Sunday, 7 February 2021

08-02-2021

May be an image of 3 people and text that says 'పరమశివుడి ఆశీస్సులతో శుభ సోమవారం'

 

UIU  IUIU UIUIIU --- ఛందస్సు --  ఈశ్వరా
రచయిత :మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఈశ్వరా మహేశ్వరా సర్వపాపహరా ....
సర్వదా నటేశ్వరా నమ్మి కూడిమిరా
నిత్యమై గజేశ్వరా మమ్ము చూడుమురా
కోపమే జపేశ్వరా మాలొ మాపుమురా  

కాలమే మనోమయం మానవత్వమురా
వెల్గుయే ఉషోదయం మేలుచూపునురా
గాలియే సమస్తమం వ్యాప్తి చెందునురా
అగ్నియే ప్రభావమం చూపు చుండునురా

మానమే మహోన్నతం స్త్రీలభావమురా
ప్రేమయే ప్రసన్నతం  స్త్రీల శక్తియు రా
కామమే ప్రభావితం జీవ యుక్తియురా
ఆశయే సమొన్నతం జీవ ముక్తియురా

తృప్తియే మనస్సితం తెల్పు మోహమురా
శాంతమే ప్రభంజనం నిత్య కొల్వుకురా
దేహమే  సమర్పితం నిత్య సేవకు రా
మొనమే సమన్వితం ప్రేమచూపునురా

ఈశ్వరా మహేశ్వరా సర్వపాపహరా ....
సర్వదా నటేశ్వరా నమ్మి కూడిమిరా
నిత్యమై గజేశ్వరా మమ్ము చూడుమురా
కోపమే జపేశ్వరా మాలొ మాపుమురా  


 🌹🌹 సమయస్పూర్తి 🌹🌹

ఒకానొకప్పుడు ఇటలీ దేశంలోని ఒక చిన్న పట్టణంలో ఒక చిరువ్యాపారి ఉండేవాడు. అతను పెద్ద మొత్తంలో ఒక వడ్డీ వ్యాపారికి బాకీ పడ్డాడు. ఆ వడ్డీ వ్యాపారి ముసలివాడు, కానీ చండశాసనుడు. తన వడ్డీ వసూలు కోసం ఎంత నీచస్థాయికైనా దిగజారగలడు.

ఒకసారి, వడ్డీ ఇవ్వడం ఆలస్యమయినందున, ఆ వడ్డీవ్యాపారి కోపంగా ఈ చిన్న దుకాణదారు ఇంటికి వచ్చాడు.

తన వడ్డీ సంగతేం చేశావని నిలదీసాడు. ఈ నెల దుకాణం సరిగా నడవనందున ఆదాయం చాలినంత లేదని, త్వరలో ఇచ్చేస్తానని నమ్మబలికాడు. ఆ ముసలివాడిని శాంతపరిచేందుకు మజ్జిగ తెమ్మని తన కూతురికి పురమాయించాడు. మజ్జిగతో వచ్చిన ఆ వ్యాపారి కూతుర్ని చూసిన ఈ వృద్ధ వడ్డీ వ్యాపారికి కళ్లు జిగేల్‌మన్నాయి. ఆ అమ్మాయి అద్భుతమైన అందగత్తె. తనను చూసిన ముసలివాడికి ఓ దుర్బుద్ధి పుట్టింది.

ఆ దుకాణదారుతో ఓ బేరం పెట్టాడు. 'నీ కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తే, నీ బాకీ మొత్తం రద్దు చేస్తా'నని స్పష్గం చేసాడు.

ఆ వ్యాపారి ముసలివాడిని అసహ్యంగా చూసాడు. అది గమనించిన వడ్డీవ్యాపారి, 'సరే… నీకు రెండు అవకాశాలిస్తాను. ఏదైనా ఒకదానిని నువ్వు ఎంపిక చేసుకోవచ్చు. అవేంటంటే, రెండు గులకరాళ్లు ఒక సంచీలో వేస్తాను. ఒకటి నల్లది. రెండోది తెల్లది. మీ అమ్మాయి వచ్చి సంచీలోనుండి ఒక రాయిని బయటకు తీయాల్సివుంటుంది. నల్లరాయి వస్తే, నీ బాకీ రద్దవుతుంది. కానీ, మీ అమ్మాయిని నాకిచ్చి వివాహం జరిపించాలి. తెల్లరాయి వస్తే కూడా నీ బాకీ రద్దవుతుంది. అప్పుడు నీ కూతుర్ని కూడా నాకివ్వనవసరం లేదు' అని తేల్చాడు.

