ప్రతి ఒక్కరికి మనవి చేస్తున్నాను నేను 2012 నుండి కధలు కవితలు అనేకమైన విశ్లేషకులు వాట్సాప్ వచ్చాక గౄపులు ద్వారా అంతర్జాల ము ద్వారా సేకరించినవి ఇందు పొందు పరుస్తున్నాను. ఇది ఉచితం ఆన్లైను అంతర్జాల పత్రిక ఇది "ఆనందం ఆరోగ్యం ఆధ్యాత్మికం " మాత్రమే
🌹అంశం :గణతంత్ర భారతం🌹
●○●○●○●○●○●○●○●○●○●○●○●○
ఎగురుతున్నది మన దేశ మువ్వన్నెల కీర్తి పతాకం వినబడుతున్నది మన దేశ ఖ్యాతి జాతీయ సమైక్యతా రాగం ధ్వనిస్తున్నది ఎందరో త్యాగమూర్తుల సమర శంఖారావం శబ్ధం సరిహద్దుల్లో పహారా కాస్తూ హద్దులు దాటిన వారిని హతమారుస్తూ దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన వీర జవాన్ల ధీరత్వం
ఆకలి తీర్చే కర్షకులు, యువతకు చైతన్యం నింపి ఆశయాలకు ఊపిరి పోసే నాయకులు
అమరవీరులు అనుచరణలకు ఆనవాళ్లుగా నిలిచేవారు మాతృభూమి కోసం సర్వం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తులు కులమతాలు వేరైనా భాషలు ఎన్నైనా మేమంతా ఒక్కటే అంటూ మార్గ దర్శకులుగా నిలిచిన మహానుభావులు ఎందరెందరో అందరికీ శిరస్సు వంచి ప్రణమిల్లుదాం నివాళులు అర్పిద్దాం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విభిన్న సంస్కృతులు ఎన్ని ఉన్నా
మానవత్వం చాటుదాం తుప్పు పట్టిన చట్టాలు సవరిద్దాం విద్య వైద్యం అందరికీ అందేలా చూద్దాం,ఆత్మస్థైర్యం నింపుదాం కుల మత రాజకీయాలు నశింపచేద్దాం రాజ్యాంగ విలువలను కాపాడుదాం దేశ ఆర్థికాభివృద్ధికి పురోగతికి పాటుపడదాం మనమంతా ఒక్కటే అని ఎలుగెత్తి చాటుదాం ప్రపంచ శిఖరాగ్రాన్ని చేరుదాం మన మనసులో నిష్కల్మషం మాటల్లో పదును చూపుల్లో తెగువ మన గుండెల్లో మెండుగా నిండిన ధైర్యం
మనం భారతీయులం అనే గర్వం అడుగడుగునా మనసులో స్ఫూర్తిని ఉత్సాహన్ని నింపిన భరతమాత ముద్దు బిడ్డలకు వేల వేల వందనాలు సమర్పిద్దాం పౌరులందరికీ సమాన హక్కులు కల్పిస్తూ ప్రతి ఒక్కరి ఆత్మ గౌరవం కాపాడుదాం ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము అంటూ దేశభక్తిని పెంపొందిద్దాం గణతంత్రపు ఘంటారావం ప్రగతి గుండెల్లో మారుమ్రోగగా మనం రూపొందించుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఈ శుభవేళ గణతంత్ర శుభాకాంక్షలు తెలుపుకుంటూ భరతమాత ముద్దుబిడ్డలుగా మనకు స్వేచ్ఛ నిచ్చిన శాంతి మంత్రాన్ని జపిద్దాం శాంతి కపోతం ఎగరేద్దాం వందేమాతరం అందాం అందరం వందేమాతరం
🌹 జై హింద్🌹
●○●○●○●○●○●○●○●○●○●○●○●○
Mallapragada Sridevi: ऊँ!
----
"సీ.
----
నారాయణాంశుని' నౌమ్యహ' మ్మందును
నిత్యమననముతో నియతిగాను
బ్రహ్మాంశసత్త్వఁపుభాసమునొందిన
దినకరు సేవింతు తిరముగాను
రుద్రప్రతేజుని రుగ్ఘర్తునెపుడును
చైతన్యదాయకు శాంతిఁగోర్దు
త్రైమూర్తి భాసుఁడు తరణియే రహినియొసఁగు
మోదదు శ్రీరామ వంశజు మూలవేల్పు
గీ.
--
అట్టి దేవపూజ్యురవిని యహరహమును
శబ్దసంక్షేమసందాతృ చండతేజు
అలుపెరుగనినిత్యగమను హాయినిడెడి
సూర్యుఁగొలిచెద మనమున సూక్తవిధిని !!! "
------------
ప్రతి తండ్రి తప్పకుండా చదవాల్సిన స్టోరీ 😊
#నాన్నలందరికీ_అంకితం
బ్రహ్మదేవుడు చాలా బిజీగా తల రాతలు రాసే పనిలో ఉన్నాడు. ఇంతలో నేను, భూమి మీదకు వెళ్ళను అని మారాం చేయడం మొదలుపెట్టాను.
“భూమి మీద నాకు ఎవ్వరూ తెలీదు. నేను ఎలా బతకగలను? అని అడిగాను. నువ్వేం భయపడకు. నిన్ను కాచి కాపాడటానికి నా అంశగా ఒక అమ్మను తయారుచేశాను. ఆమె కడుపులో నిన్ను పుట్టిస్తా” అన్నాడు బ్రహ్మదేవుడు.
“అయితే సరే, కానీ నాకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా నేను ఏడవటం మొదలుపెడతా. అప్పుడు మీరు నా ఇబ్బందిని తొలగించాలి” అనే షరతు పెట్టాను.
దానికి బ్రహ్మా, “సరే నీకు మాటలు రానంత వరకు బ్రహ్మా విష్ణు మహేశ్వరులం ముగ్గురు నీకు సహాయం చేస్తాం” అన్నాడు.
“మరి, ఆ తర్వాత చెయ్యరా?” అని అడిగా
“అదేం లేదులే. నీకు మాటలోచ్చాకా నీకో మహా మంత్రం భోదిస్తాం. నీకు ఏ కష్టం వచ్చినా, ఒక్కసారి ఆ మంత్రం పఠిస్తే తప్పకుండా నీకు సహాయం దొరుకుతుంది.” అని చెప్పాడు బ్రహ్మా.
మళ్ళీ ఇంకేదో అడగబోయే లోపల ఆ పరబ్రహ్మ, తన బెడ్రూం బాల్కనీ లోంచి నన్ను కిందకి త్రోసేశాడు. ఎలా వచ్చి చేరానో తెలియదు గానీ, ఆసుపత్రి బెడ్ మీద మా అమ్మ పక్కన వచ్చిపడ్డాను.
అమ్మ పక్కన హాయిగా నిద్రపోతున్న నన్ను, ఓ పెద్దమనిషి తన చేతిలోకి తీసుకున్నాడు. భయమేసి, అమ్మ వైపు చూసి ఏడుపు ముఖం పెట్టాను. “మీ నాన్నగారు రా!” అంటూ అమ్మ తన కంటి చూపు తో ఆయన్ని పరిచయం చేసింది.
బ్రహ్మాదేవుడు నాకు అమ్మ గురించి చెప్పి పంపాడు. తను అన్ని చోట్ల ఉండటం కుదరక అమ్మని సృష్టించాను అని. మరి నాన్న అంటే ఎవరు? భూమి మీద పడిన మొదటి రోజే నా బుర్రలో ఎన్నో ఆలోచనలు మొదలయ్యాయి.ఆ దేవుడినే అడిగి తెలుసుకుందామని ఏడుపు మొదలుపెట్టా.
“ఇప్పుడే కదా భూమి మీద పడ్డావు. అప్పుడే నన్ను గుర్తుచేసుకున్నావేమిటి?” అని అడిగాడు. అమ్మ గురించి చెప్పారు గాని, నాన్న గురించి ఏమీ చెప్పలేదెంటని అడిగా.
“నీ జన్మకి నాంది, నీ భవితకు పునాది” అని ముక్తసరిగా బదులిచ్చి, “అర్ధమైందా?” అని ప్రశ్నించాడు.
