ప్రాంజలి ప్రభ (25)
సమ్మోహనాలు ... పిల్లి 1331 ... 1328
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
పిల్లి నడకలు వొద్దు
వొద్దు అతుకులు వొద్దు
వొద్దు అనేపదం వెంటరాదు ఈశ్వరా
పిల్లిని భంధింస్తే
భంధి తొ కోపిస్తే
కోపిస్తే పిల్లియె పులియగును ఈశ్వరా
ఆడువారినడకలు
నడకలతో కళకళలు
కళకళలు పిల్లి నడకలు మల్లె ఈశ్వరా
హనుమ రూపము మార్చి
మార్చి సహనము చేర్చి
చేర్చి మార్జాలముమల్లె కదిలె ఈశ్వరా
పిల్లిని చూసి ఎలుక
ఎలుక పరుగులే ఇక
ఇక పిల్లికి చిక్కక బతికేను ఈశ్వరా
కుక్కను చూసి పిల్లి
పిల్లి పరుగుల పిల్లి
పిల్లి అయినా కుక్కంటె భయము ఈశ్వరా
పిల్లి పిల్లలు తిప్పి
తిప్పి ఇల్లులు తిప్పి
తిప్పి బతుకును నేర్పు పిల్లలకు ఈశ్వరా
కళ్ళు మూసియు పిల్లి
పిల్లి పాలను గిల్లి
గిల్లి పాలు త్రాగుట తప్పదు ఈశ్వరా
--(())--
💐💐సత్యన్నారాయణ స్వామి వ్రత కధల అంతరార్ధం 💐💐💐
మనకున్న ఎన్నో గొప్ప విశేషమైన పూజలలో, వ్రతాలలో శ్రీ సత్యన్నారాయణస్వామి వ్రతం చాలా ఉత్కృష్టమైనది. పెళ్ళిళ్ళలో, గృహప్రవేశాలలో, ఏ శుభ సందర్భంలో అయినా మనం ఆచారంగా ఈ వ్రతం చేసుకుంటాము. ముందుగా అష్టదిక్పాలకులను, నవగ్రహాలను, దేవతాసమూహాన్ని వారి సపరివారంగా ఆహ్వానించి, ఆవాహన చేసి ఉచితాసనాలతో సత్కరించి వారి ఆశీస్సులను స్వీకరించి మంత్రపుష్పం సమర్పించి అప్పుడు స్వామివారి లీలా విశేషాలను కధల రూపంగా విని తరిస్తాము.
ఈ వ్రత విధానం స్కాందపురాణం రేవాఖండంలో వివరింపబడి వున్నది. ఇక్కడ 5 కధల సమాహారం ఎన్నో విశేషాలను మనకు తెలుపుతాయి.
1. మొదటగా నారద మహర్షి శ్రీమన్నారాయాణుని దర్శించి కలియుగంలో ప్రజలు పడుతున్న కష్టాలను వివరించి వాటిని తగిన నివారణోపాయం సూచించమని వేడుకుంటాడు.
ఈ అధ్యాయం మనకు ఎదురవుతున్న ఎన్నో కష్టాలను పేర్కొంటూ వాటిని ఎలా పోగొట్టుకోవాలో చెబుతోంది. భరోసా ఇస్తోంది. మన పూర్వ జన్మ పాపం ఇప్పుడు మనకు రావలసిన ఆనందాలకు ఎలా అడ్డుపడుతుందో ( ఒక కుళాయి కొట్టంలో నీటిని ఒక అడ్డంకి ఎలా ధారను ఆపుతోందో) మనకు అవగతమవుతుంది. వాటిని ఇటువంటి క్రతువులు ఒక దూదికొండను ఒక నిప్పురవ్వ మండించి తొలగించినట్టు ఎలా తీరుస్తాయో చెబుతుంది. మనం ఇప్పుడు అనుభవిస్తున్న సుఖ దుఃఖాలన్నీ కూడా మన పూర్వం చేసిన కర్మ ఫలమే. వాటిని ఎలా తగ్గించుకోవాలో మోక్షం మన పరమపదం అని చెప్పడానికి నారదుడు మన తరఫున స్వామి వారికి నివేదించి పరిష్కారం ఆయన చేతనే చెప్పిస్తాడు.
2. రెండవ అధ్యాయంలో ఒక వేదవేత్త అయిన బ్రాహ్మణుని కష్టాలను ఎలా వ్రతం చేసి గట్టేన్కిన్చారో తెలియచేస్తారు. ఆ బ్రాహ్మణుని వ్రతం చూసి ఒక కట్టేలమ్మేవాడు ఎలా ఉద్ధరింపబడతాడో వివరిస్తుంది. ఒకరు ధర్మాన్ని నమ్ముకున్న వారికి వారి కష్టాలనుండి గట్టేన్కించడానికి స్వామి వారే ఎలా వస్తారో చెబుతుంది. త్రికరణశుద్ధిగా మనం మన కర్మ చేస్తే కష్టాలు ఎన్నో రోజులు వుండవు. కష్టపడే వాడిని ఎలా దేవుడే స్వయంగా పూనుకుని ఉద్ధరిస్తాడో చెబుతుంది. కామితార్ధప్రదాయి స్వామి. దేవుడు కేవలం కర్మ సాక్షి. కానీ ఆయనను శరణుజొచ్చిన వారికి కర్మఫలాన్ని ఎలా అనుకూలంగా మారుస్తారో తెలుసుతుంది. ముందుగా ఇహసౌఖ్యం ఇచ్చి, వారి ధర్మ ప్రవర్తన కారణంగా వారికి మరు ఉతరోత్తరాజన్మలలో మోక్షం సిద్ధింపచేస్తాడు.
౩. ఒక రాజు కామ్యం కొరకు ఎలా వ్రతం ఆచరిస్తాడో, తద్వారా అతడికి సంతాన భాగ్యం ఎలా కలిగింది, తద్వారా ఆ లీల చూసిన సాధు అనే వైశ్యుడు కూడా ఎలా సంతానవంతుడయ్యాడో వివరిస్తుంది ఈ కధ. తరువాత లోభించి ఎలా వాయిదా వేస్తాడో, దేవుని మోసం చెయ్యడం వలన ఎలా కష్టనష్టాలు అనుభావిస్తాడో చెబుతారు. అతడి పాపం వలన అతడి కుటుంబం కూడా ఎలా కష్టాలు పడ్డదో, మరల తిరిగి వారి ఆడవారు వ్రతం చేస్తానని సంకల్పించుకోవడం వలన యలా అతడు కష్టాలనుండి బయటపడ్డాడో తెలుస్తుంది.
ఒకరికి ఒక మాట ఇచ్చామంటే కట్టుబడి వుండాలి. అది మన తోటి వారికైనా దేవునికైనా. లోభం వలన అతడు మాట తప్పి, తనవారికి కష్టాలు తెస్తాడు. ధర్మాచరణ, వచనపాలన చాలా ముఖ్యం. ఇక్కడ తనకు పూజ చెయ్యలేదని శపించేటంత శాడిస్టు కాదు దేవుడు. అతడికి ఎన్నిసార్లు గుర్తుకొచ్చినా లోభించి, మొహానికి లోనయి మోసం చేసే ప్రవృత్తి వున్నవాడు అతడు. అతడెందుకు మనం అందరం కూడా అటువంటి వైశ్యులమే. నాకు ఇది చెయ్యి నీ హుండిలో ఇన్ని వందలు, వేలు వేసుకుంటాం అని బేరం పెడుతున్నాం. సుఖాలోచ్చినప్పుడు నాకెందుకు ఇచ్చావు అని ఎవడూ అడగడు, కేవలం కష్టాల్లో మాత్రమె మనకే ఎందుకు వచ్చాయి అని వగుస్తాము. ఇక్కడ కధ మనలో వున్న లోభాత్వాన్ని అణచమనే. అలాగే మనం చేసిన పాపం, మననే కాదు మన కుటుంబాన్ని కూడా కట్టి కుదిపేస్తుంది. అలాగే మన కుటుంబం వారు తప్పు తెలుసుకుని మరల శరణాగతి చేస్తే అది మరల మనను నిలబెడుతుంది. ఇక్కడ నేను, నా కుటుంబం వేరు కాదు. అంతా ఒక్కటే, కష్టాలయినా సుఖాలయినా కలిసే అనుభవిస్తాము. మన ధర్మం మననే కాదు, మన వారినందరినీ రక్షిస్తుంది, అలాగే పాపం కూడాను.
4. ఈ అధ్యాయంలో ఆ వైశ్యుడు మరల ఎలా మొహం లో పడిపోతాడో, క్రోధంతో ఒక సాధువును ఎలా హేళన చేస్తాడో చెప్పారు. అలాగే వ్రతం చేసినా కూడా ప్రసాదాన్ని స్వీకరించక కళావతి ఎలా కొంతసేపు కష్టాలు చవిచూసిందో చెబుతుంది.
పెద్దలను గౌరవించమని మన వాంగ్మయం చెబుతుంది. ఒక పుణ్య కార్యం చేస్తామని వచ్చిన సాధువుని హేళన చేసి, క్రోధపూర్వకంగా మాట్లాడి కష్టాలు కొని తెచ్చుకుంటారు. ఇత: పూర్వం చెప్పినట్టు ప్రసాదం స్వీకరించకపోతే వారి జీవితం నాశనం చేసేటంత క్రోధం దేవునికి వుండదు. ఆయన వాటి ద్వారా మనకు ఒక బోధ చేస్తున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం చూడండి, అక్కడ దేవుడు ఒక లీల చూపించి అక్కడే వుండి వారికి జ్ఞానోదయం అయ్యాక మరల వారివి వారికి ఇచ్చేస్తాడు. కేవలం వారిని పరీక్షించి వారికి పాఠం నేర్పుతాడు. అంతే తప్ప అనంతమైన కష్టాలు ఇవ్వడు. ఈ కధల ద్వారా ఒక మనిషి ఎలా ఉండకూడదో తెలుస్తోంది. అలాగే దైవానుగ్రహం మనకు ప్రసాద రూపంలో వస్తుంది. దాన్ని అలక్ష్య పరచాకూడదని మనకు చెప్పే కదా ఇది. అంతే తప్ప ఆయన మనల్ని కష్టపెట్టి ఆనందించే స్వభావం వున్నవాడు కాదు.
5. తుంగధ్వజుడనే రాజు కొందరు గొల్లలు చేసే వ్రతాన్ని తక్కువ చేసి చూసి ఒక మాయ వలన తాను నష్టపోయినట్టు భ్రమకు లోనయి తప్పు తెలుసుకుని తిరిగి ప్రసాద స్వీకారం చేసి ఆ మాయను తొలగించుకుంటాడు. వ్రతం ఎక్కడ జరిగినా భక్తిపూర్వకంగా వుండాలి. వ్రతం జరిపే వారి ఎక్కువ తక్కువ అంతరాలను దేవుడు చూడడు. భక్తి మాత్రమె ఆయనకు ప్రధానం. మద మాత్సర్యాల ద్వారా ఆ రాజు ఎలా కష్టపడ్డాడో, వివేకం ఉదయింప చేసి ఆ లీలను ఎలా ఉపసంహారం చేసారో చూపించారు.
💐 కొన్ని నీతి సూత్రాలను మనం ఈ కధల ద్వారా తెలుసుకుంటాం.💐
1. ఈ వ్రతం చాతుర్వర్ణాల వారు ఈ ఐదు అధ్యాలలలో ఎలా వ్రతం చేసుకుని ఉద్ధరింపబడ్డారో చూసాక మన పూజలు, వ్రతాలు కేవలం కొన్ని వర్ణాలకు మాత్రమె పరిమితం అని చేసే విషప్రచారానికి గొడ్డలిపెట్టు.
2. ఈ కధల ద్వారా కామక్రోధలోభ మోహ మద మాత్సర్యాలను ఎలా దైవానుగ్రహం వలన అదుపులో పెట్టుకుని ధర్మార్ధకామమోక్షాలు సాధించవచ్చో వివరిస్తాయి.
3. మాట ఇచ్చి తప్పడం ఎంత ప్రమాదమో మనం గ్రహించాలి. సత్యనిష్ఠ, ధర్మనిష్ఠ వలన ఎలా మంచి జరుగుతుందో, లేకపోతే కష్టాలు ఎలా పడతామో కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంది.
4. దైవానుగ్రహం ఎలా మన దుష్కర్మల ఫలాన్ని దూరం చేస్తుందో తెలియచేస్తుంది.
5. చెడు త్వరగా అర్ధమవుతుంది. మంచి చేస్తే మంచి వస్తుందని ఎంత చెప్పినా తేలిగ్గా తీసుకుంటాం, మన మెంటాలిటి తప్పు చేస్తే ఏమి కష్టాలు వస్తాయో చెబితే యిట్టె పట్టుకుంటుంది. వాటిని చెబుతూ ఎలా పోగొట్టుకోవాలో తరుణోపాయాలను చెబుతుంది.
ఇవే కాదు ఎన్నో మరెన్నో నీతి నియమాల సమాహారం ఈ వ్రతకధా తరంగం. స్వామిని పూర్తిగా నమ్మి శరణాగతి చేసి మనం కూడా ఆయన ఆశీర్వాదం పొంది ఉన్నతిస్థితిని పొంది ఇహపరసౌఖ్యాలను పొందుదాం. విమర్శించే సమయంలో ఒక్క వంతు మనం ఈ కధ మనకు ఏమి చెబుతోంది అని ఒక్క క్షణం ఆలోచిస్తే మనకు మరెన్నో విషయాలు బోధపడతాయి అని నా మనవి.
సేకరణ
***
నేటి ఛందస్సు
IIIUI UIUI UU UI UIU
ఇసుక తోడ ఆడుకుండె బాల్యమెంత అందమో !
మురికి లేని నీటియందు దాహ మెంత తీపియో !
కలలు లేని బత్కుయందు దేహ మెంత ఆశయో!
మనసు దోచు కారణాలు పెళ్లి యెంత బంధమో!!
అలలతోడ ఆడుకుండె బాల్యమెంత అందమో!
కధల లోన వచ్చి పోవు సంఘ టన్ల కావ్యమో !
కనులు విప్పి సౌఖ్య మిచ్చు దివ్వె వెల్గు అందమో!
మధుర మైన రాగమెంత నావు తెచ్చు అందమో!!
చెదిరిపోని సత్యమెంత మేలుచేయు అందమో!
కరిగి పోని విద్య ఎంత హాయి గొల్పు బంధమో !
కలసి పోయి శోభ ఇచ్చు హాయి గొల్పు అందమో!
విషయ వాంఛ విశ్వ మోహ భవ్య కాంతి అందమో!!
--(())--
*********
బద్ధకస్తుడికి పనెక్కువ లోభికి ఖర్చెక్కువ!
‘ప్రభాకర్’కి ఇంటి పని బొత్తిగా అలవాటు లేదు. ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ ఉంటాయో కూడా తెలియదు. ఏ పనికి ఏవస్తువు వాడతారో కూడా తెలియనంత పట్టనితనం. దానికి తగ్గట్టు అతను కొన్నాళ్ళు చేసిన ఉద్యోగం, ఇప్పుడు చేస్తున్న వ్యాపారం కూడా అలాంటివే.
పిల్లలు, ఇల్లు గురించి భార్య చూసుకునేది. పిల్లలు ఎలా పెరిగి పెద్ద వాళ్ళయ్యారో కూడా పట్టించుకునేవాడు కాదు. దీనికి కారణం ‘కొంత బద్ధకం’, కొంత ‘పట్టించుకోని తనం’, మరికొంత ఉద్యోగం తాలూకు ‘పని ఒత్తిడి’.
పిల్లలు పెద్ద వాళ్ళయ్యారు. చదువులు, పెళ్ళిళ్ళు అయి ఎవరి కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు. పిల్లలిద్దరూ అమెరికా లో ఉంటున్నారు.
వేసవి సెలవులకి పిల్లలు అమెరికా నించి వస్తున్నారు అని వాళ్ళ అత్తవారు పిల్లల్ని రిసీవ్ చేసుకోవటానికి రెండు రోజులు ముందుగావాళ్ళ ఊరు నించి హైదరాబాద్ ప్రభాకర్ వాళ్ళ ఇంటికి వస్తున్నామని కబురు చేశారు.
‘నలుగురు వస్తే ‘కూరలు’, ‘సరుకులు’ కొంచెం ఎక్కువ కావాలని, తనకి వేరే పని ఉన్నదని భార్య ‘శోభ’ బజార్ కి వెళ్ళి ప్రభాకర్ ని సరుకులు, రైతు బజార్ కెళ్ళి కూరలు తెమ్మన్నది’. ఆ విషయం పొద్దుటి నించీ పోరుతున్నది. ‘నీకెందుకు, తెచ్చే పూచీ నాది, నాకు చెప్పావు కద ఇక మర్చిపో, ఇంటికి కూరలు, సరుకులు వచ్చినట్లే’ అని భరోసా ఇచ్చి టీవీ చూస్తూ కూర్చుని, మునిమాపు వేళ అయ్యేవరకు కాలయాపన చేసి, అప్పుడు బయలుదేరాడు.
వేసవి కాలం త్వరగా చీకటి పడకపోయినా, దీపాలు పెట్టే వేళకి రైతు బజార్ కి వెళ్ళటం వల్ల అక్కడ కూరలు అమ్మే వాళ్ళు ‘మంచి బేరం దొరికింది,చీకటిలో కనిపెట్టలేరు’ అని ‘పుచ్చు వంకాయలు’ బాగా తక్కువ రేట్ చెప్పి రెండు కిలోలు తూచి ప్రభాకర్ బ్యాగ్ లో పోశారు. అలాగే ‘ముదురు బెండ కాయలు’, కొంచెం ‘కుళ్ళిన టొమాటోలు’, బాగా తక్కువరేట్ చెప్పారని కొనుక్కొచ్చి ఇంట్లో పోశాడు.
అలాగే పచారీ కొట్టుకెళ్ళి సరుకులు లిస్ట్ చెప్పి ప్యాక్ చెయ్యమన్నాడు. ‘ఎక్స్పైరీ డేట్’ అయిపోయిన ‘బోర్నవిటా’ డబ్బా, ప్యాకెట్ చిరిగిపోయిన ‘బిస్కెట్స్’ కూడా పనిలో పని గా ఆ దుకాణం వాడు సరుకుల్లో సర్దేశాడు.
పని మీద బయటికి వెళ్ళిన శోభ, తెచ్చిన సరుకులు, కూరలు మరునాడు పొద్దున్నే సర్దచ్చని అలా ఉంచేసి ఆ రాత్రికి విశ్రమించింది. పొద్దున్నే ఓ చుక్క కాఫీ తాగేటప్పటికివియ్యాల వారు రైల్ దిగారు.
ఇక హడావుడి మొదలు. గబ గబా వంట చేద్దామని కూరల సంచులు దొర్లించి చూసేటప్పటికి వంకాయలు తరుగుదామని చూస్తే మొత్తం పుచ్చులు. పోనీ బెండకాయ కూర చేద్దామని తరగబోతే కత్తిపీటకి ఎదురు తిరుగుతున్నాయి. ఇంక శోభ కోపం నసాళానికి అంటింది. ప్రభాకరాన్ని పిల్చి అతను చేసుకొచ్చిన నిర్వాకం ఏకరువు పెట్టి, ‘మీరొక్కళ్ళే వెళ్ళారా, మీతో ఇంకెవరైనా వచ్చారా’ అని అడిగింది.
‘ఎదురింటి వాసు ని తీసుకెళ్ళాను, అతను చవుకగా బాగున్నాయి అని సర్టిఫికేట్ ఇస్తేనే ఈ కూరలు తెచ్చాము’ అని తెచ్చిపెట్టుకున్న వినయంతో భార్యని కూల్ చేద్దామని చెప్పాడు.
‘ఇంకనేం, ఇప్పుడు అర్ధమయ్యింది, అతనో పొదుపరి, ఖర్చు గిట్టదు, చవుకగా వచ్చాయని ప్రతి వారం ఇలాంటి కూరలు తెచ్చి పోసి పెళ్ళాం దుంప తెంచుతాడు. ఆవిడేమో గోల, ఈ పీనాసి మనిషినితో వేగ లేక చస్తున్నాను అని. తెచ్చిన కూరల్లో పనికొచ్చేవి ఒక్కటి లేవు, వచ్చిన వాళ్ళకి ఏమి వండాలి’ అని ‘వెళ్ళి వెంటనే కూరగాయలు తెండి, మళ్ళీ ఆలస్యమైపోతుంది’ అని తొందర పెట్టింది- ‘ఓ రూపాయిఎక్కువైనా, నాణ్యమైన సరుకు తెస్తే ఒక సారి షాపింగ్ చేస్తే సరి పోతుంది, ఇలా మళ్ళీ మళ్ళీ బజార్ వెంట తిరగకుండా’ అన్నది శోభ.
ఇలా మాట్లాడుతూ సరుకుల సంచీ తీసి ఒక్కొక్కటే బయట పెట్టింది. అందులో నించి ‘చిరిగిన బిస్కెట్ ప్యాకెట్’, బోర్నవిటా సీసా చూసి, ఇదేమిటి ఇలా ఉన్నాయి అని వాటి మీద డేట్ చూసి, ‘ఏమిటండీ ఏదో పనిలో ఉండి, బజారుకి వెళ్ళి సరుకులు తెండి అంటే ఇలాగా చెయ్యటం’ అని
‘విసుక్కుని, వెంటనే వెళ్ళి వాపస్ ఇచ్చేసి, వేరేది తీసుకురండి, ఆలస్యమైతే మళ్ళీ వాడు మార్చుకోడు’ అని తొందర పెట్టింది.
అసలే బద్ధకస్తుడైన ప్రభాకరానికి రెండో సారి బజార్ కి పరిగెత్తక తప్పలేదు. ఇందుకే అంటారు మీలాంటి వాళ్ళని చూసి "బద్ధకస్తుడికి పనెక్కువ అని, ఎదురింటి వాసు లాంటి వాళ్ళని చూసి లోభికి ఖర్చు ఎక్కువ అని."
ఎం బిందుమాధవి
**********
దేవుడు శరీరధారి కాడనే’ వేద విద్వాంసులు అంటారు. వేదం ఈశ్వరీయం. అది మానవకృతం కాదు. దేవుడు కర్మలు చేయడు, జీవుడు చేస్తాడు. కర్మలు చేసేవారికి ‘శరీరధారణ’ తప్పదు. కర్మల ఫలాలను అనుభవించడానికి జన్మలెత్తాలి, శరీరధారులం కావాలి. శరీరం వల్ల కలిగే లాభం ఏమిటంటే దానితో కర్మలు చేయవచ్చు. వాటి ఫలాలను అనుభవించవచ్చు. దేవునికి కర్మలు చేయవలసిన పని లేదు. అనుభవించవలసిన పని అంతకన్నా లేదు. కర్మ చేసేవాడిని ‘కర్త’ అంటారు. కర్మఫలాన్ని అనుభవించేవాడిని ‘భోక్త’ అంటారు. కర్తృత్వం ఎవరిదో భోక్తృత్వం కూడా వారిదే. దేవునిలో ‘కర్తృత్వ భోక్తృత్వాలు’ లేవు. వేద విహిత కర్మలనే చేయాలని ఈశ్వరాజ్ఞ. వేద విరుద్ధ కర్మలను చేస్తే దుఃఖం తప్పదు. జీవునికి కర్మ ఫలాలిచ్చేవాడు దేవుడే. అందుకే దేవుడవసరం. కర్మఫలాలను అనుభవించడానికి మొదట జీవునికి శరీరం కావాలి. తర్వాత అన్నం, ఆ పిమ్మట అనువైన ప్రపంచమూ కావాలి. ఇదే, దేవుడు చేసే పని. దేవుడు సృష్టి రచన చేయకపోతే మనం శరీరధారులం కానే కాం. కర్మలు చేయనే చేయం. సుఖదుఃఖాలను అనుభవించే అవకాశం ఉండనే ఉండదు. పాపపుణ్యాల ప్రశ్నే ఉద్భవించదు. కనుక, జీవుని స్వభావం దేవుని కంటే విలక్షణమైంది.
‘కోరిక, ప్రయత్నం, ద్వేషం, సుఖం, దుఃఖం, జ్ఞానం’- ఈ ఆరు గుణాలు జీవుణ్ని ఆశ్రయించి ఉంటాయి. అందుకే, అతడు మాటిమాటికీ శరీరధారి అవుతాడు. ఒక వస్తువు కావాలని కోరడం, లభించకపోతే ద్వేషభావం కలగడం, వస్తు సంపాదనకు ప్రయత్నించడం, సాధించిన దానితో సుఖపడటం లేదా దుఃఖించడం, సామాన్య జ్ఞానాన్ని కలిగి ఉండటం.. వంటివన్నీ జీవుని విషయంలోనే చూస్తాం. దేవుడు, జీవుడు, ప్రకృతి- ఉనికిగల పదార్థాలు. వీటికీ ఎన్నడూ నాశం లేదు. దేవుడు ‘సృష్టి, స్థితి, లయ’లకు కర్త. ప్రపంచానికి స్వామి. దేవుడు ప్రపంచాన్ని మించి ఉన్నాడు. జీవుడు ప్రపంచంలో భాగస్వామి మాత్రమే. దేవుడు సర్వవ్యాపకుడు, సార్వదేశికుడు. జీవుడు ఏకదేశి. దేవుడొక్కడే, జీవులనేకం. దేవునిలోనే ఈ విశ్వమంతా ఉంది. అంతటా వ్యాపించి ఉన్న దేవునికి అవయవాలను ఎక్కడినుంచి తెచ్చిపెట్టగలం? కనుక, దేవునికి శరీరం అక్కర్లేదు. ‘సపర్యగాత్ శుక్రమకాయ మవ్రణ మస్నావిరం...’ అన్నది ‘ఈశావాస్యోపనిషత్తు’. దీని ప్రకారం దేవునికి జీవుని వలె మూడురకాల శరీరాలు లేవు. ‘కారణ శరీరం’, ‘సూక్ష్మ శరీరం’, ‘స్థూల శరీరం’- ఇవేవీ లేనివాడే దేవుడు. కారణజన్ముడు జీవుడేగాని దేవుడు కాడు. జన్మ ఎత్తడానికి దేవునికి ఏ కారణమూ లేదు. జీవునికి మాత్రమే జన్మ ఎత్తే అధికారం ఉంది.
దేవుడు ఎప్పటికప్పుడు జీవుల చేష్టల (కర్మలు)ను గమనిస్తుంటాడు. వాటికి అనుగుణమైన విధంగా ఫలాలిస్తుంటాడు. అందుకుగాను అతడు జీవుల అంతరంగాల్లోను అంతర్యామియై ఉంటాడు. పరమాణువు కంటే సూక్ష్మమైనవాడు. ప్రపంచ పదార్థాలన్నింటా ‘అదృశ్యరూపం’ (అవ్యక్తంగా)లో ఉంటాడు. ‘ఓంకార వాచ్యుడై’ కొలువున్నాడు.
దేవునిలో ‘అసంఖ్యాక ప్రాణుల శిరస్సులు, నేత్రాలు, పాదాలు ఉన్నట్లు’ తెలుస్తున్నది. కానీ, అతనికి శరీరం ఉన్నట్లు లేదు. భూ మండలాన్ని అన్ని వైపుల నుంచి స్పృశిస్తూ, సమస్త జగత్తును మించి ఉన్నాడని తెలుస్తున్నది. అంతటా ఉన్నవాడే మనలోనూ ఉన్నాడు. దేహం లేనివాడే దేహంలో ఉంటాడు. మనం శరీరధారులం కనుక, మన హృదయ కమలాల్లో అంతరాత్మ రూపంలో ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి ఉపాసించి, తరిద్దాం.
*******
ఆత్మ అంటే గాలి. ఆధ్యాత్మికత అంటే, శ్వాస, వాసన,గ్రహించడం, నటన, పరస్పర చర్య, ప్రతిస్పందన, గుర్తించడం, అర్థం చేసుకోవడం మరియు జీవగోళంలోని జీవులతో నిరంతర అవగాహన ప్రవాహాన్ని ఏర్పాటు చేయడం.
