🙏
సరదాగా...
నమస్కారం!
" కీ...కం!"
గార్ధభాండశునకీయం!
గాడిద గుడ్డు కుక్క కథ)
ఎప్పుడో 60 సంవత్సరాల క్రితం 5 తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో చదివన కథ!
తెలుగు కూడ ఇంద్లీషు మీడియంలో చదువుకునే వారికి తెలియకపోవచ్చు; ఫరవాలేదు, ప్రపంచం ఆగిపోయే ప్రమాదమేమీ లేదు!
కథ తెలిసిన వారికి, నేను కొత్తగ చెప్పేది ఏమి లేదు.
ఆ రోజులలో నాకు అర్థమైన విషయం – కుక్క పని కుక్క చేయాలి, గాడిద పని గాడిద చేయాలి; మన పనిని విస్మరించి ఇకరుల పని నెత్తిన వేసుకుంటే అనర్థం తప్పదని!
దానికో ఒక చిన్న సందేహం - అసలు గాడిదకు కుక్క చేసే పని చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అది నా అమాయకత్వం కావచ్చు. వదిలేసేయండి,
ఈ రోజులలో అంత అమాయకు లెవరు లేరు. లాభం వుంటే ఏ పనైనా చేయాలని పాలు తాగే పసి వాడికి కూడ తెలుసు!
ఆ, ఏతా వాతా నేను చెప్పదలుచున్నదేంటటే గాడిదల గురించి, కుక్కల గురించి!
ఊర గాడిదలు ఈ మధ్య ఎక్కువగా కనిపించడం లేదు.
గాడిద పాలు అమ్ముకునే వాడు వెంట కర్ర పట్టుకుని వుంటాడు (రాజకీయ నాయకుడి వెంట గన్మెన్ ఉన్నట్లు) కాబట్టి వాటికి కుక్కల బెడదకూడ లేకుండ పోయింది. కొండల్లో అడవుల్లో వుండే వారికి గాడిద అవసరం కాబట్టి ప్రాణపదంగ చూసుకుంటారు, దానిచేత ప్రాణం పోయేంత పని చేయించు కుంటారు.
వలస గాడిదల పరిస్ధితి కాస్త మెరుగైంది గాని, గాడిదల బతుకులో పెద్ద మార్పేం లేదు.
ఇక పోతే కుక్కల గురించి. వీటి సంఖ్య విపరీతంగ పెరిగిపోయింది. పట్నాలు పల్లెలు కాకుండా హైవే కుక్కలు కూడ పెరిదాయి. పెంపుడు కుక్కల సంగతి సరేసరి!
అన్నట్టు ఈ కుక్కల పెంపకం కొత్తగా పుట్టుకొచ్చిన సరదా కాదండోయ్, అనాదిగా వున్న అలవాటే!
ఇదివరలో ఇంటింటికో కుక్కుండేది. వసారాలో కాళ్ళు ముడుచుకుని పడుకునేది, ఎవరైనా వస్తే మొరిగేది. పగలైతే బంధువులో మిత్రులో, రాత్రైతే ఏ దొంగలో వచ్చారని హెచ్చరిక చేసేది, దాంతో యజమాని ముందు జాగ్రత్త పడేవాడు..
అలాగని అది 24 గంటలూ డ్యూటీలో వుండాలనే ఆంక్షలేమీ వుండేవి కాదు. మనసైతే, సరదాగా అలా బయటకు వెళ్ళి ప్రైవేటు ఎఫైర్స్ ఏమైనా వుంటే చక్కబెట్టుకుని టంచన్ గా భోజమం వేళకు మాత్రం ఇంటికి చేరేది.
By chance, ఒకపూట బయట వ్యవహారాలు పూర్తికాక, తిండి వేళకు ఇంటికి రాక పోతే, అదీ very rare, పిచ్చిముండ, తిండితిప్పలు లేకుండా బజారునపడి ఎక్కడ తిరుగుతుందోనని ఇంటి యదమానురాలు తెగ హైరాన పడిపోయేది.
మరీ పొద్దు పోయినా తిరిగి రాక పోతే, ఏ బండి కింద పడి చచ్పిపోయిందోననే బెంగతో, ఆ రాత్రికిక నిద్రపోయేది కూడ కాదు.
మరుసటి రోజుకీ తిరిగి రాకపోతే, సరే, ఋణాను బంధం తీరిపోయిందని భర్త ఓదార్చడంతో ఆ Episode ముగిసేది. Over acting చేసేంత డ్రామా scope ఉండేది కాదు.
కాకపోతే, ఏ మాటకామాటే చెప్పుకోవాలి! ఏనుగు బజార్న పోతుంటే మాత్రం కుక్క పిచ్చ మొరుగుడు మొరిగేది.
అదేంటో, అక్కడున్న వారు ఏనుగును ఏమీ అనకుండా, కుక్క నోరు మూయించే వారు.
It is pure injustice! ఏనుగు గొప్పదే కావచ్చు, కాని, కుక్కకా విషయం ఎలా తెలుస్తుంది? తెలుసుకో వలసిన అవసరం దానికేముంది?
Be Rational in your thinking Man! ఆ విషయం వదిలేయండి, Why unnecessary argument?
కాకపోతే, కుక్కల పెంపకం విషయంలో మనం తప్పు చేసామనిపిస్తోంది. ఇంటి బయట వుండాల్సిన కుక్కని ఇంట్లోకి రానీయటమే ఆ తప్పు! ఇల్లంతా విచ్చల విడిగా తిరగినా నోరు మూసుకోవాల్సి వస్తుంది. అడ్డ ఆపూ వుండదు.
పైగా గేటు దగ్గర కుక్కలున్నాయి అనే బోర్డు పెట్టుకోవాలి, మనుషులు లేరన్నట్లు! కొన్నిళ్ళలో మనుషుల సంఖ్య కన్నా కుక్కల సంఖ్యే ఎక్కువ.
అది వేరే విషయం! వారికి మనుషులకంటే కుక్కల మీద ఎక్కువ ప్రేమ ఉండొచ్చు, ప్రశ్నించే హక్కు మనకు లేదు.
విచిత్రమైన విషయం ఏంటంటే కొన్నిళ్ళలో కుక్కలు హాల్లో షో కేసులోనే కాపురం వుంటాయి. అంటే అంత చిన్నసైజువన్న మాట! విపరీతార్థం లేదు. అవి తల కళ్ళు అటూయిటూ తిప్పితే తప్ప అదొక ప్రాణని గుర్తించ లేం! అలాంటివి ప్రదర్శించుకే తప్ప వేరే ఏ విధంగా ఉపయోగమో నాకు తెలియదు.
బహుశ, అది నా అవగాహన లోపం కావచ్చు. అయినా ఎవరి అభిరుచి వారిది, కాదనే హక్కు ఎవరికి లేదు.
ఊర కుక్కలు చాలక విదేశీజాతి కుక్కలు! వాటి సంతానోత్పత్తికి విశేష కృషి! విపరీత విస్తరణ! ఎందుకో విదేశీజాతి కుక్కల మీద అంత ప్రేమ? స్వజాతి కుక్కల మీద అంత నిరసన?
