Thursday, 25 March 2021

26032021

*🌹. మనలో సంతోషము ఎందుకు మాయమవుతుంది? 🌹*

*భగవంతుని స్తృతి అనగా యోగము వలన సంతోషము కలుగునట్లు మనం చేసిన పొరపాట్ల వలన సంతోషం మాయమవుతుంది.*

*ఎప్పుడైనా పనికిరాని ఆలోచనలు మనసులోకి వస్తే వెంటనే వాటిని పెద్దల ముందుగానీ, సర్వశక్తిమంతుడైన శివ పరమాత్మ ముందుగానీ ఉంచి వారి నుండి అవసరమైన సూచనలు పొంది మానసిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలి. ఇటువంటి పొరపాట్లు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకుని హృదయ భారాన్ని తగ్గించుకోవాలి.*

*గుర్తుంచుకోవలసిన మరో విషయమేమిటంటే, గడిచిన దాని గురించే ఆలోచిస్తూ, బాధ పడుతూ, దురదృష్టవశాత్తూ నేను ఇలా చేసాను. నా ఆధ్యాత్మిక స్థితి బాగాలేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు.*

*గడిచిన దాని గురించి ఒక గుణపాఠం నేర్చుకుని, ఇక మీదట మళ్ళీ ఇటువంటి పొరపాట్లు జరగకుండా దృఢ నిశ్చయంతో ముందుకు సాగాలి. అపచారం చేసాను అన్న మనోభారంలో నిరంతరం ఉండుట వలననే మన సహజత్వాన్ని కోల్పోతుంటాము.*

*ఒక లోటును సరిదిద్దుకోవడానికి దాని గురించే ఆలోచించడం కాకుండా స్వయం యొక్క ఉన్నత స్థితి గురించిన ఆలోచన అవసరం. బుద్ధిని ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంచుకుంటూ, కలవరంలో కొట్టుకుపోకుండా , ఏ వికారీ ఆలోచన ఆటంకంగా రాకుండా చూసుకోవాలి.*

*ఇటువంటి అనిశ్చితమైన సంఘటనల నుండి జాగ్రత్తగా ఉండాలంటే దివ్య స్పృతి అనే జ్యోతికి ఎప్పుడూ దివ్య జ్ఞానము అనే నూనెను అందిస్తూ ఉండాలి.*
🌹 🌹 🌹 🌹 🌹

యద్యపి బహునాధీషే
        తథాపి పఠ పుత్ర! వ్యాకరణమ్ |
    స్వజనః శ్వజనో మా భూత్
        సకలం శకలం సకృత్ శకృత్ ||

భావం: నాయనా! నీవు ఎక్కువ చదవకపోయినా పర్వాలేదు, వ్యాకరణం మాత్రం నేర్చుకో. ఎందుకంటే స్వజన (మన వాళ్ళు) అన్న శబ్దాన్ని శ్వజన (కుక్కలు) అనకుండా, సకలం (సర్వం) అన్న శబ్దాన్ని శకలం (ముక్క/లు) అని పలకకుండా, సకృత్ (ఒకసారి) అన్న శబ్దాన్ని శకృత్ (మలము) అని పలకకుండా ఉండడానికి అది ఉపయోగపడుతుంది — అని ఒక తండ్రి తన కుమారునికి చెబుతున్నాడు.
      వ్యాకరణం తెలియనివారు ఏ అక్షరం ఎలా ఉచ్చరించాలో తెలుసుకోలేరు. ఉచ్చారణ సరిగా లేకపోతే వారు తలంచిన అర్థం రాకపోగా విరుద్ధార్థం వస్తుంది - అని భావం.
 

*****

ధన్వంతరి :-

సాక్షాత్తు పురాణ విశ్వాసం దైవంగా ఆరాధించే ధన్వంతరి ఆయుర్వేద సృష్టికర్త గా మహర్షిగా ఆయన పేరు మీద ప్రాచీన భారతీయ ఆయుర్వేద విధానం ప్రపంచంలో అద్భుతమైన వైద్యశాస్త్రం గా వర్థిల్లుతోంది. సుమారు 250 రకాల వనమూలికలను , ఖనిజాలను ఔషధాలుగా వినియోగించి వైద్యశాస్త్రాన్ని సృజించిన ధన్వంతరి ఏ కాలానికి చెందిన వారో పుట్టుపూర్వోత్తరాలు పురాణంగా నిరాధారంగా ఉన్నాయి. క్రీ శ. 5 వ శతాబ్దానికి చెందిన ఆచార్య వాగ్భటుడు ధన్వంతరిని వైద్య శాస్త్ర పితామహుడిగా ప్రశంసించాడు. కాశీరాజు దివోదాసు, ఆచార్య సుశ్రుతుడికి వైద్యం భోదించారని, దివోదాసే ధన్వంతరి గా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రాచీన గ్రంథాల ఆధారంగా క్రీ. పూ. 3వ శతాబ్దానికి చెందినవాడిగా బావించబడుతోంది. రెండవ ధన్వంతరి విక్రమాదిత్యుని ఆస్థానంలోని నవరత్నాలలో ఒకనిగా తెలుస్తోంది. అసలు సిసలైన ధన్వంతరి కాశీరాజు దివోదాసు ధన్వంతరి అని భావించవలసి ఉంది. ఆచార్య సుశ్రుతుని గురువుగా ''సుశ్రుత సంహిత'' లో పేర్కొనబడింది. వేదాలలో , పురాణాలలో నిక్షిప్తమై ఉన్న ఆయుర్వేద విధానాలను ఒక శాస్త్రరూపంగా ధన్వంతరి , సుశ్రుతుని వంటి నాటి శిష్యులకు భోదించినట్లు ఆధారాలు ఉన్నాయి.

పంచభూత నిర్మితమైన మానవధేహంలోని మూలకాల సమతుల్యాన్ని కాపాడటం వలన, ఆయుర్వృద్ధి సాధించవచ్చని శాస్త్రం విశ్వసిస్తోంది. వ్యాధి లక్షణాలు, ఓషదుల ప్రభావం, మానసిక చింతన జోడించిన ఆయుర్వేదం క్రీ . శ. 900 ప్రాంతంలో పరిశోధనా బలంతో వేదవిజ్ఞానంగా గుర్థింపబడుతోంది. ధన్వంతరి సూర్య భగవానుని 16 మంది శిష్యులలో ఒకనిగా, క్షీరసాగరమధనం లో జన్మించినట్లు భాగవతం, విష్ణు, బ్రహ్మ, వైవర్త పురాణాలు పేర్కొంటున్నాయి.

ధన్వంతరి వైద్య విధానం లో 8 భాగాలు :-

👉🏿 కాయ చికిత్స :- శరీర భాగాలన్నింటికి , ప్రధానంగా ఉదరం.

👉🏿 బాల చికిత్స:- శిశు బాలారిష్టాలు రోగ నివారణ.

👉🏿 గ్రహ చికిత్స :- మానసిక రోగచికిత్స.

👉🏿 శల్యాక తంత్ర :- తంత్రం అంటే క్రియాశీలత. శరీరంలో బాహ్య అంగాలకు సంబంధించిన రోగ నిర్దారణ, ఔషద ప్రయోగ విశ్లేషణ.

👉🏿 శల్య తంత్ర:- చిన్న, మధ్య, పెద్ద శస్త్రచికిత్స కార్యశీలత.అంటే సర్జరీ.

👉🏿 విష తంత్ర :- అశ్వినీ కుమారుడు ప్రవచించిన విష శాస్త్రం మిళితం. విషాల వర్గీకరణ. ప్రపంచ దేశాలకు విషవిజ్ఞాన పునాది .

👉🏿 రసాయన తంత్ర :- వనమూలికలు తదితరాలతో రూపొందించిన రసాయనాలతో వ్యాధుల చికిత్స విశ్లేషణ.

👉🏿 వాజీకరణ తంత్ర :- నపుంసకత్వం పోగోట్టడం, పుంసత్వశక్తి పెంపొందించడం, సుఖ లైంగిక జీవితానికి సులభ చికిత్సా విధానాలు. ఆధునిక ''వయాగ్రా'' కు మించిన ఔషధాల రూపకల్పన వివరాలు .