పిల్లవాడిని భందిత మరియు స్వేచ్ఛా స్వభావానికి తీసుకెళ్లాలి మరియు శ్వాసలో శిక్షణ పొందాలి. కొన్ని నెలల తరువాత పిల్లవాడు జీవుల నుండి వందలాది భావోద్వేగ వాసన ప్రతిస్పందనలను అనుభవించడం ప్రారంభిస్తాడు. జీవులు ఆమోదించే ప్రేమతో నిండిన వాసన ప్రతిస్పందనలను అనుసంధానం చేస్తాయి. క్రమంగా పిల్లవాడు పచ్చని మరియు స్వేచ్ఛా స్వభావంతో బలమైన భావోద్వేగ బంధాన్ని పెంచుకుంటాడు.
పిల్లల కోసం ఒక పెంపుడు జంతువును ఎంచుకోండి. పెంపుడు జంతువును దాచడానికి,వాసన ఆధారంగా,పిల్లలకి శిక్షణ ఇవ్వండి. ఈ ప్రక్రియలో, వాసన ఎలా క్రమబద్ధీకరించాలో పిల్లవాడు కూడా తెలుసుకుంటాడు. వాసన చిరునామాలను కనిపెట్టడానికి ఇది స్వయంగా శిక్షణ పొందుతుంది.
అప్పుడు పిల్లవాడికి శిక్షణ ఇవ్వండి, పెంపుడు జంతువుతో సంభాషించడానికి, పీల్చడం మరియు .పిరి పీల్చుకోవడం ద్వారా. క్రమంగా పిల్లవాడు పెంపుడు జంతువు యొక్క స్నేహితులు మరియు బంధువులతో వాసన పరిచయాన్ని పెంచుకుంటాడు. పిల్లవాడు గాలి ప్రవాహంలో ప్రేమ ప్రవాహాన్ని అనుభవిస్తాడు. ఇది ప్రకృతిని పెద్ద స్నేహితుడిగా, భరోసా ఇచ్చే స్నేహితుడిగా చూస్తుంది. పిల్లవాడు వాసన పదజాలం నేర్చుకుంటాడు, వాసన పదాలు, వాసన పదబంధాలు, వాసన నిబంధనలు మరియు వాసన వాక్యాలను అభివృద్ధి చేస్తాడు.
పిల్లల కోసం, గాలి ప్రవాహం ప్రేమ ప్రవాహంగా మరియు వాసన సందేశాల ప్రవాహంగా అభివృద్ధి చెందుతుంది. ఇది ప్రతిస్పందనలను పీల్చుకోవడం ద్వారా ప్రతి జీవన రూపాన్ని మొత్తంగా కలిగి ఉంటుంది.
వాయు ప్రవాహం యాంత్రిక మరియు భావాలు-తక్కువ వాయు ప్రవాహం కాదు.
*******
జన్మ సార్ధక సాధన.
ఒకసారి "పాలు" ఈశ్వరుని గురించి తపస్సు చేసింది. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యేక్షమై ఏమి నీ సమస్య అని అడిగాడు.
అప్పుడు పాలు..........
ఈశ్వరా !!
నేను ఆవు నుంచి, బర్రె నుంచి వచ్చినప్పుడు శుద్ధంగా, పరిశుద్ధముగా ఉంటాను.. అయితే ఈ పాపిష్టి మానవుడు వాడి స్వప్రయోజనము కోసం నాలో పులుపు వేసి నా మానసును విరిచేస్తున్నాడు. నన్ను రక్షించు అని చెప్పి భాదపడిందట.
అప్పుడు ఈశ్వరుడు ఓ చిరు నవ్వు నవ్వి...
ఓ క్షీరమా... ఇది విను, నీవు పాలు లా జీవించాలి అని ఆశ పడే ముందు నా మాట విను.. నీవు పాలు లాగా అయితే ఒకరోజు మాత్రమే బ్రతుకుతావు.
పాలకు పెరుగు తోడు వేస్తే రెండు రోజులు బ్రతుకుతావు.,
పెరుగుని చిలికి చల్ల ని చేస్తే పుల్లపుల్లగా ఇంకో రెండు రోజులు బ్రతుకుతావు.
అదే చల్ల లోంచి వచ్చిన వెన్న అయితే వారం రోజులు బ్రతుకుతావు, అ వెన్నను బాగా కాచి దాంట్లో రెండు తమలపాకులు వేసి నెయ్యి చేస్తే మంచి ఘుమ ఘుమలతో నెలలు తరబడి బ్రతుకుతావు.
ఆ నెయ్యితోనే దీపం పెడితే నాకు అర్పణవు అవుతావు..
ఇప్పుడు చెప్పు... ఒక రోజు పాలు లాగా ఉండి పాలలాగానే చస్తావా లేక క్షణక్షణం అనుక్షణం, రోజు రోజూ పెరిగి రూపాంతరం చెంది నాకు అర్పణవు అవుతావా... అని ఈశ్వరుడు ప్రశ్నించారు..
దేవుని మాటకి "పాలు" మూగబోయింది, ఈశ్వరునికి దాసోహం అయ్యింది. తన మనసులో ఉన్న అంధకారానికి సిగ్గుపడి బయటకు వచ్చింది. ఈశ్వరుడు ముందు ప్రజ్వలించి దీపంలా నిలిచిపోయింది...
మానవుడు కూడా అట్లాగే.. ఎవరో తమ మనస్సుని విరిచేసారు అని మనస్సుని పాడుచేసుకుని బాధపడేకంటే.. క్షీరము వలె మనస్సు లో ఆధ్యాత్మికత అనే తోడు వేసి, ప్రతి పరిస్థితులలోనూ ఆ ఆధ్యాత్మికతను ఈశ్వర నామ స్మరణతో చిలికి , దానిని దైవ చింతనం తో కాచి, దానిలోంచి వచ్చిన జ్ఞానం తో ఎప్పుడు ఎప్పుడా అని ఆ ఈశ్వరుని లో ఏకమవటానికి ఎదురు చూస్తూ జన్మను సార్ధకం చేసుకోవాలి.