ఎవరి ఇష్టం వారిది, కాదనే హక్కు మనకు లేదు.
వచ్చిన సమస్యల్లా మోజు తీరి పోతేనో లేక, కొత్త కుక్కల్ని తెచ్చినప్పుడు, నిర్వహణ వ్యయం భారం ఎక్కువ అవుతుందనో వాటిని వీధిలో వదిలేస్తారు.
వీటికి మెడలో ఒక తోలు బెల్టు, దానికో లైసెన్సు బిళ్ళ వేళాడుతూ వుంటాయి, తేలికగ గుర్తించ వచ్చు.
పాపం! అంత వరకు సుఖ జీవనానికి అలవాటు పడిన ఆ పెంపుడు కుక్కలకి స్వతంత్రంగ బతకటం చేతకాక పోవడం, పైగా ఒక్కసారిగా ఆళ్రయం కోల్పోవడం వలన తల తిరిగి పిచ్చెక్కుతుంది.
దాంతో అవి విచక్షణ కోల్పోయి అరవడం, కరవడం ప్రారంభిస్తాయి. దాంతో, జనానికి తెగ కోపం వస్తుంది. రాక చస్తుందా, హక్కులైతే ఒదులుకుంటారు గాని అసలుకే ఎసరు పెడితే ఎవరు ఒప్పుకుంటారు! రాళ్ళతో కర్రలతో కొట్టి చంపేస్తారు.. ఆ పరిస్థితి కల్పించడం అమానుషం కదా! అదికూడ మనలాంటి ప్రాణేకదా!
కాకపోతే, అది జంతువు, మనం మనుషులం. నిజమా, కాదా! కాకపోతే, మనిషికి జంతువుకు వ్యత్యాసం ఏంటి? ఈ అవగాహనా లోపానికి కారణం ఏమిటి?
Definitely something is wrong somewhere!
ఏమైనా గాడిదల సంఖ్య పెరిగిందని, కుక్కల బెడద ఎక్కువైందని మాత్రం అంగీకరించక తప్పదు. దీనికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ఆశిద్దాం!
PS: జంతువుల మీద పడ్డారేంటి అనే ఆలోచనలు/ ఆరోపణలూ వస్తాయి. సమాధానం చెప్పవలసిన బాధ్యత నాకుంది.
ఒక్క మాటలో నా సమాధానం “కీ...కం” (కీర్తి కండూతి)!
FPC (Free Publicity Craze)!
దయచేసి ఇందులో రాజకీయం ఇసుమంతైనా లేదని గ్రహించ గలరు!
ధన్యవాదములు!
🪔 *కామాక్షీ దీపం గురించి తెలుసా?*🪔
*ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైఃః*
కామాక్షీ దీపం అఖండ ఐశ్వర్యం
కామాక్షీ దీపం అంటే దీపపు ప్రమిదకు గజలక్ష్మీ చిత్రం ఉంటుంది. ఈ దీపానికి గజలక్ష్మీ దీపం అనికూడా పేరు. ఆ దీపపు వెలుగులో కామాక్షీ దేవి నిలిచి ఉంటుంది. కనుక కామాక్షీ దీపం అంటారు.
కామాక్షీ దేవి సర్వదేవతలకూ శక్తినిస్తుందని ప్రతీతి. అందుకే కామాక్షీ కోవెల తెల్లవారుఝామున అన్ని దేవాలయాలకన్నా ముందే తెరువబడి. రాత్రి పూట దేవాలయాలన్నీ మూసిన తరువాత మూయబడుతుంది. అమ్మవారి రూపమైన కామాక్షీ దీపం వెలిగే ఇల్లు అఖండ ఐశ్వర్యాలతో తులతూగుతుంది.
కామాక్షీ దీపాన్ని చాలామంది ఖరీదైన నగలతో సమానంగా చూసుకుంటారు. తరాల పాటు ఆ దీపాన్ని కాపాడుకోవడం హిందువుల ఇళ్ళలో ఉండే ఆచారం. కామాక్షీదీపం ఇళ్ళలో వ్రతాలూ పూజలూ చేసుకునేటప్పుడూ, అఖండ దీపాన్ని పెట్టదలచుకున్నప్పుడూ గృహప్రవేశం చేస్తున్నప్పుడూ తప్పనిసరిగా ఉపయోగిస్తారు. కామాక్షీ దీపము కేవలం ప్రమిదను మాత్రమేకాకుండా అమ్మవారి రూపునూ కలిగి ఉంటుంది.
ప్రతిష్టలలో, గృహప్రవేశాలలో కామాక్షీ దీపాన్ని దీపారాధనకు ఉపయోగించడం ఎంతో శ్రేష్టం.
కామాక్షీ దీపం వెలిగించినప్పుడు పాటించవలసిన నియమాలు
దీపారాధన చేసినప్పుడు దీపానికి కుంకుమ పెట్టడం ఆచారం. కామాక్షీ దీపాన్ని ఉపయోగించినప్పుడు ప్రమిదకు కుంకుమ పెట్టిన చేతితోనే ఆ ప్రమిదకు ఉన్న అమ్మవారి రూపానికీ కుంకుమ పెట్టి, పువ్వుతో అలంకరించి, అక్షతలు వేసి నమస్కరించుకోవాలి.
*--......
*
*🙏ఓం శ్రీ రాం... శ్రీ మాత్రే నమ🙏
సంప్రదాయం అనుసరించే వారు, ఎవరు చెప్పినా పాటించవలసిందే🙏*
*1) మంగళ, శుక్ర వారాలలో క్షవరం చేసుకోరాదు*
*2) ఒకే ఇంట్లో అందరూ ఒకేసారి క్షవరం చేసుకోరాదు.*
*3) అన్నదమ్ములు, తండ్రీకొడుకులు ఒకేరోజు క్షవరం చేసుకోరాదు.*
*4) భోజనం తిన్న పళ్లెంలో చేయి కడగకూడదు.*
*5) నూనె, ఉప్పు, గుడ్లు చేతికి ఇవ్వరాదు.*
*6) ఇంటికి ఎవరైనా వచ్చినపుడు ఎదురుగ చీపురు కనపడకూడదు.*
*7) సాయంత్రం గం.5 తర్వాత ఇల్లు ఊడ్చ కూడదు.*
*8) మంచం మీద కూర్చుని తినకూడదు.*
*9) తలుపుల మీద బట్టలు వేయకూడదు."*
*10) సాయంత్రం చీకటి పడగానే అన్ని తలుపులు వేసి ఇంట్లో దీపాలు వెలిగించాలి. వీధి తలుపు మాత్రం తీసి ఉంచాలి.* (మనదేశ సంప్రదాయం ప్రకారం సంధ్యా సమయంలో లక్ష్మీ దేవి సంచరిస్తూ ఉంటుంది.)