“పాలు తాగే పసివాడి ప్రశ్నకి ప్రాస తో బదులిస్తే ఎలా అర్ధం అవుతుంది స్వామి” అని సమాధానం చెప్పాను.
ఒక అర్ధం లేని చిరునవ్వు నవ్వి, “నీకూ మీ అమ్మకు కాపుగా నేను నియమించిన అంగరక్షకుడు” అని క్లుప్తంగా చెప్పాడు. అప్పుడు అర్ధమైంది నా బుజ్జి బుర్రకి, నా కష్టం తీర్చేది అమ్మ అని. మాకు ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాన్నదని.
ఆ రోజు నుంచి నా చిన్ని కళ్ళు నాన్న కోసం వెతుకుతూనే ఉండేవి. ఎప్పుడో ఉదయన్నే వెళ్ళిపోయి సాయంత్రం వచ్చేవాడు. “ఏం, నేనంటే ప్రేమ లేదా” అని ప్రశ్నించా ఆ దేవుడిని మళ్ళీ. “నీ మీద ప్రేమ ఉంది కాబట్టే, రోజు బయటికి వెళ్ళి కష్టపడి పని చేసి వస్తున్నాడు” అని బదులిచ్చాడు బ్రహ్మా. అర్ధం కాలేదని చెప్పాను. కొన్నేళ్లకు నీకే అర్ధం అవుతుందిలే అన్నాడు.
ఈయన అన్నీ తల తిక్క సమాధానాలే చెబుతాడులే అనుకుని, నా దగ్గరికి వచ్చిన మా నాన్న మొహం చూసా. మా నాన్న ముఖం నీరసంగా కనిపించింది. పలకరింపు కోసం ఒక చిరునవ్వు నవ్వా. మా నాన్న ముఖం లోని నీరసం మాయమైంది. నన్ను చూసిన ఆయన ముఖం పున్నమి చంద్రుడిలా మెరిసిపోసాగింది. ఆ దేవ దేవుడు నా నవ్వులో ఇంత మహిమ దాచాడా! అని గర్వపడటం మొదలుపెట్టా.
మళ్ళీ మళ్ళీ నవ్వడం నేర్చుకున్నా. నేను నవ్విన ప్రతి సారి, మా నాన్న ముఖంలో ఆనందం పది రెట్లు ఎక్కువగా కనిపించేది. మా నాన్న నన్ను ముద్దులతో ముంచేయటం మొదలుపెట్టారు. అలా ఆ సాయంత్రాలు మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచాయి.
కొన్నాళ్ళకి, నా చిట్టి పాదాలకి కొంచెం బలం చేకూరింది. నడక నేర్చుకుందామని ప్రయత్నించా. కానీ ఫలితం లేదు. పదే పదే పడిపోతూనే ఉన్నా. ఇంతలో నాన్న తన చూపుడు వేలును నాకు అందించాడు. నేను నడవలేకపోతున్నానని వెక్కిరిస్తున్నాడనుకున్నా! “నా వేలు పట్టుకుని నిల్చో నాన్నా” అన్నారు.
నిలబడగలిగాను కానీ, నా అడుగులు ఇంకా తడబడుతూనే ఉన్నాయి. ఆ మహా శివుణ్ణి, మనసులో ప్రార్దించడం మొదలుపెట్టా. తన ఢమరుక నాదంతో నా పాదాలని ప్రేరేపించమని ప్రాధేయపడ్డాను. ఆ ఢమరుక నాదపు సడిలో, వడి వడిగా అడుగులు వేయటం నేర్చుకుని మా నాన్నను ఆశ్చర్యపరుద్దామనుకున్నా. ఆ మహా శివుడికి నా మొర వినిపించలేదేమో! నా ప్రార్థనకి జవాబు దొరకలేదు. ఇంతలో మా నాన్న వెల్లకిలా పడుకున్నారు. నన్ను తన రెండు చేతులతో పట్టుకుని తన గుండెల మీద నిలబెట్టుకున్నారు. డమరుక నాదం లేకపోతేనేం!, నా గుండే చప్పుడుని నీ అరికాళ్ళతో అనుభవించి అడుగులు వేయటం నేర్చుకోమని అభయమిచ్చారు. ఏం మాయో తెలీదు. నాన్న గుండె చప్పుడు నా కాళ్ళకి తగలగానే నేనే శివుడిలా మారిపోయా. నడక రాని నేను నాన్న గుండెల మీద యధేచ్చగా నాట్యం చేయటం మొదలుపెట్టా.
నడక నేర్చిన నా చిన్ని పాదాలు కొత్త గమ్యాలను వెతకటం ప్రారంభించాయి. నడవటం మొదలుపెట్టాను. కొంత దూరం వెళ్ళాక, అటూ ఇటూ చూశాను. ఎవ్వరూ కనిపించలేదు. భయం వేసింది. ఆ శ్రీ మహా విష్ణువు అన్ని చోట్ల ఉంటాడుగా, మరి నాకు భయమెందుకు. ఆయన్నే పిలుద్దాం అని మనసులో తలుచుకున్నా. ఆయన కనిపించలేదు గాని వినిపించాడు. “ఏమైంది బాలకా” అని అన్నాడు. “భయం వేసింది స్వామి. అందుకే పిలిచా” అన్నా నేను.
“భయం ఎందుకు? నీవు నడుస్తుంది మీ నాన్న నీడ లోనేగా” అన్నాడు. ఆశ్చర్యం వేసి వెనక్కి తిరిగి చూసా. అవును నాన్న నా వెనకే ఉన్నారు. నాకు తగినంత స్వేచ్చనిస్తూ, నా ప్రయాణాన్ని గమనిస్తూ, నన్ను ఏ ప్రమాదం తాకకుండా, నాకు రక్షణగా నా వెనకే నడుస్తున్నారు. నా మనసులో భయం తొలగి ముఖంలో చిరునవ్వు మొదలయ్యింది. అప్రయత్నంగానే నా పెదవులు ‘నాన్న’ అని పలకటం మొదలుపెట్టాయి. నాన్న నన్ను ఎత్తుకుని నా ముఖమంతా ముద్దులతో ముంచేశారు. మళ్ళీ మళ్ళీ నాన్న అని పిలవమన్నారు. నేను పిలిచిన కొద్దీ, నాన్న ముఖంలో ఆనందం రెట్టింపు అవుతూనే ఉంది.
నాకు ఏ అవసరం వచ్చినా, ఏడ్చి ఆ దేవుడిని పిలిచే బదులు, మా నాన్నని పిలవడమే మేలు అనిపించింది. దేవుడు వచ్చేవాడో, రాడో తెలీదు గాని మా నాన్న మాత్రం నన్ను కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నాడు. నా అవసరాలన్నీ, నేను చెప్పక ముందే తెలుసుకుని మరీ తీర్చేవాడు. కొన్నాళ్ళకు నాన్న కూడా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఆయన నేర్పిన జీవిత పాఠాలు నాకు తోడుగా ఉండేవి.
ఆఖరికి నేను కూడా ఆ దేవుడి దగ్గరికి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను.
“నీ జీవిత మజిలీ ఎలా సాగింది?” అని ప్రశ్నించారు బ్రహ్మా విష్ణు మహేశ్వరులు.
“మీరు నాకు ఏ మంత్రమూ భోదించకపోయినప్పటికీ, నా జీవన చక్రం బాగానే సాగింది ప్రభు.” అని సమాధానం చెప్పాను గర్వంగా.
“అదేంటి అలా అంటావ్! మేము నీ నోట పలికించిన మంత్రాన్ని రోజు నువ్వు పఠిస్తుండటం ఉండటం మేము గమనిస్తూనే ఉన్నాం” అన్నారు మూకుమ్మడిగా.
“నాకు ఏం అర్ధం కావట్లేదు స్వామి” అని బదులిచ్చా నేను. బ్రహ్మా విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకరిలో ఒకరు ఐక్యం అవుతూ ఒకే రూపంగా మారి ప్రత్యక్ష్యమయ్యారు. ఆశ్చర్యపోయాను. మా నాన్న రూపం నా ముందు ప్రత్యక్ష్యమైంది. అప్పుడు గానీ అర్ధం కాలేదు ఈ మనిషి బుర్రకి, (మట్టి బుర్రకి). “అమ్మ ఆ దేవుడి అంశ అని” “నాన్న సాక్ష్యాత్ దేవుడని”. మిమ్మల్ని గుర్తించలేకపోయాను, నన్ను క్షమించండి స్వామి. అని ఆయన పాదాలమీద సాగిలపడ్డాను.
ఆ దేవుడి ముఖంలో అదే చెరగని చిరునవ్వు. నా భుజాల మీద చేయి వేసి పైకి లేపారు. ప్రేమగా హత్తుకున్నారు. నన్ను క్షమించి, నా ఆత్మకు మోక్షం ప్రసాదించండి స్వామి అని అడిగా ఆయన చెవిలో. క్షమిస్తా, కానీ ఒక్క షరతుతో అన్నాడు ఆ దేవ దేవుడు. ఏమిటది స్వామీ! అని అడిగా ఆశ్చర్యంగా. నన్ను ఆఖరుసారిగా ‘నాన్న’ అని సంభోదించగలవా అని అడిగారు ఆ సర్వేశ్వరులు. ఆ మహా మంత్రాన్ని
ఇంకోసారి జపించడానికి, నిముషం కూడా ఆలస్యం చేయలేదు నేను. నాన్న అని పిలిచి ఆయనలోనే ఐక్యం అయిపోయా.
“అమ్మ దేవుడి అంశ అయితే,
నాన్న సాక్ష్యాత్ దేవుడే”
--(())--
"మనిషి జీవితం విచిత్రమైంది
"యవ్వనంలో సమయం,
శక్తి రెండూ...ఉంటాయి..
కానీ డబ్బు ఉండదు..?
మధ్య వయసులో డబ్బు,
శక్తి రెండూఉంటాయి.
కానీ సమయం ఉండదు..??
వృద్ధాప్యంలో సమయం,
డబ్బు రెండూఉంటాయి.
కానీ శక్తి మాత్రం ఉండదు..
తెలుసుకునే ప్రయత్నం చేసే లోపు...
జీవితం ముగిసిపోతుంది.
మనం పుట్టినప్పుడు మనల్ని ఎవరు వచ్చి చూశారో మనకు తెలియదు..
మనం మరణించాక మనల్ని ఎవరు చూడటానికి వస్తారో కూడా మనకు తెలియదు...కాబట్టి మనం బ్రతికి ఉన్నప్పుడు మనతో ఉన్నవాళ్లను మనసారా ప్రేమించండి
ఆప్యాయత అనురాగలను పంచండి.
మనం మరణించి కూడా జీవించేలా మానవత్వాన్ని చాటండి.
--(())--
మిత్రాయనమః 💞
"అరే, ఒరే, ఒసే, ఏమే, ఏరా, /
అనెడి మిత్రుండొకడుండిన చాలు/
వృద్ధాప్యంబున, అదెనొసంగునారోగ్యంబు/
మిత్రాయనమః/(1)
స్నేహితుండులేని జీవితంబు/
తైలంబు లేని దీపంబు, దినకరుండు లేని/
దినంబు, ఉప్పులేని పప్పు వ్యర్ధంబు/
మిత్రాయనమః!/(2)
"ఔషధంబుకానౌషధౌంబు/
మనంబునకు శాంతినొసంగు/
తెలతెలవారంగ 'ఏరా, ఏమే' అని వినంగ/
మిత్రాయనమః/(3)
"దేశంబులనున్న, దేవళంబుననున్న/
సంతలోననున్న, సభలలోననున్న/
'ఏరా'యని వినంగ తృళ్ళిపడు తేటపడు/
మానసంబు, మిత్రుని పలుకు చెవిని పడ/
మిత్రాయనమః/(4)
"పూర్వజనమ పుణ్యంబున దొరకు/
ఏరాయను బాల్యమిత్రుండు,/
వృద్ధాప్యంబున పలుకరించ/
అమృతము చిలకరించు పలుకు/
అదిలేని జనమంబు దరిద్రమ్ము/
మిత్రాయనమః/(5)॥
"నిదుర లేవంగ 'ఏరా' లేనిచో/
సగము ప్రాణంబులు పోవు/
తీపి గురుతులే మిగులు/
దిగులు చెంద దినంబులు భారంబుగ/
మిత్రాయనమః!"(6).
మితృలందరికీ అంకితం!🙏
--(())--
అతిరథ మహారథులు..అంటే..ఎవరు...!?
అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం. అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం మనకు అర్థమవుతుంది.
అయితే ఆ పదాలకు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు.
మహామహా గొప్పవాళ్ళు వచ్చారనే అర్థంలో వాడతామనేది అందరికీ తెలుసు.
ఆ పదాలకు అర్థాలేమిటో చూద్దాం .
యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి.
ఇందులో 5 స్థాయులున్నాయి.
అవి..
రథి, అతిరథి, మహారథి, అతి మహారథి, మహామహారథి, రథి..
ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు.
సోమదత్తుడు, సుదక్షిణ, శకుని, శిశుపాల, ఉత్తర, కౌరవుల్లో 96మంది, శిఖండి, ఉత్తమౌజులు,
ద్రౌపది కొడుకులు -వీరంతా..రథులు.
అతి రథి (రథికి 12రెట్లు)..60,000మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.
లవకుశులు, కృతవర్మ,శల్య, కృపాచార్య, భూరిశ్రవ, ద్రుపద, యుయుత్సు విరాట, అకంపన,
సాత్యకి, దృష్టద్యుమ్న, కుంతిభోజ, ఘటోత్కచ, ప్రహస్త అంగద, దుర్యోధన, జయద్రథ,
దుశ్శాసన, వికర్ణ విరాట, యుధిష్ఠిర, నకుల, సహదేవ ప్రద్యుమ్నులు వీరంతా..అతిరథులు.
మహారథి (అతిరథికి 12రెట్లు). 7,20,000 మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.
రాముడు, కృష్ణుడు, అభిమన్యుడు, వాలి, అంగద, అశ్వత్థామ, అతికాయ, భీమ, కర్ణ అర్జున,
భీష్మ, ద్రోణ,కుంభకర్ణ,సుగ్రీవ,జాంబవంత, రావణ, భగదత్త, నరకాసుర, లక్ష్మణ, బలరామ,
జరాసంధులు వీరంతా..మహారథులు. అతి మహారథి (మహారథికి 12రెట్లు) 86,40,000 (ఎనభై ఆరు లక్షల నలభైవేలు) మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు.
ఇంద్రజిత్తు, పరశురాముడు, ఆంజనేయుడు, వీరభద్రుడు, భైరవుడు -
వీరు..అతి మహారథులు. రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు,
అటు ఇంద్రజిత్తు - ఇటు ఆంజనేయుడు. రామలక్ష్మణ రావణ కుంభకర్ణులు మహారథులు మాత్రమే. మహామహారథి (అతిమహారథికి 24రెట్లు) .
ఏకకాలంలో 207,360,000
(ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలు) మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలడు.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, దుర్గా దేవి గణపతి మరియు సుబ్రహ్మణ్య స్వామి, viరంతా..మహామహారథులు. మహామహారథులలో అమ్మవారు కూడా ఉండడం
హిందూ ధర్మంలోనున్న మహిళా సాధికారతకు నిదర్శనం. మహిళ..యుద్ధంలో పాల్గొన్న సంగతే ఇతర మతాల్లో మనకు కనిపించదు.
అలాంటిది, ఒక మహిళయైన దుర్గా దేవి ఏకంగా ఇరవైకోట్ల మంది కంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్టుగా గుర్తించడం మామూలు విషయం కాదు...
🙏🙏🙏
WISH HAPPY REPUBLIC DAY BY PRANJALI PRABHA
26-01-2020 (DAILY MAGAZINE FROM FACEBOOK AND
GOOGLE )
ప్రాంజలి ప్రభ - ఎవరికైనా
ధనాన్ని చూస్తే ఎవరికైనా
బుద్ది చంచల మౌతుంది
శెవాన్ని చూస్తే ఎవరికైనా
బుద్ది వేదాంత మౌతుంది
స్త్రీ వేషాన్ని చూస్తే ఎవరికైనా
బుద్ధి ఆలోచన మారుతుంది
యువతి కళ్ళు చూస్తే ఎవరికైనా
బుద్ధి ఎదో తెల్పాలనిపిస్తుంది
పౌర్ణమి వన్నెల చూస్తే ఎవరికైనా
కలలు నిజం చేసుకోవాలనిపిస్తుంది
అమావాస్య చీకటిని చూస్తే ఎవరికైనా
తెలియని మైకం కమ్ము కుంటుంది
తలఎత్తి పైకి చూస్తే ఎవరికైనా
కళ్ళను కమ్మే వెలుగు కనబడుతుంది
చుక్కలతో చంద్రుని చూస్తే ఎవరికైనా
మనసు తన్మయత్వం చెందుతుంది
కమనీయ ప్రకృతి చూస్తే ఎవరికైనా
నయనాలు వెలుగు చిమ్ముతుంది
అనుకోని సంఘటన చూస్తే ఎవరికైనా
హృదయం గగుర్పాటు చెందుతుంది
--((*))--
*సరస సంభాషణ (ఛందస్సు)
UUUU-IIII-UIU (KOTTADI)
సాంఘీకంగా కధలను పోల్చగా
సామాన్యంగా నిజమును పోల్చెనే
స్నేహంగానే కళలను తీర్చెనే
ఆనందంతో అలకను మార్చెనే
సంధానం గా అణుకువ చూపెనే
మౌనంగానే ఒకటవ టానికే
మేధస్సంతా తెలుపుచు ఉండెనే
శక్తీ నంతా కలలతొ పూడ్చకే
సమ్మోహంగా కణతలు విచ్చెనే
ప్రాధాన్యంగా పలుకులు పల్కెనే
ప్రాభావంగా విలువలు పెంచేనే
వ్యత్యాసంగా వలపులు చూపెనే
పాఠాలన్నీ వరుసగ చెప్పవే
కొర్కళన్నీ మనసుతొ తీర్చవే
సమ్మోహంతో మనసును పంచుదాం
సంతోషంతో ఒకరిగ మారుదాం
--((*))--
నేటి కవిత - పావులు
ఎత్తులతో నడుస్తాయి పావులు
పావుల కదలకలే చదరంగం
ఎత్తులు పై ఎత్తుల రంగం
ధనంతో నడుస్తుంది రాజకీయం
మనుష్యుల బలహీనతతో
ఆడుతుంది రాజకీయ చదరంగం
ఎత్తులు పై ఎత్తుల రంగం
సంపాదించిన దాని రక్షించుకోవడం
రక్షించానదాన్ని వృద్ధిపరుచుకోవడం
లేని దాన్ని పట్టుదలతో సంపాదించడం
తగిన రీతిలో వినియోగించడం
ఇదియే తెలుసుకోవలసిన రాజతంత్రం
రాజతంత్ర ఆయుధం నీతి శాస్త్రం
సంధికి నిగ్రహానికి ఉండాలి రాజతంత్రం
బీదలను గొప్పవారిగా మార్చేది తంత్రం
గొప్పవారిని బీదవారిగా మార్చేది తంత్రం
ఆశలు ఆశయాల మద్యే ఉండే తంత్రం
కుట్రలు కుతంత్రాలతో నడిపే తంత్రం
రాజకీయాలను మలుపు తిప్పే తంత్రం
వ్యావహారికంగా నడిపించే ఒక యంత్రం
శత్రువులను మిత్రులుగా మార్చే రాజీ మంత్రం
మిత్రులను శత్రువులుగా మార్చే రాజీ మంత్రం
రాజకీయం నీతిగా బ్రతికితే గుర్తు ఉండే మంత్రం
ప్రజలు నాయకులు ఆడుకొనే రాజ తంత్రం
--((*))--
నేటి కవిత - తోడు
మనసుకు మనసు తోడు
మనసుకు మమత తోడు
మమతకు స్నేహము తోడు
స్నేహముకు బలము తోడు
బలానికి ధనము తోడు
ధనము ధర్మానికి తోడు
ధర్మం న్యాయానికి తోడు
న్యాయం సత్యానికి తోడు
సత్యమే మనిషికి తోడు
మనిషికి ప్రేమ తోడు
ప్రేమలే దేశానికి తోడు
ఒకరికి ఒక్కరే తోడు
కష్టాల కు కడలి తోడు
సుఖాలకు మనిషి తోడు
క్రమశిక్షణకు చీమ తోడు
ఐక మత్యంకు కాకి తోడు
ఎండకు నీడ తోడు
చలికి వెచ్చ తోడు
ఆతృతకు ఆశ తోడు
కోపానికి ప్రేమ తోడు
--((*))--
నేటి కవిత - మదిలో భావం
మదిలో భావం అనంతం
అనంతాన్ని చేసుకోలేము అర్ధం
అర్థంలోనే దాగి ఉంది పరమార్ధం
పరమార్ధ భావాలే నిజమైన అర్ధం
మనసు ఎప్పుడూ నలుగుతుంది
కారణం ఇదేనని చెప్పనంటుంది
సుఖదుఃఖం చుట్టూ తిరుగుతుంది
ఎండా వాన చలికి మనసు పూస్తుంది
ఒకటికి ఒకటి మన మమేకం
మమేకం లోనే ఉన్నది ఏకత్వం
ఏకత్వంలో ఉన్నది సృజనత్వం
సృజనత్వమే కవితలో పటుత్వం
కేశములెన్నో చెప్పుట కష్టమో
తరంగాలెన్నో తెల్పుట కష్టమో
మనసు అంతరంగాలు తెలుపుట కష్టమే
కావ్యాలను గగన చుక్కలను తెల్పుట కష్టమే కదా
అనుకున్న వాడికి ఎప్పుడూ ఒంటరి తనం
నేను కాదు అన్నవాడికి లేదు ఒంటరితనం
నాలో ఉన్నవాడు నడిపిస్తున్నాడు అనటం
చెట్టులా గా సహాయ పడటమే కదా వేదాంతం
ఋతువులు మారిన మనసు స్థితి మారదు
భూ భారము తీరేదాకా ఎప్పుడూ మారదు
సృష్టిని వ్యతిరేకించి ఎప్పుడూనడక సాగదు
కదులుతున్న క్రతువు ఇది ఎవ్వరి కష్టం కాదు
పువ్వు విచ్చి పరిమళిస్తుంది
ఆస్వాదించి మనసు వికసిస్తుంది
దేవుణ్ణి ఒక్కసారి ప్రార్ధించ మంటుంది
అందరి సుఖం తనదని బ్రతక మంటుంది
నదులు సంగమమే ఏకత్వం
ఏకత్వంలో ఉన్నది పరమాత్ముని తత్త్వం
స్త్రీ పురుషులే ఆది సంగమం
తత్వాలు హృదయాల సమానత్వం
చీకటి రాత్రి కొందరికి కాళరాత్రి
మరికొందరికి మధుర రాత్రి
కొన్ని తారలకు తన్మయ రాత్రి
విధాత సుష్టికి అందించిన శుభ రాత్రి
మమేకమే ప్రేమకు రూపం లేదు
అనంతమే వెన్నెలకు మార్గం లేదు
సమానత్వమే సుఖ లో మార్పు లేదు
మౌనవత్వమే ప్రశ్నకు జవాబు అనదు
నీవెనుక ఉన్నది నీవు గమనించలేవు
జరుగ బో యేవి ఏవి తెలుసుకో లేవు
నీవు జవాబే వెలుగు గా భావించావు
తృప్తిలోనే సంతృప్తిని గమనించావు
మనసులోని భావమే ఒక లోకం
మమతలోని అర్ధమే మరో లోకం
మనసుకి తాకే దే కవితా లోకం
మరోలోకానికి చేర్చిది భావ తత్త్వం
--((*))--
నేటి కవిత - నేత్రాకర్షణే
నేత్రాకర్షణే ఒక మంత్రం
మామూలుమనిశికి మంత్రమే ఒక దీపం
మంత్రానికి నిగ్రహ శక్తి తధ్యం
మంత్రశక్తే దేశాభివృద్ధికి గమ్యం
ఇద్దరి ఆలోచనే ఒక మంత్రం
మంత్రసాధనకు సహాయం ఖచ్చితం
మంత్రమే అందరికి రక్షణ వలయం
మంత్రాన్ని జపిస్తే కార్య సిద్ది సులభం
స్త్రీ, ధనం వళ్ళ మంత్రసిద్ధికై ఆటంకం
ఓర్పు ఓదార్పే మంత్ర సిద్ధికి ముఖ్యం
తనకు తాను జీవించటమే మంత్రం
నమ్మకం లేనిచోట పనిచేయదు మంత్రం
--((*))--
నేటి కవిత - రాజ్యం
సుఖానికి మూలం ధర్మం
ధర్మానికి మూలం అర్ధం
అర్ధానికి మూలం అర్ధాంగి
అర్ధాంగికి మూలం రాజ్యం
రాజ్యానికి మూలం ఇంద్రియం
ఇంద్రియానికి మూలం వినయం
వినయానికి మూలం వృద్ధ సేవ
వృద్ధసేవకు మూలం విజ్ఞానము
విజ్ఞానమునకు మూలం సంపాదన
సంపాదన కు మూలం ఆత్మ తృప్తి
ఆత్మతృప్తికి మూలం ఓర్పు లాభం
ఓర్పులాభానికి మూలం ప్రకృతి వరం
ప్రకృతి వరానికి మూలం క్రమశిక్షణ
క్రమశిక్షణ కు మూలం సూర్యోదయం
సూర్యోదయానికి మూలం కాలచక్రం
కాలచక్రానికి మూలం విధాత సృష్టి
విధాత సృష్టి కి మూలం ఆదిపరాశక్తి
ఆదిపరాశక్తి కి మూలం సర్వాంతర్యామి
సర్వాంతర్యామి కి మూలం ప్రేమతత్వం
ప్రేమతత్వానికి మూలం నమ్మకత్వమే
--((*))--
నేటి కవిత - కలువలు
కలువలు పూజ లాలసులకు
ముడుపులు దైవ లాలసులకు
మకుటము రాజ లాలసులకు
సకటము బద్ద లాలసులకు
కపటము మోస లాలసులకు
నటనము హాస్యలాలసులకు
జపమును మౌన లాలసులకు
తపమును మోక్ష లాలసులకు
ధనమును సత్య లాలసులకు
గుణమును మంచి లాలసులకు
సతియును ధర్మ లాలసులకు
పతియును న్యాయ లాలసులకు
తలపులు ప్రేమలాలసులకు
గడువులు అప్పులాలసులకు
పదవులు భోగలాలసులకు
చదువులు విద్యలాలసులకు
--((*))--
నేటి కవిత - తేటజలము
ఆటవెలఁది షట్పది - (ఛందస్సు)
తేట జలము చాల
తీపి ఉండ దగును
ప్రాణమమ్ము రక్ష-గాజలములు
మీట గలను వీణ
మేటి మాట వలన
మానసమ్ము రక్ష - గావలయును
తేట తెలుగు మాట
తేజ రిల్లు కనుక
హృదయమ్ము రక్ష - గావలయును
ఆట వలన తృప్తి
దేహ మంత కదులు
రక్త మంత వేడి - గామెరియును
ప్రాణ తపన కొంత
ప్రేమ యంత కదులు
ప్రేమ వళ్ళ జీవి - గాకదులును
మాట పలుకు మంచి
భావ సొంత మగును
సత్య మంత తెల్సు - కోకలిగెను
--((*))--
నేటి కవిత - మార్పు
ఎర్రిచూపుతో - ఏటిఎం చెరా
- లైను ఉన్నదీ - లంఖణంబులే
ఉండి కూడనే - వంతు రాగ నే
-డబ్బు లేదులే - ఇంత మీకులే
అన్న మాటలే - రేపు బోర్డు రా
ఎంతకావలే - ముందు నీకు రా
అన్న మాటలే - ఆశలే కదా
బ్యాన్కు వారిచ్చే - 2 వేలనోట్లులే
ఇంటి కెళ్లగా - చిల్లరా లెదే
అన్న మాటలే - చిర్రెత్తి కొనీ
మారెదీ ఎలా - నెత్తి పట్టెనే
బ్యాంకుకే పొగా - కొత్త నోట్లు లే
వంద నోట్ల నూ - మార్చి ఇచ్చెనే
ఇచ్చె చిల్లరా - సంతసించెనే
బీదవారి కీ - గొప్పవారి కీ
కార్డు గీకగా - డబ్బు వచ్చురా
షాపులో పప్పు - ఉప్పు తెచ్చురా
హాయి హాయి గా - ఉండూ ఇప్పుడే
-((*))--
నేటి కవిత - స్నానమునకు
స్నానమునకు మేను సుబ్రమగు
కలుషిత మనసు సుబ్రముకాదు
దైవపూజా వల్ల మనశాంతి కలుగు
దేవున్నినమ్మని వాడికి శాంతే ఉండదు
రామ నామ జపము మనసుకు తేలిక యగు
హృదయం లోపల శృతి చెంది శుబ్రమగు
చిత్త శుద్ధి కలిగి చిన్మయ చిత్తము ధన్య మగు
బాహ్య శుద్ధి కొరకు జీవిత మంతా శ్రమయగు
చీకటిలో కనులు తెరిచినా శూన్యము
శూన్య మందు చేయవలె సాధనము
సాధన వళ్ళ చీకటిలో మెరియుము
పెంచును సాధన ధ్యానము జ్ఞానము
--((*))--
[25/01, 6:26 am] +91 94414 08564: 🌻 *మహా భారతం* 🌻
🩸 *భాగము 25* 🩸
💧 *ఉత్తరుని నటనా కౌశలం* 💧
🍃🌺జరిగిన వృత్తాంతము విని, ఉత్తరుడు నిర్ఘాంతపోయాడు. అప్పటివరకూ వుల్లాసంగా వున్న ఉత్తరుని ముఖ కవళికలలో గాంభీర్యం చోటుచేసుకున్నది. వినయంగా తండ్రి ముందుకు వచ్చి, ‘‘మహారాజా! మీరు నిగ్రహం కోల్పోకుండా వుండాల్సింది. కంకభట్టారకుని వేత్తలేమి మాట్లాడినా, శిరసావహించడమే శ్రేయస్కరం.
🍃🌺ఇటువంటి మహనీయులు ఆగ్రహిస్తే మన ఆయుర్భాగ్యం, రాజ్యవైభవం వర్థిల్లగలవా? ఇప్పటికైనా జరిగినదానికి వారిని మన్నింపు కోరమని నా మనవి!’’ అని వేడుకున్నాడు. అప్పటికే జరిగినదానికి పశ్చాత్తాపపడుతున్న విరటుడు, కుమారుని మాటలకు చెవి యొగ్గాడు. దోసిలి కట్టి, అసంకల్పితంగా జరిగిన అపచారాల్ని మన్నించమని ప్రాధేయపడ్డాడు.
🍃🌺ఆ ప్రశాంతమూర్తి చిరునవ్వుతో తలపంకించి, ఉత్తరుని వైపు తిరిగి, ‘‘నేనేమాత్రము కోపించలేదు. ఆగ్రహ దినుసు నా వద్ద లేనేలేదు. పైగా మహారాజు మనస్తత్వమేమిటో నాకు తెలియదా? ఎన్నడూ లేని ధోరణి నేడు నా నుదుటిపై ప్రతిఫలించింది’’ అన్నాడు.కంకభట్టు సౌమ్యమైన మాటలకు మహారాజు వూరట చెందాడు. తిరిగి సౌహార్ద వాతావరణం నెలకొన్నది. వారిమధ్య ఇష్టాగోష్ఠి మొదలైంది. అంతలోనే బృహన్నల సముఖానికి వచ్చి, పెద్దలకు నమస్కరించాడు.
🍃🌺సారథిని అభినందించి, సముచిత మర్యాదలు చేశాడు. తరువాత ఉత్తరుని చూసి, ‘‘కుమారా! యుద్ధ విశేషాలను నీ నోట వినాలని వుంది. నీ అత్యద్భుత విక్రమశక్తి నన్ను ఆనంద పరిచింది. భీష్మద్రోణాది కురువీరులు ఒక్కసారిగా నీపై విజృంభించిన పుడు అలజడి చెందక యెలా నిలిచి వారిని నిలువరించగలిగావు? గోవులను ఎలా మరలించావు? ఆ శౌర్యఘట్టాలను వినాలని వుంది. వారంతా అసహాయశూరులు.
🍃🌺ఒక్కొక్కరు ఒక్కొక్క అస్త్రశస్త్రాగారము. తలచుకుంటేనే నా శరీరం జలదరిస్తోంది. నీ అపూర్వ విజయగాథ వివరించు’’ అన్నాడు.ఉత్తరకుమారుడు తండ్రి ఉత్సాహాన్ని గ్రహించాడు. బృహన్నల కనుసైగలను అర్థం చేసుకున్నాడు. ‘‘మహారాజా, నా విజయానికి ఒక అదృశ్య శక్తి కారణం. నేను నిమిత్తమాత్రుడను. కదనరంగంలో నన్ను ఆదుకోవడానికి ఒక మహితాత్ముడు దిగి వచ్చాడు.
🍃🌺నన్ను కంటికి రెప్పలా కాపాడాడు. రణరంగంలో వున్న మహాయోధులను, బలగాలను చూడగానే నాకు ఊపిరి సలపనంత పనైంది. తిరోన్ముఖుడనై పరుగుపెడుతున్న విపత్కాలంలో, ఆ మహాపురుషుడు, ప్రచండ సూర్యుని వలె శత్రువులపై నిపలు చెరిగాడు. సూర్యకిరణాల వలె శరాలు నలుదిశలా దూసుకుపోతుంటే, ఆ ధాటికి ఎవరు నిలవగలరు? చతురంగబలాలు కుప్పకూలాయి’’ అంటూ యుద్ధపర్వాన్ని క్రమం తప్పకుండా ఉత్తరుడు కనులకు కట్టించాడు.
🍃🌺కంకభట్టు విజయోత్సాహాన్ని మనసులోనే విని, ‘‘ఉత్తరా! ఇంతకీ ఆ మహాయోధుడెవ్వరు? ఎక్కడ? ఆ పూజ్యుని కనులారా దర్శించి, గౌరవించి తరించాలని వుంది. అంతటి శ్రేయోభిలాషిని సగౌరవంగా తోడ్కొని రావద్దా!’’ అని ప్రశ్నల వర్షం కురిపించాడు.
🍃🌺ఉత్తరుడు తండ్రి మాటలు వింటూనే, ‘‘మహారాజా! కురుసేన పలాయనం చిత్తగించగానే, ఆ మహనీయుడు మరి నాకు కనిపించలేదు. సాక్షాత్తూ దైవాంశసంభూతుడు. కేవలం మనల్ని, మన గోసంపదను రక్షించడానికి దిగి వచ్చిన తేజోమూర్తి అనిపిస్తుంది. అయినా, ఆ మహితాత్ముడు నేడో రేపో మన రాజధానికి రాగలడని విశ్వసిస్తున్నాను.
🍃🌺విరాట రాజవంశాన్ని సంరక్షించడం నా కర్తవ్యమని ఆ మహనీయుడు పలుమార్లు అన్నాడు’’ అని వివరించాడు. విరాటుడా మాటలు విని తనవంటి భాగ్యశాలి లేడని ఉప్పొంగిపోయాడు. అర్జునుడు ఆ మందిరంలో అడుగుపెట్టినప్పటి నుంచి ధర్మజుడు తన వుత్తరీయపు కొంగుతో నుదుటిగాయాన్ని కప్పి పెడుతున్నాడు. ఉత్తరుడు వర్ణించిన తీరును బట్టి విరటునికి బృహన్నలపై సందేహమే రాలేదు.
🍃🌺రాజు వద్ద సెలవు తీసుకుని యువరాజు, బృహన్నల బయటకు నడిచారు. బయటకు వెళ్లాక అర్జునుడు ఉత్తరుని వాక్‌చమత్కృతిని కొనియాడాడు. ‘‘నేను నాట్యాచారుణ్ణే. కానీ నువ్వు మహానటుడివి రాకుమారా-అని అభినందించాడు. ఒకవేళ కంకభట్టు వేరుగా అడిగినా యిదే పద్ధతిలో చెప్పాలి సుమా’’ అని గుర్తుచేశాడు. ఉత్తరుడు అందుకు నమస్కారంతో అంగీకారం తెల్పాడు.
🍃🌺బృహన్నల నర్తనశాల వైపు అడుగులు వేశాడు. అక్కడ ఉత్తరాకుమారి చెలికత్తెలతో నిరీక్షిస్తున్నది. కౌరవ వీరుల తలపాగ కుచ్చులను ఆమెకు యిచ్చాడు. ‘‘నీ ఆటబొమ్మలకు అలంకరించి, ముచ్చట తీర్చుకో రాకుమారీ’’ అన్నాడు చిరునవ్వుతో. ఉత్తర ఆనందానికి అవధులు లేవు. బృహన్నల తన నివాసానికి పోయి విశ్రాంతి తీసుకుని ధర్మజుని మందిరానికి వెళ్లాడు.
🍃🌺ద్రౌపదీ దే వితో బాటు, సోదరులందరినీ అక్కడకు పిలిపించమని అన్నగారిని కోరాడు. ఒక్కొక్కరుగా వారంతా అక్కడకు చేరుకున్నారు. అర్జునుడు గోగ్రహణ ఘట్టాన్ని, తన విజయవృత్తాంతాన్ని వారందరికీ సవిస్తరంగా వివరించాడు. కౌరవ బృందానికి జరిగిన పరాభవానికి వారంతా ఆనందించారు. విజయుని పరాక్రమాన్ని పరిపరి విధాల మెచ్చుకున్నారు.
🍃🌺ఎన్ని మాటలు నడిచినా అగ్రజుడు తనవంక సూటిగా చూడకపోవడాన్ని అర్జునుడు గమనించాడు. అన్నగారి మనసులో ఏదో తనపై చిన్నచూపు వుందని శంకించాడు.
🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀🌼🥀
[25/01, 7:02 am] +91 94414 08564: 🕉 *శ్రీ కాళహస్తీశ్వర శతకం - 73* 🕉
*శ్రుతులభ్యాసముచేసి శాస్త్రగరిమల్ శోధించి తత్త్వంబులన్*
*మతి నూహించి శరీర మస్థిరము బ్రహ్మంబెన్న సత్యంబు గాం*
*చితి మంచున్ సభలన్ వృధావచనము ల్చెప్పంగనే* *కాని నిర్జితచిత్తస్థిర సౌఖ్యముల్ దెలియరో శ్రీ కాళహస్తీశ్వరా!*
📍 _*తాత్పర్యం:*_ 📍
🌹శ్రీ కాళహస్తీశ్వరా!
కొందరు వేదములను, ఉపనిషత్తులను, శాస్త్రములను అధ్యయనము చేయుదురు. అట్లద్యయనము చేసి అవి ప్రతిపాదించిన గొప్ప తత్వస్వరూపమును తమ బుద్ధితో బాగుగా ఊహ చేయుదురు.
🌹అట్టి అధ్యయన ఫలముగ వారు సభలయందు - శరీరము అశాశ్వతము, బ్రహ్మతత్వము మాత్రమే సత్యము, శాశ్వతమను విషయములను చూచినట్లుగ పఠించుదురు, వాదించుదురు, ప్రవచనములు చేయుదురు.
🌹ఇది అంతయు నిష్ప్రయోజనము. వీరు ఇంత చేసియు, తమ చిత్తవృత్తులను జయించుటచే కలుగు స్థిరసౌఖ్యానందానుభవమును ఎరుగజాలకున్నరు కదా!
🕉️ *ఓం నమః శివాయ* 🕉️
గంభీర వాతావరణం ఆవరించింది. రైలు పెట్టెలో పరిస్థితి గమనించిన పిలకా గణపతి శాస్త్రి గారు - వున్నట్టుండి ఒక్కసారి కళ్లు పెద్దవి చేసి బోలెడు ఆశ్చర్యం నటిస్తూ.........
"ఆహా... ఏమి బిస... ఏమి బిస.... ఆ యొక్క రాక్షసబొగ్గుతో ఇంతమందినీ లాక్కుని ఈ విధంగా ఛుకు....ఛుకు...ఛుకు మని అలుపూ సొలుపూ లేకుండా పరుగెత్తడం వుంది చూశారూ... అరెరెరె... ఏమాశ్చర్యం...... ?"అని అందరివైపు నోరు తెరచి చూశారు.
అప్పుడే వస్తున్న జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి ఆశ్చర్యప్రకరణమంతా విని-
"మనవాళ్ళు మామూలు తోటకూర తిని మహాకావ్యాలు రాసేస్తుండగా లేంది- బొగ్గుతో రైలు నడవడంలో ఆశ్చర్యం ఏముంది లెండి.." అన్నారు సౌమ్యంగా ఉత్తరీయాలు వున్నవాళ్లూ, లేనివాళ్లూ కూడా ఒక్కసారి బుజాల మీద చేతులు వేసుకున్నారు.
తల్లావఝుల శివశంకరస్వామి నీటుగా సింగిల్ సీటు మీద రైల్లో కూడా నేను సభాపతినే అన్నట్టు కూర్చున్నారు ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్న భంగిమలో...
జలసూత్రం ఓ క్షణం ఆగి "రైలు పట్టాల్ని చూస్తుంటే మా సభాపతిగా గారి కవిత్వం జ్ఞాపకమొస్తుంది. నాకు - అడ్డంగా వేసిన బద్దీలు నిక్కచ్చిగా కొలిచి తూచి వేసినట్టుంటే ఆయన పద్యపాదాల్లాగూ, క్రమంగా వుంటాయి. ప్రతి ఎనిమిదింటికీ దూరం తగ్గించి కాస్తంత దగ్గరగా నాలుగు బద్దీలుంటాయి చూశారూ - సీసపద్యం కింద ఎత్తుగీతి లాగు - సమాసాల కంకరరాళ్లు సరేసరి - అటూ ఇటూ కొలిచి కొట్టిన మార్జిన్లు లాగు ఇనుప కమ్మీలు.. స్వామి వారి పద్యాలని తెచ్చి పొడుగ్గా పేర్చుకుంటూపోతే రైలు పట్టాలే సుమండీ... "అనేసి మెరుపులా మాయమైపోయారు.
"ఉపమ బేషుగ్గా వుంది..." అని ముక్తకంఠంతో అక్కడ వున్న వారందరికీ అనాలనిపించింది. కాని తమాయించుకున్నారు.
శివశంకర స్వామి వారు మాత్రం గొంతు పెగలనంతగా వుక్రోషించారు. వుపాయం తోచక వూరుకున్నారు.
అలక్ష్య లక్ష్య లక్షణంగా పైజమా పైచొక్కా వేసుకుని నామార్గం వేరన్నట్టు ఇవతల కక్ష్యలో కూచుని హరీస్ ఛట్టో చదువుకుంటున్న శ్రీశ్రీ స్వామివారి వంక ఓ చూపు చూసి కళ్లద్దాలు సవరించుకున్నారు. అంతా నిశ్శబ్దం. వాతావరణం దిగులుగా వుంది.
ఇంతలో ఏపిల్...ఏపిల్...పావలా అని గుక్క తిప్పుకోని
కేకతో పళ్లబ్బాయ్ కంపార్ట్ మెంట్ లోనికి వచ్చాడు.
ఆ సమయంలో పళ్లబ్బాయ్ పెద్ద ఆసరా అయ్యాడు అందరికి -
అప్పట్లో భావకవిత్వం బ్రేక్ త్రూ అయినట్టు-
"కొంటే బాగుంటుంది" - అన్నారు పింగళి.
"తింటే మరీ బాగుంటుంది" - అన్నారు కాటూరి.
"జంట కవిత్వం బానేవుంది... అయితే నేను కొనాల్సిందేనా... అంటూ"
ఎంపిక చేసి పది పళ్లు బేరం చేశారు విశ్వనాథ-
"మిగిలితే మాత్రం నాకొకటి ఇవ్వండి" అన్నారు గణపతిశాస్త్రి
విశ్వనాథ వారు తలొకటి పంచి తనొకటి నోటికి తగిలించారు.
పక్క క్యూలోంచి శ్రీశ్రీ బుసకొట్టిన శబ్దం చేసి "ఏపిల్ బూర్జువా వ్యవస్థకి
ప్రతీక... " అన్నారు.
"అయితే మీరు జామిపళ్లు తప్ప తినరా ఏమిటి ఏప్ అంటే వానరము. ఏపిల్స్ ని నేను
హనుమత్ప్రసాదంగా తింటూ వుంటాను.. " విశ్వనాథ ఏపిల్ నముల్తూ అన్నారు.
*🌹. బంధాలు వదిలితేనే స్వేచ్ఛ 🌹*
🍀. ‘స్వేచ్ఛ. మీరనుకుంటున్నది కాదు’ నుంచి ( ఓషో బోధ ) 🍀*
మార్మికమైన జీవితంలో నిజాలతో నింపలేని ఖాళీలు మీకు చాలా కనిపిస్తాయి. మీలోని భావాలే వాటికి ప్రత్యామ్నాయాలు. అందువల్ల ఆ ఖాళీలను మీరు మీ భావాలతో నింపి, జీవితం మీకు పూర్తిగా అర్థమైనట్లు తృప్తి పడడం ప్రారంభిస్తారు.
ఒకవేళ జంతువులు కూడా మనిషిలాగే ఆలోచిస్తే, గుర్రాల దేవుడు గుర్రంలా, ఏ జంతువు దేవుడు ఆ జంతువులా ఉంటాడే కానీ, కచ్చితంగా మనిషిలా ఎప్పుడూ ఉండడు. ఎందుకంటే, గుర్రాల పట్ల మనిషి చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి, వాటికి మనిషి దయ్యంలాగే కనిపిస్తాడు. అందువల్ల, దేవుడి విషయంలో మనిషి భావాలు మనిషికి ఉన్నట్లే జంతువు భావాలు జంతువులకుంటాయి.
‘‘అండర్‌స్టాండ్’’ అనే పదానికి ఉన్న అసలైన అర్థం ఏమిటో మీరెప్పుడైనా ఆలోచించారా? దాని అసలైన అర్థం ‘‘మీకింద నిలబడి ఉండేది’’అని. ఇది మీకు వింతగానే ఉంటుంది. ఎందుకంటే, దాని అసలైన అర్థం ఎప్పుడో దానికి దూరమై కాలగర్భంలో కలిసిపోయింది.
మీ చేతి కింద, మీ పాదాల కింద, మీ అధికారం కింద- ఇలా ఏదైనా మీ కింద ఉండేలా చేసుకున్న వాటన్నింటికీ మీరే గురువు. అందుకే అందరూ అదే మార్గంలో జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడే వారు మాకు అన్నీ తెలుసు, తెలియనిది ఏదీ లేదు’ అనగలరు. కానీ, అది అసంభవం. ఎందుకంటే, మీరు ఎన్ని చెప్పినా, ఏమి చేసినా, జీవితం ఎప్పుడూ మార్మికంగానే ఉంటుంది.
అలౌకిక ఆవలి తీరం అన్నిచోట్ల ఉంది. అందుకే అది మన చుట్టూ కూడా ఉంది. అదే దేవుడు. మనం అందులోకి చొచ్చుకుపోవాలి. అది ఎప్పుడూ మన లోపలా ఉంటుంది. బయటా ఉంటుంది. అందువల్ల సహజంగానే మనం దాని గురించి పూర్తిగా మర్చిపోతాం. ఎందుకంటే, అలౌకిక ఆవలి తీరాలలోకి చూడాలంటే చాలా అసౌకర్యంగా, ఇబ్బందికరంగా ఉంటుంది.
అది అగాధంలోకి చూడడం లాంటిది. అందుకే దానిని చూడాలంటే మీరు చాలా భయంతో వణికిపోతారు. ఆ పని చేసేందుకు ఎవరూ సాహసించరు. ఎందుకంటే, అసలైన వాస్తవాన్ని ఎవరూ భరించలేరు. అది ఎప్పుడూ మహా శూన్యంతో కూడుకున్న అగాధంలా, ఎలాంటి హద్దులులేని సువిశాల ఆకాశంలా ఉంటుంది. అందుకే దానినుంచి తప్పించుకునే మార్గాలను మనం వెతుకుతూనే ఉంటాం.
అందుకే బుద్ధుడు ‘దురంగము’’ అంటాడు. అంటే ‘అలౌకిక ఆవలి తీరాలకు అందుబాటులో ఉండు’ అని అర్థం. ఎప్పుడూ సరిహద్దులకే పరిమితమై పోకుండా వాటిని అధిగమించి ముందుకు వెళ్ళండి. ఒకవేళ మీకు సరిహద్దులు అవసరమైతే పెట్టుకోండి. కానీ, వాటిని అధిగమించి బయటపడాలని ఎప్పుడూ గుర్తుంచుకోండి. ఎప్పుడూ ఎలాంటి నిర్బంధాలను సృష్టించుకోకండి.
మతాలు, నమ్మకాలు, అనుబంధాలు- ఇలా మనం అనేక రకాల నిర్బంధాలను సృష్టించుకుంటాం. అవి అందరికీ చాలా సౌకర్యంగానే ఉంటాయి. ఎందుకంటే, అక్కడ ఎలాంటి ఈదురుగాలులు వీచవు. అందుకే అందరికీ అక్కడ ఏదో రక్షణ- అది నిజమైన రక్షణ కానప్పటికీ- ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే, మిమ్మల్ని అలౌకిక తీరాలలోకి ఈడ్చుకెళ్ళేది మృత్యువే. అది రాకముందే మీరు అక్కడికి చేరుకోండి.
- ఇంకాఉంది.
🌹 🌹 🌹 🌹 🌹
మరోసారి హూంకరించి ఛట్టోలోకి వెళ్లిపోయారు శ్రీశ్రీ. (శ్రీరమణ పేరడీలు నుండి ......)
సేకరణ..తెలుగు వెలుగు
*🌹. వివేక చూడామణి - 2 / VIVEKA CHUDAMANI - 2 🌹*
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻 2. మానవ జన్మ - 2 🌻*
8. అందువలన మానవుడు జన్మ రాహిత్య స్థితికై కృషి చేయవలెను. జ్ఞానియై మనిషి భౌతిక వస్తు సముదాయము వలన పొందే లౌకిక సుఖాలకై ప్రాకులాడకుండా తన మనస్సును సత్యమువైపు మరల్చవలెను.
9. వ్యక్తి జ్ఞానేంద్రియాలపై అదుపును పొంది భౌతిక వస్తు సుఖాలకు అతీతుడై యోగారూఢ స్థితిని పొందినపుడు పుట్టుక, చావు; మంచి, చెడు అను స్థితులను అధిగమించి విచక్షణతో కూడిన జీవితాన్ని పొందగలడు.
10. జ్ఞాని అయిన విద్యావంతుడు ఆత్మను పొందే మార్గమును ఎన్నుకొని మంచి, చెడులకు అతీతుడై భౌతిక బంధనాలైన పుట్టుక, చావుల నుండి విముక్తిని పొందుటకై సాధన చేయవలెను.
11. యజ్ఞ, యాగాల వలన మనస్సు స్వచ్ఛమవుతుంది. కాని సత్యాన్ని తెలుసుకొనలేము. కేవలము నిత్యానిత్య వివేకము ద్వారానే పరమాత్మను పొందగలము. కర్మలు 10 లక్షలు చేసినను సత్యాన్ని గ్రహించలేము.
12. తాడును చూసి పామని భ్రమించి భయభీతులు చెందువాడు మనస్సులో తగినట్లు విచారణ చేసిన అది పాము కాదు తాడని గ్రహించగలడు.
13. సత్యాసత్య జ్ఞానాన్ని పొందిన జ్ఞానులతో సంభాషణ ద్వారా మాత్రమే సత్యము అవగతమగును. ఇతరత్రా నదీ జలాలలో స్నానాలు, దేవతలకు పూజలు, సమర్పణలు మరియు ప్రాణాయామము ద్వారా ప్రాణ శక్తిని అదుపుచేసినను సత్యము అవగతము కాదు.
14. శాస్త్ర పరిజ్ఞానముతో సత్యాసత్య వివేకము పొంది, శాస్త్ర చర్చలలో ప్రశ్నించుట, వాదనలలో ప్రావీణ్యం పొందిన వాడే విజయాన్ని పొందగలడు. సమయము, ప్రదేశము మరియు ఇతరత్రా ఏవైన, కేవలము అందుకు సహాయకారులు మాత్రమే.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
శ్రీమచ్ఛంకరభగవత్పాదపూజ్యకృత శివషడక్షరీస్తోత్రం
ఓంశ్రీమాత్రే నమః
శ్రీ శివ షడక్షరీ స్తోత్రమ్
1) ‖ఓం ఓం‖
ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః |
కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమోనమః ‖
2) ‖ఓం నం‖
నమంతి మునయః సర్వే నమంత్య ప్సరసాం గణాః |
నరాణామాదిదేవాయ నకారాయ నమోనమః ‖
3) ‖ఓం మం‖
మహాతత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం |
మహాపాపహరం తస్మాన్మకారాయ నమోనమః ‖
4) ‖ఓం శిం‖
శివం శాంతం శివాకారం శివాను గ్రహకారణం |
మహాపాపహరం తస్మాచ్ఛికారాయ నమోనమః ‖
5) ‖ఓం వాం‖
వాహనం వృషభో యస్య వాసుకిః కంఠభూషణం |
వామే శక్తిధరం దేవం వకారాయ నమోనమః ‖
6) ‖ఓం యం‖
యకారే సంస్థితో దేవో యకారం పరమం శుభం |
యం నిత్యం పరమానందం యకారాయ నమోనమః ‖
షడక్షరమిదం స్తోత్రం యః పఠేచ్ఛివ సన్నిధౌ |
తస్య మృత్యుభయం నాస్తి హ్యపమృత్యు భయం కుతః ‖
శివశివేతి శివేతి శివేతి వా| భవభవేతి భవేతి భవేతి వా |
హరహరేతి హరేతి హరేతి వా| భుజమనశ్శివమేవ నిరంతరమ్ ‖
ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమచ్ఛంకరభగవత్పాదపూజ్యకృత శివషడక్షరీస్తోత్రం సంపూర్ణమ్ ||
🕉️🌞🌏🌙🌟🚩
శివలింగం నిర్గుణ పరతత్వ స్వరూపం. భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి. భక్తులు ఏ రూపంతో పూజించినా, ఏ విధంగా అర్చించినా, ఏ రీతిలో అలంకరించినా అంతర్గతమైన పరతత్వం ఒకటే. ఈ విధమైన పరతత్వానికి రూపం, ఆకారం, అవయవాలు లేవు. ఈ సత్య విషయాలను తెలియజెప్పే తత్వస్వరూపమే "లింగం".
లింగాభిషేకములో పరమార్ధం :- పానిపట్టుపై శివలింగం అంటే మానవుని హృదయపద్మంపై ఆత్మలింగము. పంచామృతాభిషేకం:- భక్తీ, మంత్రజపం, నామస్మరణం, ధ్యానం, కీర్తనాలతో దైవాభిషేకం చేయాలి. జలధారా పాత్ర అనన్య అచంచల నిరంతర సాధనాభక్తికి చిహ్నం, లింగం జీవాత్మకు సంకేతం. జీవాత్మ పరమాత్మలను అనుసంధానం కావించే సాధనమే అభిషేకం.
🕉️🌞🌏🌙🌟🚩
No comments:
Post a Comment