తలుపు తెరిచి యు కిరణములు
ఎగసి పడియు మదిలొ కలలు
తలపున కదిలి యు వలపులు
మరుగున పడక యు కులుకులు
సుమధుర మధురిమ వలపులు
తొలివలుపుల చిరు నగవులు
మనసున మధురిమతొ సెగలు
సమయ సరిగమ గలగలలు
గడసరి వలపు గుసగుసలు
మమతలు కురిసిన మనుషులు
మహిమను తెలిపిన మగువలు
తడి పొడి తపనల పడుచులు
చెదిరిన విరిసిన నగవులు
విరహపు వనితలొ వగలు
మదితలపుల కురుల ముడులు
కదలిక చిలుకల పలుకులు
మిణుగురు పురుగులు మెరుపులు
కలువల కదలిక పరుగులు
బిడిసి పడిన కళ బిగువులు
వరుస కలిపిన మగసిరులు
ఒకరి కొకరి ఒడు దుడుకులు
ఒరుస కలిపెడి చురకలు
ఒలపు తలుపుల గుసగుసలు
ఒకటికొకటి తిరుగు కలలు
****
విముకులకు సంపదకూడి
ధర్మాలను చేయకుండె
మతి హీనులగుచునె ఉండి
ఖ్యాతికి ఆరాటముండె
నెమలి కన్నుల మెరుపుండి
గుణమనేది లేక ఉండె
చూడనందముగా నుండి
నిరుపయోగముగను ఉండె
త్యాగం బుధ్ధి లేని వాడి
ధనమున్నట్టి దరిద్రుడె
ప్రేమంటే తెలియ నోడి
పెళ్ళి అయ్యి న లేకుండె
కట్టెలమ్మే బతుకండి
కాలినడక అమ్ముచుండె
కాళ్ళు తారు కారు తుండి
మానవ్వులు చెదర కుండె
తలపై బరువులే ఉండి
భజంపట్టు సలప కుండె
స్త్రీలు బతుకు మార కుండి
ధర్మ నిరతి ఓర్పు ఉండె
వెన్నెల లో చేరా వడి
శృతికలిపి యే ముద్దాడె
నే వలపుల రాగముండి
మనసు నచ్చె పాట పాడె
ఇక ఆగలేను సవ్వడి
మనసు రగిలి మండు చుండె
అనురాగం కొరకే వడి
అనుభూతి కలిగించు దడె
కనులు కనులు కలప కుండి
హృదయ మంత తెలపకుండె
పెదవు లే పలక క కుండి
గుండె దడయు తెలుపు చుండె
దరహాస మే తీరుముడి
నీ దయ కృప మారు చుండె
మది తెల్పు మాయకల ముడి
తనువె బాధ కల్గు చుండె
కావచ్చు కాలమున మడి
వినవచ్చు శబ్దము నుండె
కానవచ్చు రాత్రి నాడి
మనసంతా బాధ నుండె
ఈ రోజు ** మంచి మాట.... లు
ఆశ మనిషిని బ్రతికిస్తుంది ఇష్టం మనిషితో ఏమైనా చేయిస్తుంది అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది . సమయానికి ఆరోగ్యానికి బంధాలకు విలువ కట్టలేము కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది .
నీ మనసు ను ఎప్పుడూ సంతోషంగా ఉంచుకోండి . ఎందుకంటే గెలుపు సంతోషాన్ని ఇస్తుందో లేదో తెలియదు గానీ మనసు సంతోషం గా ఉంటే చాలు మనం అన్నింట్లో గెలిచినట్టే .
వాళ్ళు నా వాళ్లు వీళ్లు నా వాళ్ళు అని నువ్వు అనుకోవడం కాదు . ఎదుటి వాళ్లు కూడా అలా అనుకున్నప్పుడే ఆ బంధానికి విలువ , గౌరవం కేవలం నువ్వే అనుకుంటే అది బంధం కాదు నీ భ్రమ మాత్రమే అవుతుంది .
మనం గెలవడం అంటే మనుషులను కాదు మనస్సు లను గెలవాలి ముందుకు వెళ్లడం అంటే నలుగురిని తొక్కుకుంటూ కాదు నలుగురిని కలుపుకుంటు వెళ్లాడమే నిజమైన విజయం
నీ పరిస్థితిని బట్టి నీ ఆలోచనలు , అలవాట్లు మారితే బాగుంటుంది , కానీ విలువలు , వ్యక్తిత్వం ఎప్పుడు మారకూడదు , పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నిలాగే ఉండడమే నువ్వు నీ జీవితంలో సాదించ వలసిన గొప్ప విజయం .
నవ్వండి సరదాగా... ఒకే వాక్యాన్ని రెండు అర్ధాలలో.....
1. మీ సంగతి ఏమిటి?
మీసం గతి ఏమిటి?
2. గురూజీ వనం బాగుందా?
గురూ జీవనం బాగుందా?
3. ఆమే కమలమును తొక్కింది.
ఆ మేక మలమును తొక్కింది.
4. మాట మాట పెరిగింది.
మా టమాట పెరిగింది.
5. ఆహారం చూడ ఎంత బాగుందో!
ఆ హారం చూడ ఎంత బాగుందో!
6. మాతా తమరు నిమిషంలో చేరారు.
మా తాత మరునిమిషంలో చేరారు.
7. నావ లతలపై పడింది.
నా వల తలపై పడింది.
8. ఆమె కవితలతో జీవనం చేయును.
ఆమె కవి తలతో జీవనం చేయును.
9. మాతా మరను పట్టుకో.
మా తామరను పట్టుకో.
*ఇదే మన తెలుగు భాష లోనే సాద్యం.👌👌
శాంతాకారం - శ్లోకంలోని అద్భుత భావన...
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధా(కా)రం గగన సదృశం, మేఘవర్ణం శుభాంగం!
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ధ్యానగమ్యం
వందే విష్ణుం భవభయహరం సర్వ లోకైక నాథం!!
ఇందులో సృష్టిక్రమం..
సృష్టిని పాలించే ఈశ్వర స్వరూపం..
ఒక చక్కని క్రమపద్ధతిలో నిబద్ధించారు.
శాంతాకారం
సృష్టికి పూర్వం ఈ జగమంతా శాంత స్థితిలో ఉన్నది.
శాంతం, శమనం – అంటే అన్నీ లయించిన స్థితి.
అనేకంగా ఉన్న వృక్షం, బీజంలో లీనమయినట్లుగా, సర్వ జగతి, పరమాత్మయందే లీనమై ఉన్న స్థితి – శాంతి.
ఏ వికారమూ లేని పరిపూర్ణత్వాన్ని కూడా, ఈ శబ్దం తెలియజేస్తోంది.
శాంతమే తన స్వరూపంగా కలిగిన పరమాత్మ.
భుజగ శయనం
భుజగశయనుడు..అనంత కాలతత్త్వమే అనంతుడు – ఆదిశేషువు – భుజగము.
ఈ కాలానికి ఆవల కాలాన్ని అధిష్ఠించిన ఈశ్వరుడే భుజగశయనుడు.
కాలానికి లొంగి ఉన్నవి లోకాలు.
కాలాతీతుడు, కాలం ద్వారా జగతిని శాసించే భగవానుడు కాలభుజగశయనుడు.
పద్మనాభం
సృష్టికి తగిన కాలాన్ని అధిష్ఠించిన నారాయణుని సంకల్పం మేరకు, సృష్టి బీజాల సమాహార రూపమైన పద్మం, ఆయన నాభీ కమలం నుండి ఆవిర్భవించింది.
సృష్టిగా విచ్చుకుంటున్న బీజ స్వరూపమే పద్మం.
దానికి నాభి (కేంద్రం) విష్ణువే.
అందుకే ఆయన ‘పద్మనాభుడు’.
సురేశం
విశ్వపు తొలిరూపమైన ఆ పద్మమందు,
విష్ణు శక్తియే సృష్టికర్తగా, బ్రహ్మగా వ్యక్తమయింది.
నలువైపులా దృష్టిని ప్రసరించి తన నుండి జగన్నియామక శక్తులైన వివిధ దేవతలను వ్యక్తీకరించాడు బ్రహ్మ.
జగతికి మేలు(సు)కలిగించే వారే సురలు
(సు- అంటే మేలు, ‘రాతి’ అంటే కలిగించు వాడు. సుం-రాతి – మేలును కలిగించువారు సురలు).
ఈ దేవతా శక్తులతో విశ్వమంతా నిర్మితమయింది. నిజానికి దేవతా శక్తులు స్వతంత్రులు కాదు.
ఆ శక్తులన్నీ ఆదిమూలమైన వాసుదేవుని కిరణాలే.
అందుకే ఆ సురలందరికీ తానే నియామకుడై ‘సురేశు’డయ్యాడు.
విశ్వాధారం
కనిపిస్తున్న విశ్వాన్ని నియమించే సూక్ష్మ శక్తులు ‘సురలు’. వారితో పాటు విశ్వానికి సైతం ఆధారమై ఉన్న చైతన్యం ఆ వాసుదేవుడు.
సమస్తమునకు ఆధారమై ఉన్నందున అతడే ‘విశ్వాధారుడు’.
కనిపించే జగమంతా ఆయన చైతన్యంతో నిండి ఉన్నందున ఆతడే ‘విశ్వాకారుడు’ కూడా.
నదిలో అలలన్నిటికీ జలమే ‘ఆధారం’.
అలల ‘ఆకారం’ అంతా జలమే.
జలం అలలకు ఆధారమై, ఆకారమై ఉన్నట్లే..
విశ్వాధారుడై విశ్వాకారుడై పరమాత్మయే ఉన్నాడు.
గగన సదృశం
ఇది ఎలా సంభవం?
ఆకాశంలో వ్యక్తమయ్యే సమస్తము నందూ, ఆకాశమే ఉన్నది.
సమస్తమూ ఆకాశము నందే ఉన్నది.
అదేవిధంగా ఆకాశంతో సహా,
సమస్త విశ్వమూ ఎవరియందు,
ఎవరిచే వ్యాప్తమై ఉందో,
అతడే పరమాత్మ.
అందుకే ఆయన ‘గగనసదృశుడు’(గగనం వంటివాడు).
ఇదే భావాన్ని ‘ఆకాశాత్ సర్వగతః సుసూక్ష్మః’ అంటూ ఉపనిషత్తు ప్రకటిస్తోంది.
ఇది నిరాకారుడైన పరమేశ్వరుని తెలియజేస్తోంది.
మేఘవర్ణం
నిరాకారుడై సర్వవ్యాపకుడైన ఆ పరమాత్మయే..
తన లీలా శక్తితో భక్తులను అనుగ్రహించడానికై దివ్యమంగళ విగ్రహుడై సాకారుడయ్యాడు.
ఆ సాకారం ‘మేఘవర్ణం’ (మబ్బువన్నె)గా ఉన్నది.
శుభాంగం
మేఘం నీటితో నిండి తాపాన్నీ, దాహాన్నీ పోగొడుతుంది. అదేవిధంగా కరుణారసంతో నిండిన విష్ణు మేఘం, సంసార తాపత్రయాల్ని పోగొట్టి, జ్ఞానదాహాన్ని తీర్చుతున్నది.
అందుకే అది నీలమేఘశ్యామం.
ఆ శ్యామల వర్ణ దేహంలో ప్రత్యంగమూ శుభమే. ప్రాపంచిక దేహాలు ప్రకృతి దోషాలతో కూడి ఉంటాయి కనుక అవి అశుభ రూపాలే.
కానీ స్వామి దాల్చిన విగ్రహంలో అవయవాలు శుభ స్వరూపాలు.
తలచే వారికి శుభాలు కలిగించే స్వభావంతో దివ్యమంగళ స్వరూపంగా భాసిస్తున్నాడు భగవానుడు.
అందుకే ఆయన రూపం ‘శుభాంగం’.
లక్ష్మీ_కాంతం
ప్రపంచాన్ని పోషించే ఐశ్వర్యాలన్నీ ఆయనను ఆశ్రయించుకున్నాయి.
ఐశ్వర్యాల అధిదేవత లక్ష్మి ఆయననే చేరి,
ఆయన సంకల్పానుగుణంగా ప్రవర్తిస్తున్నది.
అందుకే ఆ శుభ స్వరూపం ‘లక్ష్మీకాంతం’.
కమల_నయనం
ఐశ్వర్య దేవతకు ప్రీతికరం.
కమలముల వలె విచ్చుకున్న సూర్యచంద్ర కాంతులతో జగతిని గమనిస్తున్న కరుణామయ దృష్టి కల భగవానుడు ‘కమలనయనుడు’.
యోగిహృద్యానగమ్యం
ఇటువంటి విష్ణుతత్త్వం, స్వరూపం అందరూ అందుకోలేరు.
యోగులు మాత్రమే ఏకాగ్రమైన దృష్టితో ధ్యానం ద్వారా తమ హృదయాలలో దర్శించగలుగుతున్నారు.
ఆ కారణం చేతనే అతడు ‘యోగిహృత్ ధ్యానగమ్యుడు’.
వందే విష్ణుం భవ భయహరం
విశ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుడు కనుక ‘విష్ణువు’.
