Monday, 25 December 2023




శుభ శుభోదయం మనమౌను సుఖము కోర

అభయ యుక్తియు సర్వము యాశ్రయమ్ము

సభలు తీరుమారు జయము సాధ్య మౌను 

ప్రభల గీతభావముగాను ప్రతిభ భవుడు                  59


అక్షర సత్యమున్ మదీయ భావమున్ ననేక రీతులన్

శిక్షణ బుద్ధిగన్ సకాల శీఘ్రమున్ జయంబు రీతిగన్

రక్షణ చేయవేళగన్ నిరాజ్యమున్ విశాల భావమున్

కక్షలు లేని రీతిగన్ నికామ్యమున్ సహాయ మీశ్వరా  60


త్రికాలజ్ఞానమే త్రివిక్ర తీరుగా త్రినేత్ర జూపులే

వికాస సత్య భావమేను విశ్వమందు వర్ణ తీరుగా

ప్రకాశ లక్ష్యమే ప్రపంచ ప్రా భవమ్ముగాను తృప్తియే

సకాల గొల్పు రీతిలోన సహాయ మే సుధీ యీశ్వరా   61


కలమ్ము వ్రాతలేలు నిత్యకాల నిర్ణయమ్ము కావ్యమున్

ప్రలోభ భావమే మదీయ ప్రాభవమ్ముగాను తెల్పగన్

జలమ్ము గాలితీరు యంబరమ్ముగాను ప్రథ్విలీలగన్

బలమ్ము శక్తి యుక్తి రక్తి బంధమే పరాత్ప రాశివా        62


సమమ్ము వృద్ధి చెందు లీల సార్థకమ్ము గాను లక్ష్యముల్

సమర్ధ లొక్కటైనవేళ దాపునేస కాల సర్పముల్

సుమమ్ము మొంద జేసెవీధి సు ష్టపరంపరమ్ము హేతువుల్

రమత్వ కోతలై, నిజంబు  రాజుకున్న చిక్కులే శివా     63


జీవితం క్షణమ్ము స్వర్ణమున్  జపమ్ము యేలగన్ దుఃఖమున్ 

జీవసత్యమౌను కాలమున్ జయమ్ము నష్టమున్ వ్యర్థమున్

భావ భాగ్యమేను సేవలే భయమ్ము  నీడగన్ తోడుగన్

సేవలక్ష్యమే గతీమతీ విశాల ధ్యానమే యీశ్వరా        64


జయన్తి కోరిసేవలే నిజంబుగా జయమ్ము నిచ్చుటన్

నయంబు తోడ వెల్గుచున్న నారతంబు కాతువే ల్పుగన్

ప్రియంబుగా కవిత్వమున్ భవిష్యవాణి యై మనన్ జూడున్

జయంబు గొల్తు రీతిలో ప్రశస్తిగా నొసంగు యీశ్వరా    65


 శ్రీ నివాస సేవలన్ని శీఘ్ర మున్ నె జేయ శక్తి నీదిగా

ప్రాణమున్ మనస్సు నిత్య ప్రాకృతీ వినీల యుక్తి నీదిగా

దానమున్ మనమ్ము సత్యధామమున్ యశోకుయుక్తి నీదిగా

మానమున్ సహాయ నిత్యమార్గమున్ చిదంబరా సదాశివా  66


అన్నమన్న రీతి బట్టియే యాదరమ్ముగాను యాత్రమున్

కన్నవారి పేరు యూరునే కానకుండగాను తిర్గుతన్

 విన్నమాటలన్ని నమ్ముటే గీతభావ మేల బుద్దిగన్

సన్నుతింతు సేవలన్నియు శీ ఘ్ర లక్ష్యమౌను యీశ్వరా  67

🙏🙏నమస్కారం🙏🙏*

*ఏపనులు చేయకూడదు? ఏపనులు చేయాలి?*

1. గడప ఇవతల నుంచి భిక్షం వేయకూడదు.

2. ఎంత అవసరమైన  కర్పూరాన్ని ఎండాకాలంలో దానమివ్వకూడదు.

