ఇది ప్రాంజలి ప్రభ (20)
నేటి చందస్సు
మ.కో
సందడెట్టుల నీవు బల్కక చక్కనైనది నవ్వుతో
నందజేయుచు నల్లినట్టిది హారమొక్కటి ప్రీతిగా
వందనమ్ములఁ జేతు వేలుగ, పట్టు వీడవె వెంటనే
వందితాఖిల లోకపావని భక్తపాలిని మాలినీ
చెప్పవచ్చును దల్లి నీవికఁ జెప్పఁదల్చిన దేమిటో
విప్పనా ముఖపుస్తకమ్మును వేడ్కనొందియుఁ జూడఁగా
తప్పుఁ జేసితి నిన్నుఁ గొంచెము తాళమంచును బల్కుచున్
తప్పలేదట పల్కులాడక తన్వి తోడను గూటమిన్
మార్గదర్శిని యంచు వ్రాయఁగ మాటలాడితిఁ బద్యమున్
వర్గమందున సఖ్యముండుటఁ బల్కితాగతి, నైననున్
దుర్గమాంబిక గూర్చియే కద తోషమొప్పఁగఁ బల్కితిన్
నిర్గమించిన వెంటనే తను నిన్నుఁ జేరఁగ వచ్చితిన్
ప్రాంతంలోని ప్రభు ...(21)
కొత్తది ఛందస్సు
సుగంధి UIII UIII - UIII UIII - UIII UU
జ్ణానముయె పుస్తకము
పుస్తకము దేహముయె
దేహముయె కాలం
దేహముయె కాలము తొ
కాలము యె మిత్రముతొ
మిత్రుడుయె కాలం
మాటలుయె దాహముతొ
దాహముయె ఆకాలితొ
ఆకలియె కాలం
సాధన యె శోధనతొ
శోధన యె ఆశల తొ
ఆశలు యె కాలం
ప్రేమలుయె జీవితము
జీవిత మె ప్రొద్భవము
ప్రొద్భవమె కాలం
ప్రేరణయె ఆయుధము
ఆయుధమె ఆశయము
ఆశయమె కాలం
దీపముయె వెల్గులుగఁ
వెల్గులు యె జిల్గులుగ
జిల్గులు కాలం
దేహముకు గాయములు
గాయములు రోగములు
రోగములె కాలం
గొప్పలకు తిప్పలుగఁ
తిప్పలకు ముప్పలుగఁ
ముప్పులులె కాలం
ప్రాంతంలోని ప్రభు....(22)
తుమ్మెద పెద్ద పెద్ద వృక్షాలకు రంధ్రాలు చేసి
అందులో జీవనం కొనసాగిస్తుంది.....
చెక్కలకు, మొద్దులకు కూడా రంధ్రం చేసి తన పిల్లల్ని పెంచుతుంది...
కానీ మకరందం కోసం తామర మీద వాలినప్పుడు
ఆ తామర రెక్కలు ముడుచుకుంటాయి....
అయ్యో
నన్ను ఏదో బంధించేసింది అని చెప్పేసి ఆ తామర
రెక్కల్లోనే ఇరుక్కుని చనిపోతుంది....
అయితే
మహా మహా వృక్షాలకు రంద్రం చేయగలిగిన దాని సామర్థ్యం
ఆ తామర రేెకులను తొలచలేదా....
ఆ తామర రేకులకు రంధ్రాలు చెయ్యలేదా..... గట్టిగా రెక్కలు ఆడించినా రాలిపోతాయి...
కానీ అది దాని సామర్థ్యం మర్చిపోవడం, మకరందం గ్రోలే మత్తులోనో...
లేక
నన్నేదో బంధించింది అన్న
భావన దాని శక్తిని బలహీన పర్చింది.... ఆ భావనను
నమ్మడమే దాని బలహీనత.....నేను రంద్రం చేయలేనిదేదో నన్ను బంధించింది అన్న
దాన్ని నమ్మింది...
అంతే అది మరణాన్ని కొనితెచ్చుకుంది...
మన జీవితంలో సమస్యలూ అంతే,
సమస్య బలమైంది కాదు....
మనశక్తిని
మనం మర్చిపోవడమే దాని బలం...
మన శక్తికంటే దాన్ని బలంగా చూడడమే,
గుర్తించడమే, నమ్మడమే దాని బలం...
"మాయ" అనేది నీ ఆత్మశక్తి కంటే బలమైంది కాదు...
దాని బలం తామర రేకు అంత....
నీ ఆత్మబలం వృక్షాలకు రంధ్రాలు చేయగలిగేదంత.
తెలుసుకో
అదే..జీవిత సత్యం
ప్రాంజలి ప్రభ (23)
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నీకు నువ్వే అధిపతిని
నీకు నువ్వే విరోధిని
నీకు నువ్వే మితృడివి
నీకు నువ్వే కాలుడివి
సాధన మించిన ఉపకరణ లేదు
ప్రేమకు మించిన అనుకరణ లేదు
కాలము మించిన దయకరుణ లేదు
వేదము మించిన పఠణము లేదు
మానమానము మౌనగానము మాననీయుని జీవితం
సానపెట్టుట నేర్చుకున్నటి సౌఖ్యమంతయు జీవితం
ఆలుబిడ్డల తానతందాన ఆదుకొన్నుట జీవితం
వేణుగానము ఆలిఆశయు వీణనాదము జీవితం
సాధ్య సాధ్యము నిత్య శోధన తాప చక్రమె జీవితం
విద్య సాధన వింత పోకడ విశ్వ జన్నిట జీవితం
పద్య బోధలు తత్వవేక్తల బంధుభావము జీవితం
గద్య తత్వము మానవత్వము కాల తత్వము జీవితం
యేమి రూపము యేమి తాపము యేమి మోహము జీవితం
యేమి మోనము యేమి తన్మయ యేమి ఆశలు జీవితం
శ్రీ మతీపతి మెల్లమెల్లగ రమ్య పర్చెటి జీవితం
ఆశ తీర్చిన నమ్మ పల్కిన ఆత్మ బంధము జీవితం
కష్ట జీవికి పాడి పంటకు కాటు లేనిది జీవితం
ఇష్ట జీవికి ఎండ మావులు ఈప్సితంమ్ముగ జీవితం
ఘోష్టి జర్పిన వర్త మానము ఘోరమవ్వదు జీవితం
రైతు రాజుగ బత్కెరోజులు రవ్వ వెల్గుల జీవితం
రామ నిన్నెను నమ్మి వుంటిని నాకు శాంతియు పంచుమూ
మేము చేసిన పాప పుణ్యము మేమె చెప్పితి ఇప్పుడే
ప్రేమ చూపియు ఆశ తీర్చియు పాపమంతయు మాపుమా
కమ్ము కున్నటి ఇష్ట కష్టము కానిదయ్యెను తీర్చుమా
రామ నామము పాడు చుంటిని రమ్యమవ్వును నీకునూ
రామ గానము చేసి అంకిత రాశి బంధము నీవులే
రామ కాలము నిత్య సత్యము రమ్య గున్నది నీతిగా
రామ యోగము ధర్మయుద్ధము రవ్వ వెల్గుగ వచ్చెనే
Comments
ప్రాంజలి ప్రభ కధలు (23)
ఇటువంటి స్థితిలో మెల్లమెల్లగా ఇలా జరుగుతూ వుంటే ‘చండవేగుడు’ అనబడే ఒక గంధర్వుడు చూశాడు. ఈకోటను స్వాధీనం చేసుకోవాలి అని అనుకున్నాడు. ఆయన దగ్గర మూడువందల అరవై మంది మగసైన్యం, మూడు వందల మంది ఆడ సైన్యం ఉన్నారు. ఆడసైన్యం నల్లగా, మగ సైన్యం తెల్లగా ఉంటారు. అనగా రాత్రులు నలుపు, పగళ్ళు తెలుపు. వీళ్ళే శుక్లపక్ష కృష్ణ పక్షములుగా ఉంటారు. వీళ్ళు వచ్చి కోటను బద్దలు గొడదామని చూశారు. ఈలోగా వీళ్ళతో పాటు ‘కాలకన్య’(కాలస్వరూపమయిన ఈశ్వరుడు) కలిసింది. ఈ కాలకన్య వివాహం చేసుకోవాలి అనుకుంది. ఆవిడను ఎవరూ వివాహం చేసుకోవడానికి ఇష్ట పడలేదు. బ్రహ్మజ్ఞాని కదా ఈయనకు ఏమి బాధ ఉంటుందని ఒకరోజున నారదుడు కనపడితే ఆయనను తనను పెళ్ళి చేసుకొన వలసిందని అడిగింది. అపుడు ఆయన ‘నీవు నాకు అక్కర్లేదు, చేసుకోను’ అన్నాడు. కాలకన్య కాబట్టి ఆమె మృత్యు రూపమై శరీరమును పడగొట్టేయగలదు.కానీ నారదుడిని ఏమీ చేయలేదు. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని కాలం ఏమీ చేయలేదు. అందుకని ఆమె నారదుడికి ఒక శాపం ఇచ్చింది. ‘నువ్వు ఎక్కడా స్థిరంగా ఉండకుండా మూడు లోకములలో తిరుగుతూ ఉండు’ అని. అపుడు నారదుడు ‘నాకు బెంగలేదు. నామం చెప్పుకుంటూ మూడు లోకములలోనూ తిరుగుతూ ఉంటాను. కానీ ఒకమాట చెప్తున్నాను విను. నిన్ను ఎవ్వరూ పెళ్ళిచేసుకోరు’ అన్నాడు.
తరువాత కాలకన్య యవనుల నాయకుడు అయిన ‘భయుడి’దగ్గరకు వెళ్ళి తనను పెళ్ళి చేసుకోమంది. అతడు నీవు నా చెల్లెలు వంటి దానివి. నేను నిన్ను పెళ్ళి చేసుకోకూడదు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. వారి పేరు ‘ప్రజ్వరుడు’ నీవూ వాడు కలిసి ఒక పని చేస్తూ ఉండండి. ఆ పనిపేరు ‘దేవగుప్తము’ చాలా రహస్యం. నీకు భర్త దొరకలేదని కదా నీవు బాధపడుతున్నావు. ఈ వేళ నుంచి ఊళ్ళో ఉన్న భర్తలందరూ నీకు భర్తలే. అలా నీకు వరం ఇస్తున్నా. నువ్వు భార్యవు అయిపోయినట్లు వాడికి తెలియదు. నీవు వాడిని ఎప్పుడు వెళ్ళి పట్టుకునే అప్పుడే వాడు నీకు భర్త అయిపోతాడు. నీవు ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటావో వాడికి తెలియదు కాబట్టి నీపేరు ‘జర’ అని చెప్పాడు. ఇక్కడ జర అంటే వృద్ధాప్యము. వ్యక్తులు తమకు ముసలితనం వచ్చిందని ఒప్పుకోరు. కానీ జర వచ్చి పట్టేసింది. ఆమె వెనకాతలే భయుడు వస్తాడు. భయుడి వెనకాల యవనుల సైన్యం వస్తుంది. యవనులు రావడం అంటే బెంగలు, భయములు, వ్రణములు, రోగములు ఇవన్నీ బయలుదేరి పోవడం! తాను చచ్చిపోతానేమో నాన్న బెంగ మొదలవుతుంది. ఆఖరున భయుని తమ్ముడైన ప్రజ్వరుడు వస్తాడు. అనగా పెద్ద జ్వరం/పెద్ద జబ్బు. వాడు సంధి బంధములు విడగొట్టేస్తాడు. అలా ఊడగొట్టేసిన తరువాత ఈ పురంజనుడు లోపల పడుకుని ఇంకా భార్యనే తలుచుకుంటూ, సేవకులు తెచ్చినవి తింటూ, ఇందులో ఉండిపోతే బావుండునని అంటూ ఉంటాడు. అంటే తమ భార్యను తలుచుకుంటూ.