*11) ఇంటి యజమాని ఇంట్లో మొక్కలకు నీళ్లు పోయాలి.*
*12) మంగళ, శుక్ర వారాలలో డబ్బులు ఎవరికీ ఇవ్వరాదు.*
*13) ఇంటి ముందు రాక్షసుడు పటం ఉండకూడదు.*
*14) బయటికి వెళ్లి వచ్చాక తప్పనిసరిగా కాళ్ళు కడుగుకొని ఇంట్లోకి రావాలి.*
*15) తెల్లవారి లేవగానే ముందు దేవుని పటములు కానీ మీ రెండు అరచేతులు గాని చూడాలి. అద్దంలో మీ ముఖం చూసుకోరాదు.*
*16) అద్దం ఉత్తర దిక్కున మాత్రమే ఉండాలి.*
*17) ఉత్తర దిక్కున తల పెట్టుకుని పడుకోరాదు.*
*18) ప్రతినెలా కొత్త రైస్ బ్యాగు తేగానే అన్నం వండి తొలిముద్ద దేవుడికి నైవేద్యంగా పెట్టండి.*
*19) పూజా మందిరంలో మరణించిన మన కుటుంబీకుల ఫోటోలు ఉంచకూడదు.*
*20) ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు.*
*21) దేవాలయానికి వెళ్ళి వచ్చాక వెంటనే కాళ్ళు కడుగుకోకూడదు.*
*22) తూర్పు, పడమటి దిక్కులుగా తిరిగి కాలకృత్యాలు తీర్చుకోకూడదు.*
*23) ఆడవాళ్లు శిరోజాల విరబోసుకోరదు*
*24) ఆదివారం అన్నదమ్ములు ఉన్న అక్కచెల్లులు తలస్నానం చేయరాదు*
*25) ముతైదువులు పంచ మంగల్యాలు (బొట్టు, గాజులు, నల్లపూసలు, కాలి మెట్టెలు ,పువ్వులు) ధరించవలెను*
*26) దానం చేసేటప్పుడు కుడి చేత్తో చెయ్యవలను.*
*27) సంధ్య సమయం లో పడుకోకూడదు*
*పాటించేవారుంటే.. ఎన్నయినా చెప్తారు.*
*ఎవరు పాటిస్తారులే అని పెద్దలు మౌనంగా ఉండకూడదు.*
*చెప్పడం చెయ్యడం మన విధి. ఆ పైన వారి ఇష్టం*
*ఇది మన భారతీయుల సత్సంప్రదాయాలు
🙏.
బెజవాడ* *సొగసు* *చూడతరమా* !
“బెజవాడ నగర సందర్శనను సినిమా హాళ్ళు, హోటళ్ళతో మొదలు పెడదాము.
అప్పట్లో బెజవాడలో రెండంటే రెండే సినిమా హాళ్ళు వుండేవి. ఒకటి మారుతీ సినిమా, రెండోది నాగేశ్వరరావు హాలు.(బహుశా నాగేశ్వరరావు హాలంటే దుర్గాకళా మందిరం !) ఇది ముప్పయ్యవ దశకంలో మాట. ఈ సినిమా హాళ్ళకు ఆ రోజుల్లోనే సొంత జెనరేటర్లు వుండేవి.
“సాయం సమయాల్లో ఈ సినిమా హాళ్లనుంచి ఎడ్లబండ్లు సినిమా ప్రచారానికి బయలుదేరేవి. వాటిల్లో కొందరు కూర్చుని వాయిద్యాలు వాయిస్తూ వుండేవారు. నలుగురు చుట్టూ చేరగానే సినిమాల తాలూకు కరపత్రాలు పంచుతూ వుండేవారు. ఆ బళ్ళు కనబడగానే వెంట పరిగెత్తుకెళ్ళి ఆ కరపత్రాలు వీలయినన్ని పోగేసుకోవడం సరదాగా వుండేది. ఎన్ని ఎక్కువ పాంప్లేట్లు పోగేస్తే అంత గొప్ప.
“1937 లో పరిస్తితి కొంత మారింది. నాగేశ్వరరావు గారు ఎడ్లబండి స్తానంలో మోటారు వ్యాను ప్రవేశపెట్టారు. దాన్ని రంగురంగుల సినిమా పోస్టర్లతో అందంగా ఆకర్షణీయంగా అలంకరించేవారు. లౌడ్ స్పీకర్ల ద్వారా సినిమా పాటలు వినిపించేవారు. టంగుటూరి సూర్యకుమారి పాడిన రికార్డులను ప్రత్యేకంగా వేసేవారు. ఇలా సాగే సినిమా ప్రచారం కొన్నాళ్ళ తరువాత కొత్త పుంతలు తొక్కింది. సాలూరు రాజేశ్వరరావు, శ్రీరంజని, రామతిలకం నటించిన ‘కృష్ణ లీల’ సినిమా విడుదల అయినప్పుడు ఆ సినిమా నిర్మాత - కరపత్రాలను విమానం నుంచి వెదజల్లే ఏర్పాటు చేశారు. నిజంగా ఆ రోజుల్లో అదొక సంచలనం.
“సినిమా నిర్మాతల నడుమ పోటీలు పెరగడం బాగా గుర్తు. ఒకాయన ద్రౌపది వస్త్రాపహరణం నిర్మిస్తే మరొకరు పోటీగా ద్రౌపదీ మాన సంరక్షణ పేరుతొ మరో సినిమా తీసి విడుదల చేశారు. ఒకరు మాయాబజారు (పాతది) తీస్తే ఆయన ప్రత్యర్ధి శశిరేఖా పరిణయం పేరుతొ అదే కధను తెరకెక్కించారు. అలాగే సినిమాలు ఆడే ధియేటర్ల నడుమ కూడా పోటీ తత్వం వుండేది.
“అప్పటిదాకా పౌరాణిక చిత్రాలదే హవా. రెండో ప్రపంచ యుద్ధానికి కొద్ది ముందు సాంఘిక చిత్రనిర్మాణానికి నిర్మాతలు చొరవ చూపడం మొదలయింది. ముందు భానుమతి, పుష్పవల్లి తో ‘వరవిక్రయం’ వచ్చింది. తరువాత వైవీ రావు, రామబ్రహ్మం, హెచ్ ఎం రెడ్డి, బీఎన్ రెడ్డి వంటి హేమాహేమీలు రంగ ప్రవేశం చేసి సాంఘిక చిత్ర నిర్మాణాన్ని ముమ్మరం చేశారు. రైతు బిడ్డ, మాలపల్లి,ఇల్లాలు, గృహలక్ష్మి.వందేమాతరం, దేవత వంటి పలు చిత్రాలు ఈ పరంపరలో రూపుదిద్దుకున్నవే. చలనచిత్రాలను పంపిణీ చేసే డిస్ట్రిబ్యూటర్లు అందరికీ బెజవాడలోని గాంధీనగర్ రాజధాని. సినిమాలు మద్రాసులోనో, కొల్హాపూర్, కలకత్తాలలోనో తయారయినా వాటిని విడుదల చేయడానికి అవసరమయిన అన్ని హంగులూ, ఏర్పాట్లు చేయాల్సింది మాత్రం బెజవాడలోనే.
“ఆ రోజుల్లో ఇలా ఇబ్బడిముబ్బడిగా సినిమాలు తీసేవాళ్ళు కాదు. చిత్రానికి చిత్రానికీ నడుమ కనీసం పదిహేనురోజులో,నెల రోజులో వ్యవధానం వుండేట్టు చూసుకునేవారు. సినిమా విడుదలలు లేని ఖాళీ రోజుల్లో ఆ ధియేటర్లలో డ్రామాలు ఆడేవాళ్ళు.
“నలభయ్యవ దశకంలో మరో ధోరణి కనబడింది. తెలుగు సినిమాలు దొరక్కపోతే అరవ చిత్రం వేసేవాళ్ళు. హాలు మధ్యలో అనువాదకుడు నిలబడి కొన్ని డైలాగులను తెలుగులో అనువదించి చెబుతుండేవాడు. ఇంటర్వెల్ సమయంలో సినిమా సాంగ్స్ పేరుతొ ఆ సినిమా పాటల పుస్తకాలను అమ్మేవాళ్ళు. వాటికి మంచి గిరాకీ వుండేది.
“బుకింగ్ కౌంటర్ల దగ్గర ఒక వరుసలో నిలబడి టిక్కెట్లు తీసుకునే సంప్రదాయం వుండేది కాదు. కౌంటర్ తెరవగానే అంతా ఒక్కసారిగా మీదపడేవారు. సినిమా టిక్కెట్టు కొనడం అంటే దాదాపు ఒక యుద్ధం చేసినట్టు వుండేది. టిక్కెట్టు తీసుకుని బయటపడేసరికి చొక్కాలు చినిగి పోయేవి. వొళ్ళంతా చెమటలు పట్టి బట్టలు తడిసిపోయేవి.
“సినిమాహాళ్లలో పారిశుధ్యం పూజ్యం అనే చెప్పాలి. ఆ రోజుల్లో నేల క్లాసు అని ఒక తరగతి వుండేది. ఆ క్లాసులో పైన నేల మీద కూర్చున్న వారిలో ఎవరి పిల్లవాడయినా మూత్రం చేస్తే అది కింద దాకా పారుతుండేది. కింది వైపు కూర్చున్న వారి లాగూలు తడిసేవి. మరుగు దొడ్ల సౌకర్యం వుండేది కాదు. “ఇంటర్వెల్ కాగానే ప్రేక్షకులు ఒక్కమారుగా గుంపులు గుంపులుగా బయటకు వచ్చి సినిమా హాలు గోడల్ని ప్రక్షాళన చేసేవాళ్ళు.
“1939 లో అనుకుంటా బెజవాడలో కొత్తగా రామా టాకీసు వచ్చింది. తరువాత వరుసగా గవర్నర్ పేటలో లక్ష్మీ టాకీసు, వన్ టౌన్ లో సరస్వతీ మహలు వచ్చాయనుకుంటాను.
“ఇక రెస్టారెంట్ల విషయానికి వస్తే-
“వూళ్ళో దాదాపు అన్నీ శాఖాహార భోజన హోటళ్ళే! బ్రాహ్మణ హోటళ్ళు. చాలావరకు ఉడిపి అయ్యర్లవే. బాగా ప్రాచుర్యం పొందిన వెల్కం హోటల్, మోడరన్ కేఫ్ లాటి హోటళ్ళు కూడా ఉడిపి వారివే. ఒక్క అణా (రూపాయిలో పదహారో వంతు) పెడితే రెండు ఇడ్లీలు, వేడి వేడి సాంబారు, కారప్పొడి, కొబ్బరి చట్నీ, అల్లప్పచ్చడి – అన్నీ లేదు అనకుండా వడ్డించే వాళ్లు.
”గవర్నర్ పేటలోని బీసెంటు రోడ్డు దగ్గర మొదలు పెడితే గాంధీనగరం వరకు అన్నీ హోటళ్ళే! మాంసాహారం లభించే హోటళ్ళను మిలిటరీ భోజన హోటళ్ళు అనేవారు. వాటిని ఎక్కువగా కేరళ వాళ్లు నడిపే వాళ్లు. అలాగే, బయట నుంచి బెజవాడకు వచ్చిన వాళ్ల చేతుల్లో కొన్ని వృత్తులు వుండేవి. పాల వ్యాపారం చాలావరకు విజయనగరం నుంచి వచ్చిన వారు చూసుకునేవారు. ఒరిస్సా నుంచి వచ్చిన వారు - పాయిఖానాలు శుభ్రం చేసే పని చూసేవారు. దర్జీ పని, జట్కాలు (గుర్రబ్బండ్లు) ముస్లింల ఇలాకాలో వుండేవి. రాకపోకలకు రిక్షాలే గతి. సైకిల్ రిక్షాలు రాకపూర్వం వాటిని మనుషులు లాగేవారు. సిటీ బస్సులు వుండేవి కావు. కాకపొతే, బెజవాడ, ఏలూరు, బందరు, గుడివాడల మధ్య బస్సులు తిరిగేవి. ఆ బస్సులకు పై కప్పుమాత్రమే వుండేది. పక్కన ఏమాత్రం ఆచ్చాదన లేకపోవడంతో వర్షం వస్తే అంతే సంగతులు. ప్రయాణీకులు పూర్తిగా తడిసిపోయేవాళ్ళు. కృష్ణా నది మీద రోడ్డు వంతెన లేని కారణంగా బెజవాడ నుంఛి గుంటూరుకూ, ,తెనాలికీ బస్సు సర్వీసు వుండేది కాదు.
అధికారుల పెత్తనం జోరుగా వుండేది. పోలీసు అధికారి కానీ రెవెన్యూ అధికారి కానీ బస్సు ఎక్కాల్సి వస్తే బస్సును ఏకంగా ఆయన ఇంటి దాకా తీసుకువెళ్ళేవాళ్ళు.
“ గవర్నర్ పేట . ఇంటి నుంచి కొత్తపేటలోని హిందూ హై స్కూలు వరకూ నడిచే వెళ్ళే వాళ్ళం. తరువాత మేము చేరిన ఎస్ ఆర్ ఆర్ అండ్ సీ వీ ఆర్ కాలేజీ మాచవరం లో వుండేది. అప్పుడు కూడా మాది నటరాజా సర్వీసే. స్కూల్లో టీచర్లు, కాలేజీలో లెక్చరర్లు అంతా కాలినడకనే వచ్చేవాళ్ళు. దుర్గాగ్రహారంలో వుండే విశ్వనాధ సత్యనారాయణ గారు, చతుర్వేదుల నరసింహం గారు కాలేజీకి నడిచే వచ్చేవాళ్ళు. వాళ్లు లెక్చరర్లు. దోవలో ఇంగ్లీష్ సాహిత్యం గురించి చర్చించుకునే వారు. కొత్తగా విడుదలయ్యే ఇంగ్లీష్ సినిమా మొదటి ఆట చూడడం కోసం ప్లాన్లు వేసుకునేవాళ్ళు. కాలేజీ ప్రిన్సిపాల్ పుట్టపర్తి శ్రీనివాసాచారి గారు మాత్రం జట్కా బండిలో వచ్చేవారు. కొందరు లెక్చరర్లు సైకిళ్ళపై చేరుకునే వారు.
