Sunday, 30 May 2021

 

🕉️ *వైశాఖ పురాణం 21వ అధ్యాయము* 🕉️

*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |*

*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్*

🌻 *పాంచాలరాజు సాయుజ్యము* 🌻

💫🌹నారదుడంబరీషునితో తరువాతి వృత్తాంతము నిట్లు చెప్పసాగెను. శ్రుతదేవమహాముని శ్రుతకీర్తి మహారాజుతో నిట్లనెను.

💫🌹పాంచాలరాజు శ్రీహరిని జూచి సంతోషపడినవాడై వెంటనే లేచి శ్రీహరికి  నమస్కరించెను. ఆనంద బాష్పములను విడుచుచుండెను. సర్వజగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణములగు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్రజలమును తనపై జల్లుకొనెను. విలువైన వస్త్రములు ఆభరణములు, గంధ పుష్పాదులు, పుష్పమాలలు, ధూపములు, అమృతప్రాయములగు నివేదనలు, తన శరీరము, తన ధనము, తన సర్వస్వమును శ్రీహరికి సమర్పించెను. ప్రాచీన పురుషుడు నిర్గుణుడు సాటిలేనివాడునగు శ్రీమహావిష్ణువును యిట్లు స్తుతించెను.

నిరంజనం విశ్వసృజామధీశం వందేపరం పద్మభవాదివందితం |

యన్మాయయా తత్త్వవిదుత్తమాజనాః విమోహితావిశ్వసృజామధీశ్వరం || 1||

ముహ్యంతిమాయా చరితేషు మూఢా గుణేషు చిత్రం భగవద్విచేష్టితం |

అనీహఏతద్ బహుధైక ఆత్మనా సృజ త్యవత్యత్తిన సజ్జతేప్యధ || 2 ||

సమస్తదేవాసుర సౌఖ్య దుఃఖ ప్రాప్త్యై భవాన్ పూర్ణమనోరథోపి |

తత్రాపికాలే స్వజనాభిగుప్త్యైబిభర్షిసత్త్వం ఖలనిగ్రహాయ || 3 ||

తమోగుణం రాక్షస బంధనాయ రజోగుణం నిర్గుణ విస్వమూర్తే |

దిష్ట్యాదంఘ్రిః ప్రణతాఘనాశన స్తీర్దాస్పదంహృదిధృతః సువిపక్వయోగైః || 4 ||

ఉత్సిక్త భక్త్యుపహృతాశయ జీవభావాః ప్రాపుర్గతింతవ పదస్మృతిమాత్రతోయే |

భవాఖ్యకాలోరగపాశబంధః పునఃపునర్జన్మజరాది దుఃఖైః || 5 ||

భ్రమామి యోనిష్వహమాఖు భక్ష్యవత్ ప్రవృద్ధతర్షస్తవ పాదవిస్మృతేః |

నూనం న దత్తం న చతే కధాశ్రుతా నసాధవో జాతు మయాసిసేవితాః || 6 ||

తేనారి భిర్ద్యస్త పరార్ధ్య లక్ష్మీర్వనం ప్రవిష్టః స్వహరూహ్యగుం స్మరన్ |

స్మతౌ చ తౌమాంసముపేత్య దుఃఖాత్ సంబోధయాం చక్రతురార్త బంధూ || 7 ||

వైశాఖధర్మ్రైః శ్రుతిచోదితైః శుభైః స్వర్గాపవర్గాది పుమర్ధహేతుభిః |

తద్భోధతో హంకృతవాన్ సమస్తాన్ శుభావహాన్ మాధవమాసధర్మాన్ || 8 ||

తస్మాదభూన్మేపరమః ప్రసాదః తేనాఖిలాః సంపద ఊర్జితా ఇమాః |

నాగ్నిర్నసూర్యోన చ చంద్రతారకా నభూర్జలంఖంశ్వసనో ధవాఙ్మనః || 9 ||

ఉపాసితాస్తేపి హరంత్యఘంచిరాద్విపశ్చితో ఘ్నంతి ముహూర్త సేవయా |

యన్మన్యసేత్వంభవితాపి భూరిశఃత్యక్తేషణాన్ త్వద్పదన్యస్తచిత్తాన్ || 10 ||

నమస్స్వతంత్రాయ విచిత్రకర్మణే నమః పరస్మై సదనుగ్రహాయ |

తన్మాయయోమోహితోహం గుణేషు దారార్థరూపేషు భ్రమ్యామ్యనర్ధదృక్ || 11 ||

త్వద్పాద పద్మే సతిమూలనాశనే సమస్త పాపాపహరే సునిర్మలే |

సుఖేచ్ఛయానర్ధ నిదాన భూతైః సుతాత్మదారైర్మమతాభియుక్తః || 12 ||

నక్వాపినిద్రాంలభతే న శర్మప్రవృద్దతర్షః పునరేవతస్మిన్ |

లబ్ద్వాదురాపం నరదేవజన్మత్వం యత్నతః సర్వపుమర్ధహేతుః || 13 ||

పదారవిందం న భజామి దేవ సమ్మూఢ చేతావిషయేషు లాలసః |

కరోమి కర్మాణి సునిష్ఠితః సన్ ప్రవృద్ధతర్షః తదపేక్షయాదద్ || 14 ||

పునశ్చభూయామహమద్యభూయామిత్యేన చింతాశత లోలమానసః |

తదైవ జీవస్య భవేత్కృపావిభో దురంతశక్తేస్తవ విశ్వమూర్తే || 15 ||

సమాగమః స్యాన్మహతాంహి పుంసాం భవాంబుధిర్యేనహి గోష్పదాయతే |

సత్సంగమోదేవయదైవ భూయాత్తర్హీశదేవేత్వయిజాయతేమతిః || 16 ||

సమస్త రాజ్యాపగమహిమన్యేహ్యనుగ్రహం తేమయి జాత మంజసా |

యధార్ధ్యతే బ్రహ్మసురాసురాద్యైః నివృత్త తర్షైరపిహంసయూధైః || 17 ||

ఇతః స్మరామ్యచ్యుతమేవ సాదరం భవాపహం పాదసరోరుహం విభో |

అకించన ప్రార్ధ్యమమందభాగ్యదం నకామయేన్యత్తవ పాదపద్మాత్ || 18 ||

అతోన రాజ్యం నసుతాదికోశం దేహేన శశ్వత్పతతారజోభువా |

భజామినిత్యం తదుపాసితవ్యం పాదారవిందం ముని భిర్విచింత్యం || 19 ||

ప్రసీదదేవేశ జగన్నివాస స్మృతిర్యధాస్యాత్తవ పాదపద్మే |

సక్తిస్సదాగచ్ఛతు దారకోశ పుత్రాత్మచిహ్నేషు గణేషు మే ప్రభో || 20 ||

భూయాన్మనః కృష్ణ పదారవిందయోః వచాంసితే దివ్యకధానువర్ణనే |

నేత్రేమమేతేతన విగ్రహేక్షణే శ్రోత్రేకధాయాం రసనాత్వదర్పితే || 21 ||

ఘ్రూణంచత్వత్పాద సరోజ సౌరభే త్వద్భక్త గంధాది విలేపనే సకృత్ |

స్యాతాంచ హస్తౌ తవమందిరేవిభో సమ్మర్జనాదౌ మమనిత్యదైవ || 22 ||

కామశ్చమే స్యాత్తవసత్కధాయాంబుద్ధిశ్చమే స్యాత్తవచింతనేనిశం |

దినానిమేస్యుస్తవ సత్కధోదయైః ఉద్గీయమానైః మునిభిర్గృహా గతైః || 23 ||

హీనః ప్రసంగస్తవమేనభూయాత్ క్షణం నిమేషార్థ మధాపి విష్ణో |

న పారమేష్ఠ్యం న చ సార్వభౌమం న చాపవర్గం స్పృహయామి విష్ణో || 24 ||

త్వత్పాదసేవాంచ సదైవకామయే ప్రార్ద్యాంశ్రియా బ్రహ్మభవాదిభిః సురైః || 25 ||

అని స్తుతించెను.

💫🌹పాంచాలరాజు చేసిన యీ స్తుతి అర్ధవంతము శక్తిమంతమునగుటచే దీనికి భావము వ్రాయబడుచున్నది. మనమందరమును పాంచాలరాజువలె పూర్వ కర్మననుసరించి ఉన్నదానిని పోగొట్టుకొని గురువు పెద్దల వలన తరణోపాయము నెరిగి పాటించిన పాంచాలరాజు వలెనే కష్టములను దాటి సర్వసుఖములనంది పాంచాలరాజువలె భగవంతుని దర్శనమును పొందగోరువారమే కదా! 

💫🌹అందుకని యీ స్తోత్రమునకు భావము చదివినచో వేలాది పాఠకులలో నొకరైన భగవంతుని దర్శనానుగ్రహమును పొందవచ్చునేమోయని తలచి భావమునిచ్చుచున్నాము. సహృదయతతో భక్తులు దీనిని ఉపయోగించకొనగలరు. 24 తత్త్వములు పరమేశ్వరుడు/శ్రీహరి ఒకడు మొత్తము 25 సంఖ్యకు వచ్చిన శ్లోకములున్న యీ స్తోత్త్రము సాభిప్రాయమైనదే. 

💫🌹1.స్వామీ! నీవు దేనియందును ఆసక్తుడవుకావు ఏదియు అంటనివాడవు. సృష్టికర్తలకు అధిపతివి. పరాత్పరుడవు. నీమాయకులోబడిన తత్త్వవేత్తలును సృష్టికర్తలనెరుగు విషయమున అజ్ఞానవంతులగుచున్నారు.

💫🌹2. తత్త్వవిదులును మాయాచరితములైన గుణములయందు చిక్కుకొని విచిత్రమగు భగవంతుని చేష్టనెరుగ లేకున్నారు. కోరిక లేని ప్రభువా! దీనినంతయు సృష్టించిన వాడవు నీవొక్కడవే. ఈ ప్రపంచము సృష్టించినవాడవు, రక్షించువాడవు. నశింపజెయువాడవును నీవొక్కడవే.

💫🌹3.స్వామీ! నీవు కోరికలన్నియు తీరినవాడవు అయినను దేవాసురులకు సుఖదుఃఖములను కలిగించుటకై సత్వగుణమునంది శిష్టరక్షణకు అవతరించుచున్నావు.

💫🌹4.తమోగుణమున దుష్టులను శిక్షింతువు. రజోగుణమున రాక్షసుల నిగ్రహించు చున్నావు. దైవవశమున నీ పాదము నమస్కరించి వారి పాపములను పోగొట్టును. హృదయమున భావన చేసినచో శుభయోగములకు పరిపాకమును కలిగించి తీర్థమగుచున్నది.

💫🌹5.స్వామీ! గర్వము-భక్తి వీనికి లోబడిన జీవులు నీ పదములను సేవించినను సంసారము/పుట్టుక అను కాలసర్పము బంధనమునకు లోబడి పునర్జన్మాది దుఃఖములచే పీడింపబడుచున్నారు.

💫🌹6.నేనును యిట్టివాడనై ఇంటింటికి తిరిగి ఎలుకలను తినుచు బలసిన పిల్లివలె నీ పాదభక్తిని మరచి ప్రతి జన్మయందును పునర్జన్మాది దుఃఖములను పెంచుకొనుచుంటిని. ఏమియు దానము చేయలేదు. నీ కథలను వినలేదు. ఉత్తముల సేవయును చేయలేదు.

💫🌹7.ఇందువలన శత్రువులు నా రాజ్యము  నాక్రమింపగా వనవాసినై నా గురువులను స్మరించితిని. ఆర్తబంధువులగువారు నా యొద్దకు వచ్చి తమ ప్రభోధములచే నా దుఃఖమును పోగొట్టిరి.

💫🌹8.ధర్మార్థకామమోక్షములను, స్వర్గమును కలిగించు వైశాఖవ్రత ధర్మములను వారు బోధింపగా నేను వారు చెప్పిన శుభకరములగు వైశాఖధర్మముల నాచరించితిని.

💫🌹9.అందువలన నాకు సర్వోత్తమమగు శ్రీహరియనుగ్రహము కలిగినది. అందువలన నుత్తమ సంపదలు అధికములుగ నొనగూడినవి. అగ్ని. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, భూమి, నీరు, ఆకాశము, వాయువు, మాట, మనస్సు మున్నగువానిని సేవింపలేదు.

💫🌹10.నేను వైశాఖవ్రతమున శ్రీహరిని మాత్రమే ధ్యానించితిని. సూర్యాదులనుపాసింపలేదు. అవి యన్నియు స్థిరములు కావు. అన్నిటిని ఈషణత్రయమును విడిచి నీ పాదములను నిన్ను ముహూర్తకాలము సేవించినను కోరినది సిద్ధించును.

💫🌹11.స్వామీ! నీవు స్వతంత్రుడవు. ఎవరికిని లోబడినవాడవు కావు. విచిత్రమైన కర్మలను చేయుదువు. అందరికంటె నుత్తముడవు. ఇట్టి నీకు నమస్కారము. నేను నీ మాయకు లోబడి భార్యాపుత్రులు రాజ్యము మున్నగు పనికిమాలిన వాని యందాసక్తుడనైతిని.

💫🌹12.మొట్టమొదటి కర్మ దోషమును పోగొట్టి సర్వపాపములను హరించునట్టి నిర్మలమగు నీ పాదపద్మములుండగానేను సుఖము కావలయుననుకొని మమకారమునకు లోబడి అనర్థమునే కలిగించు భార్యమున్నగు కోరికలచే పీడింపబడితిని.

💫🌹13.స్వామీ! ఎచటను సుఖనిద్రలేదు, శుభములేదు, సుఖాభిలాష పెరుగుచున్నది. దుర్లభమగు మానవజన్మనెత్తియు నీవే సర్వపురుషార్థకారణమని యెరుగజాలకపోతిని.

💫🌹14.నీ మహిమనెరుగజాలని సుఖాసక్తుడనగు నేను నీ పాదపద్మములను సేవింపజాలక మూఢచిత్తుడనై సుఖాభిలాషను పెంచు కర్మలను శ్రద్ధతో చేయుచున్నాను. ఏమియును యెవరికిని యిచ్చుటలేదు.

💫🌹15.స్వామీ! ప్రభూ! పరమాత్మయగు నీ సేవను మరల మరల చేయవలయుననియున్నను చేయలేకున్నను. కాని నీ సేవ చేసినప్పుడు మాత్రమే విశ్వమూర్తిని సర్వశక్తిమంతుడవగు నీ దయ మాయందు ప్రసరించును.

💫🌹16.సత్పురుషుల సందర్శన భాగ్యము కలిగినచో సాగరభయంకరమైన సంసారము గోవుపాదమంత చిన్నది అగును. అంతేకాడు దైవమగునీయందు భక్తి భావము కలుగును.

💫🌹17.ప్రభూ! నీ రాజ్యమంతయు పోవుట మంచిదేయని అనుకొనుచున్నను. బ్రహ్మాది దేవతలు నిరీహులగు మునులు పొందగలిగిన నీయనుగ్రహమును పొందు అవకాశము కలిగినది.

💫🌹18.స్వామీ! అచ్యుతా! నీపాదపద్మమునే విడువక స్మరింతును. నీ పాదములు దీనులును ప్రార్థింపదగినవి. అనంతభాగ్యము నిచ్చునవి. కావున నీ పాదపద్మములను తప్ప మరొకదానిని స్మరింపను.

💫🌹19.కావున రాజ్యము, పుత్రులు మున్నగు వానిని ధనమును, అశాశ్వతమగు దేహమును కోరెను. మునులంతటివారును కోరదగిన నీ పాదముల సేవనే కోరుదును.

💫🌹20.జగన్నాధా! ప్రసన్నుడవగుము. నీ పాదపద్మస్మృతి నన్ను విడువకుండ చూడుము. నీ పాదములయందు ఆసక్తియు, భార్యాపుత్రాదులయందనాసక్తియు కలుగజేయుము.

💫🌹21.ప్రభూ! నా మనస్సు శ్రీకృష్ణ పాదారవిందములయందుండుగాక. నా మాటలు శ్రీకృష్ణకధాను వర్ణనమున ప్రవర్తించుగాక. నా యీ నేత్రములు నిన్ను నీ రూపమును చూచుగాక. నాయీ చెవులు నీ కథలను మాత్రమే వినుగాక. నా నాలుక నీ ప్రసాదమునే తినుగాక.

💫🌹22.నా ముక్కు నీ పాదపద్మగంధమునే వాసన జూచుగాక. నీ భక్తులకు పూసిన గంధమునే వాసన చూచుగాక! స్వామీ! నా హస్తములు నీ మందిరమును ఊడ్చుట మొదలగు పనులను చేయుగాక.నా పాదములు నీ క్షేత్రములున్నచోటకు, నీ కథలు చెప్పుచోటకు మాత్రమే వెళ్లుగాక. నాశిరమున నీకై నమస్కారము నిమగ్నమగు గాక.

💫🌹23.నీ కథలను వినుటయందే నాకు కామము, కోరికలు కలుగుగాక. నా బుద్ది నీ చింతనమునందాసక్తమగుగాక.

💫🌹24.నీ కథలను తలచుకొనుటతో దినములు నాకు గడచుగాక. నీ యింటికి వచ్చిన సజ్జనులచే నీ స్మరణను వినుటచే గడచుగాక. నీ ప్రసంగములేని క్షణమైనను గడువకుండు గాక.

💫🌹25..ప్రభూ! బ్రహ్మపదవి అక్కరలేదు. చక్రవర్తిత్వము కలదు. మోక్షమును కోరును. నీ పాదసేవను మాత్రము కోరుదును. నీ పాదసేవను లక్ష్మీదేవి బ్రహ్మ మున్నగు వారు కోరుదురు. కాని వారికి నీ పాద సేవ సులభముకాదు. వారికి దుర్లభమైన నీ పాదసేవను మాత్రము కోరుదును అనుగ్రహింపుము.

💫🌹ఇట్లు పాంచాలరాజుచే స్తుతింపబడిన శ్రీమన్నారాయణుడు వచ్చిన పద్మముల వలెనన్న కన్నులతో ప్రసన్నుడై వానిని జూచుచు మేఘగంభీరస్వరముతో నిట్లనెను. నాయనా నీవు నా భక్తుడవని కోరికలు కల్మషములేనివాడవని నేనెరుగుదును. అందుచే దేవతలకును పొందరాని వరమును నీకిత్తును. పదివేల సంవత్సరముల దీర్ఘాయువునందుము. సర్వసంపదలను పొందుము. నీకు నాయందు నిశ్చలమైన భక్తియుండును. 

💫🌹తుదకు ముక్తినందుదువు. నీవు చేసిన యీ స్తుతితో నన్ను స్తోత్రము చేసినవారికి సంతుష్టుడనై భుక్తినిముక్తిని యిత్తును. సందేహములేదు. నేను నీకు ప్రసన్నుడనై ప్రత్యక్షమైన దినము అక్షయతృతీయాతిధి సార్ధకనామమై నన్ను స్తుతించిన నా భక్తులకు అక్షయములగు భుక్తి ముక్తుల నక్షయముగ నిత్తును. భక్తిపూర్వకముగ గాకున్నను బలవంతము వలననో మొగమాటమువలననో ఏదోయొక కారణమున వైశాఖస్నానాదికమును చేసినవారికిని భుక్తిని, ముక్తిని యిత్తును.

💫🌹ఈ అక్షయతృతీయయందు పితృదేవతలకు శ్రాద్దమును నిర్వహించినచో వారికి వంశవృద్ది అనంతపుణ్యము నిత్తును. ఈ అక్షయతృతీయాతిధి మిక్కిలి యుత్తమమైనది. దీనికి సాటియైన తిధిలేదు. ఈనాడు చేసిన సత్కార్యము పూజ దానము అల్పములైనను అక్షయఫలములనిచ్చును. కుటుంబముకల బ్రాహ్మణునకు గోదానమునిచ్చినచో వానికి సర్వసంపదలను వర్షించి ముక్తి నిత్తును. సమస్త పాపములను పొగొట్టు వృషభదానమును చేసినవానికి అకాలమృత్యువేకాదు, కాలమృత్యువును కూడ పోగొట్టి దీర్గాయుర్దాయము నిత్తును. 

💫🌹వైశాఖ వ్రతమును దాన ధర్మములను యధాశక్తిగ చేసినవారికి జన్మ, జరా, మృత్యు, వ్యాధి, భయములను, సర్వపాపములను పోగొట్టుదును. వైశాఖమున చేసిన పూజ దానము మున్నగువాని వలన సంతోషించినట్లుగ నితరమాసములందు చేసిన పూజాదికమునకు సంతోషపడను. వైశాఖమాసమునకు మాధవమాసమని పేరు. 

💫🌹దీనిని బట్టి నాకీ మాసమెంత యిష్టమైనదో గ్రహింపవచ్చును. అన్ని ధర్మములను బ్రహ్మచర్యాది వ్రతములను విడిచిన వారైనను వైశాఖవ్రతము నాచరించినచో నేను వారికి ప్రీతుడనై వరములనిత్తును.

💫🌹వైశాఖవ్రతమును దానాదులను ఆచరించినవారు తపస్సులకు, సాంఖ్యయోగములకు, యజ్ఞయాగములకు సాధ్యముకాని నా సాన్నిధ్యమును చేరుదురు. ప్రాయశ్చిత్తమే లేని వేలకొలది మహాపాపములు చేసినవారైనను వైశాఖవ్రతము నాచరించిన పాపక్షయమును అనంత పుణ్యము నిత్తును. నా పాదస్మరణచే వారిని రక్షింతును.

