సీతాపతీ పద్యకావ్యము
సీసము
మనసుయే బతికించు మనిషిని నిత్యమూ
ప్రేమయే పంచును ప్రియుని యందు
శీలమే మనిషిని శీఘ్రమ్ము గ కదుల్చు
నిస్వార్ధమె మనిషి నిజము తెల్పు
సత్యమార్గపు కళ సంతోష పరచును
శాంతమే మనిషికి సౌఖ్య మవ్వు
సహనమే మనిషికి సహజగుణంఔను
ముక్తిపదముకదె మూలమగును
తేటగీతి
భక్త జనులను రక్షించు భవ్య జీవి
భాగ్య మిచ్చియు మనసును బాగుపరచు
భజన చేసిడివారిని భయముమాపు
లక్ష్మణా సత్యమును తెల్పు లోకమందు
--(())--
సీసము
శృంగార రసము తా బొంగార సీతతో
మించు వేడుక విహరించినావు
శివధనుర్బంగంబు, జేసెడి వేళలో
వీరరసంబు గుపించినావు
కాకాసురునియందు, కారుణ్యరసమును
చిలికించి, వాని రక్షించినావు
అంబుధిలో, పర్వతాళిని దేలించి
యద్భుతంబును చూపి యలరినావు
తేటగీతి
తల్లి తండ్రుల పలుకును నిలిపినావు
ధర్మ మనుచు వనములకు ఏగినావు
సూర్పనఖయందు హాస్యము జూపినావు
ప్రాంజలి ఘటించు రామ ని పాదములకు
--(())--
సీతాపతీ పద్యకావ్యము
సీసము
తత్త్వం అర్ధములను - తెలిసిన వాడికి
లోకము పిచ్చిది - లాశ్య మవ్వు
తాత్వికుడు మనసు - తాపత్రయము గుండు
లోకము పాలించు - లలిత మవ్వు
నిత్య సనాతన - నిర్మాన ధర్మాలు
దేహలయానికి - దైవ మవ్వు
నీవు దేవుడవైన - నా హృదయము నందు
దేవాలయము రామ - ధన్య మవ్వు
తేటగీతి
తత్వ భావాలు జీవికి - తృప్తి పెంచు
ధర్మ సందేహములు తీర్చి - దారి చూపు
రామ రాజ్యం లొ కష్టాలు - రావు లేవు
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు
--(())--
సీసము
ఎద లోతులో మది - ఏడుపు మడతలో
మనసు మమత లోన - మరులు గొలుపు
హృది ఉల్లము శృతిగా - రాగంతొ కృతిగాను
గీతంతొ లయవేద - గీత మాయె
గతి గమకంతోను - గోప్యతా భావము
వయసు వలపు లోన - వ్యక్త పరచి
హృది లోయ లోపల - హరించు మోహము
శ్రీ రామ వీక్షించి - రక్ష చేయు
తేటగీతి
ఆశయాలలొ సహనపు భావ ముంచి
రామశ్రీరామ సతాపతీ మనోహ
రామ రామను చుంటిని రామ భద్ర
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు
--(())--
సీసము
అక్షర సంప్రోక్ష ణము - మది లాలన
తలపు లో నిలిచిన, - తిరగని కళ
మమతల పట్టి గా - మనసున ఉంచుము
సహజ భావనలేలు - సమత మమత
హారపు సిరిచంద - నాలను మాకిమ్ము
నవజీవన తలపు - నమ్మి ఉన్న
సుమమాలల సువర్ణ - సుందర పట్టీని
సీఘ్రము గానీ కు - చిలిపి రామ
తేటగీతి
నిత్య సత్యాలు బోధన - నిజము గుండె
అమృత దారలు వర్షించె - అదుపు తప్పి
నిత్యనూతన కానుకల - నీకు రామ
ప్రాంజలి నొనర్తు రామ నీ - పాదములకు
--(())--
అదియె ఆనంద నిలయం
ధర్మో రక్షతి ధర్మం
అదియె నిత్య కళ్యాణం
అక్కడ పత్స తోరణం
--(())--
!
🧘♂️భవబంధాలు🧘♀️
ఈ లోకంలో అందరికీ తాము ఒంటరి గానే రావడం, ఒంటరి గానే పోవడం జరుగుతుందని తెలుసు. అయినా తల్లిదండ్రులూ సంతానం, భార్యా భర్త, బంధువులూ, మిత్రులూ అందరూ పరస్పరాసక్తితో వ్యవహరిస్తుంటారు. ఈ విశ్వంలోని సంబంధాలన్నీ మిథ్యయే, అసత్యాలే..
చిన్న కథ...
ఓ ఊళ్ళో శ్రీమంతుడైన ఓ శ్రేష్ఠి కుమారుడు నిత్యం ఓ సాధువు దగ్గరకు ఉపదేశాలు వినడానికి వెళ్తుండేవాడు. కానీ ప్రవచనం పూర్తి కాకుండానే వెళ్లి పోతుండేవాడు. ఒక నాడు ఆ సాధువు "నాయనా..!ఎందుకలా చేస్తున్నావు..?" అని అడిగాడు. దానికి ఆ శ్రేష్ఠి కుమారుడు.. "స్వామీ..! నేను నా తల్లి దండ్రులకు ఏకైక పుత్రుణ్ణి. ఇంటికి తిరిగి వెళ్ళడంలో ఏ మాత్రం ఆలస్యమైనా వాళ్ళు కంగారు పడతారు. నా కోసం వెదకడానికి బయలుదేరుతారు. నా భార్య కూడా నేను వెళ్ళేవరకూ ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉంటుంది. సాంసారికుల వ్యవహారం మిథ్య అని మీరంటారు. కాని ఆ విషయంలో తమకు అనుభవం లేదు స్వామీ..!" అని బదులిచ్చాడు.
