Tuesday, 30 March 2021

31032021

   

నేటి కవిత్వం -. మనోహరి (6)
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మందారం లా విరబూసే నా తనువూ
సిందూరం లా తనువంతా ఓ మెరుపూ
నీ చూపే నా మనసంతా ఓ కుదుపే
సిగ్గాయే నా కలలో నీ స్పర్శ లతా
సింగారం లా మరుగొల్పే నీ మనసే
నాంచారీ లా ఉసిగొల్పే నీ సొగసే
బంగారీ లా మెరుపుల్తో నీ తనువే
వయ్యారి లా నడకల్తో నీ నడుమే
ఉద్వేగం చెందుట శృంగారం వలనా
రాద్ధాంతం చేయుట ప్రేమావల్లె కదా
సందేహం తీర్చుట సంతోషం వలనా
ఉద్దేశ్యం మంచిది చెల్మి వల్లె కదా
ఊహల్లో ఊపుల వయ్యారం చెసే
రాగాలు పువ్వుల ముద్దూలే చెసే
అద్దంలా నవ్వితె నవ్వుల్తో చెసే
ఈజన్మే మాధవు సొంతంలా చెసే
--(())--
UIUII UIU UI UI
నేటి కవిత్వము - హాయి
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నిన్ను నిన్నుగ చూడగా నేను లేను
నేను నేనని తల్యంగా నీవు లేవు
నీవు నేనను దృష్టి యే నిల్చి పోవ
నన్ను నీవని చెప్పంగ శక్య మౌన
కాల మాయకు అందరూ చిక్కి నట్టె
వాన నీటికి అందరూ తడ్సి నట్టె
ఎండ గాలికి అందరూ మాడి నట్టె
అగ్ని వాడక ఎవ్వ రూ బత్క నట్టె
రాజ కీయపు రంగులే నీకు వద్దు
కాయ కష్టము నమ్మియే ఆశ తీర్చు
మారు పల్కక చెప్పెదే దేదొ చేయి
కారు చీకటి మారునే వెలుగు వచ్చె
పాలు నిచ్చు గొ సంతతీ బాధ చూడు
ఊలు నిచ్చిన గొర్రెల బాధ చూడు
మేలు చేసెడి పెద్దలా బాధ చూడు
వేలు ఖర్చులు మంచికే చేసి చూడు
రోజు లన్నియు ఒక్క మాదిరే చూడు
దేని గూర్చియు ఆశ పెట్టు కోకుండు
సేవ చేసియు కోర్క తీర్చియు చూడు
మంచి చేసిన వాడికే హాయి గుండు
--(())--