ఈ చిరువ్యాపారికి వేరే అవకాశం లేకపోవడం వల్ల ఈ ఒప్పందానికి 'సరే' అన్నాడు. ఆ అమ్మాయి గుండెల్లో రాయి పడింది. 'ఇదెక్కడి అన్యాయంరా భగవంతుడా. నాకేమిటి దారి? చివరకు ఈ ముదుసలి, ఆనాకారిని పెళ్లి చేసుకోవాలా?' అని బాధపడి, తర్వాత స్థిమితపడి పరిపరివిధాల ఆలోచించసాగింది.

ఇంతలో, ఆ వడ్డీవ్యాపారి వీరి ఇంటి ముందు ఉన్న గులకరాళ్ల దారి వద్దకు వెళ్లి, వంగి, అటూఇటూ చూసి రెండు గులకరాళ్లు తీసి సంచీలో వేసాడు. నిజానికి ఆ రెండూ నల్ల రాళ్లే. అనుకోకుండా వ్యాపారి కూతురు ముసలివాడి దుశ్చర్యను చూసింది. అయినా ఏమీ తెలియనట్లు ఓ పక్కన నిలబడిఉంది.

అప్పుడు ఆ ముసలివాడు తండ్రీకూతుళ్లను దగ్గరికి రమ్మని పిలిచాడు. 'అమ్మాయి. ఒక రాయి తీయి' అని సంచీని ముందుకు చాపాడు. 'నువ్వు కూడా చూడు' అని తండ్రిని కూడా అదిలించాడు.

ఇక్కడ ఇక ఆ ఆమ్మాయినిక మిగిలింది మూడే అవకాశాలు.

1. సంచీలోనుండి రాయి తియ్యడానికి నిరాకరించడం.
2. సంచీలోనుంచి రెండు రాళ్లు బయటకు తీసి ముసలివాడి అన్యాయాన్ని బయటపెట్టడం.
3. తెలిసి తెలిసి, తండ్రి అప్పు తీర్చడం కోసం సంచీలోనుండి ఒక రాయి బయటకు తీసి, అతన్ని పెళ్లి చేసుకుని, త్యాగం చేయడం.

ఇంతలో ఆ అమ్మాయికి మెరుపులాంటి ఆలోచన ఒకటి వచ్చింది. వెంటనే సంచీలో చేయిపెట్టి, ఒక రాయిని బయటకు తీసి, అదే జారిపోయినట్టుగా కిందకు దారిలో వదిలేసింది. ఆ ముసలివాడితో ఇలా అంది.

'' అయ్యో.. నన్ను క్షమించండి. రాయి పొరపాటున జారిపోయింది. కింద అన్నీ గులకరాళ్లే. జారిపోయింది ఏదో తెలియడం లేదు కదా. అయినా పరవాలేదు. సంచీలో ఉన్నది బయటకు తీయండి. దాంతో కిందపడిందేదో తెలిసిపోతుంది కదా''

ఆ వృద్ద వడ్డీవ్యాపారి కంగారు పడ్డాడు. మింగాలేక, కక్కాలేని పరిస్థితి. లోపల ఉన్నది బయటకు తీస్తే, కింద పడ్డది తెల్ల రాయి అని నిర్ధారించినట్లే. లేదూ నల్లరాయే అంటే, తన మోసం తెల్లారిపోతుంది. ఇక ఏం చేయలేక, ఏడ్వలేక నవ్వుతూ, ఆ దుకాణదారుడి బాకీ మొత్తం రద్దు చేసి వెళ్లిపోయాడు.

నీతి ఏంటంటే.. ''ప్రతీ కష్టసమయాన్ని దాటడానికి ఓ ఉపాయం ఉంటుంది. విభిన్నంగా ఆలోచించడం ద్వారా ఆ ఉపాయం తడుతుంది. పరిస్థితులు కల్పించే అవకాశాలే కాక, మరో అవకాశం మన ఆలోచన వల్ల వస్తుంది.

