Thursday, 18 February 2021

18--02--2021

Parvati and family

: 🌻 ఆధ్యాత్మిక బలం 🌻


🍃🌺వ్యక్తి యెుక్క పూర్వ కర్మల ఫలితాల ననుసరించి జయాపజయాలు,
సాధనా నిస్పృహలు, ఆకర్షణలు పని చేస్తుంటాయి.
ఈ వరుస క్రమంలో అన్నీ జరగవలసిందే. అందరూ అనుభవించ వలసినవే!

🍃🌺అవాంఛనీయ సంఘటనలు తటస్థించినా వానిని చిరునవ్వుతో స్వీకరిస్తే మన జీవన భారం కొంత తేలిక పడుతుంది!

🍃🌺ఇతరుల తప్పిదాలు అవి ఎంత
చెడ్డవైనా వాని విషయం ఎన్నడూ ఎవ్వరితో ప్రసంగించకండి. దాని వల్ల ఉపయోగమేమీ లేదు.

🍃🌺ద్వేషపూరిత హృదయానికి సంతృప్తి కలుగదు.
ద్వేషం కార్చిచ్చు వంటిది. శాస్త్రాధ్యయనం వలన మానవుడు మేధావి కాలేడు. మహాత్ముల దైనందిక కార్యములందు సాన్నిహితాన్ని పెంపొందించుకొనగలిగిన వాడే జ్ఞానియై రాణించగలడు.

🍃🌺దైవ చింతనతో గడుపుతున్న జీవితం స్వల్పకాలమైనా ఉత్తమమైనదే.
దైవ భక్తి లేని జీవి లక్షలాది సంవత్సరాలు బ్రతికి ఉన్నా ప్రయోజనం శూన్యమే!

🍃🌺కష్టపడి పనిచేయి. దేవుని నామము ఉచ్చరించు. సద్గ్రంధాలు చదువు.
వంతులకు, పోటీలకు పోవద్దు. అలా చేస్తే భగవంతునికి ఏహ్యం కలుగుతుంది.

🍃🌺మన సంభాషణ యందు మనం సత్యాన్ని ఆచితూచి పలకాలి. సాధకుడు మితభాషిగా ఉండాలి.

🍃🌺దైవాన్ని మరచిన వారికి బలహీనత కలుగుతుంది. పరమేశ్వరుని జ్ఞాపకముంచు కొనవలనంటే వాని మహిమను, నామాన్ని స్మరించడం అవసరం.కష్టాలను అధిగమించితే మనకు నూతనుత్తేజం, ఆధ్యాత్మిక బలం చేకూరుతుంది!
మహా భారతం 18 వ భాగం కురు వీరుల విద్యా ప్రదర్శన
======================================
పాండవులూ కౌరవులూ అస్త్రశస్త్ర విద్యాభ్యాసంలో నైపుణ్యం సాధించారు. వారి విద్యను చూసి తృప్తి పడిన ద్రోణుడు , ఒక రోజు దృతరాష్ట్రుని వద్దకు వెళ్ళి భీష్ముడు, వ్యాసుడు, విదురుడు, శల్యుడు, కృపుడు,  సోమదత్తుడు, శకుని లాంటి పెద్దల ముందు రాజకుమారుల విద్యా ప్రదర్శన ఏర్పాటు చేయమని కోరాడు. దృతరాష్ట్రుడు అందుకు సమ్మతించి విదురుని పిలిచి తగు ఏర్పాట్లు చేయమని చెబుతాడు.. విదురుడు శాస్త్ర ప్రకారము చుట్టుకొలత , పొడవు నిర్దేశించి రంగస్థల ప్రదేశంలో గల చెట్లను పుట్టలను తొలగించి రాళ్లను రప్పలను ఏరి వేయించి  మిట్ట పలాలను  చదును చేసి దుమ్మును అనగ గొట్టించి, కల్లాపి చల్లించి మంచి అందమైన ముగ్గులు వేయించి,ప్రేక్షకులు కూర్చుని తిలకించడానికి గాను తగు విధంగా అంతస్తుల తో కూడిన భవనాలను నిర్మించాడు. ఆ భవనాలలో రత్న వేదికలను చందనపు మంచాలను కూర్చుని చూడడానికి ఏర్పాటు చేశాడు ఆ ప్రదేశానికి ప్రహరీ ఎత్తయిన కోట గోడను నిర్మించాడు విశాలమైన ద్వారా బంధాలను తలపులను ఏర్పాటు చేశాడు. రంగురంగుల జెండాలతో,అరటి స్తంభాలతో ,కొత్త చిగుళ్ళతో పూలమాలలతో  రంగస్థలాన్ని అలంకరించి, అన్ని దిక్కుల లో శాంతి పూజలు చేయించాడు..ఇలా  ప్రదర్శనశాలను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దాడు.పంచాంగం ప్రకారం తిథి వార నక్షత్రాలు చూసి ఒక మంచి ముహూర్తం ఏర్పాటు చేశాడు ఆ రోజున శాంతి పూజలతో యజ్ఞ హోమాలతో . కురు వీరుల విద్యా ప్రదర్శనలు మొదలు అయ్యాయి.
 . అస్త్ర విద్యా ప్రదర్శనకు దృతరాష్ట్రుడు గాంధారి సమేతంగా వచ్చాడు. వ్యాసమహర్షీ, కృపాచార్యుడు, శల్యుడు, భీష్ముడు, సోమదత్తుడు, విదురుడు తమతమ ఆసనాలలో ఆశీనులైయ్యారు. పళ్ళు సాంప్రదాయాలకు చెందిన సంగీత విద్వాంసులతో గాయ వైతాళికుల తో సామంత రాజుల తో మండల అధిపతుల తో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర సమస్త జనుల తో ఆ సభా మండపం అలరారుతుంది. ప్రేక్షకుల చప్పట్లతో జయజయధ్వానాలతో కేరింతలతో ఆ జన సమూహం యొక్క శబ్దాలు సముద్ర ఘోష వలె వినిపించసాగాయి.
అటువంటి సమయంలో ద్రోణాచార్యుడు -  తెల్లని వస్త్రాలతో, సొమ్ములతో పూలదండలతో గంధంతో నెరసిన వెంట్రుకలతో, జంధ్యం తో, గడ్డం తో మీ సం తో ప్రకాశిస్తున్న దేహం కలవాడై.... రంగ మద్యంలో అశ్వత్థామతో గూడి..... మేఘాలు వీడి నిర్మలమైన ఆకాశ మధ్యమంలో.....అంగారక గ్రహ సమేతుడైన సూర్యుని వలె అక్కడ నిలిచాడు. పెక్కుమంది బ్రాహ్మణుల పుణ్యాహ వాచనం ఇచ్చిన తర్వాత.......
. బలమైన హస్తాలు కలిగినవారు ,అల్లె తాటి దెబ్బ తగలకుండా కుడుము చర్మంతో తయారు చేసిన కవచాలను వ్రేళ్ళకు తొడుక్కున్న వారు, బాణాలు నిండుగా ఉన్న అమ్ములపొదలను తగిలించుకున్న వారు, గొప్ప నైన ధనస్సులు ధరించినవారు మంచి గుణాలతో ప్రకాషించేసేవారు,అయిన  పాండవులూ, కౌరవులూ, ద్రోణాచార్యుని వెనకాల ధర్మజుని ప్రక్కన వయో ధర్మాన్ని అనుసరించి వరుస క్రమంలో నిలుచున్నారు.
వారు అలా నిలబడి - ఎర్రచందనం ఒంటికి రాసుకుని, ఎర్రటి పూలమాలలు, వస్త్రాలు సొమ్ములు  ధరించి, ఎర్రజెండాలు చేత పట్టుకొని, ఎర్రబడ్డ కనుగొలుకల తో ఉన్నవారు - ద్రోణాచార్యుని ఆజ్ఞతో... కౌరవులు పాండవులు ముచ్చటైన రాకుమారులతోకూడి, కత్తి డాలు విన్యాసాలతో, తాము గడించిన నేర్పును మరియు తమ పేర్లతో ఉన్న బాణాలను వేసి..... లక్ష్యాన్ని చేరటంలో, చేదించడం  లో సాధించిన సామర్థ్యాన్ని....గుర్రాలను, రథాలను , మదపు టేనుగు లను అధిరోహించడం లో తమకు గల పనితనాన్ని.....ఈటే  మొదలైన ఆయుధాలను ప్రయోగించడంలో తాము నేర్చుకున్న కౌశలాన్ని,.... ప్రజలందరూ చూసి కొనియాడే టట్లు తమ పెద్దలైన వారి ముందు ప్రదర్శించారు.
 ఆ తరువాత -  భీమదుర్యోధనులు చేత గదలెత్తుకొని మహా క్రోధంతో, ఒకే పర్వతానికి ఉన్న రెండు ఎత్తయిన శిఖరాలవలే ... ఆడ ఏనుగు కోసం కోపించి పోరాడే రెండు మదపుటేనుగుల వలే....ఒకరినొకరు తాకి , కుడి నుండి ఎడమకు ...ఎడమ నుండి కుడికి వలయాకారంలో తిరుగుతూ గదాయుద్ధ నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
కాళ్ల తొక్కుడు దెబ్బలతో భూమండలం కనిపించగా మహా భయంకర హూంకార ధ్వనితో.... ఆకాశమనే ఇల్లంతా బ్రద్దలు అయ్యేటట్లు భీమ దుర్యోధనుల గదాయుద్ధపు తాకిడులు.... ఆ కాలంలో ఏర్పడి, భయంకరంగా సాగు కురుపాండవుల సంగ్రామము యొక్క  సూచనగా సూచించబడుతున్నది.
. వారి యుద్ధాన్ని చూస్తున్న పౌరులు ఉద్దిగ్నతను పెంచుకుంటున్నారు. విదురుడు దృతరాష్ట్రునికి గాంధారికి జరుగుతున్నవి వివరించి చెప్తున్నాడు. పరస్థితి చేయి దాటుతుందని గ్రహించిన ద్రోణుడు అశ్వత్థామను పంపి భీమ, దుర్యోదన యుద్ధాన్ని ఆపించాడు.
             అర్జుడి విలువిద్యా ప్రదర్శన
           --------------------------------------------
ఆ తరువాత అర్జునిని విలువిద్యా ప్రదర్శన ఉంటుందని ప్రకటించాడు. అర్జునుడు రంగప్రవేశం చేయగానే జనులు ఆనందోత్సాహాలతో జయజయ ధ్వానాలు చేయడం ప్రారంభించారు. కొడుకు ప్రయోజకుడై నందుకు కుంతీదేవి ఆనందించింది. మనసులోని సంతోషం జలప్రవాహం లా బయటికి వచ్చినట్లు ....కుంతిదేవి కుచములలోని చనుబాలు ఆమె కన్నుల నుండి ఆనందభాష్పాలు రెండు ను ఒక్కసారిగా బయటికి వచ్చాయి.విదురుని ద్వారా ఆ కలకలానికి కారణం తెలుసుకుని మనసులో సంతోషించి ధృతరాష్ట్రుడు " చెవులున్నందుకు ఫలాన్ని నేడు పొందాను. పాండు కుమారుల విద్యాశక్తి ని నేడు వినగలిగాను " అని పలికాడు.
కుంతి అనే అరణి లో పుట్టిన మూడు అగ్నులు ( ధర్మరాజు భీముడు అర్జునుడు)  నా వంశ పాపమనే కీకారణ్యాన్ని దహిస్తున్నవి అని ధృతరాష్ట్రుడు పలుకుతుండగా అర్జునుడు ద్రోణాచార్యుని అనుమతి తో గొప్ప గొప్ప అస్త్రాలను ప్రయోగించటం లో  తనకుగల అద్భుత నైపుణ్యాన్ని ప్రదర్శిసించే ఆసక్తిగల వాడై అక్కడ ఉన్న జనులు చూచుచుండగా.....
వీరుడైన అర్జునుడు అక్కడ ఉన్న వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఆగ్నేయాస్త్రం తో వారింప రాని అగ్నిని.... వారుణాస్త్రం తో గొప్ప జలరాశి ని..... వాయు వాస్త్రంతో గొప్ప పెనుగాలులను ....మేఘాస్త్రం తో గొప్ప గొప్ప మేఘ సమూహాలను సృష్టించాడు... అంతేగాక భౌమాస్త్రంతో భూమిలో ప్రవేశించాడు.... అప్పటికప్పుడు పొట్టి వాడయ్యాడు ...పొడుగు వాడయ్యాడు, సన్నని వాడయ్యాడు ...మహా వేగంతో రథ మధ్యంలో నిలుచున్నాడు.... ఎక్కడో పుట్టి మరెక్కడో కనబడు తున్నాడు.  శైలాస్త్రంతో పర్వతంగా మారాడు. అదృశ్యాస్త్రంతో అదృశ్యమయ్యాడు...
అంతేగాక పరుగెత్తుతున్నా సింహాల , పెద్దపులుల నోటిలో ఐదు పదేసి బాణాలను అతి సులభంగా ఒకేసారి వేసి... చెట్టుకు తగిలి లించబడిన ఆవు కొమ్ములో ఒకేసారి ఇరవై ఒక్క బాణాలను దింపాడు. ఈ విధముగా అర్జునుడు చిత్రవిచిత్రంగా తన ధనుర్విద్య ప్రదర్శించాడు అటు తరవాత గదా ఈటే కత్తి మొదలైన ఆయుధాలను అతి ప్రావీణ్యంతో ప్రయోగించి.. జనులు ఆశ్చర్య పడే టట్లు ఆనంద పడేటట్లు చేస్తుండగా...... కర్ణుడు తన ధనుర్విద్య పాటవాన్ని ప్రదర్శించాలని తలచి ...రంగ ద్వార మధ్యమున నిలిచి  తన భుజాన్ని ఛరచ గా.... పిడుగు పడినట్లు గొప్ప శబ్దం పుట్టింది వెంటనే జనులు అయోమయానికి గురి యై భయకంపితులై శబ్దం వచ్చిన దిశగా చూశారు.
ప్రజలు భయపడిన వారై ...ఎడతెరిపి లేకుండా భుజమును ఛరచడం వల్ల పుట్టిన శబ్దాలు,, పర్వతాలపై పడిన వజ్రాయుధం దెబ్బల్లాగా ప్రతిధ్వనిస్తూ ఉండగా పాండవులు విస్మయంతో ధర్మరాజు దగ్గరికి... కౌరవులు ద్వారం వైపు చూస్తూ దుర్యోధనుని చుట్టూ చేరారు.
.అక్కడ కర్ణుడికి. భయపడిన ప్రేక్షకులు తొలగి దారి ఇవ్వగా, అర్జునునికి ఎదురుగా వచ్చి నిలబడ్డాడు.
మద్ది చెట్టు లాంటి ఎత్తయిన,  బలమైన శరీరం కలవాడు, సహజ కవచ కుండలాల చే దివ్యంగా ప్రకాశించువాడు,
మంచి మనసున్న వాడు సహనశీలి , స్నేహశీలి అయిన వాడు.. అట్టి కర్ణుణ్ణి ప్రజలు ఆశ్చర్యంగా చూస్తున్నారు.