💫🌹పాంచాలమహారాజా! నీ గురువులు చెప్పిన దానిని అడవిలో నున్నను భక్తి శ్రద్దలతో నాచరించి నాకు ప్రీతిపాత్రుడవైతివి. కావుననే ప్రసన్నుడనై నీకు ప్రత్యక్షమైతిని. నీకనేక వరములనిచ్చితిని అని పలికి శ్రీహరి అందరును చూచుచుండగనే అంతర్ధానమందెను. పాంచాలరాజును శ్రీహరి యనుగ్రహమునకు మిక్కిలి యానందమునందెను. శ్రీహరి యందు నిశ్చలభక్తియుక్తుడై పెద్దలను గౌరవించుచు చిరకాలము ధర్మపూర్ణమున రాజ్యమును పాలించెను. 

💫🌹శ్రీహరిని తప్ప మరెవరిని ప్రేమింపలేదు. గౌరవింపలేదు. భార్యాపుత్రాదులకంటె శ్రీమన్నారాయణుడే తనకు కావలసినవాడని నమ్మి సేవించెను. భార్యాపుత్రులు, పౌత్రులు, బంధువులు పరివారము అందరితో గలసి వైశాఖవ్రతమును దాన ధర్మాదులను పలుమార్లు ఆచరించెను. చిరకాలము సర్వసుఖభోగములనంది తుదకు శ్రీహరి సాన్నిధ్యమును చేరెను.

💫🌹ఉత్తమమైన యీ కథను విన్నను వినిపించినను సర్వపాపవిముక్తులై శ్రీహరి సాన్నిధ్యమును చేరుదురు అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విధముగ నారదుడు అంబరీషునకు వైశాఖమహిమను వివరించుచు చెప్పెను.

*వైశాఖ పురాణం ఇరవై ఒకటవ అధ్యాయము సంపూర్ణము*

🙏🙏 *సర్వే జనా సుఖినోభవంతు* 🙏🙏

: ఇడ్లీలు మొదట ఏదేశం వంటకం? దక్షిణాది వారిదేనా? దానికేమైనా చరిత్ర ఉంది?


ఇడ్లీ ఇండోనేషియాలో పుట్టిందని అంటారు. . ఆవిరితో ఉడికించే వంటల్లో ఇండోనేషియాలోని "డిం సం" అనే వంట ప్రసిద్ధమయింది. వెదురు బుట్టల్లో ఈ డిం సం లను ఉంచుతారు.


అలా ఉంటే కొరియాలో కూడా రైస్ కేక్ దొరుకుతుంది. ఇది మన ఇడ్లీయే. ఇవి అక్కడ చతురస్రాకారంలో ఉన్నవి.


మనదేశానికొస్తే -


పదకొండవ శతాబ్దం (1127-1138 A.D) లో మూడవ సోమదేవుడు (చాళుక్య సోమదేవుడు) అనే చాళుక్యప్రభువు "అభిలాషితార్థ చింతామణి" అని ఓ పుస్తకాన్ని రచించాడు. దాన్నే "మానసోల్లాసం" అంటారు. అందులో సామాజిక విషయాలు చాలా చెప్పాడు. అందులో ఇడిలికం గురించి ఒక శ్లోకం ఉంది.


సుశీతా ధవళా శ్లక్ష్ణా ఏతా ఇడరికా వరాః |


తస్యైవ మాషపిష్టస్య గోళకాన్ విస్తృతాన్ ఘనాన్ ||


చల్లనివి, తెల్లనివీ, మృదువైనవి ఐన ఇడ్లీలు గొప్పవి. అవి ఉద్దిపిండితో గుండ్రంగా, పెద్దగా, బరువుగా చేయబడతాయి.


శ్రీనాథుని కాశీఖండంలో ఇడ్లీ గురించి ఉందట.


చాళుక్యుల కాలాన ఇడ్లీ రికార్డు కాబడింది అంటే, అంతకు మునుపు కూడా అది ఉండి ఉండవచ్చును. ఇండోనేషియా లోని బోరోబుదుర్ - భారతీయులు స్థాపించినదే. అక్కడ పరంబనన్ దేవాలయం, ఇతరత్రా కూడా భారతీయులవే. అంతే కాదండోయ్, బహసా ఇండోనేషియా లో సంస్కృత ప్రాకృత శబ్దాలు కనిపిస్తాయి.


కనుక ఆ దేశానికి భారతదేశానికి మధ్య ఆదానప్రదానాలు ఉన్నాయి. కనుక ఇడ్లీ అక్కడి నుంచి వచ్చి ఉండాలి లేదా భారత దేశం నుండైనా వెళ్ళి ఉండాలి.


ఇంతటి ఘనమైన ఇడ్లీకి నా నుతి.


చక్రాకారం ధవళమృదులం చారురూపం సుభక్ష్యం


చట్నీయుక్తం ఘృతవిరచితం క్షారచూర్ణాత్ విభూష్యం |


సూపే సిక్తం రసభరమిదం సర్వదా సంప్రయుక్తం


ఇడ్లీ నామ్న్యాం ఉదరశుభదం పూర్ణతః భోక్తుమీడే ||

[29/05, 6:39 pm] Sriram: 🙏🙏🙏🙏🙏

త‌మ‌ల‌పాకుతో చేసిన కిళ్లీ న‌ములుతున్నారా? వారికో శుభ‌వార్త‌!

   

త‌మ‌ల‌పాకుల‌కు ఉన్న ప్ర‌త్యేక‌త మ‌రే ఆకుకు ఉండ‌దు. దేవుడికి సైతం త‌మ‌ల‌పాకుల‌నే స‌మ‌ర్పిస్తారు. త‌మ‌ల‌పాకుల‌ను ఇత‌రుల‌కు అందిస్తే శుభం జ‌రుగుతుంద‌ని భార‌తీయుల న‌మ్మ‌కం. ఇలా పండుగ‌ల‌కే కాకుండా త‌మ‌ల‌పాకుల‌ను కిళ్లీలుగా కూడా వేసుకుంటూ ఉంటారు. దీనికి అల‌వాటు ప‌డిన వారు రోజుకు రెండు, మూడు న‌మ‌లందే ఉండ‌లేరు. తాంబూలంతో ఆరోగ్య‌మే కాని ఎలాంటి చెడు ద‌రిచేర‌దు. త‌మ‌ల‌పాకు వ‌ల్ల క‌లిగే మ‌రికొన్ని ప్ర‌యోజ‌నాలేంటో తెలుసుకోండి. 


ప్ర‌యోజ‌నాలు :


 త‌మ‌ల‌పాకును తాంబూలం అని కూడా అంటారు. ఇందులో క్యాల్షియం, ఫైబ‌ర్‌, పోలిక్ యాసిడ్‌, విట‌మిన్ ఎ, సిలు పుష్క‌లంగా ఉంటాయి. 


 త‌మ‌ల‌పాకులు న‌మ‌ల‌డం వ‌లన రోగ నిరోధ‌క శ‌క్తి  పెరుగుతుంది. అంతేకాదు జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు మేలు చేస్తుంది.


 త‌ల‌నొప్పితో బాధ‌ప‌డేవారు త‌మ‌ల‌పాకుల‌ను నూరి ర‌సాన్ని తీయాలి. ఈ ర‌సాన్ని ముక్కు‌లో వేస్తే త‌క్ష‌ణ‌మే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.


 ఈ రోజుల్లో అధిక బ‌రువుతో బాధ‌ప‌డేవారు చాలామందే ఉన్నారు. వారు రెండు నెల‌ల‌పాటు ప్ర‌తిరోజూ ఒక త‌మ‌ల‌పాకు, 10 గ్రా. మిరియాలు క‌లిపి తినాలి. త‌ర్వాత వెంట‌నే చ‌న్నీళ్లు తాగితే స‌రిపోతుంది.


త‌మ‌ల‌పాకులో నూనె ఉంటుంది. ఇది ఫంగ‌స్‌కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తుంది.


 తమ‌ల‌పాకు న‌మిలేవారిలో వృద్దాప్య చాయ‌లు త‌క్కువ‌గా క‌నిపిస్తాయి. ఇది యాంటాక్సిడెంట్‌గా ప‌నిచేస్తుంది. 


రేర్‌గా క‌నిపించే బోధ‌కాలు మ‌నిషిని నాశ‌నం చేస్తుంది. ఈ వ్యాధి నుంచి ఉప‌శ‌మ‌నం పొందాలంటే. రోజూ 7 త‌మ‌ల‌పాకుల‌ను ఉప్పుతో క‌లిపి ముద్ద చేసుకోవాలి. దీన్ని నీటితో తీసుకుంటే మేలు చేస్తుంది.


 త‌మ‌ల‌పాకులు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ప‌నిచేస్తుంది. వీటిని ముద్ద‌గా నూరి త‌ల‌కు ప‌ట్టించాలి. గంట త‌ర్వాత త‌ల‌స్నానం  చేస్తే చుండ్రు ర‌మ్మ‌న్నా కూడా రాదు.

🙏🙏🙏సర్వంశివసంకల్పం🙏🙏🙏

[29/05, 6:39 pm] Sriram: 💐ఈ ఒక్క దీపం వలన నవగ్రహ దోషాలు తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి దీపం ఎంత మహత్యమో తెలిస్తే💐


ప్రమిదల్లో దీపమెలిగించడంలో ఎంత నిగూఢ అర్థముందో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీని ఓ లుక్కేయండి. ప్రమిదలో దీపం వెలిగించడం ద్వారా నవగ్రహాలను కొలిచినట్లవుతుందని.. ప్రమిద దీపం నవగ్రహ దోషాలను తొలగిస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఆలయాల్లో, గృహాల్లో ప్రమిదలతో దీపాలు వెలిగించడం మనం చూస్తూవుంటాం. ఎంతటి సంపన్నుడైనా దేవాలయానికి వస్తే ప్రమిదలతో దీపమెలిగించాల్సిందే. ఏ దేవునికైనా ప్రమిదలో దీపమెలిగించడం ద్వారా సుభిక్షమైన ఫలితాలను పొందవచ్చు. ప్రమిద, అందులోని నూనె, వత్తులు, కాంతికి నవగ్రహాలకు సంబంధం వుంది. ఇంకా ప్రమిదల్లో నేతిని నింపి దీప ప్రజ్వలన చేయడం ద్వారా మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ప్రమిదల్లోని జ్వాలలో మహాలక్ష్మి నివసిస్తుందని విశ్వాసం. 


ప్రమిద దీపం -సూర్యుడు 

నెయ్యి, నూనె- ద్రవపదార్థం - చంద్రుడు 

వత్తులు - బుధుడు 

ప్రమిదను వెలిగించడం ద్వారా ఏర్పడే జ్వాల- అంగారకుడు 

ఈ జ్వాల నీడ భూమిపై పడుతుంది- ఇది భూమికి సంకేతమైన రాహువును సూచిస్తుంది. 

జ్వాలలో కాంతినిచ్చే పసుపు రంగు- గురువు 

దీప ప్రజ్వలన ద్వారా ఏర్పడే మసిలాంటి నల్లటి రంగు- శనికి సంకేతం 

దీప ప్రజ్వలన ద్వారా ఏర్పడే కాంతి- ఇది జ్ఞానం.. కేతువుకు సంకేతం

ప్రమిదలోని వత్తులు తరుగుతూ రావడానికి శుక్రుడు సంకేతం. శుక్రుడు ఆశకు కారకుడని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు.

అదెలాగంటే.. మానవుడు ఆశలను తగ్గించుకుంటే.. సుఖసంతోషాలు చేకూరుతాయనేందుకు ప్రమిదలో వెలిగే దీపమే నిదర్శనం. ఆశలతో మానవ జన్మ సార్థకం కాదని, తద్వారా మోక్షం లభించడం కష్టమని, తిరిగి తిరిగి మానవుడు ఆశల ద్వారా కర్మలు చేసుకుంటూ పోతాడని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. ఈ విషయాన్ని మట్టి ప్రమిదలో మనం వెలిగించే దీపం ద్వారా తెలుసుకోవచ్చునని వారు సెలవిస్తున్నారు...

[29/05, 6:39 pm] Sriram: 🙏మ‌ల‌య‌ప్ప స్వామి......!! 


🌸🌿🌸🌿🌸🌿🌸


తిరుమ‌ల‌లో మ‌ల‌య‌ప్ప స్వామిని ఉత్స‌వ‌మూర్తిగా ఊరేగించిన విశేషాలు త‌ర‌చూ వార్త‌ల్లోకి వ‌స్తుంటాయి. ఇంత‌కీ ఎవ‌రీ మ‌ల‌య‌ప్ప స్వామి! ఆ పేరు ఎలా వ‌చ్చింది! అస‌లు ఉత్స‌వ మూర్తి అంటే ఎవ‌రు! అన్న విశేషాలు...


ధ్రువ‌బేర‌:

తిరుమ‌ల గ‌ర్భాల‌యంలో ఉన్న మూల‌విరాట్టుని ధ్రువ బేర‌ అంటారు. అంటే స్థిరంగా ఉన్న ప్ర‌తిమ అని అర్థం. ఈ మూల‌విరాట్టుని ఉన్న చోట నుంచి క‌ద‌ల్చరాదు కాబ‌ట్టి ఆ పేరు వ‌చ్చింది. మ‌రి గ‌ర్భాల‌యం వెలుప‌ల శ్రీనివాసునికి సేవ‌లు చేసేందుకు, క‌ళ్యాణోత్స‌వం త‌దిత‌ర ఉత్స‌వాలు నిర్వ‌హించేందుకు, ఊరేగించేందుకు ఒక అంశ ఉండాలి క‌దా! అదే ఉత్స‌వ బేర‌! తిరుమ‌ల‌లో శ్రీ మ‌ల‌య‌ప్ప స్వామివారు, ఉత్స‌వమూర్తిగా వెలుగొందుతున్నారు. మూల‌విరాట్టుకి జ‌రిగే ప్ర‌తి కార్య‌క్ర‌మానికీ ఈ ఉత్స‌వ‌బేర ప్ర‌తినిథిగా ఉంటుంది కాబ‌ట్టి, ఈ స్వామివారిని మూల‌విరాట్టుతో స‌మానంగా భావిస్తారు.


చ‌రిత్ర‌:

ఒక‌ప్ప‌డు ఉత్స‌వాల కోసం ఉగ్ర‌శ్రీనివాసుని మూర్తిని వినియోగించేవార‌ట‌. అయితే ఒకానొక బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంలో, స్వామివారి ఊరేగింపు జ‌రిగే స‌మ‌యంలో చుట్టుప‌క్క‌ల మంట‌లు చెల‌రేగాయి. ఎందుకిలా జ‌రిగిందా అని భ‌క్తులు, అర్చ‌కులు ఆందోళ‌న‌ప‌డుతుండ‌గా ఒక భ‌క్తుని ద్వారా స్వామివారు త‌న సందేశాన్ని వినిపించాడ‌ని అంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మ‌రో సౌమ్య‌మైన మూర్తిని ఉత్స‌వాల కోసం వినియోగించ‌మ‌న్న‌దే ఆ సందేశం. ఒక కొండ వంగి ఉండే ప్ర‌దేశంలో ఆ మూర్తి క‌నిపిస్తుంద‌ని కూడా స్వామివారు తెలియ‌చేశార‌ట‌. ఆ సందేశాన్ని అనుస‌రించి భ‌క్తులు నూత‌న ఉత్స‌వ మూర్తి కోసం వెత‌క‌సాగారు. అలా వారికి ఒకచోట శ్రీదేవిభూదేవి స‌హిత వేంక‌టేశ్వ‌రుని విగ్ర‌హాలు ల‌భించాయి. ఈ స్వామివారికి త‌మిళంలో మ‌లై కునియ నిన్ర పెరుమాళ్‌ (త‌ల‌వంచిన ప‌ర్వతం మీద కొలువైన స్వామి) అన్న పేరుని స్థిర‌ప‌రిచారు. కాల‌క్ర‌మంలో అదే మ‌ల‌య‌ప్పస్వామిగా మారింది.


రూపం:

మ‌ల‌య‌ప్ప స్వామి విగ్ర‌హం పంచ‌లోహాల‌తో రూపొందింది. తామ‌ర‌పూవు ఆకారంలోని పీఠం మీద మూడు అడుగుల ఎత్తున ఠీవిగా ఉన్న శ్రీనివాసుని రూపం అది. శంఖుచ‌క్రాల‌తోనూ, వ‌ర‌ద‌హ‌స్తంతోనూ స్వామివారి దివ్య‌మంగ‌ళ రూపం ఉంటుంది. ఈ విగ్ర‌హానికి కుడివైపున శ్రీదేవి, ఎడ‌మ‌వైపు భూదేవి అమ్మ‌వార్ల విగ్ర‌హాలు ఉంటాయి. ఈ రెండు విగ్ర‌హాలూ ఒకేలా ఉంటాయి. కాక‌పోతే భంగిమ‌లు అటుదిటుగా ఉంటాయంతే! మ‌రి ఇద్ద‌రిలో ఎవ‌రూ ఎక్కువ‌త‌క్కువ కాదు క‌దా! శ్రీదేవిభూదేవి విగ్ర‌హాలు కూడా వేంక‌టేశ్వ‌రుని విగ్ర‌హంతో పాటుగానే స్వ‌యంభువులుగా దొరికాయ‌ని అంటారు. ఈ విగ్ర‌హాలు దొరికిన కోన‌ని ఇప్ప‌టికీ మ‌ల‌య‌ప్ప కోన‌గా పిలుస్తున్నారు. దాదాపు 700 సంవ‌త్స‌రాల‌కు పూర్వ‌మే లిఖించిన ఒక శాస‌నంలో ఈ విగ్ర‌హాల ప్ర‌స‌క్తి ఉన్న‌ది.


సేవ‌లు:

శ్రీవారికి భ‌క్తులు జ‌రుపుకొనే క‌ళ్యాణోత్స‌వాల‌లో మ‌ల‌య‌ప్ప స్వామివారినే వినియోగిస్తారు. సాయంవేళ జ‌రిగే స‌హ‌స్ర‌దీపాలంక‌ర‌ణ సేవ‌లోనూ స్వామివారే కొలువుంటారు. స్వామివారికి జ‌రిగే కొన్ని అభిషేకాల‌లో కూడా ఉత్స‌వ‌మూర్తికి భాగం ఉంటుంది. పుష్క‌రిణిలో జ‌రిగే తెప్పోత్స‌వం కూడా మ‌ల‌య‌ప్ప స్వామివారికే నిర్వ‌హిస్తారు. ఇక ప‌ద్మావ‌తి ప‌రిణ‌యం, బ్ర‌హ్మోత్స‌వాల వంటి ఉత్స‌వాల సంద‌ర్భంగా మ‌ల‌య‌ప్ప స్వామివారు గ‌జ‌, అశ్వ‌, గ‌రుడ‌, శేష త‌దిత‌ర వాహ‌నాల‌లో వైభవంగా ఊరేగుతూ భ‌క్తుల‌కు ఆశీస్సుల‌ను అందిస్తారు.


🌸🌿🌸🌿🌸🌿🌸

[29/05, 8:23 pm] +91 96520 19186: ఆట విడుపు ....


✨✨✨😇😇😇✨✨✨


భార్య హాస్పిటల్ ఐసియు లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది . 


బయట భర్త ఆవేదనని , కన్నీళ్లని ఆపడం ఎవరి వలన సాధ్యం కావడం లేదు . 


ఐసియు నుంచి డాక్టర్ గారు భర్తను లోపలకు రమ్మని అతనితో ..! 


" మేము మా సాయశక్తులా ప్రయత్నిస్తున్నాము . కానీ ఆవిడ ఏ మందులకి స్పందించడం లేదు . బహుశా ఆమె కోమాలోకి వెళ్లిపోయినట్టుంది ..! "


వెంటనే భర్త డాక్టర్ గారి కాళ్లపై పడి , భోరున విలపిస్తూ ..! " డాక్టర్ గారు తన వయసు 31 కూడా పూర్తి కాలేదు . జీవితంలో ఆమె ఏం చూసిందని దేవుడు ఇంత తొందరగా ఆమెను తన దగ్గరకు తీసుకెళ్ళిపోతున్నాడు . మీరే ఏదైనా చెయ్యండి ..! " అంటూ ప్రాధేయపడ్డాడు . 


అప్పుడే ఒక అద్భుతం జరిగింది . ఈసిజి మిషన్ పనిచెయ్యడం ప్రారంభించింది . 


హార్ట్ బీట్ మెల్లగా పెరిగింది . 


చేతి వేళ్లు కదులుతున్నాయ్ . 


మెల్లగా కళ్ళు తెరుచుకుంటున్నాయ్ . 


పెదాలనుంచి మాట 

మెల్లగా వస్తోంది...


అప్పుడు భర్త ఆనందంతో ఏం చెప్పాలనుకుంటున్నావ్ ..!? చెప్పు ..! అన్నాడు ....


అప్పుడు భార్య ....


 భర్తను మెల్లగా రెండు పీకి ..


నావయసు29 మాత్రమే నండి ..! " అని చెప్పి ... 


బ్రతికిపోయింది...


గరికపాటి వారి హాస్యం ఆవేదన కలగలిసిన అద్భుత ప్రవచనం 


https://youtu.be/IbWYH_PmLSQ


✨✨✨😇😇😇✨✨✨

[30/05, 10:00 am] +91 99850 01339: 🙏🌷🙏🌷🙏🌷🙏🌷 

ఒకసారి రామకృష్ణ పరమహంస గారు   కాళీమాత పై ఉన్న అమోఘమైన భక్తితో   అమ్మవారికి భోజనం సమర్పించి అమ్మవారి రాకకై   వేచి ఉన్నాడు.అంతలోనే   ఆకలిగా ఉన్న బిచ్చగాడు   అమాంతంగా అమ్మవారి దగ్గర ఉన్న   భోజనం తీనేస్తాడు.   అది చూసిన రామకృష్ణ పరమహంస కోప్పడకుండా మళ్లీ  నైవేద్యం తయారుచేసి   అమ్మవారిని తినమని ప్రాధేయపడతాడు.   అమ్మవారు వచ్చి తినేదాకా  ఇక్కడ నుంచి పోయేదిలేదని మొండి పొట్టుతో కూర్చుని వేచిఉన్నాడు. ఆయన నిస్వార్ధభక్తికి మెచ్చిన   ఆ కాళిమాత వచ్చి నాకు ఆకలిగా లేదు. ఇప్పుడే కదా నాకు భోజనం సమర్పించావు.   కడుపు నిండిన తర్వాత ఎలా తినానగలను చెప్పు పుత్రా! అని అడుగుతుంది.విషయం అర్థంకాక రామకృష్ణ పరమహంస నీకు పెట్టినా నైవేద్యం భిక్షవాడు తీనేసాడు కదా?మరి నువ్వు ఎప్పుడు తిన్నావని ప్రశ్నిస్తాడు.ఆ మాటకు  కాళికామాత   ఆకలిగా ఉన్న భిక్షవాడిని కూడా నేనే! ఈ ప్రపంచంలో ఎవ్వరు నిస్వార్ధంగా   ఆపదలో ఉన్నవారికి,   ఆకలితో ఉన్నవారికి సహాయం చేస్తారో  ఆ సహాయం నాకు(దేవుడికి) చేసినట్లే!  అందరూ నా పిల్లలే కదా!   అని సమాధానం చెప్పి వెళ్లి పోయింది.అప్పటినుంచి రామకృష్ణుడు అందరిలోనూ,అన్నింటి లోనూ అమ్మను(కాళీమాతను) చూసుకుని జీవితం గడిపేవారు.

[30/05, 9:42 pm] D Krishnamurthy: *🍂యోగాలు ఎలా పుట్టాయి ?🍂*


👉🏻మానవుడు దేవుని చేరే విధానంలో జరిగే ప్రక్రియా మార్గమే యోగం. 


అసలు యోగాలు ఎలా పుట్టాయి అని ఆలోచిస్తే ఆసక్తి కరమైన విషయాలు తెలుస్తాయి. మనిషి తానున్న చోటినుంచే ఎక్కడకైనా వెళ్లగలడు. అలాగే, తనకున్న దానినుంచే ఇంకొక ఉన్నతమైనదానిని అందుకోగలడు. ఈ ప్రపంచంలో ప్రతి మనిషీ విలక్షణుడే. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన ప్రత్యేకత ఉంటుంది. వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైన శక్తిని బట్టి వారి వ్యక్తిత్వంలోని విలక్షణతను బట్టి ఆయాయోగాలు వారికి సరిపోతాయి. అందరికీ అన్ని యోగాలు సరిపోవు అనడానికి ఇదే కారణం.


👉🏻మనిషి అనేవాడు దేహం, ప్రాణం, హృదయం, కర్మేంద్రియ,జ్జానేంద్రియ, మనో, బుద్ది, ఆత్మల కలయిక. 


👉🏻అలాంటి మనిషికి కర్మేంద్రియాలున్నాయి. వీటిద్వారా భగవంతుని అందుకునేది కర్మయోగం. కొందరు పని చెయ్యకుండా క్షణం ఊరుకోలేరు. వారి జీవితం అంతా కర్మ మయంగా ఉంటుంది. అటువంటివారికి కర్మయోగం సరిపోతుంది. 


👉🏻మనిషికి జ్ఞానేంద్రియాలున్నాయి. వీటి ద్వారా దేవుని చేరుకునేది జ్ఞానయోగం. కొందరిలో బుద్ది చాలా తీక్షణంగా ఉంటుంది. తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఒకరిపైన ఆధారపడకుండా, ఏ బంధాలలోనూ ఇమడకుండా, పూర్తి స్వతంత్రంగా ఉండాలనే గట్టి వ్యక్తిత్వం కలవాళ్ళకు సరిపోయేది జ్ఞానయోగం.


👉🏻మనిషికి స్పందించే హృదయం ఉంది. దానిద్వారా కలిగే ప్రేమతత్వంతో భగవంతునిచేర్చేది భక్తియోగం. సున్నిత మనస్కులకు, దయా స్వభావులకు, ఒకరిపైన ఆధారపడే స్వభావం ఉన్నవారికి సరిపోయేది భక్తి యోగం.


👉🏻మనిషికి శరీరం ఉంది. కొందరికి దేహస్పృహ ఎక్కువగా ఉంటుంది. దేహాన్ని దాటి వాళ్ళ ఆలోచనలు ముందుకు పోలేవు. వీరికి ముందుగా కావలసింది హఠయోగం. శరీరంలో కఫ శ్లేష్మాది కల్మషాలు ఎక్కువగా ఉన్నవారికి వాటి ప్రక్షాళణ కోసం ఇది బాగా పనిచేస్తుంది.


👉🏻మనిషికి మనస్సు ఉంది. దానిద్వారా పరమాత్ముని చేరుకోవటం రాజయోగం. మనో మయ జీవులకు, ఆలోచనాపరులకు రాజయోగం చక్కగా సరిపోతుంది. 


👉🏻మనిషికి ప్రాణశక్తి ఉన్నది. దానిద్వారా ప్రాణేశ్వరుడైన పరమేశ్వరుని చేరుకోవటం కుండలినీ యోగం. ప్రాణ సాధకులకు, ప్రాణ శక్తి ఎక్కువగా ఉన్నవారికి ఈ యోగం బాగా సరిపోతుంది. 


👉🏻వీరు ఇతర మతాలవలె అందరినీ ఒకే త్రాటిన కట్టకుండా ఉండడం  మన సనాతన మతం యొక్క విశిష్టత. నువ్వున్న చోటినుంచి ముందుకు నడువు, నువ్వున్న చోటినుంచే పైకి ఎదుగు అని మన మతం చెబుతుంది.


ఆ క్రమంలో పుట్టినవే వివిధ యోగ ప్రక్రియలు.


*🌾సర్వేజనాఃశుఖినోభవంతు🙌🏼సమస్త సన్మంగళానిభవంతు🎋*

[01/06, 9:00 am] Mallapragada Sridevi: ప్రాంజలి ప్రభ..100 నుండి 104 వరకు


నీతి 

బోధించుటకా ఆచరించుటకా

అనుభవించుటకా

ఆత్మీయులను బతికించుటకా


స్నేహము

మనసు బాధ తెలిపేందుకా

కోరికలు తీర్చు కొనేందుకా

ప్రేమను తెలిపేందుకా


రోగము

మనిషిలో ఉందా బయట వుందా

కర్మ అని సర్దు కోమందా

మందు వాడితే రోగము పోతుందా


ఆశలు

మనుష్యులను బతికిస్తాయా

చచ్చుటకు మార్గ మోతాయా

చంపుటకు మార్గమోతాయా

[01/06, 9:24 am] Mallapragada Sridevi: 105..చిరునవ్వు

నీలో లేదెందుకు, నాలో ఉందెందుకు, 

నీకు నమ్మకం లేదెందుకు

నవ్వుకోవడానికి రావెందుకు


106..దైవభక్తి

ఉండితీరాలి ఆస్తికుడుగా

ఉండకూడదు నాస్తికుడుగా

నడిపించేది దేవుడే గా


107..దేశ భక్తి

పుట్టినప్పుడే ఉగ్గుపాలతో నేర్పింది అమ్మ

కండకావరంతో లేదన్నా దేశం బతికి స్తుందని చెప్పేది అమ్మ

దేశద్రోహుడుగా మారితే నరికేది అమ్మ


108..గురుభక్తి

ఉన్నవాడు జీవితాన్ని చూడగలుగుతాడు

లేనివాడు జీవితంలో కష్టాలు చూస్తాడు.


109. వార్ధక్యం

పిరికిది కానేకాదులే మేధాసంపత్తు పంచే శక్తి లే

గౌరవించేవాడికి తెలుస్తుందిలే


110.. సత్యమే

విశ్వాన్ని నడిపించు ఆయుధము

దేనికీ లొంగని బతుకు జీవనము

సత్యవాణి తాకే మంత్రము

 

🕉️ *వైశాఖ పురాణం 20వ అధ్యాయము* 🕉️



*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |*

*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||*



🌻 *పాంచాలరాజు రాజ్య ప్రాప్తి* 🌻



💫🌹నారదమహర్షి అంబరీష మహారాజుతో వైశాఖమహాత్మ్యము నిట్లు వివరింపసాగెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజా! వినుము. శ్రీహరికి మిక్కిలి యిష్టమైన వైశాఖమాస వ్రతమును దాని మహిమను వెల్లడించు మరియొక  కథను చెప్పుదును వినుము.


💫🌹పూర్వము పాంచాలదేశమున పురుయశుడను రాజు కలడు. అతడు పుణ్యశీలుడను మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజయ్యెను. అతడు ధార్మికుడు మహావీరుడు తన శక్తియుక్తులచే విశాల భూమిని పరిపాలించెను. పూర్వజన్మ దోషముచేనతడు కొంతకాలమునకు సంపదను కోల్పోయెను. వాని యశ్వములు, గజములు మున్నగు బలము నశించెను. వాని రాజ్యమున కరవు యేర్పడెను. ఈ విధముగా వాని రాజ్యము, కోశము బలహీనములై గజము మ్రింగిన వెలగపండువలె సారవిహీనములయ్యెను.


💫🌹వాని బలహీనతనెరిగి వాని శత్రువులందరును కలసి దండెత్తి వచ్చిరి. యుద్దములో నోడిన రాజు భార్యయగు శిఖినితో గలసి పర్వతగుహలో దాగుకొని యేబదిమూడు సంవత్సరముల కాలము గడపెను. ఆ రాజు తనలో నిట్లు విచారించెను. "నేను ఉత్తమ వంశమున జన్మించితిని. మంచి పనులను చేసితిని. పెద్దలను గౌరవించితిని. జ్ఞానవంతుడను. దైవభక్తి, యింద్రియజయము కలవాడను. నావారును నావలెనే సద్గుణవంతులు. 


💫🌹నేనేమి పాపము చేసితినని నాకిట్టి కష్టములు కలిగినవి? నేనిట్లు అడవిలో నెంతకాలముండవలయునో కదా! అని విచారించి తన గురువులగు యాజుడు ఉపయాజకుడను గురువులను తలచుకొనెను. సర్వజ్ఞులగు వారిద్దరును రాజు స్మరింపగనే వానివద్దకు వచ్చిరి.


💫🌹రాజు వారిద్దరికి నమస్కరించి యధాశక్తిగను ఉపచారములను చేసెను. వారిని సుఖాసీనులగావించి దీనుడై వారి పాదములందుపడి నాకిట్టి స్థితియేల వచ్చెను? నాకు తరణోపాయమును చెప్పుడని వారిని ప్రార్థించెను. వారు రాజును లేవదీసి కూర్చుండబెట్టి రాజు చెప్పినమాటలను వినిరి. వాని మనోవిచారమును గ్రహించిరి. క్షణకాలము ధ్యానమగ్నులై యిట్లనిరి. 


💫🌹రాజా! నీ దుఃఖమునకు కారణమును వినుము. నీవు గత పదిజన్మలలో క్రౌర్యము కలిగిన కిరాతుడవు. నీయందు ధర్మప్రవృత్తి కొంచమైనను లేదు. సద్గుణము లేవియును లేవు. శ్రీహరికి నమస్కరింపలేదు. శ్రీహరిని కీర్తింపలేదు. శ్రీహరి కథలను వినలేదు. గత జన్మమున నీవు సహ్యపర్వతమున కిరాతుడవైయుంటివి. అందరిని బాధించుచు, బాటసారులను దోచుకొనుచు నింద్యమగు జీవితమును గడుపుచుంటివి. నీవు గౌడ దేశముననున్నవారికి భయంకరుడవై యుంటివి. ఇట్లు అయిదు సంవత్సరములు గడచినవి.


💫🌹బాలురను, మృగములను, పక్షులను, బాటసారులను వధించుటచే నీకు సంతానము లేదు. నీకీజన్మయందును సంతానము లేకపోవుటకును నీపూర్వకర్మయే కారణము. నీ భార్య తప్ప నీకెవరును అప్పుడును లేకుండిరి. అందరిని పీడించుట చేతను దానమన్నది లేకపోవుటచేతను నీవు దరిద్రుడవుగా నుంటివి. అప్పుడు అందరిని భయపెట్టుటచే నీకిప్పుడు యీ భయము కలిగెను. ఇతరులను నిర్దయగా పీడించుటచే నిప్పుడు నీ రాజ్యము శత్రువులయధీనమైనది. ఇన్ని పాపములను చేసిన నీవు రాజకులమున పుట్టుటకు కారణమును వినుము.


💫🌹నీవు గౌడదేశమున అడవిలో కిరాతుడవై గత జన్మలోనుండగా ధనవంతులగు యిద్దరు వైశ్యులు కర్షణుడనుముని నీవున్న యడవిలో ప్రయాణించుచుండిరి. నీవు వారిని అడ్డగించి బాణమును ప్రయోగించి ఒక వైశ్యుని చంపితివి. రెండవ వైశ్యుని చంపబోతివి. అతడును భయపడి ధనమును పొదరింటదాచి ప్రాణరక్షణకై పారిపోయెను. కర్షణుడను మునియు నీకు భయపడి ఆ యడవిలో పరిగెత్తుచు, యెండకు, దప్పికకు అలసి మూర్ఛిల్లెను. నీవును కర్ష్ణణుని సమీపించి వాని మొగముపై నీటిని జల్లి ఆకులతో విసరి వానికి సేవచేసి వానిని సేదతీర్చితివి. 


💫🌹అతడు తేరుకున్న తరువాత నీవు మునీ! నీకు నా వలన భయములేదు. నీవు నిర్ధనుడవు. నిన్ను చంపిననేమి వచ్చును. కాని పారిపోయిన వైశ్యుడు ధనమునెక్కడ దాచెనో చెప్పుము. నిన్ను విడిచెదను చెప్పనిచో నిన్నును చంపెదను అని వానిని బెదిరించితివి. ఆ మునియు భయపడి ప్రాణ రక్షణకై వైశ్యుడు ధనమును దాచిన పొదరింటిని చూపెను.


💫🌹అప్పుడు నీవు  ఆ మునికి అడవి నుండి బయటకు పోవు మార్గమును చెప్పితిని దగ్గరలోనున్న నిర్మల జలము కల తటాకమును చూపి నీటిని త్రాగి మరింత సేద తీసిపొమ్ము. రాజభటులు నాకై రావచ్చును కావున నేను నీవెంబడి వచ్చి మార్గమును చూపజాలనని చెప్పితివి. ఈ ఆకులతో విసురుకొనుము. చల్లనిగాలి వీచునని వానికి మోదుగ ఆకులనిచ్చి పంపి నీవు అడవిలో దాగుకొంటివి. 


💫🌹నీవు పాపాత్ముడవైనను వైశ్యుని ధనమెచటనున్నదో తెలిసికొనుటకై ఆ మునికి సేవలు చేయుటవలన వానిని అడవి నుండి పోవు మార్గమును జలాశయమార్గమును చెప్పుట వలన ఆ కాలము వైశాఖమాసమగుటచే నీవు తెలియకచేసినను స్వార్థముతో చేసినను మునికి చేసిన సేవ ఫలించినది. ఆ పుణ్యము వలన నీవిప్పుడు రాజ వంశమున జన్మించితివి.


💫🌹నీవు నీ రాజ్యమును పూర్వపు సంపదలను వైభవములను కావలెనని యనుకున్నచో వైశాఖ వ్రతమును చేయుము. ఇది వైశాఖమాసము. నీవు వైశాఖశుద్ద తదియ యందు ఒకసారి యీనిన ఆవును దూడతో బాటు దానమిచ్చినచో నీ కష్టములు తీరును. గొడుగునిచ్చిన నీకు రాజ్యము చేకూరును. ప్రాతః కాల స్నానము చేసి అన్ని ప్రాణులకు అందరికి సుఖమును కలిగింపుము. నీవు భక్తిశ్రద్దలతో వైశాఖ వ్రతము నాచరించి శ్రీహరిని అర్చించి శ్రీహరి కథలను విని యధాశక్తి దానములను చేయుము. లోకములన్నియు నీకు వశములగును. 


💫🌹నీకు శ్రీహరియు సాక్షాత్కరించును అని వారిద్దరును రాజునకు వైశాఖ వ్రత విధానమును చెప్పి తమ నివాసములకు మరలి పోయిరి.


💫🌹రాజ పురోహితులు చెప్పినట్లుగా వైశాఖ వ్రతమును భక్తిశ్రద్దలతో నాచరించెను. యధాశక్తిగ దానములను చేసెను. వైశాఖవ్రత ప్రభావమున ఆ రాజు బంధువులందరును మరల వాని వద్దకు వచ్చిరి. వారందరితో కలసి ఆ రాజు తన పట్టణమైన పాంచాలపురమునకు పోయెను. శ్రీహరి దయవలన వాని శత్రువులు పరాజితులై నగరమును విడిచిపోయిరి. రాజు అనాయాసముగ తన రాజ్యమును తిరిగి పొందెను. 


💫🌹పోగొట్టుకొని సంపదలకంటె అధికముగ సర్వసంపదలను పొందెను. వైశాఖవ్రత మహిమ వలన సర్వమును సంపన్నమై వాని రాజ్యము సుఖశాంతులతో ఆనందపూర్ణముగ నుండెను. వానికి ధృష్టకీర్తి, ధృష్టకేతువు, ధృష్టద్యుమ్నుడు, విజయుడు, చిత్రకేతువు అను అయిదుగురు పుత్రులు కుమార స్వామియంతటి సమర్థులు కలిగిరి. ప్రజలందరును వైశాఖమాస వ్రత మహిమ వలన రాజానురక్తులై యుండిరి.


💫🌹రాజును రాజ్యవైభవము సంతానము కలిగినను భక్తి శ్రద్దలతో వైశాఖవ్రతము నాచరించి యధాశక్తి దానధర్మములను చేయుచుండెను. ఆ రాజునకు గల నిశ్చలభక్తికి సంతసించిన శ్రీహరి వానికి వైశాఖశుద్ద తృతీయ అక్షయతృతీయనాడు ఆ రాజునకు ప్రత్యక్షమయ్యెను. చతుర్బాహువులయందు శంఖచక్రగదా ఖడ్గములను ధరించి పీతాంబర ధారియై వనమాలావిభూషితుడై లక్ష్మీదేవితో గరుడాదిపరివారముతో ప్రత్యక్షమైన పరమాత్మయగు అచ్యుతుని జూచి ఆ రాజు శ్రీహరిని చూడలేక కనులు మూసికొని భక్తితో శ్రీహరిని ధ్యానించెను. 


💫🌹కనులు తెరచి ఆనందపరవశుడై గగుర్పొడిచిన శరీరముతో గద్గదస్వరముతో శ్రీహరిని జూచుచు ప్రభుభక్తితో ఆనందపరవశుడై శ్రీహరినిట్లు స్తుతించెను.


💫🌹అని శ్రుతదేవుడు శ్రుతకీర్తికి చెప్పెనని నారదమహర్షి అంబరీషునితో పలికెను.



*వైశాఖ పురాణం ఇరవైవ అధ్యాయము సంపూర్ణము*



 🙏🙏 *సర్వే జనా సుఖినోభవంతు* 🙏🙏

🌹#తెలుసుకోవలసినవి…తప్పకుండ చదువుతారు అని ఆశిస్తున్నాను #జై #శ్రీ #రామ్ #జై #హనుమాన్

1

ఏకదంతుడు – వినాయకుడు

ఏక పత్నీవ్రతుడు – శ్రీ రాముడు

ఏకాహము – 24 గంటలు పాటు చేసే భజన కార్యక్రమం

ఏకోనారాయణ – నారాయణుడు ఒక్కడే

ఏకాశం – జగతికి ఆకాశం ఒక్కటే.

2

ద్వివిధ అక్షరములు – అచ్చులు (అ నుండి అః వరకు), హల్లులు (క నుండి ఱ వరకు)

ద్వివిధకాంతిరూపులు : 1.సూర్యుడు. 2. చంద్రుడు

ద్వికటుకములు : 1.పిప్పళ్ళు, 2.మిరియాలు

ద్విజన్మలు :1.పుట్టుక, 2.ఉపనయన సంస్కారము

ద్వినేత్రములు : వామనేత్రము మరియు దక్షిణనేత్రము.

ద్విముఖపక్షులు : 1.గండబేరుండము, 2. దుందుభము

ద్వియోగములు : 1.జ్ఞానయోగము, 2.కర్మయోగము

ద్వివైనతేయులు : 1.అరుణుడు. 2. వైనతేయుడు

ద్వివిధాయుధములు : 1.అశ్త్రములు 2. శస్త్రములు

ద్వివిధాయానములు : 1.ఉత్తరాయణము. 2. దక్షిణాయనము.

ద్వివిధ హృదయములు : 1.దయార్థ్ర హృద్యము. 2. పాషాణ హృదయము.

ద్వివిధ సహజన్ములు : 1.సోదరి 2. సోదరుడు

ద్వివిధ సంగీత రీతులు : 1 మార్గము. 2. దేశి.

ద్వివిధ శైవాచారములు :1.పండితాచారము, 2. బసవాచారము

ద్వివిధదినభాగములు : 1.పగలు. 2. రాత్రి

ద్వివిధ దానములు : 1.స్వదానము (తానుగా ఇచ్చుట). 2. ప్రేరణ దానము (ఇతరుల ప్రేరణతో ఇచ్చుట)

ద్వివిధ దర్శనములు : 1.అస్తికములు,. 2. నాస్తికములు

ద్వివిధ జ్ఞానములు : 1. వృత్తిజ్ఞానము, 2. స్వరూప జ్ఞానము

ద్వివిధ జాతులు : 1. స్త్రీజాతి. 2. పురుష జాతి.

ద్వివిధ కార్యములు : 1. దేవకార్యములు (వ్రతములు, పూజలు, మొదలగునవి). 2. మానుష కార్యములు (వివాహం, సీమంతం. మొదలగునవి)

ద్వివిధ కాండములు : 1.జ్ఞానకాండము, 2.కర్మ కాండము

ద్వివిధ కళలు : అవి. 1. లలిత కళలు. (నృత్య, సంగీత, చిత్రలేఖనము మొదలగునవి.) 2. ఫలిత కళలు (కుమ్మరి, మేదరి

సాలె మొదలగునవి)

ద్వివిధ కర్మలు : 1.నిత్య కర్మలు. 2. నైమిత్తి కర్మలు

ద్వివిధ ఆత్మలు : 1.జీవాత్మ,2. పరమాత్మ

ద్విలోకములు : రెండు లోకములు: ఇహలోకము మరియు పరలోకము

ద్విగుణములు : రెండు గుణాలు: మంచి (హంస, లాభం) మరియు చెడు (హింస, నష్టం).


3

త్రి మూర్తులు – బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు (హరి, హర, బ్రహ్మ)

త్రి గుణములు – సత్వ, రజో, తమో

త్రివిధ గుణములు – దేవ, మనుష్య, రాక్షస

త్రి భువనాలు – భూలోకము, భువర్లోకము, సువర్లోకము

త్రి కరణములు – మనస్సు, వాక్కు, శరీరం (పని)

త్రి గంధములు – ఏలకులు, జాపత్రి, దాల్చిన చెక్క

త్రికాలములు – వేసవి, వర్ష, శీతల

త్రివిధ కాలములు – భూత, భవిష్యత్, వర్తమాన

త్రి లోకాలు – ముల్లోకాలు – స్వర్గ (దేవ), మర్త్య (మానవ), పాతాళ

త్రి మతములు – ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము

త్రివిధ మార్గములు – జ్ఞాన, కర్మ, ఉపాసన

త్రివిధ ఋషులు – బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి

త్రిఫల – ఉసిరి, కరక్కాయ, తానికాయ (జాజికాయ)

త్రిదోషములు – వాత, పిత్త, కఫ

త్రి సంధ్యలు -ప్రాతః, మాధ్యాహ్నిక, సాయం సంధ్యలు

త్రివర్ణములు :1.బ్రాహ్మణులు, 2. క్షత్రియులు, 3.వైశ్యులు (అగ్రకులాలు)

త్రిలింగములు :1.తారకలింగము (ఆకాశమున)2.మహాలింగము (భూలోకమున)3.హటకేశ్వరలింగము (పాతాళలోకమున)

                     1.శ్రీశైలము, 2. ద్రాక్షారామము, 3.కాళేశ్వరము

త్రిమదములు : 1.విద్యామదము, 2.ధనమదము, 3.కులమదము

త్రిపురుషులు : 1.పితృ, 2. పితామహ, 3. ప్రపితామహ

త్రిపత్రికములు : 1.తులసి, 2.మారేడు,3.కుందము

త్రినేత్రములు : 1.సూర్యుడు, 2.చంద్రుడు, 3. అగ్ని (ఈశ్వరునివి)

త్రినాడులు : 1.ఇడ, 2. పింగళ, 3. సుషుమ్న

త్రిజ్యేష్టములు : (వివాహమునకు)1, గ్బొలిచూలి వరుడు. 2. తొలి కన్యక, 3. జ్యేష్ట మాసము.

త్రికవులు : 1.నన్నయ, 2. తిక్కన, 3. ఎఱ్ఱాప్రగడ= కవిత్రయము

త్రికంటకములు : 1.శొంఠి, 2. తిప్పతీగ, 3.దూలగొండి

త్రికంటక ద్రవ్యములు : 1. వాకుడు. 2. దూలగొండి. 3. పల్లేరు.

త్రివిధ కాంక్షలు : 1. కాంత, 2 .కనక, 3.కీర్తి

త్రికరణములు : 1.మనస్సు, 2.వాక్కు, 3.పని

త్రిలోకములు : 1.స్వర్గలోకము, 2.మర్త్యలోకము, 3.నరకలోకము

త్రివేణీసంగమ నదులు : యమున, గంగా, సరస్వతి నదులు

త్రివిధాగ్నులు :1.కామాగ్న. (కోరిక) 2.క్రోదాగ్ని, (కోపము) 3.క్షుద్రాగ్ని (ఆకలి)

త్రివిధాక్షీణులు :1. కంచి కామాక్షి. 2. మధుర మీనాక్షి. 3. కాశీ విశాలాక్షి

త్రివిధ సుగంధ ద్రవ్యములు :1.చందనము. 2. కురువేరు. 3.నాగకేసరి.

త్రివిధ సుందర పురములు : 1.బ్రహ్మపురము 2.విష్ణుపురము. 3. శివపురము

త్రివిధ శాంతములు : (శాంతత్రయము) 1. సత్యము. 2. శాంతము. 3. మౌనము.

త్రివిధ శరీరాంగములు : 1.దేహము. 2. ఇంద్రియాలు. 3. ప్రాణము

త్రివిధ వేదకాండలు :1.ఉపాసనాకాండ, 2.కర్మకాండ, 3.జ్జానకాండ.

త్రివిధ వృద్ధులు : 1.జ్ఞావృద్ధులు. 2. తపోవృద్ధులు. 3. వయోవృద్ధులు.

త్రివిధ మార్గములు : మూడు మార్గాలు: 1జ్ఞానమార్గము, 2. కర్మమార్గము, 3. ఉపాసనా మార్గము

త్రివిధ మండలములు : సూర్య మండలము, చంద్రమండలము, అగ్ని మండలము

త్రివిధ గుణదేవతలు : 1.సాత్వికము.. వసువు. 2. రాజసము. రుద్రుడు. 3. తామసము. ఆదిత్యుడు.

త్రివిధ కళలు : (అభినయ) 1. గానము, 2. వాద్యము 3. నర్తనము

త్రివిధ కల్పములు : 1.బ్రహ్మ కల్పము. 2. వరాహ కల్పము. 3. పద్మ కల్పము

త్రివిధ శబ్దశక్తులు : 1.అభిధ 2.లక్షణ 3.వ్యంజన

త్రివిధ ఋషులు : త్రివిధ ఋషులు – బ్రహ్మర్షి, దేవర్షి, రాజర్షి

త్రిశక్తి దేవతలు : 1.లక్ష్మీ 2. పార్వతి. 3. సరస్వతి.

త్రిపిటకములు : (భౌద్ధ మత సంబంధమైనవి) అవి. 1.సుత్త పిటకము, 2. వినయ పిటకము, 3. అభిధమ్మ పిటకము (బౌద్దం)

త్రిక్షారములు : మూడువిధాలైన క్షారములు 1,సజ్జాక్షారము, 2. యవాక్షారము, 3. వెలిగారము

ధనగతి త్రయము : 1.దానము. 2. భోగము. 3.నాశము.

సంపాదించిన ధనాన్ని ఉపయోగించాలి అనగా అనుబవించాలి.

లేదా దానం చేయాలి. ఈ రెండు చేయకుంటే అది నాశనమౌతుందని దీని అర్థము.

శక్తిత్రయము : 1.ప్రభుశక్తి, 2. ఉత్సాహశక్తి, 3. మంత్రశక్తి

తాపత్రయములు : మూడువిధాలైన తాపములు (అవి. ఆధ్యాత్మికము, 2.ఆధిభౌతికము, 3.ఆధిదైవికము)

అంబాత్రయము : 1.మూకాంబిక, 2. జ్ఞానాంబ, 3.బ్రమరాంబ.

పాకత్రయము : మూడువిధములైన కావ్య శైలి పాకములు. అవి. 1.ద్రాక్షాపాకము. 2. కదలీ పాకము. 3. నారికేళ పాకము

కావ్యరీతిత్రయము : 1.వైదర్భి. 2. గౌడి. 3. పాంచాలి.

నాయికాత్రయము : 1.స్వీయ, 2.పరకీయ, 3.సామాన్య

త్రివిధ నాయికలు : 1.ముగ్ద: ఉదయించుచున్న యౌవనము లజ్జ గల స్త్రీ. 2. మద్య, సగము లజ్జ వీడిన స్త్రీ., 3. ప్రౌడ. సిగ్గు విడిచిన సంపూర్ణస్త్రీ.

త్రిమతములు : 1. ద్వైతము, 2. అద్వైతము, 3.విశిష్టాద్వైతము

క్రియాత్రయము : 1.మణి, 2.మంత్రము, 3. ఔషదము

అవస్థాత్రయము : 1.జాగ్రదవస్థ, 2.స్వప్నావస్థ, 3.సుషుస్త్వవస్థ

4.

చతుర్ధామములు : రామేశ్వర ధామం,బదరీనాథ్ ధామం, ద్వారక ధామం, జగన్నాథ్ ధామం

చతుర్వేదములు – ఋగ్వేదము, యజుర్వేదము, సామ వేదము, అథర్వణ వేదము

చతుర్విధ ఆశ్రమాలు – బ్రహ్మచర్యం, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము

నాలుగు దిక్కులు – తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణము

నాలుగు మూలలు – ఆగ్నేయము, ఈశాన్యము, నైరృతి, వాయువ్యం

చతుర్విధ బలములు – బాహు, మనో, ధన, బంధు

చతుర్విధ పాశములు – ఆశా, మోహ, మాయా, కర్మ

చతుర్విధ కర్మలు – ధ్యానము, శౌచము, భిక్ష, ఏకాంతము

చతుర్విధ దానములు – కన్యాదానము, గోదానము, భూదానము, విద్యాదానము

చతుర్విధోపాయములు – సామము, దానము, భేదము, దండము

చతుర్విధ ఫలములు/పురుషార్థాలు – ధర్మ, అర్ధ, కామ, మోక్ష

చతుర్విధ స్త్రీ జాతులు : 1.పద్మినీ జాతి. 2. హస్తినీ జాతి. 3. శంఖిని జాతి. 4. చిత్తినీ జాతి.

చతుర్విధ స్త్రీ గుణములు : 1. సందేహము, 2. భయము, 3. తెలియనితనము, 4. లజ్జ.

చతుర్విధ స్వభావములు : 1.బ్రాహ్మణ స్వభావము, 2. క్షత్రియ స్వభావము, 3. వైశ్యస్వభావము, 4. శూద్ర స్వభావము.

చతుర్విధ సంభవములు : 1.యజ్ఞము వలన వర్షం 2. వర్షమువలన అన్నము. 3. అన్నము వలన కర్మము, 4. కర్మము వలన మోక్షము.

చతుర్విధ లింగములు : 1.ఇష్టలింగము, 2. ప్రాణలింగము, 3. భావలింగము, 4. ఆత్మలింగము.

చతుర్విధయుగాంతములు : 1.కృతయుగము. .. శ్రావణ బహుళ అష్టమి. 2. త్రేతాయుగము,,,, కార్తీక బహుళ దశమి, 3. ద్వాపరయుగము…. మాధ బహుళ చతుర్థ, 4. కలియుగము…. మాఘ బహుళ నవమి.

చతుర్విధ బ్రహ్మ (మానస)పుత్రులు : 1.సనకుడు. 2. సనందుడు. 3. సనత్కుమారుడు. 4. సనత్సుజాతుడు.

చతుర్విధ బ్రహ్మచార్యులు : 1.గాయత్రీ బ్రహ్మచారి. 2. బ్రాహ్మణ బ్రహ్మచారి. 3. ప్రజాపత్య బ్రహ్మచారి. 4. బృహద్భహ్మచారి.

చతుర్విధ దుర్గములు : 1.గిరిదుర్గము. (పర్వతము) 2. వనదుర్గము. (వనము) 3. స్థలదుర్గము. (ప్రాకారము). 4. జలదుర్గము (సముద్రము)

చతుర్విధ జ్ఞాతులు : .సపిండులు, 2. సోదరులు, 3. సగోత్రులు, 4. సనాభులు

చతుర్విధ గణితములు : 1. సంకలితము., 2. ఉత్కలితము, 3. గుణహారము, 4. బాగహారము

చతుర్విధ కష్టములు : 1. శరీరిక కష్టము, 2. మానసిక కష్టము, 3. సామాజిక కష్టము, 4. అధ్యాత్మిక కష్టము

చతుర్విధ అలంకారములు : (స్త్రీలకు) కేశాలంకారము. 2.శరీరాలంకారము. 3. భూషణాలంకారము. 4. లేపనాలంకారము.

చతుర్విధ అగ్నులు : 1. బడబాగ్ని. 2. జఠారాగ్ని. 3. గృహాగ్ని. 4. దావగ్ని.

చతుర్విధ అంతఃకరణములు : 1. మనస్సు. 2. బుద్ధి. 3. చిత్తము. .4. అహంకారము.

చతుర్వర్ణదేవతలు : 1.బ్రాహ్మణులకు – శివుడు, 2. క్షత్రియులకు – విష్ణువు, 3.వైశ్యులకు.. లక్ష్మి, 4. శూద్రులకు .. గణపతి.

చతుర్లవణములు : 1.సైంధవము లవణము. 2. సావర్చము. 3. బిడాలవణము, 4. సముద్ర లవణము.

చతుర్దిశమూలలు : 1.ఆగ్నేయ మూల, 2. వాయువ్వ మూల, 3. ఈశాన్యమూల. 4. నైరుతి మూల.

కావ్యవృత్తి చతుష్టయము : 1.కైశికి. 2. అరభటి. 3. సాత్వితి. 4. భారతి.

స్త్రీజాతి చతుష్టయములు : 1. పద్మిని. 2. హస్తిని. 3. చిత్తిని. 4.శంఖిని

పురుషజాతి చతుష్టయము : 1. భద్రుడు, 2. దత్తుడు, 3. కూచిమారుడు. 4. పాంచాలుడు.

చతుర్విధ రధకులు : 1.మహారథుడు. 2. అతిరధుడు. 3. సమరథుడు. 4. అర్థరధుడు.

చతుర్విధ వ్యూహములు : 1.వాసుదేవ, 2. ప్రద్యుమ్న. 3. అనిరుద్ధ, 4. సంకర్షణములు

చతుర్విధ ప్రమాణములు : 1.ప్రత్యక్ష ప్రమాణము., 2. అనుమాన ప్రమాణము, 3. ఉపమాన ప్రమాణము, 4. శబ్దప్రమాణము

చతుర్విధ అభినయములు : 1.ఆంగికాభినయం 2. వాచికాభినయం 3. ఆహార్యాభినయం 4. సాత్త్వికాభినయం

చతుర్విధ కవిత్వములు : 1.చిత్ర కవిత్వము, 2. ఆశుకవిత్వము, 3. బంధ కవిత్వము, 4. గద్యకవిత్వము.

చతుర్విధ శృంగార నాయకులు :

1.అనుకూలుడు. ఒకే నాయిక యందు అనురాగము గలవాడు. 2. దక్షిణుడు. అనగా… అనేక నాయికలను సమానముగా ప్రేమించు వాడు. 3. ధృష్టుడు. అనగా నాయిక పట్ల అపచారం చేసి కూడా చెడుగా ప్రవర్తించేవాడు. 4. శఠుడు. అనగా ఇతరులకు తెలియకుండా నాయికకు మాత్రమే తెలియు నట్లు అప్రియము ఆచరించు వాడు.

చతుర్విధ కావ్య నాయకులు : 1.ధీరోదాతతుడు: ధైర్యం వంటి ఉదాత్త గుణములు గల వాడు. 2. ధీరోద్దతుడు. గర్వము అసూయ, క్రోధము వంటి గుణములు గలవాడు. 3. ధీరశాంతుడు. అనగా ప్రసన్నాత్ముడు. ధీరుడు. 4. ధీరలలితుడు: అనగా నిశ్చింతుడు. కళలలో ఆసక్తి గలవాడు నిరంతరము సుఖజీవనాభిలాషి.

చతుర్విధపురుషార్థములు : 1.బ్రహ్మచర్యము, 2.గార్హ్యస్థము, 3.వానప్రస్థము, 4.సన్యాసము

చాతుర్మాసములు : 1. ఆషాఢము. 2. శ్రావణము. 3. బాధ్రపదము. 4. ఆశ్వయుజము.

చతుర్విధ ఆయుదములు : శ్రీమహావిష్ణువి: 1.శంఖము. 2.గద, 3. చక్రము. 4. పద్మము

చతుర్విధ సభలు : 1.బ్రహ్మసభ. 2. ఇంద్ర సభ. 3. రుద్ర సభ. 4. విష్ణుసభ.

5.

పంచ లోహాలు – వెండి,ఇనుము, బంగారము,సీసము, రాగి

పంచ జ్ఞానేంద్రియాలు – శ్రోత్రం (చెవులు), త్వక్కు (చర్మం), చక్షు (కళ్లు), జిహ్వ (నాలుక), ఘ్రాణం (ముక్కు)

పంచ కర్మేంద్రియాలు – వాక్కు, పాణి, పాద, భగము, ఉపస్థ

పంచ విషయాలు – శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు

పంచ ప్రాణాలు – ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానము

పంచ పాండవులు – ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు

పంచ భూతాలు – భూమి, ఆకాశము, వాయువు,జలము, అగ్ని

పంచ లింగాలు – పృథ్విలింగం, ఆకాశలింగం, జలలింగం, తేజోలింగం, వాయులింగం

పంచమహాపాతకములు : 1.స్త్రీ హత్య. 2. శిశుహత్య, 3. గోహత్య. 4. బ్రహ్మహత్య. 5. గురుహత్య

పంచమత గ్రంధములు : 1.భగవద్గీత, 2. ధర్మపదము, 3. బైబులు, 4. ఖురానీషరీఫ్, 5. దివ్వగ్రంధము.

పంచభక్తులు : 1.పితృభక్తి, 2. రాజభక్తి, 3. గురుభక్తి, 4. దేశభక్తి, 5. దైవభక్తి.

పంచ పర్వముల కర్మలు : 1.కృష్ణాష్టమి. స్నానము. 2. కృష్ణ చతుర్ధశి. దానము. 3. అమావాస్య. తర్పణము. 4. పౌర్ణము. దేవతారాధన. 5. సంక్రాంతి. దేవోత్సవములు (పితృ కార్యములు.)

పంచ పత్రములు : 1.తులసి. 2. బిల్వము. 3.శమీపత్రము. 4. మాచీ పత్రము. 5. రుద్రజడ

పంచ పతివ్రతలు : 1.సీత. 2. సావిత్రి. 3. అనసూయ 4. ద్రౌపతి. 5. దమయంతి.

పంచనియమములు : 1.శౌచము, 2. సంతోషము, 3. తపస్సు, 4. స్వాధ్యాయము, 5. ఈశ్వరప్రణిధానము.

పంచధాతువులు :1.బంగారము, 2. వెండి, 3. రాగి, 4. కంచు, 5. ఇనుము

పంచ ధర్మములు : 1.జాతి ధర్మము. 2. ఆశ్రమ ధర్మము. 3. మత ధర్మము. 4. దేశ ధర్మము. 5. గుణ ధర్మము.

పంచదేవతలు : 1.మహాదేవతలు, 2. కర్మదేవతలు, 3. ఆజానజ దేవతలు, 4. పితృదేవతలు. 5. గందర్వలు.

పంచ జయతిధులు : 1.శుద్ధ ఏకాదశి. 2. ద్వాదశి. 3. త్రయోదశి. 4. చతుర్ధశి. 5. పౌర్ణము.

పంచగవ్యములు : 1.గోమూత్రము, (ఆవు పంచితము), 2. గోమయము (ఆవు పేడ) 3, గీక్షీరము (ఆవు పాలు) 4. గోదధి (ఆవు పెరుగు) 5. గోఘృతము (ఆవు నెయ్యి)

పంచక్షీర వృక్షములు : 1.మఱ్ఱి. 2. రావి. 3. జువ్వి. 4. మేడి. 5. గంగరావి.

పంచకావ్యములు : (తెలుగులో) 1. శృంగార నైషధము, 2. మనుచరిత్ర, 3. పారిజాతాపహరణము., 4 వసుచరిత్ర, 5. విజయవిలాసము.

సంస్కృతంలో: 1. రఘువంశము, 2.కుమార సంభవము, 3. శిశుపాలవధ 4.మేఘసందేశము, 5.కిరాతార్జునీయము

పంచ కషాయ వృక్ష ద్రవ్యములు : 1.జువ్వి. 2. రావి. 3. మోడి. 4. దిరిసెన., 5. మర్రి పట్ట.

పంచకళ్యాణి : (గుఱ్ఱమునకు వుండవలసినవి) 1. నాలుగు కాళ్ళు. 2. ముఖముపై తెల్లటి చుక్క. 3. తెల్లటి కుచ్చు తోక. 4. తెలుపురంగు వీపు. 5. తెలుపు రంగు మెడజూలు.