ధర్మో రక్షతి రక్షితః 🙏🏻🙏🏻🙏🏻
సర్వే జనా సుఖినోభవంతు 🙏🙏🙏
 
న‌వ‌గ్రహ సంబందిత క్షేత్రాలు

న‌వ‌గ్రహ సంబందిత క్షేత్రాలను సందర్శించాలనుకునే వారు రాష్ట్రఎల్లలు దాటి పోవాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలోనే చాలా క్షేత్రాలలో నవగ్రహ పూజలు చేసుకోవచ్చు. అలాంటివి మన రాష్ట్రంలోనే చాలా జిల్లాలలో ఉన్నాయి. వీటన్నింట నవగ్రహపూజలు చేసుకోవచ్చు.

సూర్యుడు

శ్రీ‌కాకుళం జిల్లా 1.హ‌ర్షవ‌ల్లి సూర్యనారాయ‌ణ స్వామి
తూర్పుగోదావ‌రి 2. పెద్దాపురం సూర్యనారాయ‌ణ స్వామి
తూర్పగోదావ‌రి 3. గొల్లల‌మామిడాడ సూర్యనాయ‌ణ స్వామి
క‌ర్నూలు 4. నందికొట్టూరు సూర్యనారాయ‌ణ స్వామి

చంద్రుడు

ప‌శ్చిమ గోదావ‌రి 1. గునుగుపూడిలో సోమేశ్వర స్వామి (భీమ‌వ‌రం).
తూర్పుగోదావ‌రి 2. కోటే ప‌ల్లి సోమేశ్వర స్వామి
కృష్ణ 3. విజ‌య‌వాడ‌లో క‌న‌క‌దుర్గాదేవి, పెద్దక‌ళ్ళే ప‌ల్లెలో దుర్గాదేవి.
నెల్లూరు 4. జొన్నవాడ కామాక్షిత‌యారు అమ్మవారు.

అంగార‌కుడు
కృష్ణ 1. మోపిదేవి సుబ్రమ‌ణ్యస్వామి మ‌రియు చోడ‌వ‌రం
తూర్పుగోదావ‌రి 2.బిక్కవోలు సుబ్రమ‌ణ్యస్వామి మ‌రియు పెద్దాపురం
గుంటూరు 3.పెద్ద నంది పాడు, నాగుల పాడు పుట్ట, పెద్దకూర‌పాడు పుట్ట, మంగ‌ళ‌గిరి సుబ్రమ‌ణ్య స్వామి, పొన్నూరు.

బుదుడు

ప‌శ్చిమ గోదావ‌రి 1. ద్వార‌కా తిరుమ‌ల‌
తూర్పుగోదావ‌రి 2. ర్యాలీ, అన్నవ‌రం, పిఠాపురం కుంతీమాధ‌వ స్వామి.
కృష్ణ 3.శ్రీ కాకుళంలో ఆంధ్రా మ‌హావిష్ణువు.
చిత్తూరు 4.తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వర స్వామి.

బృహ‌స్పతి

గుంటూరు 1. చేబ్రోలు బ్రహ్మ దేవుడు.
మ‌హ‌బూబ్ న‌గ‌ర్ 2. అలంపురంలో బ్రహ్మదేవుడు.
తూర్పగోదావ‌రి 3.కోటి ప‌ల్లోలో కోటిలింగేశ్వర స్వామి. మంద‌ప‌ల్లిలో బ్రహే్శ్వర స్వామి.
గుంటూరు 4. అమ‌రావ‌తిలో అమ‌ర‌లింగేశ్వర స్వామి. , కోట‌ప్పకొండ త్రికూటేశ్వర స్వామి.

శుక్రుడు

విశాఖ 1. విశాఖ ప‌ట్టణం క‌న‌క‌మ‌హాల‌క్ష్మి, పింహాచ‌లం ల‌క్ష్మీ దేవి.
చిత్తూరు 2. అలిమేలు మంగాపురం, ప‌ద్మావ‌తీ దేవి.
నెల్లూరు 3. పెంచ‌ల‌కోన ఆది ల‌క్ష్మీదేవి.
శ‌ని

తూర్పగోదావ‌రి 1. మంద‌ప‌ల్లెలో మందేశ్వర స్వామి.
అనంత‌పురం 2. హిందుపురం తాలూకా పావ‌గ‌డ‌లోని శ‌నిమ‌హాత్ముడు
కృష్ణ 3. విజ‌య వాడ‌లోని కృష్ణన‌ది తీరాన జ్యేష్ణదేవి స‌హిత శ‌నైశ్చర్య స్వామి
ప్రకాశం 4. న‌ర్శింగోలు (సింగ‌రాయ కొండ వ‌ద్ద) శ‌నీశ్వర స్వామి.

రాహువు, కేతువు
చిత్తూరు 1. శ్రీ కాళ‌హ‌స్తి
తూర్పుగోదావ‌రి 2. మంద‌మ‌ల్లి నాగశ్వర స్వామి
కృష్ణ 3. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గా దేవి.
విశాఖ 4. సంప‌త్ వినాయ‌క స్వామి.
గుంటూరు 5. అమ‌రావ‌తి వినాయ‌క‌స్వామి, తెనాలి వైకుంఠ‌పురం పుట్ట.

గ‌మ‌నిక‌
:
 ఈ క్షేత్ర ద‌ర్శన‌ముల‌న్నియు ఒక్క వార‌ము రోజుల‌లో పూర్తి చేసిన‌చో త‌గిన ప‌లిత‌ములు పొందుతారు.
By
ప్రాంజలి ప్రభ 

 

🙏 తిరుమల శ్రీవారి మూలమూర్తికి నిత్యమూ  అలంకరించే దండలు..... 🙏

🍃🌺తిరుమల వెంకన్న కోటి మన్మథ సదృశ్యుడు. అలాంటి ఆయన్ను అలంకరించాలంటే ఎంత కష్టమో అందరికీ తెలిసిందే.

🍃🌺ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు తిలకించే స్వామివారిని ఎంతో అందంగా అలంకరించాలి. అది వేదపండితుల పని అన్న విషయం అందరికీ తెలిసిందే.

🍃🌺ప్రతిరోజు ఏకాంత సేవ తర్వాత స్వామివారిని అలంకరిస్తారు. ఆభరణాల కన్నా స్వామివారి అందాన్ని మనకు ఎక్కువగా చూపించేది పుష్పాలే. అసలు శ్రీవారికి ప్రతిరోజు ఎన్ని కరాల పుష్పమాలలు ధరిస్తారో ఇప్పటికీ చాలా మందికి తెలియదు.

🍃🌺ఎందుకుంటే స్వామి వారిని చూడడమే చాలా తక్కువ సమయం. అలాంటిది ఆయన ఎన్ని పూల దండలు వేసుకున్నారో చెప్పడం ఇంకా కష్టమైన పని. శ్రీవారికి ఎన్ని పూలదండలు అలంకరిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం...

🍃🌺1.శిఖామణి - శ్రీవారి కిరీటం మీద నుంచి రెండు భుజాల మీద వరకు అలంకర…
 

🕉 శ్రీ కాళహస్తీశ్వర శతకం - 86 🕉

చనువారిం గని యేద్చువారు జముఁడా సత్యంబుగా వత్తు మే
మనుమానంబిఁక లేదు నమ్మమని తారావేళ నారేవునన్
మునుఁగంబోవుచు బాస సేయుట సుమీ ముమ్మాటికిం జూడగాఁజెనటు ల్గానరు దీనిభావమిదివో శ్రీ కాళహస్తీశ్వరా!



📍 తాత్పర్యం: 📍


🌹శ్రీ కాళహస్తీశ్వరా!
అవివేకులు తమ బంధువులో, మిత్రులో మరి ఏ ఆప్తులో మరణించుట చూచి మహాదుఃఖముతో ఏడ్చెదరు.

🌹యమునుద్దేశించి యమా! మేము వీరి  ఎడబాటును ఓర్వజాలము, మేము కూడ వీరితోబాటు మరణింతుమని రకరకములుగ ప్రతిజ్ఞలు పలుకుతు శపధములు చేయుదురు.

🌹కాని వారాప్రతిజ్ఞలలోని అర్ధములెరుగక ఆవిధముగ చేయజాలరు. ప్రతివారు లోకసహజమగు మోహముతో ప్రేమ ఒలుకబోయువారే గాని చచ్చువారితో తాము చావను లేరు.

🌹తత్వమునెరిగి, నిన్ను సేవించి మోక్షము నందుటకు యత్నించను లేరు. ఇట్టివారి జీవితము వ్యర్ధము కదా....


🙏 ఓం నమః శివాయ 🙏

 

 ఒక రోజు విఖ్యాత చిత్రకారుడు రవివర్మ బజారులో వెళుతూ ఉన్నాడు.