3. మీ శ్రీమతితో చెప్పకుండా ఇంటికి భోజనానికి ఎవర్ని పిలవకూడదు.

4. శుభానికి వెళ్తున్నప్పుడు స్త్రీలు ముందుండాలి. అశుభానికి స్త్రీలు వెనక వుండాలి.

5. ఉదయం పూట చేసే దానకార్యాలు ఏవైనా సరే ఎక్కువ ఫలన్నిస్తాయి.

6. అమంగళాలు కోపంలోను, ఆవేశంలోను ఉచ్చరించకూడదు. తదాస్తు దేవతలు ఆ పరిసరాల్లో సంచరిస్తూ వుంటారు.

7. పెరుగును చేతితో చితికి మజ్జిగ చేసే ప్రయత్నం ఎన్నడు చేయకూడదు.

8. పిల్లి ఎదురొస్తే కొన్ని నిముషాలు ఆగి బయలుదేరాలి. కుక్క ఎదురొస్తే నిరభ్యంతరంగా ముందుకు సాగాలి.

9. చూపుడు వేలితో బొట్టు పెట్టుకోరాదు.

10. పగలు ధనాన్ని సంపాదించాలి. రాత్రి సుఖాలను పొందేందుకు సిద్దపడాలి.

*అన్నం పరబ్రహ్మ_స్వరూపం అని తెలుసుకున్నాం కదా, కొన్ని నిజాలు చూద్దాం*

అరటి ఆకులో భోజనం చేయడానికి/పెట్టడానికి కారణం.. అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది., వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని అనేక రకాల పోషకాలు ఈ అరటిఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి.. మరియు పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి. అందుకే ఇంటికి వచ్చిన అతిధుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశ్యం తోనే అరిటాకులో భోజనం పెడతారు. 

అరటి ఆకులో, విస్తరి ఆకులో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది, ఆరోగ్య వంతులుగా ఉంటారు.

తామరాకులో భోజనం చేయడం వలన ఐశ్వర్యం కలిగి సాష్టాత్ లక్ష్మీ దేవి కటాక్షం కలుగుతుంది.

బాదాం ఆకులో భోజనం చేయడం వలన కఠిన హృదయులవుతారు.

టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది.

జమ్మి ఆకు విస్తరిలో భోజనం చేస్తే లోకాన్ని జయించే శక్తి సంపాదించవచ్చునని తపఃసంపన్నులు జ్ఞానులు చెబుతారు.

1) ధర్మ శాస్త్రం ప్రకారం మన ఇంట్లో మీకు పని వత్తిడుల వల్ల వస్తున్నాను ఆగమని చెప్పి అన్నీ వడ్డించిన విస్తరి/పళ్లెం ముందు కూర్చోరాదు. మనం కూర్చున్న తరువాతే అన్నీ వడ్డించుకుని భుజించాలి. ఎందుకంటే అన్నం కోసం మనం ఎదురుచూడాలి తప్ప మన కోసం అన్నం ఎదురుచూడరాదు. అలా చేస్తే రానున్న కాలంలో దరిద్రం వచ్చే అవకాశం ఎక్కువ. 

2) ఏ దిక్కున కూర్చుని భోజనం చేసినా మంచిదే. తూర్పునకు ముఖం పెట్టి భోజనం చేయడం ఎక్కువ ప్రాముఖ్యం ఉంది. ఎందుకనగా, దీర్గాయుష్షు వస్తుంది.

తూర్పు దిక్కు ఇంద్రునికి ఆధిపత్య స్థానము, సూర్యునికి నివాస స్థానం ఉండటం వలన ప్రాధాన్యమెక్కువ.

పడమర ముఖంగా కూర్చుంటే బలం వస్తుంది.

ఉత్తర ముఖంగా కూర్చుంటే, సంపద వస్తుంది.

దక్షిణ ముఖంగా కూర్చుంటే, కీర్తి వస్తుంది.

*కొన్ని ఎప్పటికీ ఆచరించవలసిన నియమాలు.*

అన్నము తింటున్నప్పుడు అన్నమును మరియు ఆ అన్నము పెట్టువారిని తిట్టుట దుర్భాష లాడతం చేయరాదు.

