దొంగలు పడ్డారు !
౼౼౼౼౼౼౼౼౼౼౼
ఒక కవి ఇంట్లో
దొంగలు పడ్డారు!
ఆరు వారాల నగలు
మూడు లక్షల నగదు
ఐదు పుస్తకాలు పోయాయి!!
పుస్తకాలది ఏముందయ్యా...నగలు నగదు చోరీ జరిగిందని కేసు నమోదు చేసుకున్నాడు పోలీసు.
పోలీసుల దర్యాప్తు జరుగుతోంది..నెలలు గడుస్తున్నా జాడలేదు...ఇక వడిసెను సుమతీ అనుకున్నాడు కవి....
ఐదు నెలల తర్వాత ఇంటికి ఒక పార్సిల్ వచ్చింది.. అందులో నగలు నగదు భద్రంగా పంపించారెవరో...కవి గారి భార్య పిల్లలు వాటిని కళ్ళకు అద్దుకుని ఆనందించారు...
పుస్తకాలు పోతేపోయినయి.. సొమ్ము దొరికింది అంతేచాలు అన్నారు భార్యాపిల్లలు..
ఆ పుస్తకాలు నా పంచప్రాణాలు అన్నాడు కవి...
" పోద్దురు బడాయి "
" పదేళ్లు కష్టపడి ఐదు పుస్తకాలు రాశానే...అవి నా పంచప్రాణాలు... పంపించినవాడు పుస్తకాలు పంపించి...నగదు నగలు పంపించకపోయినా బాధపడక పోయేవాడిని...కష్టపడితే సొమ్ము సంపాదించగలను..మళ్ళీ ఆ పుస్తకాలు రాయలేనే...అవి సరస్వతీ దేవి అమ్మవారు "... ఎడ్వడం మొదలెట్టాడు.
" నీ పుస్తకాలు సరస్వతీదేవీ ఐతే.. నా నగలు నగదు సాక్షాత్తు లక్ష్మీదేవి.. ఆ దొంగేవడో పిచ్చోడు " ఆనంద పడింది.ఇంతలో ఆ పార్సిల్లో ఒక కవర్ కనిపించింది.దాన్ని చించి అందులోని చీటి ఆసక్తిగా చదవడం ప్రారంభించింది ఆవిడ.
కవి గారికి
నమస్కారములు...
బీరువా తాళాలు పగులగొట్టి చూశా..నగలు నగదు పక్కన పుస్తకాలు కనిపించగానే ఇవేవో ఖరీదైనవని భావించి దోచుకెళ్లా..బీరువాలో ఎందుకు దాచారు...వీటిలో నిధి రహస్యాలు ఏమైనా ఉన్నాయేమోనని ఓపిగ్గా వాటిని చదివా..నగదు నగలుకన్నా గొప్ప నిధి దొరికింది.. అది జ్ఞాన నిధి..తప్పుచేశానని తెలుసుకున్నా..
ఈ లోగా నాభార్య పాతికవేలు ఖర్చుచేసింది.. చమటోడ్చి సంపాదించి కొద్దినెలల్లో మనియార్థర్ చేస్తా..డబ్బుతో పాటు పుస్తకాలు పంపిస్తా.. ఐతే వాటి జిరాక్స్ ప్రతులు మాత్రం తీసుకుని నావద్ద ఉంచుకుంటా... వాటిని మా పిల్లలతో పాటు తోటివారితో చదివిస్తా.. ఒకవేళ పుస్తకాలు దొంగిలించకపోతే నగలు నగదు తిరిగి పంపించేవాడినికాదు.. ఇప్పుడు నా దృష్టిలో నగలు నగదు కన్నా పుస్తకాలే విలువైనవిగా కనిపిస్తున్నాయి...ఈ రోజు నుంచి దొంగతనాలు మానేస్తున్నా... పుస్తకాలు అచ్చేసుకునేందుకు తోచిన డబ్బుకూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తా...
ఇట్లు
దొంగతనాలు మానిన దొంగ
ఇప్పుడు కవి ముఖంలో ఆనందం..
ఆయన భార్య ముఖంలో ఆలోచనలు
లక్ష్మీదేవి గొప్పదా?
సరస్వతీ దేవి గొప్పదా?
------------------'-------------------------------------------------
ఎంత చక్కని కధ. రచయిత కు అభినందనలు.
.....,,,....
ఇది ప్రాంజలి ప్రభ రోజువారీ పత్రిక (11)
సీతాపతీ పద్య కావ్యము
సీసము
భూసుతతో కూడి పాలుపోదు రాముండు
నా హృదయమున జెన్నారుగాత
తమ్ములతోగూడి దనరెడి రాముండు
నా నమస్సు గొను పూర్ణంబుగాఁగఁ
మనసున వాక్కున మత్కాయమున నేను
చేసిన కర్మలు శ్రీర ఘాత్త
మునకు నర్పించెద ననఘు పాదంబుల
కాంజలి ఘటియించి యధిక భక్తి
తేటగీతి
పాపముల నుండి రక్షింప ప్రార్ధనంబు
వీర శ్రీరామ రక్షింపు శ్రీ రమేశ
నిన్నె నమ్మితి శరణమ్ము నమ్మినోడ్ని
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు
--())--
సీసము
రఘువంశరాజుల రత్నంబు, రాజీవ
నేత్రుండు బలపూర్ణ నాదు గురువు
నిర్మలాత్ముడుగను నిఖిలజగంబున
విశ్వమంతయును విఖ్యాత పురుష
రాఘవేశ్వరుడు శ్రీ రాకేందుబింబాన
నుండు రఘుకులోత్తముండు ధరణి
రాఘవేంద్ర దయాకర రఘువంశ తిలక
నిన్నేను ప్రార్ధించి నమ్మి ఉన్న
మం. ద్వి .
కౌసల్య వరపుత్ర - కాకుత్ స్ధ వంశ్య
భుసుతారంజన - భువనైక వీర
నీరదసమగాత్ర - నిరుపమాకర
ధర్మకార్యసక్త - దానవ హంత
****
సీసము
మనిషిగా పుట్టిన మహనీయడే రామ
మానవత్వం మ్మును మనసు నేర్చు
ప్రేమతో జగతినే పాలించే శ్రీ రామ
కాలము మారినా కధలు బతుకు
మావి చిగురు మల్లె మహిమను చూపియు
చిరునవ్వుల రామ తనువంత సీతకే
అనువైన ఆదర్శ భావమ్ము తెలిపిన
ఆదిత్యుని వెలుగు అంది పుచ్చు
తేటగీతి
పాడి పంటలు మునులకు పాడి ఆవు
మునుల యాగాలు రక్షగా మనసు నిచ్చు
చిన్న పెద్దాఅందరి లోను తపము తెల్పి
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు
--(())+-.......31
--(())--
“భగవానుడు పంపిన సమాచారం..... కధ
.👉నువ్వు ఏదో ఒక రోజు ఈ మెయిల్ చూస్తావని నీకు ఈ మెయిల్ పంపుతున్నాను .
నువ్వు రోజూ నిద్ర లేచాక నా వేపు చూస్తావనీ , నన్ను పలకరించి రెండు మాటలు మాట్లడతావనీ ఎదురు చూస్తుంటాను .
కానీ
నువ్వు లేచీ లేవగానే నీ సెల్ ఫోన్ తీస్తావు . అందులో నీకు వచ్చిన మెస్సేజెస్ చూస్తావు .
అది అయ్యాక నా వేపు చూస్తావేమో అనుకుంటాను . అపుడు నీకు టైం కనిపిస్తుంది . అప్పుడే టైం అయిపోయిందా అనుకుంటూ గబగబా పక్క దిగి బాత్ రూం లోకి వెళ్లి పోతావు .
అక్కడనుండి వచ్చాక నేను ఉన్న చోటికి వచ్చి ఒక సారి నా వేపు చూసి పలకరిస్తావు అని చూస్తుంటాను
కానీ
. డైనింగ్ టేబుల్ దగ్గరకి వెళ్లి టిఫెన్ తింటూ పేపర్ చూస్తూ టి వి ఆన్ చేసి వార్తలు చూస్తుంటావు .
టిఫిన్ అయ్యాక గబగబా డ్రెస్ చేసుకుని ,జుట్టును తీరిగ్గా దువ్వుకుని , సెంటు రాసుకుని , ముఖానికి ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని , షూ వేసుకుని బయటకు వెడుతూ నా కేసి చూస్తావేమో అనుకుంటాను .
కానీ
బయటకు ఆదరా బాదరా వెళ్లి పోతావు .
అయ్యో నీకు పాపం తీరిక లేదే అని బాధ పడడం తప్ప ఏమి చెయ్యను ?
పోన్లే !
మధ్యాహ్నం లంచ్ టైం లో భోజనం కారియర్ విప్పుతూ కాంటీన్ లో నాలుగు టేబుళ్ళ వెనకాల ఒకాయన కళ్ళు మూసుకుని నన్ను తలచుకుంటుంటే నువ్వు కూడా నన్ను తలచుకుంటావు అని ఎదురు చూస్తున్నాను
కానీ
నువ్వు నవ్వుకుని నీ స్నేహితుడితో సినిమా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేసేసావు .
సాయంత్రం ఇంటికి వచ్చాక తీరు బడిగా నాతో మాట్లాదతావేమో అని అనుకున్నాను .
కానీ
సాయంత్రం ఇంటికి వస్తూ దారిలో రెండు మూరల మల్లె పూలు కొన్నావు . నా కోసం కూడా పూలు కొంటున్నావు అనుకున్నాను .
కానీ
నీకు అవి కనిపించ లేదనుకుంటాను .
పోన్లే !
పూలెందుకు ? నువ్వు నాతో మాట్లాడితే చాలు . నా కేసి చూస్తే చాలు .
ఇంటికి వచ్చావు .
సోఫాలో కూల బడి టి వి చానల్ మార్చి మార్చి చూస్తూ కాఫీ తాగావు . బాత్ రూం కి వెళ్లి స్నానం చెసి వచ్చి తెల్లటి బట్టలు కట్టుకున్నావు . అప్పుడు కూడా నా కేసి వస్తావనీ , నాతో మాట్లాదతావనీ ఎదురు చూశాను .
కానీ
నీ లాప్ టాప్ ముందుకు వెళ్లావు . అందులో నీకు ఇష్టమైన వన్నీ చూస్తూ రాత్రి 11 గంటల వరకూ గడిపావు . ఇక నీకు నిద్ర వస్తోంది . అపుడు నా దగ్గరకు వస్తావు అని అనుకున్నాను . నీ ఎదురుగా నే ఉన్నాను .
కానీ
నువ్వు నన్ను చూడలేదు .
ఇంకో అరగంట తర్వాత నా కేసి చూస్తావు అనుకున్నాను . నువ్వు అలిసిపోయావు . నీ భార్య తో గుడ్ నైట్ చెప్పి పడుకుండి పోయావు . నాకూ చెబుతావు అనుకున్నాను . చెప్పలేదు
పోన్లే !
నాకు ఓపిక ఉంది . నేను ఎదురు చూస్తుంటాను . నీకు కూడా ఇతరులతో ఎలా ఉండాలో నేర్పాలన్నదే నా తపన .
నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను . . కానీ ... కానీ ... నాకు కూడా నీవు నా వేపు చూడాలనీ , ఒక్క సారి నా ముందు తల వంచి నన్ను పలకరించాలనీ ఉంటుంది .
నీ గుండెలో ఉన్న నన్ను నువ్వు చూడడానికి నీ ప్రయత్నం ఏమీ చెయ్యక పోతే ఎలా ?
ఒకవైపు నుండే సంభాషణ ఎలా ?
ఇదిగో ఈ మెయిల్ చూశాక అయినా నీవు నా వేపు చూస్తావనీ , నాతో రోజులో కొన్ని సెకనులు అయినా గడుపుతావనీ ఎదురుచూస్తుంటా !
*నీ లోనే నీతోనే ఉన్న " నేను🤘*
సేకరణ....
:::::::::::::::::::::::::::::::::::::::::::
ఇది రోజువారీ ప్రాంజలి ప్రభ పత్రిక (4)
నేటి ఛందస్సు
UIU IIU IUI IUI UII UIU
స్ఫూర్తిగా కలలన్ని కామ్యపురాణ కారణమే కదా
ధూర్తిగా ధరణీ తలాన్ని సకాల సేవలు యే కదా
కీర్తిగా మనసంత పంచియు మానవత్వము యే కదా
మూర్తిగా మహిమాన్వితమ్మును తెల్పి తాపసి యే కదా
దీక్షతో మనిషే కధా మరుభూమిలా అనుకంపనం
కక్షతో మది తొల్చియే సమరం సమోన్నత కంపనం
తక్షణం ఇది మార్చుటే వినియోగమే కధ కంపనం
వీక్షణం అని గాజుగోళిగ నిర్విరామము కంపనం
చావనేదియు రాకమానదు జాలిగుండెకు బాధయే
ఏవగించకు ఎత్తిచూపకు ప్రశ్నలేయకు బాధలో
నిడుయవ్వన ముద్దుగుమ్మకు పాండురోగము ఎందుకో
మంచిచేసిన మృత్యవే మము తోడునీడన ఎందుకో
--(())--
అజ్ఞాని అంతకాలంలో మారినాకూడా శరణు లభ్యమే !
🌹సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తహ స్మృతిర్ జ్ఞానమపోహనం చ
వేదైశ్చ సర్వైరహమేవ వేద్యో వేదాంతకృద్వేదవిదేవ చాహమ్ (భగవద్గీత 15:15)
సమస్త ప్రాణుల హృదయాలలో అంతర్యామిగా ఉన్నవాడను నేనే. నానుండియే ప్రాణులకు స్మృతి జ్ఞానము అపోహనము కలుగుచున్నవి. వేద తాత్పర్యమును, వేదాంతకర్తను, వేదజ్ఞుడనుకూడా నేనే.
ఇది బావుంది. అలాగే, జ్ఞానము అంటే ఏమిటో ఆ పరమాత్ముని వాక్కులోనే చూడండి :
🌹ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే
ఏతద్యో వేత్తి తం ప్రాహుహ్ క్షేత్రజ్ఞ ఇతి తద్విదః (13:1)
🌹క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత
క్షేత్రక్షేత్రజ్ఞయోహ్ జ్ఞానం యత్తద్ జ్ఞానం మతం మమ (13:2)
ఈ శరీరమును క్షేత్రము అని పేర్కొందురు. ఈ క్షేత్రమును గూర్చి ఎరింగినవానిని క్షేత్రజ్ఞుడు అని తత్త్వము తెలిసిన జ్ఞానులు తెలుపుదురు. (13:1)
అన్ని క్షేత్రములయందున్న క్షేత్రజ్ఞుడను - అంటే జీవాత్మను - నేనే అని తెలుసుకొనుము. క్షేత్రముయొక్క జ్ఞానము మరియు క్షేత్రముయందున్న క్షేత్రజ్ఞునియొక్క జ్ఞానము యథార్థ జ్ఞానము అని నా అభిప్రాయము.
ఈ శ్లోకాలద్వారా స్పష్టమౌతున్నదేమిటంటే ప్రాణుల హృదయమందున్న క్షేత్రజ్ఞుడైన పరమాత్మ వలననే ప్రాణులకు జ్ఞానము కలుగుచున్నది అనేకదా !
నిజమేగానీ, పరమాత్మనుండి జన్మతః మనకు లభ్యమౌతున్న ఆ జ్ఞానాన్ని, మనయొక్క ఇంద్రియములు మనసు ఇంకా బుద్దిలో ఆశ్రయముపొందిన కామ క్రోధము ముంచెత్తేటట్లు కప్పివేస్తున్నందున
🌹 ఇంద్రియాణి మనో బుద్ధిరాస్యధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినమ్ (3:40)
ఇంకా (ఇట్లు కామ క్రోధములు జ్ఞానమును కప్పివేయు కారణమున రేకెత్తబడుతున్న కర్తృత్వబుద్ధివల్ల)
🌹ప్రకృతేహ్ క్రియామాణాని గుణైహ్ కర్మాణి సర్వశః (3:27)
సకలకర్మలకు కారకులైన మన ఇంద్రియములయొక్క ప్రకృతి గుణములలో పొంచియున్న రాగద్వేషములు (3:34) మరియు
🌹ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో అభిజాయతే (2:62)
చింతనద్వారా ఏర్పడుచున్న విషయాసక్తి ఇంకా ఆ విషయ వస్తువులను పొందుటకై ఏర్పడుతున్న వాంఛలు కోరికలు తత్ఫలిత కామ క్రోధముల ద్వారా
పరచబడిన అజ్ఞాన అంధకారంలో మనకు పరమాత్మనుండి జన్మతః లభ్యమౌతున్న యథార్థ జ్ఞానం మనం కోల్పోతూ
ఇంద్రియములు రేకెత్తించే సాపేక్షాల వెంట పరిగెడుతూ అదే యథార్థ జ్ఞానమన్న అపోహకు గురైపోతూ శుద్ద పరమతత్త్వ గమ్యం ఎంతకూ చేరలేకపోతూ అలసిపోతున్నాముకదా !
అలా అలసిపోతున్నవారిలో ప్రాపంచికజ్ఞాన మేధావులు, నిఘంటువులో నిర్వచించబడినటువంటి యోగులు, మహామహులు పండితులుకూడా ఉన్నారని అంటే అతిశయోక్తి కాజాలదు !
(2) ఈ సత్యం తెలుసుకోగల్గుతూ దీని పరిష్కారానికై స్వతహాగా ఏమీ చెయ్యలేకపోతున్నామన్న దుఃఖంతో, introspection అవలోకనముతో సర్వాంతర్యామియైన ఆ పరమాత్మతో బుద్ధియోగానికై భక్తిశ్రద్ధలతో తపించే తన భక్తులపై
🌹తేషామ్ సతతాయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం యేన మాముపయాంతి తే (10:10)
కనికరముతో
ప్రాణుల హృదయమందుంటూ ప్రాణులను తిరిగే రంగులరాట్నంవంటి యంత్రముపై కూర్చుండఁబెట్టినట్లు వారి స్థితిగతులను త్రిప్పగల ఆ పరమాత్ముఁడు
🌹ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్ఠతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా (18:61)
చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకోకుండా వారి హృదయమందు జ్ఞానజ్యోతిని ప్రకాశింపజేసి వారిలో కూరుకొనియున్న అజ్ఞాన జనిత అంధకారాన్ని రూపుమాపేది సర్వశ్రేష్ఠుడైన తానేనని, అంటే ఆ అవ్యక్త పరమభావుడేనని
🌹తేషామేవానుకంపార్థమ్ అహమజ్ఞానజం తమః నాశయామ్యాభావస్థో జ్ఞానదీపేన భాస్వతా (10:11)
అని స్పష్టంగా ఆ శ్రీకృష్ణపరమాత్మునిద్వారా ఘోషింపబడుతున్నప్పుడు
ఒకరికి జ్ఞానం ఎప్పుడు ఎలా కలుగుతుందో ఎవరూ చెప్పలేముకదా !
అంటే ఒకమారు భగవద్గీత బోధిస్తున్న ఆత్మజ్ఞాన పరమతత్త్వానుసారమూ జీవిత ప్రయాణాన్ని కొనసాగించుదామన్న దృక్పథం ఏర్పరచుకున్న పిమ్మట మన పూర్వ గురువులు. పరమహంసలు భగవత్పాదులు చెప్పిన ఉహాగానపు కథలు ఇంకా ఆ కథలలో కాల్పనిక క్రూరాత్ముడైన బోయవాడు తదితర పాత్రలను విశ్వసిస్తూ భ్రమకు గురైపోతూ శ్రీకృష్ణపరమాత్మ ద్వారా లభ్యమౌతున్న (పైన వివరించబడిన) ఈ వాస్తవ్య హామీని - ఆత్మజ్ఞానాన్ని - అపనమ్మకంతో తృణీకరించరాదుకదా. అందుకు భిన్నంగా మనఃశరీరేంద్రియాలను పరమాత్మ అంశయైన ఆత్మాధీనం చేస్తూ మనకు మనమే మిత్రులమౌతూ మనలను మనమే ఉద్దరించుకోవాలికదా. (భగవద్గీత 6:5,6) మనలను భ్రమింపజేస్తున్న ఆయా కాల్పనిక కథలను ఆత్మజ్ఞాన పరమతత్త్వాన్ని బోధించుచున్న భగవానువాచతో క్షుణ్ణంగా పరిశీలించే ఆవశ్యకత ఎంతైనా ఉందేకదా !
అందుకే అలా మనం ఒకరిగూర్చి వక్రంగా భ్రమించకూడదు / భ్రమకు గురికాకూడదు గనుకనే - పర్యవసానంగా మూర్ఖుడు లేదా అజ్ఞాని అని ఏ ఒక్కరినీ ఎప్పుడూకూడా చులకన చెయ్యకూడదు గనుకనే - భౌతిక కర్మలుచేయు (వేరొకరియొక్క) ఇంద్రియ గుణములతో మనయొక్క గుణములను ప్రవర్తింపజేయుట
🌹 తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోహ్ గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే (3:28) -
అవ్యక్త ఆత్మలమై పరమాత్ముని అంశాలమన్న జ్ఞానం ఉన్న మనకు కూడదని,
అంటే అన్ని క్షేత్రములకు క్షేత్రజ్ఞుడు ఆ పరమాత్ముడే అన్న జ్ఞానం మనకు జన్మతః ఆ పరమాత్మునినుండి లభ్యమన్న వాస్తవ సత్యాన్ని విస్మరించరాదని, తప్పని తెలుసుకుని అందరిలో ఉన్న ఆ పరమాత్ముడను - అంటే మనద్వారా ఈసడింపబడినవానిలో ఉన్న ఆ పరమాత్ముని అంశనుకూడా శరణుకోరుతూ - ఆ పరమాత్ముని అవ్యక్త తత్త్వాన్ని కనీసం అంత్యకాలంలో యథార్థంగా యెరుగగల్గుతూ శరణు కోరినాకూడా ఆ పరమాత్ముడను చేరగలమని -
🌹అంతకాలేచ మామేవ స్మరన్ ముక్త్వా కలేవరం యహ ప్రయాతి స మద్భావం యాతి నాస్త్యత్ర సంశయః (8:5) - ఆ పరమాత్ముడే హామీ ఇస్తున్నప్పుడు
ఒకరిని తమ జీవితమందు ఎప్పుడైనా అజ్ఞాని అని ఈసడించగలమా - ఎవరికి తెలుస్తుంది ఆ పరమాత్ముడు లోలోపల వారి జ్ఞాన జ్యోతిని ప్రకాశింపజేసాడేమో ! అందువలన వారు వినమ్రతతో సర్వాన్ని వాసుదేవమయంగా వీక్షించుచూ మౌనం వహించుచున్నారేమో, ఎలా తెలుసుకోగల్గుతాము ?
