Sunday, 28 March 2021

sto****ries

 

 [ will be manifested".

లేవండి! మేల్కొనండి! ఇకపై నిద్రించకండి (అజ్ఞానాంధకారము నుండి బయటకు రండి). ప్రతి ఒక్కరిలోనూ కోరికలు, దుఃఖాలను తొలగించుకొనే శక్తి ఉంది. నమ్మండి! అప్పుడు ఆ శక్తి ప్రకటితమవుతుంది.


ఓం నమః శివాయ:
46-వేదములు📚((((((((((🕉))))))))))     ఆచార్య వాణి🧘‍♂️
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩

17. వేదాంగములు : ఛందస్సు

((((((((((🕉))))))))))

కవిత్వపు ఛందస్సు పుట్టుక:-

వేదాలను పఠించేప్పుడు స్వరభేదానికై స్థాయిని హెచ్చించటం తగ్గించటం జరుగుతూంటుంది. కాని కావ్యాలలోగాని ఇతర కవనాల్లోగాని ఇది ఉండదు. వేదాలలోని అనుష్టుప్‌ ఛందస్సుని మొదటగా వాల్మీకి వాడాడు - కాని వేదాలలో వలె స్థాయి భేదం లేకుండా, అది ఆయన ప్రయత్న పూర్వకంగా చేయలేదు. రెండు పక్షులలో ఒక దానిని బోయవాడు చంపటం చూచాడు. తన సహవాసి మరణాన్ని చూస్తున్న పక్షి పట్ల కరుణ, బోయవాని పట్ల కోపంగా మారింది. అతనిని ఈ విధంగా శపించాడు;


మా నిషాద ప్రతిష్ఠాంత్వమగమ శ్శాశ్వతీసమాః!యత్‌ క్రౌంచమిథునాదేకమవధీః కామమోహితమ్‌||

''వేటకాడా- నీకెప్పుడూ ఏ శుభమూ కలుగ కుండుగాక, ఆనందంలో ఉన్న క్రౌంచపక్షులలో ఒక దానిని హత మార్చావు''


ఆయన కోపం అప్రయత్నంగానే ఆ విధమైన అక్షర రూపం దాల్చింది.


వాల్మీకి మహర్షి తన ఆవేశానికి ఎంతో చింతించి దీని గురించి ఆలోచించాడు. హఠాత్తుగా ఆయన మనస్సులో ఒక ఆలోచన మెరిసింది. ఆయన జ్ఞాన దృష్టి గల ఋషి, తన శాపము అనుష్టుప్‌ ఛందస్సులో, నాలుగుపాదాలతో, పాదానికి ఎనిమిది అక్షరాలతో కూర్పబడిందని గ్రహించాడు. ఆయనకి ఆవేశం అప్రయత్నంగా పెల్లుబికినట్లే, ఆ అక్షరాల కూర్పు కూడ కవిత్వం వలె అప్రయత్నంగానే జరిగింది. ఆయన ఆశ్చర్య చకితుడయినాడు. బోయవానిని శపిస్తూ పలికిన శ్లోకానికే మరో అన్వయం కుదురుతుంది. ''లక్ష్మీవల్లభా! సుఖదంపతులలో కామమోహితుడైన పురుషుని వధించటం నీకు యశస్కరం'' ఈ పద్యం విష్ణు అవతారమైన శ్రీరామునికి సరిగ్గా నప్పుతుంది. కామాతురుడైన రావణుని వధించటానికి రాముడవతరించాడు. మండోదరిని పెళ్లి చేసుకొని సుఖిస్తున్న రావణుడు పరస్త్రీలను మోహించి, వరించాడు. తన నుండి అప్రయత్నంగా వెలువడిన ఆ శ్లోకం దైవప్రేరితమని వాల్మీకి గ్రహించాడు. సృష్టికర్త, బ్రహ్మ ధైర్యమివ్వటంతో ఆ అనుష్టుప్‌ ఛందస్సులోనే రామాయణ కావ్య నిర్మాణం ప్రారంభించాడు.


వైదిక స్వరాలు లేకుండా (అంటే ఉచ్ఛారణలో భేదం లేకుండా) శ్లోకం జన్మించటమిక్కడే. పరమసత్యాలని తాను ప్రచారం చేయటానికే ప్రజలు తేలికగా కంఠస్థం చేయటానికీ వీలుగా ఉండే మాధ్యమం తనకి అప్రయత్నంగా సంక్రమించిందని సంతోషించాడు ఆయన. ప్రపంచానికి ఆదికావ్యంగా, అనుపమాన సౌందర్యంతో ఆయన రాముని కథను అనుష్టుప్‌ ఛందస్సులో నిర్మించాడు.


వచనాన్ని కంఠస్థం  చేయటం కష్టం - మరచిపోతాము. ఛందోబద్ధమవటం వల్ల కవిత్వాన్ని జ్ఞాపకముంచు కోవటం తేలిక. ఈ కారణం వల్లనే పూర్వపు రోజులలో చాలా విషయాలను కవిత్వంలోనే చెప్పేవారు. అచ్చువేయటం ప్రారంభించిన తరువాత అన్నిటినీ కంఠస్థం చేయవలసిన అవసరం తప్పింది, దేనిని కావాలంటే దానిని గ్రంథస్థం చేయగలగటం వల్ల. ఈ విధంగానే వచనం ప్రాచుర్యంలోకి వచ్చింది. కాని భావవ్యక్తీకరణలో కవిత్వానికి సొగసూ, సౌందర్యమూ, ఓజస్సూ ఎక్కువ.


రామాయణావిర్భావం కేవలం దైవకృపవల్లనే జరిగింది. ఆ ఛందస్సు అప్రయత్నంగా సృష్టింపబడింది. ఇతర స్త్రోత్రాలూ, పూరాణాలూ, కావ్యాలూ, రచింప బడటానికి దారి చూపింది.


కొన్ని ఛందస్సులు:-

ఇంద్రవజ్ర, ఉపేంద్రవజ్ర, స్రగ్ధర-ఇత్యాదివి స్త్రోత్రాలలో, కావ్యాలలో వాడబడే ఇతర ఛందస్సులు. వాటిలో కొన్ని బహుక్లిష్టమైనవి. పండితులేగాని ఇతరులు ఉపయోగించలేరు.


''అనుష్టుప్‌'' ఛందస్సులో పాదానికి ఎనిమిది అక్షరాలుంటాయన్నాను. తొమ్మిది ఉంటే ''బృహతీ'' అవుతుంది. పది ఉంటే ''పంక్తీ'' అవుతుంది. పదకొండు ఉంటే ''త్రిష్టుప్‌'' అవుతుంది. పన్నెండు ఉంటే ''జగతీ'' అవుతుంది. పాదానికి ఇరవై ఆరు అక్షరాలు గల ఛందస్సుని ''ఉద్‌కృతి'' అంటారు. ఇది ''భుజంగ విజృంభితం'' పద్ధతిలోనిది. పాదానికి ఇరవై ఆరు కంటే ఎక్కువ అక్షరాలుంటే ''దండక'' మవుతుంది. వీటిలో కూడ ఎన్నో రీతులున్నాయి.