రవివర్మను గుర్తుపట్టిన ఒక యువతి  సంతోషంతో   ఆయన దగ్గరకు వెళ్ళి  పలకరించి , ఏదైనా చిన్న పేయింటింగ్ గీసి ఇవ్వమని  అభ్యర్థించింది.

బజారులో పేయింటింగ్ ఎలా  చిత్రిస్తారు ? మరోసారి కలిసినపుడు తప్పక  చిత్రాన్ని  వేసి  ఇస్తాను అన్నా కూడా ఆ యునతి  మొండిగా  మారాం చేసే సరికి  ఒక పేపర్ పై  అప్పటికప్పుడు  చిత్రాన్ని చిత్రించి ఇచ్చేశాడు. ఇస్తూ ఇస్తూ  ....నవ్వుతూ    అన్నాడు  దీని విలువ  కోటి రూపాయలు.జాగ్రత్తగా కాపాడుకో.

ఆ యువతి  ఆశ్చర్యంగా  పేయింటింగ్  వంక చూస్తూ ఉండి పోయింది.

మరుసటి రోజు  ప్రముఖ చిత్రకారుల చిత్రాలు  అమ్మే వ్యక్తిని కలిసి ఈ రవివర్మ చిత్రాన్ని  అమ్మితే ఎంత ధరకు అమ్ముడు పోతుందని  వాకబు చేసింది.

ఆయన కూడా రవివర్మ చెప్పినట్లే చెప్పేసరికి  నోటమాట రాక  మళ్ళీ రవివర్మ గారిని కలవడానికి   వెళ్ళింది.
 
రవివర్మని కలిసి   ఇలా  అంది ...మీరు పది నిమిషాలలో చిత్రించిన చిత్రానికి  ఇంత విలువ ఉంటుందని అనుకోలేదు.

నాకు కూడా  చిత్రకళలోని మెళకువలు నేర్పండి. మీలా పది నిమిసాలలో కాక పౌయినా....పది రోజులకు ఒక చిత్రాన్నైనా గీయగలను.

రవివర్మ నవ్వుతూ అన్నాడు  అమ్మాయీ...!  నీకు  పది నిమిషాలలో చిత్రాన్ని గీసి ఇచ్చాను. నిజమే. దీని వెనకాల  నా 30 సంవత్సరాల కఠోర సాధన ఉంది.  

నవ్వూ నీ 30 సంవత్సరాలు  ఈ కళ కోసం త్యాగం చేయగలిగితే  నాలా తయారవగలవు.

ఆ యువతి నోటమాట రాక అలాగే చూస్తూ ఉండి పోయింది.

ఒక టీచర్ చెప్పే 45 నిమిషాల పాఠం వెనుక కూడా అతని జీవితం లోని ఎన్నో సంవత్సరాల కఠిన సాధన ఉంటుంది.

తల్లి తండ్రులు  నీకు చెప్పే మాటల వెనుక కూడా, నీ ఊహకు కూడా అందని  ప్రేమ, త్యాగాలు అనుభవాలు ఉంటాయి.
అలాగే ఒక బ్రహ్మ జ్ఞాని ఎదురుగా నీవు కొన్ని నిముషాలు కూర్చుంటే, నీ జీవితమే మారిపోతుంది.
ఉపాధ్యాయుల పాఠాలు, తల్లి తండ్రుల మంచిమాటలు, గురువుల జ్ఞాన బోధలు కూడా రవివర్మ చిత్రాల్లా నీ ఊహకు కూడా అందని విలువైనవి

శుభరాత్రి 😊💐
✳️☸️✳️

ప్రతి మనిషి కొన్ని అలవాట్లకు బానిస అయినట్టు ప్రతి మనసు కొన్ని మనసులకు బానిస అవుతుంది. ఆ మనసు దూరంగా ఉన్నా కనిపించకపోయినా..
మాట్లాడకపోయినా  ఆ మనసులోలోనే వేదన చెందుతూ ఉంటుంది.

✳️☸️✳️☸️✳️☸️✳️☸️
⚜️ నిత్య సత్యాలు ⚜️        

 మనిషికి ప్రశాంతిని ఇచ్చేది ప్రకృతి  కావచ్చు..
 కానీ ‌..
 మనసుకు  ప్రశాంతత నిచ్చేది ఇష్ట‌మైన వారినుండి వచ్చే పలకరింపు.

🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳

 జీవితమే ఒక ప్రయాణం..  ఆ ప్రయాణంలో కలిసే ప్రయాణికులు ఎందరో  కానీ..
 ఏదీ, ఎవరూ శాశ్వతం కాదు  కేవలం నువ్వే శాశ్వతం  నీ నడవడికే శాశ్వతం  గెలిచేది నువ్వే..
 ఓడేది కూడా నువ్వే  గెలుపుకి పొంగిపోకుండా..  ఓటమికి కృంగిపోకుండా   ధర్మ బద్ధంగా  ఫలాపేక్ష లేకుండా  తోటివారికి సాయపడుతూ  సాగిపోవడమే జీవితం  అదే నీ కర్తవ్యం..!!

🎊💦🦚🌹🌈💦💐

 జీవితం (Life) ఎప్పుడూ ఒకేలా ఉండదు.  కొన్ని రోజులు మనమెంతో ఆనందంగా జీవిస్తే ..
 మరికొన్నిసార్లు ప్రపంచంలోని కష్టాలన్నీ   మనకే ఉన్నాయని అనిపిస్తుంది.
 ఎప్పటికప్పుడు జీవితమనేది కొత్తగానే కనిపిస్తుంది.  కొందరు వయసు పెరుగుతుంటే..
 కష్టాలు తగ్గుతాయేమోనని అనుకుంటారు.   కానీ అందరి విషయంలోనూ ఇది సరికాదు.
 అయితే పెరిగే వయసుతో పాటు..   ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ముందుకెళ్తాం.

🎊💦🌹🌟🌈💦🎊

 🌹. వివేక చూడామణి - 15 🌹
✍️. రచన :  సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. బ్రహ్మ జ్ఞానము - 3 🍀

66. అందువలన తెలివిగల వ్యక్తి స్వయముగా అన్ని విధములైన పద్దతుల ద్వారా కృషి చేసినప్పుడే; పుట్టుక, చావులనే బంధనాల నుండి విముక్తిని పొందగలడు. అలా కాక రోగి మందు పేరును మరలమరల పలుకుట వలన రోగము తగ్గదు. తగిన మందు సేవించినప్పుడే రోగము తగ్గుతుంది.

67. ఈ రోజు మీరు అడిగిన ప్రశ్న (49వ శ్లోకము) చాలా గొప్పది. శాస్త్రాలలో నిక్షిప్తమై ఉన్న రహస్యమయమైన జ్ఞాన సౌందర్యాన్ని వెలికి తీసేదిగా ఉన్నది. తద్వారా జ్ఞానార్ధులు విముక్తి మార్గమును తెలుసుకొనగలరు.

68. ఓ జ్ఞానీ శ్రద్ధతో వినుము. నేను ఎవరికైతే ఈ విషయాన్ని చెప్పుచున్నానో, అది విన్నవారు వెంటనే సంసార బంధనాల నుండి విముక్తి పొందగలరు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

మధురిమలు - తప్పొప్పులు 

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


వాసనలేని పువ్వు 

అచ్చిరానది కొవ్వు 

అనువుకానిది నవ్వు 

జలమున్నచో తవ్వు  


బుద్ధిలేని పురంబు 

దాచలేని ధనంబు 

పొందనీ  సౌఖ్యంబు 

తీర్చనీ దాహంబు 


భక్తి లేనిది మగువ 

శక్తి లేనిది  తెగువ  

ముక్తి రానిది తగువ 

రక్తి చూపని కలువ 


గుణహీన కుమారుడు 

ప్రేమచూపని మగడు 

సమయ0 వ్యర్ధ పరుడు 

మాయచేసెను నటుడు 


పని కే రాని విద్య 

జ్ఞానం లేని విద్య

సుఖించలేని విద్య 

సేవకు రాని విద్య 


గ్రాసము లేని కొలువు 

ఆశలు చూపు తనువు  

కాలము తెల్పు మనువు  

బతక లేనిది పరువు 

  

గారెలు లేని విందు 

అక్కర రాణి చిందు 

సుఖమే లేని పొందు 

దగ్గు తగ్గని మందు 


చెట్లు లేని వనంబు 

శ్రద్ధ లేని తపంబు 

మచ్చిక వినయంబు 

చూపని సహనంబు 




No comments:

Post a Comment