Tuesday, 9 March 2021

09032021

Lord Ram Rama - Unique POSTER (8.5 x 11 Inches)
 
సీతాపతీ పద్య కావ్యము 
రామప్రేమామృతము 

సీసము

పుత్తడిబొమ్మ యే పుడమి న వెలుగుగా
స్త్రీ లశృంగారమ్ము సిరుల చెట్టు
ముగ్ధ మోహిత లీల మనసు సింగారాలు
మమతలు మునిరత్న మేలి మలుపు
ఏమి అందము లోన ఎంతో కులుకు లేలు
స్త్రీ సమ్మ తియె పుత్తడి వెలుగులె
సకలమ్ము సంతోష సిరులు పలుకు
ఆనంద నిలయమ్ము అనురాగ బంధమె
నడమంత్రపు సిరి లు నడుచు చుండు

తేటగీతి
మగువ మాంగల్య బంధము మన్నె టెక్కు
ఆశ ఆరోగ్య శృంగార మలుపు తిప్పు
నిత్య బంగార మెరుపులు నాల కించు
ముద్దు చేయుబంగారము మహిమ చూపు   .... .... 53

-+(())-+

సీసము 
అవధులు ఉండవు ఆకర్షణతొ ప్రేమ  
హద్దులు ఆపవు హాయి గొలుపు  
సరిహద్దు లెన్నున్న సంపద కడ్డేది
సంసార సుఖముయు సౌఖ్యమవ్వు 
బంధన మగుటయు బాధ్యత పెరిగియు 
బానిస కాదది బతుకు తెరువు  
స్వాగత చెలిమిని సామరస్యముగను 
లక్షణా జరిగేది లయలు కళలు 

తేటగీతి 
నీకు నేనేమి అనుటలో నిజము దాగు 
నాకు నీవేమి అనుటలో న్యాయముంది 
ఏమి లేనిఅస్థిత్వము ఎదురు చూడు 
ఎదలొ కలవరం తప్పదు ఏది ఏమో    ... .... 54
 
--(())--
సీసము 
నినునిత్య సృజనము నిన్నుగా గుర్తింపు 
అనునయ ఆరాధ్య ఆది అగును 
స్వాతిశయంతోను శాసిస్తూ కరుణను 
హృదయాన్ని అర్పిస్తూ హాయి గుంచు 
చిద్విలాసంతోను చిందులు చిందిస్తూ 
మురిపిస్తు మక్కువ  మనసు పంచు  
లక్ష్మణా తలపుల లాలసమ్ము 

పుణ్య జనులార భక్తాగ్రగణ్యులార 
పఠన మొనరింప భాగ్యమ్మ పదవి యగును 
మంగళంబులు కల్గును మమత నందు 
మానసానంద మబ్బు సంపదలు గలుగు   ... ....55

--(())__


 

 ..  ఒత్తిడి తగ్గడానికి 25 సూత్రాలు..


 1. ఒక రోజు ఒక సమయం లో నీకోసం నీవు కనీసం 60 నిముషాలు కేటాయించుకో !

  2. నీ ఒత్తిడి ని గమనించుకో ఎప్పుడు ఉద్రేకం నుండి బయట పడాలో ? శాంతం వహించాలో గమనించుకో !

  3. ప్రతి రోజు ధ్యానం చేయడం వలన నీ ఒత్తిడి రసాయనాలను 

తగ్గించగలదని గుర్తించుకో !

  4. నీ ఆహారం లో పళ్ళూ , కాయగూరలూ , నీరూ తగినంతగా ఉండేలా చూసుకో ! మాంసాహారం -విషాహారం అని తెలుసుకో !

   5. కక్ష కన్నా క్షమ గొప్పది 

క్షమ కన్నా *జీవుల పట్ల కరుణ* గొప్పదని  అని తెలుసుకొని పాటించడం అలవాటు చేసుకో !

   6. ఒక విషయం గురించి నేను ఎంత ఆలోచించాలి అనేది నిర్ణయించుకుని అంతే ఆలోచించడం నేర్చుకో !

  7. నవ్వును , దగ్గరకు తీసుకో , ఇతరులతో నీ భావాలు పంచుకో!

   8. నువ్వు దేనికి ఒత్తిడికి గురి అవుతున్నావో గమనించుకుని ధ్యానసాధన చెయ్యి.  రెండో సారి దానికే మళ్ళీ గురికాకుండా ధ్యాన సాధన ద్వారా తరిమి కోట్టడం నేర్చుకో  !

   9. ముందు నిన్ను నీవు సరిగా అంచనా వేసుకో ! ఎదుట వారిని అంచనాలు వేయడం మానుకో !

    10. పాజిటివ్ గా ఆలోచించు. దాని వలన ఎనలేని సంతోషం నీసొంతం చేసుకో  !

  11. *మద్యానికి , మాదక ద్రవ్యాలకీ దూరంగా ఉండు . అది నీ ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది అని తెలుసుకో*  *శాకాహారిగా* ఉండడం *ధ్యానం* చేయడం నేర్చుకో!

  12. డబ్బు విషయం లో జాగ్రత్త వహించు .నీడబ్బులో కనీసం 10 శాతం మంచి పనులకు ఖర్చు చెయ్యిడం నేర్చుకో!

  13. నాకు ఒద్దు , నాకు రాదు నాకు చేత కాదు అనే మాటలను చెప్పడం మానుకో !

  14. బయటకు వెళ్ళు . మిత్రులతో , బంధువులతో గడపడం, విహార యాత్రలకు వెళ్ళడం  సత్సంగం వలన నీకు ఒత్తిడి తగ్గిస్తుంది అని తెలుసుకో ! 

   15. *టి వి కన్నా నీకు ఇష్టమైన సంగీతం ఒత్తిడి తగ్గిస్తుంది అని గ్రహించుకో* !

  16. *పొగ తాగడం ఒత్తిడి పెంచడమే కాదు నిన్ను చంపగలదు అని తెలుసుకో* !

  17. బంధాలను పెంచుకో , కాపాడుకో , ఎక్కువ విను , తక్కువ మాట్లాడు నేర్చుకో !

   18. ప్రతీదీ అనుభవించు; కాని దేనికీి బానిస కాకూడదు అని తెలుసుకో  !

   19. వారానికి ఒక్కసారి ఉపవాసం ; ఉదయం సూర్యోదయం; సాయంత్రం సూర్యాస్తమయం  చూడడం నేర్చుకో  !

   20. విషయాలను నీ కోణం నుండి కాకుడా ఎదుటి వారి కోణం నుండి ఆలోచించడం నేర్చుకో !

  21. విషయం పూర్తిగా తెలుసుకొని అప్పుడు బదులు ఇవ్వడం నేర్చుకో!

  22. నీ ఆందోళన వలన సమస్యలు తొందరగా గానీ , మంచిగా కానీ పూర్తి కావు .అని గుర్తించుకో !

  23. వచ్చే సంవత్సరానికి ఏమి సాధించాలి అనేది పక్కా ప్రణాళిక వేసుకో !

  24. ప్రతీ రోజూ భగవానుడు నీకు ఇచ్చిన ఒక బహుమతి అని తెలుసుకొని. నవ్వుతూ ఉండు. ఈ ప్రపంచం అనే అందమైన పెయింటింగ్ లో నువ్వూ ఒక భాగం అని తెలుసుకో !

  25. యోగా చెయ్యి. ప్రాణాయామం చెయ్యి.


   శ్వాస మీద ధ్యాస తో ధ్యానం చెయ్యి.

   ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పు .

   నీకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువుకు కృతజ్ఞతలు చెప్పు .


 .. ఇవి మానవ జీవితానికి కంప్లీట్ ఎగ్జామ్ పేపర్ లాంటివి..

 🌹కుక్కసాయం🌹
రాజు అనే ఒక యజమాని దగ్గర లూక అనే కుక్క పిల్ల ఉండేది.
రాజు కుక్క పిల్లను తన కొడుకు కన్నా బాగా చూసెవాడు.
కుక్క పైన ప్రేమ, జాలి, ఉండేది.
రాజు లూకను ముద్దుగా పాలించేవాడు.
రాజు కొడుకు అయిన ‌సూరి
ఇద్దరి సంతోషాలను చూసి
ఓర్చుకోలేక పోయారు.
వారి ఇద్దరి పైనా సూరికి
ఈర్ష్యా ద్వేషమూ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.
ఒక రోజు రాజు తిండిలో తన కొడుకైన సూరి విష్యం వేసారు.
మృగజీవి అయినా కుక్క చూడడంతో ఆ 🐕 కుక్కకు ఒక గదిలో తరిమి వేశారు.
అబ్బా ఇది ఏంటి సంగతి హఠాత్తుగా ఇలా జరిగింది.
నా కంటి ముందరే నా రాజుకు కోసం  విష్యం వేయడం చూసిన కూడా నేను ఏమి చేయలేకపోయానుఅని లూక తన కంటినీరు జారుతూ మెండుగా ఏడ్చాడు.
అదే సమయంలో కుక్కకు ఒక ఉపాయం తట్టింది.
కుక్క తన తోకతో ప్రయత్నిస్తూ తనకు దూరంగా ఉన్న 🔪 కత్తి పిట్టాను ధైర్యంగా తోకతో ప్రయత్నిస్తూ తన దగ్గరికి లాగెసుకున్నడు.
లాగిన కత్తిని ఎత్తైన తన 👅 నాలుకతో గట్టిగా పట్టుకొని తాడును కత్తిరించారు.
హఠాత్తుగా తన రాజు దగ్గరికి వెళ్ళి చేతిలో ఒక ముద్ద లేపుతుండగా ఆ ముద్దను కింద పారేసింది.
ఓ లూక ఎందుకు ఇలా చేశావు
కుక్కకు తిట్టాడు.
కుక్క పిల్ల భావు, భావు
అనుకుంటూ ఒరేయ్ బాధగా ఉండిపోయింది.
అబ్బా ఇది ఏంటి కుక్క పిల్ల ఇలా బాధగా ఉంది నాకు అన్నము తినకుండా క్రిందకు పారెసింది.
ఇంకా కుక్క ఒంటి పైన రక్తము కారుతుంది.
అంటూ అన్నము పరిశీలిస్తే దాంట్లో విష్యం ఉండేది.
ఈ పని అంతా సూరిదే అనుకుంటూ ఈ రోజు కుక్క పిల్ల లేక పోతే నా ప్రాణము పోయోది.
మృగజీవి జీవి అయిన కుక్క నా ప్రాణాన్ని కాపాడినాది.
ధన్యవాదాలు నా ముద్దుల కుక్క నీ బాధల్ని నేను అర్థం చేయలేకపోయాను మరి నువ్వు నా కొరకు నీ ప్రాణాన్ని ఇచ్చేదానివి ఇప్పటికీ నా కొడుకు నువ్వే! అనుకుంటూ
తన కొడుకైన సూరికి ఇంటి నుంచి బయటకు తరిమేశారు.
🐕 కుక్క రాజు ఇద్దరు సుఖము సంతోషాలతో జీవితం గడపడం మొదలు పెట్టారు
ఈ కథలోని నీతి ఏమి చెబుతుంది అంటే:
పెంపుడు జంతువును ప్రేమించి రక్షిస్తే!అవి మనల్ని తప్పకుండా రక్షించినట్లే!!

 --(())-

మనిషి - పరిధి ... సమ్మోహనాలు   1348 ... 1356 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

కాలము మారుచుండు 
మారు బతుకే ఉండు 
బతుకులే కడలిలొ కలువుచుండు ఈశ్వరా 

కాల గమ్యం కదులు 
కదులు నిత్య బాధలు 
బాధలున్న గమ్యం తొ కథలే ఈశ్వరా 

పయనమే జీవితం 
జీవితం సుఖమయం  
సుఖమయం లో జీవిచ్చ కలుగు ఈశ్వరా 

వెన్నెలే ఎడారి గ 
ఎడారే చీకటిగ
చీకటి అంతాఅయ్యోమయం ఈశ్వరా 
 
ఇది గమ్య మేమిటో 
ఏమి ఏమి మాటో  
మాటల పరంపర మనసు కలయు ఈశ్వరా

ప్రేమ ఎంత గొప్పదొ 
కళ గొప్పది ఎట్టిదొ   
గొప్ప కళ లే ఒకదాని కొకటి ఈశ్వరా 

ఆరంభం ఆగదు 
ఆగదు చెడే పోదు 
చెడి పోనిది ఒక్కటే ప్రేమా ఈశ్వరా 

కాలమే నీవెంట 
నీవెంట బతుకంట 
బతుకు భ్రమలు చుట్టూ అంటా ఈశ్వరా 
 
--(())--


-

 🌹కథ: నేను శిల్పినీ
నా పేరు శిల్ప శివయ్య!బండరాయిని నేను స్వంతగా బలంగా ఉన్న బండను చక్కుతు జీవించే శిల్పిని నా జీవితం శిలాలపైన ముడిపడి ఉంది.
నేను ఒక రోజున శివుడి మందిరానికి  దారిన వెళ్ళుతువెళ్ళుతుండగా నా కళ్ళకి ముల్లు లాగా ఒకబండ
గుచ్చింది.
అయ్యో!ఈ నిర్జీవి బండకు ఎంత బలం ఉందో అని నేను చాలా అబ్బురపడ్డాను
ఈ బండను చేతిలో తిసుకున్నాను ఇంకోక అడుగు మరొక బండపైనా వేయక నేను జారిపడ్డను అయ్యే! అయ్యయ్యో? ఇది ఏంటి అని ఇంకా ఆశ్చర్యపోయాను
ఆ రెండు బండలను ఒక మర్రిచెట్టు క్రింద ప్రశాంతంగా కుసోని పరిశీలించాను
1, మొదటి బండను చక్కితే
కొంత బాధను తట్టుకోగలిగారు.
అందంగా మహాదేవ్ విగ్రహం
ఏర్పడింది.
2అదే, రెండోవ బండను
 చక్కితే పగిలింది.కొంతబాధైనా
తట్టుకోలేదు విగ్రహంగా రూపొందించలేదు.
నేను ఆ రోజే తెలుసుకున్నాను ధైర్యాంతో బాధని విడనివాడు ఓటమిని అందుకుంటారు.
ధైర్యాంతో బాధని విడచినవాడు ఓటమిని చేరుకోరన్ని నాకు అర్ధం అయ్యింది.
నా కాళ్ళు నాకు గొప్ప ఖ్యాతిని పొందుతున్నారో, గమ్యాన్ని చేరిపిస్తారో అని నాకు ఆ రోజు తెలియలేదు.
కానీ ఈ రోజు తెలుస్తోంది.
నా సత్ప్రవర్తన సద్గుణాలు నాకు ఈ రోజు ఆదర్శంగా నిలిచాయి.
నేను ఒక్కటే ఆ రోజు రాత్రి వెన్నెల్లో ఆనందంతో కంటనీరు జారుతూ మా బడి విద్యార్థులతో పాటు మా ఊరు ప్రజలందరికీ తెలియజేశాను
ఈ రోజు ప్రజలందరూ ఎనుకపడడాకి కారణం ఏమిటి అంటే నేను చక్కినా దేవత విగ్రహాన్ని చక్కగా చూడండి.
అంటూ ప్రతి ఒక్కరికి చూపించినా అందరూ ఆశ్చర్యపోయారు.
అబ్బా ఇది ఎలా సాధ్యం అయింది.
అని శివయ్యతో అడిగినారు
ఓ ప్రజలారా! నేను రెండు బండలను చక్కుతుండగా
ఒక బండ దేవతగా ఆవిష్కరించింది.మరొక
బండ కళ్ళకింద తొక్కబడింది.
మనము కూడా గొప్ప ఖ్యాతి పొందాలంటే ధైర్యాన్ని విడచకుడదు బాధల్ని ఓదార్పు కోని గమ్యాన్ని చేరుకోవాలి
అంటూ ప్రతి ఒక్కరికి బండరాయి ఒక్క ఆవశ్యకతను గుర్తించాడు.
🌹ఈ కథలోని నీతి ఏమి చెబుతుంది అంటే:
సుఖము కంటే బలము మంచిదన్న చేరుతుంది
🌹కథ: ఇద్దరూ మిత్రులు
అనగనగా ఒక రోజు రాము సోము అనే ఇద్దరూ మిత్రులు కలిసి మేలిసి కట్టుగా అడవికి వెళ్ళారు.
సంబురాలతో నవ్వుతూ వెళ్ళుతు ఉండగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలుగుబంటి కనబడింది.
అబ్బా హఠాత్తుగా ఇది ఏంటి భయము అని ఇద్దరు మిత్రులు భయపడిపోయి నారు.
ఎలుగుబంటి వాళ్ళ దగ్గరికే
వెళ్ళుతుండగా రాము చింతచెట్టు తొర్రను చూసిదాచుకున్నాడు.
అదే సోము వణుకుతు వణుకుతూ మర్రి చెట్టు ఎక్కి పోయినారు ఎలుగుబంటి తొర్రలో ఉన్న రామును చూడక పోయింది.
మర్రి చెట్టు ఆకులు కదలుతుండగా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళసాగాడు.
వణుకుతున్న సొమ్ము ఓ రామా రామా నన్ను కాపాడు అంటూ రెండు పలుకు లోపానే పెద్ద శబ్దంతో మేఘాలు గర్జాట్టహాసంబులతో గర్జించింది.
మర్రి చెట్టు దగ్గరికి వస్తున్న ఎలుగుబంటి శబ్దాన్ని విని వారి ఇంటికి వెళ్ళిపొయింది.
ఓరామయ్యా నాకు ఈ సమయంలో కాపడినందుకు
నా యొక్క పాదా అభినందనలు అంటూ చెట్టుదిగి ఓ మోసగాడు రాము
నీ ప్రాణాన్ని నువ్వు కాపాడడానికి నీ మార్గాన్ని నువ్వు ఆలోచించి చింతా చెట్టు తొర్రలో దాచుకున్నవు కానీ నీ తొడుగా ఉన్న నీ మిత్రుని మర్చపోయావు అదే ఈ ప్రాణము శ్యాశ్వతమే ఏదైనా ఒక రోజు దేవుడి దగ్గరికి పొవాల్సిందే అంటూ ఓ రామా రామా అంటూ ప్రార్థిస్తుండగా
నా దగ్గరికి వస్తున్న ఎలుగుబంటి శబ్దాన్ని చూసి పారిపోయింది.
భూమాత పై సత్యంగా జీవిస్తున్న బాలుడికి ప్రాణానికి ముప్పు ఉంది అని ఆ దేవుడు నాకు రక్షణగా నిలబడ్డారు!
కానీ నువ్వు అయితే   నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి నిలబడ్డావు
అని సొమ్ము రాముతో నైతికత విలువలు బోధించారు.
కానీ రాము భయపడుతూ ఇంటికి పారిపోయాడు.
అదే సొమ్ము ధైర్యంతో మూకొటి దేవతలకు ప్రార్థిస్తూ ఇంటికి వెళ్ళిపొయాడు.
,ఈ కథలోని నీతి ఏమి చెబుతుంది అంటే:
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్నేహితుడు అనే వాడుతన స్నేహితుడికి కలిసి జీవించడం కన్న వారి మనసులో దాగిఉన్న బాధల్ని అర్థం చేసుకోనవాడే నిజమైన స్నేహితుడు అవుతాడు.
రాథోడ్ సురేష్✍️✍️✍️✍️
🌹కథ: రజకుడు
రాంపూర్ అనే గ్రామంలో రామయ్య అనే రజకుడు ఉండేవాడు ఆయన రోజు
బట్టలు ఉతికి జీవనం కొనసాగే వాడు.
తన ఊరిలో పెద్ద ప్రజలందరి బట్టలు శుభ్రంగా కడుక్కోనేవాడు.ఒకరోజున
రామయ్యా రంగయ్య ఇంటికి వెళ్ళి అయ్యా రెండు నేలల
డబ్బు ఇవ్వమని అడిగినాడు
కానీ రంగయ్య గట్టి ఆరచుతో ఇంటి నుండి గడపపైనా వచ్చి
ఓ చాకలి వాడా! రోజు నా
అన్నము తింటూ ఇంకా నా దగ్గరనుంచి డబ్బులు అడగడానికి సిగ్గులేదా!
అని మెండుగా తిట్టాడు.
అయ్యయ్యో! అయ్యయ్యో!
రంగయ్య అంతకానము తిట్టబోకు నన్ను నా కర్తవ్యము నేను పాటిస్తున్నాను
నువ్వు 🐕 కుక్కకు పెట్టిన ఆహారంలో నా ఆకలిని తిర్చుకున్నను కానీ దాంట్లో తప్పు ఏమీ అయ్యా!
మాటలేని జీవికి అన్నము పెట్టడం తప్పు కాదు కానీ నేను అయితే మీ జాతికి చెందిన మనిషిని కాదా!
కానీ రంగయ్య ఇది గుర్తుంచుకో
నువ్వు రోజు తోడు కున్న బట్టలను నేను చెమటొడ్చి
పరిశుభ్రంగా ఉతికి మేళాను తిసి నీ ఇంటిపైన ధరించినప్పుడు గుర్తురాలేరా!
కానీ ఈ రోజు నేను డబ్బులు అడిగేటప్పటికీ కోపంగా నాకు
ఏమెమో నోటికి వచ్చినట్లు వాగేశావు కానీ చాకలి బాధలను అర్థం చేయకపోలేవు
అయ్య రంగయ్య నేను ఈ రోజు మరొక ప్రాంతానికి వెళ్ళుతున్నాను ఇంకా తిరిగి రాలేను ఈ ఊరిలో నాకు ఎవరు డబ్బులు ఇవ్వడం లేదు నా జీవనానికి భంగం కలుగుతుంది.నాకు
గూడు కూడు ఏమి లేదు ఇక్కడ కానీ! ఒక్కటే మరవబోకు రంగయ్య చాకలికి
చెరువులే ఆదర్శమూర్తివి అదే వారికి కన్నా తల్లి లాంటిది.అని
తెలుసుకో!
అంటూ రామయ్యా మరొక ప్రాంతానికి వెళ్ళసాగాడు.
ఈ కథలోని నీతి ఏమి చెబుతుంది అంటే:
పని ఉన్నప్పుడు ఇతరులను వాడుకోకుడం కన్నా వారి ఆశలను తిర్చకపోవడం చాలా మోహం అని చెబుతుంది

--(()))--

 🌹కథ: ఇద్దరూ మిత్రులు
అనగనగా ఒక రోజు రాము సోము అనే ఇద్దరూ మిత్రులు కలిసి మేలిసి కట్టుగా అడవికి వెళ్ళారు.
సంబురాలతో నవ్వుతూ వెళ్ళుతు ఉండగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎలుగుబంటి కనబడింది.
అబ్బా హఠాత్తుగా ఇది ఏంటి భయము అని ఇద్దరు మిత్రులు భయపడిపోయి నారు.
ఎలుగుబంటి వాళ్ళ దగ్గరికే
వెళ్ళుతుండగా రాము చింతచెట్టు తొర్రను చూసిదాచుకున్నాడు.
అదే సోము వణుకుతు వణుకుతూ మర్రి చెట్టు ఎక్కి పోయినారు ఎలుగుబంటి తొర్రలో ఉన్న రామును చూడక పోయింది.
మర్రి చెట్టు ఆకులు కదలుతుండగా మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళసాగాడు.
వణుకుతున్న సొమ్ము ఓ రామా రామా నన్ను కాపాడు అంటూ రెండు పలుకు లోపానే పెద్ద శబ్దంతో మేఘాలు గర్జాట్టహాసంబులతో గర్జించింది.
మర్రి చెట్టు దగ్గరికి వస్తున్న ఎలుగుబంటి శబ్దాన్ని విని వారి ఇంటికి వెళ్ళిపొయింది.
ఓరామయ్యా నాకు ఈ సమయంలో కాపడినందుకు
నా యొక్క పాదా అభినందనలు అంటూ చెట్టుదిగి ఓ మోసగాడు రాము
నీ ప్రాణాన్ని నువ్వు కాపాడడానికి నీ మార్గాన్ని నువ్వు ఆలోచించి చింతా చెట్టు తొర్రలో దాచుకున్నవు కానీ నీ తొడుగా ఉన్న నీ మిత్రుని మర్చపోయావు అదే ఈ ప్రాణము శ్యాశ్వతమే ఏదైనా ఒక రోజు దేవుడి దగ్గరికి పొవాల్సిందే అంటూ ఓ రామా రామా అంటూ ప్రార్థిస్తుండగా
నా దగ్గరికి వస్తున్న ఎలుగుబంటి శబ్దాన్ని చూసి పారిపోయింది.
భూమాత పై సత్యంగా జీవిస్తున్న బాలుడికి ప్రాణానికి ముప్పు ఉంది అని ఆ దేవుడు నాకు రక్షణగా నిలబడ్డారు!
కానీ నువ్వు అయితే   నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి నిలబడ్డావు
అని సొమ్ము రాముతో నైతికత విలువలు బోధించారు.
కానీ రాము భయపడుతూ ఇంటికి పారిపోయాడు.
అదే సొమ్ము ధైర్యంతో మూకొటి దేవతలకు ప్రార్థిస్తూ ఇంటికి వెళ్ళిపొయాడు.
,ఈ కథలోని నీతి ఏమి చెబుతుంది అంటే:
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
స్నేహితుడు అనే వాడుతన స్నేహితుడికి కలిసి జీవించడం కన్న వారి మనసులో దాగిఉన్న బాధల్ని అర్థం చేసుకోనవాడే నిజమైన స్నేహితుడు అవుతాడు.
రాథోడ్ సురేష్✍️✍️✍️✍️

 --(())--

🌹కథ: రజకుడు
రాంపూర్ అనే గ్రామంలో రామయ్య అనే రజకుడు ఉండేవాడు ఆయన రోజు
బట్టలు ఉతికి జీవనం కొనసాగే వాడు.
తన ఊరిలో పెద్ద ప్రజలందరి బట్టలు శుభ్రంగా కడుక్కోనేవాడు.ఒకరోజున
రామయ్యా రంగయ్య ఇంటికి వెళ్ళి అయ్యా రెండు నేలల
డబ్బు ఇవ్వమని అడిగినాడు
కానీ రంగయ్య గట్టి ఆరచుతో ఇంటి నుండి గడపపైనా వచ్చి
ఓ చాకలి వాడా! రోజు నా
అన్నము తింటూ ఇంకా నా దగ్గరనుంచి డబ్బులు అడగడానికి సిగ్గులేదా!
అని మెండుగా తిట్టాడు.
అయ్యయ్యో! అయ్యయ్యో!
రంగయ్య అంతకానము తిట్టబోకు నన్ను నా కర్తవ్యము నేను పాటిస్తున్నాను
నువ్వు 🐕 కుక్కకు పెట్టిన ఆహారంలో నా ఆకలిని తిర్చుకున్నను కానీ దాంట్లో తప్పు ఏమీ అయ్యా!
మాటలేని జీవికి అన్నము పెట్టడం తప్పు కాదు కానీ నేను అయితే మీ జాతికి చెందిన మనిషిని కాదా!
కానీ రంగయ్య ఇది గుర్తుంచుకో
నువ్వు రోజు తోడు కున్న బట్టలను నేను చెమటొడ్చి
పరిశుభ్రంగా ఉతికి మేళాను తిసి నీ ఇంటిపైన ధరించినప్పుడు గుర్తురాలేరా!
కానీ ఈ రోజు నేను డబ్బులు అడిగేటప్పటికీ కోపంగా నాకు
ఏమెమో నోటికి వచ్చినట్లు వాగేశావు కానీ చాకలి బాధలను అర్థం చేయకపోలేవు
అయ్య రంగయ్య నేను ఈ రోజు మరొక ప్రాంతానికి వెళ్ళుతున్నాను ఇంకా తిరిగి రాలేను ఈ ఊరిలో నాకు ఎవరు డబ్బులు ఇవ్వడం లేదు నా జీవనానికి భంగం కలుగుతుంది.నాకు
గూడు కూడు ఏమి లేదు ఇక్కడ కానీ! ఒక్కటే మరవబోకు రంగయ్య చాకలికి
చెరువులే ఆదర్శమూర్తివి అదే వారికి కన్నా తల్లి లాంటిది.అని
తెలుసుకో!
అంటూ రామయ్యా మరొక ప్రాంతానికి వెళ్ళసాగాడు.
ఈ కథలోని నీతి ఏమి చెబుతుంది అంటే:
పని ఉన్నప్పుడు ఇతరులను వాడుకోకుడం కన్నా వారి ఆశలను తిర్చకపోవడం చాలా మోహం అని చెబుతుంది
రాథోడ్ సురేష్✍️✍️
🌹కథ:ఎలుకతెలివి🌹
ఒక యజమాని తన ఇంటి ఆవరణవ్యవస్థాలో వెయ్యి పైనా ఎలుకలు ప్రేవేశపెట్టారు.
ఆ ఎలుకలాను రోజు తగ్గినంత ఆహారము పెట్టేవారు.
అవి హాయిగా తింటూ కడుపు నింపుకొని జీవించేది.
కానీ ఒక రోజు  తన ఆహారము కొరకు వెతుకుతూ తున్న 🐈
హఠాత్తుగా ఎలుకలా వాసనను పసిగట్టింది.
వాసనను పసిగట్టిన 🐈 పిల్లి
ఎలుకలా వైపు వస్తుండేది.
అదే సమయంలో ఒక ఎలుకపిల్ల ఆవరణవ్యవస్థానుండి.
బయటకు రావడం జరిగింది.
ఆకలి కొరకు వస్తున్న 🐈
ఎలుకను చూసి మూసి మూసి నువ్వులతో అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా మెల్లగా తినడానికి పోతుండగా ఆకస్మాత్తుగా ఎలుక పిల్ల పిల్లి వాసనను పసిగట్టి ఆవరణవ్యవస్థాలో వెళ్ళకుండా
బయటికి పారిపోవడం మొదలుపెట్టింది.
పిల్లి కూడా ఎలుక ఎనుక పరుగెత్తడం మొదలుపెట్టింది.
ఇద్దరూ ఒక్కరి ఎనుక ఒక్కరూ
పరుగెత్తుకుంటూ జరిగింది.వారి
ప్రాణము కొరకు పరుగెత్తుకుంటున్న.ఎలుకపిల్ల
సన్నటి పోరులో దాచ్చుకున్నది.
అదే ఆకలి కొరకు పెరుగెత్తుకుంటున్న 🐈 పిల్లి
భయపడకు ఉండిపోయింది.
లోపల పోలేక పోయింది.
ఎలుక పిల్ల పిల్లితో ఇలా చెప్పుచున్నది.
ఓ హొ పిల్లి నువ్వు అయితే నాకు పట్టక పొయినావు
ఛీ ఇంతా చిన్న జీవిని కూడా
 నేను అయితే మా ఎలుక జాతికి రక్షించడానికి పరుగెత్తిన నా ప్రాణము పొయినా సరే కానీ మా జాతిని అంతము చేయడం నేను ఓర్వలేక పోవడంతో నేను నీకు వారిదగ్గరికి వెళ్ళకుండా ఇక్కడికి తిసుకొని వచ్చినాను
ఇప్పుడు నువ్వు వారి దగ్గరికి
పోలేవు ఎందుకంటే ఇప్పుడు నువ్వు అంతా మర్చిపోయినావు చూడు ఎత్తులో బరువులో చిన్నదైనా నేను నీతో 🐈 పిల్లి కానీ నా అంతా తెలివి తేటలు లేకపోయినావు చూడు ఎవరికి కూడా తక్కువ అంచనాలు వెయ్యకూడదు.
ఇది గుర్తుంచుకో దేవుడు లేదన్నాకు దేవుడు ప్రతి ప్రాణికి తగ్గినంత శక్తి సామర్థ్యాలను ఇచ్చినారు.ఇంక
దానితో పాటు వారి శత్రువులతో వారి ప్రాణాన్ని కాపాడుకోవడానికి తెలివితేటలు కర్తవ్యముగా ఇచ్చారు.
కానీ నువ్వు ఆ తెలివిని కొల్పోయినావు.
అంటూ ఎలుక తన పోరులో ఉండిపోయానాది.
పిల్లి ఆకలి ఆకలి అంటూ కుంగిపోయి చనిపోయినది.
🌹ఈ కథలోని నీతి ఏమి చెబుతుంది అంటే:
🖋️ చెడ్డ ఆలోచనలు కన్నా మంచి ఆలోచనలు మిన్న
లేదా
శత్రువులనతోను కాపాడుకోవడానికి తగ్గినంత తెలివి తేటలు అవసరం


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

పార్వతికి నారదుని ఉపదేశము

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

నారదుడిట్లు పలికెను -

ఓ విధీ ! తండ్రీ ! నీవు మహాబుద్ధి శాలివి. విష్ణు శిష్యుడవు. ముల్లోకములను నీవు సృష్టించినావు. శంకరమహాత్ముని ఈ అద్భుతమగు గాథను చెప్పితివి. శంభుని మూడవ నేత్రము నుండి పుట్టిన అగ్నిచే మన్మథుడు భస్మము కాగా ఆ అగ్ని సముద్రములో ప్రవేశించగా , తరువాత ఏమి జరిగినదో నీవు చెప్పుము. హిమవత్పుత్రిక యగు పార్వతీ దేవి అపుడేమి చేసెను? ఆమె సఖురాండ్రిద్దరితో గూడి ఎచటకు వెళ్లెను ? ఓ దయానిధీ ! ఇపుడా వృత్తాంతమును చెప్పుము.

బ్రహ్మ ఇట్లు పలికెను -

వత్సా ! నీవు మహా బుద్ధిశాలివి. నేను గొప్ప లీలాకరుడగు చంద్రశేఖర స్వామి చరితమును వర్ణించెదను. నీవు ఆదరముతో వినుము. శంభుని కంటినుండి బయల్వెడలిన అగ్ని మన్మథుని దహించివేసినది గదా ! దాని ప్రభావముచే అద్భుతమగు మహాశబ్దము పుట్టి ఆకాశము నిండిపోయెను. దహింపబడిన కాముని చూచి, ఆ గొప్ప శబ్దమును విని ఆ పార్వతి భయపడినదై సఖురాండ్రిద్దరితో గూడి కంగారుగా తన గృహమునకు వెళ్లెను. ఆ శబ్దమును కుటుంబ సభ్యులతో గూడియున్న హిమవంతుడు గూడ విని శివుని వద్దకు వెళ్లియున్న కుమారైను స్మరించి విస్మయమును, మహా దుఃఖమును పొందెను.

శంభుని విరహముచే మహా దుఃఖమును పొంది రోదించుచున్న కుమారైను చూచి పర్వత రాజగు హిమవంతుడు శోకమును పొంది ఆమె వద్దకు వచ్చెను. ఆమెను తన దగ్గరకు తీసుకొని, ఆయన కన్నీటిని తుడిచి 'ఓ పార్వతీ! భయపడకుము, ఏడ్వకము' అని పలికి ఓదార్చెను. పర్వతరాజగు హిమవంతుడు వెంటనే తన కుమార్తెను ఒడిలో కూర్చుండ బెట్టుకొనెను. మరియు మిక్కిలి దుఃఖితురాలైయున్న ఆమెను ఓదార్చుచూ తన ప్రాసాదములోనికి తీసుకొనివెళ్లెను. శివుడు మన్మథుని బూడిద చేసి అంతర్ధానము కాగానే పార్వతి ఆయన యొక్క విరహముచే మిక్కిలి దుఃఖితురాలై ఎక్కడనూ మనశ్శాంతిని పొందలేకపోయెను.

ఆ పార్వతి తండ్రి గృహమును చేరిన తరువాత తల్లిని కలుసుకొనెను. అపుడామెకు తాను పునర్జన్మను పొందినట్లు భాసించెను. మరియు ఆమె తన రూపమును నిందించుకొని, 'అయ్యో! హతురాలనైతిని' అని దుఃఖించెను. సఖురాండ్రు ఆమెను ఓదార్చిరి. అయిననూ ఆమెకు దుఃఖవిముక్తి కలుగలేదు. ఆ పార్వతి నిద్రించుచున్నప్పుడు గాని, నీటిని త్రాగునప్పుడు గాని, స్నానమును చేయునప్పుడు గాని, ఇటునటు నడచునప్పుడు గాని, సఖురాండ్ర మధ్యలో నున్నప్పుడు గాని లేశమైననూ సుఖమును పొందలేక పోయెను. 'నా రూపము మరియు కర్మ నిందింపదగినవి' అని పలుకుచూ ఆమె సర్వదా శివుని చేష్టలను స్మరింపజొచ్చెను.

ఈ తీరున శంభుని విరహముచే గొప్ప క్లేశమును పొందిన మనస్సు గల ఆ పార్వతి లేశమైననూ సుఖమును పొందజాలక, శివా ! శివా ! అని పలుకజొచ్చెను. వత్సా ! ఆ పార్వతి తండ్రిగారి ఇంటివద్ద ఉన్ననూ, ఆమె మనస్సు శివునిపై నుండెను. ఆమె తీవ్రమగు దుఃఖము గలదై అనేక పర్యాయములు స్పృహను గోల్పోయెను. దైన్యము నెరుంగని దృఢచిత్తులైన హిమవంతుడు, మేనక, మరియు మైనాకుడు హిమవత్పుత్రులందరు ఆమెను ఓదార్చిరి. కాని ఆమె శివుని మరువలేకపోయెను. ఓ దేవర్షీ! ఓ బుద్ధిశాలీ! అపుడు నీవు యథేచ్ఛగా సంచరించుచున్నవాడవై, ఇంద్రునిచే నియోగింపబడి హిమవత్పర్వమునకు విచ్చేసితివి.

అపుడు మహాత్ముడగు ఆ హిమవంతుడు నిన్ను పూజించి శ్రేష్ఠమగు ఆసనమునందు గూర్చుండబెట్టి కుశల ప్రశ్నల నడిగెను. పార్వతి ప్రారంభము నుండియూ శివుని సేవలో లగ్నమై యుండుట, శివుడు మన్మథుని దహించుట మొదలగు వృత్తాంతమును హిమవంతుడు ఆ తరువాత నీకు వివరించెను. ఓ మహర్షీ! నీవా మాటలను విని హిమవంతునితో 'శివుని సేవింపుము' అని బోధించి, మనస్సులో శివుని స్మరిస్తూ లేచివచ్చితివి. ఓ మహర్షీ! లోకములకు ఉపకారమును చేయునట్టియు, శివునకు ప్రీతి పాత్రుడవైనట్టియు, జ్ఞాని యగు నీవు హిమవంతుని విడిచిపెట్టి, వెంటనే ఏకాంతములో పార్వతిని కలుసుకొంటివి.

జ్ఞానులందరిలో శ్రేష్ఠుడవగు నీవు పార్వతీ దేవి యొక్క హితమును గోరి ఆమెను ఆదరముతో సమీపించి సంబోధించి సత్యమును ఇట్లు పలికితివి.

నారదుడిట్లు పలికెను-

ఓ పార్వతీ! నా మాటము వినుము. దయామయుడనగు నేను నీకు అన్ని విధములుగా హితమును చేగూర్చునది, రాగద్వేషాది దోషములు లేనిది, కోర్కెలనీడేర్చునది అగు సత్యమును చెప్పెదను. దీనులను అనుగ్రహించే మహాదేవుని నీవిచట సేవించి యుంటివి. కాని నీవు తపస్సును చేయలేదు. మరియు గర్వమును కలిగియుంటివి. దానితో సర్వము ధ్వంసమాయోను. ఓ పార్వతీ! విరాగి, మహాయోగి, భక్తవత్సలుడునగు ఆ మహేశ్వర ప్రభుడు మన్మతుడు దహించి, నిన్ను విడిచిపెట్టి వెళ్లినాడు. కావున నీవు చిరకాలము గొప్ప తపస్సును చేసి ఈశ్వరుని ఆరాధించుము. తపస్సుచే పవిత్రురాలవగు నిన్ను ఆయన తన భార్యగా స్వీకరించగలడు.

నీవు ఏనాడైననూ శివశంకరుని వీడి యుండవు. ఓ దేవీ! నీవు శివుడు తక్క మరియొకనిని హఠాత్తుగా భర్తగా స్వీకరించుట జరుగబోదు. ఓ మహర్షీ! హిమవత్పుత్రిక యగు ఆ పార్వతి నీ ఈ మాటలను విని, చిన్న నిట్టూర్పును విడచి, ఆనందముతో చేతులెత్తి నమస్కరించి ఇట్లనెను.

పార్వతి ఇట్లు పలికెను-

హే ప్రభో! నీవు సర్వజ్ఞుడవు. జగత్తులకు ఉపకారమును చేయువాడవు. ఓ మహర్షీ! నేను రుద్రుని ఆరాధించుట కొరకై నాకు ఒక మంత్రము నిమ్ము. ఎవ్వరికైననూ సద్గురువు లేనిదే పుణ్యకర్మలేవియూ సిద్ధించవని నేను పూర్వము వినియున్నాను. సనాతనమగు వేదము ఈ సత్యము చెప్పుచున్నది.


బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మహర్షీ! ఆ పార్వతి యొక్క ఇట్టి పలుకులను విని నీవు శివ పంచాక్షరీ మంత్రమును ఆమెకు యథావిధిగా ఉపదేశించితివి. ఓ మునీ మరియు నీవు ఆమెకు ఆ మహామంత్రము యొక్క సర్వశ్రేష్ఠమగు మహిమను చెప్పి, ఆమె యందు దానిపై శ్రద్ధను కలిగించితివి.

నారదుడిట్లు పలికెను-

ఓ దేవీ! ఈ మంత్రము యొక్క పరమాశ్చర్యకరమగు మహిమను వినుము. శంకరుడీ మంత్రమును విన్నంత మాత్రాన మిక్కిలి ప్రసన్నుడగును. శంకరునకు అత్యంత ప్రీతిపాత్రమగు ఈ మంత్రము మంత్రములోకెల్లా గొప్పది. కోర్కెలను, భక్తిని, ముక్తిని ఇచ్చునది. ఓ సుందరీ! నీవు యథావిధిగా దీనిని జపించుము. శివుని ఆరాధించుము. శివుడు శీఘ్రముగానే నీకు ప్రత్యక్షము కాగలడు. ఇది నిశ్చయము. ఓ పార్వతీ! నీవు నియమములను పాటిస్తూ, శివుని రూపమును స్మరిస్తూ ఈ పంచాక్షరీ మంత్రమును జపించుము. శివుడు శీఘ్రమే నీయందు ప్రసన్నుడు కాగలడు. ఓ సాధ్వీ! నీవీ తీరున తపస్సును చేయుము. మహేశ్వరుడు తపస్సుచే ప్రసన్నుడగును. సర్వప్రాణులు తపస్సు చేతనే ఫలమును పొందును, మరియొక ఉపాయము లేదు.

బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ నారదా! శివునకు ఇష్టుడవగు నీవు అపుడా పార్వతితో ఇట్లు పలికి దేవతలకు హితమును చేయగోరి యథేచ్ఛగా స్వర్గమునకు వెళ్లియుంటివి. ఓ నారదా! అపుడా పార్వతి నీ మాటలను విని మిక్కిలి ప్రసన్నురాలై సర్వశ్రేష్ఠమగు పంచాక్షరీ మంత్రమును చేపట్టెను.

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో నారదోపదేశమనే ఇరువది యొకటవ అధ్యాయము ముగిసినది.
🌹 గురువు పాదముల విలువ 🌹

       భారతదేశం నుంచి అమెరికాకి వచ్చి  ఓ నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకొని నివసిస్తున్న ఓ స్వామీజీ దగ్గరకి, హిందూ మతంపై ఆసక్తి గల ఓ అమెరికన్‌ వచ్చి, హిందూ మతం గురించిన ఎన్నో పుస్తకాలు తీసుకెళ్ళి చదివాడు.

       ఆ పుస్తకాలని తిరిగి ఇచ్చేసాక స్వామీజీతో ఇలా చెప్పాడు.

         “హిందూ మతంలో నాకంతా నచ్చింది, ఒక్కటి తప్ప.”

  “ఏమిటది? అందులో నీకేం లోపం కనబడింది? "

      “పాద నమస్కారాలు. శిష్యులు గురువుగారి పాదాలనాశ్రయించడం. పాదాలు శరీరంలో అధమస్థానంలో ఉంటాయి. శరీరంలో బురద, మురికి, మట్టి లాంటివి అధికంగా అంటేది పాదాలకే. అలాంటి పాదాలకి ఓ పవిత్ర స్థానం ఇవ్వడం నాకు నచ్చలేదు. గురువు శరీరంలోని ఏదో ఓ అవయవం మీద గౌరవాన్ని ప్రదర్శించాలనుకున్నప్పుడు, అది ఉన్నత స్థాయిలోని శిరస్సు పట్ల ప్రదర్శిస్తే బావుండేదనిపిస్తోంది. గురువు కాలి బొటనవేళ్ళ నించి గంగా యమునలు ప్రవహిస్తూంటాయని, ఆ నీటిని శిష్యుడు తల మీద చల్లుకుంటే పవిత్రమౌతాడని చదివాను. కానీ అదంతా ఊహతో కూడిన కల్పన తప్ప అందులో నిజం ఎక్కడుంది?" అడిగాడా అమెరికన్‌ సీరియస్‌గా.

    స్వామీజీ చిన్నగా నవ్వి .....

                    “అలా నదివద్దకి వెళ్ళి మాట్లాడుకుందాం పద.”

          ఇద్దరూ నది ఒడ్డుకి వెళ్ళారు. అక్కడ కొందరు జాలర్లు నదిలో చేపలు పడుతున్నారు.

నీళ్ళల్లో నిలబడి వలని దూరంగా విసురుతున్నారు.

        వలలో చేపలు పడ్డాక, వాటిని పట్బకుని బుట్టలో వేసుకుని మళ్ళీ వలని దూరంగా విసురుతున్నారు.

               “జాలర్ల వలలో ఏ చేపలు పడుతున్నాయి?  వారి పాదాల వద్ద ఉన్నవా?   లేక   దూరంగా వున్న చేపలా?” ప్రశ్నించాడు స్వామీజీ.

         “దూరంగా ఉన్నవే” చెప్పాడు అమెరికన్‌ వినమ్రంగా.

                 “భగవంతుడు ఆ జాలరి వంటివాడు. అతని చేతిలోని వల మాయ. దేవుడు విసిరే వలలో గురు పాదాలను ఆశ్రయించిన చేపలు అనే శిష్యులైన భక్తులు మాయకి చిక్కరు. దాంతో మోక్షాన్ని పొందుతారు.

గురు పాదాలను ఆశ్రయించకుండా, వాటికి దూరంగా వుండే జీవులు మాయలో చిక్కుకుని జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటూంటారు." వివరంగా చెప్పారు స్వామిజీ.

గురువు పాదాల మహిమను వర్ణించ శక్తి సామర్ధ్యములు ఎవ్వరికీ లేవు.

న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః |
తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః||


🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

భోజనానికి ముందు కాళ్ళు ఎందుకు కడుక్కోవాలో.. తెలుసా..?

అన్నం పరబ్రహ్మస్వరూపం అని ఆర్యవాక్యం. మనిషి మాటలు నేర్చి, వివేకం తెలిసి వికసించి విజ్ఞానవంతుడైన తర్వాత ఆహారానికి ఉన్న విలువను గుర్తించాడు. మానవుని ప్రాథమిక అవసరాలన్నింటిలోకి ఆహారమే ముఖ్యమైనది అని తెలిసిన తర్వాత సహజంగానే భక్తిభావం పెరిగింది. ఆహార ఉపాహారాల ఇష్టత లేని వానికి సుఖాపేక్ష ఉండదట. సుఖాపేక్ష లేనివానికి సంతుష్టత ఉండదట. ఆమారాన్ని సక్రమంగా తీసుకొనని వారికి ఏ కోరికలు ఉండవట. ఇలా చెబుతోంది భగవద్గీత.
 
పూర్వకాలంలో భోజనశాలను ప్రతినిత్యం ఆవుపేడతో ఆలికి సున్నంతో నాలుగువైపులా గీతలు వేసేవారు. దీని వల్ల సూక్ష్మక్రిములు భోజనశాలలోకి ప్రవేశించేవి కావు. మనుషులను పనిచేసే సూక్ష్మక్రిములను చంపే శక్తి ఆవుపేడలోనూను, ఆవు మూత్రంలోను ఉంది. భోజనం చేసిన తర్వాత కిందపడిన ఆహారపదార్థాలను తీసివేసి మరలా నీటితో ఆలికి శుభ్రపరిచేవారు. చీమలు మొదలైన కీటకాలు రాకుండా ఉండేవి.
 
మనకు శక్తిని ప్రసాదించి, మన ప్రాణాలను కాపాడి, మనలను చైతన్య వంతులను చేసి నడిపించే ఆహారాన్ని దైవసమానంగా భావించి గౌరవించి పూజించటంలో తప్పులేదు కదా. చేతులు కడుక్కోకపోతే నీ ఆరోగ్యం మాత్రమే చెడుతుంది. కాళ్ళు కడుక్కోకపోతే కుటుంబంలోని వారందరి ఆరోగ్యం చెడిపోతుంది. బయట నుంచి ఇంటిలోనికి ప్రవే
శించే ముందు తప్పనిసరిగా కాళ్లు కడుక్కోవడం కూడా మన ఆచారాల్లో ఒకటి.
 
ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ముందుగా కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు. తరువాత తాగటానికి మంచినీరు ఇస్తారు. మనం బయట ఎక్కడెక్కడో తిరుగుతాం. తెలియకుండా అశుద్ధ పదార్థాలను తొక్కుతాం. అదే కాళ్ళతో రావడం వల్ల కుటుంబంలోని అందరి ఆరోగ్యాలకూ హాని కలుగుతుంది. ముఖ్యంగా పసి బిడ్డలకు మరింత హానిదాయకం.
 
ఇప్పుడు మన ప్రశాంతంగా తీరికగా అన్నం తింటున్నామా? కాలిబూట్లతో అన్నం తింటున్నాం. పరుగులు తీస్తున్నాం. బిజీ బిజీ బిజీ అవసరమైన అవసరాల కోసం అర్థం లేని జీవితము గడుపుతున్నాం. కాళ్ళు కడుక్కోవడం విషయం అటుంచి చేతులు కూడా కడుక్కోలేని బిజీ అయిపోతున్నాం. ఇక ఆహారాన్ని గౌరవించే ఓపికా తీరికా ఎవరికి ఉంది?

--(())--

 

40 Masterpieces Of Contemporary Art Paintings Beginners Must Try

No comments:

Post a Comment