Saturday, 2 December 2023




ప్రాంజలి ప్రభ  తెలుగు నేర్చుకునే వారిని దృష్టిలో పెట్టుకొని నిర్వాహకులు శ్రీదేవి రామకృష్ణ గారు చందస్సు మొదటి పాఠము


నగణం.. I I I ( మూడు లఘువులు )


పాఠము.. ప్రాంజలి.. (1) (తొమ్మిది అక్షరాలు ప్రాస అంత్యాను ప్రాస ఉండాలి )

ఉదాహరణలు


1..మనసు మనుగడగను 

తనువు తహతహగను

 చినుకు చరితమగును

 అణువు కలత యగును


2..ఒకరికొకరు కలియుట

 సకల విధిని గనుట

నకలు హృదయ మగుట 

 వికట కవిగ మనుట


3..అసలుపలకవలెను

ముసుగుకలలను గను

 పశువు కలయిక గను

 కొసరి కొలతలు గను


4..తిరుమల తిరుపతియె

 కరుణ హృదయమదియె 

 చరణముల పిలుపుయె

 తరుణ సుఖము కళయె


 5..కలము కథల వెతలు 

 బలము విలువ గతులు

 చలము నిలువ స్థితులు

 విలయ మగుట జతలు


6..గడప గృహము మొదట

 కడవ బరువు యచట

 మడమ తిరిగి పడుట

 జడలు కదల జడుట


7..చెలియ కలుపు చెలిమి

మలుపు తెలుపు కలిమి

బలుపు కలుపు బలిమి

కలువ మెరుపు ధరణి


8..అడవిన వెలుగు కల

 కడవరకు లయ జల

 నడక మనసుకు కళ

పడచు కదలిక కళ


9...పనులు సుఖము నెరిగి

 మనసు కథలు మరిగి

 క్షణము వలన వెలిగి

 రుణము వలన తిరిగి 

 


 ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, నాకు తెలిసిన రాస్తున్నాను, నేను ఆరాధించే ఆంజనేయ కృపాకటాక్షలతో తెలియపరుస్తున్నాను.

తప్పులు తెలిపగలరు, మీరు కొన్ని ఉదాహరణలు వ్రాయగలరు.

లైక్ చేసి, షేర్ చేయగలరు

మీ విధేయులు

ప్రాంజలి ప్రభ  తెలుగు నేర్చుకునే వారిని దృష్టిలో పెట్టుకొని నిర్వాహకులు శ్రీదేవి రామకృష్ణ గారు చందస్సు రెండవ పాఠము.. (2)


సగణం.. I I U ( రెండు లఘువులు ఒక గురువు )


పాఠము.. ప్రాంజలి.. (2) (తొమ్మిది అక్షరాలు ప్రాస అంత్యాను ప్రాస ఉండాలి )

ఉదాహరణలు


1..కలలే నిజమోనముయే

 పలుకే విధి మాయలుయే

 పిలుపే మది పుత్తడియే

 తలపే ఉపకారము యే


2...విధియాడెడి నాటకమే

 నిధి కోరెడి జీవితమే

 మది కోరిక కారణమే

 వ్యధమూలము నమ్మకమే


3...కనులే కమనీయముగా

 తనువే సుఖశాంతులుగా

 అణువై విధి బాధలుగా

 మనమై నిధి యాటలుగా


4..మనసాయె వరాలుగనే

 క్షణమాయ సుఖాలు గనే

 ఋణమే జవరాలుగనే

 మనమై ఒకటవ్వటనే


5..అతి శోధనలే మదిగా

 వ్యతిరేకముగా విడిగా

 స్థితినే మరిచేదడిగా

 గతినే తెలిపే మడిగా 


6..అవకాశము యే గతిగా

 అవమానము యే స్థితిగా

అవని శ్రమయే మదిగా

నవనాడులుగా విధిగా


7..తొలిసారిమనం కలిసే

మలి చూపులు లేకురిసే 

 బలిగా చెలిగా మురిసే

చలిగా తలపే తడిసే


8...నయనాల కళే శుభమై

పయనమ్ము కధే జయమై

వయసంత సుఖం పరమై

భయమే తొలగే విధమై


9...విలువైన సహాయముగా

తలవంచక జైత్రముగా

అలుపేయనకే పనిగా

తలమాణికమై విధిగా 


 ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, నాకు తెలిసినవి రాస్తున్నాను, నేను ఆరాధించే సీతా రామాంజనేయుల  కృపాకటాక్షలతో తెలియపరుస్తున్నాను.

