[14/03, 5:51 am] . Mallapragada: మధురిమలు
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మనసున కలువ రేకులే
తలపుల వనిత నవ్వులే
జరిగెను సమయ లొట్టలే
అవియును పడతి చూపులే
వచ్చెను చురుకు మాటలే
తెచ్చెను యువతి ఆశలే
మెచ్చెను నవత కోర్కలే
నచ్చెను మగువ ఊపులే
అప్పుడు మనసు వేటలో
ఇప్పుడు వయసు ఆటలే
చప్పుడు సొగసు చేష్టలే
ఎప్పుడు వలపు ఊటలే
వద్దులె పరువు మాటలే
సద్దులె నగల మార్పులే
ముద్దులె నగవు కుల్కులే
హద్దులె అలుపు పల్కులే
ఎందుకె వరుస వాదనే
పొందుకె వలపు చీకటే
ఎందుకె మనసు వేదనే
పొందుకె అలుపు వచ్చుటే
ఇదియే వలపు వేడుకా
ఇదియే పగటి దోషమే
తీరును తలపు దప్పికా
మారును రేయి వేషమే
ఆశల సిరులు గొప్పలే
ఆకలి మమత పొందులే
ఆశల పగలు ఎండలే
ఆకలి నళిని నీడలే
నిత్యము కలల పంటలే
వేషము కళల నేర్పులే
అందుకె శిలల పూజలే
మారెను కధల వేల్పులే
కలిసెను చిగురు టాకులే
వెలిసెను చెదురు పొంగులే
తెలిసెను కదురు చేష్టలే
మురిసె ఇద్దరు నవ్వులే
--(())--
[14/03, 6:09 am] . Mallapragada: మధురిమలు
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
ఆశకు హంగులు ఉండే
ఆకలి హంగులు మారవు
ఆటకు కోర్కలు ఉండే
మాటతొ కోర్కలు తీరవు
కాలము నీదై ఉండే
ఎప్పుడు బుద్దులు మారవు
శీలము నీదై ఉండే
తప్పుడు చేష్టలు మారవు
చెప్పుడు మాటలు ఉండే
ఆకలి తిప్పలు మారవు
తప్పుడు చేష్టలు ఉండే
వెకిలి వేషాలు మారవు
ఆవుకు రంగులు ఉండే
పాలలొ రంగులు మారవు
మనిషి లొ రంగులు ఉండే
రక్తము రంగులు మారవు
నదులకు వంపులు ఉండే
నీటికి వంపులు మారవు
మనిషి లొ వంపులు ఉండే
దేహ తాపాలు మారవు
పూలకు రంగులు ఉండే
వాసనకు రంగులు లేవు
పూజకు మంత్రం ఉండే
మత్రం బుధ్ధిని మార్చవు
భజనకు తాళా లుండే
భక్తికి తాళాలు లేవు
స్నేహానికి ప్రేముండే
స్నేహాన్ని తాళాలు లేవు
మనుగడ భయమే ఉండే
వెతుకుట దారులు మారవు
మనుగడ రొక్కము ఉండే
అడుగుట దారులు మారవు
--(())-+
[14/03, 6:45 am] . Mallapragada: మధురిమలు
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
వెంటాడే నయనాలు
దోచినాయి పువ్వులే
తరిముతుండె పవనాలు
తరించాయి పువ్వులే
మిన్నులోని తారకులు
చెలిమి చేయు పువ్వులే
మురిపించే చెలి కురులు
మనసు దోచె పువ్వులే
మనసు దోచె నవ్వులు
మెఱయు చుండె పువ్వులే
మనసు మార్చు అలకలు
గుబాళించు పువ్వులే
కొమ్మ రెమ్మ కదలికలు
కదలి రాలు పువ్వులే
మనసు దోచు కదలికలు
వేడిపుట్టు పువ్వులే
మనసు పంచు హృదయాలు
అవి యవ్వన పువ్వులే
వయసు పొంగే చేష్టలు
అవి నవ్వుల పువ్వులే
అరుణసంధ్య తరుణాలు
గుభాళించు పువ్వులే
పరిమళాలు తో గాలులు
సొగసు పంచు పువ్వులే
పుడమి పైన ప్రేమలు
కులుకు చూపు పువ్వులే
పుడమి తల్లి కోరికలు
దైవ పాద పువ్వులే
నమస్కార్ 🙏🏻
*నలభై ఏళ్ల వయసులో..*
ఉన్నత విద్యావంతులు.. సాధారణ విద్యావంతులు.. ఇద్దరూ సమానమే.
*సంపాదనలో ఎదుగుదలను మాత్రమే సమాజం గమనిస్తుంది.*
*యాభై ఏళ్ల వయస్సులో..*
అందమైన దేహం.. అందవిహీనం..
మద్య తేడా.. చాలా స్వల్పం. శరీరంమీద మచ్చలు ముడతలు దాచిపెట్టలేం.
*ఇప్పటివరకు అందంతో వచ్చిన గౌరవాన్ని కాపాడుకోవటానికి తంటాలెన్నో పడాల్సివస్తుంది.*
*అరవై ఏళ్ల వయసులో..*
ఉన్నత శ్రేణి జీవితం.. సాధారణ జీవనం.. రెండూ ఒకటే.
*పదవీవిరమణ తర్వాత బంట్రోతు కూడా పలకరించకపోవచ్చు.*
*డెబ్బై ఏళ్లవయస్సులో..*
విశాలమైన భవంతి.. సాధారణ నివాసం.. రెండూ సమానమే...
*కీళ్లనొప్పులతో కదల్లేని స్థితి. సేదతీరటానికి ఓమూలన చిన్నస్థలం చాలు.*
*ఎనభైఏళ్ల వయస్సులో..*
ధనంవున్నా లేకపోయినా ఫర్వాలేదు.
*ఎంత డబ్బున్నా ... స్వంతంగా ఎక్కడా ఏమీ ఖర్చు పెట్టలేం.*
*తొంభైఏళ్ల వయస్సులో..*
నిద్ర మెలుకువ రెండూ ఒకటే.
*సూర్యోదయం.. సూర్యాస్తమయం... రెంటినీ లెక్కించటం తప్ప ఏం చేయాలోకూడా తెలియదు.*
అందంతో వచ్చే మిడిసిపాటు...
ఆస్తులతోవచ్చే అహంకారం...
పదవులతో గౌరవాన్ని ఆశించటం...
కాలగమనంలో మన కళ్లముందే కనుమరుగవడం సత్యం.
*సుధీర్ఘ జీవన ప్రయాణంలో అందరూ సమానమే.*
అందుకే.. ఒత్తిడిలకు దూరంగావుంటూ...
అనుబంధాలను పదిలపరుచుకుంటూ...
జీవనంలోని మాధుర్యాలను ఆస్వాదిద్దాం..!
నాకు చాలా బాగా నచ్చింది. మీతో పంచుకో వలనిపించి పంపిస్తున్న.మీకూ నచ్చితే అందరిక పంపండి ఎందుకంటే ఇది జీవత సత్యo
[12/03, 10:30 am] +91 96520 19186: 🪶అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన వేదాలని పోగొట్టుకున్న వెర్రి సన్నాసులు భారతీయులు అని ప్రపంచం ఇప్పటికే ఉమ్మేసింది
🪴జీవన ధర్మాన్ని బోదించిన గొప్ప శక్తి ఐన బగవద్గీత ని చనిపోయినపుడు
మాత్రమే వినే తెలివి తక్కువ మూర్ఖులు భారతీయులు అని హేళన చేస్తోంది.
🍉ఆయుర్వేదం లో ఉన్న గొప్ప ఆరోగ్యాన్ని వొదులుకుని ఇంగ్లీష్ మందుల వెంట పడుతున్న అజ్ఞానులు భారతీయులు అని ఈ ప్రపంచం నవ్వుకుంటోంది
😅నిత్య యవ్వనం గా ఉంచే యోగ శాస్త్రాన్ని కాపాడుకోలేకపోయిన రోగులు భారతీయులు అని ఈ ప్రపంచం మనని చూసి పరిహాసం ఆడుతోంది
🌱నీ జీవిత పరమార్ధాన్ని వివరించే నీ దేశం లోనే పుట్టిన గొప్ప శక్తి ఐన ధ్యానం వొదిలేసి ఎందుకురా మా పిచ్చి సంస్కృతి ని ఫాలో అవుతున్నారు రా
తెలివి లేని భారతీయు లారా అని ఈ ప్రపంచం మనల్ని వెక్కిరిస్తోంది.
🍆అణువణువునా శక్తి ని నింపుకుని అద్భుతమైన ఆరోగ్యాన్ని ఇచ్చే ఆవుని కాపాడుకోలేక పోయిన మీకెందుకు రా ఆవేశం అని హేళన చేస్తోంది
🎋ప్రపంచానికే శాంతి ని బోదించిన మీ దేశం లో పుట్టిన బౌద్దాన్ని తరిమి కొట్టిన
పిచ్చి ఎదవలు భారతీయులు అని ఈ ప్రపంచం మనపైన ఉమ్మేస్తోంది
🌸అమెరికన్స్ ఐన మేము మీ వేప చెట్టుని పసుపు ని కొన్ని కోట్లు పోసి కొంటుంటే మీ ఇంటి ముందే ఉన్న ఆ చెట్లని కొట్టేస్తున్న తెలివి తక్కువ
దద్దమ్మల్లారా మీ దేశ గొప్ప తనం మీకే తెలియకుంటే ఎలా రా అని నిల దీసి మరీ ఈ ప్రపంచం మన మీద జాలి పడుతోంది
⛱️వేదాలు తగుల బెట్టుకున్నాము
🔥ఉపనిషత్తులు చెత్తలో వేసుకున్నాము
🍂ఆయుర్వేదాన్ని సమాధి చేసాము
🍂ధ్యానాన్ని మరిచిపోయాము
👍బౌద్దాన్ని చంపేసాము
🐂ఇప్పుడు ఆవుని కూడా చంపు కుంటున్నాము
🌿నాన్నా ఇంత గొప్ప దేశం లో పుట్టి ఇంత గొప్ప సంస్కృతి ని జీవన ధర్మాన్ని ఎందుకు కాపాడలేకపోయావు నాన్నా అని రేపు మన బిడ్డలు మన మీద ఉమ్మేయక ముందే జాగ్రత్త పడుదాం.
💥భారత దేశాన్ని చేజేతులా చంపుకుంటూ
మళ్లీ సిగ్గు లేకుండా
మా దేశం గొప్పది మా సంస్కృతి గొప్పది అని ఎదవ సొల్లు చెప్తూ ఉంటాము.
🔥వేదం లేదు యోగం లేదు ధ్యానం లేదు ఆనందం లేదు ఆరోగ్యం లేదు ఆవు లేదు ఆయుర్వేదం లేదు బౌద్ధం లేదు శాంతి లేదు ప్రేమ లేదు
ధర్మం లేదు అర్ధం లేదు కామం లేదు మోక్షం లేదు
సత్యం లేదు ధర్మం లేదు సనాతన జీవన ధర్మం లేదు
భారత దేశం అంటేనే ఇవన్ని, వీటి వల్లే భారత దేశం గొప్ప దేశం అయింది
😭ఇవన్ని చంపేసి మళ్లీ భారత దేశం బతికే ఉంది అంటూ సోది మాట్లాడుతాం.
☘️గోవులున్న ఇల్లు, గ్రామం, రాష్ట్రం, దేశం సకల సౌభాగ్యాలతో విలసిల్లుతూ ఉంటుంది. 👉👉సమస్త సృష్టిలోకి పవిత్రమైన గోమాతను రక్షిద్దాము, పూజిద్దాము సకల శుభాలను పొందుదాము….
*ఓం నమో భగవతే, గోమాత్రే నమః
గోవు ను జాతీయ జంతువు గా ప్రకటించాలి
గోవు లేకుంటే నాగరికత లేదు
గోమాత ను పూజిద్దాం, రక్షిద్దాం
ఆవు ను కూడా ఆమ్మలా ప్రేమిద్దాం.*
[12/03, 10:59 am] Sriram: 🙏🙏🙏🙏🙏
ఏది వుంటే ఇంక మరేదీ అడగాల్సిన అవసరం వుండదో అది 'ఐశ్వర్యం'.
దాన్నే ఈశ్వరానుగ్రహం అంటారు.
అందుకే ఎవరినైనా దీవించినప్పుడు, సాధారణంగా,
'ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు' అనే దీవిస్తారు కానీ, వట్టి
'ధన కనక ప్రాప్తిరస్తు' అని దీవించరు.
శివుణ్ణి మనం ఏదయినా అడిగితే, మనం అడిగినది మాత్రమే వస్తుంది.
తీరా ఆ వచ్చింది మనకు కలిసి వచ్చేది కావచ్చు , కాకపోవచ్చు.
ఎందుకంటే అది మన
జీవితంలో ఇలా
జరుగుతుందని, లేక ఉపయోగ పడుతుందని గాని, మనకు తెలియక కోరినది.
అలా గాక శివుని అనుగ్రహమే వుంటే, మనకు ఏవి అవసరమో , ఏవి శుభమో , అవే మనకు సంప్రాప్తమౌతాయి.
కాబట్టి, మనం కూడా శివుణ్ణి ,ఆలాంటి అనుగ్రహాన్ని పొందగలిగే ,
శివ పాద పరమైన భక్తినే కోరుకోవాలని శంకరులు సూచిస్తున్నారు.
అయినా నిజమైన భక్తులు ,
ముక్తులు , యోగులు , ప్రాపంచిక సంబంధమైనవేమీ ఎప్పుడూ కోరుకోరు,
మనం ఏది తింటే మరణిస్తామో, దాన్ని ఆయన మనకు దూరం చేసి, తాను మ్రింగి, తనవద్దనే, కంఠంలో,
వుంచుకున్నాడు.
అంటే అది ఇంక బయటకు వచ్చి మన ప్రాణాలు తీయలేదు.
ఆయనే కనుక, ఆ సాగర మధన వేళలో, పుట్టిన గరళాన్ని స్వీకరించకుండా వుంటే , మనమే కాదు,
ఇంద్ర బ్రహ్మాది దేవతలు , యక్ష రాక్షస కిన్నెరాది జాతులతో వున్న, ఈ సమస్త విశ్వం, దాని మహోగ్రజ్వాలలకు,
మాడి, బూడిదైపోయి వుండేది.
మనం వేటిని చూడగానే భయకంపితులమౌతామో,
అటువంటి పాముల్ని తనకు ఆభరణాలుగా చేసుకుని, మనకు అభయాన్ని ప్రసాదించాడు. అంటే ఆయన వద్ద వున్న నాగుపాము మనకు అభయానికి గుర్తు.
మనకు జుగుప్సగా , అసహ్యంగా కనబడే ఏనుగు చర్మాన్ని ఆయన తనకు వస్త్రంగా చేసుకున్నాడు. అంటే ప్రపంచంలోని జుగుప్సను,అసహ్యాన్ని తానుంచుకుని, మనకు చీనీ చీనాంబరాలను ఇచ్చి అనుభవించమన్నాడు.
మనం ఎక్కడకు వెళ్ళడానికి ఇష్టపడమో, అలాంటి వల్లకాటి వద్ద తాను నివసిస్తూ, మనల్ని గ్రామాల్లో , నగరాల్లో బ్రతకమన్నాడు.
అంతేకాదు ఆ స్మశానంకి వచ్చే ప్రతి జీవిని కొంత కాలం తన పొట్టలో పెట్టుకుని , మళ్ళీ
పునరుజ్జీవుతుణ్ణి చేస్తున్నాడు. " అసలు ఇటువంటి భగవంతుడు ఒకడున్నాడని తెలియకుండానే మనం బ్రతుకులు వెళ్ళమారుస్తున్నాము. ఇది మరీ విచారించతగ్గ విషయం.
🙏🙏🙏🙏🙏
[12/03, 10:59 am] Sriram: 🙏🙏🙏🙏🙏
🌻🌼🌹☘️🌻
పూర్వ కాలంలో దేవాలయములు నిర్మించేటప్పుడు ఒక ప్రేత్యేకత కలిగి ఉండేటట్టు నిర్మించినారు. ఒక్కొక్క దేవాలయానికీ ఒక్కొక్క ప్రత్యేకత వుండేది.
ఉదాహరణకు కొన్ని :
1. ఉత్సవ విగ్రహం లేకుండా మూల విగ్రహమే మాడవీధులలోనికి వచ్చేది చిదంబరం నటరాజ స్వామి.
2. కుంభకోణంలో ఐరావతేశ్వర స్వామి కోవెల తారాశురం అనే గ్రామంలో వుంది. అక్కడ శిల్పకళా చాతుర్యం చాల అద్భుతంగా చెక్కబడి వుంది. ఒక స్తంభము నుంచి చూస్తే వాలి సుగ్రీవుల యుద్ధం మాత్రమె తెలుస్తుంది. కొంచెం దూరంలో ఇంకొక స్తంభములో రాముడు ధనుర్దారిగా ఉండేటట్టు చెక్కబడి వుంది.
ఇందులో గొప్ప ఏమిటి అంటే మొదటి స్థంభము దగ్గర నుండీ... అంటే వాలి, సుగ్రీవుడు యుద్ధం చేస్తున్నట్టు చెక్కబడిన స్తంభం దగ్గర నుంచీ చూస్తే శ్రీ రాముడు (ధనుర్దారిగా చెక్కబడిన స్తంభం) కనపడడు కాని రెండవ స్తంభము, అంటే శ్రీ రాముడు ధనుర్దారిగా వున్న స్తంభం దగ్గర నుంచి చూస్తే వాలి సుగ్రీవుల యుద్దము చాల బాగుగా తెలుస్తుంది. (అంతరార్ధం అర్ధమైనదనుకుంటాను)
3. ధర్మపురి (తమిళనాడు)
మల్లికార్జున స్వామి కోవెలలో నవంగా మంటపం (అంటే తొమ్మిది స్తంభముల మంటపం అన్నమాట) లో రెండు స్థంభములు భూమిపై ఆనకుండా అంతరిక్షంలో వుంటాయి.
4. కరూర్ (కోయంబత్తూర్) సమీపం లోని కుళిత్తలై అనే వూరిలో కదంబవననాధస్వామి కోవెలలో రెండు నటరాజ విగ్రములు ఒక మంటపములో ప్రతిష్ఠ గావింపబడి వున్నాయి.
5. గరుడుడు నాలుగు కరములతో అందులో రెంటిలో శంఖ చక్రములతో దర్శనము ఇచ్చేది కుంభకోణం పక్కన వేల్లియంగుడి అనే గ్రామ కోవెలలో.
6. కుంభకోణంలో నాచ్చియార్ కోవిల్ అనే స్థలంలో విష్ణు గుడి వుంది.
అక్కడ గరుడ వాహనం రాతితో చేసినది. స్వామి సన్నిధిలో వున్నప్పుడు, ఆ గరుడ వాహనం బరువు, నలుగురు మోసే బరువు వుంటుంది క్రమంగా ఒక్కొక్క ప్రాకారం దాటి బయటికి తీసుకు వస్తుంటే, బరువు పెరుగుతూ, రాను రాను ఎనిమిది మంది ... పదహారు మంది... ముప్పైరెండు మంది ... బయట వీదిలోకి వచ్చేటప్పటికి అరువదినాలుగు మంది మోసేంత బరువు అయిపోతుంది. తిరిగి స్వామి గుడిలోనికి తీసుకువెళ్తున్నప్పుడు అదేవిధముగా బరువు తగ్గిపోతూ వుంటుంది. ఇక బయట వీధికి వచ్చేటప్పటికి గరుడ విగ్రహమునకు చెమట పట్టడం ఇంకా విచిత్రం.
7. చెన్నై సమీపంలో శ్రీ పెరుంబుదూర్ అనే స్థలములో రామానుజుల కోవెల వుంది అక్కడ మూల స్థానంలో ఉన్నటువంటి విగ్రహం శిల కాదు ... పంచలోహ విగ్రహమూ కాదు కేవలం కుకుమపూవు, పచ్చ కర్పూరం మూలికలతో చేసినది.
8. తిరునెల్వేలి కడయం మార్గములో నిత్యకల్యాణి సమేత విశ్వనాథ స్వామి కోవెలలో స్థల వృక్షం ఒక మారేడు చెట్టు. మారేడు కాయలు ఎలా ఉంటాయో మనకి తెలుసు... కానీ ఆ చెట్టుకి కాచే కాయలు లింగాకారంలో ఉంటాయి.
9. కుంభకోణం సమీపంలో తిరునల్లూరు అనే స్థలంలో ఈశ్వరుడి గుడి వుంది అక్కడ శివలింగం రోజుకు ఐదు వర్ణములుగా మారుతూ వుంటుంది. అందుకే ఆ కోవేలని పంచ వర్నేస్వరుడి కోవెల అని పిలుస్తారు
10. విరుదునగర్ పక్కన చొక్కనాధన్పుదూర్ అనే ఊరిలోని తవ(తపస్)నందీశ్వరుడి కోవెలలో నందికి కొమ్ములు, చెవులు, వుండవు.
11. ఆంధ్రప్రదేశ్ సామర్లకోటలో మూడువీదుల సంగమములో ఒక పెద్ద ఆంజనేయ విగ్రహం వుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆంజనేయ విగ్రహం కనులు, భద్రాచల శ్రీ రామ సన్నిధిలో వున్న శ్రీ రాముడి పాదములు ఒకే ఎత్తులో వుండడం.
12. వేలూర్ సమీపంలో విరించిపురం అనే వూరి కోవెలలో ఒక స్థంభములో అర్ధ చంద్రాకారముగా ఒకటి నుండి ఆరు వరకు, ఆరు నుండి పండ్రెండు వరకు అంకెలు చెక్కబడి వున్నాయి. పైన వుండే పల్లమునుడి మనము ఒక పుల్లను పెడితే నీడ ఏ అంకెపై పడుతుందో అదే అప్పటి సమయం.
13. చెన్నైనుంచి తిరుపతి వెళ్ళే దారిలో నాగలాపురం వద్ద వేదనారాయణస్వామి కోవెలలో మూలవిగ్రహం శిరస్సు నుంచి నడుము వరకు మానవ ఆకారంతోనూ... నడుము నుంచి పాదముల వరకు మత్స్య ఆకారంలో వుంటుంది
14. ధర్మపురి (తమిళనాడు) పక్కన పదుహారు అంటే పది మైళ్ళ దూరంలో అభీష్టవరద స్వామి అనే విష్ణు గుడిలో నవగ్రహములు స్రీ రూపముతో ఉంటాయి.
ఇలా మనకు తెలియని ఎన్నో ప్రత్యేకతలు పూర్వకాలంలో ఆగమ శాస్త్ర విధానంగా కట్టిన దేవాలయాలలో వున్నాయి.
🌻☘️🌹🌼🌻
🙏🙏🙏🙏🙏
[10/03, 5:13 am] తెలుగు1: 👉తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి
https://t.me/teluguvelugu01
మనదేశంలో కాలక్షేపానికి చెప్పే కథల్లో కూడా అంతర్గతంగా అధ్యాత్మ తత్త్వం ఉంటుంది. ఉదాహరణకు.. చిన్న పిల్లలకి అన్నం తినిపించేటప్పుడు, వాళ్లని నిద్రపుచ్చేటప్పుడు చెప్పే ఏడు చేపల కథలో ఎంతో లోతైన తత్త్వం ఉంది.
అనగా అనగా ఒక రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. ఏడుగురూ వేటకు వెళ్లారు. ఏడు చేపలు తెచ్చారు. ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. చేపా చేపా ఎందుకెండలేదు? అంటే.. గడ్డి మేటు అడ్డం వచ్చింది అంది. గడ్డిమేటా గడ్డి మేటా ఎందుకడ్డం వచ్చావు అంటే.. ఆవు మెయ్యలేదంది. ఆవా ఆవా ఎందుకు మెయ్యలేదు అంటే.. గొల్లవాడు మేపలేదంది. గొల్లవాడా గొల్లవాడా ఎందుకు మేపలేదంటే.. అమ్మ అన్నం పెట్టలేదన్నాడు. అమ్మా అమ్మా ఎందుకు అన్నం పెట్టలేదంటే.. పిల్లవాడు ఏడ్చాడు అంది. పిల్లవాడా పిల్లవాడా ఎందుకేడ్చావంటే.. చీమకుట్టింది అన్నాడు. చీమా చీమా ఎందుకు కుట్టావు? అంటే.. నా బంగారు పుట్టలో వేలుపెడితే కుట్టనా అందా చీమ. ఇదీ స్థూలంగా కథ. ఇందులో ఉండే అంతరార్థం తెలియాలంటే స్థూలంగా చూస్తే కనబడని చిక్కుముడి విప్పాలి. కథానిర్మాణంలో ఎక్కడో ఏదో లోపమో, అనౌచిత్యమో ఉంటుంది. అక్కడ ఆగి సూక్ష్మ దృష్టితో చూస్తే ఆ చిక్కుముడి విడిపోతుంది. రాజుగారికి కొడుకులుండడం, వాళ్లు వేటకు వెళ్లడం మామూలు విషయమే కానీ.. రాజుగారి కుమారులు వేటకెళ్లి చేపలు తేవడమేమిటి? రాజకుమారులు వేటకు వెళితే సింహాన్నో, పులినో వేటాడి తెస్తారు. అవి దొరక్కపోతే ఒక లేడినైనా తెస్తారు. కానీ చేప నెందుకు తెస్తారు? కథలో కీలకం అంతా అక్కడే ఉంది.
నిజానికి తెచ్చినవి చేపలు కావన్నమాట. మరేమయ్యుంటాయి? అని ఆలోచిస్తే ఎవరో ఒకరికి తోచకపోదు. ఏడు చేపల్లో ఎండిన ఆరు చేపలే అరిషడ్వర్గాలు (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు). ఎండని ఏడవ చేపే ఈ ఆరింటికీ పుట్టినిల్లయిన మనస్సు.
ఈ దృష్టితో కథ అంతటినీ మరో సారి తరచిచూస్తే అనర్ఘరత్నాలన్ని గనిలోంచి తమంతతామే బయటకు వస్తాయి. చేప ఎండకపోవడం అంటే మనస్సు నశించకపోవడం. గడ్డి మేటు అడ్డం వచ్చింది అంటే అజ్ఞానం గడ్డిమేటులా పేరుకుపోయిందని. గడ్డిమేటుని ఆవు మెయ్యలేదు అంటే జ్ఞానం అజ్ఞానాన్ని నశింపజేయ్యలేదు అని! గొల్లవాడు మేపలేదు అంటే.. ఏ గురువూ జ్ఞానోపదేశం చెయ్యలేదు అని(జగద్గురువు శ్రీకృష్ణుడు గొల్లవాడే కదా). అమ్మ అన్నం పెట్టలేదు అంటే.. మనకు జ్ఞానోపదేశం చెయ్యాల్సిందిగా అమ్మవారు ఏ గురువుకూ చెప్పలేదని! పిల్లవాడు ఏడ్చాడు అంటే.. ఇంకో భక్తుడు మనకంటే ఎక్కువగా భగవత్ సాక్షాత్కారం కోసం తపిస్తున్నాడని. చీమ కుట్టింది అంటే.. సంసారతాపత్రయం అనే విషపు పురుగు కాటేసిందని. బంగారుపుట్టలో వేలు పెట్టడం అంటే సంసారం మట్టిపుట్టే అని తెలిసి కూడా బంగారు పుట్ట అని భ్రమించి అందులో ప్రవేశించామని. ఇదీ కథలో అంతరార్థం. ఇంతటి గొప్ప కథని కాలక్షేపం కథగానో, ‘పనెందుకు చెడి పోయింది?’ అంటే ఎవరిమీదో వంకపెట్టి తప్పించుకోడానికి ఉపయోగించే కథగానో భావించడం ఎంత పొరపాటు!!
[10/03, 5:13 am] తెలుగు1: 👉తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి
https://t.me/teluguvelugu01
*ఎవరు తీసిన గోతిలో*...
✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు
భక్త తుకారాం పాండురంగడి భక్తుడు. నిరంతరం దైవ నామ స్మరణలో గడిపేవాడు. దేవుణ్ణి కీర్తిస్తూ అభంగాలు రచించి గానం చేసేవాడు.
తుకారాం భక్తి ప్రపత్తులకు ఆకర్షితుడయ్యాడు ఆ వూళ్ళోని ఒక భక్తుడు. అతడు తరచుగా భక్త తుకారాంని ఇంటికి ఆహ్వానించి అతనితో ఆధ్యాత్మిక విషయాలు చర్చించేవాడు.
అలా తుకారాం వచ్చి భర్తను కలవడం భక్తుని భార్యకు నచ్చేది కాదు. తన భర్త తుకారాంని కలవడం వల్ల ఆధ్యాత్మికంగా ఆలోచిస్తూ తనను పట్టించుకోటం లేదని బాధపడేది. కొన్నాళ్ళకు ఆ బాధ కాస్తా కోపంగా మారింది. భక్త తుకారాం మీద పగ తీర్చుకోవాలన్నంత కసి పెరిగింది ఆమెలో.
ఒక రోజు ఆ భక్తుని ఇంటికి వెళ్ళాడు తుకారాం. వారిద్దరూ ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతుండగా భక్తుడి భార్యకు మనసులో అప్పటికే ఉన్న కోపం తారాస్థాయికి చేరుకుంది.
ఎలాగైనా తుకారాంని తమ ఇంటికి రాకుండా చేయాలన్న ఉద్దేశంతో ఒక గిన్నెలో నీరు నింపి పొయ్యి మీద బాగా మరిగించింది. ఆ వేడి నీరుని తుకారాం కాళ్ళ మీద పోసినట్టయితే తన పగ చల్లారుతుందని తరువాత నుండి తుకారాం బాధ తప్పి పోతుందని అనుకుందామె.
వేడి నీరున్న గిన్నెను గుడ్డతో పట్టుకుని వంటగది నుండి బయటకు వచ్చి నడుస్తుండగా అనుకోని విధంగా ఆమె కాలు జారి క్రింద పడింది. మరుక్షణం గిన్నె లోని వేడినీరు ఆమె ఒంటి మీదనే చిలికి ఒళ్ళంతా బొబ్బలెక్కాయి. బొబ్బల బాధను తట్టుకోలేక పెద్దగా కేకలు వేస్తూ అరిచింది భక్తుని భార్య.
భార్యకు ఏమైందోనని భక్తుడు ఆందోళన చెందుతుండగా అతడితో బాటూ తుకారాం కూడ లోపలకు వెళ్ళాడు. అక్కడ భక్తుడి భార్య బాధతో గిలగిలా కొట్టుకుంటోంది. ఆమెకు జరిగిన ప్రమాదం చూసి చలించిపోయాడు తుకారాం. భగవంతుని స్మరిస్తూ ఆమె శరీరం మీద స్పృశించాడు. తుకారాం చేయి ఆమెను తాకగానే ఆమె బాధ మటుమాయమై పోయింది. అంతే కాకుండా కాలిన బొబ్బలన్నీ మాయమై పోయాయి.
తాను చేసిన తప్పుకు కుమిలిపోతూ భక్త తుకారాం పాదాలపై పడి క్షమించమని వేడుకుంది . విశాల హృదయం గల తుకారాం ఆమెను క్షమించాడు. తనను పాండురంగడే కాపాడాడని తుకారాం మనసులోనే దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు.
ఎవరు తీసిన గోతిలో వారే పడతారని తెలుసుకున్న భక్తుని భార్య తుకారాంని గౌరవించడం నేర్చుకుంది. తరువాత నుండి భర్తను తుకారంతో వెళ్లేందుకు ప్రోత్సహించింది.
[11/03, 7:39 am] తెలుగు1: *శివ'' అంటే "శివుడు - "రాత్రి'' అంటే "పార్వతీదేవి*
👉తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి
https://t.me/teluguvelugu01
శివరాత్రి .."శివ'' అంటే "శివుడు;; - "రాత్రి'' అంటే "పార్వతి''
వీరిద్దరికీ వివాహమైన రాత్రే "శివరాత్రి''. వీరికి పూర్వం వివాహమైన దంపతులు.. పురాణాలలో కనిపించరు.
అందుకే పార్వతీపరమేశ్వరులను "ఆదిదంపతులు'' అన్నారు. వీరి కళ్యాణం, జగత్కల్యాణానికినాంది అయినది కనుకనే "శివరాత్రి'' విశ్వానికంతటికీ పర్వదినం అయింది.
అంతేకాదు, తమలో ఎవరు గొప్ప అనే విషయంలో బ్రహ్మ, విష్ణువులకు మధ్య వాగ్వివాదం జరిగినప్పుడు, పరమేశ్వరుడు తేజోలింగముగా ఉద్భవించి, వారికి జ్ఞానోపదేశం చేసినది ఈ "శివరాత్రి'' నాడే. అందుకే మాఘబహుళ చతుర్దశి తిథినాడు అర్థరాత్రి సమయాన్ని "లింగోద్భవ'' కాలంగా భావించి శివరాధనలు, శివార్చనలు చేయడం ఆచారమైంది.
ఈ శివరాత్రి పర్వదినంనాడే "శివపార్వతులకు'' కళ్యాణం చేసి ఆనందించడం అలవాటైపోయింది.అభిషేకం ఎందుకు చేయాలి ?"అభిషేక ప్రియం శివః'' అన్నారు. శివుడు అభిషేకప్రియుడు.నిర్మలమైన నీటితో అభిషేకమంటే శివునకు చాలా యిష్టం.
ఇందులో అంతరార్థం ఏమిటంటే -"నీరము'' అంటే "నీరు'' నీరమునకు ఆధారుడు కనుకనే శ్రీమహావిష్ణువును "నారాయణుడు'' అన్నారు. నీరు సాక్షాత్తు విష్ణుస్వరూపం. అందుకే శివునకు "నీరు'' అంటే చాలా యిష్టం.
అందుకే శివునికి జలాభిషేకంచేస్తున్నప్పుడు ఆ నీటిస్పర్శతో నారాయణ స్పర్శానుభూతితో
"శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్ విష్ణోశ్చ హృదయం శివః''
శివునకు అభిషేకం చేసే ప్రక్రియలో క్షీరాభిషేకమనీ, గందాభిషేకమనీ, తేనెతో అభిషేకమనీ ... చాలా రకాల అభిషేకాలు చోటు చేసుకున్నాయి. కానీ ఈ అభిషేకాలన్నింటికన్న "జలాభిషేకం'' అంటేనే శివునకు ప్రీతికరం.
అందులోనూ "గంగాజలాభిషేకం'' అంటే మహా యిష్టం. ఎందుకంటే "గంగ'' "విష్ణుపాదోద్భవ'' విష్ణు పాదజలమైన గంగ అంటే శివునకు ఆనందకరం, అందుకే శివుడు, గంగను తన శిరసున ధరించి గౌరవించాడు.
ఆ తర్వాత శివుడు ఇష్టపడే అభిషేకం "చితాభాస్మాభిషేకం'' ఎందుకంటే ఆయన "చితాభస్మాంగదేవుడు'' కదా! ఈ అభిషేకం, ఉజ్జయినిలో "మహాకాలేశ్వరునికి'' ప్రతినిత్యం ప్రాతఃకాలంలో తొలి అభిషేకంగా జరుగుతుంది.
ఏది ఏమయినా, శివాభిషేకం ... సంతతధారగా జలంతో అభిషేకించడమే ఉత్తమం ...ఎందుకంటే"జలధార శివః ప్రియః'' అన్నారు కదా! ఈ అభిషేకాన్ని "రుద్రైకాదశిని'' అనబడే నమక, చమకాలతో చేయాలి. అనంతరం మారేడుదళాలతో, తుమ్మిపూలతో అర్చించాలి.
నమకంలోని "నమశ్శివాయ'' అను పంచాక్షరీ మంత్రంలో"శివ'' అనే రెండు అక్షరాలు "జీవాత్మ'' అనే హంసకు రెండు రెక్కలవంటివి. జీవుని తరింపజేయడానికి"శివాభిషేకం'' అత్యంత ఉత్తమైన సులభమార్గమని, "వాయుపురాణం'' చెబుతుంది.
"వేదేషు శతరుద్రీయం, దేవతాను మహేశ్వరః'' అనునది సూక్తి. దేవతలలో మహేశ్వరుడు ఎంత గొప్పవాడో, వేదాలలో శతరుద్రీయం అంత గొప్పది. నమక, చమకాలు గల ఈ రుద్రంతో శివునకు అభిషేకం చేస్తే, సంతాన రాహిత్య దోషాలు, గ్రహబాధలు తొలగిపోతాయని ఆవస్తంబు ఋషి చెప్పాడు.
అందుకే, శివుని ప్రతినిత్యం అభిషేకించాలి. అలా ప్రతినిత్యం అభిషేకం చెయ్యడం కుదరని వారు ఈ మహాశివరాత్రి నాడయినా భక్తిగా అభిషేకిస్తే అనంతపుణ్యం పొందుతారు.
"శివరత్రౌ అహోరాత్రం నిరాహారో జితేంద్రియ: |ఆర్చయేద్వా యధాన్యాయం యధాబలమ చకం ||యత్ఫలం మమమ పూజాయాం వర్షమేకం నిరంతరం |తత్ఫలం లభతే సద్యః శివరాత్రౌ మదర్చానాత్ ||
శివరాత్రినాడు పగలు, రాత్రి ఉపవాసముండి, ఇంద్రియనిగ్రహంతో శక్తివంచన లేకుండా, శాస్త్రం చెప్పిన విధంగా నన్ను అర్చించినవారికి, సంవత్సరమంతా నన్ను అర్చించిన ఫలం ఒక్క "శివరాత్రి'' అర్చనవలన లభిస్తుందని'' "శివపురాణంలో సాక్షాత్తు శివుడే దేవతలకు చెప్పాడు.
శివరాత్రికి ముందురోజున, అనగా మాఘబహుళ త్రయోదశినాడు ఏకభుక్తం చేసి, ఆ రాత్రి శివాలయ ప్రాంగణంలో నిదురించాలి. మరునాడు "మాఘబహుళ చతుర్దశి'' శివరాత్రి పర్వదినం కనుక, ప్రాతఃకాలాన్నేలేచి, స్నానాదికాలు పూర్తిగావించుకుని, శివాలయానికి వెళ్ళి ఆ రోజు మొత్తం శివుని అభిషేకించాలి. రాత్రంతా జాగరణ చేస్తూ, శివుని అర్చించాలి. లింగోద్భవకాలంలోఅభిషేకం తప్పనిసరిగా చేయాలి.
తరువాత శివపార్వతులకు కళ్యాణం చేసి, చతుర్దశి ఘడియలు పోకుండా అన్నసమారాధన చేయాలి. నమక, చమకాలతో అభిషేకం చేయలేనివారు,
"ఓం నమశ్శివాయ'' అనే మంత్రాని పఠిస్తూ చేసినా అదే ఫలాన్ని అనుగ్రహిస్తాడు సాంబశివుడు.
బిల్వపత్రాల విశిష్టత.
శివపూజకు బిల్వపత్రాలు [మారేడుదళాలు] సర్వశ్రేష్టమైనవి. మారేడువనం కాశీక్షేత్రంతో సమానం ... అని శాస్త్రప్రమాణం.
మారేడుదళాలతో శివార్చన చేయడంవల్ల కాశీక్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసిన ఫలం లభిస్తుంది.
సాలగ్రామ దానఫలం,శత అశ్వమేధయాగాలు చేసిన ఫలం,
వేయి అన్నదానాలు చేసిన ఫలం, కోటి కన్యాదానాలు చేసిన ఫలంతో సమానం, ఒక బిల్వాదళంతో శివార్చన చేయడం వలన లభిస్తుంది అని"బిల్వాష్టకం''లో చెప్పబడింది.
"ఏకబిల్వం శివార్పణం'' అని శివుని అర్చిస్తే, అనేక జన్మల పాపాలు నశిస్తాయి.బిల్వదళంలోని మూడు ఆకులూ, సత్త్వ, రజ, స్తమోగుణాలకూ, శివుని త్రినేత్రాలకూ, త్రిశూలానికి ప్రతీకలు. ఆ మూడు ఆకులే త్రిమూర్తులు. బిల్వాదళం ముందు భాగంలో అమృతం, వెనుక భాగంలో యక్షులు ఉంటారు కనుక. బిల్వాదళం ముందు భాగాన్ని శివునకు చూపిస్తూ పూజించాలి.
ఒకసారి కోసిన బిల్వదళాలు 15 రోజుల వరకూ పూజార్హతను కలిగి ఉంటాయి. ఆలోపు ఆ బిల్వదళాలు వాడినా దోషం లేదు. కానీ, మూడు దళాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి.
జాగరణ ఎందుకు చేయాలి..
క్షీరసాగర మధన సమయంలో జనించిన హాలాహలాన్ని భక్షించిన శివుడు ... మైకంతో నిద్రలోకి జారుకుని ఎక్కడ మరణిస్తాడో ... అన్న భయంతో సకలదేవ, రాక్షస గణాలూ, శివునకు నిద్రరాకుండా ఉండాలనీ తెల్లార్లూ శివసంకీర్తనం చేస్తూ జాగరణం చేసారట. ఆ జాగరణే "శివరాత్రి''నాడు భక్తులు ఆచారమైంది.
"జాగరణ'' అంటే నిద్రపోకుండా సినిమాలు చూస్తూ, గడపడం కాదు. జాగరూకతో శివుని భక్తిగా అర్చించడం.శివుడు నిరాడంబరుడు శివుడు నిర్మల హృదయుడు. శుద్ధ స్ఫటిక మనస్కుడు. అందుకు నిదర్శనగా స్ఫటిక మాలలు, రుద్రాక్షమాలలూ ధరిస్తాడు.
మహాదేవుడు ఎంతటి నిరాడంబరుడో ఆయన ఆకృతే చెబుతుంది. శరీర వ్యామోహం లేని వాడు కనుకే, తైల సంస్కారంలేని జటాజూటంతో, చితాభస్మాన్ని పూసుకుని, గజచర్మాన్ని ధరించి, పాములను మాలలుగా వేసుకుని నిగర్విగా తిరుగుతాడు.
ఆయన జీవనవృత్తి భిక్షాటనం. అందుకనే ఆయనను "ఆదిభిక్షువు'' అన్నారు. ఆయన భుజించే భోజనపాత్ర కపాలము. ఆయన నివాసస్థానము శ్మశానం. ఇంతటి నిరాడంబర దేవుడు మనకు ఎక్కడాకనిపించడు.
ఈ "నిర్జనుడు'' మనకేం వరాలిస్తాడో సందేహం మనకు అనవసరం. ఈశ్వరుడు ఐశ్వర్యప్రదాత.ఈశ్వర భక్తుడైన "రావణుడు'' ఎంతటి మహాదైశ్వర్య సంపన్నుడో మనకందరకూ తెలిసినదే.
బ్రాహ్మణ వంశంలో జన్మించి, వేదాలు అభ్యసించి చెయ్యరాని పాపాలు చేసినా, మహాశివరాత్రినాడు తనకు తెలియకుండానే జాగరణ చేసి, శివపూజ చేసి, శివప్రసాదం తిన్న "గుణనిధి'' మరణానంతరం శివసాన్నిధ్యం పొందాడు.
అతడే మరుజన్మలో ధనాధిపతి అయిన కుబేెరుడుగా జన్మించి ఉత్తర దిక్పాలకుడయ్యాడు. అదే"శివరాత్రి'' మహత్యం.
రావణసంహారం చేసిన శ్రీరాముడు, బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకోవడానికి సాగరతీరంలో "సైకతలింగ'' ప్రతిష్ఠచేసి పాపవిముక్తుడు అయ్యాడు. ఆ క్షేత్రమే "రామేశ్వరం''.
శివుని శరణుకోరి, మార్కండేయ, యమపాశ బంధవిముక్తుడై చిరంజీవి అయ్యాడు. శివునికి తన నేత్రాలతో అర్చించిన "తిన్నడు'' భక్తకన్నప్పగా వాసికెక్కాడు.
ఇలా చెబుతూ పొతే ఎందరోమహాభక్తుల చరిత్రలు మనకు దృష్టాంతాలుగా కనిపిస్తాయి. అట్టి నిరాకార, నిర్గుణ, నిరాడంబర, నిగర్వి అయిన ఆ "నిటలేక్షుని; ప్రేమానురాగాలు అనంతం. ఎల్లలులేనిది ఆయన మమకారం. "శివా''అని ఆర్తిగా పిలిస్తే, చెంతనుండే ఆశ్రిత వత్సలుడాయన.
దేహం నుండి జీవం పోయి, పరలోకానికి పయనమయ్యే వేళ, ఆ పార్థివదేహం వెంట కన్నీళ్ళతో భార్య గుమ్మంవరకే వస్తుంది. బిడ్డలు, బంధువులు మరుభూమి వరకూ వస్తారు. ఆ తర్వాత, వెంట ఎవరూ రారు. కపాలమోక్షం కాగానే, అందరూ ఋణం తీరిపోయిందని వెళ్ళిపోతారు.
దిక్కులేక అనాథకాష్టంలా కాలుతున్న ఆ కాష్టం దగ్గర... "నీకు నేనున్నారురా దిక్కు'' అంటూ త్రిశూలపాణియై తోడుగా నిలబడే దేవదేవుడు "శివుడు'' ఒక్కడే. పంచభూత్మికమైన పార్థివదేహం చితాభస్మంగా మారే వరకూ సాక్షిభూతుడుగా నిలబడే భూతగణాధిపతి ... ఆ పరమేశ్వరుడు ఒక్కడే..
ఇది చాలదా మన జన్మకు? ఏమిస్తే ఆ సదాశివుని ఋణం తీరుతుంది.?- భక్తిగా ఓ గుక్కెడు నీళ్ళతో అభిషేకించడం తప్ప.- ప్రేమగా ఓ మారేడు దళం సమర్పించడం తప్ప. తృప్తిగా "నమశ్శివాయ'' అంటూ నమస్కరించడం తప్ప.
అందుకే "మహాశివరాత్రి''నాడైనా మహాదేవుని స్మరిద్దాం. మోక్షసామ్రాజ్యాన్ని అందుకుందాం
"ఈశానస్సర్వ విద్యానాం - ఈశ్వర స్సర్వభూతానాం - బ్రహ్మాధిపతిర్ |బ్రాహ్మణాధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు.
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర..
*తెలుగు వెలుగు మిత్రులకు శివరాత్రి శుభాకాంక్షలు*
🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏
[11/03, 7:39 am] తెలుగు1: 👉తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి
https://t.me/teluguvelugu01
ఒక ముని ప్రశాంతంగా ధ్యానం చేసుకుందామని ఒక చిన్న పడవను తీసుకుని, తన ఆశ్రమానికి దూరంగా వెళ్ళి, సరస్సు మధ్యలో ఆపి, ధ్యానంలో నిమగ్నమౌతాడు.
నిరాటంకంగా కొన్ని గంటల పాటు ధ్యానం చేసిన తర్వాత, తన పడవను మరొక పడవ ఢీకొట్టడంతో, ధ్యానానికి భంగం కలిగేసరికి, అతనిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.
తన ధ్యానానికి భంగం కలిగించిన వాడిని శపించాలన్నంత కోపంతో కళ్ళు తెరుస్తాడు.
కానీ, అక్కడ ఒక ఖాళీ_పడవ మాత్రం ఉంటుంది. అందులో మనుష్యులు ఒక్కరూ లేకపోయే సరికి ఆశ్చర్యపోతాడు.
అది గాలువాలుకు కొట్టుకు వచ్చిందేమోనని అనుకుంటున్న క్షణంలోనే, అతనికి ఒక సత్యం గోచరిస్తుంది. ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది.
అసలు ''కోపం'' తనలోనే ఉందని, కేవలం బయట నుండి ఒక కుదుపు కారణంగానే అది బయట పడిందని గ్రహిస్తాడు.
అప్పటి నుండి, ఆ ముని తనకెవరైనా కోపం తెప్పించినా, చిరాకు కలిగించినా, 'అవతలి వ్యక్తి ఒక ఖాళీ పడవ మాత్రమే. కోపం తనలోనే ఉందన్న ఙ్ఞానాన్ని గుర్తెరిగి ఆవేశం చెందకూడదని గ్రహిస్తాడు.
అందుకే, మనం కూడా అప్పుడప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ, మనకు ఎదురయ్యే సమస్యలను ఒక సమగ్ర దృష్టితో విశ్లేషించి సమాధానం కనుక్కునే ప్రయత్నం చేయాలి.
“ఖాళీ పడవ" అనేది ఒక గొప్ప నానుడి. ఖాళీ పడవ మంచిదే. మనను మనకు పరిచయం చేస్తుంది.
No comments:
Post a Comment