Friday, 23 April 2021


May be an image of 4 people

 

సోయగాలు ... (10 -12 )


మమతయు సర్వలోక జనత  

సమత యువత జనత  

కమ్మని పాటల తొ వనిత  

మమ్ము చూడు యువత 

నమ్మియు జూపినట్టి మమత  

కమ్మ నైన చరిత 

ఏమన నే సోయ గాలులే 


నీతి యన్నది ఇక్కడ లేదు 

బ్రాంతి ఉంది అంత 

శాంతి కరువుగాను మారేను   

చింత చేరి నంత 

వింత పోకడ ఏలు చుండెను 

సంత గోల నంత 

ఇంత అంత  ప్రేమ మల్లేను  


యవినీతి ఆటలు ఆడేను 

యవని లోన జెప్ప 

యువనీతి వీధిన పడేను 

యువత చెందు బుద్ధి 

యువతీ యువకులజంట ప్రేమ  

యెంత మార్చు జగతి 

ఏమి అన్ననుఇది  ప్రేమయే 


--(())--

పుస్తక దినోత్సవ సందర్భముగా ,... ప్రాంజలి ప్రభ 


పుస్త కమ్ముయే మస్తకమ్మును మార్చు పుడమినందు    

విద్య నేర్చిన బతుకులో సుఖముండు జగతి నందు 

పుట్టి నప్పుడు జీవితాన చదువు మలుపు నందు 

గిట్టి  నప్పుడు పరమాత్మ ధ్యానము తనువు నందు 




ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక 

రచయిత : మల్లాప్రగడ రామకృష్ణ 

ముగ్గురమ్మల మూలపుటమ్మ.. చిన్న ... కవిత  ..(3 )


చింత మాపు నమ్మ - పంతం లేని అమ్మ 

శాంతి చూపు అమ్మ  - కాంతి చూపు అమ్మ 


ఫలములిచ్చు అమ్మ  - కలత తీర్చు అమ్మ 

వెలితి మాపు అమ్మ  - అలక తీర్చు అమ్మ 


పరి పోషణ గ అమ్మ - కరి పై ఉరేగు అమ్మ 

గిరి ఫై వెలిసిన అమ్మ - సిరి పంచేటి అమ్మ 


చింతామణితొ అమ్మ - కాంతా మణిగ అమ్మ 

బ్రాంతి తొలుచు అమ్మ - శాంతి తెలుపు అమ్మ  


రెప్ప పాటున అమ్మ - చెప్పు మాటలొ  అమ్మ 

ఒప్పు ఆటలొ అమ్మ  - తప్పు వేటలొ అమ్మ  


చిరుత చూపుల అమ్మ - చరిత చెప్పిన అమ్మ  

అరువు తీర్చిన అమ్మ - పరువు నిల్పిన అమ్మ 


సుఖధా రిచ్చు నమ్మ - శశిర ఋతువులొ అమ్మ    

లౌఖ్యమ్ము తెల్పు నమ్మ - మముకన్న మాయమ్మ 


కుటిలకచం మమ్మ - కఠినకుచం మమ్మ 

కుందస్మిత మమ్మ   - కాంతి చూపు మమ్మ 


కుంకుమ చ్ఛాయమ్మ - పచ్చని ముఖపు అమ్మ

తఫల మాపు మాయమ్మ - మమ్మేలు మాయమ్మ  


పంచ శరమ్ముల అమ్మ  - శాస్త్ర బోధనా లమ్మ  

ఆచార్యులతొ నమ్మ   - సర్వము దృష్టి వమ్మ 


పాత్ర పోషిత వమ్మ  - కాంచీ వాసవమ్మ 

కుమారి కాంచనమ్మ - మోహయతి వైనవమ్మ 


సులభా చిత్త మమ్మ - ప్రతిభా చిత్త మమ్మ 

కాంచీ నిలయమమ్మ  - మముకన్న మాయమ్మ  


మము కన్న మాయమ్మా  - మము పెంచు మాయమ్మ 


విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

--(())--

సోయగములు (7to ౯)


మనసున మల్లెల వాసన 

మనన నెంత కోరె 

తనమన అనక ఘుభాళించి 

తనువు పులక రించి   

తన్మయ పరిచియు చెందియు 

తన్ను తాను మరచు 

మనకు పంచేటి సోయగములే 


వయసున ఉడుకుయే ఉయ్యాల 

న్యాయ మవ్వు చుండు 

ఆయువు చల్లని జంపాల   

నెయ్య మొవ్వు చుండు 

కయ్యపు మాటలు పొంగాల 

వియ్యమవ్వు చుండు  

మనకు పంచేటి సోయగములే 


ధైర్యము ఉంటేనె విజయము

శౌర్య ముంచి కదులు

మర్మము తెలిసిన విషయమే

కర్మ మంచి గుండె

ధర్మము అనుకరించి నడుచు

నిర్మలమ్ము గుండు

సర్వము తెల్పు సోయగములే


విధేయుడు : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


--(())--


ఉషస్సు పొందితి 

వయస్సు పంచితి 

మనస్సు విచ్చెను ప్రేమతోను 


సొగసు పిలుపులో 

వయసు ఉడుకులో 

మనసు పరుగులే ప్రేమతోను 




మనసు లోతు కనుగొనుట  సూత్రము ఉందెక్కడ 

వయసు పెర్గు తెల్సుకొనుట  లుసుకొ సూత్రము ఉందెక్కడ  

సొగసు రూపు మార్చు కొనుట పంచు మనసుకు  సూత్రము ఉందెక్కడ   

తపసు  చేయు మగువకు సూత్రము ఉందెక్కడ  


నయన చుక్క కడలికి సూత్రము ఉందెక్కడ  

మెరుపు వెల్గు పుడమికి సూత్రము ఉందెక్కడ    


కలల అమ్మ మనుగడ సూత్రము ఉందెక్కడ  

కళల తండ్రి పలుకుకు సూత్రము ఉందెక్కడ  

  

ఆత్మకు రూపం, ప్రేమకు అర్ధం 

జీవికి మోక్షం, శ్రమకు సాక్ష్యం 

అమ్మ ఆరాటం, నాన్న పోరాటం 

స్నేహానికి సూత్రము ఉందెక్కడ

ఇది వేణు గోపాల ప్రేమ సుమా 

-((**))--



ప్రాంజలి ప్రభ 23 -04 -2021

ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం 

పుస్తక దినోత్సవ సందర్భముగా ,... ప్రాంజలి ప్రభ 

పుస్త కమ్ముయే మస్తకమ్మును మార్చు పుడమినందు    

విద్య వైద్య ము బతుకులో సుఖముండు జగతి నందు 

పుట్టి నప్పుడు జీవితాన చదువు మలుపు నందు 

కళల గమనమే పరమాత్మ ధ్యానము తనువు నందు 

--(())--

 అమ్మ ప్రార్ధన

అమ్మవు నీవేను మనసుతో

కమ్మ నైన పిలుపు

సమ్మతి తెలుపుతూ పలుకులే

మమ్ము హాయి గుంచు 

కన్నీరు తడుచేటి అమ్మవీ

ఆన్ని నీ కృప యునె 

చేసెద పనులన్ని ప్రేమతో

అమ్మవు నీవె అయ్యవు నీవె

అమ్మ తనము చూపి

సమ్మోహ పరిచేటి మమతవు

మమ్ము కాపు కాయు 

నీ ప్రేమ పొందేటి మనసుయే

మాకు ఇచ్చు అమ్మ

చేసెద పనులన్ని ప్రేమతో

అమ్మలు గన్నమ్మ వై నీవు

మమ్ము రక్ష చేయు

నమ్మి కొలిచితిమే ఇపుడేను

మేము చేయు తప్పు

ఒప్పులు అన్నింటినీ చూపె

మేము చేయు పూజ

లన్నియు పనులన్ని ప్రేమతో

విధేయుడు మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

-+(())--

నేటి సమస్యకు ....... పద్యాలు .

నమ్మక ముంచియు చేసెదన్ - యుద్ధము ఇపుడున్ 

కమ్మిన మేఘాలు తరిమినా  - జయమునే తలచున్   

ఏమియు శాంతియు వహిస్తె - ఏలయు జయమున్  

రాముడు గర్భము ధరించి రావణు కనియెన్...

రామబాణమునకు అడ్డేది - రాజమెరుపులున్ 

రామ మాటలకును అడ్డేది - రమ్య చరితమున్ 

రామ పత్ని సహనం అడ్డేది - రుధిర తర్పణమున్  

రాముడు గర్భము ధరించి రావణు కనియెన్

అమ్మపలుకులోను ధైర్యము - తొణికిస కనియున్ 

నమ్మక మునుచూపె హనుమయు - నయనసుందరికిన్  

దమ్ముఉంచియు చూసె రామున్ని - పలుకులవలనన్   

రాముడు గర్భము ధరించి రావణు కనియెన్

--(())--

ప్రాంజలి ప్రభ అధ్యాత్మిక చిన్న కధలు ---3--- 

మనిషి యవ్వనంలో ఒక విధమైన జిహ్వతాపం ఉద్భవించు. అది పరుగెత్తే గుఱ్ఱంలాగా సాగుతుంది.దాన్ని ఒడిసి పెట్టె విధము గ్రహించగల బుద్ధి సంక్రమించు దానికి తోడు సహాయ సహకారం ఎక్కువగానే ఉండు. అప్పడే మంచి చెప్పినా బుర్రకెక్కదు. తాను చెయ్యాలనుకున్నది చేస్తారు. అది ప్రేమవ్వచ్చు,చదువు అవ్వచ్చు లేదా చేదుఅలావాటులు అవ్వచ్చు.         

అప్పుడే సంకల్పములు అనేవి ప్రవాహము లాగా వస్తూ ఉంటాయి. ప్రవాహములో మునగకుండా గమనిస్తూ ఉండాలి. ప్రవాహములో పడిపోతే అది నిన్ను పట్టుకుపోతుంది. అక్కరలేని తిరుగుళ్లు, తిండి, మాట లేకపోతే అక్కరలేని ఆలోచనలు గూడా రావు.

సముద్రపు ఒడ్డున కూర్చుని అనంతమైన అలలను చూస్తున్నట్లుగా,  మనసులో  కలిగే భావాలను గమనిస్తూ ఉండడమే. ఇదే ధ్యానానికి ప్రాథమికమైన స్థితి. అప్పుడే స్థిరమైన మనస్సు ఏర్పడుతుంది. మూడు గుణములకు లోబడని ప్రజ్ఞగా ఉంటాము. ఉన్న స్థితి నుంచి ఎక్కడికో వెళ్లిపోయిన మనస్సు గుణములకు లోబడినదని అర్ధము.

ఆత్మజ్యోతి తన ప్రకాశాన్ని సర్వత్రా ప్రసరింపజేస్తుంది. మనం దివ్యాత్మ స్వరూపులం. ఆ దివ్యాత్మభావాన్ని విస్తరించవచ్చును.

ఆవయసులో మనిషి  విద్యఅనే  దృష్టిని కోల్పోతే అంతకన్నా దురదృష్టకరం మరొకటి ఉండదు. దివ్యత్వాన్ని ఎవరూ మన నుండి దోచుకోలేరు.

మనస్సులో ఉదయించే మలినాలే ఆ దివ్యత్వాన్ని కప్పివేస్తాయి. ఆ దివ్యత్వ ప్రకాశాన్ని సర్వులలోనూ దర్శించవచ్చు.

మన నిజమైన శత్రువులు ఆ మలినాలే. అవి మన ఆధ్యాత్మిక వారసత్వం నుండి మనల్ని దూరం చేస్తున్నాయి.

కనుక అంతఃశత్రువుల ఎడల అప్రమత్తతను కలిగి ఉండాలి.

1. నీ యందు ధర్మానుష్ఠాన బుద్ధి యున్నదా? లేక పొతే బుద్ధిని మార్చుకో 

2. అవసర సమయమునందు కూడ అధర్మము ప్రోత్సహించ బడదా? నీ ఆలోచన మార్చుకో  

3. గురువునందు, దైవమునందు ఎప్పుడైన సందేహము వచ్చునా, రాదా? సందేహాన్ని తీర్చుకో 

4. నీవు పరనింద చేయుదువా? చేయవా? నిందా అనేది మర్చిపో 

5. అసత్య భాషణమునకు జంకుదువా? జంకవా? అసత్యము దేనికి 

6. సంవత్సరమున అసహనము ఎన్నిసార్లు కలుగును ?  సహనముతోనే ఉండు 

7. మనస్సునకు స్థిరము ఏర్పడినదా? లేక చంచలత్వ మున్నదా? మనస్సు స్థిరపరచు 

8. పనులయందు శ్రద్ధ, భక్తి యున్నదా? లేక అశ్రద్ధ, నిర్లక్ష్యము 

9. నీవు శరీర శ్రమకు సిద్ధమేనా? సిద్ముగా ఉండు 

10. నీకు దైవమన్న భయమా? భయమనవసరం అది మన:శాంతికి దారి అని తెలుసుకో 

సంకల్ప బలం కు దైవ బలం తోడవుతుంది అప్పుడే బుద్ధిబలం వికసించి దేశానికి సహాయపడే మనస్సు అవుతుంది అదే ఎక్కువ ఇవ్వనదశలో 

విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

--(())--

Pranjali Prabha daily 

అమ్మ అనే పిలుపులో ఆప్యాయత ఉంది.

నాన్న అనే పిలుపులో నమ్మకం ఉంది.

తాత అనే పిలుపులో తన్మయత్వం ఉంది.

అమ్మమ్మ అనే పిలుపులు అభిమానం ఉంది.

నానమ్మ అనే పిలుపులో నవ్వు ముఖం ఉంది.

అత్త అనే పిలుపులో ఆదరణ ఉంది.

మామ అనే పిలుపులో మమకారం ఉంది.

బాబాయ్ అనే పిలుపులో బంధుత్వం ఉంది.

చిన్నమ్మ అనే పిలుపులో చనువు ఉంది.

అన్నా అనే పిలుపులో అభయం ఉంది.

చెల్లి అనే పిలుపులో చేయూత ఉంది.

తమ్ముడు అనే పిలుపులో తీయదనం ఉంది.

అక్క అనే పిలుపులో అనురాగం ఉంది.

బావా అనే పిలుపులో బాంధవ్యం ఉంది.

వదినా అనే పిలుపులో ఓర్పు ఉంది.

మరదలు అనే పిలుపులో మర్యాద ఉంది.

మరిది అనే పిలుపులో మానవత్వం ఉంది.

గురువు అనే పిలుపులో గౌరవం ఉంది.

మిత్రులారా! 

నేడు మనం కట్టే బట్ట, చదివే చదువు, 

తినే తిండి అన్ని పరాయి పోకడలను అనుసరిస్తున్నాయి.

కనీసం పిలుపులో నయినా  

మన అచ్చ తెలుగులో పిలుచుకుందాం 

బంధాలను నిలబెట్టుకుందాం.....!

--(())--

1

నేటి ఛందస్సు పధ్యాలు 

శార్దూలలలిత - మ/స/జ/స/త/స UUU IIU IUI IIU - UUI IIU

భవన నిర్మాణ/అమ్మక సందర్భముగా .పద్యం   

ప్రారంభం వెనకే సమస్త కృషియే -  ప్రోత్సాహ పలుకే 

నిర్మాణం జరిగే నిరంతరముగా - నమ్మే జగతిలో 

కర్తవ్యం వలెనే ప్రభావ పరమై - కష్టాలు జయితే  

సర్వార్ధం అనుకూలమైన ధనమై -  సామర్ధ్య కలదై 

శార్దూలలలితపు విలోమము - న/త/ర - త/స/త III UUI UIU - UUI IIU UUI 27 మాత్రలు 

18 ధృతి 145576 

**   ఆశా పాశం గురించి 

సమయసందర్భ ఆశలే - సమ్మోహ కళలై సంసార 

సమర మందేను జీవితం - శబ్దమ్ము కలిగే బంధమ్ము 

మమత మారేటి పంతమై - మోహమ్ము నలిగే కాలమై 

సమత మానవత్వముయే -  జీవితాన మనోవాంఛలే 

విధేయుడు : మల్లాప్రగడ రామకృష్ణ

0

ప్రేమతో ... సోయగాలు కొత్త ప్రక్రియ 

*

సత్యమే జయముని నమ్మాలి 

నిత్య మనసు నుంచు  

సత్య వాక్కువలన శాంతియే 

సత్ప్రవర్తనమ్ము 

హితమే మతమని తెలుసుకో  

బతుకు సాగు ఘనము

సంతృప్తి నొందుము ప్రేమతో  ..... 04

నీతిని నమ్మియు బతుకుట 

నీతి నిన్ను నమ్ము 

ఖ్యాతియు చెప్పి ఎపుడు రాదు  

అతిగ ఆశ వలదు 

నీతికో విదులకు ప్రణతులు

జాతి మేలు చూడు 

నీతి పాటించుము ప్రేమతో    .... 05

*

*🧘‍♂️ధర్మరాజ దశమి🧘‍♀️*

          *ధర్మరాజ దశమి లేదా యమ ధర్మరాజ దశమి మరణానికి దేవుడు అయిన యమ భగవానుడికి అంకితం చేయబడింది.  యమధర్మరాజు అని కూడా పిలువబడే ధర్మరాజు కు అంకితం చేసిన పూజ ఆ రోజు జరుగుతుంది. ఈ వ్రతాన్ని 10 వ రోజు చైత్ర మాసం శుక్ల పక్షంలో పాటిస్తారు.* 

          *ప్రాథమికంగా ఈ రోజున చేసే పూజలు భక్తుడి నుండి మరణ భయాన్ని తొలగించడంపై దృష్టి పెడతాయి.*

  *మరణం యొక్క రహస్యం గురించి తెలుసుకోవడానికి యమ నివాసానికి వెళ్ళిన కథ ఉపనిషత్తులోని యువ నచికేతుల కథ వినడం ఆనందంగా ఉంటుంది*.

              *మరణాన్ని జయించిన నచికేతుడు*

  *ఉపనిషత్తులకు వేదాంతాలు అని పేరు. ఆధ్మాత్మిక జ్ఞానంలోని లోతును 'వేదాంతం' అని పిలుచుకునేంతగా ఉపనిషత్తులు భారతీయ తాత్విక చింతనను ప్రకటిస్తున్నాయి. ఉపనిషత్తులో అక్కడక్కడా కొన్ని కథలు కనిపించినా వాటిలో సత్యకామజాబాలి , నచికేతుడి కథలకి చాలా ప్రాముఖ్యత ఉంది.  నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోవడమే జ్ఞాని లక్షణం అని సత్యకామజాబాలి చెబితే , అన్న మాటకు కట్టుబడాలి అని నచికేతుని కథ ప్రస్ఫుటం చేస్తుంది*.

 *🧘‍♂️నచికేతుని కథ🧘‍♀️*

          *కఠోపనిషత్తులో కనిపిస్తుంది. పూర్వం గౌతముని వంశానికి చెందిన 'వాజశ్రవసుడు'  అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను ఒకసారి విశ్వజిత్‌ అనే యాగాన్ని సంకల్పించాడు. అప్పటికే జ్ఞానిగా పేరు పొందినవాడు కాబట్టి , వాజశ్రవసుని యాగం గురించి వినగానే జనం తండోపతాండాలుగా వచ్చారు. యాగం అద్భుతంగా సాగి , నిరాటంకంగా ముగిసింది. ఇక దాన కార్యక్రమాలు మొదలయ్యాయి. వాటిలో భాగంగా వాజశ్రవసుడు ఆరోగ్యంగానూ ,ధృడంగానూ ఉన్న గోవులను తన వద్దనే ఉంచుకుని… వట్టిపోయిన ముసలి ఆవులనూ , అనారోగ్యంతో బలహీనంగా ఉన్నవాటినీ దానం చేయడం మొదలుపెట్టాడు. తండ్రి ప్రవర్తన చూసిన నచికేతునికి బాధ కలిగింది. దానం అంటూ చేస్తే అది అవతలివాడికి ఉపయోగపడేదిగా ఉండాలే కానీ , తన దగ్గర ఉన్నవాటిని వదిలించుకునేవిగా ఉండకూడదు కదా అన్న సందేహం మొదలైంది. పైగా బాల్యచాపల్యంతో తండ్రి దగ్గరకు వెళ్లి 'ఇలా నీకు పనికిరానివాటన్నింటినీ దానం చేస్తున్నావు సరే ! ఇంతకీ నన్నెవరికి దానం చేస్తావు ?'  అని అడగడం మొదలుపెట్టాడు. పిల్లవాడు అదే ప్రశ్నను మాటిమాటికీ అడగడంతో తండ్రికి చిర్రెత్తుకొచ్చింది, 'నిన్ను ఆ యముడికి దానం చేస్తున్నాను పొమ్మన్నాడు.'*

      *తండ్రి నోట్లోంచి అలాంటి మాట వినిపించగానే నచికేతుడు నిశ్చేష్టుడయ్యాడు. తొందరపడి తాను అన్నమాటకు తండ్రి కూడా పశ్చాత్తాపపడ్డాడు. 'ఏదో పొరపాటున అనేశాను. ఊరుకో'  అన్నాడు తండ్రి. కానీ నచికేతుడు ఊరుకోలేదు. పవిత్రమైన యజ్ఞసమయంలో , అందులోనూ దానం జరుగుతున్న సందర్భంలో తండ్రి నుంచి అలాంటి మాట వచ్చిందంటే దానిని నెరవేర్చి తీరాలనుకున్నాడు నచికేతుడు. 'పొరపాటున అనేశాను' అని తండ్రి ఎంతగా వారిస్తున్నా వినకుండా ఆ యయునికి తనను తాను అర్పించుకునేందుకు బయల్దేరాడు. యమలోకంలో నచికేతునికి యముని దర్శనం అంత త్వరగా లభించలేదు. జీవకోటి పాపపుణ్యాలను బేరీజు వేస్తూ , సమయం వచ్చినప్పడు వారి ప్రాణాలను హరిస్తున్న యముడు తలమునకలుగా ఉన్నాడు. ఎప్పుడో మూడు రోజుల తరువాత నచికేతుని గమనించాడు యముడు.*

 *ముక్కుపచ్చలారని పసిపిల్లవాడికి యమలోకంలో పనేంటి ? ఇంటికి పో!' అన్నాడు యముడు. కానీ నచికేతుడు అదరకుండా బెదరకుండా , జరిగినదంతా చెప్పి తనను దానంగా స్వీకరించమని యముడిని ప్రార్థించాడు. 'ఏదో తొందరపాటుగా అన్నంతమాత్రాన నీ ఆయువు తీరకముందే నిన్ను స్వీకరించడం భావ్యం కాదు. నిన్ను నేను స్వీకరించలేను. పైగా నువ్వు నా ద్వారం ముందర మూడు రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపావు కాబట్టి , నేనే నీకు మూడు వరాలను ఇస్తాను తీసుకో !'  అన్నాడు యముడు , నచికేతుని సత్యనిష్ఠకు ముచ్చటపడి*.

                   *నువ్వు నన్ను దానంగా స్వీకరించలేదు కాబట్టి నా తండ్రి నా మీద కోపగించుకోకుండా , నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి. అదే నా తొలి కోరిక' అన్నాడు  నచికేతుడు. దానికి యముడు 'తథాస్తు' అన్నాడు. ఇక రెండవ కోరికగా 'ఎవరైనా సరే స్వర్గాన్ని చేరుకునేలా ఒక యజ్ఞాన్ని అనుగ్రహించమ'న్నాడు నచికేతుడు*.   

       *ఇందులో స్వర్గం అన్న మాటకు ఒక గూఢార్థం ఉంది - 'స్వర్గలోకే న భయం కించనాస్తి' అంటాడు నచికేతుడు , అంటే నిర్భయమైన స్థితిని ఇక్కడ నచికేతుడు స్వర్గంగా సూచిస్తున్నాడు. దాంతో యముడు 'నచికేత యజ్ఞం' పేరుతో ఒక యజ్ఞాన్ని ఉపదేశిస్తాడు. ఇక మూడవ కోరికగా 'చనిపోయిన తరువాత మనిషి ఏమవుతాడు ?' అని అడుగుతాడు నచికేతుడు. తనంతటివాడు ప్రత్యక్షమై కావల్సిన కోరికలు కోరుకోమంటే 'నా తండ్రి నన్ను అభిమానించాలి , భయాన్ని జయించే స్వర్గం కావాలి , మరణ రహస్యం తెలియాలి' అంటూ ఈ పిల్లవాడు పరమార్థిక కోరికలను కోరడం యముడికి సైతం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందుకే 'నువ్వు చిన్నపిల్లవాడివి. అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు. ఈ జననమరణాల గురించి దేవతలకే బోలెడు అనుమానాలున్నాయి. వేరే ఏదన్నా కోరుకో. నీకు ఏం కావాలన్నా వరమిస్తాను.' అని నచికేతునికి నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు యముడు. కానీ నచికేతుడు తన పట్టుని విడవలేదు. తనకి ఇస్తేగిస్తే ఆ మరణజ్ఞానాన్నే వరంగా ఇవ్వమని కోరుకున్నాడు*.

           *నచికేతుని పట్టుదల , తృష్ణ చూసిన యముడికి ముచ్చట వేసింది. 'సరే చెబుతా విను. మీ మానవులు గుడ్డివాళ్లని అనుసరించే గుడ్డివాళ్లలాగా , అన్నీ భౌతిక సుఖాలలోనే ఉన్నాయనే భ్రమలో ఉంటారు. తమ కోరికలను చంపుకోలేక , పునరావృతమవుతున్న ఆ కోరికలను పూర్తిగా తీర్చుకోనూలేక మళ్లీ మళ్లీ భూలోకంలో జన్మిస్తూనే ఉంటారు. నిజానికి ఈ లోకంలో శాశ్వతమైనది ఒక్క ఆత్మ ఒక్కటే ! దానిని అశాశ్వతమైనవాటితో ఎలా పొందగలరు ?....  అంటూ ఆత్మతత్వం గురించి సుదీర్ఘంగా వివరిస్తాడు యమధర్మరాజు. ఆ మాటలకు సంతృప్తి చెందిన నచికేతుడు తన ఇంటికి సంతోషంగా తిరుగుముఖం పడతాడు*.

    *ఆత్మజ్ఞానం గురించి యముడికీ , నచికేతునికీ జరిగిన సంభాషణే కఠోపనిషత్తులో ముఖ్యభాగం వహిస్తుంది. నిజానికి ఈ ఉపనిషత్తు మరో భగవద్గీతను తలపిస్తుంది. అందుకే వివేకానంద వంటి జ్ఞానులకి కఠోపనిషత్తు అంటే ఎంతో ఇష్టం. 'నచికేతుడు వంటి దృఢమైన విశ్వాసం ఉన్న ఓ పదిపన్నెండు మంది పిల్లలు ఉంటే , ఈ దేశానికే ఒక కొత్త దిశను చూపించగలను' అంటారు వివేకానంద. అంతేకాదు ఆయన తరచూ స్మరించే 'ఉత్తిష్ఠత జాగ్రత'  (లేవండి , మేలుకోండి) అన్న మాటలు కూడా కఠోపనిషత్తులోనివే !*

--(())--


ప్రాంజలి ప్రభ పద్య పుష్పాలు - మానిని  -
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మా :: కోపము చూపకు కాలము చెప్పకు నీదియు నాదియు మాటలుగా
         లోపము వెద్కుట చేష్టలు కాదులె తీరిక ఉన్నది సేవల కే
          పాపము చేయకు  నిత్యము పల్కకు పాడుప దాలను ఎప్పటికీ      
         దీపము పెట్టుము వేదము పల్కెద హాయిగ ఉండును శాంతముగా
మా ::  అప్పుటి కప్పుడు  తప్పులు చేసిన తెచ్చును తిప్పలు ఏకముగా      
          ఇప్పుటి  కిప్పుడు  చేసిన  ఓర్పుకి  ఇచ్చును సంతస మొచ్చునులే    
          ఎప్పుడు చేయకు  కోపముతో పనె  చేసిన  కష్టము కోరుటయే     
          ఒప్పుకొ  తప్పులు  మంచిని పంచుకొ ఓర్పును చూపియు బత్కుటయే
మా :: గోపతి గోప్యము  ఎప్పుడు నీడగ వెంటనె ఉండును రక్షణగా      
         చూపరి చూపులు చిత్రము ఐనచొ  ఆడది ఆగుతా కష్టమెగా   
         తాపము వచ్చిన  చూపును ముద్రత  ఏదియు కాదని చెప్పదుగా
         జాప్యము లేదులె ఆకలి ఉందిజ  వేగము పెంచితి శీఘ్రముగా
మా ::నిప్పుల జోలికి పోయిన కాటికి చేరిన కాయము లెక్కవలె
        తప్పులు మీదను తప్పులు జాబిత బాధలు వచ్చుట లెక్కవలె
         చెప్పక చెప్పిన సత్యము  నమ్మిన వానికి  వేదము లెక్కవలె
         అప్పులు  ఇచ్చుట అప్పులు తెచ్చుట జీవికి నష్టము లెక్కవలె
                     --(())--
Pranjali Prabha daily 23/04
🦠వైరాలజీ శాస్తంలో ఉన్న ఒక పాఠ సారాంశం
👉 కరోనా అంటే ఏమిటి ?
👉  కరోనా  ఎలా వృధ్ధి
           చెందుతుంది ?  
👉 కరోనా వ్యాధిని ఎలా
         నివారించవచ్చు ?
    కరోనా అనునది  ప్రాణము లేని ఒక అచేతన స్థితిలో ఉన్న  ప్రోటీన్ పదార్థపు కణము.
దీని పైన క్రొవ్వు పదార్థము ఒక పొరలా యేర్పడి ఒక పౌడరులా  వుంటుంది.
ఇతర వాటిలా కాక ఈ  కణము కొంత బరువు కలిగి వుండటంతో గాలిలో యెగురలేదు.
 భూమిపై పడిపోతుంది.
 ఇది ఒక నిర్జీవ కణం.
స్త్రీ అండాశయంలో నిర్జీవ అండం ఎలా అయితే 14 రోజులు వుండి,
 వీర్య కణంతో జీవకణంగా మారి, కణ విభజన మొదలవుతుందో.....
అలానే కరోనా నిర్జీవ కణం  కూడా 14 రోజులు నిర్జీవ కణంగానే వుండి,
ఈ మధ్యలో  ఎప్పుడైతే మానవుని శరీరంలోని
 "చీమిడి" తో సంపర్కమవుతుందో దానిలో కణ విభజన ఆరంభమవుతుంది.
మన ముక్కు లోని చీమిడి లో కల ప్రోటీన్ ధాతువులు దీనికి మూలాధారం.
మన కంటి 'కలక' లేక 'పుసిలి' కానీ,  ముక్కులోని 'చీమిడి' కానీ,  నోటిలోని 'గళ్ళ' కానీ దానికి దొరికితే వెంటనే నిముషాలలో కొన్ని వేల, లక్షలలో కణ విభజన జరిగి శ్వాస కోశాలలో చేరి, ఊపిరి తిత్తులలోని రక్తనాళాలను ఆక్రమించి మన శరీరానికి ప్రాణవాయువును నిరోధిస్తుంది.
దీని కారణంగా, రోగి ప్రాణవాయువు అందక మరణిస్తాడు. 😭😭
దీని విస్తరణ కు పడిశాన్ని వుధృతం చేసికుంటుంది.
   రోగిష్టి తుమ్మినపుడూ,  దగ్గినపుడూ, వారి చీమిడి ద్వారా,  కఫము ద్వారా, ఈ రోగ కణాలు ఎచ్చటంటే  అచ్చట పడతాయి.
మనం దగ్గరగా వుంటే మనపై పడవచ్చు. లేక అవి తుంపరలుగా వేటిపైనన్నా పడివుంటే,  ఆయా పదార్థ లక్షణములను బట్టి వాతావరణం లోని వేడిని స్వీకరించు సామర్థ్యాన్ని బట్టి  అవి 4 గంటల నుండీ 24 గంటల వరకూ శక్తివంతమై ఉండగలవు.
అంటే వేడికి దీనిపై వున్న క్రొవ్వు పొర కరగి పోయి  నిర్వీర్యమై పోతుంది.
 👉  ఇప్పటి వరకూ
    ఈ వ్యాధి విజృంభించిన దేశాలన్నీ దరిదాపు శీతల ప్రదేశాలే.
 వేడి తక్కువ ప్రాంతాలు కావటం తో దీనిపై గల
 కొవ్వుపొర కరగడానికి హెచ్చు ఆస్కారం లేక పోవడం ఒక కారణం....
    ఈ మధ్య సమయం లో వాటిని మనం స్పర్శించినచో  🦠🦠🦠🦠
అవి మనకు అంటుకొన గలవు.
 సర్వ సాధారణంగా మనం మన చేతులతోనే స్పర్శించుతాము కావున మన అరచేతులకు,  వ్రేళ్ళకు అంటుకొనగలవు.
సర్వ సాధారణంగా మన చేతులతో మన కళ్ళను,  ముక్కును,  నోటిని స్పర్శించడం సహజం.  
ఈ విధంగా రోగ కణాలు ఎక్కడికైతే చేరకూడదో అచ్చటికి సులభంగా చేరిపోతాయి.
   👉 ఒక్కసారి అవి
            మన
          కంటి కలకను కానీ,
👉 చీమిడిని లేక ముక్కులోని
       పొక్కులను కానీ,
 👉 మన నోటిలోని గళ్ళను
           కానీ చేరాయో......
🚨🚨🚨
       ఇక వాటిని నిరోధించటం
         అసాధ్యం.
ఇవి సర్వ సాధారణంగా అందరిలో ఎల్లవేళలా  ముఖ్యంగా ముసలి వారిలో  వుంటాయి.
 కళ్ళ కలక ను చేరితే వెంటనే అది కంటి నీరుగా వృధ్ధి చెంది, ముక్కు ప్రక్కగా జారి, ముక్కు ద్వారా విజృంభిస్తుంది.
 🧬🧬🧬
 దీనికి ఇంతవరకూ మందు కనుగొన లేకున్నా,  దీనికి గల కొన్ని బలహీనతలను ఆసరాగా చేసు
కుని మనలను మనం రక్షించుకోవచ్చు.
దీనికి రక్షక కవచం దీనిపైనున్న కొవ్వు పదార్ధం.
ఈ కొవ్వు పదార్థాన్ని
మనం తొలగించి నట్లయితే దీనిని నిర్వీర్యం చేయవచ్చు.  
 సాధారణంగా క్రొవ్వు పదార్థం వేడికి కరిగి పోతుంది.
లేక 'సబ్బు' నురుగుకు కరగి పోతుంది. ♨♨♨
సర్వ సాధారణంగా మన ఇళ్లలో చేతికి కాని, పాత్రలకు కానీ పట్టిన జిడ్డు
 (కొవ్వు పదార్థం)ను తొలగించడానికి మనం సబ్బు పదార్థాలు వాడుతాం.
దీనికి కూడా అంతే.
    మన శరీరాన్ని,  తల వెంట్రుకలతో సహా సుమారు 40 డిగ్రీల సెంటిగ్రేడ్ నీటితో, బాగా నురుగు వచ్చే సబ్బుతో,  రోజుకు 2-3 పర్యాయాలు బాగా తల స్నానం చేయడంతో
 మన శరీర భాగాలను అంటుకున్న ఈ కరోనా కణము పైగల కొవ్వు కరగి పోయి నిర్వీర్యమై పోతుంది.
ఆ తరువాత బాగా కొబ్బరి నూనెను శరీర భాగాలకు రుద్దుకుంటే, ఒకవేళ మన శరీర భాగాలపై ఈ రోగకణాలు మరలా పడ్డా,   అందులో చిక్కుకుని బయటకు రాలేని స్థితి ఏర్పడుతుంది.
మారు స్నాన శుభ్రత లో వీటిని నిర్వీర్యం చేయవచ్చు.
 వీటి మధ్య లో అనేక పర్యాయాలు మన చేతులను 38 డిగ్రీలు  అంతకన్నా హెచ్చు వేడి నీటితో, బాగా నురుగు వచ్చే సబ్బుతో  నిముషం పాటు శుభ్ర పరచుకుంటే.....
మనం ధరించే వస్త్రాలను,  కర్చీఫులను,
మాస్కులను
శుభ్ర పరచుకుంటే.....
👉👉 ఈ వ్యాధి కణాలపై
      ఉన్న కొవ్వును కరిగించి దానిని నిర్వీర్యం చేయవచ్చు.
కానీ ఎట్టి పరిస్థితులలో అయినా ఈ కణం మన ముఖానికి చేర కూడదు.
 🛑🛑🛑
కంటి కలక తో కానీ, ముక్కు చీమిడి లేక పొక్కులతో కానీ, నోటి గళ్ళ తో కానీ  సంపర్క మైతే దానిని అడ్డుకొనటం అసాధ్యం.
    ఇదే వైద్యులు  నెత్తి నోరు కొట్టుకొని మనకు చెప్పే సలహాలు, వాటి వెనుక వున్న ఉద్దేశాలు.
   దీనిని మీ వారి కందరికి తెలిపి ఈ వ్యాధి
 నుండి జాగ్రత్త పరచండి.

 

May be an image of 4 people

No comments:

Post a Comment