ఏడుస్తూ తింటూ, గిన్నె/ఆకు మొత్తం ఊడ్చుకొని తినడం పనికిరాదు,దెప్పి పొడువరాదు. 

ఎట్టి పరిస్థితిలో నైనా ఒడిలో కంచం/పళ్ళెము పెట్టుకుని అన్నం తినరాదు, ఇది చాలా దరిద్రము,  అట్టివారికి నరకము ప్రాప్తించును. 

భోజన సమయంలో నవ్వులాట, తగువులాట, తిట్టుకొనుట, గేలిచేయుట నష్టదాయకం.

భోజనానంతరము ఎంగిలి ఆకులు / కంచాలు ఎత్తేవాడికి వచ్చే పుణ్యం, అన్నదాతకు కూడారాదు.

 నీవు చేసే పనుల వలన ఇతరులు ఇబ్బంది పడకుండా ఉండాలి. ఆనందమే విజయానికి సోపానం.

సర్వేజనా సుఖినోభవంతు.

ఇది సేకరణ

🙏🙏🙏🙏

ఫిలాసఫీ ని బోధించే ఒక ప్రొఫెసర్ గారు తన తరగతిలో బల్ల మీద కొన్ని వస్తువులతో నిలుచుని ఉన్నాడు.
 విద్యార్థులు మౌనంగా, ఆయన చెప్పేది వినడానికి సిద్ధంగా ఉన్నారు.

కొన్ని క్షణాల తర్వాత, ప్రొఫెసర్ తను తెచ్చిన వస్తువుల్లోంచి ఓ పెద్ద ఖాళీ గాజు జాడీని, కొన్ని గోల్ఫ్ బంతులని బయటకి తీసారు. గోల్ఫ్ బంతులని ఒక్కొక్కటిగా జాడీలోకి జారవిడిచారు. క్లాసంతా నిశ్శబ్దం.

జాడీ నిండిందా ?
 అని విద్యార్థులని అడిగారు ప్రొఫెసర్.

పూర్తిగా నిండిందని వాళ్ళు ఒప్పుకున్నారు.

అప్పుడు ప్రొఫెసర్ తను తెచ్చిన గులకరాళ్ళ కవరు విప్పి, వాటిని కూడా జాడీలో జారవిడిచారు. జాడీని కొద్దిగా కదిలించారు. గులక రాళ్ళన్ని గోల్ఫ్ బంతుల మధ్యకి, అట్టడుగుకి చొచ్చుకుపోయాయి.

క్లాసంతా నిశ్శబ్దం.

జాడీ నిండిందా ?
అని విద్యార్థులని అడిగారు ప్రొఫెసర్.
పూర్తిగా నిండిందని వాళ్ళు ఒప్పుకున్నారు.

తర్వాత ప్రొఫెసర్ తనతో తెచ్చుకున్న ఒక చిన్న పొట్లంలోంచి ఇసుకని తీసి జాడీలో ఒంపారు.అది జాడీలోకి నిరాటంకంగా జారిపోయింది.
క్లాసంతా ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది.

జాడీ నిండిందా ?
 అని విద్యార్థుల్ని ప్రొఫెసర్ అడిగారు.

"నిండింది! నిండింది!" అంటూ విద్యార్థులు ఒకే గొంతుతో అరిచారు.

అప్పుడు ప్రొఫెసర్ అప్పటి దాకా మూత పెట్టి ఉన్న రెండు కాఫీ కప్పులని దగ్గరికి తీసుకున్నారు. వాటి మీది మూతలను తీసి, కాఫీని జాడీలోకి వొంపారు. ఇసుక రేణువుల మధ్య ఉండే ఖాళీ స్థలంలోకి కాఫీ సులువుగా జారుకుంది.

ఈ చర్యకి విద్యార్థులు విరగబడి నవ్వారు.

కాసేపటికి నవ్వులు ఆగాయి. అప్పుడు ఆ ప్రొఫెసర్ ఇలా అన్నారు --

ఈ జాడీ మీ జీవితాన్ని ప్రతిబింబిస్తోందని గ్రహించండి!

గోల్ఫ్ బంతులు ముఖ్యమైనవి!

  దేవుడు, కుటుంబం, మీ పిల్లలు, మీ అరోగ్యం, స్నేహితులు, ఇంకా మీకు అత్యంత ప్రీతిపాత్రమైన అంశాలు!
మీ సిరిసంపదలన్నీ పోయినా, ఇవి మీతో ఉంటే మీ జీవితం పరిపూర్ణంగా ఉన్నట్లే !.

గులక రాళ్ళు
 మీ ఉద్యోగం, సొంతిల్లు, కారు వంటివి !

ఇసుక - అన్ని చోట్ల ఉండే చిన్నా , చితక విషయాలు!
.
మీరు జాడీని ముందుగా ఇసుకతో నింపేస్తే, గోల్ఫ్ బంతులకి, గులక రాళ్ళకి అందులో చోటుండదు!

జీవితంలో కూడ ఇంతే!

మనం ఎప్పుడూ అంతగా ప్రాధాన్యత లేని చిన్న చిన్న విషయాలకి అత్యంత ప్రాముఖ్యతనిస్తూ, అసలైన, ముఖ్యమైనవాటిని విస్మరిస్తూంటాం.

మీకూ, మీ వాళ్లకు సంతోషం కలిగించే వాటిపైనే దృష్టి నిలపండి.

మీ పిల్లలతో హాయిగా ఆడుకోండి.

మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

అప్పుడప్పుడు మీ జీవిత భాగస్వామిని బయటకి డిన్నర్‌కి తీసుకెళ్ళండి.

మీరు 18 ఏళ్ళప్పుడు ఎలా ఉన్నారో, అంతే ఉత్సాహంగా, ఉల్లాసంగా గడపండి.

ఇంటిని శుభ్రం చేసుకోడానికి, నిరూపయోగమైన వాటిని వదుల్చుకోడానికి ఎప్పుడూ సమయం ఉంటుంది
.
గోల్ఫ్ బంతుల వంటి ముఖ్యమైన అంశాలపై ముందు దృష్టి పెట్టండి.

 ప్రాధాన్యతలు నిర్ణయించుకోండి.

 మిగిలేదంతా ఇసుకే" –

క్లాసంతా నిశ్శబ్దం

ఇంతలో ఒక కుర్రాడు తనకో సందేహమన్నట్లు చెయ్యి ఎత్తాడు.

 "మరి కాఫీ దేనికి ప్రతిరూపం?"  అని అడిగాడు.

"శభాష్, ఈ ప్రశ్న అడిగినందుకు నాకు సంతోషంగా ఉంది.

"మీ జీవితం దేనితో నిండిపోయినా,  ఒక మంచి మిత్రుడితో ఓ కప్పు కాఫీకి ఎప్పుడూ అ
వకాశం ఉంటుంది"

 అంటూ ప్రొఫెసర్ క్లాస్ ముగించి వెళ్ళిపోయారు.

( ఒక ఆత్మీయుడు పంపిన పోస్టు ).

***

ఓ వ్యక్తి దగ్గరకు ఒక ఆమె వచ్చి  సర్ నా భర్త చనిపోయాడు నాకు ఇద్దరు  పిల్లలుఇన్నిరోజులు నేను నాలుగిళ్ళల్లో పనిచేస్తూ నా జీవనం సాగించాను ఇప్పుడు కరోనా కాలం కావడంతో నన్ను పని మాన్పించారు నాకు జీవనం పోయింది
ఎలాగైనా నాకు ఒక కుట్టుమిషన్ ఇప్పించగలిగితే నేను నా జీవనం సాగిస్తానని చెప్పింది  అతను అదే విషయాన్నీ సోషమీడియా లో పోస్ట్ చేయగాఒక వ్యక్తి నుండి ఫోన్ వచ్చింది,వారు నిజంగానే సహాయం పొందడానికి అర్హులేనా అని అడిగారుఅవునండి అని సమాధానం చెప్పడంతో సరే నేను కుట్టుమిషన్ తీసిస్తాను మీ నెంబర్ కు డబ్బులు పంపిస్తాను అని చెప్పాడు

వద్దు సర్ మీరు ఆ కుట్టుమిషన్ ఉన్న షాప్ యజమానికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి అని అతని నెంబర్ ఇచ్చాడు
చిన్న ఆటో మాట్లాడుకుని వెళ్ళి కుట్టుమిషన్ తీసుకుని వారికి ఆ మిషన్ కు సంబంధించి దారాలు సూది ఇతర అవసరమైన వస్తువులతో పాటు నెలకు సరిపడే సరుకులు తీసుకుని వెళ్ళి ఆమె ఇంటి ముందు ఆగగా ఆమె ఆశ్చర్యపోయి కనీళ్ళు పెట్టుకుంది

ఆమెకు సాయం చేసిన వ్యక్తిని చూపించడం కోసం వాట్సాప్ వీడియో కాల్ చేయగా అవతలి వ్యక్తిని చూసి ఆశ్చర్యం
ఒక ప్రభుత్వ ఉద్యోగి లేదా బాగా సెటిల్ అయిన వ్యక్తి అయిఉంటాడని అనుకున్న అందరికి ఆశ్చర్యం

అతను 25 ఏళ్ళ పిల్లాడు ఒక సైకిల్ పైన వీధి వీధి తిరుగుతూ టీ అమ్ముతున్నాడుఅతని యజమాని ఎవరైనా సాయం చేస్తున్నారేమో అని వెతికాడు ఎవరూ లేరుఇప్పుడు అతడి గురించి ఆరా తీయాలనే ఆలోచన పెరిగింది

చిన్న తనంలోనే తల్లితండ్రిని పోగొట్టుకుని ఆకలి బాధను అనుభవించాడుపుట్టిన ఊరు వదిలి వచ్చాడు నా అనేవాళ్ళు లేకపోవడంతోఇలా కష్టపడి పనిచేస్తూ వచ్చాడు ప్రతిరోజు అతను 20 మందికి ఆకలి తీర్చడం మొదలుపెట్టాడు
ఇతడి గురించి తెలుసుకున్న ఎంతోమంది సహాయం చేయ ముందుకు వచ్చి డబ్బులు ఇస్తామని చెప్పినా సున్నితంగా తిరస్కరించి ఆ సహాయాలను నిజంగా అర్హులైన వారికి వారిచేత ఇప్పిస్తుంటాడు

అతడి  ఆలోచనకు సలాంఅతడి నిస్వార్థపు సేవకు నమస్కరిస్తున్నకష్టం తెలిసినవాడు ఆ కష్టాన్ని తీర్చాలని ముందుకు వచ్చాడు నిజంగా నిజాయితీగా కష్టపడేవాళ్ళకు దేవుడు ఎప్పుడూ తోడు ఉంటాడు

🌹నా హృదయం 🌹

   

🙏🙏🙏


'' నేను నిన్ను పట్టుకోలేదు , నీవే పట్టుబడ్డావు '' అంది ఆమె.

ఒక మహానగరం లో ఒక గొప్ప శిల్పి వుండేవాడు.

ఆయన శిల్పాలను ఎంత గొప్పగా చెక్కేవాడంటే , పేరు ప్రఖ్యాతులున్న  విమర్శకులు కూడా ఆయన శిల్పాల్లో ఏ చిన్న తప్పునూ  పట్టలేకపోయేవారు.

ఆయన చెక్కిన శిల్పాలున్న పెద్ద గది లోకి వెళితే , అవన్నీ ప్రాణమున్నవాటివిగా , మన పక్కనవున్నట్టు , మనకు చేయి అందిస్తున్నట్టు , మనతో మాట్లాడుతున్నట్టు ... సజీవంగా వుండేవి.

ఎటూవంటివారైనా మంత్రముగ్ధులు కావాల్సిందే !  

ఆ అసాధారణ ప్రతిభ , నైపుణ్యం నెమ్మదిగా అతనిలో అహంభావాన్ని [Ego]  నింపాయి.

ఇదిలావుండగా , ఒకరోజు ఒక జ్యోతిష్కుడు ఆయన చేతిని , జన్మ నక్షత్ర  వివరాలను పరిశీలించి '' మీరు ఫలానా రోజు చనిపోతారు సుమా ! '' అని చెప్పాడు.

శిల్పికి చెమటలు పట్టాయి.
ఆయన ఇలా అనుకొన్నాడు ...

నేను బ్రహ్మ లాంటివాడిని కదా , ఆయన [ బ్రహ్మ ] మనుషులను సృష్టిస్తే , ఆ రూపాలకు నేను ప్రతిరూపాలా అనిపించే శిల్పాలు చేస్తానుకాబట్టి , నేను అపర బ్రహ్మ అవుతాను. మృత్యువు వచ్చిన రోజున నాలాగే వున్న మరో ఏడు శిల్పాలను చెక్కుతాను .

అపుడు మృతుదేవత ప్రాణమున్న శిల్పి ఎవరో , బొమ్మ ఏదో కనుక్కోలేక వాపసువెళ్ళిపోతుంది. నేను మృత్యువుకు దొరకను .

అచ్చు తనలాగా వున్న శిల్పాలు ఏడు చెక్కి , ఆరోజు ఒక దానివెనుక దాక్కొన్నాడు.

మృత్యుదేవత ఆ గది లోకివచ్చింది.

శిల్పి శ్వాసను పూర్తీగా నియంత్రించి కదలకుండా నిలుచున్నాడు.

దేవత వెతుకుతూ వస్తోంది.
ఊపిరిబిగపట్టి చూస్తున్నాడు శిల్పి .
ఇక కనుక్కోలేదు అని అనుకొన్నాడు.
అపుడు దేవత అంది : '' ఈ శిల్పి ఎవరోకానీ , ఎంత అద్భుతంగా శిల్పాలు చెక్కాడు ! కానీ ఈ ఒక్క శిల్పం లోనే అతను ఒక చిన్న తప్పు చేసాడు ! ''  అంతే ! మన అపరబ్రహ్మ కు అహం దెబ్బ తింది. వెంటనే తాను దాక్కొన్నాడు అన్న సంగతి కూడా మరచి కోపంతో
 '' ఎక్కడుంది తప్పు ? అంతా చక్కగావుంది. ఏ తప్పూ లేదు ! '' అనేసాడు.

అపుడు మృత్యుదేవత నవ్వుతూ , '' నాకు తెలుసు అందులో ఏ తప్పూ లేదని. కానీ నిన్ను గుర్తించడానికి చిన్న అబద్ధం చెప్పానంతే. నేనేమీ నిన్ను పట్టుకోలేదు , నీకు నువ్వే పట్టుబడ్డావు ! ప్రాణాధారమైన నీ శ్వాస ను కూడా నియంత్రించగలిగావు కానీ , నీ అహంభావాన్ని మాత్రం నియంత్రించలేక పోయావు, చివరకు అదే నిన్ను పట్టించింది "  అని ఆయన్ను తీసుకెళ్ళిపోయింది.

మనం పెంచుకొనే అహంభావం [Ego] అంత ప్రమాదకరమైనది.

అది సత్యాన్ని చూడనివ్వదు , వాస్తవాన్ని తెలుసుకోనివ్వదు , మనం అనుకొన్నదే కరెక్టు ,  ఇతరులదే తప్పు అని మనం అనుకొనేలాగా చేస్తుంది. నెమ్మదిగా అది స్వార్థానికి దారి తీసి '' నేను బాగుంటే చాలు , నా కుటుంబం బాగుంటే చాలు '' అనుకొంటాము. స్వార్థం ప్రకృతి విరుద్ధం , దైవం నుండి మనకు అందాల్సిన అనుగ్రహన్ని అడ్డుకొనే దెయ్యం స్వార్థం.

మీరు గమనించారా ? '' అహంభావం '' అనే పదం లోంచి  
" అహం " తీసేస్తే మిగిలేది " భావం " అంటే " అర్థం "

అర్థమైతే అనర్థం జరగదు.

--(())--



No comments:

Post a Comment