సీతాపతీ పద్య కావ్యము
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
కరుణాసముద్రడు కరుణామయుడు గాను
కారుణ్య బంధమ్ము కావ్య పరుడు
ఆనంద నిలయుడు ఆత్రత్రాణ పరుడు
కొలిచిన వారిలో కోర్కె తీర్చు
భక్త వత్సలుడు గా భాగ్యప్రధాతుడు
భవబంధనహరుడు భవ్య భవుడు
కాలాన్ని బట్టి యే కామ్యప్రధాతుడు
సర్వరక్షకపరుడు రాము డనియు
తేటగీతి
మనసు పలికేటి చూపేటి మాధుర్యడులె
చరిత లలిత సంగీతపు తురుము వేసి
సహజ సిద్ధమైన నటుడు ఉదయ భాను
ప్రాంజలి నొనర్తు రామ్ నీ పాదములకు
***((***))***
పరిపూర్ణత కొరకు జాగరూకత
(రామరాజ్యము )
సీసము
పరిశుద్ధ జీవన పరమపావనమగు
మర్మము లేనిది మనసు నిజము
నిర్మల హృదయము నిలకడ చూపును
జిజ్ఞాస హృదయము చిత్త మొవ్వు
మాటుపడని అతీం ద్రియముయే జీవము
సోదర భావము సహనమవ్వు
సలహాల నియమము స్వీకరించుటకును
సంసిద్ధ త కలిగి యుండు రామ
తేటగీతి
దేశికుని యెడ ధర్మానుష్టాన ముండు
బుద్ధి విశ్వాస నీయమ్ము నుంచి
సత్యసూత్రములను పంచి యుండె
వ్యక్తిగతముగా తనకు తానే సహాయ
--(())--
సీసము
అన్యాయమును దుష్టబుద్ధిని తరిమియు
ధీరుడుగాను విధేయుడగుట,
సిద్ధాంతములనువశీకరములగాను
నిర్భీతిగా నుద్ఘాటించుచుండె
తెగువతో కాపాడి గుప్తవిద్య లనేవి
నేర్పి మానవుని పురోభివృద్ధి
పరిపూర్ణతల యెడ పరమావిధినిచూపి
జనుల సేవయు చేయు జపత రామ
తేటగీతి
జాగరూకత కలిగి యుండుటయు రామ
మానవ పురోభివృద్ధిగా మనసు పంచు
ప్రజల రక్షణ ధ్యేయంగ పాకులాడు
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు
--(())--
*ఇది కథ కాదు*
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మనకు దాన్ని చూసే గుణముండాలి. అభినందించే మంచి మనసు కలిగి ఉండాలి.
జీవితంలో ఏది సులభం కాదు.
ప్రయత్నిస్తే ఏది కష్టము కాదు.
డబ్బుతోను, అధికారంతోను కొనలేనిది పల్లె వాతావరణంలో మాత్రమే దొరుకుతుంది. పచ్చని పంట పొలాలు, లేలేత సూర్యకిరణాలు ఇలా... చెప్పుకుంటూ... పొతే... ఆ పల్లెల్లో అద్భుతాలు ఎన్నో... ఎన్నోన్నో.
జీతం ఇచ్చిన వాడి మాట వినకపోతే కేవలం జీతం మాత్రమే పోతుంది. కానీ, జీవితం ఇచ్చిన తల్లిదండ్రుల మాట వినకపోతే... మాత్రం జీవితమే పోతుంది.
ఒక్క క్షణం సహనం, కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం, మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది.
ఖరీదైన వస్త్రం ధరించినా కూడా, దాన్ని విడువక తప్పదు.
ఎంత పంచభక్షపరమ్మన్నాం తిన్నా, విసర్జించక తప్పదు.
ఎంత ఖరీదైన కారులో ఎక్కినా దాన్ని దిగి నడవక తప్పదు.
ఎంత ఎత్తుపైకి వెళ్లినా, తిరిగి నేలపైకి రాక తప్పదు.
ఎంత గొప్ప ప్రదేశాలు తిరిగినా, తిరిగి నీ గూటికి రాక తప్పదు.
ఎంత గొప్ప అనుభూతిని నీవు పొందిన కూడా, తిరిగి మాములు స్థితికి రాక తప్పదు. ఇదే. ఇదే. జీవితం.
అవసరం లేని కోపం, అర్థం లేని ఆవేశం, ఈ రోజు నీకు బాగానే ఉంటాయి. కానీ, అవి రేపు నిన్ను ఒంటరిని చేస్తాయి.
మనః శాంతి మాత్రమే మనకు రక్ష. మంచివాడు మొదట కష్టపడతాడు కానీ, ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడతాడు కానీ, ఓడిపోతాడు.
డబ్బు సంపాదిస్తే సొమ్ములు రావాలి. సోకులు కావాలి. అంతేగాని కొమ్ములు మాత్రం రాకూడదు.
--(())-+
ఒకనాడు భోజరాజు రాత్రి వేళలో నగరం లో తిరుగుతుంటే ఒకచోట యిద్దరు దొంగలు కనిపించారు.ఒకడి పేరు శకుంతుడు మరొకడి పేరు మరాళుడు.వారిద్దరూ మాట్లాడుకుంటూ వుంటే భోజరాజు చెట్టు చాటునుండి వింటున్నాడు.
శకుంతుడు మిత్రమా!కన్నం వేసి యింత సొమ్ము దొంగిలించి తెచ్చాము,కానీ నాకు భయంగా వుంది.ఊరంతా
రక్షక భటులు తిరుగుతున్నారు.వాళ్ళు పట్టుకోక ముందే మనం దోచుకున్నసోమ్ము పంచుకొని వెళ్ళిపోవడం మంచిది.అన్నాడు మరాళుడు.
'శకుంతా మనం దోచుకున్న సొమ్ము విలువ చాలా ఎక్కువే వుంటుంది యింత సొమ్ముతో నీవేమి చేస్తావు?అందుకు శకుంతుడు యిదంతా ఎవరైనా యోగ్యుడైన పేదవాడికి దానం చేస్తాను.అతను యింకేవ్వరినీ యాచించ వలిసిన పని లేకుండా. దానం చేస్తే యిచ్చిన వాడికీ పుచ్చుకున్న వాడికీ కూడా ఒళ్ళు పులకరించేలా చెయ్యాలి.
దొంగసొమ్ము దానం చేస్తే నీకు పుణ్యం ఎలా వస్తుంది శకుంతా ?అన్నాడు మరాళుడు.
దొంగతనం కూడా 64 కళల్లో ఒకటి యిది మన తాత ముత్తాతల నుంచి వస్తున్న వృత్తే కదా!కనుక ఈ సొమ్ము దానం చెయ్య వచ్చు.పెద్దలు అంటారు కదా!
మూర్ఖో నహి దదాత్యర్థం నరో దారిద్య్ర శంకయా
ప్రాజ్ఞస్తు వితర త్యర్థం నరో దారిద్య్ర శంకయా
అర్థము:--దానం చేస్తే దరిద్రుడ నవు తానేమో నన్న భయంతో మూర్ఖుడు దానం చెయ్యడు.దానం చెయ్యకపోతే ముందు జన్మకు దరిద్రుడ నవుతా నన్న భయం తో బుద్ధిమంతుడు దానం చేస్తాడు.అని అన్నాడు శకుంతుడు,
ఇంతకీ మరాళా!ఈ దొంగ సొమ్ముతో నీవేమి చెయ్యాలని అనుకుంటున్నావు?అందుకు మరాళుడు
మొన్న మా ఇంటికి కాశీ నుండి ఒక బ్రహ్మచారి వచ్చాడు.కాశీవాసం చేస్తే చాలా పుణ్యమని మా నాన్నకు
బోధించి వెళ్ళాడు.చిన్నప్పటి నుంచీ దొంగతనాలు చేస్తూ కూడగట్టుకున్న పాపమంతా కాశీ వాసం చేసి
పోగొట్టుకోవాలని .మా నాన్నఆలోచన.ఇప్పుడాయన దొంగతనాలు మానేసి వైరాగ్య మార్గంలో నడవాలనుకుంటున్నాడు.ఆయన కాశీ యాత్రకోసమే ఈ డబ్బంతా..ఆ బ్రహ్మచారి మానాన్నకు యిలా చెప్పాడు.
వారాణసీ పురీ వాస వాసనా వాసితాత్మనా
కిం శునా సమతాం యాతి వరాకః పాక శాసనః
అర్థము:--కాశీ వాస పుణ్యం చేత పుణ్యాత్మ అయిన కుక్కతో ఇంద్రుడ యితే మాత్రం సమాన మవుతాడా? ఆ కుక్క పుణ్య ఫలం ఇంద్రుడి కంటే అధికం.
మరణం మంగళం యత్ర విభూతిశ్చ విభూషణం
కౌపీనం యత్ర కౌశేయం సా కాశీ కేన మీయతే
అర్థము:-- ఎక్కడయితే మరణమే మంగళ ప్రదమో,బూడిదే ఆభరణమో,గోచిపాతే పట్టు పుట్టమో ఆ కాశీ తో దేనికి పోలిక?
వాళ్ళిద్దరి సంభాషణ విని రాజు చాలా ఆనందిం చాడు.కర్మగతి యెంత విచిత్రం.ఈ దొంగ లిద్దరూ మంచి బుద్ధి కల వాళ్ళే.అనుకొని మౌనంగా అక్కడినుండి వెళ్ళిపోయాడు.
--(())--
పూర్వం గురుశిష్యులు చెప్పుకునే మంత్రం.!*
*ఈ మధ్య ఎక్కడ మనం వినడం -చూడటంలేదు..*
ఓం సహనా వవతు
సహనౌ భునక్తు
సహవీర్యం కరవావహై
తేజస్వినావధీతమస్తు
మా విద్విషావహై
ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః
పాఠం చెప్పుకునే ముందు గురుశిష్యులు చెప్పుకునే శాంతిమంత్రమిది.
భగవంతుడు మన ఇద్దరినీ రక్షించుగాక.
మన ఇద్దరినీ వృద్ధి చేయుగాక.
ఈ అధ్యయనానికి అవసరమైన శక్తి మన ఇద్దరికీ అబ్బునుగాక.
మనం చదివేది మన ఇద్దరికీ వెలుగుని ఆపాదించు గాక. మన మధ్యలో విభేదాలు
తలయెత్తకుండు గాక.
టూకీగా ఇదీ అర్ధం.
*భావము.*
ఈశ్వరుడు మనల నిరువురుని రక్షించుగాక. అతడు మనల నిరువురను పోషించుగాక.
మనము గొప్ప శక్తి తో(దివ్య బలముతో) కలసి పని చేయుదుముగాక. అధ్యయనము చే మనమిరువురమును మేథా సంపదను పొందుదుము గాక! మనమితరులను ద్వేషింపకుందుము గాక. శాంతి, శాంతి, శాంతి సర్వత్ర ఉండుగాక.
(ఈ వైదిక ప్రార్థన ప్రేమ సౌభ్రాబ్రత్వము, పరస్పరావగాహన ,శాంతి సామరస్యము అను
ఉదారములైన ఆశయములను ప్రకటించును. )
*వివరణ:.💐*
పాఠం చెప్పుకునే ముందు గురుశిష్యులు చెప్పుకునే శాంతిమంత్రమిది.
భగవంతుడు మన ఇద్దరినీ రక్షించుగాక. మన ఇద్దరినీ వృద్ధి చేయుగాక. ఈ
అధ్యయనానికి అవసరమైన శక్తి మన ఇద్దరికీ అబ్బునుగాక. మనం చదివేది మన ఇద్దరికీ
వెలుగుని ఆపాదించు గాక. మన మధ్యలో విభేదాలు తలయెత్తకుండు గాక.
టూకీగా ఇదీ అర్ధం.పాఠం, అధ్యయనం మాత్రమే కాదు,పాఠం, అధ్యయన౦ మాత్రమే
కాదు.ఏ ఇద్దరు మనుషులు కలిసి మాట్లాడుకునే సందర్భమైనా ఈ ప్రార్ధన సముచితమే
కాక,ఇప్పటి రోజుల్లో అయితే మరీ అవసరం కూడాను. ఆధునిక జీవితంలో మనుషుల మధ్య సంబంధాలు ఎలాగైనాయంటే - నేను చెబితే నువ్వు వినాలి,నేను గెలిస్తే నువ్వు ఓడాలి, నాది పైచెయ్యి నీది కింది చెయ్యి,నేను అంటాను నువ్వు పడు. ఉద్యోగ వ్యాపారాల్లోను, స్నేహాల్లోను ఇంట్లో మనుషుల్తోను ఇదే తంతు.తరవాత్తరవాత కాలం కొంచెం మారింది. కొత్త ఆలోచనలు బయల్దేరినై. వాణిజ్య లావాదేవీల్లోను, ఉద్యోగ శిక్షణల్లోను,మానవీయ విలువలు సరిగా లేవు
పూర్వకాలంలో నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందని సామెత.
కానీ ఎంతటి వాడికైనా ఎల్లవేళలా నోరు అంతమంచిగా పెట్టుకోవడం సాధ్యమా?
ఇద్దరు మనుషులు ఎదురెదురుగా కూర్చుని మాట్లాడుకుంటేనే ఇన్నేసి విభేదాలు
తలెత్తుతున్నాయే, మరింక ప్రత్యక్షంగా కాకుండా ఫోన్‌లలో, ఈమెయిళ్లలో, మెసేజుల్లో,
బ్లాగుల్లో .. ఎలా సాధ్యం? మన మనసులో ఏ దురుద్దేశం లేకపోయినా అవతల వినే వ్యక్తికి మనమాటలో ఏ విరుపు వినబడుతుందో, మనరాతలో ఏ వగరు కనబడుతుందో?
అప్పుడే అనిపిస్తుంది, ఈ మంత్రం ఇప్పటి జీవితంలో మరీ అవసరమని. మంత్రాన్ని మళ్ళీ ఒకసారి చదవండి. మంత్రార్ధాన్ని మననం చేసుకోండి.
ఈ మంత్రం ఇప్పటి జీవితంలో మరీ అవసరమని. మంత్రాన్ని మళ్ళీ ఒకసారి చదవండి.
మంత్రార్ధాన్ని మననం చేసుకోండి. ఆ అర్ధాన్ని ధ్యానం చెయ్యండి. మంచి జరగాలి అనుకుని ఊరుకోవడం కాదు - చెడు జరగకూడదని స్పష్టంగా వ్యక్తపరచడం ఎంత గొప్ప ఆలోచన అది. మనిద్దరం కేవలం బాగుండాలి అని కోరుకోవడమే కాదు. వృద్ధి పొందాలి.
ఎదురుగా ఉన్న పని తేలికైనది కాదు, దాన్ని సాధించగలిగే శక్తి మాకు కలగాలి.
అటుపైన ఆ చేసిన పని మా యిద్దరికీ వెలుగునివ్వాలి. నాకు నేను ఏమి అటుపైన ఆ చేసిన పని మా యిద్దరికీ వెలుగునివ్వాలి. నాకు నేను ఏమి కోరుకుంటున్నానో,
నా ఎదురుగా ఉన్న వ్యక్తికికూడా మనస్పూర్తిగా అదే కోరుకుంటున్నాను.
అంతరాంతరాల్లో ఈ నిజాన్ని పూర్తిగా జీర్ణించుకుంటే స్వ-పర భేదం మాయమవుతుంది
స్వ-పర భేదం మాయమవుతుంది.
త్వమేవాహం. ఓం శాంతిశ్శాంతిశ్శాంతిః
*సర్వే జనా సుఖినోభవంతు..!!*
: 🌻 *త్రిగుణాలు* 🌻
🍃🌹ఒకే వ్యక్తి యొక్క ప్రవృత్తి, ఈ మూడు గుణములలో ఎలా మారుతూఉంటుందో, శ్రీ కృష్ణుడు ఇప్పుడు వివరిస్తున్నాడు.
🍃🌹ఈ మూడు గుణములు భౌతిక శక్తి యందు ఉన్నాయి మరియు మన మనస్సు ఇదే శక్తితో తయారైనది. అందుకే, ఈ మూడు గుణములు మన మనస్సులో కూడా ఉన్నాయి.
🍃🌹ఒకరితో ఒకరు తలపడే ముగ్గురు మల్లయోధులతో వీటిని పోల్చవచ్చు.
🍃🌹ప్రతి ఒక్కడు మిగతా ఇద్దరిని క్రిందికి పడవేస్తుంటాడు, కాబట్టి ఒక్కోసారి మొదటివాడు పైనుంటాడు, ఒక్కోసారి రెండోవాడు, మరింకోసారి మూడవవాడిదే పైచేయి అవుతుంది. ఇదే విధంగా, ఈ మూడు గుణములు వ్యక్తి యొక్క ప్రవృత్తి పై ఒక్కోటి ఒక్కోసారి ఎక్కువ ప్రభావంతో ఉంటాయి.
🍃🌹బాహ్యమైన పరిస్థితులు, అంతర్లీన చింతన, మరియు పూర్వ జన్మ సంస్కారములపై ఆధారపడి ఒక్కో గుణము ఒక్కోసారి ప్రబలమై ఉంటుంది.
🍃🌹ఎంతసేపు ఆ ప్రభావం ఉంటుంది అన్న దానికి ఏమీ నియమం లేదు - ఒక గుణము మనోబుద్ధులపై ఒక క్షణం నుండి ఒక గంట వరకు ఉండవచ్చు.
🍃🌹సత్త్వ గుణము ప్రబలంగా ఉన్నప్పుడు, వ్యక్తి ప్రశాంతముగా, తృప్తిగా, దయాళువుగా, నిర్మలంగా, ప్రసన్నంగా ఉంటాడు. రజో గుణము ప్రబలంగా ఉన్నప్పుడు, వ్యక్తి ఉద్వేగంతో, లక్ష్యమును సాధించాలనే తపనతో, ఇతరుల విజయం పట్ల అసూయతో, ఇంద్రియ సుఖముల పట్ల ఆసక్తితో ఉంటాడు. తమో గుణము ప్రబలంగా ఉన్నప్పుడు, విపరీత నిద్ర, సోమరితనము, ద్వేషము, కోపము, రోషము, హింస మరియు అపనమ్మకం తో ఉంటాడు.
🍃🌹ఉదాహరణకి, మీరు ఒక గ్రంధాలయములో (లైబ్రరీ) లో కూర్చుని చదువుకుంటున్నారనుకోండి .
🍃🌹అక్కడ ఏమీ ప్రాపంచిక గందరగోళం లేదు, మరియు మీ మనస్సు సాత్త్వికముగా అయింది.
🍃🌹మీరు చదువుకోవటం అయిపోయిన తరువాత టీవీ చూడటం మొదలు పెడితే , అందులో చూసే అన్నింటి వలన మనస్సు రాజసికమైపోతుంది, మరియు ఇంద్రియ సుఖాల పట్ల యావను పెంచుతుంది.
🍃🌹మీకిష్టమైన ఛానల్ చూస్తుంటే, మీ కుటుంబ సభ్యుడు వచ్చి, ఆ ఛానల్ మార్చితే, ఈ అల్లరి, మనస్సులో తమో గుణమును పెంచుతుంది, మరియు మీరు కోపంతో నిండిపోతారు.
🍃🌹ఈ విధంగా, మనస్సు ఈ మూడు గుణమల మధ్య ఊగుతూనే ఉంటుంది మరియు వాటి యొక్క స్వభావాలను అపాదించుకుంటుంది.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
: 🌻 *నారాయణా నీ నామమే గతి ఇక....* 🌻
భగవంతునికి ఎన్నెన్నో రూపాలు ఉంటాయి ఆకాశానికి అంతం లేనట్టుగా, సాగరంలో జలానికి అంతంలేనట్టుగా, మన జన్మలకీ కర్మలకీ అంతం లేనట్టుగా భగవంతుని కళ్యాణ గుణాలకు కూడా అంతం లేదు.
కేవలం ఆయన గుణాలకేకాదు ఆయన స్వరూపానికి కూదా అంతం లేదు కాబట్టే ఆయనను సర్వవ్యాపి అంటారు.
ఇందుగలడని అందులేడని సందేహము వలదు. అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా, అంతటా వ్యాపించి ఉండటం భగవంతుని గొప్పతనం.
ఆ వ్యాపనశీలాన్ని చెప్పే మంత్రాలే గొప్ప మంత్రాలుగా చెప్పబడి ఉన్నాయి.
భగవంతుని వ్యాప్తిని చెప్పేవి కేవలం మూడే అవి "విష్ణు", "వాసుదేవ" మరియూ "నారాయణ".
విష్ణు అంటే వ్యాపించిన వాడని అర్థం.
వాసుదేవ అంటే అంతటా వసిస్తాడు-ప్రకాశిస్తాడు అని అర్థం. నారాయణ మంత్రం వ్యాప్తిని చెబుతుంది, వ్యాప్తి ఫలాన్ని చెబుతుంది, ఎందుకు వ్యాపించి ఉంటాదని వివరిస్తుంది. ఎందెందులో వ్యాపించి ఉంటాదని తెలియజేస్తుంది, ఆ వ్యాపించి ఉండే వాటితో సంబంధం గురించి తెలియజేస్తుంది.
నారాయణ అంటే ఒక అద్బుతమైన మంత్రం, నారములు అంటే సకల చరాచర వస్తువులు అని అర్థం. అయణం అంటే ఆధారం అని అర్థం.
సూర్యుడు మనకు ఉత్తరం నుండి ఆధారమైన కాలాన్ని మనం ఉత్తరాయణం, విడ దీస్తే ఉత్తర-అయణం అంటాం. నారాయణ శబ్దం లోని అయణ అనే పదాని అర్థం ఆధారం. ఈ సకల చరాచర వస్తుజాతానికి ఆధారమైన వాన్ని నారాయణ అంటారు.
మరి చరాచర వస్తువులలో ఎట్లావ్యాపించి ఉంటాడు, లోపల-బయట వ్యాపించి ఉంటాదని తెలియజేసేది నారాయణ మంత్రం.
ఈ నారాయణ అనే శబ్దాన్ని రెండు సమాసాలు వివరిస్తాయి. ఒకటి తత్పురుష రెండవది బహువ్రిహి సమాసాలు.
తత్పురుష అనేది నారములన్నిటికి తాను ఆధారమైన వాడు, ఆధారమై తనలోపల పెట్టుకున్నవాడు అని చెబుతుంది.
మరి బహువ్రిహి సమాసం తానీ నారములన్నిటికి తాను లోపల ఉండి రక్షిస్తాడని చెబుతుంది. అర్థాత్ ఆయన లోపన మరియూ బయట వ్యాపించి ఉంటాడని.
అయణ అనే శబ్దంచే ఆయన అన్ని గుణములు కల్గి, చేయిచాస్తే చాలు అందేట్టు ఉంటాడు కాబట్టి ఆయనకు సౌలబ్యాది గుణాలు ఉంటాయి. లోపల ఉంటాడు కాబట్టి దగ్గరగా ఉంటాడు, పైన కూదా ఉంటాడు కనక అయన పరుడు- అందుచే పరత్వం సౌలబ్యం లాంటి గుణాలు కల్గినవాడు. జ్ఞానులు కూడా ఈ నారములలోని వారేకనుక తాను జ్ఞానం కల్గి ఉంటాడు.
చేయిజాస్తే అందేవాడు, వారిలోని దోషాలను ఎలా దూరంచేయాలో తెలిసినవాడు, దోషాలున్నా తన నుండి మనల్ని దూరం చేయని వాత్సల్యం కల్గినవాడు. దోషాలను తొలగించే శక్తి కూడా ఉంది.
అర్థాత్ ఆయనలో పరత్వం ఉంది, సౌశీల్యం ఉంది, వీటన్నిటినీ తనవనుకునే స్వామిత్వం ఉంది, వీటి యొగ్యత గుర్తించే జ్ఞానంచే సర్వజ్ఞత్వం ఉంది, తను ఇలా చేస్తానంటె ఎవ్వరూ అడ్డనంత శక్తి ఉంది, ఎంత ఇచ్చినా తరగని నిండుతనం అంటే పూర్ణత్వం ఉంది.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
: 🌻 *మాఘ పురాణం - 24* 🌻
🌼 *24వ అధ్యాయము - శ్రీమనారాయణుని యనుగ్రహము - తులసీ మహాత్త్యము* 🌼
గృత్నృమదమహాముని జహ్ను మునితో నిట్లనెను. సత్యజిత్తు యేకాదశియందు భార్యతో బాటు ఉపవాసముండెను. కేశవుని గంధపుష్పాదులతో నర్చించెను. దేవతల హితమును కోరి శ్రీమన్నారాయణుని నిరంతరముగ జపించుచు జాగరణ చేసెను. ఏకాదశినాటి రాత్రి మొదటి జామునందే శ్రీహరి సత్యజిత్తునకు ప్రత్యక్షమయ్యెను.
నీలమేఘమువలె నల్లనిచాయతో, నల్లని ముంగురులతో పద్మనేత్రములతో ప్రకాశించు తిలకముతో, విచిత్రకుండలములతో చెక్కిళ్లు ప్రకాశించుతుండగా, సూర్యకాంతినిమించు కిరీటముతో, హారకేయూరాది విభూషణములతో, పచ్చని పట్టు బట్టను కట్టి మనోహరమైన రూపముతో గరుత్మంతునిపైనెక్కివచ్చెను.
మునిగణములు శ్రీమన్నారాయణుని స్తుతించు భార్యతోబాటు శ్రీమన్నరాయణుని పాదములపైబడి నమస్కరించెను. శ్రీమన్నారాయణమూర్తి 'నాయనా! కోరిన వరము నిచ్చెదను అడుగూ అనెను.
అప్పుడు సత్యజిత్తు 'స్వామి! యింద్రాదులకు పూర్వమువలెనే సంచరించు శక్తి నిమ్ము వారిపై దయనుంచుము. తరువాత నాకును, నాభార్యకును నీ సాన్నిద్యము ననుగ్రహింపుము అని కోరెను. శ్రీహరి దయతో వాని కోరిక నంగీకరించెను ఇట్లనెను. ఓయీ! యీ ఏకాదశితిథి సమస్త పుణ్యముల నిచ్చును. నేనీ తిథియందే నీకు ప్రసన్నుడనైతిని, కావున యీ తిథి నాకు సంతోషమును కలిగించు తిథి.
నీవు నీ భార్య యీ పారిజాత వృక్షమును పెకిలించి యింద్రునకిండు, పవిత్రము, వనవాసి. నాకిష్టము అయిన యీ తులసిని నకిమ్ము, నీకు శుభము కలుగును, మరియొక ఆలోచన వలదు అని పలికెను. సత్యజిత్తును అట్లేయని అంగీకరించెను. మరునాటి ఉదయమున భార్యతో కలిసి పారిజాత వృక్షమును పెకిలించి యింద్రాదుల కిచ్చెను. తులసిను లక్ష్మీపతియగు శ్రీహరికిచ్చెను.
శ్రీహరియనుగ్రహము వలన ఇంద్రాదులందరును శక్తిమంతులై శ్రీమన్నారాయణునకు నమస్కరించి నిలిచిరి.
శ్రీహరి యింద్రాదులు వినుచుండగా సత్యజిత్తును వాని భార్యను జూచి యిట్లనెను. ఈ యేకాదశితిథి నాడు నీవు భక్తితో నీ విధముగ నన్ను పూజించి నా అనుగ్రహము నుండుట వలన మిక్కిలి ఉత్తమమైనది. నాకు మిక్కిలి ఇష్టమైనది. ఈ యేకాదశీతిథి సర్వజీవుల పాపములన్నిటిని పోగొట్టి అనంత పుణ్యమునిచ్చును.
మందమతులైన మానవులీవిషయమును గమనింపలేరు. పాడ్యమి నుండి పది దినములును యధా ప్రకారము భుజించి యేకాదశి నాడు ఉపవాసమును, జాగరణము చేసి నన్ను స్మరించు వారు నా సాన్నిద్యమును చేరుదురు. ఇహలోకమున సర్వసుఖములను, సర్వశుభములను పొందుదురు. నాకు సంతోషము నిచ్చిన యీ తిథి ఉత్తమ సంభావన నిచ్చి వేలకొలది అశ్వమేధములు చేసినవచ్చు పుణ్యము నిచ్చును.
ధర్మవేత్తలగు మునులును యీ తిథి మిక్కిలి పుణ్యప్రదమని యందురు. పన్నెండవ రోజున దేవతలకు మరల శక్తి, పుష్టికలుగుటచే ద్వాదశి తిథిని ప్రాణదాయిని విష్ణుప్రియయని అందురు. అజ్ఞానముచే ఏకాదశి భుజించువారు మహాపాపముల నందుదురు. దశమినాటి రాత్రి భోజనమును మాని, ఏకాదశినాడు రెండు పూటల భోజనమును మాని, ద్వాదశి నాటి మధ్యాహ్నమున నొకమారు భుజించి నాటి రాత్రి భుజింపకయుండిన చాతుర్భుక్తావర్జితమైన ఏకాదశి ఉపవాసమని యందురు.
ఈ ప్రకారము చేసిన ఉపవాసము సంపూర్ణ పుణ్యఫలమునిచ్చును. పుణ్యప్రదమగు హరివాసరమున ఉపవాసము జాగరణము చేసి నన్ను యధా శాత్స్రముగ పూజించినవాడు నాకిష్టుడు. నా లోకమును చేరును. ఇట్టి యేకాదసి ఉపవాసము చేసినవానినే గాక వాని కులము వారినందరిని రక్షించి అనేక యజ్ఞములు చేసిన వచ్చు పుణ్యము నిచ్చును.
నాలుగు వర్ణములవారు, సన్యాసి, వానప్రస్తుడు, స్త్రీబాలవృద్ధులు అందరును ఏకాదశినాడు భుజింపరాదు, ఏకాదశినాడు స్త్రీ సుఖము, నిద్ర, అన్నము వీనిని విడిచి నన్ను పూజించవలెను. నా పాదోదకమును సేవింపవలెను. అన్ని మాసములయందును, శుక్లకృష్ణపక్షములు రెండిటను వచ్చు యేకాదశులన్నియు నిట్లే ఉపవాసముండవలెను.
చాంద్రాయణాది వ్రతముల నాచరించుట వలన వచ్చెడి పుణ్యము యేకాదశీ ఉపవాస వ్రతము వలన వచ్చును. కావున మానవులారా, మునులారా, నా భక్తులారా మెరెవ్వరును యీ యేకాదశినాడు అన్ని మాసములయందును. రెండు పక్షములయందును తినరాదు. ఇది సత్యము ఇట్లు ఉపవాసము చేసినవాడు నా లోకమును చేరి నన్ను పొందును. ఇది తధ్యము అని బిగ్గరగా పలికెను. అని గృత్నృమహాముని జహ్నుమునికి వివరించెను.
గృత్నృమహాముని జహ్నుమునితో నిట్లనెను. శ్రీమన్నారాయణుడు యేకాదశి వ్రతవిధానమును మహత్త్యమును వివరించి యింద్రాదులతో నిట్లనెను. మీరీ పారిజాత దివ్యవృక్షమును తీసికొని మీ నివాసమైన స్వర్గమునకు వెళ్ళుడని చెప్పెను. ఇంద్రాదులు శ్రీహరి చెప్పినట్లు పారిజాతవృక్షమును తీసికొని స్వర్గమునకు పోయిరి.
వారందరును వెళ్లిన తరువాత తులసి శ్రీమన్నారాయణునితో నిట్లనెను. స్వామీ! నీ పాపపద్మముల యందాసక్తి గల నన్ను దయ చూడుము. నాకు నీవు తప్ప మరియొక్క గతిలేదు. నేను నీ పాద సాన్నిధ్యమునే కోరుకొందుము అని పలికిన తులసి మాటలను విని శ్రీహరి భూమియందు అమృతము వలన పుట్టిన తులసి! నీవు నాకిటురాలవు.
నా వద్దకు రమ్ము నిన్ను నేను హృదయమున ధరింతును. సందేహము వలదు. నీవు పవిత్రురాలవు పవిత్రతను కలిగించుదానవు పాపనాశిని తులసి దళములతో కలిగి యున్న నిన్ను చూచినవారు గంగా స్నానము చేసిన వారువలె పవిత్రులగుదురు. నీ దళములతో నన్ను పూజించినవారు పునర్జన్మ నుండదు. అమృతము నుండి పుట్టిన తులసి నీ దళములను మాలగా చేసి నా కంఠమున సమర్పించినవారు అంతులేనంత అనంతకాలము నా లోకమున నుండి నాలోనైక్యమగుదురు.
నిన్ను తమ యిండ్లయందు గాని తోటలయందు గాని పెంచువారికి యే పాపములును అంటవు.ప్రాతఃకాలమున నిద్రలేవగనే నిన్ను చూచి నమస్కరించినవాడు ఆ దినమున సర్వ సుఖముల నందును.
యన్మూలే సర్వతీర్థాని యన్మభ్యే సర్వదేవతాః
యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహం ||
అను శ్లోకమును చదివి నీకు నమస్కరింపవలెను. తులసి! నీ దళములతో నీటిని తన శరీరముపై జల్లుకొనువాడు అపవిత్రుడైనను పవిత్రుడగును. నీ కుదురు మొదలులోనున్న మట్టిని తిలకముగ నుదుటిపై ధరించినవాడు. సర్వసుఖములను పొందును. యక్షరాక్షస పిశాచాదుల వలన వానికి యే బాధయు నుండదు.
అమృత సంభవా తులసీ త్రైలోక్యపావనీ నేను నిన్ను లక్ష్మీదేవిని సమానముగా భావింతును అని శ్రీహరి తులసికి వరములిచ్చెను. తులసి దళములను కాండములను శాఖలను అన్నిటిని శుభప్రదములైన మృదువైన తన చేతులతో తాకెను. చక్రధారి స్పర్శవలన తులసి మరింత కాంతిని పవిత్రతనుపొందెను. అప్పుడా తులసి మనోహరమైన పవిత్రమైన స్త్రీరూపమునంది శ్రీహరి అంశను పొందెను.
మాయావి జగదీశ్వరుడు అయిన శ్రీహరి లోకరక్షణార్థమై తులసిని నియమించెను. శ్రీహరి యెడమ చేతితో తాకబడిన భాగము కృష్ణవర్ణమై కృష్ణతులసి యను పేరు పొందెను. ఆ వైపున ఉన్న ఇతర వృక్షములను తులసీ సాన్నిధ్యముచే పవిత్రములయ్యెను. తులసి యున్న ప్రదేశము పాపములను పోగొట్టును.
అప్పుడు శ్రీహరి సత్యజిత్తును చూచి 'నీవు నాకు పూజను చేసి బ్రాహ్మణ సమారాధనము చేసి నీవు నీ భార్యయు భుజింపుడు ' అని పలికెను. సత్యజిత్తు కూడ శ్రీహరిని పూజించి, బ్రాహ్మణులకు భోజనమును పెట్టి తన భార్యతో కలసి భుజించెను. ఇట్లు ఆ వ్రతము పూర్తి అయిన తరువాత శ్రీహరి అందరును చూచుచుండ సత్యజిత్తు దంపతులతోను తులసితోను కలసి గరుత్మంతుని పైనెక్కి తనలోకమునకు పోయెను.
నాయనాజహ్నుముని! యిది యేకాదశీ వృత్తాంతము. యేకాదశీ వృత్తాంతము. ఏకాదశి తిథి అశ్వమేధ సహస్ర ఫలము నిచ్చునని స్పష్టమైనది కదా. అన్నియేకాదశులలోను మాఘమాసమునందలి యేకాదశి మరింత శుభప్రదము. ఆనాడు ఉపవాసముండి శ్రీహరిని పూజించి జాగరణ మంత్రానుష్ఠానము స్మరణము చేసినవారు శ్రీహరికి ప్రీతిపాత్రులై సాలోక్యమును సాయుజ్యమును పొందుదురు.
ఏకాదశినాడు ఉపవాసము ద్వాదశినాడు పారణ ముఖ్యము. ఆనాడు బ్రాహ్మణులకు భోజనము పెట్టి యధాశక్తిగ గోదానము, భూదానము, వస్త్రదానము, సువర్ణదానము, సాలగ్రామ శిలాదానము మున్నగువానిని ఉత్తముడైన బ్రాహ్మణునకు/బ్రాహ్మణులకు యీయవలెను. అట్టివారు యిహలోకమున చక్రవర్తియై తుదకు శ్రీహరి సాయుజ్యమునందును.
ఇట్టి పవిత్రమైన కథను వినువాడును శ్రీహరి కరుణా కటాక్షమునంది విష్ణువును చేరుదురు. నిస్సందేహముగా చెప్పుచున్నాను అని గృత్నృమదమహర్షి జహ్నుమునికి వివరించెను.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
🕉 *శ్రీ కాళహస్తీశ్వర శతకం - 114* 🕉
*నిను నావాఁకిలి గావుమంటినొ మరున్నీలాకాభ్రాంతిఁ గుం*
*టెన పొమ్మంటినొ యెంగిలిచ్చి తిను తింటేఁగాని కాదంటినో*
*నిను నెమ్మిందగ విశ్వసించుసుజనానీకంబు* *రక్షింపఁజేసిన నావిన్నపమేల గైకొనవయా శ్రీ కాళహస్తీశ్వరా!*
📍 _*తాత్పర్యం:*_ 📍
శ్రీ కాళహస్తీశ్వరా!
నేను బాణాసురునివలె నా గుమ్మమువద్ద కావలియుండుమని నిన్ను కోరను.
మను అను భక్తుడువలె దేవతాస్త్రీ కొరకు దూతవై వెళ్లుమని ప్రార్ధించను.
తిన్నని వలె ఎంగిలి మాంసము తినుమని నిర్భందించను.
నిన్ను నమ్మిన సజ్జనులను రక్షించువాడవని విని, నన్ను రక్షింపుమని ఎంత మొరపెట్టుకున్ననూ వినకున్నావు. ఎందుకు ప్రభూ?
🙏 *ఓం నమః శివాయ* 🙏
🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼🍃🌼
🙏 *శ్రీ వేంకటేశ్వర శతకము 7* 🙏
సత్కవుల కావ్యాలను గూర్చి ఈ పద్యం వివరించింది
*ఉ. ఉత్తమ కావ్యజాలముల నోపికఁగూర్ప కవీశ్వరాళికిన్*
*సొత్తుగ నుంటరాజకుల సోములు కొల్వునజేరురింపుగా*
*నుత్తమ హంస పాల జలముంచిన పాలనెగ్రోలు నేర్పు సం*
*పత్తినెఱింగి బ్రహ్మతన పజ్జనె చేర్పఁడె వేంకటేశ్వరా!*
వేంకటేశ్వరా! మహారాజులు రాజకులశ్రేష్టులై కవులలో ఉత్తమ కవులను ఎన్నికజేసి వారిని తమ కొలువులలో సత్కరించి వుంచి వారిచే ఉత్తమ కావ్యసమూహములను వ్రాయించి వెలయించి తమ ఆస్థాన కవులుగా వారిని గౌరవిస్తారు.
🍃🌹బ్రహ్మదేవుడు కూడా పాలను నీటిని వేరుచేయగల గొప్పగుణం హంసకు ఉన్నది, కాబట్టి ఆ గొప్పగుణం హంసకు మాత్రమే కలదు, కాబట్టి ఆ హంసను బ్రహ్మదేవుడు చేరదీసి తన వాహనంగా చేసి గౌరవించాడు.
🍃🌹అలాగే ఉత్తమ కావ్యాలు వ్రాసే కవులు కూడా క్షీరనీరాన్ని వేరు చేయగల హంసలవంటివారు. అందుకే రాజకులచంద్రులు వారిని దగ్గరికి తీస్తారు. గౌరవ సత్కారాలు చేసి పూజిస్తారు.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment