Wednesday, 10 March 2021

కాఫీ కధ

 

(కాసేపు నవ్వుకుందాం)(ఇది యదార్ధ గాధ )

శ్రీమతి తో శ్రీవారి ముచ్చట్ల కాఫీ లాంటి చిన్న కధ (1)   

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ    

ఉషోదయ వెలుగులు కానరావటంలేదు, మబ్బులు కమ్ముకున్నట్లు ఉంది , కానీ మంచు కమ్మి ఉంది. బయట చలిమంట వేసుకొనుచుఁన్నవారు ఉన్నారు అప్పుడే కల్లాపు చల్లాలని శ్రీమతి బకెట్ నీరు, మగ్గు తీసుకోని వచ్చి చల్లంది.  ఓవైపు వణుకుడు మారోవైపు సంప్రదాయపు ముగ్గు వెయ్యాలని తపన, తప్పదు కనీసం ముచ్చట్లు ఎవరైనా చెప్పే వారుంటే బాగుంటుంది అని నాలిక కరుచుకొని, శ్రీవారు నిద్ర లేచి సహాయ పడితే ఎంత బాగుంటుందో  అనుకుంటూ ముగ్గులేసి లోపలకు వచ్చింది. 

లోపలికొస్తూనే ఏమి అదృష్టం మోగవానిగా పుడితే హాయిగా నిద్రపోవచ్చు,  కల్పనా లోకం గురించి, ఊహల పల్లకీల గురించి , స్వప్న సీమలగురించి , ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో తెలియని మొగ వానిలా నిద్రలో కలల ఉరవడిలో కలవరింతగా పలుకులు పలకవచ్చు  .....

అబ్బా నేను ఎన్ని మాటలు మాట్లాడినా మా శ్రీవారు గురక చూడు, మూడు రోడ్లకవతల దాకా వినబడుతుంది, తెలియని వారు విన్నారో ఏ పులి వచ్చిందని భయంతో వణికి పోతారు. 

ఏమం డి నిద్ర లేస్తారా 

ఆ లేస్తానే ఎందుకు అంత తొందరా 

మీకు కాఫీ ఇచ్చి నేను త్రాగుదామని 

ఎన్ని సార్లు చెప్పేది, నీకు అర్ధం కదా,  నాకోసం ఆలో చించ వద్దు అని చెప్పఁగా 

పక్కింటి వారిని గురించి ఆలోచించ మంటారా అంటూ మంగళ సూత్రాన్ని కళ్ళ కద్దుకొని 10  నిముషాలలో తయారవ్వండి . 

5  నిముషాలు చాలే కాఫీ తీసుకురా 

ఈ మాటలకూ ఏమి తక్కువ కాదు, మరోమాట అనకండి అంటూ లోపలలకు వెళ్ళింది   

నీవు పెట్టి ఇచ్చే కాఫీ త్రాగితే అదో తృప్తి, కమ్మగా ఉందే.  అంతొద్దండి, ములగ  చెట్టు ఎక్కించకండి.     

 *భార్య గా గుర్తించక పోయినా,  గౌరవించకున్నా ఫర్వాలేదు...కించపరచకండి.... నేనుచేసుకున్న కాఫీ ఈ రోజు అసలు నాకే బాగోలేదు అయినా మెచ్చుకున్నారు, ప్రతి పని లోను....కొందరు పనికిమాలీనోళ్లు .... ఉంటారు..... అసలు విషయం దాచి పొగడతారు వారి  తీర్చుకుంటారు.  

ఎందుకే అట్లా అనుకుంటావు, బాగుంటే బాగున్నది  అని చెప్పుతాగా, 

ఇప్పుడు నాకు బాగానే ఉన్నది అందుకే చెప్పా  

ఎవరినో  దృష్టి లో పెట్టుకోని..... మాట్లాడకే.. సరే సరే 

మనిద్దరికీ  రోజూ ఉండే మాటలే  సరే సరే స్నానం చేసి రండి మరోసారి కాఫీ ఇస్తా ... 

ఆమ్మో కాపీనా ...... ఆ కాఫీ ...                                       ....... (2 )    

*******

(కాసేపు నవ్వుకుందాం)(ఇది యదార్ధ గాధ )

శ్రీమతి తో శ్రీవారి ముచ్చట్ల కాఫీ చిన్న కధ (2)   

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ    


ఏమండి మనబ్బాయిని ఏది చదివిద్దామనుకున్నారు, నువ్వేమి చదివావు, నన్నడుగుతావు,   
ఎదో ఓనమాలు నేర్చుకొని " బి.ఏ " వెలగపెట్టా ఏమన్నా ఉద్యగమా సద్యోగమా ఇదిగో ఈ గరిట, ఆ చీపురు పనితప్పా 
ఎందుకే నీలో నీవే కించ పరుచుంటావు ఆ సమయంలో బి.ఏ చదువులంటే ఏనుగుమీద ఊరేగింపు అనేవారు తెలుసా 
ఆ నాకేం తెలుసూ 
ఆచదువుకే ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అబ్బో పెద్ద చదువు చదువు తున్నదే ఉల్లేలా ఏంటీ అని ఎక్కిరించేవారు ఎక్కువమంది ఉన్నారండి. 
అవునే అప్పుడు నిన్నెవరూ ప్రేమించలేదా 
ఆ ప్రేమించారు "బ్లాకీ " అనే వారు 
ఒకటే నవ్వు 
ఎందుకండీ ఆ వెక్కిరిస్తూ  "నవ్వు "
అప్పుడు వాళ్ళు నవ్వి, ఇన్నేళ్లకైనా మీరు నవ్వి, ఈ ఆడవాళ్ళ బతుకు ఇంతే నండి 
అబ్బో కోపం వచ్చిందా అప్పుడే 
ఆరాదా కోపమూ 
ఆహా ఆ మూతి ఆలా తిప్పుతుంటే నాకు తిక్క రేగుతుందే 
ఆ ఆ రేగుతుంది సినిమాలో లాగా సూర్యకాంతం అయితే నోరెత్తరు   
అబ్బో ఏ సావిత్రిని పోల్చుకోవచ్చుకదా 
అసలు ఈ పోలికలు ఎందు కండీ 
మన అబ్బాయి చదువు గురించి అడిగితే విషయం మరో మాదిరిగా మారింది 
మీరు మహా చతురులండి 
నువ్వేం తక్కువ తిన్నావా నన్ను మించి పోయావు కదే 
అబ్బా ఏమిటండి అలా ఉడికిస్తారు   
ఉడికింపు కాదే అక్షరాల నిజం 
ఇలా వచ్చి కూర్చో నే చెప్పేది విను 
న్యాయవాది గా చదివించామనుకో 
ఒక న్యాయవాది యొక్క ఆదాయం సమాజంలో నేరాలు మరియు  వ్యాజ్యాల పెరుగుదలతో పెరుగుతుంది. అది మనకవసరమా 
వైద్యుని గా చదివించామనుకో
ఒక వైద్యుని యొక్క ఆదాయం ప్రజల వ్యాధి /అనారోగ్యం పెరుగుదలతో పెరుగుతుంది.
అది మనకవసరమా 
ఇన్స్పెక్టర్ (పోలీస్ ) చదివించా మనుకో 
ఇన్స్పెక్టర్ (పోలీస్ )  దొంగలను పట్టడం దోపిడీ డబ్బు దోచుకోవటం వల్ల ఆదాయం పెరుగుతుంది అది మనకు అవసరమా 
ఎందుకండీ ఇంకొకరి వృత్తుల గురించి అలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు 
అదికాదే నిజాలు చెబుతున్నా ఇక చాళ్లేండి ఎవరన్నా వింటే కోపాలు కూడా వస్తాయి 
నిజాలు చెపితే నీకే ముందు కోపం వచ్చింది 
ఆ రాదా మరి 
మీరేం చెప్ప కండి మన అబ్బాయి ఏది చదువుతానంటే అదే చదివిద్దాం 
ఆ మాట ముందే చెపితే ఇంత కధ జరిగేది కాదు కదా ? 
ఉండండి మీరు పేపరు చదువుతూ ఉండండి 
ఉన్నా కదే ఎక్కడికీ పోలా 
అది నాకూ తెలుసు మంచి కాఫీ తీసుకొస్తా 
ఆ తేవే కాఫీ త్రాగి మాట్లాడుకుందాం .... 
ఆ ................  ఆ .......
******     

(కాసేపు నవ్వుకుందాం)(ఇది యదార్ధ గాధ )

శ్రీమతి తో శ్రీవారి ముచ్చట్ల కాఫీ చిన్న కధ (3)   

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ    


ఏమిటండి ఈరోజు ఏమి మాట్లాడ కుండా ఉన్నారు, ఆ ఏమి మాట్లాడితే నీకు ఏమి కోపమ్ వస్తుందోనని కొంచెం ఎక్కడో భయమున్నదే ...
ఆ భయమనేది ఉంటేకదా మన ఇద్దరి మధ్య సఖ్యత సక్రమముగా ఉంటుంది 
ఎవరిదారి వారి పంతాలకు పట్టింపులకు దారి చూపితే అది సంసారం ఎలా అవుతుంది 
చక్కగా చెప్పావు 
నేను చెప్పేవి అన్ని చక్కనివే ఆచరించటంలో కొంత బేధము చూపుతారు అంతే 
ఏమన్నావ్ ఆచరించుటలేదా 
ఇప్పుడాచరించుట లేదో చెప్పు 
కాళ్ళు కడుక్కొని లోపలకు రావాలి అంటే ఎప్పుడన్నా వచ్చారా 
షూ షు విప్పి సాక్సువిప్పి వ చ్ఛాగదే 
అదే మీనిర్వాకం 
అంత పెద్ద మాటనకే ఎప్పుడో ఒకప్పుడు కడుక్కొని రాకపోవచ్చు 
అది పెద్ద తప్పా 
ఇలా చెప్పుకుపోతే ఎన్నో తప్పులు చేస్సారు మీరు 
మరి నువ్వు చేయలేదా 
చేసుంటానేమో 
నెమో కాదు రోజూ చేస్తావ్ 
ఎం చేసానండి  
టి తెమ్మంటే కాఫీ తెస్తావ్ ... కాఫీ తెమ్మంటే టి తెస్తావ్ 
ఏదన్న అడిగితె అది లేదు ఇది లేదు అని వాపోతావ్ 
ఇదేనండి చక్కని చిక్కని సంసారం 
అవునా అందరంతేనా, మనమేనా 
అందరూ అంతే
 అవునండి 
 
బతుకుబండి చక్రాల  ప్రయాణం సాఫీగా, ఒడుదొడుకులు  లేకుండా గమ్యం చేరాలంటే చక్కటి జీవన ప్రణాళిక వేసుకోవాలి. పొదుపు పాటించాలి. అంటే పాలు నీళ్లలాగా కలసి పోవాలి, నది మెట్టపల్లాలు దాటి రాళ్లు రప్పలు దాటి జలచరాలు సృష్టించి గమనం సంద్రం వైపు సాగిస్తుంది అలాగే జీవితంలో స్త్రీ పురుషులు ఏకము కూడా అంతే
అక్షరాలా నిజం చెప్పావు. 
బిడ్డలపై ఆశతో వారిని ఒక్కదారి తేవాలని ధర్మంతో సక్రమ మార్గాన్ని తెలిసిన దారిని చూపుతాము అందుకే నేనంటా "అప్పుల తప్పులు చెయ్యకూడదు. ఎవరికీ ఎలాంటి అపకారం తలపెట్టకూడదు. దుర్విచక్షణ చూపకుండా అందరితో ఆత్మీయంగా సమభావంతో వ్యవహరించాలి. కులమతాలన్నీ కల్పనలే, అడ్డుగోడలే. మనం ఇతరులకు చేసే ఉపకారాలే మన ఆస్తిపాస్తులు.  ఇతరులకు మనం చేసే అపకారాలే శాపాలు. మనల్ని అందరూ ప్రేమించాలంటే, మనం అందర్నీ ప్రేమించాలి. ఈ జీవన సూత్రం పాటించిన వారికే బతుకు తియ్యదనం అనుభవంలోకి వస్తుంది. జన్మ ధన్యమవుతుంది.
   
చక్కగా చెప్పవే అయినా కాస్త కాఫీ పెట్టుకురావే 
అవునండి మర్చిపోయా, స్టవుమీద  కాఫీడికాషన్ పెట్టా 
తొందరొద్దె ఆయినదేదో అయినది 
సరేలెండి చిక్కని కాఫీ తెస్తా పేపరు చదువుతూ ఉండండి 
నేను చేసే పని అదే గా   
ఆ......   ఆ..

--(())--

(కాసేపు నవ్వుకుందాం)(ఇది యదార్ధ గాధ )

అత్త తో కోడలు ముచ్చట్ల కాఫీ చిన్న కధ (4)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఏమి టమ్మాయి పిల్లవాడు అట్లా ఏడిపిస్తున్నాడు, ఏమో అత్తయ్యగారు నాకు అర్ధం కావాటంలేదు, ఇంకా పాలు త్రాగుతున్నాడా మానలేక పోతున్నాడు అత్తయ్యగారు. నీవే ఏదోరకంగా మాన్పించటానికి ప్రయత్నించు సెలవుకూడా  కూడా పూర్తయినది మల్లీ ఆఫీసుకు పోవాలి కదా, ఇప్పుడు ఆఫీసుకు పోనక్కరలేదు, ఇంట్లో ఉండే చేయాలిగదా

అవునే పిల్లవాడి ఆలనా పాలనా చూసే పనిమనిషిని పెట్టుకో

అత్తయ్యగారు మీరు ఉండరా

ఇక్కడ ఎక్కువరోజులు ఉండలేనమ్మా ,పెద్దకోడలు కడుపుతో ఉందట అక్కడకు పోవాలి మా అబ్బాయికి కూడా చెప్పి వెళతాను జాగర్త ఉండండి.

