మధురిమలు ... మాయ
వినయమ్ము చూపుటయు
కలమాయ మాపుటయు
బతుకంత వేదనయు
దైవమ్ము మాపుటయు
చిరునవ్వు పంచుటయు
మది తెల్పి ఆగుటయు
దరిచేరి వేడుటయు
నిత్యమ్ము వేడుకయు
సకలమ్ము కారణము
మదిలోని మచ్చలుయె
మనసంత రోదనము
విధిలేక బతుకుటయె
పరువాన ఉండుటయు
దరహాస మాడుటయు
వినసొంపు మాటలయు
జీవితము సాగుటయు
చతురత్వ విద్యయును
చతురత్వ భాషయును
చతురత్వ కోపమును
చతురత్వ దిక్కులను
దరహాస తీరు దయ
విరజాజి మారు దయ
మది తెల్పు కలమాయ
తను వంత వేదనాయ
మరుజన్మ యన్నదియు
సహజత్వ మాటలయు
అనునిత్య వెతుకుటయు
నాటకము ఆడుట యు
కల మాయ కోన కధ
గిరి మాయ నీతి కధ
చిరు గాలి గోలి కధ
విధి గాలి భీతి కధ
కరి మాయ కోరి కధ
నిధి మాయ వీధి కధ
మది గాలి మౌన కధ
తిధి గాలి బత్కు కధ
కావచ్చు కాలమున
వినవచ్చు శబ్దమున
కానవచ్చు చీకటిన
మనసంత మరణాన
--(())--
🌹. వాస్తవానికి దగ్గరగా రండి! 🌹
✍️ - యుగఋషి పండిత శ్రీరామశర్మ ఆచార్య
🙏. ప్రసాద్ భరద్వాజ
"తీర్థయాత్రలు చేసి నదులలో మునకలు వేయడం తప్పనిసరేమీ కాదు. జపం చేయడం, పంచామృతం సేవించడం, మందిరంలోకి వెళ్ళడం వంటివి అంత ఆవశ్యకమైనవేమీ కావు. కానీ అసలైన విషయం ఇది... మీరే ఆలోచించండి. పిల్లిమెడలో గంట కట్టాలంటే కట్టండి, కానీ వాస్తవానికి దగ్గరగా రండి! మీరు కొద్దిగా త్యాగం చేయవలసివస్తే చేయండి. సేవ చేయవలసిన అవసరం ఉంటే ఆలోచించండి. మనసును ఉదారంగా ఉంచవలసివస్తే ఉంచండి.. కొద్దిగా ఇబ్బంది అనిపిస్తే భరించండి.. కొద్దిగా శ్రమ చేయండి... ఏదైనా సరే మీరు చేసి చూపించండి.
🌹 🌹 🌹 🌹 🌹
20.
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - మార్చి 20.
Darkness is less light; evil is less good; impurity is less purity.
నాగరికత అంటే పట్టణాలలో గుమిగూడి మూర్ఖపు జీవితం గడపడం కాదు. ఇంద్రియనిగ్రహం ద్వారా మనస్సును భగవంతుడి వైపు మళ్ళించి, ఆత్మసామ్రాజ్యపు సింహాసనాన్ని అధిష్ఠించడం.
భాగవతము
శ్రీగురుభ్యోనమః
🕉🌞🌎🌙🌟🚩
రామాయణము చదువుకుంటే అన్నిటికన్నా ముఖ్యము ధర్మము అని తెలుస్తుంది. ధర్మము ననుసరించి కామము, భోగము, అర్ధ సముపార్జన ఉండాలి. ధర్మాన్ని విస్మరించి ఏ కార్యము జరుగకూడదు. ఏ వాక్యము పలుకగూడదు. అలా ఒక దీక్ష పెట్టుకుంటే బంధింపబడము. ధర్మము తెలియకుండా కార్యములు చేసినపుడు ఇరుక్కుపోవడమే ఉంటుంది. చేయవలసినవి చేయము, చెయ్యకూడనివి చేస్తూ ఉంటాము.
నిన్ను నీవు ధర్మానికి కట్టేసుకోవాలి. నాకు తోచినట్లు నేను ఉంటాను అనేవాడు జీవితములో చాలా దెబ్బతింటాడు. నేను ధర్మానికి కట్టుబడి ఉంటాను అనే దీక్షను అనుసరించేవారిని ధర్మము రక్షిస్తూ ఉంటుంది.
🕉🌞🌎🌙🌟🚩
శ్రీరమణీయం -(835)
🕉🌞🌎🌙🌟🚩
మనం నిత్యంచేసే అర్చన, పూజలు ఏ విధమైన ఫలితాలకు కారణమవుతాయి !?"
మన ప్రతి కదలిక, ఆలోచనలు.. ఆచరణలో పవిత్రత రావాలి. కేవలం భక్తి పేరుతో అరగంట, గంటకో మనసును, దేహాన్ని పవిత్రంగా ఉంచితే దైవం ఎన్నటికీ అర్ధంకాదు. అనుక్షణం మనసును పరిశుద్ధంగా ఉంచుకోగలిగితేనే అది సాధ్యం. అలాగని మనం చేస్తున్న పూజలు వృధాకావు. పూజ అంటే కృతజ్ఞతతో చేసేది. ఇప్పటికే మనకు ఎన్నో సమకూర్చిన దైవంపట్ల పూజపేరుతో మనంచూపే కృతజ్ఞతాభావం మన చుట్టూవున్న సృష్టి, మనుషులు, ప్రాణికోటిపై కూడా ఏర్పడాలి. పూజలోచేసే షోడషోపచారాలు కేవలం విగ్రహం కోసం రూపొందించినవి కావు. ఇతరుల విషయంలో మనం ఎలా ఉండాలో నేర్పటం కోసం పొందుపర్చబడినవి. దైవాన్ని ప్రార్ధించటం అంటే ఏదో కావాలని అడగటం. దైవాన్ని ఎందుకు అడగాలంటే మనకంటే శక్తివంతమైనది కాబట్టి !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
"ఇంద్రియాతీతమైన దైవానుభూతే శాశ్వతంగా నిలిచి ఉంటుంది..!" [అధ్యాయం -103]
🕉🌞🌎🌙🌟🚩
"ఋభుగీత "(302)
🕉🌞🌎🌙🌟🚩
"బ్రహ్మము"
21వ అధ్యాయము
మనలో ఉన్న సహజ ధ్యానాన్ని గుర్తించడానికే మన సాధన అంతా !
ధ్యానం అంటే కార్యాలు, ఆలోచనలు ఆపడం కాదు. ఎదో చేయాలని లేకపోవడం. ఏ సంకల్పాలు రాకపోవడం. మనసు శుద్ధఎరుకగా ఉండి కదలటం. ప్రయత్నంతో ఆలోచనలు ఆపితే వచ్చేది ధ్యానంకాదు. ఎందుకంటే ఆలోచనలు ఆపాలనేది కూడా ఒక ఆలోచనేకదా ? ఎందులోనూ తన ప్రమేయం లేదని గుర్తించి అవగాహనతో మనసే సహజమైన అనాలోచిత స్థితికివెళ్తే అది ధ్యానంగా పరిమళిస్తుంది. ధ్యానస్థితిలో ఏదీ కావాలనుకోవడం, వద్దనుకోవడం ఉండదు. ఈ అనుకోవడమే మనసుచేసే పెద్ద శబ్దం. నిజానికి మనసు ఎలాగైతే పరమశాంతితో ఉంటుందో, అలాగే నిరంతరరాయంగా ధ్యానంలోనే ఉంటుంది. మనలో ఉన్న సహజధ్యానాన్ని గుర్తించడానికే మన సాధన అంతా !
🕉🌞🌎🌙🌟🚩
🧘♂️నేనంటే ఎవరు?🧘♀️
ప్రపంచంలోని ప్రతి వ్యక్తీ తనను పరిచయం చేసుకునే సందర్భంలో ‘నేను’తోనే ప్రారంభిస్తాడు. నేనంటే ఎవరు ? మనిషి జాతా, కులమా, గుణమా, శరీరమా, ధనికత్వమా, అధికార హోదానా... మరేదైనా ప్రత్యేకతా ?
శిశువు జన్మించినప్పుడు కులమతాల స్పృహ ఉండదు. ‘నేను’ అనే అహంకారం ఉండదు. మాటలు వచ్చాక ‘నేను’ మొదలవుతుంది. శరీరం, దానికి అంటిపెట్టుకున్నవన్నీ ‘నావి’ అనుకుంటాడు. అలాగే పెద్దవాడవుతాడు. ఈ భావన బలపడుతున్న కొద్దీ సభ్యసమాజం నుంచి వేరుపడుతుంటాడు.
మనసు అనే కోశంలో పాములా స్వార్థం బుసలు కొడుతూ ఉంటుంది. అది ఎప్పుడు ఎవర్ని కాటు వేస్తుందో తెలియదు. కాటు వేసే పాముకు కారణాలేముంటాయి ? అది దాని స్వభావం. స్వార్థపరుడు ప్రతి అవకాశాన్నీ వాడుకుంటాడు.
సమాజంలో అందరూ మంచివారే ఉండరు. భిన్న మనస్తత్వాలవారు ఉంటారు. తమను, తమ గౌరవమర్యాదలను కాపాడుకుంటూ మనిషి జీవనప్రయాణం సాగించాలి.
‘నేను- ఎవరో తెలుసు కోవడంలోనే ఆధ్యాత్మిక రహస్యం అర్థమవుతుంది’ అనేవారు శ్రీరమణమహర్షి. నేను అనే మాయ సృష్టి మొదలు నుంచి మనిషిని ఆవరించుకుని ఉంది. శ్రీరాముడు కూడా ‘నేను’ నిర్వచనం కోసం వసిష్ఠమహర్షిని ఆశ్రయించాల్సి వచ్చింది. విశ్వామిత్ర, వసిష్ఠ, శ్రీరాముల ఆధ్యాత్మిక చర్చ యోగ వాసిష్ఠంగా రూపుదిద్దుకొంది.