కొన్ని ఛందోరీతుల పేర్లు సుందరంగా, సముచితంగా, రసాత్మకంగా ఉంటాయి. కొన్ని ఛందస్సులలో అక్షరాలు పులిపిల్ల ఆడుతూ గంతులు వేస్తున్నట్టుగా సాగుతాయి. దీనిని ''శార్దూల విక్రీడిత'' మంటారు. శార్దూలమంటే పులి, విక్రీడిత అంటే ఆట. పాదానికి పందొమ్మిది అక్షరాలుంటాయి. అతిధృతి - అంటే వేగంగల జాతి ఛందస్సు. ప్రతిపాదంలోనూ రెండు అక్షర సముదాయాలుంటాయి. ఒకదానిలో పన్నెండు, మరొక దానిలో ఏడు అక్షరాలుంటాయి. పాకుతున్న పామువలె ధ్వనించే ఛందస్సుని ''భుజంగ ప్రయాత'' మంటారు భుజంగమంటే పాము. 'జగతి' ఛందోరీతి యిది. పాదానికి పన్నెండు అక్షరాలుంటాయి. ప్రతిపాదాన్ని రెండు అక్షర సముదాయాలుగా విభజించాలి. ఒక్కొక్క దానిలో ఆరు అక్షరాలుండేట్టు. ఉదాహరణ : ''మయూరాధిరూఢం మహావాక్యగూఢం'' అన్నప్పుడు మ-యూ-రా-ధి-రూ-ఢం.మ-హా-వాక్య-గూ-ఢం. ఆదిశంకరుని ''సౌందర్యలహరి'' ''శిఖరిణి'' ఛందస్సులో ఉంది. ప్రతిపాదానికి పదిహేడు అక్షరాలుంటాయి (పాదానికి పదిహేడు అక్షరాలు కలవాటికి 'అద్యష్టి' సాధారణ నామం). ఈ పదిహేడు అక్షరాలనీ ఆరు, పదకొండు అక్షర సముదాయాలుగా, రెండుగా, విభజిస్తే ''శిఖరిణి'' అవుతుంది. ''స్రగ్ధర'' అన్న ఛందస్సులో శబ్దాలు ప్రతి ధ్వనిస్తున్నట్టు - వెల్లువవలె నోటి నుండి బయల్వెడలు తున్నట్టు ఉంటాయి. ఇందులో ఇరవై ఒక అక్షరాలుంటాయి పాదానికి. వీటిని ఏడేసి అక్షర సముదాయాలుగా, మూడుగా, విభజిస్తారు.


శ్రీ శంకరాచార్యుల వారు ఈశ్వరునిపైన, విష్ణువుపైన వ్రాసిన స్తోత్రాలు ''కేశాదిపాద'' ''పాదాదికేశ'' అన్న ఛందస్సులో ఉంటాయి. అవి ఈ జాతికి చెందినవే.


ఇంద్రవజ్ర అన్నది ''తిష్టుప్‌'' జాతికి చెందిన ఛందస్సు. పాదానికి పదకొండు అక్షరాలుంటాయి దీనిలో. ఉపేంద్ర వజ్రలో కూడ పదకొండే ఉంటాయి. కాని వేరే విధంగా విభజింపబడుతుంది. ఈ రెంటినీ కలిపితే ''ఉపజాతి'' ఛందస్సు వస్తుంది. కాళిదాసు తన కుమార సంభవాన్ని ఈ ఛందస్సులోనే ప్రారంభించాడు.


ఈ ఛందస్సులు వేదకాలం దాటిన తరువాతి కవిత్వానికీ, స్తోత్రాలకీ సంబంధించినవి. వేదాలలో కనబడే ఛందస్సులు - గాయత్రి, ఉష్నిక్‌, అనుష్టుప్‌, బృహతి, పంక్తి, త్రిష్టుప్‌, జగతి వంటివి.


మంత్రరాజమైన గాయత్రి మహా మంత్రం చెప్పబడిన ఛందస్సుకి ఆ పేరే ఉంది - ''గాయత్రి ఛందస్సు''

సాధారణంగా ఏ దేవతకి సంబంధించినదో, ఆ దేవత పేరే పెడతారు. ''శివపంచాక్షరి'' ''నారాయణ అష్టాక్షరి'' ''రామ త్రయోదశి'' అన్న పేర్లలో దేవత పేరూ, అక్షరాల సంఖ్యా కలిసి యుంటాయి.


గాయత్రి మంత్రానికి దేవత సవిత, గాయత్రి అన్నది ఛందస్సు పేరు మాత్రమే. కాని మంత్రానికి ఛందస్సు పేరే పెట్టారు. శబ్దానికీ, స్వరానికీ దివ్వశక్తి ఉన్నట్టుగానే ఛందస్సుకీ, రచనకీ కూడా ఉన్నాయి. మంత్రానికైనా, శ్లోకానికైనా నాలుగు పాదాలుండాలి మామూలుగా. దీనికి విరుద్ధంగా గాయత్రికి మూడు పాదాలే ఉంటాయి. గాయత్రి అనే ఛందస్సుకి మూడుపాదాలూ, పాదానికి ఎనిమిది అక్షరాలూ - మొత్తం ఇరవై నాలుగు అక్షరాలుంటాయి. మూడు పాదాలు కలిగి యుండటం వల్ల ''త్రిపాద గాయత్రి'' అంటారు. ఇతర గాయత్రి రీతులు కూడా ఉన్నాయి. ఋగ్వేదపు మొదటి మంత్రం - ''అగ్నిమీలే'' - కూడ గాయత్రి ఛందస్సు లోనిదే.


కొన్ని స్తోత్రాలలో 24 అక్షరాల గాయత్రిని నాలుగు పాదాలుగా, ఒక్కొక్క పాదానికి ఆరు అక్షరాలతో విభజిస్తారు.


ఒక్కొక్క పాదానికి ఏడు అక్షరాల చొప్పున మొత్తం 28 అక్షరాలుంటే అది ''ఉష్ణిక్‌'' ఛందస్సవుతుంది.


ఛందస్సు ప్రయోజనం:-

ఏ మంత్రమైనా రూపొందితే, దానిని నిర్దుష్టంగా, సరియైన స్థాయిలో, స్వరంతో పలికే విధానాన్ని నిర్దేశిస్తుంది 'శిక్ష' శాస్త్రం. మంత్రం యొక్క రూపం సరిగ్గా ఉండాలంటే ఛందస్సు అవసరం. ధ్యానమగ్నుడైన ఋషికి భగవంతుని అనుగ్రహం వల్ల గోచరించపబడే ఏ మంత్రానికైనా సరియైన రూపమే ఉంటుంది. అది శ్రమతో కూర్ప బడింది కాదు కదా!


ఒక వేదసూక్తాన్ని గాని, మంత్రాన్ని గాని పఠించేప్పుడు అది మూలం ప్రకారమే ఉన్నదో లేదో తెలుసు కోవటానికి ఛందస్సు ఉపయోగిస్తుంది. మంత్రంలోని అక్షరాలను లెక్క పెట్టినప్పుడు లెక్క కుదరక పోతే తెలిసిన వారినడిగి సరియైన రూపాన్ని తెలుసుకో గలుగుతాము.


వాటంతట అవే ఆవిర్భవించిన మంత్రాలను అట్లా ఉంచినా, కవులు శ్లోకాల రూపంలో తమ భావాలని వ్యక్తీకరించేందుకు ఛందస్సునే ఆశ్రయిస్తారు. సంగీతానికి తాళమెటువంటిదో శ్లోకాలకి ఛందస్సు అటువంటిది. ఒక క్రమంలో ఉండవలసి రావటం వల్ల దానికి స్వతస్సిద్ధంగానే రూపమేర్పడుతుంది, ఛందోబద్ధమైన దానిని కంఠస్థం చేయటం తేలిక.


వేదపాఠాలు ఆదిలో ఎట్లా ఉండేవో అట్లాగే ఒక్క అక్షరం ఎక్కువా, తక్కువా కాకుండా ఉండటానికి కారణం ఛందస్సొక్కేటే. వేదశబ్దాలతో ఆడుకోరాదు. ఏ మాత్రం హెచ్చుతగ్గు జరిగినా వాటి ఆధ్యాత్మికతకు భంగం వాటిల్లుతుంది.


వేదాలకి పాదం - మంత్రానికి నాసిక :-

ప్రతిమంత్రమూ ఏదో దేవతకి అంకితమయి ఉంటుంది. అంటే, ప్రతిమంత్రానికీ ఒక అధిష్ఠాన దేవత ఉంటుందన్న మాట. దానికొక ఛందస్సూ, దానిని లోకానికి అనుగ్రహించిన ఋషి ఉంటారు. ఆయనే ఆ మంత్రానికి ఋషి. మంత్రాన్ని చెప్పే ముందు ఆ ఋషిపేరు తలచుకొని, శిరస్సును తాకటమంటే, ఆయన పాదాలను ఎంతో గౌరవంతో శిరస్సుపై పెట్టుకోవటమన్న  మాట. మంత్రాలను మనకి యిచ్చిన వారు ఋషులే కదా!


మంత్రం యొక్క ఛందస్సు పేరుని చెప్పినప్పుడు ముక్కుని వేలితో తాకుతాము. మంత్రానికి ఒకే పరిరక్షకుడు ఛందస్సు. మంత్రానికి ఊపిరి వంటిదది. అందువల్లనే మన ఊపిరి నియమబద్ధం చేసే ముక్కుని పట్టుకోవటము. ఊపిరి లేక జీవితమే లేదు. ఆ విధంగానే మంత్రాలకి ఛందస్సే ఊపిరి కాని, వేదాలనన్నిటినీ ఒక మూర్తిగా భావిస్తే 'శిక్ష' నాసిక, ఛందస్సు పాదాలూ అవుతాయి.


మనం కాళ్లమీద నిలబడి నట్టే వేదపురుషుడు ఛందస్సనే కాళ్లపై నిలబడుతాడు. కాళ్లులేక పోతే లేచి నిలబడలేము. వేదం యొక్క దేహం నిలబడేది ఛందస్సనే పాదాలపైనే.

🕉🌞🌏🌙🌟🚩

అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩

వినరో భాగ్యము విష్ణుకథ
వెనుబలమిదివో విష్ణు కథ!!


ఆదినుండి సంధ్యాదివిధులలో
వేదంబయినది విష్ణుకథ
నాదించీనిదె నారదాదులచే
వీదివీధులనే విష్ణుకథ!!


వదలక వేదవ్యాసులు నుడిగిన
విదితపావనము విష్ణుకథ
సదనంబైనది సంకీర్తనయై
వెదకినచోటనే విష్ణుకథ!!


గొల్లెతలు చల్లలు గొనకొని చిలుకగ
వెల్లవిరియాయ విష్ణుకథ
యిల్లిదె శ్రీ వేంకటేశ్వరునామము
వెల్లిగొలిపె నీవిష్ణుకథ!!

[15:55, 28/03/2021] +91 92915 82862: భాగవతము
శ్రీగురుభ్యోనమః
🕉🌞🌎🌙🌟🚩

మనము కనులు మూసుకొని ఏదో ఒక దైవీ రూపాన్ని మనసులో ప్రతి నిత్యము చూడడానికి ప్రయత్నము చేస్తూ ఉండాలి.  అలా అంతర్దర్శనము అయినపుడు దానిని ధారణ అంటారు. అపుడు చేస్తున్న స్తోత్రం ఫలవంతముగా ఉంటుంది. ఆ దర్శనము మన లోపల అలా నిలబడి ఉండి, మనకు స్థిరముగా కనిపిస్తే  దానిని 'సాలోక్యము' అంటారు. అపుడు మన మనసుకు కలిగిన పరిపూర్ణ ఆకర్షణ చేత దానికి దగ్గరగా వెళ్లిపోతూ ఉంటే అది 'సామీప్యము' అవుతుంది.


దగ్గరగా వెళ్లిన తరువాత దానితో కలిసి పోతే  దానిని 'సాయుజ్యము' అంటారు. కలిసిపోయిన తరువాత  'అదే' నువ్వుగా ఉంటావు. 'అది' అయి పోతే దానిని 'సారూప్యము' అంటారు. అది తెలుసుకుంటే మనము  భ్రమలో లేకుండా వినయముగా ఉంటాము.

🕉🌞🌎🌙🌟🚩

ఆచార్య సద్బోధన

పవిత్రత ఎన్నడూ సోమరి జీవితంలోకి ప్రవేశించదు.
 

మనస్సు ప్రాపంచిక ఆలోచనలతో, భావాలతో పూర్తిగా నిండిపోతే అది దట్టంగా, భారంగా, స్పందించలేనిదిగా మారిపోతుంది.


మన మనస్సు మొద్దుగా, బరువుగా ఉంటే సాధన సమయంలో ఆధ్యాత్మిక భావాలు ఉదయించవు. జాగరూకతతో, ఆలోచనాపరులై ఉన్నవారి విషయంలో ఇది సంభవించదు. వారి ఉత్సాహం ఎన్నడూ సడలిపోదు. చివరి క్షణం వరకు వారు ఆధ్యాత్మిక సాధనలు విడిచిపెట్టరు. వారు ప్రతీ రోజూ, ప్రతీ కార్యాన్ని ఆధ్యాత్మికమయంగా మలచుకుంటారు.


మనం కూడా ఇలా చేస్తే మన పనులన్నీ ఉన్నతమైన ప్రేరణలతో నిండిపోతాయి. ఇది మన మనోదృక్పథం మీద, మన ఉత్సుకత మీద, మన అప్రమత్తత మీద ఆధారపడి ఉంటుంది.

శుభం భూయాత్

🕉🌞🌎🌙🌟🚩
[15:55, 28/03/2021] +91 92915 82862: శ్రీరమణీయం -(843)
🕉🌞🌎🌙🌟🚩

కోరికలను తగ్గించుకుంటూ పోతే అది ఉత్తమ జీవితానికి దారితీస్తుందా !?"

అంతరంగంలో ఆశను తగ్గించాలంటే బాహ్యజీవనంలో ఏర్పడే కోరికలను తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఆశను నిర్మూలించే కొద్దీ 'స్మృతి' వాడుకోవటం తగ్గుతుంది. స్మృతి అవసరం తగ్గేకొద్దీ మనసు త్రిపుటిగా మారే ప్రక్రియ తగ్గుతుంది. త్రిపుటి ఏర్పడని మనసు ఎప్పుడూ శుద్ధ గ్రహింపుగానే ఉంటుంది. అలా కేవలం శుద్ధగ్రహింపుతో సాగే జీవనమే సహజ సమాధిగా పరిణమిస్తోంది. పెద్దలు సూచించిన ధర్మాజీవనం అలవర్చుకుంటే అది గొప్ప యోగజీవనంతో సమానమై అత్యుత్తమ ఆధ్యాత్మిక స్థితిని మనకు ప్రాప్తింపచేస్తుంది. ధర్మజీవనాన్ని ఆచరించి చూపుతూ మనకు బోధించేందుకే గురువు అవసరం అవుతారు. [నిజానికి] గురువు బహిరంగంగాలేరు. దేహాన్ని గురువని భ్రమిస్తాం. అయితే గురువు తానట్లు భావించరు. గురువు అరూపాత్మ. అది నీలోనిది. అది వెలుగుగా గోచరించేది నిన్ను సరిదిద్దటానికే !

{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
"గ్రహింపు సమయంలోనూ మనసు శుద్ధంగానే ఉంది..!" [అధ్యాయం -104]

🕉🌞🌎🌙🌟🚩
[15:55, 28/03/2021] +91 92915 82862: "ఋభుగీత"(310)
🕉🌞🌎🌙🌟🚩

"బ్రహ్మము"
21వ అధ్యాయము

దైవంతో మన సామ్యత, సమానత్వం స్పష్టంగా తెలియడం అద్వైత జ్ఞానం !

శుద్ధత, అశుద్ధత అనేవి వ్యవహారిక ధర్మాలు. సాపేక్ష అంశాలు స్థిరమైన శుద్ధత, స్థిరమైన అశుద్ధత ఏదీలేదు. అశుద్ధంగా భావించే విసర్జకాలు భూమిని సారవంతంచేసే ఎరువు అవుతున్నాయి. ఎంతో శుద్ధమైన దేవుని నైవేద్యం తెల్లవారితే దాని శుద్ధతను కోల్పోయి దుర్వాసన వస్తుంది. ద్వైతం, అద్వైతం కూడా ఆత్మకు వర్తించవు. ద్వైతం అంటే దైవం వేరుగా ఉన్నాడని చెప్పేది. అద్వైతం అంటే నీకు దైవానికి తేడా లేదని చెప్పేది. సముద్ర తరంగాలు సముద్రంలో అంతర్భాగం. అవి సముద్రంతో సమానంకావు. అలాగని సముద్రానికి భిన్నమూ కావు. దైవంతో మన సామ్యత, సమానత్వం కూడా అలాంటివే అని స్పష్టంగా తెలియడం అద్వైత జ్ఞానం !

🕉🌞🌎🌙🌟🚩
[15:55, 28/03/2021] +91 92915 82862: 🧘‍♂️నీటిలో మునిగితే- అది స్నానం.. నీలో మునిగితే- అది ధ్యానం🧘‍♀️
🕉️🌞🌍🌙🌟🚩

నీలోకి నీవు మునిగిపోవడం నీళ్ళలో మునిగినంత తేలిక కాదు. స్నానానికి సాధనతో పని లేదు. ధ్యానానికి సాధన తప్ప వేరే దారి లేదు.
 

ధ్యానం కుదరడం లేదని ఫిర్యాదు చేసే చాలా మంది చెరువు గట్టున నిలబడి చూసేవారే కాని, నీళ్లలోకి దిగినవారు కారు. తన వద్ద శిష్యరికం చేసిన పూర్వ విద్యార్థిని పిలిపించి బుద్ధుడు ధ్యానం గురించి అడిగాడు. శిష్యుడికి అది రెండో ఎక్కం లాంటిది. రకరకాల ప్రక్రియలు, ధ్యాన దశల గురించి అప్పటికే విశేషంగా చదివి ఉన్నాడు. పరిశోధనలు చేశాడు. ఆ విద్యలో గట్టి పాండిత్యం సాధించాడు. కనుక బుద్ధుడు అడిగీ అడగ్గానే ఎన్నో సాధనా విధానాలను గడగడా వల్లించాడు.


బుద్ధుడు శిష్యుడి కేసి ప్రసన్నంగా చూస్తూ ‘మంచిది భిక్షూ ! ఇక ధ్యాన సమయంలో నీవు పొందిన అలౌకిక అనుభూతులను కొన్నింటిని వివరించు’ అని అడిగాడు. తెల్లబోయాడు శిష్యుడు. నోట మాట రాలేదు.


‘ఎవరికైనా ధ్యానం గురించి పాఠం చెప్పడానికి తగినంత పరిజ్ఞానాన్ని సాధించావే తప్ప నీవు నిజమైన ధ్యానివి కాలేకపోయావు’ అన్నాడు బుద్ధుడు. లోకంలో సాధకులమనుకునే వారిలో చాలా మందిది ఇదే పరిస్థితి.


నిజానికి ధ్యానమంటే గాఢమైన అనుభూతే తప్ప, ఆలోచన కానే కాదు. ధ్యానంలో ఆలోచించడానికి ఏమీ లేదు. వెదురుబొంగు లోపల దట్టంగా అలముకున్న గుజ్జు, పోగులు పూర్తిగా కాలిపోయి, ఖాళీ అయ్యాక- వేణువు కావడానికి సిద్ధమవుతుంది.
 

ముసురుకున్న ఆలోచనలను తుడిచేశాక, ధ్యానం తానుగా మనసులోకి వచ్చి చేరుతుంది. ఆపై నెమ్మదిగా గుండెల్లో ప్రశాంతత ఆవరిస్తుంది. ఆనందం వరిస్తుంది. శరీరం గొప్ప శక్తి కేంద్రమై తరిస్తుంది. ఈలోగానే ఆలోచనలు తిరిగి దాడి చేస్తాయి. పాత జ్ఞాపకాలు తరుముకొస్తాయి. అవి చాలా బలమైనవి. వాటిని ప్రతిఘటిస్తే మనిషి విఫలమవుతాడు. పారిపోతే దొరికిపోతాడు. వాటితో ఘర్షణ వృథా ! సాధకుడు వాటిని స్వేచ్ఛగా లోనికి  అనుమతించాలి. చిరునవ్వుతో పలకరించాలి.


ఆలోచనలకు దారివ్వడమంటే మనసును మచ్చిక చేసుకోవడమని అర్థం. ఆ సాక్షీభూత స్థితిలో మనిషికి, మనసుకు మధ్య స్నేహం కుదురుతుంది. ఆలోచనలనేవి ఎప్పుడూ స్థిరంగా ఉండవు. వేగంగా కదిలిపోతూ ఉంటాయి. వాటంతటవి తొలగిపోయేవరకు మనిషి ఓపిక పట్టాలి. ఆ సంధి సమయంలో మనిషికి సహనమే గొప్ప వరం.


ధ్యానం కోసం వేచి చూసే స్థితికి చేరుకోవడం విజయంలో తొలిమెట్టు. ఆ స్థితిలో మనసులోకి వచ్చి పోతున్నా పట్టించుకోని విషయాలే స్వయంగా మనిషిని ధ్యానంలోకి తోసేస్తాయి. పరిశీలనలోంచి మనసును అనుభూతిలోకి, ఆస్వాదనలోకి నెట్టేస్తాయి. లీలగా మనిషి ధ్యానంలో లీనమవుతాడు.
   

సాధన క్రమంలో ఒళ్ళు జలదరించడం, ఆవలింతలు రావడం, అకారణమైన ఆనందమేదో గుండె తలుపు తట్టడం గాని జరిగితే- అవన్నీ ధ్యానంలో పురోగతికి సూచనలని మనం గ్రహించాలి.


పరమహంస యోగానందగారు చెప్పినట్లు వాటి ప్రోత్సాహంతో మరింత లోతులకు ప్రయాణం సాగించాలి. ఆ అనుభూతులు వాటంతటవే రావాలి తప్ప మనం ఎదురు చూడకూడదు, వాటికోసం ప్రయత్నించ కూడదు. వైకుంఠపాళిలో నిచ్చెనల్లాంటివవి. ధ్యానానికి గమ్యం- ఆ నిచ్చెనలు కావు... పరమపద సోపానం !

🕉️🌞🌍🌙🌟🚩
[15:55, 28/03/2021] +91 92915 82862: 205) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩

యే వదన్తీత్థమేతేఽ పి భ్రామ్యంతే విద్యయాత్రకిమ్ ౹ న యథాపూర్వమేతేషామత్ర భ్రాంతేరదర్శనాత్ ౹౹239౹౹

239. (ఆక్షేపము) ఇట్లు మాయాప్రభావమును వర్ణించువారు కూడ భ్రమకు లోనగుదురు.విద్య వలన,జ్ఞానము వలన కలిగిన లాభమేమి ?
(సమాధానము)జ్ఞానమునకు పూర్వము వలె భ్రాంతి సత్యమని భావింపకుండుటయే.


ఐహికాముష్మికః సర్వః సంసారో వాస్తవస్తతః  ౹ న భాతి నాస్తి చాద్వైత మిత్యజ్ఞాన వినిశ్చయః ౹౹240౹౹

240. అజ్ఞానులకు ఈ లోకము పరలోకములందలి సుఖములే సత్యము.అద్వైతము వారికి తోచదు.లేదనియే వారి నిశ్చయము.