--(())--
తేదీ : 18-02-2021 గురువారం రోజున
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
#లోభికి_కలిగిన_మాఘ_మాస_స్నాన_ఫలము
వశిష్ట మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపుడు యిట్లు తెలియజేసెను.
పార్వతీ..! చాలాకాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు అసంతవాడయను నామము గల పెద్ద నగరముండెను. అందు బంగారుశెట్టి అను వైశ్యుడొకడు వుండెను. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారుశెట్టి పిసినిగొట్టు.. తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా నున్నది, కాని, అతడు ఇంకనూ ధనాశ కలవాడై తన వద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యెను. కాని ఒక్కనాడైననూ శ్రీహరిని ధ్యానించుట గాని, దానధర్మాలు చేయుట గాని యెరుగడు. అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు ఋణాలిచ్చి అనుకున్న గడువుకు ఋణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి, వారి ఆస్తులు సైతము స్వాధీన పరచు కొనేవాడు.
ఒకనాడు బంగారుశెట్టి గ్రామాంతరము వెళ్ళెను, ఆ రొజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారుశెట్టి భార్యను చూచి.,"తల్లీ! నేను ముసలివాడను, నా గ్రామము చేరవలయునన్న యింకనూ పది ఆమడలు వెళ్ళవలసియున్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది, ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికి పోతున్నాను. మీ ఇంటివద్ద రాత్రి గడుపనిమ్ము.. నీకెంతైనా పుణ్యముంటుంది. నేను సద్భ్రాహ్మణుడను, సదాచార వ్రతుడను.. ప్రాతఃకాలమున మాఘ స్నానము చేసి వెళ్ళిపోయెడను" అని బ్రతిమలాడెను. తాయారమ్మకు జాలి కలిగెను. వెంటనే తన అరుగు మూల శుభ్రము చేసి, అందొక తుంగ చాప వేసి, కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొనుడని పలికెను.
ఆమె దయార్ర్ద హృదయమునకు ఆ వృద్ద బ్రాహ్మణుడు సంతసించి విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలము నిచ్చి దానిని భుజింపుమని చెప్పి, "ఆర్యా, మాఘ స్నానము చేసి వెళ్ళెదనని యన్నారు కదా! ఆ మాఘ స్నానమేమి? సెలవిండు.. వినుటకు కుతూహలముగా నున్నది"అని అడుగగా నా వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని,"అమ్మా..! మాఘమాసము గురించి చెప్పుట నా శక్యము కాదు, ఈ మాఘ మాసములో నది యందు గాని, తటాకమందు గాని, నూతి యందు గాని సూర్యోదయము అయిన తర్వాత చన్నీళ్ళు స్నానము చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసి దళము తోను, పూలతోను పూజ చేసి స్వామి వారి ప్రసాదమును స్వీకరించవలెను, తరువాత #మాఘ_పురాణము పఠించవలెను. ఇట్లు ప్రతిదినము విడువకుండా నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన, దాన ధర్మములు చేయవలెను. ఇట్లు చేసిన యెడల మానవును రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ నెల రోజులూ చేయలేని వారూ, వృద్దులూ, రోగులు ఒక్క రోజయినను అనగా ఏకాదశి నాడు గాని, ద్వాదశి నాడు గాని లేక పౌర్ణమి నాడు గాని పై ప్రకారము చేసినచో సకల పాపములు తొలగి సిరిసంపదలు, పుత్రసంతానము కలుగును. ఇది నా అనుభవముతో తెలియ జేయుచున్నాను అని చెప్పగా, ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడ ప్రాతఃకాలమున బ్రాహ్మణునితో బాటు నదికి పోయి స్నానము జేయుటకు నిశ్చయించుకొనెను.
అంతలో పొరుగూరికి వెళ్ళిన తన భర్తయగు బంగారుశెట్టి యింటికి రాగా ఆమె అతనికి మాఘ మాసము గురించి చెప్పి తాను తెల్లవారు జామున స్నానమునకు పోదునని తెలియజేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారుశెట్టికి కోపము వచ్చి, వంటినిండా మంటలు బయలదేరినట్టుగా పళ్ళు పటపటా కొరికి "ఓసీ వెర్రిదానా! ఎవరు చెప్పినారే నీకీ సంగతి? మాఘ మాసమేమిటి? స్నానమేమిటి? వ్రతము, దానము లేమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా?చాలు చాలు, అధిక ప్రసంగము చేసినచో నోరు నొక్కివేయుదును. డబ్బును సంపాదించుటలో పంచప్రాణములు పోవుచున్నవి ఎవరికిని ఒక్కపైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా? చలిలో చన్నీళ్ళు స్నానము చేసి, పూజలు చేసి, దానములు చేస్తే వళ్ళూ యిల్లూ గుల్లయి, నెత్తి పైన చెంగు వేసుకొని 'భిక్షాందేహీ' అని అనవలసినదే జాగ్రత్త! వెళ్ళి పడుకో" అని కోపంగా కసిరాడు.
ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు. యెప్పుడు తెల్లవారునా యెప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది.. తాను కాలకృత్యములు తీర్చుకొని యింటికి వచ్చియున్న వృద్ధ బ్రాహ్మణునితో కలిసి, మగనికి చెప్పకుండ నదికిపోయి స్నానము చేయుచున్నది. ఈలోగా బంగారుశెట్టి పసిగట్టి  ఒక దుడ్డుకర్ర తీసుకొని నదికిపోయి నీళ్ళలో దిగి భార్యను కొట్టబోవుచుండగా, ఆ యిద్దరూ కొంత తడవు నీళ్ళలో పెనుగులాడిరి.. అటుల మునుగుటచే ఇద్దరికి మాఘ మాస ఫలము దక్కినది. మొత్తం మీద బంగారుశెట్టి భార్యను కొట్టి యింటికి తీసుకు వచ్చినాడు.
కొన్ని సంవత్సరములు తరువాత ఒకనాడు ఇద్దరకూ ఒక వ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారుశెట్టి ని తీసుకొనిపోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మను తీసికొని పోవుటకు విష్ణు దూతలు వచ్చి ఆమెను రధముపై ఎక్కించుకొని తీసికొని పోవుచుండిరి. అపుడు తాయారమ్మ యమభటులతో యిట్లు పలికెను.
"ఓ యమభటులారా! ఏమిటీ అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమిటి? నా భర్తను యమలోకము నకు తీసుకొని పోవుట  ఏమిటి? ఇద్దరమూ సమానమే గదా" అని వారి నుద్దేశించి అడుగగా, ఓ అమ్మా! నీవు మాఘ మాసములో ఒక దినమున నదీ స్నానము చేయగా నీకీ ఫలము దక్కినది. కానీ, నీ భర్త అనేకులను హింసించి, అన్యాయముగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్త్యము లాడి నరకమన్న భయముbలేక భగవంతునిపై భక్తి లేక వ్యవహరించునందులకే యమలోకము నకు తీసుకొని పోవుచున్నాము అని యమభటులు పలికిరి.
ఆమె మరల వారినిట్లు ప్రశ్నించెను. "నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్త కూడా నీట మునిగినాడు కదా! శిక్షించుటలో యింత వ్యత్యాసమేల కలుగెను?" అని అనగా  ఆ యమభటులకు సంశయము కలిగి, యేమియు తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని, ఆమె వేసిన ప్రశ్ననూ తెలియజేసిరి.
చిత్రగుప్తుడు వారి పాపపుణ్యముల పట్టిక చూడగా, ఇద్దరకూ సమానమైన పుణ్య ఫలము వ్రాసియున్నది.జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారుశెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందు వెళ్ళియున్న తాయారమ్మ తన భర్త గతి యేమయ్యెనో యని ఆతృతతో ఉండగా, బంగారుశెట్టిని పుష్పక విమానము మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి. భార్యా భర్తలిద్దరూ మిక్కిలి సంతసమందిరి.
రాజా! వింటివా! భార్య వలన భర్తకు కూడా యెటుల మోక్షము కలిగెనో.. భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్య యధాలాపముగా ఒక్కరోజు మాఘమాస స్నానము చేసినందున యిద్దరికిని వైకుంఠ ప్రాప్తి కలిగినదిగా! గనుక మాఘ స్నానము నెల రోజులు చేసినచో మరింత మోక్షదాయక మగుటలో సందేహము లేదు..
ఇది శ్రీ మాఘ పురాణం సప్తమ అధ్యాయ పారాయణం సంపూర్ణం..
--(())--
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀


[ 🌻 సంకీర్తన 🌻


🍃🌺భజన అనే మాట చాలా పవిత్రమైనది. భజించడం, కీర్తించడం భగవంతుడికే వర్తిస్తాయి. నోరారా భగవన్నామాన్ని పాడి హృదయాలను రంజింపజేయడం భక్తి కార్యాల్లో ముఖ్యమైనది. నారద భక్తి సూత్రాల్లోని నవ విధ భక్తి మార్గాల్లో మొదటి రెండు.. శ్రవణం, కీర్తనం.

🍃🌺శ్రవణం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని నిరూపించిన వాడు పరీక్షిత్తు మహారాజు. శుకమహర్షి లాంటి విజ్ఞాన గని దొరికితే చాలదు, పరీక్షిత్తు వంటి శ్రోత ఉండాలి. పరిప్రశ్న అనేది భగవద్గీతలో కృష్ణుడు పలికిన మాట.

🍃🌺ప్రశ్నించడం అంటే తెలుసుకోవాలనే కుతూహలంతో అడగడం. పరిప్రశ్న అంటే కుతూహలం సరిపోదు జిజ్ఞాస ఉండాలి. తెలుసుకున్న దాన్ని ఆచరించే కార్యాచరణ కావాలి. పరీక్షిత్తు అలాంటివాడు. అందుకే శ్రవణం మోక్షానికి రాజమార్గమైంది.

🍃🌺ఒక్కరే భగవంతుడి నామాన్ని గానం చేస్తే అది కీర్తనం. సామూహిక గానం సంకీర్తనం అని పెద్దలు చెబుతారు.

🍃🌺భజనలు నాలుగు విధాలు...

1) నామ సంకీర్తనం : గోవిందా, మాధవా, రామా, కృష్ణా లాంటి నామాలతో భజించడం.

2) గుణ సంకీర్తనం : దేవదేవుడి గుణాలను వర్ణిస్తూ భజన చేయడం.

3) లీలా సంకీర్తనం : భగవంతుడి లీలలను పొగుడుతూ ఆయన చేసిన అద్భుత కార్యాల్ని కీర్తించడం.

4) భావ సంకీర్తనం : భగవంతుడు భావప్రియుడు. మన భావాలతో స్తుతించడం.

🍃🌺పల్లెల్లో నేటికీ కొన్ని భజన సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. చిడతల భజన, చెక్కభజన, తాళాల భజన, జ్యోతిభజనతో గ్రామస్థులు భగవంతుణ్ని ఆరాధిస్తుంటారు

🍃🌺శ్రీరామదాసు, అన్నమాచార్యులు, వాగ్గేయకారులు, సంకీర్తనలతో తరించినవారు. తమ జీవితాలను సంప్రదాయ రీతుల్లో సంగీతపరంగా గానానికి అంకితం చేశారు. హనుమంతుడు శ్రీరామ నామ భజనలో అగ్రగణ్యుడు. నిరంతరం రామ నామ తారక మంత్రంతో తరించాడు.

🍃🌺మీరాబాయి కృష్ణ భక్తురాలు. మహారాణి వంశానికి చెందిన స్త్రీ అయినా వీధుల వెంట నగర సంకీర్తన చేసేవారు. మహారాణి హోదాలో ఉండి, వీధుల వెంట తిరిగి భజన కీర్తనలు పాడటం ఆమె మరిది సహించలేక పాలల్లో విషాన్ని కలిపి ఇచ్చాడు. కృష్ణార్పితంగా నైవేద్యం పెట్టి విషం పాలుతాగింది. నామ సంకీర్తనా బలంతో ఆమెను శ్రీకృష్ణుడు రక్షించాడంటారు.

🍃🌺రెండు చేతులూ చరుస్తూ చప్పట్లతో భజన చేయడం గీతానికి అనుగుణమైన తాళంగా ప్రసిద్ధి పొందింది. భజన కూడా ప్రార్థనే.

🍃🌺రామనామ సంకీర్తనలో తరించిన గుహుడు, శబరి, భరతుడు, హనుమంతుడు భజన సంప్రదాయాన్ని ఆదర్శంగా నిలిపారు. అక్రూరుడు, విదురుడు, కుచేలుడు, మీరాబాయి.. కృష్ణ భక్తులుగా చరిత్రలో నిలిచారు.

🍃🌺త్రేతాయుగంలో యజ్ఞయాగాది క్రతువులు, ద్వాపరయుగంలో వ్రతాలు, పూజలు, నోములు, కలియుగంలో నామస్మరణ, యుగభక్తి ధర్మాలుగా మహర్షులు పేర్కొన్నారు.

🍃🌺నామి కన్నా నామం గొప్పదని ప్రకటించిన ఆంజనేయుడు భక్తి సామ్రాజ్యానికి చక్రవర్తిగా నిలిచాడు.


🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀

  మాఘ పురాణం - 7 🌻

🌼 7వ అధ్యాయము - లోభికి కలిగిన మాఘమాస స్నానఫలము 🌼


🍃🌺వశిష్ట మహర్షి పార్వతితో పరమేశ్వరుడు చెప్పిన పిసినారి వృత్తాంతమును దిలీపుడు యిట్లు తెలియజేసెను. పార్వతీ! చాలాకాలం క్రిందట దక్షిణ ప్రాంతమందు అసంతవాడయను నామముగల పెద్దనగరముండెను. అందు బంగారుశెట్టి అను వైశ్యుడొకడు వుండెను. అతని భార్యపేరు తాయారమ్మ. బంగారుశెట్టి పిసినిగొట్టు తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కుటముగా నున్నది, కాని, అతడు ఇంకనూ ధనాశకలవాడై తనవద్దనున్న ధనమును వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యెను.

🍃🌺కాని ఒక్కనాడైననూ శ్రీహరిని ధ్యానించుటగాని, దానధర్మాలు చేయుటగాని యెరుగడు. అంతేకాక బీదప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు ఋణాలిచ్చి ఆ అనుకున్న గడువుకు ఋణం తీర్చనందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి, వారి ఆస్తులు సైతము స్వాధీన పరచుకొనేవాడు.

🍃🌺ఒకనాడు బంగారుశెట్టి గ్రామాంతరము వెళ్ళెను, ఆ రొజు సాయంత్రం ఒక ముదుసలి బ్రాహ్మణుడు బంగారుశెట్టి భార్యను చూచి, "తల్లీ! నేను ముసలివాడను నా గ్రామము చేరవలయునన్న యింకనూ పది ఆమడలు వెళ్ళవలసియున్నది. ఇప్పుడు చీకటి కాబోతున్నది, ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటివద్ద రాత్రి గడుపనిమ్ము నీకెంతైనా పుణ్యముంటుంది.

🍃🌺నేను సద్భ్రాహ్మణుడను, సదాచారవ్రతుడను ప్రాతఃకాలమున మాఘస్నానము చేసి వెళ్ళిపోయెడను" అని బ్రతిమలాడెను.

🍃🌺తాయారమ్మకు జాలికలిగెను వెంటనే తన అరుగుమూల శుభ్రము చేసి, అందొక తుంగచాపవేసి, కప్పుకొనుటకు వస్త్రమిచ్చి పండుకొనుడని పలికెను. ఆమె దయార్ర్ద హృదయమునకు ఆ వృద్ద బ్రాహ్మణుడు సంతసించి విశ్రాంతి తీసుకొనుచుండగా తాయారమ్మ ఒక ఫలమునిచ్చి దానిని భుజింపుమని చెప్పి, "ఆర్యా మాఘస్నానము చేసి వెళ్ళెదనని యన్నారు కదా! ఆ మాఘస్నానమేమి? సెలవిండు వినుటకు కుతూహలముగా నున్నది" అని అడుగగా...

🍃🌺ఆ వృద్ధ బ్రాహ్మణుడు దుప్పటికప్పుకొని, "అమ్మా మాఘమాసము గురించి చెప్పుట నాశక్యము కాదు, ఈ మాఘమాసములో నది యందు గాని, తటాకమందు గాని లేక నూతియందుగాని సూర్యోదయము అయిన తర్వాత చన్నీళ్ళు స్నానము చేసి విష్ణుమందిరనికి వెళ్ళి తులసి దళముతోను, పూలతోను పూజ చేసి స్వామివారి ప్రసాదమును స్వీకరించవలెను, తరువాత మాఘపురాణము పఠించవలెను.

🍃🌺ఇట్లు ప్రతిదినము విడువకుండా నెలరోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన, దానధర్మములు చేయవలెను. ఇట్లు చేసినయెడల మానవును రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోవును. ఒకవేళ ఈ నెలరోజులూ చేయలేనివారూ, వృద్దులూ, రోగులు ఒక్కరోజయినను అనగా ఏకాదశినాడు గాని, ద్వాదశినాడు గాని లేక పౌర్ణమినాడు గాని పై ప్రకారము చేసినచో సకలపాపములు తొలగి సిరిసంపదలు, పుత్రసంతానము కలుగును. ఇది నా అనుభవముతో తెలియజేయుచున్నాను" అని చెప్పగా....

🍃🌺ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడ ప్రాతఃకాలమున బ్రాహ్మణునితో బాటు నదికిపోయి స్నానము జేయుటకు నిశ్చయించుకొనెను.

🍃🌺అంతలో పొరుగూరికి వెళ్ళిన తన భర్తయగు బంగారుశెట్టి యింటికిరాగా ఆమె అతనికి మాఘమాసము గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానమునకు పోదునని తెలియజేసెను. భార్య చెప్పిన మాటలకు బంగారుశెట్టికి కోపమువచ్చి, వంటినిండా మంటలు బయలదేరినట్టుగా పళ్ళు పటపటాకొరికి "ఓసీ వెర్రిదానా! ఎవరు చెప్పినారే నీకీ సంగతి? మాఘమాసమేమిటి? స్నానమేమిటి? వ్రతము, దానములేమిటి? నీకేమైనా పిచ్చి పట్టినదా? చాలు చాలు అధిక ప్రసంగముచేసినచో నోరునొక్కివేయుదును.

🍃🌺డబ్బును సంపాదించుటలో పంచప్రాణములు పోవుచున్నవి ఎవరికిని ఒక్కపైసాకూడా వదలకుండా వడ్డీలు వసూలుచేస్తూ కూడబెట్టిన ధనమును దానము చేయుదువా? చలిలో చన్నీళ్ళు స్నానముచేసి, పూజలుచేసి, దానములుచేస్తే వళ్ళూ యిల్లూ గుల్లయి, నెత్తి పైన చెంగు వేసుకొని 'భిక్షాందేహీ' అని అనవలసినదే జాగ్రత్త! వెళ్ళి పదుకో", అని కోపంగా కసిరాడు.

🍃🌺ఆ రాత్రి తాయారమ్మకు నిద్రపట్టలేదు. యెప్పుడు తెల్లవారునా యెప్పుడు నదికి వెళ్ళి స్నానము చేతునా అని ఆతృతగా ఉన్నది. కొన్ని గడియలకు తెల్లవారినది తాను కాలకృత్యములు తీర్చుకొని యింటికి వచ్చియున్న వృద్ధ బ్రాహ్మణునితో కలిసి, మగనికి చెప్పకుండ నదికిపోయి స్నానముచేయుచున్నది.

🍃🌺ఈలోగా బంగారుశెట్టి పసిగట్టి  ఒక దుడ్డుకర్ర తీసుకొని నదికిపోయి నీళ్ళలోదిగి భార్యను కొట్టబోవుచుండగా, ఆ యిద్దరూ కొంతతడవు నీళ్ళలో పెనుగులాడిరి అటుల మునుగుటచే ఇద్దరికి మాఘమాస ఫలము దక్కినది. మొత్తం మీద బంగారుశెట్టి భార్యను కొట్టి యింటికి తీసుకువచ్చినాడు.

🍃🌺కొన్ని సంవత్సరములు తరువాత ఒకనాడు ఇద్దరకూ ఒకవ్యాధి సోకినది. మరికొన్ని రోజులకు ఇద్దరూ చనిపోవుటచే బంగారుశెట్టిని తీసుకొనిపోవుటకు యమభటులు వచ్చి కాలపాశము వేసి తీసుకొని పోవుచుండిరి. తాయారమ్మను తీసికొని పోవుటకు విష్ణుదూతలు వచ్చి ఆమెను రధముపై ఎక్కించుకొని తీసికొనిపోవుచుండిరి. అపుడు తాయారమ్మ యమభటులతో యిట్లు పలికెను.

🍃🌺"ఓ యమభటులారా! ఏమిటీ అన్యాయము? నన్ను వైకుంఠమునకు తీసుకొని పోవుట ఏమిటి? నా భర్తను యమలోకమునకు తీసుకొనిపోవుట  ఏమిటి? ఇద్దరమూ సమానమేగదా" అని వారి నుద్దేశించి అడుగగా, ఓ అమ్మా! నీవు మాఘమాసములో ఒకదినమున నదీస్నానము చేయగా నీకీ ఫలము దక్కినది. కానీ, నీ భర్త అనేకులను హింసించి, అన్యాయముగా ధనార్జన చేసి అనేకులవద్ద అసత్త్యములాడి నరకమన్న భయములేక భగవంతునిపై భక్తిలేక వ్యవహరించునందులకే యమలోకమునకు తీసుకొని పోవుచున్నాము అని యమభటులు పలికిరి.

🍃🌺ఆమె మరల వారినిట్లు ప్రశ్నించెను. "నేను ఒకే దినమున స్నానము చేసినందున పుణ్యఫలము కలిగినప్పుడు నన్ను కొట్టుచూ నాతో నా భర్తకూడా నీటమునిగినాడు కదా! శిక్షించుటలో యింత వ్యత్యాసమేలకలుగెను?" అని అనగా  ఆ యమభటులకు సంశయము కలిగి, యేమియు తోచక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని, ఆమె వేసిన ప్రశ్ననూ తెలియజేసిరి.

🍃🌺చిత్రగుప్తుడు వారి పాపపుణ్యముల పట్టికచూడగా, ఇద్దరకూ సమానమైన పుణ్య ఫలము వ్రాసియున్నది. జరిగిన పొరపాటునకు చిత్రగుప్తుడు విచారించి బంగారుశెట్టిని కూడా వైకుంఠమునకు తీసుకొని పొమ్మని విష్ణుదూతలతో చెప్పెను. విష్ణులోకమునకు ముందు వెళ్ళియున్న తాయారమ్మ తన భర్త గతి యేమయ్యెనో యని ఆతృతతో ఉండగా, బంగారుశెట్టి పుష్పకవిమానము మీద తెచ్చి వైకుంఠములో విడిచిరి.

🍃🌺భార్యా భర్తలిద్దరూ మిక్కిలి సంతసమందిరి. రాజా! వింటివా! భార్యవలన భర్తకు కూడా యెటుల మోక్షము కలిగెనో భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినను భార్యా యధాలాపముగా ఒక్కరోజు మాఘమాసస్నానము చేసినందున యిద్దరికిని వైకుంఠప్రాప్తి కలిగినదిగా! గనుక మాఘస్నానము నెలరోజులు చేసినచో మరింత మోక్షదాయకమగుననుటలో సందేహములేదు.


🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀


*ఉద్యోగ విరమణ సందేశం* 

ఎక్కడె క్కడో పు ట్టి ఇక్కడే కలిసాము,


కలసికట్టుగా నుండి ఒకటిగా మెలిగాము,


ఈపనియని ఆపనియని తేడాలు లేకుండా, 


ఆడుతూ పాడుతూ భాధ్యత గా చేసాము,


తోబుట్టువుల వలే కలసికట్టుగా నుండి 


వ్యక్తి గతబావన లేకుండా గడిపాము. 


