బ్రహ్మ జీవ తత్వాలు
వెన్నెలలొ ఏల కోపము వేకు వగను
మనసు సెగలేల ఎగసిన మూగ వగును
పువ్వులలొ కేల నవ్వుల పువ్వు అగును
ముల్లై గుచ్చియు మమతల మల్లె యగును
కన్నులలొ ఏల కోపము కినుకు యగును
మనసు కణకణ లాడిన మౌన మగును
చూపులలొ కేల కన్నుల చిగురు యగును
చూపు గుచ్చియు నగవు చిందు లగును
నీ పలుకులన్ని భాధించె నా మనసును
నీ కులుకులన్ని వేధించె నా మనసును
నీ చదువులన్ని మార్పించు నా మనసును
నీ వలపులన్ని చంపేను నా మనసును
పైట బులిపించు చేదులు పీట లగును
అకట కలహించి కథలేలు ఆట లగును
తరుము కొచ్చేటి మనసైన తీపి యగును
మాట కరువైన వినయమ్ము మనసు యగును
* * *
ధృతి – క్షమ – దమం – అస్తేయం – శౌచం – ఇంద్రియ నిగ్రహం – హ్రీః (సిగ్గు) – విద్య – సత్యం – అక్రోధం”, ఈ పది లక్షణాలు కలిగియున్న ధర్మమని శాస్త్రం చెబుతోంది. అంటే;
శ్లో || ధృతిః క్షమా దమో స్తేయం, శౌచమింద్రియ నిగ్రహః|
హ్రీర్విద్యాసత్య మక్రోధః ఏతత్ ధర్మస్త్య లక్షణమ్||
“ధృతి – క్షమ – దమం – అస్తేయం – శౌచం – ఇంద్రియ నిగ్రహం – హ్రీః (సిగ్గు) – విద్య – సత్యం – అక్రోధం”, ఈ పది లక్షణాలు కలిగియున్న ధర్మమని శాస్త్రం చెబుతోంది. అంటే;
1. మానవుడు ఏదైనా పని ప్రారంభిస్తాడు. తనకు సంబంధించినది కానివ్వండి, కుటుంబానికి సంబంధించినది కానివ్వండి, సమాజానికి సంబంధించినది కానివ్వండి! ప్రారంభించేటపుడు ఏ సమస్యలు ఉండవు. కాని ప్రారంభించిన కొన్ని రోజులకే నూటొక్క సమస్యలు ప్రారంభమవుతాయి. కువిర్శలు ప్రారంభమౌతాయి. ఎన్నెన్నో అడ్డంకులు కలిగి నిరాశ కల్గుతుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మబలంతో అకుంటిత దీక్షతో ‘ధృతి’ చెడకుండా ముందుకి సాగిపోవాలి. ‘ఇది ధర్మం’.
2. మనిషి ఏ విషయంలోనైనా, ఏ పనిలోనైనా ఓర్పు కలిగి వుండాలి. క్షమాగుణంతో ఉండాలి. ప్రతిదానినీ ప్రతివారినీ, ప్రతి విషయాన్నీ, క్షమాశక్తితో ఎదుర్కోనాలి. కోపగించుకోకూడదు. ఓర్పుగుణం వున్నవారిని ఏ శక్తులూ ఏమీ చేయలేవు. ‘ఇది ధర్మం’.
3,. మనం ఒక పని చేసేటపుడు మన మనస్సు సంపూర్ణంగా ఆ విషయంలోనే లగ్నం కావాలి. ఒక పనిచేస్తూ మరొక దానిని గురించి ఆలోచించకూడదు. ఏ విషయంలోనైనా ముఖ్యం. చదువుతున్నా, వింటున్నా, పని చేస్తున్నా, మాట్లాడుతున్నా, మనస్సును పరిపరిమార్గాలకు పోనివ్వకుండా వుండాలి ‘ఇది ధర్మం’.
4. తనకు తెలియని విషయాలను తాను తెలిసికొనక, పెద్దలు, పూర్వులు, చెప్పినదానిని అంగీకరించక, స్వతంత్ర నిర్ణయం తీసికోనలేక, నిస్తేజంగా నిర్వికారంగా, నిరాశగా, నిర్లిప్తతగా, నియమరాహితుడుగా, ఉండకూడదు. ‘ఇది ధర్మం’.
5మనిషి ఎల్లపుడూ మనస్సునూ, శరీరాన్నీ, మాటనూ ఆలోచననూ, సంసారన్నీ, ఇంటినీ, పరిసరాన్నీ, ధరించే వస్త్రాలనూ పరిశుభ్రంగా శుచిగా వుంచుకోవాలి. మనసు పరిశుభ్రంగా వుండాలి. మాత్రమే పరిశుభ్రంగా ఉండాలి. మనిషి పరిశుభ్రంగా ఉండాలి. ‘ఇది ధర్మం’.
6 ,చదువువున్నా, సంపదలున్నా, కీర్తివున్నా, బలంవున్నా ఇంద్రియ నిగ్రహం లేనివానికి ఏదో ఒకరోజు పతనం తప్పదు. కాబట్టి మనస్సును దాని ఇష్టానికి దాని వదలివేయకుండా మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. ‘మనస్సును గెలిచినవాడు దేవేంద్రుడైనా గెలుస్తాడు’ మనస్సును తమ చెప్పుచేతల్లో ఎవరుంచుకొంటారో వారిని భూతప్రేతాలుగాని, దెయ్యాలు గాని, యక్షకిన్నర కిమ్పురుశులుగాని, గ్రహాలు గాని, రోగాలు గాని, కష్టసుఖాలుగానీ, మరణంగానీ, వశంలో వుంటాయి. కాబట్టి మనస్సును, మాటను, దృష్టిని, శరీరాన్నీ, చేతలనూ అదుపుచేయాలి ‘ఇది ధర్మం’.
7 ,ప్రతి విషయానికీ సంకోచపడటం, సిగ్గుపడటం, అనుమానపడటం, తనను తాను తక్కువగా భావించటం కూడదు ‘ఇది ధర్మం’.
8 . మనిషి సత్యవ్రతం కలిగిఉండాలి. అకారణంగా, అనవసరంగా, ఒకరి మెప్పుకోసం, ఒకరిని మెప్పించటంకోసం, తన పనిని సాధించుకోవటం కోసం, తాను ఏ విధంగానైనా ప్రయోజనం పొందటంకోసం. తనవారిని తృప్తిపెట్టట్టంకోసం అబద్దాలు చెప్పకూడదు. అబద్ధం కలిగిస్తుంది. అబద్ధం అల్పసుఖాన్ని మాత్రమే కల్గిస్తుంది. అబద్ధం మరోకనాటికి అవమానం పాలు చేస్తుంది. అబద్ధం మనిషి విలువను మట్టిచేస్తుంది. మన శక్తినీ, మనకీర్తినీ, మన గోప్పదనాన్నీ పాతాళానికి త్రోక్కివేస్తుంది. కాబట్టి సాధ్యమైనంతవరకూ సత్యధర్మాన్ని వదలకూడదు. ‘ఇది ధర్మం’.
9 , మానవునికి ఆహరం ఎంత ముఖ్యమో, వివేకం కూడ అంతే ముఖ్యం. వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి. శాస్త్రాలు, పురాణాలు ఇతిహాసాలు విన్నంత మాత్రాననే వివేకం సిద్ధించదు. విన్న విషయాలను స్వానుభవానికి మళ్ళించుకోవాలంటే మనిషికి విద్య కావాలి. ‘విద్యావిహీనః పశుః’ అని ఆర్యవాణి. మనిషిగా పుట్టి మట్టిబొమ్మగా జీవిత గడపకూడదు. ఎంతటి పెడతానం పెనవేసుకొనివున్నా, స్థితిగతులు ఎంతటి బాధాకరమై వున్నా,భిక్షమెత్తి అయినా చదువుకోవాలి అని ఋషివాక్యం. విద్య ప్రతి వ్యక్తికీ నిర్బంధంగా ఉండాలి. ‘ఇది ధర్మం’.
10 ,పగ, హింస, కోపం, ప్రతీకార మనస్తత్వం ఇవన్నీ మనిషిని పతనావస్థకు నేడతాయి. పగ, ప్రతీకారాలు మనిషిని అశాంతికి గురిచేసి అనారోగ్యాన్ని కల్గిస్తాయి. తన అభివృద్ధికి తానే ఆటంకంగా నిలవాల్సివస్తుంది. తనను కన్నవారికీ,
తాను జన్మనిచ్చిన వారికీ, తనను నమ్మి బ్రతికేవారికీ అన్యాయం కల్గుతుంది.
మనిషి శారీరకంగా ఆర్ధికంగా బలహీనమైనపుడు.. ఆ మనిషి ఎన్ని తప్పులు చేసినా అంతకుముందు మన మననును బాధ పెట్టినా అవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా.. వారిని ఆదరించి నీకు మేమున్నాం అని భరోసా కల్గించడం మానవీయ లక్షణం. రోగాన్ని రోగ గ్రస్త శరీరాన్ని మనం నయంచేయలేకపోయినా అప్పటి వారి మానసిక స్థితి శరీర దౌర్భల్యానికి ఆదరణతో కూడిన సేవ సాంత్వన కల్గించే మాటలను తప్పకుండా అందించాలి. మనుషుల హృదయాలు రాతి హృదయాలు కరగనివయితే కాదు.. కదా!
