మధురిమలు
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఇక మనిషి ఇరుక్కున్నాడు
ఈ ప్రపంచం పరిధిలో
ఇక డుమ్ము లేపు తున్నాడు
డ్రమ్ము సంగీత పరిధిలో
ఇక వేసుకుంటున్నాడు
వస్త్ర ధారణ పరిధిలో
ఇక భౌతిక అకర్షితుడు
ప్రేమ పిలుస్తు పరిధిలో
ఇక సహజీవన మన్నాడు
సంసారముగ పరిధిలో
గ్రాఫిక్ గిమ్మిక్కు వీరుడు
ఇదియు సినిమా పరిధిలో
డూప్ ల పోరాటవీరుడు
హీరోయిజం పరిధిలో
పదవి పోరాట వీరుడు
ప్రజాస్వామ్య పరిధిలో
అధికార ఆరాట పరుడు
రాజకీయపు పరిధిలో
ఆస్తులను పంపకారుడు
ఇక కుటుంబం పరిధిలో
సరదాలతోన ధీరుడు
ఇదియు సంస్కృతి పరిధిలో
చదువు అంటున్న ధీరుడు
భుక్తి మార్గం పరిధిలో
కోరిన కోర్కెల దేవుడు
తీర్చుతుండే పరిధిలో
ఆస్తి ఉండగాదేవుడు
గొప్పవాళ్లతొ పరిధిలో
మందు పోయించె ధీరుడు
మిత్రుడు అన్న పరిధిలో
కట్నం తెస్తేనె ఘనుడు
భార్య పిలుపుల పరిధిలో
--(()))--
కోవిషీల్డ్,కోవాక్సిన్ లలో ఏది ఉత్తమమైనది....?
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశ వ్యాప్తంగా జనవరి 16, 2021న వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ప్రస్తుతం మన దేశంలో కోవిషీల్డ్, కోవాక్సిన్ అనే రెండు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. మార్చి 4వ తేదీ వరకు దాదాపు 1.8 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వర్కర్లు, హెల్త్ కేర్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇచ్చారు. మార్చి 1నుంచి ప్రైవేట్ కేంద్రాల్లోనూ వ్యాక్సినేషన్ అందుబాటులోకి వచ్చింది. రాబోయే రోజుల్లో ఈ రెండు వ్యాక్సిన్లలో ఏది ఉత్తమమైనదన్న సందేహాలున్నపుడు ఈ విషయాలు గుర్తించి నిర్ణయం తీసుకోవచ్చు.
కోవిషీల్డ్:
కోవిషీల్డ్ ఒక వైరల్ వెక్టర్ టీకా. చింపాంజీలలో బలహీనపడిన సాధారణ జలుబు వైరస్ (అడెనోవైరస్) SARS-CoV-2 యొక్క స్పైక్ ప్రోటీన్ యొక్క జన్యు పదార్థాన్ని తీసుకుని ఈ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేశారు.
కోవాక్సిన్:
SARS-CoV-2 (స్ట్రెయిన్: NIV-2020-770) వైరస్‌నుంచి తయారైంది. దీన్ని శరీరంలోకి పంపడం ద్వారా రోగ నిరోధక వ్యవస్థను యాక్టివేట్ చేసి కరోనా వైరస్‌పై దాడి చేసేలా ప్రేరేపించేలా కోవాక్సిన్ పని చేస్తుంది. ఇందులో ప్రోటీన్లు చెక్కుచెదరకుండా ఉంటాయి. తద్వారా అవి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.
కోవిషీల్డ్, కోవాక్సిన్లలో ఉండే రసాయన పదార్థాలు:
కోవిషీల్డ్:
* ఎల్-హిస్టిడిన్ ఇథనాల్
* ఎల్-హిస్టిడిన్ హైడ్రోక్లోరైడ్ మోనోహైడ్రేట్
* మెగ్నీషియం క్లోరైడ్ హెక్సాహైడ్రేట్
* పాలిసోర్బేట్ 80 *
* సుక్రోజ్
* సోడియం క్లోరైడ్
* డిసోడియం ఎడెటేట్ డైహైడ్రేట్ (EDTA)
* ఇంజెక్షన్ కోసం నీరు
కోవాక్సిన్:
* అల్యూమినియం హైడ్రాక్సైడ్ జెల్
* ఇమిడాజోక్వినోలినోన్ # (టిఎల్ఆర్ 7/8 అగోనిస్ట్)
* 2-ఫెనాక్సిథెనాల్
* ఫాస్ఫేట్ బఫర్ సెలైన్
నిల్వ ఉంచే పరిస్థితులు:
రెండు వ్యాక్సిన్లను 2 నుండి 8 డిగ్రీల సెల్సియస్ వద్ద నిల్వ చేయడంతోపాటు రవాణా చేయవచ్చు
ఎన్ని డోసులు వేసుకోవాలి:
కోవిషీల్డ్:
12 వారాల వ్యవధిలో రెండు డోసులుగా ఈ వ్యాక్సీన్‌ను ఇస్తారు. అయితే మన దేశానికి చెందిన డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) రెండు డోసుల మధ్య వ్యవధి 4 వారాలు సరిపోతుందని సూచించింది.
కోవాక్సిన్:
కోవాక్సిన్ కూడా రెండు డోసుల మధ్య కాలవ్యవధి 4 వారాలు ఉంటే సరిపోతుంది.
రెండు వ్యాక్సిన్లలో ఏది సమర్థవంతమైనది:
ది ల్యాన్సెట్ సర్వే ప్రకారం కోవీషీల్డ్ వ్యాక్సిన్ 4 వారాల వ్యవధిలో 2 డోసులు పూర్తి చేసుకున్నట్టయితే దాదాపు 70శాతం సమర్థవంతంగా పనిచేస్తోందని గుర్తించారు. 3 దేశాల్లో కోవీషీల్డ్ ట్రైల్స్ లో భాగంగా 11,636 మంది పేషెంట్లపై 3 ట్రైల్స్ సింగిల్ బ్లైండ్ గాను మరొకటి డబుల్ బ్లైండ్ ట్రైల్స్ చేశారు. రెండు డోసులు పూర్తయిన 12 వారాల గ్యాప్ తర్వాత దాని సమర్థత 82.4శాతం ఉన్నట్టు గుర్తించారు.
కోవాక్సిన్:
ఫేజ్-3 ట్రైల్స్ లో కోవ్యాక్సిన్ 81శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని ప్రకటించారు. వ్యాక్సిన్ ట్రైల్స్ లో భాగంగా భారత్ లో 28,500 మందిపై డబుల్ బ్లైండ్ ట్రైల్స్ నిర్వహించారు. కోవీషీల్డ్ వ్యాక్సిన్ కంటే #కోవాక్సిన్ ఎక్కువ సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు గుర్తించారు.
సమ్మతి
కోవిషీల్డ్:
3వ దశ క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తి చేసినందున కోవిషీల్డ్‌కు సమ్మతి పత్రం అవసరం లేదు.
కోవాక్సిన్:
మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలు అందుబాటులోకి రాక ముందే ఇండియన్ రెగ్యులేటరీ అథారిటీ కోవాక్సిన్ కు అనుమతి ఇచ్చింది.
వ్యాక్సిన్ ధర
వ్యాక్సిన్లను ప్రభుత్వ సంస్థల్లో ఉచితంగా అందిస్తారు. ప్రైవేట్ సంస్థల్లో మాత్రం వ్యాక్సిన్ ధర 250 రూపాయలుగా నిర్ణయించారు. ప్రస్తుతం వ్యాక్సిన్ ఏది వేసుకోవాలన్నది ప్రజలు నిర్ణయించుకునే అవకాశం లేదు. కానీ ప్రైవేట్ సంస్థల్లోనూ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినపుడు మాత్రం నచ్చిన వ్యాక్సిన్ వేసుకునే అవకాశం ఉంటుంది.
సూచనలు:
ఆక్స్ ఫోర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా, సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా తయారు చేసిన కోవీషీల్డ్ వ్యాక్సిన్ కు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే అందుబాటులో ఉన్న సమాచారం, దాని లక్షణాలు, గుణాలను పరిశీలించిన తర్వాత కోవాక్సిన్ కూడా మంచిదని సిఫార్సు చేస్తున్నారు.
వైద్యుల పర్యవేక్షణలో పై రెంటిలో ఏది తీసుకున్నా కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా రెసిస్టెన్స్ పవర్ ఇస్తాయి.
అందరికీ ఈ సమాచారాన్ని అందించండి
సర్వేజనా సుఖినోభవంతు!
మీ
డా.రోహిత్ కర్నాటి, MD జనరల్ మెడిసిన్,
నోడల్ అధికారి, AH KAVALI.
ధర్మం చాలారకాలుగా ఉంటుంది. చాలా సూక్ష్మంగా ఉంటుంది. వేదవిహితము, పెద్దలమాటలూ , వారి ఆచరణ చూసి ధర్మసూక్ష్మాన్ని గ్రహించాలి. సత్యవ్రతం గొప్పది. కాని ఇతరులకు జరిగే అపాయాన్ని నివారించడానికి చెప్పే అబద్ధం నిజం కంటే గొప్పది. ఏ ప్రాణికైనా అపకారం కలిగించే నిజం అబద్ధం చెప్పడంతో సమానం. ప్రాణాపాయ స్థితిలో, వివాహసమయంలో చెప్పే అసత్యం నిజంతో సమానం. కులవృత్తి దైవ సమానం. ఇష్టాయిష్టాలతో పని లేకుండా దానిని ఆచరించడం మానవ ధర్మం. మనము అనుభవించే కష్టసుఖాలు మనం పూర్వజనమలో చేసిన పాపపుణ్యాలే కారణం. ఇది తెలియని మూఢులు దైవాన్ని దూషిస్తారు. మానవులు తాము చేసే పనులకు తామే కర్తలమని భావిస్తారు. అది అజ్ఞానం అదే నిజమైతే తాము చేసే కార్యములన్నీ ఎందుకు ఫలించడం లేదు. ధర్మాత్ములు, నీతిమంతులు చేసే కార్యములు ఒక్కోసారి నిష్ఫలమతున్నాయి కాని దుర్మార్గులు చేసే పనులు ఫలిస్తున్నాయి. కొందరికి అనాయాసంగా ధనరాశులు వచ్చి పడుతున్నాయి. కొందరికి ఎంత శ్రమించినా పేదరికం పోదు. కటిక దరిద్రులకు పేదవారికి వద్దన్నా సంతానం కలుగుతుంది. కొందరు ధనవంతులకు ఎన్ని వ్రతాలు చేసినా సంతానం కలుగదు. ఇదంతా పూర్వజన్మ కర్మ ఫలమే. మానవులు కర్మాధీనులు కాకుంటే రోగాలు, మరణం లేకుండా బ్రతకవచ్చు కదా. కనుక ఈ శరీరం కర్మ ఫలంగానే ఏర్పడుతుంది. శరీరం చేయవలసిన పనులు కర్మవశాన నిర్ణయించబడతాయి. మరణానంతరం కర్మఫలాన్ననుసరించి దేహధారణ నిర్ణయించ బడుతుంది.
***
బెల్లం పాకం
(ప్రభాకర్ పెదపూడి)
పనిమనిషి కాంతం పెరట్లో తుడుస్తోంది. “ఇదిగో కాంతం! ఆ కొబ్బరి చీపురుతో తుడిస్తే తుడిచినట్టుగా ఉంటుంది, అంతేగానీ కొండ చీపురుతో తుడిస్తే చీపురు అరిగిపోతుంది కానీ తుక్కు పోతుందా ఏమన్నానా” బామ్మ కాంతం చేతిలో కొండచీపురు లాక్కుని కొబ్బరి చీపురు అందించింది. కాంతం మూతి నాలుగు దిక్కులకూ తిప్పింది. ఇదిగో కాంతం! అలా మునుసుబుగారి చేరుకుతోట వైపు వెళ్ళి కాస్త బెల్లం పాకం పట్రావే! ఇవ్వాళ శనివారం రాత్రికి మినపరొట్టి కాలుస్తాను, అందులో బెల్లం పాకం నంచుకు తింటే స్వర్గం కనిపిస్తుందనుకో. నీకు కూడా రెండుముక్కలు పెడతాలే, నాతోపాటు స్వర్గానికి వద్దువుగాని” స్టీలు కేరెజీ కాంతానికి అందిస్తూ అంది బామ్మ. “ మినపరోట్టి తలకింద పెట్టుకునే దిండంత కాలుస్తారుకదా మద్దెలో ఎలా కాలుతుందమ్మా “ కాంతం బామ్మను అడిగింది. “ ఓసినీ మొహం మండా, ఆమాత్రం తెలియదా మినప్పిండి వేశాక, మద్యలో గ్లాసు పెడతామే, అప్పుడు చక్కగా ఉడుకుతుంది, మా అమ్మాయి కూడా గ్లాసునే వాడుతుంది, మా అమ్మమ్మ కూడా గ్లాసునే వాడేది” బామ్మ నవ్వుతూ చెప్పింది.
“ కేరేజీ నిండా బెల్లం పాకం కక్కుర్తి పడకుండా ఇచ్చాదేమిటే వాడి మొహం మండా! ఐనా ఏమాటకి ఆమాటే చెప్పుకోవాలి మునుసుబు చాలా మంచోడు. ఎందుకంటే చిన్నప్పుడు వాడు నాక్లాసు మేటు “ బెల్లం పాకాన్ని అరచేతిలో వేసుకుని నాకుతూ అంది బామ్మ. “ఆ చానా మంచోడు, నేను ఎల్లినప్పటినుండి, ఎగా దిగా నావైపు చూడటంతో సరిపోయింది, ఏదవ సచ్చినోడు “ కాంతం తిట్టుకుంటూ వెళ్లిపోయింది. “ఆ వెధవ ఇంకా మారలేదేమిటి, స్కూల్లో నన్నుకూడా అలాగే కన్నార్పకుండా చూసేవాడు, నేను తెల్లని తెలుపుకదా” బామ్మ గతాన్ని కాసేపు నెమరువేసుకుని మురిసిపోయింది.
ఫాల్గుణ మాసం
ఫాల్గుణం ..విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం.
ఫాల్గుణంలో గోదానం, ధనదానం, వస్త్రదానం, గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం
ఫాల్గుణ శుద్ధ పాడ్యమి
నుంచి పన్నెండు రోజులు పయోవ్రతం ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధి కలుగుతోందని భాగవత పురాణం వివరిస్తోంది.
అదితి పయోవ్రతం ఆచరించి వామనుణ్ణి పుత్రుడు గా పొందింది.
ఫాల్గుణ మాసం శుద్ధ విదియ నుండీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారికి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
ఫాల్గుణ శుద్ధ చవితి రోజు వినాయకుడిని పూజించే అవిఘ్నవ్రతం లేదా పుత్రగణపతి వ్రతం చేస్తారు.
ప్రతీ ఏటా తిరుమలలో ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకూ ఐదు రోజుల పాటు స్వామివారి తెప్పోత్సవం నిర్వహిస్తారు.
ఫాల్గుణ శుద్ధ నవమి నాడు మధ్వులు ఆరాధించే రాఘవేంద్ర స్వామి వారి జన్మదినం.
అమలక ఏకాదశి :- ఫాల్గుణ శుద్ధ ఏకాదశిని ఆమలక ఏకాదశి అంటారు. ...
ఫాల్గుణ శుద్ధ ద్వాదశినే గోవింద ద్వాదశి, నృసింహ ద్వాదశి అంటారు. ఈ నాడు గంగాస్నానం పవిత్రం.
ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ మహా పూర్ణిమ, హోళికా పూర్ణిమ, డోలా పూర్ణిమ, కామదహనోత్సవంగా వ్యవహరిస్తారు. ఉత్తర భారత దేశంలో హోళికా పూర్ణిమ ప్రధానంగా జరుపుకుంటారు.
ఈ రోజు శ్రీకృష్ణుని ఊయలలో వేసి ఆరాధించే ఉత్సవంగా డోలా పూర్ణిమ చేస్తారు. తమిళనాడులోని మధురైలో మీనాక్షీ సుందరేశ్వరుల కళ్యాణం జరిగిన రోజు కనుక కళ్యాణ పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు మధురైలో అమ్మవారి అయ్యవార్ల కళ్యాణం జరుపుతారు.
ఫాల్గుణ బహుళ విదియనాడు లక్ష్మీదేవి పాలకడలి నుండి ఉద్భవించిందని చెప్పబడింది. ఆరోజు కనకధారా స్తవం చదువుకోవడం సత్ఫలితాలనిస్తుంది.
ఫాల్గుణ బహుళాష్టమి
రోజునే సీతాదేవి జనకునికి నాగేటి చాలులో దొరికిందని కావున ఆనాడు సీతాదేవి జన్మదినంగా కూడా జరుపుకుంటారు. ఫాల్గుణ మాసంలోనే రామరావణ యుద్ధం జరిగింది. మహాభారతంలో కూడా అతిరథ మహారథులైన అనేకమంది వీరులు ఫాల్గుణ మాసంలోనే జన్మించారు.
ఫాల్గుణ బహుళ అమావాస్య
రోజును కొత్త అమావాస్య అంటారు. ఆ రోజు కొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. ఆ రోజు పితృ దేవతలకి తర్పణాలు ఇస్తారు.
ఫాల్గుణ బహుళ పాడ్యమినాడే రావణుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్లాడు.
ఫాల్గుణ బహుళ ఏకాదశినాడు రావణ కుమారుడు ఇంద్రజిత్తు, లక్ష్మణుడు మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది. రావణబ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడు.
ఇలా ఎన్నో విశిష్టతలను పొందుపరచుకున్న ఫాల్గుణ మాసంలో, భక్తితత్పరతలతో ఆ భగవానుని సేవించి ఆయన కృపకు పాత్రులమవుదాం
***
🌻 ప్రత్యుపకారం 🌻
🍃🌹భగవంతుడి సృష్టితో మనిషి ఒక అద్భుతమైతే, మానవతతో ఆ జన్మను సార్థకం చేసుకునే విధానాలతో, జీవయాత్ర సాగించడం, మానవ ధర్మం.
🍃🌹కలియుగంలో మసలే మనుషులు, చిత్ర విచిత్ర స్వభావాలతో ఎవరికి వారే, అన్నట్లు బ్రతుకుతూ ఎదుటి వారి గురించిన ఆలోచనలకు దూరమవడం వల్ల, ఎన్నో అనర్థాలు ఎదురవుతున్నాయి.
🍃🌹ఒకే కుటుంబంలో నివసించేవారు సైతం ఎవరు, ఏమిటి తమ నుండి ఆశిస్తారో అనే భయాలతో బాంధవ్యాలను విస్మరించడం విస్మయం కలిగించే విషయం.
🍃🌹కష్టసుఖాలతో, ఒకరినొకరు, ఉపకారాలతో తోడ్పాడుతో, ఐకమత్యంతో మెలగడం అరుదుగా మారింది.
🍃🌹మానవ సంబంధాలు అడుగంటడంతో ఆత్మీయతలు లేవ్ఞ. అసూయాద్వేషాలు, స్వార్థం ప్రకోపించి, మనుషుల మధ్య మాటలే కరువయినాయి. పలకరిస్తే పాపం అన్నట్లు ఎవరికి వారు ఒంటరితనమే భాగ్యం అన్నట్లు ప్రవర్తిస్తూ ఉండటం వల్ల, మానసిక ప్రశాంతతను కోల్పోతూ, నిరుత్సాహం కొని తెచ్చుకుంటున్నారు.
🍃🌹ఎదుటివారి పట్ల కుతూహలమే తప్ప, ఎవరికి ఎలా ఉపయోగపడాలి! సహాయం అందించాలి అనే ఉపకార బుద్ధిని కలిగి ఉండకుండా, తమ వరకే అనేలా సంపదలను పెంచుకుంటూ, వాటి సాధన కోసం ఎంత చెడుపనికైనా సిద్ధమవడం వల్ల ప్రయోజనాలు శూన్యం.
🍃🌹భగవంతుడి సృష్ఠిలో పేద, ధనిక వర్గాలు లోకంలో సంచరిస్తూ ఉండటంతో, దేవ్ఞడు స్వయంగా తానే వచ్చి మనుషులకు సాయం చేయడు.
🍃🌹దైవత్వం కలిగిన ఉదార హృదయులు, సాటిజీవుల పట్ల దయ, కరుణ, ప్రేమ కలిగి తనతో పాటు ఇతరులు కూడా సుఖజీవనం గడిపేలా సహకరించడమే ఉపకారగుణం.
🍃🌹ధనాన్ని తన తరానికీ అన్నట్లు వ్యవహరిస్తూ దానధర్మాలు మానుకుని, నిరంతరం ధనధ్యాసకే జీవితకాలం కేటాయించకూడదు. అపకారికి కూడా ఉపకారం చేయాలనుకునే వారి జన్మధన్యం.
🍃🌹పరోపకారమే శరీరధర్మంగా భావిస్తూ బంధువ్ఞలను, స్నేహితులను, అవసరకాలంలో ఆదుకోవాలి. డబ్బుతో ప్రాణాలకి లంకె పెట్టరాదు. అది అందరికీ లభ్యమయ్యేలా వితరణలు అందించాలి.
🍃🌹ఏదీ శాశ్వతం కాదు. మరుజన్మ మంచిది కావాలనుకుంటే, మనం పెట్టుకునే పెట్టుబడే ఉపకారం అని గ్రహిస్తే పదిమందికి సహాయం చేయగలం.
🍃🌹బాల్యస్నేహితులైన కృష్ణుడు కుచేలుడి కథ వింటే మనకు సహాయం అర్థం తెలుస్తుంది. లేమిలో తనని అర్థించవచ్చిన కుచేలుడి ఆంతర్యం గ్రహించి, అటుకులు స్వీకరించి, ఆయన అడగకుండానే అన్ని భాగ్యాలు ప్రసాదించిన శ్రీకృష్ణుడి ఔదార్యం యుగయుగాలకే ఆదర్శం కావాలి.
🍃🌹ఇప్పుడైతే బ్రతికి చెడ్డవారిని దరిదాపులకు కూడా రానివ్వరు. వారిని నిర్లక్ష్య ధోరణులతో బాధపెడతారే కాని, ఉపకారం చేయరు.
🍃🌹ఇవ్వడంలో ఉండే ఆనందం పుచ్చుకోవడంలో ఉండదని, తెలిసేవారు బహుకొద్ది మంది భాగ్యవంతులకే చెల్లు.
🍃🌹ఉపకారానికి, ప్రత్యుపకారం మాట ఎలా ఉన్నా ప్రత్యపకారం, జరగకుండా ఉండేలా మానవలోకంలో మనుషులు జాగ్రత్త పడాలి.
”సర్వేజనాసుఖినోభవంతు అనే మనోభావంతో భాసిస్తే భగవంతుడి కృపకు పాత్రులవుతారు.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
మధురిమళ ... కవిత్వం (1)
మనసు భ్రమ తొలగిస్తా
కవిత్వముతొ తగ్గిస్తా
కలం కావ్యము వ్రాస్తా .
నీ మచ్చని తొలిగిస్తా !
కలతపడియు నే వ్రాస్తా
కన్నీటిని తొలగిస్తా
కాసుల కోసం వ్రాస్తా
కాగితమై బ్రతికేస్తా !