వయస్సు అరువదినిండి నుద్యోగ విరమణ


కొచ్చితిని నేను, మిమ్మల్ని వదలి పోవుట మరింత 


భారమే అయినా నాహృదిన మీరంతా పదిలంగా 


నుందురు మీ మంచి మనసులు నాకు అండగా నుండును నాతలపులందు మీరంతా కలకాల


ముందురు.భావావేశంతో నేనేమి అన్నను, నాప్రవర్తన మీకు బాధ కలిగించింనా కనికరించి నన్ను మన్నించగలరు.కష్టనిష్టూరాలు మరిచి మీసమయానుకూలము బట్టి నన్ను గుర్తుంచుకొంటూ మీవైనంమాకు తెలియబరచగలరు.విడలేక విడలేక విడిపోతున్నా మీ విధేయుడిగా వుంటాను  బ్రతుకునంత వరకూ.

🕉 శ్రీ కాళహస్తీశ్వర శతకం - 97 🕉


అమ్మా యయ్య యటంచు నెవ్వరిని నేనన్నన్శివా! నిన్నునే
సుమ్మీ! నీ మదిఁ దల్లిదండ్రులనటంచు  న్జూడఁగాఁబోకు నాకిమ్మైఁ దల్లియుఁ దండ్రియున్ గురుఁడు నీవే కాక సంసారపుం
జిమ్మంజీకంటి గప్పిన న్గడవు నన్ శ్రీ కాళహస్తీశ్వరా!



📍  తాత్పర్యం: 📍


🌹శ్రీ కాళహస్తీశ్వరా!
నేనెప్పుడైన బాధలలో ’అమ్మా! అయ్యా!’ అనిన అది నిన్నుద్దేశించియే సుమా! ఆ మాటలు నన్ను కన్నవారినుద్దేశించి అనుచున్నట్లు తలచి నన్ను నీవు వదలవద్దు.

🌹అట్టి నా ఆపదలు తొలగించి నన్ను రక్షించుచు నాకు ఆనందము కలిగించు తల్లియు తండ్రియు గురుడువు నీవు మాత్రమే.

🌹కనుక నన్ను సంసారపు చిమ్మచీకటులు చుట్టుముట్టిన సమయమున నీవు నన్ను వానినుండి ఆవలకు పోగలుగునట్లు చేయుమని వేడుచున్నాను.


🙏 ఓం నమః శివాయ 🙏


🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼

రథసప్తమి నిర్ణయః!!{ధర్మసింధు}

నిర్ణయ సింధౌః-
మాఘశుక్ల సప్తమీ
రథసప్తమీ|
సా అరుణోదయ వ్యాపినీ  గ్రాహ్యా!

సూర్య గ్రహణ తుల్యాత్ శుక్లామాఘస్య సప్తమీ|
అరుణోదయ వేలాయాం
తస్యాం స్నానం మహాఫలం||
ఇతి చంద్రి కాయం
విష్ణు వచనాత్

అరుణోదయ వేళాయాం శుక్లా మాఘస్య సప్తమీ|
ప్రయాగే యది లభ్యేత
కోటిసూర్య గ్రహైః సమా||
ఇతి వచనాచ్చ యత్తు
దివో దాసీయే
  అచలా సప్తమీ దుర్గా
శివరాత్రిర్మహాభరః|
ద్వాదశీ వత్స పూజాయాం సుఖదా
ప్రాగ్యుతా సదా||
   ఇతి షష్ఠీయుతత్వముక్తం!
 
 తత్ యదా,
పూర్వేహ్ని
ఘటికాద్వయం షష్ఠీ,
సప్తమీ పరేద్యుః క్షయ వశాత్ అరుణోదయాత్పూర్వం సమాప్యతే తత్పరం జ్ఞేయం|
తత్ షష్ఠ్యాం సప్తమీ క్షయం ప్రవేశ్యారుణోదయే స్నానం కార్యం||

ఇత్యాది వచనముల చేత
 షష్టి తో కూడి ఉన్న సప్తమి శ్రేష్టము అన్న వచనము
సూర్యోదయ
కాలంలో రెండు ఘడియలు షష్ఠి ఉండి
సప్తమితిథి మరుసటి రోజు అరుణోదయం కంటే ముందు  సమాప్తమైనప్పుడు
 మాత్రమే
షష్ఠీ యుత సప్తమి ని గ్రహించవలెను!....

 అరుణోదయమున కు సప్తమి ఉన్న రోజుననే
 రథసప్తమి పర్వము ఆచరించవలెను
  కావున గురువారం రోజున అరుణోదయ కాలంలో సప్తమి తిథి లేనందున
శుక్రవారం రోజున అరుణోదయ కాలంలో సప్తమి ఉన్నందున
 19/02/ 2021 శుక్రవారమే!!!రథసప్తమి!!!

పితృదోషము

తెలిసిగాని, తెలియక గాని పితృదేవతలు తాము బ్రతికి ఉన్నపుడు చేసిన చెడు కర్మలు, తప్పిదములు.
ప్రస్తుతం వారసులు చేసే తప్పిదములకు తమ పితృదేవతల ఆత్మ ప్రశాంతంగా ఉండకపోవటం
పితృదేవతల కోరికలు నెరవేరకపోవటం
ఆయుధముల వలన లేదా యాక్సిడెంట్ల వలన ఆకస్మిక అసహజ మరణం పొందిన వారసులకు పితృదోషం కలుగుతుంది.
వారసులు తమ పితృదేవతలకు శ్రార్ధ కర్మలు ఆచరించకపోవటం.
కొందరికి పితృదోషము ఉన్నట్టుగా జన్మకుండలిలో కనిపించదు. ఆకస్మిక ప్రమాదాల వలన చనిపోయిన వారి తండ్రి తరపున 7 తరముల వరకు, తల్లి తరపున 4 తరముల వరకు ఈ పితృదోషం వెంటాడుతుంది.
జన్మకుండలిలో రాహు కేతువులు పాప దృష్టి పొంది ఉన్నా, పితృ స్థానం శత్రుస్థానం అయినా, పితృ దోషం ఉన్నట్టుగా గుర్తించవచ్చు. హైందవ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం రాహు కేతువుల వలన కలిగే పితృశాపమునకు రాహు ఎత్తువ్లా శాంతి, ప్రీతి హోమముల ద్వారా కూడా పితృదోష నివారణ జరుగుతుంది అని చెప్పవచ్చు.
భారతీయ సంఖ్యాశాస్త్రములో కూడా ఈ పితృదోషమునకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు. ఒక కుటుంబము తరచూ ఊహించని సమస్యలు ఎదుర్కోవడం లేదా భార్యా భర్తలకు పిల్లలు కలుగకపోవటం లేదా ఒకవేళ కలిగినా ఆరోగ్యంగా ఉండటకపోవటం లేదా మానసిక, శారీరక లోపాలతో జన్మించటం ఇవన్నీ జరుగుతూ ఉంటే, ఇవి కూడా “పితృదోషం” వలననే అని గుర్తించాలి. ఇక్కడ చెప్పిన సమస్యలకు సంతానదోషం, సర్పశాపం…… ఇలా ఎన్నో దోషాల వలన కూడా ఈ సమస్యలు వస్తాయి. కాకపోతే పితృదోషం ఉన్నపుడు కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి అని చెప్పటం జరుగుతోంది. ఏ దోష కారణంగా ఈ సంఘటనలు జరుగుతున్నాయి అనేది కేవలం వారి వారి వ్యక్తిగత జన్మకుండలి పరిశీలనలో మాత్రమే నిర్దరాణ జరుగుతుంది.

పితృదోషము వలన కలిగే సమస్యలు ఏమిటి?
పితృదోషము ఉన్నవారి ఇంటిలో ఎప్పుడూ అనుకూలంగా లేని వాతావరణం ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు భార్య భర్తల మధ్య పెద్ద పెద్ద తగాదాలు వస్తూ ఉంటాయి.
పితృదోషముతో బాధపడేవారికి వివాహ విషయములో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. ఎంత ప్రయత్నించినా, సరైన వయస్సుకు వివాహం జరుగదు.
పితృదోషం నుండి బాధపడేవారు అప్పుల్లో కూరుకుపోతారు. ఎంత ఘనంగా ప్రయత్నించినా ఆ అప్పులు తీర్చలేరు.
పితృదోషము ఉన్నవారి కుటుంబములో ఒకరికి తరచూ ఒక పాము కలలో కనబడుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆ కుటుంబమునకు చెందిన పితృదేవతలలో ఒకరు కలలో కనబడి ఆహారం లేదా బట్టలు కొరకు అడుగుతూ ఉంటారు.

పితృదోషముతో బాధపడేవారికి క్రింద ఇస్తున్న సంఘటనలలో కనీసం 4 నుండి 5 వరకు వారి జీవితములో తరచూ జరుగుతూ ఉండాలి. గమనించండి .
పితృదోషం ఉన్న వారు నివసించే ఇంటిలో కొత్త గోడలు అయినప్పటికి తొందరగా చీలికలు పడతాయి.
తరచూ వారి ఇంటిలో ఎంత జాగ్రత్తగా ఉన్నా పాలు పొంగిపోతూ ఉంటాయి.
చేతిలో నుండి ఆహారము తరచూ నేల పాలు అవుతూ ఉంటుంది.
ఎన్ని సార్లు సరి చేయించినా గోడలలో నీరు లీక్ అవుతూ ఉంటుంది. చీలికలు ఉన్న గోడలలో చనిపోయిన వారి ఆత్మలు ఉంటాయని కూడా చెప్పబడింది.
ఇతిలో తరచూ నీటి సమస్య, నీటి పంపు , కుళాయిల సమస్యలు వస్తూ ఉంటాయి. Plumber వచ్చి ఎన్ని సార్లు సరి చేసినా ప్రయోజనం ఉండదు.
చీమల మందులు, దోమల మందులు ఎన్ని వాడుతున్నప్పటికి
 ఇంటిలో చీమలు, దోమలు, బొద్దింకలు, చెదలు బెదడు తగ్గదు.
పితృదోషము ఉన్నవారికి, వ్యాపారములు చేస్తూ ఉంటే వారు తీవ్రమైన అప్పులలో కూరుకుపోతారు. అగ్నికి మరియు దొంగతనాల బరీనా పడుతూ ఉంటారు లేదా వారి వ్యాపారములు అకస్మాత్తుగా మూతపడిపోతాయి.
పితృదోషం ఉన్నవారి ఇంటిలోని పిల్లలు పెద్దలకు మరియు కుటుంబ సాంప్రదాయాలకు విలువ ఇవ్వకపోవటం జరుగుతుంది. పిల్లలు మానసిక లేదా శారీరక లోపముతో జన్మిస్తారు.ఒక వ్యక్తికి పితృ దోషం ఉన్నదీ లేనిదీ జాతక పరిశీలన ద్వారా తెలుసుకొని పరిహారములు చేసుకొనవచ్చును.
==(())--=

 శుభోదయం
 -------------------
🌻 మహానీయుని మాట🍁
        -------------------------
"నేను ఎందుకు ఓడిపోతుంటాను అని
మనిషి అడిగిన ప్రశ్నకు కాలం చెప్పిన సమాధానం...
ఎండా,వాన, కాళరాత్రి, కఠినమైన పరిస్థితి ఏదైనా రానీ..
 నేను ఆగక నడుస్తూనే ఉన్నాను.
అందుకే నేను ఎప్పుడూ ఓడిపోను.
నువ్వు కూడా నాతో పాటు నడిచి చూడు.
ఎప్పటికీ ఓడిపోవు."
       --------------------------
🌹 నేటీ మంచి మాట 🌼
      ---------------------------
"మీరు ఇచ్చే బహుమతులు నేను నిరాకరిస్తే అవి మీ దగ్గరే ఉండిపోతాయి. అలాగే
మీ దూషణలను నా మనసు స్వీకరించనపుడు
అవి కూడా మీ దగ్గరే ఉండి పోతాయి.

 ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - పూర్వార్ధము -  నలుబది మూడవ అధ్యాయము

బలరామకృష్ణులు "కువలయాపీడము" అను మదపుటేనుగును చంపి మల్లరంగమున ప్రవేశించుట

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
43.9 (తొమ్మిదవ శ్లోకము)

స పర్యావర్తమానేన సవ్యదక్షిణతోఽచ్యుతః|

బభ్రామ భ్రామ్యమాణేన గోవత్సేనేవ బాలకః॥9916॥

43.10 (పదియవ శ్లోకము)

తతోఽభిముఖమభ్యేత్య పాణినాఽఽహత్య వారణమ్|

ప్రాద్రవన్ పాతయామాస స్పృశ్యమానః పదే పదే॥9917॥

అనంతరము ఆ కువలయాపీడము పుంజుకొని, శ్రీకృష్ణుని పట్టుకొనుటకు ప్రయత్నించెను. ఆ ఏనుగు కుడివైపునకు తిరుగునప్పుడు అతడు ఎడమవైపునకును, అది ఎడమవైపునకు తిరుగునప్పుడు అతడు కుడివైపునకును తిరుగుచు, బాలకుడు ఆవుదూడనువలె ఆటపట్టించుచు ముప్పుతిప్పలు పెట్టెను. పిమ్మట ఆ ఏనుగునకు ఎదుట నిలిచి చేతతో దానిని ఒక దెబ్బకొట్టి పరుగిడసాగెను. ఆ విధముగా ఆ స్వామి దానికి అందినట్లే అందుచు, అందకుండాపోవుచు పదేపదే దానిని వంచింపదొడగెను.

43.11 (పదకొండవ శ్లోకము)

స ధావన్ క్రీడయా భూమౌ పతిత్వా సహసోత్థితః|

తం మత్వా పతితం క్రుద్ధో దంతాభ్యాం సోఽహనత్క్షితిమ్॥9918॥

పిమ్మట కృష్ణభగవానుడు పరుగెత్తుచు ఒకసారి లీలగా భూమిపై పడినట్లు నటించెను. వెంటనే లేచి నిలబడెను. ఆ సమయమున మిగుల ఱెచ్చిపోయియున్న ఆ మదపుటేనుగు నిజముగనే అతడు పడిపోయినాడని భావించి, ఆవేశమున తన దంతములతో నేలను క్రుమ్మసాగెను.

43.12 (పండ్రెండవ శ్లోకము)

స్వవిక్రమే ప్రతిహతే కుంజరేంద్రోఽత్యమర్షితః|

చోద్యమానో మహామాత్రైః కృష్ణమభ్యద్రవద్రుషా॥9919॥

43.13 (పదమూడవ శ్లోకము)

తమాపతంతమాసాద్య భగవాన్మధుసూదనః|

నిగృహ్య పాణినా హస్తం పాతయామాస భూతలే॥9920॥

క్రమముగా మదపుటేనుగు యొక్క శక్తి క్షీణించుచుండెను. తన ప్రయత్నము ఎంతకును ఫలింపకుండుటచే అది రెట్టించిన కోపముతో బుసలు కొట్టుచుండెను. పరిస్థితిని గమనించిన మావటివాండ్రు దానిని గట్టిగా ఉసిగొల్పుటతో అది ఇంకను కినుకబూని కృష్ణునిమీదికి విజృంభించెను. అంతట కృష్ణపరమాత్మ తనపై దాడి చేయుటకై వచ్చుచున్న ఆ మదపుటేనుగును సమీపించి తన చేతితో దాని తొండమును గట్టిగా పట్టుకొని, నేలపై పడవేసెను.

43.14 (పదునాలుగవ శ్లోకము)

పతితస్య పదాఽఽక్రమ్య మృగేంద్ర ఇవ లీలయా|

దంతముత్పాట్య తేనేభం హస్తిపాంశ్చాహనద్ధరిః॥9921॥

అది క్రిందబడినంతనే ఆ ప్రభువు సింహమువలె విజృంభించి, అవలీలగా దానిని తన పాదములతో త్రొక్కిపట్టెను. వెంటనే ఆ స్వామి దాని ఒక దంతమును ఊడబెఱికి, దాని దంతముతోనే ఆ కువలయాపీడమును, మావటివాండ్రను చావగొట్టెను.

43.15 (పదునైదవ శ్లోకము)

మృతకం ద్విపముత్సృజ్య దంతపాణిః సమావిశత్|

అంసన్యస్తవిషాణోఽసృఙ్మదబిందుభిరంకితః|

విరూఢస్వేదకణికావదనాంబురుహో బభౌ॥9922॥

ఆ మదపుటేనుగు మృతకళేబరమును అచటనే విడిచిపెట్టి ఆ మహాత్ముడు దాని దంతమును చేబూని రంగస్థలమున  ప్రవేశించెను. అప్పుడు శ్రీకృష్ణుని రూపవైభవము చూడముచ్చట గొలుపుచుండెను. ఏనుగు దంతమును భుజముపై వహించియున్న ఆ ప్రభువు శరీరముపై రక్తబిందువులు, ఏనుగుయొక్క మదజల బిందువులు ప్రస్ఫుటముగా కనబడుచుండెను. మదపుటేనుగుతో పోరాడిన సందర్భమున చెమర్చిన ఆయన ముఖారవిందమునగల చెమటబిందువులు వింతశోభల నీనుచుండెను.

43.16 (పదహారవ శ్లోకము)

వృతౌ గోపైః కతిపయైర్బలదేవజనార్దనౌ|

రంగం వివిశతూ రాజన్ గజదంతవరాయుధౌ॥9923॥

పరీక్షిన్మహారాజా! బలరామకృష్ణుల చేతులలో ఆ ఏనుగు దంతములు ఆయుధములవలె శోభిల్లుచుండెను. కొంతమంది గోపాలురు వారి చుట్టును చేరియుండగా ఆ సోదరులు మల్లరంగమున ప్రవేశించిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి     నలుబది మూడవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[05:42, 18/02/2021] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 643  / Bhagavad-Gita - 643 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము  - 60 🌴

60. స్వభావజేన కౌన్తేయ నిబద్ధ: స్వేన కర్మణా |
కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్యవశోపి తత్ ||

🌷. తాత్పర్యం :
మోహకారణముగా నీవిప్పుడు నా నిర్దేశానుసారము వర్తించుటకు అంగీకరింప కున్నావు. కాని ఓ కౌంతేయా! నీ స్వభావము వలన పుట్టిన కర్మచే అవశుడవై నీవు దానిని ఒనరింపగలవు.

🌷. భాష్యము  :
శ్రీకృష్ణభగవానుని నిర్దేశమునందు వర్తించుటకు నిరాకరించినచో మానవుడు అవశుడై తన గుణముల ననుసరించి వర్తించవలసివచ్చును.

ప్రతియొక్కరు ప్రకృతి త్రిగుణములలో ఏదియో ఒక గుణసమ్మేళన ప్రభావమునకు లోనై యుండి, ఆ రీతిగా వర్తించుచుందురు. కాని ఎవరైతే బుద్ధిపుర్వకముగా శ్రీకృష్ణుభగవానుని దివ్యనిర్దేశమునందు నియుక్తులగుదురో అట్టివారు మహిమాన్వితులగుదురు.
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Bhagavad-Gita as It is - 643 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

🌴 Chapter 18 - Moksha Sanyasa Yoga -  The Perfection of Renunciation  - 60 🌴

60. svabhāva-jena kaunteya
nibaddhaḥ svena karmaṇā
kartuṁ necchasi yan mohāt
kariṣyasy avaśo ’pi tat

🌷 Translation :
Under illusion you are now declining to act according to My direction. But, compelled by the work born of your own nature, you will act all the same, O son of Kuntī.

🌹 Purport :
If one refuses to act under the direction of the Supreme Lord, then he is compelled to act by the modes in which he is situated. Everyone is under the spell of a particular combination of the modes of nature and is acting in that way. But anyone who voluntarily engages himself under the direction of the Supreme Lord becomes glorious.
🌹 🌹 🌹 🌹 🌹
For Old Messages...
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom  FB Telegram group 🌹
http://www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
[05:42, 18/02/2021] +91 98494 71690: 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 296, 297 / Vishnu  Sahasranama Contemplation - 296, 297 🌹
📚. ప్రసాద్ భరద్వాజ

🌻 296. కాంతః, कान्तः, Kāntaḥ 🌻

ఓం కాంతాయ నమః | ॐ कान्ताय नमः | OM Kāntāya namaḥ

కాంతః, कान्तः, Kāntaḥ

అభిరూపతమః కాన్తః అభిరూపతముడు అనగా మిక్కిలి సుందరుడు కావున విష్ణువు కాన్తః అని చెప్పబడును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 296🌹
📚. Prasad Bharadwaj

🌻 296. Kāntaḥ 🌻

OM Kāntāya namaḥ

Abhirūpatamaḥ kāntaḥ / अभिरूपतमः कान्तः Extremely handsome, brilliant in appearance hence Lord Viṣṇu is Kāntaḥ.

Śrīmad Bhāgavata - Canto 10, Chapter 29
Niśamya gītāṃ tdanaṅgavardhanaṃ vrajastriyaḥ kr̥ṣṇagr̥hītamānasāḥ,
Ājagmuranyonyamalakṣitodyamāḥ sa yatra kānto javalolakuṇḍalāḥ. (4)

:: श्रीमद्भागवते दशमस्कन्धे पूर्वार्धे एकोनत्रिंशोऽध्यायः ::
निशम्य गीतां त्दनङ्गवर्धनं व्रजस्त्रियः कृष्णगृहीतमानसाः ।
आजग्मुरन्योन्यमलक्षितोद्यमाः स यत्र कान्तो जवलोलकुण्डलाः ॥ ४ ॥

When the young women of Vṛndāvana heard Kṛṣṇa's flute song, which arouses romantic feelings, their minds were captivated by the Lord. They went to where their extremely handsome lover waited, each unknown to the others, moving so quickly that their earrings swung back and forth.

🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
भूतभव्यभवन्नाथः पवनः पावनोऽनलः ।
कामहा कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः ॥ ३२ ॥

భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః ।
కామహా కామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ॥ ౩౨ ॥

Bhūtabhavyabhavannāthaḥ pavanaḥ pāvano’nalaḥ ।
Kāmahā kāmakr̥tkāntaḥ kāmaḥ kāmapradaḥ prabhuḥ ॥ 32 ॥

 Continues....
🌹 🌹 🌹 🌹🌹

🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 297 / Vishnu  Sahasranama Contemplation - 297 🌹
📚. ప్రసాద్ భరద్వాజ

🌻297. కామః, कामः, Kāmaḥ🌻

ఓం కామాయ నమః | ॐ कामाय नमः | OM Kāmāya namaḥ

కామః, कामः, Kāmaḥ

కామః కమ్యోఽర్థకాంక్షిభిః పురుషార్థములను అభికాంక్షించువారిచే ఫలదానమునకై కోరబడెడివాడు కావున విష్ణువు కామః.

:: పోతన భాగవతము, అష్టమ స్కంధము, గజేంద్ర మోక్షము ::
సీ. వరధర్మకామార్థ వర్జితకాములై విబుధులెవ్వని సేవించి యిష్ట
గతిఁ బొందుదురు? చేరి కాంక్షించువారి కవ్యయ దేహ మిచ్చు నెవ్వాఁడు కరుణ?
ముక్తాత్ములెవ్వని మునుకొని చింతించు? రానందవార్ధి మగ్నాంతరంగు
లేకాంతు లెవ్వని నేమియుఁ గోరక భద్రచరిత్రంబుఁ బాడుచుందు?
తే. రా మహేశు నాద్యు నవ్యక్తు నధ్యాత్మ, యోగగమ్యుఁ బూర్ణు నున్నతాత్ము
బ్రహ్మమైన వానిఁ బరుని నతీంద్రియు, నీశు స్థూలు సూక్ష్ము నే భజింతు. (83)

భగవంతుడు ధర్మంపైనా, కామంపైనా, ధనం పైనా ఆశలు విడిచిన పండితుల పూజలందుకొని వారు కోరుకున్న ఉత్తమ వరాలు అనుగ్రహిస్తాడు. దరిజేరి కోరిన వారికి దయతో నాశనంలేని శరీరాన్ని ప్రసాదిస్తాడు. ముక్తులైన వారు ఆనంద సముద్రంలో మునిగిన మనస్సులతో ఆయనను అనునిత్యమూ ఆరాధిస్తారు. పరమార్థాన్ని చింతించేవారు ఏకాంతంగా ఆయన పవిత్రమైన చరిత్రను పాడుతుంటారు. అతడు అందరికంటే ఆద్యుడైనవాడు. కంటికి కానరానివాడు. అధ్యాత్మ యోగంవల్ల మాత్రమే చేరదగినవాడు. పరిపూర్ణుడు, మహాత్ముడు, బ్రహ్మస్వరూపుడు, శ్రేష్ఠమైనవాడు, ఇంద్రియాలకు అతీతమైనవాడు, స్థూలస్వరూపుడు, సూక్ష్మ స్వరూపుడు, అటువంటి మహాత్ముణ్ణి నేను సేవిస్తాను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 297🌹
📚. Prasad Bharadwaj

🌻 297. Kāmaḥ 🌻

OM Kāmāya namaḥ

Kāmaḥ kamyo’rthakāṃkṣibhiḥ / कामः कम्योऽर्थकांक्षिभिः Since He is sought after by those who desire to attain the four supreme values of life, He is Kāmaḥ.

Śrīmad Bhāgavata - Canto 8, Chapter 3
Yaṃ dharmakāmārthavimuktikāmā bhajanta iṣṭāṃ gatimāpnuvanti,
Kiṃ cāśiṣo rāpyapi dehamavyayaṃ karotu me’dabhradayo vimokṣaṇām. (19)

:: श्रीमद्भागवत अष्टमस्कन्धे तृतीयोऽध्यायः ::
यं धर्मकामार्थविमुक्तिकामा भजन्त इष्टां गतिमाप्नुवन्ति ।
किं चाशिषो राप्यपि देहमव्ययं करोतु मेऽदभ्रदयो विमोक्षणाम् ॥ १९ ॥

Worshiping Him, those who are interested in the four principles of religion, economic development, sense gratification and liberation - obtain from Him what they desire. What then is to be said of other benedictions? Indeed, sometimes the Lord gives a spiritual body to such ambitious worshipers. May that Supreme God, who is unlimitedly merciful, bestow upon me the benediction of liberation from this present danger and from the materialistic way of life.

🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
भूतभव्यभवन्नाथः पवनः पावनोऽनलः ।
कामहा कामकृत्कान्तः कामः कामप्रदः प्रभुः ॥ ३२ ॥

భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః ।
కామహా కామకృత్కాన్తః కామః కామప్రదః ప్రభుః ॥ ౩౨ ॥

Bhūtabhavyabhavannāthaḥ pavanaḥ pāvano’nalaḥ ।
Kāmahā kāmakr̥tkāntaḥ kāmaḥ kāmapradaḥ prabhuḥ ॥ 32 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹
For Old Messages...
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom  FB Telegram group 🌹
http://www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
[05:42, 18/02/2021] +91 98494 71690: 🌹. వివేక చూడామణి - 26 / Viveka Chudamani - 26 🌹
✍️. రచన :  సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. అంతఃకరణాలు - 3 🍀

100. ఈ స్థూల శరీరము ఆత్మ యొక్క అన్ని కార్యాలకు పరికరముగా తోడ్పడుచున్నది. ఆత్మ పరిపూర్ణ జ్ఞానముతో ఏ విధముగా అయితే వడ్రంగి; భాడిత, సుత్తి, మొదలగు పరికరములతో పనిచేసినట్లు ఆత్మ పనిచేయుచున్నది.

101. కండ్లు బలహీనముగా, గుడ్డిగ లేక చురుగ్గా ఉన్నప్పటికి అలానే చెవి; మూగగా చెముడు కలిగి ఉన్నప్పటికి, అన్ని తెలిసిన ఆత్మకు ఆ చెవిటి తనము, గుడ్డి తనము ఉండవు, అంటవు.

102. శ్వాస తీసుకొనుట, వదులుట, ఆవలింతలు, తుమ్ములు, శ్వాస బిగబెట్టుట శరీరమును వదులుట అనునవి ప్రాణము యొక్క వివిధ పనులు. మిగిలినవి దప్పిక, ఆకలి అనునవి ప్రాణ శక్తి యొక్క ఇతర పనులు.

103. పంచ జ్ఞానేంద్రియాలైన కన్ను, ముక్కు మొదలగువాని వెనుక మనస్సు పనిచేస్తున్నది. అలానే శరీరములోని వివిధ భాగములు ఆత్మ యొక్క ప్రతిబింబాలే.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🌹 VIVEKA CHUDAMANI  - 26 🌹
✍️ Swami Madhavananda
📚. Prasad Bharadwaj

🌻 Anthah:karanalu - Intuitions - 3 🌻

100. This subtle body is the instrument for all activities of the Atman, who is Knowledge Absolute, like the adze and other tools of a carpenter. Therefore this Atman is perfectly unattached.

101. Blindness, weakness and sharpness are conditions of the eye, due merely to its fitness or defectiveness; so are deafness, dumbness, etc., of the ear and so forth –but never of the Atman, the Knower.

102. Inhalation and exhalation, yawning, sneezing, secretion, leaving this body, etc., are called by experts functions of Prana and the rest, while hunger and thirst are characteristics of Prana proper.

103. The inner organ (mind) has its seat in the organs such as the eye, as well as in the body, identifying with them and endued with a reflection of the Atman.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹
For Old Messages...
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom  FB Telegram group 🌹
http://www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
[05:42, 18/02/2021] +91 98494 71690: 🌹. దేవాపి మహర్షి బోధనలు - 36 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 26. జ్ఞానయోగము - కర్మయోగము - 2 🌻

సృష్టి యందు యేర్పడు పాపమును, తనయందు ఏర్పడు పాపమును నిత్యము తొలగించు కొనుచుండ వలెను. ఇట్లు తొలగించు కొనుటయే పవిత్రీకరణము లేక సంస్కరణము అనబడును.

లోకమున మంచి పనులు, చెడు పనులు అని లేవు. మానవుని ఉద్దేశ్యమునుబట్టి అవి ఏర్పడును. వ్యక్తిగత ఉద్దేశ్యములు లేని కార్యము ఏదైననూ, సత్కర్మాచరణమే. కావున నీ స్వభావమున యేర్పడిన ధర్మమును ఫలాపేక్ష లేక నిర్వర్తించుట వలన బంధము తొలగును. అట్లు చేయుటలో శ్రద్ధ, సమర్పణము వుండవలెను.

వ్యామోహము, కలవరపాటు, అహంకారము ఉండరాదు. పై చెప్పిన ప్రకారము కర్మలాచరించుట వలన మనస్సు, యింద్రియములు, దేహమునకు సమన్వయమేర్పడి జ్ఞానము పొందుటకు అవకాశమేర్పడును.

అనగా తనయందు ప్రేరేపింపబడిన సృష్టి ప్రణాళికను బుద్ధియోగమున గమనించి, మనస్సు, యింద్రియములు, దేహము ద్వారా ఆచరింపజేయుట జరుగును.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
For Old Messages...
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom  FB Telegram group 🌹
http://www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
[05:42, 18/02/2021] +91 98494 71690: 🌹. మనస్సాక్షినే నమ్మాలి.  🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి  ( ఓషో బోధ ) 🍀
✍️. భరత్‌,  📚. ప్రసాద్ భరద్వాజ

‘‘మీరేమో మనం ఎలాంటి వారమైనా మనని మనం అంగీకరించాలంటారు. అంతర్గత ఆనందాన్ని కోల్పోతున్నట్లు తెలుసుకున్న నేను ఈ జీవితాన్ని అంగీకరించ లేకపోతున్నాను. ఇప్పుడేం చెయ్యాలి?’’ అని నువ్వు నన్ను అడిగావు.

మీరు వంద సంవత్సరాలు జీవించినా, మీ జీవితం ఎండిపోయిన ఎముకల గూడులా నిర్జీవంగానే ఉంది. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ‘‘మిమ్మల్ని మీరు అంగీకరించాలి’’ అని నేనంటున్నానంటే అర్థం ‘‘మీ జీవన విధానాన్ని మీరు అంగీకరించమని కాదు. దానిని విడిచిపెట్టి, మిమ్మల్ని మీరు అంగీకరించాలని నా భావన’’. కానీ, మీరు మీ తీరులోనే దానిని అర్థంచేసుకున్నారు. నేనెప్పుడూ మీరు అర్థం చేసుకున్నది చెప్పలేదు. అందుకే అన్నీ అలా జరుగుతున్నాయి.

సమాజం మీపై బలవంతంగా రుద్దిన వాటిని తిరస్కరించమంటున్నానే కానీ, వాటిని అంగీకరించమని నేనెప్పుడూ చెప్పలేదు. అనంతరం ఆవలి తీరాల నుంచి మీతో పాటు తెచ్చుకున్న మీ అంతర్గత కేంద్రం చెప్పే దానిని మాత్రమే అంగీకరించమని నేనెప్పుడూ చెప్తున్నాను.

అలా చేస్తే, మీరేదో కోల్పోయారనే భావన మీకెప్పుడూ రాదు. కాబట్టి, ఎలాంటి నిబంధనలు లేకుండా మిమ్మల్ని మీరు అంగీకరించిన మరుక్షణం మీలో నిక్షిప్తమై ఉన్న శక్తులు ప్రవహించడం ప్రారంభిస్తాయి, ఆనందం సొంతమైన మీ జీవితం పరవశంతో పయనిస్తుంది.

ఒక పేదవాడి ప్రేమలో పడిన కోటీశ్వరుడి కూతురు వాడిని తన తల్లిదండ్రులకు పరిచయం చేసేందుకు ఇంటికి విందుకు ఆహ్వానించింది. అక్కడి భోగభాగ్యాలు చూసి మతిపోయిన ఆ పేదవాడు చాలా నిగ్రహంతో మసలుకుంటున్నాడు. విందు సిద్ధమైంది. ఆ భోజన పదార్థాలు చూడగానే నిగ్రహాన్ని కోల్పోయిన ఆ పేదవాడు ఆపుకోలేక గట్టిగా అపాన వాయువు వదిలాడు.  ‘టైగర్’ ఏమిటి ఆ వెధవ పని? అన్నాడు కోటీశ్వరుడు ఆ పేదవాడి కాళ్ళ దగ్గరే కూర్చున్న కుక్కతో. తనకేమీ తెలియదన్నట్లుగా చూసింది ఆ కుక్క. తాను బయటపడలేదని తమాయించుకున్న ఆ పేదవాడు కొన్ని నిమిషాల తరువాత మళ్ళీ గట్టిగా అదే పని చేశాడు. ‘టైగర్, బుద్ధిలేదా నీకు’ అంటూ గట్టిగా అరిచాడు కోటీశ్వరుడు.

అయినా కొన్ని నిముషాల తరువాత ఆ పేదవాడు మళ్ళీ గట్టిగా అదే పని చేయడంతో ఒళ్ళు మండిన ఆ కోటీశ్వరుడు కంచం మీద నుంచి లేస్తూ ‘‘ఈ వెధవ ఇక్కడే నీపై ఏరిగేలా ఉన్నాడు. ఫో లోపలికి’’ అన్నాడు కుక్కతో.

ఇంతవరకు మీరు జీవిస్తున్న జైలు నుంచి బయటపడేందుకు మీకింకా సమయముంది. కేవలం జూదగాడికున్న కాస్తంత ధైర్యం మీకుంటే చాలు.

- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
For Old Messages...
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom  FB Telegram group 🌹
http://www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
[05:42, 18/02/2021] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 213 / Sri Lalitha Chaitanya Vijnanam  - 213 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :
మహారూపా, మహాపూజ్యా, మహాపాతక నాశినీ |
మహామాయా, మహాసత్త్వా, మహాశక్తి ర్మహారతిః ‖ 54 ‖

🌻 213. 'మహాపూజ్యా' 🌻

విస్తారముగ పూజింపబడునది కనుక మహాపూజ్యా అను నామము కలిగినది. బ్రహ్మ, విష్ణువు, శివుడు, కుబేరుడు, విశ్వేదేవతలు, వాయువు, వసువు, వరుణుడు, అగ్ని, ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, గ్రహములు, రాక్షసులు, పిశాచములు సైతము శ్రీమాతను నిత్యము పూజింతురు.

శ్రీమాత అనుగ్రహముననే లోకపాలకులు శక్తిమంతులై వారి వారి కార్యములను చక్కబెట్టుచున్నారు. సృష్టి చైతన్యము ఆమెయే గనుక ఆమెను పూజించుట వలననే ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులు వృద్ధి చెందగలవు. పూజించదగిన పూజ్యులందరూ కూడ శ్రీమాతను పూజింతురు గనుక ఆమె మహా పూజ్య.

శ్రీమాతను యంత్ర రూపమున, శిలా రూపమున, ఇంద్రనీల రూపమున, బంగారు రూపమున, వెండి రూపమున, ఇత్తడి రూపమున, కంచు రూపమున, లోహ రూపమున, సీసము రూపమున, స్ఫటిక రూపమున, మాణిక్య రూపమున, వజ్ర రూపమున, వైడూర్య రూపమున నేర్పరుచుకొని పూజించదగునని దేవీ భాగవతము తెలుపుచున్నది. ప్రతిమ ఏ పదార్థముతో చేయబడిన దైనను భక్తి ప్రధానమని తెలియవలెను. భక్తికే ఆమె వశ మగునని ముందు నామములలో తెలుపబడినది కదా!

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 213 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Mahāpūjyā महापूज्या (213) 🌻

She is worshipped by great souls like saints and sages.  Saints and sages have more knowledge than most of the demigods and goddesses.  They will not worship anybody unless they are worthy of worship. There are interpretations saying that Brahma, Viṣṇu, Śiva worship Her.  This means that Gods who have been assigned various duties, worship Her. This is yet another affirmation regarding Her supremacy.

There are references to gods, goddesses and others who worship Her using mantra-s, metals and gems.

1.Śiva - mantra, 2. Brahmā – stone, 3. Viṣṇu - blue stone, 4. Kubera – gold, 5. Viśvedevās - silver,

6. Vāyu – copper, 7.  Vasu - brass, 8.  Varuna – crystal, 9.  Agni – gems, 10.  Śakra – pearls,

11. Sūrya – coral, 12. Soma – lapis, 13.  Planets – lazuli, 14.  Demons – tin, 15.  Piśācas - adamantine, 16.  Mātṛgaṇa-s – iron.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
For Old Messages...
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom  FB Telegram group 🌹
http://www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam

No comments:

Post a Comment