ఓం నమః శివాయ శతకం ఇచ్ఛా చందస్సు
సకామ్యమ్మే జీవమ్ము వినయపు దీక్షా సతిపతే
ప్రకాశమ్మే ధ్యానమ్ము సహనపు రక్షాగతి మతే
వికాసమ్మే విన్యాస వినయపు శిక్షా సమ గతే
సకాలం మే దీనాతి బతుకుకు విద్యా పశుపతే 1
నా మీదే నీ మాయా ప్రభవము సహాయమ్ము సహనమే
ఏమైనా యీ చర్యా భవహర సయోధ్యమ్ము సమయమే
నా మాటా యీపూటా విధిపర యనేకమ్ము ప్రణయమే
నీ మాటే నా స్ఫూర్తీ మనసుగట నీ భక్తి పశుపతీ..4
దుర్మిల వృత్తము స స స స స స సస...9,13,21
కనునాదము తెల్పెద గామనతో గణ నాదము నిత్యము భక్తిగనే
వినుమా మదిమాయల చిక్కులుగా విజయమ్ము గనే సహ శిక్షణనే
నిను కొల్చెద సత్యము నెమ్మికతో సహనమ్ముగనే విధినీడగనే
తణువే తపమై స్థితి తాహతుగా సరితీరుగ నీయర యీశ్వరుడై..7
ఓం నమః శివాయ...3
యతి.. 7
స్వరూపా నాయుష్యే స్వయముగనే నీ ప్రార్ధనగతే
నిరీక్షా ప్రోత్చాహాన్ని సకల శక్తీ యిచ్చిన మతే
పరీక్షా సంకల్పా ఫలమగు భ క్తీ హృద్యము స్థితే
సరాగమ్మే స్వేచ్చా సమర యు క్తీయే పశుపతీ...10
ఓం నమః శివాయ..4
యతి..7
ఇ పుణ్యా దేహమ్మే యిణకుల పరా సేవల శివా
ప్ర పూజ్యా స్నేహమ్మే ప్రమధ గణమై ప్రేమగ హరా
ఉ పాయా పాశ మ్మై పుడమి చరణాలే గతి విభో
స పూజ్యా సౌందర్యో సుగుణ గిరిజా శంకర భవా 17
తే. గీ.సురవర కరి చర్మాంబర పురధర హర
సిరి వరాధి పతి గిరిజా వినయ ధీర
మొరలను వినుమా కేదార మోహన పర
మురిపము నినుగొలుతు శివా ముందరగను 18
శ్రీ శివ సంస్తుతి
మనోజ్ఞ
మనసు సహాయము సర్వ మంత్రపు విద్య సదాశివా
మనువుల లక్ష్యము విశ్వమేయగు సురార్చితా
తనువుల తత్త్వము సామ దానము భవ్య శివా
చినుకుల వర్షము మాయ చిత్తముగా శివా 22
(నజజభర యతి..1౦)
మకుట మహిమ విద్యామాత్ర శంభో జయమ్మున్
పక పక పక సాధ్యా ప్రతి యీశ్వర్ సుఖమ్మున్
చెక చెక చెక సాగే చిరు హాసన్ సమమ్మున్
సకల హృదయ విశ్వాసమ్మహేశున్ గిరీశున్ 23
(ననమయయ..యతి..9)
ఓం నమః శివాయ.5.