ఇంకో నెలరోజులు ఉంటె నాకు బాగుంటుంది అత్తయ్యగారు

అవునమ్మా బగుంటుంది  పోకపోతే ఏమన్నా అను కుంటారు నాకు అందరూ బిడ్డలే ఈ వయసులో తిరగలేకున్నాను , కానీ తప్పటలేదు.

నేనుచెప్పే  విషయాలు గమనించమ్మా

ఈ సృష్టి మొత్తం స్త్రీ కి  పాఠశాల.మాతృత్వం  ఈ ప్రకృతిలో ప్రతి చెట్టు, ప్రతీ జీవి... ఏదైనా తన సహజ జీవన విధానంతోనే మనిషికి ఎన్నో విషయాలు బోధిస్తాయి. అలాగే పిల్లవాడ్ని పెంచటం ఎవరిని అడగనక్కరలేదు ఇప్పుడు ఇంటర్నెట్ అంతర్గాలం ఉన్నది అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు సెల్లు ఉందికదా తెలుకొని ప్రవర్తించు.

ఐకమత్యం, ప్రేమ, త్యాగం వంటి సుగుణాలన్నీ స్త్రీ  ప్రకృతినుంచే నేర్చుకోవాలి. స్త్రీ ప్రకృతిలో అందాలను ఆస్వాదించడం మాత్రమే కాదు- వాటిని అధ్యయనం చేయాలి. ఆ ప్రకృతి ధర్మాలను ఆచరించాలి. పచ్చని ఆకులతో కళకళలాడే వృక్షం శిశిరంలో ఆకులు రాలుస్తుంది. వేసవిలో ఎండి మోడైపోతుంది. వసంతకాలం రాగానే ప్రతి కొమ్మా చిగురిస్తుంది. అట్లాగే జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదని మంచిరోజు తప్పక వస్తుందని మానవాళికి మంచి సందేశమిస్తుంది. అంతేకాదు- వృక్షం ఎంత ఎత్తుకు ఎదిగినా ఉన్నచోటునే ఉంటూ అందరికీ ఆశ్రయం ఇస్తుంది. తన పళ్లను అందరికీ ఇచ్చి అలసిన జీవులను తన కొమ్మల నీడల్లో సేదతీరుస్తుంది.పరోపకారం, త్యాగగుణం కలిగి ఎన్నో జీవిత సత్యాలను బోధిస్తుంది వృక్షం. ఆ సత్యాలు మనిషి గ్రహించి వాటిని తన జీవితానికి అన్వయించుకోవాలి.

అత్తయ్యగారు మంచి మాటలు చెప్పారుఏమోనమ్మా  నేను చెప్పాల్సినది చెప్పనమ్మా

స్త్రీకి ఓర్పే ఆయుధం, నేర్పే జీవితం, తీర్పే ఆలయం, ప్రేమే నిలయం

అత్తయ్యగారు చాలా మంచిమాటలుచెప్పారు  ఇప్పుడు కాఫీ త్రాగండి తీసుకొచ్చా

కాఫీ త్రాగి వెళ్ళొస్తాను కోడలు  .., .

అదెంటత్తయ్యగారు అప్పుడే వెలుతున్నారా. ఎవ. రైనా కొంతవరకేనమ్మా సహాయము ఎవరి  బతుకు వారికి   ఆదర్శ్యం

కాఫీ చల్లగా ఉందా

ఏదైనా సర్దుకు పోవటమే స్త్రీ బతుకు కదా

అవును ....  అవునా

--(())--

(కాసేపు నవ్వుకుందాం)(ఇది యదార్ధ గాధ )

గురువు  తో విద్యార్థి  ముచ్చట్ల కాఫీ చిన్న కధ (5)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ


పంతులుగారు బాగున్నారా 

ఆ ఆ  బాగున్నా,   ఎలాగయ్యా ఇప్పుడు మీకు సెలవులు వచ్చినట్లున్నాయి 

ఎప్పుడూ ఒకరకంగా ఉంటే ఈ గురువులు అసలు గుర్తుకు రారు కదా 

అవునవును 

ఈ మధ్య ప్రవేటు స్కూల్లో పనిచేసే అధ్యాపకులకు కష్టం గా ఉందట గదండీ 

అవును బాబు ఎవరికి చెప్పుకొనేటట్లు లేదు , అధ్యాపకులు బతుకుతెరువు కోసం  ఎదో ఒక పనిచేస్తున్నారు, ప్రభుత్వం వారు మమ్మల్నసలు పట్టించు కోవటం లేదు ఏంచేద్దాం 

ఇంటర్నెట్ విద్య నేర్చుకొని విద్య చెప్పక పొయ్యరా    

చూడు ఇది ఒక గురువుది కాదు సమస్య , అందరి గురువులది.  మహమ్మారి రావటం వల్ల అటు విద్యార్థులు, ఇటు గురువులు, తల్లితండ్రులు, బాధ పడుతున్నారు  

బాబు మేము డబ్బు కోసం కాదు పనిచేసేది విద్యావంతులుగా మార్చుటయే మా లక్ష్యం. 

దేనికి మా ( గురువుల ) ఆదాయం మాత్రం...  ప్రజల యొక్క జ్ఞానం,  శ్రేయస్సు మరియు 

దేశ అభివృద్ధి పెరుగుదలతో .పెరుగుతుంది  అందుకే మేము ఉపాధ్యాయులుగా గర్తిస్తారు ....

పంతుళ్ళం కాదు...    మేం "తరాల" తయారీదారులం...

ఏముంది పంతుళ్ళు... ఏదో వస్తారు ....  పోతారు.నాలుగు మాటలు తోచింది చెప్తారు. *లేకుంటే సెలవులు...  ఇదీ సమాజంలో ........ఉపాధ్యాయులపై చిన్న చూపు.*

మా మెదళ్లను పీల్చి పిప్పి చేసినా, వాళ్ళ మెదళ్లను బాగు చేసి మేధావులను, డాక్టర్లను, 

యాక్టర్లను, ఇంజినియర్ లను,పోలీసులను,కలెక్టర్లను,లాయర్లను,టీచర్లను,నాయకులను, 

అధికారులను...ఆఖరికి సమాజానికి కీడు చేయని ఒక మంచి మనిషిలా నిలిచేలా.... 

"తరాలు"......., "తరాలు" ......తయారుచేసే నిత్య ఉపాధ్యాయులం  మేము.

*మా పనులు శారీరకంగా అలసినట్టు కనిపించేవి కావు.......

చెమటను సాక్ష్యం గా చూపడానికి...... 

మా పనులు బురదలోనో, ఖార్ఖానా లో చేసేవి కావు......

అనంత సాగరమైన విద్యను, విజ్ఞానాన్ని మధించి...

అక్షర సేద్యంలో నిరంతరం మానసికంగా అలసిపోయి, అర్థాంతరంగా తనువు చాలిస్తూ, 

పదిమందికి బయటకు కనిపించే సాక్ష్యాలు .....

చూపలేని నిస్సహాయులం...

*మమ్మల్ని గౌరవించకున్నా ఫర్వాలేదు...

కించపరచకండి....ప్రతి వృత్తీ లోను....కొందరు పనికిమాలీనోళ్లు .... ఉంటారు.....

వాళ్ళను దృష్టి లో పెట్టుకోని.....మంచిగా పనిచేసే వాళ్ళ ను...మాటలతో... బాధించకండి 

మమ్మల్ని పొగడకున్నా ఫర్వాలేదు...తూలనాడకండి...


అవును పంతులుగారు నేడు పరిస్థితి మారింది 

అయినా ఇప్పుడు ఆధునిక విద్య అంటూ సెల్లు కొనిపించి ఆన్ లైన్ విద్య అంటూ చెప్పటం  తప్పఁని పరిస్థితి అవునుబాబు 

కాలం మారుతున్నది మేము ఎం చేయలేక పోతున్నాం 

మాభవిషత్తుకు ఎవరు ఎవరు సహాయపడతారో వేచి చూస్తాను 


పంతులుగారు కాఫీ త్రాగుదామా 

ఒక శిష్యుడుగా అడుగుతుంటే కాదనటం నేటి స్థితిలో అంత మంచిదికాదు పదా త్రాగుదాం 

నోటికి మాస్కు చేతికి వ్యాజలీన్ వ్రాసుకో బాబు 

ఏపుట్టలో ఏపామున్నదో ఎవరూ చెప్పఁలేరు అసలే సినిమాలలో మొదటి భాగం రెండవభాగం అంటున్నారు అట్లాగే రోగంలో కూడా మొదటి కరోనా రెండవ కరోనా అంటున్నారు మనజాగర్తలో మనం ఉంటె మంచిది   

మాఇంట్లో కాఫీ త్రాగుదాం అక్కడా ఇక్కడా ఎందుకూ 

అట్లాగే పంతులుగారు ...

ఆ ........ ఆ......

--(())--

(కాసేపు నవ్వుకుందాం)(ఇది యదార్ధ  ప్రాంజలి ప్రభ గాధ )

తల్లి కొడుకుల ముచ్చట్లు  కాఫీ చిన్న కధ (6)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ


అయ్యగారు అయ్యగారు 
ఏమిటిరా అట్లా అరుస్తున్నా వు 
నేనో పని చేసానండి 
ఏపని చేసావు నాకు చెప్పకుండా, మీ అమ్మ  గారికి చెప్పకుండా 
ముందుగా క్షమాపణను కోరుచున్నా గదండీ 
సరే ఏపని చేసావో చెప్పు 
అమ్మగారు ఏమను కుంటారో  
ఏమనుకుంటారో చేసేముందు ఆలోచన రావాలి 
ఇప్పు డొస్తే లాభ మేముండదు 
ఏమి లేదండి, ఏమీలేదండి అలా నాన్చాకు 
ఓ అమ్మగారు 
ఆ ... అమ్మగారు పడి పోయారండి 
పడి పోవటమేమిటి 
నిక్షేపంలా ఇప్పటిదాకా నాతొ మాట్లాడింది ఇప్పుడే వంటగదిలో పనుందని వెళ్ళింది 
మణమ్మగారు కదండీ ఎవరో అమ్మగారు "అలా కారుతీసుకొని బస్టాండు దాక చిన్నమ్మాయిని దించామన్నారు కదండీ 
ఆ దించమన్నాను 
తిరిగి వస్తూ ఉంటే ఓ అమ్మగారు నడుస్తూ నా కారు దగ్గర పడిందండి 
ఏ  మిటీ యాక్సిడెంట్ చేసావా 
లేదండీ 
మరి ఏమిటో చెప్పండీ 
అందరూ కలసి కారులో ఎక్కించారు ఇక్కడకు తెచ్చాను 
తెచ్చావా ఎక్కడా 
కారులో ఉంది 
ఉండట మేమిటిరా తీసుకురా 
ఆ ఆ ఆగు ముందు ఆమూలా నవారు మంచం ఉంది దాన్ని తెచ్చి ఇక్కడ పెట్టు దానిపై దిండు దుప్పటి వేయి 
ఇప్పుడు తీసుకురా 
ఈ చేతుల తోన 
నీవు చేసేపని మంచి ధైతే భయము నీలో ఉండదు వేళ్ళు 
ముస్లావిడిని పువ్వులా పట్టి తీసు కొని వచ్చాడు బంటు  
రామ సీతారామ జానకిరామ జయజయ రామ పట్టాభిరామ అంటూ కలవరిస్తున్నది, నిద్దరిలో జారుకుని 
ఎవరీ పెద్దవిడా అంటూ లోపల నుంచి వస్తూ అడిగింది 
ఏమో నమ్మగారు మనకారు క్రింద పడింది తీసుకొచ్చా 
దెబ్బలేమన్నా తగిలాయా 
లేదమ్మగారు కారు ఆపి ఉంచా కారుదాకా ఎదురువస్తూ ఒక్కసారి కుప్పకూలింది 
సరే ఎవరున్నా చూసారా అందరూ చూసారు 
సరే మంచిపని చేసావు ఇక్కడకు తెచ్చి 
అమ్మా అని పలకరించాడు రామారావు ఆ ఇంటి యజమాని 
అమ్మా అని పిలిచింది జానకి ఆ ఇంటి యజమానురాలు 
అమ్మా అంటూ దండం పెడుతూ నన్ను గుర్తుపట్టారా నీవు పిలిచావే ఆ హనుమంతుణ్ణి 
మిమ్మల్ని చూస్తుంటే నాకు సీతా రామ ఆంజనేయులు వారు గుర్తుకొచ్చారు 
నేనే మీఅందరికీ నమస్కారం పెట్టాలి 
ఎదో రామభజన చేస్తూ అలా కళ్ళు తిరిగి పడిపోయాను 
నాకథ చెప్పాలంటే పెద్దకథ కానీ ఇప్పుడు చెప్పలేను క్లుప్తముగా చెప్పగలను 
ఆ చెప్పండి మీ ఆరోగ్యం బాగుందా 
బాగానే ఉంది మీ అందరి దయవల్ల 
మేము ఏంచేశామని మా దయ అంటున్నారు 
ఎవరో తెలియకుండా ఆశ్రమం కల్పించారు అందులో ఈ కరోనా కాలంలో  "అదిమంచి పనేగా ఉండండి మంచి కాఫీ తీసుకొనివస్తా అందరం త్రాగుతూ మాట్లాడు కుందాం 
 
