ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక (15)
సీతా పతీ పద్యకావ్యము
సీసము
శేషతల్పసుఖుడై శోభ పెంపొందంగ
కాలాత్మకపరమై కరుణ రామ
చండకిరణములై జేతిలో ధరియించి
శ్రీపరాత్పర రామ సుఖము పంచు
కౌసల్యాపుత్రుడై కైకేయి కన్నడై
విశ్వామిత్రుని శిషై వినయ రామ
సురముని వరగుణా సౌఖ్యమ్ము పొందేటి
మిధిలాపురజనుల మోద రామ
తేటగీతి
ఘోర తాటక ఘాతక ఘనత రామ
ఘోర మారీచా దనిపాత ఘనత రామ
ఘోర రాక్షస సంహార ఘనత రామ
ప్రాంజలి నోనర్తు రామ నీ పాదములకు
--(())--
సీసము
అనుభూతు లన్నియు అలికాక బంధాన్ని
పెనవేసె లక్ష్యంగా ప్రీతి రామ
పెనుమాయ కమ్మిన పారదోలే నులే
మానవ సంభంద మదిలొ బలిమి
ఎన్నడూ కరగని ఏది అనక ప్రేమ
సుఖముల వెలుగులు సౌఖ్య చెలిమి
నవ్వుల తో మాట నవనీత మల్లెను
నెరవేర్చు కధలను నేర్పు రామ
తేటగీత
ధరణిఁ ధేనువు పితుకంగ దలచితేని
జనుల బోషింపు మధిప వత్సముల మాడ్కి
జనులు పోషింప బడుచుండ జగతి కల్ప
లత తెఱంగున సకల ఫలంబు లొసఁగు
--(())--
సీస పద్యము
పలుకుల రాగము ప్రేరణ మనసుకు
శృతికల్సి ఉండెటి శక్తి నివ్వు
వలపుల భావన వెయ్యెళ్ల వెన్నెల
మాకును అందింప మౌన రామ
తలపుల ప్రేమను తలచియు పొందియు
సౌఖ్యము కల్పించు శోభ రామ
తలుపులు నీకోసం తెరచియు ఉంచాను
నాహృద యములోన నిన్నె రామ
తేటగీత
బువ్వ తిన్నాక ఆకలి తీరు రామ
నీళ్లు తాగాక దాహము తీరు రామ
గాలి పీల్చాక ఆరోగ్య గాడి రామ
గూడు చేరాక శాంతితొ గొడుగు రామ
--(())--
సూర్యుని ద్వాదశ రూపాలు.
1. ఇంద్రుడు :
స్వర్గాధిపతి అయి దుష్టశక్తులను సంహరించాడు.
2. ధాత :
ప్రజాపతియై భూతములను సృష్టించాడు.
3. పర్జన్యుడు:
తన కిరణాలతో నీటిని ద్రవించి, తిరిగి మేఘరూపంలో వర్షించును.
4 త్వష్ట :
ఓషదాలలో, వృక్షాలలో ఫలించే శక్తి.
5. పూష :
ప్రాణులకు ఆహారంలో పుష్టిని కలిగిస్తాడు.
6. అర్యముడు :
దేవతారూపంలో వుంటాడు.
7. భగుడు :
ప్రాణుల శరీరంలో వుండి, వారిని పోషిస్తాడు.
8. వివస్వంతుడు :
ప్రాణులు తిన్న ఆహారాన్ని జీర్నం చేస్తాడు.
9.విష్ణువు :
శత్రువులను నాశనం చేస్తాడు.
10.అంశుమంతుడు :
గాలిలో నిలిచి, ప్రాణాల శ్వాసలకు ఆధారమై సుఖాన్ని ప్రసాదిస్తాడు.
11. వరుణుడు :
జీవులు తాగే నీటిలో వుండి, వారిని రక్షిస్తాడు.
12. మిత్రుడు :
లోకాాలలో మేలుచేస్తూ... చైతన్యాన్ని కలిగిస్తాడు.
🙏🙏🌞🙏🙏🌞🙏🙏🌞🙏🙏
దైవదర్శనం తరువాత...
ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైఃః
మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారూ.
అది ఏమిటంటే..!