🕉🌞🌎🌙🌟🚩

 [21:09, 28/03/2021] +91 95058 13235: 28.03.2021  సాయం కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - ఉత్తరార్ధము -  ఏబది నాలుగవ అధ్యాయము

శ్రీకృష్ణుడు శిశుపాల, జరాసంధాదులను, రుక్మిని ఓడించుట - రుక్మిణీదేవిని పరిణయమాడుట
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

54.33 (ముప్పది మూడవ శ్లోకము)

యోగేశ్వరాప్రమేయాత్మన్ దేవ దేవ జగత్పతే|

హంతుం నార్హసి కల్యాణ భ్రాతరం మే మహాభుజ॥10489॥

శ్రీకృష్ణుడు రుక్మిని చంపుటకు సిద్ధపడుటను జూచి రుక్మిణి భయవిహ్వలయయ్యెను. పిదప ఆ సాధ్వి తన భర్తపాదములపైబడి దైన్యముతో ఇట్లు విన్నవించుచుండెను-

"ప్రభూ! నీవు పరమయోగుల యొక్క హృదయములయందు నివసించువాడవు. దేహాభిమానులైన మూఢులు నిన్ను తెలిసికొనజాలరు. నీవు బ్రహ్మాది దేవతలకును దేవుడవు, జగన్నాథుడవు. తిరుగులేని భుజబలము గలవాడవు, కల్యాణ స్వరూపుడవు (మంగళప్రదమైన కల్యాణము చేసికొనబోవు చున్నవాడవు). ఎంత దుష్టుడైనను ఇతడు నాకు అగ్రజుడు, నీకు బావమఱద…
[05:09, 29/03/2021] +91 95058 13235: 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉శ్రీమాత్రేనమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్వైత చైతన్య జాగృతి మరియు కాశీవిశాలాక్షీ  అమ్మ సమూహ సభ్యులందరికీ శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
[05:10, 29/03/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః

శ్రీలలితా సహస్రనామ భాష్యము

859వ నామ మంత్రము 29.03.2021

ఓం కాష్ఠాయై నమః
 
పదునెనిమిది నిమేషముల కాలస్వరూపురాలైన జగన్మాతకు నమస్కారము.

ఉపనిషద్వాక్యార్థనిష్కర్ష స్వరూపురాలైన పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి కాష్ఠా యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును ఓం కాష్ఠాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తి శ్రద్ధలతో  ఆరాధించు భక్తులను  ఆ తల్లి  సుఖశాంతులతో, సిరిసంపదలతో జీవనముగడుపునట్లను గ్రహించును.

నిమిషము అనగా రెప్పపాటు. పదునెనిమిది నిమిషముల కాలమునకు కాష్ఠయని పేరు.  అటువంటి పదునెనిమిది నిమిషముల కాలస్వరూపురాలైన పరమేశ్వరి కాష్ఠాయని అనబడినది. దీనినిబట్టి పరమేశ్వరి కాలభేదస్వరూపురాలు.

సప్తశతిలోని పదకొండవ అధ్యాయంలో తొమ్మిదవ శ్లోకంలో

కలాకాష్ఠాదిరూపేణ పరిణామప్రదాయని

విశ్వస్యోపరితౌ శక్తే! నారాయణి! నమోఽస్తుతే॥

ప్రపంచమునకు నీవే కల-కాష్ఠ అనెడి కాలప్రమాణ రూపముతో మార్పులు కల్గించి తుదకు అంతము చేయు శక్తి గలిగిన తల్లీ నీకు  నమస్కారము.

కాష్ఠ అనగా మ్రానిపసుపు. కుమారస్వామి నాభినాళము మ్రానిపసుపుగా పరిణమించినదనియు, కాబట్టి శివశక్త్యాత్మకమనియు మైలారతంత్రమునందు ఒక కథ చెప్పబడినది. శిశువులు జన్మించినపుడు నాభినుండి వ్రేలాడు ఒక సిరకు నాభినాళము అని అందురు. పార్వతీపరమేశ్వరుల కుమారుడు కుమారస్వామి యొక్క నాభినాళము మ్రానిపసుపుగా పరిణమించెనని చెప్పబడినది. దీనిని బట్టి పరమేశ్వరి మ్రానిపసుపు స్వరూపురాలు. ప్రతీతము - అప్రతీతము, ఇంద్రియగోచరము - ఇంద్రియాతీతము - సమస్తము పరమశివుడే అని  వేదాంతవాక్యములన్నియు ఏ తత్త్వమును బోధించుచున్నవో అదియే కాష్ఠ యని అనబడినది. శివుని అష్టమూర్తులలో  ఆకాశమూర్తికి భీముడని పేరు. ఈయనకు పదిదిక్కులందు (అష్టదిక్కులు, భూమి, ఆకాశము)  భార్యలున్నారు. అందులో ఆకాశమూర్తియైన భీమునిభార్యగా పరమేశ్వరి దిక్స్వరూపురాలు. వాయు పురాణమందు భీమదేవుని ఆరవ దేహము ఆకాశము, దిక్కులు భార్యలు, స్వర్గము వారి కుమారుడని చెప్పబడినది. శ్రుతియందు 'పరమేశ్వరి జగత్తును అతిక్రమించినది గనుక కాష్ఠ యగును' అని శ్రుతియందు చెప్పబడినది.

పరమేశ్వరికి నమస్కరించునపుడు ఓం కాష్ఠాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
 పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
[05:10, 29/03/2021] +91 95058 13235: 29.03.2021  ప్రాతః కాల సందేశము

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం

దశమస్కంధము - ఉత్తరార్ధము -  ఏబది నాలుగవ అధ్యాయము

శ్రీకృష్ణుడు శిశుపాల, జరాసంధాదులను, రుక్మిని ఓడించుట - రుక్మిణీదేవిని పరిణయమాడుట
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
54.41(నలుబది ఒకటవ శ్లోకము)

రాజ్యస్య భూమేర్విత్తస్య స్త్రియో మానస్య తేజసః|

మానినోఽన్యస్య వా హేతోః శ్రీమదాంధాః క్షిపంతి హి॥10497॥

బలరాముడు శ్రీకృష్ణునితో ఇట్లు వచించెను "సోదరా! దురభిమానముతో, ధనమదముతో విర్రవీగుచుండెడివారు రాజ్యము కొఱకును, భూమి (ఆస్తి పాస్తుల) కోసము, ధనధాన్యముల కొఱకును, కాంతల విషయమునను, పేరు ప్రతిష్ఠలకోసము, వైభవములను నిలుపుకొనుట కొఱకును, మఱచి, బంధువులను సైతము హింసించుచుందురు.

54.42(నలుబది రెండవ శ్లోకము)

తవేయం విషమా బుద్ధిః సర్వభూతేషు దుర్హృదామ్|

యన్మన్యసే సదాభద్రం సుహృదాం భద్రమజ్ఞవత్॥10498॥

బలరాముడు మరల రుక్మిణితో ఇట్లనెను  రుక్మిణీ! నీ సోదరుడైన ఈ రుక్మి సకల ప్రాణులయెడ ద్వేషభావమునే కలిగియుండెను. కావున అతని మేలునకే ఇట్లు శిక్షించుట జరిగినది. అజ్ఞానులవలె నీవు 'ఈ దండనము తగని పని' యని తలంచుచున్నావు. ఇది నీ బుద్ధి వైషమ్యమే గాని వేఱుగాదు.

54.43 (నలుబది మూడవ శ్లోకము)

ఆత్మమోహో నృణామేష కల్పతే దేవమాయయా|

సుహృద్దుర్హృదుదాసీన ఇతి దేహాత్మమానినామ్॥10499॥

54.44 (నలుబది నాలుగవ శ్లోకము)

ఏక ఏవ పరో హ్యాత్మా సర్వేషామపి దేహినామ్|

నానేవ గృహ్యతే మూఢైర్యథా జ్యోతిర్యథా నభః॥10500॥

54.45 (నలుబది ఐదవ శ్లోకము)

దేహ ఆద్యంతవానేష ద్రవ్యప్రాణగుణాత్మకః|

ఆత్మన్యవిద్యయా కౢప్తః సంసారయతి దేహినమ్॥10501॥

54.46 (నలుబది ఆరవ శ్లోకము)

నాత్మనోఽన్యేన సంయోగో వియోగశ్చాసతః సతి|

తద్ధేతుత్వాత్తత్ప్రసిద్ధేర్దృగ్రూపాభ్యాం యథా రవేః॥10502॥

54.47 (నలుబది ఏడవ శ్లోకము)

జన్మాదయస్తు దేహస్య విక్రియా నాత్మనః క్వచిత్|

కలానామివ నైవేందోర్మృతిర్హ్యస్య కుహూరివ॥10503॥

54.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)

యథా శయాన ఆత్మానం విషయాన్ ఫలమేవ చ|

అనుభుంక్తేఽప్యసత్యర్థే తథాఽఽప్నోత్యబుధో భవమ్॥10504॥

భగవంతుని మాయవలన మోహితులైన వారు దేహాత్మబుద్ధిగలవారై ('దేహమే ఆత్మ' యని భావించుచు) 'ఇతడు మిత్రుడు, ఇతడు శత్రువు, ఇతడు ఉదాసీనుడు' అను భేదబుద్ధిని కలిగియుందురు. అమ్మా! సూర్యుడును, చంద్రుడును ఒక్కొక్కడే ఐనప్పటికిని జలాదులయందు అనేకులుగా భ్రమింపజేయుచుందురు. ఆకాశము ఒక్కటేయైనను ఘటాది భేదముచే వేర్వేఱుగా కన్పట్టుచుండును. అట్లే అన్ని దేహములయందును ఉన్న ఆత్మ ఒక్కటేయైనను ఉపాధి భేదములతో (మానవ పక్ష్యాది దేహములను బట్టి) మూఢులు అనేకములుగా భావించుచుందురు. పంచ మహాభూతములతో, పంచప్రాణములతో, పంచతన్మాత్రలతో, సత్త్వాది త్రిగుణములతో ఒప్పుచుండెడి ఈ దేహము ఆద్యంతములు గలది. అనగా జనన మరణములు గలది. కాని దేహాభిమానము గల జీవుడు అజ్ఞానకారణముగా 'ఈ దేహము శాశ్వతమైనది' అని భావించి సంసారచక్రమున పరిభ్రమించు చుండును. సాధ్వీ! చూచే కన్నులు, చూడబడే రూపములు -ఈ రెండింటినీ ప్రకాశింపచేసేది సూర్యుడు ఒక్కడే. అందువలన సూర్యునితో కన్నులకు, రూపములకు ఎప్ఫుడైనా వియోగము ఉండదు. సంయోగమూ ఉండదు. అదేవిధముగా ఈ జగత్తు అంతయునూ ఆత్మవల్లనే గోచరించును. సమస్త జగత్తును ప్రకాశింపజేయునది ఆత్మయే. కావున అశాశ్వతములైన పదార్థములతో ఆత్మకు ఎటువంటి సంయోగ, వియోగములూ ఉండనే ఉండవు. వృద్ధిక్షయములు చంద్రకళలకేగాని, చంద్రునకు కావు (శుక్లపక్షమున చంద్రకళలు వృద్ధిచెందును. అవి కృష్ణపక్షమున క్షీణించును).  అట్లే జన్మాది షడ్వికారములు శరీరమునకేగాని, ఆత్మకు గావు. అమావాస్య దినమున (కుహూ - సా దృష్టేందుః 'సినీవాలీ' సా నష్టేందుకలా 'కుహూః' - చంద్రకళ కనిపించిన అమావాస్యను సినీవాలి అనియు, చంద్రరేఖ కనబడని అమావాస్యను కుహువు అనియు పేర్కొందురు.అటువంటి కుహువు దినమున) చంద్రుడు లేనట్లుగా అనుకొనుచుందురు. కాని చంద్రుడు ఉండును. అట్లే శరీరము నశించినప్పుడు ఆత్మ నశించినట్లు భ్రమపడుచుందురు. రుక్మిణీ! నిద్రించుచున్నవాడు కలలో వచ్చిన సుఖదుఃఖాదులను ఆత్మయే అనుభవించుచున్నది అని భ్రమపడుచుండును. అట్లే అజ్ఞాని నశ్వరమైన విషయాదుల యందు సుఖదుఃఖాదులను పొందుచుండును.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని ఉత్తరార్ధమునందలి     ఏబది నాలుగవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319, 9505813235
[05:14, 29/03/2021] +91 98494 71690: 🌹. గీతోపనిషత్తు  -175 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 6వ అధ్యాయము - ఆత్మ సంయమ యోగము  📚
శ్లోకము 19

🍀 19. యతచిత్తము - గాలి సోకని దీపము నిశ్చలముగ నుండును. చిత్తము కూడ అట్లే నిశ్చలమై, 'నేను' వెలుగును భ్రూమధ్యమున యోగించు చుండవలెను. ధ్యానమునకు యతచిత్తమే ప్రధానము. చిత్తము ప్రవృత్తుల యందు తిరుగక ఒక వస్తువుపై కేంద్రీకృతమగుట అభ్యాసము చేయవలెను. ఈ అభ్యాసము కేవలము ధ్యాన సమయమున చేసినచో జరుగదు. దైనందినముగ మనము చేయు పనులన్నిటి యందు పూర్ణముగ మనస్సు లగ్నము చేయుట ప్రాథమికముగ నేర్వ వలయును.  యతచిత్తము కలుగుటకు కర్తవ్యమునందు దీక్ష, ఫలితముల యందనాసక్తి, సంకల్ప సన్యాసము, ప్రాపంచిక విలువల యందు ఉదాసీనత, జీవులయందు సమబుద్ధి, ఆశపడని మనసు, మిత భాషణము, మితమగు వ్యవహారము నేర్వవలెను. 🍀

యథా దీపో నివాతస్థా నేంగతే సోపమా స్మృతా |
యోగినో యతచిత్తస్య యుంజతో యోగ మాత్మనః|| 19

గాలి తగులని దీపమెట్లు నిశ్చలముగ నుండునో అట్టి స్థిర చిత్తముతో 'నేను' అను వెలుగును భ్రూమధ్యమున యోగి దర్శించు చుండును. నివాతస్థ దీపమనగ గాలి సోకని దీపము. గాలి సోకని దీపము నిశ్చలముగ నుండును. చిత్తము కూడ అట్లే నిశ్చలమై, 'నేను' వెలుగును భ్రూమధ్యమున యోగించు చుండవలెను. ధ్యానమునకు యతచిత్తమే ప్రధానము.

చిత్తము ప్రవృత్తుల యందు తిరుగక ఒక వస్తువుపై కేంద్రీకృతమగుట అభ్యాసము చేయవలెను. ఈ అభ్యాసము కేవలము ధ్యాన సమయమున చేసినచో జరుగదు. దైనందినముగ మనము చేయు పనులన్నిటి యందు పూర్ణముగ మనస్సు లగ్నము చేయుట ప్రాథమికముగ నేర్వ వలయును. యథాలాపముగ ఏమియు చేయరాదు. చేయుపని ఏదైనను దానియందే పూర్ణచిత్తము నియోగించవలెను.

దంత ధావనము,  స్నానము, వస్త్రధారణము, భోజనము వంటి కార్యములు యథాలాపముగ చేయక మనసు పెట్టి నిర్వర్తించవలెను. శ్రద్ధగ చేయవలెను. అక్షరాభ్యాస సమయము నుండి ఈ అభ్యాసము ప్రారంభించిన వారికి యతచిత్త మేర్పడుట సులభము. దైనందిన కార్యములందు యథాలాపముగ నుండువారు ధ్యానము నేర్చుటకు చాల శ్రమపడవలసి వచ్చును.

ప్రస్తుతమున మనస్సు నిలుపుట, ఇతర ఆలోచనలు రాకుండుట జరుగవలెను. విను చున్నపుడు పూర్తిగ వినవలెను. చూచుచున్నపుడు పూర్తిగ చూడవలెను. అనగ మనస్సు పెట్టవలెను. అట్లే తినుచున్నపుడు, తిరుగు చున్నపుడు కూడ. ప్రస్తుతమున మనస్సు నిలచుట ప్రధానము. ఉదాహరణకు ఒక పాట వినుచున్నపుడు పాటను పూర్తిగ వినువారు అరుదు. ఆ నిమిషములోనే అనేకానేక భావములు కలిగి పాట వినుట జరుగదు.

యతచిత్తము గూర్చి భగవానుడు చాలమార్లు పలికినాడు. అట్టి యతచిత్తము కలుగుటకు కర్తవ్యమునందు దీక్ష, ఫలితముల యం దనాసక్తి, సంకల్పసన్యాసము, ప్రాపంచిక విలువల యందు ఉదాసీనత, జీవులయందు సమబుద్ధి, ఆశపడని మనసు, మిత భాషణము, మితమగు వ్యవహారము ఇత్యాది వెన్నియో గీతయందు తెలుపబడినవి. ఇవి ఏవియును పాటింపక, సరాసరి ధ్యానమందు కూర్చుండుటకు ప్రయత్నించుట అవివేకమే అని తెలియవలెను.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[05:14, 29/03/2021] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 377🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః  🌴
అధ్యాయము - 12

🌻. శివహిమాచల సంవాదము - 2 🌻

హిమవంతుడిట్లనెను-

ఓ దేవ దేవా! మహాదేవా! కరుణానిధీ! శంకరా! ప్రభో! కన్నులను తెరచి నిన్ను శరణు పొందిన నన్ను గాంచుము (15). హే శివా! శంకరా! మహేశ్వరా! ప్రభూ! జగత్తునకు ఆనందమును కలిగించునది నీవే. మహాదేవా! ఆపదలనన్నిటినీ తొలిగించే నిన్ను నేను నమస్కరించుచున్నాను (16). హే దేవదేవా! వేద శాస్త్రములైననూ నిన్ను పూర్ణముగా తెలియజాలవు. నీ మహిమ సర్వకాలములయందు వాక్కునకు, మనస్సునకు గోచరము కానే కాదు (17). వేదమంతయూ భయముతో సందేహముతో నీ స్వరూపమును నేతి నేతి వాక్యములచే ప్రతిపాదించుచున్నది. ఇతరుల గురించి చెప్పునదేమున్నది? (18)

ఎందరో భక్తులు భక్తి ప్రభావముచే నీ కృపను పొంది నీ స్వరూపము నెరుంగుదురు. శరణుపొందిన నీ భక్తులకు ఎచ్చటనైననూ భ్రమ మొదలగునవి ఉండవు (19). నీ దాసుడనగు నా విన్నపమును ఇపుడు నీవు ప్రీతితో వినుము. హే దేవా! తండ్రీ! నీ యాజ్ఞను పొంది దీనుడనగు నేను ఈ విన్నపమును చేయుచున్నాను (20).

హే మహాదేవా! శంకరా! నీ అనుగ్రహము నాకు కలుగటచే నేను భాగ్యవంతుడనైతిని. హే నాథా! నీవు నన్ను నీ దాసునిగా తలంచి, నాపై దయను చూపుము. నీకు నమస్కారమగు గాక! (21) హే ప్రభో! ప్రతి దినము నీ దర్శనము కొరకు నేను రాగలను. ఈ నా కుమార్తె కూడా నిన్ను దర్శించగలదు. హేస్వామీ! మాకు నీవు ఆజ్ఞను ఒసంగ దగుదువు (22).

బ్రహ్మ ఇట్లు పలికెను-

హిమవంతుని ఈ మాటలను విని దేవదేవుడగు మహేశ్వరుడు ధ్యానమును వీడి కన్నులను తెరచి ఆలోచించి ఇట్లు పలికెను (23).

మహేశ్వరుడిట్లు పలికెను-

హే పర్వతరాజా! నీవు నీకుమార్తెను ఇంటివద్దనే ఉంచి నిత్యము నా దర్శనమునకు రావలెను. ఆమెతో గూడి నా దర్శనమునకు రావలదు (24).

బ్రహ్మ ఇట్లు పలికెను-

శివాదేవి తండ్రియగు హిమవంతుడు తలవంచి శివునకు నమస్కరించి, శివుని వచనమునకు ఇట్లు బదులిడెను (25).

హిమవంతుడిట్లు పలికెను-

ఈమె నాతో గూడి ఇచటకు రాగూడదనుటకు కారణమేమియో చెప్పుడు. నిన్ను సేవించే యోగ్యత ఈమెకు లేదా? ఇట్లు ఆదేశించుటకు గల కారణము నాకు తెలియకున్నది (26).

బ్రహ్మ ఇట్లు పలికెను-

అపుడు వృషభధ్వజుడగు శంభుడు చిరునవ్వుతో హిమవంతునకు బదులిడెను. ఆయన దుష్టయోగులు లోకములో ప్రవర్తిల్లు తీరుతెన్నులను ప్రత్యేకించి వివరించెను (27).

శంభుడిట్లు పలికెను-

ఈ కుమారి మిక్కిలి అందగత్తె. చంద్రుని వంటి మోము గలది. శుభదర్శనురాలు. ఈమెను నా వద్దకు తీసుకురాదగదని మరల వారించుచున్నాను (28). వేదవేత్తలగు విద్వాంసులు స్త్రీ మాయాస్వరూపురాలని చెప్పెదరు. ప్రత్యేకించి తపశ్శాలుర విషయములో స్త్రీ విఘ్నకారిణి యగును (29). నేను తపశ్శాలిని. యోగిని. మాయ ఏనాడైననూ నన్ను లేపము చేయదు. ఈ విషయములో యుక్తులను చెప్పి ప్రయోజనమేమున్నది? ఓ పర్వత రాజా! నాకు స్త్రీతో పనిచయేమి ? (30) నీవు మరల ఇట్లు పలుకవలదు. నీవు గొప్ప తపశ్శాలురకు ఆశ్రయము నిచ్చినవాడవు. నీవు వేదధర్మములో నిష్ణాతుడవు, జ్ఞానులలో శ్రేష్ఠుడవు, పండితుడవు (31).

ఓ పర్వత రాజా! స్త్రీతో కలిసి ఉండుట వలన విషయములయందు ఆసక్తి వెనువెంటనే ఉదయించి, వైరాగ్యము పూర్తిగా అదృశ్యమగును. అపుడు చక్కని తపస్సు జారిపోవును (32). ఓ పర్వతరాజా! కావున, తపశ్శాలి స్త్రీలతో మైత్రిని చేయరాదు. ఇంద్రియభోగలాలసతకు మూలమగు స్త్రీజ్ఞానమును, వైరాగ్యమును నశింపజేయును (33).

బ్రహ్మ ఇట్లు పలికెను-

మహా యోగులలో శ్రేష్ఠుడగు మహేశ్వర ప్రభుడు ఆ పర్వత రాజుతో ఇట్టి మరికొన్ని మాటలను పలికి విరమించెను (34). దోషములేనిది, కామనలు లేనిది, మరియు పరుషమైనది అగు ఆ శంభువచనమును విని ఆ కాళికి తండ్రియగు హిమవంతుడు ఆశ్చర్యపడెను. ఓ దేవర్షీ! అటులనే ఆయన కొంత మానసిక క్షోభను పొందినవాడై మిన్నకుండెను (35). తపశ్శాలి యగు శివుని మాటలను విని, మరియు ఆశ్చర్యమగ్నుడగు పర్వత రాజును తలపోసి, అపుడు భవానీ దేవి శివునకు ప్రణమిల్లి స్పష్టమగు వాక్యము నిట్లు పలికెను (36).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండములో శివహిమాచల సంవాదవర్ణనమనే పన్నెండవ అధ్యాయము ముగిసినది (12).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
[05:14, 29/03/2021] +91 98494 71690: 🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు - 5 🌹
✍🏼. మాస్టర్ ఎక్కిరాల కృష్ణమాచార్యలు

🌻. భాగవతము 4-288. ధ్రువోపాఖ్యానము 🌻

భగవంతునికి నమస్కరించువారు తాము మంచిదనుకొను దానిని పొందుటకై నమస్కరించుచున్నారు.  కొందరు దేవుని సర్వఫల ప్రదాతగా నెరిగి నమస్కరించుచున్నారు.  (ఎవరి కోరికను బట్టి వారి ఫల స్వరూపముగా ప్రత్యక్షమగు దైవమునకు నమస్కరించుచు తామేమియు కోరకున్నారు.) వారే నిష్కాములు.

అట్టి వారికి రాజ్య పరిపాలనము మున్నగు ప్రయోజనములు సిద్ధించినను ,  వారు తమ పరిపాలనము రూపమున జీవులకు సర్వ ప్రయోజనములను సిద్ధించుటకు యత్నించుచు ఆ జీవుల రూపమున‌ భగవంతుని పాదసేవయే చేసికొనుచున్నారు.
🌹 🌹 🌹 🌹 🌹
[05:15, 29/03/2021] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్  - 199 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ

🌻. సత్యానుభూతి - చతుర్విధ నిశ్చయార్థకములు 🌻

739. ఆత్మ నాల్గు స్థితుల ద్వారా పురోగమించగా సత్య సంబంధమగు నిత్య సత్యానుభూతిని సేకరించును.

740. చతుర్విధ నిశ్చయార్థకములు

1. అంతరానుభూతుల నుండి, దృశ్యముల నుండి లేక ఆధ్యాత్మిక అనుభవముల నుండి (అవి మార్గమందలి అనుభవములు కానీ లేక అన్యము కానీ) కలిగిన నిస్సంశయము.

2. సాక్షీభూతమైన నిస్సంశయము. సర్వత్రా భగవంతుని ప్రత్యక్షముగా చూపుట వలన కలిగిన నిస్సంశయము.

3. భగవదైక్యము వలన కలిగిన నిస్సంశయము.

4. మానవునిలోగల దివ్యత్వ పరిపూర్ణత్వమునకు సంబంధించిన అనుభవముతో కూడిన నిస్సంశయము. దీని వలన ఆతడు భగవంతుని యొక్క, విశ్వము యొక్క రహస్యములను ఎఱుంగును.

ఈ శక్తి ఒక్క సార్వభౌమిక మనస్సునకే (మహాకారణ శరీరము) గలదు. ఇది సమస్త దివ్య విచారమునకు పీఠము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[05:15, 29/03/2021] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 243 / Sri Lalitha Chaitanya Vijnanam  - 243 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :
*🍀  59. మనువిద్యా, చంద్రవిద్యా, చంద్రమండలమధ్యగా ।
చారురూపా, చారుహాసా, చారుచంద్ర కళాధరా ॥ 59 ॥🍀*

🌻 243. 'చారుచంద్ర కళాధరా'🌻

వృద్ధి, క్షయ రహితమైన చంద్రకళ కలది శ్రీదేవి అని అర్థము. చంద్రకళలకు వృద్ధి క్షయములు కలవు. పూర్ణజ్ఞాని చంద్రకళల కతీతముగ మనోభావమున వృద్ధి క్షయములు లేక యుండును. జ్ఞానాగ్ని మనో వికారము లన్నింటిని దగ్ధము చేయును. అట్టి జ్ఞాన వంతుడు బుద్ధిలోకమున స్థిరపడి పూర్ణ మనస్కుడై యుండును. ఈ స్థితిని చారుచంద్ర కళ అందురు.

ఈ కళను ఎప్పుడునూ ధరించి యుండునది శ్రీదేవి. ఆ జ్ఞానమున కామెయే మూలము. ఆమె జ్ఞానేశ్వరి. జ్ఞాన స్వరూప. జ్ఞానమును ప్రసాదించునది కూడ ఆమెయే. ఆమె చారుచంద్ర కళలు ధరించి యున్నది అనుటలో విశేషము నిజమున కేమియూ లేదు. శ్రీదేవికి ఈ నామము వచ్చుటకు ఒక పురాణ గాథ యున్నది.

చంద్రకళ అను రాజకుమారి యుండెడిది. ఆమె కాశీరాజు కుమార్తె. సర్వ లక్షణ సంపన్న. ఆమెకు శశికళ అనుపేరు కూడ కలదు. ఆ రాజకుమారి శ్రీమాత భక్తురాలు. ఆమెను వరింప నర్హత గల రాజ కుమారుడు చాల కాలము కానరాకుండెను.చంద్రకళ తండ్రి విఫల ప్రయత్నములకు దుఃఖము చెంది శ్రీదేవిని మిక్కిలి భక్తి భావములతో పూజించుచుండగ ఆమె కమితమగు దుఃఖము కలిగినది.

శ్రీదేవి ప్రసన్నురాలై చంద్రకళకు స్వప్న దర్శనమిచ్చి ఇట్లు పలికినది "పుత్రీ! చంద్రకళా! నీవు దిగులు చెంద నవసరము లేదు. నీవు నా భక్తురాలవు. నిన్ను పెండ్లి యాడుటకు ఈశ్వర భక్తుడే సమర్థుడు. నిశ్చలమగు ఈశ్వరోపాసకుడే నిన్ను పరిణయ మాడగలడు. సుదర్శనుడను రాజపుత్రుడు కామరాజ బీజ ఉపాసకుడు, పరమ శివుడే కామరాజు. అతనీ బీజాక్షరీ ఉపాసనమున సిద్ధి పొందినవాడు. నీవతనిని వరునిగా వరింపుము.

అతనిని మహేశ్వరు డావరించి యున్నాడు. అతడు నిన్ను వరించుటకు నేనీ క్షణము నుండి నిన్నావరించి యుందును. నీయందతనికి నాకళ గోచరించి ఆకర్షితుడగును. నీవు చంద్రకళవు.
నిన్నావరించి నేనుండుట చేత నేటి నుండి చారుచంద్ర కళాధరా అను అష్టాక్షరీ నామము నా కేర్పడగలదు.” పై కారణముగ శ్రీదేవి చారుచంద్ర కళాధరా అయినది.

పూర్ణచంద్రుని కళ చారుచంద్రకళ, ఇట్టి పూర్ణ జ్ఞానమును శ్రీదేవి అనుగ్రహింప గలదు. ఆమె సాన్నిధ్యమున ఉత్తమ భక్తులను ఇట్టి కళ ఆవరించి యుండును. ఇది శ్రీదేవి అనుగ్రహము.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 243 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Cāru-candra-kalādharā चारु-चन्द्र-कलाधरा (243) 🌻

She is wearing the crescent moon in Her crown.  Cāru means moon light.  All the above nāma-s deal with the moon.  The full moon represents supreme consciousness.  If She is meditated upon on the full moon night, one will attain mantra siddhi at the earliest.  On full moon days, sattvic guṇa becomes predominant.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment