(కాసేపు నవ్వుకుందాం)(ఇది యదార్ధ గాధ )
శ్రీమతి తో శ్రీవారి ముచ్చట్ల కాఫీ లాంటి చిన్న కధ (1)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఉషోదయ వెలుగులు కానరావటంలేదు, మబ్బులు కమ్ముకున్నట్లు ఉంది , కానీ మంచు కమ్మి ఉంది. బయట చలిమంట వేసుకొనుచుఁన్నవారు ఉన్నారు అప్పుడే కల్లాపు చల్లాలని శ్రీమతి బకెట్ నీరు, మగ్గు తీసుకోని వచ్చి చల్లంది. ఓవైపు వణుకుడు మారోవైపు సంప్రదాయపు ముగ్గు వెయ్యాలని తపన, తప్పదు కనీసం ముచ్చట్లు ఎవరైనా చెప్పే వారుంటే బాగుంటుంది అని నాలిక కరుచుకొని, శ్రీవారు నిద్ర లేచి సహాయ పడితే ఎంత బాగుంటుందో అనుకుంటూ ముగ్గులేసి లోపలకు వచ్చింది.
లోపలికొస్తూనే ఏమి అదృష్టం మోగవానిగా పుడితే హాయిగా నిద్రపోవచ్చు, కల్పనా లోకం గురించి, ఊహల పల్లకీల గురించి , స్వప్న సీమలగురించి , ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో తెలియని మొగ వానిలా నిద్రలో కలల ఉరవడిలో కలవరింతగా పలుకులు పలకవచ్చు .....
అబ్బా నేను ఎన్ని మాటలు మాట్లాడినా మా శ్రీవారు గురక చూడు, మూడు రోడ్లకవతల దాకా వినబడుతుంది, తెలియని వారు విన్నారో ఏ పులి వచ్చిందని భయంతో వణికి పోతారు.
ఏమం డి నిద్ర లేస్తారా
ఆ లేస్తానే ఎందుకు అంత తొందరా
మీకు కాఫీ ఇచ్చి నేను త్రాగుదామని
ఎన్ని సార్లు చెప్పేది, నీకు అర్ధం కదా, నాకోసం ఆలో చించ వద్దు అని చెప్పఁగా
పక్కింటి వారిని గురించి ఆలోచించ మంటారా అంటూ మంగళ సూత్రాన్ని కళ్ళ కద్దుకొని 10 నిముషాలలో తయారవ్వండి .
5 నిముషాలు చాలే కాఫీ తీసుకురా
ఈ మాటలకూ ఏమి తక్కువ కాదు, మరోమాట అనకండి అంటూ లోపలలకు వెళ్ళింది
నీవు పెట్టి ఇచ్చే కాఫీ త్రాగితే అదో తృప్తి, కమ్మగా ఉందే. అంతొద్దండి, ములగ చెట్టు ఎక్కించకండి.
*భార్య గా గుర్తించక పోయినా, గౌరవించకున్నా ఫర్వాలేదు...కించపరచకండి.... నేనుచేసుకున్న కాఫీ ఈ రోజు అసలు నాకే బాగోలేదు అయినా మెచ్చుకున్నారు, ప్రతి పని లోను....కొందరు పనికిమాలీనోళ్లు .... ఉంటారు..... అసలు విషయం దాచి పొగడతారు వారి తీర్చుకుంటారు.
ఎందుకే అట్లా అనుకుంటావు, బాగుంటే బాగున్నది అని చెప్పుతాగా,
ఇప్పుడు నాకు బాగానే ఉన్నది అందుకే చెప్పా
ఎవరినో దృష్టి లో పెట్టుకోని..... మాట్లాడకే.. సరే సరే
మనిద్దరికీ రోజూ ఉండే మాటలే సరే సరే స్నానం చేసి రండి మరోసారి కాఫీ ఇస్తా ...
ఆమ్మో కాపీనా ...... ఆ కాఫీ ... ....... (2 )
*******
(కాసేపు నవ్వుకుందాం)(ఇది యదార్ధ గాధ )
శ్రీమతి తో శ్రీవారి ముచ్చట్ల కాఫీ చిన్న కధ (2)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
(కాసేపు నవ్వుకుందాం)(ఇది యదార్ధ గాధ )
శ్రీమతి తో శ్రీవారి ముచ్చట్ల కాఫీ చిన్న కధ (3)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
(కాసేపు నవ్వుకుందాం)(ఇది యదార్ధ గాధ )
అత్త తో కోడలు ముచ్చట్ల కాఫీ చిన్న కధ (4)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఏమి టమ్మాయి పిల్లవాడు అట్లా ఏడిపిస్తున్నాడు, ఏమో అత్తయ్యగారు నాకు అర్ధం కావాటంలేదు, ఇంకా పాలు త్రాగుతున్నాడా మానలేక పోతున్నాడు అత్తయ్యగారు. నీవే ఏదోరకంగా మాన్పించటానికి ప్రయత్నించు సెలవుకూడా కూడా పూర్తయినది మల్లీ ఆఫీసుకు పోవాలి కదా, ఇప్పుడు ఆఫీసుకు పోనక్కరలేదు, ఇంట్లో ఉండే చేయాలిగదా
అవునే పిల్లవాడి ఆలనా పాలనా చూసే పనిమనిషిని పెట్టుకో
అత్తయ్యగారు మీరు ఉండరా
ఇక్కడ ఎక్కువరోజులు ఉండలేనమ్మా ,పెద్దకోడలు కడుపుతో ఉందట అక్కడకు పోవాలి మా అబ్బాయికి కూడా చెప్పి వెళతాను జాగర్త ఉండండి.
ఇంకో నెలరోజులు ఉంటె నాకు బాగుంటుంది అత్తయ్యగారు
అవునమ్మా బగుంటుంది పోకపోతే ఏమన్నా అను కుంటారు నాకు అందరూ బిడ్డలే ఈ వయసులో తిరగలేకున్నాను , కానీ తప్పటలేదు.
నేనుచెప్పే విషయాలు గమనించమ్మా
ఈ సృష్టి మొత్తం స్త్రీ కి పాఠశాల.మాతృత్వం ఈ ప్రకృతిలో ప్రతి చెట్టు, ప్రతీ జీవి... ఏదైనా తన సహజ జీవన విధానంతోనే మనిషికి ఎన్నో విషయాలు బోధిస్తాయి. అలాగే పిల్లవాడ్ని పెంచటం ఎవరిని అడగనక్కరలేదు ఇప్పుడు ఇంటర్నెట్ అంతర్గాలం ఉన్నది అన్ని విషయాలు తెలుసుకుంటున్నారు సెల్లు ఉందికదా తెలుకొని ప్రవర్తించు.
ఐకమత్యం, ప్రేమ, త్యాగం వంటి సుగుణాలన్నీ స్త్రీ ప్రకృతినుంచే నేర్చుకోవాలి. స్త్రీ ప్రకృతిలో అందాలను ఆస్వాదించడం మాత్రమే కాదు- వాటిని అధ్యయనం చేయాలి. ఆ ప్రకృతి ధర్మాలను ఆచరించాలి. పచ్చని ఆకులతో కళకళలాడే వృక్షం శిశిరంలో ఆకులు రాలుస్తుంది. వేసవిలో ఎండి మోడైపోతుంది. వసంతకాలం రాగానే ప్రతి కొమ్మా చిగురిస్తుంది. అట్లాగే జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదని మంచిరోజు తప్పక వస్తుందని మానవాళికి మంచి సందేశమిస్తుంది. అంతేకాదు- వృక్షం ఎంత ఎత్తుకు ఎదిగినా ఉన్నచోటునే ఉంటూ అందరికీ ఆశ్రయం ఇస్తుంది. తన పళ్లను అందరికీ ఇచ్చి అలసిన జీవులను తన కొమ్మల నీడల్లో సేదతీరుస్తుంది.పరోపకారం, త్యాగగుణం కలిగి ఎన్నో జీవిత సత్యాలను బోధిస్తుంది వృక్షం. ఆ సత్యాలు మనిషి గ్రహించి వాటిని తన జీవితానికి అన్వయించుకోవాలి.
అత్తయ్యగారు మంచి మాటలు చెప్పారుఏమోనమ్మా నేను చెప్పాల్సినది చెప్పనమ్మా
స్త్రీకి ఓర్పే ఆయుధం, నేర్పే జీవితం, తీర్పే ఆలయం, ప్రేమే నిలయం
అత్తయ్యగారు చాలా మంచిమాటలుచెప్పారు ఇప్పుడు కాఫీ త్రాగండి తీసుకొచ్చా
కాఫీ త్రాగి వెళ్ళొస్తాను కోడలు .., .
అదెంటత్తయ్యగారు అప్పుడే వెలుతున్నారా. ఎవ. రైనా కొంతవరకేనమ్మా సహాయము ఎవరి బతుకు వారికి ఆదర్శ్యం
కాఫీ చల్లగా ఉందా
ఏదైనా సర్దుకు పోవటమే స్త్రీ బతుకు కదా
అవును .... అవునా
--(())--
(కాసేపు నవ్వుకుందాం)(ఇది యదార్ధ గాధ )
గురువు తో విద్యార్థి ముచ్చట్ల కాఫీ చిన్న కధ (5)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
పంతులుగారు బాగున్నారా
ఆ ఆ బాగున్నా, ఎలాగయ్యా ఇప్పుడు మీకు సెలవులు వచ్చినట్లున్నాయి
ఎప్పుడూ ఒకరకంగా ఉంటే ఈ గురువులు అసలు గుర్తుకు రారు కదా
అవునవును
ఈ మధ్య ప్రవేటు స్కూల్లో పనిచేసే అధ్యాపకులకు కష్టం గా ఉందట గదండీ
అవును బాబు ఎవరికి చెప్పుకొనేటట్లు లేదు , అధ్యాపకులు బతుకుతెరువు కోసం ఎదో ఒక పనిచేస్తున్నారు, ప్రభుత్వం వారు మమ్మల్నసలు పట్టించు కోవటం లేదు ఏంచేద్దాం
ఇంటర్నెట్ విద్య నేర్చుకొని విద్య చెప్పక పొయ్యరా
చూడు ఇది ఒక గురువుది కాదు సమస్య , అందరి గురువులది. మహమ్మారి రావటం వల్ల అటు విద్యార్థులు, ఇటు గురువులు, తల్లితండ్రులు, బాధ పడుతున్నారు
బాబు మేము డబ్బు కోసం కాదు పనిచేసేది విద్యావంతులుగా మార్చుటయే మా లక్ష్యం.
దేనికి మా ( గురువుల ) ఆదాయం మాత్రం... ప్రజల యొక్క జ్ఞానం, శ్రేయస్సు మరియు
దేశ అభివృద్ధి పెరుగుదలతో .పెరుగుతుంది అందుకే మేము ఉపాధ్యాయులుగా గర్తిస్తారు ....
పంతుళ్ళం కాదు... మేం "తరాల" తయారీదారులం...
ఏముంది పంతుళ్ళు... ఏదో వస్తారు .... పోతారు.నాలుగు మాటలు తోచింది చెప్తారు. *లేకుంటే సెలవులు... ఇదీ సమాజంలో ........ఉపాధ్యాయులపై చిన్న చూపు.*
మా మెదళ్లను పీల్చి పిప్పి చేసినా, వాళ్ళ మెదళ్లను బాగు చేసి మేధావులను, డాక్టర్లను,
యాక్టర్లను, ఇంజినియర్ లను,పోలీసులను,కలెక్టర్లను,లాయర్లను,టీచర్లను,నాయకులను,
అధికారులను...ఆఖరికి సమాజానికి కీడు చేయని ఒక మంచి మనిషిలా నిలిచేలా....
"తరాలు"......., "తరాలు" ......తయారుచేసే నిత్య ఉపాధ్యాయులం మేము.
*మా పనులు శారీరకంగా అలసినట్టు కనిపించేవి కావు.......
చెమటను సాక్ష్యం గా చూపడానికి......
మా పనులు బురదలోనో, ఖార్ఖానా లో చేసేవి కావు......
అనంత సాగరమైన విద్యను, విజ్ఞానాన్ని మధించి...
అక్షర సేద్యంలో నిరంతరం మానసికంగా అలసిపోయి, అర్థాంతరంగా తనువు చాలిస్తూ,
పదిమందికి బయటకు కనిపించే సాక్ష్యాలు .....
చూపలేని నిస్సహాయులం...
*మమ్మల్ని గౌరవించకున్నా ఫర్వాలేదు...
కించపరచకండి....ప్రతి వృత్తీ లోను....కొందరు పనికిమాలీనోళ్లు .... ఉంటారు.....
వాళ్ళను దృష్టి లో పెట్టుకోని.....మంచిగా పనిచేసే వాళ్ళ ను...మాటలతో... బాధించకండి
మమ్మల్ని పొగడకున్నా ఫర్వాలేదు...తూలనాడకండి...
అవును పంతులుగారు నేడు పరిస్థితి మారింది
అయినా ఇప్పుడు ఆధునిక విద్య అంటూ సెల్లు కొనిపించి ఆన్ లైన్ విద్య అంటూ చెప్పటం తప్పఁని పరిస్థితి అవునుబాబు
కాలం మారుతున్నది మేము ఎం చేయలేక పోతున్నాం
మాభవిషత్తుకు ఎవరు ఎవరు సహాయపడతారో వేచి చూస్తాను
పంతులుగారు కాఫీ త్రాగుదామా
ఒక శిష్యుడుగా అడుగుతుంటే కాదనటం నేటి స్థితిలో అంత మంచిదికాదు పదా త్రాగుదాం
నోటికి మాస్కు చేతికి వ్యాజలీన్ వ్రాసుకో బాబు
ఏపుట్టలో ఏపామున్నదో ఎవరూ చెప్పఁలేరు అసలే సినిమాలలో మొదటి భాగం రెండవభాగం అంటున్నారు అట్లాగే రోగంలో కూడా మొదటి కరోనా రెండవ కరోనా అంటున్నారు మనజాగర్తలో మనం ఉంటె మంచిది
మాఇంట్లో కాఫీ త్రాగుదాం అక్కడా ఇక్కడా ఎందుకూ
అట్లాగే పంతులుగారు ...
ఆ ........ ఆ......
--(())--
తల్లి కొడుకుల ముచ్చట్లు కాఫీ చిన్న కధ (6)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
తండ్రి ..కూతరు ముచ్చట్లు కాఫీ చిన్న కధ (7)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
తాత మనవుడి ముచ్చట్లు కాఫీ చిన్న కధ (8)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
2020 లో జరిగిన ముచ్చట్లు కాఫీ చిన్న కధ (9)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
తల్లీ కూతురికి హిందవుగా ముచ్చట్లు కాఫీ చిన్న కధ (10)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
2020 లో జరిగిన ముచ్చట్లు కాఫీ చిన్న కధ (11)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
గురుశిష్యుల ముచ్చట్లు కాఫీ చిన్న కధ (12)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
అన్నల చెల్లి ముచ్చట్లు కాఫీ చిన్న కధ (15)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
శ్రీమతి ముచ్చట్లు కాఫీ చిన్న కధ (16)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మాజీ ప్రిన్సిపాల్ ముచ్చట్లు కాఫీ చిన్న కధ (17)
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ప్రాంజలి ప్రభ ... ఆరోగ్య ప్రభ
✍️చలికాలం - ఆహార జాగ్రత్తలు!
సేకరణ మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
👉చలి కాలంలో ఆకలి ఎక్కువ వేస్తుంది. తరచు ఏదో ఒకటి తినాలని నాలుక లాగుతూ ఉంటుంది. జీర్ణశక్తి ఎక్కువగా ఉండడమే ఇందుకు కారణం. నిజానికి చలికాలంలో శారీరక శ్రమ తగ్గుతుంది. ఎక్కువగా తింటాం. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు వచ్చి మీద పడతాయి. కీళ్ల నొప్పులు, ఒంటినొప్పులు, బద్దకంగా, నిస్తేజంగా ఉండడం, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు చలికాలంలో ఇందుకే వస్తాయి. అందుకే ఈ సీజన్లో ఎలాంటి ఆహార పదార్థాలు తినాలో మీ కోసం వివరిస్తున్నాము.
👉చలికాలంలో బాదం పప్పు, జీడిపప్పు, అంజీర, వాల్నట్స్, ఎండుద్రాక్ష, ఖర్జూరాలను పరిమితంగా అయినా తప్పనిసరిగా తీసుకోవాలి. శరీరానికి అవసరమైన పోషకాలు, చర్మానికి అవసరమైన నూనెలు వీటిలో పుష్కలంగా ఉంటాయి. దాంతో పాటు మన శరీరానికి అవసరమైన వేడికూడా ఈ పదార్థాల వల్ల లభిస్తుంది.
👉మిరియాలు, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, అవాలు, ఉల్లిపాయలు ఈ సీజన్లో ఎక్కువగా తీసుకోవాలి. వీటి వాడకం వల్ల జీర్ణశక్తి సక్రమంగా ఉండడంతో పాటు పొట్టలో గ్యాస్ సమస్య ఉండదు.
👉ఆహారం కాస్త ఎక్కువ మోతాదులో తీసుకుంటాం. పైగా తగిన శ్రమ ఉండదు కాబట్టి మునగ, కాకర, అరటి వంటి కూరగాయలు, మెంతి, పుదీనా వంటి ఆకుకూరలు అధికంగా తీసుకోవాలి. వీటి వల్ల తీసుకున్న ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.
👉మొలకెత్తిన గింజలు ఈ సీజన్లో బెస్ట్. వాటిని తీసుకోవడం వల్ల శక్తి ఎక్కువగా వస్తుంది. పైగా పొట్ట బరువుగా అనిపించదు.
👉ఓ గ్లాసు వేడి పాలలో కాస్త పసుపు, మిరియాలు వేసుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దగ్గు, జలుబు వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
👉నిల్వ ఉంచిన, చల్లారిపోయిన ఆహారం ఈ సీజన్లో అసలే తీసుకోకూడదు. వేడి వేడి, తాజా ఆహారం ఎంజైమ్స్‌ను వృద్ధి చేస్తాయి.
👉శారీరక శ్రమ తగ్గిపోతుంది కాబట్టి మన శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోవు. అందుకోసం ఆరంజ్, నిమ్మ వంటి విటమిన్- సి ఉన్న పండ్లు తీసుకోవాలి.
👉వారంలో ఒకపూట నిరాహారంగా ఉండడం వల్ల శరీరంలో ఉన్న మాలిన్యాలు తొలగిపోతాయి. శరీరానికి నవ చైతన్యం సమకూరుతుంది.
👉వయోధికులు చన్నీటి స్నానాలు వదిలేయాలి. ఒకవేళ చేయాల్సి వస్తే కాస్త ఎండ వచ్చిన తరువాత స్నానం చేయడం మంచిది.
👉కొందరు ఈ కాలంలో ఆస్తమా, జలుబు వంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా చిన్నారులు. దీనికితోడు ఏ పని చేయలేక చాలా బద్ధకంగా ఉంటుంది. అలాంటి వారు కొంత సమయం ఎండలో నడవడం మంచిది.
👉పొద్దుకుంగిన వెంటనే ఇంటి కిటికీలన్నీ మూసేయాలి. కర్టెన్లు కూడా వేసేయడం ద్వారా ఇల్లు లేదా నిద్రించే గది వేడిగా ఉండేలా చూసుకోవాలి.
👉వృద్ధులు, చంటి పిల్లలు ఉన్న ఇంట్లో ఈ జాగ్రత్తలు తప్పని సరి. లేకుంటే చలి కారణంగా అనేక సమస్యలు ఎదుర్కొనే ప్రమాదం ఉంది.
👉పడుకొనే ముందు గోరువెచ్చని నీటితో చేతులు, కాళ్లు, ముఖం శుభ్రం చేసుకొని మాయిశ్చరైజర్ వంటివి రాసుకొని పడుకోవడం వల్ల చర్మం పాడు కాకుండా ఉంటుంది.
👉ఈ కాలంలో శరీరం పొడిబారడం, కాళ్ళు పగుళ్లు లాంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటప్పుడు రాత్రిపూట కొబ్బరినూనెను వేడిచేసి దానికి చెంచా పసుపు కలిపి కాళ్లకు రాసి మర్దనా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
👉తెల్లవారుజామున లేవాల్సిన అవసరం ఉన్న వారు చెవులకు తప్పని సరిగా మఫ్లర్ లేదా మంకీ క్యాప్ వంటివి తప్పని సరిగా వేసుకొనే బయటకు వెళ్లాలి.
✍️సమస్య ఏదైనా ఒకసారి మాకు తెలపండి. తక్కువ ఖర్చుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు లేకుండా అద్భుతమైన శాశ్వత పరిస్కారం చూపే ప్రయత్నం 100% జరుగుతుంది. మా వద్ద మందులు తీసికుని వాడిన మరియూ వాడుతున్న మిత్రులు అందరూ చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాము.
మిత్రులందరికీ మా నుండి ఒక విన్నపం.. ఈ పేజీ చాలా విలువైన ఆరోగ్య విషయాలను అందరికి ఉచితంగా అందించాలనీ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో చేయడం జరిగింది. ఈ పేజీ ప్రతి ఒక్కరికి చేరేలా మిత్రులు అందరికి షేర్ చేసి సహకరించగలరని విజ్ఞప్తి. మీ మనసుకి ఇష్టమై మీకు బాగుంది అనిపిస్తే దయచేసి ఈ పేజీని లైక్, ఫాలో చేసి మరియు షేర్ చేయగలరని మనవి..
మీ ఆరోగ్యమే మా సంతోషము .... ప్రాంజలి ప్రభ
*************
శాకాహారం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి..
👉కూరగాయలు తినడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు, మాంసాహారం తీసుకుంటేనే బలంగా ఉంటాం అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది.
👉కానీ మాంసాహారం కంటే వెజిటే రియన్ డైట్‌తోనే ఎక్కువ ప్రయోజనాలున్నాయి అని చాలామందికి తెలియదు.
👉అసలు శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో ఒకసారి చూద్దాం..
1).డీటాక్సిఫై:
👉వెజిటబుల్ డైట్లో ఫైబర్ శాతం ఎక్కువగా ఉంటుంది.
👉 ఫైబర్ అంటే పీచుపదార్థాలు.
👉పాలకూర, క్యాబేజీ, సొరకాయ, గుమ్మడి వంటి కూరగాయలలో పీచుపదార్ధాలు ఎక్కువగా ఉంటాయి.
👉పీచుపదార్థాలు శరీరానికి చాలా అవసరం.
👉మలబద్ధకం రాకుండా ఉండాలంటే తీసుకునే ఆహారంలో ఫైబర్ ఉండాల్సిందే.
శరీరంలో నుంచి టాక్సిన్స్‌ను బయటకు పంపించడానికి ఈ ఫైబర్ చక్కగా ఉపయోగపడుతుంది.
👉నాన్‌వెజ్‌లో ఫైబర్ లభించదు.
2).ధృడమైన ఎముకలు:
👉మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ప్రొటీన్ శాతం పెరిగిపోతుంది.
👉 దీనివల్ల కిడ్నీలు దెబ్బతినడమే కాకుండా శరీరం కాల్షియం గ్రహించడం తగ్గిపోతుంది.
👉ఎముకలు బలహీనంగా మారుతాయి.
👉శాకాహారుల్లో ఇలాంటి సమస్యలు తక్కువే.
3). కార్బోహైడ్రేట్స్ లోపం:
👉నాన్-వెజిటేరియన్ ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగా లభిస్తాయి.
👉శరీరానికి తగినంత కార్బోహైడ్రేట్స్ లభించనపుడు అది కెటొసిస్‌కు దారితీస్తుంది.
👉అంటే శరీరం తనకు అవసరమైన ఎనర్జీ కోసం కొవ్వును కరిగించుకొంటుంది.
👉అంతేకాకుండా వెజిటేరియన్ ఫుడ్‌లో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా జీర్ణం అవుతూ శరీరానికి అవసరమైన గ్లూకోజ్‌ను మెల్లగా అందిస్తాయి.
👉అయితే నాన్‌వెజ్‌లో ఫ్యాట్, ప్రొటీన్స్ ఎక్కువగా ఉంటాయి.
👉ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది.
4).ఆరోగ్యకరమైన చర్మం:
👉బీట్రూట్, టమోట, గుమ్మడి, కాకరకాయ వంటి కూరగాయలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
👉ఆపిల్స్, పియర్స్, జామకాయ లాంటి పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మం నిగనిగలాడుతూ ఉంటుంది.
👉మాంసాహారం తీసుకోవడం వల్ల చర్మానికి ఎలాంటి ఉపయోగం లేదు.
5).బరువు నియంత్రణ:
👉కొవ్వును తగ్గించుకోవాలంటే సులభమైన మార్గం నాన్‌వెజ్‌కు దూరంగా ఉండటమే.
👉మాంసాహారం తీసుకునే వారు బరువును తగ్గించుకోలేరు.
👉అయితే నాన్‌వెజ్‌కు బదులుగా తృణధాన్యాలు, పప్పు దినుసులు, కూరగాయలు, నట్స్, ఫ్రూట్స్ తీసుకొంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ అదుపులో ఉంటుంది.
👉వెజిటేరియన్ డైట్ వల్ల అధిక రక్తపోటు, అధిక బరువు నియంత్రణలో ఉంటాయి.
6). ఫైటో న్యూట్రియెంట్స్:
👉డయాబెటిస్, క్యాన్సర్, కిడ్నీ వ్యాధులు, స్ట్రోక్, బోన్ లాస్ వంటి వ్యాధులను ఫైట్రోన్యూట్రియెంట్స్ తీసుకోవడం ద్వారా నివారించవచ్చు.
👉ఇవి వెజిటేరియన్ డైట్లో మాత్రమే లభిస్తాయి.
👉నాన్‌వెజ్ తీసుకునే వారిలో వీటికి కొరతేఉంటుంది.
7). సులభంగా నమలడం:
👉మనం తీసుకున్న ఆహారం జీర్ణం కావడం లాలాజలంతో మొదలవుతుంది.
👉కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారం తీసుకున్నప్పుడే ఈ ప్రక్రియ మరింత బాగా జరుగుతుంది.
అంతే కాకుండా కూరగాయలతో తీసుకునే ఆహారాన్ని సులభంగా నమలవచ్చు.
✍️ ముఖ్య గమనిక:
👉పౌష్టికాహారం పేరిట అదేపనిగా మాంసాహారం, గుడ్లు తీసుకుంటే వాటిని అరిగించుకోవడానికి జీర్ణకోశంపైన అనవసరపు భారం పడుతుంది.
👉శరీరంలోని జీవశక్తి అదనంగా ఖర్చవుతుంది.
👉శరీరతత్వంలో కొన్ని చెడు పరిణామాలు చోటు చేసుకుంటాయి.
👉ఆకలి మందగించడం, కడుపులో మంట, తేన్పులు, మలబద్ధకం వంటి సమస్యలు మొదలవుతాయి.
👉మాంసాహారం, గుడ్లు పూర్తిగా మానకోవాలని కాదు. ఒక పరిమితిలో వాటిని తీసుకోవచ్చు.
👉అయితే, మాంసాహారం నుంచి మాత్రమే కావలసిన పోషకాలు లభిస్తాయనుకోవడం సరికాదు.
👉శాకాహారం నుంచి కూడా అవసరమైన ప్రొటీన్లతో పాటు పోషకపదార్థాలన్నీ లభిస్తాయి. పెద్దవారికి ఇవి అవసరానికంటే ఎక్కువే.
✍️మొలకెత్తిన పెసర్లు, శనగలు:
👉వీటి నుంచి ప్రొటీన్లు, ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి.
👉తరుచూ వీటిని ఉపాహారంగా (బ్రేక్‌ఫాస్ట్) తీసుకోవడం వల్ల ఎంతో మేలు చేస్తాయి.
👉మొలకెత్తిన గింజల్లో ప్రొటీన్లతో పాటు లవణాలు, విటమిన్లు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి.
👉పైగా వీటిని జీర్ణించుకోవడంలో శరీరానికి ఎక్కువ శక్తి కూడా ఖర్చు కాదు.
👉మొలకెత్తించే విధానం గింజలను నీటిలో నాలుగు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టాలి.
👉ఆ తరువాత వాటిని తడిగుడ్డలో మూట కట్టి ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టాలి.
👉కొంచెం గాలి తగిలేలా మూత కాస్త తెరిచి పెట్టాలి. సాధారణంగా 12 నుంచి 16 గంటల వ్యవధిలో ఇవి మొలకెత్తుతాయి. చలికాలంలో అయితే 24 గంటల దాకా పట్టవచ్చు.
✍️నానబెట్టిన వేరుశనగలు:
👉శరీరానికి కావలసిన ఎన్నో పౌష్టిక విలువలు, ప్రొటీన్లను వీటి ద్వారా పొందవచ్చు.
👉వేరుశనగ గింజలను పన్నెండు గంటలపాటు నానబెట్టాలి.
👉ఆ తరువాత నీరు తీసివేయాలి. ఇలా చేయడం వల్ల అందులోని హానికారక అంశాలన్నీ తొలగిపోతాయి.
👉ఈ వేరుశనగలను బెల్లంతో కలిపి తీసుకుంటే ఎంతో శక్తి లభిస్తుంది.
✍️సలాడ్:
👉క్యారెట్, కీర, బీట్రూట్, ఉల్లి, క్యాబేజీ, క్యాప్సికమ్‌లను చిన్న చిన్న ముక్కలుగా తరగాలి.
👉అప్పుడప్పుడు పచ్చి బఠాణి, రుచి కోసం కొంచెం ఉప్పు, మిరియాల పొడి కలుపుకోవచ్చు.
👉టమాటకు బదులుగా నిమ్మరసం కలుపుకోవచ్చు.
👉 తినే సమయంలో మాత్రమే ఉప్పు కలుపుకోవాలి.
👉రాత్రిపూట ఆహారంతో పాటు తీసుకుంటే చాలా మంచిది.
✍️పప్పు, ఆకుకూరలు:
👉పప్పులో ప్రొటీన్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి.
👉ఆకుకూరలో, ఇనుము, లవణాలు అధికంగా ఉంటాయి.
👉రక్తహీనతను ఆకుకూరలు బాగా అరికడతాయి.
👉నీరసం, అలసట తగ్గుతుంది.
👉రక్తహీనత తగ్గడంతో పాటు రక్తస్రావ సమస్యలు కూడా నయమవుతాయి.
👉వీటితో పాటు నానబెట్టిన ఎండు ద్రాక్ష, అత్తిపండు, నానబెట్టిన బాదం, నల్లరకం ఎండు ఖర్జూరం తీసుకోవడం శ్రేయస్కరం.
ఆరోగ్య సలహాలతో కూడిన మన పేజీ ప్రతి ఒక్కరికి చేరేలా మిత్రులు అందరికి షేర్ చేసి, లైక్ చేసి, మంచి రేటింగ్ ఇచ్చి సహకరించగలరని విజ్ఞప్తి.
సదా మీ సేవలో
om
ReplyDelete