహనా
కష్టాల మధ్య నా
మధ్య నష్టమైనా
నష్ట కష్టము మనిషిలో మార్పు మోహనా
మనిషి మనిషికి అండ
అండ దేవుని కొండ
కొండంత అండ గా దైవమ్ము మోహనా
త్యాగ బుధ్ధి ఉంచూ
ఉంచి మాట పంచూ
మాటలు పంచుతూ త్యాగ బుద్ధి మోహనా
దాహంతో దేహము
దేహంలో తాపము
తాపము కళ్ళను కప్పె మోహము మోహనా
మిన్ను రంగులు మార్చు
మార్చు కన్నులు తీర్చు
మిన్ను కన్నులె చూ
డు మనుషుల్ని మోహనా
--+((())--+
నేటి తేటగీతి పద్యాలు
ఒక్క సారిగా కురిసింది వాన నాలొ
మక్కు వంతయు చూపాను అప్పు డపుడు
నక్క బుద్ధియు చూపక ఉన్న నేను
కుక్క బుద్దిగా విశ్వాస ముంచి ఉన్న
నా మనసున ఎడారిగా మారి ఉన్న
మొక్క నాటాలని ప్రయత్నమును చేసి
యున్న నేనెప్పు డొస్తానినియుఎ దురును
చూస్తు విశ్వాస ప్రేమను చూపియున్న
వెన్నెలలొ కంటి కానరా నిదియు మనసు
స్థిరము గానుండ కయు బాధ పెంచు తలపు
నాకు ఆశ్చర్యము ను కలు గేను ఎందు
వల్ల నో మరి అంతరార్దమును తెలిపె
సేద తీరుమార్గముల ను వెతుకు చుంటి
కాల నిర్ణయ మన్నన తోను ఉంటి
మౌన మంతయు సానుకూ లముగ ఉండి
ప్రేమ బతికియు బతికించు మార్గ ముండె
అంత రంగమున తరంగ ములుగ ఉండె
ఏదొ అపశృతి వెంటాడి కదులు చుండెఁ
నాకు మాత్రము తెలిసిన ప్రేమ పంచి
జీవితమునకు ఆధార మవ్వ కలిగె
--(()0--
chadivi sha cheyyandi ...
No comments:
Post a Comment