*********
ప్రతి వ్యక్తిలో నైతికతను పెంపొందించేది నైతిక శాస్త్ర పఠనం మాత్రమే. దీనిని అనుసరించి విజ్ఞాన నీతిపరులుగా పండితశ్రేష్టులు చూపిన మార్గంలోమానవులంతా ధర్మానుసారంగా నడిస్తే సుఖసంతోషాలను అనుభవిస్తారని విదురుడు మనకు వివరంగా వివరిస్తాడు. ఈ మానవ సమాజం నీతి వాక్యాలను వింటుంది కానీ ఆచరించటంలో అనేక రకాలుగా విపలమౌతుంటుంది. దేశంలో ఉన్న ప్రతి పౌరుడు నైతిక వర్తనుడిగా ఉండాలని కోరుకుంటారు. అది సాధ్యమా అంటే సాధ్యమే! ఎలా అంటే ఒక కుటుంబం మొత్తం నీతిగా ఉండాలంటే ఆ కుటుంబ పెద్ద మొదట నీతిగా ఉండి దిశానిర్దేశ చేస్తూ ఉండాలి. అప్పుడే అది సాధ్యపడుతుంది. రాజు ధర్మానికి బద్దుడై పాలించాలి. ప్రజలు నైతికంగా బ్రతకాలి అనేది ఆనాటి వేదకాలం నుండి మొదలుకొని ఈనాటి సాంకేతిక యుగం దాకా ప్రతి ఒక్కరూ కోరుకునేది. ప్రపంచంలో ఎన్నో ఉధ్యమాలు వచ్చాయి పారిశ్రామిక, స్వేచ్చా స్వాతంత్ర్య, భూస్వామ్య రైతాంగ విప్లవాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రపంచంలో విప్లవంతో చిందించిన రక్తం తడి ఆరని ప్రదేశాలు ఎన్నోచెప్పలేము. వీటన్నింటికీ కారణం, కనపడని మూలరూపం, అవినీతి అని మనం అని చెప్పక తప్పదు.
పుట్టుకతో మానవుడు చెడ్డవాడుకాదు, చెడు లక్షణాలు కల్గిన వాడు అంతకన్నా కాదు. ప్రతిమనిషిలోనూ మంచి చెడు రెండు రెండు పార్శ్వాలుగా ఉంటున్నాయి. అందులో చెడు అనే పార్శ్వమే తన ఉనికిని చాటుకుంటుంది, ఆ పోటీలో మంచి మసక బారిపోతుంది. కాలప్రవాహంలో పరుగెడుతున్న మానవ లోకంలో నిలకడలేని వ్యక్తిత్వాలు మానవీయ విలువల్ని కోల్పోతున్నాయి, లోకంలో అధర్మం వెర్రితలలు వేస్తూ వేయి నాలుకలతో మాట్లాడుతుంది, అక్రమాలు ఉసిళ్ళ పుట్టలా విజృంభిస్తున్నాయి. ఇటువంటి దారుణ జగత్తులో మనిషి మనిషి గా మరణించి రాక్షసుడిగా మనుగడ కొనసాగిస్తున్నాడు. అసలు మనిషి అనగా మానవత్వం, నీతి, శీలం అనే మూడు లక్షణాలతో మిళితమైన మహోన్నత రూపం, అలాంటి మనిషి తన నర నరాన జీర్ణించుకొనిపోయిన స్వార్ధపూరిత ద్వేషభావన, ఎంతటి ప్రళయాన్ని సృష్టిస్తుందో మన మానవ సమాజాన్ని పరికిస్తే అవగతమవుతుంది ఇటువంటి దుస్థిలో ధర్మం, నాయం, సత్యం ఇసుకలో వేసిన ముత్యాలై పోతున్నాయి.
పట్టాబిషిక్తుడై రాజ్యాన్ని ఏ లాల్సిన రాముడు అడవులకు పయనమై పోతుంటే అది చూసి భరించలేని దశరధుడు మరణించినప్పుడు. ఆ అయోద్యను ఆపద్ధర్మంగానైనా పాలించటానికి రాజకుమారులేవ్వరూ లేని సందర్భంలో మంత్రి పురోహితులు ఈ విధంగా సెలవిస్తారు.
ఏ రాజ్యంలోనైనా సత్యం ధర్మం నిలిచి ఉండాలంటే అది కేవలం సరైన రాజు ఉండడం వలననే సాధ్యమవుతుంది. ప్రజలకు రాజే రక్షకుడు. రాజే తల్లి, తండ్రి. రాజు లేకుండా ఒక్కరోజు కూడా రాజ్యం క్షేమంగా మనుగడ సాగించలేదు. రాజు విద్యలలో శిక్షితుడై, సకల భూతములకు హితాన్ని చేయడంలో ఆసక్తి కల్గి ఉండాలి, ప్రజలకు శిక్షణ ఇవ్వడంలో శ్రద్ధ ఉన్న రాజు మరొక రాజు లేని రాజ్యాన్ని పరిపాలిస్తాడు. నైతిక బలము కల్గిన రాజు యొక్కసామ్రాజ్యం అచంచలమైన సిరి సంపదలతో అలరారుతుంది . కాబట్టి తనకు తాను ప్రేరణ పొందుతూ సర్వ భూతాలు తనకు హితాన్ని చేకూర్చేటట్లు ఆత్మ హితాన్ని కోరే సామ్రాట్ట్ నీతి శాస్త్ర అభ్యాసం చేయాలి. తద్వారా బలమైన రాజ్యాన్ని, జ్ఞానులైన అమాత్యులను పొందడం వలన ప్రజాపాలనలో రంజిల్లుతాడు. అలాంటి రాజు బుద్ధి బలంచే తేజోరూపుడై పూర్వ జన్మ సుకృత తపోవిశేషాలతో కూడిన మహీమండలాన్ని అధిరోహించగలడు.