నాకథ అత్తాకోడళ్ల కథే ఎవరిపంతం వారిది యవ్వన పంతం గెలుస్తుంది, ముసలిపంతం జాలిగా మారుతుంది కానీ గెలవలేదు ఇదే లోకధర్మం అని ఇప్పుడు తెలుసుకున్నా 
    
 ఆనందం, విషాదం... సందర్భం ఏదైనా ఏకాంతంలో ఉన్నప్పుడు మనిషి ఆలోచనా ముద్ర వహిస్తుంది  దీర్ఘాలోచనతో తన భవిష్యత్‌ జీవితం గురించి కలలు కంటుంది  సానుకూల, వ్యతిరేక ఆలోచనల ప్రభావం మనిషి ఆరోగ్యం పైనా ఆయుర్దాయం మీదా ఎంతగానో ఉంటుంది. వస్త్రంతో వడగట్టడం ద్వారా నీటి మాలిన్యాన్ని శుభ్రపరచినట్లు, ఆలోచనా మాలిన్యాన్ని ధ్యానంతో పరిష్కరించాలని అనుకున్నా. సంసార బంధాలు అన్నీ కూడా వృత్తంలా తిరుగుతాయి మనం ఆశాజీవులం వాటిని తప్పించుకోవటం ఎవరి తరమూ కాదు. కానీ ధ్యానం అన్నింటికీ మూలం మనస్సు శాంత పరుస్తుంది బాహ్య ప్రపంచం జోలికి పోకుండా అంతర హృదయాన్ని వికసింపచేసింది  

మానవ మస్తిష్కం ఆలోచనల భాండాగారం. ఆకాశం నుంచి వానజల్లు లక్షలాది నీటి బిందువులుగా జాలువారినట్లు అది నిత్యం వేల ఆలోచనల్ని మనో క్షేత్రంలో వర్షిస్తుంది. బాహ్య లోచనాలు(కళ్లు) అడుగు అడుసు(బురద)లో పడకుండా రక్షిస్తాయి. ఆలోచనా లోచనాలు జీవితం తడబడకుండా నిలబెడతాయి. ఉత్తమోత్తమ ఆలోచనల్ని చేసే మనిషి జీవితం వర్ణమయం అవుతుంది 
అని కాఫీ త్రాగుతూ చెప్పింది 
అప్పుడే బయటనుండి అమ్మా నన్ను క్షమించు 
అత్తయ్యగారు నన్ను క్షమించు అంటూ కాళ్ళమీద పడ్డారు కొడుకూ కోడలు 
ముందు నాకు కాదు నమస్కరించేది ఆ ఆది దంపతులకు నమస్క రించండి మొహమాట పడకుండా నన్ను మోసుకొచ్చిన ఆ హనుమంతునకు నమస్కరించండి 
మమ్మలి క్షమించండి మేము ఎన్నో తప్పులు చేసాము 
  
ఒకరికొకరుక్షమాపణ చెప్పుకోటం కాదు ఆలోచనతో మనం చేసేది తప్ప ఒప్పా ఒక్క ఘడియ అలోచించి చెయ్యాలి అదే రాయణంలో హనుమ చేసింది. అందరికీ అదే ఆదర్శం. 
మీ అమ్మే నాకుకూడా అమ్మ మేము పూజించే ఆ ఆదిపరాశక్తి ఈ తల్లి ఈ దీవెనలు సర్వజగతికి క్షేమము
ఓం శ్రీ రాం ...  ఓం శ్రీ రాం ... ఓం శ్రీ రాం ... ఓం శ్రీ రాం ... ఓం శ్రీ రాం ...ఓం శ్రీ రాం ...ఓం శ్రీ రాం ...నిశ్శబ్దములో వినబడుతుంది సర్వం రామమయం ...
--(())_-

(కాసేపు నవ్వుకుందాం)(ఇది యదార్ధ  ప్రాంజలి ప్రభ గాధ )

తండ్రి ..కూతరు ముచ్చట్లు  కాఫీ చిన్న కధ (7)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ


నాన్న నాకు నిద్ర పట్టుట లేదు అన్నది కూతురు  
అవునమ్మా నిద్రపట్టక పోవుటకు కారణము ఉండు కదా 
ఏముంటుంది నాన్న 
నీ మనసులోని ఆలోచనలు బయఁటకు చెప్ప నియ్యవు , అవి నిన్ను కుదుటగా ఉండ నియ్యవు అవి చీకటి పడ్డాక నీ వెంటే ఉండి నిన్ను నిద్రపోనియ్య కుండా చేస్థాయి  
"ఏమీ" ఆలోచనలు లేవు నాన్న 
లేవు అనుకుంటే లేవు, ఉన్నాయనుకుంటే ఉండు 
సరే ఆ హనుమంతుని తలచుకొని ఆ కుంకం పెట్టుకొని పడుకో 
నిద్ర పడుతుందా నాన్న 
నిద్ర పట్టటమేమి కన్నా, నీలోఉన్న భయము, నీవు చూసిన ఆలోచనలు అన్నీ పోయి హాయ్ గా ఉంటుంది తల్లీ 
ఇది లోక మాయ ప్రభావము, పిల్లలకు ఇప్పటి నుండే ఏదో సాధించాలని, అందరి కన్నా మంచిగా బతకాలని, సుఖమైనా జీవిగా సాగాలని ఆలో చిస్తారు కానీ వీటి కన్నిటి మూలం ఆ దేవ దేవుని లీలలని తెలుసు కోలేరు ఏం చేద్దాం అంటుంటే హాయి గా నిద్రపోయినది చిన్నారి చిట్టి తల్లి కూతురు.       

" కలకు నిద్ర ఆధారం; ప్రపంచానికి మాయ ఆధారం "
"మొదటిది చిన మాయ, రెండవది పెను మాయ".చిన మాయను తెలప గలుగు తావు పెను మాయను ఎవ్వరూ తెలుసు కోలేరు ఇదే సృష్టి కి మూలం.  
ఆడేవాడు మనిషి అయితే ఆడించే వాడు దేవుడు 
దేవుడు పరమపద సోపానము చూపాడు, నీవు సర్పం నోటిలో పడతావో, పడకుండా గమ్యం సుఖమయం చేసుకుంటావో, నీకే బుద్ధి నిచ్చాడు   

"'నేను జయ' అన్నదాంట్లో:" -  నేను అనే పాదంలో అది ఒక వరం ఇది చదివిస్తుంది. అశలు పుట్టిస్తుంది, తెలియని మైకంలో ముంచి ఉంచు తుంది. దీనికి లింగ భేదము లేదు, వయో బేధము లేదు." జయమే -  ఇహం, ఇహం అహం " గా మారితే అదుపు చేయడం కష్టం ఇహం దైవపరంగా మార్చుకుంటే శాంతి సౌభాగ్యం, అహం చేరితే సర్వనాశనానినికి మూలం.     

"నేను - పరం;  జయ - ఇహం ".

 కలలోని నేను - నామ రూప సహితుడను అని భగవంతు డే తెలియపరిచాడు , కల కనే నేను - నామ రూప రహితుడను. అయినా సమాజ దృష్యా, ప్రకృతి పరంగా, సమయం, సద్వినియోగం చేసేవాడే సుఖ నిద్ర లోలుడౌతాడు అనిచెప్పారు పెద్దలు.  

గమ్యం చేరాలంటే ఒక లక్ష్యం ప్రతి ఒక్కరిలో ఉండాలి దాని చివరి అంచు వరకు శ్రమిస్తూ చేరు తుండాలి అది అందరికీ ఉపయోగ పడేదిగా ఉండి తీరాలి 
మనుసు మారాలంటే పెళ్లి కుదరాలి, పిలల్లు పుట్టాలి విద్యాబుద్ధులు నేర్పాలి శక్తి వంచన లేకుండా ప్రతి ఒక్కరిని ఒక ఇంటివారిని చెయ్యాలి, అప్పుడే నీలో ఉన్న అహం తొలగిపోయి ధ్యాన మార్గానికి దాసుడౌతావు నదీతీరం సులభంగా చేరుతావు.      
 
"తీరం చేరేక పడవ అవసరం లేదు.
మోక్షం పొందేక దేహం అవసరం లేదు ".

నిద్రలో జ్ఞానం, అజ్ఞానం ఏమి తెలియదు కేవలము మెలకువలో ఊహల పరిపక్వతపై ఆధారపడి ఉంటుంది అందుకే తెలియయపరిచారు మహానుభావులు    
 
"నిద్రలో (అజ్ఞానం) ఉన్న తాను - సృష్టిలో ఒక అంశ.
మెలకువలో (జ్ఞానం) ఉన్న తాను - సృష్టికర్త ".

నేను దేవుడ్ని నన్ను అందరు కొలవండి, నేనే మీకు సహాయం చేస్తాను అంటూ మిణుగురు పురుగు వెలుగును చూపి, తెలిసి తెలియని ఆకర్షణకు లోను చేసి బాబాల రూపంలో పుడుతున్నారు వారినే కొలిచి మూర్ఖవాదనను చేస్తున్నారు.మంచి చెడు తెలిసి కూడా మూగజీవులుగా బతికే వారున్నారు.    
 అందుకే    

 "'నేను దేవుణ్ణి' అని బయట ఉంటే దోషం.... లోపల ఉంటే సత్యం."
కాలం  కలిసొచ్చినప్పుడు దేవుడు కనబడడు, కలసి రానప్పుడు అంతా దేవుడు మాయని చెప్పుకొని బతుకుతారు 
 
స్వార్ధ రహితమైన వాత్సల్య మవనిలో
కన్న తల్లి యందె కాంచ గలము
అవనికన్న గొప్ప దాయమ్మ హృదయము 
తెల్పు చున్న వాడ్ని మల్లాప్రగడ నీతి 

అంటూ కాగితముపై కధ కాని కధ  చిన్న కధ జీవిత సత్యాలు ముగించాడు ఆ కన్న తండ్రి 
అలా సాగిపోయింది ఆరోజు రాత్రి తండ్రీ కూతురి సంభాషణలు. 
ఓం శ్రీ రాం ... శ్రీ మాత్రేనమ:.. సర్వేజనాసుఖినోభవంతు 

--(())--     


(కాసేపు నవ్వుకుందాం)(ఇది యదార్ధ  ప్రాంజలి ప్రభ గాధ )

తాత మనవుడి  ముచ్చట్లు  కాఫీ చిన్న కధ (8)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ


తాతగారు బాగున్నారా 
బాగున్నా మనవడా 
ఇదివరకులా నడవలేకపోతున్నా, ఎదో తెలియని ఆవేశం వస్తున్నది, ఎదో చెప్పాలని ఉన్నది, చెపుతున్న పటించుకోవడం లేదని ఒక బాధ ఉన్నది 
నీవైతే తాతా అంటుంటే నాకు ఎంతో ఉత్సాహం వస్తున్నది. 
నాకయితే ఇప్పుడే 20  వెళ్లి 21 వచ్చి నట్లున్నది మనవడా 
       
తాతగారు నేను చిన్న వాడ్ని అయినా కొన్ని విషయాలు చెప్పు దామనుకున్నా
చెప్పురా మనవడా అందరితో పాటు నీవు కూడా చెప్పు "గుడ్డు వచ్చి పిల్లనెక్కిరించిదటా"
మీరే అనుభవజ్ఞులు ఇక నేను చెప్పేదేముంది తాతయ్యా 
ఏపుట్టలో ఏపామున్నదో తెలియదురా పిల్లలు దేవుని స్వారూపాలు అన్నారు. వాళ్ళ మాటలు అమృత వాక్కులు చెప్పురా మనవడా నాకూ నీమాటలు వినాలని ఉన్నది. 

తాత ఈ వయసులో డాక్టర్ చెప్పిన ప్రకారం టయానికి మందులు మరువకుండా జ్ఞాపకంగా వేసుకోండి. అన్నింటికంటే మీ ఆరోగ్యం మీకు ముఖ్యం.  అవునురా మనవడా మీ బామ్మ ఉంది చూడు కోడి నిద్రపోయి కూయటం మాను తుందేమోకాని నాకు మందులు ఇస్తూ వేడినీళ్లు ఇస్తుందిరా. "మింగండి అంటూ గరళం మింగవద్దని ఆనాడు శివుని పార్వతి గొంతు పట్టుకున్నదే మో" కానీ మీబామ్మ మందు గొంతు దిగేదాకా ఇక్కడే కూర్చుంటుంది.
    