Comments
ప్రాంజలి ప్రభ (24)
కొత్తది ఛందస్సు
UUI IIIII - UUI IIIII - UUIUU
నీతోను గడుపుటకు
నీమాటలు వినుటకు
నీతోడు ఉంటా
నీ ఆట మనసులకు
నీ వేట బతుకులకు
నీతోడు ఉంటా
నీ స్వప్న అనుకరణ
నీ స్వేశ్చ అనుకరణ
నీతోడు ఉంటా
నీ ప్రేమ బతుకుటకు
నీ ప్రాణ తలుపులకు
నీతోడు ఉంటా
నీ కళ్ళు కలుపుటకు
నీ వళ్ళు తడుపుటకు
నీతోడు ఉంటా
నీ ఆశ తెలుపుటకు
నీ కాల మలుపులకు
నీతోడు ఉంటా
మేఘమ్ము కదులుటయు
వర్షమ్ము కురుయుటయు
ఆనంద మొచ్చే
దీపమ్ము వెలుగుటయు
ఆశమ్మ కలియుటయు
ఆనంద మిచ్చే
కాలమ్ము కలుపుటయు
శీలమ్ము నిలుపుటయు
ఆనంద మిచ్చే
నీ తోడు పరుగులుయె
నిన్నేను కలుసుటయె
ఆనంద మిచ్చే
--(())--
ప్రాంజలి ప్రభ (25)
సమ్మోహనాలు ... పిల్లి 1331 ... 1328
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
పిల్లి నడకలు వొద్దు
వొద్దు అతుకులు వొద్దు
వొద్దు అనేపదం వెంటరాదు ఈశ్వరా
పిల్లిని భంధింస్తే
భంధి తొ కోపిస్తే
కోపిస్తే పిల్లియె పులియగును ఈశ్వరా
ఆడువారినడకలు
నడకలతో కళకళలు
కళకళలు పిల్లి నడకలు మల్లె ఈశ్వరా
హనుమ రూపము మార్చి
మార్చి సహనము చేర్చి
చేర్చి మార్జాలముమల్లె కదిలె ఈశ్వరా
పిల్లిని చూసి ఎలుక
ఎలుక పరుగులే ఇక
ఇక పిల్లికి చిక్కక బతికేను ఈశ్వరా
కుక్కను చూసి పిల్లి
పిల్లి పరుగుల పిల్లి
పిల్లి అయినా కుక్కంటె భయము ఈశ్వరా
పిల్లి పిల్లలు తిప్పి
తిప్పి ఇల్లులు తిప్పి
తిప్పి బతుకును నేర్పు పిల్లలకు ఈశ్వరా
కళ్ళు మూసియు పిల్లి
పిల్లి పాలను గిల్లి
గిల్లి పాలు త్రాగుట తప్పదు ఈశ్వరా
--(())--
Com
ప్రాంజలి ప్రభ (26)
నేటి ఛందస్సు
IIIUI UIUI UU UI UIU
ఇసుక తోడ ఆడుకుండె బాల్యమెంత అందమో !
మురికి లేని నీటియందు దాహ మెంత తీపియో !
కలలు లేని బత్కుయందు దేహ మెంత ఆశయో!
మనసు దోచు కారణాలు పెళ్లి యెంత బంధమో!!
అలలతోడ ఆడుకుండె బాల్యమెంత అందమో!
కధల లోన వచ్చి పోవు సంఘ టన్ల కావ్యమో !
కనులు విప్పి సౌఖ్య మిచ్చు దివ్వె వెల్గు అందమో!
మధుర మైన రాగమెంత నీవు తెచ్చు అందమో!!
చెదిరిపోని సత్యమెంత మేలుచేయు అందమో!
కరిగి పోని విద్య ఎంత హాయి గొల్పు బంధమో !
కలసి పోయి శోభ ఇచ్చు హాయి గొల్పు అందమో!
విషయ వాంఛ విశ్వ మోహ భవ్య కాంతి అందమో!!