ఆ గ్రంథం చదివి, అవగతం చేసుకున్నవారికి మాయతెరలు తొలగి ‘నేను’ ఎవరో అర్థమవుతుంది. ఏది నిజం కాదో అదే మాయ. అసత్యాన్ని నిజమనే భ్రమ కలిగిస్తుంది మాయ.
మంచితనమనే ముసుగు ధరించిన ఎందరో మనకు జీవితంలో తారసపడుతుంటారు. వీళ్లనే ‘గోముఖ వ్యాఘ్రా’లంటారు. పులి ఆవు ముఖం ధరిస్తే స్వభావం మారదు.
ప్రతి వ్యక్తినీ గుడ్డిగా నమ్మకూడదు. అతి నమ్మకంతోనే సమస్యలు మొదలవుతాయి. కొన్ని సమస్యల నుంచి ఎలాగోలా బయటపడతాం. కొన్ని ‘ఊబి’లోకి దింపేస్తాయి. ముందు జాగ్రత్తతో ముప్పును తప్పించుకోవాలి. ఏదో జరిగేవరకు నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏదీ జరగకుండా అప్రమత్తంగా ఉండాలి.
జాగ్రత్తగా గమనిస్తే ‘నేను’లో దాగిన అనేక రూపాలు మనకు ప్రత్యక్షమవుతాయి. గృహంలో ఉన్నప్పుడు నేను- భర్తగా, తండ్రిగా, పెద్దలు ఉంటే కుమారుడిగా, సోదరుడిగా వ్యవహరిస్తాడు. వృత్తి, ఉద్యోగాల వేళ ‘నేను’ అధికార హోదా అవుతాడు. మిత్రుల మధ్య ఒక సరదా మనిషి అవుతాడు. బాల్యమిత్రులు అగుపిస్తే బాలుడైపోతాడు. బంధువుల మధ్య బాంధవుడవుతాడు. కష్టాల్లో ఉన్నప్పుడు దీనుడవుతాడు. ఆపదలో ఉన్నప్పుడు ఆపన్నుడవుతాడు. శత్రువుల పట్ల కర్కశుడవుతాడు. ఇలా ‘నేను’ నిత్యమూ అనేక పాత్రలు పోషిస్తుంటుంది.
జ్ఞాన బోధల్లో ‘నేను’ అంటే ఆత్మ అనే నిర్వచనాలు వింటాడు. కాబోలు అనుకుంటాడు తప్ప ఆత్మవిచారం చేసి, తనలోని అంతర్యామిని వెతుక్కోడు. జీవిత చరమాంకం దాకా నేను ఆత్మ భావనలోకి మారకపోవడమే మాయ. దీన్ని జయించాలంటే గీతాకృష్ణుడు చెప్పినట్లు, వైరాగ్యమనే ఆయుధం కావాలి. లేదా సంపూర్ణ శరణాగతి చెయ్యాలి. లేకపోతే జీవితం నిష్ఫలమవుతుంది.
మనకు దైవరూపాలు ఎన్ని ఉన్నా మూలరూపం ‘ఓం’కారమే. యోగులు ‘ఓం’కారమే ధ్యానిస్తారని చెబుతారు. ఓంకారంలోని అకార-ఉకార-మకారాలే త్రిమూర్తులంటారు. మనిషి ‘నేను’ భావనలోంచి ఆత్మభావనలోకి ప్రవేశించడానికి ‘ఓం’కార ధ్యానం ఉపకరిస్తుందని యోగులు చెబుతారు !
199) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
ఏవ మానంద విజ్ఞానమయౌ మాయాధియోర్వశౌ ౹ తదధిష్ఠాన కూటస్థ బ్రహ్మణీ తు సునిర్మలే ౹౹226౹౹
226. అట్లే ఆనందమయ కోశము, విఙ్ఞానమయ కోశము అనునవి మాయ దాని వికారమగు బుద్ధి ఉపాధులుగ ఏర్పడినవి.వానికి ఆధారములు,అధిష్ఠానములు అగు కూటస్థము బ్రహ్మము అనేవి పరిశుద్ధములు.
వ్యాఖ్య:- తత్,త్వం అనే పదాలయొక్క శోధనస్వరూపాన్ని చూపించటానికై వెనుకటి దృష్టాంతాన్ని గుర్తు చేస్తున్నారు.
తత్,త్వం అనే పదాల్ని బాగా శోధనచేసి శుద్ధరూపాన్ని ప్రదర్శించాల్సి ఉంది.ఈ ప్రకరణమునందు తత్,త్వం అనే పదాల శోధనమే ముఖ్య ప్రయోజనం.
అందుచేత,ఘటాకాశ మహాకాశాలు,జలాకాశ,
అభ్రాకాశాల దృష్టాంతం లోగడ చూపబడ్డది.దానిని బట్టి,
ఘటాకాశస్థానీయుడు కూటస్థుడు,
మహాకాశస్థానీయుడు పరబ్రహ్మ,
జలాకాశస్థానీయుడు జీవుడు,
మేఘాకాశస్థానీయుడు ఈశ్వరుడు!
అని గుర్తుచేసుకోవాలి.
పదార్థశోధన పద్దతి,
జలాకాశం జలరూపమైన ఉపాధియొక్క ఆధీనంలోను, మేఘాకాశం మేఘం అనే ఉపాధియొక్క ఆధీనంలోను ఉన్నందువల్ల పారమార్థికమైనవి
కావు.
వాటికి ఆశ్రయభూతమైన ఘటాకాశం,మహాకాశం అనేవి స్వచ్ఛమైనవి.
జలంలాంటి ఏవిధమైన ఉపాధిని ఆపేక్షించకుండా శుద్ధము,నిర్మలము
అయినవి కేవలం ఆకాశ మాత్రంగానే. ఉన్నాయి కాబట్టి!
ఇదే విధముగా ఆనందమయుడైన ఈశ్వరుడు మాయ అనే ఉపాధి యొక్క ఆధీనములోను, విజ్ఞానమయుడైన జీవుడు బుద్ధి అనే ఉపాధి ఆధీనములోను ఉన్నారు.
కాని వారిద్దరికి అధిష్ఠానాలైన కూటస్థుడు,బ్రహ్మ ఈ ఇరువురు మాత్రం,
శుద్ధము,నిర్మలము (పరిశుద్ధము)అయినవారు-ఘటాకాశ మహాకాశాల్లాగా !
పదార్థ శోధనలో ఉపయోగపడుతున్నప్పటికి సంఖ్యయోగమతాలు అంగీకరింపదగినవి కావు.
మధురిమలు ...
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఉదయభాను ప్రయాణం
జీవ యుత్తేజ భావం
ధర్మ చరిత తత్వ మయం
జీవ మనసు ఉల్లాసం
సూర్యనిది ఉష్ణ తాపం
పుడమిదీ సహన శాపం
ఇరువురిది ప్రకృతి ధర్మం
అదియె జీవులకు మార్గం
సూర్యుని ధర్మం తాపం,
జలమునకు ధర్మం రసం
అగ్నికి ధర్మం దహనం,
జీవునికి ఆత్మజ్ఞానం
మన ధర్మం సంస్కారం
మన పలుకులు సంసారం
మతము న్యాయసమ్మతం
బతికించు మానవత్వం
తేజస్సుయె విస్తారం
భక్తికి ఇదిఒక మార్గం
నిత్య హృదయం నిర్మలం
ఏకభావ సమ్మోహం
నిత్యతృప్తి సంతోషం
లక్ష్మికి స్థిరనివాసం
మనసులొ సత్యాంగత్యం
ఏర్పడును ఉత్తమ గుణం
పలుకులలోన ఉత్తమం
జీవితానికి సార్ధకం
అక్కడ బ్రహ్మ జ్ఞానం
దేవుని సాక్షాత్కారం
***
ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడి పాండిత్యం గురించి చాలా దూరదూరాల వరకు కీర్తి వ్యాపించింది. ఒకసారి ఆ దేశపు రాజు అతడిని ఆహ్వానించాడు. చర్చ చివరలో అతడితో అన్నాడు- “అయ్యా నీవు జ్ఞానివి. విద్యావంతుడవు. కానీ నీ కొడుకు ఇంత మూర్ఖుడేంటి? అతడిని కూడా కాస్త చదివించు. అతడికి బంగారము వెండి మధ్యలో ఏది విలువైనదో కూడా తెలియదు.”
అంతవరకు చెప్పి ఆ రాజు పెద్దగా నవ్వాడు. బ్రాహ్మణుడు ఆ మాటకు చాలా బాధపడ్డాడు. ఇంటికి వచ్చి తన కొడుకును అడిగాడు- “బంగారము వెండి ఈ రెంటిలో ఏది విలువైనది?” అని.
“బంగారము” ఒక క్షణం కూడా ఆలోచించకుండా అతని కొడుకు సమాధానం చెప్పాడు.
“నీ సమాధానం సరైనదే. మరి రాజు ఎందుకు ఇట్లా అన్నాడు? అందరి ఎదుట నన్ను పరిహసించాడు.”
అది విని అతడి కొడుకుకు విషయం మొత్తం అర్థం అయింది. అతడు అన్నాడు- “రాజు ఈ ఊరికి దగ్గరలో ఒక సభను నిర్వహిస్తాడు. గొప్పగా పేరుపొందిన వారంతా అక్కడ భాగం గ్రహిస్తారు. ఆ సదస్సు నేను బడికి పోయే దారిలో వస్తుంది. అతడు నన్ను చూడగానే వెంటనే పిలుస్తాడు. ఒక చేతిలో బంగారు నాణేన్ని, మరొక చేతిలో వెండి నాణేన్ని పట్టుకుంటాడు. ‘రెంటిలో ఎక్కువ విలువైనదానిని తీసుకో.’ అంటాడు. అప్పుడు నేను వెండి నాణేన్ని తీసుకుంటాను. అందరూ గట్టిగా నవ్వుతారు. వారికి వినోదం కలుగుతుంది. ఈ విధంగా ప్రతి రోజు జరుగుతుంది.”
