Sunday, 21 March 2021

22032021

 


వృద్ధులకు శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం * సీనియర్ సిటిజెన్స్‌కు మోడీ గవర్నమెంట్ బూన్ - మెడికల్ కన్సల్టింగ్ పూర్తిగా ఉచితం *

 సీనియర్ సిటిజన్లు మరియు ఇతర పౌరులందరికీ కేంద్ర ప్రభుత్వం అద్భుతమైన కన్సల్టింగ్ పథకాన్ని ప్రారంభించింది.
 వృద్ధులు, ముఖ్యంగా అధిక రక్తపోటు, డయాబెటిస్ మొదలైనవారు OPD కోసం ఆసుపత్రికి వెళ్లరు.  తలనొప్పి, శారీరక నొప్పి వంటి చిన్న రోగాలకు వారు ఇంట్లో చికిత్స పొందుతారు మరియు ఆసుపత్రికి వెళ్ళడానికి సిద్ధంగా లేరు.

 మీరు ఇప్పుడు క్రింది లింక్ ద్వారా Google Chrome లో కన్సల్టెన్సీ మరియు చికిత్సను యాక్సెస్ చేయవచ్చు.  గమనిక:

 * 1 *.  రోగి నమోదును ఎంచుకోండి.

 * 2 *.  మీ మొబైల్ నంబర్‌ను టైప్ చేయండి.  రిజిస్ట్రేషన్ కోసం మొబైల్‌లో OTP టైప్ చేయండి.

 * 3 *.  రోగి వివరాలు మరియు జిల్లా నమోదు చేయండి.  ఇప్పుడు, మీరు ఆన్‌లైన్‌లో డాక్టర్‌తో కనెక్ట్ అవుతారు.  ఆ తరువాత, మీరు వీడియో ద్వారా మీ ఆరోగ్య సమస్యలకు వైద్యుడిని సంప్రదించవచ్చు.  డాక్టర్ online షధాన్ని ఆన్‌లైన్‌లో సూచిస్తారు.  మీరు మెడికల్ ఫార్మసీ షాపులో చూపించి medicine షధం తీసుకోవచ్చు.

 * ఈ సేవ పూర్తిగా ఉచితం. *
                                      
 మీరు ఈ సేవను ప్రతిరోజూ ఉదయం 10.00 నుండి మధ్యాహ్నం 3.00 వరకు, ఆదివారం సహా ఉపయోగించవచ్చు.

 దయచేసి దీన్ని మీ సంప్రదింపు జాబితాలోని సీనియర్ సిటిజన్లకు పంపండి.

 ఇది కేంద్ర ప్రభుత్వ వెబ్‌సైట్:

 * https: //www.eSanjeevaniopd.in*

  https://play.google.com/store/apps/details?id=in.hied.esanjeevaniopd

 గైస్ ఇది సీనియర్ సిటిజన్లకు అద్భుతమైన దశ ....
 దయచేసి ప్రయోజనం పొందండి మరియు మీకు తెలిసిన అన్ని సీనియర్ సిటిజన్లకు ఫార్వార్డ్ చేయండి.
 
 🙏🙏🙏🙏🙏

సీతాపతీ పద్య కావ్యము

సీ ::
అర్ధంకోసం నేను ఆరాధనలు చేశ .
ఆర్ధికము అనర్ధ మలయు చుండె
ప్రజల కోసం నేను పుడమిని ప్రార్ధించా
నా ప్రయోజనము యే నన్ను వీడె
పాండిత్య పరిమళం ప్రగతిని చాటుతు
పుస్తకం గానులే ప్రజ్వ రిల్లె
సంఘశ్రేయస్సుయే నిస్వార్ధి సేవలు
సార్ధకమును చేయ సంఘమందు
 
తేటగీతి
రామ నిరుపమాన కళలు రవ్వ లయ్యె
మనిషి గా జీవితమ్మును మన్ననివ్వు
మాన వత్వాన్ని బతికించు మార్గ మివ్వు
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు
--(()))--
 
సీ ::
సౌమిత్రి మిత్రడై సుమధుర గాత్రుడై
సుందర దృశ్యడై సుంద రాంగ
సత్యస్వరూపుడై శాంతస్వభావుడై
సురముని వినుతుడై సార్వ భౌమ
శాంతగణము కల్గి శ్యామస్వరూపుడై
సత్వస్వరూపుడై సరస లీల
సమ్మోహనాపర సమరశీలుడు రామ
స్నేహముచూపుము సంత సమున
 
రామ నీలమేఘశ్యామ ప్రణతులొసగి
నిన్నుసేవించు భక్తుల నిఖిల దు:ఖ
పుంజముల బాపు పుణ్య పురుష
నన్ను రక్షింపవయ్య శ్రీరామ శరణు
--(())__
 
సీ
కోరికలను దీర్చు కోదండ రాముడు
కోటి విద్యలను నే కోరి నేర్పె
కైవల్య సంధాత కావ్యప్రదాతగ
కనికరం చూపంచే కళల వీవు
కౌస్తుభమణితోడ గాంతియుక్తుండవు
సకలార్ధ సిద్ధుల సహితుడీవు
కష్టములు వోకార్చి యిష్టంబు లొనగూర్చు
మానసదైవంబు మాకు రామ
 
తేటగీతి
శాంతి నొసగునట్టి గుణము శాంతిమూర్తి
చత్యమందు సతము జెలగుచుండేటి వాడు
మాకు దైవంబు రఘుకుల శ్రీ కరుండు
ప్రాంజలి నొనర్తు రామ నీపాదములకు

 

--(())--


ప్రాంతంలోని ప్రభ కధలు 20032021

హాయిగా.. తృప్తిగా,, కావలసినంత, , మితంగా,.. తిందాం,. తరవాత 60,.65..70. 80...90 కి
ఎప్పుడు అయినా పోదాం...
ఈకాస్త దానికి,. ఎందుకు ఇంత తపన, తాపత్రయం , అంతులేని ఆరాటం ???
రండి..ఇది చదవండి....
కొర్రలు, అరికలు అంటూ గడ్డి గాదం తిని ..
100 ఏళ్లు బతికితే ,.
మనల్ని గుర్తుపట్టే మనిషి ఉండొద్దా...
మనవాళ్లంతా  50...60 కే పోతే..
 మనం మాత్రం  ఉండి ఏం చేస్తాం ?
ఎప్పటికప్పుడు.. update అయిపోయిన లోకంలో పక్క వాడిని పలకరించే సమయం లేక....
... బిజీ అయిపోయిన మనుషుల మధ్య ...
 మన మొహం కూడా తెలియని ముని మనవలు మనవరాళ్ల మధ్య ఉండి  ఏం చేయాలి ?
 బతికి ఉన్నా..... డబ్బు  ఖర్చు...
మనం సంపాదించలేని స్థితిలో ...
మనమీద అంత ఖర్చు  పెట్టేది ఎవరంట ?  
మనమే మన్నా టాటా...
అంబానీలమా వేల కోట్లు ఉండి బతికినంత కాలం ఖర్చు పెట్టుకోడానికి ??  
అయినా ఆ మాటకు వస్తే ...
ఈ కొర్రలు అరికలు ...
వీటికంటే ముందు ...
అసలు మొదటి మానవుడు ...
పచ్చి మాంసం తిని..
. అప్పుడే చంపిన జంతువు వేడి రక్తం తాగి బలంగా ఆరోగ్యంగా బతికాడు ..
అని చెబితే ఎలా ఉంటుంది .
కాబట్టి అతిగా ఆరోగ్యంగా ఉండాలని ఆలోచించొద్దు...
అలాగని పూర్తిగా అశ్రద్ధ  చేయొద్దు.
 ఉన్నంతలో కాస్త తక్కువ తినడం ..
ఎక్కువ పని చేయడం..
ఏదైనా  వ్యాయామం క్రమం తప్పకుండా చేయడం సరిపోతుంది.
ఆనందంగా ఉండటం, ..
స్ట్రెస్ ని దగ్గరికి రానీయక పోవడం..
నచ్చిన కళ..హాబిని సాధన చేయడం  మరవకూడదు.
ఆనందమే ఆరోగ్యానికి మూలం.
30 రూ. 40 రూ ల బియ్యం కొనుక్కునే స్థోమత కలిగిన ఇండియాలో...
200 రు. కిలో వున్న ధాన్యాలని కొనిపించి , తినిపించగల తెలివి డైట్ రూపం లో ఎలా ..
ఎప్పటికీ అన్నం , పప్పు... కూరలు.. మాత్రం మానకండి.
హాయిగా పచ్చళ్ళు, చార్లు, పులుసులు తినండి.
మన దగ్గర పారుతున్న నది మనకి జీవనది. అలానే మన దగ్గర పండే ఆహారమే మనకి జీవశక్తి.  
మంచిగా వుండండి. హాయిగా తిని ప్రశాంతంగా నిద్రపోండి...
సర్వే జనా సుఖినోభవంతు...🙏
లోకా సమస్తా సుఖినోభవంతు

ప్రాంజలి ప్రభ కధలు...21032021
*మిత్రాయనమః* 💞
***

"అరే, ఒరే, ఒసే, ఏమే, ఏరా, /
అనెడి మిత్రుండొకడుండిన చాలు/
వృద్ధాప్యంబున, అదెనొసంగునారోగ్యంబు/
మిత్రాయనమః/(1)
స్నేహితుండులేని జీవితంబు/
తైలంబు లేని దీపంబు, దినకరుండు లేని/
దినంబు, ఉప్పులేని పప్పు వ్యర్ధంబు/
మిత్రాయనమః!/(2)
"ఔషధంబుకానౌషధౌంబు/
మనంబునకు శాంతినొసంగు/
తెలతెలవారంగ 'ఏరా, ఏమే' అని వినంగ/
మిత్రాయనమః/(3)
"దేశంబులనున్న, దేవళంబుననున్న/
సంతలోననున్న, సభలలోననున్న/
'ఏరా'యని వినంగ తృళ్ళిపడు తేటపడు/
మానసంబు, మిత్రుని పలుకు చెవిని పడ/
మిత్రాయనమః/(4)
"పూర్వజనమ పుణ్యంబున దొరకు/
ఏరాయను బాల్యమిత్రుండు,/
వృద్ధాప్యంబున పలుకరించ/
అమృతము చిలకరించు పలుకు/
అదిలేని జనమంబు దరిద్రమ్ము/
మిత్రాయనమః/(5)॥
"నిదుర లేవంగ 'ఏరా' లేనిచో/
సగము ప్రాణంబులు పోవు/
తీపి గురుతులే మిగులు/
దిగులు చెంద దినంబులు భారంబుగ/
మిత్రాయనమః!"(6).
 మితృలందరికీ అంకితం!🙏
ఓం శ్రీ రామ్ ... శ్రీ మాత్రే నమ: .. షెర్చెయ్యండి .. స్నేహితులవ్వండి


ప్రాంజలి ప్రభ కధలు 22032021
ప్రార్ధన - విశ్వాసం - సహాయం                                    

ఒకప్పుడు ఒక రాష్ట్రంలో కర్ఫ్యూ నిర్వహిస్తున్నప్పుడు.....
ఒక పేద ముసలావిడ పది ఇళ్ళల్లో పాచిపని చేసుకుంటూ తలిదండ్రులు లేని తన మనవడి ఆకలితీర్చేది. ఆ కర్ఫ్యూ వల్ల ఇంటితలుపు కూడా తీయడానికి వీలులేని పరిస్థితుల్లో ఆ ముసలావిడ తన మనవడి ఆకలి తీర్చలేక తన బాధను దేవునికి మొరపెట్టుకోవడానికి మొకరిల్లి ప్రార్థన చేస్తుంది. ప్రార్థనలో ఆవిడ దేవునితో

" దేవా....ఆకలితో ఉన్న ఒక మనిషికి ఒకప్పుడు కాకితో ఆహారాన్ని సమకూర్చావు.అలాగే నా మనవడి ఆకలి తీర్చగలవని ప్రాధేయ పడుతున్నాను"అన్నది.

ఆ మాటవిన్న తన మనవడు కాకి ఆహారాన్ని తెస్తుందని నమ్మి ,కాకి లోపలికి రావాలంటే తలుపులు తెరిచి లేవని, వెంటనే కిటికీ తలుపులు తెరిచాడు.                 

కిటికీ పక్కనే కాపాలాగా నిలబడి ఉన్న ఒక పోలీస్ వెంటనే కిటికీ తలుపు మీద కొట్టి లోపలికి తొంగిచూశాడు. లోపల ఆ పసిపిల్లవాడు బిక్కమోహం వేసుకుని అతని వంక బెదురుగా చూస్తుంటే..
ఆ పోలీసు "ఏరా? తలుపెందుకు తీశావ్ ?"అన్నాడు.
ఆ పిల్లవాడు "మా మామ్మ దేవునికి ప్రార్థన చేసింది. దేవుడు కాకితో ఆహారం పంపు తాడని అంటుంది" అన్నాడు.
అప్పుడా పోలీసు లోపల గదిలో మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తున్న ముసలావిడని చూసి ఆ పిల్లవాడితో "ఆకలివేస్తుందా "అని అడిగి..
"మీ మామ్మ చెప్పిన కాకిని నేనే..నువ్వు కిటికీ తలుపులు వేసుకుని లోపలే ఉండు. నేను మళ్ళీ వచ్చి తలుపుకొట్టినప్పుడు తియ్యి" అని చెప్పాడు.
అతను ఒక మూసిఉన్న పచారికొట్టు తీయించి పప్పులు,ఉప్పులు,బియ్యం అన్నీ తీసుకుని ఆ రోజుకి తనకిచ్చిన భోజనాన్ని కూడా తీసుకెళ్ళి ఆ పిల్లవాడి ఇంటికిటికీ దగ్గరికి వెళ్ళి తలుపుకొట్టి అందించాడు.
ఆ ముసలావిడ ప్రార్థన విన్న దేవుడు "ఖాకీ" ద్వారా ఆకలి తీర్చాడు.
ఒకరిది ప్రార్థన..
ఇంకొకరిది విశ్వాసం..
మరొకరిది ప్రేమ పూరిత సహాయం..

ప్రార్థన :-- ముసలావిడ ఆ సమయంలో ఏ విధంగానూ అవకాశం లేకపోయినా దేవుడు చేసిన మహా అద్భుతాలను గుర్తుచేసుకుంటూ స్తుతిస్తూ చేసిన ప్రార్థన.

విశ్వాసం:-- ఆ చిన్నపిల్లవాడు తన మామ్మచేసిన ప్రార్థనకు దేవుడు సమాధానమిస్తాడని నమ్మి కిటికీ తెరిచిమరీ వెతకడం.

సహాయం:--  ఆ పిల్లవాడికి దేవుడు మీద ఉన్న నమ్మకానికి ఆశ్చర్యపోయిన ఒక పోలీసు ఆ పిల్లవాడి ఆకలిని గుర్తించి తనవంతు సహాయంచేయడం....
మన ప్రార్థనకు దేవుడు సమాధానమిస్తాడు అని చెప్పడానికి
ఈ చిన్న సంఘటన చాలు.
ఓం శ్రీ రామ్ ... శ్రీ మాత్రే నమ: .. షెర్చెయ్యండి .. స్నేహితులవ్వండి
🙏
 


నేటి ఆలోచన చిన్న స్వర ప్రేమ

నెమలి కళ్ళున్న చిన్న దాన
జాలువారునదిలా చీరున్న దాన

మబ్బులలో మేఘంలా ఉన్న దాన
పాలరాతి బొమ్మగా మెరియు దాన
పాలరాతి బొమ్మగా మెరియు దాన
పాలరాతి బొమ్మగా మెరియు దాన

ప్రేమదారంగా ని మనసును చుట్టా
పెనవేసే తీగలా కమ్ముకొని ఉంటా
జడివానజల్లులా తడుపుతూ ఉంటా
సరిగమలు పలుకుతూ సరదాగా నీతోఉంటా

ఘడియ ఘడియలు నీకోసం లెక్కిస్తుంటా
మనసుమలినంగా మారకుండా జాగర్తగుంటా
మన పెళ్లికి శుభమైన సమయంకోసం ఉంటా
ఏడడుగులు నడచి ఆరో ప్రాణంగా ఉంటా

పంచభూతాల సాక్షిగా నీకోసం వేచిఉంటా
మూడుముళ్ళు వేసి ప్రేమనందిస్తూ ఉంటా
ఏకమయ్యేదాకా సమయంకోసం వేచిఉంటా
ప్రేమించి ప్రేమపొందేదాకా ప్రేమిస్తూఉంటా

నెమలి కళ్ళున్న చిన్న దాన
జాలువారునదిలా చీరున్న దాన
మబ్బులలో మేఘంలా ఉన్న దాన
పాలరాతి బొమ్మగా మెరియు దాన
***


ప్రాంజలి ప్రభ కధలు 22032021
రచయిత /సేకరణ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఆర్యా.....
బ్రాహ్మణులుగా పూజించబడి .... ఈరోజుకీ పూజింపబడుతూ ........ యజ్ఞయాగాలలో నేటికీ హవిర్భాగములు కూడా అందుకుంటున్న  బ్రాహ్మణేతరులు .. 

( వజ్రసూచికోపనిషత్తు ప్రకారం ..) 

1. ఋష్యశృంగుడు .. జింకలు పట్టుకునే జాతులకు పుట్టినవాడు.

2. కౌశికుడు .. గడ్డి కోసుకునే జాతికి చెందినవాడు.

3. జంబూక మహర్షి .. నక్కలు పట్టుకునే జాతివారు 

4. వాల్మీకి .. ఓ కిరాతకుల జాతికి చెందిన వాడు. ఈతను రచించిన రామాయణం .. హిందువులకు పరమ పవిత్రమైన గ్రంథం. ఈయన్ని ఆదికవిని చేసి పూజిస్తారు.

5. వ్యాసుడు .. ఓ చేపలుపట్టే బెస్తజాతికి చెందినవాడు. హిందువులకు పరమ పవిత్రమైన వేదములు .. ఈయన చేత విభజన చేయబడ్డవే. అందుకే ఇతణ్ణి వేదవ్యాసుడు .. అని పూజిస్తారు. 

6. గౌతముడు .. కుందేళ్లు పట్టేజాతికి చెందినవాడు.

7. వశిష్టుడు .. ఓ వేశ్యకు పుట్టినవాడు. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. ఈతని భార్య మాదిగ స్త్రీ అయిన అరుంధతీదేవి. ఈరోజుకు కూడా నూతన దంపతులచేత అరుంధతీ వశిష్టులకు నమస్కారం చేసే సాంప్రదాయాన్ని పాటిస్తు న్నారు. ప్రతి పూజలోనూ హిందువుల చేత .. అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః .. అని పూజలందు కుంటున్నారు. 

వీరి కుమారుడు శక్తి. ఇతని భార్య ఓ మాదిగ వనిత .. ఛండాలాంగని. వీరికుమారుడే పరాశరుడు. ఈతను ఓ బెస్తవనిత మత్స్యగంధిని వివాహమాడి వ్యాసుణ్ణి కన్నారు. 

8. అగస్త్యుడు .. మట్టి కుండల్లో పుట్టినవాడు.

9. మతంగ మహర్షి.. ఒక మాదిగవాని కుమారుడు. బ్రాహ్మణుడయ్యాడు. ఈతని కూతురే .. మాతంగకన్య .. ఓ శక్తి దేవత. కాళిదాసుతో సహా ఎందరో మహానుభావులు ఈ మాతను ఉపాసించారు. ఉపాసిస్తూ ఉన్నారు. ఈమే శ్యామలాదేవి.

ఇంకా.... ..
1. ఐతరేయ మహర్షి ఒక దస్యుడి మరియు కిరాతకుడి కుమారుడు .. అంటే నేటి లెక్కల ప్రకారం SC or ST. జన్మ బ్రాహ్మణుడు కాదు. కానీ అత్యున్నతమైన బ్రాహ్మణుడు అయ్యాడు. అతను వ్రాసినవే ఐతరేయ బ్రాహ్మణం మరియు ఐతరేయోపనిషత్తు. ఐతరేయ బ్రాహ్మణం చాలా కష్టమైనది. ఇది ఋగ్వేదాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు

2.  ఐలుష ఋషి ఒక దాసీ కుమారుడు. అతను ఋగ్వేదంమీద రిసెర్చ్ చేసి చాలా విషయాలు కనిపెట్టాడు. అతన్ని ఋషులందరూ ఆహ్వానించి తమకు ఆచార్యుణ్ణి చేసుకున్నారు ( ఐతరేయ. బ్రా. 2.19)

3. సత్యకామ జాబాల మహర్షి ఒక వేశ్య కుమారుడు. తండ్రి పేరే కాదు.. కనీసం తండ్రి ఎవరో కూడా తెలియదు. కానీ జ్ఞానం చేత బ్రాహ్మణుడు అయ్యాడు.

ఉన్నతవంశాలలో పుట్టిన వారిని కూడా వారిధర్మం నిర్వర్తించకపోతే .. వారిని నిర్మొహమాటంగా బహిష్క రించారు ... వారిలో కొందరు:

1. భూదేవి కుమారుడు .. క్షత్రియుడైన నరకుడు .. రాక్షసుడైనాడు.

2. బ్రహ్మవంశజులైన హిరణ్యాక్షుడు, హిరణ్య కశిపుడు, రావణుడు,.. బ్రాహ్మణులైనా .. రాక్షసులయ్యారు ..

3. రఘువంశ మూల పురుషుడైన రఘు మహారాజు కుమారులలో ఒకడు అయిన ప్రవిద్ధుడు .. రాక్షసుడైనాడు

4. త్రిశంకుడు క్షత్రియుడు. కానీ చండాలడు అయ్యాడు.

5. విశ్వామిత్రుడు క్షత్రియుడు. బ్రాహ్మణుడైనాడు .. వీరి వంశస్తులే .. కౌశికస గోత్ర బ్రాహ్మణులయ్యారు. విశ్వామిత్రుని కుమారులు కొందరు శూద్రులయ్యారు.

6. నవ బ్రహ్మలలో ఒకడైన దక్ష ప్రజాపతి కుమారుడు పృషధుడు. బ్రహ్మ జ్ఞానం లేని కారణాన శూద్రుడిగా మారిపోయాడు ( విష్ణు పురాణం 4.1.14)

7. నేదిష్టుడు అనే మహరాజు కుమారుడు .. నాభుడు. ఇతనికి క్షాత్ర జ్ఞానం లేని కారణాన, వర్తక జ్ఞానం కారణాన వైశ్యుడిగా మారవలసి వచ్చింది  ( విష్ణుపురాణం 4.1.13). 

8. క్షత్రియులైన రథోతరుడు, అగ్నివేశ్యుడు, హరితుడు .. బ్రహ్మ జ్ఞానం వలన బ్రాహ్మణులైనారు. హరితుని పేరుమీదే .. ఇతని వంశ బ్రాహ్మణులకు హరితస గోత్రం వచ్చింది (విష్ణు పురాణం 4.3.5).

9. శౌనక మహర్షి కుమారులు .. 4 వర్ణాలకు చెందినవారుగా మారారు (విష్ణుపురాణం 4.8.1).

10. అలాగే గృత్సమదుడు, వీతవ్యుడు, వృత్సమతి ... వీరి కుమారులు కూడా నాలుగు వర్ణాలకు చెందినవారు అయ్యారు.

వీరిలో చాలామంది .. వేదమంత్రాలు కూడా రచించినవారు ఉన్నారు.

హిందూ ధర్మం జ్ఞానం మీద ఆధారపడి నది కానీ, జన్మం మీద కాదు.  

ఇప్పుడు వీళ్ళు జ్ఞానాన్ని విడిచి పెట్టి, జననం ను అనుసరించి పదవులు  సంప్రాప్తిoప జేయి చున్నారు.  అదే దేశ అధోగతి కి దోహదం చేయుచున్నది.

ఇది వాట్సాపు లోని వేరే గ్రూపు నుండి సంగ్రహించినది...
ఈ సమాచార కర్తల సౌజన్యంతో...

__(())--



మధురిమలు .. మనస్సు

మానసిక మైనట్టి పొర
మనతత్వాన్ని కదిలించు
జ్ఞానేంద్రియాల నగార
ప్రపంచాన్నే కదిలించు

ప్రపంచ సృష్టికి నగార
ఆశ జీవిని కదిలించు
మనస్సుకు భయట నగార
బంధనాలతొ కదిలించు

మనోనాశనమనే పొర
అపుడు సాధన కదిలించు
క్రమశిక్షణ అనేటి పొర
సౌందర్యాన్ని కదిలించు

కలల కల్లోల నగార
భయ ప్రేమను కదిలించు
అనుభవమ్మును పెంచు తెర
స్థితిరంజిల్లి కదిలించు

వ్యక్తీకరణపు నగార
విశ్వమంతా కదిలించు
ప్రేమభావమ్ము నగార
చెరిత్రతెలిపి కదిలించు

ఆకాశ మేఘాల పొర
ఉండిఉండక కదిలించు
మనిషిలొ భందనాల పొర
పట్టువిడుపుతొ కదిలించు

నిద్రపుచ్చును మనసుపొర
కలలతోనే కదిలించు
మనిషిని శరీరమను పొర
ఆత్మ మనస్సు కదిలించు
--(())--
#సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు#


👉 ధర్మో రక్షతి రక్షిత:
👉 సత్య మేవ జయతే
👉 అహింసా పరమో2ధర్మ:
👉 ధనం మూలమిదం జగత్
👉 జననీ జన్మ భూమిశ్చ
👉 స్వర్గాదపి గరీయసి
👉 కృషితో నాస్తి దుర్భిక్షమ్
👉 బ్రాహ్మణానా మనేకత్వం
👉 యథా రాజా తథా ప్రజా
👉 పుస్తకం వనితా విత్తం
👉 పర హస్తం గతం గత:
👉 శత శ్లోకేన పండిత:
👉 శతం విహాయ భోక్తవ్యం
👉 అతి సర్వత్ర వర్జయేత్
👉 బుద్ధి: కర్మానుసారిణీ
👉 వినాశ కాలే విపరీత బుద్ధి:
👉 భార్యా రూప వతీ శత్రు:
👉 స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:
👉 వృద్ధ నారీ పతి వ్రతా
👉 అతి వినయం ధూర్త లక్షణమ్
👉 ఆలస్యం అమృతం విషమ్
👉 దండం దశ గుణం భవేత్
👉 *ఇవీ మన చెవిని పడుతూ ఉండే మూల వాక్యాలు.

ఇప్పుడు వీటి పూర్తి పాఠాలు చూద్దామా ?

ధర్మ ఏవో హతో హంతి
"ధర్మో రక్షతి రక్షిత:"
తస్మా ధర్మో న హంతవ్యో
మానో ధర్మో హ్రతోవ్రధీత్

🔥ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే , అది మనల్ని ధ్వంసం చేస్తుంది. దానిని మనం రక్షిస్తే, అది మనల్ని రక్షిస్తుంది. అందు చేత ధర్మాన్ని నాశనం చేయ కూడదు. ఎవరికి వారే తమంత తాముగా నశించి పోవాలని కోరు కోరు కదా !

🔥 సత్యమేవ జయతే నా2నృతం
సత్యేన పంథా వితతో దేవయాన:
యేనా క్రమం తృషయో హా్యప్త కామా
యత్ర త త్సత్యస్య పరమం నిధానమ్

🔥సత్యమే జయిస్తుంది. అసత్యం కాదు. సత్యం వలన దేవతల మార్గం కనిపిస్తుంది. సత్యం వలన మహర్షులు కోరికలు లేని వారై పరమేశ్వరుని పొంద గలుగు తున్నారు. ఈశ్వరుడు సత్య స్వరూపుడు.

🔥 అహింసా పరమో ధర్మ:
తథా2 హింసా పరం తప:
అహింసా పరమం ఙ్ఞానం
అహింసా పరమార్జనమ్
🔥అహింస గొప్ప ధర్మం. గొప్ప తపం. మంచి ఙ్ఞానం. గొప్ప సాధన

🔥 ధనమార్జాయ కాకుత్స్థ !
ధన మూల మిదం జగత్
అంతరం నాభి జానామి
నిర్ధనస్య మృతస్య చ

🔥ఓ రామా ! ధనాన్ని సంపాదించాలి. ఎందు కంటే ధనంతో తోనే లోకమంతా ఉంది. ఈ విషయం లోని ఆంతర్యం గమనించాలి. ధనం లేని వాడు మృతునితో సమానం.

🔥 అపి స్వర్ణ మయీ లంకా
న మే రోచతి లక్ష్మణ !
జననీ జన్మ భూమిశ్చ
స్వర్గాదపి గరీయసి.

🔥సోదరా, లక్ష్మణా ! ఈ లంక బంగరు మయ మయిన దైనప్పటికీ నాకు నచ్చదు. ఇక్కడ ఉండ లేను. ఎందుకంటే, తల్లి, పుట్టిన ఊరు స్వర్గం కంటె గొప్పవి కదా !

🔥 కృషితో నాస్తి దుర్భిక్షమ్
జపతో నాస్తి పాతకమ్
మౌనేన కలహం నాస్తి
నాస్తి జాగరతో భయం.

🔥చక్కగా వ్యవసాయం చేస్తే కరవు అనేది ఉండదు. జపతపాలు చేస్తే పాపం పోతుంది. మౌనంగా ఉంటే ఎవరితోనూ విరోధమే ఉండదు. జాగురూకతతో ఉంటే దేనికీ భయపడే పని లేదు.

🔥 గజానాం మంద బుధ్ధిశ్చ సర్పాణా మతి నిద్రతా
బ్రాహ్మణానా మనేకత్వం త్రిభిర్లోకోపకారకమ్

🔥ఏనుగుల మంద బుద్ధి తనం, పాముల అతి నిద్రా గుణం, బ్రాహ్మణులలో ఉండే అనైక్యత ... వీటి వల్లన లోకోపకారం జరుగుతోంది కదా !

🔥 రాఙ్ఞ ధర్మిణి ధర్మిష్ఠా, పాపే పాప పరా: సదా
రాజాను మను వర్తంతే, యథా రాజా తథా ప్రజా !

🔥రాజు ధర్మ పరుడయితే రాజ్యం ధర్మ పథంలో నడుస్తుంది. పాప వర్తనుడయితే రాజ్యం పాప పంకిల మవుతుంది. ఎప్పుడూ ధర్మా ధర్మాలు రాజుని అనుసరించి నడుస్తాయి. రాజు ఎలా ఉంటే, ప్రజలూ అలాగే నడచు కుంటారు.

🔥 పుస్తకం వనితా విత్తం
పర హస్తం గతం గత:
అధవా పునరా యాతి
జీర్ణం భ్రష్ఠా చ ఖండశ:

🔥పుస్తకం, స్త్రీ , ధనం ఇవి మన వద్ద ఉన్నంత సేపే . ఇతరులు చేతిలో పడితే మరి వాటి పని అంతే. తిరిగి వస్తాయను కో వద్దు. ఒక వేళ వచ్చినా. సర్వ నాశన మయి పోయిన స్థితిలో మనకి తిరిగి దక్కుతాయి సుమీ. ( స్త్రీని జాగ్రత్తగా చూసుకోవాలి అనే భావం ఇక్కడ గ్రహించాలి)

🔥 శత నిష్కో ధనాఢ్యశ్చ
శత గ్రామేణ భూపతి:
శతాశ్వ: క్షత్రియో రాజా
శత శ్లోకేన పండిత:

🔥వంద నిష్కలు ( ధన విశేషం) ఉన్న వాడే ధనవంతుడు అనిపించు కుంటాడు. వంద గ్రామాలకు అధిపతి అయిన వాడే భూపతి అవుతాడు. వంద గుఱ్ఱాలు కల వాడే రాజు అనిపించు కుంటాడు. వంద శ్లోకాలు వచ్చిన వాడే పండితుడు.

🔥విద్వత్త్వం చ నృపత్వం చ
నైవ తుల్యం కదాచన
స్వ దేశే పూజ్యతే రాజా
విద్వాన్ సర్వత్ర పూజ్యతే.

🔥పండితుడికీ, రాజుకీ పోలికే లేదు ! ఎందు కంటే, రాజు తన దేశంలో మాత్రమే పూజింప బడతాడు. కాని, పండితుడు లోకమంతా గౌరవించ బడుతాడు.

🔥 శతం విహాయ భోక్తవ్యం
సహస్రం స్నాన మాచ రేత్
లక్షం విహాయ దాతవ్యం
కోటిం త్యక్త్వా హరిం భజేత్

🔥వంద మందిని విడిచి పెట్టి అయినా భుజించాలి. వేయి మందిని విడిచి పెట్టయినా స్నానం చేయాలి. లక్ష మంది నీ వెంట రాక పోయినా దానం చేయాలి. కోటి మందిని విడిచి పెట్టయినా శ్రీహరిని సేవించు కోవాలి.

🔥 అతి దానాత్ హత: కర్ణ:
అతి లోభాత్ సుయోధన:
అతి కామాత్ దశగ్రీవో
అతి సర్వత్ర వర్జయేత్
( ఇది మరోవిధంగా కూడా ఉంది)

🔥విచ్చల విడిగా దానం చేయడం వలన కర్ణుడు చెడాడు. మిక్కిలి స్వార్ధ గుణం చేత దుర్యోధనుడు చెడాడు. అతి కామం చేత రావణుడు నాశనమయ్యాడు. కనుక అంతటా అతిని విడిచి పెట్టాలి. ఎప్పుడూ అతి పనికి రాదు. ఓవరాక్షను వికటిస్తుంది.

🔥 సత్యాను సారిణీ లక్ష్మీ
కీర్తి: త్యాగాను సారిణీ
అభ్యాసాను సారిణీ విద్యా
బుద్ధి: కర్మాను సారిణీ.

🔥లక్ష్మీ దేవి ఎప్పుడూ సత్యాన్ని అనుస రించే ఉంటుంది. ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ సంపద ఉంటుంది. అలగే, కీర్తి త్యాగాన్ని అనుసరించి ఉంటుంది. త్యాగ గుణం లేనిదే కీర్తి ప్రతిష్ఠలు రమ్మంటే రావు. అభ్యాసం లేనిదే విద్య అలవడదు. నిత్యం చదవనిదే చదువు ఎలా స్తుంది ? అభ్యాసం కూసు విద్య కదా. ఇక, బుద్ధి కర్మను అనుసరించి ఉంటుంది. చెడి పోయే రాత మనకి ఉంటే మన బుద్ధి చెడు త్రోవలోను, బాగు పడే రాత ఉంటే మన బుద్ధి మంచి దారిలోను ప్రవర్తిస్తుంది. బుద్ధి మన కర్మలను అనుసరించి ఉంటుంది సుమా !

🔥న నిర్మితో వై నచ దృష్ట పూర్వో
న శ్రూయతే హేమ మయం కురంగ:
తథా2పి తృష్ణా రఘు నందనస్య
వినాశ కాలే విపరీత బుద్ధి:

🔥బంగారు లేడి ఉన్నదని ఎన్నడయినా విన్నామా ? ఎప్పుడయినా ఎక్కడయినా అయినప్పటికీ రాముడు తన చెలి కోరిందని ముందు వెనుకలు యోచించ కుండా బంగారు లేడిని తెస్తానని వెళ్ళాడు. వినాశ కాలం దాపురించిన నాడు ఇలాంటి విపరీత బుద్ధులే పుడుతూ ఉంటాయి. చెడ్డ కాలం వచ్చి నప్పుడు తర్కం పని చెయ్యదు. బుద్ధి మందగిస్తుంది.

🔥 ఋణ కర్తా పితా శత్రు:
మాతా చ వ్యభిచారిణీ
భార్యా రూపవతీ శత్రు:
పుత్ర: శత్రురపండిత:

🔥 అప్పు చేసి, మనకి ఆస్తి కాకుండా అప్పు మిగిల్చే తండ్రి మనకి శత్రువుతో సమానం. వ్యభిచరించే తల్లి శత్రువు. రూపవతి అయిన భార్య శత్రువు. పండితుడు కాని కుమారుడు శత్రువు.

🔥 ఆత్మ బుద్ధి: సుఖం చైవ
గురు బుద్ధిర్విశేషత:
పర బుద్ధి ర్వినాశాయ
స్త్రీ బుద్ధి: ప్రళయాంతక:

🔥 మనకి తోచినది చేయడం అన్నిటి కన్నా మేలు. పెద్దల సలహా ప్రకారం నడచు కోవడం ఇంకా మంచిది. కాని పరుల (శత్రువుల అని కూడా అర్ధం చెప్పు కోవచ్చును) ఆలోచనల మేరకు నడచు కోవడం నాశనం కొని తెచ్చు కోవడమే. ఇక, ఆడువారి ఆలోచనల బట్టి నడుచు కుంటే ప్రళయమే సుమా !

🔥 అసమర్ధస్య సాధూనాం
నిర్ధనస్య జితేంద్రియ:
వార్ధక్యో దేవతా భక్తి:
వృద్ధ నారీ పతివ్రతా.

🔥అసమర్ధుని మంచితనం, ధనం లేని పేద వాని ఇంద్రియ నిగ్రహం, ముసలి తనంలో దైవ భక్తి, వయసు ఉడిగిన ఆడుదాని పాతి వ్రత్యం ఒక్కలాంటివే.

🔥 ముఖం పద్మ దళాకారం
వచ శ్చందన శీతలం
హృదయం కర్తరీ తుల్యం
అతి వినయం ధూర్త లక్షణమ్

🔥ముఖమేమో, పద్మం లాగా ఉంటుంది. మాటలేమో చందనం వలె చల్లగా ఉంటాయి. కాని, దుర్జనుని మనసు మాత్రం కత్తెర పిట్టలాంటిది. అతి వినయం చూపడం చెడ్డ వాడి లక్షణం సుమా.

🔥 సిద్ధ మన్నం ఫలం పక్వం
నారీ ప్రథమ యౌవ్వనం
కాలక్షేపం నకర్తవ్యం
ఆలస్యం అమృతం విషమ్

🔥వండిన అన్నాన్ని భుజించడానికీ, పండిన పండును కొరుక్కు తినడానికీ, యౌవ్వన వతి పొందును స్వీకరించడానికీ ఆలస్యం చేయ రాదు సుమా ! ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమై పోతుంది. అన్నం చల్లారి పోవడం, పండు కుళ్ళి పోవడం, యౌవ్వనం తరగి పోవడం జరుగుతాయి. ఆలస్యం చేయడం వల్ల అమృతం కూడా విషతుల్యమవుతుంది.

🔥 విశ్వా మాత్రా హి పశుషు, కర్ద మేషు జలేషుచ
అంధే తమసి వార్ధక్యే, దండం దశ గుణం భవేత్.

🔥పక్షులు, కుక్కలు, శత్రువులు, పాములు, పశువులు వీటిని అదుపు చేయడానికి వరుసగా, బురదలో, నీటిలో, చీకటిలో, గ్రుడ్డితనంలో , ముసలి తనంలో సాయంగా ఉండేది చేతి కర్ర. అందు వల్ల దండానికి (కర్రకి) దశగుణాలు ఉన్నాయి సుమీ !🔥

ఇవీ మూల వాక్యాలకి పూర్తి పాఠాలు.

పూర్వులు చెప్పిన దానిని మార్చరాదు


 
ప్రాంజలి ప్రభ .. మధురిమలు
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ

తన్వంగి తప్పిదములకు
తన్వి తనువు తాపమునకు
తమ్మికింటి తన్మయముకు
తరళ లోచన నమ్ముటకు

లొంగని దెవ్వరే కళకు
ఇదియు తరుణి నడవడికకు
తరలేక్షణ ఒడి నడకకు
తలిరుబడి చురుకుదనముకు

లొంగని దెవ్వరే కళకు
తలోదరిగ తమకమునకు
తామరకంటి తపమునకు
తామరనేత్ర చూపులకు

లొంగని దెవ్వరే కళకు
తియ్య బడిన తలుపులకు
తీగబడిన కళ మెలికకు
కలసియే తెఱువ తెగువకు

తెలిగంటి కల వలపుకు
తొగవ కంటి తోపుకళకు
ఇక తొయ్యలి తమకమునకు
లొంగని దెవ్వరే కళకు
--((**))--

 

సీసము

మోహన రాగము - మోహము తుంచును
మౌనపు  బతుకులో  - మాన సమ్ము
ముల్లోకము లలో - మ్రొక్కులందినవాడు
మానవ జన్మతొ - మాన్య మయ్యె
మధురాక్షసుని నేల -మట్టంబు కావించి
మధురమ్ము కల్పించి  -  మాయ మాన్పు
మణి కిరీటము దాల్చి - మహిమను చూపియు
మంద భాగ్యుని కూడ  - మార్చు రామ

తేటగీతి
మనసు పరిమళింపగచేయు మధుర రామ
మనసు పలికించి సుఖమిచ్చు మోన రామ
మనసు ఊహలు ఊసులు మాన్పు రామ
ప్రాంజలి నొనర్తు రామ నీ పాదములకు
--(())--

సీసము

పరగిన సత్య -సంపన్నుడై నున్నాడు
పరనిందసేయ - తత్పరుడు కాని వాడు!
పరులు తానేయని - పలుకు వాడు
నిర్మలుడై ఆత్మ - నియతి కలుగు వాడు
అరుదైన భూతద -యానిధి యగువాడు
ధర్మతత్పరతతో - ధరణి యందు
జగతిపై హితముగా - చరియించు ధీరుడు
భక్తితో కొలిచెద - భద్ర ముర్తి

తేటగీతి
అతడు తారకరాముండు - సతత మతని
మది స్మరియించి సేవించి - మనుజులును
పాప పుంజంబు దొలగి కై - వల్యమబ్బు
ప్రాంజలి నొనర్తు రామ నీ - పాదములకు   
^^^
బతకండిరా బతకండి
కన్నతల్లి ఆత్మఘోషను గమనించండి
మాతృభాష ను బతికించండి

బతికించేది మాతృభాష ని నమ్మండి
ధనాశతో బిచ్చగాళ్ల గా మారస్తున్నారండి
ఆంగ్ల చదువులంటూ దోచుకుంటున్నారండి

బతుకుబండి కి గుప్పెడన్నం చాలండి
మాతృభాష ముద్దలు జీర్ణమవుతాయండి
జీర్ణం కానట్టి ఆంగ్లభాష మనకెందుకండి
స్వర్గంలో విస్తరించాలని అసలు వదలండి

మనఃశాంతి కొరకు మనభాషలో చదవండి
వృత్తి ధర్మం నిలిపి గుర్తించు వారుంటారండి
తెలుగు పాండిత్యాన్ని తెలుసుకొని తెల్పండి
దేశ ప్రగతికి మూలం మాతృభాషని నమ్మండి

కన్నీళ్ళ ను తుడిచేది
భయాన్ని తొలగించేది
ధైర్యాన్ని నూరిపోసేది
పిరికితనాన్ని రూపుమాపేది

వెన్ను దట్టి ఓదార్చేది
వెన్నెల్లో చలిపుట్టించేది
ధర్మాన్ని నిబెట్టేది
వేదంలా ప్రభవించేది

నాదంలా నీలో ఉండేది
తనువెళ్ళ చైతన్య పరిచేది
బతుకు తెరువు కు మార్గమయ్యేది
నిత్యం నూతనంగా ఉండేది

ఎంత చదివినా ఇంకా చదవాలనిపించేది
సంగీతస్వర సాధనకు పనికొచ్చే ది
పద్యభావాల్ని తెలిపేది
బానిసగా మార్చకుండా చేసేది

ప్రేమకు ఆధారమైనది
అజరామరం అయినది
మన తెలుగు భాష మరవనిది
కన్నతల్లి భాష మరవనిది

కన్న తండ్రి ఆత్మ మరువలేనిది
భరతమాత ముద్దుబిడ్డ లది
తెలుగు భాష తేట నీరది
త్రాగిన కొద్ది త్రాగాలి పూజించేది

తల్లి తండ్రలారా ఇకనైనా కళ్ళు తెరవండి
ఇది మీకు నచ్చితే షేర్ చెయ్యండి
తెలుగు భాషను బతికించండి
తెలుగు అధ్యాపకుల పొట్టలు కొట్టకండి

ఎందరో మహానుభావులు అందరికీ వందనాలండి
మీ అభిప్రాయం పంపించండి
ఆత్మఘోష లు తెలుపండి
ప్రాంజలి ఘటిస్తూ, అర్ధిస్తూ, అలమటిస్తూ, తెలియపరుస్తూ హృదయాన్ని అర్పిస్తున్నాను
తెలుగును బతికించటానికండి
కళ్ళు తెరవండి
నిద్రలేవండి
ప్రతిజ్ఞ చెయ్యండి
మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ
మాతృభాష బతికిస్తామనండి

--(())--
సమ్మోహనాలు

విశ్వాసం వ్యక్తమ్మే
వ్యక్త పరచె ధైర్యమ్మే
ధైర్యంగా జీవించుట బతుకె ఈశ్వరా

మనిషి యందు బంధము
బంధము అను బంధము
బంధంగా స్నేహం శునకమ్ము ఈశ్వరా

నమ్మిన సిద్ధాంతం
సిద్ధాంత సుఖాంతం
సుఖాంతం గా స్నేహ బంధమే ఈశ్వరా

వాసనను పసిగట్టి
పసిగట్టి కనిపెట్టి
కనిపెట్టి దొంగను పట్టు కుక్క ఈశ్వరా

పేద మహిళ జీవన
జీవన కష్ట మైన
కష్టమైన ఇష్టంగా బతుకే ఈశ్వరా

నిత్య కష్ట జీవులు
జీవులుగా బతుకులు
బతుకుకే తోడుగా కుక్కయే ఈశ్వరా
--(())--

No comments:

Post a Comment