దయా హద్యం మేలే తలపు పలుకే దివ్య మగుటే
క్రియా నేస్తమ్మే లే క్రియలు దుడుకే భవ్య మొకటే
ప్రియా భావమ్మే లే ప్రియము చిలికే సవ్య మొకటే
భయా దేహమ్మలే భజన పరమేశా సుఖము యే 24
సీస పద్యమాల.. శివతత్వం
ద్వేషమూ లేదులే తేజమూ కాదులే
అనురాగమూ లేదు ఆత్మ ఒకటి
లోభమూ లేదులే లోలత్వమేనులే
మోహమూ లేదులే మోక్ష మొకటి
మదముయూ లేదులే మాత్సర్య మూ లేదు
ధర్మమూ లేదులే దారి ఒకటి
అర్థమూ లేదులే కామమూ లేదులే
మోక్షమూ లేదులే మేను ఒకటి
పుణ్యమూ లేదులే పూజ్యమూ కాదులే
పాపమూ లేదులే పఠము ఒకటి
సుఖమూ లేదులే సుబ్రతా లేదులే
దుఃఖమూ లేదులే దునుయ మొకటి
మంత్రమూ లేదులే మాయనూ లేదులే
తీర్థమూ లేదులే తీట ఒకటి
వేదములూ లేవు వేకువయూ లేదు
యజ్ఞములూ లేవు యతులు ఒకటి
భోజనమే కాను బోధకునే కాను
తినతగినది కాను చిత్ర మొకటి
యేపదార్థము కాను యేదితినను నేను
మృత్యువునూకాను మునగ నొకటి
సందేహమూ కాను. సంసయమును కాను
జాతి భేదము లేదు జాగు ఒకటి
తండ్రియూ లేడులే .తల్లియూ లేదులే
జన్మయూ లేదులే జ్ఞాన మొకటి
బంధువూ లేడులే బాధ్యతా లేదులే
మిత్రుడూ లేడులే యింతి ఒకటి
గురువూ లేడులే గుర్తుయూ లేదులే
శిష్యుడూ లేడులే శిక్ష ఒకటి
నిర్వికల్పుడనులే నిర్వాహకముగనే
నిర్మాణ కారక నిజము ఒకటి
సర్వత్ర వ్యాపించ సంఘమ్ము నందునే
ఇంద్రియములతోను ఇచ్ఛ ఒకటి
సిరులుగా లేవులే స్థిరముయూ కాదులే
శిక్షణా లేదులే శీఘ్ర మొకటి
సంబంధముయులేదు సద్భావమ్ముయులేదు
బంధమూ లేదులే భక్తి యొకటి
తే. గీ.నిత్యమూ చిదానందపు శివుడు గాను
రూపుడైన గతియు కాను రూపిగాను
నిత్య నిర్వాణషట్కము నియమ మేను
లింగరూపమోక్షమునిచ్చు నిజము ఒకటి 25,26
* * *
నమశ్శివాయ..6
మంచి చెడుల గూర్చి నాల్గు మాటలే నమశ్శివాయ
కంచి చేరు మాట లొద్దు కధలే నమశ్శివాయ
తుంచి వేరు చేయ బుద్ది తప్పులే నమశ్శివాయ
దంచి జాలి చూపు టేల నెప్పులే నమశ్శివాయ 29
మార గలర ధాత్రి జనులు మంచిగాన మశ్శివాయ
గార వించు స్త్రీలు కూడ ఘనతగా నమశ్శివాయ
భార మేదొ బెట్టి తుంచు బ్రహ్మగా నమశ్శివాయ
చేర కోకిల్లమ్మ పాట విందుగా నమశ్శివాయ 30
మధుర మైన స్వరమ తోడ మొప్పగా నమశ్శివాయ
విధిగ సేవ చేయ నీడ విందుగా నమశ్శివాయ
మదిన ప్రియము మనకు గుర్చుముందుగా నమశ్శివాయ
బదుల దిశగ నడవ గలర చిందుగా నమశ్శివాయ 31
భయము వాపు దీవ నిచ్చు బంధమే నమశ్శివాయ
జయము నీకు కలుగు గాక జంత్రమే నమశ్శివాయ
నయమయినది మార్గ మందు వేగమే నమశ్శివాయ
బ్రియము మనకు గూర్చు గాత విశ్వమే నమశ్శివాయ 32
ఉ..భారము నెంచకాలమిది బాధ్యత నుంచని పోరు గొప్ప నా
హారము లేని పేదలకు హాయిని జూపక సర్వ శక్తి యో
