సీతాపతీ పద్య కావ్యం
రాముని దృష్టిలో జానకి
సీసము
లలిత లావణ్యమ్ము లహరిగా సాగేటి
లక్ష్య సిద్ధికి బుధ్ధి లాశ్య మయ్యె
లావణ్య సౌందర్య లోలక భావమ్మె
లచ్చిగా సాగుతూ లౌక్య మయ్యె
లమ్మతనంతోను లాలిజోలలు పాడి
లభ్య మయ్యెటి బుధ్ధి లాలిగుండె
లత్కాంచన మెరుపు లలితమ్ము లాలించె
లేమ్మా మనసు బుద్ధి లేత గుండె
తేటగీతి
నీల మేఘశ్యాముననే నెమ్మ తించి
నీదు భావమ్ము ప్రేమమ్ము నిలక డుంచి
నీ కళలతోను నిత్యము నగ్న పరిచి
నిన్ను నేకోరితి లలనా నిత్య మవ్వు
--(())--
సీసము
పూలగుభాలింపు పుడమిలో పురివిప్పి
పులకరించె లతలు ప్రాభవమ్ము
పరిమళ భరితమై పవలింపు నిలయమై
ప్రకృతిలో ఒడిలో న పరవశమ్ము
పరిణితి చెందియు ప్రతిసృష్టి కళలతో
ప్రాధమిక దశలు పుడమి నందు
ప్రాధాన్యత కలిగి ప్రాభవం పొంది యు
ప్రత్యేక ప్రేమలో పలుకు లేలు
తేటగీతి
కోటి కోరికలను తీర్చు కాలమందు
కోటి లయలతో స్త్రీ లలో కోర్క తీర్చు
కోటి వరములు తీర్చియు గొప్ప గుండు
స్త్రీ లలోసీత మనసైన ప తిగ రామ
--(())---
సీసము
గలగలమను నదీ గమనమ్ము లందునన్
గలగల శబ్ధమ్ము గాలమవ్వు
కిలకిలా రావంబు కోకిల కూతలున్
కాంతి రేఖలు వచ్చె కలల లోన
కిలకిల నవ్వులు కమలములాత్రమై
ఉదయించు చుండెను ఉరవడి మాదిరే
కౌమల మైనట్టి కన్నుల పిలుపులు
కలవర పరిచేను కాంతి చేరి
...........
నీదు నామంబునకు సాటి నొకటి లేదు
నీదు ఓర్పుఓదార్పుయు సన్నుతాంగి
నిర్మలాకార శుభకర నిగమ తాంగి
నిన్ను సేవింతు భజయింతునిపుడు రామ
****
శ్రీకృష్ణుని గురించి చి అద్భుతమైన సమాచారం
1. శ్రీకృష్ణుడు 5,252 సంవత్సరాల క్రితం జన్మించాడు
2. పుట్టిన తేది క్రీ. పూ. 18.07.3228
3. మాసం : శ్రావణం
4. తిథి: అష్టమి
5 . నక్షత్రం : రోహిణి
6. వారం : బుధవారం
7. సమయం : రాత్రి గం.00.00 ని.
8 జీవిత కాలం : 125 సంత్సరాల 8 నెలల 7 రోజులు
9. మరణం: క్రీ పూ 18.02.3102
10. శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగినది
11 కురుక్షేత్రం జరిగిన 36సం. తరువాత మరణించెను
12.
కురుక్షేత్రం క్రీ.పూ. 08.12.3139న మృగసిర శుక్ల ఏకాదశినాడు ప్రారంభమై
25.12.3139 న ముగిసినది. క్రీ.పూ 21.12.3139న 3గం. నుంచి 5గం.లవరకు
సంభవించిన సూర్య గ్రహణం జయద్రదుని మరణానికి కారణమయ్యెను.
13. భీష్ముడు క్రీ.పూ. 02.02.3138న ఉత్తరాయణంలో మొదటి ఏకాదశినాడు ప్రాణము విడిచెను.
14. శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు. అవి:
మధురలో కన్నయ్య
ఒడిశాలో జగన్నాధ్
మహారాష్ట్ర లో విఠల (విఠోబ)
రాజస్తాన్ లో శ్రీనాధుడు
గుజరాత్ లో ద్వారకాదీసుడు & రాంచ్చోడ్
ఉడిపి, కర్ణాటకలో కృష్ణ
15. జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు
16. జన్మనిచ్చిన తల్లి దేవకీ
17. పెంచిన తండ్రి నందుడు
18. పెంచిన తల్లి యశోద
19. సోదరుడు బలరాముడు
20. సోదరి సుభద్ర
21. జన్మ స్థలం మధుర
22. భార్యలు : రుక్మిణీ, సత్యభామ, జాంబవతీ, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ
23. శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం. వారు : ఛణురా - కుస్తీదారు
కంసుడు - మేనమామ
శిశుపాలుడు మరియు దంతవక్ర - అత్త కొడుకులు
24. శ్రీకృష్ణుని జీవితం కష్టాల మయం. తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు. వారిది కులాంతర వివాహం.
25.
శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు. తన జీవితం
మొత్తం లో తనకి నామకరణ జరగలేదు. గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని
పిలిచేవారు. నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నరాని శ్రీ కృష్ణుడుని
అందరూ ఆటపట్టిస్తూ, అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో
సాగింది.
26. కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనం కి మారవలసి వచ్చింది.
27.
14-16 ఏళ్ల వయసు వరకు బృందావనం లో ఉన్నాడు. తన సొంత మేనమామ కంసుడిని 14-16
వయస్సులో మధుర లో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి
కలిగించాడు.
28. తను మళ్ళీ ఏపుడూ బృందావనానికి తిరిగి రాలేదు.
29. కాలయవన అను సింధూ రాజు నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది.
30. వైనతేయ తెగకు చెందిన ఆటవికులు సహాయంతో జరాసందుడిని గోమంతక కొండ (ఇప్పటి గోవా) వద్ద ఓడించాడు.
31. శ్రీకృష్ణుడు ద్వారకాను పునర్నిర్మించారు.
32. అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16-18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమంకు తరలివెళ్ళెను.
33.
గుజరాత్ లో గల ప్రభాస అను సముద్రతీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో
యుద్ధం చేసి అపహరణకు గురి ఐన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్త ను కాపడెను.
34.
తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క
ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి
చేసెను. ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించెను.
35. పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్తాపింపజేసెను.
36. ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడెను.
37. రాజ్యము నుండి వెడలగొట్టునపుడు పాండవులకు తోడుగా నిలిచారు.
38. పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించునట్టు చేసెను.
39 ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారక నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూసేను.
40. అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించెను.
41.
శ్రీకృష్ణుడు ఎప్పుడూ అద్భుతాలు చెయ్యలేదు. అతని జీవితం విజయవంతమైనదేమీ
కాదు. జీవితములో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా
గడిపినది లేదు. జీవితపు ప్రతీ మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు.
42. జీవితములో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి / ఎవరికీ అంకితమవ్వలేదు.
అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు ఐనప్పటికీ తను ఏపుడు వర్థమానములోనే బ్రతికారు.
43. శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ.
🙏🙏🙏 జై శ్రీకృష్ణ 🙏🙏🙏
ఒక ముని ప్రశాంతంగా ధ్యానం చేసుకుందామని ఒక చిన్న పడవను తీసుకుని, తన ఆశ్రమానికి దూరంగా వెళ్ళి, సరస్సు మధ్యలో ఆపి, ధ్యానంలో నిమగ్నమౌతాడు.
నిరాటంకంగా కొన్ని గంటల పాటు ధ్యానం చేసిన తర్వాత, తన పడవను మరొక పడవ ఢీకొట్టడంతో, ధ్యానానికి భంగం కలిగేసరికి, అతనిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.
తన ధ్యానానికి భంగం కలిగించిన వాడిని శపించాలన్నంత కోపంతో కళ్ళు తెరుస్తాడు.
కానీ, అక్కడ ఒక ఖాళీ_పడవ మాత్రం ఉంటుంది. అందులో మనుష్యులు ఒక్కరూ లేకపోయే సరికి ఆశ్చర్యపోతాడు.
అది గాలువాలుకు కొట్టుకు వచ్చిందేమోనని అనుకుంటున్న క్షణంలోనే, అతనికి ఒక సత్యం గోచరిస్తుంది. ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది.