ప్రాంజలి ప్రభ (27 )
దైవ తత్వ భావాలు
మొదట 'జ్ఞానాన్ని' చూడు
నీకు వస్తుందోరాదో తెలుసుకో
తర్వాత 'జ్ఞాని'ని చూడు
నీవు నిజమైన జ్ఞాని తెలుసుకో
పాలని కాచితే పొంగి పొర్లుతాయి
మంట ఉన్నంతవరకు మరుగుతాయి
మంట తీసేస్తే పాలు మిగులుతాయి
ఆటులే ఆశలకు మనుష్యులు లొంగు తారు
దుష్ట ఆలోచనకు మరిగి పోతారు
ఆలోచన మార్చుకుంటే జ్ఞానిగా మారొచ్చు
దీక్ష అందరికీ అవసరము
సర్వ శ్రేష్ఠ మైనది మౌనదీక్ష
దృక్కు, స్పర్శ, ఉపదేశం
పవిత్రునిగా మారుస్తుంది
విద్య చైతన్యము వల్ల అహంకారం
అహంకారంతో పెరుగు సంపాదన
కర్త్రుత్వ భావముతో సత్యానికి దూరం
ఈశ్వర తత్వ0తో సత్యాన్ని గ్రహించు
నిరహంకార సత్యంతో శాంతి కలుగు
"నాకు తెలియదు" అనడం కూడా తెలియడమే.
"నాకు తెలుసును " అనడం కూడా బతకడమే
"నాకు పలుకుట " రావడం కూడా వెతకడమే
"నాకు బతుకుట " చావడం కూడా ఒకటియే
బాధోస్తే బ్రతకలేమా అని అంటాం
కాలమ్మే బ్రతకనీదా అని అంటాం
దైవమ్మే బ్రతకనిస్తుందని అంటాం
వేదాంతం బ్రతక నిచ్చే దని అంటాం
ప్రేముంటుందని మగువ బ్రతకాలన్నాం
ద్వేషంలేదని మగడు బ్రతకాలన్నాం
కాలంలో ఇది సహజ ప్రకృతే అన్నాం
చావొస్తుందని తెలిసి బ్రతికేస్తున్నాం.,
తనువుకు లోపల మాత్రమే తాను ఉన్నానని అనుకుంటే - జీవుడు.
మనసుకు భేదమే లేదనే తాను పొందాలని అనుకుంటే - జీవుడు
తనువుకు లోపల, బయట తానున్నానని తెలుసుకుంటే - దేవుడు.
మనసుయు మాటయు ఒకటి గానున్నానని తెలుసుకుంటే - దేవుడు
Comments
ప్రాంజలి ప్రభ (28)
ఆరోగ్య పరం గా " తమలపాకు " ఉపయోగాలు (1)
తమలపాకులను పూజ చేయునప్పుడు దేవునిముందు వుంచు కలశములో ఉంచుతారు.
తాంబూలములో ఉపయోగిస్తారు. భోజనానంతరం తాంబూల సేవనము మన సంప్రదాయం.
తమలపాకుల రసమును గొంతునొప్పి నివారణకు ఉపయోగిస్తారు.
శ్వాసకోశ వ్యాధుల నివారణకై ఈ ఆకులను నూనె రాసి కొద్దిగా వేడిచేసి ఛాతీపై ఉంచుతారు.
తమలపాకులకు నేయి రాసి గాయాలకు కట్టుకడతారు.
తమలపాకుల రసమును చెవిలో పిండిన చెవినొప్పి తగ్గిపోవును.
అపస్మారకమును నివారించుటకు తమలపాకుల రసమును పాలతో కలిపి త్రాగించెదరు.
ఆరోగ్యపరమైనవి
ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను పక్కన పెడితే, శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా వున్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఫైబర్ - అంటే పీచు పదార్ధం తమలపాకులో చాలా ఎక్కువగా వుంటుంది. ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే, అంతకంటే ఎక్కువగా పని చేస్తాయి. సున్నం, వాక్క తదితర కృత్రిమ పదార్థాలను చేరిస్తే మాత్రం తమలపాకు శరీరానికి హానికరంగా మారుతుందని గ్రహించాలి.
తమలపాకు యాంటాక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అంటే ముసలితనపు మార్పులను కట్టడి చేస్తుందన్నమాట.
నూనెలూ ఇతర తైల పదార్థాలూ ఆక్సీకరణానికి గురై చెడిపోవడాన్ని ‘ర్యాన్సిడిటి’ అంటారు. తమలపాకు ఈ ప్రక్రియను అడ్డుకుంటుంది- తైల పదార్థాలు చెడిపోవడానికి గురికాకుండా ఉంచుతుంది. నువ్వుల నూనె, ఆవనూనె, పొద్దుతిరుగుడు నూనె, వేరుశనగ నూనె... ఇలాంటి నూనెలు చెడిపోకుండా వుండాలంటే వాటిల్లో తమలపాకులను వేసి నిల్వచేయండి.
తమలపాకులో ‘చెవికాల్’ అనే పదార్థం ఉంటుంది. ఇది బ్యాక్టీరియా పెరుగుదలను కట్టడి చేస్తుందని పరిశోధన.
తమలపాకులో ఉండే స్థిర తైలం (ఎసెంషియల్ ఆయిల్) ఫంగస్ మీద వ్యతిరేకంగా పనిచేసి, అదుపులో ఉంచినట్లు పరిశోధనల్లో తేలింది.
ఒక ముఖ్య విషయం. తమలపాకును తొడిమతో సహా తింటే మహిళల్లో వంధ్యత్వం వచ్చే అవకాశం ఉంటుందని పరిశోధకులు గమనించారు. కాబట్టి సంతానంకోసం ప్రయత్నించేవారు తమలపాకును తొడిమ తొలగించి వాడుకోవాలి.
తమలపాకు ఔషధం లాంటిది. ఔషధాల మాదిరిగానే దీనినీ పరిమితంగానే వాడుకోవాలి. ఈ సందర్భంగా తమలపాకు నేపథ్యంగా జరిగిన ఒక అధ్యయనం గురించి ప్రస్తావించాలి. రోజుకు 5-10 తమలపాకులను 2 ఏళ్లపాటు తినేవారు తమలపాకులకు డ్రగ్స్ మాదిరిగా బానిసలవుతారని ఇటీవల జరిగిన తాజా అధ్యయనంలో తేలింది.
అధిక రక్తపోటు కలిగినవారు తాంబూలాన్ని యధేచ్ఛగా వాడకూడదు- తాంబూలాన్ని తయారుచేసేటప్పుడు సున్నం కలుపుతారు కాబట్టి ఈ పదార్థం రక్తనాళాల మీద, రక్తసరఫరామీద వ్యతిరేక ప్రభావం చూపుతుంది.
తాంబూలానికి పొగాకును కలిపి తింటే ‘సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్’ వంటి ప్రమాదకరమైన నోటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. సబ్‌మ్యూకస్ ఫైబ్రోసిస్ అనేది నోటి క్యాన్సర్‌కి ముందు స్థితి.
తమలపాకు, సున్నం, వక్క... ఇవి మూడూ చక్కని కాంబినేషన్. సున్నంవల్ల ఆస్టియోపోరోసిస్ (ఎముకలు గుల్లబారటం) రాకుండా ఉంటుంది; తమలపాకు రసం సున్నంలోని క్యాల్షియంను శరీరాంతర్గత భాగాల్లోకి చేరవేస్తే తమలపాకుకు చేర్చి వక్కపొడి లాలాజలాన్ని విడుదలయ్యేలా చేసి అరుగుదలకు సహాయపడుతుంది.
ఔషధంగా తమలపాకుని వాడుకోదలిస్తే, రసం పిండి 1-2 చెంచాల మోతాదులో తీసుకోవాలి.
ప్రతిరోజూ 7 తమలపాకులను ఉప్పుతో కలిపి ముద్దగా నూరి వేడి నీళ్లతో తీసుకుంటే బోధ వ్యాధిలో చక్కని ఫలితం కనిపిస్తుంది.
ప్రతిరోజూ రెండు నెలలపాటు ఒక తమలపాకును పది గ్రాముల మిరియం గింజలను కలిపి తిని వెంటనే చన్నీళ్లు తాగుతుంటే స్థూలకాయులు సన్నగా నాజూగ్గా తయారవుతారు.
స్వర్ణక్షీరి, విడంగాలు, ఇంగిలీకం, గంధకం, చక్రమర్ధ, చెంగల్వకోష్టు, సింధూరం వీటిని ఉమ్మెత్త ఆకులతోనూ, వేప చెట్టు బెరడుతోనూ, తమలపాకుతోనూ కలిపి ముద్దగా నూరి చర్మంమీద లేపనం చేస్తే ఎగ్జిమా, తామర, దురదలు వంటి చర్మవ్యాధుల్లో ఉపశమనం లభిస్తుంది.
తమలపాకు రసం, తేనె సమపాళ్లలో కలిపి కళ్లలో డ్రాప్స్‌గా వేసుకోవాలి. (వైద్య పర్యవేక్షణ అవసరం)
తమలపాకు రసం, తులసి రసం, అల్లం రసం, మిరియాలు పొడి, తేనెలను కలిపి నాకిస్తే పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గుతాయి.
చెవుల మీద తమలపాకులను వేసి కట్టుకుంటే తలలో చేరిన వాతం శాంతించి తల నొప్పి తగ్గుతుంది.
తమలపాకు రసాన్ని పాలతో కలిపి తీసుకుంటే మహిళల్లో కనిపించే పిశాచ బాధలు, క్షణికావేశాలు తగ్గుతాయి.
తమలపాకు రసాన్ని రెండు కళ్లల్లోనూ చుక్కలుగా వేస్తే రేచీకటి సమస్య తగ్గుతుంది. (వైద్య పర్యవేక్షణ అవసరం)
గుండె అపసవ్యంగా, అపక్రమంగా కొట్టుకుంటున్నప్పుడు తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదుగా తాగుతుంటే హితకరంగా ఉంటుంది.
తమలపాకు షర్బత్‌ని తాగితే గుండె బలహీనత తగ్గుతుంది. కఫం, మందాగ్ని దూరమవుతాయి.
ఏ కారణం చేతనైనా పసిపాపాయికి పాలివ్వలేకపోతే రొమ్ముల్లో పాలు నిలిచిపోయి గడ్డలుగా తయారై నొప్పిని కలిగిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో తమలపాకు కొద్దిగా వేడిచేసి స్తనాలమీద కట్టుకుంటే వాపు తగ్గి ఉపశమనం లభిస్తుంది.
చిన్న పిల్లలకు చీటికిమాటికి జలుబు చేసి ఇబ్బంది పెడుతున్నప్పుడు తమలపాకును వేడిచేసి, కొద్దిగా ఆముదాన్ని రాసి, ఛాతిమీద వేసి కడితే హితకరంగా ఉంటుంది.
తమలపాకు కాండంను (కులంజన్), అతిమధురం చెక్కను నూరి తేనెతో కలిపి తీసుకుంటే ఇన్‌ఫెక్షన్‌తో కూడిన జలుబు (దుష్టప్రతిస్యాయం) తగ్గుతుంది.
పాటలు పాడేవారు, ఉపన్యాసాలను ఇచ్చేవారు తమలపాకు చెట్టు కాండాన్ని చిన్న ముక్క తీసుకొని బుగ్గనుంచుకొని చప్పరిస్తుంటే అమితమైన ప్రయోజనం కనిపిస్తుంది. చక్కని శ్రావ్యమైన కంఠం వస్తుంది.