రాజు అనేవాడు రాజ్య ప్రజల చేత దర్శింపబడుతూ ప్రజలజీవితాలలో దీపాలు వెలిగించే విధంగా పాలనను కొనసాగించాలి. ప్రజలను తన కన్నబిడ్డల మాదిరిగా చూస్తూ సుఖ సంతోషాలను కల్గించాలి . ప్రజలలోని గుణదోషాలను రూపుమాపే గురువుగా మంచి చెడులను చూస్తూ ప్రజలలో మంచిని పెంపొందించాలి. ఆపదలు వచ్చినపుడు మిత్రునిగా ఆదరించాలి. ఈ విధంగా ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి అన్ని విధాల ప్రజలకు మంచి చేస్తూ సత్యపాలన అందించే వాడే రాజు అని నీతిశాస్త్ర ముక్తావళిలో మనకు కనిపిస్తుంది.
అహింస, సత్యం, మనోవాక్కాయాల శుచిత్వం, అసూయ లేకపోవడం, క్రూరత్వం లేకపోవడం, ఓర్పు అనేవి అందరికీ ధర్మాలే. స్వధర్మాన్ని ఆచరించడంవల్ల సర్వం అనంతమైన ఆనందానుభూతులతో శోభిల్లుతుంది. స్వధర్మాన్ని అతిక్రమిస్తే సర్వలోకాలు నశిస్తాయి. అందువల్ల రాజు కానీ ప్రజల కానీ ఎవరూ స్వధర్మాన్నివిడవకుండా ఉండాలి. స్వధర్మం ఆచరించేవారు, ఇహలోకంలోనూ, పరలోకంలో (మరణానంతరం) కుడా సంతోషంతో ఉంటారు.
భూమి అనెడి గోవు నుండి ధనమును పితుక తలచినట్లైతే ఆవుదూడను పోషించే విధంగా ప్రజలను రాజు పోషించాలి. రాజు ప్రజలనుండి పన్నులు వసూలు చేసేటప్పుడు వారి ఆర్థిక పరిస్థితులు అంచనా వేసి తెల్సుకోవాలి. ఆవిధంగా వారికి ఆర్థిక పుష్టిని కల్గించి అన్ని రకాల …
*********
సి నా రె:- పరిచయం అవసరం లేని పేరు. కవిగా ఆయన ఎంతటి ఉద్దంఢుడో, వక్తగా అంతటి సుప్రసిద్ధులు.ఛలోక్తులతో తన చుట్టూ వున్నవారి ముఖాల్లో నవ్వుల పువ్వులు పూయించడం లో ఆయన ఘనపాటి . అలాంటివే కొన్ని జ్ఞాపకాలు.
ఓ వ్యక్తి సి నా రె ఎదురుగా కూర్చుని ఏకబిగిన ఆపకుండా పొగిడేస్తున్నాడట. అతను వెళ్ళిపోయాక సి నా రె మిత్రుడు ఎవరండీ ఆయన? అని అడిగాడట దానికి ఆయన వెంటనే పైకి చూపించాడట. మిత్రుడు తెల్లబోయి పైకి చూస్తే ఫ్యాన్ కనబడిందట. అంటే దానర్థం నా 'అభిమాని' అని .
ఒకసారి రవీంద్రభారతి లో 'సి నా రె రచన ' మాటలో ఏముంది నాపాటలో ఏముంది' పుస్తకావిష్కరణ జరుగుతోంది. తన ప్రసంగంలో ఆయన పాత చిత్రాల్లోని పాటల గురించి ప్రస్తావిస్తూ " ఆనాటి చిత్రాల్లో బృంద గాణాలుండేవి. ఆ బృందగానాలు కాస్తా
'మంద(గుంపు) గానాల స్థాయికి వెళ్లాయి. అన్నారు.
దర్శకుడు పెండ్యాల సన్మాన సభలోనూ, సినిమా పాటల మీద ఇలాంటి విసిరే విసిరారు.
సభలో ఆ నాటి ముఖ్యమంత్రి యెన్.టి . రామారావు గారు కూడా వున్నారు. వేదిక మీద సి నా రె మాట్లాడుతూ "సినిమా పాటల్లో మూడు రకాలున్నాయి." పాత సినిమాల్లో అయితే
నిలబడే పాటలుండేవి, ఆ తర్వాత నడిచే పాట లుండేవి, లు మొదలయ్యాయి.
ఇప్పుడైతే దొర్లి పడే పాటలు ఎదురవుతున్నాయి. అన్నారట. సభలో నవ్వుల జల్లులు కురిశాయి.
అలాగే యింకో సభలో వక్త ఒకరు సి నా రె ను పూజ్యులు, పూజ్యులు అంటూ గౌరవం ప్రదర్శిస్తున్నారట. మాటి మాటికీ ఆ సంబోధన విని విని ఆయన కాస్తా ఇబ్బందిగా ఫీలై పోయి " మీరు మతి మాటికీ పూజ్యులు, పూజ్యులు అంటున్నారు. తెలుగు సంస్కృతాల్లో పూజ్యులు అంటే పూజనీయులని అర్థం హిందీ లో మాత్రం పూజ్య అంటే సున్నా అని అర్థం ఇంతకీ నేను అదా? ఇదా? అని అ
డిగారట. వక్తతో సహా సభలో నవ్వని వారు లేరు.
*********
No comments:
Post a Comment