తప్పులు తెలిపగలరు, మీరు కొన్ని ఉదాహరణలు వ్రాయగలరు.

లైక్ చేసి, షేర్ చేయగలరు

మీ విధేయులు

మల్లాప్రగడ

.......


ప్రాంజలి ప్రభ  తెలుగు నేర్చుకునే వారిని దృష్టిలో పెట్టుకొని నిర్వాహకులు శ్రీదేవి రామకృష్ణ గారు చందస్సు మూడవ పాఠము.. (3)


భగణం.. U I I ( ఒక గురువు రెండు లఘువులు  )


పాఠము.. ప్రాంజలి.. (3) (తొమ్మిది అక్షరాలు ప్రాస అంత్యాను ప్రాస ఉండాలి )

ఉదాహరణలు


1...వాక్కుల నేతల పల్కులు

చిక్కుల వచ్చిన కుల్కులు

మొక్కులు తీర్చెడి మాటలు

మక్కువ చూపెడి యాటలు


2..వడ్డన చేసిన నేర్పరి

బిడ్డగ నెంచియు వచ్చిరి

చెడ్డ జనంబులు చేరిరి

 గుడ్డిగ పాఠము చెప్పిరి


3..ఎక్కడి వాడివొ తెల్పకు 

 మక్కువ చూపియు వెల్లకు

 చిక్కులు మాపియు మారకు

 తక్కువ ఎక్కువ చేయకు


4...జీవన వేదము తెల్పుము

 భావము తెల్పియు నిల్వుము

 దైవము చూపిన మార్గము

సేవలు చేయుము నిత్యము


5...ఇంతటి రాజస మెందుకు

 పంతము బూనకు యాటకు

 వంతులు వేసియు దాటకు 

 శాంతము మర్చియు వెళ్ళకు


6..జిత్తుల మారిగ నుండకు

మత్తుకు చిక్కియు మండకు

చిత్తుగ ఓడియు యేడ్వకు

కత్తుల బోనున చిక్కకు


7..మానస మౌను సుదీర్ఘము

 ఆనతి నిచ్చును మోక్షము

 మానము ఇచ్చియు పొందుము 

 ప్రాణము చూడును నిత్యము


8..మంచి తనమ్ముగ నుండును

 వంచిత బుద్ధియు వద్దును

 సంచిత భావము చూపును

కంచికి చేరుట మేలును


9...కాలము నీదియు కాదును

 కాలపు శాంతిని కోరును

 నేలను కోరును నీరును 

 జ్వాలలు యేలను తగ్గును


 ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, నాకు తెలిసినవి రాస్తున్నాను, నేను ఆరాధించే సీతా రామాంజనేయుల  కృపాకటాక్షలతో తెలియపరుస్తున్నాను.

తప్పులు తెలపగలరు, మీరు కొన్ని ఉదాహరణలు వ్రాయగలరు.

లైక్ చేసి, షేర్ చేయగలరు

మీ విధేయులు

మల్లాప్రగడ


ప్రాంజలి ప్రభ  తెలుగు నేర్చుకునే వారిని దృష్టిలో పెట్టుకొని నిర్వాహకులు శ్రీదేవి రామకృష్ణ గారు చందస్సు మూడవ పాఠము.. (4)


జగణం.. I U  I ( ఒక గురువు రెండు లఘువులు  )


పాఠము.. ప్రాంజలి.. (4) (తొమ్మిది అక్షరాలు ప్రాస అంత్యాను ప్రాస ఉండాలి )