బెజవాడ గురించి చెప్పుకునే ముందు ముందుగా ప్రస్తావించుకోవాల్సింది బెజవాడ రైల్వే స్టేషన్ గురించి. ఎందుకంటె అనేక విషయాల్లో దీనికదే సాటి. దక్షిణ భారతానికి ముఖద్వారం లాటి బెజవాడ రైల్వే స్టేషన్ లో కాలి వంతెన మీద నిలబడి అప్పుడే స్టేషను లోకి ప్రవేశించే గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ రైలును చూడడం అదో అనుభూతి.
జీటీ ఎక్స్ ప్రెస్ ఇంజను ఆవిర్లు చిమ్ముతూ, బిగ్గరగా కూతపెడుతూ ప్లాటుఫారం మీదకు వేగంగా వస్తుంటే ఆ దృశ్యాన్ని కళ్ళారా చూడడానికి వందలమంది స్టేషను ఫుట్ బ్రిడ్జ్ మీద గుమికూడేవారని చెబితే ఈనాటి వారు నమ్మడం కష్టమే. గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ పేరుకు తగ్గట్టే దాని కూత కూడా ప్రత్యేకంగా వుండేది. దూరం నుంచి కూడా కూత విని ఆ రైలును గుర్తుపట్టేవారు.
ఇక స్టేషను విషయానికి వస్తే అది యెంత పెద్దదంటే బెర్లిన్ గోడ మాదిరిగా బెజవాడ పట్టణాన్ని తూర్పు, పడమర దిక్కులుగా విభజిస్తూ వుంటుంది. రెండు పక్కలా రెండు విభిన్న సంస్కృతులు పరిఢవిల్లుతుండేవి. 1941 లో కాబోలు గానన్ డంకర్లీ అండ్ కంపెనీ, రైలు పట్టాల కిందుగా అండర్ పాస్ వంతెన నిర్మించేంతవరకు బెజవాడ రెండు భాగాలుగా వుండేది. ఇక ఆ స్టేషనులో రద్దీ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆ రోజుల్లోనే పది నిమిషాలకు ఒక రైలు రావడమో, పోవడమో జరిగేది. రైలు గేటు వేసినప్పుడల్లా అటునుంచి ఇటు రాకపోకలు సాగించేందుకు జనం నానా ఇబ్బందులు పడేవాళ్ళు. అండర్ పాస్ అందుబాటులోకి రావడంతో ఈ చిక్కులు తొలగిపోయాయి.
ఆ రోజుల్లో నిజాం పాలనలో వున్న హైదరాబాదు స్టేట్ నుంచి రైళ్ళు బెజవాడ వచ్చేవి. నిజాం రైళ్ళను గురించి జనం గొప్పగా చెప్పుకునే వారు. సమయపాలనకు అవి పెట్టింది పేరు. అలాగే శుభ్రత. మూడో తరగతి బోగీల్లో కూడా పంకాలు, స్టెయిన్ లెస్ స్టీల్ టాయిలెట్లు వుండేవి.
బెజవాడ రైల్వే స్టేషన్ చూస్తే ఏకత్వంలో భిన్నత్వం అంటే ఏమిటో బోధ పడుతుంది. దేశం నలుమూలలకు చెందిన విభిన్న భాషలవాళ్ళు బెజవాడ ప్లాటుఫారం పై కానవస్తారు. కొత్తవాళ్ళకు కృష్ణా పుష్కరం మాదిరిగా గుంపులు గుంపులుగా వున్న ఆ జనసందోహం కనబడేది.
Mallapragada: నేటి సమ్మోహాలు .. అభిమాన నటుడు (861-870)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
అగ్గి పిడుగు రాముడు
రాముడు యుగపురుషుడు
యుగపురుషుడు నందమూరి రామ మోహనా
చిక్కడు దొరకడు గా
దొరకుడు కదలుడుగా
కడలుడు వదలడు నందమూరియె మోహనా
మంచి మనిషి దేవత
దేవత గ ఎదు రీత
ఎదురీత మనుషుల్లో దేవుడు మోహనా
ఎర్రకోటవీరుడు
వీరుడు ఆరాధ్యుడు
ఆరాధ్యుడు అదృష్టజాతకుడు మోహనా
జగదేకవీరుడుగ
వీరుడు సుందరుడుగ
సుందరుడుగా భలేతమ్ముడులె మోహనా
మనుషుల్లో సత్యం
సత్యహరిచంద్రగ
చంద్రడైవెన్నెలు కురుపించును మోహనా
పౌరాణిక నాయక
నాయక ఏకవీర
వీర కంకణ ధారి మహాత్ముడు మోహనా
ఆమూడు భీముడుగా
భీముడు దేవుడుగా
దేవుడు శ్రీనాధుడుగా మనిషి మోహనా
ఉమ్మడి కుటుంబమే
కుటుంబ గౌరవమే
గౌరవ ఒకనాటి ముఖ్యమంత్రి మోహనా
చిత్ర సీమకె రాజు
రాజుగా రారాజు
రారాజు అభిమానపాత్రుడులె మోహనా
--(())--
[17/12, 5:32 am] . Mallapragada: నేటి సమ్మోహాలు ..అతివ (871-880)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
అతివి నా మతివి
మతివి నా గతివి
గతివి గణాంక శక్తివి యుక్తివి ఈశ్వరా
కళ్ళలొ కళ్ళు పెట్టి
కళ్ళు తొ కన్ను కొట్టి
కన్నుల తోను మగువ విరహమే మోహనా
కాలమే సరాగం
సరాగం సమానం
సమానం సేవయే నినాదం మోహనా
ప్రేమయే సకాలం
సకాలం సుతారం
సుతారం సుందరం సుమధురం మోహనా
అందమే మనమ్మున్
మనమ్మున్ హరించున్
హరించున్ హృదయమ్ము అతివయే మోహనా
రాగ వీణ మ్రోగెన్
మ్రోగెన్ హృదయ తపన్
తపన్ రసమ్ముల్ జిందున్ మహిళ మోహనా
కాల మాయ చూపెన్
చూపెన్ అనాదిగన్
అనాదిగన్ సుఖమ్మున్ పంచును మోహనా
సుమమ్ముల్ కన్నులై
కన్నులే దాహమై
దాహమే తాపమై తనువంతా మోహనా
సుందరిన్ దలంచన్ -
దలంచన్ సుమమ్ముల్
సుమమ్ముల్ విచ్చున్ సువాసనకె మోహనా
విందుగా సుసంధ్యల్
సుసంధ్యల్ మనమ్ముల్
మనమ్ముల్ పల్కు ల్ మమ తల్ గతి మోహనా
--(())--
: నేటి కవిత : " దేవత యే స్త్రీ " (3)
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
కాలమే సరాగం - సమానం కాదా దేవి
సేవయే నినాదం - సుసీలం కాదా దేవి
ప్రేమయే సకాలం - సుతారం కదా దేవి
పాపమే వికాసం - నిదానం కాదా దేవి .... .... 14
అంద మీ మనమ్మున్ - హరించెన్ గాదాదేవి
చంద మీ హృదిన్ సం-చరించెన్ గాదా దేవి
పందెమే మనమ్మున్ - కుదించెన్ గాదా దేవి
ఎందుకో సుఖమ్మున్ - ఖరీదున్ గదా దేవి .... .... 15
రాగవీణ మ్రోఁగెన్ - రసమ్ముల్ జిందన్ గాదాదేవి
కాల మాయ చూపెన్ - మనమ్ముల్ జిందన్ గాదాదేవి
యోగవేళ వచ్చెన్ - యుగాదిన్ నాడే గదాదేవి
శాంతి దూత చెప్పెన్ - సుమమ్ముల్ విచ్చున్ గాదాదేవి .... ... 16
పల్లవ మ్మయెన్గాఁ - బ్రసూనమ్ముల్గా గాదాదేవి
నుల్లమందు నాశల్ - హొయల్ మీఱంగా గాదాదేవి
మల్లియల్ సుమించెన్ - మనమ్మం దెల్లన్ గదాదేవి
వల్లవీ విలాసం - బవంగా రావా దేవి .... .... 17
విందుగా సుసంధ్యల్ - విభావ మ్మిచ్చున్ గాదాదేవి
సుందరిన్ దలంచన్ - సుమమ్ముల్ విచ్చున్ గాదాదేవి
పల్కులన్ మదించున్ - మనోసమ్మతిన్ గాదాదేవి
చినుకులన్ చలించెన్ - సహాయమ్మునన్ గాదాదేవి .... ... 18
నింగిలోఁ గనంగా - నిశిన్ జంద్రుండున్ గాదాదేవి
రంగులన్ వెలింగెన్ - స్రజమ్మై తారల్ గదాదేవి
శృంగమందు మంచుల్ - హృదిన్ శోకమ్మే గాదాదేవి
రంగడిందు లేఁడే - రమించన్ రాఁడే గదాదేవి ... ... 19
నిట్టూర్పులు వెంబడించినా, నిజం నిలకడగా తెలిపా దేవి
కష్టాలను తోడితెచ్చినా, సుఖం నిలకడగా మలు పే దేవి
రోగాలు తర్ముచుండినా, జపం నిలకడగా సలిపే దేవి
పాపాలు చేయుచుండినా, జయం నిలకడగా నిలిపే దేవి ....20
నిండు మనస్సు చలించినా, నిగ్రహంతో ఆశతో ఉంన్నా దేవి
పొందు ఉషస్సు చెలించకా, నిగ్రహంతో పంచుతూ ఉంటా దేవి
మంచి యశస్సు కల్పించితీ, నిగ్రహంతో సొంతమే పల్కే దేవి
వద్దు తపస్సు ఇంకెందుకే, నిగ్రహంతో పొందుమే సత్యా దేవి .... 21
ముఖ్యంగా స్త్రీలకు తెల్పునది .... తల్లులారా తప్పులు దొర్లినా క్షమించండి
మీకు నచ్చితే షేర్ చేసి అభిప్రాయాలు తెలపండి ఇది నా ఆలోచనలు మాత్రమే
--(())--
బాల్యమంతయు ఆత్మీయభావనమ్ము
విద్యవిధ్యార్ధి దశనందు విధిగ ఉండు
కష్ట నష్టమ్ములు కలిగి కాంతిగుండు
యిష్టమైనట్టి యాటలు ఈడు చుండు
చదువు పలికేను ధైర్యము సలిపి వుఃచె
చదివి చదివించుటయందు చనువు ఉంచి
చదువులలొమర్మమును తెల్పి చక్కదిద్ది
చదువుయే బతుకుతెరువ జరుగు వుండుయ
ప్రకృతి మాతకు వందనప్రీతి సల్పి
వికృతి చేష్టలు ఏమియు విద్య యందు
చూపకుండగా నిత్యము చదువు చుండి
తృప్తి సంతృప్తి కలిగియు తీపి గుండు
ప్రాయపుదశలో పదనిసపలుకు చుండు
జీవితమనునది తృప్తిగా జరుగు చుండు
ప్రకృతి పరవశాన్ని చూసి పలుకు చుండు
చెలిమీ కలిగియు ధైర్యము చెప్పు చుండు
బతుకు విద్యకొరకు దుంగపై పాదముంచి
చెరువు పైనడకను సాగించుటయు బరువు
తోభయము ఆతృతయును దూపకయె నిగ్ర
హమ్ముగా ధైర్యముగనుయే గట్టి గుండు
*శ్రీ వేంకటేశ్వర లీలలు* 🙏
🍒 *భాగము 1* 🍒
🌻 *నైమిశారణ్య ప్రాధాన్యము* 🌻
🍃🌹శ్రీలతో తులతూగుచూ పాడిపంటలు పుష్కలముగా నుండి సర్వప్రజలు నీతిమంతులై విలసిల్లిన దేశము భారతదేశము.
🍃🌹అందమైన హిమాలయములు, మహా శిల్పుల పనితనమునకు మచ్చుతునకలుగానున్న దేవాలయములు మున్నగు వానితో దేశము శోభాయమానముగానుండెడిది.
🍃🌹ఎచ్చట జూచినను దైవపూజలే యెచ్చట వినినను పుణ్య కథా శ్రవణములే! ఎచ్చట మెట్టినను ఆధ్యాత్మిక చింతనలే! అట్టి పవిత్ర భారత దేశమున అనఱ్యములు ప్రజలకు విజ్ఞాన విషయములందించుటలో విజ్ఞాన విశేషములను శోధించి, నూతన విషయములు కనుగొని, ప్రజల ఉపయోగార్థమందించెడివారు.
🍃🌹భయంకరారణ్య సీమలందు మోక్షకాముకులై అనేక మంది మునీశ్వరులు తపస్సు చేసుకొనుచెండెడి వారు. చక్రవర్తులు, రాజులు, పరిపాలనను సరిగా చేయుచు మధ్యమధ్య ఆయా మునీశ్వరులను సందర్శించి వారు ప్రబోధములు వినిచు ఉత్తేజితులయ్యెడివారు.
🍃🌹నైమిశారణ్యము భారతదేశమున గల అరణ్యములలో గొప్పదై విలసిల్లినది. సూతులవారు శౌనకాది మహర్షుల కనేక పౌరాణిక కథలను, భగవన్మాహాత్మ్యములను ఆ యరణ్యమునందే చెప్పెడివారు.
🍃🌹సర్వవేద పురాణ విజ్ఞాన నిధియైన సూతులవారు చెప్పు విషయములు ఆసక్తికరములై మోక్షదాయకములై యుండెడివి. ఆయన విప్పని ధర్మసందేహములు లేవు. చెప్పని పురాణ రహస్యములు లేవు.
🍃🌹అనేక ధార్మికాంశములతో ఆయన శౌనకాదులకు సర్వ పురాణములు వినిపించుచుండిరి.
🙏🙏
......సత్యాన్వేషణలో. కధ కాని కధ
లోకంలో చాలా ఘాతుకాలు జరుగుతుంటాయి. ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంటాయి. ఇవన్నీ భగవంతుడు చేస్తున్నవేనా? వీటన్నింటికీ కారణం ఎవరు? చాలామంది భగవంతుడు నిర్దయుడు, ఇన్ని జరుగుతుంటే చూస్తూ ఉంటున్నాడు, జరగకుండా ఆపవచ్చు కదా అంటుంటారు. ఇదెలా సాధ్యం?
కారు నడుపుతుంటే ప్రమాదం జరుగుతుంది. కారు నడిపేవాడు కారణమా, కారులో ఇంధనం కారణమా, కారే కారణమా, రహదారి కారణమా? అసలు ఆ ప్రయాణం సంకల్పించిన వ్యక్తి కారణమా, ఆ వ్యక్తికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కారణమా, వాళ్లను కన్నవాళ్లు కారణమా? ఇలా వెదుక్కుంటూపోతే ఎన్నో కారణాలు కనిపిస్తాయి. చివరికి ఒక్క దగ్గరే అంతమవుతాయి. ఇది అంతర్జాలం లాగా ఒక మాయాజాలం.
అన్నింటికీ భగవంతుడు కారణం కాదు అని తెలుసుకునేంత వరకు ఈ సంఘటనలు మనల్ని బాధపెడుతూనే ఉంటాయి. కాని, శాస్త్రాలు సర్వానికీ కారణం భగవంతుడే అని చెబుతున్నాయి కదా. ఈ చిక్కుముడి వీడటం ఎలా?
కనిపించే ఈ ప్రపంచానికి కారణం భగవంతుడి సృజనాత్మక శక్తి. దానికి మరోపేరు మాయ. దీన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నించి ప్రయత్నించి విజయం సాధించినవాళ్లు మౌనం వహిస్తారు. విఫలమైనవాళ్లు భగవంతుడే కారణం అంటూ బాధపడుతూ ఉంటారు.
ఏది ఏమైనా మన కళ్లముందు జరుగుతున్నదాన్ని మనం నమ్ముతాం. అది లేదు అంటే, ఆ అన్న వ్యక్తిని పిచ్చివాడికింద జమకడతాం. మన కన్నే మనకు ప్రమాణం. దాని వెనక బుద్ధి ఒకటి ఉందని మరచిపోతాం. దాని వెనక వివేకం ఒకటి ఉందని మరచిపోతాం. కనిపించనివి ఎన్నో మనం మన జ్ఞానంతో అంగీకరిస్తున్నాం.
ముందు మనం దైవాన్ని అంగీకరించాలి. చూసిగాని చూడకుండాగాని సత్యాన్ని నమ్మడానికి సిద్ధపడినప్పుడే విశ్వరహస్యాలు తెలుస్తాయి. విశ్వం నడిచే విధానం తెలుస్తుంది. ఏ వస్తువూ అన్ని కాలాల్లో ఒకేవిధంగా ఉండదు. మార్పు సహజం. మనల్ని మనం అంగీకరించినట్లే దైవం చేసే పనిని కూడా అంగీకరించాలి. సృష్టిలో చాలా లోపాలు కనిపిస్తాయి ప్రతి ఒక్కరికీ. పనిగట్టుకుని విమర్శించమని చెబితే, నేనైతే ఈ సృష్టిని ఇలా కాకుండా మరోలా తయారుచేద్దును అని ప్రతి ఒక్కరూ అంటారు!
దేవుణ్ని మార్చేయడానికి సిద్ధపడతారు కొందరు. దేవుడికి బోధ చెయ్యడానికి ఉద్యుక్తులవుతారు ఇంకొందరు. దేవుణ్ని పక్కనపెట్టి తామే దేవుళ్లం అంటారు మరికొందరు. మంచి ధర పలికితే దేవుణ్ని అమ్మేయడానికి ముందుకొస్తారు ఇంకొందరు. చివరికి దేవుణ్ని మాయం చేయడానికీ వెనకాడరు. మంచి జరిగినప్పుడు పొగిడి, చెడు జరిగినప్పుడు దేవుణ్ని తిట్టేవాళ్లను ఏమనాలి?
అన్ని శక్తుల్లోనూ అత్యంత గొప్పది ఇచ్ఛాశక్తి. అది స్వేచ్ఛాయుతంగా మనిషి వాడుకునే సంకల్పశక్తి. దీనితో అద్భుతాలు చెయ్యవచ్చు. ఇది జ్ఞానశక్తిగా క్రియాశక్తిగా మారుతుంది.
కల కను, నిజం చేసుకో అంటారు. కల కనాలి అంటే మనలో ఇచ్ఛాశక్తి పుష్కలంగా ఉండాలి. దీన్ని నడిపించేదే దైవశక్తి. మోక్షం వరకు తీసుకెళ్లేదీ ఇదే శక్తి. దీనిద్వారా నేనైనా నువ్వయినా చివరికి ఏ ప్రాణి అయినా తన ఆధ్యాత్మిక ప్రయాణంలో పురోగమనం సాధించడం తథ్యం.
దేవుణ్ని అర్థం చేసుకోవటం అంటే విశ్వాన్ని అర్థం చేసుకోవటమే. చెట్టును తెలుసుకుంటే అడవి తెలుస్తుంది. నది గురించి తెలుసుకుంటే సముద్రం తెలుస్తుంది. వెలుగు గురించి తెలుసుకుంటే సూర్యుడు తప్పక అర్థం అవుతాడు. శ్రద్ధ-సహనం ఉంటే జరుగుతున్న విపరీతాల వెనక సూత్రధారి ఎవరో తెలియకుండా పోతుందా?
మంచికి మంచే కారణం. చెడ్డకు తప్పనిసరిగా చెడే కారణం. తిరుగులేని ఈ అనివార్య సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని దైవాన్ని అర్థం చేసుకోవాలి. ఏది ఎవరు చేస్తున్నారో, ఎవరివల్ల జరుగుతున్నదో, ఎందుకు జరుగుతున్నదో తెలుసుకోవడానికైనా మన విమర్శలను మాని సత్యాన్వేషణ మొదలు పెట్టాలి. అప్పుడు ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో తెలిసిపోతుంది!
- ఆనందసాయి స్వామి
..........