హిస్టీరియాలో కంఠం పూడుకుపోయి మాట పెగలకపోతే తమలపాకు రసం తీసుకుంటే కంఠం పెగులుతుంది. మాట స్పష్టతను సంతరించుకుంటుంది. కఫం తెగి వెలుపలకు వచ్చేస్తుంది. 2-5 తమలపాకులను వేడి నీళ్లకు కలిపి మరిగించి పుక్కిటపడితే కూడా హితకరంగా ఉంటుంది.
తమలపాకును తింటే శ్లేష్మం కరిగి పెద్ద మొత్తాల్లో స్రవిస్తుంది. దీంతో అరుగుదల తేలికగా జరుగుతుంది. నోటి దుర్వాసన తగ్గుతుంది. తిన్న వెంటనే ఆయాసం రాకుండా ఉంటుంది. మాటలో స్పష్టత వస్తుంది. అలాగే చెడు వానలు కురిసే రోజుల్లో, జలవాయు కాలుష్యాలవల్ల చెడిపోయిన ఆహారాన్ని ఇది శుద్ధపరుస్తుంది.
తమలపాకును తినడంవల్ల లాలాజలం విడుదలై దప్పిక తీవ్రత తగ్గుతుంది.
తమలపాకు తొడిమకు ఆముదం రాసి చిన్న పిల్లల్లో మల ద్వారంలోనికి చొప్పిస్తే మలనిర్హరణ జరుగుతుంది. (వైద్య పర్యవేక్షణ అవసరం)
తమలపాకును కడుపులోపలకు తీసుకుంటుంటే ఎరక్టైల్ డిస్‌ఫంక్షన్ (అంగ స్థంభన ) ఇబ్బంది పెట్టదు. తమలపాకు రసాన్ని బాహ్యంగా కూడాప్రయోగించవచ్చు.
తమలపాకు షర్బత్‌ని తీసుకుంటే బలహీనత దూరమవుతుంది.
తమలపాకు రసాన్ని టీ స్పూన్ మోతాదులో మూడుపూటలా మిరియం పొడి కలిపి తీసుకుంటుంటే జ్వరం తగ్గుతుంది.
తమలపాకును వేడిచేసి వాపు, నొప్పి కలిగిన కీలు మీద కడితే నొప్పి తగ్గుతుంది.
మొండి వ్రణం త్వరితగతిన మానాలంటే వ్రణంమీద తమలపాకును అమర్చి కట్టుకట్టుకోవాలి.
తమలపాకు రసాన్ని ముక్కులో డ్రాప్స్‌గా వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.
తమలపాకు ముద్దను తలకు పట్టించి గంటసేపు ఆగి తల స్నానం చేస్తే చుండ్రు తగ్గుతుంది.
--(())--
కామెంట్స్
ప్రాంజలి ప్రభ --30-
నేటి ఛందస్సు
UUIU UU III IIU
నీ జ్ఞాపకం నాతో కలిసి నడిచే
నీ ప్రేమయే నిన్నే కలచి వెసెనే
నీ స్నేహమే నాలో కళల తలుపే
నీ సౌఖ్యమే నా సుఖము మెరుపే
జీవితం అంటే...,
ఎడతెగని భావ పరంపరల ప్రవాహమే.
కలలుగను కన్ను నిరంతరము ప్రవాహమే
హృదయతప నంత సమాంతరము ప్రవాహమే
కళలు మనసంత చెలించు టయె ప్రవాహమే
UIi UIU UII UIU
వాస్తవ దృక్పథం ఆశల జీవితం
స్త్రీ కని పెంచటం జ్ణానపు జీవితం
స్త్రీ అని లాభమే కోరిక జీవితం
స్త్రీ నయనాలుయే మానస జీవితం
అది తప్పా అది ఒప్పా మనిషి లో ఆలోచన
కను విప్పా కథ ఒప్పా మనసు లో ఆలోచన
తల తిక్కా వల పక్కా అనుట లో ఆలోచన
మరు మళ్లే తిరునాళ్లే బతుకులో ఆలోచన
--(())--
కొత్త ఛందస్సు
IUI UIUI IIUII
సరైన స్పష్టమైన అవగాహన
వినోద సవ్యమైన సమపోషన
విశాల సృష్టికైన ఒక కోరిక
భయాలు బ్రహ్మ కైన ఇకతప్పవు
ఎకైక ధర్మమైన నయమవ్వును
అనైక కర్మలన్ని వినయమ్మును
పనైన పర్వమైన పనియవ్వును
గతైన గర్వమైన గళమవ్వును
అనాది మాటలన్ని సమరమ్ముయె
అకాల బోధలన్ని విపులమ్ముయె
అమోఘ శక్తిలన్ని సహనమ్ముయె
అనంత భావమంత సకలమ్ముయె
త్రిగుణాలు సత్వగుణము,రజోగుణము, తమోగుణము. వీటిలో తమోగుణము నీచమైనది, నిందార్హమైనది. సత్వగుణము ఉత్తమమైనది. జ్ఞాన సముపార్జనకు అనుకూల మైనది. రజోగుణము ఈ రెండింటి మిశ్రితం. పరిశుభ్రం లేని ఆకారం, అతి నిద్ర, దీనత్వం, అసహనం, హద్దులేని కోరికలు తమో గుణ లక్షణాలు. ధైర్యం, శాంతి, కరుణ, సంతోషం, విద్యలయందు ఆసక్తి సాత్వికగుణ లక్షణం. సాత్వికడైన వాడు మానవుడు జ్ఞానాన్ని సంపాదిస్తాడు. ఈ లోకంలోని సమస్తం అశాశ్వతం అని తెలుసుకుంటారు. సుఖదుఃఖాలకు అతీతంగా ఉంటాడు. అహంకారాన్ని వదిలి ఇంద్రియ నిగ్రహాన్ని సాధించి ఉత్తమ శాంతి పొందుతాడు. సత్వగుణ సంపన్నుడు శూద్రుడైనా తరువాతి జన్మలలో వైశ్యునిగా, క్షత్రియునిగా, బ్రాహ్మణుడిగా జన్మించి కడకు కైవల్యాన్ని చేరుకుంటాడు ” అని చెప్పాడు.
అగ్ని వాయువు
కౌశికుడు ” అయ్యా ! ఈ శరీరంలో అగ్ని ఎలా పుడుతుంది. వాయువులు శశరీరంలో ఎక్కడెక్కడ ఉంటాయి ” అని అడిగాడు. ధర్మవ్యాధుడు ” మహాత్మా! మన శరీరంలో ఆత్మ అనే అగ్ని శరీరం అంతా నాభి ఆధారంగా వ్యాపించి ఉంటుంది. నాభి నుండి తల వరకు వ్యాపించి ఉన్న ఈ అగ్నిలో ప్రాణవాయువు సంచరిస్తూ ఉంటుంది. ఆ ప్రాణవాయువే సకల జీవులకు ఆధారం. ప్రాణవాయువు, ఆపానవాయువు కలిసి ప్రాణాగ్నిని జ్వలింప చేస్తుంటాయి. మానవుడిలో ఆపానము, పొత్తికడుపు, బ్రహ్మరంధ్రం మధ్యలో ప్రాణాగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. ఆపానము మలమూత్రముల విసర్జనా స్థానం. కంఠంలో ఉండే ఉదానము అనే వాయువు కర్మలను నియంత్రిస్తుంటుంది. వ్యానము అనే వాయువు శరీరావయవాల కలయికలో సంచరిస్తూ ఉంటుంది. ప్రాణ ఆపాన వాయువులను ఆధారం చేసుకుని సమాన వాయువు మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసి రక్తంలో కలుపుతుంది. నాభి వద్ద ఉండే ఆ వాయువు శరీరంలోని సకల ధాతువులను పోషిస్తుంది. పంచప్రాణములను, ఆత్మాగ్నిని గురించి తెలుసుకున్న యోగులు నిరంతర అభ్యాసము వలన ఆత్మను మూర్ధత్వ స్థానమున నిలుపుకుంటారు. ఆపాన సమాన వాయువులలో సంచరిస్తున్న అగ్ని శరీరమందు జీవాత్మగా వెలుగుతున్నాడు. ఆ జీవాత్మ తామరాకు మీద నీటి బొట్టులా శరీరంలో ఉంటూ నిర్లిప్తంగా ఉంటాడు. శరీరాన్ని విడిచిన జీవాత్మయే పరమాత్మ. అచేతనంగా పడి ఉన్న శరీరాన్ని పరమాత్మ జీవాత్మగా చైతన్యవంతం చేస్తాడు. పరమాత్మ ఈలోకాలను సృష్టించే సృష్టికర్త. బుద్ధిమంతులు తమ బుద్ధి కుశలతతో జీవాత్మను పరమాత్మగా తెలుసుకుంటారు. మహాత్మా! బ్రహ్మవిద్యాతత్వం ఆచరణ సాధ్యం చేయటమెలా అన్నది వివరిస్తాను. పండితుడు శుభం, అశుభంలలో ఆసక్తి లేక సమానంగా స్పందిస్తాడు. క్రమంగా సుఖ దుఃఖములు, రాగద్వేషములు, శీతోషణముల పట్ల సమంగా ప్రవర్తిస్తాడు. అటువంటి వాడు పుణ్యాత్ముడై ఇంద్రియములను జయించి యోగసాధన చేస్తాడు. తన ఆత్మలో పరమాత్మను దర్శించి గాలి లేని చోట నిశచలంగా జ్వలించే దీపంలా ప్రకాశించి అమరత్వం పొందుతాడు. కనుక కామక్రోధాలను వదిలి కర్మఫలత్యాగం చేసి కర్మలను ఆచరించడం ఉత్తముల ధర్మం. జీవితం అశాశ్వతం అనే ఎరిగి ఇతరులకు అపకారం చేయడం వదిలి వేయాలి. ఉన్న దానికి సంతృప్తి చెంది ఇతరుల ఎడ దయ, కరుణ, మైత్రితో ప్రవర్తించాలి. ఇందియ నిగ్రహాన్ని సాధించిన వాడు పరమ సుఖాన్ని పొందుతాడు ” అని చెప్పాడు. కౌశికుడు ” మహాత్మా! నీవు సర్వజ్ఞుడవు. నీ వలన ధర్మసూక్ష్మాలు ఎరిగి ప్రబుద్ధుడనయ్యాను ” అన్నాడు.