మంచిమనుషులకు కోపం తాటాకు మంటలాంటిదంటారు.. కదా.. అలా వుండగల్గాలి. ఎవరూ తప్పులు చేయనివారు లోపాలు లేని వారు వుండరు. క్షమ మనిషిని మహోన్నత శిఖరాల మీద కూర్చుండబెడుతుంది అంటారు కదా.. నిజానికి చాలామంది డబ్బు లేక సరైన వైద్యం లేక పోరాడి అలసి అలసి నిస్సహాయస్థితిలో మరణిస…
***
నిగ్రహంతోనే అనుగ్రహం
మనిషికి మనో నిగ్రహం అవసరం. దాన్ని పొందాలంటే ప్రతి రోజూ క్రమం తప్పకుండా ధ్యానం చేయడం అవసరం. కళ్లు, చెవులు, ముక్కు, నోరు జ్ఞానేంద్రియాలు. మానవునికి ప్రపంచం ఏమిటో తెలుసుకోవడానికి ఉప యోగపడే సాధనాలు ఇవి. అలాగే కాళ్లు, చేతులు కర్మేంద్రియాలు. ఇవి మనం కోరుకున్న వాటిని పొందడానికి పని చేసే పరికరాలు. ప్రకృతిలో అందమైన దృశ్యాలను చూడటానికి కళ్లు ఆరాట పడతాయి. శుభవార్తలను, మంచి మాటలను వివడానికి చెవులు ఇష్టపడతాయి. అలాగే, సువాసనలను, స్వచ్ఛమైన గాలిని పీల్చడానికి ముక్కు ఉపయోగపడుతుంది. నాలుకకు రుచులు అంటే అత్యంత ప్రీతి. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మనకు ఎల్లప్పుడూ లోబడి ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇంద్రియ నిగ్రహంతోనే ఇవి అదుపులో
ఉంటాయి. అందుకే మనిషికి ఇంద్రియ నిగ్రహం అవసరం. మనం ఇంద్రియాలకు లోబడి ఉండకూడదు. ఇంద్రియాలే మన ఆధీనంలో ఉండాలి. అలా ఉండాలంటే, మన సును ముందుగా మన అదుపులో ఉంచు కోవాలి. మనసును నిలకడగా ఉంచడం అంత సులువు కాదు. అది చూసిన ప్రతి దానినీ పొందాలని తాపత్రయపడుతుంది. ఇంద్రియాల మీద నిరంతరం అది ఒత్తిడి తెస్తుంటుంది. దాంతో అనేక రకాల ఇబ్బందులు తలెత్తు తుంటాయి. ఈ సంఘర్షణే మానసిక అశాంతికి దారితీస్తుంది.
మనో నిగ్రహం పొందాలంటే..
మనో నిగ్రహం పొందాలంటే మనసును దైవ ధ్యానం మీద లగ్నం చేయాలి. అర్థం లేని ఆలో చనలు మనసును చుట్టుముడితే ఇష్టదైవ నామాన్ని జపించాలి. అస్టమాను గుడికి వెళ్లడానికి కుదరకపోయినా బాధపడాల్సిన పనిలేదు. మనసు భగవంతుడి మీద నిమగ్నం చేయగలిగితే చాలు. మనసు నిర్మలంగా ఉంటే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వల్ల మనో నిగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా బాహ్య ప్రపంచంలో తిరగడం వల్ల, మంచి పుస్తకాలు చదవడం వల్ల, మంచి మాటలను వినడం వల్ల, మంచి వ్యక్తులతో, సత్సంగాలు చేయడం వల్ల మనకు తెలియని అనేక విషయాలు తెలిసి వస్తాయి. తెలియని కొత్త కొత్త మంచి విష యాలను తెలుసుకోవడమే జ్ఞానం. తెలివైన
వాళ్లు దేనికీ భయపడరు. ఎలాంటి పనైనా సరే దిగ్విజయంగా చేయగలుగుతారు. అంతేకాక ఇతరులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించగలుగుతారు. నోరు మంచిదైతే ఊరు మంచిదనే సామెత కూడా ఉండనే ఉంది కదా!. దీనిని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టేవారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంటికి వచ్చిన అతిథులను, స్నేహితులను ఆదరించి వారితో ఏ విధమైన పరుష వాక్యాలు పలకకుండా మంచిగా మాట్లాడాలి. అంతేగాని చీటికీమాటికీ అబద్ధాలు, లేనిపోని గొప్పలు మాట్లాడకూడదు. మనం ఆత్మీయంగా మాట్లాడితే అందరూ మనం అంటే ఇష్టపడతారు. గౌరవిస్తారు. మన మాటకు విలువ ఇస్తారు. కోరికలకు పగ్గాలు వేయాలి..