సమస్త వైద్యవిజ్ఞానం నిక్షిప్తమైన పై ఎనిమిది అధ్యాయాలలోని జ్ఞానాన్ని నాటి చరకుడు, సుశ్రుతుడు, నేటి అత్యాధునిక శాస్త్రజ్ఞుల పరిశోధనాంశాలను జోడించి గ్రంథస్థం చేశారు. శరీరంలోని నోరు, ముక్కు , చెవి, కన్ను, మెదడు, మనసు, తల , మూత్రకోశం, ఉదరకోశం మొదలైన అవయవాలకు శస్త్రచికిత్సలు జరిపే విధానం ఒక్క ధన్వంతరి మాత్రమే వివరించాడు.

ధన్వంతరి మహార్షికి కర్ణాటకలో యలగుప్పలో ప్రాచీన ఆలయం ఉంది. మహర్షిని పూజించి , ఔషధాలు సేవిస్తే స్వస్థత చేకూరుతుంది అని విశ్వాసం.

అగ్నివేశసంహిత గ్రంథంలో ధన్వంతరి వైద్య చికిత్సకు సంబంధించిన పూర్వ, ప్రధాన, పశ్చాత్కర్మ ప్రక్రియలు ఉంటాయి. శ్లేష్మం, పిత్తం, వాయువు దోషాల స్థాయిలో రోగ నిర్దారణ చికిత్స మహర్షి ధన్వంతరి వివరించారు.

శల్యతంత్ర గ్రంథ రచన ఆధునిక సర్జరీకి పునాది.

తంత్ర శాస్త్రం లో సమస్త ఔషధ మూలాలు, మూలికలు, మొక్కల సిద్ధాంతాలు ఉన్నాయి. తాంత్రికులు సిద్దాంతాలను క్రియారూపంలోకి మలిచేవారు. రసవాదులు ( alchemist)  వైద్య సూత్రాలను ప్రచారం చేసేవారు. దీపావళి నవరాత్రులలో ఉత్తర భారతంలో ధన్వంతరి పూజలు చేస్తారు.

క్షార లవణాలను ఔషద ధాతువులుగా వినియోగించడం గురించి సుశ్రుతుడు తన గ్రం
థంలో ''కాశీరాజు దివోదాస ధన్వంతరి'' వద్ద నేర్చుకున్నట్లు తెలిపాడు.

శరీర నిర్మాణ శాస్త్రం ( అనాటమీ) పింఢోత్పత్తి శాస్త్రం , జంతు శరీరధర్మశాస్త్రం , రోగ నిదాన శాస్త్రం, వ్యాధి పుట్టుక శాస్త్రం, ఔషద విజ్ఞాన శాస్త్రం, ఇలా పలు వైద్య శాస్త్రాలకు అంకురార్పణ చేసిన మహార్షి ధన్వంతరి ప్రపంచానికి ఆరోగ్య ప్రదాతగా దైవసమాన మహాత్ముడు .

9542552784 


👉తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి
https://t.me/teluguvelugu01

గుప్త విద్య పాఠం 1

ఇతరులతో పోల్చుకున్నావంటే భయం తప్పదు . ఎలా పోల్చుకున్నా సరే. ఆదర్శప్రాయంగా, మానసికంగా, పోల్చుకున్న రీతిలో వెలుగొందాలనుకుంటే మాత్రం, నువ్వు ఏమీ కాలేవు, కాలేకపోవడం వలనే భయం పుడుతుంది. అలా కావాలనుకోవడం ఒక కోరిక; కోరిక ప్రకారం నెరవేరడం జరుగదు. పోలిక ఉన్నచోట భయం తప్పదు.

సమాజం లో మనం ఏమీకాదు అనే భయం ఒకటి ఉంటుంది. అందుచే ఏదో ఒక హోదా పొందాలనే సంతృప్తి కోసం ఆరాటపడతాం. పౌరునికి మర్యాద చూపేదిగా సమాజం తయారయ్యింది. పొజిషన్ లేనివాణ్ణి దగ్గరకు రానివ్వదు. సమాజంలో లేదా కుటుంబం లో ఒక గుర్తింపు గల వ్యక్తి గానో దేవుని కుడి ప్రక్క కూర్చునే వ్యక్తిగానో ఇతరుల దృష్టిలో పడాలి. లోపల వేదనలతో కూడిన సుడులు, చెడుతనం ఉన్నా, గొప్ప వ్యక్తి అని గుర్తింపు పొందడమనేది ఒక తృప్తి. ఏదో ఒక పదవి లేక అధికారం కలిగి, సమాజం గుర్తింపు పొందాలనుకోవడమంటె ఇతరుల్ని అదిగమించాలనే కోరిక. అది దౌర్జన్య రూపం. ఒక సాధువు సాధుత్వంలో పొజిషన్ సంపాదించాలనుకోవడం కూడా పక్షులు ముక్కుతో పొడిచినంత దౌర్జన్యం. ఈ దౌర్జన్యానికి కారణమేంటి !? భయం !

నేను ఒక రకమైన జీవితం గడుపుతూ ఉన్నా , కొన్ని నమ్మకాలు, సిద్దాంతాలు, విధి విధానాలు ఉన్నాయి. అవి నాకు మూలాలు. వాటి నుంచి పక్కకు తొలగటానికి ఇష్టం లేదు. ఎందుకు అంటే రాబోయే కొత్త విధానం ఏంటో ఎలా ఉంటుందో తెలియదు. అది అయోమయం. అంటే , ఒక నిర్దిష్ట విధానాన్ని సృష్టించుకున్న మెదడు కణాలు, తమకు నిర్థిష్టం కాని మరో విధానాన్ని సృష్టించడానికి ఇష్టపడదు . ఒక నిర్థిష్టం నుంచి అనిర్థిష్టం ంవైపుకు ఉండె చలనమే భయం .

వాస్తవ చలనంలో , వర్తమాన చలనంలో నాకేమీ భయం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు నాకేం జరగటం లేదు, నా నుండి ఎవరూ ఏమీ తిసుకొని పోవడం లేదు. కానీ మనసులోని మరింత లోపల పోర తెలిసో , తెలియకో ముందు ముందు ఏం జరగబోతోంది అన్నది లేదా గతం నుంచి ఏదో నన్ను అధిగమించి పోతుందేమోనన్న చింతనలో పడుతుంది. కనుక నేను గతం గురించి భవిష్యత్తు గురించి భయపడతాను.

రెండు సంవత్సరాల క్రితం జ్వరం వచ్చింది అనుకుందాం. భాధ పడ్డాను . అది నా స్మృతిలో ఉంది. ఆ జ్ఞాపకం ఇప్పుడు అంటుంది జాగ్రత్తగా ఉండు , మళ్లీ జబ్బు పడొద్దు, కనుక జ్ఞాపకమే ఇలా భయపెడుతుంది. నిజంగా ఇప్పుడు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు నేను బాగానే ఆరోగ్యంగానే ఉన్నాను. గతానికి చెందిన ఆలోచన, స్మృతి నుంచి పెల్లుబికిన ఆలోచన భయపడే బావన సృష్టించింది. అది నిజం కాదు. నిజం ఏమిటంటే నీవు ఇప్పుడు బాగున్నావు. మనసులో నిలిచిన జ్ఞాపకంగా నిలిచిన గతానుభవం ఆలోచనను మేల్కొలిపి జాగ్రత్తగా ఉండు అని హెచ్చరిస్తుంది . అదే భయానికి కారణం.!!!

ఉన్నది భయం అది మొత్తంగా వుంది. దాన్ని మొత్తంగా చూడటం సాధ్యమా !? ముక్క చెక్కలైన మనసు చూడగలదా !? అసలు ఆలోచనా ప్రక్రియే ప్రతిదాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. నిన్ను ప్రేమిస్తాను, నిన్ను ద్వేషిస్తాను, నువ్వు మిత్రుడివి, విరోదివి కూడా! నా దేవుడు, నీ దేవుడు ,నా దేశం, నీ దేశం , నా మతం నీ మతం , నా కులం నీ కులం - ఇదీ ఆలోచనా ధోరణి. ఇలాంటి ఆలోచన ఒకటిగా ఉన్నదాన్ని ముక్కలు ముక్కలుగా తరిగి చూస్తుంది. కనుక ఆలోచనా చలనం ఆగినప్పుడు మాత్రమే మొత్తం భయరూపాన్ని చూడటం జరుగుతుంది.

గమనించేటప్పుడు ఒకటి ఆర్థం అవుతుంది. ఈ గమనించే వాడు ఒక అభిప్రాయాల పుట్ట, జ్ఞాపకాల తుట్ట, కనున విలువలేని వాడు. అలాంటప్పుడు ఈ చూసేవాడు , చూడబడే భయానికి వేరైన వాడా !? రెండూ ఒకటే. చూడబడేదీ భయమే , చూసేవాడూ భయస్తుడే. ఇదీ అసలు వాస్తవం. దూరం నుంచి,వేరైయుండి చూసినంత కాలం భయం భయమే . కానీ భయమే తానైతే ఇద్దరి మధ్యా ఖాళీలేదు, కాలం లేదు. ఇద్దరూ ఒకటేనన్న అవగాహన కలిగిన మరుక్షణమే భయం మాయమైపోతుంది . భయంలో నీవు భాగమని, భయానికి నువ్వు వేరుకాదు అని , భయమే నువ్వు అని తెలిసిన తక్షణమే వెతికేవాడూ లేడు, వెతకాల్సిన వస్తువు లేదు .

మనకు భద్రత కావాలి. ఇంట్లో బిడ్డకు మరింత భద్రత కావాలి. తల్లిదండ్రులు వాళ్ళ కోర్కెల సాధనలో , ఇంక ఇంకా అనే పెరపెరల్లో మునిగి ఉంటారు. భవంతుల్లో , రాజభవనాల్లో మరెంతో భద్రత కావాలి. భద్రత లేకపోతే మెదడు సమర్థవంతంగా ఆరోగ్యంగా పని చేయదు . మానసికంగా భద్రత చెందటం మరీ కష్టం . కనుక భద్రతను నమ్మకంలోనూ, తీర్మానంలో , సిద్దాంతంలో , అనుభవంలో , కుటుంబంలో , జాతీయతలో పొందాలని కాంక్షిస్తాం . ఆ నమ్మకం , నిర్ణయం, అనుభవం, కుటుంబం వగైరాలు మరుగవగానే భయం సాక్షాత్కారం పొందుతుంది.

ఒంటరితనం ఉందే అది ఉన్న స్థితిని పూర్తిగా అర్థం చేసుకోనివ్వదు. గతానుభవానికి సంబంధించిన శబ్దం , పదం ప్రమాదబావం కల్గిస్తుంది. దాంతో భయం ఏర్పడుతుంది. దాని నుండి పారిపోతాం. అదే మన ప్రయత్నం. ఒక మాట చెప్పగానే ముఖంలో మార్పు వస్తుంది. అద్దంలో చూసుకోవచ్చు. స్వర్గం, నరకం , దేవుడు, కమ్యూనిజం, కుటుంబం, భార్య, ఒంటరితనం- ఇలాంటి పదాలు మనమీద అసాధారణమైన ప్రభావం చూపుతాయి. మనం ఆ పదాలకు బానిసలైపోయాం. బానిసత్వానికి లోబడ్డ మనసు భయం నుంచి విముక్తి ఏనాటికి కాలేదు.

ఒంటరితనం ఉన్నంత మాత్రాన, ఆ వాస్తవం వలన భయం కలగడం లేదు. ఒంటరితనం వస్తుందన్న బావన వల్ల భయం కలుగుతోంది. వాస్తవం వలన గాక వాస్తవం కలిగించభోయే ప్రభావం వల్ల భయం కలుగుతోంది. మనసు జరగభోయేదాన్ని చూసి భయపడుతుంది. వాస్తవం గురించి కాదు. భవిష్యత్తు గురించి భయం ఉంటుంది. తెలియని దాన్ని గురించి కాక, తెలిసింది పోతుందేమోనన్న భయం ఉంది. గతం గురించి కూడా కాదు. గతం కలిగించే ప్రభావం ఎలా ఉంటుందోనని ఆలోచన వలన భయం. లోపల ఒంటరితనం , లోపల ఏమీ లేదన్న భావం భయం కలిగిస్తుంది. అప్పుడు దేన్నో ఒక దానిని ఆశ్రయించాలి. అప్పుడు బంధం ఏర్పడుతుంది. ఆ బందం సిద్దాంతం తో , లేక నమ్మకంతో ఏర్పడుతుంది. అది ఉన్నదాన్ని అవగాహనకు అడ్డు వస్తుంది.

పోగు చేసుకోవడంలో , పోగు చేసుకునే ప్రక్రియకు సంబంధించిన నమ్మకంలో భయం చేరి ఉంది. కుమారుడు చనిపోతే , పునర్జన్మలో నమ్మకం పెట్టుకుంటాం. ఎందుకు అంటే , మానసిక వేదన నుంచి ఓదార్పు కోసం. తప్పించుకోవడానికి. కానీ నమ్మక ప్రక్రియలోనే సంశయం ఉంది. బయట వస్తువులు పోగు చేసుకుని యుద్దాలు కొని తెస్తున్నాం, లోన నమ్మకాలు పోగు చేసుకుంటున్నాం, అలా భాధ కొని తెస్తున్నాం. బద్రత, బ్యాంకు ఎకౌంటు, సంతోషాలు, వగైరా వగైరా కావాలని కోరిక ఉన్నంతకాలం , మానసికంగానో లేక భౌతికంగానో ఏదో కావాలనుకున్నంత కాలం బాధ ఉండక తప్పదు. భయం నుంచి తప్పించుకోవాలని చేసే వాటిలోనే భయం , బాధ ఉన్నాయి .

ఒక ప్రత్యేక విధానంలో ఉండాలని కోరుకున్నప్పుడు భయం ప్రవేశిస్తుంది. భయం లేకుండా ఉండడమంటే ప్రత్యేక పద్ధతి అంటూ లేకుండా జీవించడమే . అయితే భయం లేకుండటానికి ఒక విధానాన్నే విధ్వంసం చేస్తాననడం కొత్త విధానం కోరుకోవడం అవుతుంది. అది మరో భయానికి కారణం. భయం పోగొట్టకోవాలని మనం చేసేది ఏదైనా భయానికి కారణం అవుతుంది.

భయం తన నుంచి తాను తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలు చూసుకుంటుంది. సామాన్యమైనది గుర్తింపు పొందడం- దేశంతో , సంఘంతో , అభిప్రాయం తో ఏకం కావడం. మత ఊరేగింపు, సైనిక కవాతు, దేశంపై దాడి ఇలాంటివి సంభవించినప్పుడు మనం ఏం చేస్తామో చూడండి. దేశానికో ఆదర్శనికో అంకితం అయిపోయినట్టు గుర్తింపు కోరతాం. ఖాద్యా బిడ్డలతో లేక గొప్ప క్రియతో గుర్తింపు పొందాలని కొందరు చూస్తారు. గుర్తింపు అంటే తనని తాను మర్చిపోవడం !!

నేను అనే చింతన నిలిచి ఉన్నంత కాలం బాధ, పోరు, భయం ఉంటాయి అయితే గొప్ప వాళ్ళతోనో గొప్ప విషయంలోనో, జీవితంలోనో సౌందర్యంతోనే సత్యంతోనే , జ్ఞానంతోనే తాత్కాలికంగా గుర్తింపు చెందితే , నేను నుంచి తప్పుకోవచ్చు. దేవునికి, కుటుంబానికి అంకితమైనా మైమరపు వస్తుంది. తాత్కాలిక తప్పించుకోవడం అవుతుంది.

గతం భద్రతతోనే జరిగింది. అనిశ్చాలున్నా నిన్న గడిచిపోయింది. ఈ రోజు పర్వాలేదు, బాగానే ఉన్నాను. రేపటి గురించి భయపడుతున్నా. రేపటి అనిశ్చియంతో కూడిన అభద్రత ద్వారా ఉండే ఉనికే భయం ! భవిష్యత్తు బాగానే ఉండవచ్చు. కానీ దానిని గురించిన ఆలోచన భయాన్ని కలిగిస్తుంది. రేపు ఏమైనా జరగవచ్చు, ఏమీ జరగకపోవచ్చు. ఎప్పుడూ భధ్రతకోరే ఆలోచన, హాఠాత్తుగా భవిష్యత్తు గురించి అనిశ్చయ భావానికి లోనయిందంటే భయం కలుగుతుంది. భగవంతుడా ఏం జరుగుతుందో అనుకుంటాం. కనుక ఆలోచన భయాన్ని పెంచి పోషిస్తుంది.

ఒక ఆదర్శాన్ని, నమ్మకాన్ని తెచ్చిపెట్టి దాని ద్వారా నిశ్చయత్వం కోరే ఆలోచన భయానికి కారణం అవుతుంది. ఆ భయం అంతా ఆలోచనా పనితనం . భయం తెలిసినదానితోనే సంబంధించి ఉంటుంది. తెలియని దాంతో కాదు.

*****

శంఖ - లిఖితులు

పూర్వం శంఖుడు లిఖితుడు అనే ఇద్దరు సోదరులు ఉండేవారు. వారు బాహుదానదీ తీరములో ఆశ్రమాలను నిర్మించుకొని తపస్సు చేయసాగినారు. ఇలా ఉండగా ఒకరోజు అన్నగారిని చూడలనిపించి లిఖితుడు శంఖుని ఆశ్రమమునకు చేరుకున్నాడు. అన్నగారు ఎక్కడో బయటికి వెళ్ళారని తెలుసుకొని ఆశ్రమములోని ఒక చెట్టునీడలో కూర్చుని దాని పండ్లలు తింటూ అన్నగారికోసం నిరీక్షించాడు. వేదవేదాంగ పారంగతుడైన శంఖుడు వచ్చి తన తమ్ముని చూసి సంతోషించాడు. ఆతడు పండ్లను ఆరగించటం చూచి “తమ్ముడూ! ఈ పండ్లు నీకెక్కడివిరా?” అని అడిగాడు. లిఖితుడు చెప్పినది విని “ప్రియసోదరా! ఇది తప్పు కదా! అజమానినైన నేను లేని సమయములో నా అనుమతిని పొందకనే ఫలములను తీసుకునుట అపరాధమని నీవెఱుగవా? మన మహారాజుగారి వద్దకు వెళ్ళి నీవు చేసిన తప్పుకి తగిన శిక్షని అనుభవించి రా!” అని అన్న అయిన శంఖుడు ఆజ్ఞాపించినాడు.
 

తండ్రి తరువాత తండ్రంతటి అన్న మాట తప్పని లిఖితుడు వెంటనే సుద్యుమ్న మహారాజు వద్దకు పరుగెట్టాడు. మునీంద్రుడు వచ్చాడని తెలియగానే ధర్మాత్ముడైన సుద్యుమ్న మహారాజు ఎదురేగి అర్ఘ్యపాద్యాదులర్పించి పూజించాడు. అప్పుడు లిఖితుడు “పార్థివకులభూషణ! ఈ పూజలకు నేను అనర్హుడిని. నేను మా అన్నగారు లేని సమయములో ఆయన ఇంటికి వెళ్ళి చెట్టుకున్న పండ్లను ఆయన అనుమతి లేకుండా కోసుకొని తిన్నాను. కనుక నేను చేసిని ఈ దొంగతనానికి తగిన రీతిలో శిక్షవేసి నన్ను రక్షించు. రాజదండన పొందిన వానికి యమదండన ఉండదని మా అన్నగారు నాకు హితవు చెప్పారు” అని ప్రార్థించాడు. “తపశ్శక్తితో లోకాలకు హితవు చేసే మిమ్ము ఎట్లు శిక్షించము?” అని నచ్చచెప్పినా లిఖితుడు తన పట్టువదలలేదు.
 

చివరికి సుద్యుమ్నుడు దండనీతి శాత్రాన్ని అనుసరించి లిఖితుని చేతులు నరికించాడు. లిఖితుడు ఎంతో సంతోషించి మహారాజును మనసారా ఆశీర్వదించి అన్నగారి వద్దకు పరుగెట్టాడు. శిక్షను అనుభవించి పునీతుడై వస్తున్న తమ్ముని చూచి శంఖుడు “నాయనా! మంచి పని చేశావు. నీవంటి ఉత్తముని వలన మన వంశమంతా ఉద్ధరింపబడుతుంది.
 

మద్యపానము, గురుపత్నిని ఆశించడము, విప్రుని చంపడము, విప్రుని ధనమును అపహరించడము (లిఖితుడు తెలియక చేసిన తప్పు ఇదే) మరియు ఈ పనులను చేసేవారితో కలిసి తిరగడము ఇవ్వి పంచమహాపాతకాలు. నువ్వు తగిన రాజదండన పొంది పాప విముక్తుడవైనావు. ఈ బాహుదానదీ పుణ్యజలాలలో మునిగి దేవమునిపితృ తర్పణాలు ఇవ్వు” అని ఆజ్ఞాపించాడు. వెంటానే అన్నగారి ఆజ్ఞపాటించాడు లిఖితుడు. లిఖితుడు బాహుదా నదిలో మునక వేశాడోలేదో తన బాహువులు వచ్చేశాయి! ఆశ్చర్యచకితుడై అన్నగారికి నమస్కరించాడు. శంఖుడు “ప్రియసోదరా! నువ్వు చేసిన తప్పుకు శిక్షను అనుభవించి పునీతుడవైనావు కావున భగవంతుడు నిన్ను కరుణించినాడు. బాహుదానదీ మహాత్మ్యము నా తపశ్శక్తి ప్రభావము నీ చేతులు మొలవటానికి దోహదం చేశాయి. దండనీతిని సక్రమముగా అనుసరించి నిన్ను కాపాడిన సుద్యుమ్న మహారాజు కూడా ధన్యుడు” అని చెప్పాడు.
 

పిల్లలూ! ఈ కథలోని నీతులను మరొక్కమాఱు చూద్దాము:
1. దండనీతి యొక్క ప్రాముఖ్యత మనకీ కథ ద్వారా తెలిసినది. ఏ తప్పుకు ఏ శిక్షను అనుభవించాలో వవరించి ఈ దండనీతి శాస్త్రము మనలను యమబాధలనుండి కాపాడుతుంది.
2. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. చేసిన తప్పుకు శిక్ష ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు. ఈ విషయము తెలిసిన శంఖుడు తమ్మునిపైన అనుగ్రహముతో మహారాజువద్దకు వెళ్ళి దండన అనుభవించిరమ్మనాడు.
3. అన్నగారు చెప్పిన హితవును వెంటనే అనుసరించి లిఖితుడు తనంతట తాను రాజు వద్దకు వెళ్ళి చేసిన తప్పొక్కుకుని దండించమని ప్రార్థించినాడు. దండన అనుభవించి పునీతుడైనాడు.
4. ఈ కథలో అందఱూ తమ కర్తవ్యములను బాగా పాటించి మనకు మార్గదర్శకులైనారు. విప్రులైన శంఖలిఖితులు లోకహితార్థం తప్పస్సులు చేసుకుంటూ కాలము గడిపినారు. దండనీతికోవిదుడైన సుద్యుమ్న మహారాజు లిఖితునికి తగిన శిక్షవేశాడు. లిఖితుడు అన్నగారి మాట జవదాటలేదు. శంఖుడు తమ్ముని శ్రేయస్సునే కోరినాడు.

ఈ శంఖ లిఖితులు - ద్వాపర యుగం లో
" ధర్మశాస్త్రం " రచించారు .
 ఆయనకి చేతులు ( బాహువులు) మళ్ళీ వచ్చాయి కాబట్టి , దీనికి " బాహుదా " నది అన్న పేరు వచ్చింది .
స్థానికులు అయిన గ్రామీణులు " చేతులు ఇచ్చిన యేరు  కాబట్టి, ఈ పవిత్ర నదిని " చెయ్యి + యేరు = చెయ్యేరు ) అని పిలుస్తున్నారు .]

****

No comments:

Post a Comment