 తాత ఇంట్లో మీరు ఒక్కరు వున్నప్పుడు ముక్కు మొహం తెలియని వాళ్ళు వస్తే వాళ్ళతో బాతకానీ కొట్టకండి.     వీలైనంత త్వరగా  మాట్లాడి పంపించేయండి.జాగ్రత్తగా ఉండండి. అవునురా పూర్వము గుర్రాలపై దోపిడీ దొంగలు వచ్చేటప్పుడు పెద్ద అట్టహాసం చేసేవారు, నేడు మాట్లాడుతూ గొంతు కోసేవారు, కన్ను మూసి తెరిచే లోపు చూపులతో మైకం కమ్మే విధముగా ప్రవర్తించుతున్నారు, మేకవన్నె పులులు, తేనెపూసిన కత్తులుగా ఉన్నరా 
  
తాత తడిగాఉన్న నేలపై నడువ వద్దు. ఇప్పడు కట్టే అన్ని ఇండ్లలో ఫ్లోరింగ్ కు పాలిష్ బండలు గానీ , టేల్స్ గానీ, ఇంకా నునుపైన బండలు వేస్తున్నారు. నీరు పడితే కనపడవు. అందవల్ల కాలు పెడితే జారడం ఖాయం. అవునురా చాప క్రింద నీళ్లు కనబడవు, ఏమోరా ఈ స్పటిక బండలు వేయోద్దురా అన్నా మీనాన్న వింటేగా, నీళ్ళు పడ్డా కనబడవురా ఎదుటి వారు చేశారు అని చాలా బాగున్నది అంటూ చేయటమే "ఓ గొర్రె కంచె దాటితే అన్నీ గొర్రే లు అటే పోతాయిరా. మంచి విషయాలు చెప్పినా పాములాగా పడగ చూపుతున్నారు "ఊరకనే కూర్చోక ఈ సలహాలు దేనికి అంటున్నారు " ముసలి వారి మాటలు గమనించే వారు తగ్గారురా.  

అందుకే నావంతు నాకు తెలిసినవి రాసుకుంటూ పోతున్నాను, తెలియపరుస్తున్నాను  
మనవు డా నిర్మొహమాటముగా మంచి మాటలు చెప్పావు చూడు చాలా సంతోషముగా ఉంది మంచి ఎవ్వరు చెప్పిన వినాలి ఆచరించాలి కదా మనవుడా         

తాత బామ్మా అని పెద్దగా అరిచాడు  
ఏమిటిరా బామ్మా 
బామ్మా కాఫీ తెస్తుంది అంతేనా 
ఏమనుకున్నావు తాత "ఈ పాలీష బండల పై జారిందోమనని భయమేసిందిరా నీమాటలకు 
ఏమిటీ తాతమనవుడు కూర్చొని నామీద జోక్ వేసుకొని నవ్వుతున్నారు 
ఏమీలేదు మా బామ్మ ఇచ్చే కాఫీ చాలా బాగుండని చెపుతున్నా తాతతో 
బడుద్దాయి బలే మాట్లాడుతున్నవురా 
ఒకటే నవ్వులు ...
--(())--  

ఇది యదార్ధ  ప్రాంజలి ప్రభ గాధ )

2020 లో జరిగిన ముచ్చట్లు  కాఫీ చిన్న కధ (9)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ప్రాంజలి ప్రభ పేరు పేరునా ప్రతిఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియ పరుస్తున్నాము .. ఓం శాంతి: శాంతి:శాంతి:... సర్వేజనాసుఖినోభవంతు  

ఎల్లరూ క్షేమము అని సర్దుకు పోయిన, ఇంటిలోనే ఉండి బంధాలు అనుబంధాలు ఏర్పరుచుకొని ఒకరికొకరు తోడు నీడగా సాగిపోయినది.  కష్టాలు, నష్టాలు, భయాల వార్తలతో రెండువేల ఇరవై తరతరాలకు ఒక గుణపాఠమైనది - విర్రవీగిన వారి వెన్నువిరిచి, కళ్ళు నెత్తి కెక్కిన వారి మాట విరిచి, నాకేంటి అనుకున్న వారినికూడా భయంలో ముంచి,మీసం మెలేసే వీరుల కండలు కరిగించింది. 
 
చాపకింద నీరులా కరోనా రోగం జొరబడింది, మనుషులను ఒక అట ఆడించింది, 2020 నుండి జారుకుంటుందేమోనని ఆసరాతో ఉంటే " స్ట్రైన్ " రూపంలో 2021  ప్రవేశిస్తా జాగర్తగా ఉండండి అని హెచ్చరిక చేస్తున్నది. నన్ను తక్కువచేసి మాట్లాడకండి పాప ప్రక్షాళన కొంత జరిగితే దేశం బాగుపడుతుంది  అన్నట్లు వచ్చింది        
  
కాలము తోనే గమనము,  రోగాలతోనే, భయాల తోటే పయనము, కాలము వృధా అయినది 
మెరుపు ఆలోచనల లేవు , మెరుపు నిర్ణయమ్ములు లేవు, మెరుపు లాంటి క్రిమి కీటకాల దాడులతో సాగిపోయినది 2020 , ఆత్మీయ వచనములతో, ఆత్మీయుల కలయిక ప్రవర్తనలు లేకయు బాధ్య తెరిగి పోరాడెను ప్రతి ఒక్కరు, నియమ నిభంధనలతో  ఉండటం వల్ల కొంత మేలు జరిగింది. 
  
మాట తూటలు లేవు, మాట బాంబులు లేవు, కోటి ఉన్నవాడినీ, కూటికి లేనివాడినీ, ఒకేరకమైన భయంతో- గడగడలాడించిన భయోత్పాత వర్షమై తరలి వెళుతూంది 2020 ..   

నవ్య భారత ప్రదాతగా బాధ్యత వహించి ప్రజల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యం గా ఉండి నవ్య క్రాంతికి ఆద్యుడుగా ప్రధాని ఉండి, శాంతి సమతా శోధకుడుగా నిలబడ్డాడు ప్రజలకు ధైర్యము నేర్పాడు స్వేచ్ఛ స్వచ్ఛ భారతముకు, బంగరు భవితను చూపి, జరిగి పొయినది.     
ఎలా బ్రతకాలి అని మాత్రమే కాక, ఎలా బ్రతకరాదో నేర్పించి, చూపించి, మనిషిలోని భయాన్ని వీక్షించి, నిబద్దతను పరీక్షించి వెళుతున్న  *ఇరవై-ఇరవై,* జీవితానికి బరువై, సంతోషం సగమై, ధైర్యం అరువై వికట్టహాసంతో వీడుతోంది సకల జనాన్ని

ఏది ఏమైనా గతం గత: వర్తమానం మనకు అన్నీ మంచి జరుగు తాయని ఆశించి ఆశా జీవులుగా జీవిచుదాం, ప్రేమని, స్నేహాన్ని పంచి, ధైర్యాన్ని పెంచి, మనో నిగ్రహాన్ని ప్రతిఒక్కరికీ పంచుదాము. హృదయ్ పూర్వక అభినందనలు తెలుపుకుందాం, చిక్కటి కాఫీ త్రాగి మంచి కబుర్లు చెప్పుకుందాం, జీవితాన్ని సాగిద్దాం    
    
--(())--
ఇది యదార్ధ  ప్రాంజలి ప్రభ గాధ )

తల్లీ కూతురికి హిందవుగా  ముచ్చట్లు  కాఫీ చిన్న కధ (10)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ


ఓ హిందువు నిన్ను నీవు, నీ  కుటుంబము అంటూ రక్షణ చేయటం కాదు,   చుట్టూ ప్రక్కల వారితో ఏకమై సహాయ సహకారము అందించు కుందాం, కలసి బతుకుదాం.అన్నది తల్లి.    

హిందువుకే క్లారిటీ ఎక్కువగా ఉంది నేను హిందువుణ్ణి అని, నా ఆరాధ్య  దేవుడు శివుడు లేదా వెంకటేశ్వరుడు ఇలా అనేకమంది దేవుళ్లను ఆరాధించే మతం హిందూ మతం ఒక్కటే.  మనశాంతి తో పూజలను చేసి మోక్షాన్ని పొందేవాళ్లు తెలుసుకొవాలి తల్లి . 

నేను హిందువుని,  మేము హిందువలం .అని మనం అంటూ మన పండగలకు ఒకరికొక్కరం కలుసుకుంటాం ప్రతి పండగను మనం చేసుకుంటున్నాము ఇందులో ఉన్నగొప్పతనం ఏ మతం లో ఉందో చెప్పఁడి .అని తెల్పింది తల్లి 

నేను ఫలానా కులపోణ్ణి, నేను పలా నా ఉపకులపోణ్ణి, నేను ఫలానా పార్టీ వాణ్ణి, నేను సెక్యలర్ గాణ్ణి, నేను ఫలానాసిధ్ధాంతం వాణ్ణి, నేనే ఫలానా నాయకుడి అనుచరుణ్ణి, నేను ఫలానా దేవుని భక్తణ్ణి .చెప్పాలి అదే నిజాయితి అని తెలుసుకో తల్లి.  

నేను పలానా సంఘంలో సభ్యుణ్ణి, మిగిలిన వాళ్ళంతా నేను చెప్పనట్లు చేయాలి చేయకపోతే వాళ్ళు పనికి మాలిన వాళ్ళు. అని నిందిస్తాడు.నేనే కరెక్టు,మేమే కరెక్టు.. మేము చెప్పిందే అమలు జరగాలి.అని విడిపోతాడు. పోట్లాడుతాడు.వాళ్ళు అనుకున వాళ్ళకి వంత పాడతాడు. వితండవాదం చేస్తాడు. సమాజంలో తిరగడు. సమాజం ఏమి ఆలోచిస్తుందో తెలుసుకోడు. నేను అనేవారందరు రాజకీయమతం వారు ఇందులో అన్ని మతాల వారు ఉన్నారు. ఒక మతం అని చెప్పఁ నవసరము లేదు తల్లి  

ఉచిత విద్యను నేర్పిన గురువులు, ఉచిత వైద్యం చేసే వైద్యులు, ఉచిత వాదం సహజ న్యాయవాదులు, ఇదేవిధముగా అనేకమంది ప్రజలకు సహకారం అందిస్తూ హృదయంలో స్థిరస్థావరం ఏర్పరుచుకున్న హిందువు లెందరో తెలుసుకో తల్లి  

దేశ సేవకు, ధర్మానికి కట్టు బడే వాడే హిందువు, పుట్టిన వాడి నుండి  పొయ్యే వాడివరకు పూ ర్తి  సహాయ సహకారమ్ . ఎక్కడైన ద్రోహం జరిగిన అందరూ ఒకరి కొకరు సహకరిస్తారు. ఇది నిజమైన హిందూతత్వం అదే జీవన ప్రయాణం తల్లి. 

మనం చేసే ప్రతి పనికి తర్క వితర్కాలు , లాజిక్కలు మాట్లాడము,.మన అహంకారం. మన ఆశ ,మన ఆలోచన.మేము చేసేదే రైటు.మేము నిర్ణయించిందే. నిర్ణయం అని ఎప్పుడు వాదించం జరుగుతున్నా సంఘటనలను గమనించు బతికే వాల్ళము నిజమైన హిందువులం.  . ఇతరులు మేము చెప్పనట్లు చేయాలి. ఈర్ష్య ,ద్వేషం,అసూయ ,పగ ,కక్ష.కార్పణ్యం.  డాబు, దర్పం,దర్జా‌,హోదా.కుళ్ళు కుతంత్రాలతో  లేని వాళ్ళం అసలైన హిందువులు తల్లి  . అసలే ఆలయాలను, విగ్రహాలను, ద్వంసం చేసే మూకలు వీర విహారం చేస్తున్నారు వారిని కనిపెట్టి శిక్షకు గురిచేయండి లేదా ఇప్పుడు గుడి లేదా రేపు మీ ఇల్లే అవ్వచ్చు రక్షక భటుల భద్రత పెరగాలి ప్రతిఒక్కడు ఒక హనుమంతునిగా తయారవ్వాలి దుష్టల నరికట్టుటకు. 

ఇలా చెప్పు కు పోతూఉంటే మనం తెల్సుకోవలసినవి, చేయవలసినవి ఎన్నో ఉన్నాయి. చెడు వేగంగా ప్రయాణిస్తుంది   ఎక్కడో ఇరుక్కుంటుంది కదలలేదు కానీ మంచి నిదానంగా మనసును చేరి శాంతి చే కూరుస్తుంది తెలుసుకో తల్లి ,   
--(())--

ఇది యదార్ధ  ప్రాంజలి ప్రభ గాధ )

2020 లో జరిగిన ముచ్చట్లు  కాఫీ చిన్న కధ (11)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

ఇది యదార్ధ  ప్రాంజలి ప్రభ గాధ )
భార్య భర్తతో బిడ్డకోసం  జరిగిన ముచ్చట్లు  కాఫీ చిన్న కధ (9)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఒక గర్భవతైన భార్య కధ
ఒక గర్భవతైన భార్య, ఆమె భర్త ఇలా మాట్లాడుకుంటున్నారు..
భార్య: ఏం అనుకుంటున్నావ్..?
అబ్బాయి పుడతాడనా ?
అమ్మాయనా..??
భర్త:అబ్బాయనుకో...
వాడికి లెక్కలు నేర్పుతాను...
ఇద్దరం కలిసి గేమ్స్ ఆడుకుంటాం...
స్విమ్మింగ్ నేర్పుతా...
చెట్లెక్కడం నేర్పుతా...
అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో
నేర్పుతా... ఇంకా....
భార్య: చాలు చాలు!
మరి అమ్మాయి పుడితే..!?
భర్త: అమ్మాయైతే
ఏం నేర్పనవసరంలేదు...!
అదే నాకు నేర్పుతుంది...
నేనేం తినాలి...
ఏం తినకూడదు...
ఏం మాట్లాడాలి...
ఏం మాట్లాడకూడదు...
నేను ఎలాంటి బట్టలు వేసుకోవాలి...
ఒక రకంగా మా అమ్మ లాగా అన్నమాట...
ఇంకా నేను దానికి ప్రత్యేకంగా ఏం చేయకపోయినా నన్ను హీరోలా చూసుకుంటుంది...
నన్నెవరైనా బాధపెట్టారనుకో, వాళ్ళని అస్సలు క్షమించదు...
ఎదురు తిరుగుంది...
భర్త దగ్గర కూడా నాగురించి గొప్పగా చెప్తుంది...
మా నాన్న నాకోసం అది చేసాడు...
ఇది చేసాడు అనీ...
భార్య: సో..అమ్మాయైతే ఇవన్నీ చేస్తుంది...
అబ్బాయైతే చేయడంటారు అంతేగా..??
భర్త: కాదు..
అబ్బాయైతే ఇవన్నీ మనల్ని చూసి నేర్చుకుని చేస్తాడు...
అమ్మాయికి బై బర్త్ వచ్చేస్తాయ్...
భార్య:
అదేం శాశ్వతంగా మనతోనే ఉండిపోదు కదా..!
భర్త: ఉండదు...
కానీ మనం దాని గుండెల్లో ఉండిపోతాం...
అందుకని అది ఎక్కడ ఉంది అన్నది సమస్య కాదు..!
అందుకని ఆడపిల్లల తల్లిదండ్రులు అదృష్టవంతులు...
కూతురంటే కూడికల, తీసివెతల లెక్క కాదు నీ వాకిట్లో పెరిగే 'తులసి మొక్క'...
కూతురంటే దించేసుకొవలసిన బరువు కాదు..
నీ ఇంట్లో వెలసిన  'కల్పతరువు'...
కూతురంటే భద్రంగా చూడవలసిన గాజు బొమ్మ కాదు...
నీ కడుపున పుట్టిన మరో "అమ్మ"...
కూతురంటే కష్టాలకు,కన్నీళ్ళకు వీలునామా కాదు ...
కల్మషం లేని 'ప్రేమ' కు చిరునామా...
కళ్యాణమవగానే నిన్ను విడిచివెళ్ళినా...
పరిగెత్తుకొస్తుంది నీకు ఏ కష్టమెచ్చినా...
తన ఇంటి పేరు మార్చుకున్న కడదాక వదులుకోదు పుట్టింటి పైన ప్రేమను...
కొడుకులా కాటి వరకు తోడురాకపోయినా...
అమ్మ అయి నీకు ప్రసాదించగలదు మరో జన్మ...
కూతురున్న ఏ ఇల్లు అయినా అవుతుంది..
దేవతలు కొలువున్న కోవెల...
కూతురిని కన్న ఏ తండ్రి అయినా
గర్వపడాలి యువరాణి ని కన్న మహారాజు లా..
మీరు
-కూతురని నేను కొడుకని వాదనలు ఎందుకు మనకు ఎవరు రాసిపెడితే వారే పుడతారు వారిని పెద్ద చేసాక వెళ్లి పోతారు చివరకు మిగిలేది మనిద్దరమే అది గుర్తుంచు కోండి నాకు మీరు నీకు నేను  ఆది మాత్రమే తెలిసిందా
తెలిసింది
సరే నీకు కాఫీ చేసుకొని తీసుకు వస్తా
ఆగు నీవు అసలే ఉట్టి మనిషి కాదు, ఈ రోజు నుండి నువ్వు అసలు ఏ పని చేయ నవసరం  లేదు అన్నీ నేను చేస్తాను . కాఫీ చేసుకొని వస్తా అంటూ లోపలకు వెల్లాడు భర్త . --
అబ్బా ఎంత బాగుందండి కాఫీ
కాఫీలాంటి బాబు పుడితే బాగుండు
అబ్బా ఆగవే పాల లాంటి పాప  పుట్టాలి నాకు ..
ఆ.....     ఆ....
--(())--

ఇది యదార్ధ  ప్రాంజలి ప్రభ గాధ )

గురుశిష్యుల ముచ్చట్లు  కాఫీ చిన్న కధ (12)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

శిష్యులారా నేను చెప్పేది  కాలం విలువ జాగర్త విని అనుకరించండి అదే నేను కోరుకొనేది. 

కాలనిర్ణయానికి కట్టుబడి చిత్తశుద్ధితో ప్రతిఒక్కరు నమ్మిన సిద్ధాంతంతో నడవాలి ముందుకు 
ఒక కొత్త లక్ష్యాన్ని నిర్ణయించుకోవడానికి, ఒక కొత్త కలను కనడానికి వయసుతో సంబంధం లేదు. మూడొందల అరవై అయిదు రోజులంటే, మూడొందల అరవై అయిదు అవకాశాలు అనుకుని మనిషి కార్యోన్ముఖుడై ముందుకు సాగిపోవాలి. ఎవరు ఏమన్నా నది సముద్రములో కలసినట్టు సాగుతూ పోవలసినదే.  

నేను వంటరిని కాను నాకుతోడుడుగా దైవం నా వెనుక ఉండి నడిపిస్తుంది నాకు తోడుగా వచ్చిన వారుముందుకు నడిపిస్తారని నమ్మకంతో సాగాలి. నమ్మకమే మనిషి ఆరోగ్యం అదే మన:శాంతి మార్గం . కాలం అంచు మీద జీవితం నాట్యం చేయనీయండి... , ఆకు చివర మంచు బిందువులా... జారనివ్వండి, శిలగా ఉన్నానని అనుకోకండి నేనొక శిల్పిని అనుకొని ఏదైనా కొత్తది కనుకొనగలనని దృఢముగా ఉండండి  మనిషి ఎదుగుదలకు అది ఎంతో అవసరం.

సమయాన్ని అన్నీ దిశలో వెచ్చించాలి. ఆరోగ్యం గురించి కాలాన్ని ఖర్చు చేస్తే రోగాలను దూరంగా ఉంచవచ్చు.కొందరు ప్రపంచానికే ఆదర్శవంతంగా నిలిస్తే, మరికొందరు ఎలా ఉండకూడదో చెప్పడానికి నిదర్శనంగా నిలుస్తారు. చాలామంది ఎటువంటి ప్రభావం చూపించకుండానే ఈ లోకం నుంచి నిష్క్రమిస్తారు.

శిష్యులారా మీరందరు కాఫీ త్రాగండి, నేను త్రాగుతున్నాను తర్వాత విషయాలు తెలుసుకుందాం 
అట్లాగే గురువుగారు .... ధన్యోస్మి ..
నేను చెప్పే విషయాలు తెలుసుకొని ఆచరణలో పెట్టండి 
అట్లాగే గురువుగారు 
 
జీవితానికి కాలం మూలాధారం. పుట్టగానే ఎంతో ‘కాలం’ ప్రతి ఒక్కరి ఖాతాలో జమ అయి ఉంటుంది. జీవితంలో ఏం సాధించాలో నిర్ణయించుకోవడానికి ఇందులో కొత్త సంవత్సరం కేవలం ఒక భాగం మాత్రమే. కాలానికి విలువను ఇచ్చేవారే జీవితానికి విలువనిస్తారని గ్రహించండి కాలమెప్పుడు తనపని తను చేసుకుపోతుంది మనము అర్ధం చేసుకొని జీవిత సాఫల్యం పొందాలి.    .
నేను ఏది ముఖ్యమని నమ్మానో, దాని కోసం నాకు సరిపోయేంత సమయముంది చేయడానికి’ అని అనుకోగలిగే వ్యక్తే గొప్ప అదృష్టవంతుడు.కొందరు కాలం చాలా వేగంగా వెళ్ళిపోతున్నట్లుంది అంటూంటారు. కాలంతో నేను నడవలేక పోతున్నాను దిగులుతో ఉంటారు అటువంటి వారిని నిజాలుతెలిపి దైర్యం నూరిపోస్తే వారు అదృష్ట వంతులవుతారు.   

సూర్య వెలుగులు ఆధారముగా మనిషి ఆత్మజ్ఞానంతో ఉన్నతిని పొందాలంటే ప్రతిరోజూ ధ్యానం కోసం సమయం కేటాయించండి.లక్ష్యసాధనకు మార్గం ఏర్పడుతుంది. ఎంత సమయం కేటాయించగలిగితే అంత సార్థకత. జీవితం ఊహాతీతం. మనిషి ఎంపికలు, ఫలితాలు, ప్రేరణలు.  
వస్తాయో తెలుసుకోగల బుద్ధి ఏర్పడుతుంది.  కాలాన్ని సక్రమంగా వినియోగించుకుని సద్భావనలతో సాగిపోవడం ముఖ్యం. 

ప్రతిమానవుడు సత్యాన్వేషణ రేపో ఎల్లుండో చేద్దామని కాలం లో చిక్కుకుంటాడు. కాలం లో చిక్కుకొని నివసించడం అలవాటయి పోయింది. కాలం రెండు విధాలు 
1.గడియారం సూచించే కాలమానం ఇది ఆగకుండా అలుపులేకుండా కదులుతుంది 
 2.మనస్సు కల్పించే మానసిక కాలం.ఇది చీకటి వెలుగులు చుట్టూ, కష్టసుఖాల చుట్టూ చక్రంలా తిరుగుతూ ఉంటుంది.      

నిన్న,ఈ రోజు, రేపు అనేవి మనస్సు నిర్మించిన. నిన్న జరిగిన సంఘటనలు యిప్పుడు లేవు. "నిన్న''గతించినట్లే అవి గతించాయి. కానీ ఆ సంఘటనలు జ్ఞాపకం చేసుకొని యిప్పుడు జరుగుతున్నట్టే భావించి ప్రవర్తించే వాళ్ళు చాలామంది వున్నారు. రేపు యింకా రాలేదు కానీ ఈ రోజున జరిగిన సంఘటనలు రేపు కూడా జరుగుతాయేమోనని ఊహించుకొని భయపడే వాళ్ళూ చాలా మందే వున్నారు.

అందుకే నేనంటాను నిన్నటి గురించి ఆలోచించకు, రేపటి గురించి విచారించకు , నేడే ధర్మమార్గమున కాలాన్ని సద్వినియాగం చేసుకొని సాగేదే జీవితం, రేపటికి అని బాకీ ఉంచితే గట్టును దాటలేని సముద్రకెరటంలా మారిపోతావు.
శిష్యులారా నేను చెప్పినవి వింటున్నారా 
వింటునామ్ .. 
    
నీతి :  నిజానికి నిన్నా లేదు, రేపూ లేదు, వర్తమానమే ఎప్పుడూ వుండేది. మానసిక కాలమే మిథ్య.
మనోనిగ్రహం తో ఉంటె కాలాన్ని జయించ వచ్చు రామచంద్రునిలా ధర్మాన్ని నిలబెట్ట వచ్చు 

ఓం శ్రీ రాం.... శ్రీ మాత్రేనమ:... సర్వేజనా సుఖినోభవంతు ....ఓం శాంతి: శాంతి: శాంతి: 

--(())--

ప్రాంజలి ప్రభ కధలు ... 13

పరమ శివునకు ఐదు ముఖాలు.....!!

అవి తత్పురుష, వామదేవ, సద్యొజాత, అఘోర, ఈశాన ముఖములు. ఇవి పంచభూతములకు ప్రతీకలు.

ఈ 5 ముఖములు భగవానుని 5 మహా కృత్యములైన సృష్టి( పుట్టుక), స్థితి (పెరుగుట), లయ (గతించుట), తీరోధాన ( కర్మనుబట్టి ఏ జన్మ ఎత్తాలొ/ మరల పుట్టుట / బ్రహ్మాండ నాశనం), అనుగ్రహములు(కైవల్యం / మోక్షం / శివ సాన్నిధ్యం ప్రసాదించుట. గుర్తుంచుకోవలసిన విషయం పుణ్యము ఎక్కువ చేసిన పాపము ఎక్కువ చేసిన తిరిగి జన్మించాలి. పాపము - పుణ్యము లేని సమతుల్య స్థితి లో మాత్రమే మోక్షము) చేయబడును.

ఈ 5 ముఖములనుండి 7 (2+1+1+2+1) కోట్ల మహా మంత్రములు ఉద్భవించినవి. అవి:
సద్యొజాత ముఖము నుండి గాయత్రి మొదలైన 2 కోట్ల మంత్రములు ఉద్భవించినవి. వీటిని పూర్వమ్నాయ మంత్రములు అంటారు.

సద్యొజాత - పశ్చిమ దిశ - అధిపతి సుబ్రహ్మన్యుడు - పృధ్వి తత్వం(సమస్త ప్రాణులు భూమి నుండే పుట్టును) - స్రుస్టి.

వామదేవ ముఖము నుండి 1 కోటి మంత్రములు ఉద్భవించినవి. వీటిని దక్షిణాంమ్నాయ మంత్రములు అంటారు. శైవాగమమ్ ఇందులోనిదే.

వామదేవ - ఉత్తర దిశ - అధిపతి కల్ప వృక్షం క్రింద పార్వతీ సహిత ఈశ్వరుడు - జల తత్వం (సమస్త ప్రాణులు నీటి వలననే జీవించి / వృద్ది పొందును) - స్థితి.

అఘోర ముఖమునుండి వైష్ణవాగమంకు( విష్ణు తత్వాన్ని ఆరాధించే వారు) సంబంధించిన 1 కోటి మంత్రములు ఉద్భవించినవి. వీటిని పశ్చిమామ్నయమ్ మంత్రాలు అంటారు.
అఘోర - దక్షిణ దిశ - అధిపతి దాక్షిణామూర్తి - అగ్ని తత్వం ( అన్నిటినీ కాల్చి భస్మం చేయటం) - నాశనం.

తత్పురుష ముఖము నుండి శక్తేయములైన(శక్తి ని ఉపాశించే వారు ఆచరించే విధానం శాక్తేయం) 2 కోట్ల మంత్రములు ఉద్భవించినవి. మహావిద్యాది మంత్రములు ఇందులోనివే. వీటిని ఉత్తారాంన్యాయ మంత్రాలంటారు.

తత్పురుష - తూర్పు దిశ - వాయు తత్వం (ఒక చోటనుండి మరో చోటికి ప్రయాణం) - తిరొధానం, ఈశాన్య ముఖమునుండి ఆత్మ-ఆనందం కు సంబంధించిన 1 కోటి మంత్రములు ఉద్భవించినవి. వీటిని ఊర్ధ్వామ్న్యాయ మంత్రాలు అంటారు.

ఈశాన - ఊర్ద్వ దిశ - అధిపతి రుద్రుడు - ఆకాశ తత్వం – అనుగ్రహం.
అందువలన ఈ 5 ముఖములను స్తుతించటం వలన 7 కోట్ల మహా మంత్ర జప ఫలితం ఉంటుంది.

అంతే 
కాదు దేవునికి మహా నివేదన సమయములో ఈమహా మంత్రాలతోనే పవిత్రించబడును. 
వాటినే "సధ్యోజాతాది పంచబ్రహ్మ మహామంత్రాలు" అంటారు..
 ఓం శ్రీ రాం ... శ్రీ మాత్రేనమ: ... ఓనమ:శివాయ  

--(())--


ఇది యదార్ధ  ప్రాంజలి ప్రభ గాధ )

అన్నల చెల్లి  ముచ్చట్లు  కాఫీ చిన్న కధ (15)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

చెల్లెలు చిన్న కధ  

తండ్రి పట్ల గౌరవం చూపక చీదరించుకుంటూ వెళుతున్న కొడుకుల్ని చూసి ఆ తల్లి బాధ వర్ణనా తీతమ్ కారణం తండ్రికి కరోనా వచ్చిందని ఇంటి బయట ఉన్న పాత పెంకుడుకొంప కు మార్చారు కొడుకులు. 
తండ్రి సంపాదన గురించి వీలునామా వ్రాయమని కొడుకులు గొడవపెట్టుకున్నారు ఎందుకనగా నలుగురు కొడుకులు ఒక కూతురు పంపకం చేయమన్నారు. కూతురికి పెళ్ళిచేయమని కొడుకుల్ని కోరాడు తండ్రి. 
కొడుకులందరు కలసి ఆవూరిలో వయసు ఎక్కువఉన్నవాణ్ణి తెచ్చి చెల్లెలు  వద్దన్నా పెళ్ళిచేసారు, 
మంచంలో ఉన్న తండ్రి వద్దకు వచ్చి పంపకం  చేయమని అడిగారు కారణం తండ్రి రోగానికి ఊర్లో అప్పులు చేశారు కొడుకులు.  
అనుకోని విధముగా తల్లి తండ్రులు కరోనా వ్యాధికి చేరి స్వర్గస్తులైనారు. మరణముల చక్రభ్రమనాలగా జరిగిపోయాయి 
అప్పుడే అక్కడ ఉన్న లక్ష్మి " సత్యం, ధర్మం,ధామం, దానము లేని చోట ఉండ లేనని వెళ్లి పోయినది.      
నలుగురు కొడుకులు అప్పలు తీర్చి ఆస్తిని నాలుగు ముక్కలు చేసి పంచుకున్నారు. కాపురాలు విడిపోయాయి            
సొంతఇల్లు లేదనే కానీ కూలి పనులు చేసుకుంటూ కాలం నెట్టుకుంటూ వచ్చారు పిల్లలు చదువుకొచ్చారు.   . 
చెల్లెలు కు ఏమి ఇవ్వలేదు. చెల్లెలుకూడా అన్నల బుద్ధిని తెల్సుకొని అన్నల దగ్గరకు రావటం మానేసింది. 
చెల్లెలకు బిడ్డ పుట్టినా ఆస్తిలో వాటా ఇవ్వలేదని అడుగుతుందని అన్నా వదినలు ఉత్తరసమాచారంతో ఎక్కడలేని ప్రేమ చూపారు, వచ్చుటకు వీలు కానిపరిస్థితి తెలియపరిచారు. 
కాల గమనంలో అన్నయ్యల బిడ్డలు చెల్లెలి బిడ్డ చదువులకు వచ్చారు
కాలం ఎప్పుడు ఒక రకంగా ఉండదు చదువుల నిమిత్తం గ్రామాన్ని వదలి అన్నలు వెళ్లిపోయారు 
చెల్లెలి భర్త  అనారోగ్య  కారకంగా  చనిపోయారు. అన్నలు వచ్చి ముసలి కన్నీరు కార్చి చెల్లివద్దే డబ్బు తీసుకోని కర్మకాండ చేసారు వారు.         .           
చెల్లెలు పది సంవస్చరాల బాబును పెట్టుకొని అక్కడే  చిన్న కొట్టు పెట్టుకొని పిల్లవాడ్ని చదివించింది. పిల్లవాడు చదువు యందు  శ్రద్ద చూపటం , అమ్మ కష్టం గమనించటం కాలచక్రంలో ఉద్యోగం సంపాయించుకోవటం జరిగింది.నగరం కొచ్చి చిన్న ఇల్లు తీసుకోని ఉన్నాడు తల్లిని రమ్మనగా కొంచం స్థిరపడు అప్పుడు వస్తా అన్నది తల్లి.  
అప్పడు  అన్న కూతురిని (కట్నం లేకుండా)  వివాహము చేసి ఓక్ ఇంటి  వాడును చేసింది. 
కొడుకు కోసం ఏంతో కష్టపడి కొంత డబ్బు మూట కట్టింది. 
కొడుకు ఉద్యోగం వేరే ప్రాంతానికి మారటంవల్ల కొత్త కాపురానికి కొన్ని వస్తువులు కొని ఇచ్చి పంపించింది. ఆ తల్లి. 
అమ్మ నువ్వు కూడా రామ్మా అన్న కొడుకు పిలుపుకు కంట నీరు తెచ్చుకొని మనం ఉన్న చోట ని చదువుకు అప్పులు చేసాను అవి తీర్చాలిరా, 
నేను తీరుస్తాను అమ్మా               
నివ్వెమ్ తీరుస్తావురా అసలే కొత్త కాపురం నిన్ను నమ్మి వచ్చింది మీ ఇద్దరి మధ్య నేనెందుకురా 
అప్పులు తీర్చి వస్తా
అమ్మా నీకు డబ్బు పంపుతాను నీవు కష్ట పడవద్దు అన్నాడు, కానీ పంపలేదు  
సరే జాగర్తగా ఉండండి గొప్పలకుపోయాయి అప్పులు చేయకండి అని చెప్పి వెళ్ళింది 
తర్వాత అప్పులన్నీ తీర్చి కొడుకు దగ్గర ఉందామని ఎంతో ఆశతో వచ్చింది. ఇల్లు చుసేటప్పటికల్లా ఇంద్రభవణం లా ఉన్నది 
అత్తయ్యగారు మీరు కష్ట పడుతున్నారని మీఅబ్బాయి వద్దన్నా అప్పు చేసి మరీ కొన్నాడు టీవీ వాషింమిషిన్,గ్రైండర్, మిక్సీ, ఇంకా 
కోడలి మాటలకు అత్త తలగిర్రని తిరిగింది. నేను ఒక్కదాన్నే చేసుకోలేకపోతున్నా అన్నది కోడలు 
ఎమన్నా స్పెషలా కోడలా 
ఇప్పుడే పిల్లలొద్దను కున్నాం అత్తయ్యగారు. మీకోసమని మీ అబ్బాయి బంగారు గాజులు అని చూపింది నాకెందుకమ్మా నీవే పెట్టుకో 
డబ్బు తీసుకొనివెళ్ళిన కొడుకులో మార్పు గమనించింది ఏమి లోకమో ఇది కోడలొచ్చాక తల్లి కనబడదు, కష్టం కనబడదు. కాఫీ త్రాగుతారా అత్తయ్యగారు, త్రాగను అన్నది.         . 
నేను ఇక్కడ ఉండలేను నేను పాత ఇంటికే వెళ్తాను అక్కడే నాజీవితాన్ని నెట్టుకొస్తాను, నేను అనారోగ్యం లో పడ్డాక డబ్బు తీసుకోవటానికి తప్పకుండా రమ్మణమని  చెప్పమ్మా అన్నది కోడలుతో 
అమ్మా వెళుతావటా అంటూ లోపలకు వచ్చాడు.
అవునురా శేషజీవితం మన అద్దెఇట్లోనే సాగాలని వెళ్తున్న. 
ఇక్కడ లోనుతీసుకొని కొత్త ఇల్లు కొంటున్నానమ్మ. 
బాబు నేను ఒకటే చెప్పదలచాను అప్పులు తీర్చటానికి అక్రమ మార్గం పోతునట్టున్నావు నేను నిన్ను నిజాయితీ పరుడుగా చూద్దామని  కష్ట పడి చదివిచ్చాను . 
కనీసం నన్ను రైలన్నా ఎక్కిస్తావా 
ఎమ్మా ఏమనుకోకు నాకు అర్జన్ట్ పని ఉంది నీకోడలు దించుతుంది ఏమనుకొకమ్మా. 
ఏమనుకున్నా చేసేది లేదురా బిడ్డా అంటూ కోడలితో రైల్వెస్టెషన్ కు వెళ్ళింది. కోడల పిల్ల ఈ పదివేలు నీదగ్గర ఉంచుకో ఇంతకన్నా ఏమిఇవ్వలేని దాన్ని.అంటూ ఇచ్చింది. 
మిగతా డబ్బుతో పుణ్యక్షేత్రాలు చేసి తనకొట్టుకు దగ్గరకు వచ్చింది  ఆ పాత ఇంటిలోకి ఒక స్త్రీ వచ్చి నాకేమన్నా సహాయం చేస్తావమ్మా కరోనా తో బాధపడుతున్నాడు బిడ్డను బతికించుకుంటా అన్నది. బిడ్డపై ఆశలు పెట్టుకోకకమ్మా నిన్ను నీవు నమ్ముకో నీకు డబ్బు ఇస్తా బిడ్డని బతికించుకో అన్నది. 
 అందుకే  సత్యం ధర్మం దమం దానం ఉన్నచోట  లక్ష్మీ దేవి ఉన్నట్లుగా ముసలి వయసులో కూడా అనుభవాలను కధలు వ్రాస్తూ దానధర్మాలు చేస్తూ  గ్రామదేవతగా మారింది.      
          . 
     --(())--

ఇది యదార్ధ  ప్రాంజలి ప్రభ గాధ )

శ్రీమతి  ముచ్చట్లు  కాఫీ చిన్న కధ (16)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ


 10. ఏమండో శ్రీమతి గారు 

 ఏమిటి శ్రీమతి గారు నేను స్నానం చేసి వచ్చే లోపే నా సెల్ నుండి తీసేస్తున్నవు, అలా చేయుట తప్పు కదూ, ఇతరుల సెళ్లులు చూడటం తప్పుకదా, మీరు మా వారే కదా అందు కనీ, అది నిజమే ఎవేమి డిలిట్ చేసావో కనీసం చెప్పు,  ఏమైనా ఆఫీస్ వి డిలిట్ చేసావనుకో, నాకు ప్రాబ్లం వస్తుంది, నాకెందుకు తెలియదండి నే నేమన్న చదువుకొని దాన్నా మీ భార్యనండి.

నేను వాడ్సప్ ఓపెన్ చేశా నాన్ వెజబుల్ జోక్స్ డిలిట్ చేశా, కొన్ని బొమ్మలు చూస్తే నావళ్లు కంపర మెక్కింది.

ఇంకా ఏమేమి తిసేసావు. నేను మిమ్మల్ని “వైరస్” లోకి తీసుకెల్లేవి తీసి వేసాను. ఇంకా పనికి రాని గాలి కబుర్లు డిలిట్ చేసాను. ఫేస్ బుక్ లోవచ్చే ప్రాంజలి ప్రభని తీయ లేదుకదా. నేనెందుకు తొలగిస్తానండి నాకేమన్న పిచ్చా,  రోజూ కొత్త కధలు, కవితలు, ఆద్యాత్మిక విషయాలు తెలుస్తున్నాయి కదా. నాకు కొంచం ధర్మం తెలుసండి అన్నది భార్య.

ఎం తెలుసు నీకు కొంచం చెప్పు,  చెపుతా వినండి “ మనిషి శరీరాన్ని వదలి వెళ్ళేటప్పుడు భందు మిత్రులుగాని, కుటుంబ సబ్యులుగాని వెంట రారు,  మనము అనుసరించిన ధర్మం ఒక్కటే అన్నాడు ఒక మహాకవి “

అందుకే నేను మీతో అంటాను,  దేనినైనా వదలివేయవచ్చును గాని, కామానికి వసుడయ్యో,  భయానికి లోనయ్యో, లోభం వల్లనో, లేదా ఎదో బతుకుదెరువు కోసమో ధర్మాన్ని నిర్లక్షం చేయరాదు, ధర్మాచరణను విడువరాదు.

అంటే నా ప్రవర్తన ధర్మం గా ఉన్నదా లేద, ఉన్నారు కాబాట్టే మీతో కాపురం చేస్తున్నాను, నేను ధర్మం తప్పా ననుకో ఆమాటలు ఏ భర్త నోటి వెంట రాకూడదు, వచ్చాయనుకో స్త్రీ కాళికావతారం ఎత్తటమే. ఏమిటే ఇప్పుడు అంత కోపంగ ఉన్నావు. శాంతం,శాంతం.

అసలు ధర్మాన్ని ఎరుగని వారెవరో తెలుసా నీకు అని అడిగాడు భర్త

లోకంలో ధర్మం ఎరుగని వారు పది మంది ఉన్నారు. అలాంటి వారితో సాంగత్యమును ఎర్పరుచుకోకూడదు

1.       మాత్తేక్కినవాడు, 2. పొరపాటుపడువాడు, ౩. పిచ్చివాడు 4.అలసినవాడు  5. క్రోధం కలవాడు 6.ఆకలిగొన్నవాడు 7. తొందరపా టుగలవాడు, 8. అత్యాస కలవాడు 9. భయ పడివవాడు 10. కాముకుడు  వేరేనని విదుర నీతిలొ చెప్పారండి.

సెల్ ఎందుకు ఓపెన్ చేసావంటి చిన్న కధ చెప్పావు, అసలు నా పాస్ వర్డ్ నీకెట్లా తెలిసింది. భర్త గుణం తెలుసుకొనే భార్య కాపురం చేస్తుందండి  . ఆ .. ఆ .. సెల్ మోగుతున్నది మీ అమ్మ గారుచేసారేమో చూడు లేదు ఇది మీ అక్క గారు చేసారండి    
                                                                   --((*))--


ఇది యదార్ధ  ప్రాంజలి ప్రభ గాధ )

మాజీ ప్రిన్సిపాల్  ముచ్చట్లు  కాఫీ చిన్న కధ (17)

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ


11.సహకారం

మాజీ ప్రిన్సిపాల్ గారు బాగున్నారా, మీ శృతి కి 95% మార్కులు వచ్చాయి, కానీ ఇక్కడ మీకు సీటు రాక పోవచ్చు, ఉత్తర దక్షణాలు ఎక్కువగా పనిచేస్తున్నాయి నమ్మకంగా పనిచేస్తున్న పాత లెక్చిరర్, ప్రిన్సుపాల్ రావటం సీటు లేదనటం జరిగింది.మన లాంటి  మధ్యతరగతి వారు చదవటం కష్టతరముగా మారుతున్నది. పద శృతి వెళ్దాం. 
       
నాన్న నీలో ఉన్నగుండే ధైర్యం ఎందుకు తగ్గింది, నా చదువు గురించి నీవు దిగులు చెందకు, నేను చదువును ఆపను, తల్లి తండ్రులారా మీరు ఏది చదవమంటే అది నేను చదువుతాను, అక్కల నలుగురికి పెళ్ళిళ్ళు చేసారు, నేను  మీకు భంధంలా ఉండ దలుచు కోలేదు,  నాకు తెలిసిన విద్యలలో  కంపూటర్ టైపింగ్, కుట్టు ఎంబ్రాయడరీ, నాకు తెలిసిన విద్యలద్వారా ఉద్యోగమూ చెస్తూ ప్రవేటుగా డిగ్రి చదువు తాను  నాన్న. నన్ను ఆశీ ర్వదించండి. మీరిద్దరి ప్రోస్చాహముతో, ఒక దృడ సంకల్పము నకు వచ్చి, మనో ధైర్యముతో ముందుకు పొవాలని అనుకుంటున్నాను. ఒక్క మూడు సంవస్చరాలు దాకా పెళ్లి గురించి మాట్లాడకండి, నాకాళ్ళ మీద నేను నిలబడటానికి అవకశం ఇవ్వండి.

నేను ఆడపిల్లనే కానీ మొగవాళ్ళ, మ్రుగాల్లాంటి వాళ్ళు,  ఉన్న చోట బ్రతకటం కష్ట మంటావమ్మా, నన్ను ఒక మగవాడిగా పెంచారు, నేను బ్రతికి మిమ్మల్ని బ్రతికిన్చు కొనే శక్తి నాకివ్వండి. నాన్న నీ అను భవ మంత ఉచిత విద్యా భోధనకు ఉపయొగించి , మనమే ఆర్ధికంగా వెనుకబడిన వారిని సేకరించి, వారికి తగిన ఉపాది కల్పించి, మొగ వారి తో సమానముగా  అడవారు కూడా బ్రతుక గలరు అని నిరూపించాలి నాన్న. నీధైర్యమునకు మాలో యువరక్తం ప్రవహిస్తున్నదమ్మా నీకు మా పూర్తిసహకారమ్ మేము ఇస్తాము.                   నధ్యేయానికి అడ్డు రాము నీ పట్టుదలే నీకు రక్ష  ఆడది ఆబాల కాదు సభల అని నిరూపించమ్మా . ఇది ఆధునిక యుగము అన్నీ విద్యలు అందుబాటుకు వచ్చాయి ఎక్కడకు పోనక్కరలేదు  "గూగుల్ " అన్నీ తెలుసుకోవచ్చు, స్వయంగా బతికి బతికించే మార్గాలు చాలా ఉన్నాయి, ఒక్కరౌ ఓర్పు ఓపిక ఉంటె సాధిచ లేనిది లేదు.
నాన్న ఈ రోజునుంచే నా ప్రయత్నం మెడలు పెడతా,అట్లాగే నమ్మ, ఇదిగో ఈ చిక్కటి కాఫీ త్రాగి మొదలుపెట్టు మెదడుకు మేతా అమ్మ . అదికాదురా కన్నా నమ్మకంతో కదలాలని మా ఆకాంక్ష. 
              
                                                         --((*))--
 12. తెల్ల కుక్కపిల్ల

ఏమిటి రామకృష్ణ  గారు ఈరోజు అన్నదానము చేస్తున్నారు, చెపుతాను రామారావుగారు కూర్చోండి   ఆరొజూ  
"ఏమిట్రా బాబు కుక్కపిల్ల అరుపు ఇంటిలో వినబడుతున్నది, అవునమ్మా నేనే తీసుకొనివచ్చా, పాపం చలికి వణుకుతున్నది, రగ్గు కప్పుకొని మరీ తీసుకొనివచ్చా, ఎక్కడతెచ్చావో  అక్కడ వదిలిరా, వాలమ్మ ఏడుస్తుంది, అవునమ్మ వాలమ్మ  కోసం చాలా సేపు వెతికాను ఎక్కడా కనబడలేదు అందుకే తెచ్చా, కాస్త అన్నం పెట్టు ఆకలేస్తున్నదేమో, ఇదిగో ఈ అన్నం పెట్టి ఎక్కడన్నా వదలేసిరా, లేదమ్మా నేనే పెంచుకుంటా, మీ నాన్న ఒప్పుకోడు, నీవే వప్పించ్చమ్మ.సరే దాన్ని జాగర్తగా చూసుకోవాలి, అట్లాగేనమ్మా .

తండ్రి రావటం, కుక్కపిల్ల చెప్పులు కొరకటం జరిగి పోయినాయి, కొడుకు గమనించి నాన్న ఈ పాత చెప్పులు బాగాలేదు అవి పారేస్తున్నాను కొత్తవి కొనుక్కో అన్నాడు, అవునండి కొత్తివి కొనుక్కోండి. ఏమిటే నీవు కూడా కొడుకును సమర్దిస్తావు.

నాన్న కుక్క అరుస్తున్నది, అవును ఉండు లైటు వేస్తా, ఎవరూ అటు పరుగేట్టేది అని గట్టిగా ఆరిచాడు, అప్పుడు దొంగలు పక్కింట్లో పడి దోచుకొని వెళ్లినట్లు గమనించారు. పక్కట్లోకి వెళ్లి ఓదార్చి, పరామర్శించి,పోలీస్ ఫోన్ చేసారు.

ఒక సారి కుక్కపిల్లను వెంట పెట్టుకొని విందుకు బయలు దేరారు, అందరూ చూస్తుండగా పాయసంలో మూతిపెట్టి  అరుస్తున్నది.  అక్కడున్నవారు కుక్కను కొట్ట పోయి గిన్నెను కొట్టారు, గిన్నేనుండి దొర్లిన పాయసంలో బల్లి కనిపించింది. అందరు కుక్క పిల్లను మెచ్చుకున్నారు.

కుక్కకు రకరకాల ఆటలు నేర్పారు,  పరిగెడుతూ గుంటలో పడింది, గుంటలో పాముతో పోరాడింది, పామును చంపివేసింది.

పాము విషముకుక్కకు ఎక్కకుండా డాక్టర్ సలహా ప్రకారము ఇంజక్షన్ చేయించారువారు. ఆ యింట్లో వారు కుక్కను భైరవునిగా భావించి పూజచేసి గారెలదండ వేసారు. కన్నా బిద్దలాగా చూస్తున్నారు.

అనుకోని విధముగా అందరూ కలసి ఊరికి పోవలసి వచ్చింది. కుక్క పిల్లను ప్రక్క ఇంటివారికి ఇచ్చి బయలు దేర బోయారు.  .
 ఆ ప్రక్క  యింట్లో ఉంచిన  కుక్క పిల్ల   ఒకటే ఏడుస్తూ పరుగెడుతూ మాకరుక్రిండ పడి  చని పోయింది. ఒక్కసారిగా మాబాబుకేవ్వుమని అరిచాడు, అపుడు చనిపోయిన కుక్క పిల్లను తీసుకువచ్చి మా తోటలో పాతిపెట్టాము.
అప్పుడే పిడుగు లాంటి వార్త ' మేము వెళ్ళే ట్రైన్ ను కొందరు దుండగులు పెట్రోల్ పోసి తగలేసినట్లు చాలా మంది సజీవ దహన మైనట్లు తెలిసింది.' మాప్రాణాల కోరకు  తన ప్రాణాన్ని అర్పించిన కుక్క పిల్ల చనిపోయిన రోజు అన్నదానము చేస్తున్నాము, అందుకే  మా యింట్లో కుక్క ఫొటోకు దండ వేశాము ఇది కధ "                   
                                
--(())--
 

 

ప్రాంజలి ప్రభ ... ఆరోగ్య ప్రభ 

✍️చలికాలం - ఆహార జాగ్రత్తలు!

సేకరణ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

 👉చలి కాలంలో ఆకలి ఎక్కువ వేస్తుంది. తరచు ఏదో ఒకటి తినాలని నాలుక లాగుతూ ఉంటుంది. జీర్ణశక్తి ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. నిజానికి చలికాలంలో శారీరక శ్రమ తగ్గుతుంది. ఎక్కువగా తింటాం. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి మీద పడతాయి. కీళ్ల నొప్పులు, ఒంటినొప్పులు, బద్దకంగా, నిస్తేజంగా ఉండడం, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు చలికాలంలో ఇందుకే వస్తాయి. అందుకే ఈ సీజన్‌లో ఎలాంటి ఆహార పదార్థాలు తినాలో మీ కోసం వివరిస్తున్నాము.

👉చలికాలంలో బాదం పప్పు, జీడిపప్పు, అంజీర, వాల్‌నట్స్, ఎండుద్రాక్ష, ఖర్జూరాలను పరిమితంగా అయినా తప్పనిసరిగా తీసుకోవాలి. శరీరానికి అవసరమైన పోషకాలు, చర్మానికి అవసరమైన నూనెలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. దాంతో పాటు మన శరీరానికి అవసరమైన వేడికూడా ఈ పదార్థాల వల్ల లభిస్తుంది.

👉మిరియాలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, అవాలు, ఉల్లిపాయలు ఈ సీజన్‌లో ఎక్కువగా తీసుకోవాలి. వీటి వాడకం వల్ల జీర్ణశక్తి సక్రమంగా ఉండడంతో పాటు పొట్టలో గ్యాస్ సమస్య ఉండదు.

👉ఆహారం కాస్త ఎక్కువ మోతాదులో తీసుకుంటాం. పైగా తగిన శ్రమ ఉండదు కాబట్టి మునగ, కాకర, అరటి వంటి కూరగాయలు, మెంతి, పుదీనా వంటి ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి. వీటి వల్ల తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.

👉మొలకెత్తిన గింజలు ఈ సీజన్‌లో బెస్ట్. వాటిని తీసుకోవడం వల్ల శక్తి ఎక్కువగా వస్తుంది. పైగా పొట్ట బరువుగా అనిపించదు.

👉ఓ గ్లాసు వేడి పాలలో కాస్త పసుపు, మిరియాలు వేసుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.

👉నిల్వ ఉంచిన, చల్లారిపోయిన ఆహారం ఈ సీజన్‌లో అసలే తీసుకోకూడదు. వేడి వేడి, తాజా ఆహారం ఎంజైమ్స్‌ను వృద్ధి చేస్తాయి.

👉శారీరక శ్రమ తగ్గిపోతుంది కాబట్టి మన శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోవు. అందుకోసం ఆరంజ్, నిమ్మ వంటి విటమిన్- సి ఉన్న పండ్లు తీసుకోవాలి.

👉వారంలో ఒకపూట నిరాహారంగా ఉండడం వల్ల శరీరంలో ఉన్న మాలిన్యాలు తొలగిపోతాయి. శరీరానికి నవ చైతన్యం సమకూరుతుంది.

👉వయోధికులు చన్నీటి స్నానాలు వదిలేయాలి. ఒకవేళ చేయాల్సి వస్తే కాస్త ఎండ వచ్చిన తరువాత స్నానం చేయడం మంచిది.

👉కొందరు ఈ కాలంలో ఆస్తమా, జలుబు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా చిన్నారులు. దీనికితోడు ఏ పని చేయలేక చాలా బద్ధకంగా ఉంటుంది. అలాంటి వారు కొంత సమయం ఎండలో నడవడం మంచిది. 

👉పొద్దుకుంగిన వెంటనే ఇంటి కిటికీలన్నీ మూసేయాలి. కర్టెన్లు కూడా వేసేయడం ద్వారా ఇల్లు లేదా నిద్రించే గది వేడిగా ఉండేలా చూసుకోవాలి.

👉వృద్ధులు, చంటి పిల్లలు ఉన్న ఇంట్లో ఈ జాగ్రత్తలు తప్పని సరి. లేకుంటే చలి కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.

👉పడుకొనే ముందు గోరువెచ్చని నీటితో చేతులు, కాళ్లు, ముఖం శుభ్రం చేసుకొని మాయిశ్చరైజర్ వంటివి రాసుకొని పడుకోవడం వల్ల చర్మం పాడు కాకుండా ఉంటుంది. 

👉ఈ కాలంలో శరీరం పొడిబారడం, కాళ్ళు పగుళ్లు లాంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటప్పుడు రాత్రిపూట కొబ్బరినూనెను వేడిచేసి దానికి చెంచా పసుపు కలిపి కాళ్లకు రాసి మర్దనా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

👉తెల్లవారుజామున లేవాల్సిన అవసరం ఉన్న వారు చెవులకు తప్పని సరిగా మఫ్లర్ లేదా మంకీ క్యాప్ వంటివి తప్పని సరిగా వేసుకొనే బయటకు వెళ్లాలి. 

✍️సమస్య ఏదైనా ఒకసారి మాకు తెలపండి. తక్కువ ఖర్చుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు లేకుండా అద్భుతమైన శాశ్వత పరిస్కారం చూపే ప్రయత్నం 100% జరుగుతుంది. మా వద్ద మందులు తీసికుని వాడిన మరియూ వాడుతున్న మిత్రులు అందరూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము.

 మిత్రులందరికీ  మా నుండి ఒక విన్నపం.. ఈ పేజీ చాలా విలువైన ఆరోగ్య విషయాలను అందరికి ఉచితంగా అందించాలనీ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో చేయడం జరిగింది. ఈ పేజీ ప్రతి ఒక్కరికి చేరేలా మిత్రులు అందరికి షేర్ చేసి సహకరించగలరని విజ్ఞప్తి.  మీ మనసుకి ఇష్టమై మీకు బాగుంది అనిపిస్తే దయచేసి ఈ పేజీని లైక్, ఫాలో చేసి మరియు షేర్ చేయగలరని మనవి..

 మీ ఆరోగ్యమే మా సంతోషము .... ప్రాంజలి ప్రభ 

*************

శాకాహారం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి..

👉కూరగాయలు తినడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు, మాంసాహారం తీసుకుంటేనే బలంగా ఉంటాం అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. 

👉కానీ మాంసాహారం కంటే వెజిటే రియన్ డైట్‌తోనే ఎక్కువ ప్రయోజనాలున్నాయి అని చాలామందికి తెలియదు.

👉అసలు శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో ఒకసారి చూద్దాం..

1).డీటాక్సిఫై:

👉వెజిటబుల్ డైట్‌లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది.

👉 ఫైబర్ అంటే పీచుపదార్థాలు. 

👉పాలకూర, క్యాబేజీ, సొరకాయ, గుమ్మడి వంటి కూరగాయలలో పీచుపదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. 

👉పీచుపదార్థాలు శరీరానికి చాలా అవసరం. 

👉మలబద్ధకం రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో ఫైబర్ ఉండాల్సిందే. 

శరీరంలో నుంచి టాక్సిన్స్‌ను బయటకు పంపించడానికి ఈ ఫైబర్ చక్కగా ఉపయోగపడుతుంది. 

👉నాన్‌వెజ్‌లో ఫైబర్ లభించదు.

2).ధృడమైన ఎముకలు:

👉మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ప్రొటీన్ శాతం పెరిగిపోతుంది.

👉 దీనివల్ల కిడ్నీలు దెబ్బతినడమే కాకుండా శరీరం కాల్షియం గ్రహించడం తగ్గిపోతుంది. 

👉ఎముకలు బలహీనంగా మారుతాయి. 

👉శాకాహారుల్లో ఇలాంటి సమస్యలు తక్కువే.

3). కార్బోహైడ్రేట్స్ లోపం: 

👉నాన్-వెజిటేరియన్ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా లభిస్తాయి. 

👉శరీరానికి తగినంత కార్బోహైడ్రేట్స్ లభించనపుడు అది కెటొసిస్‌కు దారితీస్తుంది. 

👉అంటే శరీరం తనకు అవసరమైన ఎనర్జీ కోసం కొవ్వును కరిగించుకొంటుంది. 

👉అంతేకాకుండా వెజిటేరియన్ ఫుడ్‌లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా జీర్ణం అవుతూ శరీరానికి అవసరమైన గ్లూకోజ్‌ను మెల్లగా అందిస్తాయి. 

👉అయితే నాన్‌వెజ్‌లో ఫ్యాట్, ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి. 

👉ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.

4).ఆరోగ్యకరమైన చర్మం: 

👉బీట్‌రూట్, టమోట, గుమ్మడి, కాకరకాయ వంటి కూరగాయలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 

👉ఆపిల్స్, పియర్స్, జామకాయ లాంటి పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది. 

👉మాంసాహారం తీసుకోవడం వల్ల చర్మానికి ఎలాంటి ఉపయోగం లేదు.

5).బరువు నియంత్రణ: 

👉కొవ్వును తగ్గించుకోవాలంటే సులభమైన మార్గం నాన్‌వెజ్‌కు దూరంగా ఉండటమే. 

👉మాంసాహారం తీసుకునే వారు బరువును తగ్గించుకోలేరు. 

👉అయితే నాన్‌వెజ్‌కు బదులుగా తృణధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, నట్స్, ఫ్రూట్స్ తీసుకొంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటుంది. 

👉వెజిటేరియన్ డైట్ వల్ల అధిక రక్తపోటు, అధిక బరువు నియంత్రణలో ఉంటాయి.

6). ఫైటో న్యూట్రియెంట్స్: 

👉డయాబెటిస్, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, స్ట్రోక్, బోన్ లాస్ వంటి వ్యాధులను ఫైట్రోన్యూట్రియెంట్స్ తీసుకోవడం ద్వారా నివారించవచ్చు. 

👉ఇవి వెజిటేరియన్ డైట్‌లో మాత్రమే లభిస్తాయి. 

👉నాన్‌వెజ్ తీసుకునే వారిలో వీటికి కొరతేఉంటుంది.

7). సులభంగా నమలడం:

👉మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడం లాలాజలంతో మొదలవుతుంది. 

👉కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకున్నప్పుడే ఈ ప్రక్రియ మరింత బాగా జరుగుతుంది. 

అంతే కాకుండా కూరగాయలతో తీసుకునే ఆహారాన్ని సులభంగా నమలవచ్చు.

✍️ ముఖ్య గమనిక:

👉పౌష్టికాహారం పేరిట అదేపనిగా మాంసాహారం, గుడ్లు తీసుకుంటే వాటిని అరిగించుకోవడానికి జీర్ణకోశంపైన అనవసరపు భారం పడుతుంది. 

👉శరీరంలోని జీవశక్తి అదనంగా ఖర్చవుతుంది. 

👉శరీరతత్వంలో కొన్ని చెడు పరిణామాలు చోటు చేసుకుంటాయి. 

👉ఆకలి మందగించడం, కడుపులో మంట, తేన్పులు, మలబద్ధకం వంటి సమస్యలు మొదలవుతాయి. 

👉మాంసాహారం, గుడ్లు పూర్తిగా మానకోవాలని కాదు. ఒక పరిమితిలో వాటిని తీసుకోవచ్చు. 

👉అయితే, మాంసాహారం నుంచి మాత్రమే కావలసిన పోషకాలు లభిస్తాయనుకోవడం సరికాదు. 

👉శాకాహారం నుంచి కూడా అవసరమైన ప్రొటీన్లతో పాటు పోషకపదార్థాలన్నీ లభిస్తాయి. పెద్దవారికి ఇవి అవసరానికంటే ఎక్కువే. 

✍️మొలకెత్తిన పెసర్లు, శనగలు:

👉వీటి నుంచి ప్రొటీన్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. 

👉తరుచూ వీటిని ఉపాహారంగా (బ్రేక్‌ఫాస్ట్) తీసుకోవడం వల్ల ఎంతో మేలు చేస్తాయి. 

👉మొలకెత్తిన గింజల్లో ప్రొటీన్లతో పాటు లవణాలు, విటమిన్లు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి.

👉పైగా వీటిని జీర్ణించుకోవడంలో శరీరానికి ఎక్కువ శక్తి కూడా ఖర్చు కాదు. 

👉మొలకెత్తించే విధానం గింజలను నీటిలో నాలుగు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టాలి. 

👉ఆ తరువాత వాటిని తడిగుడ్డలో మూట కట్టి ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టాలి. 

👉కొంచెం గాలి తగిలేలా మూత కాస్త తెరిచి పెట్టాలి. సాధారణంగా 12 నుంచి 16 గంటల వ్యవధిలో ఇవి మొలకెత్తుతాయి. చలికాలంలో అయితే 24 గంటల దాకా పట్టవచ్చు.

✍️నానబెట్టిన వేరుశనగలు:

👉శరీరానికి కావలసిన ఎన్నో పౌష్టిక విలువలు, ప్రొటీన్లను వీటి ద్వారా పొందవచ్చు. 

👉వేరుశనగ గింజలను పన్నెండు గంటలపాటు నానబెట్టాలి. 

👉ఆ తరువాత నీరు తీసివేయాలి. ఇలా చేయడం వల్ల అందులోని హానికారక అంశాలన్నీ తొలగిపోతాయి. 

👉ఈ వేరుశనగలను బెల్లంతో కలిపి తీసుకుంటే ఎంతో శక్తి లభిస్తుంది.

✍️సలాడ్:

👉క్యారెట్, కీర, బీట్‌రూట్, ఉల్లి, క్యాబేజీ, క్యాప్సికమ్‌లను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి. 

👉అప్పుడప్పుడు పచ్చి బఠాణి, రుచి కోసం కొంచెం ఉప్పు, మిరియాల పొడి కలుపుకోవచ్చు. 

👉టమాటకు బదులుగా నిమ్మరసం కలుపుకోవచ్చు. 

👉 తినే సమయంలో మాత్రమే ఉప్పు కలుపుకోవాలి. 

👉రాత్రిపూట ఆహారంతో పాటు తీసుకుంటే చాలా మంచిది.

✍️పప్పు, ఆకుకూరలు:

👉పప్పులో ప్రొటీన్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. 

👉ఆకుకూరలో, ఇనుము, లవణాలు అధికంగా ఉంటాయి. 

👉రక్తహీనతను ఆకుకూరలు బాగా అరికడతాయి. 

👉నీరసం, అలసట తగ్గుతుంది. 

👉రక్తహీనత తగ్గడంతో పాటు రక్తస్రావ సమస్యలు కూడా నయమవుతాయి. 

👉వీటితో పాటు నానబెట్టిన ఎండు ద్రాక్ష, అత్తిపండు, నానబెట్టిన బాదం, నల్లరకం ఎండు ఖర్జూరం తీసుకోవడం శ్రేయస్కరం.

ఆరోగ్య సలహాలతో కూడిన మన పేజీ ప్రతి ఒక్కరికి చేరేలా మిత్రులు అందరికి షేర్ చేసి, లైక్ చేసి, మంచి రేటింగ్ ఇచ్చి సహకరించగలరని విజ్ఞప్తి. 


సదా మీ సేవలో 




 

1 comment: