Tuesday, 6 April 2021

stories


 
 
 
*ఏయే పనులకు ఏయే స్తోత్రాలు పఠిస్తే బాగుంటుంది ?*


*1. విష్ణు..లలితా.. సహస్రనామ స్తోత్రాలు:*

 కుటుంబసభ్యుల మధ్య వున్న విభేదాలు, తగాదాలు, ఘర్షణలు తొలగిపోయి... అందరూ కలిసి మెలిసి సత్సంబంధాలుగా ఏర్పడేందుకు "విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాల"ను నిత్యం పారాయణం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. 

విష్ణు సహస్రనామాన్ని ప్రతిరోజూ పఠిస్తే.. ఏ సమస్యలు తలెత్తవు. పైగా అన్ని పనులలో విజయాలను సాధిస్తారు.

*2.కనకధారా స్తోత్రం:*

"కనకధార స్తోత్రం"ను ప్రతిరోజు చదివితే నిర్వహించుకున్న వ్యాపారంలో మంచి అభివృద్ధి లభించడంతోపాటు... నూతనంగా ఏర్పాటు చేసుకున్న వ్యాపారాలు కూడా మంచి విజయాలు సాధిస్తాయి.

*3.సూర్యాష్టకం.. ఆదిత్య హృదయం:*

ప్రతిరోజూ "సూర్యాష్టకం, ఆదిత్య హృదయం" చదువుతూ.. "సూర్యధ్యానం" చేస్తే.. ఉద్యోగాలు చేస్తున్నవారికి మంచి పురోభివృద్ధి లభిస్తుంది. అలాగే ఉద్యోగాలు లేనివారిని మంచి అవకాశాలతోపాటు ఫలితాలు కూడా లభిస్తాయి.

*4.‘లక్ష్మీ అష్టోత్ర శతనామావళి:*

లక్ష్మీ అష్టోత్తర శతనామావళి"ని నిత్యం పారాయణం చేస్తే పిల్లలకు..మంచి సద్గుణాలతో కలిగినవారు వివాహ సంబంధాలు తీసుకువస్తారు. అలాగే పెళ్లి పనులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా జరుగుతాయి.

*5.నవగ్రహ స్తోత్రం:*

నవగ్రహ స్తోత్రా"న్ని ప్రతిరోజు చదువుకుంటే.. ఋణబాధల నుంచి ఇబ్బందులు పడుతున్నవారు తక్షణమే వాటి నుంచి విముక్తి పొందుతారు. అంతేకాకుండా.. ధనానికి సంబంధించిన ఎటువంటి ఇబ్బందులు ఇక తలెత్తవు.

*6. హాయగ్రీవ స్తోత్రం..సరస్వతి ద్వాదశ నామాలు:*

విద్యార్థులు మంచి విద్యను పొందడానికి, చదువులో ఏకాగ్రతను పెంచుకోవడానికి ప్రతిరోజూ "హయగ్రీవ స్తోత్రం", "సరస్వతి ద్వాదశ నామాల"ను పఠించాలి.

*7. గోపాల స్తోత్రం :*

సంతానం లేని వారు ప్రతిరోజు "గోపాల స్తోత్రం"ను పఠిస్తే.. మంచి ఫలితం లభిస్తుందని... అలాగే గర్భంతో వున్న వారు..ఇదే స్తోత్రాన్ని ప్రతిరోజు పఠిస్తే ప్రసవం సుఖంగా అవుతుందని పండితులు, శాస్త్రాన్ని ఆధారంగా చెబుతున్నారు.

 [30/03, 1:03 pm] +91 79936 83723: *బ్రేకింగ్ న్యూస్*

    

*నగర పరిధి లో హెల్మెట్ లేకుండా ప్రయాణించ వచ్చును ***"

సాగర్ కుమార్ జైన్ పిటిషన్ పరిశీలించిన కోర్టు, 

ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న హెల్మెట్ తనిఖీని కోర్టు తిరస్కరించింది.


 మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో డ్రైవర్‌కు హెల్మెట్ వాడకం తప్పనిసరి కాదు. మీ రక్షణ మీ ఇష్టం.


రాష్ట్ర రహదారి లేదా జిల్లా రహదారి హోదా పొందిన రహదారిపై హెల్మెట్ ధరించడం అయితే తప్పనిసరి.


ఇక మీదట ఎవరైనా ట్రాఫిక్  లేదా ఇతర పోలీసులు ' మీరు హెల్మెట్ ఎందుకు ధరించలేదు అని మిమ్మల్ని, అడిగితే.. నేను 

మునిసిపల్ కార్పొరేషన్,  పంచాయతీ సమితి,  నగర పరిధిలోనే ఉన్నానని మీరు వారికి చెప్పవచ్చును....                  


ఈ విషయం అందరికీ తెలిస్తే సంతోషంగా ఉంటుంది.               


నగరం వెలుపల 15 కిలోమీటర్ల లోపు హెల్మెట్ వాడకున్నా మిమ్మల్ని అడగడానికి లేదు.


ఈ సందేశాన్ని సాధ్యమైనంత వరకు భాగస్వామ్యం చేయండి, 


తద్వారా ప్రజలందరికీ కూడా తెలియచేయండి... !!


  ⚖

దేవేంద్ర ప్రతాప్ సింగ్ చౌహాన్ న్యాయవాది

రాష్ట్ర అధ్యక్షుడు

ఉమ్మడి న్యాయవాది సమాఖ్య

9452680100

8299683093


*పవర్ ఆఫ్ ఆర్టీఐ.*

[03/04, 3:10 pm] +91 90526 93310: 🐊 *నాన్న* కూ *కన్నీళ్లు* ఉంటాయి👨‍👩‍👧‍👦


🐊 *నాన్న* మనకోసం ఏం చేశాడో*

ఏం *కోల్పో* యాడో  మనకు తెలియదు..!*


🐊 *జీవితాంతం* పిల్లల కోసం *తపిస్తూ, వారి అభివృద్ధి* కోసం పాటుపడే వ్యక్తి *తండ్రి* తన పిల్లల కోసం జీవితంలో ఎన్నో  కోల్పోతాడు. *నాన్న* మన కోసం ఏం చేశాడో మనకు తెలియదు. ఎన్ని కష్టాలు పడ్డాడో తెలియదు.

 

🐊 ఎందుకంటే..  *నాన్న* ఎవరికీ చెప్పడు. *పిల్లలకి, భార్య* కి అసలు చెప్పడు. *అమ్మ* లా *ప్రేమ* ను బయటికి చూపించడం *నాన్న* కు రాదు. *నాన్న* ఇంటికి ఎప్పుడో వస్తాడు, వెళ్లిపోతాడు. బిజీగా ఉన్న నాన్న రాత్రిపూట ఇంటికి వచ్చి మంచం మీద ఎదుగుతున్న పిల్లల్ని చూస్తుంటాడు.*

 

🐊 *ఎప్పుడూ పనేనా* ? కాస్త ఇంటి దగ్గర ఉండొచ్చుగా..’ అని చిరాకు పడుతున్న అమ్మ మాటలు వింటుంటాం. పిల్లలు కూడా నాన్నను మిస్‌ అవుతుంటారు. నిజానికి నాన్నను నాన్నే మిస్‌ అవుతుంటాడు. *పెళ్లై, పిల్లలు* పుట్టగానే *నాన్న జీవితం నాన్న చేతుల్లో ఉండదు.*

 

🐊 మనందరి కోసం నాన్న రాత్రి, పగలు పనిచేయాలి. చదువులు, సమస్యలు, బంధువులు, పండగలు, బర్త్‌డేలు, ఆసుపత్రులు.. వీటన్నింటితో నాన్న నలిగిపోతుంటాడు. ఆయనకు ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వృద్ధాప్యం వల్ల అని పిల్లలు అనుకుంటారు. 

🐊 *వృద్ధాప్యం* ఇంకా రాలేదు.. మీ కోసం అనుక్షణం కరిగిపోతూ, కాలిపోతున్న నాన్నకి లోపల ఆరోగ్యం ఎంత దెబ్బ తింటోందో తెలియదు. నాన్న *డాక్టర్‌* ను కలిసిన విషయం కూడా మనకు తెలియదు. ఎందుకంటే.. ఆ రిపోర్ట్‌లు తీసుకుని ఇంటికి రాడు.*

 

🐊 తన *పిల్ల* లు గొప్ప వాళ్లు అవుతారని *నాన్న* కు విపరీతమైన నమ్మకం. అందుకే అప్పులు చేసి చదివిస్తాడు. *ఆఫీసుకు సెలవు పెట్టి, స్కూల్‌లో పిల్లల సీటు కోసం లైన్‌లో నిల్చుంటాడు.* మీరు పరీక్ష రాస్తుంటే బయట రోడ్డు పక్కన ఎండలో నిల్చుని ఉంటాడు. పిల్లలు ఏదో సాధించేస్తారని *ఆశ.*

 

🐊 *ఆస్తులు అమ్మేసి కూతురి పెళ్లి ఘనంగా* చేస్తాడు. ఎక్కడ, ఎన్ని *సంతకాలు* పెడతాడో మనకు తెలియదు. కొన్ని వందలసార్లు *అమ్మ* ఏడ్వడం చూశాం కానీ, *నాన్న ఏడ్వడం* ఎప్పుడైనా చూశారా? *నాన్న* కూడా *ఏడుస్తాడు*.😰 కానీ మీ ముందు *ఏడ్వడం* ఆయనకు ఇష్టం ఉండదు. ఎక్కడో ఒంటరిగా కూర్చుని *ఏడుస్తాడు.**

 

🐊 పిల్లలు పెద్దయి, ఏదో పని చేసుకునే సమయానికి.. *నాన్న* అన్నీ అమ్ముకుని, అంతా ఆరిపోయి, అంతంత ఆరోగ్యంతో మిగిలిపోతాడు. అప్పుడే *పిల్లలు నాన్నకు ఎదురు చెప్పడం* మొదలు పెడతారు. ‘ఇన్నాళ్లూ వీళ్ల కోసం ఇంత చేశానా?, *నేను ఎవరి కోసం బతికాను*?’ అనే ఆలోచనలు నాన్నకు వస్తాయి. *నా కోసం నేను* ఏదీ దాచుకోలేదే.... అనుకుంటాడు.*

 

🐊 నిజానికి *నేను* అనే ఆలోచన అప్పటి వరకు నాన్నకు తెలియదు. ఉన్న రెండు ఎకరాలు నాన్న పోగొట్టాడు అనుకుంటాం. ఎందుకంటే అమ్మ అలాగే చెబుతుంది కాబట్టి. ప్రతి కొడుకు ఏదో ఒక సమయంలో *నాన్న* ను ఏడిపిస్తాడు. నాన్న గుండెలపై తంతాడు. అప్పటికి ఏడ్వడానికి నాన్నకు కన్నీళ్లు కూడా మిగలవు. అవి ఎప్పుడో ఆవిరైపోయుంటాయి.*

 

 🐊 కొడుకు ఎంత మంచివాడు *ప్రయోజకుడైతే* తండ్రి అంతే ఎక్కువ బాధ్యతగా సమస్యలు ఎదుర్కొంటాడు. అతడికి ఎంత సక్సెస్‌ వస్తే.... అంత ఎక్కువగా *తండ్రి* తపించి వుంటాడు..ఇది నిజం. మీకు కొడుకు పుడితే వాడి స్నేహితుల పేర్లు గుర్తుంటాయి. బర్త్‌డే వస్తే, పిల్లల్ని ఆహ్వానిస్తాం. కానీ, మీ *నాన్న* స్నేహితులు ఎవరో మీకు తెలియదు. అసలు మీ *నాన్న* పుట్టిన రోజు కూడా మీకు గుర్తుండదు. ఎందుకంటే మీ పిల్లలే మీ భవిష్యత్తని ఫీల్‌ అవుతారు. నాన్న మీ భవిష్యత్తు కాదు. కానీ నాన్నకు మీరే భవిష్యత్తు.

 🐊 *,పిల్లల* కోసం తను *రిస్క్‌* తీసుకోలేక, ధైర్యం సరిపోక మీ నాన్న తన *కెరీర్‌* ను వదిలేసు కుంటాడు. మీ మూలంగానే మీ నాన్నలో ఉన్న *ఎనర్జీ* పోయింది. ఎక్స్‌ట్రార్డినరీ అవ్వాల్సిన ఎంతో మంది 🐊 *నాన్న* లు జీవితంలో తమ *పిల్లల* కోసం *ఆర్డినరీ* గా మిగిలిపోయారో.....


ప్రతి *నాన్న* కు  అంకితం 💐🙏

[03/04, 8:44 pm] +91 77029 91964: *ఏమంటివి...ఏమంటివి... దానవీరశూరకర్ణ*


ఈ చిత్రం పేరు చెప్పగానే ఎన్టీ రామారావు సంభాషణలే గుర్తుకొస్తాయి.

 సుయోధన పాత్ర కోసం రాసిన సుదీర్ఘ సంభాషణలను అలవోకగా చెప్పేశారు ఎన్టీఆర్‌. ‘ఏమంటివి ఏమంటివి’ అంటూ గుక్కతిప్పుకోకుండా పలికిన సంభాషణ ఇప్పటికీ సుప్రసిద్ధమే..! ఎన్టీఆర్ కి ఎనలేని ఖ్యాతి తెచ్చిన ఈ సంభాషణలు రాసింది ఎవరో తెలుసా?

****************************//

అతడో మహారధి...మహాభారతాన్ని మధించి సామాన్యుల దరి చేర్చిన *కొండవీటి వెంకటకవి* మహాభారతం కొన్ని వందల ఏళ్లుగా పవిత్ర గ్రంధంగా కొనియాడపడుతున్నా అందులో పాత్రల పుట్టు పూర్వోత్తరాల గురించి తెలుసుకున్న వాళ్ళు 

అతి తక్కువమంది సమాజం దృష్టిలో వారు మహాపండితులు కానీ వారేనాడు ఆ పాత్రల గుట్టు విప్పలేదు.


1976 లో ఎన్టీఆర్ దానవీరశూరకర్ణ సినిమా తీయదలచి సంభాషణల రచయితగా పని చేయాలని కొండవీటి వెంకటకవి గారికి కబురుపెట్టారు. 

అప్పటికే పొన్నూరు సంస్కృత కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న ఆయన ఆ వినతిని తిరస్కరించారు.


ఔరా ! పిలిచి మరీ సినిమా అవకాశం అందునా ఎన్టీవోడు లాటి వాడు ఇస్తే తిరస్కరణా ...

హేంత అవమానం అని అనుకొనవసరం లేదు 

కారణం కొండవీటి వెంకట కవి హేతువాది మరియు కవిరాజు త్రిపురనేని రామస్వామి అనుచరుడూనూ,1970లొనే నాటి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆవుల సాంబశివరావు గారి కుమార్తె ఆవుల మంజులత వివాహం హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మంత్రాల తతంగాలు లేకుండా హేతువాద పద్ధతిలో ఇన్నయ్య గారితో కలసి ఈయన నిర్వహించారు.


అయితే ఎన్టీఆర్ వ్యక్తిగతంగా అభ్యర్ధించడంతో వారు సినిమాకు ఒప్పుకోవడంతో ఓ మహా ఘట్టానికి బీజం పడింది.

 *ఆచార్య దేవా ఏమంటివి ఏమంటివి.. అంటూ ఆంధ్ర దేశం మారు మోగింది*. 

మహా పాత్రల పుట్టు పూర్వోత్తరాల గుట్టు వెండితెర విప్పింది.


మరొక్కమారు ఆ సంభాషణలు ఎన్టీఆర్ మాయలో పడకుండా జాగ్రత్తగా వినండి ఎవరి పుట్టుకకు ఎవరు కారణమో ఏవిధంగా పుట్టారో వివరాలు తెలుస్తాయి

అవన్నీ నిజమా లేక సినిమాకోసం ప్రాసకోసం ఏమన్నా కలిపారా అనే అనుమానం ఎక్కడో ఉండేది.

 ఈ మధ్య మహాభారతం చదువుతూ ఉంటుంటే కొండవీటి వారి సంభాషణ చాతుర్యం ఎంత గొప్పదో దానిమీద వారికెంత పట్టు ఉందో కొద్ది కొద్దిగా అర్ధం అవుతోంది.


అతి సాధారణంగా కనిపించే వెంకటకవి 

గొప్ప వేదాంతి తాత్వికుడు బహుముఖ ప్రజ్ఞాశాలి 1983 నుంచి 1991లో ఆయన మరణించే వరకు ఈనాడు పత్రికలో పరదేశీ పాఠాలు పేరున రచనలు అందించారు. హేతువాది గా తెలుగు సమాజాన్ని సంస్కరించే దిశగా ఎన్నో అడుగులు వేసిన ఆయన 

రచయితగా తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు 


సత్తెనపల్లి తాలూకా విప్పర్ల గ్రామంలో నారాయణ శేషమ్మ దంపతులకు 1918 జనవరి 25 న జన్మించిన

వెంకట కవీ చరిత మరువదు...

మీ సంభాషణ రచనా చతురత !! మహాభారతాన్నే మధించి సాధారణ ప్రజకు చేర్చిన మీకే చెల్లును కవిరాజు అనిపించుకునే ఘనత !! మా ఎద సదా మెదలును మీ వాదమందు కృతజ్ఞత !!


🤔 *డైలాగ్* 🤔


ఆచార్యదేవా..! హ హ హ హ

ఏమంటివి ఏమంటివి..!

జాతినెపమున సూత సుతులకిందు నిలువర్హత లేదందువా…?

హ్హ..! ఎంత మాట ఎంత మాట..!


ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రీయ పరీక్ష కాదే…

కాదు కాకూడదు… ఇది కుల పరీక్షయే అందువా…!

నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది…?

అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది…?

మట్టి కుండలో పుట్టితివి కదా..! హహహ

నీది ఏ కులము..?


ఇంతయేల..!

అస్మత్ పితామహుడు, కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు… శివసముద్రల భార్య అగు గంగ గర్భమున జనియించలేదా..!

హహ్హ..! ఈయనది ఏ కులమో..? హ హ హ హ…


నాతో చెప్పింతువేమయ్యా..!

మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు… దేవవేశ్య అగు ఊర్వశి పుత్రుడు కాడా..!


ఆతడు పంచమి జాతి కన్య అయిన అరుంధతియందు శక్తినీ… ఆ శక్తి ఛండాలాంగానయందు పరాశరుని…

ఆ పరాశరుడు పల్లెపడతి యైన మత్స్యగంధియందు మా తాత వ్యాసుని…

ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని…

పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును…

మా ఇంటి దాసీతో ధర్మ నిర్మాణా జనుడని మీచే కీర్తించబడుతున్న హ..! ఈ విదురదేవుని కనలేదా..?


హహ్హాహ్హా..! సందర్భావసరములను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము, ఏనాడో కులహీనమైనది…

కాగా నేడు..! కులము, కులము అను వ్యర్ధ వాదములెందులకు..??


నాయనా సుయోధనా....!

యేరుల పారుల బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినవి కావు. ఇది నీవన్నట్టు ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే.. క్షాత్రమున్న వారెల్లరు క్షత్రియులే కానీ అందులో రాజ్యమున్నవారే రాజులు.. అట్టి రాజులే ఈ కురురాజు పరీక్షలో పాల్గొనుటకు అర్హులు.


ఓహో..! రాచరికమా..! అర్హతను నిర్ణయించునది. మ్మ్ మ్మ్…

అయిన మా సామ్రాజ్యములో సస్యశ్యామలమై, సంపద విరాళమై వెలుగొందు అంగ రాజ్యమునకిప్పుడే ఈతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను…


సోదరా.. దుశ్శాసనా..!

అనర్ఘ నవరత్న శక్త కిరీటమును వేగముగా గొనితెమ్ము…


మామా.. గాంధారసార్వభౌమా..!

సురుచిరమణిమయమండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము…


పరిజనులారా…!

పుణ్య భాగీరథీ నదీ తోయములనందుకొనుడు…


కళ్యాణభట్టులారా..!

మంగల తూర్యారవములు సుస్వరముగ మ్రోగనిండు..


వంధిమాగధులారా..!

కర్ణ మహారాజును కైవారము గావింపుడు…


పుణ్యాంగనలారా..!

ఈ రాధాసుతునకు ఫాలభాగమున, కస్తూరీ తిలకము తీర్చిదిద్ది…

బహుజన్మ సుకృత పరీపాకసౌలబ్ద సహజ కవచ కర్ష వైడూర్య ప్రభాదిత్యోలికి వాంఛలు చెలరేగ వీర గంధము విద్యరాల్పుడు…


నేనీ సకల మహా జనసమక్షమున..! పండిత పరిషన్మధ్యమున..!

సర్వదా సర్వదా… శతదా సహస్రదా…

ఈ కుల కళంక  మహాపంకిలఉమును

శాశ్వతముగా ప్రక్షాళనము గావించెదన  🙏🙏🙏

[03/04, 9:37 pm] +91 92904 61512: *స్త్రీ అంటే అవసరం కాదు ధైర్యం*


రామునికి       —       సీత

కృష్ణునికి        —       రాధ 

ఈశునకు      —    ఈశ్వరి

మంత్రపఠనంలో —   గాయత్రి 

గ్రంధ పఠనంలో    —      గీత

దేవుని యెదుట   - వందన, అర్చన, పూజ, హారతి, ఆరాధన వీరికి తోడుగా  శ్రద్ధ


*మన దినచర్యలో భాగంగా

ఉదయానికే       —  ఉష, అరుణ

సాయింత్రం        —   సంధ్య

చీకటైతే             —   జ్యోతి, దీప

రాత్రి మత్తులో    —   నిషా

పడుకున్నాక      —   స్వప్న

చూచేటప్పుడు  — నయన

వినేటప్పుడు     —   శ్రావణి

మాట్లాడునప్పుడు  —  వాణి

ఓరిమిలో            -      వసుధ                         వడ్డించేటప్పుడు    -   అన్నపూర్ణ

నడుస్తున్నప్పుడు   —  హంస

నవ్వుచున్నప్పుడు  —  హాసిని, ప్రసన్న

అద్దంలో చూస్తే       —  సుందరి

చేసేపనికి               -   స్పూర్తి

పని చేయడానికి     —  స్పందన

మంచి పనికి           —  పవిత్ర

ఇష్టంగాచేసే పనికి   —  ప్రీతి

నీరు త్రాగునపుడు   —  గంగ

ఐస్క్రీమ్ తినేటప్పుడు —  హిమజ

సినిమా చూస్తున్నప్పుడు —  చిత్ర

అబద్ధ మాడునపుడు   —  కల్పన

నిజం చెప్పేటపుడు  —  సత్యవతి, నిర్మల

ఆలోచనలప్పుడు   —  ఊహా, భావన చదువుచున్నప్పుడు  —  సరస్వతి

వ్యాపారంలో      —   ప్రతిభ , ప్రగతి

సంతోషంలో   —   సంతోషి

కోపంలో       —   భైరవి

ఆటలాడునప్పుడు  —  ఆనంది 

గెలుపు కోసం   —  జయ, విజయ

గెలిచిన తర్వాత  —   కీర్తి

సరిగమలు నేర్చునపుడు  —  సంగీత

పాటలు పాడునపుడు   —  శృతి, కోకిల

తాళం వేయునపుడు  —   లయ

నాట్యమాడునపుడు   —   మయూరి

సాహిత్య గోష్టిలో    —   కవిత 

నగరాన్ని కాపాడుతూ  —   ప్రకృతి

జీవిత గమనంలో మనతో

విద్యాభ్యాసంలో   —   విద్య

సంపాదనప్పుడు   —   లక్ష్మి

చేసేవృత్తిలో         —   ప్రేరణ                                               పని చేసి వచ్చాక  —  శాంతి

చిన్నతనంలో       —  లాలన                                  మధ్యవయస్సులో -మాధురి

ముసలితనంలో- కరుణ, మమత

జీవితాంతం మనతో  —  స్త్రీ

 

 

కాలసర్పయోగం అంటే ఏమిటి?
కాలసర్పయోగం నివృత్తి హోమం:
ైంఃైంఃైంఃైంఃైంఃైంఃై


జన్మకుండలిలో రాహువు మరియు కేతువు ఉన్న రాశుల మధ్యలో మిగిలిన ఏడు గ్రహములు, అనగా రవి,చంద్ర, శని, కుజ, శుక్ర, బుధ, గురు గ్రహములు ఇమిడి ఉన్నట్లైతే ఈ కాలసర్ప యోగం ప్రాప్తిస్తుంది. ఎవరి జాతకంలో అయితే ఈ కాలసర్ప యోగం ఉంటుందో, ఆ జాతకులు తమ జీవితంలో ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు చూడాల్సి ఉంటుంది. తమ తమ రంగాలలో గొప్ప స్థాయికి చేరుకోడానికి, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి ఈ కాలసర్ప యోగం ఉన్న జాతకులకు తీవ్రమైన ఆటంకాలు ఎదురవుతాయి. ఎంత కష్టపడినా సరే, ఆ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు.

  కాలసర్ప యోగం ఉన్న అందరికీ ఒకే రకమైన ప్రభావాలు కనబడవు. కొన్ని సార్లు జన్మకుండలిలోని బలమైన గ్రహాలు, స్థానాల వల్ల కూడా జాతకునికి కాలసర్పయోగ ప్రభావం అంత ఎక్కువగా కనిపించదు. కాబట్టి, అలాంటి జాతకులు కాలసర్పయోగం గురించి భయపడాల్సిన అవసరం లేదు. అయినప్పటికి ఒక అనుభవజ్ఞుడైన జ్యోతిష్యుని సలహా మేరకు ఆలస్యం చేయకుండా పరిహార కార్యక్రమాలు జరిపించుకోవాలి.

కాలసర్పయోగం వల్ల అనుకూల ఫలితాలు కలుగుతాయా?

 కాలసర్పయోగం ఉన్న ఎంతో మంది జాతకులు ధనం, పేరు, ప్రతిష్ట, అధికారం లాంటివి ఏర్పడి ఎంతో పై స్థాయికి చేరుకున్నారు. అయితే ఆ గొప్ప స్థాయికి చేరుకోవడానికి వారికి కూడా ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఏర్పడి ఉంటాయి. భగవత్ ధ్యానంతో, ఆత్మ స్థైర్యంతో కృషి చేస్తూ శిఖరాన్ని చేరుకోవాలి. అయితే కాలసర్పదోషానికి ప్రాయశ్చిత్త, పరిహారాలు జరిపించిన యెడల, వారి జీవితంలో అడ్డంకులు తొలగిపోయి విజయం చేకూరుతుంది.

కాలసర్పయోగం వల్ల ఎలాంటి కష్టాలు ఏర్పడతాయి?

కాలసర్పయోగం వల్ల ఎన్నో సమస్యలు, అనుకోని సంఘటనలు జాతకుడు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాలసర్పయోగం ఉన్న జాతకులకు ఆరోగ్య రీత్యా యోగ ప్రభావం పడుతుంది. శారీరకంగా వ్యాధుల బారీన పడి బాధలు అనుభవించాల్సి ఉంటుంది. మనఃశాంతి లేకపోవడం, జ్ఞాపకశక్తి మరియు పట్టుదల లేకపోవడం, అనవసరమైన ఒత్తిళ్ళకు లోనవడం, భాద్యతారాహిత్యంగా వ్యవహరించడం, జ్ఞానం లోపించడం, వ్యక్తిత్వ లోపాలు ఉండటం, ఆలోచనాశక్తి తక్కువగా ఉండటం జరుగుతాయి. దీనివల్ల జాతకుడు మానసిక స్థిరత్వం ఉండదు. దీనివల్ల వ్యక్తిగతంగా వారి సన్నిహితులతో సరైన బంధం కొనసాగించక బాధలు పడతారు. ఈ కాలసర్పయోగం వల్ల నిరంతరంగా శారీరక అనారోగ్యాలు లేదా వ్యాధులు ఏర్పడటమే కాకుండా, ఆ వ్యాధి తీవ్రత ఎక్కువ అవ్వటం జరుగుతుంది.

ఇక విద్యా, వృత్తి విషయాలకు వస్తే ఈ కాలసర్ప యోగం ఉన్న జాతకులు ఎప్పుడూ పరీక్షల్లో ఫెయిల్ అవుతూ ఉండటం, మంచి విద్యను నేర్చుకోలేకపోవటం, స్కూలుకు గాని, కాలేజీకి గాని, విశ్వవిద్యాలయానికి గాని ఒక కొత్త విద్య కొరకు చేరలేకపోవటం లాంటివి జరుగుతాయి. ఈ కాలసర్పయోగం జాతకులకు పై చదువులు చదవాలన్న శ్రద్ధ లేకుండా ఉండటానికి కూడా ఈ యోగం కారణం అవుతుంది. చదువులో, చేసే వృత్తిలో నిరంతర విఫలం పొందడం కూడా ఈ కాలసర్పయోగం వల్ల జరుగుతుంది. ఈ యోగం ఉన్న జాతకులకు ఉద్యోగాలలో ప్రమోషన్లు రావడానికి ఎన్నో ఇబ్బందులు, ఆటంకాలు ఎదురవుతాయి. ఒక్కోసారి ఉద్యోగం కూడా నష్టపోయే అవకాశాలు రాక మానవు.

ఈ కాలసర్ప యోగం ఉన్న వారు ప్రేమ వ్యవహారాలలో విఫలం అవ్వటం, ప్రాణ స్నేహితుని చేతిలో గాని, భాగస్వామి చేతిలో గాని, భార్య/భర్త చేతిలో గాని మోసపోవటం జరుగుతుంది. జీవిత భాగస్వామితో, ఆప్తులతో ఉన్న బంధం పై ఈ యోగ ప్రభావం పడుతుంది. వివాహం ఆలస్యంగా జరగడం, వైవాహిక జీవితం సాఫీగా ఉండకపోవడం, శృంగార జీవితంలో ఆనందం లేకపోవడం, వంధ్యత్వం (సంతాన లేమి), పదే పదే రక్తస్రావాలు జరగటం, పుత్ర యోగం లేకపోవటం, దంపతుల మధ్య అన్యోన్యత లేకపోవటం, విడాకులు జరగడం లాంటి దుర్ఘటనలు ఈ కాలసర్ప యోగం వల్ల సంభవిస్తాయి.

ఈ కాలసర్ప యోగం వల్ల ఆర్థికపరంగా అభివృద్ధి లేకపోవటం, ఆర్థిక స్థిరత్వం లేకపోవటం, జాతకుడిని పేదవాడు అయ్యేలా చేసే తీవ్రమైన అధిక ఋణాలు, వ్యాపారంలో అడ్డంకులు, వంశపారపర్యంగా వచ్చే ఆస్తులలో ఆటంకాలు వస్తాయి.

ఈ కాలసర్పయోగం వల్ల ప్రభావితులైన వారు, తమ జీవితంలో చిన్నతనం నుండి వృద్ధాప్యం వరకు ఆరోగ్య పరంగా, విద్య పరంగా, వృత్తి పరంగా, వివాహ పరంగా, అప్పుల ఆర్థికంగా, సామాజికంగా, రోజు వారి కార్యక్రమాల పరంగా, వారి లక్ష్యాలను చేరుకునేందుకు ఎన్నో ఆటంకాలు, అవరోధాలు ఏర్పడతాయి.

వామతంత్రం ప్రకారం, జన్మకుండలిలో కాలసర్పయోగం ఉన్న జాతకులు తమ బాధల నుండి, సమస్యల నుండి విముక్తి పొందాలంటే, “కాలసర్పయోగా నివృత్తి హోమం” తప్పక జరిపించాలి.  ఈ పరిహారం జరిపించడం వల్ల జాతకులకు ఉన్న దురదృష్టం దూరమయ్యి, శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఈ హోమం జరిపించడం వల్ల పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. అందువల్ల జాతకులకు శుభ ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంతానం లేని దంపతులు ఈ కాలసర్పయోగ నివృత్తి హోమం చేసుకోవడం వల్ల శీఘ్రంగా సంతానం కలుగుతుంది.వ్యాపారంలో నష్టాలు చూసే వారు, వృత్తిపరంగా అపజయం పాలయ్యే వారు, దుష్ట శక్తులు, దుష్టుల నుండి దూరం కావాలనుకునేవారు ఈ కాలసర్ప శాంతి హోమం ఎంతో శుభాన్ని చేకూరుస్తుంది.

॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰॰
[6:59 am, 06/04/2021] +91 94917 74979: 12 రకాల కాలసర్పయోగాలు :
><><><><><><><><0<
మానవ జీవితములపై ప్రభావాన్ని చూపించే ప్రధాన గ్రహాలైన రవి, చంద్ర, శుక్ర, గురు, బుధ, కుజ , శని అను ఈ ఏడు గ్రహాలు ఎవరి జన్మకుండలిలో అయితే రాహువు మరియు కేతువు మధ్య చిక్కుకొని ఉన్నవారికి ఆ పరిస్థితిని కాలసర్పదోషం అంటారు. ఎప్పుడైతే ఒక వ్యక్తి జన్మకుండలిలోని ఆరు స్థానాలలో ఏ గ్రహాలచేత ఆక్రమించబడకుండా ఉంటాయో అట్టి స్థితిని సంపూర్ణ కాలసర్ప యోగం అంటారు. కాలసర్పయోగం లేదా కాలసర్పదోషం మానవుల జీవితాలలో ప్రమాదకరమైన పరిస్థితులను సృష్టిస్తాయి. మనిషి తాను చేసే కార్యాలకు తగిన ఫలితాన్ని పొందలేదు. కొందరికి కాలసర్పదోషం ఉన్న స్త్రీ, పురుషులకు వివాహం కాకపోవటం, సంతానం కలుగకపోవటం, వృత్తిపరంగా అభివృద్ధి లేకపోవటం, తరచూ కోర్టు కేసులలో లేదా తగాదలలో ఇరుక్కోవటం తరచుగా బంధువులతో శతృత్వాన్ని పొందటం లాంటి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవటం జరుగుతుంది. మనిషికి కావలసిన అదృష్టాన్ని అడ్డగించటములో కాలసర్పదోషం పోషించే పాత్ర ఎంతో ఉంటుంది. కాలసర్పదోషానికి వ్యక్తుల యొక్క మంచి చెడులతో సంబంధం లేదు. ధనిక, పేద తేడా లేకుండా ఈ కాలసర్పదోష ప్రభావానికి గురి కావలసి ఉంటుంది. కాలసర్పదోషం ఉన్న సంపన్నులు అనుక్షణం ఏదో ఒక విషయములో ఉత్కంఠను , ఆందోళనలను అనుభవిస్తూ ఉంటారు. వారిని అనుక్షణం ఏదో ఒక అభద్రతా భావం వెంటాడుతూ ఉంటుంది. హైందవ జ్యోతిష్యశాస్త్రములో ఎన్నో దుష్ట యోగాలు ఉన్నప్పటికి వాటి అన్నింటిలోనూ అతి తీవ్రమైనది కాలసర్పదోషం. ఒక్కో రకమైన కాలసర్పదోషం మనిషికి ఒక్కో వయస్సు వరకు ప్రభావం ఉంటుంది. కొన్ని కాలసర్పదోషములు మాత్రం మనిషి మరణించేంత వరకు దాని ప్రభావం చూపుతుంది. కలసర్పదోషాలు 12 రకములు. అవి ఏమిటో తెలుసుకుందాము.

1.అనంత కాలసర్పయోగం:

 ఎవరి జన్మకుండలిలో అయితే రాహువు లగ్నములో మరియు కేతువు సప్తమ భావములో ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి “అనంత కాలసర్ప దోషం” ఉన్నట్టు గుర్తించాలి. ఈ అనంత కాలసర్ప దోషం వలన బాధపడేవారు తరచుగా అవమానములు ఎదుర్కోవటం , ఆందోళనలకు గురి కావటం జరుగుతుంది. వీరిలో న్యూనత భావం ఎక్కువగా ఉంటుంది. ఇక కోర్టు సంబంధిత విషయాలకు వస్తే వీరు విసుగు కల్పించే , ఎంతో కాలముగా పూర్తి కానీ కేసులు ఉంటాయి. వీరి ఆరోగ్యము కూడా తరచూ బాధకరంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. వైవాహిక జీవితం సాఫీగా ఉండదు. ఈ అనంతకాలసర్ప దోషం ఉన్నవారు మానసికంగా మరియు శరీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు.

2.కులికా కాలసర్పయోగం:

 ఎవరి జన్మకుండలిలో అయితే రాహువు ద్వీతీయ భావములో మరియు కేతువు అష్టమ భావములో ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి కులికా కాలసర్పదోషం ఉన్నట్టు గుర్తించాలి. ఈ రకమైన కాలసర్పదోషం ఉన్నవారు ధనాన్ని నష్టపోవటం , ప్రమాదాల వలన నష్టపోవటం జరుగుతుంది. వీరి కుటుంబములో తగాదాలు, నరాల బలహీనత, మూర్చలు లాంటి సమస్యలు వస్తాయి. కుటుంబ జీవితం అల్లకల్లోలంగా ఉంటుంది. ఆర్థికపరమైన నష్టాలు ఎక్కువగా ఎదుర్కొంటారు.ఈ కాలసర్పదోషం అనుభవిస్తున్న వారు వారి మాటలను ఎంతో అదుపులో ఉంచుకోవాలి. వీరి మాటలు ఇతరులను సులభంగా బాధిస్తాయి కాబట్టి మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. కుటుంబ సభ్యులలో మరియు సమాజములో వీరికి ఉన్న గౌరవము పోయే అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితం సాఫీగా ఉండదు. ఆర్థిక పరిస్తితి నిలదోక్కుకోవటం కోసం ఎంతో ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఈ కాలసర్పదోషం ఉన్నవారు సహజంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. గొంతుకు సంబంధించిన వ్యాధులు కలుగవచ్చు.

3.వాసుకి కాలసర్పయోగం:

 ఎవరి జన్మకుండలిలో అయితే మూడవ స్థానములో రాహువు మరియు తొమ్మిదవ స్థానములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఇమిడి ఉన్నట్లైతే వారికి వాసుకి కాలసర్పదోషం ఉందని గుర్తించాలి. ఈ కాలసర్పదోషంతో భాడపడేవారు సోదరుల కారణంగా లేదా అక్కాచెల్లెళ్ల కారణంగా నష్టపోవటం జరుగుతుంది. వీరు బంధువుల వలన కలిగే చిక్కులవలన గాని, రక్త సంబంధమైన సమస్యల వలన గాని, ఆకస్మిక మృతి పొందే అవకాశం ఉంటుంది. ప్రొఫెషనల్ జీవితములో సమస్యలు ఎదుర్కొంటారు. వీరి అదృష్టము ఎక్కువగా ఉండదు. స్నేహితుల వలన లేదా బంధువుల వలన మోసపోతారు. వ్యాపారములో, వ్యాపార భాగస్వాములతో నష్టాలు ఎదురయ్యి సమస్యలు ఎదుర్కొంటారు.  ఈ దోషం ఉన్న వారు సమస్యల వలన సతమతం అయ్యి ఆ ఆందోళనలో వీరు చేసే పనుల వలన ఇంకా సమస్యలలో చిక్కుకుంటారు. ఇతరులు వీరితో ఎంత సన్నిహితంగా ఉన్నా కూడా ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. అందరూ వీరిని మోసగించాలనే చూస్తారు. రాహు లేదా కేతు మహా దశలో వీరు దూర ప్రయాణములు చేయుట మంచిది కాదు.

4.శంఖపాల కాలసర్పయోగం:

ఎవరి జన్మకుండలిలో అయితే రాహువు నాలుగవ భావములో మరియు కేతువు దశమ భావములో ఉంటూ వీరి మధ్య మిగిలిన ఏడు గ్రహాలు ఉండినట్లైతే వారికి శంఖపాల కాలసర్పదోషం ఉన్నదని గుర్తించాలి. ఈ దోషం ఉన్న వారికి వారి తండ్రి నుండి ప్రేమ లభించదు. వీరు అతి శ్రమలు చేస్తూ జీవిస్తూ ఉంటారు. తరచుగా వృత్తిపరమైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.  వీరి జన్మభూమికి దూరంగా ఇతర రాష్ట్రాలలో లేదా ఇతర దేశాలలో హీనమైన పరిస్థితులలో మరణించటం జరుగుతుంది. వీరికి దేనిమీద సరైన ధ్యాస (Concentration)  ఉండదనే చెప్పాలి. ఉదాహరణకి తదేక ధ్యాస పెట్టె డ్రైవింగ్ లాంటి వాటిపై వీరికి పట్టు ఉండదు కాబట్టి వాటి జోలికి వెళ్లకపోవటమే మంచిది. ముఖ్యంగా వీరి తల్లితోనూ, కుటుంబ సభ్యులతోనూ సరైన బాంధవ్యము ఉండదు. కొందరికి వీరు నివశిస్తున్న ఇంటిలో వాస్తు దోషములు కూడా ఏర్పడవచ్చు. హుద్రోగములు, ఛాతీ, ఊపిరితిత్తులకు వ్యాధులు రావచ్చు. పై అధికారులతో పేచీలు ఉంటాయి. ప్రోమోషన్లు రాక ఇబ్బందుల పాలవుతారు. మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి.

5.పద్మ కాలసర్పయోగం:

 ఎవరి జన్మకుండలిలో అయితే పంచమ భావములో రాహువు మరియు ఏకాదశ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారు పద్మ కాలసర్ప దోషము నుండి బాధపడుతున్నట్టు గుర్తించాలి. ఇలాంటి జాతకులు చదువులో వెనుకబడటం జరుగుతుంది.జీవిత భాగస్వామికి తరచూ అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. సంతాన భాగ్యమును పోందలేకపోవటం , స్నేహితుల వలన వంచింపబడటం జరుగుతుంది. చదువు పరంగా వెనుకబడి ఉంటారు. ప్రేమ వ్యవహారాలలో, వ్యాపారాలలో, మార్కెట్ పరంగా వీటన్నింటిలో వీరికి అదృష్టము ఉండదు. కొందరికి సంతాన పరంగా ఆలస్యము ఉంటుంది. ప్రేమ వ్యవహారములో మరియు వైవాహిక జీవితములో సమస్యలు ఉంటాయి.  కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఉండదు.

6.మహా పద్మ కాలసర్పయోగం:

ఎవరి జన్మకుండలిలో అయితే 6వ స్థానములో రాహువు మరియు 12వ స్థానములో కేతువు ఉంది మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి మహాపద్మ కాలసర్పదోషం ఉన్నట్టు గుర్తించాలి. ఈ కాలసర్పదోషం ఉన్నవారికి వెన్నుముక ప్రారంభములో నెప్పులను, తలనొప్పులను, చర్మ వ్యాధులను కలిగి ఉంటారు. అంతేకాకుండా తరచుగా ఆస్తుల నష్టం జరుగుతుంది. వీరిపై తంత్ర ప్రయోగములు సులభముగా జరగగలవు. మామూలుగా ఇలాంటి జాతకులు విదేశాలలో ఉంటూ కుటుంబములో ఆశాంతి కలిగి ఉంటుంది. స్వయంకృత అపరాధల వలన వీరు మోసపోతారు. మానసిక రుగ్మత (డిప్రెషన్) , ఇతరుల పట్ల ద్వేషము, చేసే వృత్తి నుండి తేసివేయుట జరుగవచ్చు. కాలసర్పయోగం అంటే ఏమిటి? కాలసర్పయోగ నివృత్తి హోమం యొక్క వివరాలను ఈ లింకును క్లిక్ చేసి తెలుసుకోగలరు

7.తక్షక కాలసర్పయోగం :

 ఎవరి జన్మకుండలిలో అయితే సప్తమ భావములో రాహువు మరియు లగ్నములో కేతువు ఉన్నట్లైతే వారికి తక్షక కాలసర్పదోషం ఉన్నట్టు గుర్తించాలి. ఈ దోషం ఉన్నవారు నీచంగా ప్రవర్తించే వారిచేత అనేక రకాల బాధలు పొందవలసి ఉంటుంది. వీరు వ్యాపారములో నష్టపోవటం, అసంతృప్తితో బాధపడటం, వైవాహిక సుఖమును పోందలేకపోవటం జరుగుతాయి. ప్రమాదములు జరుగుతాయి. ఈ దోషము ఉన్నవారు ముఖ్యంగా శారీరక లక్షణములు వ్యతిరేకంగా ఉంటాయి. సహజ పొడుగు, బరువు కాకుండా వ్యతిరేకంగా ఉంటారు. శారీరక లక్షనాలే కాకుండా మానసిక లక్షణాలు కూడా వీరికి సరిగా ఉండవు. ఇతరులతో పోలిస్తే ఈ దోషం ఉన్న వారికి బుద్ధి కుశలత ఉండకపోవడం గమించవలసిన విషయం. నరముల బలహీనత కలుగుతుంది. సమస్యలను తట్టుకోలేక ఈ దోషము ఉన్నవారిలో కొందరు ఉన్మాది స్వభావము వారి వలె ప్రవర్తిస్తారు. వివాహేతర సంబంధములు చిక్కులు కలుగచేస్తాయి.

8.కర్కోటక కాలసర్పయోగం:

 ఎవరి జన్మకుండలిలో అయితే అష్టమ భావములో రాహువు మరియు ద్వీతీయ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఆ రాహు కేతు మధ్య ఉన్నట్లైతే వారికి కర్కోటక కాలసర్పదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. ఈ దోషం ఉన్నవారు పూర్వీకుల ఆస్తులు అన్నీ కోల్పోతారు. శృంగారం ద్వారా వ్యాపించే వ్యాధులు లేదా ఇన్ఫెక్షన్ రావచ్చు. విషపూరితమైన సర్పాల వలన గాని లేదా కీటకలా వలన గాని ప్రమాదములు పొందవచ్చు. కుటుంబములో అనేక సమస్యలు కలుగవచ్చు. హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. తీవ్రమైన ఆర్థిక నష్టము జరుగుతుంది. ఎటువంటి సహాయము పొందలేని వారు అవుతారు. యాక్సిడెంట్లు, ఆరోగ్య సమస్యలు దురయ్యే అవకాశములు ఉన్నాయి. వ్యక్తిగతంగా మరియు ప్రొఫెషన్ పరంగా తీవ్రమైన వ్యతిరేకతను ఎదుర్కోగలరు.

9.శంఖచూడ కాలసర్పయోగం:

ఎవరి జన్మకుండలిలో అయితే నవమ భావములో రాహువు మరియు తృతీయ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి శంఖ చూడ కాలసర్పదోషం ఉన్నట్టు గుర్తించాలి. మతానికి వ్యతిరేకమైన కార్యకలాపములు జరుపుటకు సిద్ధపడతారు. హై బి.పి. , నిరంతర ఆలోచనలు ఉంటాయి. ఈ దోషం ఉన్న వారికి జీవితములో పైకి ఎదగడం ఎంత సులభమో , క్రిందకి జారిపోవటం కూడా అంతే సులభం. జీవితములో వీరికి ఏది సులభంగా దొరకదు. చేసే ప్రొఫెషన్ లో స్థిరత్వం కోల్పోతారు. ఈ దోషం ఉన్నవారికి, వీరి తండ్రికి భేదాభిప్రాయములు వస్తాయి. వీరికి పితృశాపము కూడా ఉన్నట్టు గుర్తించాలి. ఈ దోషంతో ఉన్నవారికి ఎవరిని నమ్మాలో తెలియక అన్నీ చోటల ఇతరుల చేతిలో మోసపోతూ ఉంటారు. వైవాహిక జీవితం విడాకుల వరకు వెళ్లవచ్చు. లీగల్ విషయాలలో ఎన్నో ఇబ్బందులు కలుగవచ్చు.

10.పాతక కాలసర్పయోగం:

 ఎవరి జన్మకుండలిలో అయితే దశమ భావములో రాహువు మరియు చతుర్థ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి పాతక కాలసర్పదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. ఈ దోషం ఉన్నవారు కుటిల స్వభావము కలిగి ఇతరులకు ద్రోహము చేయుటకు పాల్పడతారు. ఈ దోషం ఉన్నవారి ఇళ్ళల్లో దొంగతనాలు జరుగుతాయి. పైశాచిక పీడ ఎక్కువగా ఉంటుంది. లో బి.పి సమస్య ఉంటుంది. ఈ దోషం ఉన్న వ్యాపారస్తులు ఒకే వ్యాపారం చేయటం వలన ఎక్కువ నష్టాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఒంటరిగా అనిపించడం లాంటి మానసిక ఆందోళనలు కలిగి ఉంటారు.

11.విషధార్ కాలసర్పయోగం:

 ఎవరి జన్మకుండలిలో అయితే ఏకాదశ భావములో రాహువు మరియు 5వ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నత్లితే వారికి విషధార్ కాలసర్పదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. సోదరులతో విబేధాలు కలుగవచ్చు. చపల మనస్తత్వం కలిగి ఉంటారు. సంతాన పరమైన సమస్యలు ఎదుర్కొంటారు. కారాగార శిక్ష అనుభవించే సూచనలు రావచ్చు. నిద్రలేమి, కంటి సమస్యలు, హృదయ సమస్యలు రావచ్చు. పై చదువులు చదువుకోవాలంటే చాలా కష్టాలు పడవలసి ఉంటుంది. సంతానము ఆలస్యముగా కలుగవచ్చు. కొంత డబ్బు కోసం ఎంతో కష్టపడవలసి ఉంటుంది. ఒక్కోసారి చేయకూడని పనులు కూడా చేయవలసి ఉంటుంది. జ్ఞాపక శక్తి మందగిస్తుంది.

12.శేషనాగ కాలసర్పయోగం:

 ఎవరి జన్మకుండలిలో అయితే ద్వాదశ భావములో రాహువు మరియు 6వ భావములో కేతువు ఉంటూ మిగిలిన ఏడు గ్రహాలు ఈ రాహు కేతు మధ్య ఇమిడి ఉన్నట్లైతే వారికి శేషనాగ కాలసర్పదోషం ఉన్నట్టుగా గుర్తించాలి. తరచూ ఓటమికి గురి అవుతూ ఉంటారు. దురదృష్టం వీరిని వెంటాడుతూ  ఉంటుంది. రహస్య శత్రువులు బాధిస్తూ ఉంటారు. నేత్ర సంబంధమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
 

No comments:

Post a Comment