“అయితే నీవు బంగారు నాణాన్ని ఎందుకు తీసుకోవు? జన సభలో నన్ను నిన్ను అవమానం పాలు ఎందుకు చేస్తావు?”
అప్పుడు ఆ బాలుడు నవ్వాడు. తండ్రిని చేయి పట్టుకొని ఇంటి లోపలకు తీసుకొని వెళ్ళాడు. అల్మారాలోని ఒక పెట్టెను తెరిచి చూపించాడు. దాని నిండా వెండి నాణాలు ఉన్నాయి. అది చూసి బ్రాహ్మణుడు చాలా ఆశ్చర్యపోయాడు.
అప్పుడు అతడి కొడుకు ఇలా అన్నాడు- “తండ్రీ, ఏ రోజైతే నేను బంగారు నాణాన్ని తీసుకుంటానో అప్పుడు ఈ ఆట పూర్తవుతుంది. ఒకవేళ వారు నన్ను తెలివిలేని వాడిగా భావించి నవ్వితే నవ్వనివ్వండి. నేను వివేకవంతుడిని అని వారికి చూపిస్తే నాకేంటి లాభం? నేను మీ పుత్రుడిని. అందువల్ల తెలివితో పనిచేస్తాను. నిజంగా మూర్ఖుడిని అయితే అది వేరు. మూర్ఖుడిగా భావింపబడేది వేరు. బంగారం వంటి అవకాశం కోసం ఎదురు చూడటం కన్నా ప్రతి అవకాశాన్ని బంగారం లాగా మార్చుకోవటం నయం.” కనుక నిజమైన జ్ఞాని ఇతరులకోసం కాకుండా తనకోసం అవకాశాలు ఉపయోగించుకుంటాడు
సహన ఫలం
✍️ నారంశెట్టి ఉమామహేశ్వరరావు
‘సహనం బలం, సహనం ఫలం” అన్నాయి గ్రంథాలు. కష్టకాలంలో నిగ్రహం పాటిస్తూ, ఉద్వేగాన్ని దాచుకుంటూ బాధను అధిగమించడమే సహనం. సహనంతో ఆలోచిస్తే సమస్యలు దూరమై సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి.
“శత్రు మిత్రులందు, మానావమానములందు, సుఖదుఃఖాలందు సమానంగా ఉండాలని, దూషణ భూషణలకు చలించక కలిగిన దాంతో తృప్తి చెందాలని” భగవద్గీత చెప్పినట్టు ప్రవర్తించిన మహాపురుషులను పురాణాలు పరిచయం చేశాయి. సింహాసనం బదులు వనవాసం ప్రాప్తించినా, సీతా వియోగం తటస్థించినా మనోధైర్యాన్ని వీడని రాముని స్థిత ప్రజ్ఞత్వాన్ని రామాయణం, దుష్ట చతుష్టయ పన్నాగాల ఫలితంగా రాజ్యలక్ష్మిని వీడి అరణ్య, అజ్ఞాత వాసాల బాట పట్టాల్సి వచ్చినా సహనశీలురై మెలుగుతూ విజయలక్ష్మిని చేపట్టిన పాండవుల చరితను భారతం తెలిపాయి.
“సమత్వం యోగ ఉచ్యతే“ అని భగవద్గీత చెప్పినట్టు ఆధ్యాత్మిక మార్గంలో నడిచిన భక్తులు ప్రతికూలాన్ని కూడా అనుకూలంగా మార్చుకుంటారు. అలాంటి సహనశీలురు భూమి మీద నడయాడారనడానికి నిదర్శనాలు చరిత్రలో కనిపిస్తాయి.
చెరకు తోట నుండి బండి నిండుగా చెరకు గడలతో వస్తూ దారిపొడుగునా దానం చేస్తూనే ఒక్క గడతో ఇంటికి వచ్చిన తుకారాం మీద కోపంతో చెరకు గడ విరిగేలా కొట్టిందతని భార్య. రెండు ముక్కలయిన చెరకుగడ నుండి ఒకటి భార్యకిచ్చి ‘తెచ్చిన చెరకులో సగము నీకిచ్చి, మిగతాది పిల్లలూ నేనూ తిందామనుకున్నాం. చెరకు గడను కోసే శ్రమ తప్పించావన్న” తుకారాం మాటలకు తల బాదుకుందా ఇల్లాలు. సహనమంటే అంత నిలకడగా ప్రవర్తించడం .
తత్వవేత్త సోక్రటీసు భార్య గయ్యాళి. నిరంతరం తత్వవిచారణలో మునిగే భర్తంటే చిరాకు ఆమెకు. ఒకసారి భోజనానికి రమ్మని పిలిచినా స్పందించని భర్త మీద బిందెడు నీళ్లను కుమ్మరించిందామె. “రోజూ ఉరుములే ఉరిమేవి. ఈ రోజు వర్షము కూడా కురిసింది. పైగా స్నానం చేసే పని తప్పిందని” సోక్రటీస్ పలికేసరికి నివ్వెరపోయిందా ఇల్లాలు.
“కెరటాలు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సముద్రాన్ని చులకనగా చూడటం ఎంత తెలివి హీనతో, సహన శీలురను తక్కువగా అంచనా వేయడం అంతేనని” గ్రంథాలు చెప్పినట్టు సహన శీలురను గౌరవించడం నేర్చుకుని, వారిలోని సుగుణాలను అలవరచుకోవాలి.
జీవితంలో విషమ సమస్యలు ఎదురైతే చావును శరణు వేడకుండా సహనంతో యోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. సరైన ఆలోచన కలగనప్పుడు అనుభవజ్ఞుల్ని ఆశ్రయిస్తే పరిష్కారం లభిస్తుంది. అసహనంతో జీవితాన్ని అంతం చేసుకుంటే అనుకున్నది సాధించలేరు సరికదా అపకీర్తి మిగులుతుందనే సత్యాన్ని గ్రహిస్తే భవిష్యత్తును ఆనందమయం చేసుకోగలరు.
***
సృష్టికర్త బ్రహ్మదేవుడికి ఆలయాలే లేవెందుకు? త్రిమూర్తుల్లోకెల్లా చిన్నవాడయిన బ్రహ్మ ఎప్పుడూ వృద్ధుడుగానే ఉంటాడెందుకు?
పద్మపురాణం ప్రకారం వజ్రనాభ అనే రాక్షసుడు ప్రజల్ని హింసించడం చూసి తట్టుకోలేక వెంటనే తన చేతిలోని తామరపూవునే ఆయుధంగా విసిరి ఆ రాక్షసరాజుని సంహరించాడట సృష్టికర్త. ఆ సందర్భంగా పూవునుంచి రేకులు మూడుచోట్ల రాలి మూడు సరస్సులు ఏర్పడ్డాయట. వాటినే జ్యేష్ట పుష్కర్, మధ్య పుష్కర్, కనిష్ట పుష్కర్ అని పిలుస్తున్నారు. పైగా బ్రహ్మ భూమ్మీదకి వచ్చి తన చేతి(కరం)లోని పుష్పం నుంచి రాలిపడ్డ ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతానికి పుష్కర్ అని పేరు పెట్టాడట. ఆ తరవాత లోకకల్యాణం కోసం అక్కడే యజ్ఞం చేయాలనీ సంకల్పించాడట. ఎలాంటి ఆటంకాలూ లేకుండా యజ్ఞం ప్రశాంతంగా నిర్వహించేందుకు రాక్షసులు దాడి చేయకుండా సరస్సుకి దక్షిణాన రత్నగిరి, ఉత్తరాన నీలగిరి, పశ్చిమాన సంచూరా, తూర్పున సూర్యగిరి అనే కొండల్ని సృష్టించి దేవతలందరినీ ఆహ్వానించాడు. సుమూహుర్తం ఆసన్నమయింది. ఆహూతులంతా విచ్చేశారు. సావిత్రీదేవి(ఈమెనే సరస్వతి అని పిలుస్తారు)ని తీసుకుని రమ్మని కుమారుడైన నారదుడిని పంపిస్తాడు బ్రహ్మ.
నారదుడు వెళ్లేసరికి ఆమె రావడానికి సిద్ధంగానే ఉంది. కానీ కలహభోజనుడు వూరికే ఉంటాడా... 'నువ్వు ఒక్కదానివే అప్పుడే వచ్చి ఏం చేస్తావు. నీ స్నేహితులతో కలిసిరమ్మ'ని సలహా ఇస్తాడు. దాంతో తన సహచరులైన లక్ష్మీ, పార్వతిలతో కలిసి వద్దామని ఆగిపోతుంది సావిత్రి. యజ్ఞవాటిక దగ్గర మూహూర్తం మించిపోతోంది. సావిత్రీదేవి జాడ లేదు. దేవతలు, రుషులు అంతా సిద్ధంగా ఉన్నారు. అనుకున్న మూహూర్తానికే యజ్ఞం జరగాలన్న తలంపుతో బ్రహ్మదేవుడు ఇంద్రుడితో 'వెంటనే ఓ అమ్మాయిని చూడు. వివాహం చేసుకుని యజ్ఞం నిర్వహిస్తాను' అనడంతో సమీపంలోని గుజ్జర్ల కుటుంబానికి చెందిన పాలమ్ముకునే ఓ అమ్మాయిని తీసుకొస్తాడు ఇంద్రుడు. శివుడు, శ్రీమహావిష్ణువు సలహాల ప్రకారం గోవులోకి పంపించడం ద్వారా ఆమెను శుద్ధి చేస్తారు. ఇలా చేస్తే ఆమె పునర్జన్మ ఎత్తినట్లేనని చెప్పి అభ్యంగన స్నానం
చేయించి సర్వాభరణశోభితురాలిని చేస్తారు. గోవుతో శుద్ధిచేయబడినది కాబట్టి ఆమెకు గాయత్రి అని నామకరణం చేసి నిర్ణీత సమయానికి యజ్ఞం ప్రారంభిస్తారు. పూర్తవుతున్న సమయంలో అక్కడకు వచ్చిన సావిత్రీదేవి బ్రహ్మదేవుడికి పక్కన మరో స్త్రీ ఉండటం చూసి ఉగ్రరూపం దాలుస్తుంది. బ్రహ్మదేవుడితోసహా అక్కడున్న వారందరినీ శపిస్తుంది. భర్తని వృద్ధుడై పొమ్మనీ ఆయనకు ఒక్క పుష్కర్‌లో తప్ప మరెక్కడా ఆలయాలు ఉండవనీ శపిస్తుంది. అన్ని యుద్ధాల్లోనూ ఓటమి తప్పదని ఇంద్రుడినీ, మానవజన్మ ఎత్తి భార్యావియోగంతో బాధపడతావని విష్ణుమూర్తినీ, శ్మశానంలో భూతప్రేతగణాలతో జీవించమని ఈశ్వరుణ్ణీ, దారిద్య్రంతో ఇల్లిల్లూ తిరిగి భిక్షాటన చేసుకొమ్మని బ్రాహ్మణులనీ ధనమంతా దొంగలపాలయి నిరుపేదగా మారమని కుబేరుణ్ణీ శపిస్తుందట. తరవాత ఆమె రత్నగిరి పర్వతాల్లోకి వెళ్లి తపస్సమాధిలోకి వెళ్లిపోయిందనీ ఆపై నదిగా మారిందనీ చెబుతుంటారు.
దీన్ని సూచిస్తూ రత్నగిరి కొండమీద సావిత్రీమాత ఆలయంతోపాటు ఓ చిన్న నీటిప్రవాహం కూడా ఉంది. దీన్ని సావిత్రీనది అని పిలుస్తారు స్థానికులు. ఆమెను పూజించిన స్త్రీలకు నిత్యసుమంగళి వరాన్ని ప్రసాదిస్తుందన్న నమ్మకంతో పుష్కర్‌ను సందర్శించిన భక్తులంతా ఆమె ఆలయాన్ని కూడా తప్పక దర్శిస్తారు.
సావిత్రీదేవి వెళ్లిన తరవాత బ్రాహ్మణులను యజ్ఞం పూర్తిచేయమని కోరతాడు బ్రహ్మదేవుడు. అందుకు వారంతా తమకు శాపవిముక్తి చేయమనీ ఆ తరవాతే యజ్ఞక్రతువు చేస్తామనీ అంటారట. అప్పటికే యజ్ఞఫలంతో సిద్ధించిన శక్తులతో గాయత్రీదేవి పుష్కర్ ప్రముఖ తీర్థక్షేత్రంగా వర్ధిల్లుతుందనీ ఇంద్రుడు మళ్లీ స్వర్గాన్ని గెలుచుకుంటాడనీ విష్ణుమూర్తి రాముడిగా జన్మిస్తాడనీ బ్రాహ్మణులు గురువులుగా గౌరవాన్ని అందుకుంటారంటూ శాపతీవ్రతని తగ్గిస్తుందట. బ్రహ్మదేవాలయం పుష్కర్‌లో మాత్రమే ఉండటానికి ఇదే కారణమట. అయితే బ్రహ్మదేవాలయాలు అత్యంత అరుదుగానయినా అక్కడక్కడా లేకపోలేదు
👉తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి
https://t.me/teluguvelugu01
నీది నాది మనది!
‘స్వామీ! ఒక ధర్మసందేహం’’
‘‘సంశయించకుండా అడుగు నాయనా!’’
‘‘ప్రతిదీ నాది నాది అనుకుంటాం. దీన్నుంచి బయటపడే మార్గం లేదా?’’
‘‘ఒక చిన్నకథ చెబుతాను. విన్న తర్వాత సందేహం ఉంటే అడుగు’’
అనగనగా ఒక ఏకాంబరం. ఒకరోజు పొరుగూరికి వెళ్లి తిరిగొచ్చేసరికి అతని ఇల్లు తగలబడిపోతోంది. ఊరి జనమంతా చేరి చోద్యం చూస్తున్నారు.
ఏకాంబరం గుండెపగిలిపోయింది. తాతల కాలం నాటి ఇల్లు కళ్లెదుటే పరశురామ ప్రీతి అయిపోతోంది. ఎలా! ఎలా! మనసులో ఒకటే బాధ. ఏమీ చెయ్యలేని నిస్సహాయత. నిన్ననే ఇంటికి బేరం వచ్చింది. అసలు ధరకంటే ఎక్కువే ఇవ్వచూపాడు ఆ ఆసామి. కానీ, ఇంటి మీద మమకారంతో తనే ఒప్పుకోలేదు.
ఇంతలో ఏకాంబరం పెద్దకొడుకు వచ్చాడు. ‘‘మీరు ఊరెళ్లినప్పుడు అతగాడు మళ్లీ వచ్చాడు. ఇంకా ఎక్కువకే కొంటానని చెప్పి చాలామొత్తం బయానా కూడా ఇచ్చాడు. బేరం బాగుందని మీకు చెప్పకుండానే ఒప్పుకున్నాను’’ తండ్రి చెవిలో చెప్పాడు. ఈ మాట వినగానే ఏకాంబరం మనసు స్థిమితపడింది. ‘హమ్మయ్య! ఇప్పుడు ఇల్లు నాది కాదు’ ఈ భావన కలగగానే అతడూ చోద్యం చూస్తున్న వాళ్లలో ఒకడిగా మారిపోయాడు.
కాసేపటికి రెండో కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ‘‘మన ఇల్లు అలా కాలిపోతుంటే మీరేంటి చూస్తూ నిలబడ్డారు?’’ తండ్రిని అడిగాడు. ‘‘ఇంకెక్కడ మన ఇల్లు! మీ అన్నయ్య నిన్ననే దీన్ని అమ్మేశాడు’’ అన్నాడు ఏకాంబరం. ‘‘భలేవారే! ఆయన మనకు బయానా మాత్రమే ఇచ్చాడు. పూర్తి పైకం ఇవ్వలేదుగా’’ అన్నాడు కొడుకు.
ఏకాంబరానికి మళ్లీ దిగులు పట్టుకుంది. కొంతసేపటి కిందటి వరకూ ఉన్న ‘నాది’ అన్న భావన మళ్లీ వచ్చేసింది. ఇంతలో మూడో కొడుకు వచ్చి మరో మాట చెప్పాడు- ‘‘చూశావా నాన్నా మన ఇల్లు కొన్నవాడు ఎంత మంచివాడో! ఈ ప్రమాదం రేపు జరిగి ఉంటే ఏమయ్యేది! ఇలా జరుగుతుందని మీకూ తెలియదు, నాకూ తెలియదు. కాబట్టి మీ నాన్నను బాధపడవద్దని చెప్పు. ఆ ఇల్లు నాదే. మాట ప్రకారం డబ్బు మొత్తం ఇచ్చేస్తా అన్నాడు’’. అంటే- ఈ ఇల్లు తనది కాదు. ఈ భావన మళ్లీ అంకురించడంతో ఏకాంబరం తిరిగి నలుగురిలో ఒకడిగా మారిపోయాడు.
నిజానికి ఏదీ మారలేదు. మారిందల్లా తనదీ, పరాయిదీ అన్న భావన ఒక్కటే!
--((()))--
నీది నాది మనది!
‘స్వామీ! ఒక ధర్మసందేహం’’
‘‘సంశయించకుండా అడుగు నాయనా!’’
‘‘ప్రతిదీ నాది నాది అనుకుంటాం. దీన్నుంచి బయటపడే మార్గం లేదా?’’
‘‘ఒక చిన్నకథ చెబుతాను. విన్న తర్వాత సందేహం ఉంటే అడుగు’’
అనగనగా ఒక ఏకాంబరం. ఒకరోజు పొరుగూరికి వెళ్లి తిరిగొచ్చేసరికి అతని ఇల్లు తగలబడిపోతోంది. ఊరి జనమంతా చేరి చోద్యం చూస్తున్నారు.
ఏకాంబరం గుండెపగిలిపోయింది. తాతల కాలం నాటి ఇల్లు కళ్లెదుటే పరశురామ ప్రీతి అయిపోతోంది. ఎలా! ఎలా! మనసులో ఒకటే బాధ. ఏమీ చెయ్యలేని నిస్సహాయత. నిన్ననే ఇంటికి బేరం వచ్చింది. అసలు ధరకంటే ఎక్కువే ఇవ్వచూపాడు ఆ ఆసామి. కానీ, ఇంటి మీద మమకారంతో తనే ఒప్పుకోలేదు.
ఇంతలో ఏకాంబరం పెద్దకొడుకు వచ్చాడు. ‘‘మీరు ఊరెళ్లినప్పుడు అతగాడు మళ్లీ వచ్చాడు. ఇంకా ఎక్కువకే కొంటానని చెప్పి చాలామొత్తం బయానా కూడా ఇచ్చాడు. బేరం బాగుందని మీకు చెప్పకుండానే ఒప్పుకున్నాను’’ తండ్రి చెవిలో చెప్పాడు. ఈ మాట వినగానే ఏకాంబరం మనసు స్థిమితపడింది. ‘హమ్మయ్య! ఇప్పుడు ఇల్లు నాది కాదు’ ఈ భావన కలగగానే అతడూ చోద్యం చూస్తున్న వాళ్లలో ఒకడిగా మారిపోయాడు.
కాసేపటికి రెండో కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ‘‘మన ఇల్లు అలా కాలిపోతుంటే మీరేంటి చూస్తూ నిలబడ్డారు?’’ తండ్రిని అడిగాడు. ‘‘ఇంకెక్కడ మన ఇల్లు! మీ అన్నయ్య నిన్ననే దీన్ని అమ్మేశాడు’’ అన్నాడు ఏకాంబరం. ‘‘భలేవారే! ఆయన మనకు బయానా మాత్రమే ఇచ్చాడు. పూర్తి పైకం ఇవ్వలేదుగా’’ అన్నాడు కొడుకు.