దారము జూపకుండగను దారిని మార్చియు శబ్ద యుక్తి మోం
కారము జూపు భక్తిగను కార్యము లన్నియు జేయు యీశ్వరా 33
కలలను తీర్చువేళయిది కాలము నందున సేవ చేసెదా
కలతల మాయతీయగల కమ్మని వాక్కుల భావసంపదా
కలమున జాలువారెగద కావ్యముగావిల సిల్లు వర్ణనా
కలుపుల మొక్కతీయువిధి కల్పనలన్నియు సిద్ధియీశ్వరా 34
మ.కనులున్నా నిను జూడలేము విధిగా కన్నీటిలో మున్గినన్
మనసారా నిను కొల్వలేము తిధిగా మాకష్టముల్ హెచ్చినన్
కనుమా కాలము కష్టనష్టమగు కామత్వమ్ము యే యీశ్వరీ
పెనురోగమ్ములుబాధ పెంచె జనులన్ వీక్షింపవే యీశ్వరా.35
శ్రీ మాత్రే నమః.. నమః శివాయ..8
సీస పద్యము
మధుర స్వప్నమ్మేను మనసు విజయమేను
ప్రభవించిన నవ లావణ్యమౌను
మదన గీతంలోన మనసు పంచే దిగా
పల్లవించిన రాగ పాద మౌను
తారల మది చీర తత్త్వమ్ము గానులే
జాబిలమ్మ దిగొచ్చె జాతరౌను
నెలవంక చూపులు నేల వంక యగుటే
పుట్టి మెట్టినచోటు దోచునౌను
పట్టు కుచ్చిళ్ళ పారాణి పాద మగుట
కట్టుబొట్టుల్లో కమనీయ కావ్య మగుట
శివుని సిరిపంచు పార్వతి స్థితి గతి యగు
చక్కనమ్మ చక్కన్నయ్య చలువ శోభ 37
***
3.3.4-3.4-3.4.4(యతి, ప్రాసయతులతో - )
కలువ పూవు మెరుపులు. కలలొ కనబడు. కనులు కళకళ మిళ మిళ
పలుకు మాట మనసున. పరుగు విధిగను. పగలు సెగలగు కదులుట
తలపు లన్ని కదులుట తహతహ లగుట తరము కదలిక కథలగు
మలుపు లన్ని జరుగుట మనసు తకధిమ మనుగడ జయమగు పిలుపు 38
చెలువమలరు వదనము - చెలియకదనము - జిలుఁగు నిండిన వసనము
తెలుఁగు పదపు మధురిమ - దెలుపు కవితల - దెలుపు వెన్నెల హసనము
లలియె కలల కలిమియొ - లలన చేసెడు - లలిత లాస్యపు చలనము
చిలికి సుధల నొసఁగును - చెలిమి హృది యను - శిలకు ప్రాణపు జ్వలనము 39
...
ఉ. మా. ఒక్కొక చుక్క చక్కనిది కొల్చెడి బుద్దిగ నెత్తు రవ్వగన్
జొక్కపు సిగ్గు నిగ్గులగుచున్ సొగసున్ రస లక్ష్యమేయగన్
జక్కని రూప ధైర్యమగు సంకలనంబు గుణాత్మ దేహమున్
నిక్కపు విద్యనంతయును నిర్మల మే యగు పార్వతీ పతీ 40
తే. గీ.నగ సదన ఘనతరయశ నగరదమున
నవ ధవళకర ధర తత భవభయహర
ప్రమదవర యనవరత సదమ వరద
హర గరళ గళ భవకనద సమనయన! 41
టీక:--నగసదన =పర్వతమే గృహముగా గలవాడా, ఘనతర యశ =అధికతరమైన కీర్తి గలవాడా, నగర దమన =త్రిపురములను అణచినవాడా, నవ=నూతనమైన
ధవళకర=చంద్రుడిని ధర=తాల్చినవాడా, తత =విస్తృత మైన, భవభయహర =సంసార
భీతి నడిగించువాడా, ప్రమదవర=ప్రమదులకు అధీశుడైన వాడా, అనవరత=నిరంతరము, సత్= శ్రేష్టమైన, అమరవరద =దేవతలకు కాపాడువాడా,
హర=హరనామము గలవాడా, గరళ గళ =విషమును కంఠమునందు గలవాడా
భవ=భావనామము గలవాడా,కనద =ప్రకాశమాన మైన, అసమ=బేసిసంఖ్య యన
నయన=నేత్రములు గల శంకరా.
నమః శివాయ.. 8.. మత్తకోకిల
దురాశా వెంటాడే మునిగిన సహాయమ్ము ఘటనే
నిరాశా నిత్యమ్మే నియమమగు దేహమ్ము భజనే
చరాశా వైనమ్మే చరితమగు దాహమ్ము నటనే
స్వరాజ్యమ్మే స్వేచ్చా సమయమగు గౌరీ పతి శివా 42
మ. కష్ట జీవికి పాడి పంటకు కామ్య మేదియు యేలనో
ఇష్ట జీవికి ఎండ మావులు ఈశ్వరేచ్ఛయు యేలనో
ఘోష్టి జర్పిన వర్త మానము హోరమవ్వట యేలనో
రైతురాజుగ బత్కెరోజులు రాజ్యమేలును యీశ్వరా 43
మ. క్రౌంచ పక్షులు చెట్టు కొమ్మన కామ్య మాటలు పల్కగా
పంచ రంగుల బాల భవ్యుడు పక్షి చూపులు చూడగా
మచ్చి కైనవి బోసి నవ్వుల మార్గమవ్వును హాయిగా
మంచిమాయయు నవ్వుఅందపు మందబుద్దియు యీశ్వరా 44
అన్నదమ్ముల ఒక్క మాదిరి ఆత్మ తత్వము ఉండుటే
కన్న ప్రేమయు భార్య మాటను కామ్య మవ్వుట మన్ననే
ఉన్న దన్నది కల్సి ఉండెటి ఉత్తమోత్తమ కోరికే
చిన్న పెద్దలు తల్లితండ్రుల చేష్ట చూపులు యీశ్వరా 45
అందుకో రమ వల్లభా కర ముల్తొ శోభను చేసుకో
కంది పోయిన లేత వయ్యసు పొందు చేసుకొ ధర్మమై
అందమంతయు జుర్రుకో మది వల్లభా చిరు నాయకా
చందనం సుమ ఘంధమై తరుణం ఇదే పతి యీశ్వరా 46
ఆంధ్ర రాజ్యపు దైవమా అమరావతీ మది సిల్పమా
చంద్రుడాకశ మే మనో భవ జాతి పుర్షుని ప్రేమయే
బుధ్ధి మంతుని ఆశ దీపము భూమి వెల్గుల చిహ్నమే
బుధ్ధభానుని సద్గుణాలను భూరి నేస్తము యీశ్వరా.47
ఇంద్రి యాలను దోష పూరిత యిచ్ఛ ధర్మము వ్రాసెనే
బేధ భావము లోన దేశము బంధ మౌనును వ్రాసెనే
వేద పుర్షుడు ప్రత్య గాత్మను వీణ దల్చియు కళ్ళతో
పాదసేవయు తల్లి తండ్రికి సేవ లక్ష్యము యీశ్వరా 48
ఊయ్యలోలను కాళ్లు చేతులు ఊపి ఆడుచు జీవుడే
కయ్య మోదలి లాలి పాటలు కాల చేష్టలు కన్యలే
వియ్య మోందెటి అత్త మామలు విద్య నేర్పుట బంధమై
సైయనే చిరు కళ్ల హాసపు నౌక మాదిరి యీశ్వరా 49
న విద్యా మోహమ్మై నటన యువతీవక్ష ములపై
భ వమ్మే దాహమ్మై భజన పడతీ ప్రేమమలుపై
సవా ప్రశ్నో ధ్యాసే సమయ వినతీ కోతి చిలిపై
న వాభ్యు ప్రేమమ్మే నయన పిలుపే పార్వతి శివా 51
అగ్నిరగుల్చు నే తునక ఆశలు మార్చును అగ్గి పెట్టె పు
ళ్ళగ్నియు కోపమొచ్చినను లాస్యపు వెల్గులు నగ్గి పెట్టి మో
హాగ్నిని సాకుజూపి విధి ఆటయు మంటలు మాయమాటలే
దగ్నియనే ది శోకముగను దాచిన నిప్పయు అగ్గి యీశ్వరా 52
.......