ఈ తత్త్వాన్ని గ్రహించి, శుభాంగాన్ని ధ్యానించే వానికి ఈ సంసారంలో భయాలు తొలగి, అవిద్య నశిస్తున్నది. అందుకే ఆ స్వామి ‘భవభయహరుడు’.
సర్వలోకైకనాథమ్
సర్వలోకములకు ప్రధానమైన నాథుడు అతడే ‘సర్వలోకైకనాథమ్’.
14నామాలతో ‘విశ్వానికీ – విష్ణువునకు’ ఉన్న అభిన్న సంబంధాన్ని, ఈ శ్లోకం స్పష్టపరుస్తోంది.
ఒకే శ్లోకంలో, విశ్వానికి పూర్వ స్థితి నుండి సృష్టి స్థితులను కూడా నిర్వహిస్తున్న భగవత్తత్త్వాన్ని స్పష్టపరచడం, ఆర్ష దృష్టి వైభవం.
ఇంత స్పష్టంగా పరమేశ్వరుని గొప్పతనాన్ని,
ఆయనలోని సాకార నిరాకార తత్వాలను తెలియజేస్తూ యోగపూర్వక ధ్యానం ద్వారా,
మన హృదయాలలోనే ఆయనను దర్శించగలమనే, సాధనా రహస్యాన్ని కూడా, ఈ శ్లోకం అందిస్తోంది.
ఉగ్రరధుడు, భీమరధుడు, విజయరధుడు ఎవరు వీరు?🚩🏹👍💐
పెళ్లి *సాధారణంగా జరగాలి.
షష్టిపూర్తి ఘనంగా జరగాలి*
మానవుని సంపూర్ణ ఆయుర్దాయం 120 సంవత్సరాలు అని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నది.
60 సంవత్సరాలు నిండినప్పుడు చేసుకునేది షష్టిపూర్తి.
ప్రతివారికీ మృత్యువు
60 వ యేట ఉగ్రరథుడు అను పేరుతో ,
70 వ యేట భీమరథు డు అను పేరుతో,
78 వ యేట విజయరథు డు అను పేరుతో ఎదురుచూస్తుంటాడు.
ఆరోగ్య సమస్యలకు తట్టుకోవటానికి చేసే శాంతి ప్రక్రియ షష్టిపూర్తి.
బృహస్పతి , శని 30 సంవత్సరాలకు మానవుని జన్మకాలంలో ఉన్నరాశికి చేరటానికి 60 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళిద్దరూ తాము బయలుదేరిన రాశికి చేరుకోవటంతో మానవుని జీవితం మరలా ప్రారంభమవుతుంది. తిరిగి జీవితం ప్రారంభం ఐనట్లు సంకేతం.
మానవుడు పు
ట్టిన తెలుగు సంవత్సరాలు (60) నిండుతాయి కనుక షష్టిపూర్తి జరుపుకుంటారు.💐🌺
🛑💁🏻♀️💁🏻♂️ ఏప్రిల్ 1 నుంచి 5 కొత్త ఆదాయపు పన్ను నియమాలు
⌨️⌨️⌨️⌨️⌨️⌨️⌨️⌨️⌨️⌨️⌨️
👁️🗨️👁️🗨️ కేంద్ర బడ్జెట్ 2021లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆదాయపు పన్ను నిబంధనలలో మార్పులను ప్రకటించారు. ఈ మార్పులు 1 ఏప్రిల్ 2021 నుంచి అమల్లోకి వస్తాయి.
👁️🗨️👁️🗨️ కొత్త నిబంధనల ప్రకారం, 75 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు గల సీనియర్ సిటిజన్లకు పెన్షన్ నుంచి వచ్చే ఆదాయం, అదే బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీపై ఏప్రిల్ 1 నుంచి ఐటిఆర్ దాఖలు నుండి మినహాయింపు ఉంటుంది.
👁️🗨️👁️🗨️ అంతేకాకుండా, ఆర్థిక మంత్రి తమ ఐటిఆర్ దాఖలు చేయని వారి కోసం అధిక టీడీఎస్ ప్రతిపాదించారు. ఈపీఎఫ్ ఖాతాలో ఏడాదికి రూ. 2.5 లక్షలకు పైగా డిపాజిట్ చేసే వ్యక్తులకు పన్ను విధించాలని ప్రకటించారు.
🛑💁🏻♀️💁🏻♂️ ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చే 5 ఆదాయపు పన్ను మార్పులను పరిశీలిద్దాం:
⤵️⤵️⤵️⤵️
🦜
No comments:
Post a Comment