పంచకల్పములు : 1.మందారము. 2. పారిజాతము. 3. సంతానము. 4. హరిచందనము. 5. కల్పవృక్షము.

పంచ కర్మ సాక్షులు : 1.సూర్యుడు. 2. చంద్రుడు. 3. యముడు. 4. కాలము. 5. పంచ భూతములు

పంచకర్తల దేవేరులు : 1. బ్రంహపత్ని, సరస్వతి, 2. విష్ణుపత్ని… లక్ష్మి, 3. రుద్రపత్ని…. పార్వతి, 4. ఈశ్వరుని పత్ని…. ఉన్మని, 5. సదాశివపత్ని…. మనోన్మని.

పంచ ఋషులు : సానగ బ్రహ్మఋషి, సనాతన బ్రహ్మఋషి, అహభువన బ్రహ్మఋషి, ప్రత్నస బ్రహ్మఋషి, సుపర్ణస బ్రహ్మఋషి

పంచామృతములు : 1. నీరు. 2. పాలు 3. పెరుగు.4. నెయ్యి. 5. తేనె

మాతృపంచకములు :1.పెంచిన తల్లి, 2. గురువు భార్య, 3. భార్యను గన్న తల్లి, 4. తనను గన్న తల్లి, 5. అన్న భార్య.

పంచగంగలు : 1. గంగానది. 2. కృష్ణానది. 3. గోదావరి నది. 4. తుంగభద్ర నది. 5. కావేరి నది.

పంచమహాపాపములు : 1. బంగారము దొంగిలించుట. 2. సురాపానము. 3. బ్రహ్మహత్య. 4. గురుపత్నీగమనము, 5. మహాపాతకుల సహవాసము

పంచాంగములు : జ్యోతిషం ప్రకారం అందులోని ఐదు అంగములు. అవి………. 1.తిథి, 2. వారము, 3. నక్షత్రము, 4.యోగము, 5. కరణము.

పంచసూతకములు : 1. జన్మ సూకకము. 2. మృత సూతకము. 3. రజఃసూతకము. 4. అంటు (రోగ)సూతకము. 5. శవదర్శన సూతకము.

పంచసూక్తములు : (మతాంతరము) 1. పురుష సూక్తము. 2. దేవీ సూక్తము. 3. సూర్య సూక్తము. 4. వర్జన్యసూక్తము. 5. శ్రీసూక్తము;

పంచశుద్ధులు : 1.మనశ్శుద్ధి 2. కర్మశుద్ధి, 3. బాండశుద్ధి, 4. దేహశుద్ధి, 5. వాక్ శుద్ధి

పంచవిధ శకములు : 1. క్రీస్తు శకము. 2. విక్రమార్క శకము. 3. శాలివాహన శకము. 4. హిజరీ శకము. 5. ఫసలీ శకము.

పంచవిధ ధన వారసులు : 1. తాను. 2. తండ్రి. 3. తాత. 4. కొడుకు, 5. కొడుకు కొడుకు

పంచవిధ దేవతా పీఠములు : 1.పద్మ పీఠము. 2. శేషపీఠము. 3.కుముద పీఠము. 4. సోమ పీఠము. 5. భద్ర పీఠము.

పంచవాయువులు : 1.ప్రాణము. 2. అపానము. 3. వ్యానము. 4. ఉదానము. 5. సానవాయువు.

పంచ దోషములు : (అ.) 1. వ్యభిచారము, 2. విరోధము, 3. సత్ప్రతిపక్షము, 4. అసిద్ధి, 5. బాధ. [ఇవి హేతుదోషములు. చూ.

పంచహేత్వాభాసములు] (ఆ.) 1. కామము, 2. క్రోధము, 3. భయము, 4. నిద్ర, 5. శ్వాసము. (ఇ.) 1. మిథ్యాజ్ఞానము, 2. అధర్మము, 3. శక్తిహేతువు, 4. ద్యుతి, 5. పశుత్వము.

6.

షడ్రుచులు – మధురం (తీపి), ఆమ్లం (పులుపు), లవణం (ఉప్పు), కటు ( కారం), తిక్తం (చేదు), కషాయం (వగరు)

షట్చక్రవర్తులు – హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుత్సుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యుడు

షడ్విధ పరమార్థ శత్రువులు : 1.కామము. 2. క్రోదము, 3.లోబము. 4. మోహము. 5. మదము. 6. మాత్సర్యము

షడ్విధ నరకములు : 1. తపనము. 2. అవీచి. 3. మహాకావరము. 4. కావరము. 5. సంఘాతము. 6. కాలసూత్రము.

షడ్విధ గుణములు : (రాజనీతి యందు) 1. సంధి. 2. విగ్రహము, 3. యానము. 4. సంస్థాపనము. 5. ఆసనము. 6. ద్వైధీభావము

షడ్విధ కలియుగ శకములు : 1.యుధిస్టరశకము. 2. విక్రమ శకము. 3. శాలివాహన శకము. 4. విజయనందన శకము. 5. నాగార్జున శకము. 6. కల్కి శకము.

షద్రసములు : 1.కషాయము. (వగరు.) 2. మధురము (తీపి) 3. లవణము (ఉప్పు) 4. కటువు (కారము) 5. తిక్తము (చేదు) 6. ఆమ్లము (పులుపు)

షదృతువులు : 1.వసంతఋతువు, 2. గీష్మఋతువు. 3. వర్షఋతువు. 4. శరదృతువు. 5. హేమంతఋతువు. 6. శశిఋతువు.

షట్చక్రాధి దిశదేవతలు : 1.మూలాధారము. గణపతి. 2. స్వాధిష్టానము. బ్రహ్మ. 3. మణిపూరకము. విష్ణువు. 4. అనాహతము . రుద్రుడు. 5. విశుద్ధము. ఈశ్వరుడు. 6. ఆజ్ఞాచక్రము. సదాశివుడు.

షట్ స్త్రీ రక్షకులు : 1.భర్త, .2 తంద్రి. 3. కొడుకు. 4.సోదరుడు. 5. పినతండ్రి. 6. మేనమామ

షట్ గుణములు : 1. శక్తి. 2. జ్ఞానము. 3. బలము. 4. ఐశ్వర్యము. 5. తేజము

షడ్భావవికారాలు : 1.గర్భంలో ఉండడం 2. జన్మించడం 3. పెరగడం 4. ముదియడం (ముసలివారు కావడం) 5. కృశించడం 6. మరణించడం

షడ్శరీరాంగములు : 1. (మనుష్యుల యందు) జ్ఞానము, ధైర్యము, మహాత్మ్యము, యశస్సు, శ్రీ, వైరాగ్యము శిరస్సు, 2. మద్యము, 3. కుడిచేయి, 4. ఎడమచేయి. 5. కుడికాలు, 6. ఎడమకాలు.

షట్శివ లింగములు : (రావణ ప్రతిష్ఠితము) 1. వైద్యనాధ లింగము. 2. వక్రేశ్వర నాథ లింగము. 3. సిద్ధి నాథ లింగము. 4. తారకేశ్వర లింగము. 5. ఘటేశ్వర లింగము. 6. కపిలేశ్వర లింగము.

షట్కళలు : నివృత్తి,, ప్రతిష్ఠ.. విద్య, శాంతి, శాంత్యాతీతము, నిష్కళము

షట్ వాయిద్యములు :డమరుకము,గుమ్మడి, డిండిమము, ఘర్ఘరము, మర్దలము, ప్రణవము

షట్ లక్ష్యములు : 1. స్థూలము. 2. సూక్ష్మము. 3. కారణము. 4. మహాకారణము. 5. సమరసము. 6. వ్వక్తము.

షట్ బౌద్ధ విశ్వ విద్యాలయాలు : 1. నలంద విశ్వవిద్యాలయము. 2. తక్షశిల విశ్వవిద్యాలయము. 3. ధనకటక విశ్వవిద్యాలయము. 4. విక్రమశైల విశ్వవిద్యాలయము. 5. బలాభి (వలాభి) విశ్వవిద్యాలయము. 6. కాంచీ పుర విశ్వవిద్యాలయము.

షడ్గుణైశ్వర్యములు : జ్ఞానము, ధైర్యము, మహాత్మ్యము, యశస్సు, శ్రీ, వైరాగ్యము

షడ్గుణములు : 1. శక్తి, 2. జ్ఞానము, 3. బలము, 4. ఐశ్వర్యము. 5. వీర్యము. 6. తేజము

షట్చాస్త్రములు : 1.తర్క శాస్త్రము 2. వ్యాకరంఅను. 3. వైద్య శాస్త్రము 4. జ్యోతిషశాస్త్రం 5. ధర్మ శాస్త్రము 6. మిమాంస

షడ్విధ గణపతి : 1.మహాగణపతి మతము, 2. హరిద్రాగణపతి మతము . 3. ఉచ్ఛిష్టగణపతి మతము 4.

నవనీతగణపతిమతము 5. స్వర్ణగణపతిమతము 6. సంతానగణపతిమతము

షడీతి బాధలు : 1.అతివృష్టి. 2. అనావృష్టి. 3. మిడుతలు. 4. పందికొక్కులు. 5. విశుద్ధ. 6. హంక్లములు.

షణ్మతములు : శైవము, వైష్ణవము, శాక్తేయము, గాణావత్యము, సౌరవము, కాపాలము

అరిషడ్వర్గములు : మానవునికి అంతశత్రువులు ఆరు. అవి, కామ, క్రోద, లోభము, మోహము, మదము, మాత్సర్యములు.

షడ్విధ సన్యాసులు : 1.కుటీచక, 2. బహుదక, 3. హంస, 4. పరమహంస. 5. తురీయాతీత. 6. అవధూత

షడ్విధ ప్రజాపతులు : (బ్రహ మానస పుత్రులు)1. మరీచి. 2. అత్రి. 3. అంగీరసుడు. 4. పులస్త్యుడు. 5. పులహుడు. 6. క్రతువు

7.

సప్తధాతువులు – రసము, రక్తము, మాంసము, మేధస్సు (కొవ్వు), ఆస్తి (ఎముక), మజ్జ (మూలుగ),

సప్త సముద్రాలు – లవణ (ఉప్పు), ఇక్షు (చెరకు), సురా (మధ్యం/ కల్లు), సర్పి (ఘృతం/ నెయ్యి), క్షీర (పాల), దధి (పెరుగు), నీరు (మంచినీటి)

ఏడు వ్యాహృతులు – ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహాః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం

సప్తగిరులు – శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషబాధ్రి, నారాయణాద్రి, వేంకటాద్రి

సప్తనదులు :  గంగ, యమున, గోదావరి, సరస్వతి, నర్మద, సింధు, కావేరి

సప్తపిండదానకరులు : 1.పుత్రులు, 2. దౌహిత్రులు, 3. పౌత్రులు, 4. మేనల్లుడు, 5. భార్య, 6. అన్నదమ్ములు, 7. అన్నదమ్ముల కొడుకులు.

సప్తమండలములు : 1.వాయుమండలము, 2. వరుణ మండలము, 3. అగ్ని మండలము, 4. చంద్ర మండలము, 5. సూర్య మండలము, 6. నక్షత్ర మండలము, 7. జ్యోతి మండలము.

సప్తమాతలు :1. స్త్రీ, 2. లక్ష్మి, 3. ధృతి, 4. మేధ, 5. శ్రద్ధ, 6. విద్య, 7. సరస్వతి.

సప్తమాతలు (మాతృసమానులు) : 1. తల్లి తల్లి, 2. మేనమామ భార్య, 3. తల్లి సోదరి, 4. భార్య తల్లి, 5. తండ్రి తల్లి, 6. అన్నభార్య, 7. గురుపత్ని.

సప్త రాజ్యాంగములు : 1.అగ్నిష్టోమము,2.అశ్వమేధము,3. బహుసువర్ణకము,4.రాజసూయము,5. గోమేధము,6. వైష్ణవము,7. మహేశ్వరము.

సప్తయజ్ఞములు : 1.అగ్నిష్టోమము,2.అశ్వమేధము,3. బహుసువర్ణకము,4.రాజసూయము,5. గోమేధము,6. వైష్ణవము,7. మహేశ్వరము.

సప్తలోకములు : 1.భూలోకము, 2. భువర్లోకము, 3. సువర్లోకము, 4. మహార్లోకము, 5. జనలోకము, 6. తపోలోకము, 7. సత్య లోకము.

సప్తగంగలు : 1. గంగ,2.యమున,3. గోదావరి,4. కృష్ణవేణి,.5.నర్మద,6.సింధు,7.కావేరి

సప్తజన్మలు : 1. దేవతలు,2.మనుష్యులు.3.మృగములు,4.పక్షులు,5.పురుగులు.6.జలచరములు,7.తరుపాషాణములు

సప్త తత్వములు : 1.సత్యము. 2.బ్రహ్మము.3.విలంబితమానము.4.పక్షులు,5.వస్తువు,6.స్వభావము,7.సత్యాదిగుణము

సప్తదేహ పుణ్య కార్యములు : 1.మనస్సు, దేవుని యందు భక్తి కలుగుట. 2.నోరు. దేవుని నామము స్మరించుట.3.చేతులు, దేవుని పూజించుట.4.కాళ్ళు,. దేవాలయమునకు వెళ్ళుట.5.కనులు. దేవుని కనులార గాంచుట.6.చెవులు. దేవుని కథలు వినుట.7.శిరము. దేవునికి వందనము చేయుట చేసిన పుణ్యము.

సప్తసరస్వతులు : సుప్రభ (పుష్కర క్షేత్రము), కాందనాక్షి (నైమిశారణ్యము), విశాల (గయా క్షేత్రము),

మనోరమ (ఉత్తర కోసలము), ఓఘవతి (కురుక్షేత్రము), సురేణు (హరిద్వార్),

విమనోదక (హిమాలయము).

8.

అష్ట దిక్పాలకులు – ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈశానుడు

అష్టలక్ష్ములు – ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సంతాన, ఆది, గజ

అష్టస్థాన పరీక్ష – నాడి, మూత్ర, మల, జిహ్వ (నాలుక), శబ్ద, స్పర్శ, దృక్కు, ఆకృతి ల పరీక్ష

అష్టదోషములు : 1.చంద్రునిలో కళంకము, 2.హిమగిరియందు మంచు, 3.సముద్రునియందు ఉప్పు, 4.చందన వృక్షములనీడన త్రాచుపాములు, 5.పద్మములకు ముండ్లు, 6.సుందరీమణులకు వృద్దాప్యము, 7.కుచములకు పతనము, 8.విద్యావంతులకు దారిద్రము.

అష్టద్రవ్యములు : యజ్ఞమునకు కావలసినవి. 1.రావి, 2.మేడి, 3. జువ్వి, 4. మర్రి సమిదలు, 5. నువ్వులు, 6.ఆవాలు, 7. పాయసము, 8. నేయి.

అష్టమహా రసాలు : 1. పాదరసము, 2. ఇందిలీకం, 3. అబ్రకము, 4. కాంతలోహము, 5. విమలం, 6. మాక్షికం, 7. వైక్రాంతం, 8. శంఖం.

అష్ట భాగ్యములు : 1. రాజ్యము, 2. భండారము, 3. సైన్యము, 4. ఏనుగులు, 5. గుఱ్ఱములు, 6. ఛత్రము, 7. చామరము, 8. ఆందోళిక [ఇవి రాచరికపు భాగ్యములు].

అష్టావధానము : 1. చదరంగము, 2. కవిత్వము, 3. లేఖనము, 4. పఠనము, 5. గణితము, 6. సంగీతము, 7. యుక్తి చెప్పుట, 8. వ్యస్తాక్షర. (ఆ.) 1. కవిత, 2. వ్యస్తాక్షర, 3. గణితము, 4. సమస్య, 5. పురాణము, 6. నిషిద్ధాక్షర, 7. చదరంగము, 8. సంభాషణము [ఈ యెనిమిదింటితో గూడినవి అష్టావధానము].

9.

నవ చక్రములు : 1. మూలాధారము,2.స్వాధీష్ఠానము, 3.నాభి చక్రము, 4. హృదయ చక్రము, 5.కంఠచక్రము, 6.ఘంటిక,7.భ్రూవు, 8.బ్రహ్మరంద్రము, 9.గగనము

నవరంధ్రాలు – కళ్ళు (2), ముక్కు (2), చెవులు (2), నోరు, మల ద్వారం, మూత్ర ద్వారం

నవగ్రహాలు – సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు (మంగళగ్రహం), బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు

నవనాడులు – ఇడ, పింగళ, సుషుమ్న, గాంధార, హస్తినీ, పుషా, జయస్వినీ, అలంబస, కుహ

నవవిధ దుఃఖములు :1.పీడ, 2. బాధ, 3. వ్వధ, 4. దుఃఖము, 5. అమనస్యము. 6.ప్రసూతిజము, 7. కష్టము, 8. కృచ్ఛము, 9. అభలము.

నవవిధ ధర్మములు : 1.పుణ్యము. 2. న్యాయము, 3.సామ్యము. 4. స్వభావము, 5.ఆచారము, 6. అహింస, 7. వేదోక్తవిధి, 8.ఉపనిషత్తు, 9.యజ్ఞము

నవవిష స్థానములు : 1. చోరులకు చేతులందు, 2. స్త్రీలకు స్థనములందు, 3. కొండెగానికి నాలుక యందు, 4. కాముకునకు కన్నుల యందు, 5. పాముకు కోరలయందు, 6.తేలుకు కొండె యందును, 7. ఈగకు తలయందును, 8. నరునకు శరీరమంతా, 9.వేశ్యకు మనస్సాంతా విషము

నవసంచార నిషిద్ధ స్థలములు : 1.చింపిపీలికలు. 2. ఎముకలు. 3. ముండ్లు, 4. మలమూత్రములు. 5. వెండ్రుకలు. 6.వరిపొట్టు, 7. బూడిద, 8. కుండ పెంకులు. 9. స్నానము చేసిన నీరు పారు స్థలము.

నవతారా శుభాశుభ ఫలితములు :1. జన్మతార, దేహనాశనము. 2, సంపత్తార. సంపద., 3. విపత్తార. దరిద్రము., 4. క్షేమతార., క్షేమము. 5. ప్రత్యక్తార.. కార్య నాశనము.6. సాధనతార., కార్యసాధనము, 7. సైధన తార ./ మరణము. 8. మిత్రతార. మైత్రి., 9. పరమమైత్రి తార. పరమ మైత్రి.

నవగ్రహదేశములు : 1.సూర్యుడు. కళింగ దేశము. 2. చంద్రుడు. యవన దేశము. 3. అంగారకుడు. అవంతి దేశము. 4. బుదుడు. మగధదేశము. 5. బృహస్పతి. సింధుదేశము. 6. శుక్రుడు. కాంబోజ దేశము. 7. శని. సింధు దేశము. * 8. రాహువు. బర్బర దేశము. 9. కేతువు. అంతర్వేధి దేశము.

నవగ్రహా హోమ సమిధలు : 1. రావి 2. అత్తి. 3. జిల్లేడు, 4. జమ్మి. 5. గరిక, 6. దర్భ 7. ఉత్తరేణి 8. మోదుగ 9. చండ్ర

నవ శక్తులు : (అ.) 1. దీప్త, 2. సూక్ష్మ, 3. జయ, 4. భద్ర, 5. విభూతి, 6. విమల, 7. అమోఘ, 8. వైద్యుత, 9. సర్వతోముఖ్య.

(ఆ.) 1. ప్రభ, 2. మాయ, 3. జయ, 4. సూక్ష్మ, 5. త్రిశుద్ధ, 6. నందిని, 7. సుప్రభ, 8. విజయ, 9. సిద్ధిద. [ఆప్టే.]

(ఇ.) 1. విభూతి, 2. ఉన్నతి, 3. కాంతి, 4. కీర్తి, 5. సన్నతి, 6. సృష్టి, 7. పుష్టి, 8. సత్పుష్టి, 9. బుద్ధి.

నవవర్షాలు : 1.కురు 2.హిరణ్మయ 3.రమ్యక 4.ఇలావృత 5.హరి 6. కేతుమాల 7. భద్రాశ్వ 8. కింపురుష 9.భరత

10.

దశ వాయువులు – ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన; నాగ, కూర్మ, కృకల, ధనుంజయ, దేవదత్తం (పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు కలిపి దశ వాయువులందురు)

దశ నాడులు – నవనాడులు (ఇడ, పింగళ, సుషుమ్న, గాంధార, హస్తినీ, పుషా, జయస్వినీ, అలంబస, కుహ) మరియు శంఖిని

దశ విధ పరీక్ష – దూశ్యం, దేశం, బలం, కాలం, అనలం, ప్రకృతి, వయసు, సత్వం, సత్మయం, ఆహారం

దశావతారములు – మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, రామ, బలరామ, బుద్ధ, కల్కి

దశ విధ వివాహ పొంతనలు – రజ్జు (పాద, ఊరు, ఉదర, కంఠ, శిరో), నాడి (ఆది, మధ్య, అంత్య)

దశవిధ జయంతులు : 1.మత్స్యజయంతి. చైత్ర బహుళ పంచమి. 2.కూర్మ జయంతి. జ్యేష్ట బహుళ ద్వాదసి. 3.వరాహ జయంతి. చైత్ర బహుళ త్రయోదశి. 4.నృసింహ జయంతి. వైశాఖ శుద్ధ చతుర్థశి. 5. వామన జయంతి. బాధ్ర పద శుద్ధ ద్వాదశి. 6. పరశురామ జయంతి. మార్గశిర బహుళ ద్వితీయ. 7. శ్రీరామ జయంతి. చైత్ర శుద్ధ నవమి. 8.బలరామ జయంతి. వైశాఖ శుద్ధ తృతీయ. 9.బౌద్ధ జయంతి. బాధ్ర పద శుద్ధ షష్టి. 10..కల్కీజయంతి. బాధ్ర పద శుద్ధ ద్వితీయ

మన్మథదశవిధావస్థలు : 1. కనులతో చూచుట. 2.మనసు పడుట. 3. సంకల్పించుట. 4. నిద్ర పట్ట కుండుట. 5. చిక్కిపోవుట. 6. అన్నిట విసుగు పుట్టుట. 7. సిగ్గువిడుచుట. 8. చిత్తభ్రమ. 9. మూర్చనొందుట.

