Wednesday, 6 December 2023




ప్రాంజలి ప్రభను షేర్ చెయ్యండి స్నేహాన్ని పెంచుకోండి


ప్రాంజలి ప్రభను షేర్ చెయ్యండి స్నేహాన్ని పెంచుకోండి


ప్రకృతిలో రామ కృష్ణ తత్వ  కంద పద్యాలు


పువ్వుయె నవ్వెను స్ఫూర్తిగ

నవ్వు పరిమళ మ్మె శోభ నటనలు కావే

రివ్వున గంధసువాసన

గువ్వామువ్వల కదలిక గుణమగు .రామా       109


కులమన గుణవంతుడొకడు

కులము వెలయు గుణము చేత గుర్తే మనసై

వెలయు మనమనే గంధము

అలుముకొని సువాసనేను యడవిన ..రామా    110


నాలుగు చుక్కలుగా తడి

నేల పరవశించి పోయి నింగితొ ప్రేమయు

తలవిత్తుయు మొక్క వెలుగు

బలమై పువ్వుల పరిమళ బంధము   రామా    .111


కుక్క లరుపులై రాజ్యము

మక్కువ కోరికగు పీఠమెక్కుట కొరకై 

సుక్కను తాగిన వరుసా

మెక్కుట మిక్కిలి మనసుగు మొరుగుట . రామా112


శారద శాంభవి శార్వరి

సారదయ ప్రభవము దేవి సద్గతి శోభల్

నీ రమణీయస్ఫూర్తిగ

ధీర మనోహరుని శక్తి దివ్యము ..రామా          113


తడవ తడవకీ యలలే

దడ పుట్టెడిగాలిగాను దరువగు భయమై

పడిపోవు తరువుల కళలు

జడివానా భీకరమ్ము జాగృతి   రామా            114


సమరము మేఘపు లీలలు

అమరిక యే వానలవ్వు యాశలు తీర్చా

సమతా భావన చూపియు

 విమలము నైనది మనసగు విందులు .రామా   115


అడిగిన అణుకువ గమనము

ముడులు అహంకారమైన ముఖ్యము తెలపకు

నడవడికే మంద మతిగ

వడివడి విద్యగ పలుకులు వళదగు .రామా..      116


జీవాత్మ పరిబ్రమలగు

భావము యవ్వన సుఖమ్ము భవభవ మగుటే

సేవాత్మ కదలి సహనము

చివరామరణమ్ము దేహ చేరును రామా .....          117


నీ చరణ కమలములనే

నాచిత్తము చిక్కినదియు నానుడి యనకూ

నీ చిత్త ప్రసాదం

యాచన చాలును బ్రతుకున యార్తియు రామా               0118


అర్థ అనర్ధాల నడుమ

వ్యర్థ పరచుటయు సహనము వ్యసనము ఏలే

స్వార్ధపు బుద్దియు యేలను

అర్ధం పరమార్ధ కళలు యాత్రము రామా        0119


జననం మరణం సహజము

అణుకువ ఆకర్షణలవి అనుభవ మగుటే

తనమన బేధము వలదే 

మనమే యనుటే కళయిక  మనసగు రామా....0120


ఆజ్యం పోసే వారే

రాజ్యం పాలనయగుటయు రవ్వల వెలుగే 

సౌజన్యం యగు కోరిక

భోజ్యం సర్వమయమేను గొప్పయు రామా           0121


కల్లలు బల్కెడు నేతలు

చల్లగ మాటలు తెలుపుచు చిత్తము యనుటే

మెల్లగ దూరియు తప్పులు

 పల్లము చేరు జలముగను పాఠము రామా......     0122


అనుకున్నవి జరగవులే

 అనుకోనివి జరగుటేను యాసయ ఫలమే

 అనుకరణ కలలు తీరును

 అనుమానం లే ని బతుకు యాటలు రామా        0123


శ్వాసలు నిత్య సఫలము వి

శ్వాసము సమయాను కళలు శాంతిని యిచ్చున్

 పాశము బంగారు మనసు

 ఆశల చుట్టూ తిరుగుట ఆత్రము రామా       0124


రావేమో వెన్నెల కళ 

 పోవేమో చీకటి కళ పోరుల శోభల్

 ఏవేవో జరిగి పోవు

 కావేమీ నిజ బతుకులు కాలము రామా      0125


ఎటు చూస్తే యటు వింతగ

 చాటున చిక్కిన సరసము జాతర వెలుగే

 వేటు పడేదియు మహిళా

 నాటు పడవ బతుకులు యివి నమ్మము రామా   0126


ప్రాంజలి ప్రభ ఉదయ రాగ రాధాకృష్ణుల లీలా కందపధ్యాలు నచ్చితే షేర్ చేయగలరు 


భ్రమలు కొలుపు కూటంలో

 విమల చరితమే సహనపు విద్యగ యుండే

 సమరమ్ముకలే సమయము

 సముఖత విముఖత సరిగమ సాధన రాధా     127


సాక్షి జలది దాటేందుకు

 అక్షర సత్యము తెలుపుచు యార్భాటముయే

విక్షణ జన చూపుల కల

శిక్షణ రక్షణ యనుచును సేవలు రాధా               128


భ్రమలు కొలుపు కూటంలో

 విమల చరితమే సహనపు విద్యగ యుండే

 సమరమ్ముకలే సమయము

 సముఖత విముఖత సరిగమ సాధన రాధా       129


ఉదరనిమిత్తార్థము గను 

పొదల బహుకృతమ్ము వేష పోరుగ సాగే

ఆధరము యాశల వెల్లువ

చదరంగం యాట యగుట చపలము రాధా        130


పసిడి మెరుపు విరి మొగ్గగ 

రసికత తెలియని రమణీ రవ్వల వెలుగై 

మసికమ్మి మధుర మాయను

కసికసి చూపుల మయమగు కాలము రాధా       131


తరువాతనయేమి జరుగు

పరువగు బ్రతుకగు కళలగు పాఠము చెప్పా

మరువని మమతలు ముసుగగు

బరువై సాగును వలపుల బంధము రాధా           132


మరుమల్లెయు నవ్వులకళ

విరహాగ్ని మెరుపు పిలుపుకు నిశ్చయ మాయే

అరునోదయ కలయికకే

నూరు తలపులే మనుగడ నూకలు రాధా           133


చిరుగాలికి రెపరెపలే

తరుణమ్ము జపము విలవిల తాపము తోనే

పరుగైసన్నాయి పిలుపు

మెరుగైన మనసు కళయిక మోక్షము రాధా         134


తరిగే మనసును నేనే

కరిగే మంచుగ బ్రతుకగు కాలము తీరే

చెరిగే బుద్దిగ నేనే

ఒరిగే వారికి వరములు ఓర్పుగ రాధా                135


వార్ధక్యం ఒక వరము ని 

 స్వార్ధత విజ్ఞానముగను సమరము చేసే

 ప్రార్ధన విద్యలు నేర్పుట

ఆర్ధిక సంపద యగుటయు అక్షయ మదిలో      136


తెలిపే నీ కళ్ళు యగుట 

తలపులు పొగ మంచు లాగ తరుముతు ఉంటే

అలలై కదెలెడి మనసై

కలవాలని హృదయ తాప కళలే మదిలో..         137


నమ్మేలా జాతకమే

 నమ్మేలా పూజలేలు నాణ్యత భక్తీ

 నమ్మేది మనిషినే మది

 నమ్మేదే ధైర్యమగుట నిర్మల మదిలో.....            138


సున్నిత హాస్యపు చెణుకులు

 ఉన్నత నేస్తమగు సత్య ఊహలు వేరే 

 పెన్నిధి కూటమి సఖ్యత 

 మన్నన ఆధ్యాత్మిక పరమగుటే మదిలో......      139


నవ్వుకు నవరత్నాలే

నవ యవ్వన పెదవి విరియు నవ సావిత్రియు

యువతీ రేఖ అభినయన

జీవితము మలుపు వెలుగులు గీతిక  మదిలో....140


చూపులకే కళ చూడుము

అపురూప మనే వయస్సు యాటలు యివియే

కైపుకు చిక్కుట తపమే

రూపము దీపము యగుటయు ముఖ్యము మదిలో 141


ఇంతకు నే నేవడునో

సంతోష పరచగలిగిన సమయము లేదో 

స్తోత్రశృతిస్మృతులు కళలు

ప్రీతికి పాత్రుడు యగుదును ప్రేమగ మదిలో.          142


జయ జయ మేయగు విధిగా

భయమే మరచియు తెలిపెను పాండిత్య కళే

నియమాలు తెలుగు పలుకులు

నయనాల వెలుగు కథలగు నవవిధ మదిలో           143


జయ జయ మేయగు విధిగా

భయమే మరచియు తెలిపెను పాండిత్య కళే

నియమాలు తెలుగు పలుకులు

నయనాల వెలుగు కథలగు నవవిధ మదిలో           144

No comments:

Post a Comment