మెసెడోనియా రాజైన అలెగ్జాండర్‌ జైత్రయాత్రకు బయలుదేరినప్పుడు తన దేశంలోని గొప్ప తత్త్వవేత్తలలో ఒకడయిన డియోజినస్ దగ్గరకు వెళ్ళాడు!
ఆయన ఉపదేశం పొందాలన్న ఆశతో!
 ఆ సమయంలో ఒక పెద్ద మర్రిచెట్టు క్రింద తనలో తానే ఆనందంగా హాయిగా నవ్వుకుంటూ  కాలుమీద కాలేసుకుని దర్జాగా సేదతీరుతున్నాడు ఆ మహాత్ముడు.
 అలెగ్జాండరు వినయంగా ఆయన దగ్గర నిలుచొని తనకేదయినా ఉపదేశించమని ప్రార్ధించాడు!.
అప్పుడు ఆ మహానుభావుడు అడిగాడు,
 "నీవిప్పుడు ఏం చేయదలచుకున్నావు?" అని!
ముందు పర్షియా ను జయిస్తాను  చెప్పాడు అలెగ్జాండర్
ఆ తరువాత ?
అని ప్రశ్నించాడు డియోజినస్,  ఈజిప్టు అని జవాబిచ్చాడు అలెగ్జాండర్.
 తరువాత?
 మెసపొటేమియా!
 ఇట్లా ఆయన అడగటం
ఈయన చెప్పటం !
ప్రపంచంలో ని రాజ్యాలన్నీ అయిపోయేదాకా చెపుతూనే ఉన్నాడు అలెగ్జాండర్‌!
ప్రపంచవిజేత అయిన తరువాత ఏం చేస్తావు?
అని అడిగాడు డియోజనస్!
మెసడోనియా తిరిగి వచ్చి హాయిగా విశ్రాంతి తీసుకుంటాను అని చెప్పాడు అలెగ్జాండర్.
ఈ సమాధానం విన్న వెంటనే డియోజినస్ తను పడుకున్న చోటినుంచి కాస్త పక్కకు జరిగి,
రా! నా ప్రక్కన పడుకో!
 విశ్రాంతి తీసుకోవడానికి నీవు అన్ని రాజ్యాలు జయించి అంత రక్తపాతం సృష్టించాలా!అని అడిగాడు!..డియోజినస్.
ప్రపంచంలో ఇక జయించడానికి ఏమీలేదు అని అనుకునేంతదాక యుద్ధాలు చేస్తూనే ఉండాలి !
అని అనుకున్నాడు అలెగ్జాండర్‌!
అలానే! నేడు కొత్తరకం అలెగ్జాండర్లు బయలుదేరారు
సంపాదన,సంపాదన,సంపాదన
ఒకటే సంపాదన ......
సంపాదించటమే విజయం !
అనే దృక్పధం పెరిగిపోయింది నేడు!
 అందులోని వత్తిడులు దానివల్ల వచ్చే రకరకాల రోగాలు!
ఒక మనిషికి ఎంతకావాలి?
ఈ ప్రశ్న దాదాపుగా మనమెవ్వరమూ ఇంతవరకూ వేసుకోలేదు అని అనుకుంటున్నా! ఎవరైనా వేసుకున్నారా
లక్షాధికారి అయిన లవణమన్నమే కాని మెరుగు బంగారమ్ము మింగపోడు!.
ప్రపంచం అంతా జయించాడు!
అన్ని దేశాల సుందరీమణులు, అతిలోక సౌందర్యవతులు తనను వరించి వచ్చారు, అయినా రావణునికి కాంక్షతీరలేదు!
ఇంకేదో కావాలి!
 సీతమ్మను చెరబట్టాడు!
చివరకు రాముడి చేతిలో మొత్తం సబాంధవంగా హతుడయ్యాడు !.....
అలానే నోటి దురుసుతనం ప్రాణాంతకమవుతుంది!
తన మేనమామ కొడుకు,
తన బంధువు అని చూడకుండా పదిమందిలో కృష్ణుడిని అవమానించి ప్రాణం పోగొట్టుకున్నాడు శిశుపాలుడు!
తన పినతండ్రి పిల్లలు వాళ్ళు  ,  తనదగ్గర లేనిది ఏదో వాళ్ళ దగ్గర ఉన్నది అని అనుక్షణం ఈర్ష్యా అసూయలతో మనసు పాడుచేసుకొని చివరకు వాటికే బలి అయిపోయాడు దుర్యోధనుడు!
కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యాలు మనలను ఉన్నచోట ఉండనీయవు, !
ధగధగా మెరిసే రాగిచెంబులాంటి మనస్సుకు పట్టే మకిలి ఈ ఆరుభావనలు!
ఈ భావనలను "యోగసాధన" అనే చింతపండుతో నిత్యం తోమాల్సిందే !
ఏ ఒక్కక్షణం కూడా బద్ధకించకూడదు!
అందుకే ఆమార్గం "క్షురస్యధారా నిశితా దురత్యయా దుర్గమ్ పధః" అని కఠోపనిషత్తు చెపుతుంది!
మనిషి తనలో చెలరేగే ప్రతి భావాన్ని నిశితంగా గమనించి ఆ భావం ఎక్కడనుండి పుడుతుందో దాని మూలంలోకి వెళ్లి ఎప్పటికప్పుడు పెరికివేయాలి!
 లేకపోతే కలుపుమొక్కలు పుడుతూనే ఉంటాయి!
మనలను మనమే ఉద్ధరించుకోవాలి!
 మనకు మనమే శత్రువు!
మనకు మనమే మిత్రుడు!
..........

కాలం ఒక ప్రవాహం, అది నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది.. ఎన్నో లోయలు, వంపులు, మలుపులు. అన్నీ అధిగమిచ్చి నిరంతరం తనకు తాను ముందుకు సాగుతూనే ఉంటుంది.. ప్రవహించిన నీరు వెనక్కు రాదు.. అదే విధంగా  చేజేతులా జారవిడుచుకున్న క్షణాన్ని మళ్ళీ వెనక్కు తీసుకోలేం. బాల్యం లో, యవ్వనం లో ఎన్నెన్నో క్షణాలను వృధా చేసుకుంటాం. వయసు పై పడిన తరువాత ఒక్క సారి వెనక్కు చూసుకుంటే. అదేదో విచిత్రమైన అనుభూతి.. అలా చేసి ఉండక పోవలసిందని.. అలాగే చేయడం మంచిదైందని అనుకుంటాం. అందుకే ప్రతిసారి మన అనుభవాలను, కష్టాలను, సుఖాలను గుర్తుచేసుకుంటూ.. ముందుకు సాగాలి.. అవే మనకు పాఠాలు, గుణపాఠాలు..
ఓరోజు ఓ ధనవంతుడు ఓ అడవిగుండా పోతున్నాడు. ఉన్నట్టుండి ముగ్గురు దొంగలు ఆయనను చుట్టుముట్టి బెదిరించారు. ఆయన దగ్గరున్నదంతా దోచుకున్నారు. అయితే దొంగలలో ఒకడు “ఇతని దగ్గరున్నదంతా దోచేసుకున్నాం. కనుక ఇతనుండి లాభమేంటీ... అతనుంటే మనకు ప్రమాదం కూడా. చంపేస్తేనే మనం బయటపడగలం” అని ఆవేశంగా అన్నాడు. ఆ మాటలతో ఆగలేదు. తన దగ్గరున్న కత్తిని తీసి అతనిపై దాడికి దిగాడు. ఇంతలో రెండో దొంగ అడ్డుపడి “అతనిని చంపడం వల్ల మనకేమీ లాభం లేదు...అతనిని కట్టపడేసి ఇక్కడే వదిలేద్దాం. అతను తనపై జరిగిన దాడి గురించి పోలీసులకు చెప్పలేడు” అన్నాడు. అతను చెప్పిన మాట బాగుందనుకుని దొంగలు అతనిని తాళ్ళతో కట్టి నడి అడవిలో వదిలేసి వెళ్ళిపోయారు. కాస్సేపు తర్వాత మూడో దొంగ ఒక్కడూ అతని దగ్గరకు వచ్చాడు. “నిన్ను మా వాళ్ళు బాగా వేధించారు కదూ. కొట్టారు. గాయపరిచారు కదూ...క్షమించు....నాకు నిన్ను చూస్తే జాలి వేస్తోంది. నేను నిన్ను విడిచిపెడతాను.... ” అంటూ మూడో దొంగ కట్లన్నీ విప్పి అతనిని విడిచిపెట్టాడు. అంతేకాదు, అడవి నుంచి అతనిని తనతోపాటు బయటకు తీసుకువచ్చాడు. “నా వెంటే రా....నువ్వు ఏ అవాంతరం లేకుండా సులభంగా మీ ఇంటికి చేరుకోగలవు...” అన్నాడు. దొంగ చేస్తున్న సహాయానికి కృతజ్ఞతలు చెప్తూ “సరేగానీ నువ్వు నాతోపాటు మా ఇంటికి రావా”లన్నాడు. “నువ్వు నాకెంతో సహాయం చేశావు. నీలోనూ ఎంతో కొంత మానవత్వం ఉంది. అది నాకెంతో ఆనందంగా ఉంది. నీకు కృతజ్ఞతలు” అన్నాడు ఆ ధనవంతుడు. “నువ్వు మా ఇంటికి వస్తే మా కుటుంబసభ్యులను పరిచయం చేస్తాను. నన్ను కాపాడింది నువ్వేనని వారికి చెప్తాను, వారెంతో సంతోషిస్తారు.... ” అన్నాడు. కానీ దొంగ తనను క్షమించమని, తాను వాళ్ళింటికి రాలేనని అంటాడు. అక్కడికి వచ్చినట్లు తెలిస్తే నన్ను పోలీసులు అరెస్టు చేస్తారంటూ చెప్పి ఆ ధనవంతుడికి దగ్గర దారి చూపించి వెళ్ళిపోతాడు. ఈ కథతో తెలుసుకోవలసినవి మూడు గుణాలు. అవి, ఒక దొంగేమో ఆ ధనవంతుడు ఉండి లాభమేంటీ...అతనిని చంపేస్తేనే మంచిదని అన్నాడు. ఇది తమోగుణం. ఇక రెండో దొంగ ఏం చెప్పాడు....అతనిని చంపడంవల్ల మనకెలాంటి లాభమూ లేదు. అతనిని తాళ్ళతో కట్టిపడేసి వెళ్ళిపోదాం అన్నాడు. ఇది రజో గుణం. ఇక ఇంకొక దొంగ వైఖరిని సత్వ గుణంగా చెప్పుకోవచ్చు. సత్వగుణం దైవాన్ని చేరుకునే మార్గం చూపుతుంది. మొదటి ఇద్దరు దొంగలకన్నా అతను మేలు. అతను దొంగే అయినప్పటికీ అతనిలో మిగిలిన ఇద్దరిలోనూ లేని మంచి గుణం ఎంతో కొంత ఉంది. కనుకనే అతను ఆ ధనవంతుడికి ఇంటికి చేరుకునే మార్గాన్ని చూపించాడు.

****

 🍁వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా?🍁


"మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః " - అంటే అర్ధం తెలుసా???

SUN'DAY
MO(O)N'DAY
TUESDAY
WEDNESDAY
THURSDAY
FRIDAY
SATUR(N)DAY

- అంటే ఏమిటో తెలుసా?
అసలు ఈ వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా?

వీటిని కాపీ కొట్టి, ఇవి మావే అని డబ్బా కొట్టుకుంటున్నది ఎవరో తెలుసా?

సూర్యహోర
చంద్రహోర
కుజహోర
బుధహోర
గురుహోర
శుక్రహోర
శనిహోర - అంటే తెలుసా?

ఇవి సంస్కృత గ్రంధాలలో మన ఋషులు చేసిన వారాల విభాగమని తెలుసా?
ఇవి ఎంతో శాస్త్రీయమైనవి కాబట్టే, బ్రిటిష్ వాళ్లు వీటిని తమ క్యాలెండర్ లో పేర్లు మార్చి, వాటిని వారి విజ్ఞానంగానే ప్రపంచాన్ని నమ్మిస్తున్నారని తెలుసా?
తెలియదా!?
సరే... ఇప్పుడైనా తెలుసుకుందాం! రండి!
ముందుగా ఈ వారాల పేర్లు సంస్కృతం నుండి గ్రీకుకు - అక్కడి నుంచి లాటిన్ దేశాలకు ప్రయాణం చేశాయి!
వారము - అంటే 'సారి' అని అర్ధము.

1వ సారి, 2వ సారి... అంటాము కదా దాన్నే సంస్కృతంలో ప్రథమ వారము, ద్వితీయ వారము - అని అంటారు!
కాస్త విపులంగా....
భూగోళము బొంగరం మాదిరి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందని మన ఋషులు కనుగొన్నారు.
భూగోళము తన చుట్టూ తాను ఒకసారి తిరగడాన్ని "ఒక వారం" అని పిలిచారు. ఒకసారి అన్నా - ఒక వారం అన్నా ఒకటే.ఆకాశంలో గ్రహాల వరస ఎలా ఉందో, సూర్య సిద్ధాంత గ్రంధంలో రికార్డు చేయబడి ఉంది.

మందామరేడ్యభూపుత్రసూర్యశుక్ర_బుధేందవః
అనగా...
పై నుండి క్రిందికి వరుసగా - శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలున్నాయి.

ఆకాశంలో గ్రహాలు ఈ వరసలో ఉంటే, వారాల్లో సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని అనే వరసలో ఎందుకున్నాయి?

ఆ గ్రహాల వరసకి, ఈ వారాలకీ అసలు సంబంధం ఏమిటి? దీంట్లో ఏం లాజిక్ ఉంది? ఇది కేవలం మూఢ విశ్వాసమా?
ఈ విషయాలు తెలియాలంటే, భారతీయ ఋషుల విజ్ఞానాన్ని లోతుగా పరిశీలించాలి.

భూమి తనచుట్టూ తాను తిరగడానికి 60 ఘడియలు పడుతుంది.
ఈ 60 గడియలలో ఈ 7 గ్రహాల ప్రభావాలు ఎలా పడుతున్నాయో మన మహర్షులు గమనించారు.
ఆ ప్రభావాల ప్రకారం లెక్క వేసుకుంటూ వస్తే ఒక "అహః" ప్రమాణంలో 24 భాగాలు కనిపించాయి.
ఆ భాగాలను వారు "హోర" అన్నారు.
"అహః ప్రమాణం" అన్నా, "అహోరాత్ర ప్రమాణం" అన్నా ఒక్కటే. అహోరాత్ర అనే పదంలో మధ్య రెండక్షరాలు కలిపితే "హోర" అయింది.
దీన్నే సాంకేతిక పదంగా తీసుకొని రోజుకి 24 హోరలు అన్నారు.
ఈ హోర పదాన్ని అవర్(HOUR) గా మార్చి పాశ్చాత్యులు 24 అవర్స్(HOURS) అన్నారు.
హోర శబ్దానికి అవర్ శబ్దానికి ఉన్న భాషాశాస్త్రపరమైన సామ్యాన్ని(పోలిక) పరిశీలించినప్పుడు కూడా మనం ఆశ్చర్యపోక తప్పదు.

ఒక్కొక్క గ్రహాల ప్రభావం అదే వరుసలో భూమిమీద ప్రసరిస్తూ చక్రభ్రమణం చేస్తూ ఉంటుంది.
ఈ భ్రమణంలో చిత్రమేమిటంటే, ఇవాళ - ఆదివారం అయితే ఈరోజు మొదటి హోర, సూర్యహోర వస్తుంది. ఇందాక చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో... ఒక్కొక్క హోరనూ పంచుకుంటూ వస్తే మర్నాడు ఉదయానికి సరిగ్గా చంద్ర హోర ఉంటుంది.
కనుక ఆ రోజు చంద్రవారం లేక సోమవారం.
మళ్లీ వరుసగా హోరలు పంచుకుంటూ వెళితే ఆ మర్నాడు ఉదయానికి మంగళహోర వస్తుంది. కనుక ఆ రోజు - మంగళవారం,
ఆ మరునాడు ఉదయానికి బుధహోర - బుధవారం ఆ మరునాడు ఉదయానికి గురుహోర అది -గురువారం.
ఆ మర్నాడు ఉదయానికి ఈ శుక్రహోర - శుక్రవారం. ఆ తరువాత ఉదయానికి శని హోర - అది శనివారం. ఇలా సూర్యోదయ సమయానికి ఉండే హోర మీద ఏ గ్రహం ప్రభావం ఉంటుందో ఆ గ్రహమే ఆ రోజుకు పేరు అవుతుంది.
అయితే... ఈ విధానం వినడం కొత్త అయిన హేతువాద, నాస్తిక, పచ్చ బాబులకు... మొదటి రోజు సూర్యోదయ సమయానికి సూర్యహోర అవుతుందనుకుంటే కదా ఈ లెక్కలన్నీ...ఇలా వచ్చేది!
అసలు అలా ఎందుకు అనుకోవాలి అనే ప్రశ్న సహజం.
వస్తున్నా... అక్కడికే వస్తున్నా...
ఎందుకనుకోవాలంటే - సూర్యుడి(ఆనాటి నిరక్షరాస్యునికి కూడా విపులంగా అర్ధం కావడం కోసం మన ఋషులు సూర్యున్ని గ్రహం గా తీసుకున్నారని గమనించాలి) - ఆధిపత్యంలో... సూర్యుడి ప్రభావం పరిపూర్ణంగా ఉన్న ఘడియలో సృష్టి ప్రారంభం జరిగిందని మన పురాణాలు నిర్ణయించాయి.

దీన్నే మరోరకంగా చెప్పుకుంటే సృష్టి ప్రారంభంలో ఏ గ్రహం ప్రభావం అమలులో ఉందో ఆగ్రహం పేరే ఆదిత్యుడు. అంటే మొదటివాడు.
అదే మొదటిరోజు.
అందువల్ల ఆ రోజు ఆదివారం అవుతుంది.
ఆదివారం అన్నా, ఆదిత్యవారం అన్నా ఒకటే.
అక్కడినుంచి ఒక హోరకు ఒక గ్రహంగా ఇప్పుడు చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో గ్రహాలను పంచుకుంటూ వస్తే, మర్నాడు సూర్యోదయానికి మొదటి గ్రహం నుంచి నాలుగో గ్రహం యొక్క హోర వస్తుంది. ఈ లెక్క ప్రతిరోజు ఇలాగే సాగుతుంది. ఈ లెక్క ప్రకారం, హోరాధిపతుల వరస ఆదిత్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని - ఈ విధంగా వస్తుంది.