అలాగే, కోరికలు అనంతాలు. ప్రతి ఒక్కరికీ కోరికలు ఉంటాయి. కొన్ని కోర్కెలు తీర్చు కోవచ్చు. మరికొన్ని తీర్చుకోవడానికి వీలు కాదు. ఆ కోర్కెలు ఎలా తీర్చుకోవాలా అని ఆలోచిస్తూ కూర్చుంటే పరిష్కారం లభించకపోగా, కుటుంబంలో, మనసులో లేనిపోని అలజడులు కలుగుతాయి. మనసులో అలజడి రేగితే భార్యాభర్తలు, పిల్లలతో ఆనందాన్ని పంచుకోలేం. వారితో సంతోషంగా ఉండలేం. స్నేహితులతో సరిగా ఉండలేం. ఏ పనీ మనసు పెట్టి చేయలేం. దేనిపైనా శ్రద్ధ చూపలేం. నిద్రపట్టదు. మనసు గతి తప్పుతుంది. ఇన్ని బాధలు పడుతూ కోర్కెలు పెంచుకోవడం అనేది అవివేకం. అధికమైన, తీరని కోర్కెలు కలగకుండా మనసుసు అదుపులో ఉంచుకోవాలి. అందుకు దైవ ధ్యానమే సరైన మార్గం. జపం ఎంత ఎక్కువగా చేస్తే మనసులోని కోర్కెలు అంత త్వరగా తొలగిపోతాయి. మనసు ప్రశాంతంగా, బుద్ధి నిలకడగా ఉంటుంది. రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులు, తలనొప్పులు మొదలైన రోగాలు కూడా దరిచేరవు.
ఉదయాన్నే లేస్తే ఎన్నెన్నో మార్పులు..
నేటి యాంత్రిక జీవితాలలో రాత్రి చాలా పొద్దుపోయే వరకు మెలకువగా ఉండటం, తెల్లవారాక ఎంత ఆలస్యంగా నిద్రలేస్తే అంత శ్రమపడ్డాం, అంత గొప్పవారం అనుకునే వారు చాలామంది ఉన్నారు. ఆలస్యంగా నిద్రలేస్తే ఎంత నష్టమో గమనించాలి. పిల్లలైనా, పెద్దవారైనా ఎవరైనా సరే తెల్లవారుజామునే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. అది ఆరోగ్యదాయకమైన లక్షణం. తెల్లవారుజామునే నిద్రలేచి బయట తిరుగుతూ పనులు చేసుకోవడం వల్ల నక్షత్రాల కాంతి శరీరానికి మెరుపును ఇస్తుంది. వీచే చల్లని గాలి శ్వాసకోశాలను శుభ్రపరచడమే కాక రోజంతా ఆహ్లాదాన్ని ఇచ్చే మానసిక ఆనందాన్ని కలుగుచేస్తుంది. ఉదయించే సూర్యకిరణాలు శరీరంపై పడటంతో ఎటువంటి చర్మవ్యాధులు దరిచేరవు. చాలామంది తెల్లవారుజామునే లేవలేం, పని చేయలేం అంటారు. కానీ, మనిషికి సాధ్యం కానిది ఏదీ లేదు కదా! మనసు ఉంటే మార్గం ప్రతీ దానికీ ఉంటుంది. వారం రోజులు క్రమం తప్పకుండా తెల్లవారుజామునే నిద్రలేస్తే అదే అలవాటు అవుతుంది. చీకటితోనే లేస్తే దైవ ధ్యానం చేసుకోవచ్చు. పనులు చేసుకుని, పిల్లలను చదివించవచ్చు. హడావుడి లేకుండా స్కూళ్లకు పంపించి ఆరామముగా ఆఫీసులకు వెళ్లవచ్చు. దీనివల్ల తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయాల్సి రావడం వల్ల పడే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.
ప్రస్తుతం పల్లెల్లోనూ, పట్టణాల్లోనూ ధ్యానం (మెడిటేషన్) నేర్పడానికి అనేక కేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. ఇంట్లో దైవ ధ్యానం చేయడానికి కుదరని వారు రోజూ ఏదో సమయంలో ఈ కేంద్రాలకు కానీ, గుడికి కానీ, ఖాళీ ప్రదేశాలకు కానీ వెళ్లి ధ్యానం చేయవచ్చు. లేదా ప్రశాంతంగా గడపవచ్చు. తద్వారా ఆరోగ్యానికి, మనసుకు స్వాంతన చేకూరుతుంది. వ్యాపకం లేకుండా ఎప్పుడూ ఇంట్లోనే ఏదో ఒక పనితో సతమతం అయ్యే వారు ఈ పేరుతోనైనా బయటకు వస్తే బాహ్య ప్రపంచం గురించి తెలుస్తుంది. నలుగురితో పరిచయాలు పెరిగి అందరితోనూ ధైర్యంగా మాట్లాడగలుగుతారు. యువతరానికి కూడా ధ్యానం అనేది తప్పనిసరి. అందులో నేటి తరం వారికి అన్ని రంగాల్లోనూ పోటీ విసరీతంగా పెరిగి వారి మనసుపై ఒత్తిడి అధికమవుతోంది. కొందరు బలహీనులైన వారు ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణాలు కూడా తీసుకుంటున్న ఉదంతాలను మనం చూస్తున్నాం. అటువంటి సున్నిత మనస్కులు మానసిక ఆందోళన చెందకుండా నిదానంగా ఆలోచించి పోటీని తట్టుకుని, సరైన మార్గంలో పయనించాలంటే వారికి మనో నిగ్రహం చాలా అవసరం. ధ్యానం ద్వారా మాత్రమే దానిని పొందగలం. ధ్యానాన్ని ఒక సాధనగా చేసుకోగలిగితే కనుక మనం జీవితంలో చాలా సాధించగలం. .
హృదయంతో జీవించాలి..
ధ్యానం, ప్రశాంతత.. ఇవన్నీ సాధించడానికి ముందు మనం అసలు ‘హృదయం’తో బతకాలి. మనం జీవించడానికి ఉండాల్సిన అతి ముఖ్యమైన సాధనం హృదయం. కానీ, దురదృష్టవశాత్తూ మనం హృదయం లేకుండానే బతికేస్తున్నాం. జీవులన్నిటిలో మనిషే ఉత్తముడు. అతనికి హృదయమే ప్రాణం. అక్కడే ఆలోచనలు.. అవి మంచివైనా, చెడ్డవైనా ప్రాణం పోసుకుంటాయి. మనలో ఏ లక్షణాలు ఎక్కువగా ఉంటే మనం ఆ రకంగా రూపుదిద్దుకుంటాం. అటువంటి పవిత్ర హృదయ స్థానంలో భగవంతుడిని ప్రతిష్ఠించుకుంటే మనం సాక్షాత్తూ భగవంతుడిలా మారిపోగలం. హృదయంలో దైవాన్ని ప్రతిష్ఠించుకుంటే, మనకు జీవితంలో ఏ లోటుపాట్లూ రావు. ఒడిదుడుకులు ఉండవు. కాబట్టి మొదట హృదయంతో జీవించడం అలవాటు చేసుకోవాలి. అది మనలోనే ఉంది. దానిని గుర్తించి, దానిని దారిలో పెట్టుకోగలిగితే చాలు ఇక మన పయనమంతా పూలబాటే.
సీతాపతీ పద్య కావ్యము
సీ ::
అర్ధంకోసం నేను ఆరాధనలు చేశ .
ఆర్ధికము అనర్ధ మలయు చుండె
ప్రజల కోసం నేను పుడమిని ప్రార్ధించా
నా ప్రయోజనము యే నన్ను వీడె
పాండిత్య పరిమళం ప్రగతిని చాటుతు
పుస్తకం గానులే ప్రజ్వ రిల్లె
సంఘశ్రేయస్సుయే నిస్వార్ధి సేవలు
సార్ధకమును చేయ సంఘమందు
తేటగీతి
రామ నిరుపమాన కళలు రవ్వ లయ్యె
మనిషి గా జీవితమ్మును మన్ననివ్వు
మాన వత్వాన్ని బతికించు మార్గ మివ్వు
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు
--(()))--
సంపాదనకోసం వ్రాస్తే ....
సోలిపోతుంది!
విలువల కోసం వ్రాస్తే ....
వికసిస్తుంది
విత్తకోసం వ్రాస్తే ....
వ్యర్ధమవుతుంది !
పీడితులకోసం వ్రాస్తే ....
ఫలితముంటుంది !
పైసలకోసం వ్రాస్తే ....
పుస్తకమవుతుంది!