ఈ విషయం మనం అంతకాలంలో తెలుసుకోగల్గుతూ క్షమాపణ వేడుకున్నాకూడా ఆ పరమాత్ముని శరణుకు అర్హులమే అని ఆ పరమాత్ముడు చెబుతున్నట్లేకదా.
ధన్యవాదములు.
[ Swami Vivekananda's Wisdom for Daily Inspiration - Mar 2.
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - మార్చి 2.
"It is the coward and the fool who says, 'This is fate' - so says the Sanskrit proverb. But it is the strong man who stands up and says, "I will make my fate". It is people who are getting old who talk of fate.
ఇది నా తలవ్రాత అని మూర్ఖుడు, పిరికివాడు మాత్రమే వచిస్తారని ఒక సంస్కృత సూక్తి. బలవంతుడు నా తలవ్రాతకు నేనే కారకుణ్ణి అని ధైర్యంగా నిలిచి చెప్తాడు. వృద్ధాప్యంలో అడుగుపెడుతున్న వారే అదృప్టాన్ని గూర్చి మాట్లాడతారు.
********
[ భాగవతము
శ్రీగురుభ్యోనమ
మనము వాక్కు ఉచ్ఛరించాలంటే నిశ్వాస ఉండాలి. నిశ్వాస ఉండాలంటే ఉచ్ఛ్వాస ఉండాలి. గాలి పీల్చకపోతే గాలి వదలలేము. ఉచ్ఛ్వాస రూపముగా మనలోకి దిగివచ్చేవాడిని *హరిఅంటారు. మొత్తము అంతా బయట వ్యాపించి ఉన్న తత్త్వము ఉచ్ఛ్వాస రూపముగా మనలోకి దిగి వస్తున్నా మనము గమనించుట లేదు.*
ఈ దిగిరావడమన్నది మన భావన లోకి దిగి వస్తే అది వాక్కుగా వ్యక్తమవుతున్నది. ఈ దిగివచ్చే వాని ఆధారం గానే మనము జీవిస్తున్నాము. వీని ఆధారముగానే సమస్తము సమకూరుతున్నది. ఈ దిగి వచ్చేవాని గూర్చి మనకి ఎంత కృతజ్ఞత ఉండాలి?
*హరియను రెండక్షరములు హరియించును పాతకముల నంబుజనాభా! హరినీ నామ మహత్యము హరిహర పొగడంగ వశమె హరిశ్రీకృష్ణా!*
**********
శ్రీరమణీయం -(819)
మనసు మోహాల నుండి బయటపడటం ఎప్పటికి అయ్యేపని !?"
మనసును ఆవరించే అనేక జాఢ్యాలను నిరంతరం గమనించుకుంటూ తొలగించుకోవాలి. అందుకు సత్సాంగత్యం ఎంతగానో సహకరిస్తుంది. శాంతి, మోక్షం వేర్వేరు కాదు. మనసు అన్ని మోహాల నుండి బయటపడటమే మోక్షం. నిరంతరాయమైన శాంతియే దానికి ఫలంగా లభిస్తుంది. అందుకు అడ్డుగా ఉన్నది మన మనసులోని జాఢ్యాలే. మనసు పెట్టే ఉరుకుల నుండి తొందర తగ్గిస్తే సత్యం అర్థం అవుతుంది. ఈ ప్రపంచంలో ఏదీ దానంతట అదిగా మనతో సంబంధం పెట్టుకోవటంలేదు. మనమే ప్రతిదానితో 'సంబంధం పెట్టుకుంటున్నాం' అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
అవసరంలేనివన్నీ అనాత్మ భావాలే.. కలలో, ఇలలో ఉన్నవి తలపులే !- [అధ్యాయం -101]
*********
"ఋభుగీత "(285)
"రహస్యోపదేశం"
20వ అధ్యాయము
ఈ సృష్టిలో వేదమే ప్రమాణం !
ఏదేది బ్రహ్మమో వేదం వివరిస్తుంది. వేదం మనకు నిత్యదర్శనీయం. రుద్రాభిషేకం చేసేప్పుడు పఠించే 'నమకం' అంతా దైవాన్ని వివిధ రూపాల్లో ఎలా దర్శించవచ్చోచెప్తుంది. కనిపించని బ్రహ్మాన్నే కాదు.. మన కళ్ళముందున్న బ్రహ్మాన్నీ అది వివరిస్తుంది. అన్నీ మనం నిత్యం చూసేవే. చెట్టు, పుట్ట, పిల్లకాల్వ, ప్రవాహం జలపాతం, సముద్రం, సముద్రపు అలలు, అలల్లోని నురుగు, సముద్రం ఒడ్డున ఉండే ఇసుకరేణువులు, సముద్రంలోని జలచరాలు, రహదారులు, ఇరుకు దారులు అన్నింటిని పొల్లుపోకుండా వివరించి వాటిని బ్రహ్మమేనని ఆవిష్కరించేదే వేదం. అందుకే ఈ సృష్టికి వేదమే ప్రమాణం అయ్యింది !
🧘♂️తపస్సు🧘♀️
_నిష్కామ, నిస్వార్థ కార్యాలన్నీ తపస్సే. యజ్ఞమూ తపస్సే, యుద్ధమూ తపస్సే _
తపస్సు అంటే అనుకున్నది సాధించే వరకు మనసు చేసే ఎడతెగని ప్రయత్నం.
మనసు సామాన్య స్థితిలో చంచల స్వభావంతో అనేక విషయాల్లో సంచరిస్తూనే ఉంటుంది. అదే మనసుకు ఒకే విషయాన్ని గ్రహించి, మిగిలినవన్నీ విస్మరించే ఉన్నత లక్షణమూ ఉంది.
మనసును సామాన్యముగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడమే తపస్సుగా చెబుతారు.