"అనాయాసేన మరణం
వినా ధైన్యేన జీవనం
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం."
మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి.
దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి.
"అనాయాసేన మరణం"
నాకు నొప్పి లేక బాధ కానీ లేని
మరణాన్ని ప్రసాదించు.
"వినా ధైన్యేన జీవనం"
నాకు ఎవరి మీదా ఆధారపడకుండా,
నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు.
"దేహాంతే తవ సాన్నిధ్యం"
మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను
నిన్ను దర్శించుకునే విధంగా దీవించు.
"దేహిమే పరమేశ్వరం"
ఓ ప్రభూ నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను.
1. అనుక్షణం నీ ప్రార్ధనలొనే గడిపే విధముగా అనుగ్రహించు.నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు.
2. ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు.
3. నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా
ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు.
ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాధిస్తాడని మరువకండి.
దీనినే దర్పణ దర్శనం అంటారు, మనస్సనే దర్పణం లో దర్శించి, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దహరాకాశన ప్రతిష్టించుకునే ప్రయత్నమే ఈ ప్రక్రియ
లోకా సమస్తా సుఖినో భవంతు..!!
--(())--
ఆంజనేయుడు హనుమ అయిన కథ :
ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైైఃః
👉 ఆంజనేయుడు పెరిగి పెద్ద వాడవుతున్నాడు. ఒక రోజు ఆకలి గా వుందని అమ్మను అడిగాడు ఏమైనా పెట్టమని. ఆమె పండిన పళ్ళు చెట్టుకు వుంటాయి కోసుకొని తినమన్నది. అప్పుడే సూర్యోదయం అవుతోంది అరుణ కాంతితో సుర్యుడు ఉ౦డటం వల్ల పండు గా భావించి ఆకాశానికి యెగిరి సూర్యున్నిపట్టు కొన్నాడు. . ఆరోజు సూర్య గ్రహణం రాహువు సూర్యుని కబళి౦చాలి. తాను చేయాల్సిన పని ఇతను చేయటం చూసి కోపం వచ్చింది. నేరేడు పండు లాగా నల్ల గా వున్న రాహువుని చూసి పండు అనుకోని పట్టుకో బోయాడు. అతను పారిపోయి ఇంద్రుడికి చెప్పాడు. తెల్లని ఐరావతం ఎక్కి ఆయన వచ్చాడు. దాన్ని కబళించాలని మీదకు దూకాడు. ఇంద్రునికి, ఆశ్చర్యము,కోపమూ వచ్చి వజ్రాయుధాన్ని ముందుగా తర్వాత బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. నోటిలో సూర్య బింబాన్ని వుంచుకొనే ఆంజనేయుడు ఆ రెండిటినీ రెండు వెంట్రుకలతో ఎదుర్కొని వాటిని పనికి రాకుండా చేశాడు. దేవతలంతా వచ్చి సూర్యుడు లేక పొతే ప్రపంచానికి చాల నష్టమని,యజ్ఞాది క్రతువులు చేయటం కుదరదని అతనికి నచ్చ చెప్పారు. వాళ్ల మాట విని తాను నోటితో మింగిన సూర్యున్ని వదిలేశాడు.
👉 ఇంద్రునికి కలిగిన పరాభవం మర్చి పోలేక,ఆన్జనేయుడు ఏమరు పాటులో వుండగా మళ్ళీ వజ్రాయుధం విసిరాడు. అది అతని దవుడ కు తగిలి నెత్తురు గడ్డ కట్టి స్పృహ కోల్పోయాడు. వాయువుకు ఈ విషయం తెలిసి వీచటం మానేశాడు. ప్రపంచం గాలి లేక స్తంభించి పోయింది. మళ్ళీ దేవతలందరూ వచ్చారు బ్రహ్మ తన కమండలం లోని నీళ్ళను బాలుని పై చల్లి మూర్చనుంచి మరల్చాడు. దేవతలందరినీ అన్జనేయునికి వరాలు ఇవ్వమని బ్రహ్మ ఆదేశించాడు. దీర్ఘాయువు,బలం,పరాక్రమం,ఆరోగ్యం తేజస్సు,గుణం,బుద్ధి,విద్య,విచక్షణ,ప్రసన్నత,చతురత,వైరాగ్యం,విష్ణు భక్తి,దయ పర స్త్రీ విముఖత ఏ అస్త్రము ఏమీ చేయలేని శక్తిని దేవతలందరూ ఆన్జనేయునికి వరం గా అనుగ్రహించారు. వజ్రాయుధం చేత మరణం ఉండదని,బ్రహ్మాస్త్రం కూడా ఏమి చేయలేదని అయితె దానికి కొద్ది సేపు లొంగి పోవాల్సిన పరిస్థితి వస్తుందనిఅన్నారు. వజ్రాయుధం తగిలినా ఊడి పోకుండా అతని దవడ ఆంటే హనుమ వుంది కనుక అప్పటినుంచి ఆన్జనేయునికి హనుమ అనే పేరు సార్ధకం అవుతుందని చెప్పారు.