ఏకాంబరానికి మళ్లీ దిగులు పట్టుకుంది. కొంతసేపటి కిందటి వరకూ ఉన్న ‘నాది’ అన్న భావన మళ్లీ వచ్చేసింది. ఇంతలో మూడో కొడుకు వచ్చి మరో మాట చెప్పాడు- ‘‘చూశావా నాన్నా మన ఇల్లు కొన్నవాడు ఎంత మంచివాడో! ఈ ప్రమాదం రేపు జరిగి ఉంటే ఏమయ్యేది! ఇలా జరుగుతుందని మీకూ తెలియదు, నాకూ తెలియదు. కాబట్టి మీ నాన్నను బాధపడవద్దని చెప్పు. ఆ ఇల్లు నాదే. మాట ప్రకారం డబ్బు మొత్తం ఇచ్చేస్తా అన్నాడు’’. అంటే- ఈ ఇల్లు తనది కాదు. ఈ భావన మళ్లీ అంకురించడంతో ఏకాంబరం తిరిగి నలుగురిలో ఒకడిగా మారిపోయాడు.
నిజానికి ఏదీ మారలేదు. మారిందల్లా తనదీ, పరాయిదీ అన్న భావన
--(())--
వేద స్వరం - శిక్ష
మహా పెరియవర్ సాక్షాత్ పరమాత్మ స్వరూపులు, శివావతారులు. ఈ శతాబ్ధపు ఆది శంకరాచార్యులు. అప్పుడు స్వామి వారు కుంబకోణంలోని కంచి మఠంలో మకాం చేస్తున్నారు. వ్యాస పూర్ణిమ చాలా ఘనంగా జరిగింది. చంద్రమౌళీశ్వర పూజ పూర్తి అయిన తరువాత భక్తులందరూ పరమాచార్య స్వామి స్వహస్తాలతో ఇచ్చే అభిషేక తీర్థం కోసం ఆత్రుతగా వచ్చారు. వరుసగా నిలబడి వస్తున్న వాళ్ళలో ఒక భక్తుణ్ణి మహాస్వామి వారు తలెత్తి చూసారు.
వారు అతనితో, ”రేపు తెల్లవారుఝామున జరిగే వేదపారాయణానికి రా” అని అన్నారు. మహాస్వామి వారి ఆజ్ఞకి తిరుగేముంది?
స్వామి వారి ఆదేశం మేరకు మరుసటిరోజు ఉదయాన్నే వచ్చి, వేదపారాయణంలో పాల్గొన్నాడు. పారాయణం జరుగుతూ ఉండగా ఆశ్చర్యకరంగా మహాస్వామి వారు వచ్చారు. వారు చాలా అరుదుగా వస్తారు.
నిన్న తాము రమ్మన్న భక్తుడు చాలా శ్రద్ధగా భక్తితో వేదాలను ఆమ్నాయం చెయ్యడం గమనించారు. వేదపారాయణం తరువాత అందరికి తీర్థప్రసాదాలు ఇచ్చు సమయంలో అతన్ని పిలిచి కొద్దిసేపు వేచియుండమన్నారు.
ఆ భక్తుడు భయంతో మనసులో నేను వేదమంత్రాలు సరిగ్గా ఉచ్ఛరింలేదేమో అందుకే మహాస్వామి వారు ఉండమన్నారు అని అనుకున్నాడు. కొద్దిసేపటి తరువాత, మహాస్వామి వారు ఆజ్ఞాపించారు అని ఒక వైద్యుడు వచ్చి, అతన్ని పూర్తిగా పరీక్ష చేసారు. తరువాత అతని వైద్యశాలకు తీసుకుని వెళ్ళీ ఇంకొన్ని పరీక్షలు చేసిన తరువాత ఆ భక్తుడికి హృదయ సంబధమైన జబ్బు ఉందని తెలుసుకున్నారు.
పరమాచార్య స్వామి వారి ఆదేశానుసారం ఆ వైద్యుడు, ఏ శస్తచికిత్స అవసరం లేకుండానే ఆ భక్తుని జబ్బు నివారించాడు.
పది రోజుల తరువాత ఆ భక్తుడు మహాస్వామి వారి దర్శనానికి వచ్చాడు. అతని మనస్సులో ఉన్న ప్రశ్నలకు సమాధానంగా మహాస్వామి వారు అతనితో,
“నువ్వు వేదం చాలా శ్రద్ధతో పఠిస్తున్నావు కాని, మంత్రాలను ఉచ్ఛరిస్తున్నప్పుడు నీకుగల శ్వాస సంబంధమైన రుగ్మత చేత, చాలా ఇబ్బందిగా పలకడం వల్ల అక్కడక్కడ స్వరం తప్పుతున్నది. నేను దాన్ని గుర్తించి బహుశా నీకు ఊపిరితిత్తులు లేక గొంతు సమస్య ఏదో ఉన్నదని గ్రహించి వైద్యుణ్ణి రప్పించాను” అని అన్నారు.
తరువాత “కొద్దిసేపు వేదం పారాయణం చెయ్యి” అని ఆజ్ఞాపించారు.
అతను స్వరం తప్పకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా వేదం చెప్పాడు. మహాస్వామి వారు చాలా సంతోషించి అతణ్ణి ఆశీర్వదించారు.అలా ఆ భక్తుడికి ముందు జరగబోయే ఉపద్రవాన్ని మహాస్వామి వారు తప్పించారు.
ఎప్పుడైతే మనం భక్తితో పరమాత్ముణ్ణి ప్రార్థించి, సేవిస్తామో మనకు రాబోయే బాధలు కష్టాలు మన దరిచేరకనే కరిగిపోతాయి.
--- రా. వెంకటసామి, శక్తి వికటన్ ప్రచురణ
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
మహాస్వామి - మక్కాయాత్ర
మార్చినెల ఉషోదయ వేళ. జనవరిలో మొదలైన చల్లని గాలి తిమ్మెరలు ఇంకా విస్తూనే ఉన్నాయి. తెలవారకుండానే టార్చిలైటు వెలుగులో ఒక పల్లకి నదీతీరంలో ఊరేగింపుగా వెళ్తోంది. ముందు పల్లకి, వెనుకగా కొంతమంది జనం, ఏనుగులు, గుర్రాలు, లోట్టిపిట్టల గుంపులు అలా వెళ్తోంది. మాయనూర్, హరిశ్చంద్రపురం, తిట్టచేరి దాటి వెళ్లి నాట్టం అనే ఊరు చేరగానే పల్లకి తలుపులను దండంతో కొట్టిన శబ్దం వినబడింది. వెంటనే నడకను ఆపారు.
అక్కడ ఒక వినాయకుని దేవాలయం ఉంది. అక్కడితో దారి కుడి ఎడమలు రెండుగా వెళ్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం అక్కడినుండి ఎడమవైపుగా ప్రయాణించాలి. కాని మరలా లోపలినుండి శబ్దం రావడంతో మాలి అనే భక్తుడు అది తాము ఎడమవైపు కాకుండా కుడివైపు ఉన్న దారిలో వెళ్లాలని అర్థం చేసుకుని ప్రయాణాన్ని కుడివైపుగా మరల్చారు.
“ఇది బహుశా మన్మంగళం వెళ్ళే దారిలా ఉంది” అని గుంపులో నుండి ఒకరు అన్నారు. మనకు లోపలి నుండి ఆదేశం వచ్చింది కాబట్టి మనం దాని ప్రకారం నడచుకోవాలి. ప్రతి విషయానికి ఎదో కారణం ఉంటుంది అని మాలి చెప్పడంతో ఇక ఎవరూ ఏమి మాట్లాడలేదు.
మన్మంగళం ఇంకా గాఢ నిద్రలో ఉంది. ఒక ఇంటిలోనుండి గృహిణి బయటకు వచ్చి ఇంటి ముందర మట్టి దీపం ఒకదానిని వెలిగించి వెంటనే దగ్గరలో ఉన్న వేంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా ఒక దీపం వెలిగించి వచ్చింది. ఇంటి ముందర చట్ట ఊడ్చి, కళ్ళాపి చెల్లి శుభ్రపరచడం మొదలుపెట్టింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఊరేగింపుని చూసింది. ఆ ఊర్లో అంతటి గజ తురగ జన సమూహంతో వస్తున్నా పల్లకిని చూసి నిశ్చేష్టురాలయ్యింది.
సరిగ్గా ఆ గృహిణి ఇంటికి దగ్గరగా రాగానే లోపలినుండి మరలా చప్పుడవ్వడంతో పల్లకిని కిందకు దించారు బోయీలు. సూర్యుని దర్శనంతో పూలు విచ్చుకున్నట్టుగా ఆరోజు అంతటి అనుగ్రహం కలిగింది మన్మంగళం గ్రామానికి.
వారి దర్శనంతోనే సూర్యుడు ఉదయిస్తాడేమో అన్నట్టుగా పల్లకి తెరలు తొలగించుకొని బయటకు రాగానే సూర్యుడు కూడా అరుణ వర్ణ శోభితుడై ఉదయించి ఆ ఊరిని పావనం చేసిన ఆ పాదపద్మాలను తన కిరణములతో తాకాడు.
ఆ ఊరు పావనమైనది. ఆ ఊరి ప్రజల అదృష్టము అంతా ఇంతా కాదు వారిని కరునించడానికే వచ్చినట్టు నడిచే దైవం, కంచి కామకోటి పీఠం పీఠాధిపతులు జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్య స్వామివారు ఆఊరి నేలపై అడుగు పెట్టారు.
ఇంటి ముందర శుభ్రం చేస్తున్న ఆమె అంతటి అనుగ్రహాన్ని ఊహించలేదు. కొన్ని క్షణాలు తన కళ్ళను నమ్మలేక అలా చూస్తుండిపోయింది. వెంటనే తేరుకొని లోపలి వెళ్లి తన భర్తకు విషయం చెప్పింది. భార్య చెప్పిన మాటలు విన్నవెంటనే ఆయన లేచి త్వరత్వరగా స్నానాదులు పూర్తిచేసుకొని, విభూడి పూసుకుని బయటకు వచ్చాడు. అప్పటికే అతని భార్య నీళ్ళు మంగళహారతి సిద్ధం చేసింది.
దంపతులిద్దరూ స్వామివారి కాళ్ళు కడిగి, హారతిచ్చి, స్వామికి నేలపై పది నమస్కారాలు చేసి మహాస్వామి వారిని ఆహ్వానించారు. కొద్ది క్షణాల్లోనే ఇంటి ముందర అరుగును శుభ్రపరిచి రంగవల్లులు తీర్చిదిద్దారు. మహాస్వామివారు అక్కడ కూర్చున్నారు.
ఈలోగా ఏనుగులు, గుర్రాల అరుపులకి మొత్తం ఊరు నిద్ర నుండి మేల్కొంది. అందరూ ఆమె ఇంటి దగ్గరకు వచ్చారు. స్వామివారిని దర్శించుకోవడానికి పళ్ళాలలో పూలు, పళ్ళు తీసుకుని చాలామంది వచ్చారు. ఒంటెలు, ఏనుగులను నది దగ్గరకు తీసుకుని వెళ్ళారు. మహాస్వామి వారి పరివారానికి చక్కని వసతి, ఆహారము ఏర్పాటు చేశారు.
అందరికి ఒక్కటే ప్రశ్న, “స్వామివారు ఇక్కడికి ఎలా/ఎందుకు వచ్చారు?”. ఎందుకంటే ముందస్తు సమాచారం లేకుండా శ్రీమఠం మకాం చెయ్యదు. హఠాత్తుగా కంచి నుండి ఇక్కడికనే కూడా రారు.
“ముందు అనుకున్నది నేడుంగరై వెళ్ళాలి అని. కాని పరమాచార్య స్వామివారు ఇక్కడికి రావాలని ఆదేశించారు. మేము వారి ఆజ్ఞానుసారం ఇక్కడకు వచ్చాము. ఎదో ముఖ్య కారణం ఉంది ఉంటుంది” అని చెప్పారు వైద్యనాథన్.
రెండు రోజులుగా స్వామివారు మౌనంలో ఉన్నారు. ఎప్పుడైనా మాట్లాడవచ్చు. ఇలా రావడం ముందుగానే తెలిసుంటే ఊరి పొలిమేరల నుండే పూర్ణకుంభ స్వాగతం పలికి ఉండే వాళ్ళం అని అనుకున్నారు ఆ ఊరిజనం. కాని స్వామివారి ఆలోచన ఏముందో.
అందరూ స్నానాలు చేసి, పూజ ముగించారు. భోజనాలు కూడా అయ్యాయి. స్వామివారు కేవలం ఎండుద్రాక్ష, పాలు మాత్రమె తీసుకున్నారు. తక్కినవారికి ఆ గ్రామస్తులు చక్కగా అరటిఆకులో భోజనం పెట్టారు. స్వామివారి ఆగమనం వార్త చాలా జోరుగా వ్యాపించి చుట్టుపక్కల గ్రామస్తులు కూడా దర్శనానికి రావడం మొదలుపెట్టారు. అది మార్చి మధ్యకాలం అవ్వడంతో వ్యవసాయ పనులు అన్ని అయిపోవడంతో చాలామంది దర్శనానికి వచ్చారు. తామర పూలు, కొబ్బరి బొండాలు, అరటి బోదలు మొదలైనవి తెచ్చి స్వామికి సమర్పించారు. రోజు కూలీగా తనవంతు వచ్చిన ధాన్యాన్ని తెచ్చి సమర్పించింది ఒక ముసలి అవ్వ. మొత్తం ధాన్యాన్ని స్వామిముందు ఉంచి నమస్కరించింది. అప్పుడు చూడాలి ఆన్నదా పారావశ్యాలతో ఉన్న ఆ అవ్వ ముఖం. అరుగు మొత్తం భక్తుల సమర్పణలతో నిండి పోయింది.
గ్రామప్రజలకు చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి స్వామివారితో మాట్లాడడానికి. పెళ్లి ఆలస్యం, గృహం కట్టడానికి ఆటంకాలు, ఆస్తి పంపకంలో తగాదాలు, ఇలా చాలా సమస్యలను స్వామివారి ముందు ఉంచారు.
కాని స్వామివారు ఏమీ మాట్లాడక మౌనంగా అన్నీ వింటున్నారు. చేతులెత్తి అక్కడున్న అందరిని ఆశిర్వదించారు. కొందరికి బిల్వాదళాలు, కొందరికి నిమ్మకాయలు ఇచ్చారు. సమయం కదులుతూ ఉంది. కాని స్వామివారు మౌనం విడలేదు. హఠాత్తుగా మాలిని పిలిచి సైగలతో ఏదో చెప్పారు. చేతులతో శివలింగం, గోపురం మొదలైనవి చూపిస్తున్నారు. బహుశా ఈ ఊళ్ళో అవి ఎక్కడున్నాయి అని అడుగుతున్నారేమో.
మాలి సైగలను అర్థం చేసుకున్నాడు. అక్కడున్న ఊరిజనంతో, “ఈ ఊళ్ళో శివాలయం ఎక్కడ ఉంది?” అని అడిగాడు. కాని ఎవ్వరినుండి జవాబు రాలేదు. వారిలో ఉన్న ముసలాయన, “ఇక్కడ ఒక విష్ణు ఆలయం ఉంది. అదికాక ఒక దేవీ ఆలయం, గ్రామ దైవం అయ్యనార్ ఆలయం, ఊరి పొలిమేరున గణపతి ఆలయం ఉన్నాయి. శివాలయం గురించి మాకు తెలియదు” అని చెప్పాడు. తొంబయ్యేళ్ల వృద్దునికే తెలియకపోతే ఇక వేరేవారికి ఏమి తెలుస్తుంది.
మహాస్వామివారు మరలా కొన్ని సైగలు చేశారు. ఊరికి పైభాగాన విష్ణు ఆలయం ఉంది అంటే కింది భాగాన ఖచ్చితంగా శివాలయం ఉండి ఉంటుంది. కాని ఇప్పుడు అది లేదు అంతే. కాని గ్రామప్రజలకు ఆ విషయం ఏమి తెలియదు. అందరూ మౌనంగా ఉన్నారు.
ఈ సంభాషణ జరుగుతుండగా అక్కడకు ఒక మహమ్మదీయ దంపతులు ఒకరు వచ్చారు. అతను తనని తానూ లతీఫ్ భాయ్ అని, తన భార్య మేహరున్నిసా అని పరిచయం చేసుకున్నాడు. వారితో పాటు తెచ్చిన రెండు అరటి గెలలను, రోజా పూలను స్వామివారికి సమార్పించారు. మహాస్వామివారు వారిని ఆపాదమస్తకం ఒక్కసారి చూశారు. స్వామివారిని దర్శించుకున్న పూజ్యభావం వారి కళ్ళల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. లతీఫ్ భాయ్ తేరుకుని చెప్పడం ప్రారంభించాడు. అతని సంభాషణ వల్ల ఒక విషయం తెలిసింది.
కొన్ని శాబ్దాల క్రితం ఇక్కడ ఒక శివాలయం ఉండేది. కాలాంతరంలో అది కాస్త పాడయిపోయి భూమిలో కలిసిపోయింది. ఆ భూమి ఎంతోమంది చేతులుమారి చివరకు లతీఫ్ భాయ్ ఆధీనంలోకి వచ్చింది. “మా నాన్నగారి హయాంలో దర్గా భూములు చూసుకుంటున్నప్పుడు కొన్ని దేవాలయ భూములను కూడా తీసుకుని వ్యవసాయం చేస్తుండేవారు. శివుని భూములను చూసుకుంటూ మోసం చెయ్యడం వల్ల వంశం పాడవుతుందని గట్టిగా నమ్మేవారు. ఈశ్వరుని కృప వల్ల ఆ భయం, భక్తి, మంచితనం నాకు కూడా అబ్బింది. కాని ఏం చెయ్యాలి. మాకు పుట్టిన ఒక్కగానొక్క కూతురు మానసిక రుగ్మత వల్ల పదేళ్ళ క్రితం చనిపోయింది.
నాకు అనిపిస్తుంది తెలిసో తెలియకో మేము ఎదో పాపం చేశాము అందుకే అల్లాహ్ మాకు ఇలా చేశాడు అని నిభాయించుకొన్నాము. కాలం వేగంగా గడిచిపోయింది. నిన్న ఇంటి వెనుక మట్టిలో ఎదో పని చేసుకుంటుండగా ఒక శభ్దం వినబడింది. కొద్దిగా మట్టిని తీసి చూడగా ఒక పెద్ద శివలింగం కనపడింది. రాత్రి నాకు నిద్రపట్టలేదు. మేము చాలా ఆందోళన పడి, దాన్ని ఏం చెయ్యాలో పాలుపోక అల్లాహ్ ను ప్రార్థిస్తున్నాము. ఉదయం అవ్వగానే చుట్టుపక్కల వారు మీరాక గురించి మాట్లాడుకుంటుండంతో వెంటనే ఇక్కడకు వచ్చాము. ఇప్పుడు మేము ఏమి చెయ్యాలో పరమాచార్య స్వామివారే సెలవియ్యాలి“ అని స్వామికి నమస్కరించారు.
“మనస్ఫూర్తిగా ఆ భూమిని ఇవ్వడానికి నేను సిద్ధం. దానికి బదులుగా నాకు డబ్బు కూడా వద్దు. పూర్వం శివాలయం ఎలా ఉండేదో అలాగే నిర్మిద్దాం. అది గ్రామ ప్రజాలకు సమ్మతమైతే ఆల్లాహ్ కూడా సంతోషిస్తాడు” అని కాళ్ళ నిరు పెట్టుకుంటూ తన్మయత్వంతో చెబుతున్నాడు. కేవలం మాటలు చేప్పడమే కాదు.
“మావంతుగా శివాలయ నిర్మాణం కోసం ఈ కానుకని స్వికరించండి అని 101/- రూపాయలను సమర్పించారు. తొలి సమర్పణగా దిన్ని భావించండి” అని ఒక పళ్ళెంలో తాంబూలంతో సహా సమర్పించారు. అక్కడున్నవారంతా మాటలురాక అలా చూస్తుండిపోయారు.
ఇప్పటిదాకా మహాస్వామివారి ఆ మహామ్మదియుడు చెప్పిన విషయాలను మందహాసంతో వింటున్నారు. సైగల ద్వారా స్వామివారు ఎదో అడిగారు. అతనికి అదేమిటో అర్థం కాకపోవడంతో ఒక పాలక బలపం తీసుకుని వచ్చి స్వామివారికి అందించాడు. స్వామివారు ఆ పలకపై అతను మక్కా యాత్ర చేశారా అని అడిగారు. అందుకు అతను లేదని, అల్లా మాకు అంత ధనం ఇవ్వలేదని తెలిపాడు. ఎన్నో సంవత్సరాలుగా ప్రణాళిక వేసుకున్నా వెళ్ళడం కుదరలేదని తెలిపాడు.
వెంటనే మహాస్వామివారు వైద్యనాథన్ వైపుకి తిరిగి విచారిస్తున్నట్టుగా, “స్థలం ఇవ్వడానికి సిద్ధపడ్డ ఇంతటి ఉత్తమమైన వ్యక్తి, మరి మనం ఏదైనా సహాయం చెయ్యాలి కదా? అతని అవసరం కూడా ఇప్పుడు మనకు తెలుసు కదా!” అన్నారు. పరమాచార్య స్వామివారి ఆలోచనని గ్రామ్పరజలకు తెలిపారు వైద్యనాథన్.
అది విన్న వెంటనే ఊరిప్రజలు అందరూ మరొక ఆలోచన లేకుండా ఒప్పుకున్నారు. వాళ్ళు మహాస్వామితో, “వారి మక్కా - మదీనా యాత్రకు అయ్యే ఖర్చును మేము భారిస్తాము పెరియావ” అని చెప్పారు. ఆ దంపతుల ఆనందానికి అవధులు లేవు. స్వామివారు ఆ దంపతులిద్దరిని గ్రామప్రజలను ఆశీర్వదించారు.
తరువాత స్వామివారు నిదానంగా పైకిలేచి గోడకు ఉంచిన దండాన్ని తీసుకొని పల్లకిలోకి వెళ్లి కూర్చున్నారు. వారివైపు చూసి నవ్వుతూ అందరిని ఆశీర్వదించారు. మరలా అందరితో కలిసి యాత్ర బయలుదేరింది. అప్పుడు మహాలింగం అన్నారు, “ఇప్పుడు అర్థం అయ్యింది ఎందుకు మహాస్వామివారు ఈ ఊర్లో పల్లకి ఆపమన్నారో! ఎ కారణం లేకుండా ఏమి జరగదు. పరమాచార్య స్వామివారి ప్రతి చర్యకి ఒక కారణం ఉంటుంది”
--- వైద్యనాథన్ ‘శంకర భక్త జ్ఞాన సభ’ కార్యదర్శి
అపారకరుణా సింధుం జ్ఞానదం శాంత రూపిణమ్
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
పరమాచార్య ప్రాణి దయ
మహాత్ములు ఏ ప్రాణికీ భయపడరు. అదేవిధంగా విష జంతువులు కూడా వారికి ఎటువంటి హాని చెయ్యవు.
పండరీపురంలో చాతుర్మాస్యం. పరమాచార్య స్వామివారు మకాం చేసిన చోటుకి ఒక పెద్ద విషపు నాగు వచ్చింది. అందరూ దాన్ని చూసి భయపడ్డారు. దాన్ని ఎవరూ కొట్టరాదని మహాస్వామివారు ఆదేశం ఇచ్చారు. మేమందరం చెప్పట్లతో అది వెళ్లిపోయేలాగా చేస్తున్నాము; దాంతో కొద్దిసేపటికి అది తనంత తానుగా వెళ్ళిపోయింది. ఆ పామును చూసి మేమందరమూ భయపడ్డాము కాని మహాస్వామివారు చలించలేదు. మమ్మల్ని చూసి అది గాభరా పడకుండా నిదానంగా పాకుతూ వెళ్ళిపోయింది.
కాని అదే పిల్లి అయితే స్వామివారు కూడా కాస్త కంగారు పడేవారు. ధర్మశాస్త్రం ప్రకారం మానవ దేహానికి ఒక్క పిల్లి వెంట్రుక అంటుకున్నా మహాపాపం. కనుక పిల్లి కనుక వచ్చినట్లయితే స్వామివారే చప్పట్లు చరిచి అది తన దగ్గరకు రాకుండా చూసుకునేవారు.
కార్వేటి నగరంలో మకాం చేస్తున్నప్పుడు పరమాచార్య స్వామివారు ఒక చీమల పుట్టను ఆనుకుని కూర్చున్నారు. అందులో ఎన్నో రెక్కల చీమలు కూడా ఉన్నాయి. రామకృష్ణన్ మరియు కణ్ణన్ లాంటి వారు అక్కడ ఉండకండి అని స్వామివారిని వేడుకున్నారు. కాని స్వామివారి వారి మాటలని వినలేదు. అక్కడే కూర్చుని నిద్ర కూడా పోయారు. ఒక్క చీమ కూడా స్వామివారిపై పాకలేదు.
--- బ్రహ్మశ్రీ రామకృష్ణ దీక్షితర్, కంచి శ్రీమఠం విద్వాన్. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
స్వామి గురించి
ఆదిశంకరభగవత్పాదులు నెలకొల్పిన మూలామ్నాయ సర్వజ్ఞపీఠం కంచి కామకోటి పీఠపరంపరలో 68వ ఆచార్య పురుషులుగా జగత్ప్రసిద్ధి గాంచిన శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి శ్రీచరణులు విద్యార్థి దశలోనే సన్యసించి, అచిరకాలంలో వేద శాస్త్ర పురాణాదులను పుక్కిటపట్టారు. దేశవిదేశాలకు చెందిన పదిహేడు భాషలనభ్యసించారు. ప్రాచీన విద్యలు, నవీన కళలు పెక్కింటిలో సర్వంకష ప్రతిభను సాధించారు.
దేశమంతటా వేద పాఠశాలలు నెలకొల్పి వేదాధ్యయనాన్ని ప్రోత్సహించారు. ఆలయ మంటపాల నెన్నిటినో నిర్మించారు. ధర్మ సంవర్థనమె లక్ష్యంగా ఇరవై సంవత్సరాలు పాదచారియై యావద్భారతదేశం పర్యటించారు. హిందూమత సంరక్షణకు, వివిధ శాఖలకు చెందిన హిందూ మతావలంబుల సమైక్యతకు అద్వితీయ కృషి చేశారు. ఎల్లెడల ధర్మ సంస్థలనూ, సేవాసంఘాలను వెలయింపజేశారు.
వీటన్నిటితో పాటు, మఠం పరిపాలన చేపట్టింది మొదలు నేటి వరకు జాతి, మత, కుల వివక్షత లేకుండా అనవతరం ఎందరి కష్టసుఖాలను విచారిస్తున్నారో, ఎందరికి జ్ఞానభిక్ష పెడుతున్నారో వారి సంఖ్య అంచనా కట్టలేము.
స్వామి జీవిత చరిత్ర తెలిసిన వారికి, రెండువేల సంవత్సరాల కిందట దక్షిణ భారతంలో జన్మించి, అవైదిక మతాలను ఖండించి, అనేక దివ్యశక్తులను ప్రదర్శించిన ఆదిశంకరులే తిరిగి నేడు శ్రీ చంద్రశేఖర సరస్వతులుగా అవతరించారని భారతరత్న పండిత్ మదనమోహనమాలవ్యా వంటి ప్రముఖలనేకులు చేసిన ప్రశంసలు అతిశయోక్తులు కావని రూఢికాగలదు.
జగదాచార్యుడు శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో చెప్పినట్టు “ఆర్తో, జిజ్ఞాసు, అర్థార్థీ, జ్ఞానీచ” అంటూ ఈ నాలుగు తరగతులకు చెందిన వారినందరిని వారి వారి స్థాయిని బట్టి వారిని ఉద్ధరించారు. భక్తుల ననుగ్రహించడంలో స్వామి అవలంబించే మార్గాలు పలువిధాలు. అవి ఆయా వ్యక్తుల తరతమ భేదంపైనా, వారి సంస్కారబలం పైనా ఆధారపడి ఉంటాయి. కొందరికి అనుష్టానం, కొందరికి మంత్రోపదేశం, కొందరికి సాక్షాద్దర్శనం, మరికొందరికి దర్శనంతో సైతం పనిలేకుండా స్వప్నంలో అనుగ్రహం.
ఆధునిక నాగరికతా, పాశ్చాత్యవిద్యా ప్రభావంచేత నేటి యువతరం హృదయంలో అవిశ్వాస మొక్కటే రాజ్యమేలుతున్నది. ప్రాచీనమూ, భారతీయమూ వారికి పరిత్యాజ్యం. విజాతీయమూ, వైజ్ఞానికమూ పరమ ప్రమాణం. విజ్ఞానశాస్త్ర పరిశోధనలు ఆధినికమానవ సుఖజీవనానికి తోడ్పడిన మాట కాదనలేము. అయినా, అదే జీవిత పరమావధి కాదుకదా?
--- నీలంరాజు వెంకటశేషయ్య గారి "నడిచే దేవుడు" పుస్తకం కృతాంజలి నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
రామనామ విశిష్టత
శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారు దక్షిణ దేశంలోని చిదంబరం యాత్ర ముగించుకొని, సమీపం లో ఉన్న ఆనందతాండవపురం చేరారు.
ఆ ఊరిలో పండితులు, ప్రజలు స్వామికి అఖండ స్వాగతం పలికారు.
ఆ జనసమూహంలో అనేకమంది బాలురున్నారు. ఆ బాలురందరినీ పిలిచి , ‘శ్రీ రామాయనమః’ అని నూరు పర్యాయాలు రాసి, ఆ వ్రాసిన పత్రాలను తనకు చూపించవలసినదిగా మహాస్వామి వారికి చెప్పారు. అదేవిధంగా వారంతా ‘శ్రీ రామాయనమః’ అని నూరు సార్లు వ్రాసి, ఆ పత్రాలన్నింటిని స్వామికి సమర్పించారు.
వారందరికి ఒక్కొక్కరికి ఒక్కొక కామాక్షి అమ్మవారి బంగారు ముద్రను స్వామి వారు బహూకరించారు.
వారిలో ఒక బాలునికి అమ్మవారి ముద్ర ఇవ్వబోతూ, స్వామి అరవంలో “సొల్లు సొల్లు.” నీవు వ్రాసింది నీ నోటితో ‘చెప్పు, చెప్పు’ అని ఆదేశించారు. అక్కడ స్వామి చుట్టూ మూగిన పండితులందరూ “అయం మూకః, అయం మూకః” (అతడు మూగవాడు మూగవాడు) అని సంస్కృతంలో స్వామికి విన్నవించారు.
అయినా, స్వామి వారి మాటలను విననట్టుగా మరల ఆ పిల్లవానివైపు తిరిగి “నీ సొల్లు, సొల్లు” (నీవు చెప్పు చెప్పు) అన్నారు. అంతట ఆ బాలుడు “శ్రీ రామాయనమః” అని అందరూ వినేట్టు బిగ్గరగా అన్నాడు.
“మూకం కరోతి వాచాలం!”
ఆ సంఘటనను శ్రీ కల్లూరి వేంకట సుబ్రహ్మణ్య దీక్షితులు గారు స్వయంగా చూచినది.
[వైదిక వాజ్ఞ్మమయంలో రెండే తారకములు. ఒకటి 'ఓం' కారం. రెందవది 'రామ' నామం. అష్టాక్షరిలోని అగ్నిబీజమైన 'రా' కారం, పంచాక్షరిలోని అమృతబీజమైన 'మ' కారం కలిపి తారకమైనది 'రామ' నామం. రామాయణాన్ని, రామనామాన్ని నమ్ముకొని సద్గతి పొందినవారు కోకొల్లలు. రామకోటి రాయడం ఎన్నో జన్మల పుణ్య ఫలం.ఎంతకాలం రామనామం చెప్పబడుతుందో, రామాయణం ఎంతకాలం చదవబడుతుందో, రామాయణం ఎప్పటి వరకు చెప్పబడుతుందో, ఎప్పటిదాకా వినబడుతుందో అప్పటిదాకా మాత్రమే మానవాళి ఉంటుంది.]
శ్రీరామ రామేతి రమేరామే మనోరమే || సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
|| జానకీకాంత స్మరాణం జై జై రామ రామ ||
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
లక్ష్మీ కటాక్షం ఉంటుంది
కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామివారిని ప్రప్రథమంగా దర్శించే భాగ్యం ఇలయత్తాన్ గుడిలో 1962 సంవస్తరంలో నాకు కలిగింది.
ఆ కాలంలో మా అల్లుడు చిరంజీవి వసుమర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి మూర్ఛ వ్యాధివల్ల బాధపడినాడు. ఎంత చికిత్స చేసినా మందులవల్ల వ్యాధి నివారణ కాలేదు.
పూజ్యులు, పండితులు, స్వామివారి భక్తులు అయిన కీ.శే. మండలీక వెంకట శాస్త్రిగారి సలహాపై కంచి స్వామివారిని దర్శించాము. మా అల్లుడు వ్యాధిని గురించి వారికి నివేదించాము. తొమ్మిది ఆదివారాలు వేదోక్తంగా పంచగవ్యములు ఇప్పించవలసిందని స్వామివారు ఆదేశించారు. తు.చ. తప్పకుండా స్వామి ఆజ్ఞను అనుసరించాము. తొమ్మిది ఆదివారాలు గడువు దాటగానే మా అల్లుడికి సంపూర్ణ ఆరోగ్యం చేకూరింది.
నేను అప్పుడు మోటారు కార్లు విక్రయించే వ్యాపారం చేస్తుండేవాణ్ణి. వ్యాపారంలో పొటీ అధికం కావడం చేత ఆ సమయంలో నా వ్యాపారం చాలా మందగించింది. మా వద్ద ఉండే పనివారంతా పని మానుకోవడం సంభవించింది.
అప్పుడు నేను నా కుటుంబంతో కంచికి వెళ్ళి మళ్ళీ శ్రీవారిని దర్శించి మఠంలో భిక్ష చేసాను. భిక్ష కాగానే శ్రీవారు నాకు ప్రసాదం ఇస్తూ, ‘నీకు లక్ష్మీకటాక్షం ఉంటుంది’ అని ఆశీర్వదించారు.
అప్పటివరకు నేను నా వ్యాపారం మీద ప్రభుత్వానికి నెలకు మూడువేల రూపాయలు అమ్మకం పన్ను చెల్లించే వాణ్ణి. స్వామివారి ఆశీర్వచనం లభీంచిన తరువాత నేను చెల్లించవలసిన అమ్మకంపన్ను మూడువేలల్లా నెలకు లక్ష రూపాయలకు పెరిగింది.
ఆ సమయంలో నావద్ద ఒకేఒక పనివాడుండేవాడు. బయటికి వెళ్ళి ఆర్డర్లు తెచ్చేవారే లేరు. అలాంటి పరిస్థితుల్లో స్వామి ఆశీర్వాద బలంతో నాలుగైదు జిల్లాలనుండి టెలిగ్రాముల ద్వారా ఆర్డర్లు రాసాగినవి. కంపెనీ వారీ విషయం గమనించి ఆస్శ్చర్యం వెలిబుచ్చారు. అదంతా స్వామి వారి ప్రభావం తప్ప మరొకటి కానేకాదు.
శ్రీ చంద్రశేఖర సర్స్వతి మహాస్వాములు సాక్షాత్తు భగవంతుడే తప్ప మానవమాత్రులు కారని నా విశ్వాసము. ఇటువంటి నిదర్శనాలు ఇంకా అనేకం ఉన్నవి.
--- శ్రీ మాగంటి సూర్యనారాయణ, ‘నడిచే దేవుడు’ పుస్తక సౌజన్యంతో
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
శ్రీమఠం సేవకులు
ఒక ధనికుడు పరమాచార్య స్వామివారికి గొప్ప భక్తుడు. స్వామివారు ఇలయత్తాంగుడిలో మకాం చేస్తున్నప్పుడు దర్శనానికి వచ్చాడు. రెండు చెక్కపెట్టెల నిండా ఆపిల్ పళ్ళను తీసుకునివచ్చి స్వామివారి ముందర పెట్టాడు. మహాస్వామి వారు వాటిని ఒకసారి పరికించి లోనికి వెళ్ళిపోయారు.
ఆ ధనవంతుడు అక్కడే ఉన్న స్వామివారి శిష్యులతో అంటున్నాడు, “నేను ఈ ఆపిల్ పళ్ళను పరమాచార్య స్వామివారి కోసం తెచ్చాను. మీరు మఠంలో ఉన్న పందికొక్కులు, వీటిని తిని ఖాళీ చెయ్యకండి”, పరమాచార్య స్వామివారు వస్తూ ఆ మాటలను విన్నారు. కాని స్వామివారు ఆ మాటలను విననట్టు ఉండిపోయారు.
అక్కడ కొందరు నారి కురవలు కొన్ని గుడిసెలను వేసుకుని నివాసం ఉన్నారు.
ఆపిల్ పెట్టెలు వచ్చిన సాయంత్రం పరమాచార్య స్వామివారు ఆ నారి కురవల కుటుంబాల పిల్లల్ని పిలిపించి తలా ఒక ఆపిల్ పండు ఇచ్చి పంపారు. ఇదంతా ఆ ధనవంతుని ఎదురుగుండానే చేశారు.
ఆ ధనవంతుని ముఖంలో బాధ కనపడింది. వెంటనే స్వామివారు “నేను కూడా ఈ మఠంలో ఒక పందికొక్కునే” అన్నారు స్వామివారు.
ఆ మాటలకు ధనవంతుడు నిశ్చేష్టుడయ్యి తన తప్పిని తెలుసుకున్నాడు. తరువాత స్వామివారిని క్షమాపణలు అర్థించాడు.
అదే ధనవంతుడు మరొక సందర్భంలో, కేరళ నుండి పెద్ద సంఖ్యలో ధోవతులు తెచ్చి స్వామివారికి సమర్పించాడు.
“ఎందుకు ఇన్ని తెచ్చావు?” అని అడిగారు స్వామివారు.
“శ్రీమఠం సేవకులకోసం, పెరియవా”
అందులోనుండి ఆరు ధోవతులకు కాషాయం రంగు అద్దమన్నారు. అందుకు కారణం ఏమిటో ఆ ధనవంతునికి అర్థం కాలేదు.
“రెండు ఆంజనేయుడికి (అప్పుడు మఠంలోనే ఉంటున్న ఒక సన్యాసి), రెండు పుదు పెరియవాకు, రెండు నాకు! మేము కూడా శ్రీమఠం సేవకులమే” అన్నారు స్వామివారు.
పరమాచార్య స్వామివారు ఈ మాటలను అనగానే ఆ ధనవంతుని గుండె ద్రవించి, స్వామివారి నిరాడంబరతని తెలుసుకుని పొంగిపోయాడు.
--- శ్రీమతి మోహన పంచపకేశన్, మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
No comments:
Post a Comment