సొమ్ముల కోసం వ్రాస్తా
సోది చెప్పి బతికేస్తా
ప్రశంసలకొరకు వ్రాస్తా ..
పక్షిలాగ జీవిస్తా !
పోటీ కోసం వ్రాస్తా .
ఆరాటము చూపిస్తా
బిరుదులకోసం వ్రాస్తా .
గౌరవంతొ జీవిస్తా !
నె పరిత పించి వ్రాస్తా
కాలాన్నే మరిపిస్తా
ఆవేదనతో వ్రాస్తా
అనంతమూ మురిపిస్తా !
చిత్తంతో నే వ్రాస్తే
చిరకాలముఆలపిస్తా !
అనుభవంతోను వ్రాస్తా ....
అర్ధంతోనే వ్రాస్తా !
--(())--
సమ్మోహనాల.... స్త్రీ
స్త్రీ శక్తికి మించిన
మించేనా యుగాన
యుగాన ఎవ్వరో తెలియదే ఈశ్వరా
స్త్రీ యుక్తి వల్లన
యుక్తితో సంధాన
సంధానకర్తగా స్త్రీ యేగ ఈశ్వరా
స్త్రీ సృష్టి అంతా ను
అంతా గంధ మేను
గంధము పేగు బంధం ప్రేమే ఈశ్వరా
స్త్రీ జీవితం తృప్తి
తృప్తి తో సంతృప్తి
సంతృప్తి తెల్పు కుటుంబానికి ఈశ్వరా
స్త్రీ మనసు మరుమల్లె
మల్లె సుమధుర జల్లె
జల్లె తరుణాన హాయిగొలుపే ఈశ్వరా
స్త్రీ గృహానికి గురువు
గురువుగాను బిందువు
బిందువే మూలం అన్నింటికి ఈశ్వరా
--(())--
మనసు భ్రమ తొలగిస్తా
కవిత్వముతొ తగ్గిస్తా
కలం కావ్యము వ్రాస్తా .
నీ మచ్చని తొలిగిస్తా !
కలతపడియు నే వ్రాస్తా
కన్నీటిని తొలగిస్తా
కాసుల కోసం వ్రాస్తా
కాగితమై బ్రతికేస్తా !
సొమ్ముల కోసం వ్రాస్తా
సోది చెప్పి బతికేస్తా
ప్రశంసలకొరకు వ్రాస్తా ..
పక్షిలాగ జీవిస్తా !
పోటీ కోసం వ్రాస్తా .
ఆరాటము చూపిస్తా
బిరుదులకోసం వ్రాస్తా .
గౌరవంతొ జీవిస్తా !
నె పరిత పించి వ్రాస్తా
కాలాన్నే మరిపిస్తా
ఆవేదనతో వ్రాస్తా
అనంతమూ మురిపిస్తా !
చిత్తంతో నే వ్రాస్తే
చిరకాలముఆలపిస్తా !
అనుభవంతోను వ్రాస్తా ....
అర్ధంతోనే వ్రాస్తా !
--(())--
సమ్మోహనాల.... స్త్రీ
స్త్రీ శక్తికి మించిన
మించేనా యుగాన
యుగాన ఎవ్వరో తెలియదే ఈశ్వరా
స్త్రీ యుక్తి వల్లన
యుక్తితో సంధాన
సంధానకర్తగా స్త్రీ యేగ ఈశ్వరా
స్త్రీ సృష్టి అంతా ను
అంతా గంధ మేను
గంధము పేగు బంధం ప్రేమే ఈశ్వరా
స్త్రీ జీవితం తృప్తి
తృప్తి తో సంతృప్తి
సంతృప్తి తెల్పు కుటుంబానికి ఈశ్వరా
స్త్రీ మనసు మరుమల్లె
మల్లె సుమధుర జల్లె
జల్లె తరుణాన హాయిగొలుపే ఈశ్వరా
స్త్రీ గృహానికి గురువు
గురువుగాను బిందువు
బిందువే మూలం అన్నింటికి ఈశ్వరా
--(())--
No comments:
Post a Comment