👉 విష్ణు మూర్తి లాగ దేవతలను వుద్దరిస్తాడని,రామ కార్యం నేరవేరుస్తాడని,శివునిలా దుష్ట సంహారం చేస్తాడని,లంక లోని రాక్షసులను వదిస్తాడని,త్రిమూర్తుల అవతారం కనుక త్రిమూర్త్యాత్మకుడనే పేరు తో పిలువ బడ తాడని,,దుష్ట గ్రహాలను పారదోల టానికి ప్రతి గ్రామం లో ఆంజనేయ దేవాలయాలు నెలకొల్పుతారని బ్రహ్మ అనుగ్రహించి అంతర్ధానమయాడు. వాయువు మళ్ళీ వీచి సకల ప్రాణి కోటికి ప్రాణ వాయువును అందించాడు. ఇలా ఆంజనేయుడు హనుమ గా మారాడు.
👉 దేవతలిచ్చిన వరాలతో హనుమ విజ్రుమ్భించి సహజ మైన కోతి చేష్టలు చేస్తూ,అందర్నీ బాధిస్తుందే వాడు. అతను భవిష్యత్ లో చేయ బోయే గొప్ప కార్యక్రమాల గురించి తెలిసిన మునులు ఏమీ అనకుండా వుండే వారు. వాళ్ల గోచీలు లాగటం, మడి బట్టలు చిమ్పేయటం చూసి ఒక శక్తి సంపన్నుడైన మహర్షి 'నీ సహజ శక్తిని మర్చిపోతావు 'అని శపించాడు తర్వాత జాలిపడి ఎవరైనా గుర్తు చేస్తే మళ్ళీ శక్తి సంపన్నుదవుతాడని అనుగ్రహించాడు. క్రమంగా అల్లరి తగ్గి మంచి బాలుడనిపించుకున్నాడు. విద్య నేర్చే వయసు వచ్చింది. తల్లి అంజన సూర్యుని అనుగ్రహం పొంది విద్యలు నేర్చుకోమని పంపింది. ఆయన దగ్గరకు వెళ్లి విద్య నేర్పని అడిగాడు. తాను అనుక్షణం తిరుగుతూంటాను కనుక విద్య నేర్పలేను అన్నాడు. తాను కూడా సూర్యుని తో పాటు కదిలి పోతూ,విద్యలు నేర్చాడుఒక కాలు ఉదయపర్వతం మీద,రెండోది పశ్చిమ పర్వతం మీద వుంచి శ్రద్ధ తో విద్య నేర్చాడు. అయిదు వ్యాకరణాలు నేర్పాడు. మిగిలిన నాలుగు నేర్పటానికి వివాహం జరగాలి కనుక తన కుమార్తె సువర్చలను వివాహం చేసుకో మన్నాడు. చేసుకుంటాను కాని నేను బ్రహ్మ చారి గానే వుంటాను దా౦పత్య సుఖం వుండదు. దానికి మీ అమ్మాయి అంగీకరిస్తే నేను సిద్ధం అన్నాడు. ఆమె అంగీకారం తో వివాహం జరిపి మిగిలిన నాలుగు వ్యాకరణాలు నేర్పి నవ వ్యాకరణ పండితుణ్ణి చేశాడు. వీరి కన్యాదానం జ్యేష్ట శుద్ధ దశమి నాడు జరిగింది. సువర్చల తపోనిష్ట తో గడుపు తోంది. గంధ మాదన పర్వతం మీద. హనుమ తల్లి దగ్గరకు వెళ్లి విషయం అంతా చెప్పాడు. ఆమె సంతోషించి 'నాయనా !నాకు వాలి,సుగ్రీవుడు అనే సోదరులున్నారు. నీకు వాళ్ళు మేన మామలు. వారిద్దరికీ బద్ధ వైరం. అందులో సుగ్రీవుడు ధర్మ స్వరూపుడు నువ్వు సుగ్రీవుని చేరి అతనికి రక్షకుడు గా వుండు. నీ పెద్ద మేన మామ వాలితో విరోధం మాత్రం పెట్టుకోకు. నీకు శుభం జరుగుతుంది 'అనిదీవించి పంపింది.
👉 తల్లి మాట విని హనుమ పంపానదీ తీరం లో వున్న చేరి మంత్రి అయాడు. తర్వాత రామ సుగ్రీవులకు సఖ్యత కూర్చిసీతాన్వేషణ కోసం సముద్రం దాటి సీతా, జాడను లంకలో తెలుసు కోని,రాముని ముద్రికను ఆమెకిచ్చి,ఆమె ఇచ్చిన శిరోమణి తీసుకున్నాడు అక్షుడు మొదలైన రాక్షసులను చంపి ఇ౦ద్రజిత్ వేసిన బ్రహ్మాస్త్రానికి బంధితుడై రావణుడి దర్బార్ కు వెళ్లి హిత వచనాలు చెపాడు. వినక తోకకు నిప్పంటిస్తే దానితో లంకా దహనం చేసి,మళ్ళీసీతా దేవిని దర్శించి, సముద్రం దాటి రామసుగ్రీవులను విషయం చెప్పాడు. రాముడిసైన్యం సముద్రుని పై వారధి నిర్మించి లంకను చేరింది. రామ రావణ యుద్ధం లో చాల మంది రాక్షసులను చంపాడు హనుమ. రావణున్ని రాముడు సంహరించాడు. సంజీవి పర్వతం తెచ్చి లక్ష్మణ మూర్చను తొలగించాడు. మైరావణ సంహారం చేసి శ్రీ రామ పట్టాభిషేకం జరిపించి,సేవా తత్పరుడై,రామ కార్య దురంధరుడై,త్రేతా యుగం తర్వాత గంధ మాదన పర్వతం చేరి తారక నామం జపిస్తూ,దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తూ,భక్తుల మనో భీస్టాన్ని నెర వేరుస్తూ రామ భక్త హనుమాన్ గా ప్రజల హృదయం లో చిరస్థాయి గా వున్నాడు భక్త వరదుడైన శ్రీ హనుమంతుడు.
దైవదర్శనం తరువాత...
ఃఃైైైైైైైైైైైైైైైైైైైైైఃః
మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారూ.
అది ఏమిటంటే..!
"అనాయాసేన మరణం
వినా ధైన్యేన జీవనం
దేహాంతే తవ సాన్నిధ్యం
దేహిమే పరమేశ్వరం."
మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి.
దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి.
"అనాయాసేన మరణం"
నాకు నొప్పి లేక బాధ కానీ లేని
మరణాన్ని ప్రసాదించు.
"వినా ధైన్యేన జీవనం"
నాకు ఎవరి మీదా ఆధారపడకుండా,
నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు.
"దేహాంతే తవ సాన్నిధ్యం"
మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను
నిన్ను దర్శించుకునే విధంగా దీవించు.
"దేహిమే పరమేశ్వరం"
ఓ ప్రభూ నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్ధిస్తున్నాను.
1. అనుక్షణం నీ ప్రార్ధనలొనే గడిపే విధముగా అనుగ్రహించు.నీ ప్రార్ధనతో నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకు వెళ్ళు.
2. ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు.
3. నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా
ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు.
ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్లినా ఇప్పుడు చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్ని కూడా మనం అడగకుండానే ఆయనే ప్రసాధిస్తాడని మరువకండి.
దీనినే దర్పణ దర్శనం అంటారు, మనస్సనే దర్పణం లో దర్శించి, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దహరాకాశన ప్రతిష్టించుకునే ప్రయత్నమే ఈ ప్రక్రియ
లోకా సమస్తా సుఖినో భవంత
దేశం లో ఎండలు
భగ భగ వేడి మంటుంటె
మనిషికి తోడైన గాలి
జీవులు ఆవిరవు తుంటె
చెవులకు వినబడే గాలి
ఎటుచూసిన అరుపులుంటె
ఎరుపు కాంతి వేడిగాలి
మనసునే చుట్టి నట్టుంటె
ఎగిసిపడే అగ్ని గాలి
పంచ భూతాలే ఉంటె
విశ్వమే శాంతించాలి
కార్చిచ్చే రగులుతుoటె
చల్లార్చు మార్గముండాలి
ప్రేమయే పంచాలంటె
సుఖమే యిచ్చి పొందాలి
సేవలే చెయ్యా లంటె
నిజమే తెల్పి బతకాలి
నీళ్లునే పోశా రంటె
తరువులన్ని బ్రతకాలి
సుఖమ్మే పొందా లంటె
నిత్యం శాంతి పొందాలి
ఆటలో గెలవా లంటె
పోటీదారులనోదించాలి
జీవితంలో గెలవాలంటె
తోటివారిని ప్రేమించాలి
--(())--
[14:41, 03/03/2021] +91 92915 82862: Swami Vivekananda's Wisdom for Daily Inspiration - Mar 3.
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - మార్చి 3.
Take care! Beware of everything that is untrue; stick to truth and we shall succeed, maybe slowly, but surely. Work on as if I never existed. Work as if on each of you depended the whole work.
అసత్యమైనదానికి దూరంగా ఉండండి; సత్యాన్నే అంటిపెట్టుకుని ఉండండి. మనం విజయం సాధించగలం. ఆలస్యమైనా విజయం సాధించి తీరుతాం. నేనెన్నడూ లేనేలేననే భావంతో పనిచేయండి. మీలో ప్రతిఒక్కరూ, ఎవరిమట్టుకు వారు కార్యభారమంతా తనపైన పడిందనే భావంతో పనిచేయండి.
🧘♂️ఆచార్య సద్బోధ🧘♀️
మనిషి పరిస్థితి ఎలాంటిదంటే అపరిమితానంద హేతువైన పరబ్రహ్మం తనలోనే ఉన్నాడని తెలుసుకోక ఎక్కడెక్కడో అన్వేషిస్తాడు. చివరకు అది తనలోనే ఉందని తెలుసుకుంటాడు.
నిజానికి, తొలి మానవుడి నుంచి ఆధునిక మానవుడి దాకా ఈ అన్వేషణే మానవాళి యొక్క మౌలిక లక్షణంగా కనిపిస్తోంది. అయితే ఎక్కువసార్లు మనిషి ఆ అనంతమైన ఆనందాన్ని, జ్ఞానాన్ని పొందడానికి భౌతికస్థాయిలోనూ, బుద్ధిస్థాయిలోనూ ప్రయత్నించి విఫలమౌతూ ఉంటాడు.
అలా ప్రాపంచిక పద్ధతులతో తన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడం చూసి, ఒక్క క్షణం ఆగి "అయితే వాటిని సాధించడానికి సరైన మార్గం ఏమిటి?" అని ప్రశ్నిస్తాడు.
ఈ ప్రశ్నే మనిషిలో కలిగే అంతర్గతమైన మేలుకొలుపుకు నాంది.
శుభం భూయాత్
శ్రీరమణీయం -(818)
పెద్దలు వాసనలను [సంస్కారాలు] వదిలించుకొమ్మని అంటున్నారే !?"
భగవాన్ శ్రీరమణమహర్షి ఆత్మను తెలుసుకోవాలంటే అనాత్మను వదిలించుకోవాలని అంటారు. సాధారణ జీవితంలో అనాత్మను వదిలించుకోవటం అంటే అవసరంలేని వాటిని వదిలించుకోవడమే. ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తే మనం ఇప్పుడు అవసరంగా భావిస్తున్న వాటిల్లో చాలా అనవసరమైనవేనని క్రమంగా తెలుస్తుంది. అవసరంలేని దాన్ని కూడా అవసరమనిపించేలా చేసేవి మనలోని వాసనలు. ఒక్కొక్క వాసన ఎంత తీవ్రంగా ఉంటుందంటే 20 ఏళ్ల తర్వాత కూడా అది దాని ప్రభావాన్ని చూపించగలదు. మనసు పోకడలపై అవగాహన పెంచుకుంటూ సత్యాన్ని అర్థం చేసుకుంటే గానీ ఈ వాసనల ప్రభావం పోదు !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
అవసరంలేనివన్నీ అనాత్మ భావాలే.. కలలో, ఇలలో ఉన్నవి తలపులే !- [అధ్యాయం -101]
"ఋభుగీత "(286)
"రహస్యోపదేశం"
20వ అధ్యాయము
బాహ్యమైన తేడాలెన్నున్నా ఆత్మవస్తువుగా అన్నీ ఒక్కటే !
ఈ సృష్టికన్నా, వేదం కన్నా పురాతనమైనది దైవం. అందుకే సనాతన నిర్గుణ బ్రహ్మమును వేదాతీతమైనదిగా ఋభువు వివరించారు. వేదంలోని గుణాత్మకమైన వర్ణనకన్నా దైనం ముందు అని ఋబుగీత ఆవిష్కరిస్తుంది. అలాంటి దైవాన్ని దర్శించిన మహాత్ములే గుణాతీతమైన నిర్గుణ బ్రహ్మమును మనకు అవగతం చేస్తారు. వేద ప్రమాణంలో అంతా దైవమే. దైవం కానిది లేదు. అలాంటప్పుడు ఇక ఎక్కువ తక్కువలు లేవు. ఆవు, మేక రెండూ శివుడే అయినప్పుడు ఇక తేడా ఎక్కడిది. వాటివాటి ప్రయోజనాలకు అనుగుణంగా బాహ్యమైన తేడాలున్నాయి. కానీ ఆత్మవస్తువుగా అన్నీ ఒక్కటే. అందుకే దొంగతనం చేసేవాడు, మోసంచేసేవాడు, తెలిసినవాడు, తెలియనివాడు, దగ్గరివాడు, దూరంవాడు అందరూ శివస్వరూపాలని చెప్పింది వేదం !
: 🧘♂️మోక్షం🧘♀️
1) నిత్యకృత్యాలు తీర్చుకుంటే పాపం కానీ పుణ్యం వస్తుందా?రాదు, అవి కేవలం శారీరక అవసరాలు మాత్రమే.
2) చదువుకుంటే పాపము కానీ, పుణ్యం కానీ వస్తుందా? రాదు, జీవనోపాధి లభించి, మన కాళ్ళమీద మనం నిలబడి స్వతంత్రంగా జీవనం కొనసాగించే స్వేచ్ఛ వస్తుంది.
3)సంపదవల్ల పాపం కాని పుణ్యం కానీ వస్తుందా? రాదు, కేవలం మమకారం పెరుగుతుంది.
4) బంధుత్వాల వల్ల పాపము కానీ పుణ్యం కానీ వస్తుందా? రాదు, కేవలం వారి అవసరాలు తీర్చే అవకాశం లేదా మన బాధ్యత నిర్వహించే అవకాశం వస్తుంది.మరి పాపము పుణ్యం ఎలా వస్తాయి?మనం ఇతరులకి చేసే వ్యవహారం తో వస్తాయి."పర పీడనం పాపం, పర హితం పుణ్యం".
5) పాపము, పుణ్యము వల్ల మోక్షం వస్తుందా రాదు. మన సంప్రదాయం ప్రకారం పాపం వల్ల నరకము, పుణ్యం వల్ల స్వర్గం వస్తాయి.స్వర్గము అంటే ఒక ఫైవ్ స్టార్ హోటల్ లాగా. డబ్బులు ఉన్నంతవరకు ఫైవ్ స్టార్ హోటల్ లో నివాసము. డబ్బులు అయిపోయాయి అంటే హోటల్ నుండి బయటకు రావాలిసిందే. స్వర్గం కూడా అంతే. పుణ్యము ఉన్నంతవరకు అక్కడ ఉంటాము. పుణ్యం అయిపోతే, తిరిగి భూలోక ప్రయాణం. ఎందుకంటే తిరిగి పుణ్యం సంపాదించాలిగా.కాబట్టి పుణ్యం వల్ల మోక్షము రాదు. పాపం మోక్షానికి ఆటంకం కాదు.మరి మోక్షం దేని వల్ల వస్తుంది. కేవలం జ్ఞానం వల్ల వస్తుంది. జ్ఞానం అంటే అబేధ దర్శనం. అంటే బేధ దృష్టి లేకపోవడం. శారీరక స్పృహ, వ్యక్తిత్వ స్పృహ, ఉన్నంతవరకు బేధ దృష్టి పోదు. కేవలం ఆత్మ స్పృహ మాత్రమే బేధదృష్టిని తొలగిస్తుంది. దినికి ముందు తన పట్ల తనకి ఉన్న అభిప్రాయాలు పోవాలి. ఇంత వరకు మనని మనం ఒక శరీరం గానే భావించాము, లేదా ఒక వ్యక్తిత్వ అంశంగా భావించాము. ఇలా కాకుండా మనని మనము ఒక ఆత్మ స్వరూపంగా భావించాలి. అందరిలో అదే (ఆత్మచైతన్యం) ఉందని భావించాలి. ఈ జ్ఞానం 🧘♂️మోక్షాన్ని🧘♂️ ప్రసాస్తుంది.
184) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
ఆనందమయ ఈశోఽయం
బహు స్యామిత్యవైక్షత ౹ హిరణ్యగర్భరూపోభూత్సుప్తిః స్వప్నో యథా భవేత్ ౹౹198౹౹*
198. సుషుప్తి అవస్థ స్వప్నావస్థగా మారినట్లే ఆనందమయుడగు ఈశ్వరుడు,
ఒకడైన తాను అనేకులు కావలెనని సంకల్పించినపుడు,
హిరణ్యగర్భుడగును.దాని వలన సకల సూక్ష్మశరీరములతో సంబంధపడును.
క్రమేణ యుగపద్వైషా
సృష్టిర్ జ్ఞేయా యథాశ్రుతి ౹
ద్వివిధశ్రుతి సద్భావాత్
ద్వివిధ స్వప్నదర్శనాత్ ౹౹199౹౹
199. శ్రుతిని అనుసరించి ఈ సృష్టిక్రమముగ జరిగినదనీ, హఠాత్తుగ , ఒక్కసారిగ జరిగినదనీ తెలియవలెను.
ఈ రెండు విధములుగను శ్రుతి వాక్యములు ఉన్నవి.
అనుభవమున కూడా స్వప్నములు సుషుప్తి నుండి క్రమముగను హఠాత్తుగను కూడా కలుగును.
తైత్తిరీయ ఉప.2.1.1, 2.6.1;
బృహదారణ్యక ఉప. 1.2.5.
వ్యాఖ్య:- సర్వత్మ స్వరూపుడైన నారాయణుడు అనేక రూపాల్లో ఉంటాడు అనే సిద్ధాంతం శ్రుతి సమ్మతమైనదే.
సర్వాత్మ భావం ఈశావాస్యోపనిషత్తు నందు,
పరమేశ్వరుడు విశ్వరూపి స్వేచ్ఛగా సర్వప్రాణులలోను సంచరిస్తూ వుంటాడని
-శాం.ప 353.5 నందు వర్ణింపబడినది.
శ్రుత్యాధారిత జ్ఞానసాధన సమ్యక్ జ్ఞానాన్ని ప్రసాదిస్తుందనే విషయం నిర్వివాదాంశం.
శ్రుతిని అనుసరించి ఈ సృష్టిక్రమము జరిగినదనీ, హఠాత్తుగ - ఒక్కసారిగ జరిగినదనీ రెండు విధములుగను శ్రుతి వాక్యములు ఉన్నవి.
అనుభవమున కూడా స్వప్నములు సుషుప్తి నుండి క్రమముగను హఠాత్తుగను కూడా కలుగునని తైత్తిరీయ ఉప.2.1.1, 2.6.1
బృహదారణ్యక ఉప.1.2.5
ఉపనిషత్ వాఖ్యలు.
సుషుప్తి అవస్థ స్వప్నావస్థగా మారినట్లే ఆనందమయుడగు ఈశ్వరుడు ఒకడైన తాను అనేకులు కావలెనని సంకల్పించినపుడు హిరణ్యగర్భుడగును.
దాని వలన సకల సూక్ష్మశరీరముతో సంబంధపడును.ఆ విధముగా అఖండ బ్రహ్మము తన అవిభక్త స్థితిలో సమస్తమునందు వ్యాపించును గనుక సమస్తము అవిభక్త స్థితిలో నున్నది.
అది తనంతటతాను ఘనీభవించినప్పుడు విశ్వమనస్సు ఉదయించును.
విభిన్న భూతములు అత్యంతసూక్ష్మదశలో ఉన్నవను ఉద్దేశము ఆ మనస్సులో ఆవిర్భవించును.
వీని అన్నిటి సమిష్టియే తైజస విరాట్పురుషుడు.ఆయనను సృష్టికర్తయగు బ్రహ్మ అందురు. కావున,ఈ సృష్టికర్త విశ్వవ్యాప్త మనస్సుకంటె వేరేదియుగాడు.
విశ్వములో విభేదమును కల్పించు తత్త్వమగు ఈ అవిద్యలో ఉండవలెనని కోరుకొన్నవాడు ఈయననే.దీని వలన వ్యక్తి ఆత్మను అనాత్మగా భ్రమించును.
మరియు ఈ అవిద్యా ప్రభావమువలననే స్రష్ట ఈ విశ్వమును విభిన్న ప్రాణులతో గూడినదిగా అగుపించునట్లు చేసాడు.దీని వలననే సమస్తవిశ్వము అనంత చైతన్యము తప్ప వేరేదియు కాకపోయినను - అణులేశములవలనను పరమాణువుల వలనను జనించిన ప్రాణులుగానున్నట్లు అగుపించుచున్నవి.
అన్ని ప్రాణులు తన ఆత్మకంటే భిన్నములు కావనీ,తన ఆత్మయే అన్ని జీవులలో నున్న ఆత్మ యనీ దర్శించే జ్ఞాని ఆ దర్శన వివేకము చేత దేనినీ ద్వేషింపక దేవతాస్వరూప భావము నొందును.
: 58)-శ్రీ రామదాసు కీర్తన
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
పల్లవి:-
పాహి రామప్రభో పాహి రామప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో
పాహి రామప్రభో!!
చరణములు:-
1.ఇందిరా హృదయారవిందాధి రూఢ
సుందరాకార నానంద రామప్రభో
ఎందునే చూడ మీ సుందరానందము
కందునో కన్నులింపొంద శ్యామప్రభో!!
2.బృందారకాది బృందార్చిత పదార
విందముల సందర్షితానంద రామప్రభో
తల్లివి నీవె మా తండ్రివి నీవె
మా దాతవు నీవు మా భ్రాత రామప్రభో!!
3.నీదు బాణంబులను నాదు షతృల బట్టి
బాధింపకున్నావదేమి రామప్రభో
ఆదిమధ్యాంత బహిరంతరాత్ముండనుచు
వాదింతునే జగన్నాథ రామప్రభో!!
4.శ్రీ రామరామేతి శ్రేష్ఠ మంత్రము
సారె సారె కును వింతగా చదువు రామప్రభో
శ్రీ రామ నీ నామ చింతనామృత పాన
సారమే నాదు మది గోరు రామప్రభో!!
5.కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు
వెలసితివి భద్రాద్రి నిలయ రామప్రభో
అవ్యయుడవైన ఈ అవతారములవలన
దివ్యులైనారు మునులయ్య రామప్రభో!!
6.పాహి శ్రీ రామ నీ పాద పద్మాశ్రయుల
పాలింపుమా భద్రశీల రామప్రభో
పాహి రామప్రభో పాహి రామప్రభో
పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో!!
🕉🌞🌎🌙🌟🚩
No comments:
Post a Comment