Friday, 30 April 2021




దివ్య సంపద

సంపదలన్నీ సుఖ సౌఖ్య సంతోషాలకేనన్న బలమైన అపోహ ప్రజల్లో ఉంది. ప్రాపంచిక సంపదలన్నీ చేతులు మారుతున్నవే తప్ప స్వయంసృష్టిగా చెప్పదగ్గవి తక్కువ. వంశానుగతంగా సంక్రమించే పూర్వీకుల ఆస్తులన్నీ ఇలా లభిస్తున్నవే.
అర్థశాస్త్ర గ్రంథకర్త చాణక్యుడు సంపదను కూడబెట్టడాన్ని వ్యతిరేకించాడు. ఏ రోజు ఆదాయం ఆ రోజుకు సరిపోతే చాలన్నాడు. అప్పుడు మనిషి స్వార్థమనే బోనులో బందీ కాడు.
రాజ్య నిర్వహణ కోసం పాలకుడు పటిష్ఠమైన ఆర్థిక వ్యవస్థ కలిగి ఉండాలని ‘శుక్రనీతి’ చెబుతుంది. కష్టార్జితమే న్యాయార్జితమని విదురనీతి శాస్త్రం బోధిస్తుంది.
ప్రపంచంలో అన్యాయార్జన కోసం ఆరాటపడేవాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. మాయాద్యూతంలో పాండవుల సంపదను దోచుకున్న దుర్యోధనుడు, సూది మోపిన స్థలాన్ని కూడా తిరిగి ఇవ్వనన్నాడు. అలా ఉంటుంది సంపద మీద వ్యామోహం. కానీ, వ్యామోహాల పర్యవసానాలన్నీ దుఃఖాంతంగానే ఉంటాయి. దుఃఖం తప్పదని తెలిసినా వ్యామోహాన్ని వదులుకోరు. ధృతరాష్ట్రుడి విపరీత పుత్రవ్యామోహం లోకప్రసిద్ధం.
మహాకవి భారవి తండ్రి తన పుత్రప్రేమను గుప్తంగా ఉంచుకుని, అందుకు కారణం కుమారుడి క్షేమమేనని చెప్పడం గుర్తుంచుకోదగిన చారిత్రకాంశం. సంతానం సాధించిన విజయాలను తండ్రి అభినందించి ప్రోత్సహించాలి. అతిగా పొగడకూడదు.
సంపద అంటే కేవలం ధనధాన్య వస్తువాహనాలు కావు. సరస్వతీ ప్రసాదాలుగా చెప్పుకొనే కళా సాహిత్య స్వరూపాలు కూడా. అక్షర సంపదలన్నీ అక్షయమే. కోటీశ్వరులు, మహారాజులు కూడా కవులకు, కళాకారులకు చేతులు జోడించక తప్పదు. లక్ష్మీ కటాక్షం కన్నా సరస్వతీ కటాక్షమే గొప్పదని రుజువైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
శ్రీకృష్ణదేవరాయలు అల్లసాని వారికి గండపెండేరం తొడిగినా, తన శ్రోత్రియత్వాన్ని పక్కనపెట్టి విశ్వనాథవారు కవికోకిల జాషువాను గండపెండేరంతో సత్కరించినా- అందుకు వారి అక్షర సంపదే కారణం.
తరతరాల సంపద ఆర్జించి వారసులకివ్వడంతో తమ కర్తవ్యం ముగిసిపోయిందనుకునేవారే ఎక్కువ. వారసులకు సంస్కారం, సంప్రదాయాలను కూడా ఇవ్వకపోతే, కొండంత సంపదైనా కళ్లముందే కరిగిపోతుంది. ఉత్తమ గుణాలు కలిగి ఉన్నవారికి ప్రాపంచిక సంపదల పట్ల ఆసక్తి ఉండదు. వారు అంతర్ముఖులై అంతర్యామిని ఆరాధించడంలో నిమగ్నులై ఉంటారు. దేహాన్ని కేవలం జీవన వాహనంగా భావిస్తారు. ఆత్మభావనతో జీవిస్తారు. చూసేవారికి వారు కాలాన్ని వ్యర్థం చేస్తున్నారనిపిస్తుంది. కానీ వారు జీవితానికి అర్థం చేకూర్చుకుంటున్నారని తెలియదు.
వాల్మీకి పుట్టలో కూచుని కాలం వ్యర్థం చేశాడా? శ్రీరమణులు, అరవిందులు, శ్రీరామకృష్ణులు ఏమీ సాధించలేదా? వారంతా దివ్య సంపదలు ఆర్జించారు. వాటిని ఆశ్రితులకు, జిజ్ఞాసువులకు ఉదారంగా పంచిపెట్టారు.
భారతదేశం దివ్యమైన ఆధ్యాత్మిక సంపదలకు నెలవు. ఎందరో మహానుభావులు తరతరాలకు సరిపడా దివ్య సంపదను వారసత్వంగా ఇచ్చారు. ఆ విషయాన్ని గుర్తించని వారంతా
ప్రాపంచిక సంపదలకు ప్రాధాన్యమిస్తున్నారు. కొన్ని తరాలకు సరిపడా కూడబెట్టి వారసులకు ఇచ్చామని ఘనంగా భావిస్తున్నారు. కానీ, దివ్య సంపదను కోల్పోయామన్న గ్రహింపు లేకపోవడం ఒక జీవితకాలపు నష్టం.
 
 --(())--
 
1. మేళ్ల చెరువు.. కోదాడకు 20 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. సిమెంటు ఫ్యాక్టరీల బెల్టు. సున్నపురాయి నిక్షేపాలు అపారంగా వున్న ప్రాంతం.
 
2. మేళ్ల చెరువులో శివాలయాన్ని కాకతీయులు 12వ శతాబ్దంలో నిర్మించారు. శాసన ఆధారాలు వున్నాయి. ఆలయ ప్రాంగణంలోనే శిలాశాసనం వుంది.
 
3. ఆలయంలోని శివలింగం ప్రత్యేకతలు అనేకం వున్నాయి.
 
4. వందేళ్ల వ్యవధిలో ఓ బెత్తెడు చొప్పున శివలింగం నిలువుగా పెరుగుతూ వుంటుంది. గడచిన ఐదు వందల సంవత్సరాలలో పెరిగిన పరిణామాన్ని సంకేతిస్తూ శివలింగంపై గుంటలు కూడా కనిపిస్తూ వుంటాయి.
 
5. లింగంపై అమర్చిన కలశంనుంచి బొట్టుబొట్టుగా కారే నీరు.. ఆ గుంటలను ఏర్పరుస్తుంటాయి. ఆ గుంట వైశాల్యం పెరుగుతుంటుంది. గడచిన పాతికేళ్లుగా అక్కడ అర్చకత్వం చేస్తున్న బ్రాహ్మణ పండితుడు ఈ విషయాన్ని నిర్ధారించారు. వందేళ్ల వ్యవధిలో అది శివలింగం ముఖ భాగంలోకి అంతకు ముందున్న గుంటల్లో భాగంగా చేరి, లింగం పరిణామం మరింత పెరుగుతుంది. అయితే.. పురావస్తు శాఖవారు దీనిపై పరిశోధన కానీ, శాస్త్ర నిర్ధారణ కానీ చేసిన దాఖలాలు లేవు.
 
6. యాగంటి బసవన్న పురావస్తు శాఖవారు  పెరుగుదలను నిర్ధారించారు.
 
7. మేళ్ల చెరువు శివయ్యను నిజరూపంలో దర్శించుకోగలిగటం  అదృష్టం.
 
8. మేళ్ల చెరువు శివలింగం అగ్రభాగాన.. కొద్దిగా వెనుకవైపుగా ఒక రంధ్రం వుంటుంది. అందులోంచి నిరంతరం నీటి ఊట వుంటుంది. అదేదో బొక్క పడి వుంటుంది.. పూజారిగారు చేసే అభిషేకాలు, కలశంనుంచి వచ్చే నీటితో ఆ బొక్క నిండుతోంది తప్ప.. ఊటలేదు, గీటలేదు అని నాలాగే ఎవరైనా అనుకుంటారు.
 
9. అసలు దీని లోతు ఎంతో అంతు చూద్దామని,  మనం బోరుబోవుల్లో వేస్తామే.. అలాగ.. ఒక రాయికి తాడు కట్టి దింపారు, దింపారు కానీ.. లోతు తెలియలేదు. తాడుని వెనక్కి లాగినప్పుడు పడిన మరకలు మాత్రం శివలింగంపై మనకు కనిపిస్తాయి.
 
10. అయితే దేవాదాయ శాఖవారు కూడా కొన్ని పరీక్షలు చేశారు. అభిషేకాలు అన్నీ ఆపేసి, ఊట మొత్తాన్ని తోడి, గుడి తలుపులు పావుగంట మూసేసి, మళ్లీ వెళ్లి చూస్తే.. గుంట నిండే వుంది. అలా మూడుసార్లు పరీక్షలు జరిగాయి.
 
11. ఆ ఊట ఎక్కడినుంచి వస్తోందో ఎవరికీ తెలియదు. భక్తుల సౌకర్యార్ధం ఆలయ ప్రాంగణంలో వేసిన నాలుగు బోర్లు కూడా ఫెయిలయ్యాయి. కానీ.. ఈ నిరంతర ఊట.. అది కూడా శివలింగంపై.. శివుడి శిరస్సున గంగ ప్రవహించినట్టుగా వుంటుంది.
 
12. అంతరాలయంలోనుంచి చూసినప్పుడు.. ఆ ఊట గుంట నేరుగా కనిపించదు. అందుకే పూజారి.. గర్భాలయంలో శివలింగం వెనుక నిలబడి ఒక అద్దం పెట్టి చూపిస్తుంటారు. ఆ గంగాజలాన్ని భక్తులపై చిలకరించి ఆశీర్వదిస్తారు. శివలింగం వెనుక అర్ధనారీశ్వరీ రూపాలు కూడా వుంటాయి. వాటిని కూడా అద్దంలోంచి చూడవచ్చు.
 
13. శివలింగం రాతి స్వభావం.. ఒక సున్నపు రాయిలాగా తెల్లగా వుంటుంది. కానీ ఆ ప్రాంతంలో మామూలుగా దొరికే సున్నపురాయి కంటే.. అత్యంత అరుదైన, అమూల్యమైన సున్నపురాతితో దానిని తయారు చేసి వుంటారని నా వ్యక్తిగత అభిప్రాయం. సున్నపురాయికి వుండే ఉష్ణస్వభావాన్ని శీతలీకరించే ప్రక్రియలో భాగంగా కాకతీయులు సహజ శీతలీకరణ యంత్రంగాన్ని ఏర్పాటు చేసి వుంటారని, అందుకు సరిగ్గా మేళ్ల చెరువులోని నిర్దిష్ట ప్రాంతాన్ని ఇంజనీరింగ్ ప్రతిభతో, వాస్తు ప్రతిభతో ఎంపిక చేసి వుంటారని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎంతో మెటిక్యులస్ ప్లానింగ్ వుంటే తప్ప ఆ ఆలయ నిర్మాణం, ఆ శివలింగ నిర్మాణం అలా సాగి వుండదు.
14. మనకు దైవభక్తి వుండవచ్చు, లేకపోవచ్చు. కానీ ఇటువంటి నిర్మాణాలను కాపాడుకోవడానికి భక్తి అనేది, దేవుడు అనేవాడు మనకు మాధ్యమం అయితే కొంపలు మునిగేదేమీ లేదు. సెక్యులరిజానికి, లౌకికవాదానికి వాటిల్లే ముప్పు ఏమీ వుండదు. మన చారిత్రక, వారసత్వ, విజ్ఞాన కేంద్రాలను మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుతారు?
 
15. ఆలయం మండపంలో సుమారు పదీ పదిహేనుమంది బ్రాహ్మణులు, నాలుగైదు వేర్వేరు విధుల్లో నిత్యం వుంటారు. గ్రహశాంతి ఇత్యాది క్రతువులను నిర్వహిస్తుంటారు. నేరుగా శివుడి సమక్షంలోనే వీటిని నిర్వహించుకోవచ్చు... 💐🙏తాన ప్రదాయిని కోట సత్తెమ్మ

పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో ఉంది కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానం. అమ్మవారు భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. కోరిన కొర్కెలు తీర్చే చల్లని తల్లిగా ప్రసిద్ధి చెందింది సత్తెమ్మ. శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానానికి పురాతన చరిత్ర ఉంది. అమ్మవారి విగ్రహం 11వ శతాబ్దంలోని తూర్పు చాళుక్యుల కాలానికి చెందినదని పరిశోధనలు చెబుతున్నాయి. అప్పట్లో నిడదవోలును నిరవధ్యపురంగా పిలిచేవారు. నిరవధ్యపురాన్ని పాలించిన వీరభద్రుని కోటలోని అమ్మవారు శక్తిస్వరూపిణిగా పూజలందుకున్నారు. కాలక్రమేణా కోట శిథిలమైంది. అమ్మవారి విగ్రహం కనుమరుగైంది. అలా అదృశ్యమైన అమ్మవారు 1934లో తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన దేవులపల్లి రామసుబ్బరాయ శాస్త్రి పొలంలో, పొలం దున్నుతున్నప్పుడు బయటపడింది. భూమి యజమాని కలను అనుసరించి కోటసత్తెమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆనాటి నుంచి నేటి వరకు అమ్మ... భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా, వరాలిచ్చే చల్లని తల్లిగా పేరుగాంచుతోంది. ఈ ఆలయానికి ఉభయగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం, గుంటూరు, కృష్ణ, జిల్లాల భక్తులు అధికంగా విచ్చేస్తుంటారు. ఆలయంలో ఏటా దసరా ఉత్సవాలతోపాటు అమ్మవారి తిరునాళ్ళను వైభవంగా నిర్వహిస్తున్నారు.
శంఖచక్రగద అభయ హస్త యజ్ఞోపవీతధారిణిగా ఏకశిలా స్వయంభూ విగ్రహంతో త్రిశక్తి స్వరూపిణిగా వెలసిన అమ్మవారిని సందర్శించటానికి రెండుకళ్లూ చాలవేమోననిపిస్తుంది. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు పంచముఖ ఆంజనేయస్వామి. అమ్మవారి దర్శనం కోసం ఏటా సుమారు 5 నుంచి 6 లక్షల మంది భక్తులు వస్తుంటారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఇక్కడ 65 గదులు ఉన్నాయి. ఆలయానికి ప్రతి ఆది, మంగళవారాలలో భక్తులు విశేషంగా తరలివచ్చి తమ మెక్కుబడులు తీర్చుకుంటారు. చుట్టుపక్కల గ్రామాలలో ప్రతి కుటుంబంలోనూ కోటసత్యనారాయణ, కోటసత్తెమ్మ అనే పేర్లు తప్పనిసరిగా పెట్టుకుంటారు. ఏటా శ్రావణమాసంలో చివరి శుక్రవారం నాడు సుమారు 1000 మంది ముతైదువలతో ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ వ్రతాలకు నిడదవోలు పట్టణంతో పాటు వివిధ గ్రామాల నుండి మహిళలు తరలిరావడంతో సందడి నెలకొంటుంది. దేవస్థానం ఆధ్వర్యంలో మహిళలకు ఉచితంగా పసుపు, కుంకుమ, గాజులు, తమలపాకులు, లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు రోజుకి సుమారు 100 మందికి శాశ్వత అన్నదాన ట్రస్టు ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు.
సంతాన వృక్షానికి పెరుగుతున్న భక్తుల తాకిడి

శ్రీ కోటసత్తెమ్మ అమ్మవారి దేవస్థానంలో గర్భాలయానికి నైరుతి వైపున ఉన్న సంతాన వృక్షానికి రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతోంది. సంతానం లేని దంపతులు ఈ వృక్షానికి ఊయల కట్టడం సంప్రదాయం. సంతానం లేని దంపతులు ఈ వృక్షం దగ్గరకు చేరుకుని ఎర్రటి వస్త్రం, పూర్తిగా పండిన రెండు అరటిపండ్లను అమ్మవారికి సమర్పిస్తారు. అనంతరం ఒక అరటి పండును, ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని దంపతులు సంతాన వృక్షానికి ఊయల కట్టి, ఆ ఊయలలో పండును ఉంచి, ‘అమ్మా... పండు కడుతున్నాను పండంటి బిడ్డను ప్రసాదించు తల్లీ’ అని వేడుకుంటారు. బిడ్డ పుట్టిన తరువాత అమ్మవారి సన్నిధి తీసుకువచ్చి పేరు పెట్టుకోవడంతోపాటు బిడ్డ ఎత్తు తులాభారంతో మొక్కుబడి తీర్చుకుంటారు. తులాభారానికి నగదు (నాణేల రూపంలో) లేదా పటిక బెల్లం తూకం సమర్పించుకుంటారు.

ఆలయానికి వచ్చే మార్గం...

అమ్మవారి ఆలయం నిడదవోలు రైల్వేస్టేషన్‌కి (బస్‌ స్టాండ్, గణపతి సెంటర్‌ల మీదుగా) 3 కిలోమీటర్ల దూరాన ఉంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుండి 26 కిలోమీటర్లు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుండి 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఆలయానికి చేరుకోవచ్చు.

ప్రతిష్ఠాత్మకంగా రాజగోపుర నిర్మాణం

అమ్మవారి దేవస్థానం ముందు భాగంలో దాతల సహకారంతో తొమ్మిది అంతస్తుల రాజగోపురం నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఆలయ ఈవో చొరవతో ఇప్పటివరకు నాలుగు అంతస్థులు పూర్తయ్యాయి.


 

Thursday, 29 April 2021

 May be an image of 1 person

ప్రాంజలి ప్రభ.. 29-04-2021
 - ఆరోగ్యం - ఆధ్యాత్మికం - ఆనందం

సోయగములు -- (16 -18 )
మారుమాట వలదు ఎప్పుడూ
పేరు చెడును కదుర
చేరుకున్నవిలువ చెరపకు  
మరచి చెడును బతుకు
అరిచి పెద్దగా చెప్పకు
అరుపు హాని కలుగు
ఆర్తనా దముతొ సోయగములు

ఆరునూర అయిన మరువకు
ఆర్తి విలువ తెలుపు
అర్పణతో పని కాదులే  
దర్పమెపుడు వద్దు
కర్పూర వెలుగులా బతకాలి  
భార మవ్వ వద్దు
బుద్ధిని బట్టి సోయగములు

కారణములు ఎన్ని ఉన్నాను
ఖర్చు అగుచు ఉండు   
నోరు ఉన్నదిగదా అరిచినా
నరము వాపు పెరుగు
నారుపోసానీరు ఇమ్మంటె
నరుని బతుకు మారు
మారుమాటలతొ సోయగములు    
--(())--

బ్రహ్మ జీవ తత్వ భావాలు...  

సుఘందాలు పంచు పువ్వులు మాలలగును   
మనోఫలకంపై అక్షర సాహిత్యం ముండును  
కళ్ళు చూసిన చిత్రాలు నచ్చవచ్చును   
మనసున చేరిన భావాలు నచ్చవచ్చును  

చెప్పలేనట్టి ప్రకృతి అందాలు బాదుంచును    
విప్పలేనట్టి మేధస్సు ఆలోచనలు మూసివేయును
మొక్కలు ఎండినా మరలా చిగురిస్తూ ఉండును    
సాహిత్యం పాతధైన మల్ల చిగురిస్తూనేఉండును  

రాయాలనుకుంటున్నాను నిత్యం ఆలోచనవుండును   
మేధస్సు చెప్పింది తెలపాలనేది సత్యమే అగును
సర్వం మంగళకరంగా ఉండాలని ఆశ ఉండును  
అందరికి చెపుతున్న తెలిసిన ధర్మమే ఇదియగును  

ధర్మం ఆచరిస్తే అందరికీ  సుఖమే  కలుగును   
అదే నేను కోరుకొనే నిత్య న్యాయ కవిత్వమగును
ఫలితం ఆశించకుండా కృషి దైవమగును  
దైవం నీలోఉన్నాడు మరచిపోకు వ్రాయమనెను  
ప్రేమించి  పొందటానికి బతుకు ప్రేమగును  

దేశ ప్రతిష్ట కోసం సహనంతో బతుకు కదులును
సర్వే జానా సుఖినోభవంతు - ఓం శాంతి: ఓం శాంతి: ఓం శాంతి:
--(())--
తులసీదాస్ విరచిత హనుమాన్ చాలీసా
మొగ్గలు
అత్యంత బలము వీరత్వం కలిగిన
స్వర్ణశోభితమైన దేహము కలవాడు
దృఢదేహుడు మారుతీ నందనుడు
దానవుని వనములన్ని దహించిన

సర్వోన్నత జ్ఞానము కలిగినవాడు
జ్ఞాన సంపన్నుడు ఆంజనేయుడు
సకల సద్గుణముల నిధి పెన్నిధియై
వానరులలోనే సర్వ శ్రేష్టమైనవాడు
దశరథ సుతుని ప్రియమైన భక్తుడు

సంద్రాన్ని గోడెక్కలా భావించి లంఘించి
రాక్షస మూకను దొమల్లా సంహరిస్తివి
రామాయణ మాలలో రత్నం హనుమ
రామకీర్తనలు వింటే భాష్ప నయనాలతో వచ్చి

రాక్షస సంహారకుడు మారుతి దీవెనలనిచ్చును
వాయుపుత్రుడు హనుమంతుడు భక్త రక్షకుడు
గురుచరణములకు మ్రొక్కి పాదధూళి ధరించితే
పురుషార్థములు పొంది రఘురాముని పొందెదరు

రామభక్త హనుమానుడు సకల శుభప్రదాయకుడు
నేను బుద్ధిహీనుడ నిన్నే స్మరించి నామం జపించి
కొలిచెదను బల బుద్ధి విద్యలను ప్రసాదించుము
క్లేశము మనోవికారములు తొలగించును మారుతి
*********
1
జ్ఞాన గుణములయందు సాగరుడై
ముల్లోకాలకు ప్రకాశమందించును
జ్ఞాన గుణ తేజో ప్రదాత కపీశుడు
2
పవనసుతుడు రామదూత అయి
అత్యంత బలం శక్తి కలిగినవాడు
బల సంపన్నుడు అంజనీపుత్రుడు
3
మహా వీరుడు పరాక్రమవంతుడై
దుర్బుద్ధి కుబుద్ధి తొలగించును
బుద్ధిమంతుల మిత్రుడు బజరంగీ
4
స్వర్ణ వర్ణుడై చెవులకుండలములతో
ఉంగరాల జుత్తుతో విరాజిల్లును
బంగరుమేనితో శోభిల్లువాడు మారుతి
5
ఒక చేతిలో వజ్రాయుధము కలిగి
జంధ్యం ధ్వజముతో విరాజిల్లును
చేతధ్వజం ధరించె వాయుపుత్రుడు
6
మహా తేజస్సు ప్రతాపములు కలిగి
ముల్లోకములందు పూజింపబడును
శంకరుని తనయుడు కేసరీపుత్రుడు
7
విద్యావంతుడు చతుర గుణవంతుడై
రామకార్యంను విజయవంతం చేసెను
అతి చతురుడు శ్రీరామునికి దాసుడు
8
శ్రీరామచరితని వినాలని ఆతృత కలిగి
సీతారామలక్ష్మణుల్ని హృదిలో నిలిపెను
ప్రభువును గుండెల్లో నిలిపె రామబంటు
9
సూక్ష్మ రూపం ధరించి సీతను దర్శించి
వికట రూపం ధరించి లంకను కాల్చెను
సీతనుకనుగొని లంకనుకాల్చె మారుతి
10
భీకరరూపం ధరించి అసురులనుచంపి
శ్రీరామచంద్రుని కార్యమును నెరవేర్చెను
రాక్షస మూకను అంతంచేసె కపీశుడు
11
మృతసంజీవనితెచ్చి లక్ష్మణునిబతికించి
రఘురాముడు హత్తుకుంటే సంతసించెను
సంజీవనికై గిరినెత్తుకొచ్చె మహాకాయుడు
12
రఘుపతి నిన్ను ఎంతో గొప్పగా పొగడి
భరతుని సమాన సోదరుడివని చెప్పెను
రాముని ప్రేమాభిమానం పొందె మారుతి
13
ముల్లోకాలు నీ కీర్తిని వేనోళ్లా పొగడునని
రాముడు నిన్ను గుండెలకు హత్తుకునెను
శ్రీరామునిచే కీర్తింపబడె హనుమంతుడు
14
బ్రహ్మ సనకాదులు నీ మహిమ కీర్తించగా
నారద శారద ఆదిశేషులు నిను పొగిడిరి
ముని దేవతల మెప్పును పొందె మారుతి
15
యముకుబేరులు అష్టదిక్పాలకులుగాని
కవి పండితులు నీ మహిమలు చెప్పలేరు
భువి దివిలో కీర్తింపబడును హనుమంతుడు
16
నీవు సుగ్రీవునికి మహోపకారము చేసి
రాముతో కలిపి అతనిని రాజుని చేస్తివి
స్నేహాన్ని కలిపి సాయముచేసె మారుతి
17
విభీషణుడు నీ మాట మంత్రంగా భావించి
లంకకు రాజయ్యెనని లోకానికి విదితము
నీ మాటే రామ బాణము వేద మంత్రము
18
సుదూరపు సూర్యుణ్ణి పండుగా భావించి
గగనానికి ఎగిరిపోయి దానిని మింగెను
నింగికి ఎగిరి సూర్యుణ్ణందుకునె మారుతి
19
రామనామము జపించి ముద్రిక చేగొని
సువిశాలమైన సాగరాన్ని లంఘించెను
ఆశ్చర్యమద్భుతం హనుమ కార్యాలు
20
జగతిలో దుర్భేద్య కష్టమైన పనులన్నీ
నీ అనుగ్రహమే వుంటే సులభమౌను
రామభక్తులకు అండ అంజనీసుతుడు
21
నీ ద్వారా మాకు రాముని దీవెనలంది
నీఆజ్ఞతోనే అతని దర్శనం లభించును
భక్తరక్షకుడు వాయుపుత్రుడు మారుతి
22
నీ శరణు వేడితే సుఖములన్నీ పొంది
భయములు తొలగి రక్షింపబడుతాము
భయభీతితొలగించి రక్షించును మారుతి
23
నీవు గర్జిస్తే ముల్లోకాలు వణుకగా
నీ తేజస్సుయే మమ్ము రక్షించును
లోకరక్షకుడు తేజోమూర్తి మారుతి
24
మహావీర హనుమాన్ నామం స్మరిస్తే
రాక్షస భూత పిశాచాలు దరిచేరవు
శిష్టజన రక్షణం మారుతీ నామము
25
వీరహనుమంతుని నామము జపిస్తే
రోగాలు కష్టనష్టాలన్ని తొలగిపోవును
సుఖములిచ్చును హనుమ నామము
26
మనస్సు కర్మలందు నిత్యం ధ్యానిస్తే
మారుతి సంకటములు తొలగించును
కష్టం హరించును హనుమద్ధ్యానము
27
తాపసులందరికి రాముడు ప్రభువై
వారి సకల కార్యాలు నెరవేర్చును
తాపసుల ప్రభువు హనుమంతుడు
28
భక్తుల మదిలోని కోరికలెరిగి తీర్చి
అర్చిస్తే జీవన ఫలాలనందించును
సేవిస్తే కోర్కెలు తీర్చును మారుతి
29
అన్ని యుగాలలో నీ మహిమచాటి
నీ వరసిద్ధితో జగతిని వెలిగించావు
సకల జగతికి వరప్రదాత మారుతి
30
సాధుసంతులు భక్తులను రక్షించి
అసుర దుష్టులను సంహరించెను
శిష్టరక్షకుడు రామభక్త హనుమాన్
31
అష్టసిద్ధులు నవనిధులు మాకిచ్చి
జానకీమాత దీవెనలందుకున్నావు
భక్తజన వరదాత ఆంజనేయుడు
32
రామనామమం రామరసం పొంది
రఘుపతికి సదా దాసుడవైతివి
రామనామరసం గ్రోలె రాంబంటు
33
నిన్నుభజిస్తే అది రాముడికేచెంది
జన్మజన్మ దుఃఖాలన్ని తొలగును
భజనతో సంతసించును మారుతి
34
రాముని భక్తితో తలచి భజించితే
మరణించి రామధామమే చేరును
శ్రీరాముడిని చేరును రామభక్తుడు
35
అన్యదేవతలను మదిలో తలచక
మారుతినికొలిచి సుఖంపొందుము
హనుమంతుడే సర్వసుఖ ప్రదాత
36
బలవీర హనుమంతుడిని స్మరిస్తే
పీడ సంకటములన్ని నశించును
సుఖం ప్రసాదించును మారుతి
37
గురుదేవునిలా కృప చూపించే
గోసాయిహనుమానుకి జయము
భజరంగ్ బలికి జయజయములు
38
వందసార్లు చాలీసా పఠించితే
బంధం తొలగి సుఖం పొందును
జన్మబంధం తొలగించును చాలీసా
39
ఈ హనుమాన్ చాలీసా చదివితే
ఈశ్వరుని సాక్షిగా సిద్ధిపొందును
అనునిత్యం పఠించాలి చాలీసా
40
తులసీదాస్ నిత్య రామ భక్తుడై
హృదయంలో నిలుపుకున్నాడు
రాముడే అతని హృదయనాథుడు
కష్టం సంకటములు తొలగించు మంగళమూర్తివై
రామలక్ష్మణసీతలతో నా హృదిలో వసించుము
పవనతనయా వాయునందనుడా హనుమంతా!
కే. పాండురంగ విఠల్
--(())--
 

బాహ్య పూజకు ఏమున్నా లేకపోయినా పత్రం, పుష్పం ఫలం, తోయం ఉంటే చాలంటారు. ఈ అన్నీ కాకపోయినా లేకపోయినా ఒక్కటైనా, ఒక్కటున్నా చాలనీ ఆర్యోక్తి. ఒక్క ఉద్దరిణేడు జలంతో బోళాశంకరుడు సంతోషంతో తలమునకలైపోతాడు. ఒక్క తులసి పత్రంతో అంతోటి శ్రీకృష్ణుడు పారిజాతపు రేకులా తూగిపోతాడు ఆనందంతో 'తేలి' పోతాడు. అమ్మ స్తోత్రప్రియ, ఒక్క జపాపుష్పం సమర్పించి స్తోత్రం చేస్తే- సమస్తం దయ చేస్తుంది. ఏ దేవుడికి ఫలాన్ని సమర్పించినా మన జీవితమే సఫలం అయిపోతుంది. ఈ అన్నీ కలిసి ఉన్న అపురూప వస్తువొకటి మన దగ్గరుంది. అదే... మనసు మనసు ఓ ఆకుపచ్చని పత్రం. సూర్యరశ్మి అనే భగవత్ స్పర్శతో పత్ర హరితాన్ని సమకూర్చుకుంటుంది. మనసే ఓ పుష్పం. మానవత్వమనే మార్దవాన్ని, సౌమనస్యమనే సౌకుమార్యాన్ని, శుభ్ర జీవనమనే సౌరభాన్ని సమకూర్చుకున్న మనసే ఓ పుష్పం. మనో పుష్పం మనసు మధురఫలం కూడా. ఫలిత భక్తి పండిన మనసు అమృతఫలం. ఆర్ద్రత చెందే మనసు మధుర రస ఓ స్వరూపం. అదే తోయం. తోయాన్ని చిందే మనసు. తోయాన్ని ఒలికే మనసు. పత్రం, పుష్పం, ఫలం, తోయం... ఈ అన్నింటి సమాహారం, సమగ్ర స్వరూపం- మనసు. ఒక్క మనసును అర్పిస్తే భగవంతునికి సమర్పించవలసినదంతా సమర్పించినట్లే. అదే అమృత ధార, నైవేద్య క్షీర మనసునే ఎందుకర్పించాం? ఈ అన్వయాన్ని శరీరానికో, ధనానికో, కీర్తికో కూడా చేసుకోవచ్చు కదా? కాదు. వద్దు ఆత్మ అనేది ఇంద్రియాలకు, పంచకోశాలకు అందనిది. చెందనిది. ప్రాపంచిక ఉపకరణాలతో, ఉపాయనాలతో పొందనిది. మనసు!? నిజమే. మనసు కూడా ఓ ఇంద్రియమే. పంచకోశాల్లోని ఓ కోశమే. కానీ ఆత్మ వరకూఅన్వేషణ సాగిస్తూ 'నేతి నేతి' అంటూ ఇంద్రియాలనూ, పంచకోశాలనూ పంచీకరణ చేస్తూ, అన్నింటినీ తిరస్కరిస్తూ వెళ్లాల్సి ఉంది. తిరస్కరించేందుకు వస్తు వివేకం, వస్తు విభజన చేయాలంటే మనకు మనసు "సహకరిస్తుంది. ఈ అన్నీ వదిలిపోయాక, అన్వేషణ కొంతమేర ఫలించాక మనసును అమనస్కం చేయాల్సి ఉంది. కాలిలోని ముల్లును తీసిన మరో ముల్లును మనం పారవేయవలసి ఉన్నట్లు. అయితే మరి... పత్రం, పుష్పం, ఫలం, తోయం... వీటి అవసరమేమిటి? నిజమే. మనం మనోబుద్ధి స్థాయిలో ఉన్నంతవరకూ ఇంద్రియాకర్షక వస్తువులనే భగవంతునికి అర్పించవలసి ఉంది- కాదు... అర్పిస్తాం. క్రమేణా భగవంతుని అప్రమేయత్వాన్ని, సర్వాంతర్యామిత్వాన్ని గ్రహించే కొద్దీ ఆయనకు ఏమి అర్పించాలో అర్థమవుతుంది. మనలోని, మన బయటి ఏ వస్తువులూ ఆ అప్రమేయత్వాన్ని అందుకునేంత, దానికి అందించేంత పరిమాణంతో గానీ, ప్రమాణంతోగానీ లేవు పరిమితమైన ఉపకరణాలతో పరికరాలతో అంతటి సర్వాంతర్యామికి తగిన స్థాయిలో మనం ఏమీ సమర్పించలేం. ముఖ్యంగా బాహ్య వస్తుజాలాన్ని ఏమర్పించినా భగవంతుడు దానికి శతాధికంగా తిరిగి మనకు అందజేస్తాడు. అదే మనసు నర్పిస్తే మాత్రం దాన్ని లుప్తం చేస్తాడు. ఆత్మలో లయం చేస్తాడు. ఆత్మను

తెలియజేస్తాడు మనసు అమనస్కమైతేనే ఆత్మ అర్థమవుతుంది. ఆత్మ భావన అనుభూతమవుతుంది. అమనస్కం... మనసు లేకుండాపోవటం. ఎలా? నిరంతర ఆలోచనా ప్రవాహమే మనసు. ఆలోచనలను అరికడితే, ఆపేస్తే- అదే అమనస్కం. ఇదెలా సాధ్యం! ఆలోచన లేకుండా జాగృతే లేదుకదా!? ఆలోచనలను ఏకాగ్రపరచినప్పుడు, ఒకే విషయం మీద నిలిపినప్పుడు- ఆలోచనలు (మనసు) ఏకోన్ముఖం
అవుతాయి. పరిపరి విధాల పాకులాట
ఆగిపోతుంది. ఒకే చోట, ఒక బిందువు కేంద్రంగా ముడివడి సుడివడి- సుళ్లు తిరిగే నీటి వెల్లువ సుడులు సుడులుగా తిరిగి తిరిగి లోలోపలికి లయమై

అంతర్జానమైపోయినట్లు.. ఆలోచనల ప్రవాహమూ ఒకేచోట కేంద్రీకృతమై అక్కడే తిరిగి తిరిగి క్రమంగా లోపలికి జారిపోతూ అసలు అంతర ప్రవాహంతో మమేకమైపోతుంది. అంతా ఒకడే అయినప్పుడు ప్రత్యేక ఉనికి, ఉపాధి, బాధ, వేదన, ద్వైతం, అన్యతా భావం.. ఏమీ ఉండవు. ఆ అనంత సాగరపు, ఆ ఆత్మకాసారపు అణువణువులో, కణకణంలో తానూ

ఒకటిగా కలగలిసిపోతుంది. అదే అమనస్కం. ఇలాంటి స్థితిని పొందేందుకే యోగులు, ధ్యానులు, సాధకులు- మనసునే పరికరంగా సాధన చేసి, ఆ మనసునే సాగనంపుతారు పుట్టుక స్థానానికి పట్టుపట్టి అంపకం పెడతారు. ఈ ప్రక్రియకు దోహదపడే ఉద్దేశంతోనే కాబోలు- భగవంతుడు ఆ మనసునే కోరతాడు

 

 May be an image of 3 people

కార్మిక దినోత్సవ సందర్భముగా అందరికి శుభాకాంక్షలు
నేటి సోయగములు
ఏమని చెప్పను కార్మిక
విమల చరిత మేది
సమయ మాసన్న మైనదియును
సమము లేని దిక్కు
అమ్మమాటలు అన్ని జరిగేను
వమ్ము కాని బతుకు
కార్మిక చరిత సోయగములు
కలలు కన్నాను దేశ భక్తితో
కూలి లేని బతుకు  
కళలను నేర్చాను శక్తితో
కళల పోష నేది
ఆలికి నచ్చిన పనులను
రాలి నట్లు చేసి
గాలిని బేరము పెట్టియు
వాలి లాగ బతుకు
పలక లేనట్టి సోయగములు
సత్యమునే నమ్మి బతికాను
నిత్య వెలుగు కొరకు
నిత్యమూ సేవలు చేసాను
ముత్య మైన పలుకు
తత్వపు బోధలు చేసాను   
తత్వ మాయ బతుకు
వ్యత్యాసము గను సోయగములు
--(())--
 

(21-౩౦)  
చదువు లేకయే   
పనులు లేకయే
అన్న౦ లేకయే
కార్మిక కష్టము రామకృష్ణ  !
పలికే నీతియు
మారే బుద్ధియు
తెచ్చు ఖ్యాతియు  
వెలుగు జీవమే రామకృష్ణ  !
ఆరోగ్య కరమే  
సౌభాగ్యకరమే
సంతాన పరమే
ఆహ్లాదపరమే రామకృష్ణ  !
ఆలి ప్రేమము  
బంధాల భయము   
బాధలే వరము
బతుకే నరకము రామకృష్ణ  !
కాలమిది ఏన  
నరకమే అఐన
మార్గము లేకన
మాలో చింతన రామకృష్ణ  
ఆటల మలుపులు
వ్యాధితో కథలు
చూసే పెద్దలు
నిత్యము నరకము రామకృష్ణ  !
పెరిగే భారము
తరిగని రోగము
వదలని శాపము
తీరని మొహము  రామకృష్ణ !
తండ్రి మాట విని
తల్లి మాట కని   
మనసే ఎరగని
మమతే పండని రామకృష్ణ !
సత్యము పల్కియు
ధర్మము తెల్పియు   
న్యాయము బతికియు
తిండియే కరువు రామకృష్ణ
హాస్యమాడితిమి
తస్కరించితిమి
జోలపాడితిమి
నిజము పల్కితిమి రామకృష్ణ !
--(())_- విధేయుడు మల్లాప్రగడ
 

Pranjali Prabha daily 294
శుభోదయం..
   భక్తి  -  భగవంతుడు..
పూర్వం ఒక ఊరిలో అయోద్యుడు అనే బద్దకస్తుడు ఉండేవాడు. ఏపని చేసేవాడు కాదు. తినడం తిరగడం.. ఇంతకుమించి ఏపని రాదు. పైగా అమాయకుడు. ఇంట్లో వారు భరించలేక ఏదన్నా ఆశ్రమం చూసుకొని వెళ్ళమన్నారు.
సరేనని ఏదన్నా  ఆశ్రమంలో చేరడానికి బయలుదేరి చాలా ఆశ్రమాలు చూశాడు. ఎక్కడా నచ్చలేదు. చివరకు ఓ ఆశ్రమానికి వచ్చాడు. ఆ  ఆశ్రమంలో గురువుగారు కొద్దిగా లావుగా ఉన్నారు.
ఆహా ఇక్కడ భోజనం బాగాదొరుకుతుందనుకుంటా ..
గురువుగారు బాగా లావుగా ఉన్నారుఅనుకున్నాడు.
ఇంతలో శిష్యులు వచ్చారు. వాళ్ళు కూడా లావుగానే ఉన్నారు. అయితే సందేహం లేదు ఇక్కడ చేరితే మూడుపూటల భోజనం దొరుకుతుంది అనుకోని గురువుగారి పాదాల మీద పడి ఇక్కడే ఉండిపోతానన్నాడు. సరే అన్నాడు గురువుగారు.
అయితే నాకు మూడుపూటల భోజనం కావాలి అన్నాడు అయోద్యుడు.  నాయనా! చక్కగా సేవ చేస్తూ రెండుసార్లు మాత్రమె ఇక్కడ భోజనం తీసుకోవాలి అన్నారు. కాదు గురువుగారు నేను ఆకలికి ఉండలేను అన్నాడు. సరే ఉదయం ప్రసాదం కొద్దిగా ఎక్కువ తిను అంటే సరేనన్నాడు.
ఏదో తెలిసిన సేవ చేస్తూ చాలీచాలని ఆహారం తింటూ ఉండగా  ఒక రోజు ఏకాదశి వచ్చింది. ఈ రోజు ఉపవాసం ఉండాలి అన్నారు గురువుగారు.  అమ్మో ఉపవాసం నావల్ల కాదు గురువుగారు... ఉండలేను అన్నాడు  ఈ శిష్యుడు. సరే అయితే ఇక్కడికి దూరంగా ఉన్న చెరువు వద్దకి వెళ్లి వండుకుతిను. కావాలంటే సరంజామా నేను ఏర్పాటు చేస్తాను అన్నాడు గురువుగారు.
సరేనని సరంజామా తీసుకున్నాడు శిష్యుడు. నాయనా వండిన ఆహారం స్వామికి నైవేద్యం పెట్టి ఆ తరువాతే నువ్వు తినాలి సరేనా. అని గురువుగారు అనగా అలాగే గురువుగారు అని వెళ్లి చెరువు దగ్గర చెట్టు క్రింద వంట చేసుకొని భగవంతుడికి నైవేద్యం పెట్టి..ఇలా పిలిచాడు
రాజా రామ్ ఆయియే, రఘురామ్ ఆయియే.. ముఝే భూక్ లాగాయియే అంటూ పాడడం మొదలు పెట్టాడు. ఎంతకీ స్వామి రాడే.. (ఇతని ఉద్దేశ్యం లో స్వామివారే స్వయంగా వచ్చి తింటారని అనుకుని ఎదురుచూస్తూ ఉన్నాడు. అంతటి అమాయకుడు అయోద్యుడు.. కపటం, కంఫ్యూషన్ లేదు మనస్సులో)  ఎంతకీ రాకపోయేసరికి బాగా ఆలోచించి ఇలా అన్నాడు .
"దేవాలయంలో అయితే ప్రసాదాలు, నైవేద్యాలు పెడతారు...ఇక్కడ ఏముంది.. కుదిరి కుదరని వంట తప్ప"  అక్కడైతే బాగా పెడతారని అనుకుంటున్నావేమో స్వామీ.. ఈరోజు ఏకాదశి అక్కడ ఏమి ఉండదు. ఏమి పెట్టరు. ఇక్కడికి కూడా రాలేదనుకో ఇది కూడా ఉండదు..అని మళ్ళీ పాడడం మొదలు పెట్టాడు. ఇది కూడా అయిపోతుందని.. శ్రీరాముడు నవ్వుకుని ఉండబట్టలేక సీతాసమేతంగా వచ్చాడు.
శ్రీరాముడిని చూశాడు సంతోషించాడు. కానీ పక్కనే సీత ఉంది. సీత వంక ప్రసాదం వంక పదేపదే చూస్తూ ఉండగా..  శ్రీరాముడు మేము వచ్చాము సంతోషమేగా అంటే...అయోద్యుడు  సీత వంక చూస్తూ ఆ ఆ సంతోషమే.. నాచేత ఇవాళ  ఏకాదశి ఉపవాసం చేయించాలనుకున్నట్లు ఉన్నారు. రండి కూర్చోండి అని ఇద్దరికి వండిన ఆహారం పెట్టాడు. చక్కగా భోజనం చేసి సీతారాములు వెళ్లిపోయారు. అయోద్యుడు ఆ రోజు ఉపవాసం తోనే ఉండిపోయాడు.
కొన్ని రోజులు గడిచాక మళ్ళీ ఏకాదశి వచ్చింది. గురువుగారు అయోద్యుడికి   మొన్న ఇచ్చినట్లే ఈసారి కూడా కిలో బియ్యం పప్పులు దినుసులు ఇచ్చారు. అప్పుడు.. గురువుగారు ఇవి సరిపోవడం లేదండి... ఇద్దరొచ్చారు ఇంకాస్త కావాలి అంటే.. వీడికి సరిపోతున్నట్లు లేదు ఇంకో కేజీ ఇచ్చి పంపండి అని శిష్యులతో  గురువుగారు చెప్పారు.   యధావిధిగా  అయోద్యుడు అక్కడకు  వెళ్లి వంట చేసి.. నైవేద్యం పెట్టి,.. మొన్న ఇద్దరు వచ్చారు కదా.. అందుకని ఇలా పిలిచాడు.
రాజారామ్ అయియే, సీతారాం ఆయియే మేరా భోజన్ కో భోగ్ ధరాయియే అంటూ పాడాడు. ఈసారి సీతారాముల తో పాటు లక్ష్మణుడు కూడా వచ్చాడు. ఈసారి లక్ష్మణుడు వంక ..భోజనం వంక.. చూస్తూ ఉండగా.. శ్రీరాముడు.. మేము వచ్చాము నీకు సంతోషమేగా అంటే లక్ష్మణుడి వంక.. భోజనం వంక..చూస్తూ ఆ సంతోషమే స్వామి అంటూ ఈ వారం కూడా నాకు ఉపవాసమే  అనుకుంటూ... రండి కూర్చోండి అన్నాడు. భోజనం పెట్టాడు .వారు ముగ్గురు తిన్నారు వెళ్లారు.
మళ్ళీ ఏకాదశి వచ్చింది. అయోద్యుడు  గురువుగారితో ఇది కూడా సరిపోదండి ముగ్గురు వచ్చారు అన్నాడు. వీడు రాత్రికి  కూడా తింటున్నాడేమో అనుకోని మరో కేజీ   అదనంగా  ఇచ్చి పంపారు. మళ్ళీ వండాడు. ఈ సారి పాట మార్చి పాడాడు.. రాజారామ్ ఆయిఏ, సీతారాం అయిఏ, లక్ష్మణ్ సాత్ అయిఏ మేరా భోజన్ కో భోగ్ ధరాయిఏ..అంటూ పిలిచాడు
ఈ సారి సీతారాములు, లక్ష్మణుడు వచ్చారు. వీళ్ళతోపాటుగా హనుమాన్ వచ్చాడు. మేము వచ్చాము. నీకు ఆనందమేగా అని అడిగారు. ఆ..ఆ.. ఆనందమే కానీ అంటూ హనుమాన్ వంక..భోజనం వంక ..చూసిఈఏకాదశికి కూడా నాకు ఉపవాసమే...
అనుకుంటూ  రండి కూర్చోండి అని వడ్డించాడు.
అందరూ కూర్చొని తృప్తిగా తినేసి వెళ్లిపోతూ ఉండగా స్వామి ఏమనుకోనంటే ఒకమాట అడగవచ్చా? ఈసారి ఎంతమంది వస్తారు? నేను వంట చేయటానికి అని అనగా శ్రీరాముడు నవ్వి ఏమి చెప్పకుండా వెళ్ళిపోయాడు..
మళ్ళీ ఏకాదశి వచ్చింది. గురువుగారు..ఈసారి రవ్వ 10కిలో, బియ్యం పదికిలో, పచారి పదికిలో కావాలి అన్నాడు అయోద్యుడు. గురువుగారికి వీడేమైనా అమ్ముకుంటున్నాడా అనే సందేహం వచ్చినా..వాడు అడిగింది ఇచ్చి తరువాత చుద్దాం ఏమి చేస్తున్నాడో అని శిష్యులతో వాడు ఆడిగినవి ఇచ్చి పంపండి  అన్నాడు.
అలాగే గురువుగారి ఆజ్ఞప్రకారం  అన్నీ  పది కిలోల చొప్పున ఇచ్చి పంపి ..గురువుగారి దగ్గరికి వచ్చారు శిష్యులు. వీడు అమ్ముకుంటున్నట్లు ఉన్నాడు.. ఎక్కడ అమ్ముతున్నాడు? ఏదుకాణంలో అమ్ముతున్నాడు...?చుద్దాం పదండి అని గురువుగారి తో  సహా
శిష్యులు అయోద్యుడికి   వెనుక బయలుదేరారు.
ఎప్పటిలానే అయోద్యుడు చెరువు దగ్గరకు వెళ్లి సామాను అంత అక్కడ పడేసి చెట్టుక్రింద కూర్చొని రాజారామ్ అయిఏ, సీతారాం ఆయిఏ, లక్ష్మణ్ సాత్ అయిఏ, హనుమాన్ సాత్ ఆయిఏ మేరా భోజన్ కో భోగ్ ధరాయిఏ.. అని పాట పాడాడు.
ఈసారి సీతారాములు, లక్ష్మణుడు, హనుమాన్,భరత శత్రుఘ్నులు, కౌశల్య సుమిత్ర కైకేయి సపరివారమంతా వచ్చేశారు. అయోధ్యా మేమొచ్చేశాం సంతోషమేగా.. ప్రసాదం ఏది ఎక్కడుంది? అని అడిగాడు శ్రీరాముడు.
అప్పుడు అయోద్యుడు.. ఎప్పుడూ నేను వండితే మీరు తినేసి వెళ్లిపోతున్నారు. కొద్దిగా కూడా ఉంచడం లేదు. నాచేత నాలుగు ఏకాదశి ఉపవాసాలు చేయించారు. ఈసారి మీరే వండండి.. సామానంత అక్కడే ఉంది అన్నాడు... శ్రీరాముడు నవ్వి సరేనని.. శ్రీరాముడు కూరగాయలు కొస్తూ ఉన్నాడు. సీతమ్మ పొయ్యి దగ్గరకి వెళ్ళింది. లక్ష్మణుడు హనుమంతుడు కట్టెలు తెచ్చారు. ఇలా అందరూ తలా ఓపని చేస్తూ ఉండగా.. సీతమ్మ వంట వండుతుందని తెలుసుకొని దేవతలు, ఋషులు, గంధర్వులు వరసగా వస్తూ ఉంటారు. కోలాహలంగా తయారయింది ఆ ప్రదేశం అంతా..
ఇంతలో గురువుగారు అక్కడికి వచ్చి. అక్కడి సన్నివేశం చూస్తే సామాను పక్కన పడేసి అయోద్యుడు చెట్టుకింద పడుకొని కనబడతాడు. వెంటనే గురువుగారు వచ్చి " అయోధ్యా! ఏంటి సామానంత అక్కడ పడేసి చెట్టుక్రింద పడుకున్నావ్" అనగానే.. అదేంటి గురువుగారు సీతారాములు, లక్ష్మణుడు హనుమంతుడు కౌశల్య సుమిత్ర కైకేయి అందరూ కలిసి వంట చేస్తున్నారుగా అంటే ఆశ్చర్యంతో ఎక్కడ ..నాకేం కనబడడం లేదు అన్నారు గురువుగారు.
అయోద్యుడు శ్రీరాముడిని చూసి మీరు మాగురువుగారికి కనబడడం లేదట కనిపించండి. లేదంటే నామీద సందేహం వస్తుంది అనగా శ్రీరాముడు అలానే అని సపరివారసమేతంగా గురువుగారి కన్నుల ఎదుట సాక్షాత్కరించాడు. గురువుగారు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉండగా అయోద్యుడ్ని కౌగలించుకొని ఎన్నో ఏళ్లుగా పూజలు చేస్తున్న నాకు దర్శన భాగ్యం కలుగలేదు.
 నీవు  అమాయకంగా, నీ మనస్సు స్వచ్ఛంగా నిర్మలంగా ఉండబట్టి ఆ భగవంతుడు సాక్షాత్కరించాడు. నీవల్ల మేము ధన్యులమయ్యాం అన్నాడు..
భగవంతుడు రాడేమో అని, పూజలు ఎలా చేయాలి ?ఎన్ని వత్తులు వేయాలి? అంటూ, కొన్నాళ్ళు.. విపరీత భక్తితో, కొన్నాళ్ళు విరక్తితో, మరొకొన్నాళ్లు చిరాకుతో ఏదో ఇష్టం వచ్చినట్లు కంఫ్యూషన్ మైండ్ తో, గందరగోళంగా పూజలు చేస్తూ ఉంటారు చాలామంది. చేయాలా వద్దా! ఎలా చేయాలి.. ఈరోజు పనులున్నాయి. ఈరోజు మనసు బాగోలేదు. ఇలా ఏదో వంకతో సాకుతో పూజలు ఎగ్గొట్టేస్తూ ఉంటారు కొందరు.
ఇలాంటివారికి జీవితాంతం గందరగోళం తప్ప భగవంతుడి సాక్షాత్కారం కలుగదు. పూజ గాని, జపం గాని, తపస్సు గాని, ధ్యానం యాగాదులు ఏదైనా సరే నిలకడ లేకుండా జీవితకాలం చేసినా ఏమాత్రం ఉపయోగం ఉండదు. స్వచ్ఛమైన, నిర్మలమైన మనస్సుతో చేస్తే తక్షణం పరమాత్ముడు దర్శనం ఇస్తాడు. ఏ మాత్రం సందేహం లేదు.
అయోద్యుడు, భక్తకన్నప్ప, భక్తతుకారాం ఈ కోవకి చెందినవారే. ఏమి పెట్టినా, ఎలా పెట్టినా మారుమాట్లాడకుండా స్వచ్ఛమైన నిర్మలమైన భక్తికి వశమైపోయాడు.
0

సమస్యకు నా పద్యములు .........
బ్రహ్మ కెందుకు పూజ్యత బలము లేదు....
బ్రహ్మ రాతలు అర్ధము అగుట లేదు
బ్రహ్మ బృంగికి  దారియు తెలుప లేదు
బ్రహ్మ బంధము మార్చియు బతక లేదు
బ్రహ్మ కెందుకు పూజ్యత బలము లేదు....
అమ్మ మాటలు పలుకులు అర్దమవగ
భృగు మహర్షుల మాటను పెట్టుకోక
మౌన  ముద్రగా శాంతిని మనకు ఇచ్చె   
బ్రహ్మ కెందుకు పూజ్యత బలము లేదు....
శివుని శాపము బ్రహ్మకు శ్వాస అయ్యె
సత్యమును తెల్ప కుండుట సేవ అయ్యె  
నిత్యము వ్రాత బతుకుట నియమ మయ్యె
బ్రహ్మ కెందుకు పూజ్యత బలము లేదు....
--(())--
 

శీర్షిక : విషం చిమ్మే కాలం.
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ
కాల యముడు విషమును పంచె  
గోల చేయు టేల
కలల పంటను తుంచు టెందుకో
వలలొ చిక్కు టేల   
జాలిలేదును జోలె పట్టినా
గాలి కూడ కరువు
కాలిపోయిన సోయగములేలు  
నిలవాలి ధర్మము ఏలనూ
కళ్ళు చెమ్మ గిల్లె
తెలపాలి బతుకులో న్యాయము  
అలక లెన్ని ఉన్న
కలలన్ని కాటికి చేరాయి
చిలక బతుకు లాగ
నిలబడి లేక సోయగములు
కాలి పొయే కట్టెనైనాను
జాలి చూపు చున్న  
గాలిలో గాలినై వెతికాను
ఆలి మాట పట్టి
తోలుతిత్తులోన నీటిలా
కాలె కడుపు నింపు
ఆకలి తీర్చు సోయగములు
--(())--
 

నేటి హాస్య కధ ..    "  మా అమ్మాయి   కనపడుట లేదు "   
మాయమై పోతున్న తెలుగు అమ్మాయి.
ఏమండి ఈ మద్యన ఎవరైనా మా తెలుగు అమ్మాయిని చూసారా? చూస్తే చెప్పండి. అయ్యా! మీకు పుణ్యం ఉంటుంది.
ఓహో! మా తెలుగు అమ్మాయి గురించి మీకు తెలియదుకదూ! ఆనవాలు చెపుతా, వినండీ.
 మా అమ్మాయి అమాయకంగా ఉంటుంది.
 చేతినిండా గాజులు వేసుకుని లక్ష్మీదేవి లాగ ఉంటుంది.
 రెండు చేతులకూ గోరింటతో (మెహెంది కాదు), పాదములకు పారాణితో అందంగా ఉంటుంది.
 మా అమ్మాయి నిండుగా పరికిణి కట్టుకుని ఓణి వేసుకుని ఉంటుంది.
 తలకు చమురు రాసుకుని చక్కగా దువ్వి రొండు జడలు వేసుకుంటుంది.
 తలనిండా పూలు పెట్టుకుని, వాలు జడకు జడ కుప్పులు వేసుకుంటుంది.
 చారడేసి కళ్లకు కాటుక పెట్టుకుని, నుదుటిన పావళా కాసంత చంద్రబింబం లాంటి ఎఱ్ఱటి కుంకుమ బొట్టు పెట్టుకుంటుంది (బొట్టు బిళ్ళ కాదు).
 కాళ్లకు మువ్వల అందెలతో (కాలి పట్టీలు అనకూడదు) ఘల్లుఘల్లు మంటూ ఇల్లంతా సందడిగా తిరుగుతుంది.
 ముద్దబంతి పువ్వులా, చిదిమి దీపము పెట్టుకునే లాగున, ఇంటికి కళగా ఉంటుంది.
 ఇలాంటి అమ్మాయి మీకేక్కడైనా కనిపించిందా? అగుపించినదా? మాకైతే గత పాతిక సంవత్సారాలుగా కనిపించడం లేదు. పండక్కో, పబ్బానికో, అక్కడ్డక్కడ తళుక్కున మెరిసి మాయమైపోద్ది అంతే !!!
..........
దానికి నేను రాసిన సమాధానం ఇది 👇
ఆమె ఉంది కానీ కనిపించే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలుగబ్బాయిని వెతుకుతూ వెళ్ళి, ఇంతవరకూ రాలేదు.
తెలుగబ్బాయి ఎవరా అనా?
ఆనవాళ్ళు చెపుతాను.
ధైర్యంగా ముందుకు పోయే తత్వం.
ఠీవిగా, పంచె, లాల్చీ, కండువాలతో ఉంటాడు.
నడిచొచ్చే విష్ణుమూర్తిలా ఉంటాడు.
కోరమీసంతో, కోటేరు ముక్కుతో ఉంటాడు.
అందరినీ వరసలు కలిపి, నవ్వుతూ పలకరిస్తుంటాడు.
తెలుగు వారితో తెలుగులోనే మాట్లాడుతుంటాడు.
చక్కని కుంకుమబొట్టుతో మెరిసిపోతుంటాడు.
తల్లిదండ్రులను అమ్మా నాన్నా అని నోరారా పిలుస్తాడు. అత్తా, మామా,  బాబాయ్ లాంటి భారతీయమైన పిలుపులే వాడుతాడు. అనవసరంగా మ్లేచ్ఛభాష వాడడు.
అడగకుండానే తోటివారికి తోచిన విధంగా సాయం చేస్తుంటాడు.
చూడటానికి రెండు కళ్ళూ, చెప్పటానికి మాటలూ చాలవు అన్నట్టుగా ఉంటాడు.
చూసి చాలా కాలమైంది. తననే వెతుకుతూ వెళ్ళి ఉంటుంది తెలుగమ్మాయి. ఒక్కటి మాత్రం నిజం. వస్తే ఎప్పటికైనా వీళ్ళు కలిసే వస్తారు. రావాలనే ఆశిద్దాం.
--(())--


 May be an illustration

ప్రాంజలి ప్రభ ... 30--04-2021
 - ఆరోగ్యం - ఆధ్యాత్మికం ఆనందం

ప్రాంజలి ప్రభ ...పూరణ
వేడుక బతికున్న శోధనే సాధనగా
ఆడిన నట నన్న కాలమే బాధలుగా
నీడ గలిగి ఆశ చూపులే ప్రేమలుగా
యేడవ పతి యున్న సాధ్వికే గౌరవమౌ

ద్విపద

అక్షర సత్యము మనసులో మార్గము
నక్షత్రములు వలే మెరుపునే అందించు

అక్షరం బులునేర్పె ఆదిగా గురువు యే
అక్షరాల్నీ అమ్మ పలకపై దిద్దించె

అక్షమాలను దాల్చి ఆత్మీయతను పంచె
ఆక్షీణమైనట్టి శక్తియు వలదులే

అక్షర జ్ఞానము నొందించె నాతల్లి
కాంక్షలు లేనట్టి ప్రేమతో నాతల్లి

ఆంక్షలు ఉన్నాను అదరని నాతల్లి
రక్షణ కల్పించి నీడగా ఉండేను

శిక్షణ మంచిగా ఇప్పించె నాతల్లి
లక్ష్యము కల్పించి మనసు పెంచే తల్లి
--(())--
మాత్రా బధ్ధ ము(13)
చిరు హాసము తెల్పి వుండిన
మరు మల్లెల పాన్పు ఉండిన
దరి హృద్యము తల్ల డిల్లిన
విర జాజుల గాలి ఉండిన

కరి లాగున పర్గు లేకన
వరి కంకులు గాలి వచ్చిన
సిరి వెంటనె పర్గు వుండిన
మరి మాటలు లేక బత్తిన

కిరణాలకు చిక్కి ఉండిన
మరణాలను చూడ కుండిన
చరణాలను తాక కుండిన
భరణమ్మును పొందు కుండిన

కార్మిక దినోత్సవ సందర్భముగా అందరికి శుభాకాంక్షలు
నేటి సోయగములు
ఏమని చెప్పను కార్మిక
విమల చరిత మేది
సమయ మాసన్న మైనదియును
సమము లేని దిక్కు
అమ్మమాటలు అన్ని జరిగేను
వమ్ము కాని బతుకు
కార్మిక చరిత సోయగములు

కలలు కన్నాను దేశ భక్తితో
కూలి లేని బతుకు  
కళలను నేర్చాను శక్తితో
కళల పోష నేది
ఆలికి నచ్చిన పనులను
రాలి నట్లు చేసి
గాలిని బేరము పెట్టియు
వాలి లాగ బతుకు
పలక లేనట్టి సోయగములు

సత్యమునే నమ్మి బతికాను
నిత్య వెలుగు కొరకు
నిత్యమూ సేవలు చేసాను
ముత్య మైన పలుకు
తత్వపు బోధలు చేసాను   
తత్వ మాయ బతుకు
వ్యత్యాసము గను సోయగములు
--(())--

(21-౩౦)  
చదువు లేకయే   
పనులు లేకయే
అన్న౦ లేకయే
కార్మిక కష్టము రామకృష్ణ  !
పలికే నీతియు
మారే బుద్ధియు
తెచ్చు ఖ్యాతియు  
వెలుగు జీవమే రామకృష్ణ  !
ఆరోగ్య కరమే  
సౌభాగ్యకరమే
సంతాన పరమే
ఆహ్లాదపరమే రామకృష్ణ  !
ఆలి ప్రేమము  
బంధాల భయము   
బాధలే వరము
బతుకే నరకము రామకృష్ణ  !
కాలమిది ఏన  
నరకమే అఐన
మార్గము లేకన
మాలో చింతన రామకృష్ణ  
ఆటల మలుపులు
వ్యాధితో కథలు
చూసే పెద్దలు
నిత్యము నరకము రామకృష్ణ  !
పెరిగే భారము
తరిగని రోగము
వదలని శాపము
తీరని మొహము  రామకృష్ణ !
తండ్రి మాట విని
తల్లి మాట కని   
మనసే ఎరగని
మమతే పండని రామకృష్ణ !
సత్యము పల్కియు
ధర్మము తెల్పియు   
న్యాయము బతికియు
తిండియే కరువు రామకృష్ణ
హాస్యమాడితిమి
తస్కరించితిమి
జోలపాడితిమి
నిజము పల్కితిమి రామకృష్ణ !
--(())_-

 విధేయుడు మల్లాప్రగడ
 

సమస్యకు నా పద్యములు .........
 

బ్రహ్మ కెందుకు పూజ్యత బలము లేదు....
బ్రహ్మ రాతలు అర్ధము అగుట లేదు
బ్రహ్మ బృంగికి  దారియు తెలుప లేదు
బ్రహ్మ బంధము మార్చియు బతక లేదు
 

బ్రహ్మ కెందుకు పూజ్యత బలము లేదు....
అమ్మ మాటలు పలుకులు అర్దమవగ
భృగు మహర్షుల మాటను పెట్టుకోక
మౌన  ముద్రగా శాంతిని మనకు ఇచ్చె   
బ్రహ్మ కెందుకు పూజ్యత బలము లేదు....
 

శివుని శాపము బ్రహ్మకు శ్వాస అయ్యె
సత్యమును తెల్ప కుండుట సేవ అయ్యె  
నిత్యము వ్రాత బతుకుట నియమ మయ్యె
బ్రహ్మ కెందుకు పూజ్యత బలము లేదు....
--(())--


శీర్షిక : విషం చిమ్మే కాలం.
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ
కాల యముడు విషమును పంచె  
గోల చేయు టేల
కలల పంటను తుంచు టెందుకో
వలలొ చిక్కు టేల   
జాలిలేదును జోలె పట్టినా
గాలి కూడ కరువు
కాలిపోయిన సోయగములేలు  
నిలవాలి ధర్మము ఏలనూ
కళ్ళు చెమ్మ గిల్లె
తెలపాలి బతుకులో న్యాయము  
అలక లెన్ని ఉన్న
కలలన్ని కాటికి చేరాయి
చిలక బతుకు లాగ
నిలబడి లేక సోయగములు
కాలి పొయే కట్టెనైనాను
జాలి చూపు చున్న  
గాలిలో గాలినై వెతికాను
ఆలి మాట పట్టి
తోలుతిత్తులోన నీటిలా
కాలె కడుపు నింపు
ఆకలి తీర్చు సోయగములు
--(())--
నేటి హాస్య కధ ..    "  మా అమ్మాయి   కనపడుట లేదు "   
మాయమై పోతున్న తెలుగు అమ్మాయి.
ఏమండి ఈ మద్యన ఎవరైనా మా తెలుగు అమ్మాయిని చూసారా? చూస్తే చెప్పండి. అయ్యా! మీకు పుణ్యం ఉంటుంది.
ఓహో! మా తెలుగు అమ్మాయి గురించి మీకు తెలియదుకదూ! ఆనవాలు చెపుతా, వినండీ.
 మా అమ్మాయి అమాయకంగా ఉంటుంది.
 చేతినిండా గాజులు వేసుకుని లక్ష్మీదేవి లాగ ఉంటుంది.
 రెండు చేతులకూ గోరింటతో (మెహెంది కాదు), పాదములకు పారాణితో అందంగా ఉంటుంది.
 మా అమ్మాయి నిండుగా పరికిణి కట్టుకుని ఓణి వేసుకుని ఉంటుంది.
 తలకు చమురు రాసుకుని చక్కగా దువ్వి రొండు జడలు వేసుకుంటుంది.
 తలనిండా పూలు పెట్టుకుని, వాలు జడకు జడ కుప్పులు వేసుకుంటుంది.
 చారడేసి కళ్లకు కాటుక పెట్టుకుని, నుదుటిన పావళా కాసంత చంద్రబింబం లాంటి ఎఱ్ఱటి కుంకుమ బొట్టు పెట్టుకుంటుంది (బొట్టు బిళ్ళ కాదు).
 కాళ్లకు మువ్వల అందెలతో (కాలి పట్టీలు అనకూడదు) ఘల్లుఘల్లు మంటూ ఇల్లంతా సందడిగా తిరుగుతుంది.
 ముద్దబంతి పువ్వులా, చిదిమి దీపము పెట్టుకునే లాగున, ఇంటికి కళగా ఉంటుంది.
 ఇలాంటి అమ్మాయి మీకేక్కడైనా కనిపించిందా? అగుపించినదా? మాకైతే గత పాతిక సంవత్సారాలుగా కనిపించడం లేదు. పండక్కో, పబ్బానికో, అక్కడ్డక్కడ తళుక్కున మెరిసి మాయమైపోద్ది అంతే !!!
..........
దానికి నేను రాసిన సమాధానం ఇది 👇
ఆమె ఉంది కానీ కనిపించే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలుగబ్బాయిని వెతుకుతూ వెళ్ళి, ఇంతవరకూ రాలేదు.
తెలుగబ్బాయి ఎవరా అనా?
ఆనవాళ్ళు చెపుతాను.
ధైర్యంగా ముందుకు పోయే తత్వం.
ఠీవిగా, పంచె, లాల్చీ, కండువాలతో ఉంటాడు.
నడిచొచ్చే విష్ణుమూర్తిలా ఉంటాడు.
కోరమీసంతో, కోటేరు ముక్కుతో ఉంటాడు.
అందరినీ వరసలు కలిపి, నవ్వుతూ పలకరిస్తుంటాడు.
తెలుగు వారితో తెలుగులోనే మాట్లాడుతుంటాడు.
చక్కని కుంకుమబొట్టుతో మెరిసిపోతుంటాడు.
తల్లిదండ్రులను అమ్మా నాన్నా అని నోరారా పిలుస్తాడు. అత్తా, మామా,  బాబాయ్ లాంటి భారతీయమైన పిలుపులే వాడుతాడు. అనవసరంగా మ్లేచ్ఛభాష వాడడు.
అడగకుండానే తోటివారికి తోచిన విధంగా సాయం చేస్తుంటాడు.
చూడటానికి రెండు కళ్ళూ, చెప్పటానికి మాటలూ చాలవు అన్నట్టుగా ఉంటాడు.
చూసి చాలా కాలమైంది. తననే వెతుకుతూ వెళ్ళి ఉంటుంది తెలుగమ్మాయి. ఒక్కటి మాత్రం నిజం. వస్తే ఎప్పటికైనా వీళ్ళు కలిసే వస్తారు. రావాలనే ఆశిద్దాం.
--(())--

Monday, 26 April 2021

సర్వేజనా సుఖినోభవంతు

ఇంద్రజిత్ - మాయా యుద్ధం వాల్మీకి రామాయణం  38వ దినము, యుద్ధకాండ


యుద్ధం ప్రారంభమయ్యింది

వానరులందరూ ఆ యుద్ధంలో ప్రాసాదాలని తిరగ తోసేసారు, పర్వత శిఖరాలని తీసుకొచ్చి విసిరేశారు, చెట్లతో కొట్టారు. కనపడ్డ ప్రతి రాక్షసుడిని చంపేశారు. నాలుగు ద్వారాలనీ మూసి ఉంచారు. బయట ఉన్నవాళ్లు బయట ఉన్నవాళ్ళతో యుద్ధం చేస్తున్నారు.


అలా ఆ వానరములకు రాక్షసులకు యుద్ధం జెరగబోయేముందు రాముడు అన్నాడు " యుద్ధం చేస్తున్న రాక్షసులు కామరుపాన్ని పొందగలరు, అలాగే వానరములలో కూడా కొంతమంది కామరుపాన్ని పొందగలరు. ఎట్టి పరిస్థితులలోను మీరు మాత్రం కామ రూపాన్ని తీసుకోకండి. ఏడుగురము మాత్రమే నర రూపంలో ఉండి యుద్ధం చేస్తాము. విభీషణుడు, ఆయన నలుగురు మంత్రులు నర రూపంలో ఉంటారు, నేను, లక్ష్మణుడు ఉంటాము. మిగిలినవారందరూ వానర రూపంలోనే ఉండండి " అని చెప్పాడు.


ఆరోజున జెరిగిన యుద్ధంలో వానరములు విశేషమైన బలాధిక్యతను ప్రదర్శించి అద్భుతమైన యుద్ధాన్ని చేశారు. ఆ సమయంలో రాక్షసులు ముసలాలు, ముద్గరాలు, శూలాలు, త్రిశూలాలు, కత్తులు, బరిసెలు వంటి ఆయుధములను పట్టుకొచ్చి కనపడ్డ వానరాన్ని కొట్టి చంపి తినేస్తున్నారు. ఆ వానరములలో ఉన్న భల్లూకములు కనపడ్డ రాక్షసుడిని గట్టిగా కౌగలించుకుని మరీ తింటున్నాయి. ఆ యుద్ధ సమయంలో ఎక్కడ చూసినా పట్టుకో, తన్ను, గుద్దు, నరుకు అనే కేకలే వినపడుతున్నాయి. ఆ రాత్రంతా మహా భయంకరమైన యుద్ధం జెరిగింది. శిరస్సులు బంతులు ఎగిరినట్టు ఆకాశంలోకి ఎగిరాయి. ఎక్కడ చూసినా చీలిపోయిన వక్షస్థలాలు, తెగిపోయిన కాళ్ళు, చేతులు ఉన్నాయి. ఆ ప్రాంతమంతా నెత్తుటితొ బురదయ్యి యుద్ధం చేస్తుంటే కాళ్ళు జారిపోతున్నాయి. ఏనుగుల తొండాలు, కాళ్ళు, గుర్రాల కాళ్ళు మొదలైన శరీర భాగాలు ఆ యుద్ధ భూమిలో పడి ఉన్నాయి.


అటువంటి సమయంలో ఇంద్రజిత్ యుద్ధానికి వచ్చాడు. రథంలో వస్తున్న ఇంద్రజిత్ ని చూడగానే అంగదుడికి అపారమైన ఉత్సాహం వచ్చింది. అప్పుడాయన ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి ఇంద్రజిత్ రథం మీద పారేశాడు. ఆ దెబ్బకి ఇంద్రజిత్ రథం మడిసిపోయింది. ఎప్పుడైతే ఎవ్వరూ ఊహించని విధంగా అంగదుడు ఆ ఇంద్రజిత్ యొక్క రథాన్ని, గుర్రాలని, ఛత్రాన్ని విరిగిపోయేటట్టు కొట్టాడో, ఆ సంఘటనని చూసి దేవతలు, రామ లక్ష్మణులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంద్రజిత్ జీవితంలో ఇప్పటిదాకా ఆయన రథాన్ని కొట్టినవాడు లేడు.


తన రథం విరిగిపోయేసరికి ఇంద్రజిత్ కి ఎక్కడలేని ఆగ్రహం వచ్చి ఆకాశంలోకి ఎగిరి అంతర్ధానం అయిపోయాడు. అప్పుడాయన మాయ చేత మంత్రములను అభిమంత్రించగానే చీకటి అలుముకుంది. తరువాత మాయ చేత సృష్టింపబడిన ఒక దివ్యమైన రథాన్ని ఎక్కి, ఆకాశంలో ఎవరికీ కనపడకుండా ఉండి, రామలక్ష్మణుల మీద బాణ పరంపర కురిపించాడు. కద్రువ యొక్క కుమారులైన సర్పాలని ఇంద్రజిత్ బాణములుగా వేశాడు. అవి బాణములుగా వచ్చి కొడతాయి, సర్పాలుగా చుట్టుకుని మర్మ స్థానములయందు కరుస్తుంటాయి. ఇంద్రజిత్ విడిచిపెట్టిన ఆ బాణములు రామలక్ష్మణులని నాగాస్త్ర బంధనంగా చుట్టేసింది. అప్పుడు రాముడు లక్ష్మణుడితో " లక్ష్మణా! మనం ఇప్పుడు ఈ ఇంద్రజిత్ ని ఏమి చెయ్యలేము. ఆబోతు వర్షాన్ని ఎలా భరిస్తుందో అలా మనం కూడా ఈ బాణాలని వహించడమే కొంతసేపు " అన్నాడు. తరువాత రాముడు మూర్చపోయి కిందపడిపోయాడు. ఓర్చుకుని నిలబడ్డ లక్ష్మణుడు రాముడి వంక చూసి ఏడుస్తూ ' ఏ మహానుభావుడిని ఎవ్వరూ యుద్ధ భూమిలో నిగ్రహించలేరో, ఎవరు విశ్వామిత్రుడి దెగ్గర ధనుర్వేదాన్ని ఉపదేశం పొందాడో, ఏ మహానుభావుడు భార్యని విడిపించుకోడానికి ఈ లంకా పట్టణానికి వచ్చాడో అటువంటి రాముడు ఇవ్వాళ నాగాస్త్ర బంధనం చేత కట్టబడి, ఉత్సాహము ఉపసమించి, భూమి మీద పడి ప్రాణములను విడిచిపెట్టాడు ' అని అనుకున్నాడు. తరువాత లక్ష్మణుడు కూడా కిందపడిపోయాడు. రాముడు పట్టుకున్న కోదండం చేతిలోనుంచి వదులయిపోయి దూరంగా పడిపోయింది. రామలక్ష్మణుల వేళ్ళ యొక్క చివరి భాగాల నుండి శరీరం అంతా అంగుళం చోటు లేకుండా ఇంద్రజిత్ బాణాలతో కొట్టి " మీ వలన నా తండ్రి ఎన్నో రాత్రులు పాన్పు మీద నిద్రపోకుండా అటు ఇటూ దొర్లాడు. ఏ రామలక్ష్మణుల వల్ల ఈ లంకా పట్టణం పీడింపబడిందో, ఏ రామలక్ష్మణుల వల్ల మా తండ్రి నిద్రపోలేదో, అటువంటి తండ్రి ఋణం తీర్చుకోడానికి ఈ రామలక్ష్మణుల ప్రాణములు పోయే వరకూ కొడతాను " అని, వారి యొక్క మర్మస్థానములలో గురి చూసి వజ్రములవంటి బాణములతో కొట్టాడు. 


అప్పుడు రాముడు మెల్లగా బాహ్య స్మృతిని కూడా కోల్పోయి భూమి మీద ఒరిగిపోయాడు, లక్ష్మణుడు కూడా ఒరిగిపోయాడు. అలా రామలక్ష్మణులు పడిపోగానే చుట్టూ ఉన్న వానర నాయకులు అక్కడికి వచ్చారు. అప్పుడు ఇంద్రజిత్ హనుమని, ఋషభుడిని, వేగదర్సిని, విభీషణుడిని, సుషేనుడిని, గంధమాధనుడిని బాణాలతో కొట్టి, వానర సైన్యం అంతటినీ కలచి వేశాడు. ఆ సమయంలో వానరాలు ఎటు వెళుతున్నారో, ఎవరి మీద నుంచి దాటుతున్నారో, ఎవరిని తొక్కుతున్నారో, ఎవరిని ఈడ్చేస్తున్నారో అని చూసుకోకుండా దిక్కులు పట్టి పారిపోయారు. 


రామలక్ష్మణులు ప్రాణములు విడిచిపెట్టారని సుగ్రీవుడు దుఃఖితుడై ఉన్నాడు. అప్పుడు విభీషణుడు అక్కడికి వచ్చి " నాయనా సుగ్రీవ! అన్ని వేళలా అందరికీ యుద్ధంలో జయము కలుగుతుందని అనుకోడానికి వీలులేదు, ఎంతటివారికైనా ప్రమాదం వస్తుంది. నువ్వు ఈ పరిస్థితులలో మొహాన్ని పొందకూడదు. ఈ సమయంలో నువ్వు శోకాన్ని పొందితే చెయ్యవలసిన పని స్ఫురణలోకి రాదు. అవతల వాళ్ళిద్దరూ ప్రమాదకరమైన స్థితిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళిద్దరికీ కాని తెలివి వచ్చిందా మనం రక్షింపబడినట్టే, వాళ్ళిద్దరికీ కాని తెలివి రాకపోతే మనిద్దరమూ నాశనం అయినట్టే. రామలక్ష్మణుల శరీరాలలో కాంతి తగ్గలేదు, అంగుళం మేర కూడా విడిచిపెట్టకుండా బాణములతో కొట్టేసినా తట్టుకోగలిగిన బలము, వీర్యము, ప్రకాశము, శక్తి, మనోధైర్యము వాళ్ళకి ఉన్నాయి " అని చెప్పి, పారిపోతున్న వానర సైన్యాన్ని వెనక్కి తీసుకురావడానికి వెళ్ళాడు.


కొంతసేపటికి విభీషణుడు ఆ సైన్యంతో తిరిగి వచ్చాడు. అప్పటికీ రామలక్ష్మణులు కిందపడిపోయే ఉన్నారు. పర్వతాల నుంచి సెలయేళ్ళు ప్రవహించినట్టు ఇంద్రజిత్ యొక్క బాణములు పెట్టిన ప్రతి రంధ్రం నుండి రక్తం ఏరులై ప్రవహించింది. అలా రక్తం వెళ్ళిపోతుండడం వలన వాళ్ళ శరీరాలు నీరసపడిపోతున్నాయి. అప్పటిదాకా సుగ్రీవుడికి ధైర్యం చెప్పిన విభీషణుడు ఈ పరిస్థితిని చూసి ఏడ్చి " నేను ఈ రాముడి మీద, లక్ష్మణుడి మీద ఆశ పెట్టుకున్నాను. రామలక్ష్మణులని ఆశ్రయిస్తే నాకు రాజ్యం లభిస్తుందని అనుకున్నాను. కాని ఈ రామలక్ష్మణులే యుద్ధంలో నిహతులయిపోయారు. ఇంక నాకు ఎవరు దిక్కు. మా అన్నయ్య నన్ను విడిచిపెట్టడు, నాకు లోకంలో ఎక్కడా రక్షణ దొరకదు. నేను దురదృష్టవంతుడిని " అని బాధపడ్డాడు.


విభీషణుడు అలా మాట్లాడేసరికి అప్పటివరకూ అక్కడ నిలబడ్డ వానర సైన్యం పారిపోవడం మొదలుపెట్టింది. అప్పుడు అంగదుడు అక్కడికి వచ్చి " ఇంత అసహ్యంగా, ఇంత సిగ్గులేకుండ వానర సైన్యం ఎందుకు పారిపోతుంది " అని అడిగాడు. అప్పుడు వాళ్ళన్నారు " మేము రామలక్ష్మణులు పడిపోయారని పారిపోవట్లేదు, ఎక్కడైనా ఇంద్రజిత్ వస్తాడేమో అని పారిపోతున్నాము " అన్నారు. ఇలా పారిపోవడమనేది చాలా భయంకరమైన విషయం, దయచేసి మీరందరూ వెనక్కి రండని ఆ వానర సైన్యాన్ని వెనక్కి తీసుకొచ్చారు.


ఆ సమయంలోనే ఇంద్రజిత్ లంకా నగరానికి చేరుకొని రావణుడితో " తండ్రి గారు మీరింక బెంగపడవలసిన అవసరం లేదు. నరులైన రామలక్ష్మణులని నేను సంహరించాను. నేను నిర్మించిన నాగాస్త్ర బంధనం చేత ఆ ఇద్దరూ యుద్ధ భూమిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళ శరీరంలో నుంచి నెత్తురు ఏరులై పారుతోంది. వాళ్ళిద్దరూ మరణించారు, ఇక మీరు ప్రశాంతంగా ఉండండి " అన్నాడు.

--(())_-



-

👍నిజాయితి(1)

 

కొత్త చెప్పులు కొందామని ఓ ప్రముఖ చెప్పుల దుకాణం కు వెళ్ళాను, షాపులోని సేల్స్ మేన్ నాకు రక, రకాల క్రొత్త చెప్పులు చూపిస్తున్నాడు, కానీ సైజు కరెక్ట్ ఉంటే చెప్పులు నచ్చడం లేదు, నచ్చిన చెప్పులు సైజు సరిపోవడం లేదు, అయినా పాపం సేల్స్ మేన్ ఓపిగ్గా ఇంకా కొత్తరకాలు తీసుకొచ్చి చూపిస్తున్నాడు, అంతలో షాపు ముందు ఓ పెద్ద కారు వచ్చి ఆగింది, అందులోనుండి ఓ వ్యక్తి హూందాగా షాపులోకి వచ్చాడు,

ఆయన్ని చూడగానే సేల్స్ మేన్స్ అందరూ మర్యాదగా లేచి నిలబడి నమస్కారం చేసారు, ఆయన చిరునవ్వుతో యజమాని సీట్లో కూర్చొని దేవునికి నమస్కారం చేసి

తన పనిలో నిమగ్నం అయ్యారు.  

మీ యజమానా?

అని సేల్స్ మేన్ ను అడిగాను,

అవును సార్,

ఆయన మా యజమాని ,

ఇలాంటి షాపులు ఆయనకు ఓ పది వరకు ఉంటాయి,

చాలా మంచి మనిషి అండి అని ఓ క్రొత్త రకం చెప్పుల జత చూయించాడు,

ఆ చెప్పుల జత చూసే సరికి నాకు తెలియకుండానే నా పెదాల మీద చిరునవ్వు వచ్చేసింది, కానీ సైజే కాస్త అటు,ఇటు గా ఉన్నట్టుంది, చెప్పుల జత నాకు నచ్చిన విషయం సేల్స్ మేన్ కనిపెట్టినట్టున్నాడు , ఎలాగైనా నాతో ఆ చెప్పులజత కొనిపించేయాలని తెగ ఆరాట పడుతున్నాడు, కాస్త బిగుతుగా ఉన్నట్టున్నాయి కదా అంటే, అబ్బే అదేం లేదు సార్, మీకు కరెక్ట్ సైజే అంటూ బలవంతపెట్టడం మొదలుపెట్టసాగాడు, ఇదంతా గమనిస్తున్న షాపు యజమాని లేచివచ్చి నాముందు క్రింద కూర్చుని సార్ ఓసారి మీ పాదం ఈ చెప్పులో పెట్టండి అని నా పాదం ను తన చేతిలో తీసుకుని చెప్పును తొడిగాడు,,


నాకు అంత పెద్ద మనిషి (వయసు లో పెద్ద , హోదాలో కూడా) నా పాదం ముట్టుకుని

చెప్పు తొడుగుతుంటే ఇబ్బంది గా అనిపించింది, పరవాలేదులెండి సర్ నేను  తొడుక్కుంటాను లెండి అని వారిస్తున్నా అతను వినకుండా రెండు కాళ్ళకు తన చేతులతో నాకు చెప్పులు తొడిగి లేచి నిలబడి ఓసారి నడిచి చూడండి సర్, మీకు కంఫర్ట్ గా ఉన్నాయో లేదో, లేకుంటే మరో జత చూద్దాం అన్నారు, కానీ ఆ జత సరిగ్గా సరిపోయాయి.

  నేను బిల్ పే చేస్తూ షాపు యజమాని తో మనసులో మాట బయటపెట్టాను,

సర్ మీరు ఈ హోదా లో ఉండికూడా మా పాదాలు పట్టుకుని మరీ చెప్పులు తొడగడం మాకు ఇబ్బంది గా ఉందండీ? అన్నాను,


ఆయన చిల్లర తిరిగి ఇస్తూ చిరునవ్వుతో సర్!

ఇది నా వృత్తి, నాకు దైవం తో సమానం,


"షాపు బయట మీరు కోటి రూపాయలు ఇస్తాను అన్నా నేను మీ పాదాలు ముట్టుకోను,

అదే షాపు లోపల మీరు కోటి రూపాయలు ఇచ్చినా మీ పాదాలు వదలను "

అన్నారు..

నాకు ఆశ్చర్యమేసింది, ఎంత గొప్ప వ్యక్తిత్వం!


Dignity of labour

******************


తను చేసే పని మీద గౌరవం, నిబద్ధత!

ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే పాఠం నేర్పడానికి నాకు దేవుడు పంపిన గురువు లా కనిపించారు,

మనం చేసే పని చిన్నదా? పెద్దదా? అన్నది కాదు సమస్య,

న్యాయబద్ధ మైందా? కాదా అని చూడాలి, న్యాయబద్ధమయినప్పుడు చేసే చిన్న పనికి సిగ్గు పడకూడదు.

ఎప్పుడూ మనం చేసే పనిని కానీ, ఉద్యోగంను కానీ తిట్టరాదు,

అదికూడ లేక రోడ్ల మీద వృధా గా తిరుగుతున్న వారు చాలామంది ఉన్నారని గుర్తు పెట్టుకోవాలని కోరుతూ.


🌻🌷🌻


--(())--

ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక 

నేటి సమాచారం - ఏకాగ్రత (5 )


 దయచేసి జాగ్రత్తగా చదవండి  _ కొన్ని చాలా ముఖ్యమైన అంశాలు _  


కరోనా తరువాత ఇప్పుడు అన్నీ చోట్ల జ్వరాలు పెరిగినట్లు తెలుస్తున్నది 

2 సంవత్సరాల విదేశాలకు ప్రయాణాన్ని వాయిదా వేయండి, 1 సంవత్సరం బయట ఆహారం తినవద్దు, అనవసరమైన వివాహం  లేదా ఎలాంటి  ఇతర వేడుకలకు వెళ్లవద్దు, అనవసరమైన ప్రయాణ యాత్రలు చేయవద్దు, కనీసం 1 సంవత్సరం రద్దీగా ఉండే  ప్రదేశానికి  వెళ్లవద్దు,   సామాజిక దూర నిబంధనలను   పూర్తిగా పాటించండి


 దగ్గు ఉన్న వ్యక్తికి దూరంగా ఉండండి, ఫేస్ మాస్క్‌ను ఉంచండి,  ప్రస్తుత ఒక వారంలో చాలా జాగ్రత్తగా ఉండండి,  మీ చుట్టూ ఉన్న గందరగోళాన్నిఅనుమతించవద్దు, శాఖాహార ఆహారాన్ని ఇష్టపడండి, ఇప్పుడు 6 నెలలు సినిమా, మాల్,    క్రౌడ్ మార్కెట్‌కు వెళ్లవద్దు.  వీలైతే పార్క్, 

పార్టీ మొదలైనవాటిని కూడా తప్పించాలి


రోగనిరోధక శక్తిని పెంచండి, బార్బర్ షాపులో లేదా బ్యూటీ సలోన్  పార్లర్‌లోఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి,  అనవసరమైన సమావేశాలకు దూరంగా ఉండండి,సామాజిక దూరాన్ని  ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి,  CORONA యొక్క    ముప్పు  త్వరలో ముగియదు


మీరు బయటకు వెళ్ళినప్పుడు బెల్ట్,  రింగులు, రిస్ట్ వాచ్ ధరించవద్దు వాచ్ అవసరం లేదు.  మీ మొబైల్‌కు సమయం వచ్చింది.,  చేతి కెర్చీఫ్ లేదు.  అవసరమైతే  శానిటైజర్ & టిష్యూ తీసుకోండి,  మీ ఇంటికి బూట్లు తీసుకురావద్దు  వాటిని బయట వదిలివేయండి,  మీరు బయటి నుండి ఇంటికి వచ్చినప్పుడు  మీ చేతులు మరియు కాళ్ళను శుభ్రం చేయండి.


మీరు అనుమానాస్పద రోగికి దగ్గరగా   వచ్చారని మీకు అనిపించినప్పుడు పూర్తిగా  స్నానం చేయండి, నమ్మిన దైవాన్ని పూజించండి 


 వచ్చే 6 నెలల నుండి 12 నెలల వరకు   ఈ జాగ్రత్తలు పాటించండి  దీన్ని మీ కుటుంబం & స్నేహితులతో పంచుకోండి.అప్పుడే మీ ఏకాగ్రతకు అసలయిన గుర్తింపు.  

ప్రతిఒక్కరికి పేరు పేరున  ధన్యవాదాలు..తెలుపుకుంటున్నాను . 


రోగమును తగ్గించ వచ్చు - కాలాన్ని మార్చలేము 

ఏకాగ్రతగా ఉండవచ్చు  - నిముషములో ఉన్న మార్పును గమనించలేము 


--(())--

ఒక్క రెండురూపాయలు,!!


2 జూన్ 2001.. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికలో ప్రచురించబడిన ఈ కథ కేవలం రెండుపేజీలే వుంటుంది . కానీ కథ పూర్తయాక రెండునిమిషాలయినా  మనం ఆలోచించకుండా వుండలేం... 

  ఈ కథలో చెప్పినదానికన్నా చెప్పకుండా వున్నదే ఎక్కువగా కనిపిస్తుంది.

           🌷🌷🌷

ఒఖ్ఖ రెండు రూపాయలు, 

"నేనేం వందలడిగేనా?  వేలడిగానా?  ఒఖ్ఖ రెండు రూపాయలేగా!  దానికే అంత దండకం చదవాలా?"

గట్టిగా వినిపిస్తున్న తల్లి గొంతు చెవిన పడుతూనే మెలకువ వచ్చింది నూకరాజుకి. గబుక్కున లేచి కూర్చున్నాడు.

       "ఆ!.. ఒఖ్ఖ రెండు రూపాయలేగా అని ఎంత తీసి పడేస్తున్నావు? పిల్లలు ఖర్చుల కడిగేదీ అదే. పుస్తకాల కడీగేదీ అదే. రెండూ రెండూ అంటూ నాలుగు సార్లు కలిపితే ఎనిమిదవదా? పదీ పదీ కలుపుకుంటూ పోతే వందవదా? ఇలాగే లెక్కలు పెడతాడు నీకొడుకు. రోజురోజుకీ  పెరిగి పోతున్న ధరలతో, నీ కొడుకిచ్చే డబ్బులకి లెక్కలు చెప్పలేక నా తలప్రాణం తోకకొస్తోంది. అయినా ముసల్దానివయిపోయావు. ఇంట్లోంచి బైటకి కదలవు. భోజనం, కాఫీ, టిఫినూ అన్నీ చెల్లిస్తూనే వున్నావాయె. ఇంకా నీకు ఆ ఒఖ్ఖ రెండు రూపాయలు మటుకు ఎందుకటా? ఏం చేసుకుందామనీ?" 

    సాగదీస్తూ అడుగుతున్న భార్య పంకజం నోటి దురుసుకి చెవులు  మూసుకుంటూ మంచం దిగాడు నూకరాజు. కాఫీ ఇస్తున్న భార్య నడిగాడు సంగతేమిటని? వెంటనే ఆమె స్వరం సౌమ్యంగా మారిపోయింది.

    "ఆ? ఏముందీ? మీ అమ్మగారికి రెండు రూపాయలు కావాలిట. మీరిచ్చిన డబ్బుతో పిల్లలకి ఫీజులు కట్టి, స్కూల్లో పుస్తకాలు, పెన్సిళ్లు కొనేసాను. ఇంక నాదగ్గర డబ్బుల్లేవు. అయినా మీ అమ్మగారికి డబ్బెందుకండీ? భోజనం, టిఫినూ, కాఫీ అన్నీ గడచిపోతుంటేనూ?" నెమ్మదిగా పాయింటు లేవదీసింది పంకజం.

నిజమే, అమ్మకు డబ్బులెందుకు?

       టైము చూసుకున్నాడు నూకరాజు.  అప్పుడే ఎనిమిదయింది.  అబ్బా, అప్పుడే షాపు తెరిచే టైమవుతోంది. గబగబా తయారయి షాపుకి బయలు దేరుతున్న అతనితో తల్లి అంది. 

       "ఒరేయ్ రాజూ, చూడరా మీ ఆవిడ... ఒఖ్ఖ రెండు రూపాయలడిగితే..." 

"అబ్బబ్బ ఏంటమ్మా. అసలే టైమయిపోతోందని కంగారు పడుతుంటే. అయినా నీకు డబ్బులెందుకు చెప్పు?”

అంటూనే హడావిడిగా చెప్పులేసుకు బయటకొచ్చేసాడు.  వెనక్కి తిరిగి తల్లికి నెమ్మదిగా నచ్చచెప్పి రమ్మని మనసు బాధిస్తున్నా, పరిగెడుతున్న టైము అతన్ని ముందుకే నడిపించింది.

      నెలలో మొదటి వారం, షాప్ రష్‌గా వుంది. నాలుగు చేతులతో పని చేస్తున్నట్లు చేస్తున్న నూకరాజుకి ఊపిరి పీల్చుకుందుకు కూడా సమయం దొరకలేదు. పదకొండు దాటేక జనం కొంచెం పలచబడ్డారు. అమ్మయ్య అనుకుంటూ వాటర్ బాటిల్‌లో నీళ్లు తాగుదామని తలయెత్తిన అతనికి, ఆ షాపు వైపే వస్తున్న రామ్మూర్తిగారు  కనిపించారు. నూకరాజు ముఖం విచ్చుకుంది. రూపాయలు, పైసల లెక్కల్తో కొట్టుకొంటున్న అతనికి రామ్మూర్తి గారితో మాట్లాడటం గొప్ప రిలీఫ్. చుట్టుపక్కల ప్రాంతంలో ఏం జరుగుతోందో తెలియనంత బిజీగా వుండే అతనికి మధ్యమధ్యలో రామ్మూర్తిగారు చెప్పే మాటల్లోనే ప్రపంచం తీరు తెన్నుల గురించి తెలుస్తూంటుంది. 

రామ్మూర్తిగారు ఒక రిటైరైన గర్నమెంటు ఆఫీసరు. మనవలతో ఆడుకుంటూ హాయిగా కొడుకింట్లో కాలం గడిపేస్తున్నారు. ఏదో హోదాగల ఉద్యోగమే చేసుంటారు. అందుకే అభిమానం, పౌరుషం గల మనిషిలా కనిపిస్తారు. 

      ఎప్పుడైనా ఆయన ఉద్యోగపు రోజులు గుర్తుకు వస్తే "ఏమిటోనయ్యా, ఆ రోజులే వేరు. ఎంతసేపు సిన్సియర్‌గా పనిచేసి పేరు తెచ్చుకుందామనే గాని వేరే దృష్టి ఎక్కడిదయ్యా? ఇప్పుడేమో అంతా ఖాళీయే. ఎవరితోనన్నా మాట్లాడదామన్నా వాడి టైము పాడు చేస్తున్నానేమోనని ఫీలింగు" అంటూ పకపకా నవ్వేస్తారు.

 "మీకేం సార్.  మాలా బిజినెస్ కాదు కదా! చేసినన్నాళ్లు చేసారు. పెన్షన్ వస్తుంది.  హాయిగా కొడుకు దగ్గర ఉంటున్నారు" అంటే,

"నీకొక జీవిత సత్యం చెబుతాను వినవయ్యా నూకరాజూ, ఎవరి జీవితం వాళ్లదేననుకో కాని, కొంతమంది ఇవ్వడానికే పుడతారు, మరికొంతమంది పుచ్చుకోవడానికే పుడతారు. కాలం మారుతూంటుంది కదయ్యా అదెప్పుడూ ఒక్కలాగే ఉండదు. మా తరం తల్లిదండ్రులని చూడవలసిన బాధ్యత కొడుకులది అనే నమ్మే తరం. అల్లాగే చూసాం. కాని మా కొడుకుల తరం వచ్చేసరికి, వాళ్లింట్లో ఉంటున్నందుకు మాకొచ్చే పెన్షన్ వాళ్ల చేతుల్లో పెట్టవలసిన పరిస్థితి వచ్చేసింది.  ఏంచేస్తాం? ఈ కాలమిలా వుంది. వాళ్ల వైపు నుంచి ఆలోచిస్తే సమర్థించుకోవచ్చేమో కాని, మాతరం వాళ్లం సర్దుకోలేకపోతున్నామాయే!" అంటూ బరువైన విషయాన్ని కూడా చాలా తేలికగా తీసుకుంటూ చెప్పేసారు.

రామ్మూర్తిగారు కొంచెం భోజనప్రియులు అయివుండాలి.  గతం గుర్తొస్తే మటుకు వెంటనే ఆయన చెప్పే మాట "అప్పుడు బజార్లోకి కొత్తరకం ఏదొచ్చినా సరే తెచ్చి పిల్లలకి తినిపించాల్సిందేనయ్యా. అప్పుడూ మాకు తినడానికి టైముండేది కాదు, ఇప్పుడు టైమున్నా పెట్టేవాళ్లు లేరు" అంటూ నవ్వేస్తారు.  ఇలా మంచీ చెడూ చెపుతూ, లోకం పోకడ గురించి ముచ్చటిస్తూ ఆయన కోడలు రాసిచ్చిన సరుకుల లిస్టు, ఖాతా పుస్తకం నూకరాజు చేతికిచ్చేవారు.  కావలసిన సరుకులిచ్చి, లెక్క ఖాతా పుస్తకంలో రాసే వరకు అతనేదో అడుగుతూండడం, ఆయన జవాబిస్తూండడం వాళ్లిద్దరికీ అలవాటయిపోయింది.

"ఏంటి మాస్టారూ విశేషాలు?" అడిగాడు నూకరాజు సరుకుల లిస్టు అందుకుంటూ.

"ఆ! ఏముందోయ్, అన్నట్లు మీ పిల్లలెలా చదువు తున్నారు?" కుశల ప్రశ్నలు వేసారు రామ్మూర్తిగారు.

"ఏం చదువులోనండి, వీళ్లు చదివి ఏం ఉధ్ధరిస్తారో తెలీదుకానండి ఫీజులు మటుకు చుక్కలంటు తున్నాయండి.  పుస్తకాలు, డ్రెస్సులు, పాకెట్‌ మనీ తడిసి మోపెడవుతున్నాయి" అన్నాడు నూకరాజు.

"ఊ! అయితే పిల్లలకి పాకెట్ మనీ కూడా ఇస్తావేమిటోయ్?" అడిగారు ఆయన.

"ఏదోనండి, రూపాయో, రెండో.  పక్క పిల్లలు ఏదో కొనుక్కుంటారు కదండీ, వాళ్లకి అనిపిస్తుంది కదా, మళ్లీ చిన్న పుచ్చుకుంటారనీ." సమర్థించుకున్నాడు నూకరాజు.

        "నిజమేనోయ్, నీకొక సంగతి చెప్పనా? మా తాతగారంటూండేవారు. చిన్నపిల్లలూ, ముసలివాళ్లూ ఒకటేనని.  అంటే వాళ్లిద్దరి మనస్తత్వం ఒక్కలాగే వుంటుందని, ఏదో అస్తమానం తింటూండాలనిపిస్తుందనీ, చపలత్వం, చాదస్తం ఎక్కువవుతాయనీ అంటూండేవాడు.  పిల్లలకే కాదు పెద్దలకి కూడా చేతిలో ఓ రూపాయుంటే ఏ గుళ్లోనో దేవుడికిచ్చుకోవాలనిపిస్తుంది కదా!" అన్నారు ఆయన. నూకరాజుకి వెంటనే తల్లి గుర్తుకు వచ్చింది. 'అమ్మ గుడిలో దేవుడి కోసం అడిగిందా ప్రొద్దున్నే రెండు రూపాయలు?'  ఆలోచనలు తప్పించుకుందుకు తల విదిలించి సరుకుల లిస్టు చూడడంలో మునిగిపోయాడు.  సరుకుల ధరలు రాసి, మొత్తం కూడి, ఖాతా పుస్తకంలో రాస్తున్నాడు.

"నూకరాజూ" 

రామ్మూర్తిగారి గొంతు నెమ్మదిగా వినిపించింది.  తలెత్తాడు నూకరాజు.

"ఏదో ఒక సరుకులో రెండు రూపాయలు ఎక్కువెయ్యవయ్యా." నసుగుతూ అన్నాడాయన.

ఆశ్చర్యపోతూ తలెత్తాడు నూకరాజు.  ఆయన అతన్ని ఓ చూపు చూసి గబుక్కున తల దించుకున్నాడు. అభిమానంతో ఆయన నోటి వెంట వచ్చిన మాటలు "ఏం లేదయ్యా... కొత్తరకం బిస్కెట్లేవో వచ్చాయన్నావు కదా, ఎలా వుంటాయో రుచి చూద్దామనీ, అంతే, ఒఖ్ఖ రెండు రూపాయలే."

         వింటున్న నూకరాజుకి ఛెళ్లున లెంపకాయ కొట్టినట్టయింది. కళ్లమ్మట గిఱ్ఱున నీళ్లు తిరిగాయి. తమలాంటి కొడుకులందర్నీ చంపి పాతరేసినా పాపం లేదనిపించింది. పాప భారంతో ఎత్తలేని తల భూమిలోకి దించుకున్నాడు నూకరాజు. 

                🌷🌷🌷

2 జూన్ 2001.. ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక ప్రచురణ.


ప్రాంజలి ప్రభ  అంతర్జాల పత్రిక - ఏకాగ్రత (3 )  

రచాయిట: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 



విశ్వాంతరాళంలోని మనకు తెలిసిన లేక తెలియని సమస్త చరాచర జీవుల సుఖానుభవం లేక దుఃఖానుభవం ప్రతి జీవి, ప్రతి ఒక్కరూ "సరాసరి"  లెక్కన అనుభవించటం జరుగుతుంది.


మన ఆలోచనలు ప్రతివిషయం  లో తేలికభావం అనుకోకండి  కష్టము కాదు,  అయ్యిందేదో మంచికే.,  అవుతున్నదేదో అది మంచికే .అవ్వపోయేది కూడా మంచికే అనుకోవాలి . ఈనాడు నీవు నాసొంతం అనుకున్నదంతా, నిన్న ఇంకొకరి సొంతం కద, మరి రేపు మరొకరి సొంతం కాగలదు.. 


 అందువల్ల నీ సుఖం, నీ శాంతి నీ ఒక్కని స్థితిపై ఆధారపడి లేదు.  జగత్తు యొక్క మొత్తపు సుఖం మీద ఆధారపడి ఉంది.


కావున జరిగేదేదో జరుగకమానదు..జరిగింది ఎన్నటికీ మారదు.. అనవసరంగా ఆందోళన పడకు 

ఆందోళన అనారోగ్యానికి మూలం.. 'ప్రయత్నలోపం లేకుండా ప్రయత్నించు. ఉపకారం చేయలేకపోయినా, అపకారం తలపెట్టకు..మతిని సిద్ధంచేసేది మతం, మానవత్వం లేని మతం మతం కాదు..దేవుని పూజించు, ప్రాణకోటికి సహకరించు తద్వారా భగవదాశీర్వాదంతో శాంతి నీ వెంట, ఇంట, చెంత ఉండగలదు..


"అంతరేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, తన్మాత్రలు, కర్మేంద్రియాలు" వీటన్నింటిని ఏకకాలంలో అనుభవించగలిగే ఏకైక వస్తువు  మనిషి. పుట్టుటకు గిట్టుటకు మనిషే మూలం . మనోధైర్యం తో  ఉండగలిగి ఏకాగ్రతతో  పలికే పలుకు లు సత్యాలు. 



--(())--  .

Saturday, 24 April 2021

No photo description available.

ప్రాంజలి ప్రభ
 - ఆరోగ్యము - ఆధ్యాత్మికం - ఆనందము
ఈ రోజు సమస్య పూరకము .............25 - 04 - 2021   

 సంతానంబిడిన హనుమ సద్గురువు కదా!
ఉత్త్సాహం కలిగి  విజయ ఊ యలలు సదా
ప్రోత్త్సాహం జరిపి మనసు మోహనపు విధీ
సత్భావం  సహజ మగుట సంతసము సదా

సంతానంబిడిన హనుమ సద్గురువు కదా!
ఆత్మానందముయు  అధర ఆనతియు సదా
తత్వానందముయు  మనసు మాటలయు సదా
సత్యానందముయు  బతుకు సౌఖ్యముయు సదా  

సంతానంబిడిన హనుమ సద్గురువు కదా!
సత్పుర్షు లకును సమయ శోధనలు సదా
సంత్రుప్తే సకల బతుకు సాధనలు సదా
తాత్పర్యం వినయ కరుణ తాపములు సదా  
సంతానంబిడిన హనుమ సద్గురువు కదా!
--(())--

ముగ్గురమ్మల మూలపుటమ్మ.. చిన్న ... కవిత  ..(4 )

పర్వత సంచారివమ్మా - మానస సంచరితవమ్మా  
సర్వము సేవార్పితవమ్మా - నిత్యము సంతసతవమ్మా

కామ జాతర వమ్మా  -  ప్రేమ జాతర వమ్మా
ఆశ జాతర వమ్మా - న్యాయ జఠరావమ్మా

పరల సేవిత వమ్మా  - విషయ సేవితవమ్మా
మనసు సేవితవమ్మా - వయసు సేవితావమ్మా

పతినే కొలిచె నమ్మా  -  ప్రియునే కొలిచె నమ్మా
వరుసే కలిపె నమ్మా -  సొగసే మలిచె నమ్మా

కుచభారమాపు వమ్మా - పరతంత్రా లతొ వమ్మా  
మా మానవతి వమ్మా  - మా ప్రాణ సతి వమ్మా

పంకజ లోచనమ్మా - సఖ్యత చూపునమ్మా
ఇష్టపు ఆశావమ్మా  - లౌక్యము చెప్పనమ్మా

బ్రహ్మచారివమ్మా -  బ్రహ్మతేజమమ్మా
బ్రహ్మపుత్రివమ్మా - బ్రహ్మ మాయమమ్మా

ఆలోచన కర్త వమ్మా - ఆలోచనా కర్మవమ్మా
ఆలోచనా భర్తి వమ్మా - ఆలోచనా కీర్తి వమ్మా

ప్రకృతికి మూలమమ్మా  - జాగృతి మూలమమ్మా
సుకృతికి మూలమమ్మా - ఆకృతి మూలమమ్మా

ఐశ్వర్య సతి వమ్మా  - బిందు ఐక్య తవమ్మా
కాంచిమధ్యగతమ్మా  - మమ్మీలు మాయమ్మా

చంద్రమౌళి సతివమ్మా - ఐందవ కిశోర వమ్మా
శేఖర మోహితి వమ్మా  -మమ్మేలు మాయమ్మా
కాంచి పురవాసమ్మా - మమ్మేలు మాయమ్మా  
--(())--

నేటి ఛందస్సు
స్థూలా - త/స/గ UU III UU
7 ఉష్ణిక్కు 29

సీతా మనసు పంచూ  
బాధా మనసు విప్పూ    
నీలో సొగసు ఉందీ
నాలో వయసు ఉందీ

రామా మనసు ఉంచూ
బాధా మనసు తెంచూ   
నీలో సగము నేనే
నాలో సగము నీవే

సీతా తనువు పంచూ
కాలం మనని కల్పే
దోషం అసలు లేదూ
వేషం ఇకను వద్దూ   

రామా తనువు పంచూ
గాయం మనసు చేసే
ప్రేమా మనలొ ఉందీ
దాహం ఇకను తీర్చూ    

సీత పలుకు వేదం
ఆశ మనకు నాదం
ప్రేమ మనకు పాఠం
నిత్య మనకు నాట్యం

రామా మనసు నీపై
సేవా ఇకను చేస్తా
రామా వయసు నీదే
ఇష్టమ్ము ఇక పొందూ
సీతా అలక లొద్దూ   

హాయే ఇకను నీకూ   
ప్రేమా వదల లేనే
అంతా సుఖము నీకే

దోషం అసలు కాదూ
వేషం అనను  వద్దూ   
దాహం మనకు ముద్దూ
దేహం ఇకను సద్దూ
--(())--

ప్రాంజలి ప్రభ 25 -04 -2021
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం

ప్రాంజలి ప్రభ అధ్యాత్మిక చిన్న కధలు ---5---
 మనసు త్రిపుటిగా విభజన చెందటానికి కారణమేమిటో సూక్ష్మంగా పరిశీలించగలిగితే అది కోరిక అని అర్థమవుతుంది. కోరికే మనసును సాఫీగా సాగకుండా కర్త, కర్మ, క్రియలను సృష్టిస్తుంది. ఈ విభజనే అశాంతికి మూల కారణం అవుతుంది. విభజన చెందని మనసు సహజమైన గ్రహింపుతో సదా ఆనందస్థితిలోనే సాగుతుంది.  . ప్రతీరోజూ నియమం తప్పక ధ్యానం చేయగలిగితే అది మన జీవిత విధానాన్ని పూర్తిగా మార్చివేయగలదు.
నైతిక వర్తనమే శ్రేష్ఠమార్గం. పుణ్యాత్ముడు చివరకు జయించి తీరుతాడు.
అందరిలోనూ అనుభవాలతో పాటు ఈ అనుకూలత, ప్రతికూలతలు సంభవిస్తాయి. అంత  మాత్రాన చేయలేను అని అధైర్య పడకూడదనే నమ్మకం.  
బాహ్యంతరాలు లౌకిక ప్రపంచానికే కానీ పరమశాంతికి కాదు. పరమశాంతి సంకల్ప రహితంగా ఉంటుంది. రూపం లేనిదిగా ఉంటుంది. సత్యం అర్థమైన తర్వాత ఈ సకలచరాచర సృష్టిలో అంతర్భాగమని తెలిసి తనకంటూ ప్రత్యేకమైన ఉనికిని వెతుక్కోకుండా ఉంటాము. ఏదైనా త్యజించాలంటే మనం దాన్ని పట్టుకోవడమో, అది మనను పట్టుకోవడమో జరగాలి.
తనమన బేధము గురించి ఆలోచన వస్తే జీవితం దుర్భరం, బేధము లేని మనసు ఉంటే సుఖమయం.   
1. "భగవంతుడు:-  ప్రతిచోట నుండి సమస్తమును చేయుచున్నాడు. , 2. భగవంతుడు:- మనలో నుండి సమస్తమును తెలిసి కొనుచున్నాడు. 3. భగవంతుడు:- మనకు వెలుపల నుండి సర్వమును చూచూచున్నాడు.4. భగవంతుడు:- మనకు ఆవల నుండి సర్వము తానై యున్నాడు."
సత్యమును అనుభవింప వలెను. భగవంతుని దివ్యత్వమును పొందవలెను. దివ్యత్వములో బ్రతుకవలెను. ఇదియే సత్యధర్మము.
----

హృదయ సుమాంజలి
మృదుల సమాంజలి
శృ దయ భయాంజలి ప్రేమతో
నిజాయితీగా
అజామరంగా
సజాసుతంగా ప్రేమతోనె
మొండి తనంగా
నాడి పరంగా
ఆడెను రంగా ప్రేమతోనె
విధేయత నుంచి
సదా తలవంచి
విదేశము ఎంచు ప్రేమతోె
ప్రవర్తన మార్చి
సమర్ధత చేర్చి
 వివర్ణము గూర్చె ప్రేమతోె
ఎక్కువైనా ను
తక్కువైనా ను
మక్కువైనాను ప్రేమతో
పోల్చు కోకండి
కూల్చు కోకండి
తేల్చు కోకండి ప్రేమతో
ప్రశాంతత పొందు
అశాంతియు చెందు
విశ్రాంతి ముందు ప్రేమతో

సోయగాలు ... (10 -12 )
 

మమతయు సర్వలోక జనత  
సమత యువత జనత  
కమ్మని పాటల తొ వనిత  
మమ్ము చూడు యువత
నమ్మియు జూపినట్టి మమత  
కమ్మ నైన చరిత
ఏమన నే సోయ గాలులే
నీతి యన్నది ఇక్కడ లేదు
బ్రాంతి ఉంది అంత
శాంతి కరువుగాను మారేను   
చింత చేరి నంత
వింత పోకడ ఏలు చుండెను
సంత గోల నంత
ఇంత అంత  ప్రేమ మల్లేను  
యవినీతి ఆటలు ఆడేను
యవని లోన జెప్ప
యువనీతి వీధిన పడేను
 

యువత చెందు బుద్ధి
యువతీ యువకులజంట ప్రేమ  
యెంత మార్చు జగతి
ఏమి అన్ననుఇది  ప్రేమయే
--(())--

మధురిమలు - కారోనా
 

చేయి చేయి కలుప వద్దు
చిలిపి తనము అసలు వద్దు  
హాయి యనఁగఁ జూచుకొనుటె  
హరుస మదియె వేడు కొనుటె
 

పూయబోకు మత్తరులను  
బూలగుత్తి  వాసనలను  
రేయియంత ఫోనులోనఁ  
బ్రేమమాట బతుకు లోన  
*
 

చక్కనైన నీపెదవులు  -
జాటు నుంచి మధువు లేలు   
ముక్కుపైన నోటిపైన  
ముసుగు గుడ్డఁ ముద్దు పైన
 

మక్కువ మనమందు నుండ  
మాటలాడు చేతి నుండ  
నిక్కముగను ముద్దులాడ  
నీకు నాకుఁ వాదు లాడ  
*

అందమైన మోము నాదు  
అద్ద  మందు చుపె నాదు -
నందమొంద వీలుకాదు  
నా వలపిటున బతక లేదు
 

ముందుముందు నిన్ను దాఁకి
ముచ్చటించ భయము దాఁకి  
సుందరీ కరోన మనలఁ  
జూచి నవ్వు నీకు ఏల  
 

బతికి బతికించు మాట
ఇక తిరుగ కుండు మాట
ఉన్న చోట ఉండు మాట
బతికుంటే ఆక లాట
 

ఎటు చూసినా రోగులు
భయముతోను  రాగాలు
చెప్పఁ కుంచు రోగాలు
ఇకను తప్పవు బాధలు
--(())--

సమాగమ సంగమ సాహిత్యం
 

పగలు గడిచెనే సంధ్యా సమయమందు పగటి కల
రాగమే గతి తప్పదా ఉత్సాహం రవ్వలవలె
 పగలు మగుడగును భార్యయు సంధ్యైతె కలియు లేల
యుగము గడిచినా ఎవరిదారియు వారె ఎదురు చూపు
 

ఒడి దొడుకులలో ఒక్కరిపై ఒకరుగా ఓడిగెలుచు
అడ్డు అడిగినా ఆయన నొసలు యే రెప్పముసుగు
తడిపొడి కలలు వెన్నంటి ఉండేను గుండె మడుగు
గుండె గుడిశబ్ధము వెలుగు తట్టిన ఫలములేదు
 

నేడె తడిపింది మల్లెల వాసంతి  వలపు వాన
ఆడె తడబడి ముడి పడలేకయే గడువు లోపు
వీడె చెడిపోయిన బతుకు తెరువు యు కలలు ఆయె
గాడి పడిననూ బతకలేని తెరువు విశాలమగు
 

పడుటే మదిదోచి హత్తు ఆరోగ్యముకన్
గడవం జనుదోయి హెచ్చు సౌందర్యముకున్
తొడిమే వికసించె గాని రారమ్మనకున్
నడుమే పసలేదు గాని నారీమణికిన్
 

అణువణువు వికసపు లతలు సరసాలకే సుమ మాలికా
లుకలుకలు పకపకలు చినుకుల చేయి సాయముగా సుతా
రము తరుణము తకధిముల వరుస ఏక మానముగా మనో
మయము కళల నిజము కలవలతొ మోహరింపు సరాగమే
 

చిరునగవు తొలకరి వణుకు సమయో చనం మరుమల్లియే
విరుపుల తలపులు కులుకులు ఒకటేమిటీ పరువాలనే
పదిలముగ సరిగమలు సరియగు సామరస్య ముగా మదీ
య పెదవుల సుకుమములు కురులలొ జాజి సుమాలు పొందుకే
 

కళల తలపులు వలలు ఉసిగొలిపే సదా మధురం వరం
గలగలలు మకసికలు కదలిక లే ఉహాజని తాలయం
అనుకువన అలసటల అరమరికే సమానముగా విశే
షములు వికసితములు ఒకరికొక రే తపోధనమే  జయం
--(())--
 

 

  త్రి కరణములు-ఏదైనా పనిని చేసే ముందు ఆ పనిని త్రికరణ శుద్ధిగా చేయమని అంటారు................!!!!!


త్రి కరణములు అనగా

1.మనస్సు

2. వాక్కు

3. పని (శరీరం)


త్రి గంధములు

1.ఏలుకలు

2.జాపత్రి

3.దాల్చిన చెక్క


త్రి గుణములు

మనిషిలోని గుణములును మూడుగా విభజించారు.

1.సత్వ గుణము

2.రజో గుణము

3.తమో గుణము


త్రి గుణముల-వాతావరణ పరిస్థితులు బట్టి కాలములను మూడుగా విభజించారు.

అవి

1.వేసవి కాలము - ఎండలు వేయును

2.వర్షా కాలము - వర్షాలు కురియును

3.శీతా కాలము - చలి గాలులు వీచును


త్రివేణీ సంగమ నదులు- 

మూడు నదులు ఒక చోట కలవడాన్ని త్రివేణీ సంగమం అంటారు.

ఆ త్రివేణీ సంగమ నదులు ఏవంటే..

1.గంగ

2. యమున

3. సరస్వతి


త్రివిధ నాయకలు

మన పూర్వీకులు స్త్రీని మూడు విధాలుగా వర్గీకరించారు.

1.ముగ్ధ - ఉదయుంచుచున్న యవ్వనమూలజ్జ గల స్త్రీ

2.మద్య - సగము లజ్జ(సిగ్గు) వీడిన యువతి

3.ప్రౌడ - సిగ్గు విడిచిన సంపూర్ణ యవ్వనవతి


త్రివిధ మార్గములు

భగవంతున్ని ప్రసన్నం చేసుకొనుటకు మన పూర్వీకులు మూడు మార్గాలను అనుసరించారు.

అవి.

1.జ్ఞాన మార్గము

2.కర్మ మార్గము

3. ఉపాసనా మార్గము


త్రివిధ మార్గములు

మానవుడుకు ముఖ్యంగా మూడు రకాల కోర్కెలు ఉంటాయి.

అవి.

1.కాంత - అనగా స్త్రీ వ్యామొహం

2.కనకం - బంగారం మీద ఆశ

3.కీర్తి - పదిమంది చేతా పొగిడించుకోవడం


త్రివిధాగ్నులు

1.కామాగ్ని

2. క్రోధాగ్ని

3. క్షుద్రాగ్ని


చతుర్విధ బలములు

1. బాహు బలము

2. మనో బలము

3. ధన బలము

4. భందు బలము


చతుర్విధ పురుషార్ధాలు

1. ధర్మము

2. అర్ధము

3. కామము

4. మోక్షము


చతుర్విధ ఆశ్రమాలు

1.బ్రహ్మచర్యం

2.గార్హస్థ్యము

3.వానప్రస్థము

4.సన్యాసము


చతుర్విధ పాశములు

1. ఆశా పాశము

2. మోహ పాశము

3. మాయా పాశము

4. కర్మ పాశము


చతుర్విధొపాయములు

1. సామము

2. దానము

3. భేధము

4. దండము


చతుర్విధ స్త్రీజాతులు


మన పూర్వీకులు స్త్రీలను నాలుగు జాతులుగా విభజించారు.

1. పద్మినీ జాతి

2. హస్తినీ జాతి

3. శంఖినీ జాతి

4. చిత్తనీ జాతి


చతుర్విధ కర్మలు

1. ద్యానము

2. శౌచము

3. భిక్ష

4. ఏకాంతము


పంచ భూతాలు

ప్రకృతిలో మనకు కనిపించే భూమి,నీరు,ఆకాశము,అగ్ని,గాలులని పంచభూతాలు అని అంటారు.

అవి .

1. భూమి

2. నీరు

3. అగ్ని

4. ఆకాశము

5. గాలి


పంచభక్ష్యాలు


పంచభక్ష్యాలు అనగా ఐదు రకాలైన ఆహార పదార్ధాలు.ఎవరైనా మంచి భొజనం పెడితే పంచభక్ష్యపరవాన్నాలతో భొజనం పెట్టాడనడం పరిపాటి. అవి

1. భక్ష్యము - భక్ష్యము అనగా నమిలితినే పదార్ధము

2. భొజ్యము - భొజ్యము అనగా చప్పరిస్తూ తినేది

3. చోప్యము - చోప్యము అనగా జుర్రుకునేది

4. లేహ్యము - లేహ్యము అనగా నాకబడేది

5. పానియము - పానియము అనగా త్రాగేది


పంచారామాలు 

ఆంధ్రప్రదేశ్ లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలను పంచారామాలు అని పిలుస్తారు. పంచారామాలు ఏర్పడుటకు స్కంద పురాణంలో వాటి స్ధల పురాణం ఇలా వివరించబడినది.పూర్వం తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి శివుని ఆత్మలింగము సంపాదిస్తాడు.దీనితో వర గర్వముతో దేవతలను అనేక రకాలుగా హింసలు గురిచేయగా దీనితో దేవతలు విష్ణుమూర్తిని ప్రార్ధించగా శివపార్వతుల వల్ల కలిగిన కుమారుడు వల్లనే తారకాసురునిపై యుద్ధానికి పంపుతారు.యుద్ధమునందు కుమారస్వామి తారకాసురుని కంఠంలో గల ఆత్మలింగమును చేదిస్తేనే మరణము కలుగునని గ్రహించి ఆ లింగమును చేదిస్తాడు.దీనితో తారకాసురుడు మరణిస్తాడు.చేదించగా ఆ ఆత్మలింగము వేరై ఐదు ప్రదేశములలో పడుతుంది. తరువాత వాటిని ఆఅ ప్రదేశాలలో దేవతలు ప్రతిష్ఠ ఛేస్తారు. ఇవే పంచారామాలు.

1.దాక్షారామము -

2.అమరారామము -

4.సోమారామము -

5.కుమార భీమారామము -


పంచపాండవులు


మహాభారతములో పాండవులకు అత్యంత ప్రాముఖ్యము కలదు.పాండవులు అనగా పాండురాజు కుమారులు.వీరు ఐదుగురు అందుచేత వీరిని పంచపాండవులు అని అంటారు.పాండురాజుకి ముని శాప కారణముగా ఏ స్త్రీ అయితే సంఘమిస్తే మరుక్షణమే మరణించును.పాండురాజు భార్య కుంతీ దేవి తనకు ఉన్న వరము కారణంగా కోరుకున్న వారితో సంతానం సిద్దించును.దీనితో పాండురాజు తన వంశం నిర్వంశం కాకూడదని కుంతీ దేవిని నీ వరము ఉపయోగించి పుత్రులు కావాలని కోరతాడు.తన భర్త అజ్ఞానుసారం కుంతీ తన వర ప్రభావముచే ధర్మరాజు,భీముడు,అర్జునుడు లకు జన్మనిస్తుంది.ఆ తర్వాత కుంతి పాండు రాజు రెండవ భార్య మాద్రి కి ఈ వరము ఉపదేశించడం వల్ల ఆమెకు నకుల సహదేవులు జన్మిస్తారు.

పంచపాండవులు

1.ధర్మరాజు - అజాత శత్రువైన ధర్మరాజు పాండవులలో పెద్దవాడు.ధర్మరాజు యముడు వరం కారణంగా జన్మిస్తాడు.

2.భీమసేనుడు - అతిబలశాలి అయిన భీముడు వయిదేవుడు వరప్రభావం చేత జన్మిస్తాడు.

3.అర్జునుడు - ఇంద్రుడు వలన విలువిద్యాపారంగతుడైన అర్జునుడు జన్మిస్తాడు

4.నకులుడు 

5.సహదేవుడు - అశ్వనీదేవతల వర ప్రభావం చేత మాద్రికి వీరిరువురూ జన్మిస్తారు.


పంచకన్యలు

1.అహల్య

2.ద్రౌపతి

3.తార 

4.మడోదరి

5.కుంతి


పంచ మహాపాతకాలు

1. స్త్రీ హత్య - స్త్రీని చంపడం

2. శిశు హత్య - చిన్నపిల్లలను చంపడం

3. గో హత్య - ఆవును చంపడం

4. బ్రహ్మ హత్య - బ్రాహ్మణున్ని చంపడం

5. గురు హత్య - చదుఫు నేర్పిన గురువుని చంపడం


పంచఋషులు

1. కౌశికుడు

2. కాశ్యపుడు

3. భరద్వాజ

4. అత్రి

5. గౌతముడు


పంచాంగం

పంచాంగం అనగా

1. తిథి

2. వారం

3. నక్షత్రం

4. యోగం

5. కరణం

ఈ ఐదు ఉన్న పుస్తకం


పంచజ్ఞానేంద్రియములు

పంచజ్ఞానేంద్రియములు అనగా ఐదు ఇంద్రియాలు

అవి

1. ముక్కు - ఘ్రాణేంద్రియం (వాసల చూడటానికి)

2. నాలుక - రసనేంద్రియం (రుచి చూడటానికి)

3. కన్ను - చక్షురింద్రియం (చూడటానికి)

4. చెవి - శ్రోత్రేంద్రియం (వినడానికి)

5. చర్మం - త్వగింద్రియం (మన శరీరంలోని అవయవాలను కప్పి ఉంచడానికి)


అయిదవతనం

అయిదవతనం అంటే అయిదు వన్నెలు కలిగి ఉండడం. ఇక్కడ “వన్నెలు” అంటే సుమంగళి యొక్క అలంకారాలు

ఆ అలంకారాలు ఏమనగా

1. మంగళసూత్రం

2. పసుపు

3. కుంకుమ

4. గాజులు

5. చెవ్వాకు


పంచగంగలు

1. గంగ

2. కృష్ణ

3. గోదావరి

4. తుంగభద్ర

5. కావేరి


షడ్గుణాలు


హిందూ సాంప్రదాయం ప్రకారం మనలోని 6 గుణాలుంటాయి.

అవి.

1. కామం

2. క్రోధం

3. లోభం

4. మోహం

5. మదం

6. మత్సరం


షట్చక్రాలు

మానవుని శరీరం లోని వెన్నుపూసలో ఉండే , దిగువ చెప్పిన ఆరు సూక్ష్మ స్థానాలను షట్చక్రాలు అంటారు

1. మూలాధార చక్రము

2. స్వాధిష్ఠాన చక్రము

3. మణిపూరక చక్రము

4. అనాహత చక్రము

5. విశుద్ధ చక్రము

6. ఆజ్ఞా చక్రము


షడ్విధ రసములు

షడ్విధ రసములు

1. ఉప్పు

2. పులుపు

3. కారం

4. తీపి

5. చేదు

6. వగరు


షడృతువులు

షడృతువులు - ఋతువులు 6

అవి

1. వసంత ఋతువు

2. గ్రీష్మ ఋతువు

3. వర్ష ఋతువు

4. శరదృతువు

5. హేమంత ఋతువు

6. శిశిర ఋతువు


సప్త గిరులు

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటెశ్వర స్వామి కొలువై ఉన్న తిరుపతిలో ఏడు కొండలు కలవు.వీటినే సప్త గిరులు అని అంటారు.

అవి.

1 శేషాద్రి

2 నీలాద్రి

3 గరుడాద్రి

4 అంజనాద్రి

5 వృషభాద్రి

6 నారాయణాద్రి

7 వేంకటాద్రి


సప్త గిరులు

సప్త స్వరాలు - మన భారతీయ సంగీతంలో 7 స్వరాలు కలవు.వీటినే సప్త స్వరాలు అని పిలుస్తారు.

అవి.

1. స = షడ్జమం (నెమలి క్రేంకారం)

2. రి = రిషభం (ఎద్దు రంకె)

3. గ = గాంధర్వం (మేక అరుపు)

4. మ = మధ్యమం (క్రౌంచపక్షి కూత)

5. ప = పంచమం (కోయిల కూత)

6. ధ = ధైవతం (గుర్రం సకిలింత)

7. ని = నిషాదం (ఏనుగు ఘీంకారం)


సప్త ద్వీపాలు

బ్రహ్మాండ పురాణములోను, మహాభారతంలోను, భాగవతం సప్త ద్వీపాలగురించి ప్రస్తావన ఉంది.

అవి .

1. జంబూద్వీపం - అగ్నీంద్రుడు

2. ప్లక్షద్వీపం - మేధాతిథి

3. శాల్మలీద్వీపం - వపుష్మంతుడు

4. కుశద్వీపం - జ్యోతిష్మంతుడు

5. క్రౌంచద్వీపం - ద్యుతిమంతుడు

6. శాకద్వీపం - హవ్యుడు

7. పుష్కరద్వీపం - సేవనుడు.


సప్త నదులు

సప్త నదులు

1. గంగ

2. యమున

3. సరస్వతి

4. గోదావరి

5. సింధు

6. నర్మద

7. కావేరి


సప్త అధొలోకములు

1. అతలము

2. వితలము

3. సుతలము

4. తలాతలము

5. రసాతలము

6. మహాతలము

7. పాతాళము


సప్త ఋషులు

1.వశిష్టుడు

2.ఆత్రి

3.గౌతముడు

4.కశ్యపుడు

5.భరద్వాజుడు

6.జమదగ్ని

7.విశ్వామిత్రుడు


పురాణాలలో అష్టదిగ్గజాలు

1. ఐరావతం

2. పుండరీకం

3. వామనం

4. కుముదం

5. అంజనం

6. పుష్పదంతం

7. సార్వభౌమం

8. సుప్రతీకం


అష్ట జన్మలు

1.దేవ జన్మ

2. మనుష్య జన్మ

3. రాక్షస జన్మ

4. పిచాచ జన్మ

5. పశు జన్మ

6. పక్షి జన్మ

7. జలజీవ జన్మ

8. కీటక జన్మ


అష్ట భార్యలు


శ్రీకృష్ణుడి ఎనిమిది మంది భార్యలును అష్ట భార్యలు లేదా అష్టమహిషులు అని అంటారు.

వారు

1. రుక్మిణి

2. సత్యభామ

3. జాంబవతి

4. మిత్రవింద

5. భద్ర

6. సుదంత

7. కాళింది

8. లక్షణ


ఆష్ట కష్టములు


ఆష్ట కష్టములు

1. ఋణము

2. యాచన

3. ముసలితనము

4. వ్యభిచారము

5. దొంగతనము

6. దారిద్ర్యము

7. రోగము

8. ఎంగిలి తిని బ్రతుకుట


అష్ట కర్మలు

1. స్నానము

2. సంధ్య

3. జపము

4. హూమము

5. స్వాధ్యాయము

6. దేవ పూజ

7. ఆతిధ్యము

8. వైశ్యదేవము


అష్టభాషలు.


1. సంస్కృతము

2. ప్రాకృతము

3. శౌరసేని

4. మాగధి

5. పైశాచి

6. సూళికోక్తి

7. అపభ్రంశము

8. ఆంధ్రము


నవధాన్యాలు

మన నిత్య జీవితంలో ఉపయోగించే 9 రకాల ధాన్యాలను నవ దాన్యాలు అని పిలుస్తారు అవి -


గోధుమలు యవలు పెసలు


శనగలు కందులు అలసందలు


నువ్వులు మినుములు ఉలవలు


నవ రత్నాలు

నవ రత్నాలు

1.మౌక్తికం = ముత్యము

2.మాణిక్యం = కెంపు

3.వైఢూర్యం = రత్నం

4.గోమేదికం = పసుపురంగులోని ఒక రత్నం

5.వజ్రం

6.విద్రుమం = పగడం

7.పుష్యరాగం = తెల్లటి మణి

8.మరకతం = పచ్చ

9.నీలమణి


నవధాతువులు


నవధాతువులు

1. బంగారం

2. వెండి

3.ఇత్తడి

4.సీసం

5.రాగి

6.తగరం

7.ఇనుము

8.కంచు

9.కాంతలోహం


నవబ్రహ్మలు

1.మరీచి

2.భరద్వాజుడు

3.అంగీరసుడు

4.పులస్త్యుడు

5.పులహుడు

6.క్రతువు

7.దక్షుడు

8.వసిష్టుడు

9.వామదేవుడు


నవ చక్రములు


మానవ శరీరంలో గల చక్రస్థానాలు.

1. మూలాధార చక్రము

2.స్వాధిష్టాన చక్రము

3.నాభి చక్రము

4.హృదయచక్రము

5.కంఠ చక్రము

6.ఘంటికాచక్రము

7.భ్రూవుచక్రము

8.బ్రహ్మరంధ్రము

9. గగన చక్రము


నవదుర్గలు


నవదుర్గలు

1 శైలపుత్రి దుర్గ

2 బ్రహ్మచారిణి దుర్గ

3 చంద్రఘంట దుర్గ

4 కూష్మాండ దుర్గ

5 స్కందమాత దుర్గ

6 కాత్యాయని దుర్గ

7 కాళరాత్రి దుర్గ

8 మహాగౌరి దుర్గ

9 సిద్ధిధాత్రి దుర్గ


దిశలు

1. తూర్పు

2. ఆగ్నేయం

3. దక్షిణం

4. నైఋతి

5. పడమర

6. వాయువ్యం

7. ఉత్తరం

8. ఈశాన్యం

9.భూమి (క్రింది ప్రక్క)

10.ఆకాశం (పైకి)


దశావతారాలు

1. మత్స్యావతారము

2. కూర్మావతారము

3. వరాహావతారము

4. నృసింహావతారము లేదా నరసింహావతారము

5. వామనావతారము

6. పరశురామావతారము

7. రామావతారము

8. కృష్ణావతారము

9. బుద్ధావతారము

10. కల్క్యావతారము


దశవిధ సంస్కారములు

1. వివాహము

2. గర్బాదానము

3.పుంసవనము

4.సీమంతము

5.జాతక కర్మ

6.నామకరణము

7.అన్న ప్రాశనము

8.చూడకర్మ

9.ఉపనయనము

10.సమావర్తనము


దశవిధ బలములు


1. విద్యా బలము

2.కులినితా బలము

3.స్నేహ బలము

4.బుద్ది బలము

5.ధన బలము

6.పరివార బలము

7.సత్య బలము

8. సామర్ద్య బలము

9. జ్ఞాన బలము

10. దైవ బలము

[25/04, 10:57 am] Sriram: _*అనంగ త్రయోదశి వ్రతం*_


*శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*


తేదీ    ... 25 - 04 - 2021,

  *_నేటి విశేషం_*

                    

  _*అనంగ త్రయోదశి వ్రతం*_

               

*దంపతుల మధ్య అనురాగాన్ని పెంచే*

*“అనంగ త్రయోదశి వ్రతం”*

భార్యా భర్తల మధ్య అనురాగాలను వృద్ధి చేయటంతో పాటు దాంపత్య జీవితాన్ని సుఖమయం చేసే *“అనంగ త్రయోదశి”* చైత్రమాసంలో శుక్లపక్ష త్రయోదశిని అనంగ త్రయోదశి అని మదన త్రయోదశి అని , మన్మద త్రయోదశి అని , కామదేవ త్రయోదశి అని పేర్లు కలవు. 

ప్రేమాధిదేవత అయిన కామదేవుడు అయిన మన్మధుడి పూజకు కేటాయించిన పర్వదినం. 

శాస్త్ర గ్రంధాలలో అనంగ త్రయోదశి గురించి దమనేన అనంగపూజ అని చెప్పడాన్ని బట్టి ఈ రోజు అనంగుడిని లేదా మన్మధుడిని దవనంతో పూజించాలని , 

ఈ రోజు మన్మధుడి పూజకు చాలా మంచి రోజు అని స్పష్టమవుతుంది.

భార్యభర్తల మధ్య అనురాగాన్ని పెంపొందింపజేసి , దాంపత్య జీవితంలో ఎటువంటి సమస్యలు రాకుండా చేసే వ్రతమే- *'అనంగత్రయోదశీ వ్రతం'.* ఈ వ్రతాన్ని చైత్రమాసంలో శుక్ల పక్ష త్రయోదశీ నాడు ఆచరించాలి.


•••••••••••••••••••••••••••••



 

ప్రాంజలి ప్రభ 24 -04 -2021
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
 

విధేయుడు:  మల్లాప్రగడ శ్రీదేవి  రామకృష్ణ
ముగ్గురమ్మల మూలపుటమ్మ.. చిన్న ... కవిత  ..(2 )
మందహాస మధురమ్మ - విందుచేయు వినయమ్మ
సుందరాన సుమసమ్మ - అందచేయు అదరమ్మ   
 

గుబ్బల మోపు అమ్మ - జబ్బలు మోపు అమ్మ
దబ్బల పెద్వి అమ్మ - మబ్బుల చూపు అమ్మ
 

నమ్రత చూపు నమ్మ - తామ్రము లేని అమ్మ
అమృత మిచ్చు అమ్మ - సుకృతమవ్వు అమ్మ
 

కైవల్య వరద అమ్మ - దైవము కొరకు అమ్మ
శ్రావ్యపు పలుకు అమ్మ - భవ్యపు వెలుగు అమ్మ 

మనంద సుందరమ్మ - సునంద కందరమ్మ
కనంద కాంతులమ్మ - అనంద ఆత్మయమ్మ
 

సౌఖ్యమిచ్చు మాయమ్మ - సఖ్యతిచ్చు మాయమ్మ
లౌఖ్య మిచ్చు మాయమ్మ - జోఖ్య మవ్వు మాయమ్మ   
 

మముకన్న మాయమ్మా - సుమమాల మాయమ్మ
సముఖాన మాయమ్మ - విముఖాన మాయమ్మ
(మూలం .. మూక పంచ శతి.. ఆర్య శతకమ్)
--(())--


 ఛందస్సు - వసు షట్పది
8 / 8 / 8 - 6 లేక 7 మాత్రలు
గాజు బతుకు యే
మోజు బతుకు యే
బూజు బతుకు యే ఎవరి కొరకు
అడిగినా ఫలం
అడితే   గళం
అడగకే గుణం ఎవరి కొరకు
ప్రణయ నాదమే
గణన వేదమే
గుణము శోధనే ఎవరి కొరకు
కళల యోగమే
కలల రాగమే
అలక మోహమే ఎవరి కొరకు
పూర్తి నమ్మకం
కీర్తి  అమ్మకం
స్ఫూర్తి విస్మయం ఎవరి కొరకు
కష్టం ఎవరికి
ఇష్టం ఎవరికి
నష్టం దేనికి ఎవరి కొరకు
మనకు సహాయం
తనకే సహనం
అనకే విహంగం ఎవరి కొరకు
మానధనుడు యే
గాణ వినుడు యే
మోనధనుడు యే ఎవరి కొరకు
పాప భీతి యే
శాప నీతి యే
కోప మేత యే ఎవరి కొరకు
కవి కాలము యే
కవి గాళము యే
కవి తాళము యే ఎవరి కొరకు
0000000



నేటి పద్య పుష్పాలు - ఇలవేల్పు ఆంజనేయ స్వామి జై
జై హనుమాన్ జై జై జై వీర హనుమాన్
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ
"మత్తకోకిల
----
అంజనీ వరనందనుండ సుహాటకాంచిత తేజుఁడా
అంజనీ మది సేవ భావ సమాన తేజపు భానుడా
రంజనాత్పర నమ్మి నందుకు కోర్కెతీర్చియు వీరుడా
యోజనాలనె లెక్క చేయక రామ కార్యపు సాధకా
 

ప్రజ్వరిల్లిన వాయు తేజము లంఖినీ మద మడ్చెనే
ప్రజ్ణ నందన మేఘ గర్జన దుష్ట హృద్యము ఖండనే
సజ్జనాలకు శిష్ట రక్షక ధర్మపోషక శోధకా
దుర్జనా లయ భంజనమ్ముయు దుష్ట శిక్షణ ధీరుడా
ఆజవంజము లేని నట్టియు ఆత్మ తేజపు శక్తుడా
 

ద్విజ రాజుల సంద్ర మంతయు ఏక పక్షిగ ఎగ్గిరే
పూజనీయుడు రామ భక్తుడు ఇష్ట కోర్కలు తీర్చెనే
వాజబీ కళ నిత్య సత్యపు సేవ భావపు రక్షకా
కంజపుష్ప సుబంధు శిష్య సుకామ్యదప్రద పావనీ
 

రంజనమ్ముగఁ జేసితీవయ రామకార్యమునంతయున్
భంజనమ్ము నొనర్చి రాక్షసబాధఁదీర్చినవయ్యవే
అంజలుల్ గొనుమయ్య దేవ ! మహాత్మ ! కావుము మమ్ములన్ !!!"
000000
----
"ఉత్పలమాలా..
-----
శ్రీపరదేవతే ! విమలరీతికటాక్షజవైభవప్రదే !
శ్రీపరదేవతే ! సుపదరీతివిభూషణరాజితే ! శుభే !
శ్రీపరదేవతే ! భయదరీతివిరోగనిహంత్రి ! చండికే !
శ్రీపరదేవతే ! సుగతిశేవధి ! త్రాహి..జయే ! నమోऽ స్తుతే !!!
(పేరి వెంకటసూర్యనారాయణ )
 

దానము చేసెదా ఇచట దాపరికమ్ముయు లేదు దేనికిన్
ఆనక విద్యలే సలిపి ఆదర మిచ్చెద మూడుడైననన్
మానస వీణ నే తలచి మార్గము తెల్పియు జూడవేడెదన్
వైనము సుస్వరంబునను వాణినె పిల్చెద బత్కు మారగన్
 

చిత్తము చూపియే కరణ చింతన తెల్పియు వేడ్కు సేయగన్
సత్యపు పల్కు లన్ నియమ సాధన చేసియు తెల్పు చుండుచున్
ముత్యపు చిప్పలో వెలుగు ముత్యము సర్వము మోహ పర్చుచున్
తత్వము నిత్యమై బతుకు తీవ్రత విశ్వము విద్య వేదమున్
(మల్లాప్రగడ రామకృష్ణ )
--(())--
 

సోయగములు.. 4నుండి 6
 జానకి రాముని కళ్యాణం
మునులు ఋషులు చేరె
చూదము రారండి జనులార
వేదములను చదువు
కారణ జన్మలపెళ్ళియు
కరుణ దయయు మెండు
చూదము కరుణ సోయగములే
 సకల గుణాభిరాముని పెళ్లి
రకరకాల పూల
గుత్తులు జిలుగు వెలుగుల లో
చిత్త మంత చూపె
జానకి పెళ్లికూతురు అయ్యె
మనకు పిల్పు వచ్చె
చూదము కరుణ సోయగములే
 అఖిల భువనమ్ములు ఏలు
సుఖము పంచు రామ
పరమ పావని సీత దేవితో
వరద రామ పెళ్ళి
మంగళ సూత్రమ్ము కట్టేను
యొగ మాయ వీడె
సన్నాయి మేళాలు మ్రోగే ను
ఉన్న వారు సంత
సమ్మును కరుణ సోయగములే
విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ
)))))0(((((((
 

పురంజనోపాఖ్యానం:
భారతీయ సంప్రదాయంలో ఋషులు చెప్పేతీరు చాలా గొప్పగా ఉంటుంది. తత్త్వబోధ చేసేటప్పుడు కూర్చోబెట్టి తత్త్వమును మాత్రమే చెబుతాము అంటే చాలామంది అదేమిటో చాలా భయంకరంగా వుంది – ఇదంతా తమకు అందదని అంటారు. అందుకని ఋషులు బోధ చేసేటప్పుడు ఆ తత్త్వమును కథతో కలిపేస్తారు. నారదుడు ప్రాచీనబర్హి అనే మహారాజుకి ఈ పురంజనోపాఖ్యానమును వివరించాడు.
ప్రాచీన బర్హి కేవలము ఈ శరీరమే శాశ్వతము అనుకోని, తాను భూమిమీద శాశ్వతంగా ఉండి పోతాననుకొని తానూ ఎటువంటి మార్గములో సంపాదించినా తనను అడిగేవారు లేరు అనుకోని ఒక రకమయిన అజ్ఞానంలో జీవితమును గడిపేస్తుంటే చాలా తొందరగా అతనికి జ్ఞానోదయం కల్పించడం కోసం మహాత్ముడయిన నారదుడు ప్రాచీన బర్హికి చెప్పిన కథకే ‘పురంజనోపాఖ్యానం’ అని పేరు.
 

పూర్వకాలంలో ‘పురంజనుడు’ అనబడే రాజు ఉండేవాడు. ఆయన తాను నివసించడానికి యోగ్యమయిన కోట, తాను నివసించడానికి యోగ్యమయిన రాజ్యమును అన్వేషిస్తూ బ్రహ్మాండములు అన్నిటా తిరిగాడు. కానీ ఆయనకు ఏదీ నచ్చలేదు. చిట్టచివరకు హిమవత్పర్వతపు దక్షిణ కొసను ఉన్నటువంటి ఒక దుర్గమును చూశాడు. ‘ఇది చాలా బాగుంది. నేను ఇందులో ప్రవేశిస్తాను’ అని అనుకున్నాడు. అపుడు అందులోనుంచి చాలా అందమయిన యౌవనము అంకురిస్తున్న ఒక స్త్రీ బయటకు వచ్చింది. ఆవిడ బయటకు వస్తుంటే ఆవిడ వెనుక అయిదు తలల పాము ఒకటి బయటకు వచ్చింది. ఆవిడ పక్కన పదకొండుమంది కాపలా కాసే భటులు వచ్చారు. ఒక్కొక్కరి వెనుక నూర్గురు చొప్పున సైనికులు ఉన్నారు. ఆవిడను చూసి పురంజనుడు ‘నీవు ఎవరు?’ అని ప్రశ్నించాడు. పురంజనుడు తాను ఒక్కడినే ఉన్నానని తనతో ఎవరూ లేరని అనుకుంటూ ఉంటాడు. కానీ ఆయన వెనక ‘అవిజ్ఞాతుడు’ అనబడే మిత్రుడు ఉంటాడు. అవిజ్ఞాతుడు అనగా తెలియబడని వాడు అని అర్థం. ఆయన ఎప్పుడూ పురంజనుడి వెనకాతలే ఉంటాడు. కానీ పురంజనుడు ఎప్పుడూ వెనక్కి తిరిగి చూడడు. అటువంటి మిత్రుడు ఉండగా పురంజనుడు ఆ కాంతను ‘నీవు ఎవరు’ అని అడిగాడు.
 

అపుడు ఆమె ‘ఏమో నాకూ తెలియదు. నా తల్లిదండ్రులెవరో నాకు తెలియదు. నేను పుట్టి బుద్ధి ఎరిగి ఇక్కడే వున్నాను. ఈ కోటలో ఉంటూ ఉంటాను. నువ్వు మంచి యౌవనంలో ఉన్నావు. నా పేరు ‘పురంజని’, నీపేరు పురంజనుడు. అందుకని నీవు ఈ కోటలోనికి రా. వస్తే మనిద్దరం మానుషమయినటువంటి భోగములను అనుభవిద్దాము. నూరు సంవత్సరములు నీవు ఇందులో ఉందువు గాని. ఈ కోటకు ఒక గమ్మత్తు ఉంది. ఈ కోటకు తూర్పు దిక్కుగా అయిదు ద్వారములు ఉంటాయి. ఈ అయిదు ద్వారముల నుండి బయటకు వెళ్ళవచ్చు. కానీ బయటకు వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కోట ద్వారంలోంచి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క మిత్రుడినే తీసుకువెళ్ళాలి. ఆ మిత్రులకు పేర్లు ఉంటాయి. వాళ్ళతోనే బయటకు వెళ్ళాలి. అలా ఆ ద్వారంలోంచి బయటకు వెడితే ఒక భూమి చేరతావు. ఆ దేశంలో నీవు విహరించవచ్చు మరల వెనక్కి వచ్చేయవచ్చు’ అని చెప్పింది.
ఇటువంటి స్థితిలో మెల్లమెల్లగా ఇలా జరుగుతూ వుంటే ‘చండవేగుడు’ అనబడే ఒక గంధర్వుడు చూశాడు. ఈకోటను స్వాధీనం చేసుకోవాలి అని అనుకున్నాడు. ఆయన దగ్గర మూడువందల అరవై మంది మగసైన్యం, మూడు వందల మంది ఆడ సైన్యం ఉన్నారు. ఆడసైన్యం నల్లగా, మగ సైన్యం తెల్లగా ఉంటారు. అనగా రాత్రులు నలుపు, పగళ్ళు తెలుపు. వీళ్ళే శుక్లపక్ష కృష్ణ పక్షములుగా ఉంటారు. వీళ్ళు వచ్చి కోటను బద్దలు గొడదామని చూశారు. ఈలోగా వీళ్ళతో పాటు ‘కాలకన్య’(కాలస్వరూపమయిన ఈశ్వరుడు) కలిసింది. ఈ కాలకన్య వివాహం చేసుకోవాలి అనుకుంది.
 

ఆవిడను ఎవరూ వివాహం చేసుకోవడానికి ఇష్ట పడలేదు. బ్రహ్మజ్ఞాని కదా ఈయనకు ఏమి బాధ ఉంటుందని ఒకరోజున నారదుడు కనపడితే ఆయనను తనను పెళ్ళి చేసుకొన వలసిందని అడిగింది. అపుడు ఆయన ‘నీవు నాకు అక్కర్లేదు, చేసుకోను’ అన్నాడు. కాలకన్య కాబట్టి ఆమె మృత్యు రూపమై శరీరమును పడగొట్టేయగలదు.కానీ నారదుడిని ఏమీ చేయలేదు. బ్రహ్మజ్ఞానం ఉన్నవాడిని కాలం ఏమీ చేయలేదు. అందుకని ఆమె నారదుడికి ఒక శాపం ఇచ్చింది. ‘నువ్వు ఎక్కడా స్థిరంగా ఉండకుండా మూడు లోకములలో తిరుగుతూ ఉండు’ అని. అపుడు నారదుడు ‘నాకు బెంగలేదు. నామం చెప్పుకుంటూ మూడు లోకములలోనూ తిరుగుతూ ఉంటాను. కానీ ఒకమాట చెప్తున్నాను విను. నిన్ను ఎవ్వరూ పెళ్ళిచేసుకోరు’ అన్నాడు.
 

తరువాత కాలకన్య యవనుల నాయకుడు అయిన ‘భయుడి’దగ్గరకు వెళ్ళి తనను పెళ్ళి చేసుకోమంది. అతడు నీవు నా చెల్లెలు వంటి దానివి. నేను నిన్ను పెళ్ళి చేసుకోకూడదు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. వారి పేరు ‘ప్రజ్వరుడు’ నీవూ వాడు కలిసి ఒక పని చేస్తూ ఉండండి. ఆ పనిపేరు ‘దేవగుప్తము’ చాలా రహస్యం. నీకు భర్త దొరకలేదని కదా నీవు బాధపడుతున్నావు. ఈ వేళ నుంచి ఊళ్ళో ఉన్న భర్తలందరూ నీకు భర్తలే. అలా నీకు వరం ఇస్తున్నా. నువ్వు భార్యవు అయిపోయినట్లు వాడికి తెలియదు. నీవు వాడిని ఎప్పుడు వెళ్ళి పట్టుకునే అప్పుడే వాడు నీకు భర్త అయిపోతాడు. నీవు ఎప్పుడు వెళ్ళి పట్టుకుంటావో వాడికి తెలియదు కాబట్టి నీపేరు ‘జర’ అని చెప్పాడు. ఇక్కడ జర అంటే వృద్ధాప్యము. వ్యక్తులు తమకు ముసలితనం వచ్చిందని ఒప్పుకోరు. కానీ జర వచ్చి పట్టేసింది. ఆమె వెనకాతలే భయుడు వస్తాడు. భయుడి వెనకాల యవనుల సైన్యం వస్తుంది. యవనులు రావడం అంటే బెంగలు, భయములు, వ్రణములు, రోగములు ఇవన్నీ బయలుదేరి పోవడం! తాను చచ్చిపోతానేమో నాన్న బెంగ మొదలవుతుంది. ఆఖరున భయుని తమ్ముడైన ప్రజ్వరుడు వస్తాడు. అనగా పెద్ద జ్వరం/పెద్ద జబ్బు. వాడు సంధి బంధములు విడగొట్టేస్తాడు. అలా ఊడగొట్టేసిన తరువాత ఈ పురంజనుడు లోపల పడుకుని ఇంకా భార్యనే తలుచుకుంటూ, సేవకులు తెచ్చినవి తింటూ, ఇందులో ఉండిపోతే బావుండునని అంటూ ఉంటాడు. అంటే తమ భార్యను తలుచుకుంటూ.
0

: పంచభూతాలలో పృధివికి మాత్రమే దైవత్వం, మాతృత్వం రెండూ ఆపాదించారు శాస్త్రకారులు. అగ్ని దేవుడు, వాయు దేవుడు, వరుణ దేవుడు, ఆకాశరాజు అంటాం... ఒక్క పృధివిని మాత్రమే భూమాత అంటాం. భూదేవి లాంటి విశేషణాలు మిగతా భూతాలకు లేవు. అందుకే ఆమెకు నిత్యం గౌరవంగా వందనాలు సమర్పించాలి. ఉదయాన్నే నిద్ర లేస్తూనే మన పాదాలను భూమి మీద మోపుతూ, ‘అమ్మా! మేం నీ గుండెల మీద నడుస్తున్నాం. మా పాదాలతో నిన్ను బాధిస్తున్నాం. మమ్ము క్షమించు తల్లీ’’ అని ప్రార్థిస్తాం. మహోత్కృష్టమైన భూమి గురించి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు పురాణాలలో గోచరిస్తాయి.
ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు, ఓషధుల నుంచి అన్నం, పునరుత్పత్తి... ఇది సృష్టిక్రమం అని వేదాలు చెబుతున్నాయి. ఓషధులకు భూమి ప్రధానమైనది. ‘భూమి’ శబ్దానికి అన్నిటినీ భరించగలిగేది అని ఒక అర్థం ఉంది. అచల, అనంత... ఒక్కో కారణంగా ఒక్కో పేరు వచ్చింది. భూమి తాను కదులుతున్నప్పటికీ భూమి మీద నివసించే ప్రాణులు, ఇతర వస్తువులను నిశ్చలంగా ఉంచే శక్తి కలిగి ఉంది. అంటే కంపం లేకుండా ఉంచుతుందన్నమాట. అందుకే భూమాతను అచల అంటారు.
ఎంత బరువువైనా భరించగల శక్తి భూమికి మాత్రమే ఉంది. సహనానికి మారుపేరు పుడమి. పిల్లలను కనిపెంచడానికి తల్లిదండ్రులకున్నంత సహనం భూమాతకు ఉంది. అంత సహనం కలిగిన భూమాత తన కుమారుడి వల్ల ప్రజలకు చేటు జరుగుతోందని గ్రహించి, తన కుమారుడని కూడా చూడకుండా, నరకాసురుడిని సంహరించింది.
మాతృత్వం...
పంచభూతాలలో భూమికి మాత్రమే దైవత్వం, మాతృత్వం అనే రెండు లక్షణాలు ఉన్నాయి. వేదాలు మాతృదేవోభవ అని చెప్పిన వాక్యం భూమికి సైతం వర్తిస్తుందని పండితులు చెబుతున్నారు. భూమిని దైవంగా భావించి గౌరవించాలి. హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో ముంచినప్పుడు విష్ణుమూర్తి ఆ తల్లిని బయటకు తీసి, భూభారాన్ని ఆయన స్వయంగా మోశాడు. భరించే వాడు భర్త కనుక, భూదేవికి విష్ణుమూర్తి భర్త అయ్యాడు.
అనేక నామాలు...
భూమి, భూదేవి, భూమా దేవి, భూమి దేవి, వసుంధర, వసుధ, వైష్ణవి, కాశ్యపి, ఉర్వి, హిరణ్యం, వసుమతి... ఈ పదాలతో నేలతల్లిని పిలుస్తాం. విష్ణుమూర్తి అవతారమైన వరాహావతారంలో వరాహుని భార్య భూమి. లక్ష్మీదేవి రెండు అంశలలో భూదేవి ఒక అంశ. ఆమె నిరంతరం నారాయణునితోనే దర్శనమిస్తుంది. కశ్యప ప్రజాపతి కుమార్తె భూదేవి. అందుకే కాశ్యపి అని పేరు.
వీరంతా భూగర్భ ఉద్భవులే...
భూమాత అనేకమంది దేవతామూర్తులకు జన్మనిచ్చింది. సీతలాగే పద్మావతీదేవి కూడా ఆకాశరాజు పొలం దున్నుతుండగా దొరుకుతుంది. ఆండాళ్‌ కూడా పెరియాళ్వార్‌ నాటిన తులసి చెట్టు కింద దొరుకుతుంది.
పంచభూతాలలో మొట్టమొదటగా నమస్కరించేది భూమాతనే. పృథివ్యాపస్తేజో వాయురాకాశః... అని పంచభూతాలను వరుసక్రమంలో చెబుతాం. దేవునికి అర్చించే పుష్పాల జన్మస్థానం భూమి. కుసుమాలు భూమి నుండి ఉద్భవిస్తున్నప్పుడే వాటికి సువాసన సమకూరుతుంది. అంటే భూమి విత్తనంతో సమ్మేళనం చెందుతున్నప్పుడే ఈ ఘుమఘుమలు సమకూరతాయి. ఈ కారణంగానే భూమిని ‘గంధవతీ పృథివీ’ అంటారు. అటువంటి భూమిని సంక్షోభానికి, తాపానికి గురి చేయకుండా ఉండటం ఆమె బిడ్డలుగా మనందరి బాధ్యత.
రూపవిలాసం... భూదేవి చతుర్భుజి. ఒక చేతిలో దానిమ్మ, ఒక చేతిలో జలపాత్ర, ఒక చేతిలో మూలికలతో నిండిన పాత్ర, మరో చేతిలో కూరలతో దర్శనమిస్తుంది. రెండు చేతులలో కుడిచేతిలో నీలోత్పలం (కుముదం లేదా ఉత్పలం, రేకలువ), ఎడమ హస్తం అభయముద్రతోను సాక్షాత్కరిస్తుంది.
అభయహస్తాన్నే లోలహస్త ముద్ర అని కూడా అంటారు. పృథివికి ఆఘ్రాణ శక్తి ఉంది. అందుకే పృథివిని నాసిక భాగంతో పోలుస్తారు. హస్తంలో పృథివిని ఉంగరం వేలుగా గణిస్తారు. పృధ్విని కేంద్ర స్థానంగాను, నిశ్చలత్వానికి ప్రతీకగాను శాస్త్రం చెబుతోంది. పృధ్వితో జలం కలిస్తే తియ్యటి రుచి ఏర్పడుతుంది. పృథివితో అగ్ని కలిస్తే చేదు రుచి ఉద్భవిస్తుంది.

--(())--


జీవితం కొందరికి వడ్డించిన విస్తరిగా అనిపిస్తుంది. ధనమే జీవితానికి పరమావధిగా భావిస్తుంటారు. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉంటే, లోకమంతా రంగులమయంగా కనిపిస్తుంది. డబ్బు అలా విసిరేస్తే కొండమీది కోతి అయినా ఇలా దిగివస్తుందని తలపోస్తారు. దిలాసాగా జీవితం గడిపేస్తుంటారు. ఏదో అనుకోని సంఘటన... వూహించని జీవన ఉత్పాతం... సంభవిస్తుంది. అనుకోని కష్టాలు ఎదురవుతాయి. అసలలాంటి బాధలు ఉంటాయని కూడా ఆలోచించి ఉండం. ఎలా ఆ కష్టాల నుంచి బయటపడటం అని... అప్పుడు.. అప్పుడు ఆలోచిస్తాం. మనిషి హాయిగా జీవించేయడానికి బాసటగా ఉన్నవారిని అకస్మాత్తుగా కోల్పోవచ్చు. కలలోనైనా వూహించని సంఘటన జరిగి సర్వస్వాన్నీ పోగొట్టుకోవచ్చు. అప్పుడిక కష్టాలన్నీ మనలను వెన్నంటే ఉంటాయి. నడి సముద్రంలో చిక్కుకొన్న మనిషిలా ఆశలు కొలబోతాయి. ఒడ్డున పడటం మన వీలు కాదని అనుకొంటున్న సమయంలో. అప్పుడు మన మనసులో శతకోటి ఉపాయాలు మెదులుతాయి. ఏదో ఒక యుక్తి వల్ల జీవితంలో ఆలంబన లభిస్తుంది. ఆ కష్టసమయంలో మనం చేసే ప్రయత్నమే మన అదృష్టంగా మారుతుంది. ఆ అదృష్టమే కష్టాల కడలినుంచి తీరానికి చేరుస్తుంది.

ఆ కష్టం సంభవించే దాకా మనిషికి తాను అలాంటి ప్రయత్నం చేయగలనని తెలియదు. కష్టమే మన ప్రయత్నానికి వూతమై అదృష్టవంతుణ్ని చేస్తుంది. ప్రారంభంలో మనిషి, అన్ని చతుష్పాద (నాలుగు కాళ్ల) జంతువుల్లాగానే భూమిపై తిరిగేవాడని మానవ ఆవిర్భావ సిద్ధాంతాలు తెలుపుతున్నాయి. కష్టాలను దూరం చేసుకొనే ప్రయత్నంలోనే సుఖాల అన్వేషణ చేశాం. నేడు సుఖంగా మనుగడ సాగించగలిగే సౌకర్యాలను
సమకూర్చుకొని అదృష్టవంతులమయ్యాం ! మనిషికి కష్టాలే లేకపోతే సుఖాలను శోధించే అవసరమే ఉండేది కాదు. శారీరక, ఆర్థిక, మానసిక, సామాజిక కష్టాల బారిన పడినంత మాత్రాన మనిషి నిరుత్సాహపడకూడదు. మనిషిలోని ఆలోచన, ఉద్వేగాలు ఎంతో గొప్పవి ఎప్పుడూ కష్టాలకు భయపడుతూ బతకడం మానవనైజం కాదు

మనిషి తనకు కలిగిన కష్టాలను దూరం చేసుకొనే అశక్తుడిగా మారినా వెరవడు. తన సృష్టి ఎలా జరిగిందో తెలుసుకొని అందుకు కారకుడైన అంతర్యామిని గ్రహించగలిగాడు. తన బాధలను, తాను తీర్చుకోలేని కష్టాలను గ్రహించగలిగాడు. తన బాధలను, తాను తీర్చుకోలేని కష్టాలను దైవానికి విన్నవించుకొనేందుకు ప్రార్థనను సృజించగలిగి మహా అదృష్టవంతుడయ్యాడు తనను అన్ని విధాలా కష్టాలనుంచి కాపాడగలిగే దైవం ఉన్నాడనే భావన మనిషికి ఎనలేని ధైర్యాన్ని ఇస్తుంది.. కష్టాల్లోనూ, అన్నిరకాల బాధల్లోనూ దైవాన్ని శరణువేడి ప్రార్థిస్తే మనిషికి లభించే ధైర్యం మహనీయమైనది. ఆ ధైర్యమే మనిషికి శ్రీరామరక్ష, చీకట్లు ఆవహించగానే ఆ .కష్టాన్ని తీర్చుకోవడానికి వెలుగులను సృష్టించుకుని అదృష్టవంతుడయ్యాడు. ప్రయత్నం చేస్తే చెడుకాలం తొలగి మంచికాలం వస్తుందని తెలుసుకొన్నాడు. సృష్టినీ సృష్టికర్తనూ తెలుసుకోగలిగాడు. ఒంటరిగా జీవించే కష్టాలకు దూరం కావడం కోసం సమాజాన్ని

సృష్టించుకొన్నాడు. ద్వేషం కష్టాలకు కారణమని గ్రహించి ప్రేమించడంలోని గొప్పతనాన్ని తెలుసుకొని అదృష్టవంతుడయ్యాడు ప్రేమించి ప్రేమను పొందడంలో దైవత్వం ఉందని తెలుసుకొన్నాడు. ప్రేమవల్ల త్యాగం, త్యాగంవల్ల నిర్మలత్వం, నిర్మలత్వం వల్ల దైవత్వం సిద్ధిస్తుందని గ్రహించాడు. అన్నింటికీ ఆ దైవమే ఉన్నాడనే భావననూసృజించుకొని మనిషి మహా అద్భుతమైన ధైర్యవంతుడయ్యాడు. ధైర్యం మనిషిని శక్తిమంతుడిని చేసే అదృష్టానిస్తుంది. కష్టకాలాల్లో ఎంతటి బాధలనైనా ఎదుర్కొని ముందుకు సాగే శక్తిని దైవబలం మనిషికిస్తుంది. జటిలమైన సమస్యలనైనా పరిష్కరించుకోగలిగే యుక్తి మనిషికి దైవం ఉన్నాడనే భావనవల్ల కలుగుతుంది

కష్టాలతో ఎంత పోరాడగలిగితే అంత బలం మనిషికి లభిస్తుంది. కష్టాలే మనిషి విజయానికి సోపానాలు మనిషిలోని నిద్రాణమైన భావం, యుక్తి, శక్తి- కష్టాలు సంభవించినప్పుడే ఉత్తేజితమవుతాయి. అలాంటి పరిస్థితుల్లోనే మనిషి కొత్త జీవితాన్ని ఆవిష్కరించుకోగలుగుతాడు. ఎంతో అదృష్టవంతుడవుతాడు. అందుకే కష్టాలకు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే... కష్టాలే అదృష్టాలు