ఒక వస్తువుపై మనసును నిలకడగా కాసేపు ఉంచగలిగితే అది ధారణ అవుతుంది. మరింత సమయం మనసును నిలువరించగలిగితే అది ధ్యానమవుతుంది.
మనసు అనే వింటి నారిని తపస్సు అనే విల్లులో బాగా లాగి కట్టాలి. అప్పుడే బుద్ధి జాగృతమై లక్ష్యాన్ని ఛేదిస్తుంది.
మనసును నియంత్రించడమన్నది చాలా పెద్ద సమస్య.
మహాభారతంలోని శాంతిపర్వం మనసును, ఇంద్రియాలను తాదాత్మ్యం చేసి బాహ్యం నుంచి అంతరంగానికి తీసుకుపోయేదే తపస్సుగా చెప్పింది.
మనోనిగ్రహం ఒక్కరోజు కృషితో పొందేది కాదు. నిరంతర అభ్యాసం కావాలి.
బాహ్య అంతఃకరణాలైన మనసు ఇంద్రియాలను సమాధాన పరచడమే తపస్సుగా ఆదిశంకరులు బోధించారు.
మనిషిలోని మనోబలాన్ని, సంకల్ప శక్తిని పెంచేదే తపస్సు. పెంపొందిన ఈ మనఃశక్తిని ఎలా వినియోగించుకోవాలి అనేది మాత్రం మనిషి లక్ష్యంపైనే ఆధారపడి ఉంటుంది.
లక్ష్యాన్ని బట్టి తపస్సును సాత్విక, రాజసిక, తామసాలనే మూడు విధాలుగా భగవద్గీత చెబుతుంది.
మంచి చెడు తేడాలతో సంబంధం లేకుండా అసురులవలే అనుకున్నవన్నీ సాధించాలని చేసే తీవ్రమైన ప్రయత్నాలన్నీ తామసమని, పదవి కీర్తికోసం చేసేవి రాజసికమని, చిత్తశుద్ధి కోసం చేసేవి సాత్వికమని గీత చెబుతుంది.
తపస్సు, తపస్సుతో పొందేది రెండూ దైవంగానే చెబుతుంది తైత్తిరీయం.
దుష్టత్వాన్ని దహించే మనసును కడిగి శక్తిని ప్రజ్వలింపజేసేదే తపస్సు.
నిష్కామ, నిస్వార్థ కార్యాలన్నీ తపస్సే. యజ్ఞమూ తపస్సే, యుద్ధమూ తపస్సే.
చిత్తశుద్ధి కోసంచేసే జపం, చిత్తశుద్ధితోచేసే ప్రతీపని తపస్సే అవుతుంది.
సాధనా తపస్సే, సేవా తపస్సే.
తపస్సు అంటే వెంటనే మనకు స్ఫురించేది నుదుట విభూది రేఖలు, మెడలో రుద్రాక్షలు, కళ్లు మూసుకుని చేసే మంత్ర జపాలు. ఇవి తపస్సుకు అంగాలు మాత్రమే.
మన లక్ష్యాన్ని అనుక్షణం గుర్తుచేసే చిహ్నాలు. తప్పటడుగు వెయ్యకుండా మనసును నియంత్రించేందుకు దోహదపడేవి.
మనసును ఏకాగ్రపరచడం, నిస్వార్థ సేవతో జీవించడం తపస్సుకు పరమావధి..!
*********
183) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
మాయీ సృజతి విశ్వం సన్నిరుద్ధస్తత్ర మాయయా ౹ అన్య ఇత్యపరా బ్రూతే శ్రుతిస్తే నేశ్వరః సృజేత్ ౹౹197౹౹
197. మరొక శ్రుతి మాయకు ప్రభువగు ఈశ్వరుడు జగత్తును సృష్టించుననీ జీవుడు మాయకు వశుడనీ చెప్పును.కనుక మాయతో కూడిన ఈశ్వరుడు సృష్టికర్త.
శ్వేతాశ్వర ఉప 4-9.
వ్యాఖ్య:-ఈ ప్రపంచమునకు కారణము బ్రహ్మమా?లేక కాలమా?లేక బ్రహ్మము ఈ సృష్టికి ఉపాదాన కారణమా?
మనము దేని వలన జన్మించితిమి?సృష్టింపబడిన మనము దేనిచేత జీవించుచున్నాము?
ప్రళయ సమయములో మనమెచ్చట నున్నాము?
మన మనుభవించుచున్న సుఖదుఃఖములు ఎవరి అధికారముతో
అనుభవించుచున్నాము?
జగత్తునకు కారణము కాలమే అని కాలవేత్తలు చెప్పుచున్నారు. స్వభావము కారణమని లోకాయతికులు చెప్పుచున్నారు. కర్మ కారణమని మీమాంసకులు భావించుచున్నారు.
యదృచ్ఛచేతనే ప్రపంచము సృష్టింపబడుచున్నదని నిరీశ్వరవాదులు పలుకుచున్నారు. పంచభూతములే సృష్టికి కారణమని జగన్నిత్యత్వవాదులు చెప్పుచున్నారు.ప్రకృతియే కారణమని శాక్తేయులు చెప్పుచున్నారు.
జీవుడు లేక హిరణ్యగర్భుడు కారణమని యోగులు తలంచుచున్నారు.సంయోగము కారణమని కొందరు భావించుచున్నారు.
ఆత్మభావన కలదగుట వలన పైన చెప్పిన 7 వస్తువుల సమూహము కూడ జగత్కారణము కాలేదు. జీవుడు కూడా సుఖదుఃఖభూతమగు జగత్తునకు కారణము కాలేడు.
(కాలస్వభావో...అను మంత్రము నుండి 10 మంత్రములు నారద పరివ్రాజకోపనిషత్ 9.ఉ.లో గూడ కలవు.)
మాయకు ప్రభువగు ఈశ్వరుడు జగత్తును సృష్టించుననీ జీవుడు మాయకు వశుడనీ,మాయతో కూడిన ఈశ్వరుడు సృష్టికర్త యనీ శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్పుచున్నది.
వికారసహిత క్షర జగత్తు, వికారరహితాక్షర బ్రహ్మము - ఈ రెంటిలో ఒకటి నశించునదిగాను, మరొకటి నాశరహితముగాను నున్నది.
ఈ క్షరాక్షరములు రెండును కలిసియున్న జగత్తును స్వతంత్రుడగు ఈశ్వరుడును, అస్వతంత్రుడగు జీవుడును ఇద్దరును భరించుచున్నారు.
వ్యక్తా వ్యక్తములను క్షరము అక్షరముగా చెప్పెదరు.ఈశ్వరుడు పరస్పరము కూడుకొని యున్న విశ్వమును భరించుచున్నాడు.
జన్మయే లేని మాయ,భోక్తృ భోగ్య వస్తువులతో కూడియున్నది.
జీవేశ్వరులను కల్పించుచున్న మాయ అనిర్వచనీయమై ఈశ్వర సన్నిధానమునందున్నది.
జన్మరహితులగు జీవేశ్వరు లిరువురును క్రమముగా అనంతుడగు ఈశ్వరుడుగాను అసమర్థుడగు జీవుడుగాను అగుచున్నారు.
ఈ జీవేవేశ్వరు లిద్దరును అజులు,జన్మాదివికారములు లేనివారలే.
కర్తృత్వ భోక్తృత్వ భావము వలన జీవుడు బంధింపబడుచున్నాడు. అయినను ఆ జీవుడే తాను నిరుపాధిక పరమాత్మయని గ్రహించినప్పుడు విముక్తుడగుచున్నాడు.
ఈశ్వర-జీవ-మాయ=ఈ మూడడింటిని
బ్రహ్మ స్వరూపముగా తెలిసికొన్నప్పుడు జీవుడు గూడా విశ్వరూపుడుగా నగుచున్నాడు.
మాయ క్షరము.అవిద్యాదులను నశింపజేయు పరమేశ్వరుడు అక్షరుడు,అద్వితీయుడు,స్వయం ప్రకాశుడు,పరమాత్మ.
క్షరమైన(నశించునది)
మాయను,అవిద్యను హరించువాడు కావున పరమేశ్వరుడు.
బ్రహ్మమే మాయవలన జీవేశ్వర రూపములతో గోచరించుచున్నది.అట్టి పరమాత్మ ధ్యానము వలనను, జీవపరమాతల సంయోజనము వలనను,నిరంతర తత్త్వచింతనము వలనను విశ్వమాయా నివృత్తి కలుగుచున్నది.
*******
అన్నమయ్య సంకీర్తన
గానం : శ్రీలోకేష్
రేకు: 7-5
సంపుటము: 5-42.
మతికంటె వెలినున్న మాట మేలు
చతురులౌటకంటె జడులౌట మేలు!!
ఇంటిలోననె వుండి హీతవరులై యుండు-
కంటెఁ బగయై యుండు కసరు మేలు
అంటుకొని మరుఁడొంటి అతివనేఁ పుటకంటె
పుంటినొవ్వల విరుల పోట్లె మేలు!!
తల్లివలె దానుండి తాపమవుటకంటె
అల్లంతనుండి కీడౌట మేలు
వెల్లిగొని నిటపర్పు వేడి చల్లెడికంటె
పల్లదపు చలిగాలి బాధలే మేలు!!
అలయించి దొరకెడి అమృతపానముకంటె
అలమి పైకొనెడి చేఁదైన మేలు
కలయక కలయు వేంకటశై లపతికంటె
తలపోఁత వేదనల తమకమే మేలు!!
******
*||శ్రీమన్నారాయణీయము|| నవమ స్కంధము 29వ దశకము - మోహినీ అవతార వర్ణనము
29-5-శ్లోకము*
అస్మాస్వియం ప్రణయినీత్యసురేషు తేషు
జోషం స్థితేష్వథ సమాప్య సుధాం సురేషు।
త్వం భక్తలోకవశగో నిజరూపమేత్య
స్వర్భానుమర్దపరిపీతసుధం వ్యలావీః॥
భావము:-
మోహిని తమయందే పూర్తిగా అనురక్తయై ఉన్నదని నమ్మిన దానవులు (తమ వంతుకై ఎదురుచూచుచూ) మౌనముగా వేచియుండిరి. ప్రభూ! అమృతమునంతయూ నీవు సురులకే పంచివేయసాగితివి. అసురులకు పంచలేదు. అసురులలోని, 'రాహువు' మాత్రము, దేవతల పంక్తిలో కూర్చుని అమృతమును గ్రహించసాగెను. ప్రభూ! అది గమనించిన నీవు, చక్రాయుధముతో ఆ రాహువు శిరస్సును ఖండించి, తక్షణమే నీ స్వస్వరూపమును పొందితివి.
వ్యాఖ్య:-
విష్ణువు మోహినీ అవతారందాల్చి రాక్షసులను మాయచేసి అమృతాన్ని దేవతలకు ఇస్తాడు. దేవతలు అమృతాన్ని తగడానికి సిద్దమవుతుండగా, రాహువు అనే రాక్షసుడు వారిలో కలిపోతాడు. ఈ విషయాన్ని గమనించిన సూర్యచంద్రులు విష్ణువుకి చెప్తారు. విష్ణువు కోపంతో రాహువు శిరస్సును ఖండిస్తాడు. కాని అప్పటికే అమృతం రాహువు గొంతువరకు వెళ్ళడంతో శిరస్సు మాత్రం ప్రాణంతో ఉంటుంది శరీరం తెగిపోతుంది.
*******
[21-వేదములు📚((((((((((🕉)))))))))) ఆచార్య వాణి🧘♂️
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
11. దశోపనిషత్తులు
((((((((((🕉))))))))))
కఠోపనిషత్తు :-
'కఠ ఉపనిషత్' 'కఠోపనిషత్' 'కఠకోపనిషత్' అనబడే ఉపనిషత్తు కృష్ణయజుర్వేదపు కఠకశాఖలోనిది. యమధర్మరాజుకీ నచికేతుడనే బ్రహ్మచారికీ మరణానంతరం ఆత్మ ఏమౌతుందన్న విషయమైన సంవాదమిది. ఒక కథ వలె ప్రారంభించినా ఒక మహాసత్యాన్ని ఆవిష్కరిస్తుంది. భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ఈ ఉపనిషద్వాక్యాలనే మళ్లీ అంటాడు. ఉదా|| 'నజాయతేమ్రియతేవాకదాచిన్నాయంభూత్వా ò భవితా వా న భూయః అజోనిత్యః శాశ్వతోòయంపురాణో నహన్యతే హన్యమానే శరీరే'' (క 2-18) కంకి నుండి గింజలను వేరు చెయ్యాలి. కొబ్బరి ఆకుని తీసివేసి ఈనెను మాత్రం బయట పెట్టాలి.
దేహమనే బాహ్య పదార్థం నుండి ఆత్యను నిశ్చయంగా, దృఢంగా వేరు చేయాలి - ఆత్మ తనంతట తానే నిల్వాలి. కామం, కోపం, ద్వేషం, భయం - ఇవన్నీ మనస్సుకి సంబంధించినవే, ఆత్మకి కాదు. ఆకలి దప్పులు దేహానికి సంబంధించినవి. ఆత్మకి కాదు. ఆత్మేతరాలైన వాటిని గుర్తించటం అలవర్చుకోవాలి ఈ అభ్యాసం నిరంతరం కొనసాగిస్తే ''నేను'' అంటే దేహము, మనస్సేనన్న భావం సన్నగిల్లి, క్రమంగా పోతుంది. ఈ దేహాన్నీ మనస్సునీ కలుషితం చేసే అపవిత్రత బారి నుండి తప్పించుకొని నిర్మలమైన 'ఆత్మ' కాగలం. ఆత్మని చుట్టి ఉన్న తొడుగువంటిది ఈ శరీరమని భావించాలి. ఈ దేహం మనకొక అన్య పదార్థమన్నట్టు గుర్తెరిగి యుండాలి. ఈ ప్రపంచంలో ఉంటూ, ఈ శరీరంలోనే మనమున్నామనిపించినప్పుడు ''ఈ శరీరం నేను కాను, ఇది నాది కాదు'' అని అనుకోవటమలవర్చుకోవాలి. అప్పుడు, ముక్తి అన్నది మరణానంతరం సంభవించేదే అనుకోనక్కరలేదు.
మోక్ష మంటే మమత నుండి విముక్తే. జీవన్ముక్తుడు ఈ లోకంలోనే ఉంటూ శరీరధ్యాసలేక ఆత్మారాముడై తన ఆనందానికై బాహిర వస్తుజాలాన్ని ఆశ్రయించడు. వేదాలకీ వేదాంతానికీ గల పరమలక్ష్యం మనిషికి విముక్తి కలిగించటమే. భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఈ విషయాన్నే అంటాడు : ''ఈ దేహం నుండి ప్రాణము పోయే ముందే, ఈ లోకంలో నివసిస్తూనే, కామ క్రోధాలను నిగ్రహించి, యోగ స్థితిలో (అంటే, పరమాత్మతో ఏకత్వంతో) ఉండేవాడు ఆనందాన్ననుభవిస్తాడు''. అంటే, ఈ లోకంలో ఉంటూనే తన ఆత్మయొక్క నిజతత్త్వాన్ని ఎరిగి, ఆ అనుభవసిద్ధి కలిగి యుంటే దేహం నశించినా ఏమీ కాదు - ఆ దేహమే తాననిగాని, తనదనిగాని, అతడు జీవించి యున్నప్పుడు కూడ భావించక పోవటం వల్ల.
అంటే, మృత్యువు దేహాన్ని తన వశం చేసికొనక ముందే అతడు దేహాన్ని విడిచాడన్నమాట. ''దేహమ''న్న పదంలో మనస్సుకూడా ఉంది. అది మనది కానప్పుడు మృత్యువు కలిగితే మాత్రమేమిటి? దానికి మనపై ఏ విధమైన ప్రభావమూ ఉండదు. మృత్యువు నుండి విముక్తి చెందటం వల్ల అమరుడవుతాడు. ఈ స్థితిలో ఉండటాన్ని పురుషసూక్తంలోని మంత్రాలు వర్ణిస్తాయి. ఇవి కర్మకాండ భాగంలో ఉన్నాయి. ఈ విషయమే ఉపనిషత్తులలో పదే పదే ప్రస్తావింప బడింది. మనకి క్లేశాన్ని కలిగించేది శరీరమూ, తద్వారా మనస్సూ. క్లేశం లేకుండా ఉండటం, ఎల్లప్పుడూ ఆనందంగా ఉండటమే - స్వర్గమన్నా, మోక్షమన్నా. ఇది అన్ని మతాలలోనూ ఉంది.
కాని అద్వైత సిద్ధాంతం తప్ప మిగిలిన అన్ని ధర్మాలూ ఆ చిదానంద స్థితిని అనుభవించాలంటే వేరే లోకానికి వెళ్లాలని అంటాయి. ఈ లోకంలో ఉంటూనే, దేహం పట్ల మమకారాన్ని పూర్తిగా విడచి, ఆత్మలో లీనమై యుండటం వల్ల పరలోకాల్లో లభించే ఆనందం కంటే అధికమైన ఆనందాన్ని పొందవచ్చని ఆదిశంకరులు నిరూపించారు.
******
అద్భుతంగా ఉన్నాయి పద్యాలు కధలు ప్రాంజలి ప్రభవారికి ధన్యవాదములు
ReplyDelete