శ్రీమంగళచండీ స్తోత్రం
ఓంశ్రీమాత్రే నమః ప్రాంజలి ప్రభ ఆద్యాత్మికం 24032021
(కుజగ్రహ దోష నివారణకు,సర్వ దోష నివారణకు)
రక్ష రక్ష జగన్మాత దేవి మంగళ చండికే
హారిక విపతాం రాసేః హర్ష మంగళ కారికే ||
హర్ష మంగళ దాక్షిణ్య హర్ష మంగళ దాయికే
శుభమంగళై దాక్షిణ్య శుభమంగళ చండికే ||
మంగళం మంగళార్ హోచ సర్వ మంగళ మంగళే
సతాం మంగళాతే దేవీం సర్వేషామ్ మంగళాలయే ||
పూజ్య మంగళవారే మంగళాభీష్టదేవతే
పూజ్యే మంగళ వషస్స మనోవంశస్య సంతతామ్ ||
మంగళాతిష్ఠాత్రు దేవీ మంగళానామ్ చ మంగళే
సంసార మంగళాధారే మోక్ష మంగళ దాయిని ||
సారేచ మంగళా తారే పారేచ సర్వ కర్మనామ్
ప్రతి మంగళవారేచ పుణ్యే మంగళ సుఖప్రాప్తే ||
||ఇతి మంగళచండి స్తోత్రం సంపూర్ణం||
******
సీతాపతీ పద్యము
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
సీసము
జన్మల బంధము జయము ను పెంచును
జాతిని రక్షించు జన్యు పరము
అంత శోభకరము ఆదిదేవుని తీర్పు
వెలుగును చూపించు వేళ కళ్ళు
సీత ఆడేందుకు సీతల వెలుగులే
రామచంద్రయ్య కు రాత్రి తెలుపు
లోకాలు ఏలేటి లౌక్యంగా నడిపించు
రామచంద్రుని లీల రమ్య మవ్వు
తేటగీతి
ప్రేమ గుడ్డిది ప్రత్యక్షం పుడమి నందు
చట్ట ముకు కళ్ళు లేవులే చూపు ఏది
సుందరాకార సౌందర్య శ్యామ లీల
ధర్మ సత్య న్యాయమునకు దారి ఇదియె
--(())--
సీసము
పరిశుద్ధ జీవన - పరమాత్మ స్వరూపి
నిర్మల హృదయంతొ - నియమ బుధ్ధి
నిగ్రహమ్ము గాను - నిత్య సత్యపు బోధ
విశ్వాస నీయమై - వినయ ముంచె
గురువును తలచియు - గౌరవించుట శక్తి
గుప్త విద్యను పూర్తి -గాను పెంచు
మర్మము లేనట్టి - మనసును అదుపులో
ఉంచుము లక్ష్మణా - ఉదయ వాక్కు
తేటగీతి
మానవపురోభి వృద్ధికి - మనసు ఉంచి
సత్య సూత్రము నిత్యము - శోభ పెంచు
నిర్మల హృదయ మే నీకు - నమ్మకమ్ము
చిత్తముంచియు ప్రేమను - చూపు చుండు
--(())--
సీసము
బంధము ఆశల - బహుమాన కధలేలు
బాధ్యత లు గలిగి - బంధమవ్వు
ఆత్మీయత గలిగి - ఆనంద పరుచుట
అనురాగ అమృతము - ఆత్రుతవ్వు
గురువులా బోధించి - గొప్పకు పోకుండ
గౌరవ లక్ష్యము - గోప్యమవ్వు
మిత్రునిలా ఆపదలో - మక్కువ చూపుము
లక్ష్మణా గృహముకు - దీపమవ్వు
ఆటవెలది
జపము సల్పుచున్న - జన్మజన్మా౦తర
పాపసంచయములు బారద్రోలి
మోక్షమొసగుచుండు మార్గమ్ము తెల్పుము
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు
--(())--
"సీ.
No comments:
Post a Comment