మ. అగ్ని ఆహుతి మోహ సంపద ఆశ్రి తమ్మయు పెట్టు చి
చ్చాగ్ని హృధ్యము చేరి మండియు చావనీయక కారు చి
చ్చా గ్నిఆర్పక ఆజ్యమే యగు జాష్ట చేష్టలు అగ్గి పె
ట్టాగ్ని కన్నను కోపతాపము తా లనీయని యీశ్వరా 53
చెప్పుకున్నది తోడులేకయు చింత లేలను చిత్రమై
వప్పులాభము లేకపోయిన వాంఛయుండుట మిత్రమై
తప్పితమ్మను నేరబుద్ధియు తాపమేలను చిత్తమై
చెప్పలేనిది యుండియున్నను చేష్టలే మది యీశ్వరా.54
చెలిమి చేసితి నేరమేమియు చింత గల్గుట చిత్తమై
కలిమికోరను సేవచేసెద కాలవాంఛలు చిత్రమై
బలిమికోరిక యైనగమ్యము బాధ్యతే యగు మిత్రమై
మలుపులన్నియు మందబుద్దిగ మాయ చుట్టును యీశ్వరా 55
అర్ధరాత్రి వేళ నీలాకాశంలో తారలు
అరుణోదయవేళ చూడగా నేలమీద థళుక
రాలిన చుక్కల్ని యేరుకొని అతివల ముగ్గులు
చుక్కలు కలిపెడి ఆనందాల ముగ్గుల మల్లిక 56
అందంగా ఒక ఆకృతిగా ముత్యాల వెలుగులు
జాబిల్లి నుండి తారలు దిగివచ్చి తరుణి బావుక
ఆశలు ఆశయాలు ముగ్గుల రూపాలు మెరపులు
పుడమి నొదిగె ముగ్గులు రమ్యత కథల మగువ చురక 57
అలా అన్నీ మాటలే యాత్రలందు
భలే తిండీ చేష్టలే బాధ్యతందు
కలే చెప్పే మోసమే కాలమందు
జలే తృప్తీ పర్చటే జాతి యందు 58
(3,4,5,6మాత్రలు )
శుభ శుభోదయం మనమౌను సుఖము కోర
అభయ యుక్తియు సర్వము యాశ్రయమ్ము
సభలు తీరుమారు జయము సాధ్య మౌను
ప్రభల గీతభావముగాను ప్రతిభ భవుడు 59
అక్షర సత్యమున్ మదీయ భావమున్ ననేక రీతులన్
శిక్షణ బుద్ధిగన్ సకాల శీఘ్రమున్ జయంబు రీతిగన్
రక్షణ చేయవేళగన్ నిరాజ్యమున్ విశాల భావమున్
కక్షలు లేని రీతిగన్ నికామ్యమున్ సహాయ మీశ్వరా 60
త్రికాలజ్ఞానమే త్రివిక్ర తీరుగా త్రినేత్ర జూపులే
వికాస సత్య భావమేను విశ్వమందు వర్ణ తీరుగా
ప్రకాశ లక్ష్యమే ప్రపంచ ప్రా భవమ్ముగాను తృప్తియే
సకాల గొల్పు రీతిలోన సహాయ మే సుధీ యీశ్వరా 61
కలమ్ము వ్రాతలేలు నిత్యకాల నిర్ణయమ్ము కావ్యమున్
ప్రలోభ భావమే మదీయ ప్రాభవమ్ముగాను తెల్పగన్
జలమ్ము గాలితీరు యంబరమ్ముగాను ప్రథ్విలీలగన్
బలమ్ము శక్తి యుక్తి రక్తి బంధమే పరాత్ప రాశివా 62
సమమ్ము వృద్ధి చెందు లీల సార్థకమ్ము గాను లక్ష్యముల్
సమర్ధ లొక్కటైనవేళ దాపునేస కాల సర్పముల్
సుమమ్ము మొంద జేసెవీధి సు ష్టపరంపరమ్ము హేతువుల్
రమత్వ కోతలై, నిజంబు రాజుకున్న చిక్కులే శివా 63
జీవితం క్షణమ్ము స్వర్ణమున్ జపమ్ము యేలగన్ దుఃఖమున్
జీవసత్యమౌను కాలమున్ జయమ్ము నష్టమున్ వ్యర్థమున్
భావ భాగ్యమేను సేవలే భయమ్ము నీడగన్ తోడుగన్
సేవలక్ష్యమే గతీమతీ విశాల ధ్యానమే యీశ్వరా 64
జయన్తి కోరిసేవలే నిజంబుగా జయమ్ము నిచ్చుటన్
నయంబు తోడ వెల్గుచున్న నారతంబు కాతువే ల్పుగన్
ప్రియంబుగా కవిత్వమున్ భవిష్యవాణి యై మనన్ జూడున్
జయంబు గొల్తు రీతిలో ప్రశస్తిగా నొసంగు యీశ్వరా 65
శ్రీ నివాస సేవలన్ని శీఘ్ర మున్ నె జేయ శక్తి నీదిగా
ప్రాణమున్ మనస్సు నిత్య ప్రాకృతీ వినీల యుక్తి నీదిగా
దానమున్ మనమ్ము సత్యధామమున్ యశోకుయుక్తి నీదిగా
మానమున్ సహాయ నిత్యమార్గమున్ చిదంబరా సదాశివా 66
అన్నమన్న రీతి బట్టియే యాదరమ్ముగాను యాత్రమున్
కన్నవారి పేరు యూరునే కానకుండగాను తిర్గుతన్
విన్నమాటలన్ని నమ్ముటే గీతభావ మేల బుద్దిగన్
సన్నుతింతు సేవలన్నియు శీ ఘ్ర లక్ష్యమౌను యీశ్వరా 67
ఎప్పుడో యనకుమా... యేదియో పలుకుగా
సప్పుడే తలపుగా..సత్యమే తెలపగా
నిప్పు నే పట్టుతీ... నిజమ్మే బ్రతుకుగా
ఒప్పులే తప్పులై... ఓటమే భవశి వా 68
ప్రతి పరిచయం ప్రీతిగ వికసితం
ప్రతి పరిణయం ప్రేమగ సముచితం
ప్రతి యనుభవం ప్రేమ చెలిమిగతం
ప్రతి జపమయం ప్రేమ మనసు శివా 69
ప్రేమ పంచె సంబంధమె ప్రీతి నిచ్చు బాం ధవ్యమె
క్షేమ మయ్యె సుఖత్వమ్మె క్షేమ స్వర్గ బంధుత్వమె
సామ బేధ కర్తవ్యమె సంఘ సర్వ కర్తృత్వమె
సాక్షి గమ్య మార్గమ్ముయె సాధ్య ధర్మ సత్య శంభు 70
ప్రవాహమ్మేసాగే ప్రభలు కదులుస్త్రోత్రముగనే
వివాహమ్మే యోగమ్ము విధిగను బంధమ్ముయగుటే
నివాసమ్మే ప్రాణమ్ము నిధిగను విద్యా కదలికే
నవాభ్యు స్సాద్యమ్మేను నటనలు విశ్వేశ్వరునివే 71
ప్రలోభమ్మే భారమ్ము ప్రగతికి కీడే జరుగుటే
విలోలమ్మే సర్వమ్ము విజయము కష్టమ్ము యగుటే
బలో పేతమ్మే నష్ట ప్రతిభ గనే బాధ గనుటే
కళో ళ్లాసమ్మే దృష్ట కళలగు శంభో మది శివా 72
నటించే వారే స్వేచ్ఛ పలుకుల యాకర్షణగుటే
ఫటించే వారే ప్రాభవ మగుట వేదమ్మగుటయే
ఝటించే వారే ఝాఝమగుటయు నాట్యమ్ముగుటయే
తటించే వారే వింత గమనము భవ్యల్ శివ శివా 73
పరంధామా శిద్దేశ్వర వినయ విద్యా ప్రతిభ యే
జ్వరంతత్త్వమ్మే బుద్ధి గుణమగు ప్రజ్ఞా ప్రభవ మే
నరం సాగేయుద్ధమ్ము గతియగు భావమ్ము కళ యే
స్వరం రాగమ్మేలే సరిగమలు శంకర ప్రభువా 74
సతతము నిన్ను గొల్చెద ప్రశాంత మూర్తి స
న్మతి ,సుముఖా, ప్రజాపతి సనాతనా ,శివా
గతియగు ,పాపనాశక, వినిర్మలాకృతీ!
చతురవచోవిదా, సుగుణజాల బ్రోవరా.
సుకేసర వృత్తము
(న జ భ జ ర యతి..11)
నే నను కసువు నీ వను ప్రగతి
నానుడి పరువు నీదను జగతి
నా నట ఋతువు నీదయ సుమతి
నేను పశువుని నీవు పశుపతి 75
విభవముజూడగాదగును,విద్యలన్ కదా
రభసనుజేయగాదగదు,రాజ్యమున్ కదా
సభలను సాహితీగరిమ,సన్నుతిన్ కదా
ప్రభలనునెన్నగాదగును, పార్వతీ పతీ 76
ప్రలోభ క్షేత్రజ్ఞ ప్రగతి దహనమ్మున్ విధిపనే
స్వలాభ ప్రేమత్వ స్వపర మదనమ్మున్ గతిగనే
బలాల స్నేహమ్మోప్ప నడక మనమ్మున్ స్థితిగనే
పొలాలే దేహమ్మో తొడుకగుట శంభో భవ హరా 77
పలుకు నేస్తము నిత్య సత్యము పాఠమౌనును తృప్తిగా
తలపు లన్నియు విద్య వాకిట తత్వ మాయెను సేవగా
మలుపు లున్నటి దారినందున మానసమ్ముయు ప్రేమగా
తెలుపు చుంటిమనస్సు వేగము తీర్పు నీదియు యీశ్వరా 78
శ్రీరామ శ్రీకృష్ణ సమాన
శ్రీ రాజ్యమ్మున్ సామరస్వమ్ము దేవా
శ్రీ రమ్య శ్రీతృప్తి సుకీర్తి
శ్రీ రక్ష మ్మున్ సాధు తత్త్వమ్మహేశా 80
మ. కో. ఏమిటన్నను చెప్పలేనులె యేదిజర్గిన కష్టమే
అక్కడేయిక బత్కుసాగును నాశదేనికి నష్టమే
ఎక్కడైనను తెల్పవచ్చును ఎన్ని మాటలు యిష్టమై
ఏమిటేమిటి నీవు యన్నది యెదొమాయయె యిశ్వరా..81
నీతి కోరి ఒప్పు చేయు నిష్ట కాగ వోర్పుతో
చేత నైన ఒప్పు మాట చింత మాపు నేర్పుతో
భీతి చెంద ముప్పు వచ్చె బేల జూపు మార్పుతో
ఖ్యాతి నెంచ గల్గు బుద్ది కర్మ వల్ల యీశ్వరా 82
నమ్మి నెంచగల్గు సాధనే విదీ మదీయ మౌ
బిమ్ముగా మహేశ్వరీ విచిత్రమే వినోద మౌ
ఇమ్ము శాంతి సహాయమ్ము యీశ్వరీ విధానమౌ
బి మ్మహీన రక్ష ధర్మ శీల విద్య యీశ్వరా 83
కన్ను కానకే కధళ్ళు కాలమాయ దేనికో
మిన్ను నమ్మియే సహాయ మిధ్యయో దేనికో
మన్ను తిన్న మాట బుద్ధిమంద హాస మేలనో
వెన్నెలమ్మ యున్నతేను వేద తీర్పు యీశ్వరా 84
చిన్న విత్తుఁ దీసి మన్ను చిత్తు చేయు సందడే
కన్న వారి వేడి తీరు కాయ కష్టమే సుధీ
విన్న మౌన బుద్ధి మేలు విశ్వ మాయ వెల్గుగా
కన్న సృష్టి చిత్రమే సకామ బుద్ధి యీశ్వరా 85
సీస పద్యము
ఢమఢమ శబ్దము డమరీకము కదల
నటరాజు నర్తించే నవ్య రీత
ఆనంద తాండవ నర్ధంబు హరుడాడె
మూడుకన్నుల వేల్పు మదన హారి
తన్మయాభినయమై తత్త్వము ధ్యానమై
సకలశోకనివార శ్యామకంఠ
పార్వతీ వల్లభా పాఠము తెలుపుమా
పాప వినాశుని పాద పూజ
వినయమునున్న నవీన విహారి కవిత్వ శివా
పనితనమున్న నుపాయ విధానము భక్తి హరా
అణుకువయున్న శుభంకర వెల్పగు భాగ్యధరా
మనమనసన్న సురక్ష సహాయ సమర్ధ శివా 86
మధువు కోరిసమస్య తెచ్చుట మందభాగ్యము యేలనో
వధువు చెంతసుఖమ్ము పంచక వెర్రి వేషము లేలనో
అదుపులేక వితండ వాదపు యాస లన్నియు యేలనో
పొదుపుయంటు సహాయమేయని పోరుచేమదియీశ్వరా.. 87
కం.సృష్టి సహజమే సృజను ల
దృష్టిగ సారించ మదియు ధృతిగా బొందే
అష్ట కళలు సిద్ధులు గా
స్పష్టత సరళ జనులగుట సంకల్ప శివా 92
కం.శ్రీశంకర కరుణాకర
పాశముల నుడుపు మహేశ పార్వతితోడన్
కాశీవాసాశంభో
శ్రీశుని కొలువుడ నతిగొను చిన్మయరూపా| 93
కం.నూతన వత్చర కాంక్షలు
ప్రతిమల్ మణుజుల్ మమతగు ప్రముఖమ్మేలే
ప్రతినన్ బూనుట జయమే
ప్రతి రూపముసంతసమ్ము ప్రభలే శంభో 94
గుణమున్నున్ మనగతియే
వినయమ్ము న్ విధిగ వాంఛ విజయమ్మేలే
మన సౌఖ్యమ్మున్ నిధిగన్
తనమన యన జూడకేను తత్త్వము శంభో 95
నూతన యాశయ లక్ష్యము
ప్రతినిత్యముగా శుభంబు ప్రతిభ కేలే
మాతా పితురుల సేవే
ప్రతిదీ సత్యమగుటేను ప్రభలే శంభో 96
మౌనం బలహీన మనకు
మోనం ప్రేమ మది చిహ్నమౌ ననుటేలే
మౌనం ఓర్పు నిదర్శన
మౌనం సత్య ఫలితమగు మోక్షము శంభో 97
సొంత పెరటి పువ్వు వెలుగు
కంత కలదు మింట నందు కాలపు తీర్పే
వెతల చెలిమి యగుట విదీ
కతలే భువిన భవ బంధ కామ్యము శంభో 98
విజయమ్మును కోరుటయే
ప్రజలకు శోభల్ విధి నిధి ప్రముఖమ్మేలే
రాజసమేలుట నిత్యము
భోజన లక్ష్యము మనసుకు భజనే శంభో 99
క్రొత్తదగుసాలు శుభమును
క్రొత్తతలఁపులఁగలిగించి కూర్మినియొసఁగున్
సత్తువపేర్మియుసంపద
మొత్తమునిడుమని యడిగెద మోదము శంభో 100
మరిచిరి పంచాంగమునే
మరచిరి మన సంస్కృతి స్థితి మన్నన యేలా
మరచిరి తిండియు వేషము
మరచిరి జననీ జనకులు మానస శంభో 101
----
No comments:
Post a Comment