*****
శాంత స్వభావం
జీవితం పట్ల సరైన, స్పష్టమైన అవగాహన లేక మనసు పరిపరి విధాల పరిగెడుతూంటుంది. ముందు ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన మారిపోయి దృష్టి ఎటో మరలిపోయి సాధారణమైన మన జీవన విధానంలో భయాలు, ఆందోళనలు, సందేహాలు కలిగి ఎటూ తేల్చుకోకుండా సందిగ్ధం ఏర్పడుతుంది. గతంలో జరిగినదానికి విచారించకూడదు. వర్తమాన కాలంలో జరుగుతున్న పరిణామాలను మనం అడ్డుకోలేం. వాటిని ధైర్యంగా ఎదుర్కోవలసిందే! భవిష్యత్తులో జరగబోయేది తెలియదు. అందుచేత ఏం జరగబోతోందో అని ఊహించుకుని భయాందోళనలకు గురి కావడం ఎందుకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. అన్నీ మనకు అనుకూలంగా జరుగుతాయని భావించకూడదు ప్రతికూలంగా జరుగుతాయని మానసికంగా సిద్దపడితే ధైర్యంగా ఉండగలుగుతాం. అప్పుడు మనసు వైకల్యం చెందదు
మన ఆలోచనా సరళిలో స్పష్టమైన అవగాహన ఉంటే సందేహాలు కలగవు. ఒకవేళ కలిగినా ఆ సందేహాలకు సమాధానాలు వాటంతట అవే లభిస్తాయి. ఎవరి సలహాలు సూచనలు పాటించకుండానే సందేహ నివృత్తి కలుగుతుంది. ఒక నిబద్ధతతో, మార్గనిర్దేశనంతో మనం ముందుకు సాగాలి
చిన్నచిన్న విషయాలకు ప్రాముఖ్యం ఇచ్చి భూతద్దంలో చూసి భయపడకూడదు. అటువంటి చిన్న విషయాల్ని పట్టించుకోకుండా పక్కకు నెట్టేయాలి. కొందరు కొన్ని పనులు సాధించుకోవడానికి ఒక సంఘంగా ఏర్పడ్డారనుకుందాం. ఆ సంఘీభావం వల్ల అనుకున్న ఆశయాలు నెరవేర్చుకోలేకపోవచ్చు. అలాంటప్పుడు ఆసంఘ సభ్యులు తమ లోపాలను ఒకసారి అవలోకనం
చేసుకుని, వాటిని దిద్దుకోవడానికి ప్రయత్నించాలి ఇతరులు ఆ వైఫల్యాలను గోరంతలు కొండంతలుగా చిత్రీకరించి ఆ సభ్యులను దెప్పి పొడవకూడదు. "సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వ్యక్తిని మనం ఆదుకుంటాం. మనం చేసిన సహాయానికి ఆ వ్యక్తే కృతజ్ఞతలు చెప్పకపోతే బాధపడతాం
మనం పలకరింపుగా చిరునవ్వు నవ్వితే, అవతలివాళ్లు చిరునవ్వుతో స్పందించకపోతే కుంగిపోతాం, క్షోభపడతాం వీడికింత తలబిరుసు అనుకుంటాం. అలాగే మనకూ తలబిరుసు లేకుండా చూసుకోవాలి. ఎదుటివారిలో ఏ లోపం ఉందనుకుంటామె ఆ లోపం మనలో ఉండకుండా జాగ్రత్తపడాలి. మిన్ను విరిగి మీద పడిపోతున్నా, ప్రశాంతంగా ఉండే ఉత్తమ పురుషులు మన పౌరాణిక గాథల్లో కనిపిస్తారు. అందులో ప్రహ్లాదుడు అయిదేళ్ల బాలకుడు. తన తండ్రి ఎన్ని బాధలు పెట్టినా, శ్రీహరి నామాన్ని నిరంతరం మననం చేసే ప్రశాంత స్వభావుడు
తరవాత- రాజర్షి అయిన అంబరీషుడు. దుర్వాసమహర్షి క్రుద్ధుడై తన జటాజూటం నుంచి 'కృత్య' అనే అగ్ని జ్వాలలతో ఉన్న శక్తిని అంబరీషుడిపై ప్రయోగించాడు అంబరీషుడు ప్రశాంతంగా రెండు చేతులూ తల మీద పెట్టుకుని శ్రీహరి నామస్మరణలో నిమగ్నుడైపోయాడు. అంతేకాని ప్రతీకారం తీర్చుకోవడానికి కించిత్తెనా ప్రయత్నించలేదు. ఆ శ్రీమహావిష్ణువే 'వెర్రితపసే చేయు వేడబంబు చక్కవెట్టుమనుచు' సుదర్శన చక్రాన్ని పంపి దుర్వాసుని పొగరు అణచివేశాడు.
ప్రశాంతచిత్తుల జాబితాలో ఉండాల్సినవాడు ఉత్తమోత్తముడైన మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముడు, తెల్లవారితే యువరాజుగా పట్టాభిషిక్తుడు కాదగినవాడు, జటాధారియై నారచీరలు ధరించి అడవులకు వెళవలసి వచ్చినప్పుడు ప్రశాంత చిత్రంతోబయలుదేరాడు. 'పయోనిధి' అయిన సముద్రంలో బడబాగ్ని ఉంది. అటువంటి బడబాగ్నిని తనలోనే అణచుకుని గంభీరంగా అడవులకు వెళ్లాడు. అందుకే 'కరుణాపయోనిధి' అని స్తుతించాడు కంచర్ల గోపన్న అనే భద్రగిరి రామదాసు
పైన పేర్కొన్న ఉత్తమ పురుషులు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మేరునగధీరులై, ప్రశాంత చిత్తులై, ఎటువంటి ఆందోళనలకు గురికాకుండా నిలబడగలిగిన ధీరోదాత్తులు. వాళ్లను తలచుకుంటూ మనం ముందుకు సాగితే జీవితంలో అపజయాలు సైతం విజయాలుగా పరిణమిస్తాయి
--(())--
No comments:
Post a Comment