*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁
*శ్రీ భాగవతం - 98 వ భాగం*
*చదువుకుందాం భాగవతం*
*బాగుపడదాం మనం అందరం*
*దశమ స్కందము*
*శ్రీకృష్ణ లీలలు - 28*
🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁
*రుక్మిణీ కళ్యాణం*
కృష్ణపరమాత్మ, రుక్మణీదేవి పంపిన లేఖను చదివి, దానిని పక్కనపెట్టి, అగ్నిద్యోతనునితో, ‘ఈ పిల్ల నాకు లేఖ వ్రాయడం కాదు. ఈ పిల్ల గురించి నేను ఎప్పుడో విని రుక్మిణీదేవిని వివాహం చేసుకోవాలని నిద్ర పోగొట్టుకుంటున్నాను. ఎంత తొందరగా వద్దామా అని అనుకుంటున్నాను’ అన్నారు.
ఈశ్వరుని దృష్టిలో రాత్రి నిద్రలేదు అంటే ఎవరు తనని పొందాలనుకుంటున్నారో అటువంటి వారిలో అజ్ఞానమును తీసి వాళ్ళను తాను పొందడానికి ఆ మహానుభావుడు ఆర్తి చెందిపోతూ ఉంటాడు.
అపుడు అగ్నిద్యోతనుడు అన్నాడు, “ఆ అమ్మాయి నీకు తగినది. ఆమెకు నీవు తగినవాడివి. మేము గురువులము. నేను అగ్నిద్యోతనుడిని. అగ్ని అనేది స్వయం ప్రకాశము. అజ్ఞానమును దగ్ధం చేసేస్తుంది. అటువంటి భగవంతుని చూపించేవాడు గురువు. ఈశ్వర దర్శనాభిలాషి అయిన వాడిని భగవంతుని వైపుకి తీసుకువెడతాడు. మేము గురువులము ఆశీర్వచనం చేస్తున్నాము. మీ యిద్దరికీ వివాహం అవుతుంది. ఇంకా ఎందుకు ఆలస్యం? ఈలోకంలో ఒక గొప్ప సంప్రదాయమును నిలబెట్టు.
శరణాగతి చేసిన వారిని ఈశ్వరుడు రక్షిస్తాడు అనే ఒక ధైర్యం నిలబడాలి. కాబట్టి కృష్ణా! నీవు వెంటనే బయలుదేరి రావలసినది’ అని చెప్పాడు.
ఈమాట వినగానే వెంటనే కృష్ణుడు తన రథసారథిని పిలిచాడు. అన్నగారికి కూడా ఈవిషయం చెప్పలేదు. మనస్ఫూర్తిగా పిలిచిన వారికోసం పరుగెత్తడానికి పరమాత్మ ఎంత సిద్ధంగా ఉంటారో చూడండి. సారథిని పిలిచి రథం సిద్ధం చేయమన్నారు. అగ్నిద్యోతనునితో కలిసి రథం మీద కూర్చుని గబగబా వచ్చేస్తున్నారు. ‘తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడు?” అని బలరాముడు అడిగాడు.
‘విదర్భరాజ్యములోని కుండిన నగరమునకు రుక్మిణీ దేవిని రాక్షస వివాహం చేసుకొని తీసుకు రావడానికి వెళ్ళారు అన్నారు. అన్నగారి ప్రేమ అన్నగారిది. తమ్ముడు ఒక్కడే వెళ్ళాడని సైన్యమును తీసుకొని వెనకాల బలరాముడు వెళ్ళాడు.
కృష్ణ పరమాత్మ కుండిన నగర వీధులలో తిరుగుతున్నారు. అక్కడి వారు ఆయనను చూసి ఏమి అందగాడురా మహానుభావుడు- ఆ నెమలి పింఛం, ఆ జుట్టు, ఆ నోరు, ఆ గడ్డం, ఆ ముక్కు , ఆ కిరీటం
*కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం*
*నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం*
*సర్వాంగే హరి చందనం చ కలయమ్ కంఠేచ ముక్తావళీం*
*గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణిః!!*
ఎంత అందంగా ఉన్నాడు! నిజంగా వివాహం జరిగితే రుక్మిణీ కృష్ణులకే వివాహం జరగాలి’ అని పొంగిపోతున్న సమయంలో అంతఃపురం లోపల పాపం రుక్మిణీదేవి కంగారు పడుతోంది.
*ఘను డా భూసురు డేగెనో? నడుమ మార్గశ్రాంతుఁ డై చిక్కెనో?*
*విని, కృష్ణుం ఇది తప్పుగాఁదలఁచెనో? విచ్చేసెనో? యీశ్వరుం*
*డనుకూలింపఁ దలంచునో తలఁపడో? యార్యా మహా దేవియున్*
*నను రక్షింప నెఱుంగునో యెఱుఁగదో? నా భాగ్య మెట్లున్నదో?*
‘అగ్నిద్యోతనుడు వెళ్ళాడో లేదో! మార్గమధ్యంలో ఏదయినా బడలికను పొందాడో! ఒకవేళ నిజంగా అంతఃపురం లోకి వెళ్లి నేను రచించిన లేఖను ఇచ్చినప్పటికీ ఆడపిల్ల ధూర్తతనంతో యిలా రాయడమేమిటని కృష్ణుడు రానని అన్నాడో! నేను కృష్ణుని పొందగలనో లేదో’! అని ఆవిడ వ్యాకులత చెందుతోంది.
కానీ కృష్ణుని చూసిన ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు.
*"తగు నీ చక్రి విదర్భరాజసుతకుం; దథ్యంబు వైదర్భియుం*
*దగు నీ చక్రికి; నింత మంచి దగునే? దాంపత్య మీ యిద్దఱిం*
*దగులం గట్టిన బ్రహ్మ నేర్పరిగదా; దర్పాహతారాతియై*
*మగఁడౌఁ గావుతఁ జక్రి యీ రమణికిన్ మా పుణ్యమూలంబునన్."*
‘నిజంగా చతుర్ముఖ బ్రహ్మగారు ఎంత గోప్పవారో! కృష్ణుడి కోసం రుక్మిణిని పుట్టించాడు. రుక్మిణి కోసం కృష్ణుడిని పుట్టించాడు. వీరిద్దరూ దంపతులైతే ఎంత బాగుంటుందో! కానీ తండ్రి ఈమెను శిశుపాలునకిచ్చి వివాహం చేస్తాను అంటున్నాడు. వీళ్ళిద్దరికీ వివాహం అవడానికి ఆ శిశుపాలుడి అడ్డం తొలగిపోయి కృష్ణుడు ఈవిడ పక్కన చేరడానికి మా పుణ్యములనన్నిటిని యిచ్చేస్తాము. మా పుణ్య ఫలములను కూడా ఆవిడే తీసుకొని కృష్ణుని భర్తగా పొందాలి’ అని ఆ ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు.
ఈశ్వరుని చూసేసరికి ఆ జననీ జనకులిద్దరూ సింహాసనం మీద కనపడాలని లోకం తాపత్రయ పడిపోతుంది. అమ్మవారు అన్న మాటలో, *‘ఆర్యామహాదేవి’* అనే ఒక గమ్మత్తయిన మాట వుంది. ఇదే రుక్మిణీ కళ్యాణమునకు ఆయువుపట్టు అంటారు పెద్దలు.
*బాణత్వం వృషభత్వ మర్థవపుషా భార్యాత్వ మార్యాపతే*
*ఘోణిత్వం సఖితా మృదంగవహతా చేత్యాది రూపం దధౌ*
*త్వత్పాదే నయనార్పణంచ కృతవాన్ త్వద్దేహభాగో హరిః*
*పూజ్యాత్ పూజ్యతర స్స ఏవహి నచేత్ కోవా తదన్యోధికః!!*
శ్రీమహావిష్ణువు శంకరుని అనేక రూపములతో సేవించి సేవించి ఆర్యామహాదేవి అనే పేరుతొ పరమశివుని ఇల్లాలు అయినాడు. ఈ ఆర్యామహాదేవికి సంబంధించిన పద్యం విన్నా, చదివినా, ఒక ఫలితం వస్తుంది. ఆడపిల్ల నొసటన అల్పాయుర్దాయం ఉన్నవాడు లేదా ఐశ్వర్య భంగమైపోయినవాడు లేదా సంతానమును పొందలేని వాడు ఇలాంటి భంగపాట్లు ఉన్న పురుషునితో వివాహం అవాలని ఆడపిల్లకు రాసి వుంటే ఎవరు ఈ పద్యములు వింటున్నారో, ఎవరు ఈ పద్యములు చదువుతున్నారో, ఎవరు రుక్మిణీ కల్యాణం చూస్తున్నారో, వారి నొసటవ్రాత మారి శిశుపాలుడు తప్పి కృష్ణుడు వచ్చినట్లు యోగ్యుడయిన వరుడు వస్తాడు. అందుకని పూర్వం కన్నెపిల్లల చేత రుక్మిణీ కళ్యాణం చదివించేవారు. రుక్మిణీకళ్యాణం చదివినా, చూసినా మనకి కొన్ని కోట్ల జన్మలనుండి వస్తున్న పాపరాశి వలన ఏర్పడిన కర్మవాసనలు తొలగి బుద్ధి చేత ఈశ్వర పాదములు పట్టగలుగుతాము. అది పెళ్లి అయిపోయిన వాళ్లకి వచ్చే ఫలితం. కాబట్టి అన్ని స్థాయిలలో ఉన్న వాళ్ళని రుక్మిణీ కళ్యాణం ఉద్ధరించేస్తుంది.
ఇప్పుడు అగ్నిద్యోతనుడు రుక్మిణీ దేవి వద్దక పరుగెత్తుకు వచ్చి ‘కన్యకా కృష్ణుడు నీ గుణములు మెచ్చుకున్నాడు. నీవంటి శిష్యురాలికి గురువు నయినందుకు నాకు ఎంతో ధనమునిచ్చాడు. సుదర్శన చక్రమును పట్టుకొని వచ్చేశాడు. దేవతలు రాక్షసులు కలిసివచ్చినా సరే రాక్షస వివాహంతో నిన్ను తీసుకువెడతాడు. నీ జీవితం ఫలించింది’ అన్నాడు.
ఇప్పుడు రుక్మిణీదేవి పరమసంతోషమును పొందింది. అమ్మవారు రుక్మిణీదేవి పార్వతీ పరమేశ్వరుల ఆరాధన చేసింది. ఆడపిల్ల అయిదవతనం నిలబడాలంటే గౌరీతపస్సు చేయాలి. గౌరీతపస్సు చేయించేటప్పుడు ఆమెచేత అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తారు. అమ్మవారి అనుగ్రహమును ఆ కుంకుమార్చన వలననే పొందగల్గుతారు. కన్య సువాసినిగా మారబోతోంది. ఆ పిల్ల ఆ తరువాత తల్లి కావడానికి అన్నిటికి కావలసిన అదృష్టం అప్పుడే కటాక్షింపబడుతుంది. గౌరీతపస్సు జరుగుతున్నంత సేపు ఆడపిల్ల తదేక దృష్టితో పార్వతీదేవిని ఆరాధన చేయాలి. అందుకే రుక్మిణీ దేవి ఎవరితో మాట్లాడకుండా మౌనంగా దేవాలయమునకు వెళ్ళింది.
భీష్మకుడు కొన్ని మంగళ సూత్రములు చేయించి వృద్ధ ముత్తైదువులకి ఇప్పించాడు. గౌరీతపస్సు అయ్యేవరకు ఆ పిల్ల మాట్లాడకూడదు. మీరు మాట్లాడించకూడదు. ఆమె గౌరీదేవి మీద కుంకుమ వేస్తూ తదేక ధ్యానంతో ఆ నామములు వినాలి. అప్పాలు పరమ పవిత్రమయిన వంటకము. భీష్మకుడు అప్పాలు వండించి ఒక్కొక్క అప్పం, చెరకు కర్ర, మంగళసూత్రం రుక్మిణి చేత ముత్తైదువలకు ఇప్పించాడు. అప్పుడు చెప్పింది
*నమ్మితి నా మనంబున సనాతను లైన యుమామహేశులన్*
*మిమ్ముఁ బురాణదంపతుల మేలు భజింతుఁ గదమ్మ! మేటి పె*
*ద్దమ్మ! దయాంబురాశివి గదమ్మ హరిం బతిఁ జేయు మమ్మ! ని*
*న్నమ్మినవారి కెన్నటికి నాశము లేదు గదమ్మ! యీశ్వరీ!”*
సనాతనులయిన పార్వతీ పరమేశ్వరులను నేను మదిలో నమ్ముకుని ఉన్నాను. మీరు యిద్దరు కూడా సనాతనముగా ఆదిదంపతులు. అమ్మా, నీవు తరగని అయిదవ తనంతో ఉన్నావు. అలా నన్ను కూడా అయిదవతనంతో నిలబెట్టవా! ఓ ఈశ్వరీ, నీవు దయకు సముద్రము వంటి దానివి. కృష్ణుని నాకు భర్తగా చేయవలసింది. నిన్ను నమ్మిన వాళ్లకు ఎన్నటికీ నాశనమన్నది లేదు. రక్షించి తీరుతావు’ అంది.
తాను చేసిన ఆరాధనకు కృష్ణుడు వచ్చి తీరుతాడని తలచినది. రుక్మిణీదేవి సౌందర్యమును చూసిన ఎందఱో రాజులు తట్టుకోలేక తమ తమ రథముల నుండి క్రింద పడిపోయారు.
*కనియెన్ రుక్మిణి చంద్రమండలముఖుం* *గంఠీరవేంద్రావలగ్ను, నవాంభోజదళాక్షుఁ,* *జారుతరవక్షున్, మేఘ సంకాశదే
హు,* *నగారాతిగజేంద్రహస్తనిభబాహుం, జక్రిఁ, బీతాం బరున్,*
*ఘనభూషాన్వితుఁ గంబుకంఠు, విజయోత్కంఠున్ జగన్మోహనున్!!*
రుక్మిణీ దేవికి, రథంలో నిలబడి పట్టుపీతాంబరము కట్టుకొని, ఎడం చేతితో అలవోకగా పగ్గములు పట్టుకుని చిరునవ్వుతో రుక్మిణీదేవి వంక చూస్తూ, నవ్వుతూ నిలబడిన కంబుకంఠుడయిన పరమాత్మ దర్శనం అయింది. పగ్గములు విడిచిపెట్టాడు. రథమును దిగాడు. శరణాగతి చేసిన వారి కోసం తానే దిగివచ్చి నడిచి వచ్చాడు. శరణాగతిలో ఈశ్వర వైభవం ప్రకాశించింది. ఈశ్వర ప్రతిజ్ఞ! తానే రథం దిగి నడిచి వచ్చాడు. అలవోకగా అమ్మవారి చెయ్యి పట్టుకున్నాడు. తన రథం ఎక్కించుకున్నాడు. ఇంతమందీ వాళ్ళిద్దరినీ చూస్తూనే ఉన్నారు. ఎవరికీ స్పృహ లేదు. రథమును తోలుకుంటూ వెళ్ళిపోతున్నాడు. తరువాత వీళ్ళందరికీ స్పృహ వచ్చింది.
కృష్ణుడు రుక్మిణీ దేవిని ఎత్తుకుపోయాడు అన్నారు. పరుగు పరుగున వెళ్లి ఈ విషయమును శిశుపాలుడికి, జరాసంధుడికి చెప్పారు. కొంతమంది కృష్ణుని పట్టుకుందామని కృష్ణుని రథం వెంట పడ్డారు. కృష్ణుడు సుదర్శన చక్రంతో వారి కుత్తుకలను కత్తిరించేశాడు.
శిశుపాలుడు జరాసంధుడి దగ్గరకు వెళ్ళాడు జరాసంధుడు అన్నాడు.
*బ్రతకవచ్చు నొడల ప్రాణంబులుండిన*
*బ్రతుకు కలిగెనేని భార్య కలదు బ్రతికితీవు;*
*భార్యపట్టు దైవమెరుంగు, వగవ* *వలదు చైద్య! వలదు వలదు!!*
శిశిపాలా, నీవు చాలా అదృష్టవంతుడివి. కృష్ణుడి దగ్గరకు వెళ్లి చచ్చిపోకుండా వెనక్కి వచ్చావు. పెళ్లి అయిపోతే పోయింది. మరొక భార్య దొరుకుతుంది. బ్రతికానని సంతోషపడు’ అన్నాడు.
ఒక్క రుక్మి మాత్రం ఒక గోపాల బాలుడు తన చెల్లిని అపహరించడం ఏమిటని అపారమయిన ఆవేశంతో కృష్ణుని రథం వెంట పడి
*మా సరివాడవా మా పాప గొనిపోవ?*
*నేపాటి గలవాడ? వేది వంశ?*
*మెందు జన్మించితి? వెక్కడ బెరిగితి?*
*వెయ్యది నడవడి? యెవ్వడెరుగు?*
*మానహీనుడ వీవు? మర్యాద లెరుగవు;*
*మాయ గైకొని కానీ మలయ రావు;*
*నిజరూపమున శత్రు నివహంబుపై బోవు;*
*వసుధీశుడవు గావు వావి లేదు;*
*కొమ్మ నిమ్ము; నీవు గుణరహితుండవు,*
*విడువు; విడువవేని విలయకాల* *శిఖిశిఖా సమాన శిత శిలీముఖముల*
*గర్వమెల్ల గొందు గలహమందు!!*
రుక్మి తెలియకుండానే స్తుతి చేసేస్తున్నాడు. ‘నువ్వు గోపాల బాలుడివి. ఎక్కడో పుట్టిన వాడివి. ఆలమందల వెనకాల తిరిగిన వాడివి. నీకు మా పిల్ల కావలసి వచ్చిందా! మా పిల్లను ఎత్తుకు పోతావా? నిలు,నిలు కృష్ణా, నిన్ను యిప్పుడే తుదముట్టించేస్తాను’ అని వస్తున్నాడు.
కృష్ణుడు చూశాడు. రుక్మి తనను ఇంత నింద చేస్తున్నాడు. కానీ అది స్తుతిపాఠం అయిపొయింది.
నిజంగా పరమాత్మకు జన్మమేమిటి? కులం ఏమిటి? వంశం ఏమిటి? ఇది తెలియక వెర్రివాడు ప్రలాపిస్తున్నాడు. కృష్ణ పరమాత్మ ఒక్కసారి సుదర్శన చక్రమును చేత్తో పట్టుకొని సంకల్పం చేస్తున్నారు.
*అని డగ్గుత్తికతో మహాభయముతో నాకంపితాంగంబుతో*
*వినత శ్రాంత ముఖంబుతో శ్రుతిచలద్వేణీకలాపంబుతోఁ*
*గనుదోయిన్ జడిగొన్న బాష్పములతోఁ గన్యాలలామంబు మ్రొ*
*క్కిన రుక్మిం దెగవ్రేయఁబోక మగిడెం గృష్ణుండు రోచిష్ణుఁడై.*
అసలు కన్నులమ్మట నీరు పెట్టవలసిన అవసరం లేక తన కడగంటి చూపులతో లోకమునకు ఐశ్వర్యము నీయగలిగిన శ్రీమహాలక్ష్మి తన తోడబుట్టినవాడు మరణిస్తాడేమోనని యింకా పెళ్ళి కాకుండానే కృష్ణుడితో వెళుతున్నది, భయపడి పోయి వణికిపోతున్న శరీరముతో ఆయన కాళ్ళు పట్టుకొని కళ్ళ వెంబడి నీళ్ళు కారిపోతుండగా ఈశ్వరా, నా అన్నకు ప్రాణ భిక్ష పెట్టు’ అని ఆయన పాదములు పట్టుకుంది. అపుడు కృష్ణుడు ‘వీనికి ప్రాణం తీసినంత పని చేస్తాను’ అని కిందికి దిగి, కత్తి తీసి, రుక్మి తల పట్టుకొని పాయలు పాయలుగా తల గెడ్డం గొరిగేసి వదిలి పెట్టేశారు. వాడు గుంజుకుంటుంటే కృష్ణుడు తనపై ఉత్తరీయము తీసి రుక్మిని బండికి వేసి కట్టేసి తల గొరిగి విరూపుని చేసి వదిలేశారు. రుక్మిణీదేవి చాలా బాధ పడింది. బలరాముడు వచ్చి ఓదార్చాడు.
తదనంతర రుక్మిణీ కృష్ణులు హాయిగా ద్వారకా నగరమును చేరుకున్నారు.
*ధ్రువకీర్తిన్ హరి పెండ్లియాడె నిజ చేతోహారిణిన్ మాన వై*
*భవ గాంభీర్య విహారిణిన్ నిఖిల సంపత్కారిణిన్ సాధు బాం*
*ధవ సత్కారిణిఁ బుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్*
*సువిభూషాంబర ధారిణిన్ గుణవతీచూడామణిన్ రుక్మిణిన్.*
ఆరోజున శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని పెండ్లి చేసుకున్నాడు. మంచి పట్టుపుట్టం కట్టుకున్నది, దరిద్రమును నాశనం చేయగలిగినది, ఇంటికి వచ్చిన బంధువులను స్నేహితులను ఆదరముతో చూడగలిగినది, పుత్రపౌత్రాభివృద్ధిగా వంశమును పెంచగలిగినది, చక్కటి చిరునవ్వుతో అందరిని ఆదరించే స్వరూపం ఉన్నది, మంచి గుణములు కలిగినది, అయిన రుక్మిణీ దేవిని కృష్ణుడు ద్వారకా నగరమునందు పెద్దలందరి సమక్షములో వివాహమును చేసుకున్నాడు.
*అనఘ! ఆదిలక్ష్మియైన రుక్మిణి తోడఁ*
*గ్రీడ సలుపుచున్న కృష్ణుఁ జూచి*
*పట్టణంబులోని ప్రజ లుల్లసిల్లిరి,*
*ప్రీతు లగుచు ముక్త భీతు లగుచు!!*
ఆ శ్రీమహాలక్ష్మియే రుక్మిణీ దేవి. ‘ఆవిడ పక్కన కృష్ణుడు కూర్చుంటే ఆవిడ మన మొరలు వినిపిస్తుంది. దయాశాలియై మనలను రక్షిస్తుంది. ఇంక మనకి ఏమి కావాలి! మనం అందరం భయములను వదిలిపెట్టి పరమసంతోషంగా ఉండవచ్చు’ అని ప్రజలందరూ భావించారు అని,.....
శుకయోగీంద్రుడు పరీక్షిత్తుకు రుక్మిణీకళ్యాణగాథ వినిపించాడు.
🙏 *శ్రీకృష్ణలీలలు ఇంకా ఎన్నో.......* 🙏
🙏 *కృష్ణ తవాస్మి నచాస్మి పరస్య*🙏
*నాగ సుబ్బయ్య పైడి* (సశేషం.....)
🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹
ప్రాంజలి ప్రభ అభిమానులందరికి మా ఒక్కరోజు ప్రయాణం లో అనుభవాలు (30 -12 - 2017 మీతోపంచుకోవాలని ఒక లక్ష్యం తో దైవ దర్సన (పుండరీకుని, గోపాలుని, నాగేంద్రునిని మరియు కృష్ణమ్మ సముద్రునితో సంగమ హంసలదీవి విశేషాలు తెలుపుటకు సాహసిస్తున్నాను.
ఒక్కసారిగా మేలుకు వచ్చింది లేచి చూస్తే తెల్లవాయుజమునా 4 .00 గంటలు అయినది వెంటనే అలవాటు ప్రకారముగా కాలకృత్యాలు తీర్చుకొని వేగముగా స్నానము చేసి "ఓం శ్రీరామ్ " అనుకుంటూ ఏదన్న వ్రాద్దామని కూర్చున్న ఆ గోపాల కృష్ణుని లీలలు గుర్తుకు వచ్చాయి రాద్దామనుకునే టప్పడికల్లా
" ఏమండి మీరు నన్ను లేపితే నేను లేచేదానివిగా ఒక్క పదినిముషాలలో నేను కూడా స్నానము చేసి వస్తాను వెంటనే మనం పుండరీకుని చూచుటకు మచిలీపట్టణం వెల్దామంది అప్పుడే చూసాను నా సెల్లులో చార్జి లేదు ఒకవితాపు చార్జి పెట్టి టివి ఆన్చేశాను అప్పుడే సూక్తుల్లో గ్రహాలూ శాంతులు పూజలు విషయాలు చెపుతున్నారు " నాశ్రీమతి వింటున్నది అప్పుడు నేను నాకు నచ్చవు ఇవి అన్నాను, మీకు ఎప్పుడు ఏమి నచ్చావని అన్నది అప్పుడు నేను అన్నాను సంపదకు రోజుకొక దేవుణ్ణి పూజచేయ మంటారు నేననేదేమిటంటే మన:శాంతి కల్పించే నమ్మిన దేవుణ్ణి ప్రదించామని చెప్పాలని ప్రయత్నిమ్చా అంతలోనే కాఫీ అందిస్తూ నేను సిద్దమే మనం బయలు దేరుదామన్నది. అంతే కంప్యూటర్ తీయకుండా కాలినడకను బుద్ధి చెప్పి ఇద్దరం ఏలై న్ సెంటార్ వరకు నడిచాము. కొండపల్లి మెట్రో బస్సు రావడం బాస్ స్టేషన్ వరకు టికెట్ తీసుకోవటం జరిగింది.
ఒక వైపు చల్లని గాలి, మరోవైపు చీకటిని చీల్చుకుంటూ వచ్చే వేలుతురులాగా వేగంగా బయలు దేరింది బస్సు, ప్రయాణికులు ఎక్కుతున్నారు దిగుతున్నారు, అప్పుడే మేము కూర్చున్న బస్సు అద్దం లేకపోవుటవళ్ళ గాలితోపాటు మంచు తుషారబిందువులు తెరిచినా కిటికిద్వారా రావటం మొదలుపెట్టాయి ఆ చల్ల గాలికి తట్టు కోలేక వేరొక సీటుకు మారటం కొద్ది నిముషాలకే బస్సు (విజయవాడ ) స్టేషన్ చేరుట జరిగింది.
అల్పాహారం తిందామనుకున్నాము అప్పుడే సూపర్ డీలక్స్ మచిలీపట్టణం బస్సు రావటం (నాన్ స్టాప్ ) అప్పుడే లైన్లో ఉండి టిక్కెట్టు తీసుకోవటం చిల్లరలేక ఒకరూపాయి బాకీ పెట్టి మరీ బస్సు ఎక్కాము, నోటి దురదకు చిప్స్ ప్యాకెట్ తినటం జరిగింది బస్సు బయలు దేరింది. కొత్త రోడ్డు వేస్తున్నందువల్ల పాతరోడ్డుద్వారా వాహనాలు నడుపువల్ల వేగము తగ్గింది అప్పుడే నా ఆలోచన కృష్ణ భగవానుని తలుస్తూ ఏదన్న రాద్దామని అనుకున్న న ఆలోచన పాఠం 16 లైన్ల శ్రీ కృష్ణ భగవానుని ఆరాధన కవిత వయగలిగాను. సెల్లు ద్వారా వ్రాద్దామని ప్రయత్నిమ్చాను చార్జి లేదు. చేసేదిలేక ఊరుకున్నాను
వసుదేవ సుతం దేవం
దేవకీ పరమానంద కృష్ణం
మురళీ గాణలీల మాధుర్య మకరంద
రావళీ మోహలీల ఆకర్ష సుఖనంద
సరళీకృత మోక్ష తన్మాయ లతనంద
నవనీతాశ ప్రియ మోహన వలనంద
పలుభావాల రాగ సంతృప్తి ముఖనంద
పలువేషాల తాప చిన్మాయ రమనంద
సుఖలాలిత్వ సేవ తన్మంత్ర అభినంద
మనసావాచ ప్రీతి కల్పించే సఖి నంద
కరుణాశీల వాళ ఉద్భోద గురునంద
తరుణాదిత్య భావ స్సద్బోధ భగనంద
నవరాగాల ప్రేమ సంతోష లయనంద
తనువాదిత్య శోభ ఆనంద జగనంద
నవమాసాలు బిడ్డ ఆదర్శ సుఖనంద
నవభావాల పుత్ర ఆకాంక్ష సమనంద
నవరూపాల శక్తి స్వరూప చరనంద
నవలోకాల భాగ్య అందించె సుమనంద
వసుదేవ సుతం దేవం
దేవకీ పరమానంద కృష్ణం
అపుడే మచిలీ పట్నం చేరుట జరిగింది బస్సు దిగి ఆటో ఏడెక్కాలా ఆలోచిస్తూ ఉంటె ఆటోవాలా ఒకరువచ్చి ఎక్కడికి పోవాలి అని అడగటం, 40 ఇవ్వండి రంగనాథుని దేవాలయము వరకు తీసుకోని వెళాతామనటం మేము క్కటం క్షణంలో జరిగిపోయినది. ఆదేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఏదన్న అల్పాహారం తీసుకుందామనుకున్నాము. అఆటోలో దేవాలయమునకు బయలు దేరాము. తర్వాత కత తర్వాతే
ఒక్కరోజు ప్రయాణం లో అనుభవాలు (30 -12 - 2017 )
నా ఆలోచనల నుండి పండరంగ మనోహారుడు, లీలా మానస మృదుహాస హృదయుడు.
నవ్వులు చిందిస్తున్న రంగా
నాట్యభంగిమలో ఉన్న రంగా
కవచాన్ని ధరించి చూస్తున్న రంగా
ప్రజలకు రక్షణగా ఉన్న పాండు రంగా
మమతల గుడిలో రంగా
మనసును పంచే రంగా
మానవతను చూసే రంగా
వెలుగును పంచే పాండు రంగా
ఆశాభావం చూపే రంగా
వాస్తవం తెలిపే రంగా
ప్రార్ధించగా పల్కే రంగా
ప్రేమ పంచే పాండు రంగా
కల్ముషం లేని ప్రేమపంచ్చేరంగా
నిర్మల మైన మనస్సుఇచ్చేరంగా
ప్రకృతిని ప్రశాంత పరిచే రంగా
ప్రమాదాన్ని తప్పించే పాండురంగా
ఆ తర్వాత శివ గంగ దేవాలయమునకు ఆటోలో బయలు దేరాము, అక్కడ వెళ్లి చూస్తే ముందు ప్రహరీ గోడ చాలా పాతదేవాలయముగా ఉన్నది , లోపలకు వెళ్లి చూస్తే పూర్తిగా రాతితో కట్టబడిన దేవాలయము విశాలమైన ప్రాంగణం ఆదేవాలయము చుట్టూ చిన్న దేవాలయములు ఉన్నాయి రామాలయము, శివాలయము, అనేక అమ్మవారి దేవాలయములు చల్లపల్లి రాజాగారు కట్టించినట్లు అక్కడ ఉన్న బ్రహమణులు తెలియపరిచారు, ఇక్కడ దిబ్బేన అనేది లేదు ఇక అమ్మవారు జ్యోతిర్మయమై కాంతివంతముగా వెలిగిపోతూ సమస్త లోకాలు చూస్తున్నట్లు ఉన్నది
లయాలయ - స/జ/భ/ర/జ/జ/ర/స/య, రెండేసి పాదములకు ప్రాసయతి
IIUI UIU - IIUI UIU - IIUI UIU - IIUI UU
లలిత శృంగార సాహిత్యం (3)పంజలి ప్రభ
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
వనమందుఁ బువ్వులే - వనమందు గువ్వలే-
వనమందు నవ్వులే - నను జూడ రావే
మనసంత వన్నెలే - వయసంత చిందులే
తనువంత మెర్పులే - నను కల్వ రావే
కనులందుఁ గావ్యమే - కనులందు భవ్యమే -
కనులందు భావ్యమే - కనుముందు లేవే
స్వనమందు గీతులే - స్వనమందుఁ బ్రీతులే -
స్వనమందు భ్రాతులే - స్వనమిందు రాదే
మనమందు దాహమే - మనమందు మోహమే -
మనమందు వ్యూహమే - తనువిందు లేదే
కనువిందు చేయవే - కనువిందు చూపవే
కనువిందు ఆశలే - కనుపాప లేపవే
--(())--
ఛందస్సు (కుసుమవిచిత్రా )
IIII UU - IIII UU .... (3) 1111UU11
మనసున ఊగే - తలపుల వేళే
తమకము రేపే - తనువులు కల్సే
కళలను పెంచే - కధలను తెల్పే
మనసులు పండేనులె
వయసులు పొంగే - వలపులు సాగే
వరుసలు కల్సే - వలపులు చిందే
తనువులు పొంగే - తలపులు కల్గే
చినుకులు రాలేనులె
మెరుపులు సాగే - ఉరుముల శబ్దం
తరువులు ఊగే - పవనము వీచే
అణుకువ చెందే - మనుగడ పండే
చెమటలు పట్టేనులే
కలువలు మెర్పే - చిరతలు మోగే
కరములు కల్పే - కుబుసము చిందే
తరువులు కద్లే - చినుకులు చిందే
కధకలతీర్చేనులె
ఆరాధ్య రక్తి లీల
ప్రాంజలిప్రభ
ఇందుముఖి ఈప్సిత చూపులకు
ఇంతి వయ్యారపు వలపులకు
ఇభయాన దీపావళి తల్కుకు
ఇదీవరాక్షి ఆనంద కుక్కుకు
లొంగని వారెవ్వరు లేరులే
ఇందువదన సఖ్యతకు
ఇగురాకుబోణి పిల్పుకు
ఇందునిబాష్య పాదాలకు
ఇగురాకుబోడి మాలకు
లొంగని వారెవ్వరు లేరులే
ఉజ్వలాంగి భగభగలకు
ఉగ్మిలి ఉన్నతోత్తమునకు
ఉవిధ ఊరించి మనసుకు
ఊసిరి వెల్లిలా మార్పుకు
లొంగని వారెవ్వరు లేరులే
-((**))--
ఆరాధ్య రక్తి లీల
ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడరామకృష్ణ
తన్వంగి తప్పిదములకు
తన్వి తనువు తాపముకు
తమ్మికింటి తన్మయమునకు
తరళలోచన నమ్మకముకు
తరలేక్షణ తడబడి నడకకు
తలిరుబోడి చురుకుదనముకు
తలోదరి తమకమునకు
లొంగని వారెవ్వరు లేరులే
తామరకంటి తాపమునకు
తామరసనేత్ర చూపులకు
తియ్యబోడి తలుపులకు
తీగబోడి మెలికకు
లొంగని వారెవ్వరు లేరులే
తెఱువ తెగువకు
తెలిగంటి వలపుకు
తొగవకంటి తోపుడుకు
తొయ్యలి తమకమునకు
No comments:
Post a Comment