[16:46, 09/02/2021] +91 92915 82862: Swami Vivekananda's Wisdom for Daily Inspiration - Feb 9.
స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - ఫిబ్రవరి 9.
All the secret of success is there; to pay a much attention to the means as to the end.
లక్ష్యంపై ఉన్నంత శ్రధ్ధాసక్తుల్ని, లక్ష్యసాధనలో సైతం చూపించాలి, విజయ రహస్యమంతా ఇదే.
🕉🌞🌎🌙🌟🚩
[16:54, 09/02/2021] +91 92915 82862: శ్రీరమణీయం -(797)
🕉🌞🌎🌙🌟🚩
"ఆధ్యాత్మిక సాధనకు అవరోధం అవుతున్న మనోవేగాన్ని ఏవిధంగా నియంత్రించాలి !?"
ఆధ్యాత్మిక సాధనల పేరుతో మనం చేసేది, చేయాల్సింది ఈ మనోవేగాన్ని తగ్గించటమే. అంటే మనసును నియంత్రించాలి. మనస్సును నియంత్రించడం అంటే దాని గుణాలను నియంత్రించడమే. మనోవేగం మన రోజూవారి జీవితంలో బయటపడుతుంది. ఒక్కొక్కరికి ఒక్కో విషయంలో మనోవేగం ఉంటుంది. ఒకరికి వస్త్రాల విషయంలో, మరొకరికి ఆహారం విషయంలో, ఇంకొకరికి విందులు-వినోదాల విషయంలో ఇలా చాలా మందికి వారివారి బలహీనతల విషయంలో మనసు వేగంగా ఉంటుంది. మన మనస్సు ఏవిషయంలో వేగంగా ఉంటుందో గుర్తించి దాన్ని తగ్గించుకోవటంచేత మనసును స్వాధీనం చేసుకోవచ్చు !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
'కనపడే గుణం మారితే కనపడని మనసు మారుతుంది'- (అధ్యాయం -98)
🕉🌞🌎🌙🌟🚩
[16:54, 09/02/2021] +91 92915 82862: 🕉🌞🌎🌙🌟🚩
"ఋభుగీత " (264)
🕉🌞🌎🌙🌟🚩
సర్వప్రపంచ హేయత్వము"
18వ అధ్యాయము
ఆశించకుండా జరిగే కార్యాలేవీ కర్తృత్వాన్ని కలిగించవు !
ఆత్మసిద్ధి కలిగే వరకూ మన కర్మలకు మనమే కర్తలమై, వాటి ఫలాలకు మనమే భోక్తలు కావాల్సి వస్తుంది. మనం ఆత్మస్వరూపం అని అర్థమైతే మన సర్వవ్యాపకత్వం మనకు అర్థమౌతుంది. అప్పుడు గ్రహించడం, గ్రహించేవాడు, గ్రహించాల్సిన విషయాలు, అనుసరించాల్సిన విషయాలు, స్నానాది నియమాలు అన్నీ కేవలం దైహికమైన ఒక కార్యకలాపమేగానీ ఏదో ఆశించి జరగవు. ఆశించకుండా జరిగే కార్యాలేవీ కర్తృత్వాన్ని కలిగించవు. కర్తృత్వం లేకపోతే కార్యమునకు ఉన్న కర్మ వాసనలు అంటవు !
🕉🌞🌎🌙🌟🚩
[17:06, 09/02/2021] +91 92915 82862: 🌷150 - మంద్రగీత🌷
🕉🌞🌎🌙🌟🚩
దేవతలు - అసురులు
8) వారికీ ఈ జగత్తు సృష్టి సత్యములపై ఆధారపడినది అని నమ్మకం ఉండదు. ఈ సృష్టికి అధీశ్వరుడు అగు భగవంతుడు లేడనిపించును. ఒక కారణం లేక సృష్టి ఎట్లో వెలువడినదనుకొందురు. దానికి ధర్మమను ప్రకృతియందు స్థిరత్వము లేదనిపించును. కామము కారణముగా స్త్రీ పురుష పరస్పర స్పర్శ చేతనే సృష్టి కలుగుచున్నది. అంతకుపైన ఏమియు లేదని నమ్ముదురు.
9) ఇట్టి దృష్టిని అవలంబించి వారు ఆత్మజ్ఞానమును కోల్పోవుదురు. దానితో బుద్ధి తక్కువ అగును. ఉగ్రములైన కర్మలను ఆచరించి, జీవుల వినాశమునకు కారకులై అహితులగుదురు.
10) ఆత్మను కోల్పోవుట అనగా తన యందు కానీ, ఇతరుల యందు కానీ 'నే'నను తత్త్వమున్నట్లు గ్రహింపకుండుట. దీనివలన 'నేను' అను పదమునకు దేహేంద్రియ మనస్సులనియే వారి ప్రమాణము.
11) ఇట్లు అన్వయింపడిన 'నేను' అను పదమే అహంకారమనబడును. అల్పబుద్ధులు అనగా వివేచనము లేనివారు. ఉగ్రకర్మలనగా బంధించుట, బాధించుట, చంపుట మున్నగునవి. జగత్తునకు అహితులనగా సృష్టి క్రమమునకు శత్రువులు.
🕉🌞🌎🌙🌟🚩
[17:06, 09/02/2021] +91 92915 82862: 164) శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి"
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైత చైతన్య జాగృతి
🕉🌞🌏🌙🌟🚩
మాయాభాసేన జీవేశౌ కరోతీతి శ్రుతౌ శ్రుతమ్ ౹ మేఘాకాశ జలాకాశావివ తౌ సువ్యవస్థితౌ ౹౹155౹౹
155. జీవుడు ఈశ్వరుడు మాయయందు ప్రతిఫలించిన ఆత్మయని శ్రుతి చెప్పుచున్నది. మేఘమునందు ప్రతిఫలించిన ఆకాశము జలమునందు ప్రతిఫలించిన ఆకాశముల వలెనే.
(మొదటిది ఈశ్వరుడు,రెండవది జీవుడు అని పోలికగా చెప్పవచ్చు)
తాపినీయ ఉప.9.
మేఘవద్వర్తతే మాయా మేఘస్థితతుషారవత్ ౹ ధీ వాసనాశ్చిదాభాస స్తుషారస్థఖవత్ త్థ్సితః ౹౹156౹౹
156. మాయను మేఘముతో పోల్చవచ్చు.బుద్ధి యందలి వాసనలు మేఘముగనున్న నీటి కణములతో పోల్చి చెప్పబడినవి. మాయయందు ప్రతిబింబింతమైన కూటస్థ చైతన్యము ఈ జలబిందువులందు ప్రతి ఫలించు ఆకాశము వంటిదని చెప్పబడినది.
వ్యాఖ్య:- ఈశ్వరతత్త్వమును వర్ణించు ఈ శ్లోకము అద్వైతసిద్ధాంతములో ఒక దుమారమును లేపి ఒక సమస్యను కూడా పరిష్కరించినది.
చైతన్య ప్రతిఫలనము మాయయందైన ఈశ్వరుడనీ అవిద్యయందైన జీవుడనీ మునుపు
(ప్ర.1.16,17) చెప్పబడినది.
ఈ శ్లోకమున మాయను మేఘముతో పోల్చి,బుద్ధి అందలి వాసనలలో ప్రతిఫలించిన చైతన్యము ఈశ్వరుడని సూచింపబడుచున్నది.అనగా ఈశ్వర సత్తను,మేఘములోని నీటిబిందువులందు ప్రతిఫలించె ఆకాశమును వలె ఊహింపవలసిందే గాని అహంత వలె స్పష్టము కాదని ఉద్దేశము.
అంతేగాక ఈశ్వరుని ఉపాధి కేవలము మాయమాత్రమే గాక అందలి బుద్ధి వాసనలు కూడా అని ఏర్పడుచున్నది.
ఇది అనవసరము కదా. మాయయందు సృష్టి అంతా ఉన్నది కనుక మాయను స్వీకరించుట చేతనే ఈశ్వరుడు సర్వజ్ఞుడు అగుచున్నాడు.
1. వాసనలనేకము లగుటచే వాని యందు ప్రతిఫలించుచు ఈశ్వరులు కూడా అనేకులగుదురు.
2. వ్యష్టి వాసనలని ఉద్దేశమైనచో ఆ ఈశ్వరుడు సర్వజ్ఞుడు కాక అల్పజ్ఞుడు మాత్రమే అగును.
3. సమిష్టి వాసనలనినచో ప్రళయంలో తప్ప ఈ సమిష్టి ఏర్పడదు కనుక సృష్టి స్థితి కాలములందు ఈశ్వరుడు లేకపోవలసి వచ్చును.
కాని మాయను మాత్రమే స్వీకరించిన చాలదు.
ఈశ్వరోపాధియగు మాయ సాత్వికమగుటచే అందు వైవిధ్యముండజాలదు.
కాని ఈశ్వరుడు సర్వజుడు అనేటప్పుడు ఆమూలాగ్రముగ జగత్తు నందలి వైవిధ్యమంతా ఈశ్వరునకు తెలియుననియే భావింతుము.
ఈ వైవిధ్యమునిచ్చునది బుద్ధియందలి వాసనలే.అవి సృష్టి స్థితి ప్రళయ కాలములందుంటూ స్థూలసూక్ష్మకారణా వస్థలయందు మరల మరల మారుచుండును. కనుక ఈశ్వరునికి మాయ ఉపాధి ద్వారా ఐక్యతయు బుద్ధి వాసనలనెడి ఉపాధి ద్వారా వైవిధ్యమును సాధింపబడినవి.
అవాజ్మానసగోచరమైన తత్త్వమును మాటల ద్వారా ఆలోచనల ద్వారా తర్కబద్ధమైన సిద్ధాంతమునందు బంధింపజూచు వారికి ఇట్టి అగచాట్లు తప్పవు.
🕉🌞🌏🌙🌟🚩
[17:16, 09/02/2021] +91 92915 82862: 48)-శ్రీ రామదాసు కీర్తన
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
(ఆనందభైరవి - రూపక)
పల్లవి:-
మేలైన చిటికెన వ్రేలు ప్రాతఃకాలమందున గుట్టెతేలు!!
చరణము(లు):-
బాలత్వముననేను బావినీళ్ళకుపోయి
కాలుబెట్టగ చిన్న తేలుపొడిచెనయ్య!! మే!!
చలివచ్చెనని నొప్పిచేత దీనివేడిమి పాపిష్టి ఘాత
యీలాగునైన నే నేలాగు తాళుదు మూలమైన గురుమూర్తి పాదములాన!! మే!!
మిక్కిలి సలుపుచున్నది రాముగ్రక్కున నాదరించినది
వెక్కసపెట్టుచు కడతేరనీయదు మ్రొక్కెద నాస్వామి యోర్వగజాలను!! మే!!
దరిజూపరా స్వామి కేశవా యిట్లు నరులుచేసినరీతి చేసెదవా
పుడమిలోపల భద్రగిరి రామదాసుని బడనీయక కాపాడు తండ్రివి నీవె!! మే!!
🕉🌞🌏🌙🌟🚩
[17:18, 09/02/2021] +91 92915 82862: ||శ్రీమన్నారాయణీయము||
అష్టమ స్కంధము 27వ దశకము - కూర్మావతారము వర్ణనము 27-7-శ్లోకము
🕉🌞🌎🌙🌟🚩
వజ్రాతిస్థిరతరకర్పరేణ విష్ణో। విస్తారాత్ పరిగతలక్షయోజనేన।
అంభోధేః కుహరగతేన వర్ష్మణా త్వం నిర్మగ్నం క్షితిధరనాథమున్నివేథః॥
భావము:-
ప్రభూ! విష్ణుమూర్తీ! వజ్రముకంటె గట్టిది, స్థిరమైనది, లక్షయోజనముల విస్తీర్ణముగల మూపు కలిగినది అయిన "కూర్మావతారమున", నీవు సముద్రగర్భమున మునిగియున్న ఆ పర్వతమును పైకి లేవనెత్తి నీ మూపుపై నిలుపుకొంటివి.
వ్యాఖ్య:-
కూర్మావతారాన్ని ఎంతో మధురంగా పోతనవారు తమ పద్యాలలో ఇలా వివరించారు.
దేవతలు అందరూ మునిగిపోతున్న మంథర పర్వతాన్ని చూస్తూ అంతులేని దుఃఖసాగరంలో మునిగిపోతుంటే చూసిన విష్ణుదేవుడు, వారు చూస్తుండగానే సముద్రం మధ్య లోకి దిగాడు.
సవరనై లక్ష యోజనముల వెడలుపై
కడుఁ గఠోరమునైన కర్పరమును
నదనైన బ్రహ్మాండమైన నాహారించు
ఘనతరంబగు ముఖగహ్వరంబు
సకల చరాచర జంతురాసుల నెల్ల
మ్రింగి లోఁగొనునట్టి మేటి కడుపు
విశ్వంబుపై వేఱు విశ్వంబు పైఁబడ్డ
నాఁగినఁ గదలని యట్టి కాళ్ళు
వెలికి లోనికిఁ జనుదెంచు విపుల తుండ
మంబుజంబులఁ బోలెడు నక్షి యుగము
సుందరంబుగ విష్ణుండు సురలతోడి
కూర్మి చెలువొంద నొక మహా కూర్మ మయ్యె.
విష్ణుమూర్తి దేవతలపై గల ప్రేమను వెల్లడిచేస్తూ, మహాకూర్మావతారం ఎత్తాడు. ఆ పెద్ద తాబేలు పైడిప్ప చక్కగా గట్టిగా లక్ష యోజనాల వెడల్పుతో ఉంది. ఆకలేసిందంటే మొత్తం బ్రహ్మాండాన్ని సైతం మింగగలంత పెద్ద నోరు లోకంలోని జీవరాశి అంతటిని లోపల ఇముడ్చుకోగలంతటి కడుపు. కాళ్ళు విశ్వగోళం మీద విశ్వగోళం పడ్డా తట్టుకోగలంతటి బలమైన కాళ్లు. లోపలికి బయటకు కదలాడే పెద్ద తల, కమలాల వంటి చక్కనైన రెండు కళ్ళు ఉన్నాయి. అలా బహు సుందర రూపంతో మహావిష్ణువు అందగిస్తున్నాడు.
కమఠంబై జలరాశిఁ జొచ్చి లఘు ముక్తాశుక్తి చందంబునన్
నమదద్రీంద్రము నెత్తె వాసుకి మహానాగంబుతో లీలతో
నమరేంద్రాదులు మౌళికంపములతో "నౌనౌఁగదే! బాపురే!
కమలాక్షా! శర"ణంచు భూదిశలు నాకాశంబునున్ మ్రోయఁగన్.
చిన్న ముత్తెము చిప్పంత సుళువుగా, కూర్మరూపధారి అయిన విష్ణువు సముద్రం లోపలకి వెళ్ళాడు. వాసుకి భూరి నాగేంద్రునితో సహా మంథర మహాపర్వతాన్ని అవలీలగా పైకెత్తాడు. ఇది చూసి దేవేంద్రుడు మున్నగు వారంతా సంతోషంతో తబ్బిబ్బయి, తలలు ఊపుతూ భూమండలం నలుదిక్కులా, ఆకాశం అంతా మారుమ్రోగేలా “ఆహా! ఓహో! మేలు మేలు శ్రీహరీ! పద్మాక్షా! శరణం శరణం” అంటూ జయధ్వానాలు చేయసాగారు..
ఇలా మందర పర్వతాన్ని ఎత్తి. . .
తరిగాండ్రలోన నొకఁడట
తరి గడవకుఁ గుదురు నాఁక త్రాడఁట చేరుల్;
దరి గవ్వంబును దా నఁట
హరిహరి! హరిచిత్రలీల హరియే యెఱుఁగున్!
ఆహా! ఎంతటి విచిత్రమైన విష్ణు లీలలు? సముద్రాన్ని చిలికేవారిలో ఒకడిగా ఉన్నాడట, పాల సముద్రం అనే పెరుగుకుండకు కుదురు తానేనట, చిలికే కవ్వంగా ఉన్న మంథరపర్వతం, కవ్వానికి కట్టిన చిలుకుతాడుగా ఉన్న మహానాగుడు వాసుకి తానేనట. ఆహా! విష్ణువు లీలలు విష్ణువుకే తెలుసు.
సముద్రాన్ని కుండగానూ, పర్వతాన్ని కవ్వంగానూ, సర్పాన్ని కవ్వంతాడుగా చేయగలవాడు, ఆపై చిలికి వెన్నతీసినట్లు లక్ష్మిని, అమృతాన్ని సంపాదించగల సమర్థత కలవాడు ఆ లక్ష్మీపతి శ్రీమన్నారాయణుడు తప్ప మరొకరు ఎవ్వరూ లేరు కదా! స్వస్తి.
ఓం నమః శివాయ:
🚩గీతా మాహాత్మ్యము🚩
భగవన్ పరమేశాన
భక్తి రవ్యభిచారిణీ,
ప్రారబ్ధం భుజ్యమానస్య
కథం భవతి హే ప్రభో!
భూదేవి విష్ణు భగవానుని గూర్చి యిట్లు ప్రశ్నించెను. ఓ భగవానుడా! పరమేశ్వరా! ప్రభూ! ప్రారబ్ధము అనుభవించువానికి అచంచలమైన భక్తి ఎట్లు కలుగగలదు?
ప్రారబ్ధం భుజ్యమానో౽పి
గీతాభ్యాసరత స్సదా
స ముక్తస్స సుఖీ లోకే
కర్మణా నోపలిప్యతే.
శ్రీ విష్ణువు చెప్పెను - ఓ భూదేవీ! ప్రారబ్ధ మనుభవించుచున్నను, ఎవడు నిరంతరము గీతాభ్యాసమందు నిరతుడై యుండునో అట్టివాడు ముక్తుడై కర్మలచే నంటబడక ఈ ప్రపంచమున సుఖముగ నుండును.
మహాపాపాది పాపాని
గీతాధ్యానం కరోతిచేత్,
క్వచిత్స్పర్శం న కుర్వంతి
నలినీదల మంభసా.
తామరాకును నీరంటనట్లు గీతాధ్యానముచేయు వానిని మహాపాపములుకూడ కొంచెమైనను అంటకుండును.
గీతాయాః పుస్తకం యత్ర
యత్ర పాఠః ప్రవర్తతే,
తత్ర సర్వాణి తీర్థాని
ప్రయాగాదీని తత్రవై.
ఎచట గీతాగ్రంథము యుండునో, మరియు ఎచట గీత పారాయణ మొనర్చబడుచుండునో, అచట ప్రయాగ మొదలగు సమస్తతీర్థములున్ను ఉండును.
సర్వే దేవాశ్చ ఋషయో
యోగినః పన్నగాశ్చయే,
గోపాలా గోపికావా౽పి
నారదోద్ధవ పార్షదైః
సహాయో జాయతే శీఘ్రం
యత్ర గీతా ప్రవర్తతే.
ఎచట గీతాపారాయణము జరుగుచుండునో, అచ్చోటికి సమస్త దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపాలురు, భగవత్పార్శవర్తులగు నారద, ఉద్ధవాదులు వచ్చి శీఘ్రముగ సహాయమొనర్తురు.
యత్ర గీతావిచారశ్చ
పఠనం పాఠనం శ్రుతమ్,
తత్రాహం నిశ్చితం పృథ్వి
నివసామి సదైవ హి.
ఓ భూదేవీ! ఎచట గీతను గూర్చిన విచారణ, పఠనము, బోధనము, శ్రవణము జరుగుచుండునో, అచట నేనెల్లప్పుడును తప్పక నివసించుదును.
గీతాశ్రయో౽హం తిష్ఠామి
గీతా మే చోత్తమం గృహమ్,
గీతా జ్ఞాన ముపాశ్రిత్య
త్రీన్లోకాన్పాలయామ్యహం
నేను గీతనాశ్రయించుకొని యున్నాను. గీతయే నాకుత్తమమగు నివాస మందిరము. మరియు గీతాజ్ఞానము నాశ్రయించియే మూడు లోకములను నేను పాలించుచున్నాను.
గీతా మే పరమా విద్యా
బ్రహ్మరూపా న సంశయః,
అర్ధమాత్రాక్షరా నిత్యా
స్వనిర్వాచ్య పదాత్మికా.
గీత నాయొక్క పరమవిద్య. అది బ్రహ్మస్వరూపము. ఇట సంశయ మేమియును లేదు. మరియు నయ్యది (ప్రణవముయొక్క నాల్గవ పాదమగు) అర్ధమాత్రాస్వరూపము. అది నాశరహితమైనది. నిత్యమైనది. అనిర్వచనీయమైనది.
చిదానందేన కృష్ణేన
ప్రోక్తా స్వముఖతో౽ర్జునమ్,
వేదత్రయీ పరానందా
తత్త్వార్థజ్ఞానమంజసా
సచ్చిదానందస్వరూపుడగు శ్రీకృష్ణపరమాత్మచే ఈ గీత స్వయముగ అర్జునునకు చెప్పబడినది. ఇది మూడు వేదముల సారము. పరమానంద స్వరూపము. తన్మాశ్రయించినవారికిది శీఘ్రముగ తత్త్వజ్ఞానమును కలుగజేయును.
యో౽ష్టాదశ జపేన్నిత్యం
నరో నిశ్చలమానసః,
జ్ఞానసిద్ధిం స లభతే
తతో యాతి పరం పదమ్.
ఏ నరుడు నిశ్చలచిత్తుడై గీత పదునెనిమిది అధ్యాయములను నిత్యము పారాయణము సలుపుచుండునో, అతడు జ్ఞానసిద్ధినిబొంది తద్ద్వారా పరమాత్మపదమును (మోక్షమును) బడయగల్గును.
పాఠే౽సమర్థస్సంపూర్ణే
తదర్ధం పాఠ మాచరేత్,
తదా గోదానజం పుణ్యం
లభతే నాత్ర సంశయః
గీతను మొత్తము చదువలేనివారు అందలి సగము భాగమైనను పఠించవలెను. దానిచే వారికి గోదానము వలన కలుగు పుణ్యము లభించును. ఇవ్విషయమున సందేహములేదు.
త్రిభాగం పఠమానస్తు
గంగాస్నానఫలం లభేత్,
షడంశం జపమానస్తు
సోమయాగఫలం లభేత్.
గీత యొక్క మూడవ భాగము(1/3) (ఆఱు అధ్యాయములు) పారాయణ మొనర్చువారికి గంగాస్నానము వలన కలుగు ఫలము చేకూరును. ఆఱవ భాగము (1/6)(మూడధ్యాయములు) పఠించువారికి సోమయాగఫలము లభించును .
ఏకాధ్యాయం తు యో నిత్యం
పఠతే భక్తి సంయుతః,
రుద్రలోక మవాప్నోతి
గణోభూత్వా వసేచ్చిరమ్
ఎవడు గీతయందలి ఒక్క అధ్యాయమును భక్తితో గూడి నిత్యము పఠించుచుండునో, అతడు రుద్ర లోకమునుపొంది అచ్చట రుద్రగణములలో నొకడై చిరకాలము వసించును.
అధ్యాయ శ్లోకపాదం వా
నిత్యం యః పఠతే నరః,
స యాతి నరతాం యావ
న్మనుకాలం వసుంధరే.
ఓ భూదేవీ! ఎవడు ఒక అధ్యాయమందలి నాల్గవ భాగమును నిత్యము పారాయణము చేయునో, అతడు ఒక మన్వంతర కాలము (ఉత్కృష్టమగు) మానవ జన్మను బొందును.
గీతాయాః శ్లోక దశకం
సప్త పంచ చతుష్టయమ్,
ద్వౌత్రీనేకం తదర్ధం వా
శ్లోకానాం యః పఠేన్నరః.
చంద్రలోక మవాప్నోతి
వర్షాణా మయుతం ధ్రువమ్,
గీతాపాఠసమాయుక్తో
మృతో మానుషతాం వ్రజేత్.
గీతయందలి పది శ్లోకములుకాని, లేక ఏడుకాని, ఐదుకాని, నాలుగుకాని, మూడుకాని, రెండుకాని, ఒకటికాని లేక కనీసము అర్ధశ్లోకమును గాని ఎవడు పఠించునో అతడు చంద్రలోకమునుబొంది అచట పదివేల సంవత్సరములు సుఖముగనుండును. ఇందు సంశయము లేదు. మరియు గీతను పఠించుచు ఎవడు మరణించునో, అతడు ఉత్తమమగు మానవజన్మమును బడయగల్గును.
గీతాభ్యాసం పునఃకృత్వా
లభతే ముక్తి ముత్తమామ్,
గీతేత్యుచ్చారసంయుక్తో
మ్రియమాణో గతిం లభేత్.
అట్లాతడు మానవుడై జన్మించి గీతాభ్యాసమును మరల మరల గావించుచు ఉత్తమమగు మోక్షముపొందును. 'గీతా - గీతా' అని ఉచ్చరించుచు ప్రాణములను విడుచువాడు సద్గతిని బడయును.
గీతార్థ శ్రవణాసక్తో
మహాపాపయుతోపి వా,
వైకుంఠం సమవాప్నోతి
విష్ణునా సహ మోదతే.
మహాపాపాత్ముడైనను గీతార్థమును వినుటయందాసక్తి కలవాడైనచో వైకుంఠమును బొంది అచట విష్ణువుతో సహా ఆనంద మనుభవించుచుండును.
గీతార్థం ధ్యాయతే నిత్యం
కృత్వా కర్మాణి భూరిశః,
జీవన్ముక్తస్స విజ్ఞేయో
దేహాంతే పరమం పదమ్.
ఎవడు గీతార్థమును చింతన చేయుచుండునో, అతడు అనేక కర్మల నాచరించినను, జీవన్ముక్తుడేయని చెప్పబడును. మరియు దేహపతనాంతర మతడు పరమాత్మపదమును (విదేహకైవల్యమును) బొందెను.
గీతామాశ్రిత్య బహవో
భూభుజో జనకాదయః,
నిర్ధూతకల్మషా లోకే
గీతాయాతాః పరమం పదమ్.
ఈ ప్రపంచమున గీతను ఆశ్రయించి జనకాదులగు రాజులనేకులు పాపరహితులై పరమాత్మపదమును బొందగలిగిరి.
గీతాయాః పఠనం కృత్వా
మాహాత్మ్యం నైవ యః పఠేత్ |
వృథా పాఠో భవేత్తస్య
శ్రమ ఏవ హ్యుదాహృతః ||
గీతను పఠించి ఆ పిదప మాహాత్మ్యమును నెవడు పఠింపకుండునో, అతని పారాయణము (తగిన ఫలమునివ్వక) వ్యర్థమేయగును. కావున అట్టివాని గీతాపఠనము శ్రమ మాత్రమే యని చెప్పబడినది.(గ్రంథము యొక్క మహిమను తెలుసుకొనినచో, గ్రంథము యెడల శ్రద్ధ కలుగదని భావము.)
ఏతన్మాహాత్మ్యసంయుక్తం
గీతాభ్యాసం కరోతి యః |
స తత్ఫల మవాప్నోతి
దుర్లభాం గతి మాప్నుయాత్ ||
ఈ మాహాత్మ్యముతోబాటు గీతాపారాయణముచేయువాడు పైన తెలుపబడిన ఫలమును బొంది దుర్లభమగు సద్గతిని (మోక్షమును) బడయగలడు.
సూత ఉవాచ:-
మాహాత్మ్యమేతద్గీతాయా
మయా ప్రోక్తం సనాతనమ్ |
గీతాన్తే చ పఠేద్యస్తు
యదుక్తం తత్ఫలం లభేత్ ||
సూతుడు చెప్పెను - ఓ శౌనకాది మహర్షులారా! ఈ ప్రకారముగ సనాతనమైనట్టి గీతామాహాత్మ్యమును, నేను మీకు దెలిపితిని. అద్దానిని గీతాపారాయణానంతర మెవడు పఠించునో అతడు పైన దెలిపిన ఫలమును బొందును.
ఇతి శ్రీ వరాహపురాణే
శ్రీ గీతామాహాత్మ్యం సంపూర్ణమ్ .
ఇట్లు శ్రీ వరాహ పురాణమందలి
శ్రీ గీతామాహాత్మ్యము సమాప్తము.
--(())--
ఓమ్.