దశక్షీరములు : 1. చనుబాలు, 2. ఆవుపాలు, 3.బఱ్ఱెపాలు. 4. మేకపాలు. 5. లేడి పాలు, 6. గుఱ్ఱము పాలు. 7. గాడిదపాలు. 8. ఒంటెపాలు. 9. గొఱ్ఱెపాలు. 10. ఏనుగు పాలు.

దశదానములు : 1. గోదానము, 2.భూదానము, 3. తిలదానము., 4. సువర్ణదానము. 5.వస్త్రదానము. 6.ధాన్యదానము. 7. నేతిదానము. 8. బెల్లందానము. 9. వెండి దానము. 10. ఉప్పుదానము.

దశదూపాంగములు : 1. వట్టివేళ్ళు, 2.మంచిగంధము. 3. గుగ్గిలము. 4. మహిసాక్షి. 5. కర్పూరము. 6. అగరు, 7. కచ్చూరము. 8. తుంగముస్తెలు. 9. సాబ్రాణి. 10. ఆవునెయ్యి.

దశనాదములు : 1. చిణి. 2. చిణిచిణీ, 3. శంఖము. 4. వేణు, 5.వీణ. 6. తాళము. 7.ఘంట. 8. భేరి. 9. మృదంగము. 10. మేఘనాదము.

దశనామములు : 1. అర్జునుడు. 2. ఫల్గుణుడు. 3. పార్థుడు. 4. కిరీటి. 5. శ్వేతవాహనుడు. 6. బీభత్సుడు. 7. విజయుడు. 8. కృష్ణుడు. 9. సవ్యసాచి. 10. ధనుంజయుడు.

దశనియమములు : 1. జపము. 2. తపము. 3. దానము. 4.వేదాంతశాస్త్ర శ్రవణము. 5. ఆస్తిక్యభావము. 6. వ్రతము. 7. ఈశ్వరపూజనము. 8. యదృచ్ఛాలాభసంతోషము. 9. శ్రద్ధ 10. లజ్జ.

దశప్రజాపతులు : 1.మరీచి. 2. అత్రి. 3. అంగీరసుడు. 4. పులస్త్యుడు. 5. పులహుడు. 6. క్రతువు. 7. ప్రచేనుడు. 8. వశిష్ఠుడు. 9. భృగువు. 10.నారదుడు.

దశరూపకములు: 1. నాటకము, 2. ప్రకరణము, 3. బాణము, 4. ప్రహసనము, 5. డిమము, 6. వ్యాయోగము, 7. సమవాకారము, 8. వీధి, 9. అంశము, 10. ఈహమృగము.

దశలింగములు :1.వాల్మీకిలింగము. 2. జ్యోతిర్లింగము. 3. పృధ్వీలింగము. 4. అబ్లింగము. 5. తేజోలింగము. 6. వాయులింగము. 7. ఆకాశలింగము. 8.దేవలింగము. 9. బ్రహ్మలింగము. 10. మహర్షిలింగము.

దశవాయువులు : 1.ప్రాణము. 2. అపానము,. 3.వ్యానము. 4. ఉదానము, 5. సమానము, 6. నాగము. 7. క్రుకరము. 8. కూర్మము, 9. దేవదత్తము. 10.ధనంజయము.

దశవిధగుణములు : 1.కామము. 2. క్రోధము. 3. లోభము, 4. మోహము. 5. మదము, 6. మాత్చ్యర్యము 7. ధంభము, 8.దర్పము, 9. ఈర్ష్యా. 10. అసూయ

దశవిధ గురుకుల కళలు : 1.వాచకము. 2.లేఖనము. 3. స్వర్ణకార క్రియ. 4. సంఖ్యామానము. 5. జ్యోతిషము. 6. జాతకము. 7. అగద మంత్రము. 8. సర్వద్య. 9. శిష్టామృతీకరణము. 10. గానము.

దశవిధ చక్షుర్వింద్రియ రూపకములు : 1.పొడుగు. 2. పొట్టి. 3. లావు. 4. సన్నము. 5. తెలుపు. 6. ఎఱుపు, 7.నలుపు. 8. ఆకుపచ్చ. 9. పసుపు. 10. మిశ్రమము

దశవిధ పాపములు : 1.పరుష మాటలు. 2. అసత్యపు మాటలు. 3. పరులను వంచింపు మాటలు. 4. అసందర్భపు మాటలు. 5. పరుల ధనమును గోరుట. 6. ఇతరులకు అనిష్టము తలపుట. 7.వృధా ప్రయానము. 8. పరులకు హాని చేయుట. 9. స్త్రీలను చెరుచుట. 10. హత్యాచారము చేయుట.

దశవిధ వైష్ణవులు : 1.శ్రీవైష్ణవులు. 2. కులశేఖరులు. 3. త్రైవర్ణికులు. 4. చాత్తానులు. 5.నంబిళ్ళులు. 6. నీజయ్యారులు. 7. తళములు, 8. గౌణులు. 9. కైవర్తులు. 10. నాచ్చాంబిళ్ళులు.

11.

‎ఏకాదశ వైరాగ్యములు

ఏకాదశ పితరులు : (పిత్రుసమానులు) 1. ఉపాధ్యాయుడు. 2. తండ్రి. 3. అన్న, 4. ప్రభువు.. రాజు. 5. మేనమామ. 6. మామగారు. 7. అభయ ప్రదాత. 8. మాతామహుడు. 9. పితామహుడు. 10. బంధువు 11. తండ్రి సోదరుడు.

ఏకాదశకీర్తి శేషులు : 1.పరోపకారి. 2. వనమాలి (తోటమాలి), 3. దేవాలయ ధర్మకర్త, 4. ధర్మ సత్ర ధర్మ కర్త, 5. నీతిదప్పని రాజు. 6. వైద్యశాల ధర్మకర్త, 7. యుద్ధములో వెను దిరగని వీరుడు. 8. గొప్ప విద్య నేర్చిన వాడు. 9. కృతి నందిన వాడు. . 11.సత్పురుషుని గన్న వాడు.

12.

ద్వాదశ జ్యోతిర్లింగాలు – రామనాథస్వామి (రామేశ్వరము), మల్లికార్జున (శ్రీశైలము), భీమశంకర (భీమా శంకరం), ఘృష్ణీశ్వర (ఘృష్ణేశ్వరం), త్రయంబకేశ్వర (త్రయంబకేశ్వరం), సోమనాథ (సోమనాథ్), నాగేశ్వర (దారుకావనం (ద్వారక) ), ఓంకారేశ్వర-అమలేశ్వర (ఓంకారక్షేత్రం), మహాకాళ (ఉజ్జయిని), వైద్యనాథ (చితా భూమి (దేవఘర్) ), విశ్వేశ్వర (వారణాశి), కేదారేశ్వర (కేదారనాథ్)

ద్వాదశదానములు : 1. ఔషదదానము /2. విద్యాదానము/3. అన్నదానము/4. ఫందాదానము/5. ఘట్టదానము/6. గృహదానము/7. ద్రవ్యదానము/8. కన్యాదానము/9. జలదానము/10. చాయదానము/11. దీపదానము/12. వస్త్రదానము/

ద్వాదశదేవతారూపులు : (దైవసమానులు) 1.కన్నతండ్రి. 2. తనను పోషించినవాడు. 3. తనకు విద్య నేర్పినవాడు. 4. మంత్రమునుపదేశించినవాడు. 5. ఆపత్కాలమునందు ఆదుకున్నవాడు. 6. దారిద్ర్యమును పోగొట్టినవాడు. 7. భయమును పోగొట్టినవాడు. 8. కన్యాదానము చేసినవాడు. 9. జ్ఞానమునుపదేశించినవాడు. 10. ఉపకారము చేసినవాడు. 11. రాజు. 12. భగత్భక్తుడు. వీరందరూ దైవ సమానులు.

ద్వాదశ పుష్కర తీర్థములు : 1.గంగా నదీ పుష్కరము. 2. నర్మదా నదీ పుష్కరము 3. సరస్వతి నదీ పుష్కరము. 4.యమున నదీ పుష్కరము 5. గౌతమీ నదీ పుష్కరము. 6. కృష్ణా నదీ పుష్కరము. 7. కావేరీ నదీ పుష్కరము. 8. తామరపర్ణీ నదీ పుష్కరము. 9. సింధూ నదీ పుష్కరము. 10. తుంగభద్ర నదీ పుష్కరము. 11. తపతీ నదీ పుష్కరము 12. సరయూ నదీ పుష్కరము.

ద్వాదశావస్థలు : 1. శయనము, 2. ఉపవేశనము, 3. నేత్రపాణి, 4. ప్రకాశము, 5. గమనము, 6. ఆగమనము, 7. ఆస్థాని, 8. ఆగమము, 9. భోజనము, 10. నృత్యలిప్స, 11. కౌతుకము, 12. నిద్ర [ఇవి గ్రహముల యవస్థలు].

ద్వాదశావస్థలు : 1.దర్శనము, 2.మనస్సంగము,3. సంకల్పము,4. జాగరము,5. కార్శ్యము,6. అరతి,7. అలజ్జ, 8.ఉన్మాదము, 9.మూర్ఛ,10. మరణోద్యమము 11. జ్వారము 12. సంతాపము.

ద్వాదశ-తపస్సులు : 1. ఉపవాసము, 2. అరకడుపుగ భుజించుట, 3. వృత్తి పరిసంఖ్యానము (భిక్షకై గృహముల నేర్పఱచుకొనుట), 4. రస పరిత్యాగము (షడ్రసములను లేక 1,2 రసములను వదలుట), 5. వివిక్త శయ్యాసనము (ఏకాంత స్థానమున పడుకొనుట, ఉండుట), 6. కాయక్లేశము, 7. ప్రాయశ్చిత్తము, 8. వినయము (రత్నత్రయము, దానిని ధరించువారిపై వినయమును చూపుట), 9. వైయావృత్తము (గురుముని పాదసేవ), 10. స్వాధ్యాయము, 11. వ్యుత్యర్గము (శరీరముపై కల మమతను తక్కువ చేసికొనుట), 12. ధ్యానము చేయుట [ఇవి జైనాచార్యుల తపస్సులు]. [జైనధర్మపరిభాష]

ద్వాదశ-వ్యాకరణాంగములు :1. సమానము, 2. వచనము, 3. లింగము, 4. విభక్తి, 5. ప్రత్యయము, 6. అవ్యయము, 7. కాలము, 8. నామము, 9. ఉపసర్గము, 10. ప్రయోగము, 11. ధాతువు, 12. సంహిత

13.

త్రయోదశ రాజదోషములు : 1.నాస్తిక్యము. 2. అసత్యము. 3. పొరబాటు. 4. బుద్ధిమాంద్యము. 5. మూడులతో సమాలోచన. 6. క్రోధము. 7. విచారణ యందు ఆలస్యము. 8. పెద్దలయందు నిర్లక్ష్యము. 9. ప్రయోజన కార్య విసర్జితము. 10. సమాలోచన వెల్లడి. 11. అనిశ్చిత కార్యాచరణ. 12. శుభకార్యములందు అశ్రద్ధ. 13. విషయ సుఖాక్ష. ఇవన్నీ రాజులకుండ వలసిన లక్షణములు కావు.

త్రయోదశ మనో దోషములు : 1, కామము. 2. క్రోదము. 3. లోభము. 4. మోహము. 5. మధము. 6. మాత్సర్యము. 7. రోగము. 8. ద్వేషము. 9. ఈర్ష్య. 10 అసూయ. 11. దర్పము. 12. దంబము. 13. అహంకార దోషము

14.

చతుర్దశ భువనాలు – ఊర్ధ్వలోకాలు (భూలోక, భువర్లోక, సువర్లోక, మహార్లోక, జనోలోక, తపోలోక, సత్యలోక), అధోలోకాలు (అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ)

చతుర్దశ అరణ్యములు : 1.నైమిశా రణ్యము. 2. బదరిక ఆరణ్యము. 3. దండక ఆరణ్యము. 4. చంపక ఆరణ్యము. 5. కామికఆరణ్యము. 6. బృంద ఆరణ్యము. 7. కదళిక ఆరణ్యము. 8. గృవ ఆరణ్యము. 9. దేవత ఆరణ్యము. 10. కేదార ఆరణ్యము. 11. ఆనంద ఆరణ్యము. 12. వృక్ష ఆరణ్యము. 13. మహా ఆరణ్యము

చతుర్దశవిద్యలు : 1.ఋగ్వేదము. 2. యజుర్వేదము. 3. సామవేదము. 4. అదర్వణస్ వేదము. 5. శిక్షా, 6. వ్యాకరణము. 7. చందస్సు. 8. నిరుక్తము. 9. జ్యోతిషము. 10. కల్పము. 11. పురాణములు. 12. శాస్త్రములు. 13. న్యాయశాస్త్రములు. 14. మిమాంస.

15.

పంచదశ కళా స్థానములు :

కాలి బొటన వ్రేలు. పాదము. మడిమ. పిక్క. పొత్తి కడుపు. బొడ్డు. గుండే. స్థనములు. చంకలు. పెదవులు. చెక్కిళ్ళు. కన్నులు. నుదురు. మెడ. నడినెత్తి.

పంచదశ పంచదశీ గ్రంథాధ్యాయములు :

తత్వవివేక, మాహాభూత, పంచకోశ, ద్వైత, మహావాక్యములు, చిత్ర దీప, తృప్తిదీప, కూటస్థ దీప, ధ్యానదీప, నాటకదీప, యోగానంద, ఆత్మానంద అద్వైతానంద, విద్యానంద, విషయానంద.

16.

షోడశలక్ష్మీ నివాస స్థానములు :1. సత్యవంతుల యందు. 2. భగవద్భకులయందు. 3. శోభగలిగిన గృహముల యందు. 4. వీరుల యందు. 5. జయద్వజముల యందు. 6. ఏనుగుల నందు. 7. గోవుల యందు. 8.చత్ర దామరములనందు. 9. తామర పువ్వుల యందు. 10 పంట భూములందు. 11. పూదోటలనందు. 12. స్వయం వరములనందు. 13. రత్నములందును, 14. దీపముల నందు. 15. అద్దముల నందు. 16. మంగళ వస్తువులనందు లక్ష్మీ దేవి నివసించును.

షోడశ మహా దానములు : 1. గోదానము. 2. భూదానము. 3. తిలదానము.4. హిరణ్యదానము. 5. రత్న దానము. 6.విద్యా దానము. 7.శయ్యాదానము.8. గృహదానము. 9. కన్యాదానము. 10. దాసి దానము. 11. అగ్రహార దానము. 12. రథదానము. 13. గజదానము. 14. అశ్వదానము. 15. భాగదానము. 16. మహిషీ దానము.

షోడస కర్మలు : 1. గర్బాధానము. 2. పుంసవనము. 3. సీమంతము. 4. జాతకర్మము. 5. నామకరణము. 6. అన్నదానము. 7. చౌలము. 8. ఉపనయము. 9. ప్రజావత్యము. 10. సౌమ్యము. 11. అగ్నేయము. 12. వైశ్వదేవము. 13. గోదానము. 14. సమావర్తనము. 15. వివాహము. 16. ఆత్మకర్మ.

షోడశ కళా స్థానములు : 1. తల. 2. ఎదురొమ్ము. 3. చేతులు. 4. కుచములు. 5. తొడలు. 6. నాభి. 7. నుదురు. 8. కడుపు. 9. పిరుదులు. 10. వీపు. 11. చంకలు. 12. మర్మ స్థానము. 13. మోకాళ్ళు. 14. పిక్కలు. 15. పాదములు. 16. బొటన వ్రేళ్ళు.

షోడశ-పదార్థములు : 1. ప్రమాణము (ప్రత్యక్షాదికము), 2. ప్రమేయము, 3. ఫలము, 4. దుఃఖము, 5. అపవర్గము, 6. సంశయము, 7. ప్రయోజనము, 8. దృష్టాంతము, 9. సిద్ధాంతము, 10. అవయవములు, 11. తర్కము, 12. నిర్ణయము, 13. వాదము, 14. ఛలము, 15. జాతి, 16. నిగ్రహస్థానము [ఈ పదార్థములు సాహాయ్యమున వాదిప్రతివాదుల మధ్య సిద్ధాంతనిర్ణయము జరుగును] [గౌతమన్యాయసూత్రములు]

17.

సప్తదశ-నాయక గుణములు : 1. వినయము, 2. మాధుర్యము, 3. త్యాగము, 4. దక్షత, 5. ప్రియంవదత్వము, 6. జనుల యనురాగమునకు పాత్రుడగుట, 7. శుచిత, 8. వాగ్మిత, 9. రూఢవంశము, 10. స్థైర్యము, 11. యౌవనము, 12. జ్ఞానము, ఉత్సాహము, స్మృతి, ప్రజ్ఞ, కళ, మానము (వీనిని కలిగియుండుట), 13. శౌర్యము, 14. దార్ఢ్యము, 15. తేజస్విత, 16. శాస్త్రచక్షుస్త్వము, 17. ధార్మికత్వము. [ద.రూ. 2-1-2] (మూలం:సంకేతపదకోశము (రవ్వా శ్రీహరి))

18.

అష్టాదశ పురాణాలు – మద్వయం (మత్స్య, మార్కండేయ), భద్వయం (భాగవత, భవిష్యత్), బ్రత్రయం (బ్రహ్మ, బ్రహ్మ వైవర్త, బ్రహ్మాండ), వచతుష్టయం (వాయు, వరాహ, వామన, విష్ణు), అగ్ని, నారద, పద్మ, లింగ, గరుడ, కూర్మ, స్కంద (మద్వయం ద్వయం చైవ బ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కానీ పురాణాని ప్రచక్షత!!)

అష్టాదశ శక్తిపీఠాలు – భ్రమరాంబ (శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్), జోగులాంబ (అలంపూర్, ఆంధ్రప్రదేశ్), మాణిక్యాంబ (ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్), పురుహూతికా (పిఠాపురం, ఆంధ్రప్రదేశ్), కామరూపిణి (గౌహతి, అస్సాం), మంగళ గౌరి (గయ, బీహార్), వైష్ణవి (జ్వాలాముఖి, హిమాచల్ ప్రదేశ్), సరస్వతి / శారిక (శ్రీనగర్, జమ్ము & కాశ్మీరు), చాముండేశ్వరి (మైసూరు, కర్ణాటక), మహాకాళి (ఉజ్జయిని, మధ్యప్రదేశ్), ఏకవీర (మాహూరు, మహారాష్ట్ర), మహాలక్ష్మి (కొల్హాపూరు, మహారాష్ట్ర), గిరిజ (బిరజ, ఒడిశా), శాంకరి (త్రింకోమలి, శ్రీలంక), కామాక్షి (కంచి, తమిళనాడు), శృంఖల (పశ్చిమ బెంగాల్), మాధవేశ్వరి / లలిత (ప్రయాగ, అలహాబాద్, ఉత్తరప్రదేశ్), విశాలాక్షి (వారణాశి, ఉత్తరప్రదేశ్)

అష్టాదశ స్మృతులు – మనుస్మృతి, వశిష్ట స్మృతి, పరాశర స్మృతి, విష్ణు స్మృతి, అత్రిస్మృతి, బృహస్పతి స్మృతి, కాత్యాయన స్మృతి, దక్ష స్మృతి, శంఖ స్మృతి, సంవర్తన స్మృతి, లిఖిత స్మృతి, ఉశన స్మృతి, హరీత స్మృతి, యమ స్మృతి, అంగీరస స్మృతి, వ్యాస స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, శాతాత స్మృతి

19.

ఏకోనవింశతి దేవతా గణములు :

అమరులు, సిద్ధులు, సాధ్యులు, గరుడులు, కిన్నరులు, కింపురుషులు,గంధర్యులు

యక్షులు, విద్యాధరులు, భూతములు, పిశాచములు, రుద్రులు, మునిగణములు

ఉరుగులు, తుషితులు, దైత్యులు, భాస్వరులు, గుహ్యకులు, నరులు.

ఏకోనవింశతి అశ్వమేధ యాగ కర్తలు :

దిలీపుడు, దశరథుడు, శ్రీరాముడు, భరతుడు (దుష్యంతుని పుత్రుడు)

ధర్మరాజు, జనమేయ జయుడు, శర్వాతుడు, అంబష్టుడు, శతానీతుడు

యుధాంశ్రేష్టి, విశ్వకర్మ, సుధాంసుడు, మరత్తుడు, అంగుడు, దుర్ముఖుడు,

అరాతి, పుష్య మిత్రుడు, వాతాపి (ఛాలుక్య వంశీయుడు), ఏలకేసి (రెండవ)

21.

ఏక వింశతి రాజ చిహ్నములు.

కిరీటము,చత్రము,చామరము, ఢంక, కొమ్ము, చక్రము, గజము, ధ్వజము

మకర తోరణము, పూర్ణ కుంభము, వుష్ఠాహారము, శంఖము, అలవట్టము

దివిటీ, వృషభము, సింహాసనము, హెచ్చరిక, అశ్వము, వారస్త్రీ, నగారా

నౌబత్కాన,

ఏకవింశతి స్మృతులు : 

ఆపస్తంబ స్మృతి, మను స్మృతి, వ్యాస స్మృతి, ఆంగీరస స్మృతి, బృహస్పతి స్మృతి

పరాశర స్మృతి, వసిష్ట స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, అత్రి స్మృతి, గౌతమ స్మృతి

కాత్యాయన స్మృతి, విష్ణు స్మృతి, దక్ష స్మృతి, లిఖిత స్మృతి, ఉశన స్మృతి

యమ స్మృతి, శంభ స్మృతి, హరిత స్మృతి, బోధాయన స్మృతి, సంవర్త స్మృతి

శాతాతర స్మృతి.

23.

త్రివింశతి ఈశ్వర కలలు :

ఈశ్వర కలా, ప్రీతి కలా, శ్వేత కలా, అరుణా కలా, అసితా కలా, సదాశివ కలా

నివృతి కలా, ప్రతిష్ఠ కలా, విద్యా కలా, శాంతి కలా, రాధికా కలా, దీపికా కలా, రేచికా కల, మూచికా కలా, పరా కలా, సూక్ష్మ కలా, సూక్ష్మామృతాకలా, జ్ఞాన కలా, జ్ఞానామృత కలా, ఆప్యాయనీ కలా, వ్యాపినీ కలా, వ్యామరూప కలా

జీవకలా.

24.

చతుర్వింశతి స్త్రీ రాగములు :

దేవ క్రియ, మేఘరంజి, కురంజి, బిలహరి, మనళిహరి, భాండి, హితదో, భాలాతి

నాహుళి, దేశి, ముఖారి, లలిత, రామక్రియ, వరాళి, గౌళ, గండ క్రియ, ఘూర్జరి

బౌళి, కళ్యాణి, ఆహిరి, సావేరి, ఘంటారవము, కాంభోజి, శంఖరాభరణము.

27.

నక్షత్రాలు – నక్షత్రం / అశ్విని /భరణి /కృత్తిక /రోహిణి / మృగశిర / ఆరుద్ర / పునర్వసు / పుష్యమి / ఆశ్లేష /మఖ /పూర్వఫల్గుణి /ఉత్తర /హస్త /చిత్త / స్వాతి /విశాఖ /అనూరాధ / జ్యేష్ట /మూల / పూర్వాఆషాఢ /ఉత్తరాషాఢ / శ్రవణము / ధనిష్ట /శతభిష / పూర్వాభద్ర / ఉత్తరాభద్ర / రేవతి/

60.

తెలుగు సంవత్సరాలు

ప్రభవ, విభవ, శుక్ల, పమోదూత, ప్రజా పతి, అంగీరస, శ్రీ ముఖ, బావ, యువ, ధాతు, ఈశ్వర, బహుదాన్య, ప్రమాది, విక్రమ, వృష, చిత్రభాను, స్వభాను, తారణ, పొర్తివ, వ్వయ, సర్వజిత్, సర్వధారి, విరోధి, వికృతి, ఖర, నందన, విజయ జయ, మన్మద, దుర్ముఖి, హేవిళంబి, విళంబి, వికారి, సార్వరి, ప్లవ, సుబకృత్, సోభకృత్, క్రోధ, వశ్వావసు, పరాభవ, ప్లవంగ, కీలక, సౌమ్య, సధారణ, విరోధికృత్, పరీదావి, ప్రమాదీచ, ఆనంద, రాక్షస, నల, పింగళ, కాళయుక్తి, సిద్దర్తి, రౌద్రి, దుర్మతి దుందుభి, రుదిరోద్గారి, రక్తాక్షి, క్రోధన, అక్షయ. (మొత్తం అరవై)

షష్ఠి పూర్తి

భర్తకు 60 సంవత్సరములు నిండిన సందర్భంగా చేసుకునే వేడుక (మళ్ళీ పెళ్ళిగా వ్యవహరిస్తారు)

63.

త్రిషష్టి-శలాకాపురుషులు :

చతుర్వింశతి తీర్థంకరులు (24)

ద్వాదశ చక్రవర్తులు (12),

నవ నారాయణులు (9) (1. త్రిపుష్టుడు, 2. ద్విపుష్టుడు, 3. స్వయంభువు, 4. పురుషోత్తముడు, 5. నరసింహుడు, 6. పుండరీకుడు, 7. దత్తదేవుడు, 8. లక్ష్మణుడు, 9. కృష్ణుడు),

నవ ప్రతినారాయణులు (9) (1. అశ్వగ్రీవుడు, 2. తారకుడు, 3. మేరకుడు, 4. నిశుంభుడు, 5. మధుకైటభులు, 6. ప్రహ్లాదుడు, 7. బలిసేనుడు, 8. రావణుడు, 9. జరాసంధుడు),

నవ బలభద్రు (దేవు)లు (9) (1. విజయుడు, 2. అచలుడు, 3. సుధర్ముడు, 4. సుప్రభుడు, 5. సుదర్శనుడు, 6. నంది, 7. నందిమిత్రుడు, 8. రాముడు, 9. పద్ముడు)

64.

చతుష్షష్టి కళలు

100.

దశ దశములు – శతాబ్ధము – 100 సంవత్సరాలు.

108 ఉపనిషత్తులు

1, ఈశావాస్య ఉపనిషత్తు (ఈశావాస్యోపనిషత్తు) 2. కేనోపనిషత్తు 3. కఠోపనిషత్తు 4. ప్రశ్నోపనిషత్తు 5. ముండకోపనిషత్తు 6. మాండూక్యోపనిషత్తు 7, తైత్తిరీయోపనిషత్తు 8. ఐతరేయోపనిషత్తు 9. ఛాందోగ్యోపనిషత్తు 10. బృహదారణ్యకోపనిషత్.


చెప్పిన విషయం లో తప్పులు దొర్లు ఉంటె మన్నించగలరు.

Saturday, 29 May 2021


🕉️ *వైశాఖ పురాణం 19వ అధ్యాయము* 🕉️



*నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |*

*దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||*



🌻 *పిశాచత్వ విముక్తి* 🌻



💫🌹నారదుడు అంబరీషునకు వైశాఖమహత్మ్యము నింకను వివరించుచున్నాడు. శ్రుతకీర్తి శ్రుతదేవునికి నమస్కరించి యింకను వైశాఖ మహాత్మ్యమును దయయుంచి వివరింపగోరుచున్నానని ప్రార్థించెను.


💫🌹శ్రుతదేవుడిట్లనెను, రాజా! జన్మజన్మల పుణ్యమున్నప్పుడే భగవంతుడగు శ్రీహరి మహిమను వ్రతముల గొప్పదనమును తెలిసికొనవలయునను బుద్ధి కలుగును. ఇట్టి ఆసక్తి గల నీవు భాగ్యశాలివి. మరెన్నియో శుభలాభములు నీకు మున్ముందు కాలమున నుండుటచేతనే నీకిట్టి కోరిక కలిగినది. ఇట్టి నీకు గాక మరెవరికి చెప్పుదును వినుము.


💫🌹వైశాఖమున సూర్యుడు మేషరాశియందుండగా ప్రాతఃకాల స్నానమునాచరించి శ్రీహరిని పూజించి శ్రీహరికథను విని యధాశక్తి దానములను చేసినవారు శ్రీహరి లోకమును తప్పక చేరుదురు. వైశాఖపురాణమును చెప్పుచుండగా దానిని శ్రద్దగా వినక మరియొకదానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని. రౌరవమను నరకమును పొంది పిశాచమై యుండును. 


💫🌹అందులకుదాహరణగ క్రింది కథను చెప్పుదురు. ఈ కథ పాపములనశింపజేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించును. ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ సుమా వినుము.


💫🌹పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరమను పుణ్యక్షేత్రము కలదు. అచట దుర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు, తపోనిష్టుడు అనువారు అచటనుండిరి. వారిద్దరును మహాజ్ఞానులు. సర్వసంగపరిత్యాగులు ఉపనిషత్తులను బాగుగ చదివినవారు. అందలి భావమును గ్రహించినవారు. వారు భిక్షాన్నమును మాత్రమే భుజింతురు. మిక్కిలి పుణ్యశాలురు. వారు అచట బృగుప్రస్రవణమను తీర్థసమీపమున నుండిరి.


💫🌹వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథలయందాసక్తి కలవాడు. చెప్పువారు లేకున్నచో, తానే శ్రీహరి కథలను వివరించును. శ్రీహరి కథలనెవరైన చెప్పిన శ్రద్దగావినును. వీరెవరును లేనిచో విష్ణుకథలను తలచుకొనుచు శ్రీహరికి ప్రీతిని కలిగించు పనులను చేయుచుండును. శ్రీహరి కథలను చెప్పువారున్నచో రాత్రింబగళ్లు తన పనులను మాని వానిని వినుచుండును. 


💫🌹అట్లే వినువారున్నచో తాను రాత్రింబగళ్లు శ్రీమహావిష్ణు కథలను వివరించును. దూరముననున్న తీర్థములలో స్నానము చేయుటకన్న దూరమున నున్న క్షేత్రములను దర్శించుట కన్న కర్మానుష్ఠానము కన్న వానికి విష్ణుకథలయందు ప్రీతి యెక్కువ. ఎవరైన చెప్పుచున్నచో తాను వినును, వినువారున్నచో తాను శ్రీహరి కథలను తన్మయుడై వివరించును. చెప్పువారున్నచో తన పనులను మానుకొని వినును. విష్ణు కథలను చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కూపస్నానము చేసి శ్రీహరి కథలను తలచును.


💫🌹విష్ణుకథాశ్రవణము లేనప్పుడు స్వకార్యములను చేసికొనును. విష్ణుకథా సమాసక్తునకు సంసారబంధముండదు కదా. శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ది కలుగును. విష్ణుభక్తి పెరుగును. విష్ణువుపై నాసక్తియు సజ్జనులయందిష్టము పెరుగును. నిరంజనము నిర్గుణమునగు పరబ్రహ్మము వాని హృదయమున స్ఫురించును. 


💫🌹జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా! దుష్టులు కర్మలనెన్నిటిని చేసినను వ్యర్థములే. గ్రుడ్డివానికి అద్దమును చూపిన ప్రయోజనమేమి? కావున చిత్తశుద్దిని సాధింపవలయును. చిత్తశుద్దివలన శ్రీహరి కథాసక్తి కలుగును. అందువలన జ్ఞానము కలుగును. అట్టి జ్ఞానము వలన ధ్యానము ఫలించును. కావున పెక్కుమార్లు విష్ణుకథాశ్రవణము, ధ్యానము, మననము, ఆవశ్యకములు. 


💫🌹శ్రీహరి కథలు సజ్జనులు లేనిచోట గంగాతీరమైనను విడువదగినది. తులసీవనము శ్రీహరి ఆలయము, విష్ణుకథ లేనిచోట మరణించినవాడు తామసమను నరకమును పొందును. శ్రీహరి ఆలయము గాని కృష్ణమృగము గాని, విష్ణుకథగాని, సజ్జనులు గాని లేని చోట మరణించివారు పెక్కు జన్మలయందు కుక్కగా జన్మింతురు. సత్య నిష్ఠుడీవిధముగ నాలోచించి విష్ణుకథా శ్రవణము ప్రసంగము, మననము, స్మృతి మున్నగునవి ముఖ్యములని తలచును.


💫🌹ఇంకొకడు తపోనిష్ఠుడు. వీనికి పూజాజపాది కర్మలనిన యిష్టము. వానినెప్పుడును మానక పట్టుదలతో చేయుచుండును. శ్రీహరి కథలను వినడు, చెప్పడు. ఎవరైన చెప్పుచున్నచో తీర్థస్నానమునకు పోవును. తీర్థస్నాన సమయమున శ్రీహరి కథా ప్రసంగము వచ్చినచో తన పూజాదికర్మకలాపము పొడగునని దూరముగ పోవును. 


💫🌹అతని ననుసరించి యుందువారును స్నానాదికర్మలనాచరించి తమ యింటి పనులను చేసికొనుట యందిష్టము కలవారై యుందురు. ఇట్లెంతకాలము గడచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథాశ్రవణము, చింతనము స్మృతి మున్నగు వానిని యెరుగడు.


💫🌹ఇట్టి యహంకారి కొంతకాలమునకు మరణించెను. శ్రీహరి కథాశ్రవణము మున్నగునవి లేకపోవుటచే పిశాచమై చిన్న కర్ణుడను పేరనుండెను. జమ్మిచెట్టునందు నివసించుచుండెను. బలవంతుడైనను నిరాధారుడు, నిరాశ్రయుడు యెండిన పెదవులు, నోరు కలవాడై యుండెను. ఇట్లు బాధపడుచు కొన్నివేల సంవత్సరముల కాలముండెను. వాని సమీపమునకు వచ్చువారు లేక మిక్కిలి బాధపడుచుండెను. 


💫🌹ఆకలి దప్పిక కలిగి అవి తీరునుపాయము లేక మిక్కిలి బాధపడుచుండెను. వాని శరీరమునకు జలబిందువు అగ్నిగను, జలము ప్రళయాగ్నివలెను ఫల పుష్పాదులు విషముగను వుండెడివి.


💫🌹ఈ విధముగ కర్మపరాయణుడగు తపోనిష్ఠుడు పలువిధములుగ బాధలనుపడెను. నిర్జనమైన ఆ యడవియందతడు మిక్కిలి బాధపడుచుండగా నొకనాడు సత్యనిష్ఠుడు పనిపై పైఠీనసపురమునకు పోవుచు నా ప్రాంతమునకు వచ్చెను. అతడు పెక్కు బాధల ననుభవించుచున్న చిన్నకర్ణుని జూచెను. దుఃఖించుచు శరణాగతుడైన వానికి భయపడకుమని ధైర్యము చెప్పివాని బాధకు కారణము నడిగెను. 


💫🌹అతడును నేను కర్మనిష్ఠుడను వాడను. దుర్వాసమహాముని సిష్యుడను. కర్మపరతంత్రుడనై శ్రీ హరి కథా శ్రవణాదులను చేయనివాడను. మూఢుడనై కర్మలనే ఆచరించుటవలన నిట్టి వాడనైతినని తన వృత్తాంతమునంతయును వానికి చెప్పెను. నా యదృష్టవశమున మీ దర్శనమైనది. నాను మీరే రక్షింపవలయునని పలు విధముల ప్రార్థించెను. వాని పాదములపై బడి దుఃఖించెను.


💫🌹సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను. తాను రెండు గడియలకాలము వైశాఖ పురాణ శ్రవణము చేసిన ఫలమును వానికి సోదకముగ సమర్పించెను. ధారపోసెను. ఆ మహిమవలన కర్మనిష్ఠుని పాపములు తొలగెను. వాని పిశాచరూపము పోయి దివ్య దేహము కలిగెను. కర్మనిష్ఠుడు-సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతను దెలిపి శ్రీహరి పంపగా వచ్చి దివ్యవిమానము నెక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను. సత్యనిష్ఠుడును వైశాఖమాస మహాత్మ్య మహిమకు విస్మయపడుచు తన గమ్యమగు పైఠీనపురమునకు పోయెను.


💫🌹శ్రుతకీర్త మహారాజా! కావున శ్రీహరి కథల ప్రసంగము, శ్రవణము, ప్రశస్తము యెరుగుము. శ్రీహరి కథాప్రసంగము గంగాప్రవాహము కంటె సర్వక్షేత్రములకంటె ప్రశస్తము యెరుగుము. శ్రీహరి కథాప్రసంగము గంగాప్రవాహము కంటె పవిత్రమైనది. గంగాతీర వాసులకు యిహలోక భోగములు ముక్తి కలుగునో లేదో కాని శ్రీహరి కథయును గంగాతీరవాసులకు యిహము, పరము, నిశ్చితములు సుమా అని శ్రుతకీర్తికి శ్రుతదేవుడు భగవత్ స్వరూపము నీవిధముగ వివరించెను.



*ఏ కోవశీసర్వభూతాంతరాత్మ, ఏకంరూపం బహుధాయః కరోతి |*

*తమాత్మస్థం యేనుపశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం ||*


*ఏకోదేవస్సర్వభూతేషు గూఢస్సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మా |*

*కర్మాధ్యక్షస్సర్వభూతాధివాసస్సక్షి చైషకేవలోనిర్గుణశ్చ ||*


*ఏకోనారాయణో నద్వితీయోస్తి కశ్చిత్ ఏకఏవశివో నిత్యస్తతోన్యత్ఫకలం మృషా |*

*బహునాత్రకిముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్ అనేక భేదభిన్నస్తు క్రీడ తే పరమేశ్వరః ||*


💫🌹అని శ్రుతదేవుడు శ్రుతకీర్తి భగవంతుని తత్త్వమును వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను.



*వైశాఖ పురాణం పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం*



🙏🙏 *సర్వే జనా సుఖినోభవంతు* 🙏🙏

 Meeru ekkada start ayyaru 

Movies chudatam... 🤔😃🤗

Check chesukovachu..👏👏

List of old memories..😊😃😍



ఎన్.టి.ఆర్ నటించిన డైరెక్టు తెలుగు సినిమాలు : 275

 1మనదేశం (24-11-1949)

 2షావుకారు (07-04-1950)

 3 పల్లెటూరిపిల్ల (27-04-1950)

 4 మాయారంభ (22-09-1950)

 5 సంసారం  (29-12-1950)

 6 పాతాళభైరవి (15-03-1951)

 7 మల్లీశ్వరి (20-12-1951)

 8 పెళ్ళి చేసి చూడు (29-02-1952)

 9 పల్లెటూరు (16-10-1952)

10 దాసి (26-11-1952)

11. అమ్మలక్కలు (12-03-1953)

12. పిచ్చిపుల్లయ్య (17-07-1953)

13. చండీరాణి  (28-08-1953)

14. చంద్రహారం (06-01-1954) 

15. వద్దంటేడబ్బు (19-02-1954) 

16. తోడుదొంగలు (15-04-1954)

17. రాజూపేద (25-06-1954) 

18. సంఘం (10-07-1954) 

19. అగ్గిరాముడు (05-08-1954)

20. పరివర్తన (01-09-1954)

21. ఇద్దరు పెళ్ళాలు (06-10-1954)

22. మిస్సమ్మ (12-01-1955) 

23. రేచుక్క (25-03-1955) 

24. విజయగౌరి (30-06-1955) 

25. చెరపకురా చెడేవు (06-07-1955)

26. కన్యాశుల్కం (26-08-1955)

27. జయసింహ (21-10-1955) 

28. సంతోషం (24-12-1955)

29. తెనాలి రామకృష్ణ (12-01-1956)

30. చింతామణి (11-04-1956) 

31. జయం మనదే (04-05-1956) 

32. సొంతఊరు (23-05-1956)

33. ఉమాసుందరి (20-07-1956) 

34. చిరంజీవులు (15-08-1956) 

35. గౌరీమహాత్మ్యం (20-10-1956) 

36. పెంకిపెళ్ళాం (06-12-1956)(11 తమిళ్( మాయా రంభై, పాతాళ భైరవి, కళ్యాణం పన్ని పార్, వెలైకరి మగల్,మారుమగల్, చండీ రాణి, చంద్ర హారం,పానం పడుతుం పాడు, నట్టియ తార, తెనాలి రామకృష్ణ, మర్మవీరన్),3 హిందీ సినిమాలు( పాతాళ భైరవి, చండీ రాణి,నయా ఆద్మీ)తో కలిపి 50 వ సినిమా)

37. చరణదాసి, (20-12-1956) 

38. భాగ్యరేఖ (20-02-1957) 

39. మాయాబజార్ (27-03-1957)

40.వీర కంకణం (16-05-1957) 

41. సంకల్పం (19-06-1957)

42. వినాయక చవితి (22-08-1957) 

43. భలే అమ్మాయిలు (06-09-1957) 

44. సారంగధర( 01-11-1957)

45. కుటుంబ గౌరవం (07-11-1957) 

46. పాండురంగ మహాత్మ్యం (28-11-1957)

47. అన్న తమ్ముడు (15-02-1958 ) 

48. భూకైలాస్( 20-03-1958)

49. శోభ (01-05-1958 )

50. రాజనందిని (04-07-1958 ) 

51. మంచి మనసుకు మంచి రోజులు (15-08-1958 )

52. కార్తవరాయని కధ (18-10-1958 )

53. ఇంటిగుట్టు (07-11-1958 )

54. అప్పు చేసి పప్పు కూడు (14-01-1959) 

55. రేచుక్క పగటి చుక్క (14-05-1959) 

56. శభాష్ రాముడు (04-09-1959) 

57. దైవబలం (17-09-1959)

58. బాలనాగమ్మ (09-10-1959)

59. వచ్చిన కోడలు నచ్చింది (21-10-1959) 

60. బండ రాముడు (06-11-1959)

61. శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం (09-01-1960)

62. రాజమకుటం (24-02-1960)

63. రాణీ రత్న ప్రభ (27-05-1960)

64. దేవాంతకుడు చిత్రం (07-07-1960) 

65. విమల  (11-08-1960)

66. దీపావళి (22-09-1960)

67. భట్టి విక్రమార్క (30-09-1960)

68. కాడెద్దులు ఎకరం నేల (06-10-1960)

69. సీతారామ కల్యాణం (06-01-1961) 

70 ఇంటికి దీపం ఇల్లాలే (26-01-1961)

71. పెండ్లి పిలుపు (05-05-1961) 

72. సతీ సులోచన (05-05-1961)

73. శాంత (14-7-1961)

74 . జగదేకవీరుని కధ (09-08-1961) 

75. కలసి ఉంటే కలదు సుఖం  (08-09-1961) 

76. టాక్సీ రాముడు (18-10-1961)

77. గులేబకావళి కధ (05-01-1962 )

78. గాలి మేడలు (09-02-1962) 

79. టైగర్ రాముడు (08-03-1962) 

80. భీష్మ ( 19-04-1962 ).