అందుకే వారాల పేర్లు ఈ వరసలోనే వచ్చాయి.
ఈ విధంగా ఆకాశంలో ఉండే గ్రహాల వరస వేరుగా, వారాల వరస వేరుగా అయింది.

ఈ సత్యాన్ని అన్ని దేశాల్లో ఇలాగే పాటిస్తున్నా, ఇవాల్టి వైజ్ఞానిక లోకానికి కూడా " ఫలానా ఈ వారానికి ఈ పేరే ఎందుకు రావాలి?" అనే విషయం తెలియదు.

అది భారతీయులైన మహర్షులకే తెలిసిన సత్యం!

కాబట్టి హేతువాదులని చెప్పుకునే కుహనా మేధావులారా! అన్యమత సంస్కృతులను మూఢాచారాలని నమ్మే కమ్మే వారాల పేర్లు ఇతరమత గ్రంథాల్లో ఇమడవు కదా!

మరి ఆ మాక్స్ ముల్లరూ, విలియం జోన్సూ, రిస్లే బాస్టెడూ ఎందుకు వీటిని తీసెయ్యలేకపోయారూ?
పేర్లు మార్చి, కాపీ కొట్టి ఇవి మావేనని ఎందుకు జబ్బలు చరుచుకుంటున్నారు??? ఎందుకంటే ఇవి బైబిల్ చట్రంలో ఇమడలేదు, తీసెయ్యడానికి కుదరలేద!

అదీ...భారతీయ ఋషుల గొప్పదనం!
నేటికైనా తెలుసుకోండి.. తెలియకపోయినా పాటించండి! సనాతన ధర్మ సంస్కృతిలో ప్రతీదీ మనిషికి పనికొచ్చే సైన్సే తప్ప వేరే కాదు.

🍁*****

sekarana 🌹. వివేక చూడామణి - 53 / Viveka Chudamani - 53🌹
✍️  రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 16. బుద్ది   - 2 🍀

189. స్వయంగా అత్యంత ప్రకాశవంతమైన ఆత్మ హృదయములో అది స్వచ్ఛమైన విజ్ఞానము కలిగి ప్రాణములో ప్రకాశిస్తుంది. అది నిర్వికారమైనప్పటికి దాని కారణముగానే అనుభవాలు మరియు దాని అత్యంత ప్రభావము వలన విజ్ఞానమయ కోశము రూపొందుతుంది.

190. జీవించి ఉన్న ప్రతి జీవి యొక్క ఆత్మ బుద్ది యొక్క కొన్ని పరిమితులకు లోబడి తప్పుగా తనను తాను ఈ ప్రపంచములో వేరుగా భావిస్తుంది. మట్టి కుండ మట్టితో తయారైనప్పటికి తాను మట్టి కంటే వేరుగా భావిస్తుంది.

191. దివ్యాత్మతో సంబంధము వలన తాము దానితో సమానముగా భావించి, అది ప్రకృతి సిద్దముగా స్వచ్ఛమైనప్పటికి తాను ఉన్నతమైన ఆత్మవలె ప్రకాశిస్తుంది. మార్పు చెందని అగ్ని వివిధ మార్పులు చెందుతూ ఇనుమును అగ్నిగా ఎర్రగా ఎలా మారుస్తుందో అలానే.

192. మాయ వలన కాని ఇతర కారణముల వలన ఉన్నతమైన ఆత్మ తననుతాను జీవాత్మగా భావిస్తుంది. ఈ భావనకు మొదలుగాని, చివరగాని లేదు. దీనికి అంతము లేదు. అది జీవాత్మగా పిలువబడుతుంది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

సదాచారము 


పరిశుద్ధ జీవనము ఒక్కటియే మార్గమున పురోగతి నివ్వజాలదు. సదాచారవంతు లెందరో గలరు. పాత్రను పరిశుద్ధి చేయుట సద్వినియోగపరచుటకే కదా! కేవలము ప్రతిదినము తోమి, కడిగి, భద్రముగ వుంచిన పాత్ర వలన వినియోగము లేదుకదా! ఆహార పదార్థములను వండుటకు పాత్రను వినియోగించినట్లే నీవు కూడ పరహితమను యజ్ఞమునకు సమర్పణము చెంది
యుండవలెను.

పాత్ర అగ్ని తాకిడి భరించి, రుచికరమైన పదార్థములను తయారుచేసి పదిమందికి పోషణము కలిగించును. నీవును అట్లే జీవితపు ఆటుపోటులను భరించుచు, పదిమందికి వినియోగపడు పద్ధతిలో జీవించుట ముఖ్యము. కేవలము సదాచారమే సమస్తము అను భ్రమనందు జీవింపకుము. సదాచారమవసరమే. అది లేనివారు సత్కార్యములను నిర్వర్తించలేరు.

సత్కార్య నిర్వహణకు సదాచారముతో పాటు సత్సంకల్పము, తెగించు బుద్ధి (ధీరత) కూడ నుండవలెను. ఇట్టి గుణములు లేని సదాచారము డాంబికముగ నుండును. తెలియని అహంకారము నిన్నాశ్రయించి యుండును. పదిమందికి ఉపయోగ పడిన జీవనమే జీవనము. త్వరపడి పరహిత కార్యమున పాల్గొనుము.

సశేషం...

 స్వేచ్

నాకు స్వేచ్ఛగా ఉండాలనిపిస్తుంది. కానీ, దాని గురించి ఆలోచించిన వెంటనే నాలో చాలా భయం కలుగుతోందని ఇటీవలే నాకు తెలిసింది. అయితే అది కేవలం ఒంటరితనం, బాధ్యతల నుంచి తప్పించుకోవడమే తప్ప వేరే ఏదీ కాదు. కాబట్టి, స్వేచ్ఛ గురించి ఎందుకు అంతగా భయపడుతున్నానో దయచేసి కాస్త వివరంగా చెప్పండి.

మీరు ఇతరులపై ఆధారపడి వారి సలహాలు, సూచనలను పాటించాలని మీకు బాగా చిన్నప్పటి నుంచే బోధించారు. అందుకే మీకు స్వేచ్ఛ అంటే భయం. అది సహజమే. మీకు వయసు పెరిగిందే కానీ, బుద్ధి పెరగలేదు. అన్ని జంతువులకూ వయసు మాత్రమే పెరుగుతుంది కానీ, బుద్ధి పెరగదు. బుద్ధి పెరగడమంటే ఆధారపడే తత్వం నుంచి బయటపడడం. అది మనిషికి మాత్రమే సాధ్యమవుతుంది.

దేవుడు మిమ్మల్ని రక్షిస్తున్నాడని ఆది నుంచే మీకు బోధించారు. అందువల్ల మీరు ఆయన రక్షణ వలయంలో ఉన్నారనుకుంటారు. మీ లెక్కలు మీకుంటాయి. ‘‘ భయపడకండి. దేవుడు మిమ్మల్ని రక్షిస్తున్నాడు. కాబట్టి, ఆయనను తలచుకుంటూ పడుకోండి’’ అని చిన్న పిల్లలకు కూడా రాత్రి పడుకునే ముందు బోధిస్తారు.

మీకు వయసు పెరిగినా మీ పసితనంలో నాటిన ఆ భావన మీలో అలాగే ఉండిపోతుంది. కానీ, ఎవరూ మిమ్మల్ని రక్షించ వలసిన అవసరం లేదని, చీకటిలో కూడా మీరు హాయిగా పడుకోవచ్చని’’  నేనంటాను. అంటే ‘‘మీరు భయపడుతున్నారని, అందుకే మిమ్మల్ని రక్షించేందుకు ఎవరో ఒకరు కావాలని, లేకపోతే మీరు పడుకోలేరని’’ అర్థం. .

ఒకవేళ మీ రోగం కేవలం ఊహాత్మకమైతే- అలాంటి రోగులు మీ చుట్టూ అనేకమంది ఉంటారు. ఒక చిన్న విషయం చాలు, వారికే తెలియకుండా వారు దానిని పెద్దది చేస్తారు- దానికి ఊహాత్మకమైన మందు అవసరమవుతుంది. ఒక మాయ చెయ్యడమే వాటికి మందు. ‘‘దేవుడు’’ అలాంటి మందే.

నిశ్శబ్దంగా ఉండే అనంతమైన కటిక చీకటి చాలా అందంగా ఉంటుంది. వెలుగు వస్తుంది, పోతుంది. కానీ, చీకటి ఎప్పుడూ అలాగే ఉంటుంది. అది వెలుగుకన్నా ఎక్కువ శాశ్వతమైనది. వెలుగు కావాలంటే మీకు ఇంధనం అవసరం. కానీ, చీకటికి ఇంధనం అవసరం లేదు. ఎందుకంటే, అది ఎప్పుడూ ఉండేదే. వెలుగు ఒత్తిడి కలిగిస్తుంది. అందువల్ల మీకు నిద్ర పట్టదు. విశ్రాంతి లభించదు. కాబట్టి, విశ్రాంతి కోసం వెలుగును ఎంచుకోవడం సరియైన పని కాదు. అసలైన విశ్రాంతి చీకటిలోనే లభిస్తుంది.

కాబట్టి, అందులోకే వెళ్ళండి. నిజానికి, చీకటిలో మిమ్మల్ని భయపెట్టేది ఏదీ లేదు. అనవసరంగా ఆ విషయంలో మిమ్మల్ని భయపెట్టారు. అందుకే చీకటిలో మిమ్మల్ని రక్షించేందుకు ఆ దేవుడు మీకు అవసరమవుతాడు.  ఒక అబద్ధానికి మరొక అబద్దం చెప్పాల్సి వస్తుంది. అలా మీరు అంతులేని అబద్ధాలు చెప్తూనే ఉంటారు.

స్వేచ్ఛ మిమ్మల్ని అనేక విషయాలలో కచ్చితంగా భయపెడుతుంది. కాబట్టి, ఆ విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండండి. మిమ్మల్ని భయపెట్టే విషయాలపై లోతుగా దృష్టి సారించండి. వెంటనే వాటిపై మీకున్న భయం పోతుంది. మీరు భయపడేందుకు ఈ ప్రపంచంలో ఏదీ లేనప్పుడే మీరు స్వేచ్ఛగా ఆనందించగలరు, దాని బాధ్యతను స్వీకరించగలరు.