విద్యాధనం ... ఇది కధ కాని కధ
తెలియనివారికి తెలియజేసేది విద్య. అది అనంతరూపాల్లో లోకంలో కనబడుతుంది. విద్యగలవాడు అన్నీ చక్కగా తెలుసుకోగలడు. విద్యలేనివాడు తెలుసుకోలేడు. అంటే విద్య లేనివాడు కళ్లు ఉన్నప్పటికీ గుడ్డివాడే. తెలుసుకోవడం అనేది రెండు విధాలు. ఒకటి పైచూపులతో చూడటం. రెండోది లోతుల్లోకి వెళ్లి అంతరంగాన్ని తెలుసుకోవడం. ఈ రెండు మార్గాల్లో రెండోదాన్నే 'విద్య' అని అంటారు. ఈ విద్య పైకి కనిపించని ధనం వంటిదని ప్రాచీనులు చెబుతారు. ధనం లేకున్నా విద్య ఉంటే చాలు. దానివల్ల ధనాన్ని సంపాదించుకోవచ్చు. విద్య లేకపోతే ఎంత ధనం ఉన్నా- జీవితానికి అర్థం, పరమార్థం ఉండవు.
విద్య అంటే సరస్వతి. చదువుల తల్లి. ఆమెను ఒక కవి ఇలా సంభావించాడు- 'తల్లీ, సరస్వతీ! నీ దగ్గర అపూర్వమైన ధనాగారం ఉంది. అది విద్యలతో నిండి ఉంది. ఆ ధనాగారంలో నుంచి ఎన్ని విద్యలను తోడుకున్నా, ఇంకా అవి వృద్ధి చెందుతూనే ఉన్నాయి. వాటిని ఖర్చు చేయకుంటే నశించిపోతున్నాయి. ఇలాంటి ధనాన్ని నేనెక్కడా చూడలేదు!'. అంటే, ఖర్చు చేస్తున్నకొద్దీ అభివృద్ధి చెందుతూ ఉండే విద్యాధనం గొప్పతనం ఏమిటో అర్థమవుతుంది.
సంపదలు లోకంలో అసంఖ్యాకంగా ఉన్నాయి. వాటిని లెక్కించడం అసంభవం. గడ్డిపోచను మొదలుకొని పర్వతాలదాకా నెలకొని ఉన్న వస్తువుల్లో దేని విలువ దానిదే. ప్రవాహంలో పడి కొట్టుకొనిపోతున్నప్పుడు మనిషిని గడ్డిపోచలు కాపాడవచ్చు. అవి అమూల్యమైనవే కదా! కానీ, విద్య అనే ధనం మాత్రం సర్వకాలాల్లో సకల ప్రదేశాల్లో ఎంతో విలువైంది. అది ధరించినవారికి ఆభరణంలా భాసిస్తుంది. ఆ ఆభరణానికి విలువ కట్టలేం. ఇతర సంపదలు ఎప్పటికో ఒకప్పటికి తరిగిపోతాయి లేదా నశించిపోతాయి. కానీ, విద్యాధనం మాత్రం అక్షయంగా నిలిచి ఉంటుంది. దానికి ఎన్నటికీ నాశనం లేదు.
విద్యలు ప్రధానంగా రెండు విధాలు. ఒకటి శస్త్రవిద్య. రెండోది శాస్త్రవిద్య. శస్త్రాలు (ఆయుధాలు), శాస్త్రాలు (తత్వజ్ఞాన సాధనాలు) మనిషికి ఎంతో అవసరమైనవే. ఒకటి రక్షణకు, మరొకటి ఆత్మోన్నతికి మూలం. ఈ రెండింటిలోనూ శాస్త్రవిద్యలే గొప్పవి. ఎందుకంటే శస్త్రవిద్యలు యౌవనంలో ఉన్నంత కాలమే ఉపకరిస్తాయి. వృద్ధాప్యంలో పనికిరావు. శాస్త్రవిద్యలు అలా కాదు. పండుముసలితనంలోనూ వాటిని ఉపయోగించే వీలు ఉంటుంది. కనుక జీవితాంతం ఉపయోగపడే శాస్త్రవిద్యలు మనిషికి సంపదలే! అందుకే సుభాషితకారులు- 'ఎన్నో సంశయాలను దూరం చేసేవీ, పరోక్ష ప్రయోజనాలను అందించగలిగేవీ, అన్నింటినీ చూడగలిగే కన్నులవంటివీ అయిన శాస్త్రాలను మనిషి ఎన్నడూ వదిలిపెట్టరాదు. శాస్త్రాలను తెలుసుకోలేని మానవుడు కళ్లుండి కూడా చూడలేనివాడే అవుతాడు' అని ప్రబోధించారు.
ఎన్ని సంపదలను అపారంగా కూడబెట్టినా మనిషికి మానసిక శాంతి ఉండదు. ఎప్పుడు ఏ దొంగ వచ్చి దోచుకొనిపోతాడో అని బిక్కుబిక్కుమంటూ కాలం గడపాలి. ధనం ఎక్కువగా ఉంటే ప్రభువుల కళ్లు దానిపై పడతాయి. ఆ ధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. అన్నదమ్ములూ డబ్బుకోసం పోట్లాడతారు. తమకు వాటా ఇమ్మంటారు. ఇవ్వకుంటే చంపడానికైనా సిద్ధపడతారు. అంతేకాదు, అపారంగా ఉన్న డబ్బును ఎక్కడ దాచాలో తెలియదు. ఎవరికంటా పడకుండా ఎక్కువకాలం దాచడం కష్టమే. అందువల్ల ధనం భారమే అవుతుంది. విద్యాధనం మాత్రం అలాకాదు. ఏ దొంగలూ విద్యను దోచుకోలేరు. ప్రభువులూ గుంజుకోలేరు. అన్నదమ్ములూ పంచుకోలేరు. ఎంత విద్య ఉన్నా ఏ భారమూ లేదు. అందుకే ప్రపంచంలోని అన్ని సంపదల్లో 'విద్య' అనే సంపదకు ఉండే విలువ ఇంతా అంతా కాదు.
విద్యావంతుణ్ని విద్య తల్లిలా సదా రక్షిస్తుంది. కట్టుబట్టలతో విదేశాలకు వెళ్లినా, విద్యావంతుడు పుష్కలంగా డబ్బు సంపాదించుకోగలడు. విద్యావంతుణ్ని విద్య తండ్రిలా ముందుకు నడిపిస్తుంది. ఏది హితమో అదే చెబుతుంది. వేదనలు, కష్టాలు ముంచుకొని వచ్చినప్పుడు వాటిని విద్య దూరం చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే- విద్యకూ, కల్పవృక్షానికీ ఏ భేదమూ లేదు. విద్యగలవాడు కల్పవృక్షం నీడలో ఉన్న దేవుడివంటివాడే. ఇందులో ఎంతమాత్రం సందేహంలేదు.
ఎన్ని కష్టాలు అనుభవించినా సరే, ఎంత ధనాన్ని వెచ్చించినా సరే, ఎన్ని త్యాగాలు చేసినా సరే- విద్యావంతుడు కావడానికే మనిషి ఆజీవనాంతం ప్రయత్నించాలి. విద్య ఒక్కటే మనిషి బతుకుకు వెలుగు!
డాక్టర్ అయాచితం నటేశ్వరశర్మ
No comments:
Post a Comment