81. దక్ష యజ్ణం ( 10-05-1962 )

82. గుండమ్మకధ (07-06-1962) ( తమిళ సినిమాలు1 మాయారంభై 2 పాతాళ భైరవి 3 కల్యాణం పన్నిపార్ 4 వెలైకారి మగల్ 5 మరుమగల్ 6 చండీరాణి 7 చంద్ర హారం 8 పానం పడుతుం పాడు 9 నట్టీయ తార 10 తెనాలి రామకృష్ణ 11 మర్మ వీరన్ 12 మాయా బజార్ 13 సంపూర్ణ రామాయణం 14 రాజు సెవై 15 రాజ మగుడం హిందీ సినిమాలు 1 పాతాళ భైరవి 2 చండీ రాణి 3 నయా ఆద్మీ…...15 తమిళ్ సినిమాలు+3 హిందీ సినిమాలు +82 తెలుగు సినిమాలు = 100 వ సినిమా)

83.మహామంత్రి తిమ్మరసు (26-07-1962 )

84.స్వర్ణ మంజరి (10-08-1962)

85.రక్త సంబంధం (01-11-1962)

86.ఆత్మ బంధువు (14-12-1962)

87.శ్రీ కృష్ణార్జున యుద్ధం (09-01-1963) 

88. ఇరుగు పొరుగు (11-01-1963) 

89.పెంపుడు కూతురు (06-02-1963) 

90 వాల్మీకి (09-02-1963) 

91 సవతి కొడుకు (22-02-1963)

92 లవకుశ (29-03-1963) 

93 పరువు ప్రతిష్ట (09-05-1963)

94 ఆప్తమిత్రులు, (29-05-1963) 

95 బందిపోటు (15-08-1963) 

96. లక్షాధికారి (27-09-1963) 

97 తిరుపతమ్మ కధ (04-10-1963)

98 నర్తనశాల (11-10-1963) 

99 మంచీ చెడు (07-11-1963)

100గుడిగంటలు (14-01-1964) 

101ఇంకా మర్మ యోగి (22-02-1964) 

102.కలవారి కోడలు (14-03-1964) 

103.దేశ ద్రోహులు (07-05-1964)

104.రాముడు-భీముడు(21-05-1964) 

105.శ్రీసత్యనారాయణవ్రత మహాత్మ్యం(27-06-1964),

106.అగ్గి-పిడుగు (31-07-1964) 

107.దాగుడుమూతలు (21-08-1964) 

108.శభాష్ సూరి (19-09-1964) 

109.బబ్రువాహన (22-10-1964) 

110.వివాహ బంధం (23-10-1964) 

111.మంచి మనిషి (11-11-1964) 

112.వారసత్వం(19-11-1964)

113.బొబ్బిలియుద్ధం (04-12-1964) 

114 నాదీ ఆడ జన్మే (07-01-1965) 

115. పాండవ వనవాసం (14-01-1965) 

116 దొరికితే దొంగలు (26-02-1965)

117.మంగమ్మ శపధం (06-03-1965) 

118.సత్య హరిశ్చంద్ర (22-04-1965)

119.తోడు నీడ (12-05-1965) 

120.ప్రమీలార్జునీయం (11-06-1965)

121 దేవత (24-07-1965) 

122 వీరాభిమన్యు (12-08-1965) 

123 విశాల హృదయాలు (09-09-1965)

124 సి ఐ డి (23-09-1965) 

125 ఆడ బ్రతుకు (12-11-1965)

126 శ్రీకృష్ణ పాండవీయం(13-01-1966) 

127 పల్నాటి యుద్ధం (18-02-1966) 

128 శకుంతల (23-03-1966) 

129 పరమానందయ్య శిష్యులకధ (07-04-1966) 

130 శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు కధ (06-05-1966)(17 తమిళ్,3 హిందీ సినిమాలు తో కలిపి 150 వ సినిమా)

131 మంగళ సూత్రం (19-05-1965)

132.అగ్గిబరాటా (02-06-1966) 

133.సంగీత లక్ష్మి (07-07-1966) 

134.శ్రీకృష్ణ తులాభారం (25-08-1966) 

135.పిడుగు రాముడు (10-09-1966) 

136.అడుగు జాడలు (29-09-1965)

137. డాక్టర్ ఆనంద్ (14-10-1966)

138 గోపాలుడు భూపాలుడు (13-01-1967)

139 నిర్దోషి (02-03-1967) 

140 కంచు కోట (22-03-1967)

141.భువనసుందరి కథ (07-04-1967)

142.ఉమ్మడి కుటుంబం” (20-04-1967)

143.భామా విజయం (29-06-1967) 

144.నిండు మనసులు (11-08-1967) 

145.స్త్రీజన్మ (31-08-1967) 

146.శ్రీకృష్ణావతారం (12-10-1967)

147.పుణ్యవతి (03-11-1967) 

148.ఆడపడుచు (30-11-1967)

149.చిక్కడు దొరకడు (21-12-1967)

150.ఉమా చండీ గౌరీ శంకరుల కధ (11-01-1968) 

151 నిలువు దోపిడి చిత్రాలు (25-01-1968)

152 తల్లి ప్రేమ (09-03-1968)

153 తిక్క శంకరయ్య (29-03-1968) 

154 రాము (04-05-1968)

155. కలిసొచ్చిన అదృష్టం (10-08-1968) 

156. నిన్నే పెళ్ళడతా (30-08-1968) 

157. భాగ్యచక్రం (13-09-1968) 

158. నేనే మొనగాణ్ని (04-10-1968) 

159. బాగ్దాద్ గజ దొంగ (24-10-1968) 

160. నిండు సంసారం (05-12-1968)

161 వర కట్నం (10-01-1969) 

162 కధానాయకుడు (27-02-1969) 

163 భలే మాస్టారు (27-03-1969)

164 గండికోట రహస్యం (01-05-1969) 

165 విచిత్ర కుటుంబం (28-05-1969) 

166 కదలడు వదలడు (09-07-1969)

167 నిండు హృదయాలు (15-08-1969) 

168 భలే తమ్ముడు (18-09-1969)

169 అగ్గి వీరుడు (17-10-1969)

170 మాతృదేవత (07-11-1969) 

171 ఏకవీర (04-12-1969)

172 తల్లా-పెళ్ళామా (08-01-1970) 

173 లక్ష్మీ కటాక్షం (12-02-1970) 

174 ఆలీబాబా 40 దొంగలు, (04-04-1970)

175 పెత్తందార్లు(30-04-1970) 

176 విజయం మనదే (15-07-1970) 

177 చిట్టి చెల్లెలు (29-07-1970) 

178 మాయని మమత (13-08-1970) 

179 మారిన మనిషి (24-09-1970)

180 కోడలు దిద్దిన కాపురం (21-10-1970)( తమిళ సినిమాలలో 16 లవకుశ 17 కర్ణన్….....17తమిళ్ సినిమాలు+3 హిందీ సినిమాలు+180 తెలుగు సినిమాలు =200 వ సినిమా)

181 ఒకే కుటుంబం (25-12-1970) 

182 శ్రీ కృష్ణ విజయం (11-01-1971) 

183 నిండు దంపతులు (04-02-1971) 

184 రాజకోట రహస్యం (12-03-1971) 

185 జీవితచక్రం (31-03-1971)

186 రైతుబిడ్డ (19-05-1971) 

187 అదృష్ట జాతకుడు (06-08-1971) 

188 చిన్ననాటి స్నేహితులు(06-10-1971) 

189 పవిత్ర హృదయాలు (24-11-1971) 

190 శ్రీకృష్ణసత్య (24-12-1971)

191 శ్రీకృష్ణాంజనేయ యుద్ధం (18-05-1972) 

192 కుల గౌరవం (19-10-1972) 

193 బడిపంతులు (23-11-1972) 

194 డబ్బుకు లోకం దాసోహం (12-01-1973)

195 దేశోద్ధారకులు (29-03-1973)

196 ధనమా దైవమా (24-05-1973)

197 దేవుడు చేసిన మనుషులు (09-08-1973)

198 వాడే-వీడు (18-10-1973)

199 ఎర్ర కోట వీరుడు (14-12-1973)

200 పల్లెటూరి చిన్నోడు (09-01-1974) 

201.అమ్మాయి పెళ్ళి (07-03-1974)

202 మనుషుల్లో దేవుడు (05-04-1974)

203 తాతమ్మకల (30-08-1974) 

204 నిప్పులాంటి మనిషి(25-10-1974)

205 దీక్ష (11-12-1974)

206 శ్రీరామాంజనేయయుద్ధం (10-01-1975) 

207 కథానాయకుని కథ (21-02-1975)

208 మాయా మశ్చీంద్ర (09-05-1975)

209 సంసారం (28-05-1975) 

210 రాముని మించిన రాముడు (12-06-1975)

211 అన్నదమ్ముల అనుబంధం (04-07-1975) 

212 తీర్పు (01-10-1975) 

213 ఎదురులేని మనిషి (12-12-1975) 

214 వేములవాడ భీమకవి (08-01-1976)

215 ఆరాధన (12-03-1976) 

216 మనుషులంతా ఒక్కటే (07-04-1976)

217 మగాడు (19-05-1976)

218 నేరం నాదికాదు ఆకలిది (22-07-1976)

219 బంగారు మనిషి (25-08-1976) 

220 మా దైవం (17-09-1976)

221 మంచికి మరో పేరు (09-12-1976) 

222 దానవీరశూర కర్ణ(14-01-1977)

223 అడవిరాముడు (28-04-1977)

224 ఎదురీత (22-07-1977) 

225 చాణక్య చంద్రగుప్త (25-08-1977)

226 మా ఇద్దరి కధ (23-09-1977)

227 యమగోల (21-10-1977) 

228 సతీ సావిత్రి (04-01-1978) (19 తమిళ్3 హిందీ సినిమాలతో కలిపి 250 వ సినిమా)

229 మేలుకొలుపు (13-01-1978) 

230 అక్బర్ సలీం అనార్కలి (15-03-1978) 

231 రామకృష్ణులు (08-06-1978) 

232 యుగపురుషుడు (14-07-1978) 

233 రాజపుత్ర రహస్యం (28-07-1978) 

234 సింహబలుడు (11-08-1978) 

235 శ్రీ రామ పట్టాభిషేకం (07-09-1978)

236 సాహసవంతుడు (06-10-1978) 

237 లాయర్ విశ్వనాధ్ (17-11-1978) 

238 కేడీ నంబర్ వన్ (15-12-1978)

239 డ్రైవర్ రాముడు (02-02-1979) 

240 మా వారి మంచితనం (09-03-1979)

241 శ్రీమద్విరాట పర్వం (28-05-1979)

242 వేటగాడు(05-07-1979)

243 టైగర్ (05-09-1979)

244 శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం (28-09-1979) 

245 శృంగార రాముడు (22-11-1979)

246 యుగంధర్ (30-11-1979)

247 ఛాలెంజ్ రాముడు (12-01-1980) 

248 సర్కస్ రాముడు (01-03-1980) 

249 ఆటగాడు (24-04-1980)

250 సూపర్ మేన్ (10-07-1980)

251 రౌడీ రాముడు కొంటె కృష్ణుడు (15-08-1980) 

252 సర్దార్ పాపారాయుడు (30-10-1980)

253 సరదా రాముడు (14-11-1980) 

254 ప్రేమ సింహాసనం (14-01-1981) 

255.గజదొంగ (30-01-1981) 

256 ఎవరు దేవుడు (04-03-1981)

257 తిరుగులేని మనిషి (03-04-1981)

258 సత్యం శివం (28-05-1981) 

259 విశ్వ రూపం (25-07-1981) 

260 అగ్గి రవ్వ (14-08-1981) 

261 కొండవీటి సింహం(07-10-1981)

262 మహాపురుషుడు (21-11-1981)

263 అనురాగదేవత (09-01-1982) 

264 కలియుగ రాముడు (13-03-1982) 

265 జస్టిస్ చౌదరి(28-05-1982) 

266 బొబ్బిలిపులి(09-07-1982)

267 వయ్యారి భామలు వగలమారి భర్తలు (20-08-1982) 

268 నా దేశం (27-10-1982) 

269 సింహం నవ్వింది (03-03-1983)

270 చండశాసనుడు (28-05-1983) 

271.శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర(29-11-1984)

272 బ్రహ్మర్షి విశ్వామిత్ర (19-04-1991)

273. సమ్రాట్ అశోక (28-05-1992)

274 మేజర్ చంద్ర కాంత్(23-04-1993)

275 శ్రీనాధకవి సార్వభౌముడు (21-10-1993)(19 తమిళ్,3 హిందీ సినిమాలతో కలిపి 297 వది)

******

ఎన్ టి ఆర్ అతిధి పాత్రలలో నటించిన సినిమాలు : 3

1. సతీ అనసూయ (గెస్ట్) 25-10-1957

2. భక్త రఘునాధ్ (గెస్ట్) 04-11-1960

3. భక్త రామదాసు (గెస్ట్) 23-12-1964

ఈ మూడు అతిథి పాత్రల సినిమాలతో కలిపి మొత్తం 300 సినిమాలు

**********

విడుదల కాని చిత్రం (బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ) : 1(301 వది)


ఎన్ టి ఆర్ నటించిన పర భాషా చిత్రాలు : 22(19 తమిళ్,3 హిందీ)

1. మాయా రంభై (తమిళ్) 00-00-19--

2. పాతాళ భైరవి (తమిళ్) 17-05-1951

3. పాతాళ భైరవి (హిందీ) 00-05-1952

4. కల్యాణం పణ్ణి పార్ (పెళ్ళి చేసి చూడు తమిళ్) 15-08-1952

5. వెలైకారి మగళ్ (దాసి తమిళ్) 14-01-1953

6. మరుమగళ్ (అమ్మలక్కలు తమిళ్) 20-02-1953

7. చండీరాణి (హిందీ) 28-08-1953

8. చండీరాణి (తమిళ్) 28-08-1953

9. చంద్రహార్ (తమిళ్) 14-01-1954

10. పనం పడుతుం పడు (వద్దంటే డబ్బు) 04-03-1954

11. నట్టియతార (రేచుక్క తమిళ్) 25-05-1955

12. తెనాలి రామన్ (తమిళ్) 03-02-1956

13. మర్మవీరన్ ( గెస్ట్, తమిళ్) 19-07-1956

14. నయాఆద్మీ (సంతోషం హిందీ) 01-01-1956 లేదా 24-12-1956

15. మాయా బజార్ (తమిళ్) 12-04-1957

16. సంపూర్ణ రామాయణం (తమిళ్) 14-04-1958

17. రాజ సెవై (రేచుక్క పగటి చుక్క తమిళ్) 02-10-1959

18. రాజ మగుడం (తమిళ్) 25-02-1960

19. లవకుశ (తమిళ్) 19-04-1963

20. కర్ణన్ (తమిళ్) 14-01-1964

21. తిరుడాదే తిరుడన్ (ఎర్ర కోట వీరుడు తమిళ్) 11-01-1971

22. కన్నన్ కరుణై (శ్రీ కృష్ణ పాండవీయం, తమిళ్)16-06- 1971

******* :

**********

 తెలుగులో వచ్చిన డబ్బింగ్ సినిమాలు

1.14-01-1959 సంపూర్ణ రామాయణం (తమిళ్, సంపూర్ణ రామాయన్)

2.09-04-1964 కర్ణ( తమిళ్,కర్ణన్)

3.16-03-1957 వేగుచుక్క( మర్మ వీరన్,తమిళ్)

**********

బెంగాలీలో డబ్బింగ్ అయిన సినిమాలు

1 1968 మేఘనాథ్ బాద్ ( సతీ సులోచన)

2.1971 శకుంతల

3. మాయా బజార్

4. జగదేకవీరుని కథ

5. నర్తన శాల

6. పాండవ వనవాసం

********

హిందీలో డబ్బింగు అయిన సినిమాలు

 1     -05-1952 పాతాళ భైరవి

 2.03-01-1958 పియా మిలన్(మర్మవీరన్,తమిళ్)

 3.           1959 జైసింగ్(జయసింహ,తెలుగు)

 4.20-10-1960 భక్తి మహిమ(భూకైలాస్, తెలుగు)

 5.           1960 డాకు భూపత్ (రాజనందిని, తెలుగు)

 6.           1960 రామాయన్ (సంపూర్ణ రామాయణం,తమిళ్)

 7             1961 పతివ్రత మహసతీ సులోచన (సతీ సులోచన)

 8             1962 బాద్లా (రేచుక్క,తెలుగు)

 9             1962 భగవాన్ బాలాజి ( శ్రీవెంకటేశ్వర మహత్యం,తెలుగు)

10            1964 చక్రవర్తి విక్రమాదిత్య ( భట్టి విక్రమార్క,తెలుగు)

11             1965 దాన్ వీర్ కర్ణ(కర్ణన్,తమిళ్)

12             1968 రామ్ ఔర్ రహీమ్ ( రామదాసు,తెలుగు)

13.            1970 వీరాభిమన్యు( వీరాభిమన్యు,తెలుగు)

14             1971 భగవత్ (గండికోట రహస్యం,తెలుగు)

15              1971 మాయా బజార్ (మాయా బజార్,తెలుగు)

16              1973 గణేష్ చతుర్థి ( వినాయకచవితి,తెలుగు)

17              1973 పాండవ వనవాస్ (పాండవ వనవాసం,తెలుగు)

18             1974 హరేకృష్ణ (శ్రీకృష్ణ విజయం,తెలుగు)

19             1974 లవకుశ్ (లవకుశ,తెలుగు)

20             1975 అలక్ నిరంజన్( మాయామచింద్ర, తెలుగు)

21             1975 శ్రీరామ్ హనుమాన్ యుధ్ ( శ్రీ రామాంజనేయ యుద్ధం,తెలుగు)

22            1976 తుహి రామ్ తుహి కృష్ణ( శ్రీకృష్ణ సత్య,తెలుగు)

23.                    జగదేకవీరునికథ

24 26-07-1981 సతీసావిత్రి ( సతీసావిత్రి,తెలుగు)

*********

కన్నడంలో డబ్బింగ్ అయిన సినిమాలు

1961జగదేక వీరుని కథ

1963 శ్రీ కృష్ణార్జున యుద్ధం

1965 మాయా బజార్

         లవకుశ

***********

ఒరియాలో డబ్బింగ్ అయిన సినిమాలు

జగదేక వీరుని కథ

నర్తనశాల

**********

తమిళంలో డబ్బింగ్ అయిన సినిమాలు

1. 00-00-1955 జయసిమ్మన్ ( జయ సింహ,తెలుగు)

2. 30-03-1956 ఇల్లారమే ఇన్బం (చెరపకురా చెడేవు,తెలుగు)

3. 00-08-1956 వేట్రి వీరన్( జయం మనదే,తెలుగు)

4 .02-10-1956 అమరగీతం( చిరంజీవులు,తెలుగు)

5 . 00-00-1956 మంగళ గౌరి ( శ్రీ గౌరీ మహత్యం,తెలుగు)

6. ఆండ్రి పెట్ర సెల్వం( రాజుపేద,తెలుగు)

7 00-00-1958 వెట్టుకు వందా వరలక్ష్మి ( భాగ్య రేఖ,తెలుగు)

8 00-00- 1958 సతీ అనసూయ ( సతీ అనసూయ,తెలుగు)

9  00-00- 1958 పెంకి పెళ్ళాం

10 10-09-1959 శబాష్ రాము( శభాష్ రాముడు,తెలుగు)

11 00-00-1959 వినాయకచతుర్ధి ( వినాయక చవితి,తెలుగు)

12 00-00-1959 అన్నియుం పిత్వుమ్ మున్నారి ( పాండురంగ మహాత్మ్యం,తెలుగు)

13 00-00-1960 బాలనాగమ్మ ( బాలనాగమ్మ,తెలుగు)

14 00-00-1960 పట్టి విక్రమాదిత్యన్ ( భట్టివిక్రమార్క,తెలుగు)

15 00-00-1960,19-09-2008 శ్రీనివాస కల్యాణం ( శ్రీ వెంకటేశ్వర మహత్యం,తెలుగు)

16 00-00-1961 జగతాల ప్రతాపన్ ( జగదేకవీరుని కథ,తెలుగు)

17 00-00-1961 నాగ నందిని( తెలుగు)

18 00-00-1962 దక్షయజ్ఞం ( దక్ష యజ్ఞం, తెలుగు)

19 00-00-1963 శ్రీకృష్ణార్జున యుద్ధం ( తెలుగు)

20 00-00-1964 వీరాధి వీరన్ ( అగ్గి పిడుగు,తెలుగు)

21 29-05-1964 నర్తనశాల

22 00-00-1966 శ్రీ కృష్ణ తులాభారం

23 00-00-1966 కావేరి మన్నన్( అగ్గి బరాట,తెలుగు)

24 00-00-1967 శ్రీకృష్ణావతారం

25 00-00-1967 అపూర్వ పైరవిగల్

26 00-00-1969 మాయాతీవు రహస్యం( అగ్గి వీరుడు,తెలుగు)

27 00-00-1970 లక్ష్మీ కటాక్షం

28 00-00-1983 అంతఃపుర మర్మం (రాజపుత్ర రహస్యం,తెలుగు)