"అయితే మీ వాళ్లకు నీ మీద అంత ప్రేమ అంటావు..!" అన్నాడు సాధువు. " అవును స్వామీ..! నా మాట మీద తమకు నమ్మకం లేనట్లుంది." అన్నాడా యువకుడు." నాకు ఉండడం, లేకపోవడం గురించి కాదు. నీకు నమ్మకం కలగడానికి ప్రేమ పరీక్ష పెట్టి చూసుకో..!" అని సలహా ఇచ్ఛాడు సాధువు." ఎలా స్వామీ..?" అడిగాడు ఆ యువకుడు."ఇదిగో..! ఈ మూలిక తిను. నీ శరీరం క్రమేణా వేడెక్కిపోతుంది. తరువాత అక్కడ జరిగేదేమిటో నువ్వే చూస్తావు." అని చెప్పాడు సాధువు. ఆ యువకుడు సాధువు ఆదేశాన్ని పాటించి ఆ మూలిక తిని ఇంటికి వెళ్లిపోయాడు.
అతని శరీరం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. తలిదండ్రులు వైద్యుని పిలిపించి చూపించారు. వైద్యుడు ఏం చేసినా ఫలితం లేదు. భార్య వెక్కి వెక్కి ఏడవసాగింది. ఇంతలో ఆ సాధువు వచ్చేడు. అందరూ ఆ యువకునికి చికిత్స చేయమని సాధువును అర్థించారు. సాధువు చూసి.. "ఎవరో మాయను ప్రయోగించారు. నేను దాన్నిని ఉపసంహరించగలను." అని అతడు ఓ పాత్రతో నీరు తెమ్మన్నాడు. ఆ నీటిని యువకుని తల చుట్టూ త్రిప్పి "నేను నా మంత్రశక్తితో ఆ దుష్టగ్రహాన్ని ఈ నీటిలోకి పంపించేసాను. ఈ యువకుణ్ణి రక్షించాలంటే మీలో ఎవరైనా ఈ నీటిని త్రాగెయ్యాలి." అన్నాడు.
మళ్ళీ "ఈ నీరు త్రాగినవారు మరణిస్తారు. కానీ ఈ యువకుడు మాత్రం బ్రతికి తీరతాడు." అని సాధువు అనగానే ఆ యువకుని తల్లి "స్వామీ..! నేను నా ప్రియ పుత్రుని కోసం ఈ నీటిని త్రాగగలను. కాని నేను చనిపోతే నా వృద్ధ పతికి సేవలు ఎవరు చేస్తారు..?" అంది. తర్వాత ఆ యువకుని తండ్రి "నేను ఈ నీటినైతే తాగుతాను కాని నా మరణానంతరం పాపం నా భార్య గతి ఏమవుతుందోనని వెనుకాడుతున్నాను. నేను లేకపోతే ఈమె అసలు బ్రతుకలేదు" అన్నాడు.
సాధువు వినోదంగా "అయితే మీరిద్దరూ చెరిసగం నీళ్ళు త్రాగండి. ఇద్దరి క్రియాకర్మాదులు ఒకేసారి జరిగిపోతాయి." అనగానే ఆ ఇద్దరూ మరి మాట్లాడలేదు. ఆ యువకుడి భార్యనడుగగా ఆమె " వృద్ధురాలైన నా అత్తగారు సాంసారిక భోగాలన్నీ అనుభవించింది. కాని నేనింకా యౌవనంలో ఉన్నాను. ఏ అచ్చటా, ముచ్చటా, ముద్దూ మురిపెం, సుఖం సంతోషం చూసినదాన్ని కాదు. నేనెందుకు మరణించాలి?" అంది.
ఈ విధంగా ఆ యువకుని బంధు గణమంతా ఆ నీళ్ళు త్రాగడానికి నిరాకరించారు. సరి కదా అంతటితో ఊరుకోక "మహాత్మా..! మాపై దయ తలచి తమరే ఈ నీళ్ళు త్రాగి పుణ్యం కట్టుకొండి. మీ వెనుక ఏడ్చే వాళ్ళెవరూ లేరు కదా..! పరోపకారం పరమ ధర్మమని మీరే ఎన్నోసార్లు చెప్పేరు. కనుక మీరే ఈ ఉపకారం చెయ్యండి." అన్నారు.
ఆ యువకునికి తనపై తన వారి ప్రేమ వ్యవహారానుభవం కలిగింది. అతను లేస్తూనే.. "మహాత్మా..!నేను ఈ అన్ని బంధాలూ స్వార్థ పూరితమైనవే. వాస్తవిక సంబంధం ఆ పరమాత్మ తోటిది మాత్రమే అని గ్రహించాను" అంటూ ఇల్లు వదలి ఆ మహాత్మునితో వెళ్లిపోయాడు.
((())))
No comments:
Post a Comment