గోదాదేవి పూల దండ ధరించి మనసులో ప్రార్ధించింది
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
అనురాగం రంగరించి ఆత్మీయత చూపిస్తా
నయగారం కుమ్మరించి నటనలన్నీ చూపిస్తా
మనసారా నిను వరించి కోరి అన్ని చూపిస్తా
విరహాగ్నిని నే భరించి ఉన్న దానినే కృష్ణా
అంగాంగం సిద్ధపరిచాను కనువిందు చేస్తా
శృంగార రససృష్టికి మనసే నీకు చూపిస్తా
భక్ష్యమే నా చుబుకాన్ని నీ కొఱుకు అందిస్తా
భోజ్యమే నా అధరం నములు మెత్తగ కృష్ణా
చోష్యమే చెవితమ్మెలు చప్పరించు అందిస్తా
లేహ్యమే మెడవంపు నొల్లు రంజిల్ల అందిస్తా
పయోధర పానీయం ప్రాశిల్లు మత్తు ఇస్తా
హృదయాన్ని నీకొరకు ఆర్పించేందుకే కృష్ణా
అణువణువును స్పృశించు తమకంగా సంతోషిస్తా
కంపించగ మేనుమీటి పలికించు విశ్వసిస్తా
అత్తరునే మించు స్వేదమాఘ్రాణించు మైకమిస్తా
రెప్పార్పక తిలకించు మదన కోరికతో కృష్ణా
కలువని కనికరం చూపించు నీకు సహకరిస్తా
బిగువులో ఉన్న పట్టును నీకు తెలియపరుస్తా
మొహమాటం లేదు నాకు నీకే కాయం అర్పిస్తా
తప్పయిన ఒప్పైనా నిన్నే ప్రేమిస్తాను కృష్ణా
అందమైన మోముకు అందాన్ని చూపిస్తా
క్షణక్షణం నీకొరకు చూస్తూ నిద్రనే ఆపేస్తా
నిజమో అబద్ధమో నాకుతెలియదు పిలుస్తా
కలవరింతగా ఉంది కొంత సమయముంచు కృష్ణా
--(())--
శ్రీ కృష్ణా నీవే మాకు దిక్కు
నాహృదయం నీకే అర్పిస్తున్నా కృష్ణా
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
పరుగులు తీసే హృదయం కల్పించావా కృష్ణా
ఈ లోక రోగాన్ని తగ్గించే గుణం ఉందా కృష్ణా
కాయం కష్టం తప్పదు లోక మాయని మార్చు కృష్ణా
ప్రేమ ఉప్పెనలా ఉంది మార్చుకోలేములే కృష్ణా
నీ హృదయం తెలియదులే మనసు మార్చలేములె కృష్ణా
నా హృదయం మరువదులే నిను కోరుట మారదు కృష్ణా
ఈ ప్రేమచెరగదులే ప్రేమిస్తూ ఉంటాను కృష్ణా
ఎన్ని జన్మలైన నీ ప్రేమ కొరకు ఉంటాను కృష్ణా
నీతోనే సహవాసం నేను మరువలేనులె కృష్ణా
నీతోనే వనవాసం చేయమన్న వచ్చెద కృష్ణా
నువ్వుంటే మధుమాసం ఎప్పుడు నీతోనే కృష్ణా
ప్రేమ ప్రేమకే బానిసని విన్న నేనీ బానిస కృష్ణా
కష్టాలు కోరికలు కడతేర్చు తరుణమదేను కృష్ణా
నీదర్శనము మాకు నిత్య సంతృప్తి నిచ్చును కృష్ణా
మధురమూర్తికి మధురగానంగా పాడుతున్నా కృష్ణా
పుణ్యమును పంచు పుణ్య మూర్తిగ కాపాడుమా కృష్ణ
******
*2020!!*
ఇదే ఈసంవత్సరప్రగతి జగతి ముగిసింది
*ఇరవై ఇరవై* ఇకముగిసింది
*కరోనా పరమై* బాధల్లో ముంచింది
*మనశ్శాంతి కరువై* భయాన్ని నింపింది
*చుట్టాలే దూరమై* రాకుండా చేసింది
*కాలక్షేపమే భారమై* ఇంటిలో పనైంది
*సోమరితనం దగ్గరై* బద్ధకం పెరిగింది
*ఆదాయం ఆవిరై* ఆలోచనపెంచింది
*చింతలన్నీ చేరువై* చిక్కులు పెంచింది
*మమతలన్నీ మాయమై* భనసే మింగింది
*తనువు చిక్కి శల్యమై* సగమైనది
*పండుగలు దండగై* ఖర్చు తగ్గింది
*లోకమంతా చీకటై* వెలగు ఇమ్మంది
*కన్నీరు కాల్వలై* భారమైనది
*అయినవాళ్ళే కానివారై* ఏడుపై ఉన్నది
*కాలమే గాలమై* వెంబడించింది
*శాపమే శూలమై* చదువుకు పోటు పొడిచింది
*ప్రకృతే వికృతై* ఎక్కిరించింది
*మరణమే శరణమై* గతౌ తున్నది
*రొదచేస్తూ సుధలు మరిపించి*
*వ్యథను పరిచయం చేసింది*
*ఇరవై ఇరవైలో మనతో కరోనా*
*
కొత్త సంవత్సరం అంతా శ్రమకు తగ్గ ఫలితం ఉంటుందని ఆశీద్దాం
కొత్త సంవత్సరం అంతా శుభాలే ఆశిద్దాం అందుకే ముందుగా నూతనసంవత్సర శుభాకాంక్షలు ప్రాంజలిప్రభ అంతర్జాలపత్రిక తెలియచేస్తున్నది.
మీవిధేయుడు. మల్లాప్రగడ రామకృష్ణ
******
అన్నమయ్య ఆ బాలాజిని కొలిచి చరితార్థుడైనాడు
ఒక్కసారి మనం తలచి ఆ దేవుని కృపకు పాత్రులవుదాము
సమ్మోహాలు ..941 -950
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ :
మనసు నిండా భక్తి
భక్తి ఇచ్చును శక్తి
శక్తితో నిత్యమూ ప్రార్ధనా బాలాజీ
నీ వక్కడ ఉంటివి
ఉంటివి మహిమంటివి
మహిమతోనే కాపాడుతున్న బాలాజి
కాలము ఏది అయిన
అయిన సమయమందున
సమయంలో నిన్ను కీర్తిస్తా బాలాజీ
ఏడు కొండలు ఎక్కి
ఎక్కి పాడుతు చిక్కి
చిక్కి జీవితచరితార్ధమవును బాలాజి
ఆనంద శరణమ్ము
శరణమ్ము భాగ్యమ్ము
భాగ్యమ్ము నీ చక్షవులతోను బాలాజి
మెట్టి నింటికి నీవు
నీవు కరుణించావు
కరుణా కఠాక్షాన్ని అందించు బాలాజి
పూర్వపు నోము ఫలము
ఫలము వద్దు క్షణము
క్షణక్షణము నీధ్యాసయేను బాలాజి
పూర్వజన్మ సుకృతము
సుకృతము నీ ఫలితము
ఫలితము కోరని దాసుని గాంచు బాలాజి
తలుపులను తెరవవా
తెరచి మన్నించవా
మన్నించుము తప్పులన్నింటిని బాలాజి
నీదరి చేర లేను
చేరిన చూడలేను
చూడాలని ఉంది దారి చూపు బాలాజి
సమ్మోహనాలు....931....940
మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
పరుగు ప్రాయం ఏక
ఏక నటన తొ తికమక
తికమక గ మోదలు నటి సావిత,,లో,*త్రి ఈశ్వరా సాగు
అందం ఆకర్షణ
ఆకర్షణ పోషణ
పోషణలో ప్రేమ వరదగుండె ఈశ్వరా
చలిలో వెచ్చ దనం
వెచ్చని కులుకు మయం
కులుకు ల రాణిగా దేవతగా ఈశ్వరా
ప్రేమ వలలొ చిక్కి
చిక్కి కాముడి దక్కి
దక్కి సంపదలతొ వన్నె లెక్కె ఈశ్వరా
ఆస్తి కప్పంరంబై
కర్పూర జీవమై
జీవిగా వైరాగ్యం పరుగులు ఈశ్వరా
అప్పు లన్ని పెరిగే
పెరిగి మనసు కరిగే
కరిగిన మనసు త్రాగుడు బానిస ఈశ్వరా
ఆమె బతుకు పువ్వులు
పువ్వు నలుపు నవ్వులు
నవ్వుల మధ్య నటన చిరు నవ్వు ఈశ్వరా
కళలు కల్ల లాయే
లయల కాయమాయే
కాయం రోగానికి చిక్కేను ఈశ్వరా
మాతృ దేవత గాను
దేవత కళలు గాను
కళలు కళ్ళు చూపులకే ఉన్న ఈశ్వరా
దేవదాసు చెంతకు
చెంతకు చివరి బతుకు
బతుకు స్వర్గం నరకము మారే ఈశ్వరా
మిస్సమ్మ దేవతై
దేవత హృదయ మతై
మతైన మగువ చరిత్ర ధరిత్రి ఈశ్వరా
..................
శ్రీ కృష్ణ లీలలు వర్ణించుట ఎవరితరము
అత్యానుప్రాస శ్రీకృష్ణ లీల పద్యాలు
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ , రంగారెడ్డి
ఆశ్చర్యకర చేష్టల మణిపూస దివ్యానందహేల
మధురా నిర్వాకులు మనో నేత్రుని మనసున లీల
భగవత్ సంబంధము కల ఆరాధ్యులు కలయులీల
యమునా నదీ జలాలలో కన్యల జలకాల లీల
నవనీత చోరుడు గోపకులకు పుణ్యమిచ్చు లీల
అవని అవతరించి అలరించె దివ్యానంద హేల
మేలు మాటతో బతుకులకు ధారిగా శ్రీ కృష్ణ లీల
కాలము చేయు మేలు అని చాటి చెప్పిన కృష్ణ లీల
వేణుగానలోలుడు గోపీజన మానస చోరుని లీల
ఫణిరాజ శయనుడు మణిమయ భూషణుని లీల
దీనజన పాలుడు మాధవుడు దయామయుని లీల
జ్ఞాన మార్గ బోధకుడు మహదానంద జనక లీల
యమునా నదీ విహారి సర్వుల రక్షణ మౌన లీల
నదీ తీర సంచారి హృదయాలు దోచే మధుర లీల
యాదవ కులము నందు సర్వ శ్రేష్ఠులతో స్నేహలీల
పుట్టిన వాడే శౌరిగా మార్చే మహిమాన్వితునిలీల
గోప వంశమున మెరిసెను భయ రక్కసుల లీల
దీపమై ప్రకాశించెను కృష్ణ సంహరించు శక్తిలీల
యశోదమ్మ గర్భమున శక్తి తో ఉన్న బిడ్డల లీల
తను ప్రకాశింప జేసె హృదయతాపం తగ్గించు లీల
చిన్ని బాలుడు ఎన్ని మహిమలు చేసెనో మౌనలీల
చన్నొసగిన పూతన ప్రాణము హరించె ఆటలీల
కన్నుల విశ్వము జూప మన్నుదినె మాధవుని లీల
ప్రమాదములన్ని మలచె ప్రమోదముగ జేయు లీల
కాళిందీ తీరాన కాళీయ సర్పాన్ని లొంగదీయు లీల
గొల్లభామల కేళీ వినోదాల మధ్యన కృష్ణ లీల
తాడుచే కట్టబడెన రోలు లాగి మోక్షమిచ్చు లీల
దామోదరుదన బడె శ్రీకృష్ణ భవవానుని లీల
పుష్పములతో పూజించిన చాలును శక్తినిచ్చు లీల
పదములతోటి కీర్తించిన చాలు శాంతి నిచ్చు లీల
శ్రీకృష్ణుని మనసార ధ్యానించిన ధైర్యమిచ్చు లీల
గత జన్మ పాపాలన్ని భక్తితో తొలగించేటి లీల
నిప్పున పడ్డ దూది వలె పాపాలు నశింప లీల
వ్రతమును ఆచరించిన మోక్షము కల్పించేటి లీల
పూర్వ పాపరాశంత తొలగించేటి గోదా వ్రత లీల
ఉదర మందున్న జగముల చెదరనీయని లీల
యదునందనుడు నందయశోదానందునిసుత లీల
మునిజన హృదయానంద మూలకందుని లీల
మనమోహనుడు నీలగగన ఘనశ్యాముని లీల
జ్ఞానమిచ్చు నాచార్యుడు దారిచూపు నాచార్యుని లీల
తననే విశ్వసిస్తే తరింప జేయు సద్గురుని లీల
జనన మరణములు లేనట్టి స్వసంకల్పుని లీల
కర్మాను సారముగా ధర్మోద్దరణ చేయు కృష్ణ లీల
దుష్ట శిక్షణార్థమై శిష్టులను రక్షణార్థుని లీల
--(())--
సమ్మోహనాలు 921.....930
ఎప్పుడైన మేమే
మేమే రైతులమే
రైతులగ సర్వుల ఆకలితీర్చు ఈశ్వరా
పుడమి తల్లి ఆశలు
ఆశలు తీర్చు రైతులు
రైతులుగా సృష్టి విధాతలే ఈశ్వరా
పొలమంత దున్నీ
దున్నాక జలాన్నీ
జలములో నారు పోసియు కదిలె ఈశ్వరా
కలుపు మోక్కలు తీసి
తీసి ఎరువులు వేసి
వేసి పంటకు రక్షించ రైతు ఈశ్వరా
చేనుకు పురుగు పడ్తె
పడ్తె పంటలు చెడ్తె
చెడ్తె కుటుంబ మంత బాధలే.ఈశ్వరా
గిట్టు బాటు.ధరలు
ధరలు.లేక బాధలు
బాధల తో బతుకు దుర్భరమే ఈశ్వరా
ఎంత ఎండ వచ్చిన
వచ్చిన వాన పట్టిన
పట్టిన రాత్రిపగలు కష్టమే ఈశ్వరా
వడ్లు అన్ని మరేసి
మరతొ బియ్యం చేసి
చేసి ఇంటికి చేర్చె కష్టమే ఈశ్వరా
అన్నం పెట్టె అన్న
అన్న మన రైతన్న
రైతన్న దేశముకు వెన్నెముక ఈశ్వరా
కన్న తల్లి చూచే
చూచె తండ్రి కాచే
కాచే బిడ్డలతో రైతుగా ఈశ్వరా
***(())***
నేటి అంత్యప్రాస పద్యాలు. కృష్ణ మాయ
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
వేద మంత్రముల పఠనాలు
భగవాన్ భక్తితొ గీతాలు
సాత్వికమై లోక వృత్తులు
నిత్య దైవిక భావ కృతులు
శ్రేష్టులే కార్యక్రమ దీక్షలు
రాసలీల మైకం గోపికలు
బాలుర కేళీ విన్యాసాలు
నిత్యము గృహిణుల మేలుకొలుపులు
కిలకిలారావాలు ఒకవైపు
కీచు కీచు ధ్వనులు మరొ వైపు
మేలుకొలుపు లెమ్ము సఖుల వైపు
గోపాలని కొలుచె మరో మలుపు
అశ్వ రూపంలో వచ్చె రక్కసి
ఎద్దు రూపంలో వచ్చె రక్కసి
బండి రూపంలో వచ్చె రక్కసి
రక్కసులను కృష్ణుడు కాలరాసి
కళ కళలాడే ముఖారవిందం
అందరికి కలిగించు ఆనందం
పడచులతోనే ప్రేమానందం
సర్వులు పొందు తన్మయానందం
తనివి తీరా నోరార కృష్ణా
మనసు పిలిచె ఆశతో కృష్ణా
హృదయమ్ము శబ్దమ్ముగా కృష్ణా
వెలుగు నందించుము మాకు కృష్ణా
కీచురాళ్ళ మోన వ్రతం లో
కోయిల గొంతులే మౌనంలో
నా గుండె చప్పుడు మౌనంలో
కృష్ణ లీల చేయు మౌనంలో
గోమాతల సేవలలో గోపాలులు
కోడె దూడల విన్యాస వినయ హొయలు
ప్రకృతి ఆకృతి మధుర ప్రశాంత స్థితులు
బ్రహ్మ శిష్యులతో వ్యాకరణ వల్లెలు --(())--
సమ్మోహాలు ... వృద్ధుడు ( 911 -920 )
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
పట్టు వీడని వారు
వారు మేధస్సు వారు
వారు వృద్ధులే అయిన బుద్దులు ఈశ్వరా
ముదిమి వయస్సు లోన
లోన ధైర్యముతోన
ధైర్యము వారికి ఆరోపణమే ఈశ్వరా
వృధ్ధాప్యంలొ భార్య
భార్యయే ఔదార్య
ఔదార్య సాఫల్యంతొ జీవి ఈశ్వరా
వృధ్ధొప్యంలొ జోడు
జోడు తొ ఉండు తోడు
తోడుగ శ్రీమతి సహకారమే ఈశ్వరా
ఆరోగ్యం కూడా
కూడా చెడకుండా
చెడకుండా తగు జాగర్తలే ఈశ్వరా
పుత్రుల నిరాదరణ
నిరాదరణ పోషణ
పోషణ కరవైన ధైర్యమ్ముయె ఈశ్వరా
స్వశక్తి తోను తిరుగు
తిరుగి హృదయము కరుగు
కరిగినమనసు తో ఆదు కొనెను ఈశ్వరా
బిడ్డలకు పెద్దగా
పెద్ద ఆసక్తిగా
ఆసక్తి తో మేధస్సు పంచెను ఈశ్వరా
అనుభవాల కధలే
కధలె జీవితాలులే
జీవితం ముగింపు వృద్ధాప్యము ఈశ్వరా
చేతి కర్రే కాలు
కాలు చేయును మేలు
మేలు మాటతో బతుకు ధారియె ఈశ్వరా
శ్రీకృష్ణుడు భామలచేంత ఆట
సమ్మోహాలు .. 901 --910
లలన చూపుము కరుణ
కరుణ జరుగు పోషణ
పోషణతొ మన మధ్య సఖ్యతే మానసా
కలువ కళలు తీర్చు
తీర్చి తరుణము మార్చు
మార్చియు వయసుని వేదించకే మానసా
మగువ మదిలో మాయ
మాయ అదియును మోయ
మోయలేను హృదయానికి బరువు మానసా
చిలక పలుకుల మొలక
మొలక చూపకు అలక
అలకలతో సమయ వ్యర్ధముయే మానసా
చలితరుము తున్నదే
ఉన్నది సెగ ఏదే
సెగలాగ చుట్టుకోవే ఇపుడు మనసా
గలగల పాకు నీరు
నీరు సంద్రం చేరు
చేరు నట్లు నీవు కూడ చేరు మానసా
అలక వైనం వద్దు
వద్దు ఇవ్వుము ముద్దు
ముద్దులో మహిమాన్వితము ఉండు మానసా
కులుకు లన్ని చూపుము
చూపి మనసు చేరుము
చేరుము సలపరింత తగ్గునే మానసా
తలపుల తెలివి వాణి
వాణి హాయిగ రాణి
రాణివై సర్వము నీసొంతము మానసా
కలయిక కాల మిదియు
యిదియే మనసు నిధియు
నిధిని ఎవరు వదలలేరు కదా మానసా
--(())--

నేటి కవిత ..
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నీ మస్తకంలో ఉన్న మహత్తును
మహిమాన్వితమైన జగత్ విషయాలను
వ్రాసి మందమతులను, ఉత్తెజులుగాను
ఉద్దండ పండితులుగా మార్చాలి ఎలా ?
అలా ఇలా అనుకోవటం అనవసరము
కంటితో చూసినది బుద్ధికి పదును పెట్టడము
బుద్ధిహీనులకు బుద్ధి చెప్పడమే కవిత్వము
కవిత్వం వ్రాతపూర్వకంగా ఉంటె అర్ధం కానివరికి ఎలా ?
కళ్ళతో అమాయకుల ఆక్రందనలు చూడాలి
ఆదుకొనే శక్తి పరుల ప్రోస్చాహంతో బ్రతికించాలి
ఆశయ సాధన లేని రాజకీయాలను వదలాలి
పకృతి సౌందర్యాన్ని ఆస్వాదించి మంచిని పంచాలి ఎలా?
హృదయంతరము లోని భావాలను ఉప్పెనలా
సందర్భోచిత పరిష్కారాలను పెను తుఫానులా
దుష్టచతుష్టయాలను ఎదుర్కోవాలి ప్రభంజనంలా
అస్తవ్యస్త సమాజానికి కవిగా చేయూత నివ్వాలి ఎలా ?
--((*))-
ఎన్ని వీణల్లో - హృదయమ్ములో
నాయకుని కి ఉండాల్సిన లక్షణాలు
నాయక గతాన్ని వదిలేసి నటన వద్దు
నాయక నేర్చుకో ప్రజలలొ నిపుణతంత
నాయక మనసు విషయాన్ని నమ్మ బుచ్చు
నాయకగ ఈగొ వదిలేసి నమ్మి బతుకు
నాయకగ బాధ్యతను సక్రమంగ
నాయకగ తప్పు లనుకూడ శాoత పరచు
నాయకగ బాధలోన ఓదార్పు చూపు
నాయకగఅన్ని వేళలో తీర్పు చెప్పు
నాయకగ నిర్ణయమ్మును తెలుపు చుండు
నాయకగ మార్గ దర్శకుడుగను ఉండు
నాయకగఎల్లప్పుడు నవ్వుతూను వుండు .
నాయకగ సమస్యలకును నిర్భయమ్ము
నాయకగ జన మధ్యన హృదయ ముంచు
నాయకగ అభినందన తెల్పు చుండు
నాయకగ సమాజమునందు సేవచేయు
నాయకగ నమ్మి రాజకీయునిగ సేవ
--(())--
No comments:
Post a Comment