🕉🌞🌎🌙🌟🚩
[18:17, 09/02/2021] +91 98494 71690: 🌹. గీతోపనిషత్తు -146 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 5వ అధ్యాయము - కర్మసన్న్యాస యోగము 📚
శ్లోకము 29
🍀 27. సాన్నిధ్యము - తపస్సు, యజ్ఞముల భోక్తను నేను. సర్వలోకముల అధిపతులకు ఈశ్వరుడను నేను. సృష్టి యందు పుట్టిన సమస్త ప్రాణులకు సుహృదయుడను నేను. ఈ విధముగ నన్ను తెలుసు కొనిన వాడు శాశ్వతముగ శాంతిని పొందుచున్నాడు. సన్న్యాస స్థితికి చరమ గీతముగ భగవంతుడు ఈ వాక్యమును పలికినాడు. “నేను” అను అంతర్యామి ప్రజ్ఞగ అందరి హృదయములందు తా నున్నాడు. అట్టివాని చూచుట ప్రధానము. “కర్మ సన్న్యాసయోగము" అని నామ కరణము చేయుటలో గల ఔచిత్య మేమనగ, సత్సాధకుడు తన మనో బుద్ధి యింద్రియములను 'నేను' అను అంతర్యామి ప్రజ్ఞ యందు లగ్నము చేసియుండగ, అతని సమస్త కార్యములు యాంత్రికముగ సాగిపోవును. ఇదియే ఈ అధ్యాయ రహస్యము 🍀
భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరమ్ |
సుహృదం సర్వ…
[18:17, 09/02/2021] +91 98494 71690: 🌹 . శ్రీ శివ మహా పురాణము - 345 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
87. అధ్యాయము - 42
🌻. దక్షుని ఉద్ధారము -3 🌻
పరమేశ్వరుడవగు నీవు ఆత్మ తత్త్వము లోకములో ప్రవర్తిల్ల జేయుటకై విద్యను, తపస్సును, దీక్షను కలిగియున్న బ్రాహ్మణులను ముందుగా నీ ముఖము నుండి సృజించితివి (38). నీవు పశువుల కాపరి పశువులను పాలించు తీరున భక్తులను సర్వ విధముల ఆపదలనుండి రక్షించెదవు. మరియు ధర్మ మర్యాదలను పాలించె నీవు దుష్టులపై దండమును ప్రయోగించెదవు (39).
నేను చెడుమాటలనే బాణములతో పరమేశ్వరుని వేధించితిని. అయిననూ నీవు నన్ను అనుగ్రహించితివి. అటులనే మిక్కిలి దీనమగు ముఖములు గల ఈ దేవతలను అనుగ్రహించుము (40). హే దీనబంధూ!శంభో!భక్తవత్సలా! అట్టి నీవు భగవానుడవు. పరాత్పరుడవు. నీవు సృష్టించుకున్న నీ స్వరూపమైన ఈ విస్తారమైన బ్రహ్మండములో నీవు ఆనందర…
[18:17, 09/02/2021] +91 98494 71690: 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 229 🌹
🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. గర్గమహర్షి 🌻
1. గర్గమహర్షి యదుకులానికి ఆచార్యుడు. ఆయ్న ఒకసారి కృష్ణుణ్ణీ లాలిస్తున్నటువంటి యశోదాదేవితో, “ఈ పిల్లవాడు ఎవరోకాదు, సాఖాత్తూ శ్రీమహావిష్ణువే! పరబ్రహ్మ వస్తువు.
2. రాధేశ్వరుడైన శ్రీకృష్ణుడు, గోలోకాధిపతి భర్గవుడు, శివుడు, నారాయణుడు, నరనారాయణులు, కపిలాది నారాయణావతరములు అన్ని కలిపి ఇతడు. ఈతడిలో లేని అంశలేదు. కపిల, శివ, నారాయణాంశలతో కూడిన ఈతడు గోలోకాధిపతి అయిన మాధవుడే! ఇదే అతడిని గురించిన పరమరహశ్యం” అని చెప్పాడు.
3. ఆయన ఇంకా కృష్ణుని గురించి, “ఇతడు పుట్టీపుట్టగానే దేవకీ వసుదేవులకు మాత్రమే నిజస్వరూపం చూపించాడు. ఇతడికి ప్రతీయుగంలోనూ వర్ణభేదము, నాంభేదము ఉంటాయి. కృత్యుగములో శ్వేతవర్ణుడుగాను, త్రేతలో రక్తవర్ణుడుగాను, ద్వాపరంలో పీతవర్ణుడుగాను ఉంటాడు. ఈ ద్…
[18:18, 09/02/2021] +91 98494 71690: 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 168 🌹
✍️. శ్రీ బాలగోపాల్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. భగవంతుని పదవపాత్ర సద్గురువు - మూడవ దివ్య యానము - 6 🌻
650. సద్గురువు ప్రణతి, పునరావృత్తి ఆధ్యాత్మక మార్గముల ద్వారా, అభావమును యొక్క సంస్కారము లన్నింటిని జయించి, అభావమును కూడా లోపల కలిగియున్న సర్వమ్ తానేయని అనుభూతి నొందెను. సద్గురువు సృష్టి ధర్మమందున్నను, అది వాని నంటదు.
651. మానవుడు భగవంతుడైన తరువాత ఇంక మానవుడుగా ఉండలేడు. అతడు మానవుని వలెనేవ జీవించవలనన్నెచో, అప్పటికప్పుడు అన్ని విధముల మానవ లక్షణములతో మానవుని వలెనే వ్యవహరించును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
[18:18, 09/02/2021] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 23 / Bhagavad-Gita - 23 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. ప్రధమ అధ్యాయము - విషాద యోగము - 23 🌴
23. యోత్స్యమానానవేక్షే(హం య ఏతే(త్ర సమాగతా: |
ధార్తరాష్ట్రస్య దుర్బుద్దేర్యుద్దే ప్రియచికీర్షవ ||
🌷. తాత్పర్యం :
దుష్టబుద్ధి గల ధృతరాష్ట్రతనయునికి ప్రియమును గూర్చుటకై యుద్ధము నొనరించుటకు ఇచ్చటకు విచ్చేసిన వారిని నేను చూచెదను.
🌷. భాష్యము :
తన తండ్రియైన ధృతరాష్ట్రుని సహాయమున దుష్టప్రణాళిక ద్వారా పాండవుల రాజ్యమును దుర్యోధనుడు హరింప గోరేననుట బహిరంగ రహస్యము. అనగా దుర్యోధనుని పక్షమున చేరిన వారందరును అతని లక్షణమునలను పోలినవారే.
యుద్ధరంభమునకు పూర్వము రణరంగమున వారిని అర్జునుడు గాంచదలిచెను. వారెవారా యని తెలిసికొనుటయే గాని వారితో శాంతి మంతనములు జరిపెడి భావన అర్జునునకు లేదు. తన చెంతనే శ్రీకృష్ణభగవానుడు ఉపస్థిత…
[18:18, 09/02/2021] +91 98494 71690: 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 24 / Sri Lalita Sahasranamavali - Meaning - 24 🌹
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🍀 24. దేవర్షి గణసంఘాత స్తూయమానాత్మ వైభవా |
*భండాసుర వధోద్యుక్త శక్తిసేనా సమన్వితా ‖ 24 ‖ 🍀
🍀 64) దేవర్షిగణ సంఘాత స్తూయమానాత్మ వైభవా -
దేవతల యొక్క, ఋషుల యొక్క, గణదేవతల యొక్క సముదాయము చేత స్తోత్రము చేయబడుచున్న తన యొక్క గొప్పదనము గలది.
🍀 65. భండాసుర వధోద్యుక్త శక్తి సేనా సమన్వితా -
భండుడు అను రాక్షసుని సంహరించుట యందు ప్రయత్నించు స్త్రీ దేవతల సేనలతో చక్కగా కూడియున్నది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 24 🌹
📚. Prasad Bharadwaj
🌻 24. devarṣi-gaṇa-saṁghāta-stūyamānātma-vaibhavā |
bhaṇḍāsura-vadhodyukta-śaktisenā-samanvitā || 24 || 🌻
🌻 64 ) Devarshi Gana - sangatha - stuyamanathma - vai…
[18:18, 09/02/2021] +91 98494 71690: 🌹. శ్రీ విష్ణు సహస్ర నామములు - 24 / Sri Vishnu Sahasra Namavali - 24 🌹
నామము - భావము
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ 🌻
మిధునరాశి- ఆరుద్ర నక్షత్రం 4వ పాద శ్లోకం
🍀 24 . అగ్రణీగ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ‖ 24 ‖ 🍀
🍀 218) అగ్రణీ: - భక్తులకు దారిచూపువాడు.
🍀 219) గ్రామణీ: - సకల భూతములకు నాయకుడు.
🍀 220) శ్రీమాన్ - ఉత్కృష్ణమైన కాంతి గలవాడు.
🍀 221) న్యాయ: - సత్యజ్ఞానమును పొందుటకు అవసరమైన తర్కము, యుక్తి తానే అయినవాడు.
🍀 222) నేతా - జగత్తు యనెడి యంత్రమును నడుపువాడు.
🍀 223) సమీరణ: - ప్రాణవాయు రూపములో ప్రాణులకు చేష్టలు కలిగించువాడు.
🍀 224) సహస్రమూర్ధా - సహస్ర శిరస్సులు గలవాడు.
🍀 225) విశ్వాత్మా - విశ్వమునకు ఆత్మయైనవాడు.
🍀 226) సహస్రాక్ష: - సహ…
[21:25, 09/02/2021] +91 95058 13235: 9.2.2021 సాయం కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - నలుబదియవ అధ్యాయము
అక్రూరుడు శ్రీకృష్ణుని స్తుతించుట
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
అక్రూర ఉవాచ
40.1 (ప్రథమ శ్లోకము)
నతోఽస్మ్యహం త్వాఽఖిలహేతుహేతుం నారాయణం పూరుషమాద్యమవ్యయమ్|
యన్నాభిజాతాదరవిందకోశద్బ్రహ్మాఽఽవిరాసీద్యత ఏష లోకః॥9789॥
అక్రూరుడు ఇట్లు స్తుతించెను శ్రీమన్నారాయణా! అఖిల కారణకారణుడవు అగు నీకు నమస్కరించుచున్నాను (వ్యష్టి ప్రపంచమునకు హేతువులైన మహదాదులకు నీవే మూలము). నీవే ఆదిపురుషుడవు, అవ్యయుడవు, నీ నాభికమలమునుండి ఆవిర్భవించిన బ్రహ్మదేవునిద్వారా ఈ లోకసృష్టి జరిగినది.
40.2 (రెండవ శ్లోకము)
భూస్తోయమగ్నిః పవనః ఖమాదిర్మహానజాదిర్మన ఇంద్రియాణి|
సర్వేంద్రియార్థా విబుధాశ్చ సర్వే యే హేతవస్తే జగతోఽఙ్గ భూతాః॥9789॥
పంచమహాభూతములైన భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనునవియు,…
[04:32, 10/02/2021] +91 95058 13235: 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉శ్రీమాత్రేనమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అద్వైత చైతన్య జాగృతి మరియు కాశీవిశాలాక్షీ అమ్మ సమూహ సభ్యులందరికీ శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
[04:32, 10/02/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
811వ నామ మంత్రము 10.02.2021
ఓం పాశహంత్ర్యై నమః
భక్తుల పాశములను నశింపజేయు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి పాశహంత్రీ యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును ఓం పాశహంత్ర్యై నమః అని ఉచ్చరించుచూ, ఆ అమ్మవారిని ఉపాసించు సాధకునికి గల వివిధ పాశములనుండి విముక్తిని కలిగించును.
ప్రతీ జీవి పేగు త్రెంచుకుని పుట్టి ఇలలో వివిధ పాశములకు బంధీ అవడం అనేది సాధారణం. అందు వల్ల అరిషడ్వర్గములకు (కామక్రోధలోభమోహమదమాత్సర్యములకు) లోనై జననమరణ చక్రంలో పరిభ్రమిస్తూ ఉండడం పరిపాటి అవుతుంది. ఈ విషయం తెలిసిన బుద్ధిమంతుడు పరమేశ్వరి పాదములను శరణు వేడుకుంటే తను చిక్కుకున్న పాశముల నుండి ముక్తి ప్రసాదిస్తుంది ఆ పరమేశ్వరి. గనుకనే అమ్మవారు పాశహంత్రీ యని అనబడినది.
అలాగే పాపకర్మలు చేసి, మరణకాలం సమీపిస్తే ఆ కాలుడు యమపాశంతో తనను …
[04:32, 10/02/2021] +91 95058 13235: శ్రీమాత్రేనమః
శ్రీలలితా సహస్రనామ భాష్యము
237వ నామ మంత్రము 10.02.2021
ఓం మహాచతుష్షష్టికోటి యోగినీ గణసేవితాయై నమః
త్రైలోక్యమోహనాది తొమ్మిది చక్రములలో గల అరువదినాలుగుకోట్ల యోగినీ గణములచే సేవింపబడు శ్రీమాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి మహాచతుష్షష్టికోటి యోగినీ గణసేవితా యను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును ఓం మహాచతుష్షష్టికోటి యోగినీ గణసేవితాయై నమః అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకులకు అనిర్వచనీయమైన ఆత్మానందానుభూతి కలుగును.
బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారీ, వైష్ణవి, వారాహీ, మాహేంద్రి, చాముండ, మహాలక్ష్మి అను వీరు అష్టమాతృకలు. వీరి అంశచే ఒక్కొక్కరికి ఎనిమిది మంది చొప్పున మొత్తం అరువది నాలుమంది యోగినులు ఉంటారు.
ఈ అరువది నాలుగు మందికి ఒక్కొక్కరికి కోటిమంది చొప్పున అరువది నాలుగు కోట్ల యోగినులు ఉంటారు. ఆవిధంగా నవచక్రాత్మకమైన లలితాచక్రంలో
త్రైలోక్యమోహన చక్రము మొదలుగా తొమ్మిది చక్రములలోను ప్రతీ చక్రములోని అరువదినాలుగు కోట్లమంది భిన్నభిన్నలై మొత్తం తొమ్మిది చక్రములకు (8 x 8 x 9) అయిదువందల డెబ్బది ఆరు (576) కోట్లమంది యోగినులు ఉంటారు. అనగా అయిదు (5) పద్మముల, ఏడు(7) అర్బుదముల, ఆరు (6) కోట్లమంది యోగినులు అగుదురు. ఇంత పెద్దసంఖ్యను చెప్పడానికి మహత్ అను పదమును ప్రయోగించి మహాచతుష్షష్టికోటి యోగినీగణము అనియు ఇంతమంది యోగినులచే సేవింపబడు శ్రీమాత మహాచతుష్షష్టికోటి యోగినీగణసేవితా యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు ఓం మహాచతుష్షష్టికోటి యోగినీగణసేవితాయై నమః అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
[04:32, 10/02/2021] +91 95058 13235: 10.2.2021 ప్రాతః కాల సందేశము
వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం
దశమస్కంధము - పూర్వార్ధము - నలుబదియవ అధ్యాయము
అక్రూరుడు శ్రీకృష్ణుని స్తుతించుట
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
40.9 (తొమ్మిదవ శ్లోకము)
సర్వ ఏవ యజంతి త్వాం సర్వదేవమయేశ్వరమ్|
యేఽప్యన్యదేవతాభక్తా యద్యప్యన్యధియః ప్రభో॥9796॥
స్వామీ! ఇతర దేవతలను నీ కంటె వేఱైన వారినిగా భావించి, వారిని కొందఱు ఆరాధించుచుందురు. నీవు సర్వదేవతా స్వరూపుడవు, సర్వేశ్వరుడవు కావున, వాస్తవముగా ఇతర దేవతలను ఆరాధించినను నిన్ను ఉపాసించినట్లే అగును.
40.10 (పదియవ శ్లోకము)
యథాద్రిప్రభవా నద్యః పర్జన్యాపూరితాః ప్రభో|
విశంతి సర్వతః సింధుం తద్వత్త్వాం గతయోఽన్తతః॥9797॥
దేవా! పర్వతములనుండి ప్రవహించిన నదులు అన్నియును వర్షజలములతో నిండి, అన్నివైపులనుండియు సముద్రమునే చేరుచున్నవి. అట్లే వివిధములగు ఉపాసనా మార్గములద్వారా పూజించినను అవి అన్నియున…
[05:22, 10/02/2021] +91 98494 71690: 🌹. శ్రీమద్భగవద్గీత - 635 / Bhagavad-Gita - 635 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 18వ అధ్యాయము - మోక్ష సన్యాస యోగం - సన్న్యాసము యొక్క పూర్ణత్వము - 52 🌴
52. వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయమానస: |
ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత: ||
🌷. తాత్పర్యం :
మితాహారము కలిగినవాడును, మనోవాక్కాయములను నియంత్రించువాడును, సమాధిస్థితి యందున్నవాడును, అసంగుడును,
🌷. భాష్యము :
దేహాత్మభావన లేని కారణముగా మిథ్యాదర్పమునకు దూరుడై యుండు అతడు భగవానుడు ఒసగినదానిచే తృప్తుడగు చుండును. అట్టివాడు ఇంద్రియప్రీతి లభింపనప్పుడు క్రోధము చెందుట గాని, ఇంద్రియార్థములకై తీవ్రయత్నములు సలుపుట గాని చేయడు.
ఈ విధముగా మిథ్యాహంకారము నుండి సంపూర్ణముగా విడివడినపుడు, భౌతికవిషయముల యెడ అతడు అనాసక్తుడగును. అదియే బ్రహ్మానుభవస్థితియై యున్నది. అట్టి స్థితియే “బ్రహ్మభూతస…
[05:22, 10/02/2021] +91 98494 71690: 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 280, 281 / Vishnu Sahasranama Contemplation - 280, 281 🌹
📚. ప్రసాద్ భరద్వాజ
🌻280. మన్త్రః, मन्त्रः, Mantraḥ🌻
ఓం మన్త్రాయ నమః | ॐ मन्त्राय नमः | OM Mantrāya namaḥ
శబ్దమూర్తిర్హరిర్మంత్రః ఋగ్యజుస్సామలక్షణః ।
అథవా మంత్ర బోధ్యత్వాన్మంత్ర ఇత్యుచ్యతే బుధైః ॥
ఋక్, యజుర్, సామ వేద మంత్రరూపుడు కావున 'మంత్రః' అనబడును. లేదా అట్టి వేదమంత్రములచేత తెలుపబడువాడు కావున 'ప్రతిపాద్య-ప్రతిపాదకతా' అనగా తెలుపబడునది, తెలుపునది అను సంబంధముచే విష్ణుడు 'మంత్రః' అనబడును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 280🌹
📚. Prasad Bharadwaj
🌻280. Mantraḥ🌻
OM Mantrāya namaḥ
Śabdamūrtirharirmaṃtraḥ r̥gyajussāmalakṣaṇaḥ,
Athavā maṃtra bodhyatvānmaṃtra ityucyate budhaiḥ.
शब्दमूर्तिर्हरिर्मंत्रः ऋग्यजुस्सामलक्षणः ।
अ…
[05:22, 10/02/2021] +91 98494 71690: 🌹. వివేక చూడామణి - 18 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. పంచభూతాలు - 1 🍀
74. పంచభూతాలతో నిర్మింపబడిన ఈ శరీరములోని ప్రతి భూతము రెండు భాగాలై, ఒక భాగములో ఆ భూతము యొక్క సగ భాగము, మిగిలిన సగము మిగిలిన నాల్గు భాగములలోని ఎనిమిదవ భాగములతో కూడి ఉన్నది.
ప్రతి భూతములో ఐదు భూతాలు ఉన్నాయన్నమాట. ఉదాహరణకు భూమిలో పదార్థము సగము, మిగిలిన సగము మిగిలిన నాలుగు భూతములతో కూడినవి. ఈ స్థూల శరీరము ఐదు భూతములతో పైన తెల్పినట్లు రూపొంది స్థూలమైనది.
ఈ స్థూల శరీరము ఐదు తన్మాత్రలతో కూడినది. భూమి యొక్క తన్మాత్ర వాసన, నీటికి రుచి, అగ్నికి రూపము, వాయువుకు స్పర్శ, ఆకాశానికి శబ్దము. ఈ ఐదు తన్మాత్రల ద్వారా జీవాత్మ తత్సంబంధమైన ఆనందాలను, దుఃఖాలను పొందుచున్నది.
75. ఎవరైతే ఈ జ్ఞానేంద్రియములకు చెందిన వస్తు సముదాయములతో చిక్కుకుని ఉన్నారో వారు పిచ్చివారు. వారు…
[05:22, 10/02/2021] +91 98494 71690: 🌹. దేవాపి మహర్షి బోధనలు - 28 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 19. కుమారో బుధః 🌻
సూర్యుడు సత్యలోకమును, బుధుడు రజోలోకమును, చంద్రుడు దృశ్యమాన జగత్తును అధిష్ఠించియున్న దేవతలు. వీరు వరుసగా సత్వము, రజస్సు, తమస్సు గుణములకు కూడ అధి దేవతలు. సూర్యుడు ప్రఖకు అధిదేవత, చంద్రుడు పదార్థమునకు అధిదేవత. వీరిద్దరి సంయోగము ఏర్పడు జీవులకు బుధుడు అధి దేవత. వారు సహజముగ రజోమూర్తులు. అనగా వెలుగు మూర్తులు.
'కుమారో బుధః' అని వేదము తెలుపుచున్నది. సూర్యుడు తండ్రి, చంద్రుడు తల్లి. సూర్యప్రజ్ఞ చంద్రునిద్వారా మరల పుట్టుటయే కుమారప్రజ్ఞ లేక బుధప్రజ్ఞ. బుధుడు మానససృష్టికి ప్రతీకగ
నిలబడును. తండ్రికి సమీపముగ నుండును. రాశి చక్రమున గూడ సూర్యునికి అత్యంత సమీపమున సంచరించు గ్రహము బుధుడే.
తండ్రియే కొడుకుగ దిగివచ్చెనని, తల్లి ద్వారమున దిగివచ్చెనని అందుచే దిగివచ్…
[05:22, 10/02/2021] +91 98494 71690: 🌹. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి 🌹
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀
✍️. భరత్, 📚. ప్రసాద్ భరద్వాజ
భయం, అపరాధం ఒకటి కాదు. అంగీకరించిన భయం స్వేచ్ఛగా మారుతుంది. ఖండించిన, తిరస్కరించిన, నిరాకరించిన భయం అపరాధంగా మారుతుంది.
నిజానికి, భయం పరిస్థితిలో ఒక భాగం మాత్రమే. అలాగే, ఈ సువిశాల సర్వస్వంలో మనిషి కేవలం ఒక చిన్న భాగం మాత్రమే. అంటే, ఈ సర్వస్వమంతా సముద్రమైతే మనిషి అందులో ఒక చిన్న నీటి బొట్టన్నమాట.
అందుకే ‘‘నేను నా గుర్తింపును కోల్పోయి ఈ సర్వస్వంలో లీనమై నాశనమవుతానేమో’’ అనే భయం మీలో కలుగుతుంది. అదే మృత్యుభయం. అందుకే మీలో వణుకుపుడుతుంది. కాబట్టి, అన్ని భయాలు మృత్యుభయాలే.
మనిషి అలా భయంతో వణికిపోవడం సహజమే.
ఆ సహజత్వాన్ని మీరు సంపూర్ణంగా అంగీకరించినట్లైతే వెంటనే మీ వణుకు తగ్గిపోతుంది, మీ భయం స్వేచ్ఛగా మారుతుంది. అప్పుడు నీటిబొట్టు సమ…
[05:22, 10/02/2021] +91 98494 71690: 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 205 / Sri Lalitha Chaitanya Vijnanam - 205 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀. పూర్తి శ్లోకము :
సర్వయంత్రాత్మికా, సర్వతంత్రరూపా, మనోన్మనీ |
మాహేశ్వరీ, మహాదేవీ, మహాలక్ష్మీ, ర్మృడప్రియా ‖ 53 ‖
🌻 205. 'సర్వ యంత్రాత్మికా' 🌻
అన్ని యంత్రముల మూలము శ్రీదేవి అని అర్థము.
యంత్రములు సృష్టి వ్యూహములు. అవి వరుసగా బిందువు, వృత్తము, త్రిభుజము, చతుర్భుజము, పంచభుజము, షష్ఠభుజము, అష్టభుజము ఆదిగా ఏర్పడుచుండును. ఈ వ్యూహముల నుండియే శ్రీదేవి సమస్త సృష్టిగ ప్రకాశించును.
యంత్రముల రూపములు కూడ పై తెలిపిన ఆకారములతో యుండును. ఈ యంత్ర వ్యూహము లన్నియూ కూడ శ్రీదేవి నుండియే దిగివచ్చినవి. మంత్రము లాధారముగ యంత్రము లేర్పడును.
యంత్రమ…
[15:16, 10/02/2021] +91 92915 82862: శ్రీ గణేశ స్తవ రాజః
🕉🌞🌏🌙🌟🚩
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
అద్వైతచైతన్యజాగృతి
🕉🌞🌏🌙🌟🚩
అస్య శ్రీగణేశస్తవ రాజమంత్రస్య భగవాన్ సదాశివ ఋషిః, అనుష్టుప్ ఛందః, శ్రీమహాగణపతిర్దేవతా,శ్రీమహాగణపతిప్రీత్యర్థే జపే వినియోగః!!
1) వినాయకైక- భావనా-సమర్చనా-సమర్పితం!
ప్రమోదకైః ప్రమోదకైః ప్రమోద-మోద-మోదకం!
యదర్పితం సదర్పితం నవాన్నధాన్యనిర్మితం!
న కండితం న ఖండితం న ఖండమండనం కృతం!!
2) సజాతికృద్- విజాతికృత-స్వనిష్ఠభేదవర్జితం!
నిరంజనం చ నిర్గుణం నిరాకృతిం హ్యనిష్క్రియం!
సదాత్మకం చిదాత్మకం సుఖాత్మకం పరం పదం!
భజామి తం గజాననం స్వమాయయాత్తవిగ్రహం!!
3) గణాధిప! త్వమష్ట మూర్తిరీశసూనురీశ్వర-!
స్త్వమంబరం చ శంబరం ధనంజయః ప్రభంజనః!
త్వమేవం దీక్షితః క్షితిర్నిశాకరః ప్రభాకర-!
శ్చరాఽచర-ప్రచార-హేతురంతరాయ-శాంతికృత్!!
4) అనేకదం తమాల- నీలమేకదంత-సుందరం!
గజాననం నమోఽగజాననాఽమృతాబ్ధి-చం…
[15:43, 10/02/2021] +91 7013 527 083: ఆరా రంగులు - ఎరుపు - Aura Colours - Red
📚✍️ భట్టాచార్య
మూలాధార చక్రం రంగు ఎరుపు. మూలాధార చక్రం మన భౌతిక శరీరాన్ని, మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని ప్రతిబింబిస్తుంది. ఎరుపు రంగు బలమైన జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. భయ, భీతులు లేని వ్యక్తులలో ఈ ఎరుపు రంగు తేజోవలయం గోచరిస్తుంది. ఆ వ్యక్తి యొక్క కోరికలను, అభిలాషలను...ఈ ఎరుపు రంగు తేజోవలయం...వ్యక్తీకరిస్తుంది. జీవితంలో సాహస కృత్యాలు చేయడానికి ఇష్ట పడేవారిలో...ఈ ఎరుపురంగు aura ద్యోతకమౌతుంది. ఆరాలో....పసుపు అంచులతో కలిగిన ఎరుపు రంగు, ఇతరుల యోగ క్షేమాల కోసం పాటుపడే తత్వాన్ని తెలియజేస్తుంది. అదే ఎరుపు రంగులో బురద రంగు కలిసి ఉండే ఆరా కలిగిన వ్యక్తులు....దుర్మార్గులు, కఠినాత్ములు. భయంకరమైన స్వార్ధాన్ని నింపుకునేవాడు. తీక్షణమైన ఎరుపు రంగు తేజోవలయం గల వ్యక్తి శారీరకంగా బలిష్టుడై ఉంటాడు. హంతకులు, పరమ దుర్మ…
చక్కని విజ్ఞానదాయక వివరణ
ReplyDeleteచక్కని విజ్ఞానదాయక వివరణ
ReplyDelete