అసలు ''కోపం'' తనలోనే ఉందని, కేవలం బయట నుండి ఒక కుదుపు కారణంగానే అది బయట పడిందని గ్రహిస్తాడు.
అప్పటి నుండి, ఆ ముని తనకెవరైనా కోపం తెప్పించినా, చిరాకు కలిగించినా, 'అవతలి వ్యక్తి ఒక ఖాళీ పడవ మాత్రమే. కోపం తనలోనే ఉందన్న ఙ్ఞానాన్ని గుర్తెరిగి ఆవేశం చెందకూడదని గ్రహిస్తాడు.
అందుకే, మనం కూడా అప్పుడప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ, మనకు ఎదురయ్యే సమస్యలను ఒక సమగ్ర దృష్టితో విశ్లేషించి సమాధానం కనుక్కునే ప్రయత్నం చేయాలి.
*“ఖాళీ పడవ" అనేది ఒక గొప్ప నానుడి. ఖాళీ పడవ మంచిదే. మనను మనకు పరిచయం చేస్తుంది.*
మిత్రులకు శ్రేయోభిలాషులకు మరియు సమస్త బంధుజన పరివారానికి
*శివరాత్రి శుభాకాంక్షలు*
[10/03, 2:56 pm] +91 94404 88271: *🥥పూజలలో కొబ్బరికాయ విశిష్టత ఏమిటి.!!🥥*
🌹🌷🌺🌸🥥🌸🌺🌷🌹
మన హిందు సాంప్రదాయంలో పూజ అంటే ముందుగా కావలసినది కొబ్బరికాయ. కొబ్బరికాయ కొట్టకుండా చేసే పూజ అసలు సంతృప్తిని ఇచ్చినట్టే ఉండదు. అంతగా పూజకు కొబ్బరికాయకు మనకు ఆత్మీయత కుదిరిపోయింది. అటువంటి కొబ్బరికాయకు సంబంధించిన సందేహాలు ఇక్కడ చర్చించుకుందాము.
*🔸కొబ్బరికాయకు ఉన్న ప్రత్యేకత ఏమిటి?*
కొబ్బరికాయకు మనకు పోలిక ఉంది. కొబ్బరికాయ పైన ఉన్న దళసరి పెంకు మన అహంకారానికి, లోపలి కొబ్బరి మన మనస్సుకూ ప్రతీకలు. కొబ్బరికాయ కొట్టడమంటే మన అహంకారాన్ని విడనాడి, ఆతెల్లని కొబ్బరి లాంటి మన మనస్సును స్వామి ముందు పరచామనీ ఆ మనస్సును ( కొబ్బరిని ) స్వీకరించి నిర్మలమైన కొబ్బరి నీరు లాంటి జీవితమును ప్రసాదించమనీ అర్థం అందులో ఉంది. అందుకే కొబ్బరికాయ మన పూజలో ప్రత్యేక స్థానం సంపాదించింది.
*🔸 పీచు తీసిన కొబ్బరికాయను కొట్ట కూడదా?*
మన శరీరానికి చర్మం ఎంత అవసరమో, కొబ్బరికాయకు పీచూ అంతే అవసరము. ఈ పీచును కొట్టే ముందు తీయకూడదు. కొట్టినతరువాత తీయాలి. కొబ్బరికాయ మొదలులో ఉన్న 3 కన్నాల దగ్గరా చిప్ప కాస్త మెత్తగా ఉంటుంది. ముందరే పీచుతీయడం వలన ఆ కన్నాల ద్వారా బాక్టీరియా కాయలోనికి త్వరగా ప్రవేశించి కాయ పాడయిపోయే అవకాశం ఉంది. ( మీరు గమనించే ఉంటారు కొబ్బరి కాయ కుళ్లడం అంటూ జరిగితే అది మొదలు నుండే జరుగుతుంది. లేదా కొబ్బరికాయకు పగులు వస్తే ఆ పగులు వద్ద కుళ్లుతుంది. ) కనుక ముందు పీచుతీయకూడదు అంటారు.
*🔸 మరి కొబ్బరికాయ కొట్టిన తరువాత పీచు ఎందుకు తీయాలి?*
కొబ్బరికాయను దేమునికి ప్రసాదంగా పెడుతున్నాము. ఆ ప్రసాదంగా పెట్టే కొబ్బరికాయ బాగుందో లేదో చూచుకుని పెట్టాలి కదా!? కానీ వాసన చూడకూడదు, రుచి చూడకూడదు ( దేముని ప్రసాదం కనుక ) . మరి వాసన చూడకుండా, రుచి చూడకుండా కొబ్బరికాయ బాగుందో పాడైపోయిందో ఎలా తెలుసుకోవడం? కొన్ని సార్లు కంటికి బానే ఉన్నట్టు కనబడినా రుచి చూసిన తరువాత పాడయి పోయిందని తెలుస్తుంది. అలా పాడయి పోయిన కాయను తెలుసుకోవడం ఎలా? దానికోసమే కొబ్బరికాయ వెనకాల పీచుతీసి మూడు కన్నాల వద్ద నొక్కి చూడాలి. ఎక్కడైనా మెత్తగా నొక్కు బడితే అది పాడయి పోయిందని అర్థం. అలా నొక్కు బడక మామూలుగా ఉంటే బాగుందని. ఆవిధంగా కంటికి కనబడని కొబ్బరికాయలోని లోపాన్ని కూడా తెలుసుకోవడానికే కొబ్బరికాయ కొట్టిన తరువాత పీచు తీయాలి.
*🔸 కొబ్బరి కాయకు పసుపు కుంకుమ రాయడం సబబేనా?*
పసుపు, దాని నుండి తయారైన కుంకుమ మనకు అత్యంత పవిత్రమైనవి. వాటిని కొబ్బరికాయకు అలంకరించడం ఒకవిధంగా సబబే. అందువలన ఆ కాయచుట్టూ ఉన్న వ్యాధికారక క్రిములు నశిస్తాయి. కానీ కొబ్బరికాయను కొట్టిన తరువాత కొబ్బరిపై కుంకుమ పెడతారు. ఇది ఎంత మాత్రమూ సరిఅయినది కాదు. మనం భగవంతుడు వచ్చాడు అని నమ్మి అతనకి పూజ చేస్తాము. ఆ విధంగా మన ఇంటికి వచ్చిన భగవంతునికి షోడశోపచార పూజలో భాగంగా నైవేద్యముగా ఈ కొబ్బరిని సమర్పిస్తున్నాము.
అంటే మన ఇంటికి ఒక అథిధిని పిలిచి ఫలహారం పెట్టడం లాంటిది. మనం కొబ్బరి తింటే, లేదా వచ్చిన అథిధికి పెడితే కుంకుమా పసుపుతో ఉన్న కొబ్బరి తినం కదా!?
కుంకుమ ఉంటే కడుక్కుని మరీ తింటాము. మరి అలాంటాప్పుడు స్వామికి పెట్టే కొబ్బరి మాత్రం కుంకుమా పసుపూ చల్లి పెట్టడం తప్పేకదా !?
ఇదే కాదు మరే ప్రసాదమైనా సరే మనం ఎంత శుభ్రమైనది, నాణ్యమైనదీ తింటామో అంతే పవిత్రమైనది మాత్రమే స్వామికి నివేదించాలి.
[10/03, 2:56 pm] +91 94404 88271: _*శివరాత్రి అంటే ?శివరాత్రి పూజావిధానం ఎలా ?*_
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి. ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరీలోని శివ అనే రెండక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమ శివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్థశినాడు జరుపుకుంటాం.
*☘శివరాత్రులు ఎన్ని ?☘*
శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. ఏడాదిలో వచ్చే శివరాత్రులు మొత్తం అయిదు. అవి :
నిత్య శివరాత్రి , పక్షశివరాత్రి , మాసశివరాత్రి , మహాశివరాత్రి , యోగశివరాత్రి. వీటిలో పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి. మార్గశిరమాసంలో బహుళ చతుర్థి , అర్ద్ర నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది. శివునికి అతి ఇష్టమైన తిథి అది. అందుకే ఈరోజున శివుడ్ని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరై పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట. ఈ రోజున శివ ప్రతిష్ట చేసినా లేక శివకళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు. త్రయోదశినాడు ఒంటిపొద్దు ఉండి చతుర్థశినాడు ఉపవాసం ఉండాలి. అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్థశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైందంటారు.
లింగోద్భవ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి 180 రోజులు లెక్కిస్తే శివ రాత్రి వస్తుంది. రూపరహితుడైన శివుడు , జ్యోతిరూపంలో , లింగాకారంగా అవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవకాలం అంటారు. ఈ పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి చాలా ముఖ్యమైనది. అర్థరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయమని పురాణాలలో చెప్పారు. ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆరోజు నిద్ర పోకుండా మేల్కొని ఉపవాసముండి , మహాలింగ దర్శనం చేస్తారు. ఉపవాస దీక్ష స్త్రీలు , పురుషులు కూడా ఆచరించదగినదే. ప్రపంచమంతా శివ శక్తిమయమని తెలుసుకోవాలి. శివలింగానికి ప్రణవానికి సామ్యముందంటారు.
ఆ పంధాలో చూస్తే ఈ శివలింగం ఆరువిధాలు ఇలా ఒక్కొక్క విధానంలో ఆరేసి లింగాలు ద్వివిదా ద్వాదశలింగాలుగా చెప్పబడుతున్నప్పటికీ , శివాగమాలరీత్యా మాత్రం ఆచార గర్వాది లింగాలే సరియైనవి కనుక ఈ ఆరులింగాలనే అనుదినం ఆరాధించాలి. పరమశివుడు శివరాత్రి పర్వదినమున ఎన్నో విధాలుగా ఆలంకరింపబడతాడు. ఆ స్వరూపాలలో విభూతిధారణ ఒకటి. విభూతి అంటే ఐశ్వర్యం. అది అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు. ఈశ్వరుడు ఒంటి నిండా విభూతి అద్దుకుంటాడు. రెండవది రుద్రాక్ష. రుద్రాక్ష అంటే శివుని మూడవ కన్ను. అందరు దేవతలలో ఫాలభాగంలో కన్ను గలవాడు ఆయన ఒక్కడే.
మూడవది పంచాక్షరి జపం. పంచాక్షరీ మంత్రోపదేశం లేనివారు శివనామాం జపిస్తే చాలు. నాలుగవది మారేడు దళాలతో శివున్ని పూజించడం. శివునికి మూడు దళాలుంటాయి. అయిదవది అంతరంగంలో శివ స్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశి వాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ప్రదోష సమయంలో శివస్మరణ , శివదర్శనం విధిగా చెయ్యాలి. వేదాలన్నింటికీ తాత్పర్యం ఓంకారం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు. *‘శివ’* శబ్దాన్ని దీర్ఘంతీస్తే *‘శివా’* ఆవుతుంది. అది అమ్మవారి పేరు ఈ స్వరూప ధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు. పార్వతీపరమేశ్వరులు , సూర్యుడు , అగ్ని ఈ మూడింటిలోను శివుడుంటాడు. పరమ శాంతినిచ్చేది శివనామస్మరణమే. శివస్మరణకు అందరూ అర్హలే. పరమ శివునికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి నక్షత్రాలలో ఏకాదశి. ఈ తిథి నెలలో రెండుసార్లు వస్తుంది.
ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గర శివరాత్రి గురించి ఆడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమనీ , ఇంకేమి చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసమున్నాసరే తానెంతో సంతోషిస్తానని చెబుతాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం , ఆ రోజు పగలంతా నియమనిష్ఠతో ఉపవాసంతో గడిపి , రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో , తర్వాత పెరుగుతో , ఆ తర్వాత నేతితో , ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రహ్మవిధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు. మామూలుగానైతే ఏ మాసమైనా కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు. కానీ , ఫాల్గుణ మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్తు ఉంటుంది. అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు. మహాశివుడంటే అందరికి తెలుసు. కాని , రాత్రి అంటే ప్రత్యేకార్థము చాల మందికి తెలియదు. *“రా” అన్నది దానార్థక ధాతు నుండి “రాత్రి”* అయిందంటారు. సుఖాన్ని ప్రదానం చేసేదాన్నే రాత్రి అంటారు. ఋగ్వేద – రాత్రి సూక్తం తాలూకు యూప మంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ ఇలా చెప్పబడింది – హే రాత్రే !
అక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక !… వగైరా –
*‘ఉప మాపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్!*
*ఉష ఋణేవ యాతయ||’*
నిజంగానే రాత్రి ఆనందదాయిని అన్నింటికి ఆశ్రయం ఇవ్వగలది. అందుకే రాత్రిని ప్రశంసించటం జరిగింది. మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూటే జరుపుకుంటారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఓ ప్రత్యేకత వుంది. చతుర్దశి రోజు ఎవరైతే శివపూజను చేస్తారో , ఆ రాత్రి జాగరణ వహిస్తారో వారికి మళ్ళీ తల్లి పాలు తాగే అవసరం రాదు. అంటే ఆ భక్తుడు జీవన్ముక్తుడు అవుతాడని స్కందపురాణంలో స్పష్టంగా చెప్పబడింది. అంతటి మహిమాన్వితమైనది శివపూజ.
*‘శివంతు పూజయత్వా యోజా గర్తిచ చతుర్దిశీం!*
*మాతుః పయోధర రసం నపిబేత్ స కదాచన!!’*
అందుకేనేమో గరుడ , స్కంద , పద్మ అగ్ని మొదలైన పురాణాల్లో దీనిని ప్రశంసించడం జరిగింది. వర్ణనలలో కొంత తేడా వుండొచ్చు. ప్రముఖ విషయం ఒకటే. ఏ వ్యక్తి అయితే ఆ రోజు ఉపవాసం చేసి , బిల్వ పత్రాలతో శివపూజ చేస్తారో , రాత్రి జాగరణ చేస్తారో వారిని శివుడు నరకాన్నుండి రక్షిస్తాడు. ఆనందాన్ని , మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వ్రతం చేసే వ్యక్తి శివమయంలో లీనమైపోతాడు. దానము , తపము , యజ్ఞము , తీర్థయాత్రలు , వ్రతాలు లాంటివెన్ని కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు. మహాశివరాత్రి రోజు ఉపవాసము , జాగరణ శివపూజ ప్రధానమైంది. అసలు వీటికి తాత్విక అర్థాలెన్నో ఉన్నాయి. అసలు వ్రతం గురించి భిన్న భిన్న గ్రంథాల్లో భిన్నార్థలు గోచరిస్తున్నాయి. వైదిక సాహిత్యంలో దీని అర్థం – వేద బోధితమని , ఇష్ట ప్రాపకర్మ అని వుంది. దార్శనిక గ్రంథాల్లో *‘అభ్యుదయ ‘ మని , ‘ నిః శ్రేయస్సు ‘ కర్మ అని , అమరకోశంలో వ్రతమంటే నియమమని వుంటే పురాణాల్లొ మాత్రం ధర్మానికి పర్యాయవాచిగా ఉపయోగించబడింది. అన్నింటిని కలుపుకుంటే – వేదబోధిత అగ్నిహోత్రాది కర్మ , శాస్త్ర విహిత నియమాది , సాధారణ లేక అసాధారణ ధర్మమే వ్రతమని చెప్పవచ్చు. సులభంగా చెప్పుకోవాలంటే కర్మ ద్వారా ఇష్ట దేవుడి సామీప్యాన్ని పొందటమే అని అనవచ్చు.
మహాశివరాత్రి వ్రతం రోజు ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత నిచ్చారు. అలా అని *‘తిథితత్వం'* లో చెప్పబడింది. ఈ గ్రంథంలో భగవాన్ శంకరుడు ఇలా అన్నట్లు వుంది. – *‘ మీరు స్నానం చేసినా , మంచి వస్త్రాలు ధరించినా , ధూపాలు వెలిగించినా , పూజ చేసినా , పుష్పాలంకరణ చేసినా వీటన్నిటికంటే కూడా ఎవరైతే ఉపవాసం చేయగలరో వారంటేనే నాకిష్టం'* అంటాడు శివుడు.
*☘ఉపవాసం అంటే ఏమిటి ?☘*
దగ్గర వసించటం , నివశించటం , ఉండటాన్ని ఉపవాసమంటారు. వ్రతం చేసేవారి ఇష్టదైవం దగ్గర ఉండటమే ఉపవాసం – ఉపవాసమంటే ఇంతేనా అని పెదవి విరిచే వారికోసమే ఈ శ్లోకం.
*‘ఉప – సమీపే యో వాసః జీవాత్మ పరమాత్మనోః*
*ఉపవాసః సవిఘ్నేయ సర్వభోగ వసర్జిత్: ||’ (వరాహోపనిషత్తు)*
*భవిష్య పురాణంలో కూడా అలాగే చెప్పబడింది.*
*ఉపావృత్తస్య పాపేభ్యోయస్సు వాసో గుణైః సహా!*
*ఉపవాసః స విఘ్నేయ సర్వభోగ వివర్జిత్: ||*
మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరము. వ్రతానికి యోగ్యమైన కాలము రాత్రి. ఎందుకంటే రాత్రిపూట భూత , శక్తులు , శివుడు తిరిగే సమయమన్నమాట. చతుర్దశి రాత్రి ఆయనను పూజించాలి. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఇలా స్పష్టంగా చెప్పాడు. *‘సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రి కాలంలో మేల్కొని తిరుగుతుంటాడు. అతనిలోని ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి. అంటే భోగ , సంగ్రహంలో మునిగి ఉంటారు. తత్వాన్ని అర్థం చేసుకోగల మునులు దృష్టిలో రాత్రి అది.
*‘యానిశా సర్వ భూతానం తస్యాం జాగర్తి సమ్యమీ*
*యస్యాం జాగృతి భూతాని సానిశాపశ్యతో మునే ‘*
విషయాసక్తుడు నిద్రలో వుంటే అందులో నిగ్రహస్తుడు ప్రబుద్ధంగా ఉన్నాడు. అందువల్ల శివరాత్రి రోజు జాగరణ ముఖ్యమన్నమాట. శివునితో ఏకీకరణమవటమే నిజమైన శివ – పూజ. ఇంద్రియాభిరుచుల్ని నిరోధించి పూజించటమే శివవ్రతము.
శివరాత్రి ఎలా చేసుకోవాలంటే – గరుడ పురాణంలో ఇలా వుంది – త్రయోదశి రోజునే శివ – సన్మానము గ్రహించి , వ్రతులు కొన్ని ప్రతిబంధకాల్ని గమనించాలి. అంటే కొన్ని నియమాల్ని మనసులో నిర్ధారించుకుని పాటించాలి. మీ ప్రకటన ఇలా ఉండాలి – *‘హే మహాదేవా ! నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను. నా భక్తి సామర్ధ్యాన్ని బట్టి దాన , తప , హోమాన్ని చేయగలను. నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను. రెండవరోజు మాత్రమే తింటాను. ఆనంద , మోక్షాలను అనుగ్రహించు శివా !”*
వ్రతం చేశాక గురువు దగ్గరికి వెళ్ళాలి. పంచామృతంతో పాటు పంచగవ్యాలును (ఆంటే అయిదు విధములైన గో సంబంధిత వస్తువులు – ఆవు పేడ – ఆవు పంచకం , ఆవుపాలు , ఆవు పెరుగు , ఆవునెయ్యి) శివలింగాన్ని అభిషేకం చేయించాలి. అభిషేకం చేస్తున్న సమయంలో *‘ఓం నమః శివాయ‘* అనుకుంటూ జపించాలి. చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారాలతో పాటూ శివపూజ చేయాలి. అగ్నిలో నువ్వులు , బియ్యము , నెయ్యితో కలిపిన అన్నము వేయాలి. ఈ హోమం తర్వాత పుర్ణాహుతి నిర్వహించాలి. అందమైన శివకథలు వినవచ్చు. వ్రతలు మరోకసారి రథరాత్రి మూడవ , నాల్గవ ఝాములో ఆహుతులను సమర్పించాలి. సూర్యోదయం అయ్యేంతవరకూ మౌన పాఠం చేయదలచినవారు *‘ఓం నమః శివాయ* అంటూ భగవాన్ శివుని స్మరిస్తూ ఉండాలి. ఆయనను భక్తులు కోరుకునేది ఏమిటంటే – *'పరమాత్మా ! మీ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజ కొనసాగించి పూర్తి చేసాను. హే లోకేశ్వరా ! శివ – భవా ! నన్ను క్షమించు. ఈ రోజు నేను అర్జించిన పుణ్యమంతా , మీకు అర్పితం గావించినదంతా మీ కృపతోనే పూర్తి చేశాను. హే కృపానిధీ ! మా పట్ల ప్రసన్నులు కండి ! మీ నివాసానికి వెళ్ళండి. మీ దర్శనమాత్రము చేతనే మేము పవిత్రులం అయ్యాము.
అటు తర్వాత శివ భక్తులకు భోజనము. వస్త్ర , ఛత్రములు ఇవ్వాలి. నిజానికి లింగోద్భవమైన అర్థరాత్రి సమయం ప్రతిరోజూ వస్తుంది కనుక ప్రతిరోజూ శివరాత్రే. ప్రతిక్షణం శివస్మరణయోగ్యమే. అయితే కృష్ణపక్ష చతుర్దశి శివునికి ఇష్టమైన రోజు కనుక ప్రతినెలా వచ్చే ఆ రోజును మాసశివరాత్రి అన్నారు. అందులోనూ మాఘ బహుళ చతుర్దశి ఆయనకు మరీ మరీ ప్రీతి కనుక ఆ రోజున మహా శివరాత్రి జరుపు కుంటున్నాం. ఆ రోజు ఉదయం స్నానాదికాలం తర్వాత వీలైన శివాలయాన్ని దర్శించి , అవకాశం లేకపోతే , ఇంటివద్దే ఉమామహేశ్వరులను శివప్రీతికరమైన పువ్వులతో , బిల్వదళాలతో అర్చించాలనీ , శక్తికొలదీ పాలు , గంగోదకం , పంచామృతాదులతో లింగాభిషేకం చేయాలనీ , ఉపవాస , జాగరణ శివస్మరణలతో రోజంతా గడిపి మరునాడు ఉత్తమ విప్రులకు , శివభక్తులకు భోజనం పెట్టాలని వ్రత విధానన్ని బోధించారు.
*శివరాత్రికి లింగోద్భవకాలమని* కూడా పేరు. ఆ రోజు అర్థరాత్రి జ్యోతిర్మయమైన ఒక మహాలింగంగా శివుడు ఆవిర్భవించాడు. పరమేశ్వరుడు లోకానికి తన స్వరూప దర్శనం చేయించి జగత్తంతా దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడంలో అర్థం లేదు. అందుకే శివరాత్రి జాగరణకు అంత ప్రాధాన్యం. ఆ రోజు అభిషేకాదులతో శివుని పూజించి ఉపవాసముండి రోజంతా శివనామస్మరణంతో గడపడంలోని ఉద్దేశం మన తనువునూ , మనసునూ కూడా శివార్పితం , శివాంకితం చేయడానికే. శివమంటే జ్ఞానమే. జన్మ పరంపర శృంఖాలాలను తెంచి నిత్యానంద ప్రదమైన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికే ఉంది. శివరాత్రినాడు పధ్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు *'బిల్వ'* మూలంలో ఉంటాయనీ , శివరాత్రినాడు ఉపవసించి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది. కనీసం జన్మకొక్క శివరాత్రి అయినా చేయమని పెద్దలు చెబుతుంటారు. సమస్త ప్రాణికోటిలో సూక్ష్మజ్యోతిరూపంలో ఉండే శివుడు భూమిపై పార్థివలింగంగా ఆర్చింపబడుతుంటాడు. శివరాత్రినాడు ఫలం , ఒక తోటకూర కట్ట అయినాసరే శివార్పణం అని దానం చేయడం ముక్తిదాయకం. కలిగినవారు వారి వారి శక్తి అనుసారం బంగారం , వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి ఓ పండితునికి సమర్పిస్తే అజ్ఞానంధకారం నశిస్తుందని పెద్దలవాక్కు. శివరాత్రినాడు ఉపవసించి త్రికరణ శుద్ధిగా శివుని ఆరాధిస్తే , ఒక సంవత్సర కాలం నిత్యం శివార్చన చేసిన ఫలం కలుగుతుందని సాక్షాత్తు శంకరుడు బ్రహ్మదేవునికి చెప్పినట్లు పెద్దలవాక్కు.
*☘ప్రదక్షణ విధులు☘*
శివాలయములో ప్రవేశించిన తర్వాత నందికి ఏ ప్రక్కనుంచి లోపలకు వెళ్తారో ఆ ప్రక్కనుంచి మాత్రమే , వెనక్కి రావాలి. శివలింగం , నందీశ్వరుల మధ్య నుంచి రాకూడదు. ఇలావచ్చినా పుణ్యం రాదు సరి కదా పూర్వ జన్మలోని పుణ్యం కూడా పోతుంది.
*☘బిల్వ దళం ప్రాముఖ్యత:☘*
బిల్వం లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్టం. బిల్వ దళం మూడు అకుల్ని కలిగి ఉంటుంది. ఇందులో కుడి ఎడమలు విష్ణు , బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు. మారేడుకే శివప్రియ అని మరోపేరు ఉంది. బిల్వదళం పొరబాటున కాలికి తగిలితే ఆయష్షు క్షీణిస్తుందంటారు. ఇది శివుడి అజ్ఞ. బిల్వం ఇంటి అవరణంలోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం. తుర్పున ఉంటే సౌఖ్యం. పశ్చి మాన ఉంటే సంతానాభివృద్ధి. దక్షినాన ఆపదల నివారణ. వసంతం , గ్రీష్మంలో బిల్వంతో శివున్ని పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది.
[10/03, 2:56 pm] +91 94404 88271: *పంచ మహాపాతకాలు*
పెద్ద తప్పులు, అయిదు.శాస్త్రప్రకారం, చేయకూడని 5 అతి పెద్ద తప్పులనే మహాపాతకాలు అంటారు.వీటిని చేయడం, చేసినవారిని సమర్దించడం కూడా అంతే పాతకమును చేసినట్లు అవుతుంది.
చాల మంది, నాఅనే వాళ్ళు తప్పు చేస్తే ఒకలాగా, బయటి వాళ్ళు అంటే తెలియని వాళ్ళు తప్పు చేస్తే, ఒకలాగా స్పందిస్తారు. అంటే తెలిసినవాడు తప్పుచేస్తే మనవాడు కదా అని, ఆ తప్పును కప్పిపుచ్చడం, లేదా సమర్దించడం చేస్తారు. ఇలా సమర్దించినా లేదా తప్పు చేస్తున్నాడని తెలిసి కూడా నచ్చచెప్పకపోవడం, ఆ రెండు కూడా ఆ తప్పులో భాగస్వామ్యం ఉన్నట్లే.
అప్పుడు ఆ పాపము సమర్థించిన వారికి కూడా అంటుకుంటుంది.
ఒక తప్పును చేయడము వలన, వేలజన్మలు దాని చెడుపలితాలను అనుభవించక తప్పదు.
అవేంటో చూద్దాం,
బ్రహ్మ హత్య మహాపాతకము
సువర్ణ చౌర్య మహాపాతకము
సురాపాన మహాపాతకము
గురుపత్ని సాంగత్యం ఈ నాల్గింటిని సమర్దించడం
అయిదవ మహాపాతకం.
*బ్రహ్మ హత్యా మహాపాతకం*
బ్రాహ్మణుడు, వేదవిద్య అభ్యసించిన వారిని, పండితులను హత్యచేయటం వలన ఈ మహాపాతకం అంటుకుంటుంది.పండితులు, బ్రాహ్మణులు,
వీరు విశ్వ శ్రేయస్సు కోరేవారు, అంటే అందరి శ్రేయస్సును కోరేవారు.
అలాగే, గోవు కూడా విశ్వశ్రేయస్సు కోరి అనేకమైన దివ్యఔషద గుణాలున్న పదార్దాలను ఇవ్వడమే కాకుండా,సమస్త దేవతలు కొలువుండే గర్భగుడిగా గోవును కొలుస్తాము.అందువలన బ్రాహ్మణుడిని, పండితుడిని, గోవును హత్యచేయడం ద్వారా ఈ బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది.
*సువర్ణ చౌర్య మహాపాతకం*
బంగారమును దొంగతనము చేయడం ద్వారా ఈ పాతకం చుట్టుకుంటుంది.
సాధారణంగా దొంగతనం చేయడం పాపం అయితే,బంగారమును దొంగతనం చేయడం అత్యంత పెద్దపాపము అందుకే, దీనిని మహాపాతకములో చేర్చడం జరిగింది .
*సురాపాన మహాపాతకం*
మద్యం సేవించడం ద్వారా వచ్చే పాపాన్ని సురాపాన మహాపాతకము అంటారు.
మద్యం సేవించడం ద్వారా మందమతి అయ్యి, ఎదుట ఉన్నవారు ఆడ, మగ, చిన్న, పెద్ద, గురువూ, దైవం అనే విచక్షణ మరచి దుర్భాషలు ఆడటం,
నీవెంతటి వాడవు అనే మాటలను ఉచ్చరిస్తూ ఉంటారు.
అందుకే సురాపానం మహాపాతకము అయినది.
*గురుపత్ని సాంగత్యం మహాపాతకం*
గురువుగారి భార్యను తప్పుడు దృష్టితో చూసి, గురువుగారు, భార్య నిద్రించే మంచము పైన, ఆమెతో పాటు ఉండి సాంగత్యం చేయడం ద్వారా,
కలిగేది గురుపత్ని సాంగత్య మహాపాతకం.
*ఇక అయిదవది, పైన ఉన్న వాటిని సమర్దించడం ద్వారా వచ్చేది.*
పైన ఉన్నవాటిలో ఏ ఒక్క దానినైన చేసిన వ్యక్తిని సమర్దించడం,
లేదా చేసినవాడు, నా స్నేహితుడు, నా బందువు, నావాడు అని చెప్పినా,
ఈ అయిదవ మహాపాతకమును పొందుతాడు.పైన చెప్పిన మహాపాతకములులో ఏది చేసినా, ఎన్ని జన్మలు అయిన నిష్కృతి ఉండదు.
కేవలం భగవంతుడి నామస్మరణ ద్వారా మాత్రమే, మనకు కాస్తంత ఉపశమనం ఉంటుంది, మహాపాతకము ఉదృతి కాస్త తగ్గుతుంది.
[10/03, 5:13 am] తెలుగు1: 👉తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి
https://t.me/teluguvelugu01
మనదేశంలో కాలక్షేపానికి చెప్పే కథల్లో కూడా అంతర్గతంగా అధ్యాత్మ తత్త్వం ఉంటుంది. ఉదాహరణకు.. చిన్న పిల్లలకి అన్నం తినిపించేటప్పుడు, వాళ్లని నిద్రపుచ్చేటప్పుడు చెప్పే ఏడు చేపల కథలో ఎంతో లోతైన తత్త్వం ఉంది.
అనగా అనగా ఒక రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. ఏడుగురూ వేటకు వెళ్లారు. ఏడు చేపలు తెచ్చారు. ఎండబెట్టారు. అందులో ఒక చేప ఎండలేదు. చేపా చేపా ఎందుకెండలేదు? అంటే.. గడ్డి మేటు అడ్డం వచ్చింది అంది. గడ్డిమేటా గడ్డి మేటా ఎందుకడ్డం వచ్చావు అంటే.. ఆవు మెయ్యలేదంది. ఆవా ఆవా ఎందుకు మెయ్యలేదు అంటే.. గొల్లవాడు మేపలేదంది. గొల్లవాడా గొల్లవాడా ఎందుకు మేపలేదంటే.. అమ్మ అన్నం పెట్టలేదన్నాడు. అమ్మా అమ్మా ఎందుకు అన్నం పెట్టలేదంటే.. పిల్లవాడు ఏడ్చాడు అంది. పిల్లవాడా పిల్లవాడా ఎందుకేడ్చావంటే.. చీమకుట్టింది అన్నాడు. చీమా చీమా ఎందుకు కుట్టావు? అంటే.. నా బంగారు పుట్టలో వేలుపెడితే కుట్టనా అందా చీమ. ఇదీ స్థూలంగా కథ. ఇందులో ఉండే అంతరార్థం తెలియాలంటే స్థూలంగా చూస్తే కనబడని చిక్కుముడి విప్పాలి. కథానిర్మాణంలో ఎక్కడో ఏదో లోపమో, అనౌచిత్యమో ఉంటుంది. అక్కడ ఆగి సూక్ష్మ దృష్టితో చూస్తే ఆ చిక్కుముడి విడిపోతుంది. రాజుగారికి కొడుకులుండడం, వాళ్లు వేటకు వెళ్లడం మామూలు విషయమే కానీ.. రాజుగారి కుమారులు వేటకెళ్లి చేపలు తేవడమేమిటి? రాజకుమారులు వేటకు వెళితే సింహాన్నో, పులినో వేటాడి తెస్తారు. అవి దొరక్కపోతే ఒక లేడినైనా తెస్తారు. కానీ చేప నెందుకు తెస్తారు? కథలో కీలకం అంతా అక్కడే ఉంది.
నిజానికి తెచ్చినవి చేపలు కావన్నమాట. మరేమయ్యుంటాయి? అని ఆలోచిస్తే ఎవరో ఒకరికి తోచకపోదు. ఏడు చేపల్లో ఎండిన ఆరు చేపలే అరిషడ్వర్గాలు (కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు). ఎండని ఏడవ చేపే ఈ ఆరింటికీ పుట్టినిల్లయిన మనస్సు.
ఈ దృష్టితో కథ అంతటినీ మరో సారి తరచిచూస్తే అనర్ఘరత్నాలన్ని గనిలోంచి తమంతతామే బయటకు వస్తాయి. చేప ఎండకపోవడం అంటే మనస్సు నశించకపోవడం. గడ్డి మేటు అడ్డం వచ్చింది అంటే అజ్ఞానం గడ్డిమేటులా పేరుకుపోయిందని. గడ్డిమేటుని ఆవు మెయ్యలేదు అంటే జ్ఞానం అజ్ఞానాన్ని నశింపజేయ్యలేదు అని! గొల్లవాడు మేపలేదు అంటే.. ఏ గురువూ జ్ఞానోపదేశం చెయ్యలేదు అని(జగద్గురువు శ్రీకృష్ణుడు గొల్లవాడే కదా). అమ్మ అన్నం పెట్టలేదు అంటే.. మనకు జ్ఞానోపదేశం చెయ్యాల్సిందిగా అమ్మవారు ఏ గురువుకూ చెప్పలేదని! పిల్లవాడు ఏడ్చాడు అంటే.. ఇంకో భక్తుడు మనకంటే ఎక్కువగా భగవత్ సాక్షాత్కారం కోసం తపిస్తున్నాడని. చీమ కుట్టింది అంటే.. సంసారతాపత్రయం అనే విషపు పురుగు కాటేసిందని. బంగారుపుట్టలో వేలు పెట్టడం అంటే సంసారం మట్టిపుట్టే అని తెలిసి కూడా బంగారు పుట్ట అని భ్రమించి అందులో ప్రవేశించామని. ఇదీ కథలో అంతరార్థం. ఇంతటి గొప్ప కథని కాలక్షేపం కథగానో, ‘పనెందుకు చెడి పోయింది?’ అంటే ఎవరిమీదో వంకపెట్టి తప్పించుకోడానికి ఉపయోగించే కథగానో భావించడం ఎంత పొరపాటు!!
[10/03, 5:13 am] తెలుగు1: 👉తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి
https://t.me/teluguvelugu01
*ఎవరు తీసిన గోతిలో*...
✍️నారంశెట్టి ఉమామహేశ్వరరావు
భక్త తుకారాం పాండురంగడి భక్తుడు. నిరంతరం దైవ నామ స్మరణలో గడిపేవాడు. దేవుణ్ణి కీర్తిస్తూ అభంగాలు రచించి గానం చేసేవాడు.
తుకారాం భక్తి ప్రపత్తులకు ఆకర్షితుడయ్యాడు ఆ వూళ్ళోని ఒక భక్తుడు. అతడు తరచుగా భక్త తుకారాంని ఇంటికి ఆహ్వానించి అతనితో ఆధ్యాత్మిక విషయాలు చర్చించేవాడు.
అలా తుకారాం వచ్చి భర్తను కలవడం భక్తుని భార్యకు నచ్చేది కాదు. తన భర్త తుకారాంని కలవడం వల్ల ఆధ్యాత్మికంగా ఆలోచిస్తూ తనను పట్టించుకోటం లేదని బాధపడేది. కొన్నాళ్ళకు ఆ బాధ కాస్తా కోపంగా మారింది. భక్త తుకారాం మీద పగ తీర్చుకోవాలన్నంత కసి పెరిగింది ఆమెలో.
ఒక రోజు ఆ భక్తుని ఇంటికి వెళ్ళాడు తుకారాం. వారిద్దరూ ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతుండగా భక్తుడి భార్యకు మనసులో అప్పటికే ఉన్న కోపం తారాస్థాయికి చేరుకుంది.
ఎలాగైనా తుకారాంని తమ ఇంటికి రాకుండా చేయాలన్న ఉద్దేశంతో ఒక గిన్నెలో నీరు నింపి పొయ్యి మీద బాగా మరిగించింది. ఆ వేడి నీరుని తుకారాం కాళ్ళ మీద పోసినట్టయితే తన పగ చల్లారుతుందని తరువాత నుండి తుకారాం బాధ తప్పి పోతుందని అనుకుందామె.
వేడి నీరున్న గిన్నెను గుడ్డతో పట్టుకుని వంటగది నుండి బయటకు వచ్చి నడుస్తుండగా అనుకోని విధంగా ఆమె కాలు జారి క్రింద పడింది. మరుక్షణం గిన్నె లోని వేడినీరు ఆమె ఒంటి మీదనే చిలికి ఒళ్ళంతా బొబ్బలెక్కాయి. బొబ్బల బాధను తట్టుకోలేక పెద్దగా కేకలు వేస్తూ అరిచింది భక్తుని భార్య.
భార్యకు ఏమైందోనని భక్తుడు ఆందోళన చెందుతుండగా అతడితో బాటూ తుకారాం కూడ లోపలకు వెళ్ళాడు. అక్కడ భక్తుడి భార్య బాధతో గిలగిలా కొట్టుకుంటోంది. ఆమెకు జరిగిన ప్రమాదం చూసి చలించిపోయాడు తుకారాం. భగవంతుని స్మరిస్తూ ఆమె శరీరం మీద స్పృశించాడు. తుకారాం చేయి ఆమెను తాకగానే ఆమె బాధ మటుమాయమై పోయింది. అంతే కాకుండా కాలిన బొబ్బలన్నీ మాయమై పోయాయి.
తాను చేసిన తప్పుకు కుమిలిపోతూ భక్త తుకారాం పాదాలపై పడి క్షమించమని వేడుకుంది . విశాల హృదయం గల తుకారాం ఆమెను క్షమించాడు. తనను పాండురంగడే కాపాడాడని తుకారాం మనసులోనే దేవునికి కృతజ్ఞతలు తెలిపాడు.
ఎవరు తీసిన గోతిలో వారే పడతారని తెలుసుకున్న భక్తుని భార్య తుకారాంని గౌరవించడం నేర్చుకుంది. తరువాత నుండి భర్తను తుకారంతో వెళ్లేందుకు ప్రోత్సహించింది.
[ *శివ'' అంటే "శివుడు - "రాత్రి'' అంటే "పార్వతీదేవి*
శివరాత్రి .."శివ'' అంటే "శివుడు;; - "రాత్రి'' అంటే "పార్వతి''
వీరిద్దరికీ వివాహమైన రాత్రే "శివరాత్రి''. వీరికి పూర్వం వివాహమైన దంపతులు.. పురాణాలలో కనిపించరు.
అందుకే పార్వతీపరమేశ్వరులను "ఆదిదంపతులు'' అన్నారు. వీరి కళ్యాణం, జగత్కల్యాణానికినాంది అయినది కనుకనే "శివరాత్రి'' విశ్వానికంతటికీ పర్వదినం అయింది.
అంతేకాదు, తమలో ఎవరు గొప్ప అనే విషయంలో బ్రహ్మ, విష్ణువులకు మధ్య వాగ్వివాదం జరిగినప్పుడు, పరమేశ్వరుడు తేజోలింగముగా ఉద్భవించి, వారికి జ్ఞానోపదేశం చేసినది ఈ "శివరాత్రి'' నాడే. అందుకే మాఘబహుళ చతుర్దశి తిథినాడు అర్థరాత్రి సమయాన్ని "లింగోద్భవ'' కాలంగా భావించి శివరాధనలు, శివార్చనలు చేయడం ఆచారమైంది.
ఈ శివరాత్రి పర్వదినంనాడే "శివపార్వతులకు'' కళ్యాణం చేసి ఆనందించడం అలవాటైపోయింది.అభిషేకం ఎందుకు చేయాలి ?"అభిషేక ప్రియం శివః'' అన్నారు. శివుడు అభిషేకప్రియుడు.నిర్మలమైన నీటితో అభిషేకమంటే శివునకు చాలా యిష్టం.
ఇందులో అంతరార్థం ఏమిటంటే -"నీరము'' అంటే "నీరు'' నీరమునకు ఆధారుడు కనుకనే శ్రీమహావిష్ణువును "నారాయణుడు'' అన్నారు. నీరు సాక్షాత్తు విష్ణుస్వరూపం. అందుకే శివునకు "నీరు'' అంటే చాలా యిష్టం.
అందుకే శివునికి జలాభిషేకంచేస్తున్నప్పుడు ఆ నీటిస్పర్శతో నారాయణ స్పర్శానుభూతితో
"శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్ విష్ణోశ్చ హృదయం శివః''
శివునకు అభిషేకం చేసే ప్రక్రియలో క్షీరాభిషేకమనీ, గందాభిషేకమనీ, తేనెతో అభిషేకమనీ ... చాలా రకాల అభిషేకాలు చోటు చేసుకున్నాయి. కానీ ఈ అభిషేకాలన్నింటికన్న "జలాభిషేకం'' అంటేనే శివునకు ప్రీతికరం.
అందులోనూ "గంగాజలాభిషేకం'' అంటే మహా యిష్టం. ఎందుకంటే "గంగ'' "విష్ణుపాదోద్భవ'' విష్ణు పాదజలమైన గంగ అంటే శివునకు ఆనందకరం, అందుకే శివుడు, గంగను తన శిరసున ధరించి గౌరవించాడు.
ఆ తర్వాత శివుడు ఇష్టపడే అభిషేకం "చితాభాస్మాభిషేకం'' ఎందుకంటే ఆయన "చితాభస్మాంగదేవుడు'' కదా! ఈ అభిషేకం, ఉజ్జయినిలో "మహాకాలేశ్వరునికి'' ప్రతినిత్యం ప్రాతఃకాలంలో తొలి అభిషేకంగా జరుగుతుంది.
ఏది ఏమయినా, శివాభిషేకం ... సంతతధారగా జలంతో అభిషేకించడమే ఉత్తమం ...ఎందుకంటే"జలధార శివః ప్రియః'' అన్నారు కదా! ఈ అభిషేకాన్ని "రుద్రైకాదశిని'' అనబడే నమక, చమకాలతో చేయాలి. అనంతరం మారేడుదళాలతో, తుమ్మిపూలతో అర్చించాలి.
నమకంలోని "నమశ్శివాయ'' అను పంచాక్షరీ మంత్రంలో"శివ'' అనే రెండు అక్షరాలు "జీవాత్మ'' అనే హంసకు రెండు రెక్కలవంటివి. జీవుని తరింపజేయడానికి"శివాభిషేకం'' అత్యంత ఉత్తమైన సులభమార్గమని, "వాయుపురాణం'' చెబుతుంది.
"వేదేషు శతరుద్రీయం, దేవతాను మహేశ్వరః'' అనునది సూక్తి. దేవతలలో మహేశ్వరుడు ఎంత గొప్పవాడో, వేదాలలో శతరుద్రీయం అంత గొప్పది. నమక, చమకాలు గల ఈ రుద్రంతో శివునకు అభిషేకం చేస్తే, సంతాన రాహిత్య దోషాలు, గ్రహబాధలు తొలగిపోతాయని ఆవస్తంబు ఋషి చెప్పాడు.
అందుకే, శివుని ప్రతినిత్యం అభిషేకించాలి. అలా ప్రతినిత్యం అభిషేకం చెయ్యడం కుదరని వారు ఈ మహాశివరాత్రి నాడయినా భక్తిగా అభిషేకిస్తే అనంతపుణ్యం పొందుతారు.
"శివరత్రౌ అహోరాత్రం నిరాహారో జితేంద్రియ: |ఆర్చయేద్వా యధాన్యాయం యధాబలమ చకం ||యత్ఫలం మమమ పూజాయాం వర్షమేకం నిరంతరం |తత్ఫలం లభతే సద్యః శివరాత్రౌ మదర్చానాత్ ||
శివరాత్రినాడు పగలు, రాత్రి ఉపవాసముండి, ఇంద్రియనిగ్రహంతో శక్తివంచన లేకుండా, శాస్త్రం చెప్పిన విధంగా నన్ను అర్చించినవారికి, సంవత్సరమంతా నన్ను అర్చించిన ఫలం ఒక్క "శివరాత్రి'' అర్చనవలన లభిస్తుందని'' "శివపురాణంలో సాక్షాత్తు శివుడే దేవతలకు చెప్పాడు.
శివరాత్రికి ముందురోజున, అనగా మాఘబహుళ త్రయోదశినాడు ఏకభుక్తం చేసి, ఆ రాత్రి శివాలయ ప్రాంగణంలో నిదురించాలి. మరునాడు "మాఘబహుళ చతుర్దశి'' శివరాత్రి పర్వదినం కనుక, ప్రాతఃకాలాన్నేలేచి, స్నానాదికాలు పూర్తిగావించుకుని, శివాలయానికి వెళ్ళి ఆ రోజు మొత్తం శివుని అభిషేకించాలి. రాత్రంతా జాగరణ చేస్తూ, శివుని అర్చించాలి. లింగోద్భవకాలంలోఅభిషేకం తప్పనిసరిగా చేయాలి.
తరువాత శివపార్వతులకు కళ్యాణం చేసి, చతుర్దశి ఘడియలు పోకుండా అన్నసమారాధన చేయాలి. నమక, చమకాలతో అభిషేకం చేయలేనివారు,
"ఓం నమశ్శివాయ'' అనే మంత్రాని పఠిస్తూ చేసినా అదే ఫలాన్ని అనుగ్రహిస్తాడు సాంబశివుడు.
బిల్వపత్రాల విశిష్టత.
శివపూజకు బిల్వపత్రాలు [మారేడుదళాలు] సర్వశ్రేష్టమైనవి. మారేడువనం కాశీక్షేత్రంతో సమానం ... అని శాస్త్రప్రమాణం.
మారేడుదళాలతో శివార్చన చేయడంవల్ల కాశీక్షేత్రంలో శివలింగ ప్రతిష్ట చేసిన ఫలం లభిస్తుంది.
సాలగ్రామ దానఫలం,శత అశ్వమేధయాగాలు చేసిన ఫలం,
వేయి అన్నదానాలు చేసిన ఫలం, కోటి కన్యాదానాలు చేసిన ఫలంతో సమానం, ఒక బిల్వాదళంతో శివార్చన చేయడం వలన లభిస్తుంది అని"బిల్వాష్టకం''లో చెప్పబడింది.
"ఏకబిల్వం శివార్పణం'' అని శివుని అర్చిస్తే, అనేక జన్మల పాపాలు నశిస్తాయి.బిల్వదళంలోని మూడు ఆకులూ, సత్త్వ, రజ, స్తమోగుణాలకూ, శివుని త్రినేత్రాలకూ, త్రిశూలానికి ప్రతీకలు. ఆ మూడు ఆకులే త్రిమూర్తులు. బిల్వాదళం ముందు భాగంలో అమృతం, వెనుక భాగంలో యక్షులు ఉంటారు కనుక. బిల్వాదళం ముందు భాగాన్ని శివునకు చూపిస్తూ పూజించాలి.
ఒకసారి కోసిన బిల్వదళాలు 15 రోజుల వరకూ పూజార్హతను కలిగి ఉంటాయి. ఆలోపు ఆ బిల్వదళాలు వాడినా దోషం లేదు. కానీ, మూడు దళాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి.
జాగరణ ఎందుకు చేయాలి..
క్షీరసాగర మధన సమయంలో జనించిన హాలాహలాన్ని భక్షించిన శివుడు ... మైకంతో నిద్రలోకి జారుకుని ఎక్కడ మరణిస్తాడో ... అన్న భయంతో సకలదేవ, రాక్షస గణాలూ, శివునకు నిద్రరాకుండా ఉండాలనీ తెల్లార్లూ శివసంకీర్తనం చేస్తూ జాగరణం చేసారట. ఆ జాగరణే "శివరాత్రి''నాడు భక్తులు ఆచారమైంది.
"జాగరణ'' అంటే నిద్రపోకుండా సినిమాలు చూస్తూ, గడపడం కాదు. జాగరూకతో శివుని భక్తిగా అర్చించడం.శివుడు నిరాడంబరుడు శివుడు నిర్మల హృదయుడు. శుద్ధ స్ఫటిక మనస్కుడు. అందుకు నిదర్శనగా స్ఫటిక మాలలు, రుద్రాక్షమాలలూ ధరిస్తాడు.
మహాదేవుడు ఎంతటి నిరాడంబరుడో ఆయన ఆకృతే చెబుతుంది. శరీర వ్యామోహం లేని వాడు కనుకే, తైల సంస్కారంలేని జటాజూటంతో, చితాభస్మాన్ని పూసుకుని, గజచర్మాన్ని ధరించి, పాములను మాలలుగా వేసుకుని నిగర్విగా తిరుగుతాడు.
ఆయన జీవనవృత్తి భిక్షాటనం. అందుకనే ఆయనను "ఆదిభిక్షువు'' అన్నారు. ఆయన భుజించే భోజనపాత్ర కపాలము. ఆయన నివాసస్థానము శ్మశానం. ఇంతటి నిరాడంబర దేవుడు మనకు ఎక్కడాకనిపించడు.
ఈ "నిర్జనుడు'' మనకేం వరాలిస్తాడో సందేహం మనకు అనవసరం. ఈశ్వరుడు ఐశ్వర్యప్రదాత.ఈశ్వర భక్తుడైన "రావణుడు'' ఎంతటి మహాదైశ్వర్య సంపన్నుడో మనకందరకూ తెలిసినదే.
బ్రాహ్మణ వంశంలో జన్మించి, వేదాలు అభ్యసించి చెయ్యరాని పాపాలు చేసినా, మహాశివరాత్రినాడు తనకు తెలియకుండానే జాగరణ చేసి, శివపూజ చేసి, శివప్రసాదం తిన్న "గుణనిధి'' మరణానంతరం శివసాన్నిధ్యం పొందాడు.
అతడే మరుజన్మలో ధనాధిపతి అయిన కుబేెరుడుగా జన్మించి ఉత్తర దిక్పాలకుడయ్యాడు. అదే"శివరాత్రి'' మహత్యం.
రావణసంహారం చేసిన శ్రీరాముడు, బ్రహ్మహత్య దోషాన్ని పోగొట్టుకోవడానికి సాగరతీరంలో "సైకతలింగ'' ప్రతిష్ఠచేసి పాపవిముక్తుడు అయ్యాడు. ఆ క్షేత్రమే "రామేశ్వరం''.
శివుని శరణుకోరి, మార్కండేయ, యమపాశ బంధవిముక్తుడై చిరంజీవి అయ్యాడు. శివునికి తన నేత్రాలతో అర్చించిన "తిన్నడు'' భక్తకన్నప్పగా వాసికెక్కాడు.
ఇలా చెబుతూ పొతే ఎందరోమహాభక్తుల చరిత్రలు మనకు దృష్టాంతాలుగా కనిపిస్తాయి. అట్టి నిరాకార, నిర్గుణ, నిరాడంబర, నిగర్వి అయిన ఆ "నిటలేక్షుని; ప్రేమానురాగాలు అనంతం. ఎల్లలులేనిది ఆయన మమకారం. "శివా''అని ఆర్తిగా పిలిస్తే, చెంతనుండే ఆశ్రిత వత్సలుడాయన.
దేహం నుండి జీవం పోయి, పరలోకానికి పయనమయ్యే వేళ, ఆ పార్థివదేహం వెంట కన్నీళ్ళతో భార్య గుమ్మంవరకే వస్తుంది. బిడ్డలు, బంధువులు మరుభూమి వరకూ వస్తారు. ఆ తర్వాత, వెంట ఎవరూ రారు. కపాలమోక్షం కాగానే, అందరూ ఋణం తీరిపోయిందని వెళ్ళిపోతారు.
దిక్కులేక అనాథకాష్టంలా కాలుతున్న ఆ కాష్టం దగ్గర... "నీకు నేనున్నారురా దిక్కు'' అంటూ త్రిశూలపాణియై తోడుగా నిలబడే దేవదేవుడు "శివుడు'' ఒక్కడే. పంచభూత్మికమైన పార్థివదేహం చితాభస్మంగా మారే వరకూ సాక్షిభూతుడుగా నిలబడే భూతగణాధిపతి ... ఆ పరమేశ్వరుడు ఒక్కడే..
ఇది చాలదా మన జన్మకు? ఏమిస్తే ఆ సదాశివుని ఋణం తీరుతుంది.?- భక్తిగా ఓ గుక్కెడు నీళ్ళతో అభిషేకించడం తప్ప.- ప్రేమగా ఓ మారేడు దళం సమర్పించడం తప్ప. తృప్తిగా "నమశ్శివాయ'' అంటూ నమస్కరించడం తప్ప.
అందుకే "మహాశివరాత్రి''నాడైనా మహాదేవుని స్మరిద్దాం. మోక్షసామ్రాజ్యాన్ని అందుకుందాం
"ఈశానస్సర్వ విద్యానాం - ఈశ్వర స్సర్వభూతానాం - బ్రహ్మాధిపతిర్ |బ్రాహ్మణాధిపతిర్ బ్రహ్మ శివోమే అస్తు.
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర..
*తెలుగు వెలుగు మిత్రులకు శివరాత్రి శుభాకాంక్షలు*
🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏
[11/03, 7:39 am] తెలుగు1: 👉తెలుగు వెలుగు టెలిగ్రామ్ లో చేరాలనుకునేవారు కింద లింక్ ద్వారా చేరండి
https://t.me/teluguvelugu01
ఒక ముని ప్రశాంతంగా ధ్యానం చేసుకుందామని ఒక చిన్న పడవను తీసుకుని, తన ఆశ్రమానికి దూరంగా వెళ్ళి, సరస్సు మధ్యలో ఆపి, ధ్యానంలో నిమగ్నమౌతాడు.
నిరాటంకంగా కొన్ని గంటల పాటు ధ్యానం చేసిన తర్వాత, తన పడవను మరొక పడవ ఢీకొట్టడంతో, ధ్యానానికి భంగం కలిగేసరికి, అతనిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.
తన ధ్యానానికి భంగం కలిగించిన వాడిని శపించాలన్నంత కోపంతో కళ్ళు తెరుస్తాడు.
కానీ, అక్కడ ఒక ఖాళీ_పడవ మాత్రం ఉంటుంది. అందులో మనుష్యులు ఒక్కరూ లేకపోయే సరికి ఆశ్చర్యపోతాడు.
అది గాలువాలుకు కొట్టుకు వచ్చిందేమోనని అనుకుంటున్న క్షణంలోనే, అతనికి ఒక సత్యం గోచరిస్తుంది. ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది.
అసలు ''కోపం'' తనలోనే ఉందని, కేవలం బయట నుండి ఒక కుదుపు కారణంగానే అది బయట పడిందని గ్రహిస్తాడు.
అప్పటి నుండి, ఆ ముని తనకెవరైనా కోపం తెప్పించినా, చిరాకు కలిగించినా, 'అవతలి వ్యక్తి ఒక ఖాళీ పడవ మాత్రమే. కోపం తనలోనే ఉందన్న ఙ్ఞానాన్ని గుర్తెరిగి ఆవేశం చెందకూడదని గ్రహిస్తాడు.
అందుకే, మనం కూడా అప్పుడప్పుడు ఆత్మ పరిశీలన చేసుకుంటూ, మనకు ఎదురయ్యే సమస్యలను ఒక సమగ్ర దృష్టితో విశ్లేషించి సమాధానం కనుక్కునే ప్రయత్నం చేయాలి.
“ఖాళీ పడవ" అనేది ఒక గొప్ప నానుడి. ఖాళీ పడవ మంచిదే. మనను మనకు పరిచయం చేస్తుంది.
No comments:
Post a Comment