మధురిమలు..నా..భావము
రచయిత. మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
మధురిమలు .. వాకిళ్ళు అంగళ్ళు లోగిళ్ళు
ఒకనాటి వేశ్యల స్థితి
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
కష్టమోస్తే కన్నీళ్ళు
దాహమైతే ఎక్కిళ్ళు
తెరచి ఉంచే వాకిళ్ళు
ఆదుకొనేటి అంగళ్ళు
జిలుగు వన్నె రుమాళ్ళు
చెవులు మత్యపు జోళ్ళు
వెగటైన వడదోళ్ళు
ఉండే ఆట గాళ్ళు
వార కాంతల యిళ్ళు
వచ్చు రాచ కొమాళ్ళు
నారీమణుల పెళ్ళు
అబ్బే నారి కేళ్ళు ... క
వాసించు వటివేళ్ళు
వారిజాక్షి నగుళ్ళు
పూజలకు దేవుళ్ళు
నిత్య ము తలచు గుళ్ళు
శృంగార సావళ్ళు
బంగారు మెడసూళ్ళు
నిగ్యైన మద్దెళ్ళు
మోహపు నేర్పు గాళ్ళు
మధ్యన యిద్దరాళ్ళు
విసిరారు సవాళ్ళు
మాట తెలపని వళ్ళు
మనసు దోచే కళ్ళు .... క
వచ్చే నీటుగాళ్ళు
కనికరమైన కళ్ళు
కదిలించేను కాళ్ళు
వంచారు మోకాళ్ళు
వెంటే కేటు గాళ్ళు
చేయు గుల్లగ వొళ్ళు
వరుస లేని వాళ్ళు
గుళ్ళ చేసె వాళ్ళు
అందమైన వాళ్ళు
మనసు దోచు వాళ్ళు
ముత్తు చేయు వాళ్ళు
ముద్దు పెంచు వాళ్ళు
గాలి నిచ్చు వాళ్ళు
చిత్తు చేయు వాళ్ళు
రెక్క చూపు వాళ్ళు
లెక్క చెప్పే వొళ్ళు
కష్టమోస్తే కన్నీళ్ళు
దాహమైతే ఎక్కిళ్ళు
తెరచి ఉంచే వాకిళ్ళు
ఆదుకొనేటి లోగిళ్ళు
--(())--
[• మనిషీ... ఓ మనిషీ!!
చేతిలో డబ్బు లేకపోతే ఇంట్లో ఉన్న కూరగాయలు తినేసి ఊరుకుంటావ్...
జేబునిండా డబ్బు ఉంటే స్టార్ హోటల్‌కు వెళ్లి అవే కూరగాయలు తిని ఆనందిస్తావ్...!
డబ్బు లేని రోజున ....
సైకిల్ మీద ఆఫీసుకు వెళతావ్...
డబ్బులు ఎక్కువైతే అదే సైకిల్
ఇంట్లోనే ఎక్కి ఎక్కర్‌సైజ్‌లు చేస్తావ్...!
డబ్బులు లేనప్పుడు సంపాదన కోసం చెప్పులు అరిగేలా నడుస్తావ్...
డబ్బు ఎక్కువైతే పెరిగిన కొవ్వు కరిగించుకొనేందుకు నడుస్తావ్...!
మనిషీ ... ఓ మనిషీ!!
ఇలా నిన్ను నీవు మోసం చేసుకొనేందుకు ....
ఏ రోజునా వెనకడుగు వేయవ్!
డబ్బు లేనప్పుడు కుదురుకొనేందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటావ్...
డబ్బు ఎక్కువయినప్పుడు విడాకులు కావాలనుకుంటావ్ ...!
డబ్బు లేనప్పుడు ....
నీ భార్య నీ సెక్రటరీ అవుతుంది....
డబ్బు ఎక్కువైతే ....
నీ సెక్రటరీయే భార్య అవుతుంది....!
డబ్బు లేనప్పడు ....
సంపన్నుడిలా నటిస్తావు...
డబ్బు ఉన్నప్పడు ....
నిరుపేదలా నటిస్తావు...!
మనిషీ... ఓ మనిషీ!!
జీవితంలో ఎన్నడూ ....
సత్యానికి దగ్గరగా ఉండవ్...!
షేర్ మార్కెట్..
అంతా మోసం అని అరుస్తావ్... అయినా స్పెక్యులేషన్ మానవ్..!
డబ్బు మహా చెడ్డది అంటావ్..
అయినా ....
సంపదను పోగుచేయడం మానవ్...!
పదవులు వస్తే అందరికీ దూరం అయిపోతాం అని లెక్చరిస్తావ్ ....
అయినా పదవుల వెంటపడతావ్...!
మనిషీ... ఓ మనిషీ!!
నువ్వో చిత్రం!
నీవు అనుకున్నది చేయవు..
చేసేది చెప్పవు... !!
మనిషీ... ఓ మనిషీ!!
నువ్వో మహా విచిత్రం!!
*(ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఆంగ్ల కవితకు అనుసృజన)*
***********
*దేవుడి ఇంటికి సరైన దారి*
〰〰〰〰〰〰〰〰
🔼 *'రామాపురం'* అనే ఊళ్ళో రైలు దిగండి.v
⏺ *'నమ్మకం'* అనే రిక్షాని మాట్లాడుకోండి.
🔼 *భక్తి* అనే పేటలోకి తీసుకెళ్ళమనండి.
⏺ *పాపం* అనే డెడ్ ఎండ్ వీధి వస్తుంది.
🔼 *పుణ్యం* అనే దాని ఎదురు సందులోకి ముందుకి సాగండి.
⏺ *ప్రార్ధన* అనే వంతెనని దాటండి.
🔼 *కర్మ* అనే సర్కిల్ వస్తుంది.
⏺ *దుష్కర్మ* అనే రెడ్‌లైట్ అక్కడ వెలుగుతూండవచ్చు.
🔼 *సుకర్మ* అనే పచ్చలైటు వెలిగాక ముందుకి సాగండి.
⏺ *భజనమండలి* అన్న బోర్డున్న కుడి రోడ్డులోకి మళ్ళండి.
🔼అక్కడ రోడ్డు నాలుగు రోడ్లుగా చీలుతుంది.
⏺మొదటి మూడిటి పేర్లు - *అసూయ స్ట్రీట్, ద్వేషం సందు, ప్రతీకారం వీధి.*
🔼వాటిని వదిలి నాలుగో సందులోకి తిరగండి. దానిపేరు *సత్సంగం* వీధి.
⏺పక్కనే కనబడే *వద0తుల* వీధిలోకి వెళ్ళకండి. అది వన్‌వే రోడ్డు.
🔼కాస్తంత ముందుకు వెళ్ళాక ఓ జంక్షన్ వస్తుంది.
అక్కడ ఎడమవైపు రోడ్డు పేరు *వ్యామోహం.*
⏺కుడివైపు రోడ్డు పేరు *వైరాగ్యం.* వైరాగ్యం వీధిలోకి వెళ్ళండి.
🔼ఎదురుగా మీకు *కైవల్యం* అనే మరో చౌరస్తా కనిపిస్తుంది.
⏺ *దయగల హృదయం - భగవన్నిలయం* అన్న బోర్డున్న తెల్లరంగు ఇల్లు కనిపిస్తుంది.
☯గేటు దగ్గరున్న *ముక్తి* అనే తలుపు మిమ్మల్ని చూడగానే తెరుచుకుంటుంది.
ఇది *దేవుడి ఇంటికి సరైన దారి.*
మీరు మీ బంధుమిత్రులకి కూడా ఈ దారిని తెలపండి. లేదా సరైన దారి తెలియక వారు దారి తప్పిపోవచ్చు.
ఆధ్యాత్మిక మార్గంలో భక్తి, మంత్రం, ధ్యానం ఇలా...రకరకాల సాధన ఏదైనా గాని, చేసేవారు ఎవరైనా గాని తెలుసుకోవలసిన సూక్ష్మ విషయం ఇదే!
**********
_*💫 మన దేవాలయ దర్శనంలో ఉన్న సాంకేతిక ఏమిటో తెలుసుకుందాం... 🥀*_
_*1. మూలవిరాట్ :* భూమిలో ఎక్కడైయితే electronic & magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ మూల విరాట్ ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు catalyst గా పని చేస్తాయి._
_*2. ప్రదక్షిణ :* మనం గుడి చుట్టు clockwise direction లో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన.. ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు. పుణ్యక్షేత్రాలు vedic architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరం లోని షఠ్ చక్రాలను ప్రభావితం చేస్తాయి._
_*3. ఆభరణాలతో దర్శనం :* ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు.. బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని..._
_*4. కొబ్బరి కాయ :* ఇది స్వచ్ఛతకు గుర్తు. పై టెంక మన అహంకారాన్ని.. దాన్ని పగలగొడితే వచ్చే కొబ్బరి మన కల్మషం లేని మనసును.. అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం..._
_*5. మంత్రాలు :* ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే neurons ని ఆక్టివేట్ చేసి డేటా ని దాస్తున్నాం.. అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర నియమంతో ఒక లయను కల్గి neuron లను ఉత్తేజపరువస్తాయి._
_*6. గర్భగుడి :* గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు._
_*7. అభిషేకం :* విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి.. వాటికి పాలు తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం._
_*8. హారతి :* పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు.. హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి.. దీనికి ఆయుర్వేద పరిభాష లో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు._
_*9. తీర్థం :* ఇందులో పచ్చ కర్పూరం.. తులసి.. లవంగాలు ఇలా ఎన్నో.. పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థం గా ఇస్తారు._
_*10. మడి :* తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కువగా తీసుకునే గుణం ఉంటుంది.. అందుకే మడి..!_
🙏 *ఏడు కొండలు* 🙏
🍒 *భాగము 16* 🍒
🌻 *శ్రీ శైలం* 🌻
🍃🌹వక్షస్థల మహాలక్ష్మీ సమేతుడైన శ్రీనివాసుడు 'కలౌ వేంకట నాయక అన్న ప్రసిద్ధితో కోరిన వారందరికీ సంపదలను ప్రసాదిస్తున్నాడు.
🍃🌹శ్రీమహాలక్ష్మి వసిస్తున్నందువల్లే 'శ్రీశైలం' అనీ 'శ్రీసగ్గిరి' అనీ.. ఇలా అనేక పేర్లతో పిలవబడుతూ వింత వింత తేజస్సులతో ప్రకాశిస్తున్నదని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ వర్ణించింది
🍃🌹శ్రీప్రదమైన, శాశ్వతమైన సిరులను కురిపిస్తూ లక్ష్మీసమేతుడై శ్రీనివాసుడు ఉన్న ఈ కొండ 'శ్రీశైలం” అని ప్రసిద్ధిని పొందింది.
🍃🌹ఇలాగ అనేక యుగాల్లో అనేక పేర్లతో విరాజిల్లుతున్న అద్భుతమైన మహిమలు వున్న దివ్యక్షేత్రం వేంకటాచలం! ఈ క్షేత్రానికి వున్న అనంత నామాలలో తెలిసినంతవరకు కొన్ని పేర్లనైనా స్మరించినా చాలు! సకల దురితాలు చాల సులువుగా తొలగిపోతాయి.
🍃🌹మరికొన్ని పేర్లను ఉచ్ఛరించినా చాలు! అనేక జన్మల్లో తెలిసీ, తెలియక మనసా, వాచా, కర్మణా చేసిన ఎన్నో పాపాలు ఇట్టే నశిస్తాయి. అద్భుతమైన వేంకటాచలయాత్రకు వెళ్లి ఆ దివ్య క్షేత్రాన్ని తాకితే చాలు! భయంకరమైన కర్మరోగాలు, నశించి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ప్రారబ్ధ, సంచిత, ఆగామి కర్మల ఫలితాలు అన్నీ నశిస్తాయి.
🍃🌹వేంకటాచలయాత్రకు వెళ్లాలి అని సంకల్పిస్తే చాలు! ఒక ఆనందం కుటుంబ సభ్యులతో కొండకు బయలుదేరితే చాలు. అది చెప్పలేని ఆనందం ఏడు కొండలలో విహరిస్తే చాలు! వింత వింత అనుభూతులతో కూడిన విచిత్రమైన ఆనందం! ఆ కొండపై అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుని బంగారు మేడ' ఆనంద నిలయ విమానాన్ని తలపైకెత్తి చూస్తే చాలు చాలు తన్మయంతో కూడిన ఒక దివ్యానందం.
🍃🌹ఆ బంగారు విమాన అంతర్భాగంలో మనం అందరికోసం ఎదురుచూస్తున్న ఏడు కొండలవాణ్ణి ఒకే ఒక్క క్షణం కన్నులార్పక, కన్నుల నిండా దర్శిస్తే చాలు! చాలు! అవ్యక్తమైన అనంతమైన ఆనందంతో కూడిన అనుభూతి నిలువెల్ల కలుగుతుంది.
🌺(ఎవరు రాశారో తెలియదు గాని అద్భుతం గా వుంది.)
అమ్మ చేసిన రొట్టె *వృత్తము*
సగానికి మడిచిన దోసె *అర్ధ వృత్తము*
మనం కూర్చునే స్టూల్ *చతురస్త్రం*
పడుకునే మంచం *దీర్ఘ చతురస్త్రం*
మనకిష్టమైన లడ్డూఒక *గోళము*
సగం మన మిత్రునికిస్తే *అర్ధ గోళము*
మన తరగతి గది ఒక *ఘనం*
మనం కూర్చునే బెంచీ ఒక *దీర్ఘ ఘనం*
మన జెండా కర్ర ఒక *స్థూపం*
కొడవలి మలుపు ఒక *చాపం*
ధాన్యపు రాశి ఒక *శంఖువు*
రూపాయి రూపాయి కలిపితె *కూడిక*
కొనడానికి కొంత తీస్తే *తీసివేత*
తలా పది పంచితే *భాగహారం*
హెచ్చిస్తే *గుణకారం*
కూర్చుంటే *జడత్వం*
కదిలితే *చలనం*
పరిగెత్తితే *వేగం*
ఆగి ఆగి పరుగు తీస్తే *త్వరణం*
పడిపోతే *ఆకర్షణ*
విడిపోతే *వికర్షణ*
తన చుట్టూ తాను తిరిగితే *భ్రమణం*
గుడి చుట్టూ తిరిగితే *పరిభ్రమణం*
మాట్లాడడానికి *శక్తి*
పనిచేయడానికి *బలం*
గంటకు ఎంతపని చేస్తావో అది *సామర్థ్యం*
వింటున్నా మంటే *శబ్దం*
చూస్తున్నామంటే *వెలుగు*
రంగులన్ని *వర్ణ పటం*
ఆహారం అరగడం *జీవక్రియ*
అరిగిన ఆహారం శక్తిగా మారడం *రసాయన క్రియ*
ఉచ్వాస నిశ్వాస *శ్వాస క్రియ*
నేను చూశాను *భూతకాలం*
నేను చూస్తున్న *వర్ధమాన కాలం*
నేను చూడ బోతున్న *భవిష్యత్ కాలం*
నాకు తొంభై ఏళ్ళు ఇక *పోయే కాలం*
బతుకుల్లో లేనిది ఏముంది శాస్త్రాల్లో ..
సరిగా అర్థం చేసుకుంటే మన బతుకే ఒక శాస్త్రం...
మనిషిని, ఇతర ప్రాణుల్ని , ప్రకృతిని
గురించి తెలుసుకోవడం తప్ప..
భయమెందుకు నీకు ...
నీకంటే ప్రపంచంలో ఎవరు గొప్ప...
తెలుసుకో పదిలంగా
నేర్చుకో సులభంగా...! *అదే మన తెలుగు భాష గొప్ప*.
********🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹
*శ్రీమద్భాగవత మాహాత్మ్యం*
🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹🍁🌹
శ్లో.
*సంసారం సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే!,*
*కర్మమోహగృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్.*
శ్లో.
*శ్రీమద్భాగవతస్యాపి తతః పూజా ప్రయత్నతః,*
*కర్తవ్యా విధినా ప్రీత్యా ధూపదీప సమన్వితా.*
శ్లో.
*తతస్తు శ్రీఫలం ధృత్వా నమస్కారం సమాచరేత్,*
*స్తుతిః ప్రసన్న చిత్తేన కర్తవ్యా కేవలం తదా.*
శ్లో.
*శ్రీమద్భాగవతాఖ్యోsయం ప్రత్యక్షః కృష్ణఏవహి,*
*స్వీకృతో౬సి మయా నాథ ముక్త్యర్థం భవసాగరే.*
శ్లో.
*మనోరథో మదీయోsయం సఫలః సర్వథి త్వయా,*
*నిర్విఘ్నేన కర్తవ్యో దాసోsహం తవ కేశవ.*
*భావము:*
'కరుణానిధీ!నేను సంసారసాగరంలో నిండుగామునిగిఉన్నాను. చాలా దీనుడను కర్మల యొక్క మోహం అనే మొసలి నన్ను పట్టుకొనింది. కనుక, మీరు ఈసంసార సముద్రం నుంచి ఉద్ధరించాలి' అని ప్రార్థించాలి.
ఆతర్వాత ధూపదీపాలు మొదలైన వాటితో శ్రీమద్భాగవతాన్ని ఉత్సాహంతో, భక్తిప్రపత్తులతో విధివిధానంగ పూజించాలి.
ఆతర్వాత గ్రంథానికి ముందు కొబ్బరికాయను సమర్పించి, నమస్కరించాలి.
తర్వాత ప్రసన్న చిత్తంతో ముఖ్యవిధిగా భావించి, ఇలా స్తుతించాలి.
శ్రీమద్భాగవత రూపాన శ్రీకృష్ణపరమాత్ముడవైన నీవే
ప్రత్యక్షంగా విరాజిల్లావు.
కనుక, ప్రభూ! నేను భవసాగరం నుంచి విముక్తిని పొందడానీకి నీ శరణుజొచ్చాను.
కేశవా! నేను నీ దాసుడను. ఏ విధమైన విఘ్నాలుగానీ, బాధలుగానీ కలుగనీయక నా ఈ కోరికను పూర్తిగా ఫలవంతం చేయాలి.
(పద్మపురాణం 2వ అధ్యాయం శ్లో.27-30)
[18/01, 6:32 am] +91 94414 08564: 🙏 *ఓం నమః శివాయ* 🙏
🍃🌼పరమ శివుని పూజించుకునేటప్పుడు మనం "ఏక బిల్వం శివార్పణం" అంటూ మారేడు దళాలను సమర్పించుకుంటూ పూజించుకుంటాము.
🍃🌼ఙ్ఞానస్వరూపమయిన పరమాత్ముడే పరమశివుడు. మనలోని అఙ్ఞానాన్ని రూపుమాపి, ఙ్ఞానజ్యోతిని వెలిగించి, మన మనసులను పవిత్రం చేసి, నిర్మలమైన జీవనాన్ని కలిగించమని, ఙ్ఞానస్వరూపమైన మారేడు దళాలను స్వామికి సమర్పించుకుంటూ ఉంటాము.
🍃🌼మారేడు దళాలను పరిశీలించినప్పుడు మూడు దళాలు కలిసి ఒక్క కాండానికే ఉండాటాన్ని గమనించగలము. అందుకే, దీనికి బిల్వము అనే పేరు వచింది. ఈ మూడు రేకులకు ఆధ్యత్మికంగా పూజకుడు-పూజ్యము- పూజ / స్తోత్రము - స్తుత్యము- స్తుతి/ ఙ్ఞాత - ఙ్ఞ్యేయము - ఙ్ఞానము అనే అర్ధాలను చెబుతున్నారు.
🍃🌼ఇలాగ మూడిటిని వేరు వేరుగా భావించటమే త్రిపుటి ఙ్ఞానము.ఒక వృక్షానికి కొమ్మలు వేరు వేరుగా కనిపించి నప్పటికి, ఆధారకాండము ఒకటే అయినట్లు , సృష్టి, స్థిథి, లయ కారకుడైన ఆ మహదేవుడు మారెడు దళాలతో " మూడు పత్రాలుగా వేరు వేరు ఉన్నట్లు గోచరిస్తున్నాడు.
🍃🌼కాని ఆయన సర్వాంత్రయామి!
బిల్వపత్ర దర్శనం వలన అత్యంత పుణ్యం లభిస్తుంది.వాటిని స్పృసించడంవలన వలన సర్వ పాపాలు నశిస్తాయి.
🍃🌼ఓక బిల్వ పత్రాన్ని శివునికి భక్తిశ్రద్ధలతో అర్పించతం వలన, ఘోరాతిఘోరమైన పాపాలు సైతం తొలగిపోతూ ఉంటాయి. అటువంటి త్రిగుణాలుగల బిల్వ దళ్ళాన్ని స్వామికి అర్పించుకుంటే ఆయన అనుగ్రహం సులభంగ కలుగుతుంది.
🍃🌼"పూజకుడవు నీవే ,పూజింబడేది నీవే" - అనే భావంతో శివుని పూజించుతయే ఉత్తమమైన భావం. ఈ ఙ్ఞానరహస్యాన్ని తెలుసుకుని - బిల్వపత్రరూపంతో ' త్రిపుటి ఙ్ఞానాన్ని ' నీ పాదాల చెంత నేను సమర్పిస్తున్నాను అని స్వామికి విన్నపించుకుని " శివోహం, శివోహం " అనే మహావాక్య ఙ్ఞానాన్ని స్థిరపరిచేదే బిల్వార్చన అవుతుంది.
🍃🌼పవిత్రమైన ఈశ్వర పూజకు " బిల్వపత్రం " సర్వశ్రేష్టమైనది. శివార్చన కు మూడు రేకులతోనున్న పూర్తి బిల్వదళాన్ని ఉపయోగించాలి.
బిల్వదళాలు వాడిపోయినప్పటికి పూజర్హత కలిగి ఉంటాయి.
🍃🌼ఏక బిల్వ పత్రంలోని మూడు ఆకులలో ఎడమవైపునున్నది బ్రహ్మ అని, కుడి వైపు ఉన్నది విష్ణువు అని, మధ్యన ఉన్నది శివుడు అని చెప్పబడుతోంది.
🍃🌼ఇంకా బిల్వదళంలోని ముందు భాగం లో అమృతము, వెనుక భాగంలో యక్షులు ఉండటo చేత బిల్వపత్రం యొక్క ముందు భాగాన్ని శివుడి వైపుకు ఉంచి పూజ చెయ్యాలి.
🍃🌼బిల్వవనం కాశి క్షేత్రంతో సరిసమానం అని శాస్త్రవచనం. మారేడు చెట్లు ఉన్న చోట శివుడు నివసిస్తాడు. ఇంటి ఆవరణ లో , ఈశన్యభాగంలో మారేడు చెట్టు ఉంటే , ఆపదలు తొలగి, సర్వైశ్వర్యాలు కలుగుతాయి!
🍃🌼తూర్పున ఉంటే సుఖప్రాప్తి కలుగుతుంది.
పడమర వైపు ఉంటే సుపుత్రసంతాన ప్రాప్తి, దక్షిణ వైపు ఉంటే యమబాధలు ఉండవు!
🙏 *హర హర మహాదేవ శంభో శంకర !* 🙏
[18/01, 6:33 am] +91 94414 08564: 🙏 *శివుడికి ప్రీతికరమైన పుష్పాలు* 🙏
🍃🌼పరమశివుడికి ఏ పుష్పాలతో అర్చన ఇష్టమంటే
*కరవీరార్క మందార శమీ వకుళ కింశుకమ్!*
*మధూక బృహతీ బిల్వ మపామార్గం చ పాటలమ్!!*
*అశోకాగస్త్య దత్తూర కర్ణికార కదంబకమ్!*
*బాణపున్నాగ తిలకం కోవిదారం చ చంపకమ్!!*
*మల్లికా మాధవీ జాతిః ద్రోణం చ శతపత్రకమ్!*
*కమలం కైరవం చైవ తథానీలోత్పలాని చ!!*
*తమాలం తులసీపత్ర మిత్యేతాని శివార్చనే!*
*పుష్పపత్రాణి శస్తాని సర్వపాప హరాణి చ!!* (శివతత్త్వ సార సంగ్రహం)
🌻 *శివార్చనకు* 🌻
కరవీరం (గన్నేరు),
అర్కం (జిల్లేడు),
మందారం,
శమీ (జమ్మి),
బొగడ,
మోదుగ,
ఇప్ప,
వెంపలి,
బిల్వం(మారేడు),
అపామార్గం (ఉత్తరేణి),
కలిగొట్టు,
అశోకం,
అవిసె,
ఉమ్మెత్త,
కొండగోగు,
కడిమి,
నల్ల గోరింట,
సురపొన్న,
ఎర్రగోరింట,
ఎర్ర దేవకాంచనం,
సంపెంగ,
మల్లి,
పండు గురివింద,
జాజి,
తుమ్మి,
నూరు రేకుల పద్మం,
వెయ్యి రేకుల పద్మం,
తెల్లకలువ,
నల్లకలువ,
తాపింఛం
🍃🌼వీటికి సంబంధించిన పుష్పపత్రాలు సర్వదా శ్రేష్ఠాలు. వీటితో పరమ శివుణ్ణి పూజిస్తే, సమస్త పాపాలూ నశిస్తాయి
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
*జయజయహే భాగవతవరేణ్యా!*
*బమ్మెరపోతన సుకవివరేణ్యా!!*
సమర్పణ
om
ReplyDelete