పదికాలాలుం
ప్రాంజలి ప్రభ .. మధురిమలు
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
తన్వంగి తప్పిదములకు
తన్వి తనువు తాపమునకు
తమ్మికింటి తన్మయముకు
తరళ లోచన నమ్ముటకు
లొంగని దెవ్వరే కళకు
ఇదియు తరుణి నడవడికకు
తరలేక్షణ ఒడి నడకకు
తలిరుబడి చురుకుదనముకు
లొంగని దెవ్వరే కళకు
తలోదరిగ తమకమునకు
తామరకంటి తపమునకు
తామరనేత్ర చూపులకు
లొంగని దెవ్వరే కళకు
తియ్య బడిన తలుపులకు
తీగబడిన కళ మెలికకు
కలసియే తెఱువ తెగువకు
తెలిగంటి కల వలపుకు
తొగవ కంటి తోపుకళకు
ఇక తొయ్యలి తమకమునకు
లొంగని దెవ్వరే కళకు
--((**))--
ధర్మం నాలుగుదిక్కుల నడుమ
జీవం ఆశల పక్కల నడుమ
న్యాయం రూకల గుక్కలు నడుమ
ప్రాణం మోహము దాహము నడుమ
64 కళలు వివరణ సహితం (బ్రహ్మ జీవతత్వాలు)
3. నృత్యము (భావాభినయము),
4. అలేఖ్యము (చిత్రలేఖనము),
5. విశేషకచ్ఛేధ్యము (తిలక-పత్రభంగాది రచన),
6. తండులకుసుమ బలివికారములు (బియ్యపుపిండితో, పూలతో భూతతృప్తి కొఱకు పెట్టెడి ముగ్గులు),
7. పుష్పాస్తరణము (పూలశయ్యలను, అసనములను ఏర్పఱచుట),
8. దశన వసనాంగరాగము (దంతములకు, వస్త్రములకు రంగులద్దుట),
9. మణిభూమికాకర్మ (మణులతో బొమ్మలను చేయుట),
10. శయన రచనము (ఋతువుల ననుసరించి శయ్యలను కూర్చుట),
11. ఉదక వాద్యము (జలతరంగిణి),
12. ఉదకాఘాతము (వసంతకేళిలో పిచికారుతో నీళ్ళు చిమ్ముట),
13. చిత్రయోగములు (రకరకముల వేషములతో సంచరించుట),
14. మాల్యగ్రథన వికల్పములు (చిత్ర విచిత్రములైన పూలమాలలను కూర్చుట),
15. శేఖరకాపీడ యోజనము (పూలతో కిరీటమును, తలకు చుట్టును అలంకరించుకొనెడి పూల నగిషీని కూర్చుట),
16. నేపథ్య ప్రయోగము (అలంకరణ విధానములు),
17. కర్ణపత్రభంగములు (ఏనుగు దంతములతోను శంఖములతోను చెవులకు అలంకారములను కల్పించుకొనుట),
18. గంధయుక్తి (అత్తరువులు మొదలగునవి చేసే నేర్పు ),
19. భూషణ యోజనము (సామ్ములు పెట్టుకొను విధానము ),
20. ఇంద్రజాలములు (చూపఱుల కనులను భ్రమింప జేయుట),
21. కౌచిమారయోగము (సుభగంకరణాది యోగములు),
22. హస్త లాఘవము (చేతులలోనున్న వస్తువులను మాయము చేయుట),
23. విచిత్ర శాఖయూష భక్ష్యవికారములు (రకరకముల తినుబండములను వండుట),
24. పానక రసరాగాసవ యోజనము (పానకములు, మద్యములు చేయుట),
25. సూచీవానకర్మ (గుడ్డలు కుట్టుట),
26. సూత్రక్రీడ (దారములను ముక్కలు చేసి, కాల్చి మరల మామూలుగా చూపుట),
27. వీణాడమరుక వాద్యములు (ఈవాద్యములందు నేర్పు),
28. ప్రహేళికలు (సామాన్యార్థము మాత్రము పైకి కనబడునట్లును, గంభీరమైన యర్థము గర్భితమగునట్లును కవిత్వము చెప్పుట),
29. ప్రతిమాల (కట్టుపద్యములను చెప్పుట),
30. దుర్వాచక యోగములు (విలాసము కొఱకు క్లిష్ట రచనలను చదువులట),
31. పుస్తక వాచకము (అర్థవంతముగా చదివెడి నేర్పు),
32. నాటకాఖ్యాయికా దర్శనము (నాటకములకు, కథలకు సంబంధించిన జ్ఞానము ),
33. కావ్యసమస్యాపూరణము (పద్యములతో సమస్యలను పూరించుట),
34. పట్టికా వేత్రవాన వికల్పములు (పేముతో కుర్చీలు, మంచములు అల్లుట),
35. తక్షకర్మ (విలాసము కొఱకు బొమ్మలు మొదలైనవి చేయుట),
36. తక్షణము (కఱ్ఱపని యందు నేర్పు),
37. వాస్తువిద్య (గృహాదినిర్మాణ శాస్త్రము ),
38. రూప్యరత్నపరీక్ష (రూపాయలలోను, రత్నములలోను మంచి చెడుగులను పరిశీలించుట),
39. ధాతువాదము (లోహములుండెడి ప్రదేశములను కనుగొనుట),
40. మణిరాగాకర జ్ఞానము (మణుల గనులను కనిపెట్టుట),
41. వృక్షాయుర్వేద యోగములు (చెట్లవైద్యము),
42. మేషకుక్కుటలావక యుద్ధవిధి (పొట్టేళ్ళు, కోళ్ళు, లావుక పిట్టలు మొదలగు వానితో పందెములాడుట),
43. శుకశారికా ప్రలాపనము (చిలుకలకు, గోరువంకలకు మాటలు నేర్పుట),
44. ఉత్సాధన, సంవాహన, కేశమర్దన కౌశలము (ఒళ్ళుపట్టుట, పాదములోత్తుట, తలయంటుట వీనియందు నేర్పు),
45. అక్షరముష్టికా కథనము (అక్షరములను మధ్య మధ్య గుర్తించుచు కవిత్వము చెప్పుట),
46. మ్లేచ్ఛితక వికల్పములు (సాధుశబ్దమును గూడ అక్షర వ్యత్యయము చేసి అసాధువని భ్రమింపజేయుట),
47. దేశభాషా విజ్ఞానము (బహుదేశ భాషలను నేర్చియుండుట),
48. పుష్పశకటిక (పూలతో రథము, పల్లకి మొదలగునవి కట్టుట),
49. నిమిత్త జ్ఞానము (శుభాశుభ శకునములను తెలిసియుండుట),
50. యంత్ర మాతృక (యంత్ర నిర్మాణాదులు),
51 ధారణ మాతృక (ఏకసంధా గ్రహణము),
52. సంపాఠ్యము (ఒకడు చదువుచుండగా పలువురు వానిననుసరించి వల్లించుట),
53. మానసీక్రియ (మనస్సుయొక్క అవధానమునకు సంబంధించిన క్రియ),
54. కావ్యక్రియ (కావ్యములను రచించుట),
55. అభిధాన కోశచ్ఛందో విజ్ఞానము (నిఘంటువులు, ఛందోగ్రంథములు-వీని పరిజ్ఞానము),
56. క్రియాకల్పము (కావ్యాలంకార శాస్త్ర పరిజ్ఞానము),
57. ఛలితక యోగములు (మాఱువేషములతో నింకొక వ్యక్తివలె చలామణి యగుట),
58. ద్యూతవిశేషములు (వస్త్రములను మాయము చేయుట మొదలగు పనులు),
59. ద్యూతవిశేషములు (జూదము లోని విశేషములను తెలిసికొని యుండుట),
60. ఆకర్షక్రీడలు (జూదములందలి భేదములు),
61 బాలక్రీడనకములు (పిల్లల ఆటలు),
62. వైనయిక జ్ఞానము (గజ అశ్వ-శాస్త్ర పరిజ్ఞానము),
63. వైజయిక విద్యలు (విజయసాధనోపాయములను తెలిసియుండుట),
64. వ్యాయామిక జ్ఞానము (వ్యాయామపరిజ్ఞానము).
🌹 🌹 🌹 🌹 🌹
కంచి కామక్షి తల్లిని దర్శించుకోవడానికి కేవలం మానవ సంకల్పం సరిపోదు తల్లి సంకల్పమే ప్రధానం. ఇది గొప్ప విశేషం
🔸 సమస్త భూమండలానికి నాభి స్థానమే #కాంచీపురం. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మన నాభినుండే తల్లి పోషిస్తుంది. అందుకే కామక్షి తల్లిని దర్శించుకున్న వారిని కష్టం లేకుండా పోషిస్తుంది.
🔸 ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా అమ్మను ఇక్కడ "సుగంధ కుంతలాంబ" అవతారంలో దర్శించవచ్చు.
(ముత్తైదువులకు అఖండ సౌభాగ్యం లభిస్తుంది. )
🔸 ప్రపంచంలో ఎక్కడా దర్శించలేని విధంగా ఇక్కడ "ఢంకా
వినాయకుడు" దర్శనమిస్తాడు.
(ఏకాంబరేశ్వర,సుగంధ కుంతలాంబ కళ్యాణ మహోత్సవాన్ని ఢంకా భజాయింపుతో అందరికీ తెలియజేస్తాడు)
🔸 కామాక్షి తల్లి ఆలయంలో "అరూప లక్ష్మి" దేవి దర్శనమిస్తుంది. కామాక్షితల్లిని అర్చించిన తరువాత పూజారి మనకిచ్చిన కుంకుమ ప్రసాదాన్ని అరూప లక్ష్మి తల్లికి ఇచ్చి దాన్నే ప్రసాదంగా తీసుకుంటే భర్తను నిందించిన దోషం పొతుంది , మరియు స్త్రీపురుషులు ఎవరైనా సరే ఇక్కడ అరూప లక్ష్మి తల్లిని దర్శించుకుంటే తప్పకుండా శాపవిమోచనం అవుతుంది.
🔸 కాత్యాయనీ దేవి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడానికి తపస్సు చేసిన క్షేత్రం కాంచిపురం. తపస్సులో భాగంగా శివకల్పితమైన గంగా ప్రవాహాన్ని తట్టుకొని సైకతలింగాన్ని రక్షించుకునే ప్రయత్నంలో లింగాన్ని తన ఆలింగనంతో(కౌగిలితో) కాపాడుకుంటుంది . అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మ గాజుల మరియు కుచముల ముద్రలు ఇప్పటికీ అక్కడ శివలింగం పై అగుపిస్తాయి.
🔸 కామాక్షిదేవి ప్రధాన ఆలయానికి ప్రక్కనే ఉన్న ఉత్సవ కామక్షి తల్లికి ఎదురుగా ఉన్న గోడలో తుండిర మహారాజు, శివుడి నంది ఎలాగో అమ్మకు అలా ఎదురుగా ఉంటాడు. (తనను నమ్మినవారికి ఎంతటి మహోన్నత స్థానాన్నైనా అనుగ్రహించగలదు కామక్షి)
అమ్మధ్యానంలో, "శోకాపహంత్రీ సతాం" అనే దివ్య వాక్కు
గురించి వర్ణణ ఉంది. ఎవరైతే సతతం మనః శుద్ధితో అమ్మను ధ్యానించే సత్పురుషులు ఉంటారో, అలాంటి వారి దుఃఖాన్ని పోగొట్టడానికి తల్లి ఎల్లపుడు సిద్ధంగా ఉంటుంది . తనయొక్క కరుణను కురిపించి ఆదుకుంటుంది , భుజం తట్టి నేనున్నాని ధైర్యం చెబుతుంది.
కావున భక్తులెల్లరు కామాక్షితల్లిని దర్శించి పునీతులు
కాగలరని మనవి
🙏 ఓం శ్రీ మాత్రేనమః 🙏
🙏🙏🙏🙏🙏
విభూది నీటితో అభిషేకం
ఎన్నో సమస్యలు తో బాధ పడుతూ ఏది కలిసిరాక ఇబ్బందులు పడుతూ ఏ పాపము చేసాము అని బాధ పడుతుంటారు చాలా మంది..ఒక వేళ నిజం గా ఏదైనా పాప కర్మ ఉండచ్చు లేకపోవచ్చు ఒక వేళ ఉంటే ఎటువంటి పాప కర్మ నుండి అయినా విముక్తి కలిగించే ది శివుని అభిషేకం.. శివుడు ఐశ్వర్య కారకుడు ఎన్నో ఆటంకాలు తొలగించి సంతోషాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు.
సూర్యుడు అస్తమించే సమయంలో ప్రదోషం వేల గృహం లో కానీ లేదా దేవాలయ సమీపంలో కానీ నదీ తీరం దగ్గరలో ఎక్కడైనా రెండు అంగుళాలు మించని చిన్న శివలింగాన్ని పెట్టి "విభూతి" నీటిలో కలిపి ఆ నీటితో అభిషేకం చేయాలి.
సంకల్పం
మమ ఇహజన్మని పూర్వ జన్మని జన్మాంతర కృత పాప క్షయార్థం పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహ సిద్యర్థం ప్రదోష కాలే భస్మాభిషేకం కరిష్యే
ఈ విధంగా సంకల్పం చెప్పుకుని "ఓం నమః శివాయ" అని జపిస్తూ 1018 సార్లు 108 రోజులు చేయాలి .
ఇది ఎవరైనా చేయవచ్చు ఏదైనా ఆటంకాలు వచ్చి ఆపినా మళ్ళీ కొనసాగించాలి
నియమాలు : శివునికి విభూతి నీటితో చేసే ఈ అభిషేకం భష్మాభిషేకం ఇది మొదలు పెట్టాక 108 రోజులు పూర్తి అయే వరకు మద్యం మాంసం తీసుకోకూడదా. ప్రదోషం సమయంలో ఈ పూజ మొదలు పెట్టే టప్పుడు స్నానం చేయాలి రోజంతా నమఃశివాయ అని స్మరించు కుంటూ ఉండాలి.
హర హర మహాదేవ.
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
మధురిమలు
అక్షరాల అభ్యాసం
ఆరాటమె ఉండాలి
ఆరాటాల సమాజం
పోరాడుతూ ఉండాలి
పోరాటాల స్తిరత్వం
అడ్డుపడ కే ఉండాలి
ఆటంకాల జీవితం
నరకం కా కుండాలి
ఈ నరకమే అనుభవం
శాపమే కా కుండాలి
ఇప్పుడొచ్చేను శాపం
పాపమే కాకుండాలి
పాపం వలననె ద్రోహం
ద్రోహమే మనోవాదం
మనో వాదనే ప్రాణం
ప్రాణం వల్లే భయం
No comments:
Post a Comment