బాధ్యత మీరు ఉన్నతంగా ఎదిగేలా చేస్తుంది. అందువల్ల మీరు ప్రతి పనిలో, ఆలోచనలో, భావనలో మరింత బాధ్యతాయుతంగా ఉంటారు. అలా అది మీకు, మీ మనస్తత్వానికి ఉన్న బంధనాలన్నింటినీ తొలగించి, మిమ్మల్ని మరింత పారదర్శకంగా చేస్తుంది.

మీరు మీ భయాలను మరీ ఎక్కువగా ఊహించుకున్నారు. అందుకే వాటినుంచి తప్పించుకునేందుకు చేసే ప్రయత్నంలో అసలు వాటివైపే చూడకుండా వాటికి వ్యతిరేకమైన వాటిని మీరు సృష్టిస్తున్నారు. వెంటనే అవి వడగళ్ళలా కరిగిపోతూ తగ్గిపోవడం ప్రారంభిస్తాయి. వాటి గురించి మీకు పూర్తి అవగాహన కలిగే సమయానికి అవి పూర్తిగా అదృశ్యమైపోతాయి. గుర్తుంచుకోండి.

మన అభిప్రాయాలను పిల్లలపై రుద్దకుండా, వారి స్వేచ్ఛలో మనం జోక్యం చేసుకోకుండా, వారి సామర్థ్యం పూర్తిగా ఎదిగేందుకు మనం ఎలా సహాయపడగలం?

పిల్లలు పూర్తి సామర్థ్యంతో ఎదిగేందుకు మనం ఎలా సహాయపడాలి? అని ఆలోచించడమే మీరు తప్పుదారిలో ఉన్నట్లు నిరూపిస్తోంది. అలా మీరు పిల్లలకు ఏది చెయ్యాలనుకున్నా అది కూడా మీకు కావలసిన రీతిలో మలచబడ్డ ప్రణాళికే అవుతుంది.

అది మీరు మీ పెద్దలనుంచి స్వీకరించిన నిబద్ధీకరణ ప్రణాళికకన్నా భిన్నమైనదే కావచ్చు, మీది సదుద్దేశమే కావచ్చు. ఏదేమైనా, మీరు పిల్లలను ఏదో ఒక రకంగా నిబద్ధీకరిస్తున్నారు.

ఇంకా వుంది...
🌹 🌹 🌹 🌹 🌹

ఓ రాజు తనకు యుద్ధంలో విజయం సంపాదించిపెట్టిన తన సామంతులకు విందు ఇస్తూ,

తన అందమైన కుమార్తె చేత వడ్డింపజేస్తున్నాడు.

ఇంతలో ప్రచండమైన గాలి వీచి, దీపాలు ఆరిపోయాయి.

తరువాత రాకుమార్తె ఏడుస్తూ తండ్రిని చేరి,

ఒక సామంతుడెవడో తన చేయి పట్టుకొని లాగాడని,

తాను విడిపించుకొని వస్తూ అతని తలపాగాను లాక్కొచ్చానని,

దాని సాయంతో ఆతని శిక్షించమని చెప్పింది.

రాజు, ఆమెను ఊరుకోబెట్టి, దీపాలు వెలిగించాక, తన సామంతులతో

సంతోషకరమైన ఈ విందు సమయంలో అధికారాన్ని సూచించే తలపాగాలు ధరించవద్దని

అందర్నీ తీసేయమన్నాడు. అందఱూ తీసేసి, మరింత ఉత్సాహంతో విందారగించారు.

ఆ తరువాత తన చర్యను రాకుమార్తెకు వివరిస్తూ, రాజు,

ఆ సంతోషసమయంలో అతనిని శిక్షిస్తే, అది విషాదంగా మారుతుందని,

తమ సాటివాడు శిక్షకు గురయితే, అది మిగతావారికి క్షోభకరంగా మారుతుందని,

అందువల్ల ఓపికవహించానని, మనకు విజయం సాధించిపెట్టాడు కాబట్టి

నీవు కూడా అతనిని క్షమించలేవా? అన్నాడు.

రాకుమార్తె, అంగీకరించిందో లేదో మనకు తెలియదు.

ఒకనాడు రాజు వేటకు వెళ్లగా, పగబట్టిన శత్రువులు అదును చూసి, చుట్టుముట్టారు.

రాజు యుద్ధం చేస్తున్నాడు కానీ అలసిపోయాడు. అదే సమయంలో మెరుపులా దూకిన

ఒకడు, రాజుకు అండగా నిలబడి, శత్రువులందర్నీ ఊచకోత కోశాడు.

ప్రాణాలకు తెగించి, తన ప్రాణాలను కాపాడిన అతడికి రాజు కృతజ్ఞతలు తెలియజేయగా,

నా ప్రాణాలను కాపాడిన మీకే నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి అని అతడన్నాడు.

ఆశ్చర్యపొతున్న రాజుతో అతడు విషయం తెలుపుతూ,

విందురోజున వీచిన గాలికి, అలంకరణార్థం ఏర్పాటుచేసిన స్తంభం ఒకటి

రాకుమార్తెమీద పడబోతుండగా తాను, విధిలేక

ఆమె చేయి పట్టుకొని, ఇవతలకు లాగానని,

అయితే మీరు పెద్దమనసుతో తనను క్షమించి, ప్రాణాలను తీయక వదలిపెట్టినందువల్లే

ఇప్పుడు మీ ప్రాణాలను కాపాడగలిగానని చెప్పాడు.

ఈసారి రాకుమార్తె అతణ్ణి క్షమించడం కాదు. అతడికే క్షమాపణలు చెప్పి ఉంటుంది.

ఈ కథ క్షమాగుణం యొక్క గొప్పతనాన్ని తెలుపుతోంది.

పైవన్నీ ప్రక్కన పెట్టండి. కోపం మనకు ఎలా శత్రువవుతుందంటే,

కోపం వల్ల శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి.

అనేక కెమికల్ టాక్సిన్స్ పుడతాయి. ఇవి మనకు చెరుపు కలుగజేస్తాయి.

రక్తప్రసరణవేగం హెచ్చుతుంది.

అంటే బిపికి రహదారి కోపం.

తలనొప్పులు వస్తాయి.

ముఖ కవళికలు మారతాయి. దాంతో ముఖం అందవిహీనంగా మారుతుంది.

నుదుటిన ముడుతలు ఏర్పడతాయి.

వాల్మీకి, రామాయణంలో రాముని వర్ణిస్తూ,

రాముని నుదుటి మీద ఎన్నడూ ముడుతలు ఏర్పడలేదని అంటాడు.

అంటే రాముడెప్పుడూ ప్రసన్నమైన మోముతోనే ఉండేవాడని అర్థం.

ఈ ప్రసన్నతే అంటే శాంతగుణమే ఆరోగ్యదాయిని.

చుట్టం అవసరంలో ఆదుకొన్నట్లు

మన దయాస్వభావం మనను అవసరంలో తప్పక ఆదుకొంటుంది.

తద్ద్వారా ఏర్పడిన సంతోషం ఇక్కడే స్వర్గాన్ని సృష్టిస్తుంది.

శుభసాయంత్రం
 😊💐

 🙏🙏🙏🙏🙏
ధర్మరాజును పరీక్షిచుటకు యమధర్మరాజు యక్షుడి రూపంలో 72 చిక్కు ప్రశ్నలు వాటికి ధర్మరాజు ఇచ్చిన జవాబులు:

1. సూర్యుణ్ణి ఉదయింప చేయువారు ఎవరు? (బ్రహ్మం)

2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (దేవతలు)

3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (ధర్మం)

4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (సత్యం)

5. మానవుడు దేనివలన శ్రోత్రియుడగును? (వేదం)

6. దేనివలన మహత్తును పొందును? (తపస్సు)

7. మానవునికి సహాయపడునది ఏది? (ధైర్యం)

8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (పెద్దలను సేవించుటవలన)

9. మానవుడు మానవత్వమును ఎట్లు పొందును? (అధ్యయనము వలన)

10. మానవునికి సాధుత్వాలు ఎట్లు సంభవిస్తాయి? (తపస్సువలన సాధుభావము, శిష్టాచార భ్రష్టత్వం వల్ల అసాధుభావము సంభవించును.)

11. మానవుడు మనుష్యుడెట్లు అవుతాడు? ( మృత్యు భయమువలన)

12. జీవన్మృతుడెవరు? (దేవతలకూ, అతిధులకూ పితృసేవకాదులకు పెట్టకుండా తినువాడు)

13. భూమికంటె భారమైనది ఏది? (జనని)

14. ఆకాశంకంటే పొడవైనది ఏది? (తండ్రి)

15. గాలికంటె వేగమైనది ఏది? (మనస్సు)

16. మానవునికి సజ్జనత్వం ఎలావస్తుంది? ( ఇతరులు తనపట్ల ఏపని చేస్తే, ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల కూడా ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో అట్టి వానికి సజ్జనత్వం వస్తుంది)

17. తృణం కంటే దట్టమైనది ఏది? (చింత)

18. నిద్రలో కూడా కన్ను మూయనిది ఏది? (చేప)

19. రాజ్యమేలేవాడు దైవత్వం ఎలా పొందుతాడు? ( అస్త్రవిద్యచే)

20. రాజ్యాధినేతకు సజ్జనత్వం ఎలా కలుగుతుంది? ( యజ్ఞం చేయుటవలన)

21. జన్మించియు ప్రాణంలేనిది (గుడ్డు)

22. రూపం ఉన్నా హృదయం లేనిదేది? (రాయి)

23. మానవుడికి దుర్జనత్వం ఎలా వస్తుంది? (శరణుజొచ్చిన వారిని రక్షించక పోవడంవలన)

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (నది)

25. రైతుకు ఏది ముఖ్యం? (వాన)

26. బాటసారికి, రోగికి, గౄహస్ధునకూ, చనిపోయిన వారికి బంధువులెవ్వరు? (సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)

27. ధర్మానికి ఆధారమేది? (దయ దాక్షిణ్యం)

28. కీర్తికి ఆశ్రయమేది? (దానం)

29. దేవలోకానికి దారి ఏది? (సత్యం)

30. సుఖానికి ఆధారం ఏది? (శీలం)

31. మనిషికి దైవిక బంధువులెవరు? (భార్య/భర్త)

32. మనిషికి ఆత్మ ఎవరు? ( కుమారుడు)

33. మానవునకు జీవనాధారమేది? (మేఘం)

34. మనిషికి దేనివల్ల సంతసించును? (దానం)

35. లాభాల్లో గొప్పది ఏది? (ఆరోగ్యం)
🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment