[9:29 pm, 20/05/2021] +91 94414 08564: వైశాఖ పురాణం పదవ అధ్యాయము 🕉️
నారాయణం నమస్కృత్య నరం చైవనరోత్తమం |
దేవీం సరస్వతీం వ్యాసం తతోజయ ముదీరయేత్ ||
🌻 దక్షయజ్ఞ నాశము కామదహనము 🌻
💫🌹రుద్రుడా వార్తను విని కాలాంతకునివలె భయంకరాకారుడై వేయి బాహువులుకల మహాబలశాలియగు వీరభద్రుడు వెలువడెను. అతడును పరమేశ్వరునకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణమును తెలుపుమని చేతులు జోడించి యడిగెను. పరమేశ్వరుడును నా భార్య వినజాలనిరీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షుని సంహరింపుమని యానతినిచ్చెను. భూతసంఘములను వీరభద్రుని వెంటపొండని పంపెను.
💫🌹ఇట్లు పరమేశ్వరుని యాజ్ఞనందిన వీరభద్రుడు, వాని వెంట వెళ్లిన పరివారము యజ్ఞశాలను చేరి యచటనున్న దేవతలు, రాక్షసులు, మానవులు మున్నగు మహావీరులను అందరనుకొట్టిరి. సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టెను. సతీదేవి మాటను సతీదేవిని పరిహసించుచు నెవరు యే…
[9:30 pm, 20/05/2021] +91 94414 08564:
🙏
No comments:
Post a Comment