ఉదాహరణలు


1..నిరంతర మే మది సాగు

 పరం తపమే విధి వేగు

 భరించు విధానము రేగు

 వరించి జయమ్మన కాగు


2..విశాల వినమ్రతగాను

 ప్రశాంతి సుఖోన్నతగాను

 అశోకము శోభను గాను

 పాశముయు బంధముగాను


 3..విధాన సహాయము గాను

 నిదాన మదీ సుమ గాను

 ప్రధాన జపమ్ములు గాను

 సుధా మధుపమ్ముగ గాను


4..మురారి ముభావము యేల

విరోధి భవమ్ముగ యేల

సరాగము రాగము యేల

చిరాకుగ నుండుట యేల


5..స్థితీ మది పెంచుటయేను

 ప్రతీ విధియాడుటయేను

 సతీ సహనమ్ము గ యేను

పతీ సహ కారిగ యేను


6..ప్రభుత్వము సంతత తృప్తి

 ప్రభుత్వము యంత్రము దీప్తి

 ప్రభుత్వము మంత్రము జాస్తి

 ప్రభుత్వము తంత్రము నాస్తి


7..స్వరాంజలి వాణి నినాద

విరాజిల్లు గాన ప్రమోద

తరాల మనో స్వర మేధ

నిరంతర మౌన సమేధ


8..రుచించదు విద్యగ సేవ

విచిత్ర సహాయము సేవ

సుచిత్ర సుమిత్రగ సేవ

రచించు సకామ్యము సేవ


9.. ఎ మైనను మాయల బుద్ధి

      ఎ మూల ఎతీ రు న సిద్ధి

       ఎ మౌన ఎ రోగ ము శుద్ధి

       ఎ మార్పు ఎ తీర్పున బుద్ధి 


 ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, నాకు తెలిసినవి రాస్తున్నాను, నేను ఆరాధించే సీతా రామాంజనేయుల  కృపాకటాక్షలతో తెలియపరుస్తున్నాను.

తప్పులు తెలపగలరు, మీరు కొన్ని ఉదాహరణలు వ్రాయగలరు.

లైక్ చేసి, షేర్ చేయగలరు

మీ విధేయులు

మల్లాప్రగడ

ప్రాంజలి ప్రభ  తెలుగు నేర్చుకునే వారిని దృష్టిలో పెట్టుకొని నిర్వాహకులు శ్రీదేవి రామకృష్ణ గారు చందస్సు మూడవ పాఠము.. (5)


తగణం.. UU  I ( రెండు గురువులు ఒక లఘువుల  )


పాఠము.. ప్రాంజలి.. (5) (తొమ్మిది అక్షరాలు ప్రాస అంత్యాను ప్రాస ఉండాలి )

ఉదాహరణలు


1.. వచ్చింది పోయింది కాలమ్ము

 నచ్చింది చేసింది పుణ్యమ్ము

 మెచ్చింది ఒప్పింది మార్గమ్ము

 చచ్చింది బాధల్ తొ నిత్యమ్ము 


2..పంచాక సంపాదనే యేది

 ముంచాక గంభీరతా యేది

 లంచాలు పొందాక మేలే ది

 కంచాన యన్నమ్ము గా ఏది


3..దాహమ్ము ద్రోహమ్ము మారేను

 దేహమ్ము లక్ష్యమ్ము తీరేను

 మోహమ్ము మౌనమ్ము కోరేను

స్వాహా మనో భవ్య పారేను


4..హేమంత మాసమ్ము మోక్షమ్ము

 చామంతి పూబంతి వైనమ్ము

ఏమంత రాగమ్ము దీర్ఘమ్ము

 సామంత రాజ్యమ్ము వైరమ్ము


5...ఒక్కొక్క మార్గమ్ము మారేను

 ఒక్కొక్క లక్ష్యమ్ము తీరేను

ఒక్కొక్క రాష్టమ్ము కోరేను

ఒక్కొక్క దేశమ్ము కోరేను


6...ఏమన్న చెప్పాలి కావ్యమ్ము 

రామన్న దూతేను భవ్యమ్ము 

సోమన్న మాటేను తత్త్వమ్ము 

భీమన్న  మార్గమ్ము నిత్యమ్ము


7..ఎవ్వా ని సంగీత విన్నాక

 నవ్వాపి ఆశ్చర్య పడ్డాక

 కవ్వమ్ము చిల్కేను కన్నాక 

సవ్వారి యయ్యేను విన్నాక


8.. కారుణ్య భావమ్ము  కన్నాక

 దారుడ్య ధైర్యమ్ము విన్నాక

ఆరోగ్య మర్మమ్ము మారాక

వైరాగ్య లక్ష్యమ్ము చేరాక


9...ఏమాయ చేసావు యిన్నాళ్ళు

ఏమూల నున్నావు చాన్నాళ్ళు

ఏమేమి చూసావు లోగిళ్ళు

ఏమైన మారావు కొన్నాళ్ళు


ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, నాకు తెలిసినవి రాస్తున్నాను, నేను ఆరాధించే సీతా రామాంజనేయుల  కృపాకటాక్షలతో తెలియపరుస్తున్నాను.

తప్పులు తెలపగలరు, మీరు కొన్ని ఉదాహరణలు వ్రాయగలరు.

లైక్ చేసి, షేర్ చేయగలరు

మీ విధేయులు

మల్లాప్రగడ


ప్రాంజలి ప్రభ  తెలుగు నేర్చుకునే వారిని దృష్టిలో పెట్టుకొని నిర్వాహకులు శ్రీదేవి రామకృష్ణ గారు చందస్సు మూడవ పాఠము.. (6)


రగణం.. U I U  ( రెండు గురువులు ఒక లఘువుల  )


పాఠము.. ప్రాంజలి.. (6) (తొమ్మిది అక్షరాలు ప్రాస అంత్యాను ప్రాస ఉండాలి )

ఉదాహరణలు


1..అచ్యుతం కేశవం మాధురీ 

     ఖచ్చితం రామనాధా గిరీ 

     నచ్చితే వాసుదేవం శిరీ

     మచ్చికే కాలమందే గురీ


 2..కాలమే తీర్పుగా మార్చునే

     మేళమే కూర్పుగా మ్రోగునే 

     తాళమే ఓర్పుగా వేసినే

     గాలమై నేర్పుగా పట్టనే 


3..ఇందిరామందిరం చేతసా

    పొందుకే వందనం చేతసా

    చిందులే పొందుటే చేతసా

     మందులే విందుగా చేతసా


4.. దాసుడై రక్షణా నిత్యమూ

     కాసులే పొందెనే సత్యమూ

     రాసులై వచ్చెనే పైత్యమూ

     ధీసుడై వెల్గెనే ముత్యామూ


5.. శిక్షనే ముందుగా వీలుగా

      రక్షనే దేశమై నాడిగా

      భక్షనే మూర్ఖుడై మొండిగా 

      వీక్షనే మూలమై వేడిగా


6..కల్గుతుందన్న మాటే విధీ

    నల్గుతుందన్న మాటే మదీ 

    మూల్గుతుందన్న మాటే నిధీ

    వెల్గుతుందన్న మాటే సుధీ


7..నాదిగా ఉన్నదా యిక్కడా

    నీదిగా మన్ననే యక్కడా

    మోదమై ఒప్పితీ యిక్కడా 

    వేదమై చెప్పిమై యక్కడా


8..నాదిగా ఉన్నదా యిక్కడా

    నీదిగా మన్ననే యక్కడా

    మోదమై ఒప్పితీ యిక్కడా 

    వేదమై చెప్పిమై యక్కడా


9.. ఉన్నదీ లేనిదీ చెప్పకే

      అన్నదీ ఒప్పుకో మెప్పుకే

      విన్నదీ తెల్పుటే మార్పుకే

      మంచిదీ చెడ్డదీ నేర్పు కే 


ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, నాకు తెలిసినవి రాస్తున్నాను, నేను ఆరాధించే సీతా రామాంజనేయుల  కృపాకటాక్షలతో తెలియపరుస్తున్నాను.

తప్పులు తెలపగలరు, మీరు కొన్ని ఉదాహరణలు వ్రాయగలరు.

లైక్ చేసి, షేర్ చేయగలరు

మీ విధేయులు

మల్లాప్రగడ


1.

ప్రాంజలి ప్రభ  తెలుగు నేర్చుకునే వారిని దృష్టిలో పెట్టుకొని నిర్వాహకులు శ్రీదేవి రామకృష్ణ గారు చందస్సు మూడవ పాఠము.. (7)


మగణం.. U I U  ( మూడు గురువులు )


పాఠము.. ప్రాంజలి.. (7) (తొమ్మిది అక్షరాలు ప్రాస అంత్యాను ప్రాస ఉండాలి )

ఉదాహరణలు

మగణం..UUU

1..దైవత్వంమ్మే పృధ్వీ ప్రేమమ్మే

     ప్రావీణ్యమ్మేలే విశ్వాసమ్మే

     ఆవేశమ్మే లే యర్ధాతమ్మే

     సేవా తత్వమ్మే సాహిత్యమ్మే


2..ఏమమ్మా చెప్పమ్మా యివ్వాలా 

     క్షేమంగా దీపం మే చూపాలా

     నామంమే స్నేహంమై అవ్వాలా

     కామం మే ప్రేమమ్మే నవ్వాలా


3..మాతృత్వమ్మే ప్రేమాతత్త్వమ్మే

    భాత్రుత్వమ్మే స్నేహా భావమ్మే

    పిత్రూ కర్తవ్యమ్మే ధైర్యమ్మే

    శ త్రూ వైనమ్మేలే ద్రోహమ్మే


4..రుద్రయ్యే సర్వమ్మై హృద్యమ్మై 

     రౌద్రమ్మే పాపంమ్మే శాపమ్మై

     భద్రమ్మే భార్యత్వం ప్రేమ మ్మై

     ఆంధ్రా భావం మే సమ్మోహమ్మై


5..సందర్భంబట్టే తీర్మాణమ్మే

     సందేహం బట్టే విశ్వాసంమ్మే

     మీ దారుడ్యoబట్టే ధైర్యమ్మే 

     సద్భావం బట్టే సంతోషమ్మే


6..ద్వేషం వాగ్వాదం వద్దే వద్దూ

     రోషం కోపం ప్రాణంగా సద్దూ

     వేషం చేసే వ్యాపారం హద్దూ

     పోషించే బుద్ధీ యుంటే ముద్దూ


7..అర్థం సర్వార్థం సంఘం మేలే

    అర్థం ప్రేమమ్మే స్నేహమ్మే లే

    అర్థం విశ్వాసం జాడ్యమ్మేలే

    అర్ధం లోకమ్మే నిత్యమ్మే లే


8..ధైర్యం మే సంపాదా విద్యే లే

    సౌర్యమ్మే యుద్ధమ్మే విద్యే లే

    వీర్యమ్మే మోక్షమ్మే విద్యే లే 

    కార్యమ్మై జ్ఞాణమ్మే విద్యే లే


9..హే రంభా సర్వార్ధమ్మే లే

     ప్రారంభం ప్రార్థించే విద్యా లే

     ధీరోదాత్తా దేదీప్యమ్మే లే

     కారుణ్యార్ధా బాలా విఘ్నేశా

    

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, నాకు తెలిసినవి రాస్తున్నాను, నేను ఆరాధించే సీతా రామాంజనేయుల  కృపాకటాక్షలతో తెలియపరుస్తున్నాను.

తప్పులు తెలపగలరు, మీరు కొన్ని ఉదాహరణలు వ్రాయగలరు.

లైక్ చేసి, షేర్ చేయగలరు

మీ విధేయులు

మల్లాప్రగడ




No comments:

Post a Comment